19, సెప్టెంబర్ 2020, శనివారం

ఉత్తరావృత శంఖం, ఉత్తరావృత శంఖం విశేషాలు

పాంచజన్యం ఉత్తరావృత శంఖం

భగవాన్‌ శ్రీకృష్ణపరమాత్ముడి శంఖం పాంచజన్యం. ఆయన ఈ శంఖాన్ని కురుక్షేత్ర యుద్ధంలో పూరించేవాడు. వసుదేవుడు బలరామ , కృష్ణులకు గర్గాచార్యుడనే పురోహితుడి ద్వారా ఉపనయనం చేయించాడు. అనంతరం ఆచార్యులు వారికి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బలరామ కృష్ణులను సాందీప మహాముని ఆశ్రమానికి తీసుకువెళతారు. ఆ ఆశ్రమంలో అన్ని విద్యలను ఆచార్యుల వారు వారికి బోధించారు. ఈ ఆశ్రమంలోనే కుచేలుడు  కృష్ణునికి స్నేహితుడిగా పరిచయమవుతాడు.

కొంతకాలం అనంతరం శిక్షణ ముగియడంతో బలరాముడు , కృష్ణుడు ఆచార్యులకు ప్రణమిల్లి గురుదక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించమని కోరతారు. వీరు సామాన్యులు కాదని వైకంఠం నుంచి భువిపై అవతరించిన వారని తన దివ్యజ్ఞానంతో సాందీపుడు తెలుసుకొంటాడు. తన మరణించిన కుమారుడిని తిరిగి బతికించమని కోరతాడు. గురుపత్ని శోకాన్ని నివారించినట్టు అవుతుందని వారికి సూచిస్తాడు.

గురుకుమారుడు కొంతకాలం క్రితం సముద్రస్నానం చేస్తూ భారీ అల రావడంతో కడలిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆ సముద్రతీరానికి వెళ్లిన బలరామ కృష్ణులు గురుకుమారుడిని తిరిగివ్వమని సాగరుణ్ని కోరారు. సాక్షాత్తు నారాయణుడే తన దగ్గరకు రావడంతో సముద్రుడు వారికి వినమ్రంగా నమస్కరించి ‘గురుపుత్రుడిని మింగింది పంచజనుడనే రాక్షసుడనీ , కడలి గర్భంలో దాగి వున్నాడనీ’  వెల్లడిస్తాడు. దీంతో వారు సముద్రంలోపలికి వెళ్లి పంచజనుడితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తారు. అనంతరం అతని కడుపును చీల్చిచూడగా గురు కుమారుడు కనిపించడు. ఒక శంఖువు మాత్రమే కనిపిస్తుంది. శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. గురుకుమారుడు నరకంలో వున్నాడని గ్రహించిన వారు అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఆ శంఖువును పూరిస్తాడు కృష్ణుడు. ఆ శబ్దానికిభీతిల్లిన యమధర్మరాజు అక్కడకు చేరుకొని ఇద్దరినీ తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేసి ఎందుకొచ్చారో తెలుసుకుంటాడు. భగవంతుని ఆజ్ఞ కావడంతో వెంటనే సాందీపుని కుమారుడిని వారితో పంపిస్తాడు. మునికుమారుడిని వెంటబెట్టుకొని ఆశ్రమానికి చేరుకుంటారు. మృతుడైన తమ కుమారుడు తిరిగి రావడంతో సాందీప దంపతులు ఎంతో సంతోషిస్తారు. పంచజనుడి నుంచి తీసుకున్న శంఖం కనుకనే దానికి పాంచజన్యం అని పేరొచ్చింది.


#శంఖం  ప్రాముఖ్యత


దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. ఉత్తరావృత శంఖానికి ఎడమప్రక్క ఆవృతం(కడుపు) ఉంటుంది. శంఖాన్ని తూర్పుదిక్కుకి పట్టుకున్నప్పుడు ఉత్తరం వైపు ఆవృతం ఉంటుంది.

కాబట్టి ఈ శంఖాన్ని ఉత్తరావృత శంఖం అంటారు. విజయానికి సంకేతంగా శంఖాన్ని పూరిస్తారు. శంఖ ధ్వని విజయానికి , సమృద్ధికి, సుఖానికి , కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక.

ఉత్తరావృత శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు.

ఉత్తరావృత శంఖాన్ని ఊదటం కేవలం ఆద్యాత్మికపరమైన ప్రయోజనాలే కాకుండా శాస్త్రీయ మరియు ఆయుర్వేద ప్రయోజనాలు కూడా ఉంది. శంఖాన్ని ఊదినప్పుడు స్వచ్చమైన గాలి ఊపిరితిత్తులకు చేరుతుంది. మలినాలతో కూడిన గాలి బయటకు వస్తుంది. ఉత్తరావృత శంఖాన్ని ఊదటం వలన ఊపిరితిత్తుల వ్యాదులు నశించటమే కాకుండా ప్రేగులకు సంబందించిన వ్యాదులు నివారణవుతాయి. ఎవరికైనా మాటలు తడబడటం , నత్తి , గొంతు సంబంద సమస్యలు ఉన్నవారు ఉత్తరావృత శంఖాన్ని పూరించిన , ఉత్తరావృత శంఖ ద్వని విన్న గొంతు సంబంద వ్యాదులు నివారణవుతాయి. ఆస్తమా ఉన్నవారు క్రమం తప్పకుండా ఉత్తరావృత శంఖాన్ని పూరించినట్లైతే వ్యాది నుండి నివారింపబడతారు.

శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం ఉత్తరావృత శంఖ ధ్వని వల్ల వాతావరణంలో హాని చేసే కీటకముల నాశనం జరుగుతుందని - అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు.  జర్మన్ శాస్త్రవేత్తల ప్రయోగాల పలితంగా ధైరాయిడ్ , హార్మోన్ లోపాల వంటి వ్యాదులు నివారింపబడతాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు.

ఆశ్చర్యకరంగా కొన్ని ప్రాంతాలలో శంఖాన్ని పూరించినప్పుడు వెలువడే శబ్ధ కెరటాలు పరిసరాల్లో నివసించే ప్రజలకు ప్లేగు , కలరా వంటి వ్యాదులు ప్రబలవని నమ్ముతారు. ఉత్తరావృత శంఖాన్ని పూరించిన ఇంటిలో గాని , వ్యాపారసంస్ధలలో గాని నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉత్తరావృత శంఖాన్ని పూజ మందిరంలో గాని , ఇంటికి ఉత్తర దిక్కున గాని ఉంచిన సమస్త వాస్తు దోషాలు నశిస్తాయి.

కామెంట్‌లు లేవు: