19, సెప్టెంబర్ 2020, శనివారం

ఆయుర్వేదం నందు నీటి ప్రాముఖ్యత

 ఆయుర్వేదం నందు నీటి ప్రాముఖ్యత - సంపూర్ణ వివరణ -1 . 


 * సమస్త జలరాశి యందు గంగాజలం ప్రశస్తమైనది. ఆకాశం నుండి పడిన గంగాజలం సౌమ్యధాతువులను వృద్ధిచేసి వాతపిత్తశ్లేష్మాలను సమస్థితిలో ఉంచును. 


 * ఆశ్వయుజ మాసం వదిలిపెట్టి ఇతర మాసముల యందు సముద్రజలమును పానము చేయరాదు . 


 * శుశ్రుత సంహిత యందు వర్షబేధముల గురించి చక్కని వివరణ ఉన్నది. సన్నని వరి అన్నము ముద్ద పాసిపోకుండా ఉన్నదానిని అదేవిధముగా ఎక్కువ ఎండిపోకుండా ఉన్నదానిని గ్రహించి ఒక వెండిగిన్నెలో పెట్టి వర్షము పడున్నప్పుడు ఆరుబయట ఉంచవలెను . వర్షములో తడిచిన ఆ అన్నము రెండు ఘడియల తరువాత చూసిన వేసినది వేసినట్లు ఉండి మెత్తబడకుండా ఉండిన యెడల గంగోదకము వర్షించుచున్నదని తెలుసుకొనవలెను . అలా కాకుండగా రంగు మారి మెత్తబడిపోయినచో సముద్ర ఉదకం వర్షించుచున్నది అని తెలుసుకొనవలెను . ఇందులో గంగోదకం ప్రధానము . ఆశ్వయుజ మాసములో గ్రహించవలెను . 


 * సముద్రజలము అనగా సముద్రము వలన వర్షించబడు జలం అని అర్థము. సాముద్ర జలం నిలువచేయకూడదు. సముద్రజలము అయినను అశ్వయుజ మాసము నందు కురిసినది తాగిన గంగోదకం వంటి గుణము కలిగి ఉండును. 


 * అగస్త్యోదయము అనునది ఆశ్వయుజ మాసమున ఏర్పడును . విషపూరితమైన జలములు సైతం అశ్వయుజ మాసమునందు విషరహితముగా మారును . చంద్ర , వాయు , సూర్యుల స్పర్శ ఏర్పడిన తరువాత పృథ్వి యొక్క గుణమును బట్టి జలము శీత , ఉష్ణ , స్నిగ్ద , రుక్షాధి గుణములతో కూడినదిగా ఉండును. ఇవి దేశకాలాదులను బట్టి మారును . 


 * తవ్వబడిన పల్లము నందలి జలమును , రాతి ప్రదేశము నందలి జలమును , నిర్మలమైన వస్త్రముచే గ్రహించబడిన జలమును , వికృతి చెందని జలమును , బంగారు పాత్రలో లేక మట్టిపాత్రలో ఉంచిన జలమును అన్ని కాలముల యందు ఉపయోగించుకోవచ్చు. తెల్లటి వస్త్రము నుండి గ్రహించిన జలము బంగారు పాత్ర లో ఉంచిన జలం శ్రేష్టమైనది. 



         జలము గురించి మరికొన్ని అమూల్యమైన విషయాలు తరవాతి పోస్టు నందు వివరిస్తాను . 



   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

శ్రీ సీతారామ కల్యాణం

 పద్యభారతీసంతతికి ప్రణామాలు. 

శ్రీ సీతారామ కల్యాణం అనే గ్రంథంలో 220, 221 పద్యములు. 

      ప్రభాతాయాం తు శర్వర్యాం 

      కృతపౌర్వాహ్ణికక్రియౌ।

      విశ్వామిత్ర మృషీం శ్చాన్యాన్

      సహితా వభిజగ్మతుః॥-1.31.2

          ........................

     మైథిలస్య నరశ్రేష్ఠ 

     జనకస్య భవిష్యతి।

    యజ్ఞః పరమ ధర్మిష్ఠ

    స్తత్ర యాస్యామహే వయమ్॥-1.30.6

అని విరచించిన వాల్మీకి మహర్షికి ప్రణామాలు. 

        యజ్ఞమును సంరక్షించిన రామలక్ష్మణులు ఆ నాటి రాత్రి సిద్ధాశ్రమంలో నిశ్చింతగా హాయిగా నిద్రించినారు. వారిరువురు వేకువనే నిద్రలేచి ప్రాతఃకాల సంధ్యావందనాది పూజావిధులను పూర్తిచేసి ఏమాత్రము గర్వమును పొందకుండా విశ్వామిత్ర మహర్షిని చూచేందుకు వెళ్లినారు. రాజకుమారులైన రామలక్ష్మణులు మునిరాజైన కౌశికుని చూచి కింకరుల వలె మెలగుతూ ఎంతో వినయంతో నమస్కరించినారు. రాముని చూచి గాధిజుడు సంతోషిస్తూ ఉండగా అచ్చట ఉన్న మునులు “ఓ రఘురామా! మనం మిథిలకు వెళ్దాము. ఆ నగరంలో ఒక గొప్ప యజ్ఞము జరుగగలదు. అచ్చటికి వెళ్లినట్లైతే మనం ఆ యజ్ఞముతో పాటు మహిమాన్వితమైన శివధనుస్సును కూడా చూడవచ్చు అని రామునికి మిథిలానగర విశేషములను వివరింపసాగినారు. 

          ఈ విషయాన్ని ఈ పద్యములలో తెలియజేస్తూ ఉన్నాను. 


అంతట రామలక్ష్మణులు హాయిగ రాత్రి పరుండినారు, ని

శ్చింతగ లేచి వేకువన శ్రీకర సంధ్యల వార్చినార లా

వంతయు గర్వమందక మహర్షినిఁ జూడగఁ నేగినారు త

చ్చింత దొలంగినన్ వినయశీలతఁ గింకరులై చరింపగన్.{220}


రాముడు లక్ష్మణుండు మునిరాజునుఁజేరి నమస్కరింపగా

రామునిఁ జూచి కౌశికుడు రంజిల మౌనులు వల్కి రిట్టులన్

“రామ! చనంగనౌ మిథిల, రాజిలు నచ్చట దివ్య యజ్ఞ, మా

సీమ మహేశదత్తమగు శ్రేష్ఠధనుస్సునుఁ జూడగా నగున్.{221}

           రచన:-కోట రాజశేఖర్, కోవూరు, నెల్లూరు.

భాగవత ప్రవచనం

 🌼🌿ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో భాగవత ప్రవచనం ఇస్తున్నారు..అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు.


భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల 

వర్ణన జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. 


భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు.


బ్రాహ్మణుడు భయపడి ‘నా దగ్గర ఏమీ లేదు ‘ అని అన్నారు.

దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు. మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు.


బ్రాహ్మణుడు ఆలోచించి, “బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు”అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు


దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు.యమునా నది తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో 

పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు వస్తున్నారు.ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ.


బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ‘ అని అనుకున్నాడు.


ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది..


తరువాత చూస్తే, దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు.


ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణిడిని ,నీవు ఒక దొంగని అనుగ్రహించావు , నాకు కూడా దర్శనం ఇవ్వవా?” అని బాధపడ్డాడు.


అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ‘ *నీవు భాగవత* *పురాణమును కేవలము* *ఒక కథగా* *చదివావు* , *కాని , దొంగ,* *నువ్వు చెప్పిన* *కథని, మాటలని* *మనస్ఫూర్తిగా నమ్మాడు.* అపార నమ్మకం ,సమర్పణ

 శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను.”


నీతి:


పురాణాలను చదవడమే కాకుండా, దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి.

.ఆడదాని జీవితము

 .ఆడదాని జీవితము అంతులేని బాధలే ఆ బాధలకు అంతే లేదులే

తల్లితండ్రుల నడుమ గారాబంగా పెరిగిన తల్లి,

చదువులలో ఆ పిల్ల సరస్వతి కావచ్చు,

పెళ్లి అయిన తరువాత మొగుడు 

ఎట్లా వస్తాడో,

వాడు శ్రీ రామ చంద్రుడైతే జీవితము ఆనందమే,

అదే ఒకరికి ఇద్దరితో సరసాలాడే సోగ్గాడైతే ఎవరికి చెప్పుకోలేక నలిగేను ఆ వనిత,

పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటే ను కౌసల్య లాతాను మురిసేను,

అత్తమామలు ఏమన్నప్పటికి చిరు

నవ్వుతో భరించేను భూదేవిలా,

వందనాలమ్మా ఓ సహనం వున్న ప్రతి స్త్రీ కి సహనమూర్తుల వల్లే

ఈ వర్షాలైనా కురుస్తున్నాయి 

వందనాలు........


సర్వేజనా సుఖినోభవంతు

శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి


8886240088

**మన సంస్కృతి సాంప్రదాయాలు**

 **దశిక రాము**




**అడుగ‌డుగున అద్బుతాలు…మ‌హాబ‌లేశ్వ‌రం ఆల‌యాలు**.!!


మహాబలిపురం.. తమిళనాడులోని చెన్నైకి దక్షిణాన సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా పురాతనమైన పట్టణం. క్రీస్తు శకం 7 నుంచి 9వ శతాబ్దాల నడుమ దీన్ని పల్లవులు నిర్మించారు. అప్పట్లో ఈ పట్టణం చక్కని పర్యాటక ప్రదేశంగా ఉండేది. ఇక్కడి రాతి ఆలయాలు, వాటిపై ఉండే శిల్పకళ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.


చరిత్ర

7 వ శతాబ్దంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహాబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్టబడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.


మరొక కథనం ప్రకారం అప్పట్లో ఈ పట్టణాన్ని మహాబలి అనబడే ఓ రాక్షస రాజు పరిపాలించేవాడట. పేరుకు రాక్షస రాజే అయినా అతనిది చాలా జాలి గుండెనట. ఈ క్రమంలోనే అతని పేరిట ఈ పట్టణానికి మహాబలిపురం అని పేరు వచ్చిందని చెబుతారు. దానికి అంతకుముందు మామళ్లపురం, కడల్‌మలై అనే పేర్లు కూడా ఉండేవట. కడల్‌మలై అంటే పర్వతాలు, సముద్రంతో కూడిన ప్రదేశం అని అర్థం.ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.


1200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు దర్శనమిస్తాయి. అందులోని శిల్పాలను చూస్తే పురాతనకాలంలోనే రాకెట్ ప్రయోగాలకు నాంది పలికారని అనిపిస్తుంది. 


మహాబలిపురం మొత్తం 7 ఆలయాలు కలిపి ఒకే ఆలయంగా ఉండేవి. కానీ అందులో 2 ఆలయాలు సముద్రంలో మునిగిపోగా, ప్రస్తుతం 5 ఆలయాలు మాత్రమే బయటకు ఉన్నాయి. అవే మనకు కనిపిస్తాయి. అయితే సముద్రంలో మునిగిన ఆ ఆలయాల శిఖరాలను బోటులో వెళ్లి చూడవచ్చు. అందుకు గాను బీచ్‌ నుంచి బోటు సౌకర్యం అందుబాటులో ఉంది.


ప్రస్తుతం మనకు కనిపించే ఆ 5 ఆలయాలను దూరం నుంచి చూస్తే రథాలలా ఉంటాయి. అవి పాండవులకు చెందిన 5 రథాలే అని చెబుతారు.

ఈ ఆలయాలను నిర్మించేందుకు సుమారుగా 200 ఏళ్లు పట్టిందట. మొత్తం 3 తరాలకు చెందిన పల్లవ రాజులు ఈ ఆలయ నిర్మాణాలను పూర్తి చేశారట.

ఆ 5 ఆలయాల్లో సముద్రానికి దగ్గర్లో ఉన్న ఆలయం ముఖ్యమైందిగా చెబుతారు. దీన్ని చాలా పకడ్బందీగా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణాలు అన్నింటినీ కేవలం ఏకశిలతోనే నిర్మించారు.


ఆనాటి రాజుల కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా వుంది. ఇక్కడ ప్రసిద్ధి ఏకశిలా దేవాలయాల అద్భుత పనితనానికి అందరు శిల్పులు, నిపుణులు పరవశించిపోతారు. వాటిలో ప్రధానమైనవి శ్రీకృష్ణుని రాయి. దీనినే కృష్ణాస్ బట్టర్ బాల్ అని పిలుస్తారు. ఇది కృష్ణుడు ఆడుకున్న రాయి అని చెబుతారు. ఇది గుండ్రంగా ఉంటుంది. బల్లపరుపుగా ఉన్న మరో రాయిపై బ్యాలెన్స్‌ అయి ఉంటుంది. కిందకు దొర్లినట్లు దూరం నుంచి చూస్తే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటికీ దొర్లలేదు. అలాగే ఉంది. ఇది సైంటిస్టులకు ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగానే మారింది.


ఈ రాయి ఎత్తు 20 అడుగులు కాగా వెడల్పు 5 మీటర్లు. బరువు 250 టన్నుల వరకు ఉంటుంది. అయితే ఈ రాయిని అక్కడకు తీసుకువచ్చి పెట్టారా.. అదే సహజసిద్ధంగా అక్కడ ఏర్పడిందా.. అన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ సుమారుగా 1200 ఏళ్ల నుంచి ఆ భారీ రాయి అక్కడ అలాగే ఉంది. ఇది నిజంగా విశేషమే.

ఈ రాయిని తమిళంలో వానిరైకల్‌ అని పిలుస్తారు. అంటే స్టోన్‌ ఆఫ్‌ ది స్కై గాడ్‌ అని అర్థం వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. ఒల్లాంటయ్‌టంబో, పెరు, మచ్చు పిచ్చులలో ఉన్న భారీ ఏకశిలలకన్నా ఈ రాయి చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది.


సైన్స్‌ ప్రకారం చూస్తే.. ఈ తరహా రాయిని అలా బ్యాలెన్స్‌ చేసి ఉంచడం చాలా కష్టం. ఈ రాయి ప్రస్తుతం కేవలం 4 అడుగుల ప్రదేశంలో బ్యాలెన్స్‌ చేయబడి ఉంది. అది కూడా కొండ లాంటి ప్రదేశంలో. అంతటి భారీ రాయి అంత తక్కువ ప్రదేశంలో ఎలా బ్యాలెన్స్‌గా ఉందా అని భౌతిక శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు. సాధారణంగా అలాంటి రాళ్లు కిందకు జారుతాయి. కానీ ఈ రాయి 1200 ఏళ్ల నుంచి అక్కడ అలాగే కదలకుండా ఉండడం.. నిజంగా ఆశ్చర్యమే మరి.


1908వ సంవత్సరంలో అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ ఆర్థర్‌ లాలీ ఆ రాయిని చుట్టు పక్కల నివాసితులకు ప్రమాదకరంగా ఉందని భావించి దాన్ని అక్కడి నుంచి తొలగించాలని అనుకున్నాడు. కానీ ఆ రాయి అస్సలు కదలలేదు. అది అందరినీ షాక్‌కు గురి చేసింది.


ప్రఖ్యాత గాంచిన ఈ శిలను పల్లవరాజు నరసింహవర్మ ఆకాశదేవుని రాయిగా పేర్కొని, దీనిని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడు. కొందరు మాత్రం గుడి కోసం తెచ్చిన ఈ రాయిని మధ్యలోనే వదిలేసారని వాదిస్తారు. ఇంకొందరు ఇది గ్రహాంతవాసులు ఎగిరే పళ్లెం అని అంటారు


. దాదాపు 250 టన్నులు బరువు వుండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యే పనికాదు, అందుకే ఇది ఎలియన్స్‌కి సంబంధించింది అంటారు. ఈ రాయిని పోలిన రాళ్లు ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నాయి. అవే ఎలియన్స్ తిరుగుతున్నారనే ఊహాగానాలు వెలువడే మెక్సికో, పెరూలు.


ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే టెక్నాలజీకి అబ్బురపకుండా ఉండలేరు. ఒకే చిత్రంలో ఆవు, పాలు తాగుతున్న దూడను చూడవచ్చు. ఆ కాలంలోనే అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టారా.. అనటానికి అనేక శిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పల్లవరాజు ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు చేసారనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి.ఆ ఆలయంలోని గణేశుడి విగ్రహంపై రాకెట్ లాంచింగ్ వెహికల్ కనిపిస్తుంది. దీంతో పాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక రూపాలు కనిపిస్తాయి.

ఇక్కడ విచిత్రమైన మరో అంశం బావి. కొలతలు కూడా అందుబాటులో లేని కాలంలో ఎంతో ఖచ్చితత్వంతో బావిని నిర్మించారు. అప్పట్లోనే సాంకేతిక పరిఙ్ఞానం వాడారు అనడానికి ఇది గొప్ప నిదర్శనం. ఆలయ గోపురంపై ఉండే శూలాన్ని చూస్తే టెక్నాలజీ అబ్బురపరుస్తుంది. శూలానికి సంబంధించిన దేవుడు మనకి ఎక్కడా కనిపించడు. అతని తల మీద రెండు కొమ్ములు,అలాగే హెల్మెట్ ధరించినట్లు ఉంటుంది. అచ్చం శాటిలైట్ స్థంభం మాదిరిగానే ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూస్తే రోదసిలోని వ్యోమగాముల్లాగా కనిపిస్తారు.


విమాన గోపురం చుట్టూ వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే గర్భగుడిలోకి గాలి చొరబడకుండా నిర్మించారు. ఉపగ్రహ వాహక నౌకలు పంపినపుడు విడుదలయ్యే వాయువులు బయటకు పోయే విధంగా ద్వారాలను నిర్మించారు. కిటికీలు,తలుపులు కనపడకుండా రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ తట్టుకునే విధంగా ఈ గుడిని నిర్మించారు. ఇక్కడ లైట్ హౌస్ దాదాపు 1000 ఏళ్ల కిందట నిర్మించారని భావిస్తారు.


మహాబలిపురంలో బీచ్‌కు దగ్గర్లో ఉన్న ఆలయానికి 1984లో యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు లభించింది. ప్రతి ఏడాది డిసెంబర్‌, జనవరి సమయంలో ఇక్కడ డ్యాన్స్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. కథాకళి, భరతనాట్యం, కథక్‌, మోహినీ ఆట్టం, కూచిపూడి, ఒడిస్సీ తదితర భారతీయ నృత్యాలను కళాకారులు ప్రదర్శిస్తారు. ఈ ఫెస్టివల్‌ను తమిళనాడు ప్రభుత్వ పర్యాటక శాఖ నిర్వహిస్తుంది.

ఆలయం వద్ద చెక్క బడిన నందుల శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఆలయానికి సమీపంలో చెక్కబడిన శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన వరాహ అవతార విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏 

🌹 **మూకపంచశతి** 🌹

 




🌷 **ఆర్యాశతకము** 🌷


🌹1.

**కారణపరచిద్రూపా**


**కాంచీపురసీమ్ని కామపీఠగతా**


**కాచనవిహరతి కరుణా**


**కాశ్మీరస్తబకకోమలాంగలతా!**

   


భావం:


శ్రీ కామకోటి

పీఠమును అధిరోహించి,కారణ పర చైతన్యస్వరూపమయిన ఆ కామాక్షీదేవి ,కుంకుమపూగుత్తివంటి అతికోమలమైన తీగ వంటి తనువుతో రూపుదాల్చిన కరుణయా అన్నట్లు కాంచీపురమున విహరించుచున్నది.



💮సప్తమోక్షపురములలో కాంచీనగరము అతిముఖ్యమైనది.కామాక్షీదేవి కొలువైన క్షేత్రము.గొప్ప ఉపాసనా భూమి. ఏకామ్రేశ్వరుని పట్టపురాణి అయిన కామాక్షీ దేవి ఈసీమయందు దయాస్వరూపమున విహరించుచూ ,తన భక్తుల కటాక్షించుచున్నది.



🙏అమ్మా కామాక్షీ !నీ కరుణతో మమ్ము "వినాయకుని వలెను బ్రోవవే ,నిను వినావేల్పులెవరమ్మా !"🙏🙏🙏


🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**





**ధర్మో రక్షతి రక్షితః**

శివామృతలహరి

    .శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||


చెలువారన్ రజతాద్రిమందిరమునన్ శ్రీ గౌరితోఁ గూడి భా

సిలుదేవుండు శివుండదేల నిలుచున్ చిత్రంబుగా కాటిలో ?

కలరూపుంగని జ్ఞానియైన మనుజున్-కాలంబులున్ దేశముల్

సిలుగుల్ సౌఖ్యములంటవంచు దెలుపన్ శ్రీసిద్ధలింగేశ్వరా !

భావం; ( నాకు అర్ధమైన రీతిలో)


వెండికొండ పై శ్రీ గౌరీ సమేతముగా మణి మందిరములో దేదీప్యమానంగా వెలుగొందాల్సిన శివ మహాదేవుడు, 

ఆశ్చర్యకరంగా స్మశానంలో దర్శనమిస్తాడేమిటి?

అని ప్రశ్నించుకుంటే కాల స్వరూపుడైన మహా శివుణ్ణి ధ్యానించి,దర్శించుకుని,జ్ఞానం పొందిన మనుష్యుడికి 

కాలాలు, దేశాలు, సుఖాలు దుఃఖాలు ఏవీ అంటక, వాటికి అతీతుడు కాగలడని తెల్పటానికే కదా స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

నాగులచవితి

 నాగులచవితి నాడు పాముల పుట్టవద్ద దీపాలు వెలిగించాలా?

కార్తీక శుద్ధ చవితి నాడు నాగులచవితి పండుగ వస్తుంది. ఈరోజు స్త్రీలు పుట్టలో పాలు పోసి చలిమిడి, వడపప్పు, నువ్వులు తో చేసిన చిమ్మిలి ఉండలు నాగదేవతలకు నైవేద్యం సమర్పిస్తారు. ఆరోజున సూర్యోదయానికి ముందు ఆకాశంలో తూర్పు దిక్కున శేషుని ఆకారంలో నక్షత్రం కన్పిస్తుంది. దీపావళి నుండి ఐదవరోజున నాగపంచమి పర్వాన్ని జరుపుకుంటారు. నాగేంద్రస్వామికి పుట్టలో పాలు పోయడం మన అలవాటు. పిల్లలు తో ఈవిధంగా పాలు పోయించడం వలన వారికి ఎలాంటి అనారోగ్యాలు, అరిష్టాలు లేకుండా ఎదుగుతారని విశ్వాసం. పుట్టల కొనలలోంచి ఆవుపాలు, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు జారవిడిచి పుట్టలో కొలువైన నాగదేవతకు పిల్లలు పెద్దలు భక్తి శ్రద్ధలతో నైవేద్యం పెడతారు. ముందు పుట్టవద్ద శుభ్రం గా చేసి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ లు పూలు చల్లి పూజ చేస్తారు. ఆ తర్వాత నాగేంద్రుడికి నైవేద్యం పెడతారు.

            నైవేద్యం పెట్టడానికి ముందు గా పుట్టకు పూజ చేస్తారు. పూజా విధానం లో దీపం వెలిగించడం, ధూపం తప్పనిసరిగా కాబట్టి దీపారాధన కూడా చేస్తారు. పాముల పుట్ట వద్ద టపాకాయలు వెలిగించడం వంటివి మాత్రం చేయకూడదు.

         వర్షాకాలం పూర్తయి శీతాకాలం ప్రవేశిస్తూంటే పాములు వరుసగా పుట్టలు వదిలి బయటకు రావడం ప్రారంభిస్తాయి. అలా వచ్చే పాముల ను అదుపులో ఉంచేందుకు పుట్టలో తేమ ఉంచేందుకు మనవారు నాగులచవితి పండుగను ఏర్పాటు చేసారు. ఆరోజున పాలు, చిమ్మిలి వంటివి పోయడం వలన పాముల పుట్టలు తడిగా మారతాయి. దాని వలన పాములు త్వరగా బయటకు రావు. స్త్రీలకు, పిల్లలు కు పాముల పట్ల భయం ఉండేందుకు నాగులచవితి పర్వదినం ఉపయోగపడుతుంది.

*పాప, పుణ్యకార్యాలు*



మానవులు ఎలాంటి పుణ్యకార్యాలనూ చేయడానికి ఇష్టపడరు. కాని పుణ్యఫలాన్ని మాత్రం ఆశిస్తారు. పాపఫలితాన్ని ఆశించరు. కాని పాపకార్యాలను మాత్రం ప్రయత్న పూర్వకంగానే చేస్తారు అని ధర్మనీతి శాస్త్ర నిర్వచనం. ఇంతకీ పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి?


"పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం" అంటే ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం.


పూర్వజన్మల్లో చేసిన పాప దోషాల వల్లనే ఈ జన్మలో శారీరక, మానసిక వ్యాధులు వచ్చి పీడుస్తున్నాయి అని మనం గ్రహించాలి. పాపం వల్లనే దుఃఖాలు వస్తాయి. పాపం లేనప్పుడు ఆనందం కలుగుతుంది. ఏ కొంచెం దుఃఖం కలిగినా అది పాపఫలమే కాక వేరొకటి కాదు.


పాపదోషం అనుభవించితే తప్ప పోదు. అడవుల్లో ఉన్నప్పుడు, యుద్ధంలో శత్రువుల మధ్య, నీటి మధ్య, అగ్నిమధ్య ఉన్నప్పుడు, సముద్రంలో సాగుతున్నప్పుడు, పర్వత శిఖరాలను ఎక్కుతున్నప్పుడు, నిద్రలో, అజాగ్రత్తలో, సంకట పరిస్థితులలో మానవుడిని తాను పూర్వ జన్మలో చేసిన పుణ్యాలే కాపాడతాయి


"ఇతరులు తనయందు ఏ విధంగా ప్రవర్తిస్తే, తన మనస్సు కలత చెందుతుందో అదే విధమైన ప్రవర్తనను ఇతరుల యందు నీవు కలిగి ఉండకపోవడమే అన్ని ధర్మాల్లోకి కూడా ఉత్తమమైన ధర్మం" అని విదురవాక్కు. పుణ్యం చేయడం చేతకాకున్నప్పుడు ఈ ధర్మాన్ని ఆచరిస్తే చాలు.


ఈ లోకంలో పుణ్యం కాని, పాపం కాని, ఇతరుల నుంచి మనం తీసుకోలేం. తాను చేసిన పాపకర్మ వల్లనే దుఃఖం కలుగుతుంది. తాను చేసిన పుణ్యకర్మ వల్లనే సుఖం కలుగుతుంది. ఈనాడు మనం నవ్వుతూ చేసిన పాపకర్మకి రేపు ఏడుస్తూ దుఃఖాన్ని అనుభవించక తప్పదనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే అవకాశం ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించాలి. భగవంతుని అనుగ్రహం పొందాలి.

అష్టాక్షరీ మంత్రం

 “ఓమ్ నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో “ఓం” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.

అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.

జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,

“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే

“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే

“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే

“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే

“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించుటచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.

"ధ్యాయేన్నారాయణందేవం

స్నానాదిఘ చ కర్మసు,

ప్రాయశ్చిత్తం హి సర్వస్వ

దుష్కృత స్వేతివైశ్రుతిః!"

స్నానపానాదిగల సమస్తకర్మలలో “నారాయణుని” స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.

దేవర్షి

 దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.

బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.

మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.

రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.

అ[మార్చు]


అగ్ని మహర్షి

అగస్త్య మహర్షి

అంగీరస మహర్షి

అంగిరో మహర్షి

అత్రి మహర్షి

అర్వరీవత మహర్షి

అభినామన మహర్షి

అగ్నివేశ మహర్షి

అరుణి మహర్షి

అష్టావక్ర మహర్షి

అష్టిక మహర్షి

అథర్వణ మహర్షి

ఆత్రేయ మహర్షి

అథర్వాకృతి

అమహీయుడు

అజామిళ్హుడు

అప్రతిరథుడు

అయాస్యుడు

అత్రి

అవస్యుడు

అంబరీషుడు

ఇ[మార్చు]


ఇరింబిఠి


ఉ[మార్చు]


ఉపమన్యు మహర్షి

ఉత్తమ మహర్షి

ఉన్మోచన

ఉపరిబభ్రవుడు

ఉద్దాలకుడు

ఉశనసుడు

ఉత్కీలుడు

ఊ[మార్చు]


ఊర్ఝ మహర్షి

ఊర్ద్వబాహు మహర్షి

ఋ[మార్చు]


ఋచీక మహర్షి

ఋషభ మహర్షి

ఋష్యశృంగ మహర్షి

ఋషి


ఔ[మార్చు]


ఔపమన్యవ మహర్షి

ఔరవ మహర్షి

క[మార్చు]


కపిల మహర్షి

కశ్యప మహర్షి

క్రతు మహర్షి

కౌకుండి మహర్షి

కురుండి మహర్షి

కావ్య మహర్షి

కాంభోజ మహర్షి

కంబ స్వాయంభువ మహర్షి

కాండ్వ మహర్షి

కణ్వ మహర్షి

కాణ్వ మహర్షి

కిందమ మహర్షి

కుత్స మహర్షి

కౌరుపథి

కౌశికుడు

కురువు

కాణుడు

కలి

కాంకాయనుడు

కపింజలుడు

కుసీదుడు

గ[మార్చు]


గౌతమ మహర్షి

గర్గ మహర్షి

గృత్సమద మహర్షి

గృత్సదుడు

గోపథుడు

గోతముడు

గౌరీవీతి

గోపవనుడు

గయుడు

చ[మార్చు]


చ్యవన మహర్షి

చైత్ర మహర్షి

చాతనుడు

జ[మార్చు]


జమదగ్ని మహర్షి

జైమిని మహర్షి

జ్యోతిర్ధామ మహర్షి

జాహ్న మహర్షి

జగద్బీజ

జాటికాయనుడు

త[మార్చు]


తండి మహర్షి

తిత్తిరి మహర్షి

త్రితుడు

తృణపాణి

ద[మార్చు]


దధీచి మహర్షి

దుర్వాస మహర్షి

దేవల మహర్షి

దత్తోలి మహర్షి

దాలయ మహర్షి

దీర్ఘతమ మహర్షి

ద్రవిణోదస్సు

న[మార్చు]


నచికేత మహర్షి

నారద మహర్షి

నిశ్ఛర మహర్షి

సుమేధా మహర్షి

నోధా

నృమేధుడు

ప[మార్చు]


పరశురాముడు

పరాశర మహర్షి

పరిజన్య మహర్షి

పులస్త్య మహర్షి

ప్రాచేతస మహర్షి

పులహ మహర్షి

ప్రాణ మహర్షి

ప్రవహిత మహర్షి

పృథు మహర్షి

పివర మహర్షి

ప్రత్య్సంగిరసుడు

పతివేదనుడు

ప్రమోచన

ప్రశోచనుడు

ప్రియమేథుడు

పార్వతుడు

పురుహన్మ

ప్రస్కణ్వుడు

ప్రాగాథుడు

ప్రాచీనబర్హి

ప్రయోగుడు

పూరుడు

పాయు

బ[మార్చు]


భరద్వాజ మహర్షి

భృగు మహర్షి

భృంగి మహర్షి

బ్రహ్మర్షి మహర్షి

బభ్రుపింగళుడు

భార్గవవైదర్భి

భాగలి

భృగ్వంగిరాబ్రహ్మ

బ్రహ్మస్కందుడు

భగుడు

బ్రహ్మర్షి

బృహత్కీర్తి

బృహజ్జ్యోతి

భర్గుడు

మ[మార్చు]


మరీచి మహర్షి

మార్కండేయ మహర్షి

మిత మహర్షి

మృకండు మహర్షి

మహాముని మహర్షి

మధు మహర్షి

మాండవ్య మహర్షి

మాయు

మృగారుడు

మాతృనామ

మయోభువు

మేధాతిథి

మధుచ్ఛందుడు

మనువు

మారీచుడు

య[మార్చు]


యాజ్ఞవల్క మహర్షి

యయాతి

ర[మార్చు]


రురు మహర్షి

రాజర్షి మహర్షి

రేభుడు

వ[మార్చు]


వశిష్ట మహర్షి

వాలఖిల్యులు

వాల్మీకి మహర్షి

విశ్వామిత్ర మహర్షి

వ్యాస మహర్షి

విభాండక ఋషి

వాదుల మహర్షి

వాణక మహర్షి

వేదశ్రీ మహర్షి

వేదబాహు మహర్షి

విరాజా మహర్షి

వైశేషిక మహర్షి

వైశంపాయన మహర్షి

వర్తంతు మహర్షి

వృషాకపి

విరూపుడు

వత్సుడు

వేనుడు

వామదేవుడు

వత్సప్రి

విందుడు

శ[మార్చు]


శంఖ మహర్షి

శంకృతి మహర్షి

శతానంద మహర్షి

శుక మహర్షి

శుక్ర మహర్షి

శృంగి ఋషి

శశికర్ణుడు

శంభు

శౌనకుడు

శంయువు

శ్రుతకక్షుడు

స[మార్చు]


సమ్మిత మహర్షి

సనత్కుమారులు

సప్తర్షులు

స్థంభ మహర్షి

సుధామ మహర్షి

సహిష్ణు మహర్షి

సాంఖ్య మహర్షి

సాందీపణి మహర్షి

సావిత్రీసూర్య

సుశబ్దుడు

సుతకక్షుడు

సుకక్షుడు

సౌభరి

సుకీర్తి

సవిత

సింధుద్వీపుడు

శునఃశేపుడు

సుదీతి

హ[మార్చు]


హవిష్మంత మహర్షి

హిరణ్యరోమ మహర్షి

రామాయణమ్.67

 

..

కైకా ! నీవు చేసిన పని భరత శత్రుఘ్నులు సమర్ధిస్తారనుకొన్నావా?...భరతుడు దశరథుడికి పుట్టిన వాడే అయితే ఈ విషయంలో నీవు తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ వంశములో పుట్టిన భరతుడు నిన్ను అనుసరించడు ! తండ్రి తనకు మనఃపూర్వకముగా ఇవ్వనిదానిని తాను స్వీకరించడు! 

.

అంతెందుకు? రాజ్యంలో అన్నలేకపోతే అన్న ఉన్నచోటే రాజ్యమని భరతశత్రుఘ్నులు రాముని వెంటే వెడతారు.

.

నహి తద్భవితా రాష్ట్రం యత్ర రామో న భూపతిః

తద్వనం భవితా రాష్ట్రం యత్ర రామో నివత్స్యతి! 

.

రాముడు లేని చోటు అది రాజ్యమే కాదు! రాముడున్న వనమే రాజ్యం .

.

తమ పిల్లపాపలతో జనులంతా రాముని వెంటే కదులుతారు! పాడుపడి,పిచ్చిమొక్కలుమొలిచి నిలిచి ఉన్న నిర్మానుష్యమైన రాజ్యం ,భరత శత్రుఘ్నులు లేక శోభావిహీనమైన అంతఃపురమూ మాత్రమే నీకు మిగులుతాయి. 

.

కైకేయీ ఒక్కసారి బయటకు వచ్చి చూడు ! పశుపక్ష్యాదులతో సహా అన్నీ తమ ముఖాన్ని రాముడున్న వైపే త్రిప్పి వున్నాయి.

.

సీతమ్మకు నారచీరలెందుకు ఇచ్చావు? ఈమె నారచీరలు కట్టవలెనని లేదే అని పలుకుతూ వసిష్ఠులవారు సీతమ్మను నారచీరకట్టుకోవద్దని వారించారు.

.

సీత విషయములో నీవు ఏ నిబంధన విధించలేదుకదా ! 

రాముడి ఆత్మ సీత ఆమె ఇక్కడే ఉండి రాముడి సింహాసనం అధిష్ఠించగలదు ! 

.

అనుష్ఠాస్యతి రామస్య సీతా ప్రకృతమాసనమ్....రాముడియొక్క ప్రస్తుతమైన సింహాసనం సీతమ్మ అధిష్ఠించగలదు ! 


...

N.B

..

సీతమ్మ తనకు అత్యంత ప్రియుడయిన తన భర్తను వదిలి ఉండటానికి ఇష్టపడలేదు .తానుగా తరలింది వనవాసానికి.

.

( ఇదీ భారతీయుమ్!)

.

 స్త్రీల కు పూర్వకాలంలో సింహాసనం మీద కూర్చుండి పాలించే అర్హత లేదు ,స్త్రీల ను అణగదొక్కారు. వారిని వంటింటికే పరిమితం చేసేశారు అనే వారు వశిష్ఠ మహర్షి మాటలు దయచేసి గమనించి మాట్లాడండి ! 

.


భారతీయ సమాజం లోని నేటి పోకడలు కూడా తులనాత్మకంగా అధ్యయనం చేయ ప్రార్ధన..

.

లౌకిక దృష్టికి కైక చేస్తున్న పనులలో క్రూరత్వం కనిపిస్తున్నది .

సామాన్యంగా ఆవిడను రాముడికి ఇన్ని కష్టాలు కలిగించినదానిగా భావించి తిట్టిపోస్తాము మనమంతా ! 

ఒక్క క్షణం ఆలోచిద్దాం ! 

ఆవిడ ముగ్గురికీ దుస్తులు సిద్దం చేసింది .ఆవిడ కోరిక మేరకు రాముడొక్కడే వెళ్లాలి .కానీ చిన్నప్పటినుండీ రాముడిని గారాబంగా పెంచినది ఆవిడే ! ఆవిడకు తెలుసు రాముడి నీడ లక్ష్మణుడని ! అన్నని వదిలి ఆయన ఒక్కక్షణం కూడా ఉండడని ! సీతారాముల అన్యోన్య దాంపత్యం చూసిన ఆవిడకు అర్ధమయ్యింది రాముడి ఆత్మ సీతేనని సీతమ్మప్రాణం రాముడేనని! .

మరి మనిషిని అతని నీడ ,ఆత్మ విడిచి ఉంటాయా ! అసంభవమది.

.

ఇక పోతే లోకకంటకుడయిన రావణ వధ జరగాలంటే రాముడి ప్రయాణం మొదలుకావాలి ! తండ్రినుండి విడదీయాలి ! దశరథుడినుండి రాముడిని వేరు చేయగల సమర్ధులు ఎవరు? ఒకరు విశ్వామిత్రుడు! రెండు కైక !

మొదట విశ్వామిత్రుడు తాత్కాలికంగా విడదీసి దివ్యాస్త్రజ్ఞానాన్ని ఇచ్చి రాముడిని రాబోయే సంగ్రామానికి సన్నద్ధుడిని చేశాడు .అది సరిపోతుందా ! సరిపోదు ! రాముడు బయటకు నడవాల్సిందే ! ఇదిగో ఆ పని కైకమ్మచేసింది ! 

రాముడెవరో కైకకు తెలుసు రాముడు నారాయణుడని రామనారాయణుడని! మరి ఈ కోణంలో ఆలోచిస్తే కైక అమృతమూర్తి..)

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక

**హిందూ ధర్మం** - 42

 **దశిక రాము**




ధర్మం యొక్క తదుపరి లక్షణం ధీః - బుద్ధి అంటుంది మనుస్మృతి.


ధర్మాచరణకు ఉండవలసిన లక్షణం బుద్ధిని ఉపయోగించడం. బుద్ధిని వృద్ధి చేసుకోవడం, జ్ఞానాన్ని పెంచుకొవడం, బుద్ధి శక్తికి విఘాతం కలిగించే మాదకద్రవ్యాలు, మత్తు పదార్ధాలు, మద్యం, ధూమపానం (సిగిరెట్టు), మత్తు కలిగించే ఆహారపదార్ధాలు, మాంసాహారం మొదలైనవాటికి దూరంగా ఉండడం, బద్ధకస్తులు, దుర్మార్గులు, చెడు అలవాట్లు కలిగినవారి నుంచి దూరంగా ఉండడం, జాగ్రత్తగా ఉండకపోవడం (సావధానంగా ఉండడం), మంచివారితో, సాధుపురుషులతో, భగవత్ భక్తులతో స్నేహం చేయడం, సత్సంబంధాలు కలిగి ఉండడం, యోగా మొదలైన ప్రక్రియలను ఆచరించడం, పుష్టికరమైన, సంతులిత ఆహారం తీసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధమైన అలవాట్లను కలిగి ఉండడం వంటివి బుద్ధిని వికసింపజేస్తాయి. ఈ లక్షణాలు కలిగి ఉంటూ బుద్ధి శక్తిని కాపాడుకోవడం, వృద్ధి చేసుకోవడం ధర్మం అంటున్నారు మను మహర్షి.


మనిషికి బుద్ధి జీవి అని పేరు. సృష్టిలో అన్ని జీవులకు బుద్ధి ఉన్నా, వాటి నడవడిక వాటి పూర్వజన్మ కర్మను, వాసనలను అనుసరించె ఉంటుంది. మానవుల విషయంలో కూడా అంతే. కానీ మనిషికి, ఇతర జీవులకు ఉన్న తేడా, మనిషి కొత్తగా కర్మ చేయవచ్చు, అది పుణ్యమైనా, పాపమైనా. జంతువులు కేవలం ఫలాలు మాత్రమే అనుభవిస్తాయి. అవి చేసే కర్మలకు పాపపుణ్యాలు ఉండవు. మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప సాధనం బుద్ధి.


మనమేం చేసినా అది తిరిగి మనవద్దకు వస్తుంది, ఈ సమస్త ప్రకృతి కొన్ని చక్రాల మీద నడుస్తున్నది, మనసు పూర్వజన్మ వాసనలనే చక్రంలో బంధించబడి ఉంటుంది. కర్మలు కూడా అంతే. ఈ జగత్తు మొత్తం ఒక పెద్ద యంత్రం లాంటిది. కానీ ఈ జగద్యంత్రానికి వెలుపల నుంచి పని చేసే సాధనమే బుద్ధి.


జీవితంలో మనకు ఎప్పుడు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి మంచిదారి, రెండవది చెడ్డదారి. ఏ దారిలో పయనిస్తామన్నది మనం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది, మనిషికి సంపూర్ణంగా నిర్ణయాధికారం ఉంది. మీరు ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునే స్వేచ్చ భగవంతుడి ఇచ్చాడు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఎంచుకున్న మార్గాన్ని బట్టి మీకు ఏ ఫలాలు లభించాలో, అవి మాత్రమే భగవంతుడు ఇస్తాడు. ఇక్కడే బుద్ధిని ఉపయోగించాలి. సరైన సమయంలో సరైన మార్గాన్ని ఎంచుకోవాలి.

 

తరువాతి భాగం రేపు........

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి**

https://chat.whatsapp.com/LyeuNWbrRlW9fGDW4tOeNY


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/Hdv5PrMFoxX3I2TsoVErae


*ధర్మము - సంస్కృతి* గ్రూప్

 ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

**మహాభారతము**

 **దశిక రాము,**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


87 - అరణ్యపర్వం.


హనుమద్ పరిష్వ0గంలో పరవశించి భీమసేనుడు, యిక బయలు దేరుతానంటూ అగ్రజునివద్ద తడిబారిన కళ్ళతో వీడ్కోలు తీసుకుంటూ, ఆయన కటాక్షం తమమీద యెల్లప్పుడూ వుండాలని కోరుకున్నాడు.  


భీముని వినయానికి యెంతో సంతుష్టుడై హనుమంతుడు చిరునవ్వుతో, ' భీమా ! మీ సోదరులందరి మీదా నా అనుగ్రహం యెల్లప్పుడూ వుంటుంది. యుద్ధం అనివార్యమైనప్పుడు, శత్రునేనలను మీరు ఎదుర్కొనే సమయంలో, నీ తమ్ముడు అర్జునుని రథంపై వున్న పతాకం మీద నేను వుండి, రక్షణ గావిస్తాను. నీవు సింహనాదం చేసినప్పుడు యుద్ధభూమిలో, నా కంఠధ్వని అందులో మిళితమై, నీవు చేసిన శబ్దానికే, దాదాపు సగంమంది సైనికులు ప్రాణాలు కోల్పోయేటట్లు చేస్తాను. యిక వెళ్ళిరా . నేను గంధమాదన పర్వతాలపై వున్న విషయము, ప్రస్తుతానికి రహస్యంగా వుంచు. ' అని వాత్సల్యపూర్వకంగా వీడ్కోలు పలికాడు హనుమ అనుంగుసోదరునికి.


హనుమతో గడిపిన సుందరదృశ్యాన్నే మాటిమాటికీ నెమరు వేసుకుంటూ, అక్కడి అందాలను వీక్షిస్తూ, మరల భీముడు ప్రయాణం సాగించాడు, హనుమ చెప్పిన మార్గం గుండా. ఎట్టకేలకు, సౌగంధికావనం ప్రవేశించాడు భీమసేనుడు. అక్కడి వాతావరణానికి, సౌగంధికా పుష్ప సువాసనలకు మైమరచి, భీముడు సరాసరి సౌగంధికా సరోవరం వైపు దారితీశాడు. అక్కడ కొంచెముకూడా బురదలేని స్వచ్ఛమైన నీళ్లలో తేలియాడుతున్న సౌగంధికాపుష్పాలను చూసి, మైమరచి, ద్రౌపది ఆతని వూహలలోనికి రాగా, హనుమంతుడు చెప్పిన సలహాని విస్మరించి, అక్కడి జలాలను త్రాగి, ఆ పుష్పాలపై చెయ్యి వేయబోయాడు.  


ఇంతలో అక్కడ కాపలాగావున్న యక్ష సమూహం అతనిని చుట్టుముట్టింది. కుబేరుని అనుమతి లేకుండా మానవ మాత్రులెవరూ వనంలో ప్రవేశించరాదని చెప్పారు వారు. అయితే, ద్రౌపదీధ్యానంలో వున్న భీముడు సౌగంధికా పుష్పాలు కోయబోతున్న సమయంలో యేమిటి యీ వాదనలని కోపగించి, ' ఇది ప్రకృతి అందించిన వరం. దీనిపై యే ఒక్కరికో అధికారంలేదు. ముచ్చటపడిన వారు యెవరైనా పొందడమే ప్రకృతిధర్మం. ' అని వారితో వాదులాడి, వారిని రెచ్చగొట్టి, యుద్ధానికి తలబడ్డాడు. తానెవరో చెప్పి, మీయజమాని కుబేరుని రమ్మనండి. అతనితోనైనా యుద్ధానికి సిద్ధం' అన్నాడు.  


కొద్దిసేపు యక్షులకూ, భీమునికి యుద్ధం జరిగింది. క్షత్రియ తేజస్సుతో ధైర్య సాహసాలతో పోరాడుతున్న భీమసేనుని చూసి, అతనిపై తమ మాయా విద్య ప్రదర్శించడానికి యిష్టపడక, యక్షులు, భీముని కొద్దిసేపు నిలువరించి, యీలోపు, కొందరు అనుచరుల ద్వారా కుబేరునికి వర్తమానం పంపారు. కుబేరుడు వచ్చినవాడు భీమసేనుడు, పుష్పాలను తీసుకువెళ్తున్నది ద్రౌపది కోరికమేరకు, అని గ్రహించి, సౌగంధికా పుష్పాలు తన కానుకగా పంపించమని వచ్చిన యక్షులకు చెప్పాడు.  


ఆ విధంగా భీమసేనుడు, సౌగంధికాపుష్పాల కొరకై సరస్సులో దిగగానే, ఒక్కసారిగా అక్కడ పాండవులు వున్న చోట చిమ్మచీకట్లు అలుముకుని, పెద్దపెట్టున గాలివీచింది. ధర్మరాజు, వ్యాకులతతో, అందరినీ ఒక దగ్గర వుండమని పిలుస్తుండగా, భీమసేనుడు కనిపించలేదు. రెట్టించిన అతృతతో, భీముని గురించి విచారించగా, ద్రౌపది తాను సౌగంధికా పుష్పాలు కోరిన విషయము, దానికై ఈశాన్యదిక్కుగా భీముడు వెళ్లిన వైనం చెప్పింది.  


వెంటనే, యింక ఆలశ్యం చెయ్యకుండా, ఘటోత్కచుని, అతని పరివారం సహాయంతో, అందరూ సౌగంధికా సరస్సు వద్దకు చేరుకొని, భీముని కలుసుకున్నారు. ధర్మజుడు భీముని క్షేమము తెలుసుకుని ఆలింగనం చేసుకున్నాడు. వనరక్షకులు ధౌమ్యులవారికీ, ధర్మజునికీ మిగిలిన పెద్దలకు నమస్కరించి ఆదరించారు. వారి రాక తెలుసుకుని, కుబేరుడు విచ్చేసి, తమ ఆతిధ్యం స్వీకరించమని కోరాడు.


కొద్దిసమయము కుబేరుని వద్దవుండి, తిరిగి అందరూ కలిసి గంధమాదన పర్వతం చేరుకొని, అక్కడి వాతావరణంలో ఆనందాన్ని అనుభవిస్తూ కాలం గడుపుతున్నారు, ఘటోత్కచుడు వారివద్ద వీడ్కోలు తీసుకుని తన పరివారంతో తిరిగి వెళ్ళిపోయాడు.


కాలం గడుస్తుండగా,ఒకనాడు, లోమశమహర్షి, ధౌమ్యుడు, స్నానానికి నదీతీరానికి వెళ్లగా, భీముడు అరణ్యం లోనికి వెళ్ళాడు . ద్రౌపదీ ధర్మరాజాదులు అక్కడే వున్నారు. జటాసురుడు అనే రాక్షసుడు, అప్పటిదాకా వారి మధ్యనే బ్రాహ్మణవేషం లో వున్నవాడు, అదను చూసుకుని, తనశరీరాన్ని పెంచి, గాలికంటె వేగంగా వారినందరినీ, అందరి అస్త్ర శాస్త్రాలనూ,కలిపి ఒక మూటగాకట్టి నెత్తిన పెట్టుకుని పారిపోసాగాడు.


అంతవరకూ, మిగిలిన బ్రాహ్మణులతో పాటు ధర్మజుని ఆదరణ పొంది, నివురుగప్పిన నిప్పులాగా బ్రాహ్మణ సమూహంలో వున్న రాక్షసుని చేష్టలకు, కోపగించి ధర్మజుడు,' ఓరీ రాక్షసాధమా ! బ్రాహ్మణరూపం లో వచ్చిన దుష్టుడవు నీవు. నీకు చేటుకాలం దాపురించి యీవిధంగా ద్రౌపదిమీద కాంక్షతో మమ్ములను యిబ్బందిపెడుతున్నావు. అధర్మ బుద్ధితో సంచరిస్తున్న నీవు యెంతో దూరం మాభారం మోయలేవు. నిలు దురాత్మా ! ' అని నిలువరించసాగాడు. ఇంతలో సహదేవుడు తన ఖడ్గాన్ని తీసుకుని నెమ్మదిగా వాడి చేతి నుండి జారి క్రిందకుదిగి భీమసేనునికై గాలించాడు.  


ధర్మజుడు అన్నట్లుగానే, జటాసురుడు యుధిష్టురుని వంటి ధర్మాత్ముని భారం మోయలేక వేగం తగ్గించాడు. ఇంతలో సహదేవుడు వానికి అడ్డుగా నిలిచి కత్తి యుద్ధంతో నిలువరించే ప్రయత్నిస్తుండగా, భీమసేనుడు కలిశాడు. జటాసురునికీ, భీమసేనునికీ భయంకరమైన యుద్ధం జరిగింది. ద్రౌపదీ మొదలగు వారిని తన తలపైనుండి దించి, జటాసురుడు కూడా , ' నీవే నాకు సమఉజ్జీవి. కాచుకో. ' అని మల్లయుద్ధానికి సిద్ధపడ్డాడు భీమునితో. చివరకు భీముని గజపట్లు తప్పించుకొనలేక, భీముని దెబ్బలు యెదుర్కొనలేక, బీముడు మెడపై సాచివేసిన దెబ్బకు తట్టుకొనలేక చెట్టునుండి మగ్గినపండు రాలి క్రిందపడినట్లు, జటాసురుని తల, దేహంనుండి విడివడి, క్రిందలు రాలింది. ఆ విధంగా దుష్టశిక్షణ జరిగి, భీముడు అందరి ప్రశంశలు అందుకుంటుండగా, వారంతా మళ్ళీ నరనారాయణాశ్రమం చేరారు.  


మరికొంతకాలం గడిచింది. అర్జునునిరాకకై యెదురుచూస్తున్నారు అందరూ. లోమశమహర్షి సూచన మేరకు అందరూ కైలాషపర్వతం చేరి అక్కడ వుండి అర్జునుని కొరకై నిరీక్షిద్దామనుకున్నారు. వెంటనే బయలుదేరి, అతి పవిత్రమైన అరిష్టశ్రేణుని ఆశ్రమం మీదుగా, కైలాసశిఖరం చేరుకున్నారు, పాండవులు. ఆ పుణ్యప్రదేశానికి, యెందరో మునులు, ఋషులు, సాధుపుంగవులు వస్తూపోతూవున్నారు. వారితో సత్కాలక్షేపం చేస్తూ యెన్నో మంచివిషయాలు తెలుసుకుంటూ వున్నారు, ధర్మరాజాదులు.  


ఇలావుండగా, ఒకనాడు, ఆకాశములో వున్నట్లుండి ఒక పెద్ద తెల్లనిమెరుపు మెరిసింది. ఆపై, తెల్లని అశ్వాలు పూనిన రథంలో మాతలి సారధ్యంలో, దివ్యరధం గోచరించింది, వారి వైపే వస్తూ. ఇంకొద్దిగా ముందుకు రధంరాగానే, కాంచన మణిమయహారాలతో, నవరత్న ఖచిత సువర్ణ కిరీటంతో ఇంద్ర తేజస్సుతో వెలిగిపోతూ, పాండవ మధ్యముడు అర్జునుడు వారినందరినీ అలరిస్తూ కనిపించాడు.  


రధం వారిదగ్గరగా వచ్చి ఆగింది. రధం దిగుతూనే, అర్జునుడు, లోమశమహర్షికీ, ధౌమ్యులవారికి నమస్కరించి, ఆపై అన్నలకూ నమస్కరించాడు., నకులసహదేవులను దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకుని ఆదరించాడు. ద్రౌపదిని ప్రేమ పూర్వకంగా సమీపించి, ప్రియసంభాషణలు గావించాడు. 


పాండవుల సత్కారాలు అందుకుని, మాతలి వారికి చెప్పవలసిన హితవచనాలు చెప్పి, వారంతా ఇంద్రరధానికి నమస్కరిస్తుండగా, తిరిగి మాతలి, రథంతో సహా అమరావతి బయలుదేరి వెళ్ళాడు.


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

**శ్రీమద్భాగవతము**

 **దశిక రాము**




 తృతీయ స్కంధం -23


శ్రీహరిదర్శనంబు 


జయవిజయులు ఇలా అంటున్న సమయంలో...అందరికీ ప్రభువైనవాడూ, అంతములేనివాడూ అయిన హరి ఆ కలకలాన్ని విని, లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చేస్తూ వినోదించడాన్ని చాలించి, ఆశ్రయించినవారి కష్టాలను పోగొట్టేవాడై, శాశ్వత వైభవంతో శుభాలను కలిగించేవాడై అంతఃపురం యొక్క మాణిక్యాలు పొదిగిన మందిర ద్వారాలను దాటి మాననీయ స్వరూపంతో వచ్చాడు.ఇంకా...లక్ష్మీదేవి కూడా తొట్రుపాటు కలిగినదై వెంట రాగా, పరమహంసలైన మునీశ్వరులు నమస్కరించే తమ పాదపద్మాలకున్న క్రొత్త మణులు పొదిగిన బంగారు అందెలు అడుగడుగుకూ మనోహరమైన శబ్దాలు చేస్తుండగా శ్రీహరి మహానుభావులచేత నమస్కరింపబడేవాడై, యోగులచేత సేవింపబడేవాడై శ్రీహరి వచ్చాడు. అప్సరసలు తమ చేతులకున్న మణులు పొదిగిన బంగారు కంకణాలు గల్లుగల్లున మ్రోగుతుండగా హంసరెక్కలవంటి తెల్లని వింజామరలను వీస్తున్నారు. ఆ వింజామరల గాలికి చంద్రబింబంలా వెలుగుతున్న వెల్లగొడుగు అంచులలో వ్రేలాడుతున్న ముత్యాల హారాలు బాగా కదులుతున్నాయి. వాటిమీదనుండి చల్లగా జారిపడుతున్న మంచుబిందువులతో అందాలు చిందే దివ్యమంగళ స్వరూపుడై శ్రీహరి వచ్చాడు. 

ఇంకా ఆ శ్రీహరి మునీశ్వరు లందరూ వర్ణించే మందహాస సుందరమైన ప్రసన్న ముఖపద్మంతో అలరేవాడు. విశేషమైన ప్రేమతో చెమ్మగిల్లిన కన్నులున్న తన భక్తజనుల హృదయాలలో నివసిస్తూ తనరేవాడు. విశాలమైన నల్లని వక్షస్థలంపై వైజయంతి అనే మాలచేత అలంకరింపబడి రాజిల్లేవాడు. నమస్కరించే జనులను రక్షించడంలో దయామృత తరంగాలు పొంగిపొరలే పద్మనేత్రాలు కలవాడు. ఆ విష్ణువు యోగిపుంగవు లందరిచేత సేవింపబడేవాడు. సజ్జనులను రక్షించడానికి సమర్థుడైనవాడు. అత్యంత మహిమాన్వితమై అఖిలలోకాలకు చూడామణి అయిన వైకుంఠపురాన్ని అలంకరించేవాడు. ఆ శ్రీహరి నడుము చుట్టూ ప్రకాశించే పచ్చని పట్టుపంచెతో బంగారు మొలత్రాడు వెలుగులు వెదజల్లుతున్నది. కంఠం చుట్టూ ఉన్న రత్నహారాల కాంతులు కౌస్తుభమణి కాంతులతో కమ్ముకొంటున్నాయి. మెరుపుతీగలను మించి ప్రకాశించే కర్ణకుండలాల కాంతులు చెక్కిళ్ళ కాంతులతో కలిసిపోతున్నాయి. గొప్పనైన నవరత్నాలు పొదిగిన కిరీటం కాంతులు నలుదిక్కులలో వ్యాపిస్తున్నాయి. గరుత్మంతుని మూపుపై ఆనించిన ఎడమచేతికి భుజకీర్తులు, మురుగులు, కంకణాలు ముచ్చట గొలుపుతుండగా, కుడి అరచేతిలో తిప్పుతున్న అందమైన పద్మం అమరి ఉండగా శ్రీహరి వచ్చాడు. ఆ శ్రీహరి పాదపద్మాలలోని కేసరాలవలె తులసీదళాలు వెలుగులు వెదజల్లుతున్నవి. ఆ తులసీదళాలతో మిళితమైన మకరంద సుగంధాలతో చల్లగా మెల్లగా వీచే కమ్మని పిల్లగాలులను ఆస్వాదిస్తూ సేవాభావంతో యోగీంద్రులు ఆయన వెంట నడుస్తున్నారు. ఆ యోగీశ్వరుల మనస్సులకు విష్ణుమూర్తి దివ్యస్వరూపం ఆనందదాయకమై వెలుపలి లోపలి ఇంద్రియాలకు సంతుష్టి కలిగిస్తున్నది. ఆ అనుభవం చేత వారు గగుర్పాటు చెందుతున్నారు. ఇటువంటి పరిపూర్ణ తేజోవంతమైన స్వరూపంతో విష్ణుమూర్తి నడచి వచ్చాడు. ఆయన ప్రక్కన లక్ష్మీదేవి నడచివస్తున్నది. మిక్కిలి శ్రేష్ఠమైన ఆమె సౌందర్యం విష్ణుమూర్తి సౌందర్యానికి లోబడి అందులో ఒక అంశంగా వెలుగొందుతున్నది. ఆ విధంగా సకల జగత్తులకు ఈశ్వరుడైన విష్ణువు అక్కడికి వచ్చాడు.

ఆ విధంగా సుస్థిరమూ శుభకరమూ అయిన శోభావైభవంతో వచ్చిన ఆ విష్ణుమూర్తి పగడాల పెదవి క్రొంజిగురాకులా ఉంది. స్వామి చిరునవ్వు ఆ చిగురాకుపై విలసిల్లే మల్లెమొగ్గల అందాన్ని అందుకున్నది. అటువంటి గోవిందుని సుందర ముఖపద్మాన్ని సనక సనందనాదులు ఆనందంగా సందర్శించారు. మనస్సులు తృప్తి చెందక మళ్ళీ మళ్ళీ మాధవుణ్ణి సందర్శించారు.ఆ సనక సనందనాది మునులు అచంచలమైన భక్తితో ఆ శ్రీహరి ముఖాన్ని చూపులు త్రిప్పుకోలేక చూసి చూసి, ఎట్టకేలకు చూపులు త్రిప్పుకొని స్వామి పాదాలమీద కేంద్రీకరించారు. ఆ పాదాలు కల్మషము లేని భక్తుల భేదాలను పోగొట్టేవి, మునుల మనస్సులకు మోదాన్ని కలిగించేవి, మోక్షమందిరం యొక్క ద్వారాలను తెరిపించేవి, వేదాలను క్రొంగ్రొత్త నూపురాలుగా చేసికొని పొగడ కెక్కినవి.కోరిక తీరిన ఆ సనక సనందాది మహర్షులు నిరంతరం యోగమార్గాసక్తులైన మహాయోగులు సైతం ఎంత వెదకినా కనిపించని మహానుభావుడైన విష్ణువును కన్నులారా చూసారు. పద్మరాగ మణుల కాంతులతో ప్రకాశించే ఆ భగవంతుని పాదపద్మాలను తమ హృదయాలలో పదిలపరచుకొని పదేపదే నమస్కారాలు చేశారు. ధ్యానించేవారికి మాత్రమే వశమయ్యేవాడూ, తత్త్వజ్ఞులకు దర్శన మిచ్చేవాడూ, భక్తులైన వారికి బ్రహ్మానందాన్ని ప్రసాదించే స్వరూపం కలవాడూ అయిన ఆ పరాత్పరుణ్ణి మునీశ్వరులు తమ మనస్సులలో నిలుపుకున్నారు.


సనకాదుల హరి స్తుతి


కన్నులకు విందు కావించే దివ్యమంగళ స్వరూపాన్ని ధరించిన ఆ మహానుభావుడు, పురుషోత్తముడు, అనంత తేజోనిధి అయిన విష్ణువును సనకసనందనాదులు ఇలా సంస్తుతించారు. పద్మదళాల వంటి నేత్రాలు కలిగినవాడా! భక్తజనులపై వాత్సల్యాన్ని చూపే దేవా! నీ కుమారుడూ, మాకు జనకుడూ అయిన బ్రహ్మదేవుడు మాకు ఉపదేశించిన ఉపాయంతో నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూడగలిగాము. ప్రభూ! కృతార్థులమైన మా జన్మ సార్థకమయింది.దేవా! నీవు దుష్టుల హృదయాలలో ఉండికూడ వారికి కనిపించవు. పట్టుదలతో నీ దివ్యమంగళ స్వరూపాన్ని ఆశ్రయించి ఆరాధించేవారిని అంతులేని దయతో చేరదీసి వారి మనస్సులను తృప్తి పరుస్తావు. పద్మనయనా! సర్వలోకాధిపతీ! నిన్ను చూడాలనే కోరిక కలగడం వల్లా, నీ గురించి చెప్పుకొనడం వల్ల, సుస్థిరమైన భక్తియోగంలో నిష్ణాతులైన ఆత్మవిదులైనవారు రాగద్వేషాలు తొలగించుకున్నట్టి యోగిజనుల మనస్సులనబడే పద్మాలలో నీవు కూర్చుని ఉంటావని తెలుసుకుంటారు.

నీ పాదాలపై మనస్సు లగ్నం చేసిన భక్తులు నీ భక్తికి వ్యతిరేకాలైన ఇతర ముఖ్యమైన కార్యాలు ముక్తి నిచ్చేవైనా వాటిని పాటింపరు. దయాగుణమే అలంకారంగా గలవాడా! పాపాలను తొలగించేవాడా! పొగడ దగినదీ, దోషాలు లేనిదీ, శుభగుణాలకు కాణాచియైనదీ, గొప్ప కీర్తిచేత విరాజిల్లేదీ అయిన పవిత్రమైన చరిత్ర కలవాడవు. నీ పాదపద్మాల సేవచేత నిర్మలమైన మనస్సు కల మహానుభావులు ఇతర విషయాలను భావించరు. అంతులేని తపస్సు చేసి సాంసారిక పాపాలను పోగొట్టుకొని తిరిగే మేము ఈరోజు నీ పాదదాసులపై కోపించి శపించాము. మహాపాపాన్ని కల్గించే చెడుమార్గంలో అడుగుపెట్టి ధర్మహాని చేసి నరకానికి పాత్రుల మయ్యాము. మా తప్పు మన్నించి మమ్మల్ని రక్షించు. కేశవా! తుమ్మెద కుతూహలంతో కమ్మని మకరందం కోసం వాడిముళ్ళతో కూడిన కొంగ్రొత్త పూలగుత్తులను సమీపించే విధంగా మిక్కిలి ఆటంకాలను అధిగమించి నీ పాదపద్మాలను ఆరాధించడానికి వచ్చాము.పద్మనాభా! మాధవా! నీ పాదపద్మాలపై సమర్పింపబడి అందాలు చిందే ఈ తులసి పవిత్రమైనట్లు నీ కథామృతంతో కూడిన మాటలను ఎటువంటి కల్మషం లేకుండా విన్నట్టి మా చెవులు పవిత్రాలై విలసిల్లుతాయి. మహనీయమైన కీర్తియొక్క విలాసంచేత ప్రకాశించే సుగుణాలు కలవాడా! అందరికీ ఆశ్రయింప దగినవాడా! అచ్యుతా! పంచేంద్రియాలకు లొంగినవారికి కనిపించక నల్ల అవిసె పూవుల కాంతితో ఒప్పే నీ సహజ స్వరూపాన్ని ఇప్పుడు మేము సంతృప్తిగా చూసి మా కన్నులు ధన్యతను పొందాయి. నీకు మ్రొక్కిన మమ్మల్ని ఆదరించు. అని ఈ విధంగా సనక సనందనాదులు శ్రీహరి పాదపద్మాలకు మ్రొక్కి భక్తితో పరవశమైన మనస్సు కలవారై విన్నవించారు. గోవిందుడు సంతోషించి ఆ మునీశ్వరులను చూసి ఇలా అన్నాడు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

**సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఐదవ శ్లోక భాష్యం - మూడవ భాగం


అలా అర్థరహితమైన జీవితాలు గడిపిన వారందరూ ఎల్లప్పుడూ అలాగే ఉండిపోరు. మన మతం నిరంతరమైన నరకాన్ని ఒప్పుకోదు. మధ్వాచార్యులవారు దానికి తుల్యమైన భావాన్ని వెలువరించారు. ప్రజలలో పాపభీతి కలిగించి సన్మార్గ వర్తనులుగా చేయాలన్నది వారి ఉద్దేశ్యంగా మనం గ్రహిద్దాం. మహాపాపికి కూడా ఒకానొక సమయంలో ముక్తి లభిస్తుందని మన సాధారణమైన విశ్వాసం. యుగాల కాలం పట్టవచ్చు. కానీ అంబిక తన చెడిపోయిన పిల్లలను తన ఒడిలోనికి తీసుకొని నిశ్చయంగా సద్వర్తనులను చేసి ముక్తినిస్తుంది.


యుద్ధం కోసమొక రాజుగారు రాజప్రాసాదాన్ని విడిచి వెళ్ళారు. అక్కడ ఏకాంతంలో ఎవరో ఒక పౌరులు ఆయనకు సహాయం చేశాడు. లేదూ ఈతడికే ఆ పౌరునిపై అకారణమైన దయ కలిగింది. రాజప్రాసాదంలోకి వచ్చి తనను కలుసుకోమన్నాడు. “నా వంటివాణ్ణి రాజభవనంలోనికి రానీయరు కదా – రాజముద్ర ఏదైనా ఉంటే ప్రసాదించమ”న్నాడతను. రాజుగారు ఓ ముద్రిక ఇచ్చారు. పరిశీలించి చూస్తే అది శత్రురాజు యొక్క రాజముద్రిక. ఆ పౌరుడు తికమక పడ్డాడు.


రాజుగారు నవ్వుతూ శత్రురాజు రాజముద్రికను ఎందుకిచ్చారో చెప్పాడు. “చాలామందికి నేను రాజముద్రిక నిచ్చాను. అట్లాంటి వాళ్ళు పెద్దవరుసలో నించొని ఉంటారు. నువ్వావరుసలో చేరితే నిన్ను తొందరగా కలుసుకోవాలన్న ఉద్దేశ్యం నెరవేరదు. అందుకే నీకీ శత్రురాజు రాజముద్రికనిచ్చాను. ఇది అతని గూఢచారులను పట్టుకొన్నప్పుడు మా చేతబడింది. దీనిని దాచుకొని నా దగ్గరకు దొంగతనంగా వస్తున్నట్లు నటించు. ఆ అంగరక్షకులకు అనుమానం కలిగేలా ప్రవర్తించాలి. వాళ్ళు నిన్ను పట్టుకొని, సోదాచేసి, శత్రురాజు రాజముద్రిక ఉన్నందున నేరుగా నావద్దకు తీసుకొని వస్తారు.” 


అంబిక చేసేది ఇటువంటి పనే! కామక్రోధములనేవి శత్రురాజు రాజముద్రిక వంటివి. కృష్ణపరమాత్మ కుంతీ దేవిని నీ కోర్కె ఏమిటో చెప్పు అన్నాడు. “నాకు కష్టాలు రావాలి. అవి ప్రసాదించు. అప్పుడే నిన్ను నేను తలుచుకుంటాను” అన్నది. కష్టాలు ఎలా వస్తాయి ?? కామక్రోధాదుల చేత. వాటిచే బాధించబడినపుడు, ఫలితంగా కష్టబడేటపుడు, మనకు దేముడు గుర్తుకు వస్తాడు. ఆయనను ప్రార్థిస్తాం. అప్పుడు ఈ జగత్సృష్టి, కామక్రోధములు ఎంత ఉపయోగకరమైనవో గుర్తిస్తాం.


అంబిక ఒకనికి కామాన్ని కలిగించిందంటే కారణం అతడిపై కరుణ చూపే అవకాశం తనకు కలగడానికే!! ఈ ఏర్పాటు. ఆ వ్యక్తితోనే అంతరించదు. అతడి కామం వలన జనించిన పుత్రులపైన కూడా ఈ కరుణ ప్రసరిస్తుంది. మహాత్ములు మరింకో జన్మవద్దని ఆక్రోశిస్తారు. కానీ ఈ కామంచేత జనించిన అనేకమందికి అది ఆశీస్సుగా పరిణమిస్తోంది.


మరింకో జన్మ వద్దని మరి పోగులు పోగులుగా కర్మననుభవించ వలసినవారు జన్మవద్దంటే తీరుతుందా ? వారి శేషకర్మను అనుభవించడానికి జన్మించి తీరవలసిందే! ధర్మయుతంగా జీవించవలసిందే!! ఎవరికీ కామం లేకపోతే ఈ కర్మలను అనుభవించవలసిన వారు పుట్టేదెలా?? తమ కర్మ భారాన్ని వదిలించుకొనేదెలా ?? వారికి కర్మను వారనుభవించి ధర్మయుతంగా జీవించడానికి తద్వారా నైష్కర్మ్యాన్ని పొందడానికి ఒక అవకాశం ఈయబడింది. ఆ జన్మలో కూడా వారి పాతకర్మలను తుడిచివేసుకోగా కొత్త దుష్కర్మలను చేర్చుకుంటే దానికి ఎవరేం చేయగలరు ?? జన్మకు ప్రయోజనం ఇంకో జన్మ కలగకుండా చేసుకోవడానికి ప్రయత్నించడం. మనమీ సత్యమెరిగి తదనుగుణంగా వర్తించాలి.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

*సంపూర్ణ తిరుమల చరిత్ర - 5*_

 **దశిక రాము**




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


తిరుమలను అనాది కాలం నుండి వేంగడం అని పిలిచేవారు. పురాతన తమిళ సాహిత్యంలో కూడా ఈ పదమే కనిపిస్తుంది. తిరుమల గిరులు అటు తమిళులకు, ఇటు తెలుగువారికి కూడా వారధిగా ఉండేవని ప్రచారంలో ఉంది. తిరువేంగడంగా పిలువబడే తిరుమల ఉత్తర ప్రాంతానికి తమిళులు, దక్షిణ ప్రాంతానికి తెలుగువారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేవారు. దట్టమైన అరణ్యంగా ఉండే ఈ తిరుమల ప్రాంతమంతా వన్యమృగాలతోనూ, ఏనుగుల సంచారంగా ఉంది సామాన్య జనజీవనానికి దూరంగా ఉండేదట. తమిళుల అతి ప్రాచీన కవి నక్కియార్ తిరుమల గురించి కొంత ప్రస్తావించాడు. ఆ కాలంలో ఈ ప్రాంతం కళావర్ల ఏలుబడిలో ఉండేదట. వీరు వేంగడం ప్రాంతాన్ని, ఇకా పావిత్తిరి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారట. ఈ అటవీ ప్రాంతంలో నివసించే ఆటవికులు ఏనుగులను తరిమికొట్టదానికి రంగురంగుల రత్నాలను రాళ్ళుగా విసిరేవారని, వాటి కాంతికి ఏనుగులు దూరంగా పారిపోయేవని కథలు ప్రచారంలో ఉన్నాయి. అందుకేనేమో రాయలకాలంలో ఇక్కడ రత్నాలు రాశులు పోసి అమ్మేవారట. అనేక తమిళ ప్రాచీన గ్రంధాల్లో తిరువేంగడం అయిన తిరుమల పైన ఎప్పుడూ ఏవో జాతరలు, పండుగలు, సంబరాలు, ఉత్సవాలు జరిగేవని చరిత్రకారులు చెప్పారు. అన్ని జాతరలు, ఉత్సవాలు అక్కడ వెలసిన తిరువేంకటనాథుడైన శ్రీనివాసుని వైభవాలేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


అన్నమయ్య చెప్పినట్లు అనంత సూర్యతేజుడైన శ్రీనివాసుని తేజస్సును ఎంతని వివరించగలం? ధనుజాంతకుడైన శ్రీహరి ప్రతాపాన్ని ఎంతని కొలవగలం? మన్మథుని తండ్రి అయిన వాని రూపాన్ని ఏమని వర్ణించగలం? సకల పాప నివారిణి అయిన గంగామాతకే జనకుడైన శ్రీహరిని కొలిస్తే వచ్చే పుణ్యమెంత.. సర్వ ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మికి పతి అయిన వాని రాజసాన్ని ఏమని వర్ణించగలం? వేయి రూపాల వాడైన శ్రీపతి లేని ప్రదేశాన్ని ఊహించగలమా?


సర్వాంతర్యామి అయిన శ్రీహరికి తమను తాము అర్పించారు కనుకనే హరి భక్తులు ఆళ్వారులయ్యారు. ఆళ్వారులంటే భగవంతుని సేవకే తమ జీవితాలను అంకితం చేసినవారని అర్ధం. అత్యంత సన్నిహితంగా ఉండే భగవద్భక్తులని భావం. అందుకే హరి వాహనుడైన గరుడుని కూడా గరుడాళ్వారులని, శ్రీహరి ఆలయాన్ని కూడా కోయిలాళ్వారులని స్వామివారి సుదర్శన చక్రాన్ని చక్రత్తాళ్వారులు అని పిలుస్తుంటారు. క్రీస్తుశకం 4వ శతాబ్దం నాటికే ఆళ్వారులు శ్రీహరిని కీర్తించి, గానం చేసి భక్తి సామ్రాజ్యాన్ని ఏలిన పరమ భక్తులు ఆళ్వారులు. వీరినే ద్వాదశ సూరులంటారు. నాలాయిరం అంటే దాదాపు నాలుగు వేలని అర్ధం. వీరు 12మంది ఆళ్వారులు. నాలుగువేల పాశురాలను రచించి గానం చేసినవారు. నాలుగువేల పాశురాలను రచించిన 12మందిని ఆళ్వారులు అన్నారు గనుకనే 32 వేల కీర్తనలను రచించిన అన్నమయ్యను కూడా తెలుగు ఆళ్వారు అని ఇటీవల పేర్కొన్నారు. ఈ ఆళ్వారులను భగవదంశతో జన్మించారని తమిళ ప్రబంధాలలో పేర్కొన్నారు. వీరంతా విష్ణు భక్తులు. భక్తి ప్రచారంలో అమృతప్రాయమైన తమ పాశురాలతో భగవద్భక్తిని ప్రభోదించినవారు. స్వామివారి పంచాయుధాలతో వీరిని పోలుస్తుంటారు. వీరిలో పోయ్ గై ఆళ్వారును శ్రీవారి శంఖు పాంచజన్యం గానూ, భూతత్తాళ్వారును శ్రీవారి గద కౌమోదకి గాను, పేయాళ్వారును నందక ఖడ్గంగానూ తిరుమలశై యాళ్వారును సుదర్శన చక్రంగానూ, కులశేఖరాళ్వారును కౌస్తుభమణిగానూ ఇలా స్వామివారి పంచాయుధాలను భగవదంశలుగా పేర్కొని, ఆళ్వారులుగా ఆరాధిస్తుంటారు.


భూతం సరశ్చ మహాదాహ్వాయ భట్టనాథ 


శ్రీ భక్తిసార కులశేఖర యోగినాహాన్ 


భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ 


శ్రీ మత్పరాంకుశ మువిం ప్రణతోస్మిన్ నిత్యం


పై శ్లోకంలో పదకొండు మంది ఆళ్వారుల పేర్లు ఉన్నాయి. వీరు 1.పొయ్ గయాళ్వారు (పాంచజన్యం) 2. పూతత్తాళ్వారు (కౌమోదకి) 3.పోయాళ్వారు (నందకం) 4. పెరియాళ్వార్ (విష్ణు రథం) 5.తిరుమలశయాళ్వారు (సుదర్శన చక్రం) 6. కులశేఖరాళ్వారు (కౌస్తుభం)7.తిరుప్పాణాళ్వారు (శ్రీవత్సలాంఛనం) 8.తొండరడిప్పొడి యాళ్వారు (వైజయంతిమాల) 9.తిరుమంగయాళ్వారు (శార్గం) 10. ఉడయవర్ (ఆదిశేషుడు) 11.నమ్మాళ్వార్ (విష్వక్సేనుడు) 12. ఆండాళ్ అను గోదాదేవి (భూదేవి)


ఈ ఆళ్వారులను కవితా సుందరి వలచి వచ్చి వీరి వాక్కులను వరించింది. అందుకే వీరి పాశురాలు అమృత ప్రాయాలు. పరమ భాగవతోత్తములైన ఈ ఆళ్వారులు ద్రవిడ దేశంలో అవతరించి ద్రవిడ భాషలో శ్రీ మహావిష్ణువు గుణవిశేషాలను తమ అనంత భక్తితో ఆరాధించి నాలుగు వేల పాశురాలలో కీర్తించారు. వీరు తమ పాశురాలలో తిరుమల, శ్రీరంగం, కంచి మొదలైన వైష్ణవ క్షేత్రాలలో వెలసిన దేవతామూర్తులను పలువిధాల స్తుతించారు.


