23, ఆగస్టు 2023, బుధవారం

పరవిద్య, అపరవిద్య

 తపస్సు చేసుకుంటున్న అంగీరసుని వద్దకు శౌనకమహర్షి వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని కోరాడు. విద్య రెండు విధాలుగా పరవిద్య, అపరవిద్య అని రెండు రకాలుగా ఉంటుందని, వేదాలు, వేదాంగాలు అపరావిద్యలని, అక్షర స్వరూపుడై పరావిద్య అని, దానిని పొందే మార్గాన్ని తెలిపాడు. ఈశ్వరుడు క్షరాక్షరాలకు అతీతుడని, క్షర అంటే కదులుతూ ఉండేదని, అక్షరమంటే కదలిక లేనిదని తెలిపాడు. (ఉదాహరణకు, నీటియందు కదలికచే చంద్రుని యొక్క ప్రతిబింబం కదులుతున్నట్లుగా అనిపిస్తూ, అదే నిర్మలంగా ఉన్ననీటిలో కదలకుండా, స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది, వాస్తవానికి, క్షరాక్షరాలకు అతీతం చంద్రబింబం) ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని సంపాదించేందుకు ఉపనిషత్తులనే ధనస్సును, అంతఃకరణ వృత్తి అనే బాణంతో అనుసంధానం చేసి, ఉపాసనతో దానికి పదునుపెట్టి, పరమాత్మయందు ఏకాగ్రమైన మనస్సుని బ్రహ్మంగా భావిస్తూ సంధించిన అపరోక్షజ్ఞానం కలుగుతుందని, అదే మోక్షమని తెలిపాడు అంగీరసుడు. ఈ బోధ అంతా ముండకోపనిషత్లో ఉంది. మాండుక్యకారికలోనూ ఈ విషయాలను వివరిస్తారు.

కామెంట్‌లు లేవు: