23, ఆగస్టు 2023, బుధవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 4*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 4*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


       *త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః*

       *త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా |*

       *భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం*

       *శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ ||*


ఈ శ్లోకంలో అమ్మవారిని సూచనగా వర్ణిస్తున్నారు. వరద, అభయ ముద్రలు లేనిదిగా చెరకు విల్లు, పుష్పబాణములు, పాశము, అంకుశము పట్టుకొని వున్న అమ్మవారిగా చూపిస్తున్నారు.


త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః = నీవు తప్ప మిగిలిన దేవతా గణాలు అభయ, వరద ముద్రలతో వున్నారు.

త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా = నీవు ఒక్కదానివే అభయ వరద ముద్రాభినయము ప్రకటించటంలేదు. ఎందుకని?


భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం = అమ్మవారి నామాల్లో *భయాపహా* అని చెప్పుకుంటున్నాము. భయముల నుండి రక్షించటానికి, కోరిన దాన్ని మించి ఇవ్వటానికి అమ్మవారికి వరద అభయ ముద్రల అభినయము అక్కరలేదు.


శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ = నీ పాదారవిందములే లోకాలకు అభయము, వరములు ఇవ్వటానికి శరణ్యము.


అమ్మవారు జ్ఞానప్రదాయిని. ద్వైతం భయం అన్నారు పండితులు. నీవు కాక మరొక వస్తువు వున్నదన్న భ్రమయే వివిధములైన భయమును కలిగిస్తుంది. విశ్వమంతా నీవే వ్యాపించి వున్నావు అనే సుజ్ఞాన భావన కలిగినప్పుడు ఇక దేనికి భయపడాలి? దేనిని కోరాలి - జ్ఞాన వైరాగ్యములు కలిగాక? ఇవి ఇచ్చేది అమ్మవారి పాదపద్మములే అంటున్నారు శంకరులు. *వాంచితార్ధప్రదాయినీ*, *వరదా వామనయనా* అని అమ్మవారి నామాలు. అటువంటి దివ్య పాదములను కాంచీపురంలో మహాయోగముద్రలో కూర్చొని వున్న కామాక్షీ అమ్మవారు ముముక్షువులకు అనుగ్రహిస్తున్నారు.


          🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: