22, ఏప్రిల్ 2023, శనివారం

Duty_Beyond_Death

 Duty_Beyond_Death.

*************************

 భారత్_చైనా_సరిహద్దుల్లో కాపాలా_కాస్తున్న_చనిపోయిన_భారత_జవాను_ఆత్మ....


ఆత్మని తీసుకెళ్లాలని భారత్‌కు లేఖ రాసిన చైనా ఆర్మీ

అధికారులు....

ఇది నిజం నమ్మలేని నిజం....

మన దేశ సరిహద్దులో ఒక ఆత్మ దాదాపు 50 ఏళ్లగా

కాపాల కాస్తుంది.... 

మీ ఆత్మను మీరు తీసుకెళ్లండి అంటూ

చైనా ఆర్మీ గగ్గోలు పెడుతుంది.... 

ఆత్మలు లేవని మనం

నిజంగా నమ్మితే చైనా సైనికులకు ఎలా కనిపిస్తొంది....??


సైనికుని ఆత్మకు మనఆర్మీ జీతం, సెలవులు, ప్రమోషన్లను

వర్తింప జేస్తొంది అంటే నమ్ముతారా.... 

కానీ ఇది నమ్మలేని నిజం....

ఒకసైనికుడు1967లో మరణించాడు, చనిపోయిన

తర్వాత కూడా అతడు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాడు....

భారత్ - చైనా సరిహద్దుల్లో కాపాలాగా ఉన్నాడు.... 

ఇది కేవలం ఏ ఒక్కరి విశ్వాసమో కాదు, భారత సైనికుల

నమ్మకం కూడా.... 


ఆ సైనికుడు #హర్భజన్_సింగ్.... 

ఆ దేశ భక్తుడి ఆత్మ కథ ఇది....

భారత్ - చైనా సరాహద్దుల్లో కథూవా మార్గంలో ఎతైన

పర్వతాలలో సైనికులు కాపాల కాయడం చాలా 

కష్టమైన పని....

చైనా సైనికులు ఆక్రమణలకు ప్రయత్నిస్తుం

డడంతో మన సైనికులు రాత్రిపగలు కాపలా కాస్తుంటారు....

మన సైనికుల సామర్ధ్యాన్ని ఎవరు శంకించరు కానీ

ఈ సైనికుల మధ్యనే #కనిపించని_ఓ_సైనికుడు కూడా 

విధులు నిర్వహిస్తున్నాడు.... 

ఇక్కడ భయంకరమైన 

మంచులో ఎక్కువ సమయం డ్యూటీ చేస్తూ కూడా

ఏ జవానుకు కంటి మీద కునుకు రాదు ఒకవేళ పొరపాటున వస్తే వెంటనే చెంప చెల్లుమనిపిస్తాడు, నిద్ర లేపుతాడు.... 

చైనా సైనికులు ఆక్రమనలకు ప్రయత్నిస్తే

గుర్రపు స్వారీ చేస్తూ వచ్చి వెంటనే హెచ్చరిస్తాడు....

ఆయనే మన భారత సైనికుడు #బాబా_హర్భజన్_సింగ్....


1965లో ఆర్మీలో చేరిన హర్భజన్ సింగ్ ప్రస్తుతం

పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం గుజర్వాలా

జిల్లా సంద్రాణాలో 1946 ఆగస్టు 30న జన్మించారు, కానీ ఫోస్టింగ్ మాత్రం

సిక్కింలో పడింది. భారత్ -చైనా సరిహద్దుల్లో ఉన్న

నాథూలాలో విధులు నిర్వర్తిస్తున్నపుడు హర్భజన్ 

అనుకోకుండా మంచు తుఫాన్ లో చిక్కుకున్నాడు.

సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉన్న

హిమాలయ పర్వతాలనుంచి  కాలుజారి లోయలో పడ్డాడు. 

1967 సెప్టెంబర్ 11న మంచులో కూరుకుని ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికి ఆయన వయసు 22 సంవత్సరాలు

మాత్రమే. అతన్ని వెతకడానికి సైనికులు చాలా ప్రత్నిం

చారు, కానీ ఎక్కడా అతని జాడ దొరకలేదు. ఒకరోజు

రాత్రి తన సహచరుడి కలలో కనిపించాడు, ఆ తర్వాత

అద్భుతం జరిగింది. ఎందుకంటే అంతవరకు ఎంత 

వెతికినా దొరకని అతడి ఆచూకి సహచరుడికి కలలో

కనిపించిన చోటు వెతికారు. ఆశ్చర్యంగా అతడు చెప్పిన

చోటునే పార్ధివ దేహం దొరికింది, శవం పక్కనే రైఫిల్ 

కూడా లభించింది. 

ఖననం చేసిన తర్వాత అంతా ఆయన గురించి మరచి పోయారు.


కొన్ని రోజుల తర్వాత మరో సహచరుడి కలలో

కనిపించాడు. నా శరీరం కాలి పోయింది కానీ నా ఆత్మ

ఎప్పటికి డ్యూటీలోనే ఉంటుందని చెప్పారు. మొదట

దాన్ని అందరు లైట్ తీసుకున్నారు. 

కానీ ఆతర్వాత తోటి సైనికులు అద్భుతం జరగడం

చూశారు. ఏదైనా ఆపద రాబోతున్నా, శత్రువులు చొర

బాటుకు ప్రయత్నించినా ముందుగానే తన సహచరుల

కలలో కనిపించి హెచ్చరించేవాడు. #చైనా_ఆపరేషన్

చేపట్టబోయే విషయాన్ని ముందుగానే హర్భజన్ సింగ్ 

కలలో కనిపించి చెప్పేవారు. ఆయన చెప్పింది తర్వాత

అలాగే జరిగేది. ఈవిషయం క్రమంగా అధికారుల చెవిన

పడింది, కానీ మొదట వాళ్లు దీన్ని నమ్మలేదు, పరిక్షించి

చూసి ఆశ్చర్యపోయారు.... 


మీసైనికుడు తెల్లటి దుస్తులు

ధరించి గుర్రంపై స్వారీ చేస్తున్నాడని అతన్ని వెనక్కి

పిలిపించుకోండి అని చైనా సైనికులు మన ఆర్మీకి చాలా

సార్లు చెప్పారట. ఇక చైనా అధికారులు ఈవిషయంలో

మన సైనిక అధికారులకు లేఖ కూడా రాశారంట. దీని

గురించి బాబా హర్భజన్ సింగ్ మన సైనిక అధికారులకు

ముందే కళలో కనిపించి చెప్పాడంట. దీంతో అధికారులు

కూడా హర్భజన్ ఆత్మపై విశ్వాసం ఏర్పడింది. మంచు

తుఫానులో సైనికులు డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ల

మధ్యలో అదృశ్య రూపంలో హర్భజన్ సింగ్ ఉంటాడని

భావిస్తారు మన సైనికులు.... 


హర్భజన్ సింగ్ #బాబా_హర్భజన్_సింగ్ ఎలా అయ్యాడు....

సరిహద్దుల్లో కాపాల కాస్తున్న జవాను ఆత్మ

బాబా హర్భజన్ సింగ్ పేరుపై ఒక మందిరం కూడా 

కట్టించారు మన సైనికులు...

నాథూలా మార్గంలో 13వేల అడుగుల ఎత్తులో ఉంది ఈమందిరం.

ఇక్కడ బాబా హర్భజన్ సింగే దైవం... 

ఆయనఫోటో,, యూనిఫాం,, షూతో

పాటు పరుపు మరన్ని వస్తువులను ఇక్కడే ఉంచి

పూజలు నిర్వహిస్తారు....

ఆమందిరం ఆలనా పాలనా ఆర్మీనే చూస్తొంది.... 

ఉదయం టిఫిన్ నుంచి రాత్రి బోజనం

వరకు ఈమందిరంలో హర్భజన్ సింగ్ కు పెడతారు.

చీకటి పడినవెంటనే మందిరం తలుపులు మూసివేస్తారు.

ఎందుకంటే బాబా రాత్రివేళ డ్యూటి పై వెళతారు అనేది

వారి విశ్వాసం , బాబా హర్భజన్ సింగ్ డ్యూటిలో ఉన్న సైనికుడిగా భావిస్తారు. అందుకే ఒక సైనికుడికి వర్తించే

నియమాలన్నీంటిని హర్భజన్ సింగ్ కు వర్తింప జేస్తారు.

వేతనం నుంచి సెలవులు, ప్రమోషన్ల వరకు ఆయనకు

వర్తింప జేస్తారు, అదికూడా మరణాంతరం వర్తించడమే

ఇక్కడ విశేషం....

బాబా హర్భజన్ సింగ్ సరిహద్దుల్లో గుర్రంపై స్వారీ చేస్తూ

మనదేశాన్ని కాపాడుతున్నాడు అనేది సైనికులతో

పాటు ప్రజల విశ్వాసం. అందుకే భారత్-చైనా సరిహద్దుల్లో

జరిగే ప్రతి సమావేశానికి ఆయన్ను కూడా భాగస్వామిని

చేస్తారు మన సైనిక అధికారులు. ఆయన గౌరవార్ధం

ఒక ఖాళీ కూర్చీలో ఫోటో పెడతారు, ఇలా చేయడం

అనేది సైనికుల మూఢనమ్మకం కాదు, నియమాలను

పాటించడం అంటారు అధికారులు. హర్భజన్ సింగ్ 

ఆర్మీలో ఉన్న రోజుల్లో ఎంత హడావిడి ఉండేదో ఇప్పుడు

అలాగే ఉంటుంది.శారీరకంగా హర్భజన్ లేక పోయినా

ఆయన ఆత్మ ఉందని భావిస్తున్నారు...

భారత్-చైనా సరిహద్దుల్లోని నాథూలా మార్గంలో ఉష్టోగ్రతలు 

ఎప్పుడు 0 డిగ్రీల కంటే తక్కువగానే నమోదవుతుంది.

ఆ మంచులో అప్పుడప్పుడు కాలు జారుతుంది. శ్వాస

తీసుకోవడం కష్టం అవుతుంది. ఇక్కడ జీవించడం

చాలా కష్టం. కానీ చైనా లాంటి శత్రుదేశం పన్నాగం నుంచి

కాపాడ్డానికి కాపలా కాస్తారు. ఇలాంటి ప్రాంతంలో సైనికలు

ప్రశాంతంగా ఉన్నారు అంటే అది సైనికుల ధైర్య 

సాహసాలతో పాటు బాబా హర్భజన్ సింగ్ అండగా ఉండడమే అని భావిస్తారు.

బాబా కష్ట కాలంలో ఆదుకుంటారన్నది సైనికుల నమ్మకం.

 అది క్రమంగా జనాల్లోకి వెళ్లింది. 

దీంతో సామాన్య జనంకూడా ఆయన దర్శనానికి బారులు తీరుతున్నారు.

సందర్శకుల సంఖ్య పెరగడంతో మందిరాన్ని మరింతగా

విస్తరించి అద్భుతమైన మందిరాన్ని నిర్మించింది ఆర్మీ. 

ఈమందిరాన్ని సందర్శించే వారు లోపల నోట్ పుస్తకాన్ని

ఉంచుతారు, అందులో సందర్శకులు తమ కోర్కెలను

రాస్తారు, బాబా హర్భజన్ సింగ్ డ్యూటి నుంచి తిరిగి

వచ్చి రాసి ఉన్న కొర్కెలను చదువుతారని తర్వాత

వాటిని తీరుస్తాడని వారి నమ్మకం. ఇక్కడ ప్రజలు

నీటి బాటిల్స్ ని కూడా సమర్పిస్తారు, ఎవరికైనా అనారో

గ్యంగా ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా మూడు

రోజుల తర్వాత ఆబాటిల్స్ ని తీసుకుని వెళతారు.

అందులోని నీటిని 21 రోజుల పాటు కొంచెం కొంచెం

త్రాగితే సమస్యలన్నీ మటుమాయం అవుతాయనేది

ప్రజల నమ్మకం,ఇంకా సైనికులకు ఈమందిరం శక్తి స్వరూపంతో సమానం.

కొత్తగా ఆర్మీలో చేరిన జవాన్లు

ఈమందిరానికి వచ్చి నమస్కరించి విధుల్లో చేరడం

ఆనవాయితీ. హర్భజన్ సింగ్ కు ప్రతి సంవత్సరం

సెప్టెంబర్ 15న ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ.

సెప్టెంబర్ నెలలో రెండు నెలల సెలవులపై తన 

సొంతూరు పుంకా గావులోని తన ఇంటికి వచ్చేవారు.

అప్పుడు ఊరు ఊరంత ఆయనకు స్వాగతం పలక

డానికి రైల్వే స్టేషన్ కు తరలి వచ్చేవారు సైనికులుకూడా

అక్కడికి వచ్చి ఘనస్వాగతం పలికే వారు, ఇప్పుడు

కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు....

ఎటా సెప్టెంబర్ 15 న రైల్లో సీటును రిజర్వు చేస్తారు దానిపై

హర్భజన్ ఫోటో, వస్తువులు ఉంచుతారు. 

సొంత గ్రామానికి రైలు రాగానే జవాన్లు, జనం ఆయన ఫోటోకి

స్వాగతం పలుకుతారు. చనిపోయి కూడా ఆత్మ విధులు

నిర్వర్తిస్తుందని భావించి హర్భజన్ సింగ్ కు ఇచ్చే 

అత్యంత అరుదైన గౌరవం ఇది. 

ఆయన మరణించి 50 ఏళ్లు కావస్తొంది. ఇప్పటికూడా ఆయన 

ఆత్మ రూపంలో భారత్-చైనా సరిహద్దుల్లో విధులు

నిర్వహిస్తున్నట్టు సైనికులు నమ్ముతారు. ఇదేమి మూఢ

నమ్మకం కాదని తమకు ఎదురౌతున్న అనుభవాల

దృష్ట్యా నిజమేనని నమ్మక తప్పని పరిస్థితి అంటారు

సైనికులు, అందుకే శరీరం లేని జవాను బ్రతికున్నట్లుగా

భావిస్తారు.... జైజవాన్ జైహింద్ !!

వివిధ దేవతా* *శ్లోకాలు_స్తోత్రాలు!!* 🍁🍀

 🍀🍁 *, పిల్లలు* *నేర్చుకోవడంకోసం వివిధ దేవతా* 

*శ్లోకాలు_స్తోత్రాలు!!* 🍁🍀


🍂 *గణేశ శ్లోకాలు* 🍂

🌻 "శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం

అనేక దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే"


🌻 "శ్రీ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ

నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా"


🌻 "గజాననం భూతగణాధిసేవితం కపిత్థ జంబూఫలసార భక్షితమ్

ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం"


🌻 "మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర

వాననరూప మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే"


🍂 సరస్వతి శ్లోకాలు 🍂

🌻 "సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా"


🌻 "పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని

నిత్యం పద్మాలయా దేవి సామాంపాతు సరస్వతి"


🌻 "యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా

యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా

సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా"


🌻 "కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలాః

న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః

వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే

క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్"


🌻 "మాణిక్య వీణామ్ ఉపలాలయంతీం

మదాలసాం మంజుల వాగ్విలాసాం

మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం

మాతంగకన్యాం మనసా స్మరామి

చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే

పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతః"


🌻 "శ్యామలా దండకం" చదవాలి.


🍂 ఆదిత్య  శ్లోకం 🍂

🌻 "బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్

సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్"


🍂 లక్ష్మీదేవి శ్లోకాలు 🍂

🌻 "లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం

దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం"


🌻 "పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాయతాక్షి

విశ్వప్రియే విష్ణుమనో నుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ"


🌻 "నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే

శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే"


🍂 దుర్గాదేవి శ్లోకం 🍂

🌻 "సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే

సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని

గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే

శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే

సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే"


🍂 గాయత్రి మంత్రం 🍂

🌻 "ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్"


🍂 శ్రీరామ శ్లోకాలు 🍂

🌻 "శ్రీరామ రామ రామేతి

శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

శ్రీరామనామ వరాననే ఓం నమః ఇతి"


🌻 "వనమాలీ గదీశార్‌ఙ్గీ శంఖీ చక్రీచ నందకి

శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభి రక్షతు

శ్రీ-వాసుదేవోభి రక్షతు ఓం నమ:ఇతి"


🌻 "శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి"


🌻"ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం"


🌻 "అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి"


🌻 "ప్రాతః స్మరామి రఘునాథ ముఖారవిందం

మన్దస్మితం మధురభాషి విశాలఫాలమ్

కర్ణావలమ్బిచలకుండలశోభిగన్డం

కర్ణాoతదీర్ఘ నయనం నయనాభి రామమ్"


🍂 శ్రీకృష్ణ శ్లోకాలు 🍂

🌻 "వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనం

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం"


🌻 "కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే

నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే"


🌻 "కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే

ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః"


🌻 "ఇమం మంత్రం జపం దేవి భక్త్యా ప్రతిదినం నరః

సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకమవాప్నుయాత్"


🌻 "కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం

నాసాగ్రే నవమౌక్తికం కరతలేవేణుం కరేకంకణం

సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠీచ ముక్తావళిం

గోపస్త్రీ పరివేష్టితో విజయతే గొపాలచూడామణి"


🍂 విష్ణు శ్లోకాలు 🍂

🌻 "విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం

అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమం"


🌻 "శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం

లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం"


🍂  హనుమాన్ శ్లోకాలు 🍂

🌻 "యత్రయత్ర రఘునాథ కీర్తనం

తత్ర తత్ర కృతమస్తకాంజలిం

భాష్పవారిపరిపూర్ణలోచనం

మారుతిం నమత రాక్షసాంతకం"


🌻"మనోజవం మారుతతుల్య వేగం

జితేంద్రియం బుద్ధి మతాంవరిష్ఠం

వాతాత్మజం వానరయూధ ముఖ్యం

శ్రీ రామదూతం శిరసా నమామి"


🌻 "బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత

అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణా భవేత్"


🌻 "నమస్తేస్తు మహావీర నమస్తే వాయునందన

విలోక్య కృపయానిత్యం త్రాహిమాం భక్తవత్సల"


🌻 "అమలకనక వర్ణం పృజ్వలత్పావకాక్షం

సరసిజనిభవక్త్రుం సర్వదాసుప్రసన్నం

పటుతరఘన గాత్రం కుండలాలంకృతాంగం

రణజయకరవాలం రామదూతం నమామి"


🌻 "నాదబిందుకళాతీతం ఉత్పత్తి స్థితివర్జితం

సాక్షాదీశ్వరరూపంచ హనుమంతం నమామ్యహం"


🌻 "సువర్చలాకళత్రాయ చతుర్భుజ ధరాయచ

ఉష్ట్రారూడ్హాయ వీరాయ మంగళం శ్రీహనుమతే"


🍂 మహామృత్యుంజయ మంత్రం 🍂

🌻 "ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్"


🍂  శ్రీవేంకటేశ్వర శ్లోకం 🍂

🌻 "వినా వేంకటేశం ననాథో ననాథః

సదా వేంకటేశం స్మరామి స్మరామి

హరే వేంకటేశం ప్రసీద ప్రసీద

ప్రియం వేంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ"


🌻 "ఓం నమో వేంకటేశాయ పురుషాయ మహాత్మనే

ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నం నమః"


🍂 నవగ్రహ శ్లోకం 🍂

🌻 "ఆదిత్యాయ సోమాయ, మంగళాయ బుధాయచ

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః"


🍂 తులసీ శ్లోకం 🍂

🌻 "యన్మూలే సర్వ తీర్థాణి యన్మధ్యే సర్వ దేవతాః

యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం"


🍂 బృహదారణ్యకోపనిషత్ 🍂

🌻 "అసతోమా సద్గమయ

తమసోమా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతంగమయ

ఓం శాంతిః శాంతిః శాంతిః"


🍂 కఠోపనిషత్ 🍂

🌻 "ఓం సహనా వవతు సహనౌ భునక్తు

సహవీర్యం కరవావహై

తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై

ఓం శాంతిః శాంతిః శాంతిః"


🍂 ఈశావాస్యోపనిషత్ 🍂

🌻 "ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే

ఓం శాంతిః శాంతిః శాంతిః"


🍂 విశ్వనాథాష్టకం 🍂

🌻 "ఓం గంగా తరంగ కమనీయ జటా కలాపం

గౌరీ నిరంతర విభూషిత వామభాగమ్

నారాయణ ప్రియ మనంగ మదాపహారం

వారాణసీ పుర పతిం భజ విశ్వనాథమ్"


🍂 పార్వతీపరమేశ్వరులప్రార్థన 🍂

🌻 "వాగర్థావివ సంపృక్తౌ - వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే - పార్వతీ పరమేశ్వరా"


🌻 "శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం

శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం

నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే

నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి"


🌻 "వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం


వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం

వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం

వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం"


🍂 లింగాష్టకమ్ 🍂

🌻 "బ్రహ్మమురారి సురార్చిత లింగం

నిర్మలభాసిత శోభిత లింగమ్

జన్మజ దుఃఖ వినాశక లింగం

తత్ ప్రణమామి సదాశివ లింగమ్


దేవముని ప్రవరార్చిత లింగం

కామదహన కరుణాకర లింగమ్

రావణ దర్ప వినాశన లింగం

తత్ ప్రణమామి సదాశివ లింగమ్


సర్వ సుగంధ సులేపిత లింగం

బుద్ధి వివర్ధన కారణ లింగమ్

సిద్ధ సురాసుర వందిత లింగం

తత్ ప్రణమామి సదాశివ లింగమ్


కనక మహామణి భూషిత లింగం

ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్

దక్ష సుయఙ్ఞ వినాశన లింగం

తత్ ప్రణమామి సదాశివ లింగమ్


కుంకుమ చందన లేపిత లింగం

పంకజ హార సుశోభిత లింగమ్

సంచిత పాప వినాశన లింగం

తత్ ప్రణమామి సదాశివ లింగమ్


దేవగణార్చిత సేవిత లింగం

భావైర్భక్తిభిరేవ చ లింగమ్

దినకర కోటి ప్రభాకర లింగం

తత్ ప్రణమామి సదాశివ లింగమ్


అష్టదళోపరివేష్టిత లింగం

సర్వసముద్భవ కారణ లింగమ్

అష్టదరిద్ర వినాశన లింగం

తత్ ప్రణమామి సదాశివ లింగమ్


సురగురు సురవర పూజిత లింగం

సురవన పుష్ప సదార్చిత లింగమ్

పరమ పరం పరమాత్మక లింగం

తత్ ప్రణమామి సదాశివ లింగమ్


లింగాష్టకమిదం పుణ్యం యఃపఠేశ్శివ సన్నిధౌ

శివలోకమవాప్నోతి శివేన సహమోదతే"


🍂 మరికొన్ని ప్రార్థనలు 🍂

🌻 "కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతీ

కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం"


🌻 "దీపం జ్యోతి: పరం బ్రహ్మ దీప స్సర్వ తమోపహః

దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే"


🌻 "అగస్త్యో మాధవశ్చైవ ముచికుందో మహాబలః

కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖ శాయనః"


🌻 "రామస్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం

శయనేయః పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి"


🌻 "కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌"


🌻 "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన

మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి"


🌻 "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే"


🍂 నిద్రా శ్లోకం 🍂

🌻 "రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం

శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్న-స్తస్యనశ్యతి"


🍂 గురుస్తుతి 🍂


 "గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః"


 సర్వేజనాస్సుఖినోభవంతు


లోకాస్సమస్తా స్సుఖినోభవంతు


సమస్త లోకా సుఖినోభవంతు 


*ఓం శాంతిః శాంతిః శాంతి:*

వైశాఖంపురాణం - 1 వ అధ్యాయము

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

      🌹 _*శుక్రవారం*_🌹

  🕉️ *ఏప్రిల్ 21, 2023*🕉️


_*వైశాఖంపురాణం  - 1 వ అధ్యాయము*_


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹


*వైశాఖమాస ప్రశంస*


☘☘☘☘☘☘☘☘


*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*


సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా ! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ ! మీరు అన్ని మాసముల మహత్త్యమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి ? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి ? మానవులాచరింప వలసిన దానములను , వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ , దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును ? వాని ఫలమెట్టిది ? పూజాద్రవ్యములెట్టివి ? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.


నారదుడును రాజర్షీ ! అంబరీషా ! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు *'నారదా ! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను  కార్తీకకము , మాఘము , వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము , పూజ , దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన , పూజా , జప , దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేదవిద్యవలె , మంత్రములలో ఓంకారమువలె , వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె , ధేనువులలో కామధేనువువలె , సర్వసర్పములలో శేషునివలె , పక్షులలో గరుత్మంతునివలె , దేవతలలో శ్రీమహావిష్ణువువలె , చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె , సౌహార్దములు కలవారిలో భార్యవలె , నదులలో గంగానది వలె , కాంతి కలవారిలో సూర్యుని వలె , ఆయుధములలో చక్రమువలె , ధాతువులలో సువర్ణమువలె , విష్ణుభక్తులలో రుద్రునివలె , రత్నములలో కౌస్తుభమువలె , ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ , తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును , పూజను చేసినను , పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున , కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక , స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖ స్నానము నది , ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను , కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.


అంబరీష మహారాజా ! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను , తటాకమైనను , సెలయేరైనను , అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను , జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును , యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.


    *ఒకటవ అధ్యాయము*  

         _*ఒకటవ రోజు*_ 

 *పారాయణము సమాప్తం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*


🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

భగందర వ్యాధి

 భగందర వ్యాధి ( Fistula ) గురించి సంపూర్ణ వివరణ  - 


   కొందరిలో ఆసనం వద్ద చిన్న గుల్ల ( కురుపు ) లేచి చీముపట్టి ఆ చీము బయటకి వెడలును . రోజులు గడుస్తున్న కొలది మలద్వారం పక్కన ఆసనం లోపలి వరకు చిన్న నాళము ఏర్పడును . ఇది కొంతకాలం తరువాత పైన మానినట్లు కనిపించినా లోపలి వైపు మానదు . వేడి చేయు పదార్ధాలు తినినప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి పుండు పగిలి రక్తం , చీము వస్తుంటుంది. ఈ దశలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇది చాలా మొండి వ్యాధి . ఇది కాలం గడిస్తున్న కొలది ప్రమాదకరంగా మారును . 


               ఈ వ్యాధికి ప్రధాన కారణం మలబద్దకం , రక్త కాలుష్యము , సూక్ష్మ జీవులు . ఈ వ్యాధి యొక్క తీవ్రత అనేది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. అల్లోపతి వైద్య విధానంలో ఈ వ్యాధికి ఔషధాలతో చికిత్స లేదు . సర్జరీ ఒక్కటే మార్గం . కాని నేను చాలా మంది రోగులలో గమనించిన విషయం సర్జరీ తరువాత కూడా కొంతకాలానికి మరలా సమస్య తిరగబెడుతుంది. బహుశా  సరైన ఆహారనియమాలు పాటించకపోవడం కూడా కారణం కావచ్చు . 


    ఆయుర్వేదం నందు ఈ సమస్యకు చక్కటి పరిష్కారం కలదు. శరీరం నందలి వ్యర్ధపదార్ధాలను బయటకి వెడలింపచేస్తూ సరైన ఔషధాలను ఇస్తూ చికిత్స చేయవలెను . ఈ వ్యాధి నందు ఔషధ సేవన ఎంత ముఖ్యమో ఆహారవిహారాదులు అంతే ముఖ్యము . ఈ సమస్య అత్యంత మొండివ్యాది. సరైన కాలంలో సరైన చికిత్స అందనిచో మలద్వారం పక్కన ఏర్పడిన కురుపు నుంచి చీము , రక్తం కూడ వచ్చును. ఇంతకు ముందు చెప్పినట్లు లొపలికి నాళంలా ఏర్పడి దాని ద్వారా కూడా మలం బయటకి వచ్చును. కావున వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి బయటకి రావడానికి ప్రయత్నించవలెను . 


          భగందర సమస్యతో ఇబ్బంది పడువారు నన్ను సంప్రదించగలరు.  


  

           

      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


               9885030034

మంగళప్రదమైనదో

 .

              _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝 

*మరణం మంగళం యత్ర*

*విభూతిశ్చ విభూషణం|*

*కౌశేయం  యత్ర కౌపీనం*

*సా కాశీ కేన మీయతే ||*


తా𝕝𝕝 

ఎక్కడ మరణం మంగళప్రదమైనదో, విభూతియే అలంకారమై ప్రకాశించుచున్నదో, కాషాయవస్త్రం కౌపీనమగుచున్నదో అట్టి కాశీపుణ్యక్షేత్రమును మించిన పవిత్ర క్షేత్రం మరొకటి కలదా ??.... 


[ *ముల్లోకాల్లో కాశీ పుణ్యక్షేత్రమంతటి పవిత్రక్షేత్రం లేదని భావం* ].

వైశాఖ పురాణం: 2 వ అధ్యాయం.

 వైశాఖ పురాణం: 2 వ అధ్యాయం.


🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


               వైశాఖమాసమున చేయవలసిన

               వివిధ దానములు వాని ఫలితములు


నారద మహర్షి అంబరీష మహారాజు తో మరల ఇట్లనెను అంబరీష మహారాజా వినుము విష్ణు ప్రీతికరమగుటచే మాధవమాసముని వైశాఖమునందురు. వైశాఖ మాసము తో సమానమైన మాసము లేదు. కృత యుగమంతటి ఉత్తమ యుగము లేదు. జల దానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖము తో సమమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు.


నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి,వ్యవసాయము తో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.


శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు  ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మల నందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువాని ఎన్ని ధర్మకార్యములను చేసినను - వైశాఖమాస వ్రతమును పాటింపనిచో - యివి అన్నియు వ్యర్ధములగుచున్నవి వైశాఖ వ్రతమును పాటించడానికి మాధవార్పితముల గావించి భక్షించే ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుజ్యము కలుగును. అధిక ధనవ్యయముచే చేయగల వ్రతములెన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు ఎన్నో ఉన్నవి ఆ వ్రతములెన్నియో ఉన్నవి.ఆ వ్రతములన్నియు - తాత్కాలిక ప్రయోజనములు కలిగించును అంతేకాదు పునర్జన్మను కలిగించును. అనగా ముక్తినీయవు. కనుక నియమపూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము - పునర్జన్మను పోగొట్టును , అనగా ముక్తిని ఇచ్చును.


అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము సర్వతీర్థములందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున - జలదానము చేసినంతనే వచ్చును. జల దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి మరియొకనికి ప్రభోదించిన అట్టివానికి సర్వ సంపదలు కలుగును. హితములును చేకూరును. దానములన్నిటిని ఒకవైపునకు - జల దానమును మరొకవైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును.


బాటసారులు దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరచి జల దానము చేసినచో వాని కులము లోని వారందరూ పుణ్యలోకములు నందుదురు జలదానము చేసిన వారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము ఏర్పరుచుటచే బాటసారులు ,సర్వ దేవతలు ,పితృదేవతలు ,అందరును సంతృప్తులు ప్రీతి నంది వరములు ఇవ్వును. ఇది నిస్సంశయముగ సత్యము సుమా.దప్పిక గలవాడు నీటిని కోరును. ఎండ బాధ పడిన వాడు నీడను కోరును. చెమట పట్టినవాడు -  విసరుకొనుటకు - విసనకర్రను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలమును గొడుగులు విసనకర్రలు దానమియ్యవలెను నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై జన్మించును. (చాతకమను పక్షి - భూస్పర్శకల నీటిని త్రాగినా  చనిపోవును కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను - క్రింద పడకుండా - ఆకాశముననే త్రాగి ఉండును . ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు.


దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్య ఫలము కలుగును. ఎండకు అలసిన వానికి / బ్రాహ్మణునకు విసనకర్రతో విసరి ఆదరించినవాడు పక్షరాజై త్రిలోక సంచార లాభమునందును. అట్లు జలము ఈయనివారు -  బహువిధములైన  వాతరోగములంది పీడితులు అగుదురు.ఎండకు అలసిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో - పై బట్ట (ఉత్తరీయము వగైరా) తో విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నొందును .పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రను ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నొందును.అలసటను వెంటనే పోగొట్టున్నట్టి విసనకర్రను ఈయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.


గొడుగును దానము చేసినచో - ఆధిభౌతిక ,ఆధిదైవిక, ఆధిఆత్మిక దుఃఖములు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయనివాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను (చెప్పులను) దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. మరియు ఇహలోకమున బాధలను పొందడు. సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి ,చెప్పులు లేవని అడిగినవారికి - చెప్పులను దానం చేసిన వాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు -బాటసారులకు ఉపయోగించినట్లుగా - అలసట తీరునట్లుగా మండపము మున్నగునవి నిర్మించినవాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలరు.

మీ దేహం దేవుని ఆలయం..

 మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి..🙏


1. మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు పొట్ట గాయపడుతుంది.


2. మీరు 24 గంటల్లో 10 గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు కిడ్నీలు గాయపడతాయి.


3. మీరు 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా గాల్ బ్లాడర్ గాయపడుతుంది.


4. మీరు చల్లని మరియు పాత ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేగు గాయపడుతుంది.


5. మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు పెద్ద ప్రేగులు గాయపడతాయి.


6. మీరు పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు మరియు సిగరెట్ల కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు

లంగ్స్ గాయపడతాయి.


7. మీరు భారీగా వేయించిన ఆహారం, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు లివర్ గాయపడుతుంది.


8. మీరు ఎక్కువ ఉప్పు మరియు కొలెస్ట్రాల్‌తో మీ భోజనం తిన్నప్పుడు గుండె గాయపడుతుంది.


9. మీరు తీపి పదార్థాలు తినేటప్పుడు ప్యాంక్రియాస్ గాయపడుతుంది. ఎందుకంటే అవి రుచికరమైనవి.


10. మీరు చీకటిలో మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు కళ్ళు గాయపడతాయి.


11. మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు మెదడు గాయపడుతుంది.


ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు.

కాబట్టి జాగ్రత్త వహించండి మరియు మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి.


మీ దేహం దేవుని ఆలయం..


ఒక్క రోజు లoగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు..

కిడ్నీస్ చేసే పని డయాలిసిస్ చేస్తే 10 వేలు..

హార్ట్ లుంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో..

ఇంకా బ్రెయిన్ కి సబ్టిట్యూట్ రాలేదు, వస్తే కోట్లల్లో..

అంటే మెడికల్ పరిభాషలో, రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది..


దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా???

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేరే ఉదాహరణలు కావాలా..

బంధువులారా

 *శ్రీ నృసింహ సేవా వాహిని*



*ప్రియ భగవద్ బంధువులారా....*


*నదులు అన్నిటిలో  విశేషమైనటువంటి నది గంగానదిగా మనం చెప్పుకుంటాం అలాంటి గంగానదికి పుష్కరాలు రావడం ఆ పుష్కరకాలంలో మనం జీవించి ఉండడం మన పూర్వజన్మ సుకృతం అలాంటి పుష్కర ప్రాంతాల్లో మన పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం ఎన్నో జన్మల పుణ్యఫలం*


 *విశిష్టమైన  గంగానది పుష్కరాల సందర్భంగా,మన భక్తుల కోరిక మేరకు వారణాసి,గయ* *ప్రయాగ,హరిద్వార్,త్రివేణి సంగమం,లలో*

*శ్రీ నృసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి పితృదేవతలకు శ్రాద్ధ తర్పణ కార్యక్రమాలు నిర్వహించలేనటువంటి వారి కోసం సంస్థ ఆధ్వర్యంలో పితృదేవతలకు శ్రాద్ద,తర్పణ కార్యక్రమములను నిర్వహించనున్నాము.*


 *పరమ పవిత్రమైనటువంటి కాశీ పట్టణంలో   గయ ప్రయాగ త్రివేణి సంగమంలో ఇటువంటి మహత్తర కార్యక్రమము చేయడం ద్వారా  పితృదేవతల ఆత్మలు శాంతింపబడి పుణ్యలోకాలను చేరుతారని,అలానే ఎంతో అనుగ్రహాన్ని మనకి ప్రసాధిస్తారని   పెద్దల మాట.*

ఇప్పటి వరకు చాలా మంది తమ తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగినది.


ఇంకా......


 *ఎవరైనా ఇట్టి మహత్తర కార్యక్రమం  ద్వారా మీ యొక్క పితృదేవతలకు శ్రాద్ద తర్పణాలు ఇవ్వదలచిన వారు తమ యొక్క పేర్లను నమోదు చేసుకోగలరు. **


గమనిక :రిజిస్ట్రేషన్  కొరకు చివరి తేది 22-04-2023 శనివారం. తరువాత పంపనున్న డీటెయిల్స్ స్వీకరించబడవు.



          వివరాలకై 


శ్రీ నృసింహ సేవా వాహిని

సెల్ :6305811889 office

        8885368348 p.r.o

ఆశ

 


                         *ఆశ*

                   ➖➖➖✍️


*ఆశయా బద్ధ్యతే జంతుః*

*కర్మణా బహుచింతయా*

*ఆయుః క్షీణం న జానాతి*

*తస్మాత్ జాగ్రత జాగ్రత*


*జీవులన్నియు ఆశకు లోబడిపోయేవే! ఆశకులోబడి చాలా పనులు చేస్తుంటాయి! కాని ఆయువు తరిగిపోతోందని మాత్రం గుర్తించవు. కనుక జాగ్రత్త సుమా..!*


*లోకంలో వారందరూ ఆశకు కట్టుబడిపోయేవారే!*


*ఆశ నాలుగు రకాలు:* 


*ఆశ, పేరాశ, దురాశ, నిరాశ.* 


*ధర్మబద్ధమైన ఆశతో జీవిస్తే ఇబ్బందులుండవు. కాని పేరాశ కుదురుగా ఉండనివ్వదు.* 


*ఆ తరవాతది దురాశ! ఇది అసలు చేరకూడదు.*


*తన అర్హతకు తగినది కావాలనుకునేది ఆశ.*


*తన అర్హతకు కానిదానిని కోరుకోవడం పేరాశ.*


*అర్హత, ధర్మంతో నిమిత్తం లేక సర్వమూ నాకే కావాలనుకోవడం దురాశ.* *దురాశకు పోతే తామే ఉండమనే విచక్షణ నశిస్తుంది.* 


*వీటికి ఉదాహరణలు ఎదురుగా కనపడుతున్నా నమ్మలేం.*

*ఏదో ఆశించి జరగకపోతే నిర్వేదం పొంది దిగజారిపోవడమే నిరాశ.* 


*అంతఃశ్శత్రువులు కమ్ముకొచ్చి, జ్ఞానం నశించి ఆయువు క్షీణిస్తోందని గుర్తించలేనితనం కలుగుంది.*


*దురాశ ఆయువును తీస్తుంది. ’దురాశ దుఖానికి చోటు’ అన్నది నానుడి.* 


*ఏ సమయంలో కూడా ఆయువు గడచిపోతోందనే ఆలోచన మాత్రం రాదు. పుట్టినరోజన్న సంబరమేకాని ఆయువు ఒక సంవత్సరం తగ్గిపోయిందన్న విచక్షణ ఉందదు…!*


*సంపదః స్వప్నసంకాశాః*

*యౌవనం కుసుమోపమం*

*విధుః చంచలమాయుషం*

*తస్మాత్ జాగ్రత జాగ్రత*


*సంపదలన్నీ స్వప్న సదృశాలు,                           యౌవనం పువ్వు లాటిది.                                 ఆయువు మెరుపు తీగలాటిది.                      కనుక జాగ్రత్త..!*.    


*కలిగి ఉండడమే సంపదన్నది నేటి మాటే కాదు, నాటి మాట కూడా!              కలిగి ఉండడం సంపదైతే అదేది? అరుదైన వస్తువులా? భూమి వగైరా ఆస్థులా? బుద్ధియా? అందరూ అనుకునే సంపద కలిగి ఉండడం అనేది చిన్నమ్మ కటాక్షమే!*


*ఈ తల్లి కటాక్షం బహు చంచలం. కొబ్బరికాయలోకి నీరు చేరినట్టు                            నేడు చేరుతుంది, రేపు కనపడదు.                     కలలో సంపద ఇలలో కనపడనట్టు, ఇలలో సంపద కూడా స్వప్నం లో లాటిదే!*        


*ఇక యౌవనమా అదెంతకాలం? యౌవనం పువ్వు లాటిదన్నారు,                        అంటే పువ్వు వాడిపోయినట్టు యౌవనమూ వాడిపోతుంది.                           ఆయువు ఎంతకాలమో తెలియదు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



       *జ్ఞానమార్గం చూపించే…*

                 *గురువు..!*

               ➖➖➖✍️


*గురువును భగవంతునికన్నా ఉన్నతంగా భావించే దేశం ప్రపంచంలో ఏదైనా ఉందీ అంటే అది హిందూదేశం మాత్రమే. ప్రపంచ దేశాలలో ఎక్కడా గురువు అనే భావనే ఉండదు.* 


*గురువు మనలోని మాలిన్యాలను తొలగించి వ్యక్తిగా తయారుచేస్తారు.*


*గురువు అంటే చీకటిలో నుండి వెలుతురులోకి తీసుకువచ్చేవాడని నిర్వచిస్తూ ఉంటారు.*


*అజ్ఞానులను జ్ఞానమార్గం వైపు నడిపించి, మార్చగలిగేది గురువు మాత్రమే.* 


*అందుకే గురువును…          “గురుబ్రహ్మః-గురువిష్ణుః-గురుర్దేవో మహేశ్వరః” అంటూ కీర్తిస్తుంటారు.* 


*గురువు కొరకు పరితపిస్తూ అన్వేషిస్తేనే సద్గురువు లభిస్తాడు. గురువును భక్తితో పూజించాలి. మనలో మనకు తెలియకుండా నిద్రాణమై ఉన్న అహాన్ని తొలగించేది గురువు మాత్రమే.*

**************


*జ్ఞానమార్గం చూపించే గురువు..*


*ఒకరోజు ఒక మహారాజు సాయం సంధ్యా సమయంలో నదీ తీరం వెంబడి ప్రయాణిస్తూ అక్కడ తన గురుదేవులు కౌపీనమునకు పడిన చిల్లులను సూదీదారంతో కుట్టుకొనుట చూసాడు.* 


*గురువును సమీపించి, “గురుదేవా… మీరు నా గురువులు, మీరు ఇలా కౌపీనము కుట్టుకొనుట బాగులేదు. కౌపీనము అంతా చిల్లులమయంగా ఉంది” అన్నాడు.* 


*గురువుగారు ”అయితే?” అని ప్రశ్నించారు.*


*దానికి సమాధానంగా ”నేను మహా రాజును, మీకు ఏమి కావాలన్నా ఇస్తాను” అని ఏం కావాలో కోరుకోమన్నాడు.*


*ఆ గురువుగారు     రాజులో ఉన్న అహాన్ని మాటల ద్వారా గ్రహించారు. ఆయన ”రాజా నువ్వు ఏమైనా ఇవ్వ గలవా!” అని ప్రశ్నించారు.* 


* ”ఓ! ఇస్తాను” అని గర్వంగా అన్నాడు రాజు.*


*గురువు తన చేతిలో ఉన్న సూదిని నదిలోకి విసిరి దానిని తీసుకురమ్మన్నాడు.*


*రాజు నివ్వెరపోయాడు. రాజుకు తనలోని అజ్ఞానం అర్థమైంది. గురువు పాదాలకు సవినయంగా నమస్కరించి అక్కడ నుండి నిష్క్రమించాడు.*


*గురువు భగవంతునికన్నా శక్తిమంతుడు. గురువు కోరికలను తీర్చడు. శిష్యునికి ఏది అవసరమో దానిని ఇస్తాడు. ఒక మహానుభావుడు గురువును గూర్చి చెబుతూ ”గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కాని వర్షంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. గురువు గొడుగులాంటి వాడు” అని అన్నాడు.*


*కబీరు తన దోహాలో    ”గురువు, గోవిందుడు ఒకేసారి దర్శనమిస్తే ముందు గురువుకు నమస్కారం చేస్తా” నని వ్రాసాడు. కారణం గోవిందుని వర్ణించి చెప్పినది గురువే కాబట్టి.* 


*అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు తదితరులందరూ గురువులవద్ద విద్యనభ్యసించినవారే.*


*మన గురు పరంపర..*


*ఆషాఢ పూర్ణిమను గురుపూజా ఉత్సవంగా నిర్వహిస్తుంటాము. ఆ రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. మన సమాజం వ్యాసమహర్షిని గురువుగా స్వీకరించింది. అంతకుముందు నుండి ఎంతోమంది గురుశ్రేష్ఠులుండగా వ్యాసమహర్షినే గురువుగా ఎందుకు స్వీకరించారనే అనుమానం రాక తప్పదు. ఋక్కులు, యజస్సులన్నిటిని కలిపి యజుస్సంహితగా, సామాలన్ని కలిపి సామ సంహితగా, అధర్వం మంత్రాలన్ని కలిపి అధర్వ సంహితగా తయారు చేశారు. వేదరాశిని నాలుగు భాగాలుగా విభజించి వేదాధ్యయనం సులభతరం చేసి వ్యాసమహర్షి వేదవ్యాసుడిగా కీర్తింపబడ్డాడు. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా 18 పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారత, భాగవతాది గ్రంథాలు తదితరాలు వ్రాసిన వ్యాసభగవానుని గురువుగా స్వీకరించింది ఈ సమాజం.*


*గీతాకారుని ”కృష్ణం వందే జగద్గురుం” అని కీర్తిస్తున్నది మన సమాజం. అనంతరం అనేకమంది గురువులుద్భవించారు. వేదాలకు భాష్యం వ్రాసి, అస్పృశ్యుడిలో భగవద్దర్శనం పొందిన ఆదిశంకరులను, ”న జాతిః కారణంలోకే గుణాః హేతవః (లోకకళ్యాణానికి కులం కారణం కారాదు, గుణమే ప్రధానమని)” అని ప్రవచించి ఆచరించిన                       శ్రీ రామానుజులను గురువుగా స్వీకరించింది.*


*”సదాచార సంపన్న వ్యాస శంకర మధ్యమాం, అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరమ్‌” అని గురువును నిత్యం స్మరిస్తూ ఉంటాము.* 


*గతంలోనే కాదు నేటికి గురువులు మన కళ్ళముందే ఉన్నారు. పూజ్య రమణమహర్షిని సాక్షాత్తు అరుణాచలేశ్వరుని అవతారంగా భావిస్తారు. వారు భౌతికంగా లేకపోయినా నేటికీ జ్ఞానమార్గాన్ని చూపిస్తూనే ఉన్నారు. సద్గురు శివానందమూర్తిగారి ఆశ్రమానికి వెళ్ళి వారి సమక్షంలో కూర్చుంటే చాలట సందేహాలన్ని తీరుతా యంటారు వారి శిష్యులు.*


*తెనాలి గురువుగారు ”నిన్ను ఎవరైన ముట్టుకుంటే నువ్వు మైలపడటం కాదు, నిన్ను ముట్టుకొన్నవారు పునీతులు కావాలని” చెబుతుంటారు.*


*ఈ విధంగా ఎందరో గురువులు, వ్యక్తులకు, సమాజానికి మార్గదర్శకులుగా నేటికీ ఉన్నారు.*


*కాషాయవర్ణం త్యాగానికి, సమర్పణకు ప్రతీక. సమాజహితమే తమ హితంగా భావించిన సన్యాసులు ధరించేది కాషాయాంబరాలే. అగ్ని తనను తాను దహించుకొంటూ లోకానికి కళ్యాణకారకు డవుతున్నాడు. యాగాగ్ని కాషాయవర్ణంలోనే ఉంటుంది. సూర్యభగవానుడు ఉదాయస్తమయాలలో కాషాయవర్ణంలోనే దర్శనమిస్తాడు.*


*మన దేశ చరిత్రకు సాక్షి కాషాయ ధ్వజమే. దీనిని భగవాధ్వజం అని కూడా అంటారు. కోట్లాది మంది ప్రజలు అనేక సందర్భాలలో ప్రాణాలను తృణప్రాయాలుగా భావించి ఆత్మార్పణ చేశారు. భగవాధ్వజాన్ని చూస్తే వారి బలిదానాలు గుర్తుకు వస్తాయి. ఈ దేశాన్ని ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో అహర్నిశలు శ్రమించిన శిల్పులు గుర్తుకు వస్తారు. భగవాధ్వజాన్ని చూడగానే మన ప్రాచీన ఋషిపరంపరతోపాటు చరకుడు, ఆర్యభట్ట, వరాహమిహిరుడు వంటి మహానుభావులు; సమర్థ రామదాసు, చాణుక్యుడు, రామకృష్ణ పరమహంస తదితర గురుపరంపర గుర్తుకు వస్తుంది. భగవాధ్వజాన్ని దర్శిస్తే ఇటువంటి ఎందరో మహానుభావులు గుర్తుకు వస్తారు. అందుకే అన్నారు ”భగవాధ్వజం ఈ దేశపు చరిత్ర, ఇతిహాసాలకు సాక్షి” అని.*


*సంస్కృతి ఆరాధన ద్వారా సమాజం సర్వాంగీణ వికాసం సాధించాలనేది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆకాంక్ష. మన ధర్మం, సంస్కృతి నలుదిశలా విస్తరించాలి. భారతమాత జగద్గురు స్థానంలో ప్రతిష్టితమవ్వాలి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన శక్తి భగవాధ్వజ ఛాయలలోనే లభిస్తుంది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


      *గురువాయూర్ కృష్ణుని లీల*

                ➖➖➖✍️


*దేవుడు మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మ జ్ఞానం కలిగేలా చేస్తాడు.*


*కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరి ప్రక్కన ఉన్న ‘పేరంపాలచ్చోరి’ అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తుండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురూ పేదరికంలో ఉన్నవారే, పూట గడవడానికి కూడా జరుగుబాటు లేదు. వారికి తెలిసిందల్లా వంట చేయడమే. దొరికితే తినేవారు లేదా కృష్ణ నామస్మరణతోనే కడుపు, మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతున్నదని, వంట చేయడానికి వంట మనుషులు కావాలనీ వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్ళారు.*


*ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. నడుము వొంగిపోయి, నిలబడడానికే శక్తిలేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా !!! అనుకున్నాడు. ఎగతాళిగా నవ్వుతూ ఈ వయస్సులో మీరు వంట చేయటానికి వచ్చారే! ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో 1000 గుండిగల అన్నం , కూరలు , పప్పు, చారు అన్నిరకాలు చేయాలి , ఈ వయసులో మీరు అంత పని చేయగలరా! ఈ వయస్సులోకూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయటానికి వచ్చారా?” అని ఎగతాళిగా అన్నాడు.*


*కృష్ణుడి భక్తులైన ఆ నలుగురు వృద్దులు అతని మాటలకు బాధపడి, “ఆ కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కానిదేముంటుంది చెప్పండి. మా ప్రయత్నం మేము చేస్తాము, అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు” అని సమాధానం చెప్పారు.* 


“బానే ఉంది మీరు చెప్పేది, మీ భారం ఆ కృష్ణుడి మీదకు నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏమిటి? మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా? ఇది మీ శక్తికి మించిన పని మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరడం లేదు” అన్నాడు. 


*“అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి, మేము ప్రయత్నిస్తాము, ఇది వరకు ఎన్నో సంతర్పణలలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకున్నది” అన్నారు.* 


*”సరే చూస్తాను, తేడా వచ్చిదంటే ముసలివాళ్ళు అని కూడా చూడను జాగ్రత్త” అన్నాడు.*


*”గురువాయిరుప్పా ! నీ అనుగ్రహం ఉంటే గడ్డిపోచలతో మదగజాలను కట్టేయచ్చు, దేనినైన సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించాగానే కలుగుతుంది ప్రభూ, నీ మీదే భారం వేసాము  మమల్ని కాపాడు” అని అనుకుంటూ వారు వారి స్థలానికి వెళ్లిపోయారు.*


*మరునాడు ఉదయం తెల్లవారుజామున 3 గం.లకు నిద్ర లేచి ప్రక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్లారు. అప్పుడు వాళ్లకి అంతకుముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు మొఖం కడుకుంటూ కనిపించాడు. వాళ్ళు ఆశ్చర్యంతో “నాగోరి! నువ్వు ఎప్పుడు వచ్చావ్ ఇక్కడికి?” అని అడిగారు.*


*అప్పుడు ఆ బాలుడు “నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారు అని తెలిసింది, వృద్దులైన మీకు సహాయం చేయటానికి నేను వచ్చాను” అని అన్నాడు.* 


*ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది. అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు.*


*వంట పని మొదలు పెట్టారు. ఆ నలుగురు ఏదో కొంచెం కొంచెం సహాయం చేసారు కానీ ఆ బాలుడే వంట మొత్తాన్నీ చక చక పూర్తి చేసాడు. ఉదయం 9 గంటల కల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడి నైవేద్యం కోసం పొంగల్, పులిహోర , అన్నిరకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు.*


*అందరూ ఆశ్చర్యపోయారు.*


*వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా  ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి, చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాప పడి, క్షమాపణలు చెప్పి,  నలుగురు కృష్ణ భక్తులకూ ఘనంగా సత్కారం చేసి, పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే డబ్బులు ఇచ్చాడు.*


*వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరీ గురించి ఆ కార్యనిర్వహకునికి తెలియదు. వారికి సత్కారం జరుగుతుండగా "నేను త్వరగా గురువాయూర్ వెళ్ళాలి, నాకోసం అక్కడ ఎంతో మంది వేచి ఉన్నారు" అన్ని చెప్పి నాగోరీ భోజనం కూడా చేయకుండానే అక్కడినుండి వెళిపోయాడు.*


*ఆ నలుగురు భక్తులూ భోజనం చేసి గురువాయూర్ వెళ్లారు. వాళ్ళు ఆ ఆనందంలో, ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు. గురువాయూర్ లో దర్శనం చేసుకొని వాళ్ళ నలుగురు వాళ్ళ సొంత ఉరికి వెళ్లిపోయారు.*


*ఆ రోజు రాత్రి నలుగురికీ ఒకే కల వచ్చింది.*


*ఆ  కలలో గురువాయూరప్పన్ కనిపించి “భక్తులారా! నాగోరి లాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలి ఇవ్వకుండా వచ్చేసారే, నా చేత పని చేపించుకొని కూలి ఇవ్వకపోవటం మీకు న్యాయమేనా?" అని అడిగాడు.*


*ఉలిక్కిపడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు. ఆశ్చర్యం!   అందరికీ ఒకే కల వచ్చింది,     అది కలా?                కాదు! కాదు!! అందరికీ ఒకే దివ్య దర్శనం, సందేశం లభించాయి. వెంటనే అందరూ ఆనందబాష్పాలు రాలుస్తూ , గురువాయురప్పని కీర్తిస్తూ, జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంలో గురువాయూర్ చేరి స్వామి వారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు.*


*ఆ సంఘటన మూలంగా ఇప్పటికి కూడా 1000 గుండిగల నైవేద్యం చేసి గురువాయూరప్పన్ కి పూజలు చేస్తున్నారు. ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికి వచ్చిన కూలిడబ్బులో ఒక వంతు దేవుడికి  నేటికీ సమర్పిస్తున్నారు.*✍️


*హరే కృష్ణ  హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.*

*హరే రామ హరే రామ రామ రామ హరే హరే.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖




                *ఆగని కన్నీరు...!

