27, జులై 2021, మంగళవారం

ఆనాటి పెళ్ళి భోజనాలు

 మనందరినీ నాలుగైదు దశాబ్ధాల వెనుకకు తీసుకుపోయే మెసేజ్ -  ఆనాటి పెళ్ళి భోజనాలు ఒకసారి రుచి చూడాలంటే, చదివేయండి మరి 😃

చివరన, ఆగకుండా చదివిన తృప్తి ఎంత అంటే, చెప్పలేనంత👌😊

ఆరోజులు మళ్లీ రావు. వస్తే ఎంత బాగుండును? 


*పెళ్ళి భోజనం* 


ఆకుపచ్చని అరిటాకు ముందు కూచుంటాము శుభ్రంగా.  శుభ్రంగా...తడిగా మెరుస్తుంటుంది లేత అరిటాకు నవ నవలాడుతూ. 


వంటల వాసన గాలిలో తేలివస్తూ మనల్ని ఒక ఊపు ఊపేస్తుంటుంది తొందర చేస్తూ.  తినబోయే వాటి రుచులు నాలుకను చవులూరిస్తాయి. 


ఈలోగా ‘ చవి’ వడ్డిస్తానంటూ వస్తాడు ఒక బూరిబుగ్గల పిల్లవాడు. బొజ్జనిండా తిని పందిట్లో పడి అల్లరి చేస్తుంటే పిలచి వాడికి ఉప్పు విస్తట్లో పైన వారగా వేసే పని అప్పచెప్పారులా ఉంది. 

శ్రద్ధగా వేస్తున్నవాణ్ణి చూసి నవ్వుతుంటాం. 


పట్టుపరుకిణీ గర గర లాడించుకుంటూ నీళ్ళ జగ్గు పట్టుకొస్తుంది ఓ బాలామణి , దానితో పాటే ఇంకా కొందరు ఆడపిల్లలు వీరికి మంచినీళ్ళు పోసే పని . కిలకిలా గల గలా నవ్వుతూ చిందకుండా తలలు వంచి గ్లాసులలో నీళ్ళు పోస్తుంటే, ఆడపిల్లల వద్దిక చూసి ముచ్చట పడిపోతాం ఆకుల ముందు కూచున్న మనం . 


ఈలోగా వస్తాడు పూర్ణంబూరెల బుట్ట పుచ్చుకుని చినమామయ్య. 

ఈ మామయ్యకు లౌక్యం బాగా తెలుసు. 

బావా ! బామ్మర్దీ! ఏమే మరదలా ! మేనకోడలా ! అని పలకరిస్తున్నట్టే పలకరిస్తూ లాఘవంగా రెండు బూరెలు వడ్డించిపోతుంటాడు వేగంగా. ఇంకోటి వేయవయ్యా ! అంటున్నా మాటలు చెవిని వేసుకోనే వేసుకోడు. 


పెద్ద పళ్ళంలో కనపడేట్టు పట్టుకుని పొడుగ్గా ఉన్న అరటికాయ బజ్జీ అందంగా వడ్డించి పోతాడు నూనూగు మీసాల మేనల్లుడు మరో మాటుండదు. 


వచ్చి ఆకులో ఇటుపక్క  చెంమ్చాతో చూసి చూసి వడ్డిస్తుంది దోసావకాయను , పెళ్ళై ఇద్దరు పిల్లలున్న నంగనాచి మేనకోడలు. 

ఆ దోసావకాయ ఘాటుకు నోట్లో నీళ్ళూరి , ‘అదేమిటే ఆ  విదపడం ..ఇంకొంచం వేయచ్చు కదే ‘అంటే , 

‘ముందు అది తినవమ్మా తర్వాత మళ్ళా వేస్తా ‘అంటూ తన పిల్లలకు చెప్పినట్టు చెపుతూ చక్కా పోతుంది. 


తర్వాత కొత్తావకాయని అత్తయ్య పట్టుకొస్తుంది . 

ఈ రంగు చూసావా వదినా! 

నే దగ్గరుండి గుంటూరు మిరపకాయలు ఆడించి కలిపించాను, ముక్క కసుక్కుమంటోంది కొరికితే ‘ అంటూ పెచ్చుతో సహా ఎర్రెర్రని ఆవకాయ వడ్డించి అందరి మనసు రంజింప చేస్తుంది. 


పచ్చళ్ళ గుత్తి పుచ్చుకొని తెల్లటి లాల్చీ పైజమా వేసుకున్న బాబయ్య వస్తాడు వడ్డించడానికి. ఈ బాబయ్య ఎప్పుడూ తెల్లటి బట్టలే వేసుకొని చల్లగా నవ్వుతుంటాడు. 

పైగా వడ్డింపుకు పట్టుకొచ్చినదో.. 

రుచులూరించే గోంగూర పచ్చడి దానికి తగ్గట్టుగా గొప్పకబుర్లు చెపుతూ’ మీ పిన్ని చేత చేయించాను, ఆకంతా నేనొక్కడినే వలిచాను తెలుసా ‘ అంటూ. ఆచేత్తోనే గుత్తి రెండో భాగంలో ఉన్న తాజాగా ఘుమ ఘుమలాడే కొబ్బరికాయ మామిడికాయ కలిపిన పచ్చడి వడ్డించేసి పోతాడు. 


తర్వాత అమాయకపు పిన్ని వంతు. పట్టెడు పట్టెడు పులిహోర వెనకాడకుండా వడ్డిస్తుంటుంది, వరసలో కుర్రవెధవ నాకు వేరుశనగపలుకులు ఎక్కువ రాలేదంటే, మళ్ళీ వెనక్కి వెళ్ళి చిరునవ్వుతో వడ్డిస్తుంది. ‘సుబ్బరంగా తినండి , లేకపోతే అక్క నన్ను కోప్పడుతుంది ‘ అంటుంది తెచ్చుకున్న పెద్దరికంతో. 


ప్రత్యేకంగా పనసపొట్టు కూర గంపలో వేసుకు పట్టుకువస్తాడు వంటపంతులు మామ. ఎంతో కష్టపడి చేసిన ఆ కూర తన చేత్తో తానే వడ్డించాలని, పదిమందికీ తన వంట నైపుణ్యం చెప్పాలని , పనసపొట్టు కొట్టిన దగ్గరనుంచి పోపు పుష్కలంగా వేసానని , జీడిపప్పుకు మొహమాటపడలేదని,  కొంచం ఆవ కూడా తగిలించానని వర్ణిస్తూ వడ్డిస్తుంటే మనం ఉవ్విళ్ళూరిపోతాం ఎప్పుడెప్పుడు నోటపెట్టుకుందామా అని. 


ఈలోగా ’గుత్తివంకాయ కూర ‘అంటూ అరుస్తూ వడ్డిస్తాడు అసిస్టెంటు కుర్రాడు , పరుగులే నుంచోడం లేదు. గరిట నుంచి జారి విస్తట్లో పడుతుంటుంది నూనె ఓడుతున్న నోరూరూంచేసే గుత్తి వంకాయ . ఎవరో అది చూడంగానే బంతిలో వారు కూనిరాగం తీస్తారు , *‘గుత్తివంకాయ కూరోయి బావా ”* అంటూ. 


పప్పు గోకర్ణంతో వస్తాడు పెళ్ళి కూతురు అన్నగారు. చెల్లెలి పెళ్ళిపనుల పర్యవేక్షించి అలసిపోయినట్టున్నా , వడ్డింపు పనికి కూడా పరుగెట్టుకొచ్చాడు. మరి ఇదే కదా అన్నిటికన్నా ముఖ్యమైన పని, వచ్చిన అతిధులను భోజనంతో ఆదరించడం . పేరుకు పప్పు గోకర్ణం పట్టుకు వడ్డిస్తున్నా , పది కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు అందరకీ అన్నీ అందుతున్నాయా, వడ్డింపులు సరిగా సాగుతున్నాయా అని. అంత హడావిడిలోనూ ఆకులో మామిడికాయ పప్పు వడ్డిస్తూ మొహంలో నవ్వు చెదరనివ్వనేలేదు.  


సిల్కు వల్లెవాటు జారిపోతుంటే సద్దుకుంటూ, మొహం మీది ముంగురులు వెనక్కి తోసుకుంటూ, అక్క పెళ్ళికి సందడి అంతా తానై తిరుగుతున్న కాటుక కళ్ళ చిన్నది, పెళ్ళి కూతురు చెల్లి అప్పడాలు,గుమ్మడి వడియాలు,ఊర మిరపకాయ వడ్డిస్తోంది హుషారుగా. కాని ఒకళ్ళకి వడియం వడ్డించడం, వదిలేస్తే ఇంకోరికి ఊరమిరపకాయ సొడ్డు పెడుతోంది , నలుగురినీ ఒక్కదగ్గరగా చూసిన గాభారాలో. పైగా పొలోమంటూ ఈ పిల్లను చూడగానే ప్రతీవాళ్ళూ పరాచికాలాడటమే. 

*‘ఏమిటా కంగారు అంటూ ‘తర్వాత నీదే కదా ఛాన్స్’,* *నువ్వెప్పుడు పెట్టిస్తావే పప్పన్నం’* 

ఇవ్వన్నీ వింటూ ఆ పిల్ల సిగ్గుపడిపోయి మరింత కంగారుపడి , కనిపించిన వదిన గారికి ఆ అప్పడాలు అప్పచెప్పి తుర్రుమంది. 


వెంట అన్నం పట్టించుకుని చేతిలో నేతి కొమ్ముజారీ పట్టుకుని పట్టుచీరతో అక్షింతలు పూలరేకులు కాసిని మీదపడి అంటుకున్నవాటితో ఆమట్ని ఆపసోపాలు పడుతూ వస్తుంది పెద్దమ్మ , పెళ్ళికూతురు తల్లి యజమానురాలు. మొహమంతా పెళ్ళి నిర్విఘ్న్నంగా జరిగిందన్న తృప్తీ సంతోషమూనూ. 

ప్రతి వక్కరనీ పేరుపేరునా వరసలతో పలకరిస్తూ పెద్దవాళ్ళని ‘ ‘అన్నయ్యా! వచ్చి నీ చేతుల మీదుగా 

మా పిల్ల పెళ్ళి జరిపించావు, వదినా భోజమనమయ్యేక బొట్టెట్టించుకుని తాంబూలం తీసుకు వెళ్ళండమ్మా’ అంటూనూ’ 

తమ్ముడూ ! నువ్వొచ్చావు ఎంతో సంతోషం , అమ్మాయీ లక్షీమీదేవి లాగ ఉన్నావమ్మా’ అంటూ చిన్నవాళ్ళనీ పలకరించుతూ, వడ్డించిన అన్నం మరికాస్త కలపండి మొహమాటం లేకుండ భోంచేయమని చెపుతూ , చాలు చాలంటున్నా నేయి ధార కట్టిస్తుంది విస్తట్లో. 


ఈలోగా అల్లక్కడ లోపలనుంచి  *‘తప్పుకోండి , తప్పుకోండి వేడి వేడి గుమ్మడికాయ దప్పళం వస్తోంది’* అని కేకలు వినిపిస్తుంటాయి . 

మనం అయితే దప్పళానికి ఖాళీ ఉంచుకోవాలనుకుంటూ, అన్నీ తినేసి కొంత అన్నం మధ్యలో గుంట చేసి పెట్టుకొని అందులో వేడి వేడి ముక్కల పులుసు పోయించుకొని మైమరచి తింటాము. 


అప్పుడొస్తాడు పెళ్ళి పెద్ద గృహయజమాని కన్యాదాత , కమ్మని గట్టి పెరుగు దగ్గరుండి వెంటబెట్టించుకుని. జోడీగా చక్కెరకేళీ,అరటిపండు .విస్తట్లో పెరుగుకు అన్నం ఏదని కేకలు పెట్టి మళ్ళీ అన్నం వడ్డిపిస్తాడు. అన్నీ అందాయా లోటేమీ జరగలేదు కదా అని కనుక్కుంటాడు. 

అతని మొహంలో భారం దిగిన తేలిక తృప్తి సంతోషం పరవళ్ళు తొక్కుతున్నా పొంగిపోకుండా అందరకీ తన ఆహ్వానం అందుకొని పెళ్ళికి వచ్చినందుకు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఇంకా చేయవలసిన బాధ్యతలు తలచుకుంటూ అందరనీ గబ గబా చిరునవ్వుతో తలపంకించి చూస్తూ అభినందనలు అందుకుంటూ ముందుకెడుతుంటాడు. 


ఈయనకు ఎదురు వస్తాడు అత్తాకోడలంచు పంచా, కండువా సవరించుకుంటూ, పెళ్ళికూతురి తండ్రికి ప్రాణస్నేహితుడుట. ‘ ప్రత్యేకించి పురమాయించి చేయించాను, మాపిల్ల పెళ్ళి కోసం’ అంటూ  బూందీ మిఠాయి , పాకం కాజా వేసి, ‘ వదలకుండా తినాలి’ అని బెదిరించి మరీ వెడతాడు. 


చివరలో ఎవరు పెట్టి పోయారో గమనించముగాని , భోజనం పూర్తి చేసి తలఎత్తి చూసేటప్పటికి సుగంధభరితమైన తియ్యని కిళ్ళీ ఉంటుంది, మంచినీళ్ళ గ్లాసు పక్కన. 


కిళ్ళీ నోట్లో బిగించి , ఎదురుగా చూస్తే పందిట్లో ఓ పక్క వెండి కంచాలలో వధూవరులకు భోజనం వడ్డించి, స్నేహితులు వరసైన వారు పరాచికాలాడుతూ వారిని ఒకరికొకరు తినిపించుకోవాలని గొడవ చేస్తుంటారు. సిగ్గులతో ఓరచూపులతో కొంటె నవ్వులతో,ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ఒకరు కొరికిన మిఠాయి మరోకరు కొరుకుతూ , జీవితంలోని మధురిమలను రుచులను కలిసి అందుకోవడానికి సిద్ధమైన వారిని దూరం నుంచే మనసులో  కలకాలం సుఖంగా బతకమని ఆశీర్వదించి, భుక్తాయాసంతో ఇంటిదారి పడతాం మనం. 


*మరి ఈరోజుల్లో ఆ సరదాలు ఎక్కడ కానరావాయే....* 


*ఆ రోజులు మళ్లీ రావు, కదా, వస్తె ఎంత బాగుండు?*

  

.... *శ్రీమతి జానకి చామర్తి గారి రచన*

🙏🙏🙏🌹🌹🌹👌😊

వైదిక విజ్ఞానం అనే Link

 👇Link opened👇                         👉https://vignanam.org/mobile/

 

 ఈ వైదిక విజ్ఞానం అనే  Link     

అన్ని భాషలలో  ఇంతవరకు మీరు చూసి ఉండరు 


ఏ Book తో పని లేకుండా సమస్త దేవతల, దేవుళ్ళ  స్తోత్రాలు, అస్త్రోత్రాలు , శతనామాలు, సుప్రభాతాలు, చాలీసాలు, హారతులు  భగవద్గీత పతంజలి యోగ సూత్రాలు 

ఒకటేమిటి మీరు ఉహించలేనివి


భారతమాత కు సంభందించిన       

అన్ని వందేమాతరం జనగణమన సరేజహాసే అచ్చా మాతెలుగు తల్లికి  దేశభక్తి ,జాతీయ గీతములు


 అన్ని హారతులు అన్నమయ్య, రామదాసు త్యాగరాజు  కీర్తనలు

 

ఇవి ఒక ఉదాహారణ మాత్రమే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో.... 

ఇది మీకు జీవితాంతం మీతో ఉంచుకోతగిన Link .దీని కోసం ఎంతో శ్రమ పెట్టి ఇది తయారు చేసిన వారికి  హృదయ పూర్వక వందనము. 

ఇంత అత్యంత విలువైన దానిని ప్రతిఒక్కరు

ఉపయోగించుకుంటారని ప్రతిగ్రూప్   కి పంపుతారని  కోరుకొoటూ....🙏😊

ప్రశ్న పత్రం సంఖ్య: 15

  ప్రశ్న పత్రం సంఖ్య: 15                          కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది సాహిత్యానికి సంబందించిన ప్రశ్నలకు జవాబులు తెలుపండి 

1) మనుచరిత్ర వ్రాసినది ఎవరు.  

2) మహాప్రస్థానం కవి ఎవరు. 

3) గిరీశం పాత్ర ఏ నాటకం లోనిది 

4)  రామరాజభూషణుని ఇంకొక పేరు ఏమిటి. 

5) మేఘ సందేశం వ్రాసినది ఎవరు. 

6) తెలుగులో తోలి కవి అని ఎవరిని అంటారు. 

7) రామాయణం మొదటిసారి తెలుగులో వ్రాసిన కవియిత్రి ఎవరు. 

8) " పొగ తాగనివాడు దున్నపోతయి పుట్టున్" అన్న డైలాగు ఎవరిది. 

9) ఈ క్రింది పద్యం ఎవరు వ్రాసారని విశ్వసిస్తారు 

అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహి పాహి” యనఁ గుయ్యాలించి సంరంభి యై.

10) బారిస్టర్ పార్వతీశం నవల రచయిత ఎవరు 

11)సిరిగలవానికి చెల్లును

తరుణుల పదియారువేలదగ పెండ్లాడన్
మిగిలింది పూరించగలరు 

12) కన్య శుల్కం నాటకం ఏ సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా వ్రాసారు. 

13) కావ్యేషు రమ్యం ________

14)  "శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి" అంటే అర్ధం ఏమిటి. 

15)  "ఖరహర ప్రియ" రాగం వ్రాసింది ఎవరు 

16)  ఈ క్రింది పద్యం ఏ ప్రబంధంలోది, ఎన్నవ అశ్వాసము, కవి ఎవరు. 

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ

కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌

17)  ఈ క్రింది పద్యం, కవి, గ్రంధము, ఘట్టం తెలుపగలరు. 

మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు

18) ఈ క్రింది పద్యం మిగిలిన పాదాలు పూర్తించండి, కవి పేరు తెలపండి. 

సిరిదా వచ్చిన వచ్చును
సరసంబుగ నారికేళ సలిలము భంగిన్

19) శతకానికి ఎన్ని పద్యాలువుంటాయి  

20) శతకాలలో మకుటం అని దేనిని అంటారు. 

21)  ఒక యోగి వ్రాసిన శతకం తెలపగలరు 

22) కాదేది కవితకు అనర్హం అన్న కవి ఎవరు.  

23) ఈ పద్యం మొదటి రెండు పాదాలు తెలుపగలరు  

హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ

ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.

24) ఉత్పల మాలిక అంటే ఏమిటి. 

25) తెలుగు, సంస్కృతంలో ఆశువుగా ఉత్పల మాలిక చెప్పి గండపెండేరం అలంకరించుకున్న కవి ఎవరు. 

 


ప్రశ్న పత్రం సంఖ్య: 14

 ప్రశ్న పత్రం సంఖ్య: 14                          కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి ప్రతి పదం "“రు " " తో అంతమౌతాయి  

1) జీవనాధారము  

2) నిజము కాదు  

3) పడవలని ఓడలని ఆపటానికి వడ్డులో వేసేది   

4)  గుంటూరు జిల్లలో ఒక గ్రామము 

5) మంచానికి నేసేది    

6) అన్నంలో కలిపి తేనే ఒక ద్రవ వంటకం   

7) వివాహాలలో విందులల్లో చాల్లే సువాసన ద్రవం 

8) ఉన్న విషయం చెప్పటానికి ఎందుకు నీకు అంత  ______

9) ఆంద్రప్రదేశ్ లోని ఒక జిల్లా ---

10) చివర ----

11) మలేషియాలోని ఒక పట్టణం ---

12) షడ్రుచులలో ఒక రుచి 

13) పారే జలము 

14)  చిన్న పిల్లలకు పెట్టె నల్లని బొట్టు

15)  చాలా తేలికగా చేసే విషయానికి  _____ మీద నడక అంటారు 

16) ముళ్ళు గల ఒక కయ 

జవాబులు 

1) జీవనాధారము ----  నీరు  

2) నిజము కాదు ---పుకారు 

3) పడవలని ఓడలని ఆపటానికి వడ్డులో వేసేది   లంగరు 

4)  గుంటూరు జిల్లలో ఒక గ్రామము పొన్నూరు 

5) మంచానికి నేసేది    నవారు 

6) అన్నంలో కలిపి తేనే ఒక ద్రవ వంటకం   సాంబారు 

7) వివాహాలలో విందులల్లో చాల్లే సువాసన ద్రవం పన్నీరు 

8) ఉన్న విషయం చెప్పటానికి ఎందుకు నీకు అంత  ______కంగారు 

9) ఆంద్రప్రదేశ్ లోని ఒక జిల్లా ---నెల్లూరు 

10) చివర ----ఆఖరు  

11) మలేషియాలోని ఒక పట్టణం ---కౌలాలంపూరు 

12) షడ్రుచులలో ఒక రుచి -----వగరు 

13) పారే జలము ---- ఏరు 

14)  చిన్న పిల్లలకు పెట్టె నల్లని బొట్టు--- అగరు 

15)  చాలా తేలికగా చేసే విషయానికి  _____ మీద నడక అంటారు ---నల్లేరు 

16) ముళ్ళు గల ఒక కయ ----- పల్లేరు 

తెలుగు భాష గొప్పతనం

 🤣😋🤣నవ్వుల శుభోదయం🤗🤔😍😘


ఖ-క.... లకు ఎంత తేడా వుందో చూడండి.... తెలుగు భాష గొప్పతనం గుర్తించండి. 

లాయర్ : మీ వివాహానికి కారణం?

ఆనంద్ : *ప్రేమలేఖ*

లాయర్ : మరి ప్రేమించి పెళ్ళి చేసుకొని.. ఇప్పుడు విడాకులెందుకు?

ఆనంద్ : *ప్రేమలేక*

😀😁😂🤣😃😄😅😆😉😊😋😎😍😘


😝😜🤣 నవ్వుల శుభోదయం 😍


*ప్రసాద్* : ఏ వస్తువు కొనాలన్నా మా ఆవిడ రెండు కారణాలు చూపిస్తుందిరా!

*మురళి*: ఏమిటవి?

*ప్రసాద్*: పక్కింటివాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మనం కొనాలి. లేదా వాళ్ళ దగ్గర లేవు కనుక మనం కొంటే గొప్పగా ఉంటుందని కొనిపిస్తుంది.😞

😜😜😜😬😬😬😂😂😂😍😘😗😚


*భర్త : అదేంటీ.. పంతులు అన్ని నక్షత్రాలుండగా ఒక్క అరుంధతిని మాత్రమే చూపించాడు....!!* 🤔🤔


*భార్య : మిగతా నక్షత్రాలన్నీ రేపటి నుండి నేను చూపిస్తానుగా...!!*😳😳

😜😜😜😬😬😬😂😂😂🙄😐😶


🤣 నవ్వుల శుభోదయం 😍


 *నవ్వొస్తే నవ్వుకోండి...!*


*టీచర్:* _"సతీ సావిత్రి కధ లో  నువ్వు  తెలుసుకున్నది ఏమిటి?"_


*స్టూడెంట్:* _"భార్య నుండి భర్తను  ఆ యముడు కూడా కాపాడలేడని!"_

 🤣😃😄😅😜😅😄😃🤣😂😁😀


నవ్వుల శుభోదయం 🤣


ఒక సందేశాన్ని అత్యంత వేగంగా చేరవేయాలంటే *"ఈమెయిల్"*అయినా ఉండాలి లేదా *"ఫీమేల్"* అయినా ఉండాలి.

రెండవది మరింత వేగంగా చేరవేస్తుంది.!😜

😉😉😉😉😉😉😉😉😉😉😉😉


నవ్వుల శుభోదయం 🤣

*పెళ్ళి* అంటే ఏంటో  కుతూహలంతో ఒక *శాస్త్రవేత్త* పెళ్లిచేసుకున్నాడు ... కొంతకాలం తర్వాత అతనికి అర్ధమయ్యింది ...


*శాస్త్రవేత్త* అనేవాడు అందరికీ పనికొచ్చే ప్రయోగాలు చేయాలి కానీ , పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకూడదని..

😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊


నవ్వుల శుభోదయం 😜

ఈ భూమ్మీద ....

రెండే రెండు వింతలు చెప్పుకోదగ్గవి !!!!

1 . *మద్యపానం*...

ఎంతటి మితభాషి నైనా...

మాట్లాడేటట్టు చేస్తుంది!!!

2 . *భార్య* ...

ఎంతటి ఘనుడినైనా...

మూగవాని గా మార్చేస్తుంది !!!!! 😁

😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋


నవ్వుల శుభోదయం 😍

దొంగ .. పోలీసుతో ఇలా..


*దొంగ* : మా కష్టాలు ఏమి చెప్పమంటారు..ఈ పెళ్ళిల సీజన్లలో 20 చైన్లు లాగితే 18 గిల్టు చైనులు ఉంటున్నాయి ..😭

😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎


నేను బస్ లో వెళ్తున్నా..

నా ముందు నిల్చున్న అబ్బాయి

మొబైల్ లో జాతీయ గీతాన్ని పెట్టాడు ....

నేను లేచి నిల్చున్నా..

యెదవ నేను నిల్చోగానే సాంగ్ ఆఫ్ చేసి నా సీట్ లో కుార్చున్నాడు....

😥😥


వాట్సాప్ నుండి

దేవున్ని చూసారా

 Lఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి  ఒక జర్నలిస్ట్  వెళ్ళింది,

 ఏదైనా సెన్సషనల్ న్యూస్ వేసి మంచిపేరు తీసుకో వాలని ఆమె కోరిక. 

అక్కడే ఉన్న ఒక  భక్తుడిని ఇలా అడిగింది. 

జర్నలిస్ట్ :మీ  వయసు ఎంతుంటుందండి? 

భక్తుడు :85 ఏళ్లు ఉంటాయండి 

జర్నలిస్ట్ :ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు? 

భక్తుడు : నాకు  బుద్ది వచ్చినప్పటి నుండి 

జర్నలిస్ట్ : మరి దేవున్ని  చూసారా? 


భక్తుడు : లేదండి 

జర్నలిస్ట్ :మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళుతున్నారు? 

భక్తుడు :మీరెక్కడ నుండి వచ్చారు? 

జర్నలిస్ట్ :సిటీ నుండి 

భక్తుడు :అక్కడ ఎక్కువ కుక్కల్ని పెంచుకొంటారట కదా? 

జర్నలిస్ట్ :అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు 

భక్తుడు :మాది  చిన్న పల్లెటూరండి, అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు, 

జర్నలిస్ట్ :నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం? 

భక్తుడు :రాతిళ్ళు పంట చేల దగ్గర  ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టూ దూరంగా  ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి, కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతో నే  మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు. 

అలాగే వేల సంవత్సరాలనుండి ఎంతో మంది, ఋషులు, పుణ్యపురుషులు, రాజులు, తపస్సు తో దేవుడి నే చూసివచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది హిందూ ధర్మం లో పురాణపురుషులు చెప్పారు దేవుడు ఉన్నాడని, అలాంటప్పుడు  

యోచనా శక్తి లేని కుక్కలే  ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి, 

అలాంటిది ఆలోచించే శక్తి, ఉన్న మనుషులం మనం మన పూర్వీకుల నే నమ్మలేమా !

తప్పకుండా మంచిమనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొంటాను. 

జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత,

 నా వయసు లేదు, తప్పుగా  మాట్లాడిన  జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పారాయణం తో పరివర్తన..*


"నువ్వు నీ చాదస్తం తో నన్ను కాల్చుకు తినొద్దు..నన్ను నీకు తోడుగా రమ్మన్నావు..నీతో పాటు వచ్చాను..నువ్వు పారాయణమే చేసుకుంటావో..పొర్లుదండాలు పెడతావో..నీ ఇష్టం..అవన్నీ చేయమని నన్ను బలవంతం చేయకు.." అని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది..అలా మాట్లాడుతున్న కూతురుని చూసి మౌనంగా తలూపింది ఆ పిల్ల తల్లి..ఆ అమ్మాయి వయసు పాతికేళ్ల లోపే..తల్లికి సుమారు నలభైఐదేళ్ల వయసు ఉన్నది..ఆమె పేరు రాజేశ్వరి గారు..ఆ అమ్మాయి పేరు కల్యాణి.


ఆ తల్లీకూతుళ్ళు ఆరోజు ఉదయమే శ్రీ స్వామివారి మందిరానికి బస్సులో వచ్చారు..బస్సు దిగగానే..రాజేశ్వరి గారు నేరుగా బావి వద్దకు వెళ్లి తన కాళ్ళూ చేతులూ కడుక్కొని..కొన్ని నీళ్లు నెత్తిన చల్లుకుని..కూతురి నెత్తిమీద కూడా చల్లింది.. అప్పుడే ఆ అమ్మాయి చిరాగ్గా ముఖం పెట్టుకున్నది..ఆ అమ్మాయికి దైవం  మీద పెద్దగా విశ్వాసం లేదు..పైగా భక్తి, విశ్వాసాలు కలిగిన వారిని చూస్తే చిరాకు కూడా..శ్రీ స్వామివారి మందిరానికి కూడా కేవలం తన తల్లి తోడుగా రమ్మని బలవంతం చేస్తే వచ్చింది..వచ్చే ముందు కూడా తల్లితో తనను నమస్కారం పెట్టమని బలవంతం చేయొద్దని చెప్పింది....సరే అని చెప్పి బైలుదేరింది ఆవిడ..


శ్రీ స్వామివారి మందిరం లోపలికి వచ్చి..శ్రీ స్వామివారి ప్రధాన మంటపం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి..అర్చన చేయించుకొని..ముందున్న మంటపం లో కూర్చున్నారు రాజేశ్వరి గారు.. ఆరోజు ఆదివారం..భక్తులు ఎక్కువగానే వచ్చారు..శ్రీ స్వామివారి మందిరం కోలాహలంగా ఉన్నది..కొందరు జుట్టు విరబోసుకొని..మందిరం చుట్టూ కేకలు పెడుతూ పరిగెడుతున్నారు..మరికొందరు మంటపం లో పడుకొని వున్నారు..ఇంకొందరు "దత్తాత్రేయా మమ్ములను చల్లంగా చూడు.." అని గట్టిగా ప్రార్ధిస్తున్నారు..మందిరానికి బైట వైపు..భజన జరుగుతున్నది..పరిసరాలు మరచిపోయి భజన చేస్తున్నారు కొందరు..ఇంత సేపూ ఆ అమ్మాయి  మంటపం లో కూర్చుని అందరినీ గమనిస్తోంది..


ఏ మహత్తూ లేకపోతే.. ఇంతమంది..ఇంత విశ్వాసం తో ఇక్కడికి ఎందుకొస్తారు?..అని మొదటిసారిగా ఆ అమ్మాయి మనసులో సందేహం మొదలైంది..మెల్లిగా వాళ్ళమ్మ దగ్గరకు వెళ్లి.."అమ్మా..ఇందాకటి నుంచి గమనిస్తున్నాను..ఇక్కడ సిద్ధిపొందిన ఈ స్వామివారి మీద అందరికీ ఇంతటి భక్తి విశ్వాసాలున్నాయి..ఏమిటీ మహాత్యం?.."అని అడిగింది..అలా అడిగిన కూతురి వైపు ఆశ్చర్యంగా చూసిన ఆ తల్లి..తాను పారాయణం చేస్తున్న శ్రీ స్వామివారి జీవిత చరిత్రను చదవమని ఆ అమ్మాయికి ఇచ్చింది..


"పారాయణమే చేస్తావో..పొర్లుదండాలే పెడతావో..నీ ఇష్టం.." అని చెప్పిన ఆ పిల్ల..కేవలం రెండుగంటల సేపు శ్రీ స్వామివారి మందిరం లో గడిపి..మనసులో ఏర్పడిన కుతూహలం కారణంగా శ్రీ స్వామివారి జీవిత చరిత్రను పారాయణం చేయడం మొదలుపెట్టింది..సాయంత్రం నాలుగు గంటలకు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవడం పూర్తిచేసింది..తన తల్లి దగ్గరకు వచ్చి.."అమ్మా..స్వామివారి సమాధిని దర్శించుకుంటాను.." అన్నది..అనడమే కాదు..తల్లిని వెంటబెట్టుకొని..శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..అర్చన కూడా చేయించుకున్నది..మంటపం లో ఉన్న శ్రీ స్వామివారి చిత్రపటానికి తల ఆనించి కొద్దిసేపు నిలబడింది..ఆ సమయంలో ఆ అమ్మాయి కళ్ల నుంచి అశ్రువులు ధారగా కారుతున్నాయి..స్వామివారి మీద భక్తి వల్లనా.. లేక పశ్చాత్తాపం వల్లనా అనేది ఆ దైవానికే తెలియాలి..


అంతవరకూ ఆ అమ్మాయిలో ఉన్న మొండితనం..దైవం పట్ల ఉన్న నిరసన భావం ఎటుపోయాయో తెలీదు..ఆ నిమిషం వరకూ..కల్యాణి అని పిలువబడే ఆ అమ్మాయి..మొగలిచెర్ల గ్రామం వద్ద సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి భక్తురాలు కల్యాణి గా మారిపోయింది..మరెప్పుడూ దైవం పట్ల చులకన భావాన్ని ప్రదర్శించలేదు..ప్రస్తుతం వివాహం చేసుకొని సాఫ్టువేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కల్యాణి ..ప్రతి సంవత్సరం రెండుసార్లు భర్త తో సహా  శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శిస్తున్నది...ఒకప్పుడు "ఏమిటీ మహాత్యం?.." అని తన తల్లిని ప్రశ్నించిన కల్యాణి..తన లో వచ్చిన మార్పే ఆ మహాత్యం అని గ్రహించింది..శ్రీ స్వామివారిని దర్శించడానికి భర్తతో కలిసి మందిరానికి వచ్చిన ప్రతిసారీ..భక్తులకు అన్నదానం చేసి..తిరిగి వెళ్లడం కల్యాణి కి ఆనవాయితీగా మారిపోయింది..కల్యాణి ఈ విధంగా మారిపోవడానికి శ్రీ స్వామివారి చల్లని కరుణ కాక మరేమిటి?..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).