*1839*
*కం*
మన సంతోషము స్వార్థము
మనవారలసంతసమ్ము మర్యాద యగున్
జనులందరిమోదమ్ములు
మనిషికి పరమార్థమగును మరువకు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మనం సంతోషంగా ఉండాలనుకోవడం స్వార్థం, మనవాళ్ళు సంతోషం గా ఉండాలనుకోవడం మర్యాద, కానీ జనులందరిసంతోషం కోరుకోవడం మనిషి కి పరమార్థమని మరువవద్దు.
*ఉదాహరణ*:-- మన సంతోషం కోసం కొన్ని జీవులను చంపితినడంకంటే అవి కూడా సుఖసంతోషాలతో జీవించాలనుకోవడమే మనిషి కి పరమార్ధం, ఎందుకంటే మనిషి ఎంతో తెలివైన వాడు, సమర్ధుడు, కావున రుచిగా ఏ శాకమునైనా వండుకుని తినగలడు,తన శక్తి సామర్థ్యాలతో సాటి జీవాలను కూడా బతకనీయడమే నరజన్మకు సార్థకమవుతుంది, అదే పరమార్ధం.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి