1, మార్చి 2021, సోమవారం

మన మహర్షులు- 35

 మన మహర్షులు- 35


లోమశ మహర్షి 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹 


ఒకనాడు లోమశ మహర్షి 

అరణ్యక మహర్షి  వద్దకు రావడం జరిగింది.

అరణ్యకుడు ఆయనకి సాష్టాంగ నమస్కారంచేసి మహాత్మా! సంసార సాగరం నుంచి తరించే వుపాయం చెప్పండన్నాడు.


లోమశ మహర్షి 'వత్సా! 'రామ'మంత్రం కంటే సంసారం నుంచి దాటించే మంత్రం ఇంకొకటి లేదు. ఇది వేదశాస్త్ర పరమ రహస్యం ఇంతకంటే వేరు మంత్రాలు, ప్రతాలు, క్రతవులు, యోగాలు, యాగాలు, దానాలు, మౌనాలు ఏమీలేవు 'అని చెప్పాడు.

ఇంకా  శ్రీరామచంద్రమూర్తిని ఇలా వర్ణించాడు..


అయోధ్యలో చిత్రమండపంలో వున్న కల్పవృక్షం క్రింద వున్న నవరత్నాలు పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చుని, పూర్ణిమనాటి చంద్రుడిలా ఉండే మొహంతో నీలిరంగులో వుండే శరీరంతో, మణులు పొదిగిన కిరీటంతో, నల్లటి జుట్టుతో, మకర కుండలాల్తో, వైఢూర్యమణుల్లాంటి పలువరుసతో, పువ్వులావుండే నాలుకతో, శంఖంలాంటి మెడతో, ఎత్తైన భుజాల్లో, శుభలక్షణాలు కలిగిన ముక్కుతో, రకరకాలయిన ఆభరణాల్లో వున్న ఆజానుబాహువులయిన చేతుల్లో, లక్ష్మీనివాసము విశాలము అయిన వక్షస్థలంతో,

గంభీరమైన నాభి, మృదువైన పాదాలు కలిగి దేదీప్యమానంగా వెలిగే శ్రీరామచంద్రుణ్ణి మనసారా ధ్యానించి, చేతులారా పూజించి, నోరార భజించి చాలా సులభంగా మోక్షాన్ని పొందవచ్చు. ఇంతకన్న సులభమయిన మార్గం లేదని చెప్పాడు లోమశ మహర్షి.


 లోమశ మహర్షి ఇంకా రామకథంతా చెప్తున్నాడు. అరణ్యక మహర్షి వింటూ

వున్నాడు.


వత్సా! త్రేతాయుగంలో సూర్యకులంలో విష్ణుమూర్తి నాలుగు రకాల ఆకృతుల్లో పుట్టాడు. లక్ష్మణుడితో కలిసి కౌశికుడి యజ్ఞం పాడుచేస్తున్న మారీచ సుబాహుల్ని చంపి అహల్యాశాపవిమోచనంచేసి, మిథిలకి వెళ్ళి శివధనుస్సు విరిచి సీతని వివాహం చేసుకున్నాడు. అప్పటికి రాముడికి పదిహేనో సంవత్సరం.


అరణ్యవాసానికి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు చిత్రకూట పర్వతం మీద వుండి తర్వాత పంచవటి వెళ్ళాడు. అక్కడే రావణుడు సీతనెత్తుకుపోయాడు. మార్గశిర శుద్ధ  ఏకాదశినాడు రాత్రి హనుమంతుడు సీతని చూశాడు. ద్వాదశినాడు సీతని పలకరించి త్రయోదశినాడు లంకను కాల్చి పూర్ణిమనాడు తిరిగి వెళ్ళి ఏడోరోజు కి రాముణ్ణి కలిశాడు శ్రీరాముడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం అష్టమినాడు బయలుదేరి ఏడురోజులకి

సముద్రతీరం చేరుకుని దశమినాడు సేతువు మొదలుపెట్టి, త్రయోదశికి పూర్తి చేసి సైన్యాన్ని దాటించి శుక్ల ద్వాదశి నుంచి కృష్ణచతుర్ధి వరకు యుద్ధంచేసి రావణుణ్ణి చంపాడు.


మొత్తం డబ్బయి రెండు రోజులు పట్టింది యుద్ధానికి, పద్నాలుగు సంవత్సరాలు పూర్తవగానే రాముడు అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం చేయించుకున్నాడు అప్పటికి రాముడికి నలభై రెండు, సీతకి ముఫ్ఫైయి మూడు సంవత్సరాలు. సీత

రావణుడి చెరలో పదకొండు నెలల పద్నాలుగు రోజులుంది. 


రాముడు అశ్వమేధయాగం చేసినప్పుడు రధం నీ దగ్గరకి వస్తుంది. నువ్వు రాముని

చూసి ఆయన పాదాల దగ్గరే మోక్షం పొందుతావని లోమశ మహర్షి, అరణ్యక మహర్షికి చెప్పాడు.


 ఈ విధంగా  జరగబోయేది కచ్చితం గా తెలియజేశాడు లోమశ మహర్షి .


ఒకనాడు ఉత్కచుడు లోమశ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి అనేక వృక్షాలను కూకటి వేళ్లతో పెకలించి వేశాడు. ఉత్కచుడి చర్యలకు లోమశ మహర్షి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. పాము కుబుశాన్ని విడిచినట్లు నీవు శరీరాన్ని వదలిపెడతావని శపించాడు. దీంతో తన తప్పును తెలుసుకున్న ఉత్కచుడు ఆ మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు. అతడిలో కలిగిన పశ్చాత్తాపానికి లోమశుడు సంతోషించి నా శాపానికి తిరుగులేదు... కాబట్టి నీవు మరు జన్మలో శకటాసురునిగా జన్మించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి వల్ల మోక్షం పొందుతావని తెలిపాడు.


లోమశ మహర్షి ధర్మరాజు తదితరులను తీర్ధయాత్రలకు తీసుకువెళ్లి  భృగు తీర్థము, పుష్కరము, గయ మొదలైన 

తీర్ధమల  ప్రాశస్థ్యము తెలియజేస్తాడు.వారికి ధర్మసూత్రాలను బోధిస్తాడు.


లోమశమహర్షి ప్రణీతమైన 'లోమశసంహిత' ఆయుర్దాయాన్ని గురించీ, వివిధ రకాలైన మరణాలలోని తేడాలను గురించీ, తనదైన పంధాలో వివరించింది.


మన ప్రాచీన గ్రంధాలలో మానవులకు రాబోయే అరిష్టాలను ఎలా గుర్తించాలి, వాటినుంచి ఎలా రక్షించుకోవాలి అన్న విషయాలు ఎన్నో చోట్ల మహర్షులచేత చర్చించబడ్డాయి.


వాటిని స్వీకరించి ఆచరించి మేలు పొందటం విజ్ఞుల లక్షణం. 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

ఆత్మ పరమాత్మ

 నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే, సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. మంగళాశాసనం ఎవరికి భగవంతునికా లేక ఆ రూపంలో గల ప్రకృతి పరంగా గల జీవులకా . ఆత్మ పరమాత్మ ఆటమ్ సూపర్ ఆటమ్. పరాశక్తి సూపర్ ఆటమ్. ఆ శక్తి వేంకటాద్రి కొండ .వేంకట అద్రి. కొండలను నాశనం చేయుట మన లక్షణం. సృష్టి కారణం మనమా లేక వేరొకరెరైనానా. మన విలాసాలాసాలకు ప్రకృతిని నాశనం. కొండ గుట్ట లేకపోయిన మన వునికి? నిత్యముగా వుండాలి శరీరంతో దర్శించుటకు యనే సాధనకు. నిరవద్యాయ ఎల్లవేళల చూచుట కష్టం. రాత్రి పగలు తేడా వుంది. రాత్రి నిద్రలో కూడా జాగృదావస్థ చూచుట  కష్టం. స్వప్నం లోనే భగవత్సాత్సాక్షాత్కారం. 

లేనియెడల మానవ నేత్రములుకు అంత అనంతమైన శక్తిని దర్శించుటకు వీలుకాదు. సత్యానంద చిత్ ఆత్మనే. చిత్తం ఆత్మ స్వరూపం. ఆత్మ మనస్సు ఆధారం. మనస్సు పంచభూతాత్మకమైన దేహం ఆధారం. యీ రోజు వున్నది రేపు లేదు. నిత్యాయ ప్రతీ నిత్యం భగవత్ తత్వం నిండియున్నది. మనం వుండుటలేదు. కాంతి రూపంలో. కిరణ లక్షణము భగవంతుడు. సత్యమే ఆనందం. సర్వ ఆత్మయందు పరమేశ్వర స్వరూపమే. అమ్మ కూడా అయ్యవెంటే ఎందుకంటే అయ్యపోషణ కనుక ఆ అమ్మకు కూడా.పోషణ జీవోధ్ధరణకే. జీవవుధ్ధరణ సంపాదన కాదు ఆత్మ తత్వం తెలియుటకే. సత్యం ఎలా సూక్మమెూ భగవత్ శక్తి కూడా అనగా వేంకటాద్రి కూడా అంత సత్యమే. వేం జీవులు యనగా  క జీవతత్త్వం. క అనగా జీవుడు యని బాల మంత్ర వుపాసన ద్వారా. క జీవ తత్వం తెలియుటకే వుపాసన సమీపంలో యున్న తత్వాన్ని దర్శించి ఉప మనలో గల అమ్మ స్వరూపం చూచుట. అమ్మ స్రీ పురుష క్షేత్ర రక్షణ అనగా ప్రకృతి రక్షణ. జీవ రక్షణ. ప్రత్యక్షంగా చూచిన సూర్య శక్తి. పరోక్షంగా చంద్ర శక్తి యీ రెండింటి చలనమే అమ్మ రూపం. వేంకటాద్రి రూపంలో గల శక్తి తత్వం. దానిని నిరంతరం ధ్యానించుటే భగవంతుని తత్వం. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 *గుణపాఠం..*


ఆదివారం ఉదయం ఐదు గంటలకు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో స్వామివారి ప్రభాతసేవ కార్యక్రమాలు మొదలవుతాయి..అప్పటినుంచి మరో గంటా నలభై ఐదు నిమిషాలపాటు ఆ కార్యక్రమం అలా సాగిపోతూనే ఉంటుంది..ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆఖరి హారతి ఇచ్చిన తరువాత..భక్తులను స్వామివారి మందిరం లోకి దర్శనానికి అనుమతి ఇస్తాము..సహజంగానే ఆ సమయం లో భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది..మేమందరమూ ఆ హడావిడి లో ఉంటాము..


ఆరోజు ఉదయం ఏడున్నర గంటలకు కందుకూరు నుంచి వచ్చే మొదటి బస్సులో ఒక యువతి స్వామివారి మందిరానికి వచ్చింది..మందిరం లోపలికి వచ్చి.."ఇక్కడ ప్రసాద్ గారంటే ఎవరు?" అని నన్నే అడిగింది.."నేనే" అని జవాబు చెప్పి.."మీ రెవరు..?" అని అడిగాను.."ఇక్కడ సిద్ధిపొందిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకోవాలి అని వచ్చాను..ముందుగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి.." అన్నది.."అమ్మా..చూస్తున్నారు కదా..ఇప్పుడు మీతో మాట్లాడే వ్యవధి లేదు..అన్యధాభావించవద్దు..ఇంకొక రెండు గంటల తరువాత..భక్తులు రావడం తగ్గుతుంది..ఈలోపల మీరు వెళ్లి స్నానం చేసి..స్వామివారి దర్శనానికి రండి..ముందు స్వామివారి సమాధి ని దర్శించుకొని..ఆ తరువాత సమయం చూసుకొని..నాతో మాట్లాడవచ్చు.." అని చెప్పాను.."సరే.." అని వెళ్ళిపోయింది..మరో అరగంటకు స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చింది కానీ..లోపలికి వెళ్ళలేదు..నా టేబుల్ వద్దనే ఒక ప్రక్కగా నేలమీద కూర్చుని.."ప్రసాద్ గారూ.మీకు తీరిక దొరికిన తరువాత..మీతో మాట్లాడి..ఆపై స్వామివారి సమాధి వద్దకు వెళతాను..అక్కడ నా మనసులోని మాట చెప్పుకుంటాను.." అన్నది..


మరో గంట తరువాత..నా వద్దకు రమ్మని చెప్పి..ప్రక్కనే కుర్చీలో కూర్చోమని చెప్పి.."అమ్మా..ఇప్పుడు చెప్పండి.." అన్నాను..అంతవరకూ ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్న ఆమె..తన రెండు చేతులతో ముఖం కప్పుకొని..ఏడ్చేసింది..అలా ఒక ఐదు నిమిషాల పాటు ఏడుస్తూనే ఉన్నది..ప్రక్కనే ఉన్న మా ఆవిడ..ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి..ఓదారుస్తూ.."అమ్మా..నీ కొచ్చిన కష్టం చెప్పు..ఇప్పుడు నువ్వు స్వామివారి సన్నిధిలో ఉన్నావు..భయపడకు..వ్యధ చెందకు.." అని చెప్పింది..కొద్దిసేపటికి తేరుకొని.."నా పేరు సుశీల..పెళ్లై పదేళ్లు అవుతున్నది..మాకొక బాబు..వాడికి ఎనిమిదేళ్ల వయసు..థర్డ్ క్లాస్ చదువుతున్నాడు..మావారు సాఫ్ట్ వేర్ లో ఉద్యోగం చేస్తున్నారు..నేనూ కొన్నాళ్ళు ఉద్యోగం చేసాను..బాబు పుట్టిన తరువాత మానేసాను..ఖాళీగా ఉన్న సమయం లో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అని మావారితో చెప్పాను..నిజానికి ఆయన చెవిలో పోరు పెట్టాను..నేను ఖాళీగా వున్నాను..నేను నిర్వహిస్తాను..అని రోజూ మా వారితో చెప్పాను..ముందు ఆయన ఒప్పుకోలేదు..చివరకు ఒప్పుకున్నారు..ఇద్దరమూ బాగా చర్చించుకుని..చిట్ ఫండ్ వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకొని..మొదలుపెట్టాము..మొత్తం నేనే నిర్వహించేదాన్ని..మొదటి మూడేళ్ళూ చాలాబాగా నడిచింది..ఆ తరువాతే మా కష్టాలు మొదలయ్యాయి..చిట్ పాడుకున్న వాళ్ళు కొన్నాళ్ళు డబ్బు కట్టారు..ఆ తరువాత మెల్లిగా ఆలస్యం చేయసాగారు..మాకు రావాలసింది ఎప్పుడైతే ఆలస్యం అయిందో..మేము కట్టాల్సిన వాళ్లకు సకాలం లో చెల్లించలేకపోయాము..కొందరికి చెక్ లు ఇచ్చాము..అవి కూడా నేను సంతకాలు చేసి ఇచ్చాను..నాలుగేళ్లు తిరిగే సరికి..బాగా ఇరుక్కుపోయాము..ఇద్దరు ముగ్గురు నేనిచ్చిన చెక్ లు అడ్డం పెట్టుకొని కోర్టులో కేస్ వేశారు..ఇంకొక పదిహేను రోజుల్లో కోర్టుకు హాజరు కావాలి..మావారు నేను నలిగిపోతున్నాము..ఏ దిక్కూ తోచలేదు.. ఈ మాధ్య సోషల్ మీడియా లో ఈ స్వామివారి గురించి చదివి..మా వారితో చెప్పి..చివరి ఆశగా ఇక్కడికి వచ్చాను.." అని మళ్లీ ఏడ్చేసింది..


కొద్దిసేపటి తరువాత..స్వామివారి సమాధి ని దర్శించుకొని..స్వామివారి పాదుకులకు నమస్కారం చేసుకొని..ఇవతలకు వచ్చి.."స్వామివారిని వేడుకున్నాను..నా సమస్యకు పరిష్కారం దొరికితే..మావారితో సహా ఇక్కడకు వచ్చి..మూడు రాత్రుళ్ళు నిద్ర చేసి..అన్నదానం చేసి వెళతాను.." అని మొక్కుకున్నాను..అన్నది.."చూద్దాం తల్లీ..స్వామివారిని త్రికరణ శుద్ధిగా నమ్ముకో..మంచి జరుగుతుంది.." అని మేమిద్దరం చెప్పాము..మధ్యాహ్నం వెళ్లిపోయింది..మూడు నాలుగు నెలలు గడిచిపోయాయి..ఒక శనివారం నాటి సాయంత్రం ఐదు గంటల వేళ..సుశీల తన భర్త, కుమారుడితో కలిసి స్వామివారి మందిరానికి వచ్చింది..నేరుగా మా దంపతుల వద్దకు వచ్చి..మాకు తన భర్తను పరిచయం చేసి.."మా సమస్య ఒక రకంగా తీరిపోయింది..ఇక్కడి నుండి వెళ్లిన తరువాత..అమెరికా లో ఉన్న మా అన్నయ్య కు విషయం తెలిసి..నా అప్పులు తీర్చడానికి అవసరమైన నగదు సర్దుబాటు చేసాడు..ముందు కేసుల్లోంచి బైటపడ్డాను.. మాకు వెసులుబాటు కలిగింది..కానీ..గుణపాఠం కూడా నేర్పింది..స్వామివారు సకాలం లో దారి చూపారు..మా అన్నయ్య రూపం లో స్వామివారే మమ్మల్ని కరుణించారు..ఇంకెప్పుడు అత్యాశకు పోను..స్వామివారి వద్ద ప్రమాణం చేయడానికి వచ్చాను..ఇప్పుడిప్పుడే మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తున్నారు..త్వరలో వచ్చి నా మొక్కు చెల్లించుకుంటాను.." అని చెప్పింది..


సుశీల సమస్యకు పరిష్కారం చూపడమేకాక..జీవితం లో అత్యాశకు పోకుండా..చక్కటి పాఠం కూడా నేర్పారు స్వామివారు.


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

రాముడు అక్కడ ఉంటాడు. 🥀🪴

 🪴🥀భక్తులు ఎక్కడ ఉంటే 

రాముడు అక్కడ ఉంటాడు. 🥀🪴


ఈశ్వరుడు ఎక్కడో ఉండడు. గుళ్ళో ఈశ్వరుడు ఉంటాడు అన్నమాట యదార్థమే. కానీ నిజంగా ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? బాగా గుర్తు పెట్టుకోండి. హృదయంలో ప్రతి ఊపిరిలో ఆయన ఆరాదిస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడో, ఎక్కడ నిలుచుంటాడో, ఎక్కడ తిరుగుతాడో ఆయన వెంటనే తిరుగుతూంటాడు ఈశ్వరుడెప్పుడూ. రాముడు ఎక్కడుంటాడు అని చెప్తారో తెలుసా శాస్త్రంలో. రామచంద్రమూర్తిని నమ్ముకొని బ్రతుకుతున్నవాడు ఎక్కడ ఉంటాడో రాముడు అక్కడే ఉంటాడు. ప్రక్కనే ఉంటాడుట ధనుర్ధరుడై. ఆయన కూర్చుంటే కూర్చుంటాడు, నిలుచుంటే నిల్చుంటాడు, ఆయన వెడుతూంటే వెళతాడు. ఆయన పడుకుంటే గుమ్మం ముందు కూర్చుంటాడట. ఎందుకంటే ఆయనకి ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని. రామచంద్రమూర్తి తనను నమ్మిన వాళ్ళను రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుంటాడు అని. అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామభక్తులెక్కడ ఉంటారో అక్కడే సీతారామలక్ష్మణులు, హనుమ కూడా ఉంటారు. ఇది తులసీదాసు గారి జీవితంలో నిజమైంది. ఆయన రామదర్శనం అవ్వాలి అనుకుంటూ పడుకుంటే దొంగ వచ్చి లోపలికి వెళ్ళి దొరికినవి మూట కట్టుకొని బయటకు వద్దాం అనుకున్నాడు. తల బైట పెట్టాడు. రామలక్ష్మణులిద్దరూ కోదండాలు పట్టుకొని నిల్చొని ఉన్నారు. నన్ను నమ్ముకున్న వాడి సొత్తు ఎత్తుకు పోతావా నువ్వు అని. ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వెనక్కి వచ్చాడు. తెల్లవారే వరకు తల బైట పెడుతున్నాడు, లోపల పెడుతున్నాడు. రామలక్ష్మణులు ఇద్దరూ అలాగే ఉన్నారు. తెల్లవారింది. తులసీ దాసు గారు నిద్రలేచారు. దొంగ మూటకట్టుకొని కూర్చుని ఉన్నాడు. నువ్వు ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అని అడిగారు. బుద్ధి గడ్డితిని దొంగతనానికి వచ్చాం. అన్నాడు. పట్టుకెళ్ళపోయావా? అన్నారు. తీసుకు వెళదామని బయటికి వెళ్తే ఎవరో ఇద్దరు ఉన్నారు. ఒకాయన నల్లగా మేఘంలా ఉన్నాడు. ఒకాయన ఎర్రగా ఉన్నాడు. కోదండాలు పట్టుకొని నిల్చున్నారు. హడలి లోపలికి వచ్చి కూర్చున్నాం. అన్నారు. ఆయన అప్పుడు బయటికి వెళ్ళి చూశారు. ఆయన ఏడ్చారు అప్పుడు. నిద్రపోకుండా స్వామీ నా పర్ణశాల ముందు కాపలా ఉన్నావా? మీరెంత ధన్యులురా..ఇన్నిమార్లు దర్శనం పొందారు, నాకు అవలేదు అని ఏడ్చారు. ఎవడు రాముణ్ణి నమ్మాడో వాడున్నచోట రాముడు ఉంటాడు తప్ప ఇంకొక చోట రాముడు ఉంటాడు అనుకోకండి. రామభక్తులెక్కడ ఉంటారో అక్కడే సీతారాములుంటారు. ఇది ప్రత్యేకించి రామావతారంలో మెండుగా కనిపిస్తోంది. త్యాగరాజ స్వామి విషయంలో, రామదాసు గారి విషయంలో. గంజి గుంటలో పడిపోయిన పిల్లవాడి శవాన్ని ఉడికిపోయిన దానిని తీసుకెళ్ళి రాముడి దగ్గర పెట్టి నువ్వు ఇచ్చిన కొడుకు, ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే నీలో కలిపేసుకో. అంతరాలయంలో పెట్టి తలుపులు వేసి రామనామ భజన చేశాడాయన. పిల్లవాడు పరుగెత్తుకుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో పడుకున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? ఈమధ్యనే కదా రామదాసు గారు. ఆయన వాడిన మంగళసూత్రంలో శతమానం కూడా మనం కల్యాణంలో చూస్తూనే ఉన్నాం కదా! రాముడు ఉన్నాడు. మీరు నమ్మండి. ఇప్పటికీ రాముడు తిరుగుతూనే ఉన్నాడు. మీరు నమ్మి ఉన్నచోట మీవెంట రాముడున్నాడు. మీరు పడుకుంటే మీరు పడుకున్నచోట ఉన్న కుర్చీలో ఆయన ఉంటాడు. ఎక్కడ రాముణ్ణి నమ్మిన వాడున్నాడో అక్కడే సీతారాములు కూడా ఉంటారు. అందుకే శాస్త్రంలో ఒక మాటుంది. రాముణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గం రామభక్తుణ్ణి తెచ్చుకోవడం. రామభక్తుడొస్తే సీతారాములొస్తారు.


శ్రీరామ జయరామ జయజయ రామ🙏


🔱 *ఓం నమః శివాయ* 🔱