శ్లోకం:☝️
*ఆయుః కర్మ చ విత్తం చ*
*విద్యా నిధనమేవ చ |*
*పంచైతాన్యపి సృజ్యంతే*
*గర్భస్థస్యైవ దేహినః ||*
భావం: "మనిషియెక్క ఆయుర్దాయం, జీవించటానికి చేయు వృత్తి, ధనం, విద్య, చావు అనే నిర్దిష్టములైన ఐదూ తల్లి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడి ఉంటాయి." - అని భావం.
అయితే పెద్దల ఆశీర్వచనాల వల్ల, దైవానుగ్రహం వలన, పురుష ప్రయత్నంతోను ఏమీ ఉపయోగం లేదా? అంటే ? "ఉన్నది."అని పురాణేతిహాసాలు చెబుతున్నాయి.
మార్కండేయుడు, శంకర భగవత్పాదులు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకున్నారు. హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా వరమందారు. యుద్ధంలో చనిపోయిన వానర వీరులను హనుమంతుడు సంజీవనితో బ్రతికించినట్లు, చనిపోయిన సాందీపముని యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు విన్నాం కదా!