27, జులై 2021, మంగళవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 15

  ప్రశ్న పత్రం సంఖ్య: 15                          కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది సాహిత్యానికి సంబందించిన ప్రశ్నలకు జవాబులు తెలుపండి 

1) మనుచరిత్ర వ్రాసినది ఎవరు.  

2) మహాప్రస్థానం కవి ఎవరు. 

3) గిరీశం పాత్ర ఏ నాటకం లోనిది 

4)  రామరాజభూషణుని ఇంకొక పేరు ఏమిటి. 

5) మేఘ సందేశం వ్రాసినది ఎవరు. 

6) తెలుగులో తోలి కవి అని ఎవరిని అంటారు. 

7) రామాయణం మొదటిసారి తెలుగులో వ్రాసిన కవియిత్రి ఎవరు. 

8) " పొగ తాగనివాడు దున్నపోతయి పుట్టున్" అన్న డైలాగు ఎవరిది. 

9) ఈ క్రింది పద్యం ఎవరు వ్రాసారని విశ్వసిస్తారు 

అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహి పాహి” యనఁ గుయ్యాలించి సంరంభి యై.

10) బారిస్టర్ పార్వతీశం నవల రచయిత ఎవరు 

11)సిరిగలవానికి చెల్లును

తరుణుల పదియారువేలదగ పెండ్లాడన్
మిగిలింది పూరించగలరు 

12) కన్య శుల్కం నాటకం ఏ సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా వ్రాసారు. 

13) కావ్యేషు రమ్యం ________

14)  "శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి" అంటే అర్ధం ఏమిటి. 

15)  "ఖరహర ప్రియ" రాగం వ్రాసింది ఎవరు 

16)  ఈ క్రింది పద్యం ఏ ప్రబంధంలోది, ఎన్నవ అశ్వాసము, కవి ఎవరు. 

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ

కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌

17)  ఈ క్రింది పద్యం, కవి, గ్రంధము, ఘట్టం తెలుపగలరు. 

మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు

18) ఈ క్రింది పద్యం మిగిలిన పాదాలు పూర్తించండి, కవి పేరు తెలపండి. 

సిరిదా వచ్చిన వచ్చును
సరసంబుగ నారికేళ సలిలము భంగిన్

19) శతకానికి ఎన్ని పద్యాలువుంటాయి  

20) శతకాలలో మకుటం అని దేనిని అంటారు. 

21)  ఒక యోగి వ్రాసిన శతకం తెలపగలరు 

22) కాదేది కవితకు అనర్హం అన్న కవి ఎవరు.  

23) ఈ పద్యం మొదటి రెండు పాదాలు తెలుపగలరు  

హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ

ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.

24) ఉత్పల మాలిక అంటే ఏమిటి. 

25) తెలుగు, సంస్కృతంలో ఆశువుగా ఉత్పల మాలిక చెప్పి గండపెండేరం అలంకరించుకున్న కవి ఎవరు. 

 


కామెంట్‌లు లేవు: