14, మే 2021, శుక్రవారం

అభివృధి/విజన్ అంటే

 అభివృధి/విజన్ అంటే ఇది 👇👇👇👇 Don't Miss It 


కరెంటును ను స్టోరేజ్ చేసుకునే సిస్టం దాదాపుగా ప్రపంచంలొ లేదు. (కొన్ని దేశాలు ఈ మద్యనే ప్రారంభించాయి).  కాని మోది ప్రభుత్వం ఇప్పుడు ముందు చూపుతో ఫవర్ ను స్టోరేజ్ చేసుకునే సిస్టం ను తయారుచేసే రంగంలోకి అడుగు పెట్టింది. ఇందుకోసం ఫవర్ ను స్టోరేజ్ చేయడానికి ప్రత్యేకంగా అడ్వాన్స్ కెమిస్ట్రి సెల్ బ్యాటరీ లను తయారు చేయిస్తున్నారు. మొదటి విడతగా 50 గిగావాట్ల బ్యాటరీ కెపాసిటి కేంద్ర ప్రభుత్వం, ఆయా సంస్థలతో కలిసి పనిచేస్థుంది. ఒక్క గిగా వాట్ బ్యాటరీలొ పది లక్షల కుటుంబాలకు ఇచ్చేంత కరెంటును నిల్వ చేయవచ్చు. ఇది మోది ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న ఒక అద్భుతమైన ఆలోచన.


దీని వలన ఉపయోగాలు


1. భారత్ కు 2 నుండి 2.5 లక్షల కోట్ల రుపాయలు ఆధాయం జరుగుతుంది.

2. మేక్ ఇన్ ఇండియాలో తయారి రంగం పటిష్టం జరుగుతుంది.

3. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెరుగుతుంది

4. పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు రానున్నాయి

5. ఈ బ్యాటరీల హార్డువేర్ కు సంబందించిన అన్నీ పరిశ్రమల నిర్మాణాలు భారత్ లోనే జరుగుతాయి

6. క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గుతాయి

7. విద్యుత్ నిల్వ చేసే సామర్ధ్యం పెరుగుతుంది, అధనపు ఉత్పత్తి మరియు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు నిల్వ చేసుకోనే సౌలభ్యం ఉంటుంది.


ఆఖరిగా ఒక్క మాట చెబుతాను.


మోది గారు ఏ నిర్ణయం తీసుకున్న భావి భారతాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తారు..ఒక వ్యక్తి తన కాళ్ళ మీద తాను నిలబడేట్లు చేస్తారు

రసలీలాసారం

 😋మామిడిపండు మాయాసారం😋


రెండు చేతులలో మామిడి పండును తేరి పారా చూస్తూ పట్టుకుంటామే ,దీనినే  "వ్యామోహం" అని అంటారు.😛 


మగ్గిన పండును చూసి పరవశించి , పండంతా గుడ్లప్పగించి తడిమి చూచుకుంటామే, దీనినే  "వాత్సల్యం" అని విశదీకరించారు😛.


చేతికందిన పండును చూచి భుజాలు గజాలు అవ్వగా , చొక్కాతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుతుంటామో, దీనినే  "ఆప్యాయత" అని చాటి చెప్పారు.😛


పండంతా ఆబగా తినిన తరువాయి కూడా , టెంకను చీకుతూ మైమరుస్తుంటామే అదిగో దానినే "లోభం" అని అన్నారు.😛


మన పండంతా తిని  ఆస్వాదించాక, టెంక విసిరేసి , చేతులు నాక్కుంటూ, పక్క వాడు తింటున్న మామిడిపండు ఇంకా అవ్వటం లేదేమిటి అని ఆలోచిస్తుంటామే దానినే  "అసూయ" అని వివరించారు.😛


మామిడిపండు చేతికి చిక్కాక , ఆబగా  చివర్లలో కొరికి రసాద్వాసన చేసే ప్రయత్నంలో , గుజ్జు టెంకతో సహా ఆ కొరుకుడు ప్రాంతం నుంచీ జారి పడిపోయి నప్పుడు , మనం వేసే చిందులతో కూడిన తాండవమునే, "క్రోధం"అని వివరంగా తెలిపారు.😛


మామిడి పండు తిని తొక్కను ఆవులకు, మేకలకు విసిరి, పండంతా పెట్టినట్టు  దీర్ఘ శ్వాస వదలి బిగుసుకు పోతామే, ఇదిగో దీనినే  "అహంకారం" అని చాటారు.😛


మామిడి పండు అంతా తిని పెదవులు మరియు మూతి నాలికతో అందుకుంటూ, టెంకను మురిపెంగా చూచుకుని , దానిని శుభ్రంగా కడిగి, మొక్కవుతుందని నేలలో పాతి పెడతామే, దానినే  "మమకారం" అని తెలిపారు.😛


అతిగా మామిడి పళ్ళు తిని , జడివానలా వచ్చే వమనములుకై చెరువు గట్టుకు పరిగెడుతుంటామే, ఇదిగో దీనినే ముఖ్యంగా "ఆత్రం" అని విశదీకరించారు.😛


ఒక  పండు ఆరగింపు ముద్దు, రెండు కద్దు, మూడు అసలే వద్దు, ఉండాలి దేనికయినా సరిహద్దు. దీనినే   ******స్వీయ నియంత్రణ****అని విపులీకరించారు మన పెద్దలు.😛 


ఇదీ మామిడిపండు రసలీలాసారం😛😛😛😛

బ్రాహ్మణ ధర్నాన్ని

 అగ్రతః చతురో వేదా:

పృష్ఠతః సశరం ధనుః

ఇదం బ్రాహ్మమ్ ఇదం క్షాత్రం

 శాపాదపి శరాదపి

నాలుగు వేదాలను నిష్ఠగా పఠించి  పృష్ఠ భాగం లో (వీపు ) అమ్ములపొది ని ధరించి,చేతిలో ధనుస్సు తో  ఉన్న  బ్రాహ్మణుడు అవసరాన్ని బట్టి శాపమూ ఇవ్వగలడు శరమూ ప్రయోగించగలడు. ఆశీర్వాదమూ  ఇవ్వగలడు  అస్త్రమూ సంధించగలడు.ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ధర్మ పరమైన హింసను కూడా చేపట్టగలడు. సమయాన్ని బట్టి బ్రాహ్మణ ధర్నాన్ని , క్షాత్ర ధర్మాన్ని పాటించగల సద్బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ  🙏🙏

* శ్రీ పరశురామ జయంతి శుభాకాంక్షలు*

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*రామకోటి పై మార్గదర్శనం..ప్రలోభపు ఆలోచన!..*


*(ఇరవై ఏడవ రోజు)*


శ్రీ స్వామివారు రామకోటి వ్రాయడం గురించి వివరించిన తరువాత కూడా..తన ఉపదేశాన్ని కొనసాగించారు..


"రామకోటి వ్రాస్తే కష్టాలు చుట్టుముట్టాయని వాపోయావు కదా తల్లీ!..నీకు అలా వ్రాయడానికి అర్హత వుందో.. లేదో..ముందుగా భగవానుడు పరీక్షిస్తాడమ్మా..అసలు ఈ జన్మకు నువ్వు ముక్తిమార్గం వైపు పయనించే అర్హత లేదనుకో..భగవన్నామాన్ని చేత పట్టుకుని కూడా..చిన్నపాటి వ్యాధులొచ్చాయనో..లేదా..కుటుంబంలో సమస్యలు వచ్చాయనో..ఇవేవీ కాకుంటే..ఇతరులు చెప్పిన కల్పిత మాటల ప్రభావం చేతనో..చేతిలోవున్న దివ్య నామాన్ని వదిలి..ఈ లౌకిక విషయ వాసనల్లో చిక్కుకుపోతావు..ఈ వ్యాధులు..ఈ కుటుంబ సమస్యలు..ఇవన్నీ..ప్రతి గృహస్తుకూ వుండేవే.. మానసిక అశాంతి అనేది అందరికీ వుంటున్నదే.. కొత్తగా రామకోటి వ్రాసినంతమాత్రాన అవి రావు..ఆ సమస్యల తీవ్రత తగ్గించి..మానసిక ప్రశాంతతను చేకూర్చే మహత్తర నామం..రామనామం తల్లీ!.."


"వద్దు అమ్మా..వద్దు!..లేనిపోని శంకలు పెట్టుకొని..ఆ దివ్యనామాన్ని వదలకు!..నిష్ఠతో ప్రారంభించు!..చేత పట్టుకున్న ఆ రామనామాన్ని వ్రాయడం మొదలుపెట్టు!..కోటి పూర్తి చెయ్యి!..అది ఒక్కటీ వున్నా..దైవం కరుణ పూర్తిగా ఉన్నట్లే!..దైవ కరుణ లేకుండా ఎన్ని అష్టైశ్వర్యాలు వున్నా వ్యర్ధమే తల్లీ!..రామనామం కోటి పూర్తయ్యాక..తిరుమంత్రం..అష్టాక్షరి కోటి ప్రారంభిద్దువు గానీ..ఈలోపు..అష్టాక్షరిని రోజుకు 108 సార్లు నియమంగా జపం చేస్తూవుండు!.." అని చెప్పారు..అప్పటికే దాదాపు రాత్రి 11గంటలు దాటి పోయింది..


"అమ్మా!..ఒక గ్లాసు పాలు ఇవ్వు..నేను వెళతాను.." అని స్వామివారు పాలు త్రాగి తన గది దగ్గరకు వెళ్లిపోబోతూ..అక్కడే ఉన్న పారిజాతం చెట్టు వద్ద ఆగారు..ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు..వెన్నెల ఆ పారిజాతం చెట్టు ఆకుల మీద ఉన్న మంచుబిందువుల్లో వింతగా మెరుస్తోంది..