అలపన్నిద్దరు సూరులందును సముద్యల్లీలగా ఉన్న బె 


గ్గలికం దానము బాస ణా నిజమున కంజాతనంజాత పు 


ష్కల మాధ్వీక ఝరిన్మురారి సాగియంగా బొక్కి ధన్యాత్ములౌ 


నిల పన్నిద్దరు సూరలం దలతు మోక్షేచా ఛామతిందివ్యులన్


అని శ్రీకృష్ణదేవరాయలు తాను రచించిన ఆముక్తమాల్యదలో ఆళ్వారుల గురించి స్తుతించాడు. వీరు రచించిన పాశురాలు నాలాయిర దివ్య ప్రబంధమనే పేరుతో ప్రఖ్యాతి గాంచాయి. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి తొలి ఆళ్వారుగా పేర్కొన్న పోయ్ గై యాళ్వారు, భూతత్తాళ్వారులు, పేయాళ్వారులు క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటివారని చెబుతోంటే చరిత్రకారులు మాత్రం 12 మంది ఆళ్వారుల కాలం క్రీస్తుశకం 6 నుండి 9వ శతాబ్దం వారని చెబుతుంటారు. ఏది ఏమైనా పన్నిద్దరు ఆళ్వారులు తమ హృదయ కమలాల నుండి నిసర్గ సుందరంగా వెలువడిన మధుర మధు ప్రవాహంచే హరిణి కీర్తించి ధన్యులైన పరమ భాగవతోత్తములు. ఈ ఆళ్వారులు చూపిన మధురభక్తి విష్ణు సాయుజ్యము నకు చేరుటకు మార్గం.


కొండలపై వర్షం కురవడంవల్ల ఆ నీరు పాయలుగా మారి నదీనదాలుగా రూపాంతరం చెంది పల్లమువైపుకు ప్రవహించి చివరికి సాగరంతో సంగమిస్తుంది. కానీ భక్తి నది మాత్రం దక్షిణము నుండి ప్రవహిస్తూ ఉత్తరంగా పయనించి కొండ కోణాలను దాటి పరమ పదమునకు ఆలవాలమైన శ్రీమన్నారాయణుని యందు ఐక్యమౌతుంది. ఆకాశం నుండి కురిసిన వర్షం సాగరాన్ని చేరినట్లుగా, భూలోకాన ఆవిర్భవించిన భక్తి నది మాత్రం సర్వోత్కృష్టమైన హరి అనే మహా సాగరాన్ని చేరడానికి ఆరాటపడుతుంది. అందుకే గదా భగవానుడు భగవద్గీతలో ఈవిధంగా చెప్పాడు.


ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం 


సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్ఛతి


ఈ పాశురాలను నాథముని అనే కవినాథుడు ద్రావిడ సంహితకు రాగతాళములు కూడా కూర్చి పాటలు పాడుకోడానికి వీలుగా మలిచాడు. అందువల్ల ఈ పాశురాలు పండిత పామరులు కూడా సులభంగా పాడుకోడానికి అవకాశం కలిగింది. ఆళ్వారులలో నమ్మాళ్వారులు శరీరం కాగా, మిగిలిన ఆళ్వారులు అందరూ వీరికి ఇతర శరీర భాగములని వైష్ణవులు కీర్తిస్తారు. ఈ నమ్మాళ్వార్లనే భక్తి అనే నదికి ఉన్నత స్థానంగా కూడా వైష్ణవాచార్యులు వర్ణిస్తారు.


వైష్ణవాలయాలకు వెళ్ళినప్పుడు అర్చకులు మనకు తీర్థం ఇచ్చి శఠగోపం మన శిరశుపై ఉంచుతారు కదా! ఈ నమ్మాళ్వారులకే శఠగోపులని కూడా పేరు. వీరి ప్రతీకయే ఈ శఠగోపం. వీరు శ్రీ మహావిష్ణువుకు పాదస్థానీయులు. అందుకే శఠగోపంపై విష్ణు పాదములు ఉంటాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రవర్తకులగు శఠగోప మహర్షి భక్తి స్రవంతికి ఉన్నత స్థానం. వీరు మూర్తీభవించిన కరుణా రసమూర్తి.

🙏🙏🙏

సేకరణ

*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


*ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

*నిజమైన గుర్తింపు సాధనం*

 *మంచి కధ* 




*ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు.


రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు. 


*కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు.

అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు. 

రాజు చాలా ఆశ్చర్యపోయాడు. 


*అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు - “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది. 

దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు.


*రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు. 


*రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది. 

అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు. 

అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు.


*కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు... అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని..

రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు. 

అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము.


*రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని. అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది. 

ఒక రాణి స్తాయి వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు....


*రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడు

 

*కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు. 

ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు. 

రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు.

రాజుకు చాలా కోపం వచ్చింది. 

కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు. 

తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. నువ్వు ఒక రైతు కొడుకువు. 

మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని. 


*రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు. 


*అప్పుడు ఉద్యోగి- “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు. 

ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు...


*మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తీ ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికే!


*మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతడి వ్యవహారమే.*

శ్రీలక్ష్మిఅష్టోత్తర నామావళిః

 

1) ఓం జడాజడప్రకృతిస్థితరవ్యక్తావ్యక్తస్వరూపిణ్యై నమః 

2) ఓం అష్టసిద్ధిప్రదాయిన్యై నమః 

3) ఓం నవనిధినిలాయాయై నమః 

4) ఓం శ్రీమహావిష్ణుహృదయసరోవరమధ్యగాయై నమః 

5) ఓం మన్మథజనన్యై నమః 

6) ఓం సర్వాలంకారభూషితాయై నమః

7) ఓం ఆదిలక్ష్మ్యై నమః 

8) ఓం ఆదిమధ్యాంతరహితాయై నమః 

9) ఓం చారుమతీసేవితపదాంబుజాయై నమః 

10) ఓం కోలాసురసంహారిణ్యై నమః 

11) ఓం కరవీరపురనివాసిన్యై నమః 

12) ఓం హరిద్రాకుంకుమచర్చితాంగ్యై నమః 

13) ఓం సప్తమధాతురూపిణ్యై నమః 

14) ఓం క్షీరసాగరనిలయాయై నమః 

15) ఓం హరివల్లభాయై నమః 

16) ఓం సరోజాత్మికాయై నమః 

17) ఓం శ్వేతాంబరధరాయై నమః  

18) ఓం సిద్ధగంధర్వయక్షవిద్యాధరకిన్నరపూజితాయై నమః 

19) ఓం శుభమంగళపరంపరాప్రదాయిన్యై నమః 

20) ఓం హేమాబ్జవల్ల్యై నమః 

21) ఓం వేదవల్ల్యై నమః 

22) ఓం ఆనందవల్ల్యై నమః 

23) ఓం స్వాహాస్వధాస్వరూపిణ్యై నమః 

24) ఓం కనకకలశహస్తాయై నమః 

25) ఓం సింహవాహిన్యై నమః 

26) ఓం విష్ణువామాంకసంస్థితాయై నమః 

27) ఓం అపాంగవీక్షణాయై నమః 

28) ఓం దారిద్ర్యదుఃఖభంజనాయై నమః 

29) ఓం ప్రణవవాచ్యస్వరూపిణ్యై నమః 

30) ఓం సద్గతిప్రదాయకాయై నమః 

31) ఓం మహేంద్రాదిదేవగణపూజితాయై నమః 

32) ఓం సర్వలక్షణసంపన్నాయై నమః 

33) ఓం తాపత్రయనివారణాయై నమః

34) ఓం శ్వేతదీపనివాసిన్యై నమః 

35) ఓం హిరణ్మయ్యై నమః 

36) ఓం రత్నగర్భాయై నమః 

37) ఓం చంద్రసహోదర్యై నమః 

38) ఓం గృహలక్ష్మీస్వరూపిణ్యై నమః 

39) ఓం వాగ్జాడ్యమలాపహారిణ్యై నమః 

40) ఓం సచ్చిదానందస్వరూపిణ్యై నమః 

41) ఓం సహస్రదళపద్మస్థాయై నమః 

42) ఓం కారుణ్యకల్పలతికాయై నమః 

43) ఓం హేమవర్ణాభాయై నమః 

44) ఓం సాలగ్రామమయ్యై నమః 

45) ఓం వ్యాసవాల్మీకిపూజితాయై నమః 

46) ఓం అఖిలాండకోటిబ్రహ్మాండనాయికాయై నమః 

47) ఓం సకలాభరణవిలాసిన్యై నమః 

48) ఓం నిత్యానపాయిన్యై నమః 

49) ఓం ద్వంద్వాతీతవిమలమానసాయై నమః  

50) ఓం పరాపశ్యంతిమధ్యమవైఖరిస్వరూపిణ్యై నమః 

51) ఓం జననమరణచక్రవినిర్ముక్తాయై నమః 

52) ఓం పుష్పయాగప్రియాయై నమః 

53) ఓం పరమంత్రయంత్రతంత్రభంజిన్యై నమః 

54) ఓం సకలవిద్యాప్రదాత్ర్యై నమః 

55) ఓం లోకపావన్యై నమః 

56) ఓం పుత్రపౌత్రాభివృద్ధికారిణ్యై నమః 

57) ఓం ధనధాన్యవృద్ధికర్యై నమః 

58) ఓం శరీరారోగ్యరక్షాకర్యై నమః 

59) ఓం సత్యశౌచాదిసద్గుణనిలయాయై నమః 

60) ఓం ఆచార్యరూపిణ్యై నమః 

61) ఓం ఖడ్గధరాయై నమః 

62) ఓం ధర్మాధర్మవిచక్షణాయై నమః 

63) ఓం జ్ఞానముద్రాయై నమః 

64) ఓం శబ్దాత్మికాయై నమః 

65) ఓం ప్రద్యుమ్నజనన్యై నమః 

66) ఓం కమలాలయాయై నమః

67) ఓం అనిందితాయై నమః 

68) ఓం విజయపరంపరాప్రదాయిన్యై నమః 

69) ఓం రాగమోహవివర్జితాయై నమః 

70) ఓం వైకుంఠపురవాసిన్యై నమః 

71) ఓం బీజస్వరూపిణ్యై నమః 

72) ఓం పద్మవనాంతస్థాయై నమః 

73) ఓం గోపృష్ఠనిలయాయై నమః 

74) ఓం బిల్వవృక్షస్వరూపిణ్యై నమః 

75) ఓం సద్బుద్ధిప్రదాయిన్యై నమః  

76) ఓం పద్మసంభవాయై నమః 

77) ఓం గోసంపదప్రదాయిన్యై నమః 

78) ఓం భవభయభంజనాయై నమః 

79) ఓం భృత్యసంపత్ప్రదాయిన్యై నమః 

80) ఓం దాంపత్యసౌఖ్యప్రదాయిన్యై నమః 

81) ఓం స్నేహబాంధవసంవర్ధిన్యై నమః 

82) ఓం కుశాగ్రబుద్ధిప్రదాయిన్యై నమః 

83) ఓం యోగిహృత్కమలవాసిన్యై నమః 

84) ఓం యోగధ్యాననిష్ఠాపరాయై నమః 

85) ఓం శ్రీపతిపాదకమలసేవితాయై నమః 

86) ఓం సకలదిక్పాలకపూజితాయై నమః 

87) ఓం కార్యసిద్ధికర్యై నమః 

88) ఓం మాదీఫలహస్తాయై నమః 

89) ఓం కంబుకంఠ్యై నమః 

90) ఓం ఆగతశరణాగతవత్సలాయై నమః  

91) ఓం సకలలోకసంచారిణ్యై నమః 

92) ఓం గంభీరమృదుభాషిణ్యై నమః 

93) ఓం నిగమాగమజ్ఞానప్రదాయిన్యై నమః 

94) ఓం భక్తజనపోషిణ్యై నమః 

95) ఓం నీలచికురాయై నమః 

96) ఓం అజ్ఞానాంధకారహారిణ్యై నమః 

97) ఓం సంగీతరసాస్వాదిన్యై నమః  

98) ఓం త్ర్యంబకసహోదర్యై నమః 

99) ఓం కమలేక్షణాయై నమః 

100)ఓం గోలోకవాసిన్యై నమః 

101) ఓం రాసేశ్వర్యై నమః 

102) ఓం ఉత్ఫుల్లముఖాంబుజాయై నమః 

103) ఓం అపరమితబలోత్సాహప్రదాయిన్యై నమః 

104) ఓం పాటలపారిజాతచంపకకేతకీపుష్పాలంకృతాయై నమః 

105) ఓం గురుగుహవందితాయై నమః 

106) ఓం గుహ్యాతిగుహ్యతత్త్వాత్మికాయై నమః 

107) ఓం గజాభిషేకాసక్తాయై నమః 

108) ఓం మాయాతీతస్వరూపిణ్యై నమః 

      సర్వం శ్రీలక్ష్మిదివ్యచరణారవిందార్పణమస్తు

Beautiful world



 

దేవతలు

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam --2 by Pujya Guruvulu 

Brahmasri Chaganti Koteswara Rao Garu


దేవతలు బ్రహ్మాండము బయటికి వెళ్ళి దాని కొరకు ఒక యజ్ఞము చేయాలని హిమాలయపర్వతముల మీద ఒక యజ్ఞప్రాంగణము ఏర్పాటు చెయ్యాలనుకున్నారు. భండుడికి ఎందరో గూఢచారులు ఉన్నారు. వాడు ఎక్కడ ఎవరు ఎలా కదిలినా పసికడతాడు. ఏమి చెయ్యాలని ఆలోచన చేసారు. శ్రీమహావిష్ణువు – ‘భండుడికి ఇతరులు భోగములు అనుభవించకూడదు, తానే అనుభవించాలని కోరిక కనక ఇంతకముందు వాడు కనీ వినీ ఎరుగని ఇద్దరు కాంతలను సృష్టించి వాడి దగ్గరకు పంపి వాడు వారితో రతికేళిలో మునిగి తేలుతూ ఉండగా మనము నిశ్శబ్దముగా ఎవరికీ తెలియకుండా హోమగుండము ఏర్పాటు చేద్దామ’ ని దేవతలను వెంట పెట్టుకుని బ్రహ్మాండము అంచు దగ్గరకు తీసుని వెళ్ళారు. బ్రహ్మాండము బయటకు వెళ్ళి అవతల ఉన్నవారిని ఆహ్వానించాలి. దేవతలు బ్రహ్మాండమునకు ఒక రంధ్రము చేసి వెళితే బయట ఎన్నో కోట్లబ్రహ్మాండములు ఉన్నాయి. ఎవరిని పిలవాలి? ఎవరు వచ్చి రక్షిస్తారు? పిలిస్తే వచ్చి శక్తిపుట్టేట్టుగా అనుగ్రహించే శంభుదేవుడిని ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా పలుకుతాడని దేవతలు శంభుదేవుని ఈ విధముగా ప్రార్థన చేసారు.  


జయఫాల నయన! శ్రితలోలనయన! శీతశైలశయన ! శర్వా !

జయ కాలకాల! జయమృత్యుమృత్యు ! జయ దేవదేవ శంభో! 

జయ చంద్రమౌళి ! నమదింద్రమౌళి మణిసాంద్రహేళి చరణా !

జయ యోగ మార్గ జితరాగదుర్గ ముని యాగ భాగ! భర్గా ! 

జయ స్వర్గవాసి మతివర్గ భాసి ప్రతి సర్గ సర్గ కల్పా !

జయ బంధు జీవ సమబంధు జీవ సమసాంధ్య రాగ జూటా !

జయ చండ చండతర తాండవోగ్ర భర కంపమాన భువనా ! 

జయ హార హీర ఘనసార సారతర శారదాభ్ర రూపా !

జయ శృంగి శృంగి శ్రుతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతీ 

జయ కాలకంఠ కలకంఠ కంఠసుర సుందరీ స్తుత శ్రీ !

జయ బావ జాత సమ ! భావజాత సుకళాజిత ప్రియాహ్రీ !

జయ దగ్ద భావ భవ ! స్నిగ్ధ భావ! భవ ! ముగ్ధ భావ భవనా ! 

జయ రుండమాలి ! జయ రూక్ష వీక్ష ! రుచిరుంద్ర రూప ! రుద్రా!

జయనాసికాగ్ర నయనోగ్ర దృష్టి జనితాగ్ని భుగ్న విభవా ! 

జయ ఘోర ఘోరతర తాప జాప తప ఉగ్ర రూపవిజితా !

జయ కాంతిమాలి ! జయ క్రాంతికేలి జయ శాంతిశాలి ! శూలీ !

జయ సూర్య చంద్ర శిఖి సూచనాగ్ర నయలోచనాగ్ర ! ఉగ్రా!

జయ బ్రహ్మ విష్ణు పురుహుత ముఖ్య సురసన్నుతాంఘ్రి యుగ్మా !

జయ ఫాలనేత్ర ! జయ చంద్రశీర్ష ! జయ నాగభూష ! శూలీ !

జయ కాలకాల ! జయ మృత్యుమృత్యు ! జయ దేవదేవ ! శంభో !     

పరమశివుని యొక్క గుణములు అన్నీ ఆవిష్కరిస్తూ దేవతలు చేసిన ప్రార్థన విని పరమశివుడు అక్కడకు వచ్చి మీకు కలిగిన ఆపద తీరాలి అంటే లలితాపరాభట్టారిక ఆవిర్భవించాలి. అందుకొరకు ఒక మహాయజ్ఞము చెయ్యాలి. శ్రీ మహావిష్ణువు భండుని మోహములో పడవెయ్యడానికి ఇప్పటికే ఇద్దరు కన్యలను సృష్టించారు. నిశ్శబ్దముగా హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి హోమము చేద్దాము అన్నాడు.


పెద్ద యజ్ఞకుండము తయారు చేసారు. అందులో అగ్నిరగిల్చి హవిస్సులు వేసి అమ్మవారిని పిలవాలి. భండుడు తెచ్చిన ఉపద్రవమునకు అగ్నిహోత్రము ప్రతిష్ఠించడానికి ఈ బ్రహ్మాండములో ఉన్న అగ్నిపనికిరాదు. శంభుదేవుడు –‘మనకి ఉండే గార్హపత్యాగ్ని, ఆవహనీయాగ్ని, దక్షిణాగ్ని పనికిరావు. బ్రహ్మాండమునకు చేసిన రంధ్రమునుంచి చిదగ్ని అనే అగ్నిని వాయురూపములో తీసుకుని వచ్చి ఆ వాయువును అగ్నికుండములో పెట్టి హవిస్సులు ఇవ్వడానికి అగ్ని రగిలిస్తాను. సామాన్యమైన పదార్థములు వేస్తే యజ్ఞముతో ప్రీతి చెందడానికి చాలాకాలం పట్టవచ్చు. భండుడు మేల్కొనే లోపల అమ్మవారి ఆవిర్భావము జరిగిపోవాలి. ఆర్తి ప్రకటనము జరిగి తొందరగా రావాలి. మీ శరీరభాగములను ఖండించి హవిస్సుగా సమర్పించండి. దేవతలు కనక మీ శరీర భాగములను కోసినంత మాత్రమున మీకు మృత్యువు రాదు. ఆర్తి ప్రకటనము జరిగి అమ్మవారు ఆవిర్భవిస్తుంది అన్నాడు. ‘అమ్మా ! నువ్వు ఆవిర్భవించాలి’ అని దేవతలందరితో కలిసి శంభుదేవుడు ప్రార్థన చేసాడు. 


విశ్వరూపిణీ ! సర్వాత్మే! విశ్వభూతైక నాయకి ! |

లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||

అనన్గరూపిణీ పరే ! జగదానందదాయిని ! |

లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||

జ్ఞాత్వ జ్ఞాన జ్ఞేయ రూపే ! మహాజ్ఞాన ప్రకాశిని |

లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||

లోకసంహార రసికే ! కాళికే ! భద్రకాళికే ! |

లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||

లోకసన్త్రాణరసికే ! మంగళే ! సర్వ మంగళే !   

లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||

విశ్వసృష్టి పరాదీనే ! విశ్వనాథే ! విశఙ్కటే ! 

లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||

సంవిద్వహ్ని హుతాశేష సృష్టి సమ్పాదితాకృతే ! |

లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||

భణ్డాద్వైస్తారకాద్యైశ్చ పీడితానాం సతాం ముదే ! |  

లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||


దేవతలు తమ శరీరఖండములనుకోసి హోమకుండములో వేస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తుంటే కంటితో చూడడానికి వీలుకాని పరబ్రహ్మస్వరూపిణి, మణిద్వీపములో కూర్చుని అన్ని బ్రహ్మాండములను శాసించకలిగి, కోట్ల బ్రహ్మాండములకు నాయకురాలయిన అమ్మవారు అనుగ్రహము కలిగి, ఈ బ్రహ్మాండములో హిమాలయ పర్వతముల మీద ఏర్పాటు చేసిన హోమకుండములోని చిదగ్నినుంచి అమ్మవారి ఆవిర్భావము ప్రారంభము అయింది. అమ్మవారు ఆవిర్భవిస్తున్న స్వరూపమును దేవతలు ప్రార్థన చేసారు. ఆవిర్భవించిన తరవాత ఏమి జరిగిందన్నది లలితాసహస్రనామ పూర్వభాగములో వివరణ ఇచ్చారు. దేవతా సైన్యములను, వారాహిని, శ్యామలాదేవిని, బాలాదేనిని, ఏనుగులను, గుఱ్ఱములను, సృష్టి చేసి, తనభర్తను మహా కామేశ్వరుడిగా స్వీకరించి, ఎలా యుద్ధము చేసింది? భండుని ఎలా చంపింది ? అన్న విషయములు తరవాత భాగములో వస్తాయి. దేవతలు భండాసురుని సంహరించిన తరవాత ప్రసన్నతను పొందారు. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

*పాప, పుణ్యకార్యాలు*



మానవులు ఎలాంటి పుణ్యకార్యాలనూ చేయడానికి ఇష్టపడరు. కాని పుణ్యఫలాన్ని మాత్రం ఆశిస్తారు. పాపఫలితాన్ని ఆశించరు. కాని పాపకార్యాలను మాత్రం ప్రయత్న పూర్వకంగానే చేస్తారు అని ధర్మనీతి శాస్త్ర నిర్వచనం. ఇంతకీ పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి?


"పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం" అంటే ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం.


పూర్వజన్మల్లో చేసిన పాప దోషాల వల్లనే ఈ జన్మలో శారీరక, మానసిక వ్యాధులు వచ్చి పీడుస్తున్నాయి అని మనం గ్రహించాలి. పాపం వల్లనే దుఃఖాలు వస్తాయి. పాపం లేనప్పుడు ఆనందం కలుగుతుంది. ఏ కొంచెం దుఃఖం కలిగినా అది పాపఫలమే కాక వేరొకటి కాదు.


పాపదోషం అనుభవించితే తప్ప పోదు. అడవుల్లో ఉన్నప్పుడు, యుద్ధంలో శత్రువుల మధ్య, నీటి మధ్య, అగ్నిమధ్య ఉన్నప్పుడు, సముద్రంలో సాగుతున్నప్పుడు, పర్వత శిఖరాలను ఎక్కుతున్నప్పుడు, నిద్రలో, అజాగ్రత్తలో, సంకట పరిస్థితులలో మానవుడిని తాను పూర్వ జన్మలో చేసిన పుణ్యాలే కాపాడతాయి


"ఇతరులు తనయందు ఏ విధంగా ప్రవర్తిస్తే, తన మనస్సు కలత చెందుతుందో అదే విధమైన ప్రవర్తనను ఇతరుల యందు నీవు కలిగి ఉండకపోవడమే అన్ని ధర్మాల్లోకి కూడా ఉత్తమమైన ధర్మం" అని విదురవాక్కు. పుణ్యం చేయడం చేతకాకున్నప్పుడు ఈ ధర్మాన్ని ఆచరిస్తే చాలు.


ఈ లోకంలో పుణ్యం కాని, పాపం కాని, ఇతరుల నుంచి మనం తీసుకోలేం. తాను చేసిన పాపకర్మ వల్లనే దుఃఖం కలుగుతుంది. తాను చేసిన పుణ్యకర్మ వల్లనే సుఖం కలుగుతుంది. ఈనాడు మనం నవ్వుతూ చేసిన పాపకర్మకి రేపు ఏడుస్తూ దుఃఖాన్ని అనుభవించక తప్పదనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే అవకాశం ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించాలి. భగవంతుని అనుగ్రహం పొందాలి.

*ఇంటింటి బ్రహ్మోత్సవాలు*

 


తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు శ్రీకారం చుట్టిన బ్రహ్మాండ నాయకుడి అద్భుత బ్రహ్మోత్సవ వేడుకలు నేడే ఆరంభమవుతున్నాయి. ఇవి వర్షాకాలంలో వచ్చే వార్షిక ఆవిర్భావ దినోత్సవాలు. శ్రీవారికి ఏటా జరిగే సుమారు 450 సంబరాల్లో ఇవే తలమానికాలు.


శ్రీ మహావిష్ణువు కన్యా మాసంలో శ్రవణా నక్షత్రం రోజున శ్రీ వేంకటపతిగా, శ్రీ స్వయంభువు మూర్తిగా ఆవిర్భవించాడని తిరుమల స్థల పురాణం చెబుతోంది. ‘వేంకట’ శబ్దానికి ‘సమస్త పాపాలను దహించేది’ అంటూ భవిష్యోత్తర పురాణం వ్యాఖ్యానం చేసింది. శ్రీవారి జన్మదిన వేడుకలను తొలుత బ్రహ్మదేవుడు నిర్వహించాడు కాబట్టి వీటిని ‘బ్రహ్మోత్సవాలు’ అనడం పరిపాటి.


ధ్వజం అంటే జెండా! బ్రహ్మోత్సవాల ఆరంభ సూచికగా విజయకేతనం ఎగురవేయడాన్ని ‘ధ్వజారోహణం’ అంటారు. వెండివాకిలి ఎదుట ధ్వజస్తంభంపై గరుడ కేతనాన్ని ఆవిష్కరించి- విద్యాధర, సిద్ధ, సాధ్య, యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వాదులను, దేవతాసమూహాలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. గరుడోత్సవంలో ప్రత్యేక అలంకారాలు విశేష ఆకర్షణలుగా నిలుస్తాయి. ‘ఆనందనిలయం’లో మూలవిరాట్టుకు అలంకరించే లక్ష్మీహారం, మకర కంఠి, సహస్రనామ హారం సహా ఎన్నో అమూల్య వజ్రాభరణాలను మలయప్పస్వామికి గరుడోత్సవం నాడే అలంకరించి ఊరేగిస్తారు. ఇక దేవేరులతో శ్రీవారు ఠీవిగా రథంలో విహరించేది తొమ్మిదో రోజున! శ్రీ వరాహస్వామి ఆలయప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి అభిషేకం, సుదర్శన భగవానుడికి స్వామిపుష్కరిణిలో పవిత్రస్నానం, గరుడధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.


గతంలో బ్రహ్మోత్సవాలకు హాజరైనప్పుడు సప్తగిరి శిఖరాలనుంచి జాలువారే సెలయేటి బిందువులన్నీ పవిత్ర తీర్థ జలాలై, మన భౌతిక మానసిక కక్ష్యలను ప్రక్షాళన చేసేవి. మాడవీధులను చుట్టుముట్టే ప్రతి గాలి తునకా అన్నమయ్య పాటమొలకై శ్రవణానందాన్ని కూర్చేది. దేహానికి బయటి, లోపలి ఆవరణలన్నింటా వినూత్న ఆధ్యాత్మిక చైతన్య విభూతి ఆవరించేది. జన్మజన్మాంతర దోషాలను సమూలంగా దహించేది. ‘అదివోఅల్లదివో శ్రీహరి వాసము, పదివేల శేషుల పడగల మయము...’ అంటూ వినసొంపుగా వినవచ్చే గానామృతం మరోవైపు ఆధ్యాత్మిక కక్ష్యను ఆప్యాయంగా అభిషేకించేది. అలా మూడు ఆవరణలు శుద్ధి అయిన మనకు తిరుమల క్షేత్ర విలక్షణ కాంతి పరివేషం- అన్నమయ్య చెప్పిన ‘సువ్రతస్థితి’ని అనుగ్రహించేది. ఆ స్థితిలో స్వామివారి దివ్య మంగళ దర్శనంతో భక్తుడి జన్మ ధన్యమైపోయేది.


తిరుమలలో బ్రహ్మోత్సవాలను తిలకించడమంటే జన్మ చరితార్థమేనని భక్తులు భావిస్తారు. కానీ ఈఏడాది మాత్రం కాలం కలిసి రాలేదు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే పరమ భక్తులకు సైతం ఈసారికి ప్రత్యక్ష ప్రసారాలను తిలకించి, పులకించి తరించవలసిన పరిస్థితి ఏర్పడింది.


స్వామి భక్తసులభుడన్న విషయం మరచిపోకూడదు. తన వద్దకు రాలేని భక్తుల కోసం శ్రీవారే దిగివచ్చి గుండెల్లో కొలువు తీరినట్లుగా భావించి దర్శించి సరిపెట్టుకోవలసిన సందర్భమిది. ఈ ఏడాది వీటిని ‘ఇంటింటి బ్రహ్మోత్సవాలు’ గాను, హృదయావిర్భావ దినోత్సవాలు గాను భావించాలి. ఈ పదిరోజులూ మన ఇల్లే తిరుమల కావాలి. మన హృదయాలు ఆనంద నిలయాలుగా మారాలి. ఆరాధనలు విలక్షణంగా సాగాలి. గుండె గుడిలో శ్రీవారిని దర్శించుకొని తృప్తిగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి.

రామాయణమ్.84

 

..

తలచుకుంటూ ఉంటే హృదయం బరువెక్కిపోతున్నది కౌసల్యకు.

తన పుణ్యాలప్రోవు ,తన వరాలమూట జగదేకవీరుడైన రాముడు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడనే ఆలోచన ఆవిడ గుండెల్ని పిండివేస్తున్నది ! 

దీనికి కారణం దశరధుడు !

తన భర్తయొక్క అనాలోచిత చర్య !

ఆవిడ బాధ అంతా దశరధుడి మీద కోపంగా మారిపోయింది..

.

రాజా నీకు మూడులోకాలలో కీర్తి ఉండిన ఉండవచ్చు కానీ నీవు చేసిన ఈ తెలివితక్కవ పనివలన అది అంతా తుడిచి పెట్టుకు పోయింది..

.

నీ కొడుకులిద్దరూ నీ పనికిమాలిన కోరిక వలన అడవులపాలైనారే !

కష్టమంటే ఏమిటో తెలియని రాకుమారులు అడవులలో క్లేశాలను ఎలా భరించగలరనుకొని పంపావయ్యా!

.

ఇంత వరకు భక్ష్య,భోజ్య,లేహ్య,చోష్య,పానీయాదులతో బహుపసందైన భోజనమారగించే ఆ జనకుడికూతురు అడవులలో దొరికే నివ్వరిధాన్యాలు,వెదురుబియ్యాలతో ఆకలి ఎలా తీర్చుకుంటుంది?

.

సుప్రభాతవేళలో మంగళవాయిద్యములను శ్రవణానందకరంగా వింటూ నిదురలేచే ఆ రాకుమారి నేడు అడవి అంతా ప్రతిధ్వనించే సింహశార్దూల గర్జనల భయంకరధ్వనికి ఉలిక్కిపడి నిదురలేవాలికదయ్యా! 

ఎంతటి దయమాలినవాడవయ్యా నీవు !  

.

పట్టుపరుపులమీద మెత్తని దిండ్లు తలగడగా పెట్టుకొని హాయిగా నిదురించే నా కుమారుడు నేడు పరిఘవంటి తన బాహువులనే తలగడగా పెట్టుకొని నిదురించాలి గదయ్యా! 

ఎంత తెలివిమాలినపనిచేశావయ్యా!.

.

నీవు సుఖం అనుభవించటానికి నాకొడుకులను సుఖానికి దూరంచేశావు కదా!.

.

రాముడు తిరిగి వచ్చినప్పుడు తన తమ్ముడు అనుభవించిన రాజ్యలక్ష్మిని తాను తిరిగి చేపడతాడా?

.

ఇంకొక మృగము ముట్టిన ఆహారము పెద్దపులి తాను ముట్టదు .

నరశార్దూలము నా రాముడు!

 వాడు ఇంకొకరిచేత ఎంగిలి చేయబడ్డ కూడు ఆశించడు.

.

ఆత్మాభిమానము కల రాముడు ఈ అవమానం సహించడు.

.

కేవలము తండ్రి అనే గౌరవముతో నిన్ను ఏమీ చేయలేదు.

వాడికోపము ముల్లోకాలను ముంచెత్తగలదు ! 

వాడి బంగరు బాణములు సకలభూతములను ప్రళయకాలములోని అగ్ని లాగా దహించివేయగలవు.

వాడి శస్త్రాస్త్రాలు మహాసముద్రాలనే ఇంకింపచేయగలవు,

వాడు కన్నెర్ర చేస్తే నీవెక్కడ ఉండే వాడివి?.

.

పెద్దపులి తోకను తాకితేనే తాకినవారిని నిలువునా చీల్చివేస్తుంది! ఈ అవమానము నా రాముడు భరింపగలడా?

.

చేపలు తమపిల్లలను తామే తింటాయి అలాగే నీ పిల్లల సౌభాగ్యాన్ని నీవే నాశనం చేశావుకదయ్యా!

.

వాడు ఏ నేరము చేశాడో చెప్పు ?

 ధర్మానికి కట్టుబడి నడుచుకోవటమే వాడి బలహీనత అయ్యింది నేడు !

 ధర్మమూర్తికి ఉత్తపుణ్యానికి రాజ్యబహిష్కరణ విధించి బికారిలాగ ఇంటినుండి వెడలగోట్టావు కదా! 

ఇది శాస్త్ర సమ్మతమేనా?! 

సనాతన ధర్మమేనా? !

.

పడతికి పతి,పుత్రుడు,జ్ఞాతి ఈ ముగ్గురే గతి ! 

మొదటి గతి, నీవా ఉండీ నాకు లేనట్లే

నా కొడుకును చూసుకొని ఉందామంటే వాడిని అడవులపాలుచేశావు! 

అన్ని విధాలుగా నన్ను గతిలేని దానిని చేశావు కదయ్యా అంటూ తన హృదయవేదనను బహిర్గతం చేసింది కౌసల్యామాత!


రామాయణమ్. 85

..

రాణీ కౌసల్య పేల్చేమాటల తూటాలు దశరధుడి హృదయకవాటాలను భేదిస్తున్నాయి.ఆవిడ పలికే ఒక్కొక్క పలుకు ములుకై గుండెలను గుచ్చుతున్నాయి.పాపం ముసలి రాజు తట్టుకోలేక పోతున్నాడు.ఇంద్రియాలు పట్టుతప్పుతున్నాయిమాటిమాటికి మూర్ఛిల్లుతు‌న్నాడు తేరుకుంటున్నాడు.

.

కౌసల్యా ! పూర్వమెప్పుడో నేను చేసిన పాపం నన్ను పట్టిపీడిస్తున్నది.నీ వంటి ధర్మదృష్టిగల వనితాశిరోమణి ,పెద్దచిన్నతారతమ్యము తెలిసినదానవు.నీవు ఎంత దుఃఖములో ఉన్నప్పటికీ భర్తను నిందించడం నీవంటిదానికి తగునా!.

.

పల్లెత్తుమాట ఏనాడూ తను తన భర్తను అని ఎరుగదు.

 ఈనాడు తనకీ దురవస్థ సంప్రాప్తించినదని ఇన్నిమాటలు అన్నానే ! అని ఒక్కసారిగా ఉబికిఉబికివచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ భర్తచేయిని తన తలమీద ఉంచుకొని, రాజా నీవు ఒక్కమాటతో నన్నుప్రాణములేని దానిని చేసి వేశావు గదయ్యా!.

నేను క్షమార్హము కాని అపరాధము చేసినాను.

.

మహారాజా నాకు ధర్మములన్నీ తెలుసు నీవు ధర్మము తప్పని వాడవనీ తెలుసు అయినా నన్ను ఆవరించిన శోకం నాలోని,ధైర్యాన్నీ,విజ్ఞతను,శాస్త్రపరిజ్ఞానాన్నీ, నశింపచేసినదయ్యా.శోకాన్ని మించిన శత్రువు లేదుకదా!

.

శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శృతమ్

శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమో రిపుః

.

శత్రువుకొట్టిన దెబ్బనైనా సహింపవచ్చును కానీ హఠాత్తుగా వచ్చిమీదపడిన శోకాన్ని అది ఎంత చిన్నదైనా కానీ తట్టుకోవడం కష్టం..

.

ఓ వీరుడా ! ధర్మవేత్తలూ,శాస్త్రజ్ఞులు,అన్నిసంశయాలు తొలగిన సన్యాసులు కూడా శోకాన్ని తట్టుకోలేరయ్యా!.

.

ఓ నా ప్రాణనాధా నాప్రియ పుత్రుడు అడవికి వెళ్ళి నేటికి అయిదవరోజు అయినా నాకు అయిదు సంవత్సరములవలే ఉన్నది.రాముడిని తలుచుకుంటున్నకొద్దీ నాలో దుఃఖము కట్టలు తెంచుకొంటున్నదయ్యా!.

.

వీరిలా మాటలాడుకుంటూనే ఉన్నారు .సమయమెంత గడిచిందో ఇరువురికీ స్ప్రుహలేదు.సూర్యకిరణాలవెలుగు మసకబారి రాత్రి వచ్చింది.శోకముతోటే నిద్రలోకి జారుకున్నాడు దశరధుడు.

ఆదిపర్వము – 24

 


మాండవ్య మహాముని వృత్తాంతం


అప్పుడు జనమేజయునకు ఒక సందేహం వచ్చింది.


“వైశంపాయన మునీంద్రా, యమధర్మ రాజుకు మాండవ్య మహర్షి శాపం ఎందుకు ఇచ్చాడు” అని అడిగాడు.


దానికి వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు.


మాండవ్యుడు అనే మహాఋషి ఉండేవాడు. ఆయన ఊరి వెలుపల ఒక ఆశ్రమం కట్టుకొని, ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు కొందరు దొంగలు రాజుగారి ధనాన్ని దొంగిలించి, సైనికులు వెంటపడగా పరుగెత్తుకుంటూ అటుగా వచ్చారు. అక్కడ ఉన్న ఆశ్రమం చూసి అందులో దాక్కున్నారు. సైనికులు వచ్చి మాండవ్యుని చూసి “అయ్యా, ఇటుగా ఎవరన్నా దొంగలు వచ్చారా” అని అడిగారు. మౌన వ్రతంలో ఉన్న మాండవ్యుడు జవాబు చెప్పలేదు.


సైనికులు ఆశ్రమం లో ప్రవేశించి, అక్కడ దాక్కున్న దొంగలను పట్టుకున్నారు. మాండవ్య మహా మునికి కూడా దొంగలతో సంబంధం ఉందని అనుమానించి దొంగలతో సహా మాండవ్య మహామునిని పట్టి బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు.


రాజుగారు ఆ దొంగలకు మరణశిక్ష విధించారు. సహాయం చేసినట్టు అనుమానిస్తున్న మాండవ్యునికి ఇనప శూలం మీద కూర్చోబెట్టమని శిక్ష విధించాడు. కాని మాండవ్యుడు ఆ శిక్షకు భయపడక, తపస్సు చేసుకుంటున్నాడు.


ఒకరోజు రాత్రి కొంతమంది మహాఋషులు పక్షుల రూపంలో వచ్చి మాండవ్యుని చూసి “ఓ మహర్షీ, మహానుభావుడైన నీకు ఈ శిక్ష వేసిన వారు ఎవ్వరు?” అని అడిగారు.


దానికి మాండవ్యుడు నవ్వి “నా పూర్వ జన్మ పాప ఫలాన్ని అనుభవిస్తున్నాను. దీనికి ఒకరిని నిందించ పనిలేదు” అన్నాడు.


ఈ విషయం అక్కడ కాపలా ఉన్న భటులు విని రాజుకు చెప్పారు. రాజుగారు వెంటనే అక్కడకు వచ్చి, మాండవ్యుని కిందికి దించమని ఆజ్ఞాపించాడు. కాని ఆ శూలం అతని శరీరం నుండి వెలుపలికి రాలేదు. అక్కడికి దానిని నరికించాడు. శూలంలో కొంతభాగం శరీరంలో మిగిలిపోయినందున మాండవ్య మహామునికి “అణి మాండవ్యుడు” అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. తరువాత ఆ మాండవ్యుడు యమపురికి వెళ్లాడు.


