24, జూన్ 2024, సోమవారం

వైకుంఠపాళి

 *"వైకుంఠపాళి" - కొంచెం పెద్దదే, కానీ "చదివితే జీవితం తెలుస్తుంది."*


తెలుగు తోటలో పండిన విక్రమకేళి - వైకుంఠపాళి


 కేవలం నాలుగు గవ్వలతో మూడో నాలుగో చింత పిక్కలతో (ఆడేవాళ్ళ సంఖ్యను బట్టి) జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగు వారి సృష్టి. తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి.


ఇందులో 11 వరుసలుంటాయి. ఒక్కో వరుసలో 11 గడులుంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక 11 గడులలో ‘పరమపదసోపానపటము’ అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన “ధరసింహాసనమైనభంబు గొడుగై తద్దేవత భృతులై...సిరిభార్యామణియై” అన్నట్లుగా పదిమంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. చివరకు చేరుకోవల్సిన స్థానం అది. అక్కడకు చేరుకొనే వరకు (జీవితమనే) ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా ఒకటి నుంచి 121 వరకు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి. పడుతూ లేస్తూనే ఉండాలి. అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని హెచ్చరిక.


పదకొండు అంటే సంస్కృతంలో ఏకాదశి. ఏకాదశీవ్రతం భారతీయులందరికీ ఆచరణీయం. ఏకాదశి మహా పర్వదినం. ఆ రోజు ఉపవాసం, జాగరణ, దైవస్మరణం అనే మూడూ తప్పని సరి. అలా 11 ఏళ్ళు వరుసగా ఏకాదశీ వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చనేది పురాణ కథనం. అయితే ఇదంతా ఆధ్యాత్మికం.


గెలుపోటములు మానసికానుభూతులు. పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్ధం. ఇదొక రకంగా అరచేతిలో వైకుంఠం. ఇందులో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాలున్నాయి. నీ ఉన్నతి నీ చేతిలోనే ఉందని చెప్పడం. గవ్వలతో గెలవగలవని జీవితం కోసం ‘రవ్వ’ పెట్టుకోవద్దని ఉపదేశం.


ఇందులో చాలా గళ్ళలో ఏదో ఒక బొమ్మ, దానికో పేరు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని గళ్ళు అడ్డంగా దాటేస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి. కొన్ని గళ్ళు అమాంతం దించేస్తూ ఉంటాయి. అంతలో ఉత్సాహం అంతలోనే నిరుత్సాహం. అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి. ఇదీ ఆట నడిచేతీరు.


ఈ ఆటలో పాములు, నిచ్చెనల గడుల్లోని పేర్లను నిశితంగా పరిశీలిస్తే అద్భుత రహస్యాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 75వ గడిలో ఒక పాము తల దగ్గర కర్కోటకుడు అని రాసి ఉంటుంది. దాని తోక 10వ గడిలోకి పాకుతుంది. అక్కడ పంది బొమ్మ ఉంటుంది. పాము కరవడం వల్ల కిందికి రావడం అనేది పైకి కనిపించే విషయం. జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందైపుడతావనేది ఆధ్యాత్మిక హెచ్చరిక. పందిలా హీనంగా చూస్తారనేది వ్యక్తిత్వ పాఠం.


అలాగే 55వ గడిలో ఒక పాము తల ఉండి దుర్యోధనుడు అని రాసి ఉంటుంది. దాని తోక 12 వ గడిలోకి పాకుతుంది. 43 గడులు కిందికి జారిపోవడం పైకి కనిపించే ఓటమి. దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపం. దాని వల్లే కురు వంశ క్షయం. అలానే... మనమూ అసూయపడితే జీవితం నరకప్రాయమవుతుందని, సుఖ శాంతులు నశిస్తాయని హెచ్చరిక.


పాముల అమరిక ఇంత అర్ధవంతంగా ఉంటే నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్ధ బోధకంగా ఉంటుంది. 63వ గడిలో ఒక నిచ్చెన అడుగు భాగం ఉంటుంది. అక్కడ భక్తి అని రాసి ఉంటుంది. ఒక భక్తుని బొమ్మ ఉంటుంది. దాని కొస 83వ గడి వరకూ సాగుతుంది. అక్కడ బ్రహ్మలోకం అని రాసి ఉంటుంది. బ్రహ్మదేవుని చిత్రం ఉంటుంది. భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయమన్నది పరమైతే..ఏ పనైనా దాని మీద భక్తితో చేస్తేనే మంచి ఫలితాలొస్తాయన్నది ఇహం.


అలాగే 65వ గడిలో ఒక నిచ్చెన మొదలు ఉంటుంది. అక్కడ చిత్తశుద్ధి అని ఉంటుంది. దాని కొస 105వ గడిలో ఉంటుంది. అక్కడ మహాలోకం అని ఉంటుంది. మొత్తం వైకుంఠపాళిలో ఇదే పెద్ద నిచ్చెన. 40 గడులు అమాంతం ఎగబాకవచ్చు. ఇదంతా పైకి ఆశ పెట్టే విధానం. చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయని అంతరార్ధం. లోకంలో మహానుభావుడిగా కీర్తిపొందుతారని విశేషార్ధం. ఏ చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఇవాళ దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందో అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాన్ని చిన్నతనంలోనే పిల్లలకు ఆటల రూపంలో నేర్పిన ఏకైక జాతి మన తెలుగుజాతి.


ఇంత గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్త పడమనడం ఈ ఆట ప్రత్యేకత. సాధారణంగా 105వ గడి వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది. ఇంక 16 గడులు దాటితే పండిపోయినట్లే కదా అనుకుంటాడు. అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం. 106వ గడిలో అరుకాషుడు అనే అతి పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం కిందికి జారి మొదటి గడిలోకి అంటే కోతి లోకి వచ్చి పడతాడు. అంటే ప్రముఖుణ్ణి (సెలబ్రిటీ) అయ్యాను కదా అని గర్వించి ఒక్క పొరపాటు (ఒకటి వెయ్యడం)చేసినా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయం అని హెచ్చరించడం అన్నమాట. పైగా వైకుంఠపాళి పరిభాషలో ఒకటిని గుడ్డి అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక్క గుడ్డి పనిచేసినా మళ్ళీ కిందకి జారిపోవడం తప్పదని చెప్పడం.


ఇంత జరిగినా ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం. ఒకడు పెద్దపాము నోట్లో పడినా ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని ఆడమని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్ధిని సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా వైకుంఠపాళీయే నేమో!


ఇంతకీ చివిరిదైనా చిన్నది కాని విషయం మరొకటుంది. చివర 121 వ గడిలో కూడా ఒక పాము ఉంటుంది. దానిపేరు అహంకారం. దానితోక 99 వ గడిలోకి ఉంటుంది. అంటే 106 లో అరుకాషుణ్ణి దాటినా, 115లో వైకుంఠంలో ప్రవేశించినా, 117లో కైలాసంలో దివ్యానుభూతి పొందినా చివరలో 121 లో అహంకారానికి లోనయితే తిరిగి రాక్షస జన్మ తప్పదు అని హెచ్చరిక. బ్రహ్మరుద్రాది దేవతల్ని తపస్సులతో ప్రసన్నం చేసుకొని మహాభోగాలు అనుభవించి లోకాలన్నీ జయించిన హిరణ్యకశిప, రావణాసురాది వీరులు చివరకు రాక్షసులై దుర్మరణం పాలుకావడానికి ఈ అహంకారమే కారణం కదా!


అంతిమంగా అహంకారం, మమకారం అనే రెండిటినీ జయించినవాడే పరమపదం చేరుకోగలడని సారాంశం.


జీవితమే ఒక వైకుంఠపాళి

నిజం తెలుసుకో భాయి!

ఎగరేసే నిచ్చెనలే కాదు

పడదోసే పాములు ఉంటాయి

చిరునవ్వులతో విషవలయాలను

ఛేదించి ముందుకు పోవోయి.


ఈ చలనచిత్రగీతం ఒక ప్రాచీన శ్లోకంలా, ఒక ప్రబంధ పద్యంలా, ఒక భావకవితలా, ఒక అభ్యుదయ గేయంలా ఎప్పుడూ తెలుగువారి చెవుల్లో మారుమోగుతూ గెలుపుకోసం వెన్ను తడుతూనే ఉంటుంది.🙏👏🤝👍🦜

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

వైఫల్యంలోంచి సాఫల్యం వైపు

 వైఫల్యంలోంచి సాఫల్యం వైపు

జీవితంలో ఆశించిన సుఖాలు లభించవు - ఒక్కొక్కసారి - అదేవిధంగా పలుమార్లు ఆశించని దుఃఖాలూ తారసపడతాయి. ఇది జీవిత లక్షణం. ఈ అనివార్యంశాన్ని తెలివిగా నిర్వహించడంలోనే విజయవంతమైన వ్యక్తిత్వం తేటపడుతుంది.

కొందరు ఊహించని దుర్ఘటనో, నష్టమో జరగగానే తీవ్ర మనస్తాపానికి గురికావడమో, లేదా ప్రపంచం మీద కసి ఏర్పరచుకోవడమో, లేదా దైవాన్ని దూషించడమో చేస్తారు. ఈ విధమైన పరివర్తన, తీవ్రస్పందన సామాన్య మానవులలో కలగడం సహజమే. కానీ ఈ పరిణామాలు ఉత్తమ వ్యక్తిత్వానికి నిదర్శనాలుకావు.

అలాంటి సంఘటనలోంచే కొందరు సకారాత్మక (Positive) పరిణామాన్ని స్వీకరిస్తారు. దుర్ఘటనలలోంచి వివేక వైరాగ్యాలను పొంది జ్ఞానులుగా, యోగులుగా మారిన వారెందరో!

"ప్రియా ప్రియాలకు (సుఖ దుఃఖాలకు) చలించని ధృఢ మనస్కులకు జ్ఞానులకు నమస్కారము” అని సీతాదేవి అలాంటి మహాత్ములకు అంజలించింది (సుందరకాండ).

కొందరు దుఃఖ సంఘటనల్లోంచి ఎవరి పైనో కసిని ఏర్పరచుకోకుండా, దానిని కరుణగా మార్చుకున్న వారూ ఉన్నారు.

ఒక గొప్ప పారిశ్రామికవేత్త తనకున్న ఏకైక సంతానం మరణించగానే, ఆ దుఃఖంలోంచి యోగిగా మారిన వైనం కూడా ఒక విజయ చరిత్రగా ఉన్నది. ఒక విదేశీ వైజ్ఞానిక శాస్త్రవేత్త తన శరీరం వికలాంగదశలో ఉన్నా, తన మేధస్సుతో అపూర్వ పరిశోధనలు జరిపిన ప్రపంచోపకారిగా మారిన ఘటన నేటికీ సాక్ష్యం.

బలీయమైన ప్రారబ్ధం దుఃఖాన్ని కలిగించినా, బలమైన మనస్సు ప్రయోజనకారునిగా మలచగలదు. ఇదే జీవిత సార్థక్యం.

తన సంతానంపై కేంద్రీకరించిన ప్రేమను, సంతాన నష్టంతో, ప్రపంచమంతా విస్తరింపజేసిన కర్మయోగి - స్వార్థం లేని కీర్తి కాంక్షలేని సేవా కార్యక్రమాలతో ద్రవ్యాన్నీ, శ్రమనీ లోకోపకారానికి ఉపయోగించగలడు.

ఒంటి చక్రంతో కూడుకున్న రథంపై, తొడలు లేని సారథి (అనూరుని)తో కాలగమనాన్ని నడుపుతున్న సూర్యుని వర్ణించిన మన సంస్కృతి - ఏ సహకారమూ లేకున్నా విజయయాత్ర చేయగల ఆదర్శాన్ని చూపించింది.

క్రియాసిద్ధిః సత్యేభవతి

మహతాం నోపకరణే ॥

ఉపకరణాల సహాయం లేకున్నా ఎన్ని అవరోధాలు ఎదురైనా తమ స్వాత్మ శక్తితోనే క్రియాసిద్ధిని సాధించే వారు మహాత్ములు.

ఏ కారణాలను, ఏ లోపాలను చూపించి - "వాటి వల్లనే మేము వైఫల్యం పొందాము" అని సామాన్యులు చెప్తారో, అవే కారణాలతో, అవే లోపాలతో అద్భుత సాఫల్యాలను సాధిస్తారు మహాత్ములు.

తాము ఎదగకపోవడానికి వ్యక్తులను, సంఘటలను, కారణాలుగా చూపించడం చాలా మందికి సహజం. మన చుట్టూ ఉన్న సమాజంలో అందరికీ అన్నీ ఒకేలా ఉన్నా - వాటిని వినియోగించుకొనే తెలివిమీదనే విజయాలు ఆధారపడి ఉంటాయి.

ఒకడు "దరిద్రం వల్లనే నేను సామాన్యుడిగా మిగిలిపోయాను" అంటాడు. కానీ అదే దరిద్రంలోంచి ఎదిగి, పదిమంది దరిద్రాన్ని పోగొట్టగలుగుతారు మరికొందరు.

మన సాఫల్య వైఫల్యాలకు బాహ్యకారణాల కంటే, మన బుద్ధిశక్తిలోని దృఢత్వ, బలహీనత్వాలే ప్రధానహేతువులు.

శౌర్యంతో దాడిచేసిన విశ్వామిత్రుని విస్తార భౌతిక బలాన్ని, ఒంటరిగా తన స్వాత్మ శక్తితో ఎదుర్కొన్న వసిష్ఠుని మహోన్నత వ్యక్తిత్వం విశ్వామిత్రునికి విస్మయం కలిగించింది.

రాజ్యాది సంపదలు లేకున్నా, అడవిలో విద్యనార్జిస్తూ, బోధిస్తూ ఉన్న ఒక జ్ఞాని - ఒక మహా విస్తార రాజ్య సైన్యాన్నే అణచగలిగాడంటే - స్వాత్మ శక్తి ఎంత గొప్పది! దీనిని గ్రహించిన విశ్వామిత్రుడు జాగృతి చెంది, తన భౌతిక సంపదల కంటే మించిన తపశ్శక్తిని సాధించగలిగాడు.

ప్రేమ, సేవ, వైరాగ్యం, జ్ఞానం, త్యాగం... ఇవి ఇవ్వగలిగే ఆనందం ఏ వైభవమూ ఇవ్వలేదు. ఈ దివ్యగుణాలున్న వారు యశఃకాయులై కలకాలం మిగిలిపోతారు. సార్థక జన్ములౌతారు.

[సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర, శివతత్త్వసుధానిధి "బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు" రచించిన వ్యాసం]

పురాణ సంబంధ 49 పుస్తకాలు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*పురాణ సంబంధ 49 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

గరుడ పురాణం www.freegurukul.org/g/Puranamulu-1


దేవీ భాగవతం www.freegurukul.org/g/Puranamulu-2


విష్ణు పురాణం www.freegurukul.org/g/Puranamulu-3


సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం www.freegurukul.org/g/Puranamulu-4


శివ పురాణము www.freegurukul.org/g/Puranamulu-5


భవిష్య మహా పురాణము www.freegurukul.org/g/Puranamulu-6


దేవీ భాగవతం www.freegurukul.org/g/Puranamulu-7


సంపూర్ణ కార్తీక మహాపురాణం www.freegurukul.org/g/Puranamulu-8


శివ పురాణం www.freegurukul.org/g/Puranamulu-9


పురాణ పరిచయము www.freegurukul.org/g/Puranamulu-10


బ్రహ్మ పురాణము-1,2,3 www.freegurukul.org/g/Puranamulu-11


మార్కండేయ పురాణం www.freegurukul.org/g/Puranamulu-12


శ్రీ దత్త పురాణం www.freegurukul.org/g/Puranamulu-13


హరి వంశ పురాణం www.freegurukul.org/g/Puranamulu-14


లక్ష్మీ నరసింహ పురాణం www.freegurukul.org/g/Puranamulu-15


సంపూర్ణ దేవీ భాగవతము www.freegurukul.org/g/Puranamulu-16


కల్కి పురాణము-1,2 www.freegurukul.org/g/Puranamulu-17


బసవ పురాణం www.freegurukul.org/g/Puranamulu-18


అష్టాదశ పురాణ కథా విజ్ఞాన సర్వస్వము www.freegurukul.org/g/Puranamulu-19


శివ పురాణము - ధర్మ సంహిత www.freegurukul.org/g/Puranamulu-20


కన్యకా పురాణం www.freegurukul.org/g/Puranamulu-21


శివ రహస్య ఖండము-1,2 www.freegurukul.org/g/Puranamulu-22


మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణ సార సంగ్రహము www.freegurukul.org/g/Puranamulu-23


భాగవత,వామన, మార్కండేయ మహాపురాణాలు www.freegurukul.org/g/Puranamulu-24


మార్కండేయ పురాణము www.freegurukul.org/g/Puranamulu-25


శ్రీ పరమేశ్వరి-దేవీ భాగవత వచనము www.freegurukul.org/g/Puranamulu-26


సూత సంహిత -స్కాంద పురాణాంతర్గతము www.freegurukul.org/g/Puranamulu-27


ఆంధ్ర స్కాందము-1 www.freegurukul.org/g/Puranamulu-28


మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-బ్రహ్మఖండము www.freegurukul.org/g/Puranamulu-29


స్కాందపురాణ సారామృతము www.freegurukul.org/g/Puranamulu-30


దేవాంగ పురాణం www.freegurukul.org/g/Puranamulu-31


అగ్ని పురాణం www.freegurukul.org/g/Puranamulu-32


మత్స్య మహాపురాణము www.freegurukul.org/g/Puranamulu-33


మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-ప్రకృతి ఖండము www.freegurukul.org/g/Puranamulu-34


వైశాఖ పురాణము www.freegurukul.org/g/Puranamulu-35


పురాణ వాంగ్మయం www.freegurukul.org/g/Puranamulu-36


విష్ణు ధర్మోత్తర మహాపురాణము -1 www.freegurukul.org/g/Puranamulu-37


స్కాంద పురాణంతర్గత కార్తీక పురాణం www.freegurukul.org/g/Puranamulu-38


నారదీయ పురాణము www.freegurukul.org/g/Puranamulu-39


పద్మ పురాణము-భూమి ఖండము www.freegurukul.org/g/Puranamulu-40


మత్స్య మహా పురాణము-1 www.freegurukul.org/g/Puranamulu-41


స్కాంద పురాణతర్గత బ్రహ్మోత్తరఖండం www.freegurukul.org/g/Puranamulu-42


మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-ఉత్తరార్ధము www.freegurukul.org/g/Puranamulu-43


మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-పూర్వార్ధము www.freegurukul.org/g/Puranamulu-44


సూత పురాణము www.freegurukul.org/g/Puranamulu-45


కైశిక మహత్యము www.freegurukul.org/g/Puranamulu-46


శివ తాండవము www.freegurukul.org/g/Puranamulu-47


దేవల మహర్షి చరిత్ర -వచన దేవాంగ పురాణం www.freegurukul.org/g/Puranamulu-48


ప్రధమాంధ్ర మహాపురాణము www.freegurukul.org/g/Puranamulu-49


పురాణముల పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.



ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జూన్ 25, 2024 *🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🍁 *మంగళవారం*🍁  

 🌹 *జూన్ 25, 2024 *🌹

    *దృగ్గణిత పంచాంగం* 

                  

            *ఈనాటి పర్వం*   

 🕉️ *సంకష్టహర చతుర్థి* 🕉️

   *పూజ: సా 06.43-08.54*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠమాసం - కృష్ణ పక్షం*

*తిథి : చవితి* రా 11.10 వరకు ఉపరి *పంచమి*

వారం :*మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం : శ్రవణం* మ 02.32 వరకు ఉపరి *ధనిష్ఠ*

*యోగం : వైధృతి* ఉ 09.06 వరకు ఉపరి *విష్కుంబ*

*కరణం : బవ* మ 12.17 *బాలువ* రా 11.10 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.00 - 12.00  మ 02.00 - 03.30*

అమృత కాలం :*రా 03.19 -04.49 తె*

అభిజిత్ కాలం :*ప 11.44 - 12.36*

*వర్జ్యం : సా 06.18 -  07.48*

*దుర్ముహుర్తం: ఉ 08.14 - 09.07 రా 11.05 - 11.49*

*రాహు కాలం : మ 03.27 - 05.05*

గుళిక కాలం :*మ 12.10 - 01.49*

యమ గండం :*ఉ 08.54 - 10.32*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *మకరం/కుంభం*

సూర్యోదయం :*ఉ 05.37*

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల :‌ ఉత్తరం దిక్కుకు ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.37 - 08.14*

సంగవ కాలం :*08.14 - 10.52*

మధ్యాహ్న కాలం :*10.52 - 01.29*

అపరాహ్న కాలం :*మ 01.29 - 04.06*

*ఆబ్ధికం తిధి : జ్యేష్ఠ బహుళ చవితి*

సాయంకాలం :*సా 04.06 - 06.43*

ప్రదోష కాలం :*సా 06.43 - 08.54*

నిశీధి కాలం :*రా 11.49 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.10 - 04.54*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   🍁 *ఆంజనేయ స్వామి*🍁    

        🙏 *సుప్రభాతం* 🙏


1.అమల కనకవర్ణం ప్రజ్వల త్పావకాక్షం సరసిజ నిభవక్త్రం సర్వదా సుప్రసన్నం పటుతర ఘనగాత్రం కుండలాలంకృతాంగం

రణ జయకరవాలం రామదూతం నమామి


2.అంజనా సుప్రజా వీర పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ హరి శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం

ఉత్తిష్టోత్తిష్ఠ హనుమాన్ ఉత్తిష్ఠ విజయధ్వజా ఉత్తిష్ఠ విరజాకాంత త్రైలోక్యం మంగళం కురు


3.శ్రీరామచంద్ర చరణాంబుజ మత్తభృంగ శ్రీరామచంద్ర జపశీల భవాబ్దిపోత

శ్రీ జానకీ హృదయ తాప నివార మూర్తే శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్||


4.శ్రీ రామ దివ్య చరితామృత స్వాదలోల శ్రీరామ కింకర గుణాకర దీనబంధో

శ్రీ రామ భక్త జగదేక మహోగ్ర శౌర్య శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్I


5.సుగ్రీవ మిత్ర కవిశేఖర పుణ్యమూర్తే సుగ్రీవ రాఘవ సమాగమ దివ్యకీర్తే సుగ్రీవ మంత్రివర శూల కులాగ్రగణ్య 

శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్|


6.భక్తార్తి భంజన దయాకర యోగివంద్య శ్రీ కేసరీప్రియ తనూజ సువర్ణదేహ

 శ్రీ భాస్కరాత్మజ మవోంబుజ చంచరీక శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్I


7.శ్రీమారుత ప్రియ తనూజ మహాబలాఢ్యమైనాకవందిత పదాంబుజ దండితారిన్

 శ్రీ ఉష్ట్ర వాహన సులక్షణ లక్షితాంగ శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥


8.పంచాననస్య భవభీతి హరస్యరామ పాదాబ్జ సేవన పరస్య పరాత్పరస్య

 శ్రీ ఆంజనాప్రియ సుతస్య సువిగ్రహస్య శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥


9.గంధర్వ యక్షభుజగాధిప కిన్నరాశ్చ ఆదిత్య విశ్వ వసు రుద్ర సురర్షి సంఘాః 

సంకీర్తయంతి తవ దివ్య సునామపంక్తిం శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥


10.శ్రీ గౌతమీ చ్యవన తుంబుర నారదాత్రి మైత్రేయ వ్యాస జనకాది మహర్షి సంఘాః

 గాయంతి హర్షిభరితా స్తవ దివ్యకీర్తిం శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥



11.భృంగావళీచ మకరంద రసం పిబేద్వై కూజం త్యుతార్థ మధురం చరణాయుధాచ్ఛ

 దేవాలయే గన గభీర సుశంఖ ఘోషాః శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్||


12.పంపా సరోవర సుపుణ్య పవిత్ర తీర్ధ మాదాయహేమ నలశైశ్చ మహర్షి సంఘాః 

తిష్ఠంతి త్వచ్ఛరణ పంకజ సేవనార్థమ్ శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥


13.శ్రీ సూర్య పుత్ర ప్రియనాధ మనోజ్ఞమూర్తే వాతాత్మజాత కపివీర సుపింగళాక్ష 

సంజీవరాయ రఘువీర సుభక్తవర్య శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥


              🍁 _*ఓం శ్రీ*_🍁 

🍁 *_ఆంజనేయయా నమః*_🍁


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


           🌷 *సేకరణ*🌷

        🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🌷🍁🌷🍁🌹

దీపారాధన

 హిందూ సంప్రదాయంలో దీపారాధనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే.. దేవుడిని ఆరాధించే సమయంలో 

'దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి మహేశ్వర, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే' 

అనే శ్లోకాన్ని చదువుతూ ఆశీస్సులు కోరుకుంటారు. అయితే.. చాలా మందికి ఏ నూనెతో దీపారాధన చేయాలి? ఏ నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల ఎలాంటి ప్రతిఫలం పొందవచ్చు? అనే విషయాలు తెలియదు. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.మనలో కొంత మంది దేవుడికి పూజ చేసే సమయంలో ఎక్కువగా నెయ్యి, నూనెతో దీపారాధన చేస్తుంటారు. మరి కొంతమంది పూజ గదిలో, దేవాలయంలో.. ఆవాలు, నువ్వులు, ఆముదం వంటి రకరకాల నూనెలతో దీపాన్ని వెలిగిస్తుంటారు. అయితే.. మనం ఒక్కో రకమైన నూనెను ఉపయోగించడం వెనుక ఒక్కో ప్రత్యేకత ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఏ నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ?

ఆవు నెయ్యితో :

ఆర్థిక సమస్యలు ఉన్న ఇంట్లో.. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల ఆ సమస్యలు దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే దీనివల్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ప్రశాంతత, ఆనందం వెల్లివిరుస్తాయని అంటున్నారు. ఆవు నెయ్యితో అన్ని దేవతలకూ దీపారాధన చేయవచ్చు. ఈ నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని గాలి శుద్ధి అవుతుందట. అలాగే గాలిలోని సూక్ష్మక్రిములు నశిస్తాయని తెలియజేస్తున్నారు. దీపం నుంచి వచ్చే సువాసనతో మానసిక ప్రశాంతత లభిస్తుందట.నువ్వుల నూనెతో:

నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల మనల్ని వేధించే సమస్యలు, చెడు ప్రభావాలు, మనకు ఎదురయ్యే కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోతాయట. అందుకే శని గ్రహ శాంతి కోసం ప్రయత్నించే చాలా మంది ఆవాలు లేదా నువ్వుల నూనెని ఎక్కువగా ఉపయోగిస్తారని పండితులు తెలియజేస్తున్నారు.

పంచదీప నూనెతో:

ఇంట్లోని చెడు ప్రభావాలు తొలగిపోయి, శాంతిగా ఉండాలంటే పంచదీప నూనెతో దీపారాధన చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల మనలోని చెడు ఆలోచనలు దూరమవుతాయట. అలాగే అనారోగ్యం, పేదరికాలను మన దరి చేరనివ్వదని అంటున్నారు. పంచదీప నూనెను కొబ్బరి లేదా నువ్వుల నూనె, ఆముదం, వేప నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి కలగలిపి తయారు చేస్తారు.

కీర్తి, ప్రతిష్టలు, సిరిసంపదలు పొందాలనుకునే వారు తమ ఇష్టదైవాన్ని ఆముదంతో ఆరాధిస్తే మంచిదట.హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మల్లెపూల నూనెతో దీపారాధన చేయాలి.సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు.రాహు, కేతు గ్రహాల ప్రభావం పడకుండా ఉండటానికి మునగ నూనెతో దీపం వెలిగించండి.

దీపారాధన ఎలా చేసినా కూడా.. స్వచ్ఛమైన మనసుతో, సంపూర్ణమైన భక్తితో దేవుడికి మిమ్మల్ని మీరు అర్పించుకొని పూజ చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

*శ్రీ మహాదేవ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 358*





⚜ *కర్నాటక  :- ఇటగి - గదగ్*


⚜ *శ్రీ మహాదేవ ఆలయం*



💠 మహాదేవ ఆలయం కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని ఇటగిలో ఉన్న పురాతన దేవాలయం.  

ఇది కర్నాటకలోని ప్రసిద్ధ వారసత్వ దేవాలయాలలో ఒకటి మరియు హంపి టూర్ ప్యాకేజీలలో భాగంగా హంపి సమీపంలో సందర్శించవలసిన ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి.


💠 శివునికి అంకితం చేయబడిన, ఇటగిలోని మహాదేవ ఆలయాన్ని 1112 లో పశ్చిమ చాళుక్య రాజు విక్రమాదిత్య VI యొక్క సైన్యంలోని కమాండర్ (దండనాయక) మహాదేవ నిర్మించారు.  

ఇది అన్నిగేరిలోని అమృతేశ్వర ఆలయ సాధారణ ప్రణాళికపై నిర్మించబడింది. 


💠 మహాదేవ ఆలయంలో అమృతేశ్వరుడి మాదిరిగానే నిర్మాణ భాగాలు ఉన్నాయి, కానీ వాటి ఉచ్చారణలో తేడా ఉంది.  

చక్కగా రూపొందించబడిన శిల్పాలు, గోడలు, స్తంభాలు మరియు గోపురంపై చక్కగా చెక్కబడిన చెక్కడాలు చాళుక్యుల కళాకారుల అభిరుచిని తెలియజేస్తున్న పూర్తి పాశ్చాత్య చాళుక్యుల కళకు ఇది మంచి ఉదాహరణ.  ఆలయంలోని 1112 నాటి శాసనం దీనిని దేవాలయాల చక్రవర్తి అంటే దేవాలయాలలో చక్రవర్తి అని పిలుస్తుంది.  

మహాదేవ దేవాలయం భారత పురావస్తు శాఖ పరిధిలోని రక్షిత స్మారక చిహ్నం.


💠 మహాదేవ దేవాలయం నగారా నిర్మాణం.

 ఆలయ ప్రణాళికలో ఒక మందిరం ఉంటుంది, ఇది వసారా  ద్వారా మూసి ఉన్న మంటపానికి అనుసంధానించబడి ఉంటుంది.  

మూసి ఉన్న మంటపం బహిరంగ మంటపానికి దారి తీస్తుంది.  

ఈ బహిరంగ మంటపానికి 64 స్తంభాలు ఉన్నాయి, వీటిలో 24 పూర్తి స్తంభాలు ప్రధాన పైకప్పుకు మద్దతుగా ఉన్నాయి, మిగిలినవి వాలుగా ఉన్న చూరుకు మద్దతు ఇచ్చే సగం స్తంభాలు.  నాలుగు కేంద్ర స్తంభాలకు మద్దతుగా ఉన్న బహిరంగ మంటపం యొక్క చతురస్రాకార పైకప్పు ఆసక్తికరమైన రాతి పనిని ప్రదర్శిస్తుంది.


💠 లింగాన్ని కలిగి ఉన్న ప్రధాన ఆలయం చుట్టూ 13  చిన్న దేవాలయాలు ఉన్నాయి, ఒక్కొక్కటి దాని లింగంతో ఉంటాయి.  ఆలయాన్ని ప్రతిష్ఠించిన చాళుక్య సేనాధిపతి మహాదేవ తల్లితండ్రులు మూర్తినారాయణ మరియు చంద్రలేశ్వరికి అంకితం చేయబడిన మరో రెండు ఆలయాలు ఉన్నాయి.


💠 ఇది కళ్యాణి చాళుక్యులచే పరిపూర్ణంగా చెక్కబడిందని చెబుతారు, ఇది రాష్ట్రంలోనే అత్యుత్తమమైనది మరియు హళేబీడు ఆలయం తర్వాత రెండవది. చరిత్రకారుల ప్రకారం, షికారా ప్రతి వైపు నుండి చక్కగా ఉంటుంది, మండపంలో అందంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి, అవి ఇప్పటికీ మెరిసే ప్రకాశాన్ని కలిగి ఉన్నాయి, దానిపై తమ ప్రతిబింబాన్ని చూడవచ్చు. 


💠 సముదాయంలో పుష్కరిణి ఉంది మరియు ప్రధాన ఆలయం చుట్టూ దాని స్వంత లింగంతో చిన్న 13 దేవాలయాలు ఉన్నాయి.


💠 కొప్పల్ నుండి 26 కి.మీ, 

గడగ్ నుండి 43 కి.మీ, 

హంపికి 70 కి.మీ మరియు 

బాదామి నుండి 79 కి.మీ దూరం.

భగవంతుడికి

 జై శ్రీ రామ్*_🙏భగవంతుడికి ఎవరి మీద శ్రద్ధ గాని, ద్వేషముగాని ఉండదు .అందరి పట్ల సమభావనతో ఉంటారు._*


*_🌿మనం చేసుకున్న కర్మలకు ఆయన సాక్షిభూతుడుగా ఉంటారు .మన జన్మలకి మనమే కారణము .మనం చేసిన కర్మను బట్టి తల్లిదండ్రులు అన్నదమ్ములు ,అక్కచెల్లెళ్ళు, స్నేహితులు, చుట్టుపక్కల సమాజము ఇవన్నీ కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి._*


*_🌿ఇవన్నీ కూడా మనం చేసుకున్నవే అంటే మన కర్మను బట్టి ఇవన్నీ వస్తాయి. విత్తనము మొలకెత్తాలంటే నేల బాగుండాలా నీరు పోసేవారు ఉండాల వాటిని పరిరక్షించేవారు ఉండాలి ఇవన్నీ కూడా ఉంటే విత్తనము మొలకెత్తలేదు అంటే కాలము దానికి సహకరించలేదు అని అర్థము. అంటే కాలము ఇక్కడ భగవంతుని స్వరూపం ఆయన ఆజ్ఞ లేనిదే ఆ విత్తనము మొలకెత్తదు._*


*_🌿మనము భక్తి చేతగాని, ధ్యానం చేతగాని ,కర్మ చేతగాని ఈశ్వరుని ఆరాధిస్తున్నప్పటికీ మన మోర భగవంతుడు ఆలకించలేదు అంటే మన పాపపు కర్మ ఇంకా ఉంది అని అర్థము. భగవంతునికి దగ్గర కాలేదు అని అర్థం. కాబట్టి మనం ఇంకా ప్రయత్నము ఎక్కువ చేయాలి అంటే కాలము కలిసి వచ్చేదాకా ప్రయత్నం చేస్తూ ఉండాలి ._*


*_🌿సహనముతో సాధించుకోవాలి .ఓకే కాలంలో ఒకే చెట్టుకి వచ్చిన పండ్లన్నీ ఒకే రుచిని కలిగి ఉండవు .అలాగే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అందరూ కూడా ఒకలాగే ప్రవర్తించరు వారి వారి కర్మలను బట్టి వారి బుద్ధి ఆధారపడి ఉంటుంది._*


*_🌿ఎవ్వరిని ఏమీ అనక్కర్లేదు మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాను పుణ్యం చేస్తే పాపం అనేది తానంతగా తన పోతుంది ._*


*_🌿ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తూ ఉండండి. గోవులకు ,కుక్కలకు వాటికి కూడా ఏమన్నా పెడుతు ఉండండి. ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతుడు మన విన్నపాన్ని తప్పకుండా ఆలకిస్తారు. ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి._*


*_🌿మన పాపమంతా పోయి భగవంతుడు మన మొర ఆలకించిన రోజు మనము ఏమి కోరుకుంటే అది జరుగుతుంది. మనము అనుకున్నవి జరగటం లేదు అంటే మన పాపం పోలేదని మనం అర్థం చేసుకోవాలి ._*


*_👉కాబట్టి సాధన అనేది మనం ఇంకా పెంచుతూ వెళ్లాలి మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతూ ఉంటే మీరు తప్పకుండా భగవంతుడు తో సంబంధం ఏర్పడింది అని అర్థము. మానవ జన్మ పరమార్థము భగవంతుడితో సంబంధం కొరకే._*


_*💚జీవితంలోకి మంచిని పలకరిదాం... మంచినే కోరుకుందాం...💚*_


జై శ్రీ రామ్ 

కంచెర్ల వేంకట రమణ

_కోతి ముందు అరటిపండ్లు,

 _కోతి ముందు అరటిపండ్లు, బోలెడంత డబ్బు పెడితే కోతి అరటిపండ్లు ఎత్తుకుపోతుంది తప్ప డబ్బు కాదు అంటాడు, ముఖేష్ అంబానీ._


_ఎందుకంటే డబ్బుతో చాలా అరటిపండ్లు కొనవచ్చని, ఆ కోతికి తెలియదు._


 _అదే విధంగా  భారతదేశంలోని ప్రజలు వ్యక్తిగత లాభం (లేక) జాతీయ భద్రతను ఎంచుకోమని కోరినట్లయితే,_

_వారు వ్యక్తిగత లాభాన్నే  ఎంచుకుంటారు._

_ఎందుకంటే, దేశానికి భద్రత లేకపోతే, తమ వ్యక్తిగత లాభాలు మిగలవనీ.._

_మూటలు కట్టి, ఆ లాభాల ను ఎక్కడికి తీసుకెళ్లలేరని వారు అర్థం చేసుకోలేరు._ 🤔


❌నాలుగు విరుద్ధమైన పోకడలున్నాయి❌


 *_మొదటిది:-_*

 _భారతదేశం పేద దేశం, కాబట్టి బుల్లెట్ రైలు అవసరం లేదు అంటుంటారు._

_కానీ, లక్షలాది అక్రమచొరబాటుదారులైన రోహింగ్యాలు దేశం మీదపడి  కోట్లకొద్దీ మేస్తుంటే.. కిమ్మనరు.!_

_వాళ్లను దేశం నుండి పారదోలదామంటే ఒప్పుకోరు_


 *_రెండవది:-_*

 _మసీదు వైపు నుండి దేశంలోని యాభై ఆరు మంది ఖరీదైన న్యాయవాదులుంటారు._

_కానీ, గుడి వైపు నుంచి ఒకేఒక్క సుబ్రమణ్యస్వామి!!_


 *_మూడవది:-_*

_దేశంలో GSTకి వ్యతిరేకత ఉంది,_

_కానీ, జనాభా పెరుగుదలపై ఎప్పుడైనా వ్యతిరేకతను చూశారా?_


 *_నాల్గవది:-_*

 _తమాషా ఏమిటంటే, ఇద్దరు పిల్లలు ఉన్నవారు పన్నులు చెల్లిస్తారు,_

_కానీ పదిమంది పిల్లల్ని కనేవాళ్లు, ఆ పన్నులను సబ్సిడీలు గా మింగుతుంటారు!_


 *మీకు పైన పేర్కొన్న విషయాలు నచ్చకపోవచ్చు,*

*కానీ అవి ఖచ్చితంగా దేశాన్ని సర్వనాశనం చేస్తున్న విషయాలు!!!*

అసలైన చరిత్ర

 అసలైన చరిత్ర తెలుసుకుందాం..

****************************


#నలందవిశ్వవిద్యాలయం ఎలా నాశనం చేయబడిందో తెలుసుకుందాం.. 

#తుర్కిష్ సైన్యాధ్యక్షుడు #భక్తియార్‌ఖిల్జీ చేతుల మీదుగా 1193 లో నలంద విశ్వవిద్యాలయం అత్యంత క్రూరంగా సర్వనాశనం చేయబడింది. అదెలా జరిగిందో తెలుసుకుందాం..


ఒకసారి ఖిల్జీకి తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. తన ఆస్థాన వైద్యుల చేత కూడా నయం కాలేదు.

ఆస్థాన సలహాదారు "నలందలో #రాహుల్_శ్రీభద్ర అనే ఒక ఉపాద్యాయుడు ఉన్నాడు. అతనే నలందకి సర్వాధికారి (ప్రిన్సిపాల్) కూడాను. అతను అనుకుంటే మీ జబ్బు క్షణంలో నయం చేయగలడు. ఆయన తప్పక సహాయం చేయగలడు.." అని చెప్పాడు.


అందుకు ఖిల్జీ ఒప్పుకోలేదు..

"ఇతర మతాచారాలు పాటించే వారితో చచ్చినా వైద్యం చేయించుకొను.." అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రోజులు గడుస్తున్నాయి, కానీ ఖిల్జీకి వింత వ్యాధి నయం కాక భరించరాని బాధతో ఇంకో దారి లేక, ఖిల్జీ తన అహం చంపుకుని ఒప్పుకున్నాడు..


రాహుల్_శ్రీభద్ర కి కబురు పంపారు, ఆయన వచ్చిన తరువాత ఒక నిబంధన విధించాడు "నీ మత విశ్వాసం కాకుండా మందులుతోనే నయం చేయాలి, అలా చేయలేని పక్షంలో నీ తల తీస్తాను.." అన్నాడు. 

శ్రీ భద్ర సరే అని "మీ ఇస్లాంలో నయం చేసే ప్రార్థనలు ఉంటే చేసుకోమన్నాడు.." ఖిల్జీ ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పటికే చాలా సార్లు చేశాం కదా మళ్ళీ ఎందుకు అన్నాడు, అయినా అవసరం తనది కనుక అలానే చేసాడు ఖిల్జీ..


ఆశ్చర్యంగా ఖిల్జీకి నయం అయిపోయింది వ్యాధి..

ఖిల్జీ పట్టరాని ఆనందంతో "ఎలా సాధ్యం అయింది అని అడిగాడు, మా వైద్యులు కూడా మందులు వేశారు నేను ప్రార్థనలు చేసాను కానీ అప్పుడు నయం కాలేదు, ఇప్పుడు ఎలా నయం అయింది.." అన్నాడు..

అప్పుడు శ్రీభద్ర ఇలా చెప్పాడు "చేసే పనిలో శ్రద్ధ, నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది మనస్సులో ఉండాలి, వైద్యుడు వైద్యం కోసం వచ్చే వారిలో నమ్మకం నింపాలి, భయం పోగొట్టాలి ఆ తర్వాత వైద్యం చేయాలి, నా మీద నీకు పూర్తి నమ్మకం ఏర్పడింది, అందువల్లే జబ్బు నయం అయుంది.." అని చెప్పాడు. ఇంతకు ముందు అవి మీకు లేవు అని ఖిల్జీ తో చెప్పాడు.. 

ఆ తరువాత శ్రీభద్ర దగ్గర ఖిల్జీ స్నేహం ప్రేమ నటిస్తూ చాలా విషయాలు తెలుసుకున్నాడు....


నలందలో అన్ని విద్యలు ఆత్మరక్షణ విద్యలు, కళలు, సాహిత్యం, జ్యోతిష్యం, ఖగోళ, తాంత్రిక, గ్రహాంతర వాసులతో కనెక్ట్ అవడం.. వగైరా కనీ వినీ ఎరుగని అన్ని విద్యలూ సాధన చేస్తున్నారు అని వేగులు ద్వారా తెలుసుకుని విధ్వంసకరమైన కుటిల పన్నాగానికి ప్రణాళిక సిధ్దం చేసాడు ఖిల్జీ.. 

మహా పాండిత్యం ఉన్న వీళ్ళు ఎప్పటికి అయినా ప్రమాదం అని భద్రని సాగనంపి తాను కోలుకున్న తరువాత మిగతా అన్ని పనులూ పక్కనబెట్టి సైన్యాన్ని వెంటబెట్టుకుని నేరుగా వెళ్ళి నలందని నాశనం చేశాడు.. 


1193 లో #బఖ్తియార్_ఖిల్జీ అనే టర్కీ సైన్యాధికారి చేత బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయం సర్వనాశనం చేయబడినది,,

అక్కడ విద్య నేర్చుకుంటున్న 10 వేలమంది విద్యార్థులను, ఆచార్యులనూ వారు హాహాకారాలు చేస్తుండగా సజీవ దహనం చేసి విశ్వవిద్యాలయాన్ని కాల్చి బూడిద చేశారు..

లైబ్రరీలో ఉన్న సుమారు 1 కోటి 10 లక్షల (11 మిలియన్) తాళపత్ర గ్రంధాలను తగుల పెట్టినపుడు అవి కాలి బూడిద కావడానికే 6 నెలల సమయం పట్టినదట..

ఆ పొగ సుమారు 150 కిలోమీటర్ల మేర కనిపించేదట..

సహాయం చేసిన వారికి ద్రోహం చేయడం అంటే ఇదే..

****************************************************


#భక్తియార్‌పూర్ పేరు వినగానే ప్రతి భారతీయునికి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి..

కారణం #నలంద విశ్వవిద్యాలయం ఆ ఊరిలోనే ఉంది.. 

దానికి ఆపేరు ఎలా వచ్చిందో తెలుసా..??


1193లో భక్తియార్‌ఖిల్జీ అనే ముస్లిం సేనాధిపతి కేవలం 1000 మంది కరడుగట్టిన ఛాందసవాద సైనికులతో ఆ ఊరు వచ్చి, అక్కడ ఉన్న 10,000 మంది విద్యార్థులనూ, అధ్యాపకులనూ నరమేధం చేసి, నలంద యూనివర్సిటీని నేలమట్టం చేసి, అక్కడి లైబ్రరీలో ఉన్న 11 మిలియన్ల గ్రంధాలను తగులబెట్టాడు..

ఆ గ్రంధాలు అన్నీ పూర్తిగా తగల పడడానికి 6 మాసాల సమయం పట్టిందట..

ఆ పొగ 150 కి.మీ దూరం కనిపించిందట..

 కాంగ్రెస్ అతని పేరు మీద ఆ ఊరికి భక్తియార్‌పూర్ అని పేరు పెట్టింది..

చరిత్ర తెలియని మనం అదేదో భక్తితో కూడుకున్న పేరులా భలేగా ఉంది అని గుడ్డిగా 70 ఏళ్లుగా అలాగే పలుకుతూ ఉన్నాం..

ఇకనైనా నలంద అని మార్చాలి....!!


#My_Nalanda

కళ్ళలో నీళ్లు తెప్పించే వాస్తవ కధ..

 *మీకు కళ్ళలో నీళ్లు తెప్పించే వాస్తవ కధ.._* 

ఆర్మీ అధికారికి  ఓ వ్యక్తి దగ్గర  నుండి  లేఖ వచ్చింది.*_ 

అందులోని విషయం ఇలా ఉంది ..._* 

అయ్యా!_* 

నా పేరు  సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా  పని చేస్తూ  రిటైర్ అయ్యాను.*_ 

 _*నా కొడుకు ఆర్మీ లో  ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధం  లో వీరమరణం  పొందాడు.*_ 

 _*ఈ ఏడాది అతను  ప్రాణాలు విడిచిన  చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి  చూస్తున్నాము.*_ 

 _*అనుమతి ఇస్తే సంతోషము , అలా కుదరదు  మీ ఉద్యోగాలకు ఏదైనా  ఇబ్బంది కలుగుతుంది  అనుకుంటే  వద్దు  అని ముగించారు.*_  


 _*ఆ ఉత్తరం  చదివాక  ఆ అధికారి కళ్ళు  తడిచాయి  వెంటనే  వారిని  ప్రభుత్వ  ఖర్చులతో  పిలిపించండి.*_  _*అలా ఒకవేళ  ప్రభుత్వం ఖర్చు  పెట్టకపోయినా  సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీచేశారు.*_  


 _*ఆ వృద్ధ  దంపతులకు అక్కడ ఉద్యోగం చేస్తున్నవారంతా  వారికి వందనం చేశారు ఒక వ్యక్తి మాత్రం చివరగా వారి కాళ్ళపై పువ్వులు చల్లి నమస్కరించి వందనం చేశారు.*_ 


 _*ఎందుకు బాబు నువ్వు మాత్రం  ఇలా నువ్వు ఎంత  పెద్ద  అధికారివి  అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు.*_  


 _*అందరూ ఇప్పుడు ఉద్యోగంలో చేరిన  వారు నేను మీ అబ్బాయితో  కలిసి పని చేసాను.*_ 

*అని ఒక నిమిషం  మాటలురాక నిలబడిపోయాడు.*  

 _*పర్లేదు బాబు ఏ విషయమైనా  ధైర్యంగా  చెప్పు నేను ఏడవను అని చెప్పాడు.*_ 

 _*మీరు కాదు నేను ఏడవకుండా  ఉండాలి  కదండి అని చెప్పి మళ్ళీ చెప్పడం  మొదలుపెట్టాడు.*_  


 _*ఆనాడు పాకిస్థానీలతో  యుద్ధం జరుగుతున్నది  మా దగ్గర*_ _*ఆయుధాలు* *అయిపోవడంతో నేను డెత్* *ఛార్జ్ తీసుకుంటాను అని*_ _*ముందుకు  వచ్చాను.*_ _*అప్పుడు మీ కొడుకు నన్ను లాగి*_ 

 _*నీకు పిచ్చా నీకు పెళ్ళై  ఇద్దరు పిల్లలు ఉన్నారు.*_ 

 _*నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను  అని ముందుకు వెళ్లి  ఆ తూటాలను  తన శరీరంలో తీసుకున్నాడు.*_  

 _*శత్రువులను 13 మందిని చంపి  ఇక్కడే మరణించాడు.*_ 


 _*అతడిని మొదటగా పట్టుకున్నది  నేను అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణాలు  పోయింది*._  _*శరీరంలో 42 తూటాలు  ఉన్నాయి అని చెప్పి ఏడ్చేశాడు.*_  

 _*అక్కడ వింటున్న  తల్లి తన చీర  కొంగును అడ్డుపెట్టుకుని  ఏడ్చేసింది.*_  


 _*ఆరోజు  నేనే శవాన్ని  తీసుకురావలసింది  దగ్గర ఉండి అతడిని మోసిఉండాల్సింది  కానీ నాకు వేరే డ్యూటీ వేశారు ఆరోజు  అతడి కాళ్లపై వేయాల్సిన  ఈ పూలు ఇలా వేసి  నా ఋణం  తీర్చుకుంటున్నాను  అని అన్నాడు.*_ 


 _*బాబు నా కొడుకు పుట్టినరోజుకు  వస్తాడని  బట్టలు కొనిపెట్టాము  కానీ వాడి మరణవార్త వచ్చింది అందుకే ఈ బట్టలు ఇక్కడ  వదిలి  పెట్టాలని తెచ్చాము  కానీ అది అక్కడ కాదు నీకు ఇవ్వాలని  అర్థం అవుతున్నది.*_ 

 _*నీకు అభ్యన్తరం  లేకపోతే  తీసుకో బాబు  అని అతనికి  ఇచ్చి  ఎంతో  గర్వంతో  వెనుకకు  తిరిగారు  ఆ తల్లితండ్రులు.*_  


 _*ఇలాంటి కథలు  వాస్తవాలు  ఇంకెన్నో*_  

 *ఇవేవి మనకు తెలియవు  మనం ఆలోచించను  లేము*  

 *రాజకీయనాయకుడికి పాలాభిషేకం  చేసుకుంటూ*_  

 _*నటించే హీరోలకు  భారీగా         కట్అవుట్లు పెట్టుకుని వాళ్ళే దేవుళ్ళని  మన సమయాన్ని మన విలువని  పోగొట్టుకుంటున్నాము.*_  


*ఇలాంటి వీరజవాన్ల ఎంతో మంది  మనం బాగుండాలని  వారి ప్రాణాలను  త్యాగం చేస్తున్నారు.* 

 _*కనీసం మనం గుర్తించలేక  పోతున్నాం*_ ..

 *

గుణములు సాత్వికమ్ములు

 చం.

గుణములు సాత్వికమ్ములు; నిగూఢ మనోజ్ఞ పరోపకారమున్

ప్రణతుల బొందు రీతి యగు; స్వార్థము లేనివి పాఠ్యబోధనల్;

గణనకు మించి పూజ్యులగు కాశ్యపి యందు వసించు యొజ్జ లే 

ధనముల కాశ బొందని ప్రథానులు వారికి కేలు మోడ్చెదన్ 

మీ 

*~శ్రీశర్మద*

8333844664

శారదా దేవి దివ్య స్వరూపం!

 శు  భో  ద  యం🙏


శారదా దేవి దివ్య స్వరూపం!  


ఉ:  "  అంబ!  నవాంబుజోత్పల  కరాంబుజ  శారద!  చంద్ర  చంద్రికా


          డంబర  చారుమూర్తి; !  ప్రకట స్ఫుట భూషణ  రత్నదీపికా 

          

           చుంబిత  దిగ్విభాగ , శ్రుతి  సూక్తి  వివిక్త  నిజప్రభావ,   భా

            

           వాంబర  వీధి   విశ్రుత  విహారిణి!  నన్ గృపజూడు  భారతీ!


                 హరివంశము- అవతారిక - ఎఱ్ఱాప్రగ్గడ ;


(నవాంబుజోజ్జ్వలయనిపాఠాంతరము)


మాత  సరస్వతిని  కవులందరూ  స్మరించారు. కానీ , కవిత్రయంలో  తృతీయుడు  ఎఱ్ఱన  ప్రస్తుతించిన  తీరు అబ్బురమైనది.

ఆమూర్తిలోని  అంతస్ఫూర్తి  ,నింత గొప్పగా  ఆవిష్కరించిన  కవి  మరియొకఁడు  కానరాడు. బాహిర స్వరూపము నొక్కింత తడవుచు ఆతల్లి యక్షరామృత  వితరణా శీలమును  యెఱ్ఱన  యీపద్యమున  రూపు గట్టించినాడు.

    

         కఠినపదములకు అర్ధము:- అంబుజము-పద్మము; ఉత్పలము-కలువ; చంద్రిక-వెన్నెల;  చారు మూర్తి-  మనోహరాకారము కలది; రత్నదీపిక- రత్న దీపము; చుంబిత -ముద్దిడుకొను ; శ్రుతి-వేదము; సూక్తి-మంచిమాట;

వివిక్త- విశ్లేషణ;( కాళీప్రదేశమని మరొక అర్ధముంది) భావాంబరము- మనస్సనే యాకాశము; విశ్రుత విహారిణి: ప్రసిధ్ధినొందిన విహారముగలది;


           అప్పుడే వికసించిన పద్మములను,కలువలను బోలిన కరములు గలదానా! చంద్రుని వెన్నెలను బోలిన  మనోహర స్వరూపిణీ! ఆభరణములందు గల దీప సదృశములగు రత్నకాంతులను దిగంత పరివ్యాప్త మొనరించుదానా! వేదవాక్యములయందు  నిరూపింపబడు మహా ప్రభావ శాలినీ!  హృదయాకాశమునందు  స్వేఛ్ఛావిహారమొనరించు  మాతా! 

భారతీ!  నన్ను  దయజూడుము;  అని భావము.


                    ఈపద్యంలో 1  నవాంబుజోత్పల కరాంబుజ!


                                        2భూషణ  రత్నదీపికా చుంబిత  దిగ్విభాగ!

   

                                        3 శ్రుతి సూక్తి  వివిక్త  నిజప్రభావ!

       

                                        4 భావాంబర వీధి విశ్రుత విహారిణి!                      అనే యీనాల్గు  విషయాలూ  విశ్లేషింప దగినవి.

మొదటిది: ఆమె కరములు  అంబుజములట! అంబుజములు రెండురకములు .పగటికి తామరలు పద్మములు.రేయికి కలువలు. ఆమెహస్తము లీ  రెంటిని బోలి యుండునట. రేయింబవళ్ళు  ఆమెచేతులకు పని. యేమిపని? జ్ఙానామృతమును పంచుపని.అక్షరామృతమునందించుపని, పద్మమునందు మకరంద ముండును.మాత సరస్వతి హస్తమున జ్ఙానామృతముండును. దానినామె నారాధించువారికి  రేయింబవళ్ళు వితరణ మొనర్చును. ఆహా! ఎఱ్ఱనగారి యూహ యెంత గొప్పది!!!


               ఇఁక రెండవ యంశము: ఆమెభూషణములు  రత్నదీపములట!ఔను రత్నదీపికలే! శ్రుతులే యామెకు నిజభూషణములు. వాటిప్రభావము విశ్వ వ్యాప్తమేగదా! భారతీయ జ్ఙాన వికాసమునకు వాని వెలుగులే  యాధారము.


            3శ్రుతి సూక్తి  వివిక్త  నిజప్రభావ! వేద సూక్తుల యందు ఆమెప్రభావము  అడుగడుగునా ప్రస్ఫుట మగుట మనకు విదితమే"  అక్షరం పరమంపదం"- ఆఅక్షరమైన పరంబ్రహ్మ  స్వరూపావిష్కరణకు  అక్షరం అవసరంగదా! ఆఅక్షరమే ఆమెరూపము, ఆమెస్వభావము, ఆమెప్రభావము. 


                        4  భావాంబర వీధి  విశ్రుత విహారిణి! హృదయాకాంశంలో  తిరుగు లేని సంచారంచేసే తల్లి.ఆమాట నిజమే!

కానీ, భావాంబరమని  " అంబర"- శబ్దాన్ని యెఱ్ఱన ప్రయోగించుటలో  నేదో ప్రత్యేకత యున్నది. అంబరము అనుపదమునకు 

ఆకాశము  అను నర్ధమేగాక  వస్త్రము  అను నర్ధముకూడా ఉన్నది. హృదయమనే కేన్వాసుపై  చెరగని ముద్రవైచుకొని  యెటుబోయిన నటువచ్చు(మూవీ) స్వరూపముగలదట! ఈచిత్ర మెంత చిత్రము!


                               మనము  మరియొక దాని నుపేక్షించితిమి ." శారద  చంద్ర చంద్రికా డంబర  చారుమూర్తి" శరత్కాలమునందలి చంద్రుని వెన్నెలనుదలపించు చల్లని మనోహర రూపిణి! మాత  సరస్వతి  చల్లనిది. ఆమెకరుణ సూర్యాతపమువంటిదికాదు, చంద్రాతపమును బోలి చల్ల నిది. వెన్నెలను జ్ఙానముగా పెద్దల సూచన! అందుచేత చల్లగ మెల్లగ జ్ఙాన సంపదను యిచ్చుతల్లీ!యని కవియను చున్నాడు.


                              ఇటులీ పద్యము  అనవద్యము  హృద్యమునై  చదువుల తల్లి యంతః సత్త్వమును వ్యక్తమొనర్చు

పరమామ్నాయ  సదృశమై  యొప్పారు చున్నది.


                                                                  స్వస్తి!🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నివేదన – పవిత్రత

 *నివేదన – పవిత్రత* 

 గురువుల సమక్షంలో   ఓ శిష్యుడి ఇంట్లో, సహస్రనామ పాదపూజ  జరుగుతున్నది. శ్రీ గురువుల ప్రక్కన టేబుల్ ఫ్యాన్ ఉంచబడింది. నైవేద్యం తీసుకువచ్చినప్పుడు, శ్రీ గురువులు పంకా (ఫ్యాన్) ను కొద్దిగా ప్రక్కకు త్రిప్పారు. శిష్యుడ్ని పేరు పెట్టి పిలుస్తూ అతని దృష్టిని ఆకర్షించిన శ్రీ గురువులు, “లలితా సహస్రనామంలోని పేర్లు  అతి రహస్యమైనవి, గూడార్థము కలిగినవి. ఉదాహరణకు, “అపర్ణ” పేరును పరిశీలించండి. హిమవంతుని కుమార్తె పార్వతిగా వ్యక్తమైన తరువాత, ఆ తల్లి శివుడిని పొందటానికి తీవ్రమైన తపస్సు చేసింది. ఆ సమయంలో, ఆమె ఒక్క ఆకు కూడా తినకుండా ఉపవాసం చేసింది. దీనిని గమనించిన దేవతలు ఒక్క ఆకు కూడా తినని ఆ తల్లిని  ‘అపర్ణ’ అని ప్రశంసించారు.ఆ పేరుకు మరో అర్ధం కూడా ఉంది. “అప” మరియు “ర్ణ” గా విభజించండి. అంటే  ఋణం నుండి విముక్తి పొందిన వ్యక్తి అని అర్ధం. ఎవరైనా ఆమె పేరును స్మరించినప్పుడు, ఆమె తన భక్తుడి నుండి ఏదో అందుకున్నట్లు అనిపిస్తుంది. క్షణాలు ఆలస్యం చేయకుండా, ఆమె ఆ భక్తునికి రుణం వుంచుకోకుండా తిరిగి చెల్లిస్తుంది.అలాగే, ఎవరైతే తన రుణాన్ని వెంటనే తీరుస్తారో ఆమెను  నిజంగా అపర్ణ అని అంటారు. ఆమె ఏదీ తన దగ్గర వుంచుకొనదు. నామముల అర్థాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుసుకున్నప్పుడు ఆరాధన యొక్క ఆనందం పెరుగుతుంది”. అని పూజ్య గురువులు శెలవిచ్చారు. అటు పిమ్మట శ్రీ గురువులు పూజను కొనసాగించమని శిష్యుడికి సైగ చేసి, ఫ్యాన్ ను యథాస్థితికి త్రిప్పారు. పూజ ముగిసిన తరువాత, శ్రీ గురు చరణులు అందరినీ ఆశీర్వదించి వెళ్లిపోయారు. 

తరువాత, శిష్యుడు జగద్గురువులు బస చేసిఉన్న  చోటుకు వెళ్ళాడు. భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ గురు చరణులను సమీపించి, *" నేను ఎంతో భాగ్యశాలిని, జగన్మాత యొక్క పవిత్ర నామం అయిన అపర్ణ యొక్క అర్ధాలను మీ ద్వారా విన్నందుకు నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను.   మీ పవిత్ర చరణముల ద్వారా ఉద్భవించిన ఈ కథ యొక్క రెండవ వ్యాఖ్యానం కూడా విని నేను ఎంతో ఆశ్చర్యపోయి, ప్రేరణ పొందాను.* 


HH: దాని కోసం నాకు గుర్తింపు, కీర్తిని ఇవ్వవద్దు. ఇందులో నా ప్రమేయం ఏమియూ లేదు. 

శిష్యుడు: మీరు  నిరాడంబరులు. 


H.H: ఇది నమ్రత గురించిన ప్రశ్న కాదు.  నేను ఇచ్చిన అర్ధాలు లలిత-సహస్రనామం శాస్త్ర వ్యాఖ్యానంలో ఉన్నాయి. 

శిష్యుడు: మీ పాద చరణాల నుండి నేను చాలా విలువైన  పాఠాలు నేర్చుకున్నాను. ఆరాధన సమయంలో జపించే నామం యొక్క అర్ధాన్ని, దాని ప్రాముఖ్యతను  తెలుసుకోవడంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా దాని అర్ధం కూడా తెలుసుకునే స్థితిలో ఉండాలి. 

ఫ్యాన్ యొక్క స్థానాలను మార్చడంలో  తమ అంతరార్ధాన్ని నాకు శ్రీచరణులు తర్వాత ఇలా చెప్పారు. *తెచ్చిన నైవేద్యం చాలా వేడిగా ఉందని, నేను దానిని దేవతకు అర్పించే ముందు, మేము పంకాను (fan) దాని వైపుకు త్రిప్పాము. అది చల్లబడిన తరువాత, మళ్లి   పంకాను (fan) యధా స్థానానికి పునరుద్ధరించాము. నివేదన  చల్లబడుతున్నప్పుడు,  ప్రవచిస్తూ తద్వారా ప్రజల దృష్టిని నైవేద్యం వైపు ఆకర్షింపబడకుండా మరలించాను.తద్వారా  వేడి నైవేద్యం  సమర్పణ నివారించడమే కాకుండా, చేసే ఆ తప్పు వలన మా వంశానికి ఎటువంటి అసౌకర్యం, కీడు జరగకుండా శ్రీ గురువులు మమ్ములను రక్షించినారు. గురు దేవుళ్ళ సాధారణ చర్యలు కూడా ఎంతో  బోధనాత్మకమై, భద్రతతో కూడుకున్నవిగా ఉంటాయి.

ప్రశంసలను విస్మరించి శ్రీ గురువులు ఇలా అనుగ్రహించారు, *"పూజలు చేసేటప్పుడు, మనం  దేవుని సన్నిధిలోనే ఉన్నాము,  ఒక చిత్రం ముందు కాదు అన్న స్పృహ, భావన అందరికీ వుండాలి. మనము వేడిగా వున్న  ఆహారాన్ని, చెడిపోయిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడము,  ఒక ముఖ్యమైన అతిథికి కూడా అలాంటి ఆహారాన్ని ఇవ్వము.  అలాగే భగవంతునికి కూడా అలాంటి సమర్పణను ఇవ్వకూడదు. అదేవిధంగా వాడిపోయిన పువ్వులను, వాసన లేని పువ్వులను పక్కన పెట్టాలి.  క్రొత్త వాటిని మాత్రమే పూజకు సమర్పించాలి".*


*-జగద్గురువులు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు*

పరమార్థతత్త్వాన్ని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *తత్త్వం చిన్తయ సతతం చిత్తే*

        *పరిహర చిన్తాం నశ్వరవిత్తే।*

        *క్షణమిహ సజ్జనసఙ్గతిరేకా*

        *భవతి భవార్ణవతరణే నౌకా॥*

 

తా𝕝𝕝 "పరమార్థతత్త్వాన్ని మనసులో సదా ఆలోచించుము. అశాశ్వతమైన ధనసంపదలయందు కోరిక విడనాడుము. *సజ్జనసాంగత్యం ఒక్కటే ఈ సంసారసాగరాన్ని క్షణకాలంలో దాటించగలిగే నౌక అగుచున్నది*."

రాముడిని చూశారా

 ఒకప్పుడు భక్తుడు తులసీదాసుని అడిగాడు.


“మీరు రాముడిని చూశారా ?"


దానికి తులసీదాస్ "అవును నేను చూసాను: అన్నాడు.


భక్తుడు “అప్పుడు నాకు కూడా శ్రీరామదర్శనం చేయించండి "


తులసీదాసు "ఎందుకు కాదు నీకు కూడాశ్రీరామదర్శనం సాధ్యమే! అది చాల సులభం. మీరు ఏ వ్యక్తిని చూసిన అక్కడ మీ కోసం రాముడు కనిపిస్తాడు!"


భక్తుడికి అర్థం కాలేదు. " ఎలా చెప్పండి"


తులసీదాసు అన్నారు :


చూడండి, దీనికి సులభమైన సూత్రం ఉంది.


భక్తుడు మరింత ఉత్సుకతతో, ఆశ్చర్యంతో ఆ సూత్రం ఏమిటి? అని అడిగాడు.


అప్పుడు తులసీదాస్ ఇలా అంటాడు:


"నామ_చతుర్గుణ_పంచతత్త్వమిలన_తాసం_ద్విగుణ_ప్రమాణ_తులసీఅష్టసౌభాగ్యే_అంత_మే_శేష_రామ_హీ_రామ ||"


దీని ప్రకారం, ఏ పేరు అయినా సరే,


అందులోని అక్షరాలను లెక్కించండి. అని


నాలుగు (నాలుగు రెట్లు) ద్వారా గుణించండి. దానితో


ఐదు (పంచతత్త్వ మిలన్) జోడించండి. అప్పుడు


మీరు పొందిన సంఖ్యను రెట్టింపు చేయండి.


.దాన్ని ఎనిమిదితో భాగించండి (అష్టసౌభాగ్యం).


మిగిలేది అదే. ఆ రెండు


అక్షరాలు "రామ"!


భక్తుడు ఆశ్చర్యపోతాడు. అతని పేరు "నిరంజన".


4X4=16; ౧౬ ప్లస్ 5=21;


21X2=42; 42/8= ఆన్సర్ 5. శేషం 2.


అతని భార్య పేరు "నిర్మల".


అక్కడ ఉన్నదానికి సూత్రం ప్రకారం . 3X4=12;


12 + 5=17; 17X2=34; 34/8 =


ఆన్సర్ 4. శేషం 2.


అతని కూతురు పేరు "నిధి".


ఫార్ములా వర్తింపజేయబడింది. 2X4=8; 8 + 5=13;


13X2=26; 26/8 = ఆన్సర్ 3. శేషం = 2


అవును! పేరు ఏదైనా,


అక్షరాలు ఎన్ని ఉన్నా


ముగింపు రెండు అక్షరాలు"రామ" మాత్రమే!


మరియు సూత్రంలోని సంఖ్యలు


గణిత కార్యకలాపాల ప్రాముఖ్యత మీకు తెలుసా?


చతుర్గుణ = ధర్మము, అర్థము, కామము, మోక్షము


నాలుగు పురుషార్థాలు.


పంచతత్త్వం = భూమి, నీరు, అగ్ని,


పంచమహాభూతాలు వాయు మరియు ఆకాశ.


ద్విగుణ = మాయ మరియు బ్రహ్మ.


అష్టసౌభాగ్య = ఆహారం, అర్థం, ఆధిపత్యం,యవ్వనం, కీర్తి, ఇల్లు, బట్టలు, ఆభరణాలు


వీటన్నింటి కోసమే మనం జీవిస్తున్నాం.కానీ చివరికి మిగిలేది భగవంతుని నామం మాత్రమే

జై శ్రీ రామ్ 🙏🙏  జై శ్రీ రామ్

పద్యం జ్ఞాపకముంద

 నయమున బాలుం ద్రావరు

భయమును విషమ్మునైన భక్షింతురుగా

నయమెంత దోసకారియో

భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!  - బద్దెన


భావం:- ఓ బుద్ధిమంతుడా!మీరు మర్యాదగా అడిగితే ప్రజలు పాలు తాగరు, కానీ బెదిరించినప్పుడు వారు విషాన్నైనా తాగేస్తారు. కాబట్టి కొన్నిసార్లు పనులు పూర్తి కావడానికి బెదిరింపులు అవసరం.

ఈ పద్యం జ్ఞాపకముంద


 మీ ఇంట్లొ చిన్నారులకు వీటిని నేర్పగలరు.

పరమార్థతత్త్వాన్ని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *తత్త్వం చిన్తయ సతతం చిత్తే*

        *పరిహర చిన్తాం నశ్వరవిత్తే।*

        *క్షణమిహ సజ్జనసఙ్గతిరేకా*

        *భవతి భవార్ణవతరణే నౌకా॥*

 

*తా𝕝𝕝 *పరమార్థతత్త్వాన్ని మనసులో సదా ఆలోచించు అశాశ్వతమైన ధనసంపదలయందు కోరిక విడనాడుము సజ్జనసాంగత్యం ఒక్కటే ఈ సంసారసాగరాన్ని క్షణకాలంలో దాటించగలిగే నౌక అగుచున్నది*.


 ✍️💐🌺🌹🙏

శాసన సభ్యులు - సుపరిపాలన 8*

 *శాసన సభ్యులు - సుపరిపాలన 8*


సభ్యులకు నమస్కారములు.


అధికార పక్షము మరియు ప్రతిపక్షము అను భేదము లేకుండా శాసన సభ్యులందరూ , తమ తమ నియోజక ప్రజలకు నిరంతరము అందుబాటులో ఉండి, చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందవలసి ఉంటుంది. ఫిర్యాదుదారులతో, లబ్ధి దారులతో మాత్రమే గాకుండా నియోజక ప్రజలందరితో మర్యాదా మన్ననలతో  ప్రవర్తిస్తూ, వివరాలను సేకరిస్తూ, జాప్యం జరుగకుండా వేగవంతంగా స్పందిస్తూ ప్రజలకు సహకరిస్తూఉండాలి. 


ప్రతి శాసన సభ్యుడు తమ నియోజక ప్రజల మద్దతుతోనే తాము అధికారంలోకి వచ్చామన్న  భావన సర్వదా కలిగి ఉండాలి. పాలకులు బాధ్యతాయుతంగా అంకిత భావంతో క్రమశిక్షణాయుతంగా వారి వారి  విధులు నిర్వహించాలి. ముఖ్యంగా సమాజంలోనున్న సంఘ విద్రోహశక్తులను, నేరస్తులను, జూదగాళ్లను, మత్తు పదార్థ విక్రయ దారులను, మాన భంగ దుర్మార్గులను,  దౌర్జన్యకారులను ఇత్యాది చట్ట వ్యతిరేక, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని నియంత్రించడంలో  రక్షకభట శాఖ సహకారము గైకొని  ప్రజలకు ప్రశాంతమైన వాతావరణము కల్పించాలి.  *నిజాయితీగా, ఋజు వర్తనతో ఉండే అధికారుల విధులలో జోక్యము చేసుకోరాదు* అట్టివారికి  అండదండలుగా  *ఉంటే ప్రజలు హర్షిస్తారు*.


*నేరస్తుల నియంత్రణలో   శాసన సభ్యులు ఎట్టి ప్రలోభాలకు గాని ఆధిష్టానము ఒత్తిడులకు గాని లోంగరాదు* . నేరాల అదుపునకై భద్రతా శాఖ సహకారముతో, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానము వినియోగించుకుంటూ  *శాంతి భద్రతల అంశమునకు ప్రథమ ప్రాధాన్యము ఇవ్వవలసి ఉంటుంది*. 

 

ఎన్నికల సమయంలో  తమ తమ పార్టీలు ఇచ్చిన ప్రజా సంక్షేమ  హామీలను మరియు వాగ్దానాలను అమలు చేయాలి, పూర్తిచేయాలి. ప్రజా సంక్షేమం ఎంత ముఖ్యమో, ప్రజలు స్వయం పోషకులుగా తమ శక్తి సామర్థ్యాలను వినియోగించుకునెలా ఉద్యోగ అవకాశాల కల్పపనలో, పారిశ్రామిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు చేపట్టాలి.  సంక్షేమము తో పాటు  అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వడం మరి మరీ ముఖ్యము.


*ప్రజల సుఖ సంతోషాలు మరియు క్షేమమే తమ కర్తవ్యంగా నాయకులు భావించాలి*.  ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు పార్టీలు ఏవైనా సరే ప్రజా సంక్షేమ పథకాలన్నీ అమలు అయ్యేలా కృషి చేయాలి, దీక్షబూనాలి. *ప్రతి శాసన సభ్యుడు మానవతా దృక్పథంతో సుపరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందాలి*.


ధన్యవాదములు.

(*స శేషం*)

పంచాంగం 24.06.2024

 ఈ రోజు పంచాంగం 24.06.2024  Monday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష తృతీయ తిధి ఇందు వాసర: ఉత్తరాషాఢ నక్షత్రం ఇంద్ర యోగ: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.


తదియ రాత్రి 01:22 వరకు.

ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03:52 వరకు.


సూర్యోదయం : 05:47

సూర్యాస్తమయం : 06:50


వర్జ్యం : రాత్రి 07:38 నుండి 09:09 వరకు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:45 నుండి 01:37 వరకు తిరిగి మధ్యాహ్నం 03:21 నుండి 04:13 వరకు.


అమృతఘడియలు : పగలు 09:46 నుండి 11:17 వరకు.


రాహుకాలం : పగలు 07:30 నుండి 09:00 వరకు.


యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.



శుభోదయ:, నమస్కార: