8, ఆగస్టు 2021, ఆదివారం

దేవుడు ఎంత గొప్పవాడో

 దేవుడు ఎంత గొప్పవాడో… ఒకసారి పరిశీలిద్దాం...


                  *నిరాశ వద్దు!*

                  ➖➖➖


*"ఛీ"!!!*

*చచ్చిపోతే_బాగుండు ...నాలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు....* 

*అర్థంచేసుకొనేవారు కూడా ఎవరూ లేరు...*

*చనిపోవడం బెటర్ అని ఆలోచిస్తూ...*


*చాలా ఏళ్లగా తీవ్రమైన సమస్యలతో సతమతమౌతున్న ఒక యువకుడు విసిగి వేసారి, అన్నీ విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు...!!!*


*అన్నీ అంటే...???*


*ఉద్యోగం...తనని నమ్మిన కుటుంబాన్నే కాక తాను నమ్మిన దైవాన్ని, చివరికి దేవుడిచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించు కున్నాడు.*


*చివరిగా ఒక్కసారి దేవునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక ప్రాంతంలో దేవునితో ఇలా మాట్లాడతాడు...*


*"దేవుడా ! నేను ఇవన్నీ విడిచి పెట్టకుండా ఉండడానికి కారణం ఒక్కటి చెప్పగలవా ?" అని అడుగుతాడు.*


*దానికి దేవుడు వాత్సల్యంగా.. "నాయనా! ఒక్కసారి నీ చుట్టూ చూడు ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి.., వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా?"*


*"అవును... కనిపిస్తున్నాయి."*


*"నేను... ఆ గడ్డి విత్తనాలు... వెదురు విత్తనాలు... నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను... గాలి, నీరు సూర్యరశ్మి ... అవసరమైనవి అన్నీ అందించాను."*


*”గడ్డి వెంటనే మొలకెత్తింది. భూమి పై పచ్చని తివాచి పరచినట్టుగా! కానీ వెదురు మొలకెత్తనే లేదు. కానీ నేను వెదురును విడిచిపెట్టనూలేదు... విస్మరించనూలేదు...”*


*“ఒక సంవత్సరం గడిచింది, గడ్డి మరింత ఎత్తుగా ఒత్తుగా పెరిగింది అందంగా ఆహ్లాదంగా... కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు రెండు, మూడు , నాలుగు సంవత్సరాలు గడిచాయి ...!”*


*”వెదురు మొలకెత్తలేదు కానీ నేను అప్పటికి వెదురును విస్మరించలేదు...!”*


*”ఐదవ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది...!”*


*”గడ్డి కన్నా ఇది చాల చిన్నది!”*


*”కానీ ఒక్క ఆరు నెలలలో అది వంద అడుగుల ఎత్తు ఎదిగింది ...అందంగా బలంగా ...!”*


*”ఐదు సంవత్సరాలు అది తన వేళ్ళను భూమి లోపల పెంచుకుంది బలపరచుకుంది...!”*


*”పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్ళు ముందు సంపాదించాయి... ఆ బలం వాటికి లేకపోతె వెదురుమనలేదు (నిలబడలేదు).”*


*”నా సృష్టిలో దేనికీ కూడా అది ఎదుర్కోలేని సమస్యను నేనివ్వను...!”*


*”ఇన్నాళ్లూ నువ్వు పడుతున్న కష్టాలన్నీ , ఎదుర్కుంటున్న సమస్యలన్నీ నీ వేళ్ళను (మానసిక స్థైర్యాన్ని ) బలపరుస్తూ వచ్చాయి...!”*


*”వెదురు మొక్కను విస్మరించలేదు..!నిన్నుకూడా విస్మరించను... ఒకటి, నిన్ను నువ్వు ఇతరులతో ఎన్నటికీ పోల్చుకోకు..!”*


*”రెండూ, అడవిని అందంగా మలచినప్పటికీ ...గడ్డి లక్ష్యం వేరు .. వెదురు లక్ష్యం వేరు ...!”*


*”నీసమయం వచ్చ్చినప్పుడు నువ్వూ ఎదుగుతావు...!!!"*


*"దేవుడా...! మరి నేను ఎంత ఎదుగుతాను??"*


*"వెదురు ఎంత ఎదిగింది?"*


*“అది ఎంత ఎదగగలదో అంత ఎదిగింది."*


*నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు..*


**దేవుడు ఎప్పుడూ... ఎవరినీ ... విస్మరించడు... విడిచిపెట్టడు...!*


**మనం కూడా దేవునిపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని మన ప్రయత్నాన్నీ ఎన్నటికీ విడిచిపెట్టకూడదు...! ఆయన మన చేయి విడువక మంచి స్నేహితునిగా మనలను అర్థం చేసుకుంటాడు...!”*


*”ధైర్యంగా ఉండండి.. ! తప్పక దేవుని సహాయాన్ని అందుకుంటారు.”*


*నీ సమస్య ఎంత పెద్దదో దేవుడికి చెప్పకు...నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ సమస్యకు చెప్పు.!!!*


. 🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

మూత్రములో మంటను నివారించుటకు

 మూత్రములో మంటను నివారించుటకు సులభయోగాలు -


 * వేపపండ్లు దొరికే కాలంలో వాటిని విరివిగా వాడుతున్న మూత్రవిసర్జనలో మంట తగ్గును.


 * దువ్వెన ఆకుల కషాయం పూటకు పావుకప్పు మోతాదులో ప్రతిపూటా తీసుకొంటుంటే త్వరగా తగ్గును. రోజుకు రెండుసార్లు శుభ్రమైన తుమ్మజిగురు చింతగింజ అంత ఒక కప్పు నీటిలో కలుపుకుని తాగుచున్న త్వరగా తగ్గును.


 * ఒక కప్పు పాలలో పచ్చి గరిక ముక్కలు రెండుచెంచాలు వేసి మరిగించి తాగాలి . అలా రోజుకు రెండుసార్లు చేస్తుంటే బాధ తగ్గును.


 * ప్రతినిత్యం రెండుపూటలా గుప్పెడు చింతచిగుళ్ళు తింటుంటే మంట త్వరగా తగ్గును. చింతాకు రసం రెండు చెంచాలు రెండుపూటలా తీసుకొనుచున్న మంట అద్భుతంగా తగ్గును.


 * కర్బుజా పండు గింజలను నూరి చెంచాడు తినాలి. ఉదయం , సాయంత్రం అలా చేస్తుంటే బాధ సులువుగా తగ్గును.


 * మామిడి జీడి చూర్ణాన్ని అర చెంచా అరకప్పు పెరుగుతో కలిపి తినాలి. అలా ప్రతిపూటా తింటుంటే మూత్రవిసర్జనలోని మంట త్వరగా తగ్గును.


 * బెండకాయను చిన్న ముక్కలుగా కోసి గ్లాసుడు నీళ్లలో గుప్పెడు ముక్కలు వేసి అరగంట పాటు మరిగించాలి. తీపికోసం కొంచం పంచదార కలిపి పూటకు అరకప్పు ఆ నీరు తాగాలి. అలా ప్రతిరోజూ తయారుచేసుకొని దానిని మూడుపూటలా తాగాలి. అలా రెండురోజులు చేసేసరికి మూత్రవిసర్జనతో ఏ బాధా ఉండదు. చాలా సులువుగా మూత్రం పోతుంది . లింగ , వృషణాలు , యోని , శరీరంలో అన్ని రకాల బాధలు అతి త్వరగా తగ్గును.


          నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

శ్రావణమాసం -- మహత్తరమైన ఫలితాలు


శ్రావణమాసం -- మహత్తరమైన ఫలితాలు

1. ఈ మాసమంతా ఏకభుక్త వ్రతం ఆచరించినట్లైతే బంధువులలో విశేషమైన పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని మహాభారతం తెలియచేస్తోంది.


2. శ్రావణమాసంలో వస్త్రదానం చేసిన వారికి మహత్తరమైన ఫలితాలు కలుగుతాయని దానమయూఖం తెలియచేస్తోంది.


3. ఈ మాసంలో శ్రీధర ప్రీతిగా ఆవునెయ్యిని, ఆవుపాల కడవను దానం ఇవ్వాలని వామన పురణం చెబుతోంది.


4. శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువుకు ఆవునెయ్యి, వరిపేలాలు నివేదన చేయడం వలన లక్ష్మీప్రాప్తి కలుగుతుందని పద్మపురాణం తెలుపుతోంది.


5. శ్రావణంలో శివపూజ మహా విశేషం: ఈ మాసామంతా నక్తవ్రతాన్ని ఆచరింస్తూ శివ ప్రీతిగా మాసం చివరిలో తెల్లని వర్ణం కలిగి ఎర్రని మచ్చలు గల ఆవును.. కాని ఎద్దుని కాని బ్రహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేయడం వలన కైలస ప్రాప్తి కలుగుతుందని శివధర్మపురాణం.


6. ఈ మాసంలో అమ్మవారికి పెరుగుని నివేదన చేయడం వలన దేవీ అనుగ్రహం లభిస్తుంది.


7. మహాలక్ష్మీ అనుగ్రహాన్ని అందించే ఈ మాసమంతా లక్ష్మీనారాయణహృదయ స్తోత్రన్ని పారయణ చేసినటైతే స్థిరమైన సిరిసంపదలు కలుగుతాయి. ( ప్రతి రోజు ప్రాతఃకాలంలో శంకరభగవత్పాదాచార్య కృత కనకధార స్తోత్రాన్ని


పారాయణ చేయడం కూడా మహాలక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది.)

8. ఈమాసంలో చేసే శ్రీచక్ర దర్శనం, శ్రీచక్రపూజ అక్షయమైన పుణ్యాన్ని


9. శ్రావణ సోమవారం: శ్రావణ సోమవారాలు పూర్తిగా ఉపవసించడంగాని లేక కేవలం రాత్రి నక్షత్రాలు వచ్చే వరకు నిరాహారంగా ఉండి శివారాధన చేసాక భోజనం చేయడం చేయాలి. కార్తీక సోమవారాలు లాగానే శ్రావణ సోమవారాలు కూడా పరమ పవిత్రమైనవి. కాశివంటి పుణ్యక్షేత్రాలలో విశేష పూజలు చేస్తారు. ఆక్రమంలో ఈ రోజున మొదటి శ్రావణ సోమవారం.

*ఆషాఢ అమావాస్య

 🌑 *ఆషాఢ అమావాస్య!!*

*హిందూ ధర్మచక్రం* 🌑


🌚 ఆషాఢ మాసపు అమావాస్యను నక్షత్ర అమావాస్య, చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య నాడు దేవతలను ఒక్కసారి తలచినా, పూజించినా వేయి జన్మలు విడువకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది. పితృశ్రాద్ధం, దానం, హోమం చేస్తే అక్షయఫలం లభిస్తుంది. 


🌚 పితృదేవతలు సోమపథం అనే లోకంలో నివసిస్తుంటారు. వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు. వీరికి అగ్నిష్వాత్తులు అని పేరు. వీరి మానసపుత్రిక పేరు అచ్ఛోద. ఈమె నదీరూపంలో కూడా ప్రవహించేది. ఒకప్పుడు ఈమె వెయ్యేళ్ళు స్త్రీ రూపంలో, తానే నదీ రూపంలో ప్రవహిస్తున్న తన తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకోమన్నారు. వారంతా మారు రూపాలలో, దివ్యరూపాలలో ఉన్నారు. అందులో ఒకాయన "మావసుడు". 


🌚అచ్ఛోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని వరం కోరింది. తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ అయిపోయింది. కాని మావసుడు మాత్రం ఆమెను ఏమాత్రం కామించలేదు. మావస్య కాలేదు కనుక ఆమెకు అమావాస్య అని పేరు వచ్చింది. అనగా మావసునికి ప్రియురాలు కానిది అని అర్థం. ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ఆమె పేరుతో అమావాస్యా తిథిని ఏర్పాటు చేసి ఆరోజు పితృతర్పణాలు ఇచ్చే వారికి అనంత సుఖాలు ఇస్తామని వరాలిచ్చారు. 


🌚అచ్ఛోద మానవ స్త్రీ అయిపోయి పితృదేవతలను కరుణించమని కోరగా, వారు ఇరువది ఎనిమిదవ ద్వాపరంలో చేప కడుపు నుండి పుట్టి మత్స్యగంధిగా, సత్యవతిగా పరాశరుని వల్ల కృష్ణ ద్వైపాయన మునిని పుత్రునిగా పొంది, కన్యగానే ఉంటావనీ, శంతనమహారాజ పత్నివౌతావనీ, ఆపై వ్యాసుని వల్ల తరిస్తావని వరమిచ్చారు. ఆమెయే సత్యవతిగా జన్మించింది. (బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు కవయిత్రి శ్రీమతి శ్రీ విద్యగారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించబడినది. )


🌟 *ఆదివారం, ఆగష్టు 8, 2021* 🌟

        *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*

      *దక్షిణాయనం - గ్రీష్మ ఋతువు* 

      *ఆషాఢ మాసం - బహుళ పక్షం*

తిధి : *అమావాస్య0* సా6.45

             తదుపరి శ్రావణ శుక్ల పాడ్యమి 

వారం : *ఆదివారం* (భానువాసరే)

నక్షత్రం : *పుష్యమి* ఉ9.46

              తదుపరి ఆశ్రేష 

యోగం : *వ్యతీపాతం* రా1.07

               తదుపరి వరీయాన్ 

కరణం : *చతుష్పాత్* ఉ6.36

                తదుపరి *నాగవ* సా6.45

              ఆ తదుపరి కింస్తుఘ్నం

వర్జ్యం : *రా11.00 - 12.40* 

దుర్ముహూర్తం : *సా4.46 - 5.37* &

                       *మ12.31 - 1.22*

అమృతకాలం: *లేదు*

రాహుకాలం : *సా4.30 - 6.00* 

యమగండం/కేతుకాలం: *మ12.00 - 1.30*

సూర్యరాశి: *కర్కాటకం* || చంద్రరాశి: *కర్కాటకం*

సూర్యోదయం: *5.44* || సూర్యాస్తమయం: *6.28*

 👉 *సర్వ అమావాస్య*

  *పాతార్క యోగం* *పుష్యార్క యోగం*


🙏సర్వే జనా *సుజనో* భవతూ!

సర్వ *సుజనా* సుఖినో భవతూ!!🙏

         🙏 *శుభమస్తు* 🙏

_______________________________   

                 *గోసేవ చేద్దాం*               

           *గోమాత ను పూజిద్దాం*                                                

        *గోవులను రక్షించు కుందాం* 🙏 *ఓం గౌమాత్రే నమః* 🙏

బ్రహ్మములో చరించు

 ఓ మనసా ! బ్రహ్మములో చరించు ... 

ఎవని కేశములు నెమలి పించముతో అలంకరించబడి ఉన్నవో, ఎవని అందమైన చేక్కిళ్ళు దర్పణ సౌందర్యమును మించి యున్నవో అట్టి బ్రహ్మములో రమించుము.


సదాశివ బ్రహ్మేంద్రస్వామి కీర్తన:-

మానస సంచరరే బ్రహ్మణి

మానస సంచరరే బ్రహ్మణి

మానస సంచరరే యే..యే..


అను పల్లవి :

మధ శిఖి పింఛా అలంకృత చికురే

మహనీయ కపోల విచిత ముఖురే

మానస సంచరరే యే..యే..


చరణం :

శ్రీరమణి కుచ దుర్గ విహారే

సేవక జన మందిర మందారే

పరమ హంస ముఖ చంద్ర చకోరే

పరి పూరిత మురళీ రవధారే

మానస సంచరరే యే..యే..


భావము:

ఓ మనసా! బ్రహ్మములో చరించుము.


1. ఎవని కేశములు నెమలి పించముతో అలంకరించబడి ఉన్నవో, ఎవని అందమైన చేక్కిళ్ళు దర్పణ సౌందర్యమును మించి యున్నవో అట్టి బ్రహ్మములో రమించుము.


2. లక్ష్మీదేవి యొక్క కుచదుర్గముల యందు విహరించువాడును, సేవకులైన భక్తులకు కల్పవృక్షము వంటివాడును అగు బ్రహ్మములో చరించుము.


3. చంద్రకిరణములతో తృప్తిచెందు చకోరమువలె పరమహంసల మొగముల యందు వెలుగు దివ్యప్రకాశములో రమించువాడును, వేణువు ద్వారా సదా మధురనాదమును పలికించువాడును అగు బ్రహ్మములో రమించుము.


రచన: సదాశివ బ్రహ్మేంద్రస్వామి

పాడినవారు : Kum. Sivasri Skandaprasad


సదాశివ బహ్రేంద్ర ఒక యోగి, కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, అద్వైత తత్వవేత్త. 18 శతాబ్దంలో తమిళనాడులోని కుంభకోణం వద్ద జీవించారు. ప్రధానంగా సంస్కృతంలో అతను రచనలు ఉన్నాయి. ఈ స్వరసృష్టిలోని ఇప్పటికి కొన్ని మాత్రమే మిగిలి ఉన్నా, వాటిని కర్ణాటక సంగీతంలో అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు.


మోక్ష సోమసుందర అవధాని, పార్వతి అనే తెలుగు దంపతులకు సదాశివ జన్మించారు. అతను తొలి పేరు శివరామకృష్ణ. 17 ఏటనే వివాహమైంది. 17 - 18 శతాబ్దాల మధ్య తమిళనాడులోని కుంభకోణంలో జీవించారు. మరో ఇద్దరు ప్రముఖ హిందు ఆధ్యాత్మిక వేత్తలు శ్రీధర వేంకటేశ అయ్యాళ్, శ్రీ బోధేంద్ర సరస్వతి వేదపాఠశాలలో సదాశివకు సహచరులు.


సత్యాన్వేషణకై ఇంటిని వదిలి వేశారు. సన్యాసం స్వీకరించిన తరువాత దిగంబరంగా, అర్ధనగ్నంగా పరధ్యాన స్థితిలో తిరిగేవాడు. విపరీత వైరాగ్యంతో సమాధి స్థితిలో ఉండేవాడు. పరమహంస యోగనంద "ఒక యోగి ఆత్మకథ"లో అతను జీవ సమాధి ఉదంతాన్ని సంగ్రహంగా ప్రస్తావించడం జరిగింది. అతను ఆత్మ విద్యా విలాసం వేరిట ఒక అద్వైత గ్రంథాన్ని కూడా రచించారు.అతను జీవించి ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలను చేసాడని ప్రతీతి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రమే ఈ కింద ఉదహరించడం జరింగింది.


ఒకసారి ఒక ధాన్యపు కుప్పల వద్ద ధ్యానం చేసుకుంటున్నాడు. అతనును దొంగగా భావించి ఒక రైతు కొట్టేందుకు కర్రను ఎత్తగా శిలలా నిల్చిపోయాడు. మర్నాటి ఉదయం తన ధ్యానం ముగిశాక సదాశివ రైతును చూసి చిరునవ్వు నవ్వగా మళ్లీ మామూలు మనిషి అయ్యి క్షమాపణ కోరాడు.


మరోసారి, కావేరి నది ఒడ్డున ధ్యానంలో మునిగి ఉండగా అకస్మాత్తుగా వరదలు వచ్చి కొట్టుకుని పోయారు. కొన్ని వారాల తర్వాత కొంత మంది మట్టిని తవ్వుతుండగా సదాశివ దేహం తగిలింది. బయటకు తీయగా అతను లేచి నడచి వెళ్లి పోయారు.


ఇవి జరిగిన చాలాకాలం తర్వాత అతనును ప్రజలు మరిచిపోయే దశలో అతను మళ్లీ కనిపించారు. బ్రహ్మము తప్ప మరేమీ పట్టని పరధ్యాన స్థితిలో దిగంబంరంగా శరీరస్పృహలేకుండా తనకు ఎవరు ఎదురు వస్తున్నారో, ఎటు వెళ్తున్నారో తెలియకుండా ఒక నవాబు గారి అంతఃపురంలో అటుఇటూ తిరుగుతుండగా అంతఃపుర వాసులు గమనించి నవాబుకు తెలిపారు. అతనును పట్టుకోమని నవాబు పురమాయించగా సైనికులు అతను రెండు చేతులను నరికి వేశారు. చేతులు రాలాయి. సదాశివలో మార్పు లేదు. అలా పరధ్యానంగా నడుస్తూనే ఉన్నారు. ఇది నవాబుకు తెలిపారు. తప్పు తెలుసుకుని పశ్చాత్తాపచిత్తుడై నవాబు రెండు చేతులను తీసుకుని సదాశివకు ఎదురు వెళ్ళి ఆ చేతులను అర్పించారు. అంతే రెండు చేతులూ తిరిగి అతుక్కున్నాయి. సదాశివ నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. 


పుదుకొట్టాయ్ రాజు తొండైమన్ ను కలిసి అతనుకు దక్షిణామూర్తి మంత్రం ఉపదేశించారని కథనం. సదాశివ ఇసుకలో దక్షిణామూర్తి మంత్రాన్ని రచించగా ఆ ఇసుకను రాజు తీసుకున్నాడు. ఇప్పటి వరకు పుదుకొట్టాయ్ రాజభవనంలోని దక్షిణామూర్తి ఆలయం ఆ రాజుల అధీనంలోనే ఉంది.


తంజావూరు సమీపంలోని పున్నైనల్లూర్ మరియమ్మన్ దేవతను ఇతనుే ప్రతిష్ఠించారు. కామాక్షి దేవాలయంలోని దేవదనపట్టి విగ్రహ స్థాపనకు మార్గనిర్దేశనం చేశారు. తంజావూరులోని నాలుకాల్ మంటపం వద్ద ఉన్న ప్రసన్న వెంకటేశ్వరం ఆలయంలో ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

కుంభకోణం వద్ద తిరునాగేశ్వరం రాహుస్థలంలో గణపతి విగ్రహాన్ని, శక్తిమంతమైన గణపతి యంత్రాన్ని స్థాపించారు. ఈ విషయం ఆలయశాసనంలో లిఖితమై ఉంది.


#మానససంచరరే #manasaSancharare #SivasriSkandaprasad

#సదాశివబ్రహ్మేంద్రస్వామి #SadasivaBrahmendraSwamy

#IndianClassicalMusic #CarnaticMusic

హనుమంతుని దివ్య చరిత్ర

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁హనుమంతుని దివ్య చరిత్ర

        బ్రహదేవుడు దేవతలను వెంట దీసుకుని వాయుదేవుని గుహ వద్దకు వెళ్ళాడు. తన పుత్రుని మ్రుత్యువు కారణంగా వాయుదేవుడు వ్యాకులచిత్తుడై ఉన్నాడు. అప్పటికి శిశువు దేహాన్ని తన చేతుల్లోకి ఉంచుకుని ఉన్నాడు. వాయుదేవుడు తనకు ప్రణామాలు చేసిన మీదట బ్రహ్మదేవుడు వాత్సల్యముతో తన హస్తాన్ని వానరశిశువు శిరస్సుపై ఉంచి తక్షణమే అతణ్ణి పునరుజ్జీవుతుడిని చేశాడు.

        తన పుత్రుడు పునరుజ్జీవించగానే వాయుదేవుడు సకల ప్రాణుల్లోనూ తన సంచారాన్ని పునరుద్ధరించాడు. దానితో ప్రాణులంతా తిరిగి ఆనందభరితులైనారు. అంతట బ్రహ్మదేవుడు సమావేశమైన దేవతలతో 'భవిష్యత్తులో ఈ శిశువు మీ శ్రేయస్సు కోసం పనిచేస్తాడు. అందువల్ల మీరంతా అతనికి వరాలు ప్రసాదించాలి' అని చెప్పాడు.

           బ్రహ్మదేవుని ఆదేశాన్ని విన్న ఇంద్రుడు తన పద్మహారాన్ని తీసి హనుమంతుని మెడలో వేశాడు. 'తన హనువు(దవడ) భగ్నమైన కారణంగా ఈ శిశువును ఇక నుంచి హనుమంతుని గా పేరు గాంచుతాడు. ఇకమీదట ఇతను నా వజ్రాయుధానికి భయపడవలసిన పనిలేదు. ఎందుకంటే ఇతనిమీద దాని ప్రభావం పని చేయదు' అని ఇంద్రుడు ప్రకటించాడు.

         సూర్యుడు 'ఇందుమూలంగా నా తేజస్సులో ఒక శాతాన్ని హనుమంతునికి ప్రధానం చేస్తున్నాను. అంతేగాక ఇతనికి పరిపూర్ణమైన వేదశాస్త్ర పరిజ్ఞానాన్ని, అద్భుతమైన వాక్పటిమను కూడా ప్రసాదిస్తున్నాను'అని ప్రకటించాడు.

         అంతట యమధర్మరాజు' హనుమంతుణ్ణి నా మ్రుత్యుదండము ఏమీ చేయదని, ఏ వ్యాధిగాని అతనికి సోకదని ఇందుమూలంగా వరమిస్తున్నాను' అన్నాడు.

        కుబేరుడు' నా గద హనుమంతునిమీద ప్రభావం చూపకుండుగాక! అతను యుద్ధంలో ఎన్నటికీ అలసట చెందకుండుగాక'అని ప్రకటించాడు.

        పరమశివుడు హనుమంతునికి ఎన్నటికీ నావల్ల గానీ, నా ఆయుధాలు వలన గానీ మరణం లేకుండా వరమిస్తున్నాను' అన్నాడు.

        విశ్వకర్మ 'నాచేత రూపొందించిన ఏ ఆయుధం వల్ల గానీ మ్రుత్యువు కలుగకుండా హనుమంతునికి వరమిస్తున్నాను' అని ప్రకటించాడు.

        చివరగా బ్రహ్మదేవుడు' నేను హనుమంతునికి దీర్ఘాయువును, ఔదార్యాన్ని ప్రసాదిస్తున్నాను. బ్రహ్మాస్త్రంగాని, బ్రాహ్మణులు శాపాలుగాని అతనిమీద ప్రభావం చూపకుండా వరమిస్తున్నాను'అన్నాడు.

         అంతట బ్రహ్మదేవుడు వాయుదేవుని తో' ఈ బిడ్డ తాను కోరుకున్న విధంగా తన రూపాన్ని మార్చుకోగల కామరూపి మరియు అజేయుడు అవుతాడు. తాను కోరుకున్న ఏ చోటు కైనా తాను తలచుకున్న ఎంత వేగంతో నైనా ప్రయాణించగలుగుతాడు. భవిష్యత్తులో రావణుని వినాశనానికి దోహదం చేయగల మహిమాన్వితమైన కార్యాలను చేస్తాడు. అలా అతను శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు'అని చెప్పాడు.

శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కేనోపనిషత్తు

 కేనోపనిషత్తు సారాంశము


ప్రశ్న:- కేనేషితం పతతి ప్రేషితం మనః


మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను,చెవుల వెనుక ఉన్న దేవత ఎవరు?


జవాబు:


1. శ్రోతస్య శ్రోత్రం (చెవితో చూద్దాం) ఆత్మ వేరు, చెవి వేరు. ఆత్మ చెవి అంతటా వ్యాపించి ఉంది.


ఆత్మ ఉండటం వల్లే చెవిని చెవి అనగలుగుతున్నాము. అంటే చెవితో వినగలుగుతున్నాము.


ఇదే సూత్రం మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవులకు వర్తిస్తుంది.


2. న తత్ర చక్షుర్గచ్ఛతి న వాగ్గచ్ఛతి నో మనః మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవుల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. 3. యద్వాచానభ్యుదితం యేన వాగభ్యుద్యతే


మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవుల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. కాని మనస్సు, ప్రాణం, వాక్కు కన్ను, చెవులు ఆత్మ వల్లనే పని చేస్తున్నాయి. 4. అన్యదేవ తద్విదితాదథో అవిదితాదధి


ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు.


దీని అర్థం- ఎ) ఆత్మ తెలియబడే వస్తువు (ఆబ్జెక్టు) దు - ప్రమేయం కాదు. బి) ఆత్మ తెలుసుకునే నేను - ప్రమాతా అయిన నేను.


సి) ఆత్మ ప్రమాతృత్వం లేకపోయినా ఉంటుంది. అది శుద్ధ చైతన్యం. 5. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే -


ఆత్మ ఆబ్జెక్టు కాదు కాబట్టి, సగుణ రూపంలో కొలిచే దేవుడు ఆత్మ కాదు. సాక్షి చైతన్యమైన నేనే ఆత్మను.


ఆత్మ అనుభవం


ఆత్మ అనుభవం పొందలేము.కేనోపనిషత్తు


ఆత్మ అనుభవం పొందనవసరం లేదు.


ఎందుకంటే అది నువ్వే. ఎవ్వర్ ది ఎక్స్ పీరియన్సర్, నెవ్వర్ ది ఎక్స్ పీరియడ్. అనుభవించే నువ్వే ఎప్పటికీ, అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ. యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూంషి పశ్యతి ఆత్మను కన్నుతో చూడలేము కాని కళ్ళు ఆత్మ వల్లే పనిచేస్తున్నాయి ప్రతిబోధ విదితం మతం


ఆత్మ అనుభవం పొందలేము కాని ప్రతి అనుభవమూ ఆత్మ వల్లే పొందుతున్నాము.


ఆత్మజ్ఞానం


ఆత్మ అంటే అనుభవించబడే వస్తువు కాదు. ఆత్మ అంటే అనుభవించే నేనే. నేను అంటే సాక్షి చైతన్యాన్ని, ఆత్మజ్ఞానం పొందటం అంటే వృత్తిలో మార్పు.


ఆత్మ అనుభవం కోసం ప్రయత్నించకూడదు. ఆత్మ వల్లే అన్నీ అనుభవిస్తున్నాము. ఆ ఆత్మను నేనే అని పదునైన బుద్ధితో అర్థం చేసుకోవటమే ఆత్మజ్ఞానం,


ఆత్మజ్ఞానం పొందిన విద్యార్థి స్పందన


1. నాకు బ్రహ్మ తెలుసు అనను 2. నాకు బ్రహ్మ తెలియదు అనను అంటే- బ్రహ్మను ఆబ్జెక్టుగా చూస్తే తెలియదని నాకు తెలుసు. బ్రహ్మను సబ్జెక్టుగా తెలుసుకోవాలని నాకు తెలుసు. బ్రహ్మ ఎవరికి తెలియదో, వారికి తెలుసు.


3. నాకు తెలుసు


దీన్నే ఉపనిషత్తు మళ్ళీ చెపుతుంది.


140


4. నాకు తెలియదు


బ్రహ్మ ఎవరికి తెలుసో, వారికి తెలియదు.కేనోపనిషత్తు


తెలిసిన వారికి తెలియదు.


తెలియని వారికి తెలుసు. అంటే బ్రహ్మను ఆబ్జెక్టుగా


చూసేవారికి తెలియదు. బ్రహ్మను సబ్జెక్టుగా తెలుసుకునేవారికి తెలుసు.


యక్షుని కథ వల్ల వచ్చిన 6 సందేశాలు 1. బ్రహ్మ అస్తి- యక్షుడు కనబడ్డాడు. ఉపాసనలు 1. విద్యుత్ ఉపాసన


2. బ్రహ్మణః దుర్విఘ్నేయం- వాయువు, అగ్ని తెలుసుకోలేకపోయారు. అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము.


3. జ్ఞానయోగ్యతా అపేక్షః- గర్వం ఉండకూడదు. శ్రద్ధ, భక్తి,శరణాగతి కావాలి. ఇంద్రుడు శరణు వేడాడు.


4. గురు అపేక్ష:- గురువు ద్వారానే నేర్చుకోవాలి. ఉమాదేవి గురువుగా వచ్చింది. 5. బ్రహ్మవిద్యాస్తుతిః - బ్రహ్మ విద్య పొందిన ఈ ముగ్గురు దేవతలూ ఖ్యాతిని పొందారు.


6. ఉపాసనవిధి అంగత్వం - ఈ కథకు అనుగుణంగా కొన్ని ఉపాసనలు చెప్పబడ్డాయి.


2. నిమేష ఉపాసన అధి దైవ ఉపాసనలు 3. వృత్తి ఉపాసన 4. బ్రహ్మ మహిమ ఉపాసన గుణ విశిష్ట ఉపాసన యక్షుని లక్షణాలు - క్షణికత్వం, మనోహరత్వం, ప్రకాశరూపత్వం. మెరుపుకూ, కనురెప్పలు ఆర్పటానికీ, వృత్తికీ ఈ మూడు లక్షణాలు ఉన్నాయి. మనస్సు బాహ్యవస్తువును ప్రకాశింపజేస్తుంది. చైతన్యం, వృత్తిని ప్రకాశింపజేస్తుంది. మనస్సు అంతర్గతంగా ఉన్న సాక్షిని ప్రకటింపచేస్తుంది. వృత్తి, చైతన్యాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆధ్యాత్మ ఉపాసన


141


కేనోపనిషత్తు కర్మయోగం


ఉపనిషత్తు అనే ఆవుకు నాలుగుపాదాలు- తపస్సు, దమము, కర్మ, శమము


అంగాలు


అన్ని వేదాలు


సత్యం ఫలం


ఆయతనం


పాపరూప పాపాలు, పుణ్యరూప పాపాలు, అజ్ఞానరూప పాపాలు


నాశనమవుతాయి. సర్వాత్మ భావన కలుగుతుంది. జ్ఞాననిష్ఠలో నెలకొంటాడు. అంటే ఈ క్రింది భావనలోనే ఉంటాడు తదేవ బ్రహ్మత్వం విద్ధి వేదం యదిదముపాసతే


శాంతి పాఠం


ఓం ఆప్యాయను మమాజ్ఞాని వాక్పాణశ్చక్షుః శ్రోత్రమథోబలమిన్షియాణి చ సర్వాణి! సర్వం బ్రహ్మోపనిషదం మా_హం బ్రహ్మ నిరాకుర్యాం మా మా బ్రహ్మ నిరాకరోదనిరాకరణమస్త్వనిరాకరణం మే2 స్తు! తదాత్మని నిరతే య ఉ పనిషత్సు ధర్మాస్తే మయి సన్తు తే మయి సన్తు ||


ఓం శాస్త్రశ్శాస్తిశ్శాస్త్ర


కేనోపనిషత్తు అధ్యయనం మొదలుపెట్టే ముందు విఘ్నాలు లేకుండా చేయమని శాంతిపాఠం పఠిస్తాము. ఇప్పుడు అధ్యయనం నిరాటంకంగా సాగినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ శాంతి పాఠాన్ని పఠిస్తాము.


సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు


142


కుండ మట్టి - జీవన్ముక్తి


మనిషి ఏం చేసినా శాంతి, సుఖం, భద్రత కోసమే చేస్తూంటాడు. అవి వస్తువుల్లోనూ, పరిస్థితుల్లోనూ, మనుషుల్లోనూ, సంఘటనల్లోనూ ఉందనుకుంటాడు. తన స్వరూపమే శాంతి, సుఖం, భద్రత అని తెలుసుకోలేక, బాహ్యంగా పరుగులు తీస్తూంటాడు. కస్తూరి మృగం తనలో సువాసన పెట్టుకుని బయట ఎక్కడో ఉందని, వెతికి, వెతికి అలసి సొలసి చనిపోతుందిట. సరిగ్గా మనిషి కూడా అలానే చేస్తాడు. తనే ఆనంద స్వరూపం అని గ్రహించడు.


కుండకు ఎవరో చెప్పారు. నీ గురించి నువ్వు తెలుసుకో! స్వరూపంగా నువ్వెవరో తెలుసుకో! స్వరూపతః నువ్వు మట్టివి. మట్టిని తెలుసుకుంటే, వెంపర్లాట, ఆరాటం పోయి జీవన్ముక్తి పొందుతావు అని చెప్పారు. వెంటనే కుండ మూటాముల్లే సర్దుకుని స్వరూపంగా మట్టిని చూద్దామని చార్ ధామ్ యాత్రకు బయలు దేరింది. యాత్ర అంతా పూర్తి అయింది కాని స్వరూపంగా మట్టి మాత్రం కనపించలేదు. యజ్ఞ యాగాదులు చేసింది మట్టి జాడే తెలియలేదు. ధ్యానం చెయ్యాలన్నారెవరో! ధ్యానం లోనూ మట్టి కనపడలేదు. కుండ మట్టిని వెతకాలి. ఎలా? మట్టి ఎక్కడ ఉంది? కుండ లోపల ఉందా? కుండ బయట ఉందా? కుండ మధ్యలో ఉందా? అసలు కుండకు మట్టికి దూరం ఎంత? కుండ అంతటా మట్టే. మట్టి తప్ప కుండే లేదు. కుండకు మట్టికి దూరం ఏమిటి? అవి రెండు వస్తువులైతే కదా! మట్టినే కుండ అంటున్నాం. కుండగా పరిమితత్వం, అల్పత్వం, అశాశ్వతత్త్వం ఉన్నాయి. అదే మట్టిగా అపరిమితత్త్వం, అనల్పత్వం, శాశ్వతత్త్వం. అదే జీవన్ముక్తి. ఇప్పుడు కుండ ఏం చేయాలి? అంతటా వెతకాలా? పూజలు చేయాలా? ధ్యానం చేయాలా? నేనే మట్టిని అని తెలుసుకుంటే చాలు. కుండ తయారుకాక ముందూ మట్టే, కుండగానూ మట్టే, కుండ పగిలినా మట్టే. మట్టిగా దానిలో ఏ మార్పూ లేదు. దానికి పుట్టుకా లేదు, మరణం లేదు. అదే కుండయితే మరణం, పుట్టుక తప్పవు.అదే విధంగా జీవుడు తను స్వరూపతః బ్రహ్మను అని తెలుసుకుంటే, తనే ఆనంద స్వరూపమని తెలుసుకుంటాడు. అదే జీవన్ముక్తి. జీవుడు ఎప్పుడూ ముక్తుడే. ఆ విషయం తెలుసుకోవడమే తరువాయి. దీనినే శాస్త్రం ప్రాప్తస్య ప్రాప్తం అంటుంది. మోక్షం సిద్ధవస్తువు, సాధ్యవస్తువు కాదు.


కంఠ చామీకర న్యాయం - ఒక రాజ్యంలో రాణిగారు చాలా ఖరీదైన నెక్లెస్ విదేశాలనుంచి తెప్పించుకున్నారు. అకస్మాత్తుగా ఆ నెక్లెస్ కనిపించడం లేదు. రాణిగారికి చాలా ప్రీతికరమైన నెక్లెస్ మాయమయింది. దాని మీదమోజు తీరకుండానే పోయింది. దానితో రాణిగారు విపరీతమైన ఆవేదన చెందారు. సేవకులతో రాజప్రాసాదమంతా అడుగడుగునా గాలింపు చేయిస్తున్నారు.


ఎంత వెతికినా ప్రయోజనం కన్పించటం లేదు. మంత్రి ఏమైనా మార్గం చూపుతాడేమోనని పిలిపించారు. మంత్రిగారు అసలు విషయం వాకబు చేస్తే రాణిగారి నెక్లెన్ పోయిందని తెలిసింది. రాణిగారిని చూడగానే మంత్రిగారికి నెక్లెస్ జాడ తెలిసిపోయింది. వెంటనే మంత్రి, “అమ్మా మీ సేవకులను వెతకడం ఆపమనండి,” అన్నారు.


మంత్రి తెలివితేటల మీద అచంచలమైన విశ్వాసం ఉన్న రాణిగారు చప్పట్లు కొట్టి నెక్లెస్ గురించి వెతకడం ఆపించింది.


“అమ్మా రాణిగారూ! మీ మెడను ఒకసారి తడుముకోండి,” అన్నారు మంత్రి. అప్పుడు రాణిగారికి మెడ తడుముకోకుండానే నెక్లెస్ బరువు తెలిసింది. ఆమె తన మెడలోనే నెక్లెస్ ను పెట్టుకుని, ఊరంతా వెతుకుతోంది. తనదగ్గరే వున్న నెక్లెస్ బయట ఎలా దొరుకుతుంది? విశ్వమంతా ఎంత వెతికినా దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం - నెక్లెస్ పొయింది అనే అజ్ఞానం తొలిగి తన దగ్గరే, తన మెడలోనే ఉందని తెలిస్తే చాలు. దీనినే కంఠచామీకర న్యాయం అంటారు. ఇది తెలిస్తే ఇక ఎటువంటి ఆందోళన ఉండదు. కంఠచామీకరం అంటే నెక్లెస్ అని అర్థం.


సరిగ్గా ఇలాగే జీవుడు తనే స్వరూపతః బ్రహ్మనని తెలుసుకోలేక జన్మ జన్మలనుంచి బ్రహ్మను వెతుకుతూనే ఉన్నాడు. మన దగ్గరే కోహినూర్ డైమండ్ ఉంది. దానిని అజ్ఞానంతో పేపరు వెయిట్ లా వాడుతున్నాము.


ప్రయోజనం: నేనే శాంతి, సుఖం, ఆనందాలకు నెలవు అని తన పూర్ణత్వం దర్శించిన జ్ఞానికి ఎటువంటి వెలితి లేదు. అతను ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి, ఆత్యంతిక ఆనందాన్ని అనుభవిస్తాడు.


అలవోకగా అద్వైతం పుస్తకరూపంలో రాబోతున్నది ...


144

అదే మాదిరిగా జీవుడు తను స్వరూపతః బ్రహ్మను అని తెలుసుకుంటే, తనే ఆనంద స్వరూపమని తెలుసుకుంటాడు. అదే జీవన్ముక్తి. జీవుడు ఎప్పుడూ ముక్తుడే. ఆ విషయం తెలుసుకోవడమే తరువాయి. దీనినే శాస్త్రం ప్రాప్తస్య ప్రాప్తం అంటుంది. మోక్షం సిద్ధవస్తువు, సాధ్యవస్తువు కాదు.


కంఠ చామీకర న్యాయం - ఒక రాజ్యంలో రాణిగారు చాలా ఖరీదైన నెక్లెస్ విదేశాలనుంచి తెప్పించుకున్నారు. అకస్మాత్తుగా ఆ నెక్లెస్ కనిపించడం లేదు. రాణిగారికి చాలా ప్రీతికరమైన నెక్లెస్ మాయమయింది. దానిమీదమోజు తీరకుండానే పోయింది. దానితో రాణిగారు విపరీతమైన ఆవేదన చెందారు. సేవకులతో రాజప్రాసాదమంతా అడుగడుగునా గాలింపు చేయిస్తున్నారు.


ఎంత వెతికినా ప్రయోజనం కన్పించ లేదు. మంత్రి ఏమైనా మార్గం చూపుతాడేమోనని పిలిపించారు. మంత్రిగారు అసలు విషయం వాకబు చేస్తే రాణిగారి నెక్లెస్ పోయిందని తెలిసింది. రాణిగారిని చూడగానే మంత్రిగారికి నెక్లెస్ జాడ తెలిసిపోయింది. వెంటనే మంత్రి అమ్మా మీ సేవకులను వెతకడం ఆపమనండి అన్నారు.


మంత్రి తెలివితేటల మీద అచంచలమైన విశ్వాసం ఉన్న రాణిగారు చప్పట్లు కొట్టి నెక్లెస్ గురించి వెతకడం ఆపింది.


“అమ్మా రాణిగారూ! మీ మెడను ఒకసారి తడుముకోండి,” అన్నారు మంత్రి. అప్పుడు రాణిగారికి మెడ తడుముకోకుండానే నెక్లెస్ బరువు తెలిసింది. ఆమె తన మెడలోనే నెక్లెస్ ను పెట్టుకుని, ఊరంతా వెతుకుతోంది. తనదగ్గరే వున్న నెక్లెస్ బయట ఎలా దొరుకుతుంది? విశ్వమంతా ఎంత వెతికినా దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం నెక్లెస్ పొయింది అనే అజ్ఞానం తొలిగి తన దగ్గరే, మెడలోనే ఉందని తెలిస్తే చాలు. దీనినే కంఠచామీకర న్యాయం అంటారు. ఇది తెలిస్తే ఇక ఎటువంటి ఆందోళన ఉండదు. కంఠచామీకరం అంటే నెక్లెస్ అని అర్థం. -


సరిగ్గా ఇలాగే జీవుడు తనే స్వరూపతః బ్రహ్మనని తెలుసుకోలేక జన్మ జన్మలనుంచి బ్రహ్మను వెతుకుతూనే ఉన్నాడు. మన దగ్గరే కోహినూర్ డైమండ్ ఉంది. దానిని అజ్ఞానంతో పేపరు వెయిట్ లా వాడుతున్నాము.


ప్రయోజనం: నేనే శాంతి, సుఖం, ఆనందాలకు నెలవు అని తన పూర్ణత్వం దర్శించిన జ్ఞానికి ఎటువంటి వెలితి లేదు. అతను ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి, అత్యంతిక ఆనందం అనుభవిస్తాడు.


అలవోకగా అద్వైతం పుస్తకరూపంలో రాబోతున్నది ...


***


146



అటుపుటు రటుం భణంతే !

 అటుపుటు రటుం భణంతే !

........................... .............................


అటుపుటు రటుం భణంతే ! ఈ పాదం తెలుగువాడిని కీర్తించిన శ్లోకంలోనిది. అటుపుటు రటుం అనే పదాలకు ప్రాకృత భాషలో అర్థవంతమైన భావముంది. తెలుగోడి గొప్పతనం గురించి ఉదాహరించుకొన్నాం కాబట్టి తెలుగుభాషను గురించి కూడా కొద్దిగా తెలుసుకొని అటుపుటు రటుం అంటే ఏమిటో తరువాత తెలుసుకొందాం.


జనని సంస్కృతంబు ఎల్లభాషలకు అని మననమ్మకం. అంటే మనం మాట్లాడుతున్న భారతీయభాషలన్ని సంస్కృతం నుండే పుట్టాయని ఆర్యోక్తి. నిజమే తెలుగులాంటి భాషలు సంస్కృతం నుండి పుట్టకపోయినా తమభాషలో మాటలో నుడికారంలో కావ్యంలో ఆ దేవభాషను జీర్ణం చేసుకొని పరిపుష్టమైనాయి.


కాకపోతే భాషా శాస్త్రజ్ఞులు మాత్రం దక్షిణాది భారతదేశంలో దాదాపుగా అన్ని భాషలుకూడా మూలద్రావిడము నుండే పుట్టాయని అభిప్రాయపడ్డారు.ఈ ద్రావిడాన్ని కాలానుగుణంగా ఉత్తర,మధ్య, దక్షిణ కుటుంబాలుగా విభజించారు.


ఉత్తర ద్రావిడంనుండి (1) బ్రాహుయి (2) మాల్‌తో (3) కూరుఖ్ భాషలు ఉద్భవించాయి. విచిత్రమేమిటంటే ఇప్పటికి అఫ్ఘనిస్థాన్ లోని బెలూచిస్థాన్ లో ఇంకా బ్రతికిబట్టకట్టేవుంది.


మధ్య ద్రావిడ భాషా కుటుంబంలో (1) గోండి(2) కొండ (3) కూయి (4) మండ (5) పర్జి (6) గదబ (7) కోలామీ (8) పెంగో (9) నాయకీ (10) కువి (11) తెలుగు భాషలను పేర్కొన్నారు.


దక్షిణ ద్రావిడం నుండి (1)తుళు (2) కన్నడం (3) కొడగు (4) తొద (5) కోత(6) మలయాళం (7) తమిళం ఏర్పడ్డాయని సూత్రీకరించారు.


కాబట్టి తెలుగుభాష కూడా ఇతర భాషలలాగా పాతదే. కాకపోతే తెలుగుభాష బాగా ఆర్వాచీనమని నిరూపించటానికి అక్షరరూప ఆధారాలు కొరవడ్డాయి.

అలా అక్షరరూపంలోనున్న తెలుగు కళమల్ల రాతిశాసనంలోనే మనం గుర్తించాం. 


కలమళ్ళ శిలాశాసనము కడప జిల్లా యర్రగుంట్ల మండలంలోని కలమళ్ళ గ్రామంలో ఉండేది. దీన్ని క్రీ.శ. 575లో రేనాటిచోళరాజు ధనంజయ ఎరికళ్ ముత్తురాజు వేయించాడు. ఇందులో వారు అనే బహువచనం కనిపిస్తుంది. తొలి తెలుగు శాసనాలలో ఇది ఒకటి.


ఎరికల్ ముతురాజు అనేబిరుదుగల ధనంజయుడనే రాజు అంటూ ఈ శాసనం మొదలౌతుంది. మధ్యలో కొంత భాగం అసంపూర్ణంగా ఉంది. పంచమహాపాతకుడు అవుతారని చెబుతూ ఈ శాసనం ముగుస్తుంది. ఇందులో శకటరేఫను వాడారు.


మహారాజు, మహా రాజాధిరాజు, యువరాజు (దుగరాజు) అనే పదాలు రాజపదవులలో ఉండే వివిధ స్థాయీ భేదాలను తెలుపుతాయి. అలాగే ఈ శాసనంలో వాడిన ముత్తురాజు అనే పదం కూడా రాజు యొక్క స్థాయిని సూచిస్తుందని ఈ శాసనాన్ని పరిష్కరించిన ముట్లూరి వెంకటరామయ్య, ప్రొఫెసరు కె.ఎ.నీలకంఠ శాస్త్రి అన్నారు.


అయితే అమరావతి స్థూపంలో దొరికిన ఒక శాసనభాగంలో నాగబు అనే తెలుగుమాటను పెర్కొనడం జరిగిందని ఇదే మొదటి తెలుగుపదమని వేటూరి ప్రభాకరశాస్త్రి, ఆరుద్రగారలు అభిప్రాయపడ్డారు. అది నాగ - బు అనే తెలుగు మాట కాదు, నాగబుద్ధ అనే పేరని పేర్కొన్న ప్రబుద్ధులు కూడా వున్నారు.


కాని 

క్రీ.పూ.3000-2500 ఏళ్లనాటి శాసనాన్ని ఒకదానిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని కన్నమడకలలో కనుగొన్నారు. ఈ శాసనంలో "అంధిర లోకము" అనే పదం ఉంది. దీని అర్థం "ఆంధ్ర లోకము". ఇదే మొదటి తెలుగు పదంగా పరిశోధకులు గుర్తించారు.


నాగబు(నాగంబు > నాగం > నాగుపాము) పదమా లేక అంధిరలోకమా? ఏది పాతదనే మాటను భాషాశాస్త్ర కోవిదులు తేల్చాలి.


తెలుగుభాష ఉనికికే పెనుప్రమాదం ఏర్పడిన ప్రస్తుతపరిస్థితులలో ఈ నిరూపణా కార్యాలు ఎంత వరకు సాధ్యం ! తెలుగుతల్లి నిను ఆ దేవుడే రక్షించాలి.


సాహిత్యరూపంలో నన్నయ వ్రాసిన మహభారత భాగాలే తెలుగులో మొదటివని మన ప్రగాఢవిశ్వాసం.


ఏదిముందో ఏదివెనుకో ఏది తలో ఏది తోకో తెలుసుకోవాటానికి నిధులు (Budget) కేటాయింపు జరిగేనా ?


పైన తెలుగువాడి అటుపుటుం రటుం గురించి చెప్పుకొన్నాం కదా ! అదేమిటో చూద్దాం.


తెలుగువారి పౌరుషం వ్యవహారం గురించి 892 ACE కాలానికి చెందిన ఉద్యోతనుడనే ప్రాకృతకవి పెర్కోవడం జరిగింది.

ఈయన వ్రాసిన కువలయమాల కథలో తనకాలంలోనున్న 18 దేశాలవారిని, వాళ్ళ భాషలను పెర్కొనడం జరిగింది. అందులో క్రింది శ్లోకంలో ఆంధ్రులగురించి ప్రస్తావించడం జరిగింది.


"పియ మహిళా సంగామే సుందరగత్తేయ భోయణే రోద్దే

అటుపుటు రటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి"


ఆంధ్రులు అందగత్తెలను యుద్ధరంగాన్ని కూడా సమానంగా ప్రేమిస్తారు. వీరు అందమైన శరీరాలు కలవారు. అటువంటి ఆంధ్రులు అటూ పుటు రటుం (అందరికి పెట్టండి, బహుశా భోజనం వడ్డించండి) అనుకొంటూ ఊరిలోనికి వస్తున్నారని పంచాజ్ఞుల ఆదినారాయణశాస్త్రిగారు తెనిగించారు.


(సేకరణ)

...............................................................................................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

శ్రీ దేవరియా బాబా - 2 వ భాగం🌸

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


_"శ్రీపాద రాజం శరణం ప్రపద్యే"_

*🌸బ్రహ్మర్షి శ్రీ దేవరియా బాబా - 2 వ భాగం🌸*

_*"బ్రహ్మర్షి శ్రీ దేవరాహా బాబాతో భారత తొలి రాష్ట్రపతి"*_


ఆ పిల్లవానికి 🤵🏻సుమారు 10 - 15 సంవత్సరములుండి ఉండవచ్చు. వారి తాతగారు🥸 వాడిని ఒక బాబా దగ్గరకు తీసుకొని వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఆ బాలుడు తాతగారితో - _"తాతగారూ...! మీరు ఈ బాబాను ఎప్పటి నుండి ఎరుగుదురు ?"_ అని ప్రశ్నించాడు. తాతగారు నవ్వుతూ _"నేను నీ వయసులో ఉన్నప్పటి నుండి"_ అని పలికారు. _"బాబా దగ్గరకు మీరు ఎందుకు వెళ్తున్నారు ?"_ మళ్ళీ బాలుడు తాతగారిని ప్రశ్నించాడు. ఆయనను చూసినంతనే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. వారి మాటలు వింటుంటే నా మనస్సు ఎంతో శాంతి పొందుతుంది అని తాత మళ్ళీ సమాధానం ఇచ్చాడు. ఇంతలో ఇరువురూ బాబా దగ్గరకు చేరారు. బాబా, తాతగారు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ పిల్లవాడు కొద్దిసేపు వారి మాటలు విని, అంతలోనే చపలత్వం కారణంగా ఆ ఆశ్రమంలో ఉన్న చెట్లూచేమల మధ్య ఆడుతూ 🏃🏻‍♂️పాడుతూ తన సమయం గడిపేవాడు. వాడిని చూచి తాతగారు మందలించే వారు. తాత తన మనవడిని మందలిస్తూ ఉంటే బాబా ఆ తాతతో - *"నాయనా ! వీడు గొప్ప సంస్కారవంతుడు. వీడికి నా ఆశీర్వాదం పూర్తిగా ఉన్నది"* అని అంటూ ఆ పిల్లవాడితో నవ్వుతూ _*"అరే..! నీవు 🤴🏻 రాజువురా"*_ అంటూ ఆశీర్వదించారు. ఆ పిల్లవాడు భవిష్యత్తులో భారతదేశ రాష్ట్రపతి అయ్యాడు. ఆ పిల్లవాడు రాష్ట్రపతి అయిన తర్వాత మళ్లీ బాబా దగ్గరకు వెళ్ళాడు. బాబా నవ్వుతూ మళ్ళీ *"అరే..! నీవు రాజువురా"* అని పలికారు. వినయవంతుడు, ఆధ్యాత్మిక సంపన్నుడైన ఆ రాష్ట్రపతి బాబా పాద పద్మములకు 🙏👣🙏 నమస్కరించి - *"బాబా..! ధూళికణము ఆకాశములోనికి ఎగురుతుంది. ఇది దాని గొప్పతనము కాదు. వాయుదేవుని కృపతో దానికి ఆ అదృష్టం పట్టింది. మీ ఆశీర్వాద ఫలం వల్లనే నేను ఇంతవాడిని కాగలిగాను."* అని అన్నాడు. ఈ మాటలు అన్నది మరెవరో కాదు... _"భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్."_ పై విషయమును ఆయనే స్వయంగా తన గ్రంథము _"ఆటో (ఆత్మకథ) బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ రాజేంద్రప్రసాద్"_ లో వివరించారు. _*"ఆ బాబాయే దేవరాహా బాబా."*_🙏

*అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 12

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 12     

                           SLOKAM : 12

                                                

भवजलधिगतानां द्वन्द्ववाताहतानां

सुतदुहितृकलत्रत्राणभारार्दितानाम् ।

विषमविषयतोये मज्जतामप्लवानां

भवतु शरणमेको विष्णुपोतो नराणाम् ॥ १२॥


భవజలధిగతానాం ద్వంద్వ వాతాహతానాం 

సుతదుహితృ కళత్ర త్రాణభారార్ధితానాం I    

విషమవిషయతోయే మజ్జతామప్లవానాం 

భవతు శరణమేకో విష్ణుపోతోనరాణాం ॥    


    సంసారమనే సముద్రంలో చిక్కి, 

    విరుద్ధ ధర్మములనే గాలిచే కొట్టబడి, 

    భార్యాబిడ్డలు మున్నగువారిని పోషించడమనే బరువును మోస్తూ,    

    విషయసుఖాలనే నీళ్ళలో మునిగి లేస్తూ,    

    నావ లేకుండా నానా యాతనలకు గురి అవుతున్న నరులకు 

    శ్రీమన్నారాయణుడు (శ్రీమహా విష్ణువు) అనే నావ ఒక్కటే శరణ్యము.  


    The people in this vast ocean of birth and death are being blown about by the winds of material dualities.    

     As they flounder in the perilous waters of sense indulgence, 

     with no boat to help them,    

     they are sorely distressed by the need to protect their sons, daughters, and wives.    

     Only the boat that is Lord Viṣhṇu can save them.


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*భక్తి..బంధుత్వం..*


"మేము స్వామివారి కి బంధువులం అవుతామండీ..ఈరోజు ఇక్కడ నిద్ర చేయాలని అనుకున్నాము..మేము ఉండడానికి ఏదైనా గది ఇస్తారా?.." అని ఆ దంపతులు అడిగారు..ఇద్దరిదీ వయసు ముప్పై ఏళ్ల లోపలే..శ్రీ స్వామివారికి వారికి ఏవిధంగా బంధుత్వం వున్నదో కూడా తెలిపారు.. గది కేటాయించాము..ఇద్దరూ స్నానాదికాలు ముగించుకొని తిరిగి మందిరం లోనికి వచ్చారు..ఆరోజు శనివారం కనుక, శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్ళడానికి వీలు లేదు కనుక..దూరం నుంచే నమస్కారం చేసుకున్నారు..


"మాకు వివాహం జరిగి నాలుగేళ్లు అవుతున్నది..ఇద్దరమూ డెంటల్ డాక్టర్ల గా నెల్లూరు లో ప్రాక్టీస్ చేస్తున్నాము..సరిగ్గా జరగడం లేదు..ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నాము..దుబాయ్ లో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్ నుంచి మమ్మల్ని రమ్మనమని కబురు వచ్చింది..వెళ్లాలని అనుకుంటున్నాము..కానీ గత మూడు నెలలుగా ఏదో ఒక అడ్డంకి వలన మేము అక్కడికి వెళ్లలేక పోతున్నాము..మాకున్న ఈ ఆర్థిక సమస్యలు తీరిపోయి..దుబాయ్ వెళ్ళడానికి వీలుకుదరాలని స్వామివారికి విన్నవించుకుందామని వచ్చాము.." అని చెప్పారు..సాయంత్రం పల్లకీ సేవ ఎన్నిగంటలకో అని అడిగి తెలుసుకున్నారు..పల్లకీ సేవ లో తామిద్దరం పాల్గొంటామని చెప్పారు..సరే అన్నాను..


ఆరోజు సాయంత్రం ఏడు గంటలకు పల్లకీ సేవ ప్రారంభం అయింది..దంపతులిద్దరూ భక్తిగా పాల్గొన్నారు..పల్లకీ మందిరం చుట్టూ తిరిగే మూడు ప్రదక్షిణాల లోనూ అతనే పల్లకీని మోశాడు..పల్లకీ సేవ తరువాత, అన్నదాన సత్రానికి వెళ్లి, అన్నప్రసాదం స్వీకరించి వచ్చారు..వాళ్లకోసం గది ని కేటాయించినా కూడా ఆ రాత్రి మండపం లోనే పడుకుంటామని చెప్పి, అక్కడే నేలమీద నిద్ర చేశారు..


ప్రక్కరోజు ఆదివారం తెల్లవారుఝామున లేచి..స్నానం చేసి..శ్రీ స్వామివారి మండపం చుట్టూ ప్రదక్షిణాలు చేసి వచ్చారు..ప్రభాత పూజ, హారతులు అయిపోయిన తరువాత..ఇద్దరూ శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, సుమారు పది నిమిషాల పాటు నిలబడ్డారు..తమ కోర్కెను శ్రీ స్వామివారికి విన్నవించుకున్నామని ఇవతలికి వచ్చి నాతో చెప్పారు..


"ఎందువల్లో తెలీదండీ..శ్రీ స్వామివారి సమాధి వద్ద మా బాధలు విన్నవించుకున్న తరువాత..మా మనసులకు ప్రశాంతత వచ్చింది.." అన్నారు..మధ్యాహ్నం దాకా మందిరం లో గడిపి..తిరిగి నెల్లూరు వెళ్లిపోయారు..


పదిహేను రోజులు గడిచిపోయాయి..మేము దాదాపుగా ఆ దంపతుల గురించి మర్చిపోయాము..ఒకరోజు శ్రీ స్వామివారి బంధువు మరొక వ్యక్తి మందిరానికి వచ్చాడు..మాటల మధ్యలో ఈ దంపతుల ప్రస్తావన వచ్చింది..పదిహేను రోజుల క్రిందటే వాళ్లిద్దరూ వచ్చి వెళ్లారని తెలిపాను..గత నాలుగైదు నెలలుగా వాళ్లిద్దరూ తీవ్రమైన ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్నారని..మానసికంగా కూడా వత్తిడి లో ఉన్నారనీ..అప్పుడు ఆ అమ్మాయి తల్లి గారు వాళ్ళను మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని శరణు కోరమని చెప్పిందనీ..ఆవిడ మాట ప్రకారం వాళ్లిద్దరూ ఇక్కడకు వచ్చారని..తెలిపాడు..శ్రీ స్వామివారికి మ్రొక్కుకున్న మూడు రోజుల్లోనే దుబాయ్ నుంచి మళ్లీ పిలుపు వచ్చిందని..మరో వారం లోపలే ఆ దంపతులు దుబాయ్ వెళుతున్నారని..టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారని.." ఆ వచ్చిన వ్యక్తి తెలిపాడు..


ప్రస్తుతం ఆ దంపతులిద్దరూ దుబాయ్ లో లక్షణంగా ఉన్నారు...శ్రీ స్వామివారి దయ వలన ఆ భార్యా భర్తల కోరిక నెరవేరిందని అనుకున్నాము..బంధుత్వం కన్నా..వాళ్లిద్దరూ కనపరచిన భక్తి విశ్వాసాలే వాళ్ళను శ్రీ స్వామివారికి దగ్గర చేసాయి.. ఎందుకంటే శ్రీ స్వామివారు భక్త సులభుడు కదా!..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

దేశభక్తులెందరో

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*వీరిలాంటి మనలో చాలా మందికి తెలియని దేశభక్తులెందరో?*

                🌷🌷🌷

జైలర్ కోపంతో నీ గుండెలో నేతాజీ ఉన్నట్లయితే నీ గుండెల్లో నుండి పెకిలించి తీసి బందిస్తానంటూ కోపంతో ఊగిపోతూ మరో వైపు చూస్తూ వెంటనే వచ్చి ఈమె గుండెలను చీల్చేయండి రండి అంటూ ఆజ్ఞాపించాడు.... పనివాడు ఇనుప ఆయుధాలు తీసుకువచ్చి ఆమె వక్షస్థలాన్ని కోయడం ప్రారంభం చేశాడు.... రక్తం చివ్వున చిమ్ముతూ ఉండగా ఆ తల్లి విలవిలలాడి పోయింది వాళ్లేమో రాక్షసంగా నవ్వుకుంటున్నారు...

(ఈ సంఘటన అండమాన్ నికోబార్ దీవుల లోని కాలాపాని జైలులో జరిగింది.)


    ఆజాద్ హింద్ ఫౌజ్ లోని ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా రెజిమెంట్ లో శిక్షకురాలు, ఆంగ్లేయులచే అండమాన్ కాలాపాని జైలు శిక్ష విధించబడిన వీరనారి "నీరాఆర్య". 


     తనను కట్టుకున్నవాడే ఆంగ్లేయుల పంచన చేరి దేశద్రోహిగా మారి సమరయోధులను హత్య చేయడాన్ని కళ్ళారా చూసి అతడు ఇక భూమిపై ఉండకూడదని నిర్ణయం తీసుకొని పొడిచి చంపి నేతాజీని మరియు అనేక మంది దేశభక్తులను రక్షించిన వీరాంగణ, చివరి దశలో అజ్ఞాతంగానే మన హైదరాబాద్ ఫలక్నుమా ప్రాంతంలో ఉంటూ ఉస్మానియా ఆస్పత్రిలోనే అంతిమ శ్వాస విడిచారు.


    భారతదేశ చరిత్రలో మొదటి గూఢచారిణి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగం అయిన ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన "నీరా ఆర్య" 1902 మార్చి 5 న ఇప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం "భాగ్ పత్ జిల్లా"లోని 'ఖేకడా' అనే నగరంలో జన్మించారు.


      తండ్రి "శేట్ చజ్ మల్" అప్పటికే దేశంలో గొప్ప పేరున్న వ్యాపారవేత్త, నీరా ఐదవ ఏట తండ్రి వ్యాపార ముఖ్య కేంద్రమైన కలకత్తాకు వలస వెళ్ళాడు.


   నీరాఆర్య విద్యాభ్యాసం మొత్తం కలకత్తాలోనే పూర్తయింది, తాను తండ్రితో కలిసి పలు ప్రాంతాల్లో వ్యాపార నిమిత్తం వెళ్లడం వలన తనకు పలు భాషలపై మంచి పట్టు ఉండేది.


      తన కూతురు మొదటి నుండి చదువు, ఆటపాటలలో మేటియై,దేశభక్తితో స్వతంత్ర్య భావాలను కలిగి ఉండడం మరియు బ్రిటిష్ వారిని పారద్రోలే ఆలోచనలను కలిగి ఉండడాన్ని కూడా గమనించారు.


    యుక్త వయసు రాగానే నాటి బ్రిటిష్ ఇండియా సిఐడి పోలీసు ఇన్స్పెక్టర్ అయిన "శ్రీకాంత్ జొయరంజన్ దాస్" తో వివాహం జరిపించాడు తండ్రి.


   తన భర్త బ్రిటిష్ వారి కోసం, తను నేతాజీ నేతృత్వాన దేశంకోసం పనిచేస్తూ కూడా పరస్పర విరుద్ధ భావాలతో ఉన్నప్పటికీ అతడిలో మార్పు తీసుకువచ్చి దేశభక్తుడిగా మార్చాలని ప్రయత్నం చేస్తూనే కలిసి చాలాకాలం జీవనం కొనసాగించారు.


   బ్రిటిష్ ప్రభుత్వం నీరాఆర్య భర్తను నేతాజీ కదలికలను గుర్తించడం వీలైతే వెంటనే హతమార్చే పనిలో నియమిస్తారు. ఒక సందర్భంలో నీరాఆర్య భర్త నేతాజీనీ తుపాకీతో కాల్చగ గురి తప్పి డ్రైవర్కు గాయం అవుతుంది, ఈ క్రమంలో నేతాజీని కాపాడటానికి తన వెంటే ఉన్న కత్తితో భర్తను పొడిచి వేసింది దానితో జోయారంజన్ దాస్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. 


      ఆ తర్వాత నీరాఆర్య నాగిని అనే మారుపేరుతో స్వాతంత్రోద్యమ కార్యకలాపాలను నిర్వహించింది. నీరాఆర్య తమ్ముడు బసంత్ కుమార్ కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ లో పని చేసేవాడు. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ కెప్టెన్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా సైనికులకు శిక్షణ ఇచ్చే వారు. నూతన సైనికులను సమకూర్చేవారు.


     భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రవాస ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ సింగపూర్ కేంద్రంగా సైనికులను సమకూర్చుకుని ఆంగ్లేయులను పారద్రోలుటకై భారత్ వైపు బయలు దేరి, చారిత్రాత్మకమైన 'ఛలో ఢిల్లీ ' నినాదం ఇచ్చి ఈశాన్య భారతాన్ని స్వాధీనం చేసుకుని ప్రజలందరూ స్వాగతాలు పలుకుతుండగా ఢిల్లీ వైపు సాగే క్రమంలో వాతావరణం అనుకూలించక పోవడం, వర్షాలు వరదలు తుఫాను తాకిడికి సైన్యం చెల్లాచెదురై పోయారు. మరోవైపు సహాయం కోసం విదేశాలకు వెళ్లిన నేతాజీ అదృశ్యమైపోయారు. 


    ఆతర్వాత అజాద్ హిందు ఫౌజు సైన్యం లొంగిపోయింది. ఎర్రకోటలో విచారించి అజాద్ హింద్ ఫౌజ్ సైనికులందరికి వివిధ శిక్షలు వేయగా నీరాఆర్య ను మాత్రం ఖైదు చేసి అండమాన్ "కాలాపాని" జైలుశిక్ష విధిస్తారు. 


   జైలులో ఆమెపై ప్రతిరోజు అతి కిరాతకంగా శారీరకంగా మానసికంగా అనేక చిత్రహింసలకు గురిచేసేవారు.


   తను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత స్థానిక ఉర్దూ కవయిత్రి "ఫర్హనా తాజ్" తో తన జీవితంలో ముఖ్యంగా జైలు జీవితంలో జరిగిన ఘటనలను పంచుకోగా, ఆమె వాటిని తన రచనల్లో పొందుపరిచింది.

ఆమె చెప్పిన ప్రకారం.


    అండమాన్ కాలాపాని జైల్ లో ఉండగా ఒక రోజు ఒక జైలు ఉద్యోగి వచ్చి రమ్మని వెంట తీసుకు వెళ్ళాడు అప్పటికే నేను బలమైన బరువైన ఇనుప గొలుసులతో కాళ్లను మరియు చేతులను కలిపి బంధించిన ఆ గొలుసులతోనే బరువుగా నడుస్తూ నడుస్తూ అతని వెంట వెళ్ళాను. జైలర్ పక్క గదిలో వరకు తీసుకెళ్లిన అతను ఒక పెద్ద సుత్తి మరియు గొలుసులను తొలగించడానికి మరొక పరికరాన్ని తీసుకొచ్చాడు. ఇనుప సంకెళ్ళను తొలగిస్తున్నానంటూ ప్రారంభించిన వాడు నా చర్మాన్ని కూడా కోసివేస్తున్నాడు. బాధను తట్టుకోలేక పోతున్నాను మరోవైపు సంకెళ్ళు తీసి వేస్తున్నారని మనసులో కొంత ఉపశమనంగా ఉన్నప్పటికీ చేతిని కత్తిరిస్తున్న బాధ భరించలేకపోతున్నాను... 


    ఇది ఇలా ఉండగా కాళ్లకు సంబంధించిన సంకెళ్లను తొలగిస్తున్నా నంటూ చూసి చూసి ఇనుప సుత్తితో నా కాలి వేళ్లపై రక్తం వచ్చేటట్లు కొడుతున్నాడు, భరించలేని బాధతో ఇలా ఎందుకు కొడుతున్నావ్ అని గట్టిగా అరిచాను., దానితో వాడు కొడతాను ఎక్కడైనా కొడతాను నీ వక్షస్థలంపై కూడా కొడతాను అని మూర్ఖంగా జవాబు ఇస్తే., ఆ జైలులో ఒక బానిసగా ఉన్న నేను వాళ్లేం చేసినా చూడాల్సిందే భరించాల్సిందే, కానీ నేను నాఆత్మాభిమానాన్ని చంపుకోలేక వ్యతిరేకించాను మహిళలపై ఇలాంటి మాటలు ఇలాంటి చేతలు మంచిది కాదని ఇటువంటి పనులు మూర్ఖులు మాత్రమే చేస్తారని అన్నాను‌, ఇంకా ఏమీ చేయలేక వాడిపై ఉమ్మేసాను దీనితో వాడు అరవడం ప్రారంభం చేశాడు ఈ అరుపులు విని జైలర్ అక్కడికి చేరుకున్నాడు.


     ఇన్ని బాధలెందుకు పడతావు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ శరణు కోరుకో నిన్ను వదిలి వేస్తామని బెదిరింపు లాంటి బుజ్జగింపుగా ఒక మాట అన్నాడు. నేను శరణు వేడితే జగజ్జనని కాళిక మాతనే శరణు వేడుతాను తప్ప, ఇతర దేశాలను ఆక్రమించుకుని దోచుకుంటున్న దోపిడీ దొంగలను శరణువేడను అని నిర్ద్వందంగా చెప్పాను, దానితో వాళ్ళు మరింత రెచ్చిపోయారు.


   ఒకవైపు కాలి నుండి స్రవిస్తున్న రక్తం మరొకవైపు చేతి నుండి స్రవిస్తున్న రక్తం... బాధతో విలవిల లాడి పోతున్నాను.


   ఇంతలోనే జైలర్ నేతాజీ ఎక్కడున్నాడో చెబితే నిన్ను వదిలి పెడతాం అని అన్నాడు..., అప్పటికే విమాన ప్రమాదంలో నేతాజీ అసువులుబాసినట్లుగా ప్రకటన వెలువడింది దాన్నే అతని గుర్తు చేశాను. విమాన ప్రమాదంలో మృతి చెందిన సుభాష్ బాబు గురించి నీకు ఎంత తెలుసో జైల్లో ఉన్న నాకూ అంతే తెలుసు అని అన్నాను. కానీ అతడు మరింత రెట్టించిన గొంతుతో లేదు సుభాష్ చంద్ర బోస్ ఎక్కడో ఉన్నాడు అది నీకు తెలుసు ఎక్కడున్నాడో చెప్పు అంటూ గద్దించసాగాడు.., 


      వాడి అరుపులను మౌనంగా భరించి వింటున్నాను కొంతసేపటికి..


    చివరకు హాఁ.., ఉన్నాడు నేతాజీ ఉన్నాడు అని అన్నాను వెంటనే ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటూ నా వైపు వస్తుండగా నేతాజీ నా గుండెల్లో ఉన్నాడు అని బదులిచ్చాను.


       అంతే ఆ సమాధానం విన్న జైలర్ కోపంతో నీ గుండెలో నేతాజీ ఉన్నట్లయితే నీ గుండెల్లో నుండి పెకిలించి తీసి బందిస్తానంటూ కోపంతో ఊగిపోతూ మరో వైపు చూస్తూ వెంటనే వచ్చి ఈమె గుండెలను చీల్చేయండి రండి అంటూ ఆజ్ఞాపించాడు. పనివాడు ఇనుప చిమ్టి లాంటి పరికరాన్ని తీసుకువచ్చి నా శరీరం పైన ఉన్న చీరకొంగును లాగేశాడు, జాకెట్ ను తొలగించాడు వక్షస్థలంపై ఆయుధాన్నుంచి నా కుడి రొమ్మును ఇనుప పరికరంతో తొలగించాలని కోసివేయడం ప్రారంభం చేశాడు భయంకరమైన నొప్పితో విలవిలలాడి పోయాను. రక్తసిక్తమైన దేహంతో శరీరం అంతా కంపించి పోతుండగా ఎక్కడున్నాడో చెప్పు నీ గురువు నీవు దైవంగా నమ్మే నేతాజీ అంటూ అరుస్తూనే ఉన్నాడు నా మెదడు మొద్దుబారిపోతున్నది ఆ తర్వాత ఎప్పుడు స్పృహ లోకి వచ్చి లేచానో నాకే తెలియదంటూ చెప్పారు.


     ఇంతటి క్రూర చిత్రహింసలను తట్టుకొని కూడా ఆమె ఏనాడు నేతాజీ గురించిన విషయాలను బ్రిటిష్ వారికి చెప్పలేదు.


      నీరాఆర్య జన్మించిన భాగ్ పత్ జిల్లాకు చెందిన సాహితీవేత్త తేజ్ పాల్ సింగ్ దామా రచించిన నీరా జీవిత చరిత్ర అయినా *"ఫస్ట్ లేడీస్ స్పై"* అనే పుస్తకాన్ని ప్రచురించారు. దీని ఆధారంగా చైనా సినీ నిర్మాత "జాంగ్ హ్యుయిహూ అంగ్ గ్రేసి" త్వరలో సినిమా తీయబోతున్నారని సమాచారం.


    *భారతదేశ స్వాతంత్ర్యానంతరం కూడా అజ్ఞాతంగానే ఉంటూ భారత యూనియన్ లో విలీనం కాకుండా ఉన్న హైదరాబాద్ స్టేట్ లోని ప్రజల దుఃఖాన్ని కష్టాలను విని ఇక్కడి సమాచారం తన అనుయాయుల ద్వారా భారత యూనియన్ కు చేరవేయడం కోసం హైదరాబాద్ చేరుకున్నట్లు, వివిధ స్థలాలలో గుడిసె వేసుకొని సామాన్య జీవితం గడుపుతూ ఇక్కడి స్థితిగతులను రహస్యాలను చేర వేసినట్లుగా సమాచారం.*


      *హైదరాబాద్ ఫలక్ నుమా ప్రాంతంలో గుడిసెలోనే నివసిస్తూ రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించిన ఆత్మాభిమానం గల దేశ భక్తురాలు. అప్పుడప్పుడు చుట్టుపక్కల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఏవేవో చదువుకునే లేదా ఆడుకునే వస్తువులను తెచ్చి ఇచ్చేవారని, "బాగా చదువుకోవాలని ఈ దేశానికి పేరు తేవాలని చెబుతుండేవారనీ" పూలమ్మే వృద్ధమాత ఇలా పిల్లలపై ఖర్చు చేస్తుండడం విచిత్రంగా ఉండేదని. ఆ నోటా ఈ నోటా వినవస్తుండేది.*


  *సంపన్న కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి, అన్ని రంగాలలో ఆరితేరి స్వాతంత్రాన్ని సాధించిపెట్టిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో ట్రైనర్ అయి ఉండి కూడా తన జీవిత చరమాంకంలో ప్రభుత్వం నుండే కాదు ఎవరి ద్వారా కూడా ఎలాంటి సహకారాన్ని కోరుకోని స్వాభిమానం ఆమెది.*


  *స్వాతంత్ర్య కోసం తన భర్తనే బలి ఇచ్చింది, తన సర్వసంపదలను వదిలిపెట్టింది, బంధుగణం ఎదుటన ఈ పనులు చేయడం అవమానంగా భావించక తన సోదరుడితో సహా స్వాతంత్ర్య సమరంలో దూకింది, తనకోసం తన పిల్లలకోసం తన ఇంటికోసం అంటూ ఆలోచించలేదు.., దేశం కోసం ఇవ్వడమే కాని తీసుకోవడం తెలియని మహాతల్లి తన సర్వస్వాన్ని ధారపోసింది. ఎప్పుడెప్పుడు ఏమేమి ఇవ్వాల్సి వచ్చినా అన్నింటినీ త్యాగం చేసింది , ఇంకా చేయడానికి సిద్ధపడింది భారతదేశ వైభవానికి పునాది రాయిగా ఉండిపోవాలని కోరుకున్నది ఆ తల్లి.*


    ఒకానొక సందర్భంలో ఆమె వేసుకున్న గుడిసె ప్రభుత్వ భూమిలో ఉందని ఆ గుడిసెను కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ మున్సిపాలిటీ వారు కూల్చి వేశారు.


   చివరికి 26 జూలై 1998 న 96 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో ఒక నిరుపేదగా, అసహాయురాలిగా, నిరాశ్రితగా, అనారోగ్య వృద్దమహిళగా చార్మినార్ దగ్గర్లో గల ఉస్మానియా ఆస్పత్రిలో చేరి మరణించింది.


    ఆమె మరణించిన విషయాన్ని తెలుసుకొని స్థానిక ఒక పత్రికా విలేఖరి తన మిత్రుల సహాయంతో అంతిమ సంస్కారాలు జరిపించారు.


    *మహనీయులైన "నీరా ఆర్య" గారికి మనం ఏమివ్వగలం..., అశ్రునయనాలతో అమ్మను గుర్తు చేసుకోవడం, ముకులించిన హస్తాలతో నివాళులర్పించడం తప్ప.*


~ గత జూలై ఇరవై ఆరవ తేదీన హిందీ ప్రాంతానికి చెందిన మిత్రులు ఎవరో గుర్తుచేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన దాన్ని చూసి వివరాలు తెలుసుకోవాలని అఖిల భారత అధికారి రాస్ బిహారీజితో మాట్లాడగా వారు మరిన్ని వివరాలు చెబుతూ ఉంటే ఆశ్చర్యచకితుడనై పోయాను నీరాఆర్య గారి జీవిత చరమాంకం హైదరాబాదులోనే గడిచిపోయిందని అక్కడే మృతి చెందింది అని చెప్పగానే నేను మరింత ఉద్విగ్నతకు లోనయ్యాను. ఈ విషయం గురించి చాలామందిని సంప్రదించాను.... వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది . 


    ఇది వ్రాస్తున్నంతసేపు మనసంతా మనసంతా దుఃఖ భారంతో గందరగోళంగా ఉంది కళ్ళలో కన్నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి నాలుక తడారిపోతున్నది.