“యమధర్మ రాజా, మహారాజు నాకు అంతటి శిక్ష వెయ్యాడానికి నేనేమి తప్పు చేసాను?” అని అడిగాడు.


“మహామునీ, నువ్వు నీ చిన్నతనంలో తూనీగలను పట్టుకొని చిన్న చిన్న మేకులకు గుచ్చి ఆనందించావు. అందుకని ఆ ఫలం ఇప్పుడు అనుభవించావు” అని అన్నాడు యముడు.


దానికి మాండవ్యునికి కోపం వచ్చి “యమ ధర్మ రాజా, పిల్లలు 14 ఏళ్లు వచ్చేవరకు బాలురు అని పిలవబడతారు. ఆ వయసులో ఏదీ తెలిసి చెయ్యరు. కాబట్టి ఈ రోజు మొదలు 14 ఏళ్ల లోపు పిల్లలు ఏమి చేసినా అది తప్పు కాదు. పెద్దగా పాపం కాదు. కాని 14 ఏళ్ల లోపు పిల్లలకు ఏవరన్నా అపకారం చేస్తే అది పెద్ద తప్పు అవుతుంది” అని నిర్ణయం చేసాడు. (ఈ చట్టం ఈనాటికీ “Juvenile Act” గా అమలులో ఉంది).


“కానీ యమధర్మ రాజా, నేను బాల్యంలో చేసిన చిన్నపాటి తప్పుకు నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు. కాబట్టి నువ్వు శూద్ర యోని యందు జన్మించు” అని శాపం పెట్టాడు. అందుకని యమధర్మ రాజు వ్యాసుడి వలన, దాసీ దాని గర్భంలో నుండి విదురుడుగా జన్మించాడు” అని వైశంపాయనుడు జనమేజయునకు వివరించాడు.

పిసినారితో సమానుడైన దాత

 కృపణేన సమో దాతా న భూతో న భవిష్యతి

అస్పృశన్నేవ విత్తాని యః పరేభ్యః ప్రయచ్ఛతి



పిసినారితో సమానుడైన దాత ఇంతకుముందు పుట్టలేదు. ఇటుపైన పుట్టడు. ఎందుచేత ననగా అతడు తన ధనం ముట్టుకోకుండానే ఇతరులకు ఇచ్చేస్తాడు !


శుభోదయము !

14-22,23,24,25-గీతా మకరందము

 14-22,23,24,25-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అర్జునుని యా ప్రశ్నను విని భగవానుడు గుణాతీతుని లక్షణములను వివరముగ చెప్పుచున్నారు- 

 

శ్రీ భగవానువాచ — 

ప్రకాశం చ ప్రవృత్తిం చ 

మోహమేవ చ పాణ్ణవ| 

న ద్వేష్టి సమ్ప్రవృత్తాని 

న నివృత్తాని కాంక్షతి || 

 

ఉదాసీనవదాసీనో 

గుణైర్యో న విచాల్యతే | 

గుణా వర్తన్త ఇత్యేవ 

యోఽవతిష్ఠతి నేఙ్గతే ||

 

సమదుఃఖసుఖస్స్వస్థః సమలోష్టాశ్మకాఞ్చనః | 

తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిన్దాత్మసంస్తుతిః ||

 

మానావమానయో* స్తుల్యః 

తుల్యో మిత్రారిపక్షయోః | 

సర్వారమ్భపరిత్యాగీ 

గుణాతీతస్స ఉచ్యతే || 

 

తాత్పర్యము:- శ్రీ భగవానుడు చెప్పెను - ఓ అర్జునా ! ఎవడు తనకు సంప్రాప్తములైన సత్త్వగుణసంబంధమగు ప్రకాశమును (సుఖమును) గాని, రజోగుణసంబంధమగు కార్య ప్రవృత్తినిగాని, తమోగుణసంబంధమగు మోహమును (నిద్రా,తంద్రతలను) గాని ద్వేషింపడో, అవి తొలగిపోయినచో వానిని అపేక్షింపడో, తటస్థునివలె ఉన్నవాడై గుణములచేత (గుణకార్యములగు సుఖాదులచేత) చలింపజేయడో, గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలిసికొనియుండునో, (ఏపరిస్థితులయందును) చలింపక నిశ్చలముగ నుండునో, మఱియు ఎవడు సుఖదుఃఖములందు సమభావము గలవాడును, ఆత్మయందే స్థిరముగనున్నవాడును, మట్టిగడ్డ, ఱాయి, బంగారము - వీనియందు సమబుద్ధి గలవాడును, ఇష్టానిష్టములందు సమభావము గల్గియుండువాడును, ధైర్యవంతుడును, సమస్త కార్యములందును కర్తృత్వబుద్ధిని వదలువాడును, (లేక కామ్యకర్మలనన్నిటిని విడచువాడును, లేక సమస్తకర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్ఠయందుండు వాడును) అయియుండునో అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును.


వ్యాఖ్య:- గుణాతీతునియొక్క లక్షణము లిచట పేర్కొనబడినవి. ఈ లక్షణములను బట్టి మనుజుడు త్రిగుణములను దాటినది, లేనిది తెలిసికొనవచ్చును. గుణాతీతుడు తటస్థుడుగనుండుచు తనకు ఏ కారణముచేతనైనా, సత్త్వగుణసంబంధమైన ప్రకాశము (సుఖము) గాని, రజోగుణసంబంధమైన కార్యప్రవృత్తిగాని, తమోగుణసంబంధమైన మోహము (నిద్రాతంద్రతలు) గాని సంప్రాప్తించినచో వానియెడల ద్వేషముగాని, అవి తొలగినచో వానిని కోరుటగాని లేకుండును. గుణాతీతునియొక్క తాటస్థ్యమును, ఔదాసీన్యస్థితిని తెలుపుటకు ఈ విషయము బోధింపబడినదేకాని ఆ యా మోహాదిగుణములు అవలంబనీయములని తెలుపుటకాదు. మఱియు ఇచట మోహమనగా అజ్ఞానమని అర్థముకాదు. ఏలయనిన గుణాతీతునకు అజ్ఞానమెపుడో తొలగిపోయియుండును. భగవానుడు తెలిపిన ఈ గుణాతీతుని లక్షణములందు 'నిశ్చలత్వము', 'సమత్వము' అనునవి ప్రధానముగ గోచరించుచున్నవి -

(1) ‘నిశ్చలత్వము’ - ఏ చిన్న సంఘటన జరిగినను అజ్ఞాని బెదరిపోవును. తన సమత్వమును గోల్పోవును. కాని గుణాతీతుడు మేరుసమానగాంభీర్యముగలిగి, పరిస్థితులకు ఏమాత్రము చలింపకనుండును (న విచాల్యతే, నేఙ్గతే). శ్వాసవాయువు, లేక చిన్న అలలు పర్వతమును కదలింపజాలనట్లును, మేఘములకు పైనున్న సూర్యుని మేఘజనితములగు పిడుగులు, మెఱుపులు, వర్షము బాధింపజాలనట్లును, త్రిగుణములను దాటి మనస్సునకు ఆవలనున్న ఆత్మయందు నిలుకడగలిగియున్న యోగిపుంగవుడు ప్రపంచములోని ఏ సంఘటనచేగాని, ఆపత్తుచేగాని చలింపక సదా ఆత్మయందే సుస్థిరుడై యుండును. ఆ వికటపరిస్థితులన్నియు మనస్సునకు జెందినవి. గుణములకు సంబంధించినవి. ఉపాధికి జేరినవి. "నేను గుణములకంటె వేఱుగనున్నాను. మనస్సునకు అతీతుడనైయున్నాను" అని తలంచి యాతడు మహద్ధైర్యయుతుడై మెలగును. గుణాతీతునియొక్క గుఱుతు ఇదియే.


(2) సమత్వము - మానావమానములందు, నిందాస్తుతులయందు, సుఖదుఃఖము లందు, ఇష్టానిష్టము లందు, శత్రుమిత్రాదులందు, శిలాకాంచనములందు గుణాతీతుడగు మహనీయుడు సమబుద్ధి గలిగియుండును. గుణాతీతుడైన శుకమునీంద్రుడు జనకుని యాస్థానమున కేగినపుడు, ఆతని పరీక్షార్థము జనకునిచే కలుగజేయబడిన సుఖదుఃఖాదులందు ఆతడెంతటి సమత్వమునుజూపెనో ఈ సందర్భమున జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. అట్టి మహనీయులు నిరంతరము ఆత్మస్థితియందే (ధ్యేయాకారమందే, స్వవస్తువునందే) నిలుకడ గలిగియుందురు. కావున మిథ్యారూప ప్రపంచమునందలి ఇట్టి ద్వంద్వములు వారినేమియు చేయజాలవు. మఱియు నిందాస్తుతులు, సుఖదుఃఖములు మున్నగునవి మనోధర్మములే, కావున మనస్సాక్షియగు ఆత్మయందు సదా సుస్థితులైయుండు గుణాతీతులను, జ్ఞానులను అవి కదలింపజేయజాలవు. మఱియొకనికి కలుగు సుఖదుఃఖములు మనుజుని యెట్లు బాధింపజాలవో, అట్లే ఉపాధిని తనకంటె వేఱుచేసికొనిన జ్ఞానిని, గుణాతీతుని ఆ యా ద్వంద్వములు బాధింపజాలవు.


'సర్వారమ్భపరిత్యాగీ’ - ఈ పదమునకు "సమస్తకార్యములందును కర్తృత్వమును వదలినవాడ”ని అర్థము చెప్పుటయే సమంజసముగ నుండును. లేక, కామ్యకర్మలన్నిటిని వదలినవాడనియు చెప్పవచ్చును.లేక, ఇతరకార్యములన్నిటిని త్యజించివైచి నిరంతరము బ్రహ్మనిష్టయందుండువాడనియు పేర్కొనవచ్చును.


ఇట్టివాడు "యః” - ఎవడో 'సః' అతడు 'గుణాతీతః ఉచ్యతే’ గుణాతీతుడని చెప్పబడును - అని తెలుపుటవలన - అనగా యచ్ఛబ్ధప్రయోగము గావింపబడుటవలన ఎవరైనను సరియే ఆ స్థితిని బడయవచ్చుననియు, అట్లు (ప్రయత్నపూర్వకముగ) ఆ యా సద్గుణములను బడయువాడే గుణాతీతుడగునుగాని తక్కినవారు కారనియు స్పష్టమగుచున్నది. కావున సర్వులును అట్టి మహోన్నతస్థితికై యత్నించి కృతార్థత బడయవచ్చును.

 

ప్రశ్న:- గుణాతీతుని లక్షణములెవ్వి?

ఉత్తరము:- ఎవడు తనకు సంప్రాప్తించిన సత్త్వగుణసంబంధమగు ప్రకాశము (సుఖము)ను గాని, రజోగుణసంబంధమగు కార్యప్రవృత్తినిగాని, తమోగుణసంబంధమగు మోహము (నిద్ర, తంద్రత) ను గాని ద్వేషింపడో, అవితొలగిపోయినచో వానిని అపేక్షింపడో, తటస్థునివలెనుండి ఆ యా గుణకార్యములచే ఏ మాత్రము చలింపడో, గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలిసికొనియుండునో, ఏ పరిస్థితులందును చలింపడో, మఱియు ఎవడు ఆత్మయందే స్థిరముగ నుండునో, మట్టిగడ్డ, ఱాయి, బంగారములందు సమదృష్టిగలిగియుండునో, సుఖదుఃఖములందు, ఇష్టానిష్టములందు, నిందాస్తుతులందు, మానావమానములందు శత్రుమిత్రులయందు సమభావముగల్గి యుండునో, ధీరుడై వర్తించునో, సమస్త కార్యములందును కర్తృత్వము విడిచివేయునో (లేక కామ్యకర్మలన్నిటిని త్యజించివేయునో, లేక సమస్తకర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్ఠయందుండునో) అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును. కావున ఈసద్గుణములే గుణాతీతుని లక్షణములైయున్నవి.

~~~~~~~~~~~~~

* మానాపమానయోః - పాఠాంతరము.

. జడులై నాకముఁ

 🌺 *ఓం నమో నారాయణాయ* 🌺




*231. జడులై నాకముఁ గోలుపోవు సురలం జంభారినిం బ్రోవఁగా వడుగై భూమి బదత్రయం బిడుటకై వైరోచనిన్ వేఁడి రెండడుగుల్ సాఁచి త్రివిక్రమస్ఫురణ బ్రహ్మాండంబుఁ దా నిండుచుం గడుమోదంబున నుండు వామనున కెక్కాలంబునన్ మ్రొక్కెదన్."*



*భావము:* జంభాసురుని సంహరించిన ఇంద్రుడు, దేవతలు, అశక్తులై స్వర్గాన్ని ఓడిపోయారు. విష్ణుమూర్తి వారిని కాపాడటానికి వామనావతాం ఎత్తి, విరోచనుని కొడుకు బలిచక్రవర్తిని మూడు అడుగుల నేల దానం ఇమ్మని అడిగి పుచ్చుకున్నాడు. త్రివిక్రమావతారం ఎత్తి రెండు అడుగులు వేయడంతోనే బ్రహ్మాండం అంతా నిండిపోయి ఆనందంగా ఉండే ఆ వామనుడికి ఎప్పుడూ మ్రొక్కుతూ ఉంటాను."




*232. అని యిట్లు శుకుండు రాజునకు వామనావతారచరితంబు చెప్పె"నని సూతుండు మునులకుం జెప్పిన విని, వార లతని కిట్లనిరి.*




*భావము:* అని ఈ విధంగా శుకబ్రహ్మ పరీక్షిత్తు మహారాజునకు వామనావతార చరిత్రను చెప్పెను" అని సూతమహర్షి శౌనకాది మహర్షులకు చెప్పాగా వినిన వారు సూతునితో ఇలా అన్నారు.

*ఆచార్య సద్భావన*



తనను చూసి తానే జాలిపడటం అనారోగ్యకరం. అది ఆనందాన్ని పొందనీయక నిరోధిస్తుంది. ఆధ్యాత్మిక చైతన్యపు జాగృతి వలన కలిగిన ఆనంద మాధుర్యాన్ని చవి చూసిన వారిని ఎటువంటి కష్టాలు, కన్నీళ్ళు, దురదృష్టాలు, వైపరీత్యాలు కదపలేవు. భగవంతుని మరిచిపోవడమే గొప్ప ఆపద, తాను దివ్యత్వపు వారసుడినని విస్మరించడమే పెద్ద దురదృష్టం. మేధస్సు కానీ, లెక్కలు కట్టే బుద్ధిగానీ భగవంతుని పట్టుకోలేదు. భక్తి విశ్వాసాలతో నిండి ఉన్న హృదయం, స్వార్థ చింతన లేని హృదయమే తాను భగవంతుని చేత సదా పరి రక్షించబడుతున్నాననే సంగతిని గ్రహిస్తుంది.


అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.


*శ్రీమన్నారాయణా!*

మా జీవితాల్ని అణకువగా, శుద్ధంగా తీర్చిదిద్దుకునేలా అనుగ్రహించుము, మీ సత్య వీక్షణం అందుండి ప్రసరించి నలుదిశలా వ్యాపించనిమ్ము, శాశ్వతమైన మీ ఉనికికి మా హృదయాలను జోడించనిమ్ము, మీ యొక్క విశ్వవ్యాప్త భావజాలంతో మా ఆలోచనలను జోడించనిమ్ము, మీ ఇచ్ఛానుసారముగా మమ్మల్ని ప్రవర్తించనిమ్ము, మమ్మల్ని మీ ఉపకరణంగా మలచి కార్యాచరణాన్ని గావించుకొనుము.

సర్వేజనా సుఖినోభవంతు.


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు*

అష్టమహాదానాలని వేటిని అంటారు?

 🌹


వాటిని దానం చేయ‌డం వ‌ల్ల వ‌చ్చే ఫ‌లితాలు ఏంటీ?


సనాతన సంప్రదాయంలో అష్ట మహాదానాలకు విశిష్టమైన ప్రాధాన్యత వుంది. గరుడ

పురాణం ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి చక్కగా వివరించారు. నువ్వులు,

ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, భూమి, ఆవులను దానంగా ఇవ్వవచ్చు. ఇక ఎనిమిదో

దానం కింద ఏడు ధాన్యాలను చేర్చారు. ఇందులో గోధుమలు, కందులు, పెసలు,

శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు వున్నాయి. వీటిలో ఏదైనా ఒకటిని లేదా

అన్నింటినీ దానంగా ఇవ్వవచ్చు. నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి

ఉద్భవించాయి. నువ్వుల్లో మూడు రకాలుంటాయి. వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ

ఫలితాలుంటాయి.


ఇనుమును దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా వుండవచ్చని శాస్త్రం

తెలుపుతోంది. యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించివుంటారు. దీంతో ఇనుము

దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరు. భూమిని దానం చేయడం ద్వారా

సమస్తభూతాలు సంతృప్తి చెందుతాయి. సువర్ణదానం బ్రహ్మ, దేవతలు, మునీశ్వరులు

సంతోషించేందుకు దోహదపడుతుంది. పత్తిని దానం చేయడం ద్వారా యమభటుల భ‌యం

ఉండ‌దు. అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. గోదానంతో

వైతరిణి నదిని దాటిపోవచ్చు. ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయడం

ద్వారా యముడి నివాసానికి రక్షణగా వుండేవారు ఆనందిస్తారు.


ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు. ఉప్పు, నువ్వులు,

ధాన్యాలు, పత్తిని దానం చేయవచ్చు. ఈ దానాలను చేయడం ద్వారా లేనివానికి

మనకున్నంతలో ఇవ్వడమే అని పరమార్థం.

🌹

శ్రీ కృష్ణుడు నేర్పిన గుణపాఠం 🦚


ఒకసారి సత్య భామ శ్రీకృష్ణునితో

‘స్వామీ.. రామావతారం లో సీత మీ భార్యకదా! 

ఆమె నాకంటే అందంగా ఉండేదా?’ 

అని అడిగింది. 

ఆ సమయం లో అక్కడే ఉన్న గరుడుడు

‘ప్రభూ, 

నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా?’ 

అన్నాడు.

పక్కనే ఉన్న సుదర్శనుడు

(సుదర్శన చక్రం) 

కూడా.. ‘పరంధామా, 

అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.

నాతో సరి తూగు వారెవరు స్వామి’

అన్నది.

ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు.

దీర్ఘంగా ఆలోచించి..

‘సత్యా, నువ్వు సీతగా మారిపో.

నేను రాముణ్నవు తాను.

గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతా రాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా.

చక్రమా, 

నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు’ 

అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు. 

గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి.. 

సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు. 

హనుమ ఆనందంతో పుల కించిపోతూ..

‘నేను నీ వెనుకే వస్తాను. 

నువ్వు పద’ 

అని గరుత్మంతు ని సాగ నంపుతాడు. 

ఈ ముసలి వానరం రావడానికి ఎంత కాలమవు తుందో కదా అను కుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు. 

కానీ.. 

ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతు నికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు.

ఇంతలో..

‘హనుమా’

అన్నపిలుపు తో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు. 

‘లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా?’

అని అడగ్గా..

హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ

‘ప్రభూ, 

ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు.

ఎన్ని చెప్పినా వినక పోవడం తో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’

అన్నాడు సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానం తో నేల చూపులు చూస్తూ ఉండి పోయాడు. 

ఇంతలో హనుమంతు ని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్త్రీ 

పై పడి 

‘స్వామీ, 

మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా! 

ఎవ రీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువు గా సత్య భామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది. 

అలా కృష్ణపర మాత్ముడు, ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలు వేమిటో తెలియ చెప్పాడు

🌺💥పురాణ కథలు🌺💥



🌺అక్షరాలా దేహం ఓ వృక్షమే!🌻

 

మానవ దేహం వృక్షంతో సమానం. అది ఎలా? అనే విషయాన్ని వివరించి చెప్పేదే ఈ కథాసందర్భం. మహాభారతం అశ్వమేధపర్వం ముప్పైఅయిదో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విషయాలను వివరించి చెప్పాడు. మానవ దేహం అక్షరాలా ఓ వృక్షం లాంటిది. అజ్ఞానం అనేది ఈ వృక్షానికి మూలమైన బీజం. బుద్ధి దాని బోదె. అహంకారం ఆ చెట్టుకు ఉండే కొమ్మలు. ఇంద్రియాలు ఆ చెట్టు మానుకు ఉన్న తొర్రలు. పంచమహాభూతాలు ఆ వృక్షానికి ఉన్న విశేషమైన అవయవాలు. ఆ పంచభూతాల విశేష భేదాలు కొమ్మల నుంచి పుట్టుకొచ్చిన చిరుకొమ్మలు. ఈ కొమ్మలకు, చిరుకొమ్మలకు నిరంతరం సంకల్పాలు అనే ఆకులు పుడుతుంటాయి. కర్మలు అనే పూలు పూస్తుంటాయి. 

పిచ్చిమొక్కల్లా మిగలగూడదు..  

శుభ, అశుభ కర్మలవల్ల కలిగే సుఖదుఃఖాదులే ఆ చెట్టు పండ్లు. ఇలా బ్రహ్మరూపమైన బీజం నుంచి పుట్టుకొచ్చి ప్రవాహరూపంగా నిరంతరం ఉండే దేహం అనే వృక్షం జాగ్రత్తగా పరిశీలిస్తే అంత సామాన్యమైనదేమీకాదు. అది చాలా గొప్పదే. ఎందుకంటే అది ఎన్నెన్నో ప్రాణుల బతుకులకు ఆధారంగా ఉంటుంది. ఆ దేహమనే వృక్షతత్వాన్ని అందరూ గ్రహించగలగాలి. ఆ తత్వం అర్థం కావాలంటే సద్గురువుల ఉపదేశాలు అవసరం. అయితే ఒకసారి అలా ఉద్భవించిన దేహం సంసార సముద్రంలో పడి తాను, తనవాళ్లు అని కొట్టుమిట్టాడుతూ స్వార్థంతో నిండిపోతే కష్టమే. నిస్వార్థంగా నిజమైన చెట్టులాగా అందరికీ సహాయపడాలే తప్ప పిచ్చి మొక్కల్లాగా పనికిరాని తీరులోనూ అందరికీ ఇబ్బంది కలిగించే చెట్లలాగా మనిషి దేహం మారకూడదు. తన దేహం అలా మారుతోంది అని సందేహం కలిగినప్పుడు సద్గురువు సూచనల మేరకు జ్ఞానం అనే ఉత్తమ ఖడ్గాన్ని తీసుకొని అజ్ఞాటవు ఆలోచనలను నశింపచేసుకోవాలి. అప్పుడే మానవ దేహం అందరికీ నీడనిచ్చే మంచి చెట్టులాగా పేరు తెచ్చుకుంటుంది. అలా కానప్పుడు ముళ్లచెట్టులాగానో, పిచ్చిచెట్టులాగానో అందరి నిరాదరణకు గురవుతుంది. 

బ్రహ్మ చెప్పిన మంచిచెడ్డలు  

సనాతన జ్ఞానవిషయం ధర్మాన్ని అనుసరిస్తూ అలా మనిషి తన దేహాన్ని అన్ని ధర్మకార్యాలకు సాధనంగా వినియోగిస్తుండాలి. ఈ విషయం తెలిసిన వారే జీవితం ఫలవంతం చేసుకోగలరు. వారే విద్వాంసులు, సిద్ధులు అని పేరు పొందుతారు. పూర్వకాలంలో దక్షప్రజాపతి, భరద్వాజుడు, గౌతముడు, శుక్రుడు, వసిష్ఠుడు, కశ్యపుడు, విశ్వామిత్రుడు, అత్రి అనే మహర్షులు తమతమ మార్గాలలో పెద్దపెద్ద వృక్షాలు మానవాళికందించినంతటికీ సుఖాన్ని అందించారు. అయితే దేహమైనా, వృక్షమైనా కొద్దికాలంపాటే భూమ్మీద ఉండగలిగేది. కనుక కొంతకాలానికి వారికి అలసట వచ్చింది. అప్పుడు వారంతా కలిసి అంగిరస మునిని వెంటపెట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు. వెళ్లి అంతకాలంపాటు తామెన్నో పనులు చేశామని ఆ పనులన్నీ మంచివేనా? లేకపోతే శ్రేష్ఠకర్మ ఎలా చేయాలి? ఒకవేళ పాపం చేసి ఉంటే ఆ పాపం నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలను గురించి చెప్పమన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారందరికీ మంచి పనులు, పుణ్యకార్యాల విషయాలను తెలియచెప్పాడు. బ్రహ్మ చెప్పిన విషయాలతోపాటు తాము చేసిన పనులు సరిపోల్చుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని మళ్లీ సాగించారు ఆ రుషులు. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియచెప్పాడు. ఈ కథాసందర్భంలో గమనించాల్సిన విషయం ఒకటుంది. మనిషి నిస్వార్థంగా ఓ మంచి చెట్టులాగా అందరికీ సహాయపడుతూ ఉండాలి. ఎన్ని మంచి పనులు చేస్తున్నా చివరకు అనుభవజ్ఞుల దగ్గర తమ పనులను సమీక్షించుకుంటూ మంచి, చెడులను బేరీజు వేసుకుంటూ మందుకు నడవాలనే జీవన మార్గదర్శక సూత్రాన్ని ఈ కథాసందర్భం వివరిస్తోంది.

కోపం వచ్చినపుడు

 🕉️🌞🌎🏵️🌼🚩


*కోపం వచ్చినపుడు శ్వాసను,* 

 *ద్వేషం వచ్చినపుడు కనులను,* 

 *రాగం కలిగినపుడు మాటను* 

 *ఈర్ష్య కలిగినపుడు* *ఆలోచనలను అసూయ* *కలిగినపుడు ముచ్చట్లను* *మోహం కలిగినపుడు నీ* *దృష్టిని నియంత్రించు* 

 *నియంత్రించు* 

 *నియంత్రించు* 

 *ప్రయత్నిస్తుండు* 

 *వినోదమును నీవు విసర్జిస్తే అమృతం నిన్ను స్వీకరిస్తుంది.* 


 🕉️🌞🌎🏵️🌼🚩

వేణుమాధవుని ప్రేయసి

 🎻🌹🙏🙏🙏         

      వేణుమాధవుని ప్రేయసి...ఆరాధన...ఆమెయే రాధ...

చరిత పుటలలో ప్రేమకావ్యమై నిలిచిపోయె ఆమె గాథ...

మాధవుని పదాల రేణువైనా కావాలని, తపించి పోయిన యోగిని...రాధ...

తన కన్నుల గిన్నెలలో ఆ మోహనరూపాన్ని నింపేసుకోవాలని తాపత్రయం...

పరిణయానికి నోచకున్నా, ప్రణయానికి చిరునామాగా మారిన కథ...

ఆమె తనువంతా ఆయన వలపులే...మనసంతా అతని తలపులే...

ఆ మురళీగాన లాహిరిలో...ఆమె కన్నులెప్పుడూ అరమోడ్పులే...

జగతి దృక్కులలో స్వైరిణి అయితేనేమి, మాధవుని మనోహరిణి...

రాధ జీవనం మాధవుసన్నిధి లోని కొన్ని ఘడియల కాలమే...

మిగిలిన బ్రతుకంతా...ఆ మధుర క్షణాల మననమే...

రాధా మాధవ బంధం...అమలిన శృంగారానికి అద్వితీయ రాగబంధం...

అది రెండు ఆత్మలు ఏకమైన అనురాగసంగమం...ఎప్పటికీ అజరామరం..🙏🌹🎻

🙏 శ్రవణం🙏



ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రtవచనం చెప్తున్నారు. బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. 

"రామాయణం నీకేం అర్ధమైంది" అని అడిగింది భార్య

"నాకేం అర్ధం కాలేదు" అన్నాడు బండోడు.

 ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని బండోడు చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది. 

"ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా" అంది. 

బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయి లో నీళ్ళు నిలబడవు కదా. 

అలాగే తీసుకొచ్చాడు.భార్య మళ్ళీ తెమ్మంది. మళ్ళీ వెళ్ళాడు. అలా పది సార్లు తిప్పింది. 

"చూసావా.. ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు.అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు. 

నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది. 

అప్పుడు బండోడు అన్నాడు... "ఒసేయ్.. గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే... కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రం పడిందికదా.. 

అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పదిరోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది" అన్నాడు. 

భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది. 

నవ విధ భక్తి మార్గాల్లో "శ్రవణం" ఒకటి.

*🌻. గురువు 🌻*

 .




గురువనగా అయస్కాంతము. శిష్యుడనగా ఇనుప ముక్క. అయస్కాంతపు సాన్నిధ్యముచే ఇనుపముక్క అయస్కాంతము అగుచున్నది.ఇనుమునకు అయస్కాంతము సాన్నిధ్యము ఇచ్చినదే కాని అయస్కాంత తత్త్వమును ధారపోయలేదు. 


అట్లే గురువు శిష్యునకు తన భావములను, నమ్మకములను, ఆచారములను రుద్దడు. రుద్దుట రాజకీయ లక్షణము అది పార్టీలు, మతములు మార్చుటకు పనికి వచ్చును. కాని శిష్యుని గురువుగా సృష్టించుటకు పనికిరాదు. జీవునికి దైవముగా రెండవజన్మము ఇచ్చుటకు పనికిరాదు. 


ఇనుములో అయస్కాంత ధర్మము నిద్రాణమై యున్నది. దానిని మేల్కొలుపుటకు మాత్రమే అయస్కాంతము తన సాన్నిధ్యమును ప్రసాదించును. అట్లే గురువు ప్రయోగించినది ఉద్బోధము (Induction) అను ప్రక్రియే గాని, బోధ (Conduction) అను పద్ధతి కాదు..


🌹 🌹 🌹 🌹 🌹

🌹మనదేవాలయాలు🌹

 


  🚩🚩🚩🚩🚩🚩🚩


*శ్రీకూర్మం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్*


విష్ణువు దశావతార రూపుడన్న విషయం మనకు తెలిసిందే. ప్రతి రూపానికి సంబంధించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేవాలయాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే ఒకే ఒక రూపానికి సంబంధించి ప్రపంచంలో ఒకే దేవాలయం ఉంది. అదే కూర్మావతారానికి సంబంధించిన దేవాలయం. మేరు పర్వతంతో సముద్రాన్ని చిలికే సందర్భంలో ఆ పర్వతం సముద్రంలో మునగకుండా కాపాడటానికి విష్ణువు కూర్మం (తాబేలు) రూపం దరించాడని చెబుతారు. ఆ కూర్మం రూపానికి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాకుళం జిల్లాలో శ్రీకూర్మం అనే గ్రామంలో ఉంది. ఇందుకు కారణం ఈ కథనంలో తెలుస్తుంది. అదే విధంగా ఈ దేవాలయంలోని పుష్కరిణిలో శ్రీకృష్ణుడు స్నానం చేశాడని ఆ పుష్కరిణిలో మనం కూడా స్నానం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్మకం.


శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో కూర్మావతారం (తాబేలు) రెండోది. మిగిలిన అన్ని అవతారాలకు సంబంధించిన ఆలయాలు ప్రపంచం అంతటా ఉన్నాయి. అయితే కూర్మావతారానికి సంబంధించి ప్రపంచంలో ఒకే ఒక ఆలయం ఉంది. అది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాకుళం జిల్లాలో శ్రీకూర్మం అనే గ్రామంలో ఉంది.


ప్రస్తుతం శ్రీ కూర్మం ఉన్న ప్రాంతానికి కొంత దూరంలో శ్వీతపురమనే పట్టణం ఉండేది. దానిని రాజధానిగా చేసుకుని శ్వేతచక్రవర్తి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్యపేరు విష్ణప్రియ. విష్ణుభక్తురాలైన ఆమె ఏకాదశి వ్రత దీక్షలో ఉంటుంది. ఆమె భర్త కామమోహితుడై విష్ణుప్రియ దగ్గరకు వస్తాడు. అప్పుడు విష్ణుప్రియ భర్తను ఒక చోట కుర్చోబెట్టి పూజా మందిరంలోకి పోయి విష్ణువును ధ్యానిస్తుంది.


‘స్వామీ అటు నా భర్తను కాదనలేను. ఇటు నీ వ్రతాన్ని భంగపడనివ్వలేను. నన్ను నీవే కాపాడాలి.' అంటూ వేడుకుంటుంది. దీంతో శ్రీమన్నారయణుడు దర్శనమిచ్చి అక్కడ గంగను ఉద్భవింపజేస్తాడు. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వైపు ప్రయాణిస్తుంది. దీంతో రాజు భయపడి శ్రీ కూర్మం దగ్గరగా ఉన్న ఒక పర్వత పై భాగానికి చేరుకుంటాడు.


అనంతరం తన తప్పును తెలుసుకుని అటుగా వచ్చిన నారదుడిని సహాయ అడుగుతాడు. నారదుడు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశిస్తాడు. దీంతో రాజు మంత్రాన్ని పట్టించి గంగను శాంతిపజేసి సముద్రంలో వంశధార పేరుతో కలిసి పోతుంది. అలా కలిసే సాగర సంగమంలో రాజు స్నానం చేసి విష్ణువును ప్రార్థించగా స్వామి నాలుగు చేతులు, శంఖం, చక్రం, గద, పద్మములతో ప్రత్యక్షమవుతాడు.


రాజు తన తప్పును మన్నించాల్పిందిగా కోరడమే కాకుండా ఇక పై ఇక్కడే కూర్మం రూపంలో ఉండిపోవాలని అభ్యర్థిస్తాడు. దీంతో విష్ణువు శ్రీ కూర్మ రూపంలో మహాలక్ష్మి సమేతుడై ఇక్కడ ఉన్న పుష్కరిణిలో ఉండిపోతాడు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఓ బోయ యువతి ఆమె భర్త బిల్లురాజు అటుగా వచ్చినప్పుడు పుష్కరిణిలో దివ్వమైన వెలుగు కనిపిస్తుంది.


అంతలోనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ దంపతులకు దర్శనమిస్తాడు. అటుఅక్కడకు వచ్చిన శ్వేతరాజు జరిగిన విషయం బిల్లురాజుకు తెలియజేస్తాడు. దీంతో తమ జీవితం ధన్యమయినట్లు ఆ దంపతులు భావిస్తారు. అటు పై పుష్కరిణికి పశ్చిమదిక్కులో నివాసం ఏర్పరుచుకొని స్వామికి సేవలు చేయడం ప్రారంభిస్తాడు.


అంతే కాకుండా తన నివసం పశ్చిమ దిక్కుగా ఉంది కాబట్టి మీరు కూడా పశ్చిమాభిముఖంగానే ఉండాలని స్వామిని దంపతులు వేడుకుంటారు. అందువల్లే స్వామి పశ్చిమాభిముఖంగా ఉంటాడని పురాణ కథనం వివరిస్తుంది.


ఇక ఈ ఆలయ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఆలయంలోనూ గర్భగుడి మధ్యభాగంలో మూలవిరాట్ ఉంటాడు. అయితే ఈ ఆలయంలో మాత్రం గర్భగుడి ఎడమవైపు గోడకు ఒక మూలగా శ్రీ కూర్మనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు కనిపిస్తాడు. ఇటువంటి విధానమే మనం తిరుమల గర్భగుడిలో చూడవచ్చు.


ఆలయంలో ఒక అడుగు ఎత్తు, ఐదు అడుగుల పొడవు, నాలుగుల వెడల్పు ఉన్న రాతిపీఠం పై కూర్మనాథస్వామి దర్శనమిస్తాడు. మొదట తల, మధ్యలో శరీరం చివరగా తోక మూడు భాగాలుగా మనం కూర్మనాథున్ని దర్శించుకోవచ్చు.


గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోకి భక్తులను అనుమతించడం విశేషం. ఇటు వంటి సంప్రదాయం మరే ఇతర వైష్ణవాలయంలోనూ కనిపించదు. విగ్రహం పశ్చిమాభిముఖంగా ఉండటమే కాకుండా రెండు ధ్వజస్థంభాలు కలిగి ఉంటుంది.


ఈ విధంగా గర్భగుడిలోని మూలవిరాట్టు పశ్చిమాభిముఖంగా ఉండటం, దేవాలయాల్లో రెండు ధ్వజస్థంభాలు ఉండటం ప్రపంచంలో అతి కొన్ని చోట్ల మాత్రమే మనం చూడవచ్చు. రోజు వారీ అభిషేకం నిర్వహించే అతి తక్కువ విష్ణు దేవాలయాల్లో శ్రీ కూర్మనాథస్వామి దేవాలయం కూడా ఒకటి.


సాధారణంగా విష్ణు దేవాలయాలకు రోజు వారి అభిషేకం నిర్వహించడం అరుదుగా జరుగుతుంది. అజంతా ఎల్లోరా గుహల మాదిరిగా ఇక్కడ కుడ్యచిత్రాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా లక్షల ఏళ్ల క్రితం నాటివి. అయినా ఇప్పటికీ చెక్కచెదరకుండా ఉన్నాయి.


దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న ప్రపంచంలోని రెండవ దేవాలయం ఇదే. మరొకటి భారత దేశంలోని జమ్ము కాశ్మీర్ లో ఉంది. ఈ దేవాలయంలో ఉన్న 108 రాతి స్థంభాలు ఒక్కదానికొకటి పోలిక లేకుండా ఉంటాయి. ఏ రెండు రాతి స్థంభాల పై శిల్పాలు కూడా ఒకే విధంగా ఉండవు.


శ్రీకూర్మనాథ స్వామి దేవాలయంలో ఒక స్వరంగ మార్గం ఉంది. దీని ద్వారా వారణాసి చేరుకోవచ్చునని చెబుతారు. అయితే దీనిని ప్రస్తుతం మూసి వేశారు. వారణాసి, పూరీల వలే మరణించిన వారి అంతిమ కర్మలను ఇక్కడ నిర్వహిస్తారు. దీని వల్ల వారికి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.


ప్రపంచంలో మరెక్కడా కూడా కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువునకు దేవాలయం లేకపోవడానికి శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముని శాపమే కారణమి పురాణాలు చెబుతున్నాయి. అందులో ఉన్న వివరాలను అనుసరించి ద్వాపర యుగం చివరిలో బలరాముడు శ్రీకాకుళం దగ్గర్లో ఉమారుద్రకోటేశ్వర లింగం ప్రతిష్టింపచేస్తాడు.


అటు పై తీర్థయాత్రల్లో భాగంగా శ్రీ కూర్మం వస్తాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు బలరాముడిని అడ్డగిస్తాడు. దాంతో ఆగ్రహం తెచ్చుకున్న బలరాముడు భైరవుడిని గిరగిర తిప్పి అవతలికి విసిరేస్తాడు. ఇది తెలిసిన కూర్మనాథ స్వామి స్వయంగా ప్రత్యక్షమయ్యి బలరాముడికి దర్శనభాగ్యం కలిగించాడు.


అయినా కోపం చల్లారని బలరాముడు ప్రపంచంలో ఇక్కడ మాత్రమే శ్రీ మహా విష్ణువుకు దేవాలయం ఉండాలని మరెక్కడా ఉండకూడదని శాపం పెట్టాడు. అందువల్ల ప్రపంచంలో ఇక్కడ మాత్రమే కూర్మావతర రూపంలో శ్రీ మహావిష్ణువు మనకు కనిపిస్తాడు.


ఇక శ్రీ కూర్మంలోని పుష్కరిణిలో అడుగు భాగంలోని మట్టి తెల్లగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి జలక్రీడలు ఆడారని అందువల్ల ఆ మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనినే గోపీ చందనం అని కూడా అంటారు. దీనిని నుదుట దరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని అందం పెరుగుతుందని స్థానికులు చెబుతారు.


శ్రీకాకుళం పట్టణం నుంచి ప్రతి 15 నిమిషాలకు అరసవిల్లి మీదుగా ఇక్కడకు బస్సులు ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8. గంటల వరకూ ఇక్కడ ప్రయాణ సదుపాయం బాగా ఉంటుంది. బస మాత్రం శ్రీకాకుళంలోనే ఏర్పాటు చేసుకోవడం మంచిది.


     🌹సర్వేజనాసుఖినోభవంతు🌹