                 ➖➖➖✍️️


              ....మొదట శృంగేరి వెళ్ళండి!



        చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన! మేము ఒకయాభై మందిమి కలిసి కర్ణాటకలోని   క్షేత్రాలకు వెళ్దామని నిర్ణయించుకొని     ఒక టూరిస్ట్ బస్సులో ప్రయాణం ప్రారంభించాము. 

      

        ముందుగా కంచి వెళ్ళి పరమాచార్య స్వామి వారిని    దర్శించుకుని వెళ్ళడం మాకు అలవాటు.           కనుక మొదట అక్కడికి    వెళ్ళాము.             సుమారు సాయింత్రం నాలుగు గంటల సమయం లో        శ్రీమఠంలో పరమాచార్య స్వామి వారిని దర్శించుకొని   వారికి సాష్టాంగం చేసి నిలబడ్డాము.  చిన్నగా నవ్వి రెండు చేతులు పైకెత్తి  మమ్మల్ని   ఆశీర్వదిస్తూ ఇలా అడిగారు       “అందరూ       పెద్ద గుంపుగా వచ్చారు,    ఏమిటి సంగతి?” 


          తరువాత నేను స్వామివారికి మా కర్ణాటక యాత్ర       గురించి       మొత్తం వివరించాను. 


      స్వామి వారు      చాలా సంతోషపడి కనుబొమ్మలు పైకెత్తి, “మొదట అక్కడికి వెళ్ళాల్సిన  ఉద్దేశం  ఏమిటి?”      అని అడిగారు.    “మా ఉద్దేశం....  పెరియవ మంగుళూరు    చేరగానే         మొదటగా 'తలకావేరి' కి  వెళ్ళి,     అక్కడ సంకల్ప స్నానం చేసి,   శృంగేరికి వెళ్తాము. 


    తరువాత     అక్కడినుండి     'కుక్కె 

సుబ్రహ్మణ్య,     ధర్మస్థళ,     ఉడుపి, 

కొల్లూరు మూకాంబిక,      కటిలు దుర్గా పరమేశ్వరి . . .ఇలా” అని అన్నాను. 


     నేను ముగించకముందే స్వామివారు అడ్డుపడుతూ,        “ఆగాగు. . . నువ్వు చెప్పిన    క్షేత్రాలలో       ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని మరచిపోయావు”. 


        ప్రశ్నార్థకంగా  చూస్తున్న   మావైపు 

చూసి నవ్వుతూ,      “ఏమిటి?    అర్థం కాలేదా?    నేనే చెప్తాను. . . హొరనాడు క్షేత్రం!    అమ్మ    అక్కడ   అన్నపూర్ణగా వెలసి అనుగ్రహిస్తున్నది.   చాలా చాలా విశిష్టమైన క్షేత్రం. తప్పకుండా మీరంతా దర్శించండి” అని చెప్పారు. 


   మరలా ఇలా చెప్పారు“మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెయ్యండి.   మొదట మంగళూరు నుండి     శృంగేరి క్షేత్రానికి వెళ్ళండి.అక్కడ తుంగానదిలోసంకల్ప స్నానం చేసి, గురువులను దర్శించుకొని ప్రసాదం తీసుకొని  అమ్మ శారదా దేవిని దర్శించుకొని మీయాత్రమొదలుపెట్టండి 


    ఆ తరువాతే    మీరు    వెళ్లవలసిన ప్రదేశాలకు వెళ్ళండి.      ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు శృంగేరికి ఏ రోజు వెళ్ళినా,             సాధ్యమైనంతవరకు సాయింత్రం లోగా చేరుకోండి”. 


        అందరమూ     అంగీకరిస్తున్నట్టు తలఊపి,       మహాస్వామి       వారికి సాష్టాంగం చేసి,   మాకు ప్రసాదం ఇచ్చి పంపించారు. మాబస్సు యొక్క డ్రైవరు కండక్టరుకు కూడా          ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.   మేము మా యాత్రను కొనసాగించాము. 


        మరుసటి రోజు     ఉదయం     మా ప్రయాణం      బెంగళూరు        నుండి మంగళూరుకు.    రాత్రికి మంగళూరులో ఒక కళ్యాణమండపంలో బస చేసాము. మరుసటి రోజు ఉదయం లేచి      స్నాన పానాదులు    ముగించుకొని      బయలు దేరుతున్నాము.      రామనాథన్    అని మాతో పాటే వచ్చిన ఒకతను  నావద్దకు వచ్చి,      “మనం ముందు    తలకావేరి వెళ్దాము.  అక్కడ సంకల్ప స్నానం చేసి, తరువాత.   శృంగేరి వెళ్దాము”     అని నన్ను ఒప్పించబోయాడు. 


     నేను ఒప్పుకోక ”పరమాచార్య స్వామి వారు మనకు   ఏమి చెయ్యమని చెప్పారో అలాగే చేద్దాం”   అని  అన్నాను.   కాని వాళ్ళకి అది   నచ్చలేదు.       “ముందు తలకావేరికే    వెళ్ళాలి”    అని    ఒత్తిడి చేసారు.   బహుశా   వారు   ముందే... మాట్లాడు కున్నారేమో     నేను ఎంతగా ప్రాధేయపడ్డా       నా మాట    వారికి చెవికెక్కలేదు.


బస్సు తలకావేరివైపు ప్రయాణించింది. రోజంతా అక్కడ గడిపి నదిలో సంకల్ప స్నానం చేసి,   శృంగేరికి బయల్దేరాము. అప్పుడు రాత్రి 8:00గంటల సమయం.  శృంగేరికి కొండమార్గంలో వెళ్తున్న   మా బస్సు ముందు    రెండు   టైర్లు పంక్చర్ అయ్యి బస్సు ఆగిపోయింది. 


     బయటంతా   కటిక  చీకటి!    కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనబడదు. టార్చి లైటు వెలుతురులో   డ్రైవరు   మరియు కండక్టరు పంక్చర్అయిన టైర్లు తీసివేసి వేరే వాటిని అమర్చుతున్నారు. 


మాకందరికి కడుపులో చాలా ఆకలిగా ఉంది. చివరగా మద్యాహ్నం ఎప్పుడో బాడమండలలో తిన్నాము. 


   దాదాపు 10:00 గంటల సమయంలో బస్సు   బయలుదేరింది.     హఠాత్తుగా చిన్నగా వర్షం మొదలైంది.     అప్పుడు సమయం 11:00 గంటలు,    అయినా శృంగేరి జాడ కనిపించడం లేదు. 


   అప్పుడే మాకు అనుమానం వచ్చింది నిజంగా మేము సరైన దారిలోనే    వెళ్తు న్నామా   లేదా     దారి తప్పామా అని! అప్పుడే   దేవుడు   పంపాడా  అన్నట్టు దూరంగా ఒక మనిషి కనబడ్డాడు. 


       మేము అతని దగ్గరగా బస్సు ఆపి అడిగాము.        అతను తల కొట్టుకుని

“ఇది వేరే మార్గం.       15 కిమీ ముందే మీరు కుడి వైపున తిరగవలసి ఉన్నది” అని మాకు షాకిచ్చాడు. 


   కావున ఇప్పుడు బస్సు మేము వచ్చిన దారివైపు వెనక్కితిరగాలి.  డ్రైవరు దిగి పరిశీలించగా,   ఇరువైపులా లోయలతో కూడుకున్న    చిన్న  రోడ్డుమార్గం  అది. 

తన స్థానంలో కూర్చుని తెచ్చి పెట్టుకున్న ధైర్యంతో,      “మీరేమి  భయపడకండి. నేను     కొద్ది కొద్దిగా బస్సును     వెనకకు తీస్తూ    బస్సును తిప్పుతాను”     అని మొదలెట్టాడు.       ఎలాగో కష్టపడి ఒక తొంబై డిగ్రీలు      తిప్పిన     తరువాత, ఆందోళన పడుతూ గట్టిగా అరిచాడు. 

“సార్ .. సార్ బ్రేకుని నేను ఎంత గట్టిగా తొక్కిపట్టినా     పడటం లేదు      బస్సు వెనక్కు పడిపోతోంది.  దేవుడే మనల్ని కాపాడగలడు గట్టిగా ప్రార్థించండి” అని అన్నాడు. 


        మాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టైంది. 


    బస్సు వెనక్కు పడిపోతొందని మాకు తెలుస్తోంది.   మా అందరి కళ్ళల్లొ నీరు కారుతుండగా     గట్టిగా        అరవడం మొదలెట్టాము.  “అమ్మా.....    శృంగేరి శారదాంబా..... కాపాడు!     శృంగేరి.... మహాసన్నిధానం కాపాడండి!      కంచి పరమాచార్యగళే,   రామచంద్రమూర్తియే కాపాడండి కాపాడండి!!!”


హఠాత్తుగా డ్రైవరు చెప్పాడు“సార్ సార్ నేను బ్రేకుపైన కాలు తీసేసాను,అయినా బస్సు వెనక్కు పడిపోవడం లేదు.  ఒక వంద మంది వెనక నిలబడి   బస్సును పట్టుకున్నట్టుగా    బస్సు ఆగిపోయింది. ఏమి  భయపడకండి.       నేను మెల్లిగా బస్సును       తిప్పుతాను”      అని తన ప్రయత్నం మొదలు పెట్టాడు.    కానీ.... మేము నామఘోష ఆపలేదు!


   హమ్మయ్య చివరగా డ్రైవరు బస్సును తిప్పాడు.      అందరూ ఊపిరి     పీల్చు కున్నారు.   అప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలు.   సరిగ్గా ఒకటిన్నరకు శృంగేరి సంస్థానం ప్రవేశద్వారం చేరుకున్నాము. 


    మాకోసం ఎదురు చూస్తున్న నాగేశ్వర గణపదిగళ్      మమ్మల్ని      చూడగానే నవ్వుతూ,     “రండి రండి మీరందరూ మద్రాసు నుండి     వస్తున్నారు   కదూ? ముందు     కాళ్ళు చేతులు     కడుక్కుని కొద్దిగా తినండి.చాలాఆకలిగా ఉన్నారు. మీ కోసమని    అన్నం   ఉప్మా, వంకాయ గొజ్జు సిద్ధం చేసాము” అని అన్నారు. 


     ”శాస్త్రిగారూ  మేము     వస్తున్నామని మీకు ఎలాతెలుసు? మేము మీకు జాబు కూడా రాయలేదు” అని అడిగాను. 


      అతను నవ్వుతూ, “అవును నిజం. మీరు    వస్తున్నారని     మావంటివారికి తెలియకపోవచ్చు.      కాని లోపల ఉన్న త్రికాలవేదులు        శ్రీ మహాసన్నిధానం వారికి అంతా తెలుసు.   మీకు తెలుసా, దాదాపు    పదకొండు    గంటలప్పుడు స్వామి వారు నన్ను పిలిచి,  ‘శారదాంబ దర్శనం కోసం     54 మంది     భక్తులు వస్తున్నారు.      వారు   చాలా  ఆకలిగొని ఉంటారు.        మీ వాళ్ళకి చెప్పి అన్నం ఉప్మా  వంకాయ గొజ్జు తయారుచేయించి సిద్ధంగా ఉంచు. అలాగే వారి కోసం ఒక పెద్ద  హాలును    సమకూర్చు’.      అన్నీ ముగించుకొని    మిమ్మల్ని    ఆహ్వానించ డానికి నేను ఇక్కడ నిలబడ్డాను” అని మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసారు. 


శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దూరదృష్టి,     వారి అవ్యాజమైన కరుణని   తలచుకొని     నేను     ఆశ్చర్య పోయాను.నా కళ్ళ వేంట   ఆగనికన్నీరు వచ్చింది. అది చూసి శాస్త్రి గారు “దీనికే మీరు ఆశర్యపోతున్నారు.రేపు ఉదయం మీకు మరొక    విషయం కూడా చెప్తాను. మీరు అది విని ఇంకా ఆశ్చర్యపోతారు” అని అన్నారు. 


  అరిటాకులపై వేడి వేడిగా అన్నం ఉప్మా, వంకాయ గొజ్జు వడ్డించారు.   మా కడుపుల  నిండుగా   తిని     ఆ రాత్రికి విశ్రమించాము. 


          మరుసటి రోజు ఉదయం తుంగా నదిలో      మా స్నానాలు ముగించుకొని దక్షిణామ్నాయ   శృంగేరి పీఠాధీశ్వరులు మహాసన్నిధానం          శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దర్శనానికి బయలుదేరాము.   రాత్రి మేము కలిసిన శాస్త్రి గారు కూడా మాతోనే ఉన్నారు. 


     నేను వారికి రెండుచేతులు జోడించి నమస్కరించి“నిన్న మీరు మాకు ఇంకొక విషయం చెబుతానన్నారు.    దయచేసి చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను” అని వారిని ప్రార్థించాను. 


   వారు చెప్పడం ప్రారంభించారు “రాత్రి దాదాపు 12:00 గంటల    సమయంలో మహాసన్నిధానం వారు    వారి ఏకాంత మందిరంలో కూర్చుని శాస్త్రసంబధమైన పుస్తకాలు చూస్తున్నారు.   నేను బయటి గదిలో కూర్చున్నాను.      హఠాత్తుగా ... బయటకు వచ్చి     స్వామి వారు    తమ రెండు చేతులని   గోడకి ఆనించి గట్టిగా అదుముతూ,      ఏదో మంత్రం చదవ నారంభించారు. నేను లేచినిలబడ్డాను. వారిని చూస్తే ఆ గోడ పడకుండా   ఆపు తున్నట్టు ఉంది.        నాకు ఏమి అర్థం కాలేదు. 


          ఒక ఐదు నిముషాల తరువాత గోడ   పైనుండి     చేతులు తీసి......, మహాసన్నిధానం వారు       నా దగ్గరకు వచ్చి      ‘నేను  ఇలా గోడకు     చేతులు అడ్డుపెట్టి జపంచెయ్యడం చూసిననీకు వింతగా అగుపిస్తోది కదూ. ఏమీలేదు! మద్రాసు నుండి శారదాదేవి దర్శనానికి వస్తున్న బస్సు దారి తప్పింది.     వారు తప్పు  మార్గంలో   ప్రయాణిస్తున్నామని తెలుసుకుని      బస్సును      వెనక్కు తిప్పుతుండగా,   బ్రేకులు పడక బస్సు లోయలోకి పడిపోతోంది.....


   అందులోఉన్నభక్తులు గట్టిగా "అమ్మా శారదా!    కాపాడు    కాపాడు"     అని అరిచారు.      అందుకనే    గోడకి    నా చేతులను అడ్డుపెట్టి        ఆ బస్సు.... పడిపోకుండా     ఆపాను.      ఇప్పుడు అంతా సవ్యంగా ఉంది. బస్సు శృంగేరి వైపు వస్తోంది.     నీవు వెళ్ళి....    నేను ఆనతిచ్చినట్టుగా     వారికి  అన్నీ సిద్ధం చెయ్యి’   అని చెప్పి     వారు      గదిలోకి వెళ్ళిపోయారు.    నేను ఇదంతా విని స్థాణువైపోయాను.”          ఇది విని మేమందరమూ ఉండబట్టలేక   కన్నీరు కారుస్తూ,   ఆ నడయాడే శారదా దేవిని చూడటానికి బయలుదేరాము. 


       శ్రీవారికి సాష్టాంగం చేసి నిలుచున్న నావైపు చూసి, శ్రీ శ్రీ శ్రీ మహాసన్నిధానం వారు నవ్వుతూ,     మాకు       హెచ్చరిక చేస్తున్నట్టు  “మహాత్ములు చెప్పినదాన్ని ఎప్పుడూ వినాలి.     దాన్ని తప్పకుండా పాటించాలి.      అలాకాకుండా ప్రవర్తిస్తే జరగవలసినవి   ఏవి   సరిగ్గా జరగవు. ఏమిటి అర్థమైందా?”     అని అన్నారు. 


     మహాసన్నిధానం వారు చెప్తున్నది .. 

కంచి పరమాచార్యులు వారు      మాకు ఆజ్ఞాపించినదాని గురించే    అని నాకు అర్థమైంది.....✍️️



--- శ్రీ రమణి అన్న, శక్తి వికటన్ ప్రచురణ


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

[22/04, 9:23 am] +91 94939 06277: 150423h1841    220423-4.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


 *భగవంతుడి నోట “తాతా” అని పిలిపించుకున్న భక్తుడు.*

              ➖➖➖✍️



 *భగవంతుణ్ణి భక్తుడు ఆర్తితో పలురకాలుగా పిలుస్తాడు. తన మనసుకి తోచిన బంధంతో పరమేశ్వరుని కొలుచుకుంటాడు. కానీ భగవంతుడే భక్తుణ్ణి “తాతా” అని పిలుచుకున్న ఓ అరుదైన సందర్భం ఉంది. ఆ భగవంతుడు శ్రీనివాసుడైతే, భక్తుడు తిరుమలనంబి.*


 *ఈ “తిరుమలనంబి” ఎవరో కాదు. రామానుజాచార్యులకి మేనమామ. రామానుజాచార్యులు జన్మించగానే, వారిని చూసి ఇతడు సాక్షాత్తూ లక్ష్మణుని అవతారమనీ, కలియుగంలో అద్భుతాలు సాధిస్తాడనీ ఊహించాడు తిరుమలనంబి.*


*తిరుమలనంబి అసలు పేరు శ్రీశైలపూర్ణుడు. ఆయనగారు తన మేనల్లుడైన రామానుజాచార్యుల భవిష్యత్తుకి తగు సూచనలు అందిస్తూనే శ్రీరంగంలో ఉన్న యమునాచార్యులు అనే గురువుగారి వద్ద ఆధ్మాత్మిక జ్ఞానాన్ని అభ్యసించసాగారు.*


*గురువుగారు తరచూ తిరుమల శ్రీనివాసుని తల్చుకోవడం గమనించారు తిరుమలనంబి. దాంతో కొన్నాళ్లపాటు తిరుమలలో గడిపి రావాలన్న కోరిక కలిగింది.*


*అలా తిరుమలకు చేరుకున్న తిరుమలనంబి ఏడుకొండల మధ్య కొలువైన శ్రీనివాసుని వైభవం చూసి ఇక వెనక్కి వెళ్లలేదు. ఆయన జీవితాంతమూ శ్రీవారి ఆలయంలో జరిగే సేవలకు తన వంతు సాయాన్ని అందిస్తూ గడిపేశారు.*


*తిరుమలనంబి ప్రతిరోజూ శ్రీవారి అభిషేకం కోసమని ఎంతో దూరంలో ఉన్న పాపవినాశనం అనే తీర్థం నుంచి జలాలను తీసుకువచ్చేవారు. ఏళ్లు గడుస్తున్నా, ఒంట్లో సత్తువ తగ్గిపోతున్నా తిరుమలనంబి తన దినచర్యను మార్చుకోలేదు. జోరున వర్షాలలో, జారిపోయే రాతిగుట్టల మీద నడుస్తూ జలాన్ని తెచ్చేవారు. రాళ్లు ముళ్లల్లా గుచ్చుకుంటున్నా మనసులో శ్రీనివాసుని తలచుకుని నడకని సాగించేవారు. పాపవినాశనం నుంచి తీర్థాన్ని తెచ్చి శ్రీవారి పాదాలను కడిగితే కానీ ఆయనకు రోజు గడిచినట్లు ఉండేది కాదు.*


*అలాంటి తిరుమలనంబిని ఆటపట్టిద్దామనుకున్నారట ఒకసారి శ్రీవారు. ఆయనకి ఆటలంటే మహా ఇష్టం కదా! ఒకరోజు యథావిధిగా తిరుమలనంబి ఒక మట్టికుండలో పాపవినాశనం నుంచి జలాన్ని నింపుకొని వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆ సమయంలో ఆయనకు వేటగాని రూపంలో ఎదురుపడ్డాడు శ్రీనివాసుడు.*


 *~”తాతా! కుండ నిండా నీళ్లు మోసుకుపోతున్నావు కదా! నాకు కాసిని నీళ్లివ్వవా!” అని అడిగాడట వేటగాడి రూపంలో అక్కడికి వచ్చిన శ్రీనివాసుడు*


 *’కాస్త నడిస్తే నీకే ఎక్కడో ఓ చోట నీళ్లు దక్కుతాయి. పోయి తాగు! నాకు అభిషేకానికి వేళ మించిపోతోంది’ అని బదులిచ్చాడట తిరుమలనంబి. ఒకటికి రెండుసార్లు ఈ సంభాషణ ఇలాగే గడిచిన తరువాత తిరుమలనంబి ఆ వేటగాడిని దాటుకుని ముందుకు సాగాడు.*


 *వేటగానిలా ఉన్న వేంకటేశుడు అక్కడితో ఊరుకోలేదు. తిరుమలనంబి వెనకే చేరి అతని కుండకి తన బాణంతో బెజ్జం చేసి హాయిగా అందులో నీటిని తాగేశాడు.*


 *జరిగింది తెలుసుకున్న తిరుమలనంబి కుప్ప కూలిపోయాడు. ‘ఏళ్లకు ఏళ్లుగా జరుగుతున్న అభిషేకానికి విఘ్నం వాటిల్లిందే’ అని బాధపడుతూ తీర్థాన్ని తీసుకువచ్చేందుకు మళ్లీ పాపవినాశనానికి పయనమయ్యాడు.*


 *’తాతా! తీర్థజలం కోసం అంత దూరం మళ్లీ ఏం పోతావు. ఇక్కడికి దగ్గరలోనే మరో తీర్థం ఉంది. చూపిస్తాను రా!’ అంటూ తన వెంట తీసుకుపోయాడు వేటగాడు. అటూఇటూ ఎంత తిరిగినా తీర్థం కనిపించలేదు. అభిషేకానికి ఓ పక్క వేళ మించిపోతోంది. అలా కాసేపు తిరుమలనంబిని అడవిలోనే తిప్పించిన శ్రీవారు… “ఇక్కడ ఏ తీర్థమూ ఉన్నట్లు లేదు. ఉండు నేనే ఏదో ఒక ఏర్పాటు చేస్తాను” అని తన బాణాన్ని ఒక కొండ మీదకు సంధించారు.* 


 *~అప్పుడు ఏర్పడిన తీర్థమే ఆకాశగంగ! ఆ సంఘటనకు గుర్తుగా ఇప్పటికీ తిరుమలనంబి వారసులు ఆకాశగంగ జలాలతో శ్రీవారి పాదాలను అభిషేకిస్తుంటారు.*


*తిరుమలనంబికీ, శ్రీవారికీ ఉన్న అనుబంధానికి గుర్తుగా శ్రీవారి ఆలయానికి చేరువలోనే ఆయనకు కూడా ఒక చిన్న గుడిని నిర్మించారు.*✍️

        *ॐశ్రీవేంకటేశాయ నమః*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*ఆధ్యాత్మిక విషయాలు దైవ కార్యక్రమాలు దేవుళ్ల వివరాలు తెలుసు కొనుటకు జాయిన్ బటన్ నొక్కండి https://chat.whatsapp.com/Emm3knQIrJA2rlMnRRXFjF

                     ➖▪️➖


కరక్కాయ గుణగణాలు

.

*మన ఆరోగ్యం…!


                    *కరక్కాయ*

                  ➖➖➖✍️



 తెలుగు  - కరక్కాయ . 

 సంస్కృతం  -  హరీతకి . 

 హింది - హరడ్ . 


 *గుణగణాలు:-

 కరక్కాయ లవణరస వర్జితముగా , అయిదు రసములు గలదిగా , రూక్షముగా , వేడిగా , జఠరదీపనముగా , బుద్ధిబలమును ఇచ్చునదిగా , మధురపక్వముగా , ఆయురారోగ్యాలను ఇచ్చునదిగా , నేత్రములకు హితవుగా , తేలికగా , ఆయువును పెంపొందించునదిగా , ధాతువృద్ధిగా , వాయువును కిందకి వెడలించునదిగా ఉండును. మరియు శ్వాసను , దగ్గును , ప్రమేహమును , మొలలను , కుష్టును , నంజును , ఉదరమును , క్రిమిని , స్వరభంగమును , గ్రహిణిని , మలబద్ధకమును , విషజ్వరమును , గుల్మమును , కడుపుబ్బరం , దాహము , వాంతిని , ఎక్కిళ్ళను , దురదను , హృదయరోగమును , కామెర్లను , శూలను , ప్లీహారోగమును , అనాహమును , కాలేయవ్యాధిని , శిలామేహమును , మూత్రకృచ్చ రోగమును , మూత్రఘాత రోగమును నాశనం చేయును . 


           కరక్కాయ పులుసు రసం కలిగి ఉండుటచే వాతాన్ని హరించును . తీపి , చేదురసం కలిగి ఉండటం చేత పిత్తాన్ని హరించును . రూక్షత్వం ,వగరు రసం కలదగుట చేత కఫాన్ని హరించును . ఈ విధముగా కరక్కాయ త్రిదోషహరమైనది. 


        కరక్కాయను వర్షఋతువు నందు సైన్ధవ లవణము చేర్చి , శరదృతువు యందు పంచదార చేర్చి  , హేమంత ఋతువు నందు శొంఠిని చేర్చి శిశిర ఋతువు నందు పిప్పలిని చేర్చి , వసంత ఋతువు నందు తేనెని చేర్చి , గ్రీష్మఋతువు నందు బెల్లమును చేర్చి భక్షించవలెను. 


కరక్కాయను భోజనానంతరం భక్షించినను పథ్యకరమైనది . మరియు భోజనం జీర్ణం అయిన తరువాతను , అజీర్ణసమస్య ఉన్నప్పుడును పుచ్చుకోవచ్చు. 


  *రూప లక్షణాలు:-

కరక్కాయ మొత్తం 7 రకాలుగా కలదు. అవి 

             *  విజయా . 

             *  రోహిణీ . 

             *  పూతన . 

             *  అమృతా . 

             *  అభయా . 

             *  జీవంతి . 

             *  చేతకీ . 

      అని మొత్తం 7 జాతులుగా ఉండును. ఇప్పుడు మీకు వీటి గురించి సంపూర్ణముగ వివరిస్తాను. 

        విజయా కరక్కాయ వింధ్య పర్వతం పైన పుడుతుంది. చేతకీ కరక్కాయ హిమాలయ పర్వతాలపైన పుట్టుచున్నది. పూతన కరక్కాయ సింధూనది ప్రాంతము నందు పుట్టుచున్నది . అమృత కరక్కాయ , అభయ కరక్కాయ చంపారణ్యం నందు పుట్టుచున్నది. రోహిణీ కరక్కాయ అన్ని స్థలముల యందు పుట్టుచున్నది. జీవంతి కరక్కాయ సౌరాష్ట్ర దేశము నందు పుట్టుచున్నది. 

                  సొరకాయ వలే పొడవుగా , గుండ్రముగా ఉండునది విజయా కరక్కాయ , కేవలం గుండ్రముగా ఉండునది రోహిణి కరక్కాయ , బీజము పెద్దదిగా ఉండి పై చర్మము పలుచగా ఉండునది పూతన కరక్కాయ , బీజములు చిన్నవిగా ఉండి పేడు మందముగా ఉండునది అమృత కరక్కాయ , అయిదు రేఖలు కలిగినది అభయ కరక్కాయ. బంగారు రంగుతో ఉండునది జీవంతి కరక్కాయ , మూడు రేఖలు కలిగినది చేతకీ కరక్కాయ . 

     విజయ కరక్కాయను సర్వరోగముల యందు ఉపయోగించదగినది. రోహిణి కరక్కాయను వ్రణము హరించుటకు ఉపయోగించదగినది . పూతన కరక్కాయ లేపనమందును , పైన పట్టు వేయుటకు ఉపయోగించతగినది. అమృత కరక్కాయ శోధనార్థం , విరేచనములు మొదలగు వానికి ఉపయోగించతగినది. అభయ కరక్కాయ నేత్రరోగములకు ఉపయోగించతగినది. , జీవంతి కరక్కాయ సర్వరోగములను హరించును . చేతకీ కరక్కాయ చూర్ణములకు ప్రశస్తమైనది. 

                కరక్కాయ మనుష్యులకు తల్లివలె హితము చేయును . తల్లికి ఒకప్పుడైనను కోపము కలిగి దండించును. కాని కడుపులో ప్రవేశించిన కరక్కాయ (తినిన) ఎప్పటికి హానిచేయదు . ఎల్లప్పుడూ మంచిచేయు గుణము కలిగినది . 

     చేతకీ కరక్కాయ తెలుపు రంగు , నలుపు రంగు బేధము వలన రెండు విధములుగా ఉండును. తెల్ల చేతకీ కరక్కాయ 6 అంగుళముల పొడవుగాను , నల్ల చేతకీ కరక్కాయ ఒక అంగుళము పొడవుగా ఉండును.  

           ఒక జాతి కరక్కాయ తినుట చేతను , ఇంకో జాతి కరక్కాయ వాసన చూసిన మాత్రం చేతను , మరొక జాతి కరక్కాయ ముట్టుకొనిన మాత్రమున , వేరొక జాతి కరక్కాయ చూచిన మాత్రమునే విరేచనం కలిగించును. ఈ ప్రకారం నాలుగు బేధముల విరేచన గుణములు కరక్కాయల యందు కలవు. 

              చేతకీ కరక్కాయ చెట్టు కింద ఏ మనుష్యులు కాని లేక పశు , పక్షి , మృగాదులు కాని తిరిగిన తక్షణం విరేచనములు అగును. చేతకీ కరక్కాయను హస్తము నందు ఎంతసేపు ఉంచుకొనునో అంతవరకు ఆ కరక్కాయ ప్రభావం వలన నిశ్చయముగా విరేచనములు అగుచుండును. చేతకీ కరక్కాయను సుకుమారులు , బలహీనులు , ఔషధము నందు ద్వేషము కలిగినవారు చేతిలో పట్టకూడదు. చేతకీ కరక్కాయ అత్యంత ప్రశస్తమైనది. సుఖవిరేచనం కలిగించుటకు హితకరం అయినది. 

             పైన చెప్పిన 7 జాతులలో విజయ కరక్కాయ ప్రధానం అయినది. ప్రయోగము నందు సుఖవిరేచనం ఇచ్చునది. సర్వరోగముల యందు ఉపయోగించతగినది. ఏ కరక్కాయ నూతనమైనది , జిగట కలిగినది . గొప్పది , గుండ్రనిది , బరువు కలిగినది . నీటిలో మునుగునదిగా ఉండునో ఆ కరక్కాయ ప్రశస్తమైనది. తూనిక నందు 2 తులములు తూగినది ప్రశస్తమైన కరక్కాయ . 

 ఔషధోపయొగాలు  - 

 *  కామెర్ల నివారణ కొరకు  - 

        కరక్కాయ , తేనె , బెల్లం కలిపి తినిన కామెర్లు తగ్గును. 

 *  కీళ్ళవాతము నివారణ కొరకు - 

        కరక్కాయ చూర్ణమును , ఆముదముతో కలిపి ప్రతినిత్యం వాడిన కీళ్లవాతం , గృదసీవాతం ( సయాటికా ) తగ్గును. 

 *  క్రిమిరోగముల నివారణ కొరకు  - 

         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో కలిపి వాడిన క్రిమిరోగాలు తొలగును . ఇది చక్కని విరేచనాన్ని కలుగచేయును . అర్శమొలల సమస్యతో ఇబ్బంది పడువారికి ఇది చాలా మంచిది . 

 *  కడుపునొప్పి నివారణ కొరకు 

         కరక్కాయ చూర్ణము నందు బెబులిన్ కలదు. ఇది కడుపునొప్పిని తగ్గించును . 

 *  చర్మరోగముల నివారణ కొరకు  - 

         కరక్కాయ చూర్ణమును , గోమూత్రము నందు కలిపి తాగిన పామా , దద్రు మొదలగు చర్మరోగాలు తగ్గును. కరక్కాయను కాల్చి చూర్ణము చేసి ఆ చూర్ణముకు నువ్వులనూనె కలిపి రాసిన పురాణ వ్రణములు తగ్గును. 

 *  విషమ జ్వరాల నివారణ కొరకు  - 

         కరక్కాయను తేనెతో కలిపి వాడిన విషమ జ్వరాలు తొందరగా నయం అగును. 

 *  ఆమ్ల పిత్తము నివారణ కొరకు  - 

         కరక్కాయను ద్రాక్షతో కలిపి సేవించిన ఆమ్లపిత్తము నయం అగును. 

 *  అర్శమొలల నివారణ కొరకు  - 

          కరక్కాయ చూర్ణమును బెల్లముతో కలిపి ప్రతిరోజు సేవించిన అర్శమొలలు , మలబద్ధకం , వాత్తరక్తం శమించును . 

 *  బరువు తగ్గుట కొరకు - 

         కరక్కాయ ప్రతినిత్యం వాడుచున్న బరువు తగ్గును. 

 *  గోరుచుట్టు నివారణ కొరకు  - 

        పసుపు రసమునకి కరక్కాయలను చేర్చి వాటిని బాగా దంచి మెత్తగా నూరి పైపూతగా రాయుచున్న గోరుచుట్టు తగ్గును. 

 *  నీళ్ల విరేచనాల నివారణ కొరకు  - 

         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో తాగుచున్న నీళ్ళవిరేచనాలు తగ్గును. 

 *  రక్తస్రావ నివారణ కొరకు  - 

        కరక్కాయ చూర్ణాన్ని అడ్డసరం రసంతో భావన చేసి ఎండబెట్టి ఆ చూర్ణమునకు పిప్పళ్లు , తేనె చేర్చి సేవించిన ఎంతపెద్ద రక్తస్రావం అయినను తగ్గును. 

 *  శరీర బలం పెరుగుట కొరకు  - 

         కరక్కాయలను నేతిలో వేయించుకుని తినుచున్న శరీరానికి మంచి బలం కలుగును. 

 *  పాండురోగం నివారణ కొరకు  - 

        కరక్కాయలను గోమూత్రము నందు వేసి మరిగించి తీసి పైపెచ్చు పొడిని చేసి దానిని 5 గ్రాముల మోతాదులో కొంచం ఆముదం కలిపి ప్రతినిత్యం ఉదయం సమయంలో పరగడుపున సేవించవలెను . దీనిని గోమూత్ర హరీతకీ అని అంటారు.  దీనిని వాడటం వలన పాండురోగం , అధిక బరువు , వరిబీజం తగ్గును. 

 *  చర్మ దళ కుష్టు నివారణ కొరకు  - 

       20ml గోమూత్రము నందు 3 గ్రాముల కరక్కాయ చూర్ణము కలిపి తాగితే చర్మ దళ కుష్ఠు , కిటిభకుష్టు  తగ్గును . ఇతర చర్మవ్యాధుల యందు కరక్కాయ పొడికి సమానం వేపాకు చూర్ణం కలిపి 1 స్పూన్ చొప్పున రెండుపూటలా తాగవలెను . 

 *  గొంతు బొంగురు నివారణ కొరకు  - 

       కరక్కాయ చూర్ణమునునకు పిప్పలి చూర్ణం లేదా శొంఠిచూర్ణం మరియు తేనె కలిపి లేహ్యముగా చేసి అరస్పూన్ చప్పరించి మింగుచున్న బొంగురుగొంతు , గొంతులో నస తగ్గును. 

 *  దగ్గు నివారణ కొరకు  - 

        కరక్కాయ పెచ్చును నోటిలో ఉంచుకుని రసము మింగుచున్న కొండనాలుక , దగ్గు , గొంతు వొరుచుకొనుట , పొడిదగ్గు తగ్గును. 

 *  తలనొప్పి నివారణ కొరకు  - 

        కరక్కాయ గింజలతో నుదుటి పైన పట్టువేసిన తలనొప్పి తగ్గును. 

 * కండ్ల ఎరుపు నివారణ కొరకు  - 

         కరక్కాయ , కాచు సమాన భాగాలుగా తీసుకుని నీటితో నూరి కండ్లపైన గుడ్డ వేయవలెను . కండ్ల ఎరుపులు తగ్గును. 

 *  ఎక్కిళ్లు నివారణ కొరకు  - 

       గోరువెచ్చని నీళ్లతో కరక్కాయ చూర్ణం కలిపి ఇచ్చిన ఎక్కిళ్ళు కట్టును . 

 *  ఉదరరోగ నివారణ కొరకు  - 

       ఉదయం మరియు సాయంత్రం ఒక్కొక్క కరక్కాయ చొప్పున 2 నెలలపాటు తినుచుండిన ఎటువంటి ఉదరరోగం అయినను తగ్గిపోవును. 

 *  ఆహారం జీర్ణం అగుటకు  - 

       వేడినీటితో కరక్కాయ చూర్ణం కలిపి తాగిన తినిన ఆహారం సరిగ్గా అరగకుండా ఉన్న సమస్యని తొలగించి ఆహారాన్ని జీర్ణం చేయును . 

 *  కఫజ్వర నివారణ కొరకు  - 

       గోమూత్రంలో కరక్కాయలు భావన చేసి తినిన కఫసంబంధ దోషం వలన వచ్చు జ్వరం నివారణ అగును. 

 *  వాంతుల నివారణ కొరకు  - 

        కరక చూర్ణం తేనెతో సేవించిన వాంతులు తగ్గును. 

 *  కఫ సంబంధ బోదకాలు నివారణ కొరకు  - 

       కరక్కాయ ముద్దను గోమూత్రముతో కలిపి తాగిన బోదకాలు నివారణ అగును. 

 *  గుల్మ నివారణ కొరకు  -  

        కరక్కాయ చూర్ణం బెల్లముతో కలిపి తినుచున్న గుల్మరోగం నివారణ అగును. 

 *  రక్తపిత్త రోగ నివారణ కొరకు  - 

        అడ్డసరం రసములో 7 సార్లు భావన చేసిన కరక్కాయను నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకుని కొంచం పిప్పలి చూర్ణం కలిపి తేనెతో సేవించిన అసాధ్యమగు రక్తపిత్తం తగ్గును. 

 *  ఉబ్బురోగం నివారణ కొరకు - 

     బెల్లం మరియు కరక్కాయ సమానంగా కలిపి తీసుకొనుచున్న ఉబ్బురోగములు తగ్గును. 

 *  వాతరక్త వ్యాధి నివారణ కొరకు  - 

     5 కరక్కాయలు బాగుగా నమిలి మింగి తిప్పతీగ కషాయం తాగిన వాతరక్తం తగ్గును.

 *  అండవృద్ధి నివారణ కొరకు  - 

        గోమూత్రము నందు భావన చేసిన కరక్కాయను ఆముదము నందు వేయించి వేడినీటి అనుపానంగా సేవించిన అండవృద్ధి హరించును . 

 *  నేత్రరోగ నివారణ కొరకు  - 

        కరక్కాయ ఆవునేతితో ఉడికించి అది కంటిపైన వేసి కట్టు కట్టుచున్న నేత్ర దోషాలు నివారణ అగును. 

 *  పిల్లల కోరింత దగ్గు నివారణ కొరకు  - 

       కరకపువ్వు 1 భాగము , వేయించిన పిప్పళ్లు 1/2 భాగము , ఎండిన ఉస్తిపండ్లు 1/4 భాగము తీసుకుని వీటన్నింటిని మెత్తగా చూర్ణం చేసి మూడు గురిగింజలంత చూర్ణము 2 గంటలకి ఒక పర్యాయము తేనెతో నాకించుచుండిన కోరింత దగ్గులు తగ్గును. కరకపువ్వు చూర్ణం కూడా వాడవచ్చును  . 

  గమనిక  - 

           అతిగా నడచినవాళ్లు , బలహీన శరీరం కలవాళ్ళు , చిక్కిన శరీరం కలవాళ్లు , ఉపవాసం వలన బలహీనపడిన వారు , శరీరం నందు అమిత వేడి కలిగినవారు , గర్భవతులు , రక్తం తీయబడిన వారు , రక్తస్రావం వలన ఇబ్బందిపడేవారు , హనుస్థంభ వాత రోగులు కరక్కాయను వాడరాదు  .

                              ....సేకరణ.


.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ప్రియమైనది

 శ్లోకం:☝️

*నాస్తి మేఘసమం తోయం*

 *నాస్తి ఆత్మసమం బలం l*

*నాస్తి చక్షుః సమం తేజో*

 *నాస్తి చాన్నసమం ప్రియం ll*


భావం: (స్వచ్ఛమైన) మేఘపు నీటికి సమానమైన నీరు లేదు. ఆత్మ బలానికి సమానమైన శక్తి లేదు. కన్నుల మించిన సాక్షి మరొకటి లేదు. మరియు ఈ ప్రపంచంలో ఆహారము కన్నా ప్రియమైనది మరొకటి లేదు.

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం

 

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం

( గోలగముడి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ )


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


             347. అమ్మకిచ్చిన మాట.


           శ్రీ వెంకయ్య స్వామివారు చిన్నప్పటి నుండి వారి అమ్మ పిచ్చమ్మతో ఎక్కువ అనుబంధం కలిగి ఉండేవారు. ఆ కుటుంబంలో పెద్ద కొడుకు వెంకయ్య స్వామి. ఆమె ఎన్నో పూజలు చేసిన తరువాత కలిగిన సంతానం. శ్రీ స్వామివారు జన్మించినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. 1897 లో శ్రీ స్వామివారు జన్మించినట్లుగా భక్తులు అందించిన సమాచారం. ఆ రోజుల్లో కాన్పు అంటే పునర్జన్మతో సమానం. పిచ్చమ్మ ప్రసవించిన తరువాత ఆమెకు చూపు కనిపించలేదు. అందరూ ఆందోళన చెందారు. తరువాత 15 నిముషాలకు మాములుగా కనిపించింది. అవతార పురుషునికి జన్మ నిచ్చానని పాపం ఆ తల్లికి అప్పట్లో తెలియదు. శ్రీ స్వామివారు అందంగా ఉన్నారు అందరూ ఆ బాలుని రూపం చూసి ఇష్టపడే వారు. నీ కొడుకు చిన్ని కృష్ణుని లా ఉన్నాడు అని అందరూ అంటుంటే పిచ్చమ్మ మురిసిపోయేది. నిజానికి భగవంతుడు ఆయా కాలాలలో అవసరమైన సమయంలో నేను యోగినై జన్మిస్తాను అని భగవద్గీతలో చెప్పారు అందుకే నిరుపేదల కోసం నారాయణ మూర్తి జననం ఆ ఇంట అలా జరిగింది.


           తరువాత ఆమెకు ముగ్గురు సంతానం కలిగారు ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడపిల్ల. ముగ్గురు అన్న దమ్ముల మద్య ఒక్కతే అమ్మాయి కావడంతో అందరూ ఆమెను అల్లారు ముద్దుగా పెంచారు. ఆమె పేరు మంగమ్మ రాజపద్మా పురంలో బంధువుల అబ్బాయి కే ఇచ్చి చేశారు. శ్రీ స్వామివారు ఆ సంబంధం వద్దు అన్నారు కానీ అదే చేశారు. ఆమె దురదృష్టం ఇద్దరు పిల్లలు పుట్టగానే భర్త చనిపోయారు. శ్రీ స్వామివారు తనకు వచ్చిన ఆస్తి వాటాను ఆమెకి వ్రాసి ఇచ్చేసారు.


       శ్రీ స్వామివారు చిన్నప్పుడు వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు ఎంతో సహయం చేసేవాడు. పొలం వెళ్తే ముగ్గురు కూలీలు చేసే పని తాను ఒక్కరే చేసేవాడు. ఎవరికైనా కూలీకి వెళ్తే ఆ డబ్బులు తాను అడిగి తెచ్చుకోవడం ఉండదు. వాళ్లే మీ అబ్బాయి మా దగ్గర పని చేసాడు అని ఆ డబ్బులు తెచ్చి వాళ్ళ అమ్మ కి ఇచ్చే వారు. బాల్యంలో చదువు పై ఆసక్తి కనపరచ లేదు. ఎక్కువగా కష్టం చేసేవారు. లేదా ఒంటరిగా వెళ్లి కూర్చొని కళ్ళు మూసుకుని ఉండే వారు. ఎవరైనా వచ్చి పిలిస్తే పోలీసులు వస్తున్నారు నా దగ్గరకు రావద్దు పోండి అనే వారు.


                 ఇతని ప్రవర్తన ఏదో తేడాగా ఉందని ఇంట్లో వాళ్ళు కొట్టారు తిట్టారు అవమానించారు, చాలా బాధ పెట్టారు. నాలిక మీద బంగారు కడ్డీతో వాతలు పెట్టారు. ఏదో దెయ్యం పట్టిందని భూత వైద్యం చేయించారు. గుండు గీయించి కత్తితో గాట్లు పెట్టి నిమ్మ కాయ రసం పిండారు ఇలా రక రకాలుగా హింస పెట్టారు. ఇన్ని చిత్ర హింసలు పెట్టినా తల్లి మీద అభిమానం తో భరించారు. ఆమె నా పిల్లాడిని ఏమి అనొద్దు అని ఇంట్లో అందరికి చెప్పేది.


                ఒకరోజు శ్రీ స్వామివారిని పొలం వెళ్లి, తోటలో నీరు పెట్టమన్నారు. వెళ్లి తోటలో ఉన్న మొక్కలకు నీళ్లు పెట్టకుండా ఏ పంట లేని పొలములో పెట్టాడు అక్కడ పారతో ఏదో కట్టలు వేస్తున్నారు. బావిలో నుండి ఇంజిన్ ద్వారా వచ్చే నీరు అంతా వృధా చేస్తున్నాడని వాళ్ళ సోదరుడు చూసి వాళ్ళ నాన్నతో చెప్పాడు. ఆయన కోపంగా కొట్టడానికి సిద్ధ పడి ఆవేశంగా వచ్చి తోటలోకి వెళ్లి చూసాడు. తోటలో మొక్కల పాదుల నిండా నీళ్లు ఉన్నాయి. ఏమిటి ఈ చిత్రం అని ఆశ్చర్య పోయాడు. అతని దగ్గర ఏదో శక్తి ఉందని అప్పటి నుండి ఇంట్లో వాళ్లు ఎవరూ ఏమి అనలేదు .


            తరువాత పెళ్లి ప్రయత్నం చేయాలని అందరూ బంధువులు సమావేశం అయ్యారు. శ్రీ స్వామివారు ఆ రోజు ఎటు వెళ్ళారో కనపడలేదు. అందరూ వెళ్లిన తరువాత వచ్చి తల్లితో నాకు పెళ్లి వద్దు అని చెప్పారు, ఆమె ఎంతో నచ్చచెప్పింది కానీ ఆ విషయంలో స్వామి అంగీకరించలేదు. తరువాత ఇంటికి వచ్చి పనిచేసే చాకలి వాళ్ళ బుట్ట లో అన్నం పెట్టగానే వాళ్ళు తాకక ముందే స్వామి వచ్చి చేయి పెట్టి తీసుకుని తింటున్నారని అలాగే హరిజనుల దగ్గర తింటున్నారని ఊరంతా పిర్యాదు చేసారు. అప్పట్లోకుల పట్టింపులు ఎక్కువగా ఉన్న రోజులవి. అందరూ వెంకయ్యకి పిచ్చి ఎక్కింది అని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది.


       ఒక రోజు ఇంట్లో పెట్టి తలుపు వేసింది. బిడ్డను చూసి ఆకలితో ఉన్నాడని అర్థం అయింది అన్నం పెట్టింది శ్రీ స్వామివారు తింటున్నారు. ఏమైంది రా నీకు అని యశోద చిన్ని కృషుడికి చెప్పినట్లుగా ఇలా చెప్పింది. నువ్వూ ఎన్నో పూజలు చేసుకున్న తర్వాత పుట్టావు ఆ వెంకటేశ్వర స్వామివారి దయ వలన, నా కడుపున జన్మించావు. నువ్వు ఆ స్వామి వారి అనుగ్రహతో పుట్టావని వెంకటపతి అని పేరు పెట్టుకున్నాము ప్రేమగా వెంకయ్యా అని పిలుచుకుంటున్నాము. శ్రీ స్వామివారికి ఎప్పుడూ ఎంగిలి అన్నం పెట్ట కూడదు నీకు అందుకే ఎవరికి పెట్టక ముందు అన్నం తీసి పెడుతున్నాను. నువ్వు ఎప్పుడూ ఇలాగే తినాలి. తినేదాన్ని శ్రీ స్వామివారి ప్రసాదంగా భావించి తినాలి, తినే ముందు మన ప్రక్కనున్న జీవ రాశులకు పెట్టి తినాలి ఎక్కడైన తినేటప్పుడు ఎవరూ చూడకుండా తినాలి ఒక్కసారే పెట్టించుకోవాలి, పదే పదే పెట్టించుకుని వాళ్ళకు కష్టం కలిగించకూడదు అని చెప్పింది. అలాగే అమ్మా అని మాట ఇచ్చారు.


             శ్రీ స్వామివారు అప్పటి నుండి ఎక్కడ బిక్ష చేసినా పక్షులకు మూగజీవాలకు పెట్టి తాను తీసుకుంటారు. బహిరంగంగా చేసేవారు కాదు. ఒకేసారి అన్నీ పదార్థాలు తాటి ఆకుతో చేసిన రేక లో పెట్ట మనే వారు స్వల్ప ప్రమాణంలో మాత్రమే స్వీకరించే వారు. ఆరోజు అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తల్లి గౌరవం నిలపెట్టే విధంగా ప్రతీ స్త్రీ మూర్తిని అమ్మా అని ఆప్యాయంగా పిలిచే వారు.


       అవతార పురుషులై ఆమె కడుపున జన్మించినా కూడా ఆమెను తన మాతృ మూర్తిగా గౌరవించి ఆమెకి భోజనం విషయంలో ఇచ్చిన మాటని జీవితాంతం నియమంగా పాటించారు. అమ్మ అనే పిలుపుకి భగవంతుడు కూడా బంది కావాల్సిందే...!


🔥ఓం నారాయణ           ఆదినారాయణ🔥


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 23*

                 *సర్వసమర్ధుడు*

                               శ్రీ రఘురామ్ రాజ్


నాకు ఒకే ఒక చెల్లెలు వున్నది. ఆమె మ్యారేజ్ కోసం ప్రయత్నాలు చేస్తూవుంటే ఎక్కడా కుదరలేదు. మా తల్లి దండ్రులు విసిగిపోయారు. అప్పుడు మాస్టార్ గారికి చెప్పుకుంటే “ఆమె పేరు ఏమిటి? " అని అడిగారు.   “పార్వతి”అన్నాను. క్షణకాలం కళ్ళుమూసుకున్నారు. లాస్ట్ కి "జరుగుతుందిలే” అన్నారు. తర్వాత ఆమెకు మారేజ్ అయిపోయినది. ఈయన స్టూడెంట్స్ ని ఎప్పుడూ తిట్టడం గాని, అరవటం గాని చేసేవారు కాదు. లెసన్ మధ్యమధ్యలో జోక్స్ వేసేవారు. కాబట్టి ఆయన ఎంత సేపు చెప్పినప్పటికి కూడా క్లాస్ విసుగనిపించేది కాదు. ఇంకా చెప్తే బాగుండు అని అన్పించేది. పిల్లలు క్లాస్ లో వెనుక బెంచీలో కూర్చుని నవ్వుతూ అల్లరి చేస్తూంటే "ఆ చేసేదేదో పెద్దగా చెప్పి చెయ్యండి మేము కూడా మీతో పాటు నవ్వుతాము” అని అనేవారు కానీ తిట్టేవారు కాదు. కానీ జనరల్ గా ధైవం అంటే ఆసక్తి లేని వారు కూడా ఆయన క్లాస్ అంటే మాత్రం లైక్ చేసేవారు. ఇప్పుడు వివేకానందుడు, గాంధీ మహాత్ముడు స్పీచ్ ఇస్తుంటే మంత్ర ముగ్ధులై విన్నట్లు వినేవారని చెప్తూంటారు చూడండి, ఆ టైప్ వుండేది ఆయన క్లాస్. ఆయన గొంతులో ఒక రకమైన ప్రత్యేకత వుండి స్టూడెంట్స్ ని ఎట్రాక్ట్ చేసేది. ఆయన దేవుడు గురించి, బాబా గురించి క్లాస్ లో చెప్పేవారు కాదు.


                        🙏జై సాయిమాస్టర్🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*రోజుకు ఒక్క నామాన్ని భావయుక్తంగా చదువుకుందాము*


*ఓం సర్వస్మై నమః*


*సర్వము తాను అయిన శ్రీ సాయినాథునికి నమస్కారము*


 వివరములకు పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్  విరచిత "సాయినాథ పూజ" అను  గ్రంథమును పరిశీలించ గలరు.

online లో చూచుటకు.. www.saibharadwaja.org పరిశీలించగలరు.

*ఓం సాయి రాం......జై సాయి మాస్టర్*

పేజీ నెంబర్ : 48


🌹🌹🌹🌹🌹🌹🌹🌹