శ్రీ స్వామివారు చాలాసేపు ఆ చెట్టు చుట్టూరా పసి పిల్లాడు పట్టరాని ఆనందంతో తిరుగుతున్నట్టు ప్రదక్షిణగా తిరగసాగారు..కొన్ని పారిజాతపు పూలు కోసుకుని గదిలోకి వెళ్లి వాటిని అక్కడ ఉంచి..మరలా తిరిగివచ్చి..ఆ చెట్టు దగ్గర చాలా సేపు నిలబడి చూస్తూ..పచార్లు చేస్తూ..ఉండిపోయారు..ఆ తరువాత ఆ  ఆవరణ మొత్తం కలియతిరుగుతూ వున్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు శ్రీ స్వామివారి ఉపదేశం అద్భుతంగా అనిపించింది..సత్యనారాయణమ్మ గారు కూడా శ్రద్ధగా ఆలకించారు.. భక్తి పూర్వకంగా నమస్కారం చేసుకున్నారు..ప్రభావతి గారికి రామనామం గురించి..ఆవిడ మనసులో వున్న సందేహాలన్నీ మటుమాయం అయ్యాయి..ప్రక్కరోజే..కందుకూరు నుంచి రామకోటి పుస్తకాలు తెప్పించుకున్నారు..శ్రీధరరావు గారు కూడా.."మళ్లీ మొదటినుంచీ ప్రారంభించు ప్రభావతీ!.." అన్నారు..అత్తగారు సత్యనారాయణమ్మ గారు కూడా.."స్వామివారి ఆశీస్సులు..ఆ మాల్యాద్రి లక్ష్మీనారసింహుడి కరుణ..నీ చేత కోటి పూర్తి చేయిస్తాయమ్మా..మొదలుపెట్టు!.." అన్నారు..


సద్గురువు (శ్రీ స్వామివారు) ఆదేశము..తన తోడూ నీడ గా వుండే భర్త అంగీకారము ప్రభావతి గారికి కొండంత విశ్వాసాన్ని కలిగించాయి..మంచిరోజు చూసుకొని రామకోటి వ్రాయడం మొదలుపెట్టారు..


శ్రీ స్వామివారు తాను ధ్యానం నుంచి లేచివచ్చిన తరువాత..ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి శ్రీధరరావు దంపతులకు బోధిస్తూ వుండేవారు..ఒక్కొక్కసారి మౌనం పాటించేవారు..శ్రీ స్వామివారు తనంతట తాను నోరువిప్పి మాట్లాడితే తప్ప, వీరిద్దరూ ఏ విషయమూ ఆయనతో ప్రస్తావించేవారు కాదు..ఇలా ఒకటి రెండు రోజులు గడిచాయి..


ఒక సాయంత్రం వేళ..శ్రీ స్వామివారు హఠాత్తుగా శ్రీధరరావు దంపతులతో.."మీరిద్దరూ నిస్వార్ధంగా నా తపస్సుకు సహకరిస్తున్నారు కనుక..మీకేమైనా బాధలుంటే చెప్పండి..నేను పరిష్కారం చెపుతాను.." అన్నారు..


వెంటనే శ్రీధరరావు గారు.."స్వామీ!..మేము గృహస్థులము..ఎన్నో సమస్యలుంటాయి..బాధలు..సంతోషాలూ అన్నీ ఉంటాయి..మా సమస్యలను మేమే తీర్చుకోవాలి..అది మా బాధ్యత!..మాకోసం, మీ తపశ్శక్తిని ధారపోయడం నాకు ఇష్టం లేదు!.." అని చెప్పారు..శ్రీ స్వామివారు ఎంతో సంతోషంగా ఆశీర్వాదం ఇచ్చారు..


నిజానికి ప్రభావతి గారు శ్రీ స్వామివారు అడిగినవెంటనే..తమకున్న ఆర్ధిక కష్టాలు చెప్పుకోవాలని ఉవ్విళ్ళూరారు..స్త్రీ సహజమైన ఆందోళన, బాధ్యతల తాలూకు భయమూ..కొద్దిపాటి ప్రలోభమూ ఆవిడను చుట్టుముట్టాయి..కానీ శ్రీధరరావు గారు ఆవిడ ఆలోచనను నిర్ద్వందంగా తోసిపుచ్చారు.."లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు ప్రభావతీ!..మనం ఆయననుంచి ఏదో ఆశించి ఇక్కడ ఆశ్రయం ఇవ్వలేదు..ఆయన తపస్సుకు మనం ఆలంబన కావాలి..అంతేకానీ మన బరువు బాధ్యతలు మోపకూడదు..మనం నమ్ముకున్న లక్ష్మీనృసింహుడి కి మన సమస్యలు తెలుసు..కాకుంటే స్వామివారి మనసులో మనకు మేలు చేయాలని ఉన్న ఒక్క భావనే చాలు మన పదితరాలు తరించిపోవడానికి.." అన్నారు..ప్రభావతి గారు అప్పటికి సరే అన్నారు గానీ..లోలోపల మాత్రం ఎలా అయినా శ్రీ స్వామివారి వద్ద తన కోరికను వెళ్లబుచ్చాలని గట్టిగా నిర్ణయించుకున్నారు..


అష్టైశ్వర్యాలు..అష్టసిద్ధులు..రేపటిభాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).