24, జూన్ 2024, సోమవారం

భగవంతుడికి

 జై శ్రీ రామ్*_🙏భగవంతుడికి ఎవరి మీద శ్రద్ధ గాని, ద్వేషముగాని ఉండదు .అందరి పట్ల సమభావనతో ఉంటారు._*


*_🌿మనం చేసుకున్న కర్మలకు ఆయన సాక్షిభూతుడుగా ఉంటారు .మన జన్మలకి మనమే కారణము .మనం చేసిన కర్మను బట్టి తల్లిదండ్రులు అన్నదమ్ములు ,అక్కచెల్లెళ్ళు, స్నేహితులు, చుట్టుపక్కల సమాజము ఇవన్నీ కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి._*


*_🌿ఇవన్నీ కూడా మనం చేసుకున్నవే అంటే మన కర్మను బట్టి ఇవన్నీ వస్తాయి. విత్తనము మొలకెత్తాలంటే నేల బాగుండాలా నీరు పోసేవారు ఉండాల వాటిని పరిరక్షించేవారు ఉండాలి ఇవన్నీ కూడా ఉంటే విత్తనము మొలకెత్తలేదు అంటే కాలము దానికి సహకరించలేదు అని అర్థము. అంటే కాలము ఇక్కడ భగవంతుని స్వరూపం ఆయన ఆజ్ఞ లేనిదే ఆ విత్తనము మొలకెత్తదు._*


*_🌿మనము భక్తి చేతగాని, ధ్యానం చేతగాని ,కర్మ చేతగాని ఈశ్వరుని ఆరాధిస్తున్నప్పటికీ మన మోర భగవంతుడు ఆలకించలేదు అంటే మన పాపపు కర్మ ఇంకా ఉంది అని అర్థము. భగవంతునికి దగ్గర కాలేదు అని అర్థం. కాబట్టి మనం ఇంకా ప్రయత్నము ఎక్కువ చేయాలి అంటే కాలము కలిసి వచ్చేదాకా ప్రయత్నం చేస్తూ ఉండాలి ._*


*_🌿సహనముతో సాధించుకోవాలి .ఓకే కాలంలో ఒకే చెట్టుకి వచ్చిన పండ్లన్నీ ఒకే రుచిని కలిగి ఉండవు .అలాగే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అందరూ కూడా ఒకలాగే ప్రవర్తించరు వారి వారి కర్మలను బట్టి వారి బుద్ధి ఆధారపడి ఉంటుంది._*


*_🌿ఎవ్వరిని ఏమీ అనక్కర్లేదు మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాను పుణ్యం చేస్తే పాపం అనేది తానంతగా తన పోతుంది ._*


*_🌿ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తూ ఉండండి. గోవులకు ,కుక్కలకు వాటికి కూడా ఏమన్నా పెడుతు ఉండండి. ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతుడు మన విన్నపాన్ని తప్పకుండా ఆలకిస్తారు. ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి._*


*_🌿మన పాపమంతా పోయి భగవంతుడు మన మొర ఆలకించిన రోజు మనము ఏమి కోరుకుంటే అది జరుగుతుంది. మనము అనుకున్నవి జరగటం లేదు అంటే మన పాపం పోలేదని మనం అర్థం చేసుకోవాలి ._*


*_👉కాబట్టి సాధన అనేది మనం ఇంకా పెంచుతూ వెళ్లాలి మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతూ ఉంటే మీరు తప్పకుండా భగవంతుడు తో సంబంధం ఏర్పడింది అని అర్థము. మానవ జన్మ పరమార్థము భగవంతుడితో సంబంధం కొరకే._*


_*💚జీవితంలోకి మంచిని పలకరిదాం... మంచినే కోరుకుందాం...💚*_


జై శ్రీ రామ్ 

కంచెర్ల వేంకట రమణ

కామెంట్‌లు లేవు: