ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
23, ఆగస్టు 2023, బుధవారం
సత్యనారాయణ స్వామి వ్రత కధల
💐💐💐సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం 💐💐💐💐
మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము.
ఈ వ్రత విధానం స్కాందపురాణం రేవాఖండంలో వివరింపబడి వున్నది. ఇక్కడ 5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి.
1. మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయాణుని దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు.
ఈ అధ్యాయం మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతోంది. భరోసా ఇస్తోంది. మన పూర్వ జన్మ పాపం ఇప్పుడు మనకు రావలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో ( ఒక కుళాయి కొట్టంలో నీటిని ఒక అడ్డంకి ఎలా ధారను ఆపుతోందో) మనకు అవగతమవుతుంది. వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూదికొండను ఒక నిప్పురవ్వ మండించి తొలగించినట్టు ఎలా తీరుస్తాయో చెబుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మ ఫలమే. వాటిని ఎలా తగ్గించుకోవాలో మోక్షం మన పరమపదం అని చెప్పడానికి నారదుడు మన తరఫున స్వామి వారికి నివేదించి పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు.
2. రెండవ అధ్యాయంలో ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టేన్కిన్చారో తెలియచేస్తారు. ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టేలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతాడో వివరిస్తుంది. ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాలనుండి గట్టేన్కించడానికి స్వామి వారే ఎలా వస్తారో చెబుతుంది. త్రికరణశుద్ధిగా మనం మన కర్మ చేస్తే కష్టాలు ఎన్నో రోజులు వుండవు. కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకుని ఉద్ధరిస్తాడో చెబుతుంది. కామితార్ధప్రదాయి స్వామి. దేవుడు కేవలం కర్మ సాక్షి. కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుసుతుంది. ముందుగా ఇహసౌఖ్యం ఇచ్చి, వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరు ఉతరోత్తరాజన్మలలో మోక్షం సిద్ధింపచేస్తాడు.
౩. ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో, తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగింది, తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడయ్యాడో వివరిస్తుంది ఈ కధ. తరువాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో, దేవుని మోసం చెయ్యడం వలన ఎలా కష్టనష్టాలు అనుభావిస్తాడో చెబుతారు. అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో, మరల తిరిగి వారి ఆడవారు వ్రతం చేస్తానని సంకల్పించుకోవడం వలన యలా అతడు కష్టాలనుండి బయటపడ్డాడో తెలుస్తుంది.
ఒకరికి ఒక మాట ఇచ్చామంటే కట్టుబడి వుండాలి. అది మన తోటి వారికైనా దేవునికైనా. లోభం వలన అతడు మాట తప్పి, తనవారికి కష్టాలు తెస్తాడు. ధర్మాచరణ, వచనపాలన చాలా ముఖ్యం. ఇక్కడ తనకు పూజ చెయ్యలేదని శపించేటంత శాడిస్టు కాదు దేవుడు. అతడికి ఎన్నిసార్లు గుర్తుకొచ్చినా లోభించి, మొహానికి లోనయి మోసం చేసే ప్రవృత్తి వున్నవాడు అతడు. అతడెందుకు మనం అందరం కూడా అటువంటి వైశ్యులమే. నాకు ఇది చెయ్యి నీ హుండిలో ఇన్ని వందలు, వేలు వేసుకుంటాం అని బేరం పెడుతున్నాం. సుఖాలోచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవడూ అడగడు, కేవలం కష్టాల్లో మాత్రమె మనకే ఎందుకు వచ్చాయి అని వగుస్తాము. ఇక్కడ కధ మనలో వున్న లోభాత్వాన్ని అణచమనే. అలాగే మనం చేసిన పాపం, మననే కాదు మన కుటుంబాన్ని కూడా కట్టి కుదిపేస్తుంది. అలాగే మన కుటుంబం వారు తప్పు తెలుసుకుని మరల శరణాగతి చేస్తే అది మరల మనను నిలబెడుతుంది. ఇక్కడ నేను, నా కుటుంబం వేరు కాదు. అంతా ఒక్కటే, కష్టాలయినా సుఖాలయినా కలిసే అనుభవిస్తాము. మన ధర్మం మననే కాదు, మన వారినందరినీ రక్షిస్తుంది, అలాగే పాపం కూడాను.
4. ఈ అధ్యాయంలో ఆ వైశ్యుడు మరల ఎలా మొహం లో పడిపోతాడో, క్రోధంతో ఒక సాధువును ఎలా హేళన చేస్తాడో చెప్పారు. అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చవిచూసిందో చెబుతుంది.
పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతుంది. ఒక పుణ్య కార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి, క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇత: పూర్వం చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవునికి వుండదు. ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం చూడండి, అక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే వుండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరల వారివి వారికి ఇచ్చేస్తాడు. కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం నేర్పుతాడు. అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు. ఈ కధల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తోంది. అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది. దాన్ని అలక్ష్య పరచాకూడదని మనకు చెప్పే కదా ఇది. అంతే తప్ప ఆయన మనల్ని కష్టపెట్టి ఆనందించే స్వభావం వున్నవాడు కాదు.
5. తుంగధ్వజుడనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వలన తాను నష్టపోయినట్టు భ్రమకు లోనయి తప్పు తెలుసుకుని తిరిగి ప్రసాద స్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు. వ్రతం ఎక్కడ జరిగినా భక్తిపూర్వకంగా వుండాలి. వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువ అంతరాలను దేవుడు చూడడు. భక్తి మాత్రమె ఆయనకు ప్రధానం. మద మాత్సర్యాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో, వివేకం ఉదయింప చేసి ఆ లీలను ఎలా ఉపసంహారం చేసారో చూపించారు.
💐 కొన్ని నీతి సూత్రాలను మనం ఈ కధల ద్వారా తెలుసుకుంటాం.💐
1. ఈ వ్రతం చాతుర్వర్ణాల వారు ఈ ఐదు అధ్యాలలలో ఎలా వ్రతం చేసుకుని ఉద్ధరింపబడ్డారో చూసాక మన పూజలు, వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమె పరిమితం అని చేసే విషప్రచారానికి గొడ్డలిపెట్టు.
2. ఈ కధల ద్వారా కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాలను ఎలా దైవానుగ్రహం వలన అదుపులో పెట్టుకుని ధర్మార్ధకామమోక్షాలు సాధించవచ్చో వివరిస్తాయి.
3. మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి. సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ వలన ఎలా మంచి జరుగుతుందో, లేకపోతే కష్టాలు ఎలా పడతామో కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది.
4. దైవానుగ్రహం ఎలా మన దుష్కర్మల ఫలాన్ని దూరం చేస్తుందో తెలియచేస్తుంది.
5. చెడు త్వరగా అర్ధమవుతుంది. మంచి చేస్తే మంచి వస్తుందని ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాం, మన మెంటాలిటి తప్పు చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే యిట్టె పట్టుకుంటుంది. వాటిని చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను చెబుతుంది.
ఇవే కాదు ఎన్నో మరెన్నో నీతి నియమాల సమాహారం ఈ వ్రతకధా తరంగం. స్వామిని పూర్తిగా నమ్మి శరణాగతి చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నతిస్థితిని పొంది ఇహపరసౌఖ్యాలను పొందుదాం. విమర్శించే సమయంలో ఒక్క వంతు మనం ఈ కధ మనకు ఏమి చెబుతోంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనకు మరెన్నో విషయాలు బోధపడతాయి అని నా మనవి.
మానవుల్ని పతనం ఎలా మొదలైందో
*ఈ భూమి మీద మానవుల్ని పతనం ఎలా మొదలైందో మీకు తెలుసా ఐతే చదవండి ఈనా మెసేజిని*
!!! దేవుడు మనుషుల్ని సృష్టిస్తూ సృష్టిస్తూ
!!! వాళ్లు బతకడానికి ఒక ఆవుని కూడా చేతుల్లో పెట్టాడు
!!! వ్యవసాయం చేసుకోవడానికి బూమి ఇచ్చాడు
!!! దున్నడానికి ఎద్దు ఇచ్చాడు
!!! ఎరువు కోసం అవు గేదెలను ఇచ్చాడు
!!! ఇలా మనిషి సృష్టి నిలవడానికి ఆవు నీ మమేకం చేశాడు
!!! అలా కొన్ని లక్షల తరాలు కేవలం ఆవులు గేదెలు వాటి ఎరువు బూమి వ్యవసాయం గా కొనసాగుతుంది
!!! మనిషి పతనం ఎప్పుడు మొదలైంది...??
!!! ఎప్పుడైతే మనిషి ఆవుని కసాయి వాడికి అమ్మి సొమ్ము చేసుకున్నాడో
!!! అప్పటి నుండి వారి వారాసత్వాలు ఆవు పాపానికి బలై పోతూ వస్తున్నారు
!!! ఆవుల్ని కసాయికి అమ్మక ముందు ఏ క్యాన్సర్ లేదు
!!! ఏ ఏయిడ్స్ లేదు,
!!! ఏ గుండె జబ్బు లేదు
!!! ఏ pcod గర్భసంచి సమస్య లేదు
మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి....?
!!! మనిషికి పొద్దున లేవగానే టీ కావాలి..దానికి పాలు కావాలి ...పాలు కల్తీ
!!! మనిషికి అన్నం లోకి నెయ్యి కావాలి.....నెయ్యి కల్తీ
!!! అన్నం లోకి పెరుగు కావాలి...పెరుగు కల్తీ
!!! వేడి చేస్తే మజ్జిగ కావాలి..మజ్జిగ కల్తీ
!!! మనిషికి గాయం అయితే వెన్న కావాలి...వెన్న కల్తీ
!!! సగటు మనిషి జీవితం ఆవుతో ముడి పడి ఉంది అనే విషయాన్ని మర్చిపోయారు జనాలు
!!! కానీ వేరే గ్రహం లో ఏముంది కనుకుంటున్నరు.. కళ్ల ముందు కనుమరుగు అవుతున్న జీవితాన్ని మాత్రం ఏ శాస్త్ర వేత్త కనిపెట్ట లేకపోతున్నారు
!!! ఒకడు కోటి రూపాయలు పెట్టీ లగ్జరీ విల్లా కొనగలుగు తున్నాడు కానీ స్వచ్ఛమైన నాణ్యమైన పాలు కొనలేకున్నడు
!!! ఒకడు కోటి రూపాయల కార్ లో తిరుగుతున్నాడు కానీ నాణ్యమైన పెరుగును అన్నం లో తినలేకపోతున్నాడు
!!! ఆలోచించండి. కార్ వల్ల ఆరోగ్యం పెరగదు
!!! లగ్జరీ విల్లా వల్ల ఆరోగ్యం పెరగదు
!!! కానీ నాణ్యమైన పాల వల్ల ఆరోగ్యం పదింతలు పెరుగుతుంది
!!! నాణ్యమైన పెరుగు వల్ల రోగాలకు దూరం గా ఉండొచ్చు
ఇప్పుడు రోగాలకు మందు లు కొట్టిన ఆహారం ప్లాస్టిక్ అంటున్నారు అందరూ... కానే కాదు
!!! మనిషి ఆవుకు దూరం అవ్వడం వల్లే రోగాలు వస్తున్నాయి అని నేను అంటున్నాను
!!! పొద్దున నుంచి సాయంత్రం వరకు పాల తో తయార్ అయిన ఆహారం ఎన్ని రకాలు తింటున్నమో గ్రహించండి
!!! అవి స్వచ్ఛమైన పాల తో చేసినవా కెమికల్ తో తయార్ చేసినవా...??
!!! నా చిన్నప్పుడు మా అమ్మ పెరుగు కోనుకాస్తే పొద్దున తృప్తి గా తిన్నవాన్ని
!!! రాత్రి పెరుగు తిన్నప్పుడు మా అమ్మను తిట్టేవాన్ని ఛీ పుల్లగా ఉంది నాకు వద్దు అని
!!! అలాంటిది ఇప్పుడు పెరుగు పాకెట్ కొంటే పడి రోజులు అయిన పులుపు రావడం లేదు అంటే అర్దం ఏంటి...??
!!! ఒకప్పుడు పొద్దున పాలు సాయంత్రానికి విరిగి పోయేవి
!!! ఇప్పుడు పది రోజులు ప్రిడ్జ్ లో పెడితే బాగుంటున్నాయి పాకెట్ పాలు
!!! అదే మన గేదె పాలు ప్రీడ్జ్ లో పెట్టండి తెల్లారి కళ్ల పాడై పోతాయి
!!!! అంటే అర్దం ఏంటి..?? పుల్లగా అవకుండా కెమికల్ కలుపుతున్నారు
!!! పాలు విరిగి పోకుండా ఉండటానికి కెమికల్ కలుపుతున్నారు
!!! సో ఇప్పుడు అర్దం అయింద...?? మనిషి రోగాలకు కారణం పాలు పాలేతర వస్తువులే కారణం
!!! ఒక గొప్ప విల్లా కొనడం గొప్ప కాదు..విల్లా ముందు చిన్న గుడిసె దాంట్లో ఒక ఆవు ఒక గేదె పెట్టడం గొప్పదనం
ఇప్పటికైనా ఈ సాఫ్ట్వేర్ లు హార్డ్వేర్ లు వదిలి రెండు అవుల్ని కొనుకొని ఊరికి పోయి 3 పూటల మంచి మనం పందిచుకున్న ఆహారం తినడం గొప్ప
ఎలాగోలా బ్రతకడం గొప్ప కాదు .ఆరోగ్యంగా తిని బ్రతకడం గొప్ప
ఫైనల్ గా :-
మనం అందరం మట్టికి దూరం అయ్యాం..ఇప్పుడు అందరం మళ్ళీ మట్టికి దగ్గర అవుదాం.. కల్లు తెరవండి ఆరోగ్యంగా జీవించండి..
ఏదైనా అనారోగ్యం ఆవు యజమాని ఇంట్లో వాళ్ళకి వస్తె..ఆ అనారోగ్యానికి విరుగుడు మందు తిని ఆవు ఇంటికి వచ్చి పాలు ఇస్తుంది అంటా..ఆ పాలు తాగినా వాళ్ళకి అనారోగ్యం నుంచి విముక్తి అవుతారని చరిత్ర చెబుతుంది
సో ..చిరిగిన చొక్కా అయినా వేసుకో..ఒక్క ఆవుని మాత్రం పెంచుకో
గుడిసెలో ఆయినా బ్రతుకు కానీ ఆవుని మాత్రం పెంచు🙏
సాంగత్యం ఎలా ఉండాలి?
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*సాంగత్యం ఎలా ఉండాలి?*_
🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
✳️ _*భగవంతుని సృష్టిలో ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది.*_
✅ _*బియ్యపుగింజకూ, వరిగింజకూ మధ్య ఉన్న సంబంధంలో ఎంతో గొప్పఆధ్యాత్మిక విజ్ఞానమున్నది.*_
✅ _*పొట్టు ఉంటే వరి గింజ. పొట్టును తొలగిస్తే బియ్యపు గింజ. పొట్టు ఉంటేనే గింజ తిరిగి మొలకెత్తుతుంది. పొట్టును తొలగించినట్లయితే గింజ తిరిగి మొలకెత్తదు. పొట్టు అనేది అజ్ఞానం లాంటిది. అజ్ఞానం ఉంటే జీవుడు. అజ్ఞానం తొలిగిపోతే దేవుడు. అజ్ఞానం కలవాడికి పునర్జన్మ ఉన్నది. అజ్ఞానం తొలగినవాడికి పునర్జన్మ లేదు.*_
✳️ కనుక, మనమందరమూ సద్గ్రంథ పఠనం చేసి, సజ్జన సహవాసం చేసి, సత్సేవ చేసి, ఇలాంటి సత్సంగంలో చేరి అజ్ఞానాన్ని తొలగించుకొనే ప్రయత్నంచేయాలి.
🪷 _*సాంగత్యం ఎలా ఉండాలి?*_ -
కధ: 💐
✳️ ఒకసారి ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు, ఏమి దొరకలేదు, అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతోంది. అప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంస ఎగురుతూ అక్కడకు వచ్చింది, ఎవరో పడుకున్నాడు, అతనిపై నీడ రావడం లేదు, కలత చెందుతున్నాడని, అతనిపై ఎండవస్తోంది అని గమనించి, ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరచి కూర్చుంది. వేటగాడు ఆ హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది.
✳️ కొంత సమయం తరువాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు, ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుని, హంసతో మాటలు కలిపింది. ఇటు అటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా, అతని మీద రెట్ట వేసి ఎగిరిపోయింది. అప్పుడు ఆ వేటగాడు లేచి ఇటు అటు కోపంగా చూసి వెంటనే విల్లు తీసి ఎదురుగా కనిపించిన హంసను కొట్టాడు. హంస కింద పడి చనిపోతూ, నేను నీకు నీడ ఇచ్చి సేవ చేసాను. నీవు నన్ను చంపావు. ఇందులో నా తప్పు ఏమిటి అని అడిగింది.
🪷 అప్పుడు వేటగాడు విషయం గ్రహించి ఇలా అన్నాడు. నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు. నీ ఆలోచనలు నీ శరీరంలాగే అందంగా ఉన్నాయి.
నీ ఆచారాలు స్వచ్ఛమైనవి. నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే ఉన్నావు. కానీ నీవు ఒక్క పొరపాటు చేసావు, కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు, వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది. ఆ దుష్ట కాకి సాంగత్యం క్షణకాలమే అయినా నిన్ను మరణ ద్వారం వద్దకు తీసుకువెళ్ళింది.
✳️ అందుకే, మన పెద్దలు ఎల్లప్పుడూ చెపుతుంటారు మంచి సత్సాంగత్యం లోనే వుండమని.
✅ _*సత్సంగము ద్వారా జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి.*_
_*సత్సంగత్వే - నిస్సంగత్వం*_
_*నిస్సంగత్వే- నిర్మోహత్వం,*_
_*నిర్మొహత్వే - నిశ్చల తత్వం,*_
_*నిశ్చల తత్వే - జీవన్ముక్తిః*_
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*
*సేకరణ:* వాట్సాప్ పోస్ట్
🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
గురుముఖంగా
పుస్తక ప్రత్యయాధీతం
నాధీతం గురుసన్నిధౌ|
సభామధ్యే న శోభన్తే
జారగర్భా ఇవ స్త్రియః||
*తాత్పర్యం*
గురుముఖంగా నేర్వక పుస్తకం ద్వారా నేర్చిన విద్యగలవారు వ్యభిచరించి గర్బం దాల్చిన స్త్రీలవలే శోభిల్లరు.
(పుస్తకం ద్వారా నేర్చిన విద్యకంటే గురుముఖతః నేర్చిన విద్య అన్నివిధాల విలువైనది.)
సంతోషము స్వార్థము
*1839*
*కం*
మన సంతోషము స్వార్థము
మనవారలసంతసమ్ము మర్యాద యగున్
జనులందరిమోదమ్ములు
మనిషికి పరమార్థమగును మరువకు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మనం సంతోషంగా ఉండాలనుకోవడం స్వార్థం, మనవాళ్ళు సంతోషం గా ఉండాలనుకోవడం మర్యాద, కానీ జనులందరిసంతోషం కోరుకోవడం మనిషి కి పరమార్థమని మరువవద్దు.
*ఉదాహరణ*:-- మన సంతోషం కోసం కొన్ని జీవులను చంపితినడంకంటే అవి కూడా సుఖసంతోషాలతో జీవించాలనుకోవడమే మనిషి కి పరమార్ధం, ఎందుకంటే మనిషి ఎంతో తెలివైన వాడు, సమర్ధుడు, కావున రుచిగా ఏ శాకమునైనా వండుకుని తినగలడు,తన శక్తి సామర్థ్యాలతో సాటి జీవాలను కూడా బతకనీయడమే నరజన్మకు సార్థకమవుతుంది, అదే పరమార్ధం.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
హిందువుల్లో లోపాలు?
🌾🌺🌾🌺🌾🌺🌾🌺🌾
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*హిందువుల్లో లోపాలు?!*
*సమన్వయమే సనాతనం..... సామరస్యమే భారతీయం*
*మతం మారుతున్నది కేవలం హిందువులు మాత్రమే.*
*మార్చుతున్నది హిందువులను మాత్రమే.*
*ఈ మార్చేక్రమంలో పాఠశాలలు, వైద్యశాలలు అన్నీ వారి - కార్యాలయాలవుతున్నాయి. అయితే ఎలా హిందువులను మాత్రమే మార్చగలుగుతున్నారు! చాలా కాలం క్రితం హింస, అధికార దౌర్జన్యం వంటివి కారణాలు. తరువాత ప్రలోభాలు. కానీ, ఇప్పుడు ప్రలోభాలతోపాటు, మరేవో కారణాలు ఉన్నాయి.*
*ప్రధాన కారణాలు - హిందువులకు కొరవడిన స్వాభిమానం, తమ మతంపై పరిజ్ఞానం లేకపోవడం, ఒక నియమబద్ధమైన మతానుష్ఠానం శూన్యమవడం, గౌరవం లేకపోవడం - ఈ నాలుగు. దీనికి తల్లిదండ్రులే బాధ్యులనాలి. వారిలో ఉన్న ఈ నాలుగు కారణాలచేతనే తమ పిల్లలకు కూడా పరంపరని అందించలేకపోయారు.*
*ఇతర మతాలలో బాలబాలికలకు కూడా వారి మతంపై ఒక అభిమానం, గౌరవం ఉ ంటాయి. హిందూ బాలబాలికలకు ఏ కోశానా ఆ రెండూ గోచరించవు. మతం పట్ల ఒక నిబద్ధత ఉండదు. కేవలం కోరికల కోసం ఒకసారి ఎప్పుడో గుడికి వెళ్లడం తప్ప, పెద్దల ప్రమేయంతో ఒక నియమబద్ధంగా వెళ్లడం, మతగ్రంథాలను అధ్యయనం చేయడం లేదు. పైగా ఆచారాలను హేళన చేయడం, దేవీదేవతలను కించపరచడం, అర్థరహితమైన ప్రశ్నలు వేయడం అలవాటు. అది 'తార్కికబుద్ధి' అనుకుంటాం కానీ, అది శరత్వం అని తెలుసుకోలేం.*
*చిత్రమేమిటంటే - ఈ దేశంలో నాస్తికులలో అత్యధికులు హిందువులు. నాస్తికునికి ఏ మత విశ్వాసమైనా మూఢత్వమే - గుడ్డి నమ్మకమే. కానీ ఈ దేశపు నాస్తికునికి మాత్రం హిందూమతం మాత్రమే అంధవిశ్వాసం కింద లెక్క ఇతర మతాల విశ్వాసాల విషయంలో 'కిమ్మనరు'. పైగా 'వారి మనోభావాలను గౌరవించాలి' అంటారు. చివరకు న్యాయరంగ ప్రముఖుల మాటలూ, ఇలాగే ఉంటాయి. ఆ నాస్తికులకు ఎన్నో ఛానల్స్ పెద్ద పీటలు వేసి వినోదం చేస్తాయి.*
*మన బాలబాలికలు, యువత కూడా ఇతర మతాలవాళ్లను, వారి మతనిష్ఠను చాలా గౌరవిస్తారు.*
*తల్లిదండ్రులు ఏ మతపరిజ్ఞానం పొందే ప్రయత్నం చేయక, పిల్లలకు అందించే ఉద్దేశం లేక పెంచిన తీరు ప్రతి ఇంటా కనిపిస్తున్నదే. బైట బడులకు పంపిస్తున్నారనుకుంటారే కానీ, అక్కడ మతప్రచారకుల కుతంత్ర ప్రభావంతో పిల్లల ఆలోచనాధోరణి విషపూరితమౌతోందని. గమనించడం లేదు.*
*ఈ మధ్య ఒక విద్యార్థినిని ఇంట్లో ఒక పండుగనాడు బొట్టుపెట్టుకోమంటే మొరాయించింది. అంతే కాదు. ఒక ద్వేషభావాన్నే వెళ్లగక్కింది. కారణం ఆమె బడిలో అన్యమత ప్రచారం చేసే ఉపాధ్యాయుల ప్రభావం.*
*ఇంగ్లీష్ భాషా చదువులకోసమని కొన్ని దశాబ్దాల క్రితం నుండే 'కాన్వెంట్'లలో చేరినదాని ప్రభావం, కొన్ని తరాలను సంస్కృతికి దూరం చేసింది. ఇప్పుడు సెక్యులరిజం, మతప్రచార స్వేచ్ఛ వంటివి అడ్డం పెట్టుకుని చొరబాటుగా చేస్తున్న 'బ్రెయిన్ వాష్' సామాన్యం కాదు.*
*పైగా పిల్లల జీవితం, పాఠశాల నుండి కళాశాలల వరకు క్రమంగా ఇంటి అనుబంధంనుండి దూరం చేస్తున్నదే. వారికి ఇల్లు, పరంపర కంటే బైట వ్యాపకాలు, విద్యార్థి జీవితమే ఎక్కువ. హిందూ గృహాలలో మతవిశ్వాసం పాటించడం, తెలుసుకోవడం కంటే విద్యపైననే ప్రాధాన్యమివ్వాలనే దృఢాభిప్రాయం ఉంది. కానీ, ఇతర మతస్థులకు మతం తర్వాతనే ఏదైనా.*
*మతం మార్చితే చాలా పుణ్యమనీ, ఇతరుల్ని తమ మతస్థులుగా మార్చడం కర్తవ్యమనీ, తమ మతం తప్ప మిగిలినవన్నీ వ్యర్థాలనీ, వాటిని పరిమార్చాలనీ... వారి మత పాఠాలలో స్పష్టంగా, గాఢంగా బోధిస్తారు. అందుకే ఇప్పుడు ప్రచారకులుగా, మత తీవ్రవాదులుగా ఉన్నవారు ఆ మతంలో లీనమైపోయిన ఒకనాటి హిందువులే. వారికి ఆ పాఠాలు ఒంటబట్టాయి.*
*మతం గురించి ఏమీ పట్టని హిందువుల వల్ల తమకు ఎలాగూ ప్రయోజనం లేదని, ఇతర మతాల సంతుష్టీకరణ కోసం పాకులాడే రాజకీయాలు హైందవ ద్వేషానికి కూడా సిద్ధపడుతున్నాయి. హైందవేతర మతాలకు కొమ్ముకాచే నాస్తికుల మూక కూడా ఈ ధర్మానికి పెద్ద శత్రుసమూహమై ఉంది. వారి చేతుల్లో పడ్డ చరిత్ర కూడా వక్రీకరణకు గురై, "హిందువులు ఆటవికులుగా, అనాగరికులుగా, దోపిడీదారులు"గా చిత్రించడం జరిగింది.*
*ఈ దేశసంపదను, విజ్ఞానాన్ని విధ్వంసం చేసి దోచుకున్నవారిని, ఈ దేశీయులను దారుణంగా చంపిన కిరాతకుల్ని గొప్ప నాయకులుగా చూపించడానికి కూడా వెనుదీయ లేదు. వాటిని చదివే విద్యార్థులకు ఈ దేశంపై, మతంపై గౌరవం, స్వాభిమానం ఎలా ఏర్పడతాయి! మన ధార్మిక గ్రంథాలను బోధించే వారిని కూడా ప్రగతి విరోధులుగానో, విజ్ఞానశూన్యులుగానో, ఛాందసులుగానోభావించే ధోరణి కూడా హిందువుల్లోనే వ్యాపించి ఉంది.*
*హిందూమతంపై వందల ఏళ్లు చేసిన దాడులు, విధ్వంసాలు, హింసలు చరిత్ర ద్వారా తెలియనివ్వకుండా చేశారు. తెలియజేస్తే ద్వేషభావం పెరుగుతుందని అపోహ కొందరిది. కానీ చారిత్రక వాస్తవాలను దాచిపెట్టడం ద్రోహం కాదా?*
*జరిగిన విధ్వంసాలను తెలుసుకుంటే, వాటిని చేసినవారి పరంపరకు చెందిన నేటితరం వారిలో కూడా ఒక సానుభూతి, ఇకపై అటువంటి తప్పులు చేయకూడదనే భావం పెరిగే అవకాశం ఉంటుంది. విధ్వంసాలకు, హింసకు గురైన వారి పరంపరకు చెందిన నేటితరం హిందువు తమ వారసత్వ సంపదను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయవచ్చు.*
*కానీ పిల్లలకు వాస్తవాలు తెలియకపోవడం, మతధర్మంపై ఆత్మన్యూనత, గౌరవహీనత పెరగడం హిందూగృహాల్లో సర్వసాధారణమైపోయింది.*
*ఇప్పుడిప్పుడు సామాజిక మాధ్యమాలద్వారా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజ్ఞాన దృక్పథంతో కొందరు మేధావులు చేస్తున్న పరిశోధనల వల్ల, బోధనలవల్ల - నేటితరం హిందువుల్లో కొంత మేరకు మార్పు వస్తున్నదని చెప్పక తప్పదు.*
*కానీ ఇతరుల వంచన, దాడులు పెరుగుతున్నంత వేగంగా, తీవ్రంగా ఈ మార్పు గోచరించడం లేదు. హిందువులు ఇతరుల్ని మార్చడానికి, ద్వేషించడానికి ఉద్యమించనక్కర లేదు - హిందువు హిందువుగా జీవించడానికి, జీవింపజేయడానికి కృషి చేయాలి.*
*వక్రీకరణలకు సమాధానమిస్తున్న పెద్దలమాటల్ని పరిశీలించాలి. పరివ్యాప్తి చేయాలి. స్వాభిమాన హిందూజాతి ఏర్పడాలి.*
*సామవేదం షణ్ముఖ శర్మ*
ప్రజాదరణ ఉన్న పాలకుణ్ణి
తస్కరస్య వధో దండో. దాస దండస్తు ముండనమ్! భార్యాదండం పృథక్ శయ్యా. మిత్రదండమ్ అభాషణమ్!! దొంగకు హింసించడం శిక్ష. సేవకునికి తలగొరిగించడం శిక్ష. భార్యను పడకగదిలో దూరంగా ఉంచడం శిక్ష. స్నేహితునితో మాట్లాడకుండా దూరంగా ఉంచడమే సరియగు శిక్ష. చమత్కార శ్లోకం;---- ప్రజాగుప్త శరీరస్య-- కిం కరిష్యంతి సంహతాః? హస్త న్య స్తాత పత్రస్య-- వారి ధారా ఇవారయః!! ప్రజాభిమానం ఉన్నదే అది గొడుగు వంటిది. చేతిలో గొడుగు ఉన్నవాణ్ణి వర్షం ఏమీ చేయలేనట్లు , ప్రజాదరణ ఉన్న పాలకుణ్ణి, ఏ శత్రువులు ఏమీ చేయలేరని కవి భావం. ( భోజ చరితం నుండి గ్రహీతము) తేది 13--8--2023, ఆదివారం, శుభోదయం.
ఆలోచనాలోచనాలు
ంంంం ఆలోచనాలోచనాలు ంంంం సంస్కృత సూక్తి సుధ ంంంం. కోకిలానాం స్వరో రూపమ్. పాతివ్రత్యస్తు యోషితామ్! విద్యా రూపం విరూపిణాం క్షమారూపం తపస్వినామ్!! కోకిలలకు సుస్వరమే అందము. స్త్రీలకు పాతివ్రత్యమే అందము.అందవిహీనునకు మంచి విద్యయే అందము. తపస్సు చేసుకొనే ఋషిపుంగవులకు ఓర్పే నిజమైన అందము. దైవాధీనం జగత్సర్వం. సత్యాధీనంతు దైవతమ్! తత్సత్యముత్తమాధీనం ఉత్తమో మమ దేవతా!! ఈ జగత్తు యావత్తు భగవంతుని అధీనంలో ఉన్నది. ఆ దైవం సత్యం అధీనంలో నిలచివున్నాడు. ఆ సత్యం ఉత్తమముల అధీనమై ఉంది. మరి, అట్టి ఉత్తములే దైవసమానులని భగవంతుని వాక్కు. అభ్యాసానుసరీ విద్యా. బుద్ధిః కర్మానుసారిణీ! ఉద్యోగానుసరీ లక్ష్మీ. ఫలం భాగ్యానుసారిణీ!! అభ్యాసాన్ని బట్టి విద్య వంటబట్టుతుంది. మనకర్మను అనుసరించి మనకు బుద్ధి పుడుతుంది. మనం చేసే వృత్తి లేదా ఉద్యోగాన్ని బట్టి ధనం లభిస్తుంది. మరి ఫలితం ఉన్నదే మన అదృష్టాన్ని బట్టే మనకు లభిస్తుంది. పిబంతి నద్యః స్వయమేవ నాభః. ఖాదంతి నస్వాదు ఫలాని వృక్షాః! పయోధరాస్సస్య మదంతి నైవ. పరోపకారాయ నతాం విభూతయః!! నదులనిండా నీళ్ళున్నా ఆ నీళ్ళను నదులు తాము త్రాగవు. చెట్లనిండా మధురమైన ఫలాలు ఉంటాయి. అయినా ఆ పండ్లను చెట్లు తినవు. మేఘాల నిండా నీరే ఉంటుంది, కానీ ఆ నీటిని మేఘాలు త్రాగవు. లోకంలో ధర్మాత్ములైనవారు తాము సంపాదించిన ధనాన్ని తాము ఉపయోగించుకోకుండా పరుల కోసమే ఉపయోగిస్తారు. అర్థా గృహే నివర్తంతే. శ్మశానే మిత్ర బాంధవాః ! సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంత మనుగచ్ఛతి!! మానవుడు చనిపోయిన తరువాత ఆతని భార్య ఇంటివద్దే ఆగిపోతుంది. స్నేహితులు, బంధువులు వల్లకాటిదాకా వచ్చి వీడ్కోలు పలుకుతారు. మనుష్యులు దాటిపోయిన తర్వాత వెంట వచ్చేవి ఆ జీవి చేసుకొన్న పాప, పుణ్యఫలితాలే. కాబట్టి జీవితం అంతా పుణ్యకార్యాలే చేసుకొంటూపోవాలి.
కడతేరిన కష్టాలు..
*కడతేరిన కష్టాలు..*
"అయ్యగారూ..నాపేరు లలితామాధవి..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయస్వామివారి మందిరానికి రావాలని అనుకుంటున్నాను..ఎలా రావాలో చెపుతారా?"..అంటూ ఆ యువతి ఫోన్ లో అడిగింది..తాను ఏ ఊరు నుంచి రాదల్చుకున్నదో అడిగి..అక్కడినుంచి ఎలా రావాలో వివరంగా చెప్పాను..ధన్యవాదాలు చెప్పింది..
పదిహేను రోజుల తరువాత ఒక గురువారం ఉదయం..కందుకూరు నుంచి వచ్చే మొదటి బస్సులో ఓ అమ్మాయి మందిరం వద్దకు వచ్చింది..ఆ అమ్మాయి వయసు లో చిన్నదాని లాగే కనబడుతోంది..నేరుగా మందిరం లోపలికి వచ్చింది..అక్కడే ఉన్న మా సిబ్బంది ని ఒక రూమ్ కావాలని అడిగింది..తన పేరు లలితామాధవి అని, తాను బెంగుళూరు నుండి వస్తున్నాననీ..రెండురోజుల పాటు ఇక్కడ వుండదలిచాననీ చెప్పింది..మా వాళ్ళు రూమ్ కేటాయించారు..ఆ అమ్మాయి చెప్పిన పేరు విన్న నేను..తనను దగ్గరకు పిలిచి..పదిహేను రోజుల క్రితం ఫోన్ చేసింది మీరేనా..అని అడిగాను.."మీరేనా ప్రసాద్ గారు..?" అని నన్ను అడిగింది..అవును అన్నాను..చేతిలో ఉన్న సంచీ ని ప్రక్కన పెట్టి..రెండు చేతులతో నమస్కారం చేసింది.."అయ్యగారూ..మీరు ఇక్కడే వుంటారు కదా..నేను ఒక గంటలో తయారయ్యి వస్తాను..స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత..మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి.." అన్నది..మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉంటానని చెప్పాను..
మరో గంటలోపలే..స్నానాదికాలు ముగించుకొని..మందిరం లోకి వచ్చి..స్వామివారి వద్ద అర్చన చేయించుకొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి ప్రదక్షిణ చేసి..నమస్కారం చేసుకొని..నేను కూర్చున్న చోటుకి వచ్చింది.."అమ్మా..ఇప్పుడు చెప్పండి..నాతో ఏదో మాట్లాడాలన్నారు కదా.." అన్నాను..
"సుమారు తొమ్మిది నెలల నుంచీ సోషల్ మీడియా లో ఈ స్వామివారి గురించి చదువుతున్నాను అయ్యగారూ..ఆరు నెలల క్రితం మీ దగ్గరనుంచి పోస్టులో స్వామివారి విభూతి గంధం తెప్పించుకున్నాను..మాది చిత్తూరు ప్రక్కన పల్లెటూరు..నా చిన్నతనం లో..అంటే..నాకు ఐదారు ఏళ్ల వయసప్పుడే మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు..మా అమ్మ కు నేనొక్కదానినే సంతానం..ఎంతో కష్టపడి నన్ను పెంచింది..నాన్న వదిలేసిన తరువాత చిత్తూరు తీసుకొచ్చి..ఇళ్లల్లో పాచిపని చేసి..నన్ను చదివించింది..చిన్న రేకుల షెడ్ లో వుండేవాళ్ళము..నాకు పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి..ఒక ట్రస్ట్ వాళ్ళు నా చదువుకు సహాయం చేశారు..ఇంజినీరింగ్ పూర్తి చేసాను..దేవుడి దయవల్ల ఉద్యోగం వచ్చింది..ఉద్యోగం లో చేరిన వెంటనే మా అమ్మను తీసుకొచ్చేసాను..నా వద్దే ఉంటున్నది..ఇప్పుడు నా వయసు 24 ఏళ్ళు..పోయిన సంవత్సరం అమ్మకు కడుపులో నొప్పి వచ్చింది..డాక్టర్ల కు చూపించాను..టెస్టులు చేసి..కడుపులో కణితి ఉంది..ఆపరేషన్ చేయాలన్నారు..తాను బలహీనంగా ఉందనీ..రక్తం తక్కువ ఉందనీ..కొన్నాళ్ళు మందులు వాడి..మళ్లీ రమ్మన్నారు..ఆరోజు చాలా బాధపడ్డానండీ..అమ్మను ఇంటికి తీసుకొచ్చిన తరువాత..ఎందుకో తెలీదు అయ్యగారూ..ఈ మొగిలిచెర్ల స్వామివారు పదే పదే గుర్తుకొచ్చారు..మీరు విభూతి గంధం తో పాటు పంపిన స్వామివారి చిన్న ఫోటోను చేతిలో పట్టుకొని.."మా అమ్మకు ఏ కష్టం రాకుండా చూడు స్వామీ..అమ్మ త్వరగా కోలుకుంటే మొగిలిచెర్ల కు వచ్చి నీ దర్శనం చేసుకుంటాను..నా శక్తి మేరకు అన్నదానం చేయిస్తాను..అని మొక్కుకున్నాను..స్వామివారి విభూతి అమ్మ నుదుటిపై పెట్టాను..అమ్మ డాక్టర్ ఇచ్చిన మందులు ఒక నెల వాడింది..ప్రతిరోజూ విభూతి పెట్టుకునేది..ఆ తరువాత మళ్లీ డాక్టర్ వద్దకు పరీక్షకు వెళితే..మళ్లీ అన్ని టెస్టులూ చేసి..ఆపరేషన్ అక్కర్లేదు..కడుపులోని కణితి కరిగిపోయింది..అని చెప్పారు..ఇదంతా స్వామివారి దయే అని నా నమ్మకం..అందుకే..నా మొక్కు తీర్చుకుందామని ఈరోజు వచ్చాను.." అన్నది..
"ఈరోజు స్వామివారి సమాధి వద్ద నాకు తెలీకుండానే ఏడుపు వచ్చింది..దుఃఖం ఆపుకోలేక పోయాను..మా అమ్మ నాకు దక్కేటట్లు చేసావు స్వామీ..అదే విధంగా నన్నూ మా అమ్మనూ కూడా బాగా చూసుకునే భర్తను కూడా నువ్వే చూడు..మంచి మనిషితో నా వివాహం జరగాలని ఆశీర్వదించు తండ్రీ.." అని కూడా మొక్కుకున్నాను.." అంటూ మళ్లీ కన్నీళ్లు పెట్టుకున్నది..ఆరోజు స్వామివారి మంటపం లోనే పడుకున్నది..ప్రక్కరోజు ఊరు వెళ్లేముందు మళ్లీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..అన్నదానానికి కొంత విరాళం ఇచ్చి వెళ్ళిపోయింది..
మరో మూడు నెలల తరువాత.."అయ్యగారూ..నాకు వివాహం కుదిరింది..వచ్చే నెల లోనే ముహూర్తం పెట్టుకున్నాము..వివాహం కాగానే..మా వారి తో కలిసి మొగలిచెర్ల కు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాను..శుభలేఖ పంపుతున్నాను..స్వామివారి విగ్రహం వద్ద పెట్టి మా గోత్రనామాలతో పూజ చేయించండి..మీకు ఋణపడిఉంటాను.." అని ఫోన్ చేసింది లలితామాధవి..అలాగే అన్నాను..ప్రక్క నెలలో వివాహం కాగానే భర్తను, తల్లిని వెంటబెట్టుకొని మొగలిచెర్ల కు వచ్చి, శ్రీ స్వామివారి సమాధి ని దర్శించుకొని..అర్చన చేయించుకొని..సంతోషంగా తిరిగివెళ్లింది..
ఆ అమ్మాయి చిన్నతనం నుంచీ పడిన కష్టం..తల్లి గురించి పడిన వేదన..అన్నీ తీరిపోయి..జీవితం ఒక గాడిలో పడింది..అందుకు అన్నివిధాలా మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారే కారణం అని లలితామాధవి నమ్మకం..
ఆ విశ్వాసమే ఆ అమ్మాయికి అన్నివిధాల రక్ష..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
క్షేత్రమూ..హోమమూ..*
*క్షేత్రమూ..హోమమూ..*
"బాబూ..రేపు ఇక్కడ హోమం చేస్తున్నారట కదా..మేము కూడా పాల్గొంటాము..మేము ఉంటున్న గదిని మాకోసం రేపటికి కూడా కేటాయించండి..రేపటి హోమము లో మేము కూడా పాల్గొంటాము..దానికొఱకు అయ్యే ఖర్చు ఎంతో చెపితే..ఇప్పుడే ఇచ్చేస్తాము.." అని ఆ దంపతులు పోయిన సంవత్సరం భాద్రపద పౌర్ణమి కి ముందురోజు అడిగారు..పౌర్ణమి సోమవారం నాడు వచ్చింది కనుక..ఆదివారం నాడు ఉన్నంతమంది భక్తులు వుండరు..కేవలం హోమం లో పాల్గొనే వాళ్ళు..మరి కొద్దిమంది మాత్రమే వుంటారు కనుక..ఆ దంపతులకు గది గురించి పెద్దగా ఆలోచించలేదు..పైగా వాళ్లిద్దరూ శనివారం నాడే వచ్చారు..పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆదివారం నాటి ప్రభాతసేవ పూర్తి శ్రద్ధతో చూసారు..
"ఇప్పుడు శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి వెళ్ళినప్పుడు..మీ అర్చకస్వామి రేపటి హోమం గురించి చెప్పారు..ఇంతదూరం ఎలాగూ వచ్చి ఉన్నాము కనుక..రేపొక్కరోజూ ఇక్కడే వుండి..ఆ హోమం లో కూడా పాల్గొని..తిరిగి మా ఊరు వెళతాము.." అన్నారు..సరే అన్నాను కానీ..వాళ్ళిద్దరినీ చూస్తే...ఈ వయసులో వీళ్ళిద్దరూ అంతసేపు..అంటే..దాదాపు నాలుగు గంటల పైగా..హోమం దగ్గర కూర్చోగలరా..సాధారణంగా హోమం లో పాల్గొనే వారు..ఆ హోమం పూర్తయ్యేదాకా నిరాహారంగా వుంటారు..ఈ దంపతులిద్దరూ డెబ్భై ఏళ్ళ పై బడిన వారే..ఆ మాటే వాళ్ళను అడిగాను..ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు..
"బాబూ..నీ సందేహం సరైనదే..అంతసేపు కూర్చోవడం మాకు కష్టమే..కానీ మేము ఒక కోరికతో ఈ మందిరానికి వచ్చాము..నాపేరు ధనంజయ రావు..ఈమె వెంకటలక్ష్మి..మాకు ఒక్కడే కుమారుడు..నేను ఒక బాంక్ కు మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యాను..నేను రిటైర్ అయ్యే నాటికే మావాడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు..ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసాము..కోడలు కూడా ఉద్యోగం చేస్తున్నది..ఇద్దరూ చక్కగా కాపురం చేసుకుంటున్నారు..మూడేళ్లు వాళ్ళ కాపురం సవ్యంగా ఉంది..ఆ తరువాత ఏమైందో తెలీదు..ఇద్దరూ తరచూ గొడవ పడటం మొదలు పెట్టారు..కళ్ళముందు కొడుకూ కోడలు ఎడముఖం పెడముఖం గా ఉంటే..మేము చూస్తూ వుండలేము..అట్లని వాళ్లకు సలహా ఇవ్వలేము..నలిగి పోతున్నాము..ఈలోపల ఈ క్షేత్రం గురించి చదవడం జరిగింది..ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే..వాళ్ళ సంసారం బాగు పడుతుందేమో ననే ఆశతో వచ్చాము..రేపు భాద్రపద పౌర్ణమికి మీరు అదేదో..లక్ష్మీగణపతి హోమము నిర్వహిస్తారట కదా..అందులో కూడా పాల్గొందామని అనుకున్నాము..ఎన్ని మొక్కులు మొక్కినా..ఎన్ని హోమాలు చేసినా..మా వాడి కాపురం బాగు పడితే చాలు..అదొక్కటే మా కోరిక..అందుకోసం కొద్దిగా కష్టపడ్డా పర్వాలేదు.." అన్నారు..వాళ్ళిద్దరి తాపత్రయానికి నాకు కొద్దిగా బాధ వేసింది..మీ ఇష్టం అన్నాను..
ఆ ప్రక్కరోజు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకల్లా ఆ దంపతులు శుచిగా తయారయ్యి మందిరం లోకి వచ్చారు..ముందుగా శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వచ్చారు..హోమం లో పాల్గొనే ఇతర భక్తులు కూడా ఈలోపల వచ్చేసారు..ఈ దంపతులు కూర్చోవడం కోసం కొద్దిగా ఎత్తుగా ఉన్న చిన్న బల్లలను ఏర్పాటు చేసాము..ఉదయం తొమ్మిది గంటల నుంచి..మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ హోమం తాలూకు క్రతువు..పూర్ణాహుతి జరిగాయి..అందరూ శ్రద్ధగా పాల్గొన్నారు..ఆ తరువాత భోజనాలు చేసి వచ్చారు..మరో రెండు మూడు గంటలకల్లా..దాదాపు అందరూ వెళ్లిపోయారు..ఈ దంపతులు మాత్రం తమ గదికి వెళ్లి మళ్లీ మందిరం లోకి వచ్చారు.."బాబూ ప్రసాద్..నీ సహకారంతో హోమం లో పాల్గొన్నాము..మరొక్కసారి స్వామివారి సమాధిని దర్శించుకొని..మా ఊరు వెళ్లిపోతాము.." అన్నారు అలాగే అన్నాను..స్వామివారి సమాధిని దర్శించుకొని వచ్చి.."మావాడి కాపురం బాగుపడి..పరిస్థితులు చక్కబడితే..మళ్లీ ఈ స్వామివారి దర్శనానికి వస్తాము బాబూ..వెళ్ళొస్తాము.."అని చెప్పి తమ కార్లో వెళ్లిపోయారు..
ఆ దంపతులు రెండు వారాల క్రితం ఒక ఆదివారం నాడు మళ్లీ మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..స్వామివారి సమాధిని దర్శించుకొని..నేరుగా నా వద్దకు వచ్చి.."బాబూ ప్రసాద్..మేము గుర్తున్నామా..నేను ధనంజయరావు ను.." అన్నారు..బాగా గుర్తు వున్నారు అన్నాను.."ఇక్కడ మొక్కుకొని వెళ్లిన తరువాత..వెంటనే మా వాడి కాపురం చక్కబడలేదు..క్రమంగా ఆరు నెలలు పట్టింది వాళ్లిద్దరూ సర్దుకోవడానికి..ప్రస్తుతం ఇద్దరూ సఖ్యత తో వుంటున్నారు..కోడలుకు ప్రస్తుతం మూడో నెల..మాకు మనోవేదన తగ్గింది..అందుకే స్వామివారిని దర్శించుకొని..కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాము..ఈసారి పౌర్ణమి కి కూడా హోమం నిర్వహిస్తున్నారట కదా..మేము ఈసారి పాల్గొనలేము..మా తరఫున మీరే మా గోత్రనామాలతో క్రతువు జరిపించండి..అందుకు అయ్యే ఖర్చు ఇస్తాము..ఈ క్షేత్రం లో మీరు జరిపే హోమాలు చాలా ప్రభావం చూపుతాయి..మాకు అనుభవం లోకి వచ్చింది కదా.." అన్నారు..ఆ దంపతుల ముఖాల్లో చాలా ప్రశాంతత కనిపించింది..సరే అన్నాను..
క్షేత్ర మహిమో..హోమ ప్రభావమో..స్వామివారి అనుగ్రహమో..ఏదైతేనేం..ఆ వృద్ధ దంపతుల మనోవేదన తీరిపోయింది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
అతిథులకు
శ్లోకం:☝️
*తృణాని భూమిరుదకం*
*వాక్చతుర్థీ చ సూనృతా |*
*ఏతాన్యపి సతాం గేహే*
*నోచ్ఛిద్యన్తే కదాచన ||*
భావం: అతిథులకు ఉచితాసనము, ఉండడానికి స్థలం, తాగడానికి నీరు, మధుర వచనములు ద్వారా ఆతిథ్యం - సజ్జనుల ఇళ్లలో ఈ వస్తువులకు ఎప్పుడూ కొరత ఉండదు. వారు అతిథులను స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.
🙏 *అతిథి దేవోభవ* 🙏
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-28🌹
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-28🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కొల్లాపురమున లక్ష్మీదేవి భర్తయయిన శ్రీమహావిష్ణువును గూర్చి పదేపదే ఆలోచించుచూ కాలము గడుపుచున్నది. తాను కొల్లాపురమున నేకాకిగా నున్నందులకామె లోలోపల మిక్కిలి వెతపడుచున్నది.
ఈ విధముగా వుంటూండగా ఒకనాడు నారాయణ నామస్మరణచేస్తూ నారదుడు వచ్చివాడు. లక్ష్మీదేవి అతనికి తగిన గౌరవము చేసి లోక వృత్తాంత విశేషములు చెప్పుమని అడిగింది. అడిగినదే తడవుగా నారదుడు సర్వలోక విశేష విషయాలూ లక్ష్మీదేవికి వివరించాడు.
పద్మావతీ శ్రీనివాసుల సంగతి కూడా తెలిపినాడు. అందులకు ఆమె తనపట్ల శ్రీనివాసునకు ప్రేమాభిమానములు ఏమయినా తగ్గినవా? అని అడిగింది. ‘‘ఏమో! పద్మావతీదేవిని లాలించుటలో, పాలించుటలో నున్న శ్రద్ద నాపట్ల సున్నయగునేమో!’’ అని స్ర్తీ సహజ భావమును నారదుని యెదుట ప్రకటించినది.
నారదుడు ‘‘శ్రీనివాసునకు నీపైగల అభిమానము చెక్కుచెదరలేదు. అతడును యీ మధ్య నిన్ను పలుమారులు తలచుకొనుట జరుగుచున్నది. ఆయన హృదయమును అర్ధము చేసుకొని నీవు ఆయనను చేరుటయే లోకకళ్యాణప్రద కార్యమగును.’’ అని బోధించి, తన దారిన వెడలెను.
*సవతుల కయ్యము:*
నారదుడు కొల్లాపురమునుండి సరాసరి శ్రీనివాసుని వద్దకు వెడలి, జరిగిన విషయము పూసగ్రుచ్చినట్లు చెప్పినాడు.
శ్రీనివాసుడు ‘‘నారదా! లక్ష్మీదేవి నాచెంత లేకుండుటవలన నేను కూడా చాలా బాధపడుచున్నాను. ఆమెను చూచి ఎన్నోళ్ళో అయినది. నేనే స్వయముగా వెడలి ఆమెను ఆహ్వానించి తీసుకొని రావలె ననుకొనుచున్నాను. అన్నాడు.
‘శుభమస్తు’ అన్నాడు నారదుడు. తాను లక్ష్మీవేవిని తేనున్న విషయాన్ని శ్రీనివాసుడు పద్మావతితో తెలుపగా ఆమె ఏ కళనున్నదోగాని అంగీకరించినది. వెంటనే శ్రీనివాసుడు రాయాబారాల మీద రాయబారాలు జరిపి ఎట్టకేలకు లక్ష్మీదేవిని తీసుకొని వచ్చినాడు.
శ్రీ వెంకటేశుడు తనకు తాళిగట్టినాడనీ ఆయనకు లక్ష్మికన్న తానే ఎక్కువ అనీ పద్మావతి వాదన. అంతకు ముందెన్నడో స్వర్గమున శ్రీ మహావిష్ణువున్నప్పటి నుండియు ఆయన హృదయ మందిరమున తాను నివసించుట వుండనే వున్నదనీ, కనుక, మహావిష్ణువునకు పద్మావతీదేవి కంటే తానే అధికమైన ప్రియురాలిననీ లక్ష్మీదేవి వాదన, పద్మావతీ, లక్ష్మీదేవి ఒకరినొకరు చిలువలు పలువలు పెంచుకొనుచూ నేనేవో అనుకొనసాగిరి.
ఆ సవతుల కయ్యమును శ్రీ వెంకటేశ్వరస్వామి ఆపుటకు ప్రత్నించెను. కాని వారి దెప్పుళ్ళూ మాటవిసుర్లూ, సణుగుళ్ళూ ఏ మాత్రమూ తగ్గలేదు. పైపెచ్చు హెచ్చినవి. ఒకరి పుట్టుపూర్వోత్తరాలు మరియొకరు విమర్శించుకొనసాగినారు. ఇక పరిస్థితిని శ్రుతిమించి రాగాన పడనీయ రాదనుకొనినాడు శ్రీనివాసుడు. ఒకనాడు ఏకాంతములో పద్మావతి పూర్వచరిత్ర అయిన వేదవతి కథను లక్ష్మికి చెప్పినాడు.
నివాసుడు చెప్పిన పూర్వకథను విని నిజము తెలుసుకొని లక్ష్మీదేవి శాంతించెను.
అంతకు శ్రీవేంకటేశ్వరుడు మిక్కిలి ఆనందించి ఆమెతో యిట్లనెను.
‘‘దేవీ! నేను వివాహము కొరకు కుబేరుని వద్ద అప్పు తీసుకొంటిని. అది తీర్చు మార్గము తోచుట లేదు. ప్రతీ సంవత్సరము వడ్డీ చెల్లింతునని పత్రము వ్రాసితిని, నీవు నాకొక ఉపకారం చేయవలెను. ఈ కలియుగమున నా భక్తులకు భాగ్యమిచ్చుచుండవలెను.
వారు ధన గర్వముచే పాపము లొనర్చి ఆపదలపాలైనా దర్శనమును కోరుదురు. నాకు మ్రొక్కులు, ముడుపులు, నిలువుదోపుడులు చెల్లించమని కలలం దగుపడి చెప్పి వారిని కాపాడు చుందును. వారివల్ల ప్రతిసంత్సరము వసూలు చేసిన వడ్డీకాసులను కలియుగాంతము వరకు కుబేరునకు చెల్లించెదను. ఆ తదుపరి అసలు దీర్చి మనము వైకుంఠమునకు చేరుకొందుము.
అంతవరకు నీవీ పద్మసరోవరమునుండి భక్తులను రక్షించుము’ ఆ మాటలకు లక్ష్మీదేవి మొక్కి ఆనందించి, తాను శ్రీ వేంకటేశ్వరుని వక్షమందుండుటకును తన అంశమును పద్మసరోవరమును వెలయించుటకును అంగీకరించెను.
శ్రీనివాసుడు దేవశిల్పి విశ్వకర్మను గావించి శుకాశ్రమమునందలి పద్మసరోవరము వద్ద మందిరమును నిర్మింపజేసెను. లక్ష్మీదేవిని ఆ ఆలయమున ప్రవేశింప జేసి శుకునిచే అచ్చడ అగ్రహారమును వెలయింపజేసెను.
ఒక రోజున శ్రీనివాసుని సుందర్శించుటకై తొండమానుడు ఆగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ పద్మావతీ శ్రీనివాసులు అతడిని చాలా గౌరవించిరి.
తరువాత తొండమానుడు శ్రీనివాసుడితో ‘‘సర్వలోకరక్షకా! సృష్టికారణా! భక్తజనరక్షకా సుందరమైననీ దివ్యరూపాన్నీ చూస్తుంటే, సర్వకాల సర్వావస్థలోనూ యిలా చూస్తూనే జీవించాలనే కోరిక కలుగుతోంది, నాకు దేనిపైనా ఆశలేదు.
కానీ, నీ పాదసేవపైననే ఆశ కలదు. ఈ దీనుడయిన భక్తునిపై కరుణాదృష్టి ఎప్పుడునూ జూపుతూ వుండండి’’ అన్నాడు.
అందుకు శ్రీనివాసుడు అంగీకరించి ‘‘రాజా! నీ కోరిక తీరవలెనంటే నీవు నాకై ఒక చక్కని ఆలయం నిర్మించాలి’’ అన్నాడు. అనంతరం తొండమానుని శేషాచలానికి తీసుకొనివెళ్ళి అక్కడ కొంత స్థలమును చూపించి ‘‘రాజా! ఇదిగో ఈ ప్రదేశము నాకు వరాహస్వామిచే యివ్వబడినటువంటింది. ఇందు స్వామిపుష్కరిణికి తూర్పు ముఖంగా ఆలయ నిర్మాణము చేయుము.
గోపుర, ప్రాకార, సింహద్వార, ధ్వజస్తంబ ఆస్థాన మండపములు-గో, ధాన్య వంటశాలలూ అన్నీ దానిలోనే ఉండేవిధంగా ఆలయం కట్టించు. అన్నట్లు చెప్పడం మరిచాను. ఇక్కడనే ఒక పూలబావి కలదు. అది శిధిలావస్థలో నున్నది. అదే బాగుచేయించు’’ అన్నాడు.
గరుడాద్రి వాస గోవిందా, నీలాద్రి నిలయా గోవిందా, అన్జనాద్రీస గోవిందా, వృషభాద్రీసా గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||28||
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-29🌹*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-29🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
తొండమానుడు ఆలయ నిర్మాణమునకు తక్షణమే పూనుకొనినాడు. అతితక్కువ రోజుల్లోనే ఆనందనిలయం గోపుర, ప్రాకార, మంటపాలూ, మెట్లూ కట్టించాడు. పూల బావిని బాగుచేయించినాడు. ఆలయ నిర్మాణపు ముగింపు గూర్చి శ్రీనివాసునకు కబురు పంపినాడు.
వేద వేదాంగ నిష్ణాతులైన బ్రాహ్మణులు శ్రీనివాసుడు ఆలయములో ప్రవేశించడానికి సముహూర్తం నిర్ణయించినారు. ఆ ప్రవేశోత్సవం చూడడానికి సర్వలోకాల వారున్నూ విచ్చేసారు. పద్మావతీ శ్రీనివాసులు చక్కగా ముస్తాబై ముహూర్తము సమీపించగానే విప్రాశీర్వచన శ్లోక శుభమంత్రములు చెలగుచుండ, వివిధ మంగళ వాయిద్యములు మ్రోగుచుండ, మునీంద్రులు ఆశీర్వచన శుభవాక్యాలు పలుకుచుండ, బ్రహ్మాది దేవతలు పుష్పవర్షం కురిపించుచుండ, జయ జయ నినాదముల మధ్య ఆనంద నిలయమున ప్రవేశించినారు.
కలియుగదైవమైన శ్రీనివాసుడు వుండు శ్రీ వేంకటాచలము ఒక ఆమడవెడల్పు, ముప్పయి ఆమడల పొడవు విస్తరించి వుంది
. శ్రీమద్వేంకట శైలరాజ శిఖరే శ్రీ శ్రీనివాసో హరి:
శ్రీమత్ స్వామి సరోవర ప్రభృతిభి: పుణ్యైరనేకైర్యుతే
తీర్థై:ప్రాజ్ముఖ సంస్థితి ర్విజయతే శ్రీతొండమానాదిభి:
దృష్ట: శ్రీ నవసూరి సంస్తుత వపు స్త్వాలింగ్య పద్మావతీమ్||
శ్రీ వేంకట గిరీశోయం అలర్ మేల్ మంగనాయకీమ్|
ఆశ్రితో రాజతే నిత్యం ఆనంద నిలయాలయ:||
మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్
స్వామిపుష్కరిణీ తీరే రమయా సహమోదతే.
శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపమైన శ్రీవైకుంఠమును విడచి స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు, అనియు
"శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్"
("శ్రీవైకుంఠమున విరక్తుడైన స్వామి, స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు")
అనియు చెప్పినట్లుగా శ్రీవైకుంఠనికేతనుడైన స్వామి భక్త సంరక్షణ దీక్షితుడై తిరుమలపై వేంచేసియున్నాడు.
"కృతేయుగే నారసింహ: త్రేతాయాంరఘునందన:
ద్వాపరే వాసు దేవశ్చ కలౌవేంకటనాయక:"
అని చెప్పినట్లుగా కృతయుగమున నరసింహస్వామి, త్రేతాయుగమున శ్రీరామచంద్రులు, ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్మ; కలియుగమున శ్రీవేంకటేశ్వరస్వామి భక్తరక్షణ దీక్షితులై యున్నారు.
శ్రీనివాసునకు బ్రహ్మోత్సవము
ఆనందనిలయం ప్రవేశోత్సవము జరిగిన తరువాత బ్రహ్మదేవుడు శ్రీనివాసుని చెంతకు వచ్చి ‘ఆదిపురుషా! నేను నీ చెంత రెండు ఆఖండజ్యోతులు వెలిగించెదను. లోక కళ్యాణకరంగా అవి ఎప్పుడూ నీ వద్ద వెలుగుతూండవలెను. ..
నీవు కలియుగపుమానవుల కొరకై యుగాంతము వరకూ యిచ్చటనే నివసించుచు భక్తులకు దర్శనభాగ్యము కలుగజేస్తూ వుండవలెను.
నేను నీకు ఒక ఉత్సవము చేయగలను. దానికి మీరు అంగీకరించ గలందులకు కోరుచున్నాడు. అనగా శ్రీ వెంకటేశ్వరుడు అంగీకరించినాడు.
బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి, ఇవి కలియుగాంతం వరకూ వెలుగుతూంటాయని చెప్పాడు.
బ్రహ్మోత్సవము ప్రారంభమైనది.
పగలూ రాత్రీ అనక, ఏకటాకిని అలాగే ఉత్సవము జరుగసాగినది.
ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదటి రోజున అంకురార్పణ జరిగినది. ధ్వజారోహణము, శేషవాహనము, గజవాహనము, సింహవాహనము, ముత్తెంపుపందిరి, కల్పవృక్షవాహనము, సర్వభూపాల వాహనము, మోహినీ అవతారము గరుడసేవ, హనుమంత వాహనము, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు, రథోత్సవము అశ్వవాహనము ఇవి అన్నీ తొమ్మిది రోజులపాటు రకరకాలుగా ఉత్సవాలు జరిగాయి.
పదియవ రోజున అలంకారాలతో నిండిన పల్లకీ ఉత్సవము జరిగినది. ఆనాడే స్వామి పుష్కరిణీ తీర్థములో అవబృథస్నానము కూడా జరిగినది. వేలకొలదీ భక్తులు యీ ఉత్సవాలకు హాజరయ్యారు.
ఎక్కడ విన్ననూ ‘గోవిందా, గోవిందా’ అనే హరినామస్మరణమే! శేషాచలము! బ్రహ్మోత్సవ సమయములో వైకుంఠాన్ని తిరస్కరించేటటువంటి ప్రకాశంతముగా వుంది. భక్తులు శ్రీ వేంకటేశ్వరునకు కానుకలూ అవీ సమర్పించి, అనంతరము వారి వారి యిండ్లకు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు శ్రీనివాసునితో చెప్పి సత్యలోకానికి వెళ్ళి పోయాడు.
తిరుమల నాయక గోవిందా, తులసీమాల గోవిందా, శేషాద్రి నిలయ గోవిందా, శ్రేయోదాయక గోవిందా, |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||29||
*శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 19*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 19*
44 అంత సులభం కాదు. అలా ఒక వ్యక్తి చేయగలిగితే అది అతనిలో బ్రహ్మచర్యశక్తి లేదా మేధాశక్తి అనే నూతన శక్తిని జనింపచేస్తుంది. ఈ శక్తి అసాధ్య కార్యాలను సాధ్యం చేస్తుంది. ఈ శక్తిని సముపార్జించే తీరాలని నరేంద్రుడు నిశ్చయించాడు. అందుకు తగ్గట్లు తన జీవిత విధానాన్ని మలచుకొన్నాడు.
అయినప్పటికీ ఒక రోజు ఆ ఉద్వేగం కట్టలు తెంచుకొని ఆతడిలో ఉప్పొంగింది. ఇక మీదట అది తలెత్తకుండా అదుపులో ఉంచే తీరాలని సంకల్పించాడు. తలచుకొన్నది సాధించే తీరుతాడు కదా నరేంద్రుడు! చుట్టూ పరికించాడు. చలి కాచుకోవడానికి పొయ్యి రాజేసి ఉన్నారు. శరీర భాగం తాకేటట్లు ఆ పొయ్యి మీద కూర్చున్నాడు! ఆ పుండు నయం కావడానికి నెలలు పట్టింది! శరీరం మీద పుండు ఏర్పడ్డదే తప్ప కామం అనే పిడికిలి నుండి మనస్సు విడివడింది.
ఆ తరువాత నరేంద్రుని జీవితంలో కామం అనే పదానికే చోటులేకపోయింది. ఆ యౌవనావస్థలోనే తనను కోరివచ్చిన స్త్రీలను తల్లిగా భావించి, వారిని త్రోసి రాజన్న శక్తి అతడిలో కలిగింది.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 4*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 4*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః*
*త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా |*
*భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం*
*శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ ||*
ఈ శ్లోకంలో అమ్మవారిని సూచనగా వర్ణిస్తున్నారు. వరద, అభయ ముద్రలు లేనిదిగా చెరకు విల్లు, పుష్పబాణములు, పాశము, అంకుశము పట్టుకొని వున్న అమ్మవారిగా చూపిస్తున్నారు.
త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః = నీవు తప్ప మిగిలిన దేవతా గణాలు అభయ, వరద ముద్రలతో వున్నారు.
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా = నీవు ఒక్కదానివే అభయ వరద ముద్రాభినయము ప్రకటించటంలేదు. ఎందుకని?
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం = అమ్మవారి నామాల్లో *భయాపహా* అని చెప్పుకుంటున్నాము. భయముల నుండి రక్షించటానికి, కోరిన దాన్ని మించి ఇవ్వటానికి అమ్మవారికి వరద అభయ ముద్రల అభినయము అక్కరలేదు.
శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ = నీ పాదారవిందములే లోకాలకు అభయము, వరములు ఇవ్వటానికి శరణ్యము.
అమ్మవారు జ్ఞానప్రదాయిని. ద్వైతం భయం అన్నారు పండితులు. నీవు కాక మరొక వస్తువు వున్నదన్న భ్రమయే వివిధములైన భయమును కలిగిస్తుంది. విశ్వమంతా నీవే వ్యాపించి వున్నావు అనే సుజ్ఞాన భావన కలిగినప్పుడు ఇక దేనికి భయపడాలి? దేనిని కోరాలి - జ్ఞాన వైరాగ్యములు కలిగాక? ఇవి ఇచ్చేది అమ్మవారి పాదపద్మములే అంటున్నారు శంకరులు. *వాంచితార్ధప్రదాయినీ*, *వరదా వామనయనా* అని అమ్మవారి నామాలు. అటువంటి దివ్య పాదములను కాంచీపురంలో మహాయోగముద్రలో కూర్చొని వున్న కామాక్షీ అమ్మవారు ముముక్షువులకు అనుగ్రహిస్తున్నారు.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
చిత్రస్పందన -- 13
#చిత్రస్పందన -- 13
*( పువూ - తోడిమ రీతినే , పుడమిన ఆలుమగలుయును !! )*
🌺🍃🌺
*తొడిమకు శోకమె మిగులున్ -*
*బుడమిన వ్రాలంగఁ బూవు , పొద్దుకు సెలవౌ !*
*విడివడుదురాలుమగలున్ -*
*ముడి విప్పగ దైవమదియె ముదిమి వయసునన్ !*
🌺🍃🌺 *( కందము )*
✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏
🌺🍃🌺
( తోడిమనుండీ పూవు వికసించగా , వాటికవే ఆనందపడుతూ ,
చూచెడి వారలకు కుడా ఆనందము కలిగించుచూ అలరారుతాయి .
ఆ ముచ్చట ఒక పొద్దే ! కుసుమము వ్రాలిపోతే తొడిమకు శోకమే !!
అన్యోన్యముగా మూడుముళ్ళ బంధముతో ఒకటైన ఆలుమగలు ,
వయసు మీరగా విడిపోవు దినము తప్పక వచ్చును .
దైవాజ్ఞ గా వారి ముడి విప్పివేయబడి ఒకరు ఒంటరులౌట తధ్యమే కదా !!
అకటా ఇదియే జీవితము !! ) 🙏🙏
🌺🍃🌺
*బుధవారం, ఆగస్టు 23, 2023*🌹రాశి ఫలాలు
. *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*
. *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*
*బుధవారం, ఆగస్టు 23, 2023*
*శ్రీ శాలివాహన శకం: 1945*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*నిజ శ్రావణ మాసం - శుక్ల పక్షం*
*తిధి* : *సప్తమి రా10.06* వరకు
. *🌹రాశి ఫలాలు🌹*
*మేషం*
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తులాభాలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
---------------------------------------
*వృషభం*
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి.
---------------------------------------
*మిధునం*
నూతన రుణయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
---------------------------------------
*కర్కాటకం*
చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. ఇంటాబయట మానసిక ఒత్తిడులు అధికామౌతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు ఫలించవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
---------------------------------------
*సింహం*
అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు.
---------------------------------------
*కన్య*
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి.
---------------------------------------
*తుల*
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది.
---------------------------------------
*వృశ్చికం*
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.
---------------------------------------
*ధనస్సు*
దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
*మకరం*
ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
---------------------------------------
*కుంభం*
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.
---------------------------------------
*మీనం*
బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.
🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄
👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*
👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻
*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻
*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻
🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
భజే వ్రజైక మండనం
భజే వ్రజైక మండనం
సమస్త పాప ఖండనం
స్వభక్త చిత్త రంజనం
సదైవ నంద నందనం
సుపింఛ గుచ్చ మస్తకం
సునాద వేణు హస్తకం
అనంగ రంగ సాగరం
నమామి కృష్ణ నాగరం
మనోజ గర్వ మోచనం
విశాల లోల లోచనం
విధూత గోప శోచనం
నమామి పద్మ లోచనం
కరార వింద భూధరం
స్మితావలోక సుందరం
మహేంద్ర మాన దారణం
నమామి కృష్ణ వారణం
కదంబసూన కుండలం
సుచారు గండమండలం
వ్రజాంగనైక వల్లభం
నమామి కృష్ణ దుర్లభం
యశోదయా సమోదయా
సగోపయా సనందయా
యుతం సుఖైకనాయకం
నమామి గోపనాయకం
సదైవ పాదపంకజం
మదీయ మానసే నిజం
దధానం ఉత్తమాలకం
నమామి నంద బాలకం
సమస్త దోష శోషనం
సమస్తలోక పోషణం
సమస్త గోప మానసం
నమామి నంద లాలసం
భువో భరావ తారకం
భవాబ్ధి కర్ణ ధారకం
యశోమతి కిశోరకం
నమామి చిత్త చోరకం
ధృగంత కాంత భంగిణం
సదా సదాల సంగిణం
దినే దినే నవం నవం
నమామి నంద సంభవం
గుణాకరం సుఖాకరం
కృపాకరం కృపావరం
సురాద్విషణ్ నికందనం
నమామి గోపనందనం
నవీన గోపనాగరం
నవీన కేళి లంపటం
నమామి మేఘసుందరం
తదిత్ప్రభా లసత్పటం
సమస్త గోపనందనం
హృదంభుజైక మోదనం
నమామి కుంజమధ్యగం
ప్రసన్న భానుశోభనం
నికామకామ దాయకం
దృగంత చారుశాయకం
రసాల వేణుగాయకం
నమామి కుంజ నాయకం
విదగ్ధ గోపికామనో
మనోజ్ఞ తల్ప శాయినం
నమామి కుంజకాననే
ప్రవృద్ధ వహ్ని పాయినం
యధాతధా యథాతథా
తథైవ కృష్ణ సత్కథా
మయా సదైవ గీయితాం
తథా కృపా విధీయతం
ప్రమాణికాష్టక ద్వయం
జపత్యధిత్య యఃపుమన్
భవేత్ సదా నందనందనే
భవేభవే సుభక్తిమాన్
- ఆది శంకరాచార్యులు
గానం - అశిత్ దేశాయ్, హేమ
ఇంద్రియాల ద్వారా
, బాహ్య వస్తువులు ఇంద్రియాల ద్వారా మనసుకు అనుసంధానం ఉన్నంతవరకు (ఇది గృహస్థుకు తప్పదు) అపరోక్షజ్ఞానం తద్వారా
అపరోక్షానుభూతి సిద్దించవు.
ఉదాహరణకు మన తెలుగు వార్త పత్రికను క్షుణ్ణంగా చదువుతూ అలవాటు ఉన్న మనిషికి
ఒకరోజు కూడా తెలుగు వార్త పత్రిక చూడకుండా ఉండలేడు. ఇది బాహ్య వస్తువును ఇంద్రియముల ద్వారా మనస్సుకు అనుసంధానం వలన జరుగుతుంది.
అదే వ్యక్తి కొంతకాలం ఉపనిషత్తులను మరియు తెలుగు వార్తా పత్రికలను కూడా చదువుతే మెల్లిగా ఆ వ్యక్తి యొక్క మనసు బాహ్య వస్తువులపై అనుసంధానం తగ్గి ఉపనిషత్తుల వాక్యాలపై దృఢమైన విశ్వాసం కలుగుతుంది.
ఒకనాటికి ఆ వ్యక్తికి తెలుగు వార్త పత్రికల యందు ఉన్న వార్తలు చాలా చిన్నవిగాను, చికాకు గానూ ఉంటాయి. మెల్లిగా ఉపనిషత్తులు సారం అతని జీవనగమనాన్ని మార్చివేసి బ్రహ్మజ్ఞానం వైపు మరలించి అపరోక్షనుభూతి కలిగేటట్టు చేస్తుంది.
అందువలన గృహస్తుకు
పైన ఉదాహరించిన ఆటంకాలు చాలా ఉంటాయి. వాటినన్నింటిని కాలమాన పరిస్థితులు వ్యతిరేకమైనప్పటికీ సహనంతో ముందు అడుగు వేయగల గృహస్తునకు మోక్షం, అపరోక్షానుభూతి కరతలామలకం.
మువ్వన్నెలజెండా
” “6 వ సంచిక “ మువ్వన్నెలజెండా గీతాలు కవితలు"
71. శీర్షిక.. పతాక వందనం / జెండా వందనం
వందనం..వందనం.. మన జాతీయ జెండాకు వందనం.. అభివందనం ఎగురుతోంది ఎగురుతోంది మన భారత జెండా గౌరవం నిండా
గ్రామ గ్రామంలో, నగర నగరంలో రాజధాని ఢిల్లీలో సగర్వంగా ఎగురుతోంది... భారత కీర్తి కిరీటమై శాశ్వత శౌర్యమై జాతికి స్పూర్తి యై
.... వందనం వందనం
రూపకర్తలు పింగళి కృత మువ్వన్నెల జెండా.. ముచ్చటగా గగనాన విజయవిహారం...మన జాతీయ జెండా... గౌరవం నిండా......
కాషాయం... త్యాగముగా.. శ్వేతవర్ణం స్వచ్ఛంగా.. హరితవర్ణం... సంపద అభివృద్ధి ల సంగమమై.. మధ్యనుండు అశోకచక్రం... ధైర్యం.. పరాక్రమం సూచిస్తూ.... ఎగురుతోంది... జాతీయ జెండా..... ఎదురు లేని భారతికీ...అలుపెరుగని విజయానికి చిహ్నంగా... జాతీయ జెండా.....జాతి గౌరవ కీర్తి
వందనం.. వందనం... నీకిదే అభివందనం
దేశమంత జరుపుకునే ఉత్సవాలు.... గణచంద్ర దినం.. స్వాతంత్య్ర దినం.. బాపూజీ జన్మదినం.... మురిపెముగా చూసుకునే మన జెండా నేర్పుతోంది... శాంతి.. ధర్మం..... ధైర్యం సాహసం.. స్పూర్తిగా...
వందనం...వందనం... నీకిదే అభివందనం
హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులం
అందరమొకటై... హాయిగ కలసి.
చేసుకునే వేడుకే... గణతంత్ర దినోత్సవం...
వందనం... వందనం.. జాతీయ జెండాకు అభివందనం.. మనసాభివందనం..
...డాక్టర్ దేవులపల్లి పద్మజ, విశాఖపట్నం....
గోరుముద్దలు
గోరుముద్దలు తినిపించవా!
రెండు బార్బెక్కింది /లే ముఖం కడుక్కో, పాలుత్రాగు నీళ్ళోసుకుని చదువుకో / మంగళ గీతికలా వినబడేది.
ఇప్పుడంటేనే భయం వార్డెన్ లెట్టే తిట్లవి/మీపు ఛళ్ళుమనే శబ్దాలకి
పొద్దున్నే అమ్మ గొంతు సుప్రభాతాలు దుర్భర ప్రభాతాలౌతున్నాయి. చలికికాదు. దెబ్బలకి పణుకుతూ / పరుగులు పెడితే, అక్కడంతా హెలిముఖాల జాతర/చాలీచాలని నీళ్ళతో బాత్రూమ్లో యాతన తరగతి గదిలో తీరు ఇంకో రకం
అర్థంకాని పాఠాలతో తలనెప్పి ఒక ప్రక్క ఏ పెచ్చు ఎప్పుడు ఊడ్రి/నెత్తిన పడుతుందోనని భయం మరో ప్రక్క అర్ధం అయ్యేలా పాఠం చెప్పలేని సారు. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు బెత్తాన్ని ప్రయోగిస్తుంటారు. అందుకే ఆదివారం కోసం / అంతగా ఎదురుచూస్తాను. అరగంటైనా చాలు/ నీ ఒడిలో ఆదమరచి నిద్రపోతాను తలకి ఇంత నూనె వ్రాసి / తల చున్ని ఇన చేసినప్పుడు వెంట తెచ్చిన మురిపెంగా నువ్వు తినిపిస్తున్నప్పుడు
నేను కొత్తగా పుట్టినట్లుంటుందమ్మా!
అమ్మా! ఓ ఆమె విత్తనాన్ని నువ్వు నాకింది వసతి దానంలో కాదు. అనుపగోడలతో కట్టిన రాక్షస గృహంలో
నీకు గుండె కోతను మిగిల్చినదాననౌతాను అందుకే చెప్పుకోలేని / ఈ ఊసులన్నీ నీ కడకొంగుకు ముడివేస్తున్నాను.
ఇంటికెళ్ళి ఒక్కసారి ముడి విప్పి విను
ఈ పంజరం నుంచి నన్ను విడుదల చేసి చూడు రివ్వున ఆకాశానికి ఎగురుతాను.
మేఘాల పలక పైన నీ ఆశలను అక్షరీకరిస్తాను! .
అమ్మా! నీ కలకు నేను సాకార రూపమై నిలుస్తాను!
- మద్దాళి రఘురామ్ 19888067777 (ఓ హాస్టల్ బాలి క ఆవేదన. 31 జూలై నాటి సాక్షి సంపాదకీయం స్ఫూర్తితో)
శ్రీదేవి జయంతి
ప్రముఖ సినీ కథానాయిక శ్రీదేవి జయంతి ఈరోజు. ఐదేళ్ల కిందట 2018 ఫిబ్రవరి 24న ఆమె మరణించారు. ఆమె మృతికి సంతాపంగా అప్పట్లో నేను రాసిన కవితను జయంతి సందర్భంగా పంచుకుంటున్నాను.
*దేవత మరణం*
*-డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు*
ఇప్పుడే తెలిసింది
దేవతలూ మరణిస్తారని
ఇంటింటా ఉన్న బొమ్మల డబ్బాలు
ప్రకటిస్తున్నాయి
జన హృదయాధిదేవత
అస్తమించిన సంగతి
గుండెల్లో కొలువైన దేవతలకూ
గుండె నొప్పి వస్తుందా?
మనసులే నెలవైన సురులకూ
మరణం ఉంటుందా?
మూగబోయిన హృదయం
మరు జన్మకైనా తేరుకుంటుందా?
మాటలు రాని మనసుకు
మరపు భాష వస్తుందా?
పదహారేళ్ల వయసులో ఆడి పాడిన
జ్ఞాపకాల దగ్గరే ఆగిపోయిన యవ్వనం
అతిలోక సుందరి వైపే చూసీ చూసీ
నిలిచిపోయిన దృష్టి కోణం
ప్రభాత సూరీడి సమక్షంలో
ఆకు నుండి నీటిగా
బొట్టు బొట్టూ జారిపడే
తుషార బిందు సౌందర్యం
నోరెళ్లబెట్టించే ఆ అందం
కళ్లప్పగించేలా చేసే ఆ అభినయం
పదహారేళ్ల వయసుతో
మనుషుల్ని మైమరిపించిన రూపం
మూడు పద్దెనిమిదుల ఈడులో
దేవుడిని మురిపించిన ఈ వైనం
పై నుండి ఒక సుమధుర స్వరం
“మానవా! బాధపడడం మానవా?”
కావ్యలహరి
కావ్యలహరి
9-8-2023
అంశము *చిత్ర కవిత*
పేరు---లలితా చండీ
ఊరు-హైదరాబాదు
ఏమి చిత్రమిది?
ఎంత అర్ధమున్నది
చిత్తమంతా భక్తినిండగా
అక్షరములు అలరెను ఇలాఇలా!
కమలనయనా కృష్ణా
శిఖి పించధారి అంటూ..
ఆ మధుసూదనుడు *హరి*
అభయమిచ్చే కరములా అవి..
పలికించేను మోహన రాగం
మోడుబారిన వెదురును
మోహన వంశిగా మార్చి
శృతి చేసేను, మనసును
దోచేసి మైమరపించేలా..
ఆల మందల ఆగోపాల బాలుర
గోప కాంతల ఉల్లములు
ఆనందముతో మురియగా
రాసలీలలకు పిలిచెనే వాడు
బృందావనమది బాల లీలలో
అసురులెందరో అసువులు బాయగా
రాస కేళికి రారమ్మంటూ
ఇదే మంచి సమయమంటూ
ఆ రాధను పిలిచెనే అస్కలితుడు.
గోవులను కాచిన వాడే
గీతను భోధించిన గోవిందుడు
భగవంతుడని భాగవతమే తెలిపే
గాధలెన్నో కలవు భారతానా!
లలితా చండీ
స్వీయ రచన✍️
కావ్యలహరి కోసం రాసినది
9885552922
బసవ పురాణం 11వ భాగము....
🎻🌹🙏 బసవ పురాణం 11వ భాగము....
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸ఒకనాడు కొందరు దొంగలు అంతఃపురంలోని ధనాన్ని అపహరించాలని యత్నించారు. లింగధారి కానివారికిలోపలికి ప్రవేశం లేదని తెలిసి వారంతా వంకాయలను లింగకాయలవలె కట్టుకొని లోపలికి వచ్చారు.
🌿బసవన్న ఆదరంతో వారిని మిగిలిన జంగములతోపాటు కూర్చోబెట్టి ‘శివపూజ కానీయండి అని ప్రార్థించాడు. దొంగలకు భయం వేసింది. బసవన్న చిరునవ్వు నవ్వాడు. గత్యంతరం లేక దండనకు భయపడి దొంగలు వంకాయలు విప్పి చేతబట్టుకొని అర్చన ప్రారంభించి చూసేసరికి చేతులలో వంకాయలకు బదులు లింగాలున్నాయి.
🌸భక్తులు నివ్వెరపోయారు. బసవన్న కన్నులతో నవ్వాడునిజమే భక్తులు స్మరిస్తే పరమేశ్వరుడు ఎందైనా ప్రత్యక్షమవుతాడు. బల్లేశు మల్లయ్య అనే శివభక్తుడు వ్యాపారార్థం పొరుగూరికి పోయాడు. అక్కడ శివాలయము లేదు.
🌿అందువల్ల ధాన్యం కొలిచే కుంచాన్ని లింగంగా భావించి ఉంచి లభ్యమైన కొండగోగులతో పూజ చేశాడు. అక్కడివారు మల్లయ్యను చూచి నవ్వి కుంచం లింగమట! ఏమి వెర్రి ధాన్యం కొలవాలి, తీసుకొని రండిరా అనేసరికి మల్లయ్య కోపగించి ‘మూర్ఖుల్లారా! నేను అర్చించినప్పుడే కుంచం లింగమైపోయిందిరా! పోయి చూడండి అన్నాడు.
🌸వాళ్ళు వెళ్లి చూచేసరికి కుంచం సాక్షాత్తు లింగమూర్తి అయింది. దాని చుట్టూ గుడి స్వర్ణశిఖరం వృషభేంద్రునితో ఆలయం వెలిసి వుంది కాటకోటడు అనే మరొక ముగ్ధ్భక్తుడున్నాడు.ఆయన గొల్లవాడు. ఒకనాడు మేక పెంటికను లింగంగా భావించి దానిని పాలతో అభిషేకం చేశాడు.
🌿అది విని ‘పాలన్నీ నేలపాలు చేశావు కదరా’ అని తండ్రి ఆ పెంటికను కాలదనే్నసరికి కాటకోటడు ఆ శివాపచారాన్ని సహింపలేక చేతిలో గండ్రగొడ్డలితో ఒకే దెబ్బన తండ్రి తలను నరికాడు. ఆ దెబ్బకు కైలాసంలోని సింహద్వారాలు దభీ దభీమని ఊగి ఊడి పడిపోయాయి. అలాగే బావూరి బ్రహ్మయ్య అనే భక్తుని భావనతో జొన్నలు లింగాలైనాయి.
🌸అందువల్ల భక్తులకు అసాధ్యమేముంది?ఇలా వుండగా ఒకనాడొక భక్తుడు బసవన్న వద్దకు వచ్చి నాకు ముత్యాల ముగ్గు తీర్చి శివార్చన చేసే నియమం వుంది. ముగ్గు తక్కువైంది. వెంటనే పది పుట్ల ముత్యాలు ఇప్పించు అని అడిగాడు. బసవన్న ఒక జొన్నల రాశివైపు చూచాడు.
🌿ఆయన అమృత వీక్షణంవల్ల జొన్నలు మొత్తం ముత్యాలైనాయి. ‘పది పుట్లేమిటి? ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని పోండి’ అని భక్తుణ్ణి అర్థించాడు బసవన్న అయితే ఇందులో ఆశ్చర్యమేమి లేదు. భక్త పరాధీనుడు కాబట్టే భక్తులు తలచినవెల్లా నెరవేరుతాయి.
🌸లోగడ మొరటద వంశయ్య అనే శరణుడు ఒక భక్తుని కోరికపై శివపూజ కోసం గొడ్డుటావును పితికి పాలు తెప్పించాడు. ఎండు కట్టెను కోసి బిల్వాలు తెప్పించాడు బసవన్న వద్ద ముత్యాలు తీసుకొన్న భక్తుడు ‘బాపురే బసవన్నా! నీ భక్తిని పరీక్షిద్దామని వచ్చానయ్య అని చూస్తుండగానే తన జంగమ వేషాన్ని వదలి వేశాడు.
🌿బసవన్న ఆశ్చర్య చకితుడై చూచేసరికి అక్కడ పరమేశ్వరుడు నిలబడి ఉన్నాడు.బసవా మూడవ కనే్నదీ అని ప్రశ్నించాడు శివుడు. బసవన్న నవ్వి అద్దం పట్టి అందులో శివునికి మూడవ కన్నును చూపించాడు. ‘నీ మాయ నే వెరుగుదును స్వామీ’ అన్నాడు బసవడు.
🌸అది విని శివుడులజ్జించి అంతర్థాను డైనాడు. ఇలా శివుడోడి బసవడుగెలిచాడు.గొల్లెత కథ
ఒకనాడు బిజ్జలుడు కొలువు దీరియుండగా బసవన్న ఉన్నట్టుండి ‘పడవద్దు- పడవద్దు’ అని రెండు చేతులూ పైకెత్తాడు. అది చూచి రాజు నవ్వి ‘ఏమి బసవన్నా! గాలిలో చేతులెత్తి పడవద్దని అంటున్నావు.
🌿భక్తిరసం తలకెక్కి శివమెత్తిందా ఏమిటి? అన్నాడు. అప్పుడు బసవన్న ‘ప్రభూ నిండు సభలో స్వగుణ సంకీర్తనం చాలా తప్పు. అయినా మీరు అడిగారు కాబట్టి గత్యంతరం లేక చెపుతున్నాను. త్రిపురారి గుడి తూర్పు దిక్కున కపిలేశ్వరంలో ఒక తపస్వి శివునికి ఆరుపుట్ల పాలతో క్షీరాభిషేకం చేస్తాడు. నిత్యమూ అవి కాలువ గట్టి నేడు వీధిలోకి వచ్చి ఏనుగులు తొక్కడంతో బురదగా అయింది.
🌸ఆ వీధిలో చల్లనమ్ముతూ పోతున్న ఒక గొల్లెత బురదలో కాలుజారి పడబోతూ ‘బసవా! బసవా! అని నన్ను స్మరించింది. తక్షణమే నేను చేయెత్తి పడవద్దు పడవద్దు అని సాయం పట్టి కుండ పట్టుకున్నాను అన్నాడు. సభ ఈ విషయాలు నమ్మలేదు. బిజ్జలుడు తక్షణమే భటులను పంపి గొల్లెతను పిలిపించి నిజానిజాలు విచారించాడు.
🌿గొల్లెత నిజమేనని చెప్పి తనకంటిన బురదను చూపించింది. సభ మొత్తమూ నివ్వెరపోయింది. అప్పుడా గొల్లెత ‘ప్రభూ! పూర్వం తిరుచిట్టంచిలుడు అనే భక్తుడు శివపూజకై పూలు తెస్తూ నదీ తీరంలో కాలు జారిపడిపోతూ ‘ప్రభూ’ అని కేకబెట్టగా శివుడు స్వయంగా వచ్చి భక్తుణ్ణి పట్టుకున్నాడు. నేనూ అదేవిధంగా బసవణ్ణి స్మరిస్తే బసవలింగయ్యగారు నాకు నేడు సహాయం చేశాడు’ అని చెప్పింది...సశేషం..🚩🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
_హిందువులలో
🍁🍁🌸🌸🪴🪴🪴
*_జై శ్రీరామ్ 🙏_*
*_హిందువులలో ఉన్న లోపాలు_ 👇*
*_1)ఐకమత్యం లేకపోవటం_*
*_2)అతి మంచితనము_*
*_3)కుల పిచ్చ_*
*_4)డబ్బు పిచ్చి_*
*_5)గ్రంధాలు(చరిత్ర )చదవకపోవటం_*
*_6)మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనం తెలుసుకోకపోవటం_*
*_7)మూఢ నమ్మకం ఏదో మంచి నమ్మకం ఏదో తెలియక పోవటం_*
*_8)కాలానికి అనుకూలంగా మార్పు చెందలేకపోవటం_*
*_9)మత ప్రచారం చేసేవాళ్ళు లేకపోవటం_*
*_10)నాకెందుకులే అనే నిర్లక్ష్యం_*
*_11)సమాజంలో జరుగుతున్న దుర్మార్గాలని ప్రశ్నించలేకపోవటం.._*
*_12)తేలివి ఉన్నవారికి డబ్బు లేకపోవటం డబ్బు ఉన్నవారికి తెలివి లేకపోవటం రెండు ఉంటే విదేశాలకు వెళ్ళటం_*
*_13) కనీసం ధర్మ రక్షణకు పనిచేస్తున్న మంచి వారికి సాయం చెయ్యాలనే మనసు లేకపోవటం_*
*_14)అక్రమంగా విదేశీ గాడిదలు ఉన్నారు అని తెలిసి కూడా చూసి చూడనట్లు నటించం.._*
*_చివరి లోపాన్ని అయిన హిందువులు సరిదిద్దుకోగలిగితే హిందు ధర్మానికి మంచిరోజులు మళ్ళీ ప్రారంభమైనట్టే..._*
*_జై హింద్ 🚩🚩🚩🚩🚩🙏🙏🙏_*
_కొడెనాగులోస్తున్నాయిఓటు వేయమని_*
😭😭😭😭😭😭😭
*_కొడెనాగులోస్తున్నాయిఓటు వేయమని_*
*_బ్రతిమిలాడగ_*
*_భూమిని మింగే_*
*_జెర్రిపోతులు_* *_వస్తున్నాయి..._*
*_ఓటు వేయమని బ్రతిమి లాడగ_*
*_నీకు రోగమొస్తే లక్షలు గుంజిన_*
*_కార్పొరేట్ దవాఖాన ఎవ్వరిధిరా...?_*
*_వారి చుట్టానిధిరా..?_*
*_నీ పిల్లల ఫీజులు లక్షలలో_*
*_లాగిన కార్పొరేట్ విద్యాలయం_*
*_ఎవ్వరిధిరా...?_*
*_వారికి వరసై నొడిధిరా..?_*
*_భూములేవ్వరికి ఉన్నవిరా..?_*
*_రైతు బంధు రుణమాఫి ఎవ్వరికీ ఎక్కువ ముట్టిందిరా...?_*
*_పరిశ్రమలు, వ్యాపారాలు ఎవ్వరివి_*
*_ఎమ్మెల్యే టికెట్స్ ఎవ్వరివి_*
*_తెలుసుకోర వెర్రి నాయనా...?_*
*_నీ ఓటే వారికి అన్నిటినీ సమకూరుస్తుంది తెలుసుకో..._*
*_ఓటు లోనే మర్మమున్నది.._*
*_ఓటు జాగ్రత్తగా నీ వాడికే వేసుకో...._*
*_ఓటు దొంగల కేసి_* *_దరిద్రుడిగా.._*
*_ఉండి పోకురా..._*
శ్రీ కాళహస్తీశ్వర శతకం - 72
శ్రీ కాళహస్తీశ్వర శతకం - 72
కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం
బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషాదులటంచు న్నిమిషార్ధ జీవనములంచుం బ్రీతిఁ బుట్టించి యీ సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీ కాళహస్తీశ్వరా! మానవులమగు మాకు మేము మామంచిచెడుగులను మేమే నిర్ణయించు కొనగలమను అజ్ఞానము కలిగించి వెర్రి మొర్రి ప్రాపంచిక విద్యలైన స్వప్నములు - వాటి ఫలితములు,
శుభ దుశ్శకునములు, శుభాశుభ గ్రహయోగములు, సాముద్రిక లక్షణములు, అరిష్ఠములు, దృష్టిదోషములు, భూతములు, విషాదులు మొదలగునవి మామెడకు కట్టితివి. వాని మోహములో వాటిని నమ్ముతు పొరపాటు చేయుచున్నాము.
ఇది అంతయు అర్ధనిమేష అల్పకాలజీవనము కొరకే కదా! ఈ లోతును మేము ఆలోచించలేకున్నాము. ఏల ఇట్లు చేసి మమ్ము బంధింతువయా ప్రభూ...
ఓం నమః శివాయ
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
సృష్టి గణపతి
*నిత్యాన్వేషణ:*
సృష్టి గణపతి గురించి వివరాలు తెలుపగలరు?
గణపతిని వివిధ రూపాలలో అర్చించడం సనాతనంగా అలవాటు. ఆదిశంకరులు వారు షణ్మతాలని స్థాపించారు అందులో ఒకటి గాణపత్యం.
హిందువు యొక్క పూజా విధానాల్లో ఎక్కడ కూడా ఇస్లామిక్ విధానాలు లేదా క్రిస్టియన్ విధానాలు ఉండవు. అలాగే ఎవరు - భగవంతుని - ఎందుకోసం ప్రార్థించినా కూడా - ఒకే సంప్రదాయంలో ఆ ప్రార్థన విధానాలన్నీ ఉండటం అన్నది సహజమైన ప్రక్రియ.
విఘ్నాలు పోవడానికి గణపతిని, చదువు కోసం సరస్వతి దేవిని, డబ్బు కోసం లక్ష్మీదేవిని - ఇలా అన్ని సంప్రదాయాలని కలిపి వాడుకోవడం అన్నది కొత్తగా ప్రారంభమైన ప్రక్రియ. పూర్వకాలంలో అలా ఉండేది కాదు.
ఉదాహరణకి వైష్ణవ సంప్రదాయంలో - గణపతిని పూజించరు. విశ్వక్సేనుల వారిని పూజిస్తారు. చదువు కోసం సరస్వతి దేవిని అర్చించరు విద్యాలక్ష్మిని పూజిస్తారు. లక్ష్మీదేవి అష్టలక్ష్మిలుగా భాషిస్తుంది.
సారాంశం - మనిషికి ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా రకరకాల దేవతా స్వరూపాలను అర్చించడం మొదలుపెట్టాడు. అవసరాలు ఎన్నైనప్పటికీ, దేవతా స్వరూపాలు ఎన్ని అయినప్పటికీ — అవన్నీ కూడా ఒకే సంప్రదాయంలో ఉండడం అన్నది పద్ధతి. ఒక సంప్రదాయాన్ని పాటించేవారు వేరొక సంప్రదాయంలోని దేవతా స్వరూపాన్ని అర్ర్చించేవారు కాదు. ఇది వేరొక సంప్రదాయం పట్ల ఉన్నటువంటి నిరసన కాదు. తమ సంప్రదాయం పట్ల ఉన్నటువంటి గౌరవము — నమ్మకము.
తమ సంప్రదాయంలోని పూజా విధానాలు, స్తోత్రాలు ధర్మబద్ధమైనటువంటి తమ కోరికలను అన్నింటిని తీర్చలేదు అన్న ఆలోచన — మనిషిని ఆ సంప్రదాయంలో ఎక్కువ కాలం నిలువనివ్వదు.
అందుకని ప్రతి సంప్రదాయంలో కూడా సగటు మనిషి అవసరాలు తీరడానికి కావలసినటువంటి పూజలో, స్తోత్రాలో మరొకటో ఉంటాయి. అలాగే గణపతి ఆరాధనా విధానాల్లో కూడా.
పైన చెప్పినటువంటి విధానంలో భాగంగా 32 రకములైనటువంటి గణపతి స్వరూపాలున్నాయి. కొన్ని లెక్కల ప్రకారం ఈ 32 గణపతిలలో 23వ వాడు సృష్టి గణపతి. మరికొన్ని పద్ధతుల్లో ఆయన 21వ వాడు. వరుస క్రమంలో ఈ స్వరూపం యొక్క సంఖ్య ఏదైనప్పటికీని — సృష్టి గణపతి అన్నది గణపతి యొక్క స్వరూపాలలో ఒకటి.
పేరు సూచిస్తోంది ఈ గణపతి సృష్టికి మూల కారకుడు. గాణపత్యంలో బ్రహ్మగారు అన్నమాట.
ఈ గణపతి స్వరూప ఆరాధన కేరళలోని తిరునంతపురం ప్రాంతాలలోనూ, కర్ణాటకలో మైసూరు ప్రాంతంలోనూ, తమిళనాడులో సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం స్వామి మలై లోను ఉన్నది.
ఈ గణపతిది జ్యేష్ట నక్షత్రం. ఈయనని ఆరాధిస్తే విచక్షణా జ్ఞానం కలుగుతుంది.
అందాన్ని కృశింప చేస్తుంది
🪷 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪷
🕉️ *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_*🕉️
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*_ఆదౌ రూప వినాశినీ కృశ కరీ కామాంకురచ్ఛేదినీ_*|
*_పుత్రామిత్ర కలత్ర భేదనకరీ గర్వాంకుర చ్చేదినీ_*||
*_కామం మందకరీ తపః క్షయకరి ధర్మస్య నిర్మూలినీ_*|
*_సా మాం సంప్రతి సర్వరోగ జననీ ప్రాణాపహంత్రీ క్షుధా_*||
𝕝𝕝భావం𝕝𝕝
ఆకలి అనేది మనిషి అందాన్ని కృశింప చేస్తుంది, సన్నగా కళా హీనంగా చేస్తుంది, లైంగిక కోరికను తగ్గిస్తుంది , పుత్రుణ్ణి కూడా శత్రువుగా చేస్తుంది,మిత్రులను దూరం చేస్తుంది మరియు భార్యతో విభేదాలు సృష్టిస్తుంది... మరియు కుటుంబ సభ్యులను విచ్ఛిన్నం చేస్తుంది, సహనాన్ని తగ్గిస్తుంది మరియు ధర్మమార్గం ను దగ్గరకు రాకుండా చేస్తుంది .... అన్ని రకాల అనారోగ్యాలకు మూలకారణంగా మారుతుంది ఇది చివరికి వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. ఆకలి అన్నింటి కంటే భయంకరమైనది.
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-28🌹*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-28🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కొల్లాపురమున లక్ష్మీదేవి భర్తయయిన శ్రీమహావిష్ణువును గూర్చి పదేపదే ఆలోచించుచూ కాలము గడుపుచున్నది. తాను కొల్లాపురమున నేకాకిగా నున్నందులకామె లోలోపల మిక్కిలి వెతపడుచున్నది.
ఈ విధముగా వుంటూండగా ఒకనాడు నారాయణ నామస్మరణచేస్తూ నారదుడు వచ్చివాడు. లక్ష్మీదేవి అతనికి తగిన గౌరవము చేసి లోక వృత్తాంత విశేషములు చెప్పుమని అడిగింది. అడిగినదే తడవుగా నారదుడు సర్వలోక విశేష విషయాలూ లక్ష్మీదేవికి వివరించాడు.
పద్మావతీ శ్రీనివాసుల సంగతి కూడా తెలిపినాడు. అందులకు ఆమె తనపట్ల శ్రీనివాసునకు ప్రేమాభిమానములు ఏమయినా తగ్గినవా? అని అడిగింది. ‘‘ఏమో! పద్మావతీదేవిని లాలించుటలో, పాలించుటలో నున్న శ్రద్ద నాపట్ల సున్నయగునేమో!’’ అని స్ర్తీ సహజ భావమును నారదుని యెదుట ప్రకటించినది.
నారదుడు ‘‘శ్రీనివాసునకు నీపైగల అభిమానము చెక్కుచెదరలేదు. అతడును యీ మధ్య నిన్ను పలుమారులు తలచుకొనుట జరుగుచున్నది. ఆయన హృదయమును అర్ధము చేసుకొని నీవు ఆయనను చేరుటయే లోకకళ్యాణప్రద కార్యమగును.’’ అని బోధించి, తన దారిన వెడలెను.
*సవతుల కయ్యము:*
నారదుడు కొల్లాపురమునుండి సరాసరి శ్రీనివాసుని వద్దకు వెడలి, జరిగిన విషయము పూసగ్రుచ్చినట్లు చెప్పినాడు.
శ్రీనివాసుడు ‘‘నారదా! లక్ష్మీదేవి నాచెంత లేకుండుటవలన నేను కూడా చాలా బాధపడుచున్నాను. ఆమెను చూచి ఎన్నోళ్ళో అయినది. నేనే స్వయముగా వెడలి ఆమెను ఆహ్వానించి తీసుకొని రావలె ననుకొనుచున్నాను. అన్నాడు.
‘శుభమస్తు’ అన్నాడు నారదుడు. తాను లక్ష్మీవేవిని తేనున్న విషయాన్ని శ్రీనివాసుడు పద్మావతితో తెలుపగా ఆమె ఏ కళనున్నదోగాని అంగీకరించినది. వెంటనే శ్రీనివాసుడు రాయాబారాల మీద రాయబారాలు జరిపి ఎట్టకేలకు లక్ష్మీదేవిని తీసుకొని వచ్చినాడు.
శ్రీ వెంకటేశుడు తనకు తాళిగట్టినాడనీ ఆయనకు లక్ష్మికన్న తానే ఎక్కువ అనీ పద్మావతి వాదన. అంతకు ముందెన్నడో స్వర్గమున శ్రీ మహావిష్ణువున్నప్పటి నుండియు ఆయన హృదయ మందిరమున తాను నివసించుట వుండనే వున్నదనీ, కనుక, మహావిష్ణువునకు పద్మావతీదేవి కంటే తానే అధికమైన ప్రియురాలిననీ లక్ష్మీదేవి వాదన, పద్మావతీ, లక్ష్మీదేవి ఒకరినొకరు చిలువలు పలువలు పెంచుకొనుచూ నేనేవో అనుకొనసాగిరి.
ఆ సవతుల కయ్యమును శ్రీ వెంకటేశ్వరస్వామి ఆపుటకు ప్రత్నించెను. కాని వారి దెప్పుళ్ళూ మాటవిసుర్లూ, సణుగుళ్ళూ ఏ మాత్రమూ తగ్గలేదు. పైపెచ్చు హెచ్చినవి. ఒకరి పుట్టుపూర్వోత్తరాలు మరియొకరు విమర్శించుకొనసాగినారు. ఇక పరిస్థితిని శ్రుతిమించి రాగాన పడనీయ రాదనుకొనినాడు శ్రీనివాసుడు. ఒకనాడు ఏకాంతములో పద్మావతి పూర్వచరిత్ర అయిన వేదవతి కథను లక్ష్మికి చెప్పినాడు.
నివాసుడు చెప్పిన పూర్వకథను విని నిజము తెలుసుకొని లక్ష్మీదేవి శాంతించెను.
అంతకు శ్రీవేంకటేశ్వరుడు మిక్కిలి ఆనందించి ఆమెతో యిట్లనెను.
‘‘దేవీ! నేను వివాహము కొరకు కుబేరుని వద్ద అప్పు తీసుకొంటిని. అది తీర్చు మార్గము తోచుట లేదు. ప్రతీ సంవత్సరము వడ్డీ చెల్లింతునని పత్రము వ్రాసితిని, నీవు నాకొక ఉపకారం చేయవలెను. ఈ కలియుగమున నా భక్తులకు భాగ్యమిచ్చుచుండవలెను.
వారు ధన గర్వముచే పాపము లొనర్చి ఆపదలపాలైనా దర్శనమును కోరుదురు. నాకు మ్రొక్కులు, ముడుపులు, నిలువుదోపుడులు చెల్లించమని కలలం దగుపడి చెప్పి వారిని కాపాడు చుందును. వారివల్ల ప్రతిసంత్సరము వసూలు చేసిన వడ్డీకాసులను కలియుగాంతము వరకు కుబేరునకు చెల్లించెదను. ఆ తదుపరి అసలు దీర్చి మనము వైకుంఠమునకు చేరుకొందుము.
అంతవరకు నీవీ పద్మసరోవరమునుండి భక్తులను రక్షించుము’ ఆ మాటలకు లక్ష్మీదేవి మొక్కి ఆనందించి, తాను శ్రీ వేంకటేశ్వరుని వక్షమందుండుటకును తన అంశమును పద్మసరోవరమును వెలయించుటకును అంగీకరించెను.
శ్రీనివాసుడు దేవశిల్పి విశ్వకర్మను గావించి శుకాశ్రమమునందలి పద్మసరోవరము వద్ద మందిరమును నిర్మింపజేసెను. లక్ష్మీదేవిని ఆ ఆలయమున ప్రవేశింప జేసి శుకునిచే అచ్చడ అగ్రహారమును వెలయింపజేసెను.
ఒక రోజున శ్రీనివాసుని సుందర్శించుటకై తొండమానుడు ఆగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ పద్మావతీ శ్రీనివాసులు అతడిని చాలా గౌరవించిరి.
తరువాత తొండమానుడు శ్రీనివాసుడితో ‘‘సర్వలోకరక్షకా! సృష్టికారణా! భక్తజనరక్షకా సుందరమైననీ దివ్యరూపాన్నీ చూస్తుంటే, సర్వకాల సర్వావస్థలోనూ యిలా చూస్తూనే జీవించాలనే కోరిక కలుగుతోంది, నాకు దేనిపైనా ఆశలేదు.
కానీ, నీ పాదసేవపైననే ఆశ కలదు. ఈ దీనుడయిన భక్తునిపై కరుణాదృష్టి ఎప్పుడునూ జూపుతూ వుండండి’’ అన్నాడు.
అందుకు శ్రీనివాసుడు అంగీకరించి ‘‘రాజా! నీ కోరిక తీరవలెనంటే నీవు నాకై ఒక చక్కని ఆలయం నిర్మించాలి’’ అన్నాడు. అనంతరం తొండమానుని శేషాచలానికి తీసుకొనివెళ్ళి అక్కడ కొంత స్థలమును చూపించి ‘‘రాజా! ఇదిగో ఈ ప్రదేశము నాకు వరాహస్వామిచే యివ్వబడినటువంటింది. ఇందు స్వామిపుష్కరిణికి తూర్పు ముఖంగా ఆలయ నిర్మాణము చేయుము.
గోపుర, ప్రాకార, సింహద్వార, ధ్వజస్తంబ ఆస్థాన మండపములు-గో, ధాన్య వంటశాలలూ అన్నీ దానిలోనే ఉండేవిధంగా ఆలయం కట్టించు. అన్నట్లు చెప్పడం మరిచాను. ఇక్కడనే ఒక పూలబావి కలదు. అది శిధిలావస్థలో నున్నది. అదే బాగుచేయించు’’ అన్నాడు.
గరుడాద్రి వాస గోవిందా, నీలాద్రి నిలయా గోవిందా, అన్జనాద్రీస గోవిందా, వృషభాద్రీసా గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||28||
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
పరవిద్య, అపరవిద్య
తపస్సు చేసుకుంటున్న అంగీరసుని వద్దకు శౌనకమహర్షి వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని కోరాడు. విద్య రెండు విధాలుగా పరవిద్య, అపరవిద్య అని రెండు రకాలుగా ఉంటుందని, వేదాలు, వేదాంగాలు అపరావిద్యలని, అక్షర స్వరూపుడై పరావిద్య అని, దానిని పొందే మార్గాన్ని తెలిపాడు. ఈశ్వరుడు క్షరాక్షరాలకు అతీతుడని, క్షర అంటే కదులుతూ ఉండేదని, అక్షరమంటే కదలిక లేనిదని తెలిపాడు. (ఉదాహరణకు, నీటియందు కదలికచే చంద్రుని యొక్క ప్రతిబింబం కదులుతున్నట్లుగా అనిపిస్తూ, అదే నిర్మలంగా ఉన్ననీటిలో కదలకుండా, స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది, వాస్తవానికి, క్షరాక్షరాలకు అతీతం చంద్రబింబం) ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని సంపాదించేందుకు ఉపనిషత్తులనే ధనస్సును, అంతఃకరణ వృత్తి అనే బాణంతో అనుసంధానం చేసి, ఉపాసనతో దానికి పదునుపెట్టి, పరమాత్మయందు ఏకాగ్రమైన మనస్సుని బ్రహ్మంగా భావిస్తూ సంధించిన అపరోక్షజ్ఞానం కలుగుతుందని, అదే మోక్షమని తెలిపాడు అంగీరసుడు. ఈ బోధ అంతా ముండకోపనిషత్లో ఉంది. మాండుక్యకారికలోనూ ఈ విషయాలను వివరిస్తారు.
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-29🌹*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-29🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
తొండమానుడు ఆలయ నిర్మాణమునకు తక్షణమే పూనుకొనినాడు. అతితక్కువ రోజుల్లోనే ఆనందనిలయం గోపుర, ప్రాకార, మంటపాలూ, మెట్లూ కట్టించాడు. పూల బావిని బాగుచేయించినాడు. ఆలయ నిర్మాణపు ముగింపు గూర్చి శ్రీనివాసునకు కబురు పంపినాడు.
వేద వేదాంగ నిష్ణాతులైన బ్రాహ్మణులు శ్రీనివాసుడు ఆలయములో ప్రవేశించడానికి సముహూర్తం నిర్ణయించినారు. ఆ ప్రవేశోత్సవం చూడడానికి సర్వలోకాల వారున్నూ విచ్చేసారు. పద్మావతీ శ్రీనివాసులు చక్కగా ముస్తాబై ముహూర్తము సమీపించగానే విప్రాశీర్వచన శ్లోక శుభమంత్రములు చెలగుచుండ, వివిధ మంగళ వాయిద్యములు మ్రోగుచుండ, మునీంద్రులు ఆశీర్వచన శుభవాక్యాలు పలుకుచుండ, బ్రహ్మాది దేవతలు పుష్పవర్షం కురిపించుచుండ, జయ జయ నినాదముల మధ్య ఆనంద నిలయమున ప్రవేశించినారు.
కలియుగదైవమైన శ్రీనివాసుడు వుండు శ్రీ వేంకటాచలము ఒక ఆమడవెడల్పు, ముప్పయి ఆమడల పొడవు విస్తరించి వుంది
. శ్రీమద్వేంకట శైలరాజ శిఖరే శ్రీ శ్రీనివాసో హరి:
శ్రీమత్ స్వామి సరోవర ప్రభృతిభి: పుణ్యైరనేకైర్యుతే
తీర్థై:ప్రాజ్ముఖ సంస్థితి ర్విజయతే శ్రీతొండమానాదిభి:
దృష్ట: శ్రీ నవసూరి సంస్తుత వపు స్త్వాలింగ్య పద్మావతీమ్||
శ్రీ వేంకట గిరీశోయం అలర్ మేల్ మంగనాయకీమ్|
ఆశ్రితో రాజతే నిత్యం ఆనంద నిలయాలయ:||
మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్
స్వామిపుష్కరిణీ తీరే రమయా సహమోదతే.
శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపమైన శ్రీవైకుంఠమును విడచి స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు, అనియు
"శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్"
("శ్రీవైకుంఠమున విరక్తుడైన స్వామి, స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు")
అనియు చెప్పినట్లుగా శ్రీవైకుంఠనికేతనుడైన స్వామి భక్త సంరక్షణ దీక్షితుడై తిరుమలపై వేంచేసియున్నాడు.
"కృతేయుగే నారసింహ: త్రేతాయాంరఘునందన:
ద్వాపరే వాసు దేవశ్చ కలౌవేంకటనాయక:"
అని చెప్పినట్లుగా కృతయుగమున నరసింహస్వామి, త్రేతాయుగమున శ్రీరామచంద్రులు, ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్మ; కలియుగమున శ్రీవేంకటేశ్వరస్వామి భక్తరక్షణ దీక్షితులై యున్నారు.
శ్రీనివాసునకు బ్రహ్మోత్సవము
ఆనందనిలయం ప్రవేశోత్సవము జరిగిన తరువాత బ్రహ్మదేవుడు శ్రీనివాసుని చెంతకు వచ్చి ‘ఆదిపురుషా! నేను నీ చెంత రెండు ఆఖండజ్యోతులు వెలిగించెదను. లోక కళ్యాణకరంగా అవి ఎప్పుడూ నీ వద్ద వెలుగుతూండవలెను. ..
నీవు కలియుగపుమానవుల కొరకై యుగాంతము వరకూ యిచ్చటనే నివసించుచు భక్తులకు దర్శనభాగ్యము కలుగజేస్తూ వుండవలెను.
నేను నీకు ఒక ఉత్సవము చేయగలను. దానికి మీరు అంగీకరించ గలందులకు కోరుచున్నాడు. అనగా శ్రీ వెంకటేశ్వరుడు అంగీకరించినాడు.
బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి, ఇవి కలియుగాంతం వరకూ వెలుగుతూంటాయని చెప్పాడు.
బ్రహ్మోత్సవము ప్రారంభమైనది.
పగలూ రాత్రీ అనక, ఏకటాకిని అలాగే ఉత్సవము జరుగసాగినది.
ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదటి రోజున అంకురార్పణ జరిగినది. ధ్వజారోహణము, శేషవాహనము, గజవాహనము, సింహవాహనము, ముత్తెంపుపందిరి, కల్పవృక్షవాహనము, సర్వభూపాల వాహనము, మోహినీ అవతారము గరుడసేవ, హనుమంత వాహనము, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు, రథోత్సవము అశ్వవాహనము ఇవి అన్నీ తొమ్మిది రోజులపాటు రకరకాలుగా ఉత్సవాలు జరిగాయి.
పదియవ రోజున అలంకారాలతో నిండిన పల్లకీ ఉత్సవము జరిగినది. ఆనాడే స్వామి పుష్కరిణీ తీర్థములో అవబృథస్నానము కూడా జరిగినది. వేలకొలదీ భక్తులు యీ ఉత్సవాలకు హాజరయ్యారు.
ఎక్కడ విన్ననూ ‘గోవిందా, గోవిందా’ అనే హరినామస్మరణమే! శేషాచలము! బ్రహ్మోత్సవ సమయములో వైకుంఠాన్ని తిరస్కరించేటటువంటి ప్రకాశంతముగా వుంది. భక్తులు శ్రీ వేంకటేశ్వరునకు కానుకలూ అవీ సమర్పించి, అనంతరము వారి వారి యిండ్లకు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు శ్రీనివాసునితో చెప్పి సత్యలోకానికి వెళ్ళి పోయాడు.
తిరుమల నాయక గోవిందా, తులసీమాల గోవిందా, శేషాద్రి నిలయ గోవిందా, శ్రేయోదాయక గోవిందా, |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||29||
*శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 19*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 19*
44 అంత సులభం కాదు. అలా ఒక వ్యక్తి చేయగలిగితే అది అతనిలో బ్రహ్మచర్యశక్తి లేదా మేధాశక్తి అనే నూతన శక్తిని జనింపచేస్తుంది. ఈ శక్తి అసాధ్య కార్యాలను సాధ్యం చేస్తుంది. ఈ శక్తిని సముపార్జించే తీరాలని నరేంద్రుడు నిశ్చయించాడు. అందుకు తగ్గట్లు తన జీవిత విధానాన్ని మలచుకొన్నాడు.
అయినప్పటికీ ఒక రోజు ఆ ఉద్వేగం కట్టలు తెంచుకొని ఆతడిలో ఉప్పొంగింది. ఇక మీదట అది తలెత్తకుండా అదుపులో ఉంచే తీరాలని సంకల్పించాడు. తలచుకొన్నది సాధించే తీరుతాడు కదా నరేంద్రుడు! చుట్టూ పరికించాడు. చలి కాచుకోవడానికి పొయ్యి రాజేసి ఉన్నారు. శరీర భాగం తాకేటట్లు ఆ పొయ్యి మీద కూర్చున్నాడు! ఆ పుండు నయం కావడానికి నెలలు పట్టింది! శరీరం మీద పుండు ఏర్పడ్డదే తప్ప కామం అనే పిడికిలి నుండి మనస్సు విడివడింది.
ఆ తరువాత నరేంద్రుని జీవితంలో కామం అనే పదానికే చోటులేకపోయింది. ఆ యౌవనావస్థలోనే తనను కోరివచ్చిన స్త్రీలను తల్లిగా భావించి, వారిని త్రోసి రాజన్న శక్తి అతడిలో కలిగింది.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 4*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 4*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః*
*త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా |*
*భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం*
*శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ ||*
ఈ శ్లోకంలో అమ్మవారిని సూచనగా వర్ణిస్తున్నారు. వరద, అభయ ముద్రలు లేనిదిగా చెరకు విల్లు, పుష్పబాణములు, పాశము, అంకుశము పట్టుకొని వున్న అమ్మవారిగా చూపిస్తున్నారు.
త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః = నీవు తప్ప మిగిలిన దేవతా గణాలు అభయ, వరద ముద్రలతో వున్నారు.
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా = నీవు ఒక్కదానివే అభయ వరద ముద్రాభినయము ప్రకటించటంలేదు. ఎందుకని?
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం = అమ్మవారి నామాల్లో *భయాపహా* అని చెప్పుకుంటున్నాము. భయముల నుండి రక్షించటానికి, కోరిన దాన్ని మించి ఇవ్వటానికి అమ్మవారికి వరద అభయ ముద్రల అభినయము అక్కరలేదు.
శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ = నీ పాదారవిందములే లోకాలకు అభయము, వరములు ఇవ్వటానికి శరణ్యము.
అమ్మవారు జ్ఞానప్రదాయిని. ద్వైతం భయం అన్నారు పండితులు. నీవు కాక మరొక వస్తువు వున్నదన్న భ్రమయే వివిధములైన భయమును కలిగిస్తుంది. విశ్వమంతా నీవే వ్యాపించి వున్నావు అనే సుజ్ఞాన భావన కలిగినప్పుడు ఇక దేనికి భయపడాలి? దేనిని కోరాలి - జ్ఞాన వైరాగ్యములు కలిగాక? ఇవి ఇచ్చేది అమ్మవారి పాదపద్మములే అంటున్నారు శంకరులు. *వాంచితార్ధప్రదాయినీ*, *వరదా వామనయనా* అని అమ్మవారి నామాలు. అటువంటి దివ్య పాదములను కాంచీపురంలో మహాయోగముద్రలో కూర్చొని వున్న కామాక్షీ అమ్మవారు ముముక్షువులకు అనుగ్రహిస్తున్నారు.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