25, అక్టోబర్ 2020, ఆదివారం

ఆర్.ఎస్.ఎస్.ను ఎందుకు పెట్టారట

 ఇంతకీ ఆర్.ఎస్.ఎస్.ను ఎందుకు పెట్టారట?(95సం.ల క్రితం దసరానాడు)


1921లో దేశంలో సహాయనిరాకరణోద్యమం జరుగుతూ ఉండగా నాగపూర్ పరిసరాలలోని గ్రామ గ్రామానికీ వెళ్లి దేశంపట్ల తమకర్తవ్యమేమిటో వివరించి, రాజద్రోహ నేరానికి విచారింపబడి ఒక ఏడాదిపాటు జైలుశిక్ష ననుభవించిన వాడాయన. అయితే జైలుశిక్ష ననుభవించటంతో తన జీవితం తరించి పోయిందనే భ్రమ ఆయనలో లేదు. "చాలాసార్లు మనుష్యులు సాధనాలను ప్రేమిస్తూ, సాధించవలసిన లక్ష్యాన్ని మరిచిపోవటం జరుగు తుంటుంది. మనం అటువంటి పొరబాటు చేయరాదు." అని తన తోటివారిని హెచ్చరించి- "మనం పట్టుదలతో మనపనిని చేస్తూఉంటే, విదేశీపాలకులు తప్పక మనదేశాన్ని వదలిపెట్టి పోతారు" అని విశ్వాసం ప్రకటించిన వాడాయన.


 జైలులో ఉన్నరోజుల్లో -మనదేశం పెద్దది. మనప్రజలు శూరులు, ప్రజ్ఞావంతులు, మనది అత్యంత శ్రేష్ఠమైన ధర్మం, మనది గౌరవప్రదమైన, అత్యంత ప్రాచీనమైన చరిత్ర. అయినప్పటికీ వందల సంవత్సరాలుగా మనం పరాధీనులుగా ఎందుకు ఉన్నాం? - అనే మౌలికమైన ప్రశ్న గురించి లోతుగా ఆలోచించి, మన దుర్దశకు మనమే కారణం, మనలోని అలసత్వం, స్వార్థ ప్రవృత్తీ మన పరాజయానికి కారణం. మన లోని అంతర్గత కలహాలవల్లనే మనం పరాధీనుల మైనాం అన్న విషయమై నిష్కర్షకు రావటమేగాక, ఏ గుణగణాలను మనదేశప్రజలలో నిర్మించవలసి యున్నదో, దానికై ఎటువంటి కార్యప్రణాళికను రూపొందించవలసియున్నదో క్షుణ్ణంగా ఆలోచించి, అమలుపెట్టినవా డాయన. ఆయన పేరు డా౹౹కేశవ రావ్ బలిరామ్ హెడ్గేవార్. డాక్టర్జీ అని ఆయనను అందరూ పిలిచేవారు.


  ఆయన పూర్వీకులు నేటి తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో ఉన్న కందకుర్తి గ్రామానికి చెందినవారు. నిజాం నవాబులపాలనలోని ఇబ్బందులను తట్టుకోలేక నరహరిశాస్త్రి హెడ్గే 1800తర్వాత నాగపూర్ తరలివెళ్లాడు. ఆయనకు మూడవతరం లోని వాడైన కేశవరావ్ 1889 ఉగాదినాడు(ఏప్రియల్ 1న) జన్మించాడు....


విదర్భ ప్రాంతంలోని జాతీయవాదుల సహకారంతో వైద్యవిద్యను అభ్యసించేందుకు కొలకత్తా చేరుకొని, వైద్యవిద్య నభ్యసిస్తూనే అనుశీలన సమితి అనే రహస్య విప్లవ సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు. 1913లో దామోదర్ నదికి భయంకర మైన వఱదలు వచ్చినపుడు రామకృష్ణ మిషన్ మాధ్యమంగా వఱదబాధితుల సేవా కార్యక్రమాలలో నిమగ్నుడై పనిచేశాడు. 


వైద్యవిద్య పూర్తయిన సందర్భంలో కాలేజి ప్రిన్సిపాల్ కేశవరావును పిలిచి- "బర్మాలోని ఒక హాస్పిటల్ సూపరింటెండెంట్ నుండి ఉత్తరం వచ్చింది. అక్కడ ఖాళీగా ఉన్నస్థానానికి యోగ్యులైన వారు ఎవరైనా ఉన్నారా..అని అడిగారు. నీపేరు సిఫారసు చేస్తున్నా" నని చెప్పారు. కేశవరావు తాను ప్రభుత్వో ద్యోగం చేయదలచలేదని చెప్పి, ధన్యవాదాలు తెలియ జేశాడు. "దేశపరిస్థితి  అస్తవ్యస్తంగా ఉంది. నావంటి యువకులు వేలాదిమంది తమ సర్వస్వాన్ని అర్పించి పనిచేసినప్పుడే కొంత చక్కబడుతుంది. బంధుత్వ భావనతో, దృఢదీక్షతో పనిచేయగల త్యాగశీలురు, సేవావ్రతులు అయిన కార్యకర్తలకోసం భారతమాత పిలుస్తున్నది. ఆ మార్గంలో నేను పయనించ నిశ్చయించుకొన్నాను" అని ప్రిన్సిపాల్ గారికి వివరించి చెప్పాడు. నాగపూర్ తిరిగి వచ్చారు.


అప్పటికి మొత్తం మధ్యప్రాంతాలలో కేవలం 75 మంది వైద్యులు ఉండేవారు. డా. హెడ్గేవార్ గాని వైద్యవృత్తిలో ప్రవేశించినట్లయితే ఎంతో ఖ్యాతిని ధనాన్ని సంపాదించగల్గి ఉండేవారు. కానిఆయన బ్రహ్మచారిగా ఉండిపోయి, జాతినిఆరాధించటమనే వ్రతాన్ని స్వీకరించారు.


1920 డిసెంబర్ లో అఖిల భారత కాంగ్రెస్ మహా సభలను నాగపూర్లో నిర్వహించాలని నిర్ణయమైంది. లోకమాన్య తిలక్ అధ్యక్షతన మహాసభలు జరుగ వలసి యుండగా ఆగస్టు 1న ఆయన దివంగతు డైనాడు. అటువంటి స్థితిలో అధ్యక్ష స్థానానికి అర్హు లెవరు? అరవిందఘోష్ ను అధ్యక్షునిగా ఆహ్వానించా లన్న ప్రతిపాదనను ప్రాంతీయ కాంగ్రెసు ఆమోదించింది. డా. బాలకృష్ణ శివరాం మూంజే, డా.హెడ్గేవార్ లు ఆగస్టులో పుదుచ్చేరికి వెళ్లారు. కాని క్రియాశీలరాజకీయాలలోనికి రావడానికి అరవిందులు  నిరాకరించారు. చివరకు విజయరాఘవాచారిగారి అధ్యక్షతన సభలుజరిగాయి. 


మహాసభల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో డా. హెడ్గేవార్ చాలా శ్రమించారు.1200మంది వాలెంటీర్లను కూర్చుకొని వారికి శిక్షణ ఇచ్చారు. అంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ముప్పదివేల మందితో ఆ సభలు వ్యవస్థితంగా జరిగాయి. మహాసభల విషయనిర్ధారణ సమితి సమావేశంలో డాక్టర్జీ ఒక తీర్మానాన్ని పరిశీలన నిమిత్తం అంద జేశారు. "భారతీయగణతంత్రాన్ని స్థాపించటము, పెట్టుబడిదారీ విధానం సాగించే అత్యాచారాలనుండి దేశాలకు విముక్తి కలిగించటమూ దీని ఉద్దేశ్యం." ఈతీర్మానం విషయ నిర్ధారణ సమితిలో ఆమోదం పొందలేదు. అయితే,డా. హెడ్గేవార్ భారత జాతీయ స్వాతంత్ర్య సమరాన్ని ప్రపంచంలోని సకల పీడిత తాడిత జాతులతో, సామ్రాజ్యవాద శృంఖలాలలో బంధింపబడియున్న దేశాలతో జోడించే ప్రయత్నం చేయటమూ గమనించిన మాడరన్ రివ్యూ పత్రిక ఇలా వ్రాసింది. "But the proposed resolution, which excited laughter among serious minded people, deserved a better fate than what it met with the Subjects Committee". (గంభీరమనస్కులైన వారిమధ్య నవ్వుపుట్టించిన ఈ ముసాయిదా తీర్మానం విషయనిర్ధారణ సమితి పట్టించిన గతికంటే, మరింతశ్రద్ధగా పరిశీలించదగి యున్నది)


1921 లో రాజద్రోహనేరానికి విచారింపబడి జైలుకు పంపబడిన విషయం ప్రారంభంలోనే ప్రస్తావింప బడింది. ఇలా రకరకాల ఉద్యమాలలోనుండి, అనుభవాలలో నుండి, అధ్యయనాలలోనుండి సాగిన తన పయనంలో, నిరంతరంగా సాగిన మేధోమథనం లోనుండి 1925  విజయదశమినాడు ఆయన రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించారు. 


డా. హెడ్గేవార్ జీవితంపై పరిశోధాత్మక గ్రంథాన్ని రచించిన డా౹౹రాకేశ్ సిన్హా ఇలా వ్రాశారు. "గణవేషమూ (యూనిఫామ్), పెరేడు, ఆటపాటలు, వివిధశారీరిక కార్యక్రమాలరూపంలో కనబడే అర్ధసైనిక సంఘటన, లేదా హిందూ సంరక్షకదళమూ కాకుండా సంఘం ఒక వైచారిక (ఆలోచనలకు, సంస్కరణలకూ ప్రాధాన్యమిచ్చే) ఉద్యమం. దాని లక్ష్యం సంపూర్ణ రాష్ట్రాన్ని(జాతిని) ఉద్దేశాలను గ్రహించుకొన్నదిగా రూపొందించటంకోసం సంఘటిత పరచటం. ఆయన సంఘకార్యాన్ని రాజ్యాధి కారానికో, అధికసంఖ్యాకవాదానికో, హిందువుల సంఖ్యాధిక్యతకో లేదా రాష్ట్రానికి ఉండే ఒక పార్శ్వానికో పరిమితంచేయలేదు. సంపూర్ణ రాష్ట్రాన్ని, సంపూర్ణ సమాజాన్ని, రాష్ట్రంయొక్క సర్వాంగీణ వికాసాన్ని -వీటినే ఆయన తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు. ఆయన సంఘానికి హిందూరాష్ట్రంతో ఏకరూపత, తాదాత్మ్యత అనే ఆదర్శాన్ని లక్ష్యంగా నిర్ధారించారు. అంతేగాక సంఘటన ఆదర్శాలను భూత, వర్తమాన , భవిష్యత్తుల యాత్రతో అనుసంధానం చేశారు. ఏదో ఒక ప్రయోజనం సాధించిన ఆనందంతోనో, ఒక లక్ష్యాన్ని సాధించుకున్ప తృప్తితోనో సంఘం యొక్క సంఘటనాకార్యంలో విరామం రాకూడదని ఆయన ఆలోచన. సంఘటన యాత్ర సమాజజీవితంతో, రాష్ట్ర జీవితంతో ఏకరూపమైపోవాలనీ, ఆకాంక్షించ టమే గాక జీవితానికి ఏకైక కార్యంగా కార్యకర్తలు మలుచుకోవాలని నొక్కిచెప్పారు.సంఘానికి అవసరమయ్యే నిధులను విరాళాల రూపంలో బయటివారినుండి సేకరించుకోవటంకాక, స్వయంసేవకులు ఏటేటా 'గురుదక్షిణ' సమర్పించే విధానాన్ని ప్రవేశపెట్టారు."


డా.హెడ్గేవార్ జీవనదృక్పథాన్ని స్పష్టంచేసిన ఒక సందర్భాన్ని తప్పక స్మరించుకోవాలి. ఒకసారి ఆయన ఒక తైలవర్ణ చిత్రపటాన్ని, దానిక్రింద "టీచ్ అజ్ హౌ టు డై" (ఎలా మరణించాలో మాకు నేర్పు) అనివ్రాసి ఉండటమూ గమనించారు. ఆయన ఆ వాక్యాన్ని  మార్చి "టీచ్ అజ్ హౌ టు లివ్" (జీవించవలసిన తీరును మాకు బోధించు) అని వ్రాశారు. 1940లో డా. హెడ్గేవార్ దివంగతులైనారు. కాని ఆర్. ఎస్.ఎస్. దినదిన ప్రవర్ధమానమౌతూ ఈ దేశపు పరమ వైభవాన్ని సాధించే దిశలో అడుగులు ముందుకు వేస్తూనే ఉంది.


('ప్రజ్ఞానిధులు, త్యాగధనులూనైన మనదేశభక్తులు' గ్రంథం నుండి)

జ్ఞాన మార్గం- భక్తి మార్గం.

 జ్ఞాన మార్గం- భక్తి మార్గం. 

ముముక్షువులారా మనలో చాలా మందికి తరచుగా జ్ఞాన మార్గం- భక్తి మార్గం. రెంటిలో ఏది ఉత్తమమైనది అనే సందేహం కలగటం కద్దు. నేను నా గురుదేవులనుండి పొందిన జ్ఞానంతో ఈ విషయాన్ని వివరించటానికి ప్రయత్నిస్తాను. 

ముందుగా ఈ రెండు మార్గాలు ఏమిటి అనేది తెలుసుకుందాము. 

1) భక్తి మార్గం. 

ఒక భక్తుడు నిరంతరం ఒక దేవి, లేక దేముడిని పూర్తిగా త్రికరణ శుద్ధిగా (మనో, వాక్కాయ, కర్మేనా. ) నమ్మి నిత్యం పూజాదికములు నిర్వహిస్తూ సర్వావస్థలాల్లో తన దేముడిపైన నిష్కల్మషమైన భక్తి కలిగి మనస్సు పూర్తిగా ఆ దేమునిపైనే లగ్నం చేసి ప్రార్ధించడం తో ఆ దేముడు తనకు ముక్తి ప్రసాదిస్తాడని ఆ దేముడికి పూర్తిగా కల్మష రహితంగా, అనుమాన రహితంగా స్వాధీనం కావటం. ఇది భక్తి మార్గం. ఇక్కడ మనం ఒక వేదాంత సూత్రమును చూద్దాము అది "ఎత్ భావం తత్ భవతి" ఈ సూత్రము ప్రకారము ఒక మానవుడు సంపూర్ణంగా ఏ దేముడిని నమ్మి తన భక్తిని ప్రకటిస్తాడో ఆ భగవంతుడు ఆ రూపంలో ఆ భక్తుని అనుగ్రహిస్తాడు. ఇందులో సందేహంలేదు. 

నవ విధ భక్తులలో  భక్తుడు తన భగవంతుడిని ఏ రకంగా భావించిన సరే భక్తుడు భగవంతుడిని చేరుకుంటాడు అందులో సందేహం లేదు. అటువంటప్పుడు  మరి అందరు భక్తి మార్గాన్నే ఎంచుకోవచ్చుగా మరి జ్ఞాన మార్గ ఆవశ్యకత ఎందుకు అనే సందేహం కలుగుతుంది.  కానీ ఈ సందేహం బహు కొద్దీ మందికి మాత్రమే కలుగుతుంది. ఎందుకంటె చాలా మంది భక్తి మార్గమే సుగమమైనది అని భావించి ఈ మార్గంలోనే తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తారు. భక్తికి మూలం నమ్మకం అది తాను నమ్మిన దేముడు తనను ఉద్ధరిస్తాడనే నమ్మకం. అది ఉంటే చాలు మోక్షము పొందటానికి. కానీ జ్ఞాన మార్గం బహు క్లిష్టమైనది. 

2) ఇక జ్ఞాన మార్గం. 

జ్ఞాన మార్గం భక్తి మార్గం అంత సులువైనది కాదు.  ఇది కఠినాతి కఠినమైనది. ఎందుకంటె ఈ మార్గంలో సాధకుడు భగవంతుని స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకొని సాధన చేస్తాడు. 

భగవంతుని స్వరూపం తెలుసుకోటం ఎలా. భగవంతుడు అంటేనే నామ రూప, గుణ ( లక్షణం) లేని వాడు అంతే కాకుండా దేశంలో, కాలంలో లేనివాడు. అతనితోనే కాలం వున్నది. దీని గురించి కొంత వివరంగా తెలుసుకుందాము. 

మనం ఈ సృష్టిలో ప్రతిదీ ఏదో ఒక పేరుతొ తెలుసుకుంటున్నాము. అది ఎరకమైన పేరైన కావచ్చు. అంతేకాకుండా ఒక నిర్దుష్ట రూపం చూస్తూవున్నాము. ఒక నిర్దుష్ట రూపానికి ఒక నిర్దుష్ట పేరు తో పిలుస్తున్నాము. ఉదా: ఒక గ్లాసు, ఒక చెంబు, ఒక కంచం ఇలా ఒక నిర్దుష్ట ఆకారం కలిగి ఒకే రకమైన పదార్ధంతో ( లోహంతో) చేసిన వాటి రూపాయలని బట్టి పేర్లను నిర్దేశిస్తున్నాము. ఇలా పిలిచే పేరు చెపితే నీవు ఆ నిర్దుష్ట వస్తువుని గుర్తు పట్టగలవు. అంటే రూపం వున్న ప్రతిదానికి నామము (పేరు)ఉన్నదన్న  మాట. ఇక గుణం. ప్రతి వస్తువుకి ఒక ప్రేత్యేక గుణం అంటే లక్షణం ఉంటుంది. ఉదా : స్టీలు దానికి తెలుపు అనే లక్షణం ఇత్తడి దానికి పసుపు అనే లక్షణం, రాగి దానికి ఎరుపు అనే లక్షణం కలిగి ఉంటుందని మనకు జ్యోతకం అవుతున్నది. ఇది స్టీలు గ్లాసు, ఇది ఇత్తడి గ్లాసు, ఇది రాగి గ్లాసు అని మనం అంటు న్నాము. ఈ మూడు విషయాలు మనం మనుషులకు, జంతువులకు కూడా చూస్తున్నాము. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ఈ జగత్తులో వున్నా ప్రతి దానికి అంటే జీవికి, నిర్జీవికి సంబంధించి ఈ మూడు విషయాలతో గుర్తించవచ్చు. 

ఇక కాలము. నిజానికి ఇది ఒక విచిత్రమైన రాసి ఎందుకంటె దీనిని మనం పంచేద్రియాలతో గుర్తించలేము కానీ ఇది వున్నదని మనమందరం నమ్ముతాము దానికి ప్రమాణం మన నమ్మకమే. ఉదా : మనం తరచుగా అంటూవుంటాము నిన్న నేను ఈ చెట్టుకు ఒక పువ్వు చూసాను అంటావు. నేను ఏది నాకు చూపించు అంటే నీవు నిన్న చూసిన పువ్వు నీవు చూసిన కొమ్మకు లేదు. మరి ఏమైనట్లు అంటే ఆ పువ్వు ఈ రోజు పరిణతి చెంది చిన్న కాయగా మారింది అందుకే నిన్న చూసిన పువ్వు ఇప్పుడు లేదు. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే ప్రతిదీ కాలంలో మార్పు చెందుతున్నది. అంటే స్థిరంగా ఇక్కడ ఏమిలేదు. 

ఇప్పుడు దేశం అంటే ఏమిటో తెలుసుకుందాం. నీవు నాతొ అన్నావు అన్నా నిన్న నీకు పుస్తకము ఇచ్చాను అని అప్పుడు నేను అడిగాను ఎక్కడ ఇచ్చావు అని అన్నాను. నీవు అదే అన్నా నీయింటిముందర గేటుదగ్గర అదే అన్నా నను కాలింగబేల్ నొక్కితే నీవు వెంటనే గేటుదగ్గరికి వచ్చావు గుర్తుచేసుకో అంటావు. ఈ సంభాషణ వాళ్ళ మనకు నిన్న అనే కాలము గేటుదగ్గర అనే ప్రదేశం తెలుస్తున్నాయి అంటే ప్రతి చర్యా ఈ భూమిమీద ఒక నిర్దుష్టమైన కాలంలో నిర్దుష్టమైన దేశంలో అంటే స్థలంలో మాత్రమే జరుగుతుంది. ఇది అర్ధం చేసుకోటానికి కొంచం కష్టంగా ఉంటుంది.  నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం నీవు ఏమి చెప్పుతావో చూద్దాం. నీవు ఇప్పుడు ఎక్కడ వున్నావు.  దానికి నీవు కోఠిలో, నాంపల్లిలో, బిడ్సులో అని సమాధానం చెపుతావు. నేను నీవు చెప్పింది అబద్దం అంటే ఒప్పుకుంటావా అస్సలు ఒప్పుకోవు. నీవు చెప్పిందే నిజమని ప్రమాణం కూడా చూపిస్తావు. కానీ అది అంతా నిజం కాదు మరి నిజం ఏమిటంటే నీవు నేను భూమిమీద వేరు వేరు ప్రదేశాలలో ఉండొచ్చు కానీ మనమందరము వున్నది మాత్రం గాలిలో మాత్రమే. అదేమిటి గాలిలో ఉండేవి పక్షులు కదా మనం మనుషులం గాలిలో ఎలా ఉంటాము అనే అనుమానము నీకు వస్తుంది. కానీ ఇది నిజం మనం అంతా గాలిలో వున్నాము కాబట్టే మనం భుచేరులం అంటే భూమి మీద చేరించే జీవులం అయ్యాం. ఏక్షణం ఐతే భూమిమీద గాలి ఉండదో అప్పుడు ఒక్క జీవి కూడా బతికి ఉండదు. ఇది సత్యం. అంటే మనం చెప్పే దేశం రెండు విశేషాలు కలిగి వున్నది ఒకటి భూమి మీది ప్రదేశం రెండూప్ గాలిలోని ప్రదేశం. భూమి మీది ప్రదేశం వేరు వేరుగా ఉండవచ్చు కానీ గాలిలోని ప్రేదేశం మాత్రం అంతా ఒక్కటే. 

ఇంకా వుంది. 

ప్రవచనములు


 

దసరా















 

తెప్పోత్సవం







 

ఉత్తమ స్తవా దుచ్చ మందతః*

 *ఉత్తమ స్తవా దుచ్చ మందతః*

*చిత్తజం జప ధ్యాన ముత్తమం*


భావము :-భగవంతుని స్తోత్రములతో  బిగ్గరగా శబ్దము చేస్తూ శృతించుట కంటే మౌనముగా నిలిచి జపము చేయుట మంచిది. ఆ జపము కంటే ధ్యానము శ్రేష్టమైనది  అంటారు. ఈ విధంగా ఒక దాని కంటే  ఒకటి  శ్రేష్ఠమైనవని చెప్పారు మహర్షి. ఇక్కడ చెప్పే మౌనము వాక్ మౌనము.

మౌన ధ్యానమంటే తను సంకల్పించిన దైవము యొక్క రూపమును మాత్రము మనస్సు నందు నిలుపుట. 

మనము పూజ చేయునప్పుడు చేతితో పూజ చేయుచున్ననూ,  మనస్సు వేరే ఆలోచనలతో ఇతర రూపములను పొందుచుండును. కనుక త్రికరణ శుద్ధి లేక,  దేహము ఒక పని, మనస్సు వేరొక పని, వాక్కు వేరొక పని చేయుచుండును. మనస్సు నందు దైవమును నిలుపునపుడు వేరే ఆలోచనలు రావు. కనుక ఈ మానస ధ్యానము శ్రేష్టము

16-21-గీతా మకరందము

 16-21-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - నరకబాధనుండి తప్పించుకొను ఉపాయమును భగవానుడు సెలవిచ్చుచున్నారు -


త్రివిధం నరక స్యేదం 

ద్వారం నాశనమాత్మనః | 

కామః క్రోధస్తథా లోభః

తస్మా దేతత్రయం త్యజేత్ || 


తాత్పర్యము :- కామము, క్రోధము, లోభము అను ఈమూడును మూడువిధములగు నరకద్వారములు. తనకు (జీవునకు) నాశము గలుగజేయును - కాబట్టి ఈమూడిటిని విడనాడవలెను. (లేక, కామము, క్రోధము, లోభము అను మూడువిధములగు ఈ అసురసంపద నరకమునకు ద్వారములు - అనియు చెప్పవచ్చును).


వ్యాఖ్య:- నరకప్రాప్తికి హేతుభూతమైన దుష్టత్రయము ఈశ్లోకమున తెలియజేయబడినది. ఆ మూడును (కామాదులు) నరకమునకు ద్వారములవంటివేయని చెప్పబడినది. అనగా అవి కలవారికి నరకద్వారము తెఱవబడినట్లేయని అర్థము. ఆ మూడు దుర్గుణములు లేనివారికి ఆ ద్వారములు మూయబడియుండుట వలన, ఇక వారికి నరక ప్రవేశము లేనేలేదని యర్థము. ఇంతదనుక భగవానుడు అనేక అసుర గుణములు చెప్పుచువచ్చెను. అట్టి దుర్గుణములు కలవారు క్రింది క్రింది లోకములకు, నీచనీచజన్మలకు జనుచు నానాదుఃఖపరంపరలను అనుభవించుచుందురనియు తెలిపెను. అయితే ఇక వారిగతి అంతియేనా? వారుద్ధరింపబడుటకిక అవకాశములు లేవా? అని ప్రశ్నించిన, కలవని గీతాచార్యులు చెప్పుచున్నారు. అసురగుణములన్నిటిని మూడుగ విభజించవచ్చును. అవియే (1) కామము (2) క్రోధము (3) లోభము. కాబట్టి ఎవడీ మూడింటిని ప్రయత్నపూర్వకముగ త్యజించివేయునో అతడు నరకముయొక్క బెడదనుండి తప్పించుకొని ఊర్ధ్వగతిని బడయగలడు. ఈసత్యమింకను రాబోవు శ్లోకమున చక్కగ విశదీకరింపబడగలదు. కాబట్టి ఇక పాపాత్ములెవరును తమ యధఃపతనమునుగూర్చి దిగులుపడక, తామెచ్చోటనున్నారో అచటినుండియే భగవానుడు తెలిపిన ఈ కామక్రోధలోభ త్యాగరూపప్రయత్న మాచరించుచు నుండినచో అచిరకాలములోనే వారు నరకవిముక్తులై, దుఃఖవర్జితులై పరమ శ్రేయము నొందగలరు. కావున ప్రతివారును వారివారి హృదయములను చక్కగ పరిశోధించుకొని ఈ కామ, క్రోధ, లోభములను ముగ్గురుదొంగలను కనిపెట్టి వివేకాదుల సహాయమున వారిని దూరముగ తరుమగొట్టవలెను.

ఈశ్లోకమున “త్రివిధమ్" అను పదమును ‘నరకమ్' అనుదానికిగాక, "ఇదమ్” అను పదమునకు విశేషణముగ జెప్పి, (కామ, క్రోధ, లోభములను) మూడువిధములుగనున్న ఆసురీసంపద 'నరకద్వారము’ అనియు అర్థ ము చెప్పవచ్చును.


ప్రశ్న:- నరకమున కెన్ని ద్వారములు? అవియేవి?

ఉత్త6: - మూడు. అవి క్రమముగ (1) కామము (2) క్రోధము (3) లోభము అనునవి.

ప్రశ్న:- ఆ కామాదులవలన జీవునకు కలుగు హాని యేమి?

ఉత్తరము:- అవి యాతనిని నశింపజేయును. (ఆతని వినాశనమునకవి హేతువులైయున్నవి).

ప్రశ్న:- కాబట్టి శ్రేయము నభిలషించువాడేమి చేయవలెను?

ఉత్తరము:- ఆ మూడు దుర్గుణములను త్యజించివేయవలెను.

ప్రశ్న:- ఆసురీసంపదకు సంబంధించిన అనేక దుర్గుణములను భగవానుడు తెలిపెనుగదా! వానినన్నింటిని సంక్షేపించి మూడుగ జెప్పుము?

ఉత్తరము:- (1) కామము (2) క్రోధము (3) లోభము.

అరణ్యపర్వము – 6

 అరణ్యపర్వము – 6

ఊర్వశి శాపం

అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళాడు. ఇంద్రలోకంలో సూర్య చంద్రులు లేకనే స్వయంప్రకాశంతో వెలిగి పోతున్న అమరావతి నగరాన్ని చూసాడు అర్జునుడు. పురద్వారం వద్ద ఐరావతం అర్జునుడికి స్వాగతం చెప్పింది. అర్జునుడు దేవేంద్రునికి నమస్కరించాడు.

అర్జునుడికి ఆనందం కలిగించడానికి దేవేంద్రుడు ఊర్వశిని నియమించాడు. ఊర్వశి అర్జునుడి ముందు నాట్యం చేసింది. అర్జునుడు ఆమెకు నమస్కరించి ” అమ్మా! నా మీద పుత్ర ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా? ” అంటూ మాతృభావంతో ఊర్వశికి నమస్కరించాడు. ” అర్జునా ! నేను నీ పొందు కోసం వచ్చాను. ఇది దేవలోకం నేను దేవ వేశ్యని. మాకు వావివరసలు ఉండవు. నీకు నేను ఏవిధంగా తల్లిని అయ్యాను ” అన్నది. ” మా వంశకర్త పురూరవుని భార్యవు నీవు. నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచర్యలు చేస్తుంటావు కనుక నీవు నాకు మాతృ సమానురాలివి. స్వేచ్చా శృంగారం దోషం, పాపం ” అన్నాడు. ఊర్వశి కోపించి ” కోరి వచ్చిన నా కోరిక తీర్చనందుకు భూలోకంలో నపుంసకుడివై ఆడవాళ్ళ మధ్య సంచరించు ” అని శపించి వెళ్ళి పోయింది.

ఇది తెలిసిన ఇంద్రుడు అర్జునుడుతో ” అర్జునా! నీ వంటి ధైర్యవంతుని నేను ఇదివరకు చూడలేదు. నీవు ధర్మబుద్ధివి, జితేంద్రుడివి. బాధపడకు ఊర్వశి శాపం అనుభవించక తప్పదు. కాని అది నీ అజ్ఞాతవాస సమయంలో ఉపయోగపడుతుంది. ఎవ్వరికీ తెలియకుండా నపుంసక రూపంలో ఉంవడచ్చు. నీ అజ్నాతవాసం ముగియగానే నీ శాపం తొలగి పోతుంది ” అని ఊరడించాడు. తరువాత అర్జునుడికి ఇంద్రుడు ఎన్నో దివ్యాస్త్రాలను ఇచ్చాడు. అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో ఐదు సంవత్సరాలు గడిచాయి.

ఒకనాడు రోమశుడు అనే మహర్షి దేవేంద్రుని వద్దకు వచ్చి ఇంద్రుని అర్ధ సింహాసానంపై కూర్చున్న అర్జునుని చూసి ” ఎవరీతుడు ? ” అని ఇంద్రుని అడిగాడు. దానికి దేవేంద్రుడు ” మహర్షీ ! ఇతడు పూర్వజన్మలో నరుడు అనే మహర్షి. ఇప్పుడు నా అంశతో కుంతీ గర్భాన జన్మించాడు. పరమేశ్వరుడు ఇతనిని అనుగ్రహించి పాశుపతాన్ని ఇచ్చాడు. నేను కూడా ఇతనికి దివ్యాస్త్రాలెన్నో ఇచ్చాను. ఇతను నివాత కవచులను రాక్షసులను సంహరించగలడు. కాని తమరు భూలోకమునకు పోయి అర్జునుడు నా వద్ద ఉన్నాడు అని ధ్మరాజుకు చెప్పండి. ధర్మజుని తీర్ధయాత్రలు చేయమని నా తరఫున చెప్పండి. తీర్ధయాత్రల వలన అతడు పాప రహితుడు కాగలడు ” అని రోమశునితో చెప్పాడు.

భూలోకంలో ధృతరాష్ట్రునికి అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించిన విషయం వ్యాసుని వలన తెలిసి కలత చెందాడు. సంజయుని పిలిచి ” సంజయా! అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వనాన్ని దహించాడు. నాలుగు దిక్కులు జయించి ధర్మరాజుతో రాజసూయం చేయించాడు. పరమశివుని మెప్పించి పాశుపతం పొందాడు. అలాంటి అర్జునుడు ఉండగా పాండవులను జయించడం ఎలా? వారు ధర్మవర్తనులు వారిని విజయలక్ష్మి వరిస్తుంది ” అన్నాడు.

సంజయుడు ” సుయోధనుడు నిండు సభలో ద్రౌపదిని అవమానించే సమయంలో వారిని వారించకుండా ఇప్పుడు వగచి లాభం ఏమి? పాండవులు ఇప్పుడు కామ్యకవనంలో ఉన్నారు. శ్రీకృష్ణుని అనేక మంది రాజులను వెంట పెట్టుకుని కామ్యక వనానికి వెళ్ళి పాండవులను పరామర్శించాడు. సుయోధనుని జయించి ధర్మరాజుకు పట్టాభి షేకం చేస్తానని అన్నాడట. మిగిలినవారు వారించి అర్జునినికి సారధ్యం వహించమని అన్నారట. శ్రీకృష్ణుని సాయంతో అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తి అయ్యాక నీ కొడుకుతో యుద్ధం చేస్తారు. నీ కొడుకులు అర్జునిని దివ్యాస్త్రాలకు, భీముని గధాఘాతాలకు తట్టుకోగలరా? ” అన్నాడు సంజయుడు.

ధృతరాష్ట్రుడు ” నేనేం చేసేది సంజయా ! నేను ముసలి వాడిని. నాకొడుకు నా మాట వినడు. వాడు ఒక దుర్బుద్ధి. వాడికి భీష్మ, ద్రోణుల మాటలు నచ్చవు. ఆ కర్ణుని, శకుని మాటలు నచ్చుతాయి. నేనేంచేయుదును ” అని పరితపించాడు.

ధర్మరాజుకామ్యకవనంలో అర్జునిని కోసం ఎదురు చూస్తున్నాడు. భీముడు ” అన్నయ్యా! నువ్వే కదా అర్జునిని తపసుకు పంపింది. మన బతుకులన్నీ అర్జునిని మీద ఆధారపై ఉన్నాయి. మీరు వెంటనే శ్రీకృష్ణుని పంపి అర్జునిని వెంటనే తీసుకు రమ్మని చెప్పండి. నేను అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో దుర్యోధనాదులను జయించి నిన్ను కౌరవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాము. రణరంగంలో నన్ను ,అర్జునిని ఎదిరించే వారు లేరు” అన్నాడు. అందుకు ధర్మరాజు ” భీమసేనా! ఆ విషయం నాకు తెలియును కాని యుద్ధానికి ఇది సమయం కాదు. పదమూడు సంవత్సరాల తరువాత నీవు, అర్జునుడు శత్రువులను జయించండి విజయులు కండి. నిండు సభలో కౌరవులతో చేసిన ఒప్పందానికి నేను విరుద్ధంగా ప్రవర్తించను ” అన్నాడు ధర్మరాజు.

రామాయణమ్ .168

 రామాయణమ్ .168

...

సీతమ్మ ఇంకా హెచ్చరిస్తున్నది రావణాసురుడిని.

.

అధముడా ! 

ధర్మమునందే స్థిరమైన రాముని పత్నిని 

నీవిక తాకనుకూడా తాకలేవు!

.

ఓరీ రాక్షసాధమా ఈ శరీరాన్ని బంధిస్తే బంధించావు ,చంపివేయదలచుకుంటే చంపివేయి 

నా శరీరాన్నికానీ ప్రాణాన్ని కానీ రక్షించుకోవాలన్న కోరిక, ఆసక్తి నాకు ఏమాత్రమూ లేదు .

.

భూలోకములో అపకీర్తి కలిగేపని మాత్రము చేయనుగాక చేయను.

.

సీతామాత చాలా కోపంగా పరుషంగా మాట్లాడి కాసేపు ఊరకున్నది.

.

ఆవిడను భయపెట్టి అయినా సరే లొంగదీసుకోవాలనుకున్నాడు రావణుడు ,ఆవిడతో ఇలా అన్నాడు.

.

ఓ సీతా ! విను ,నీకు పన్నెండు మాసాలు మాత్రమే గడువిస్తున్నాను ఈ లోపు నా దారికి వచ్చి 

నా దరిచేరినావా సరే! 

లేని పక్షమున ఉదయపు అల్పాహారములో నీ మాంసము వండించుకొని తినగలను.

.

అని తీవ్రముగా బెదిరించి ,అక్కడ ఉన్న రాక్షస స్త్రీల తో ఏ విధముగానైనా సరే దీని గర్వాన్నిపోగొట్టండి ,సామ,దాన,దండోపాయాలు ప్రయోగించండి ,అని పలికాడు .

.

వాడు అలా అనటమే ఆలస్యం భయంకరాకారముగల స్త్రీలు సీతను చుట్టుముట్టి నిలిచారు.

.

సీతను అశోకవనమునకు తరలించి రహస్యప్రదేశములో ఉంచమని ఆజ్ఞ ఇచ్చాడు రావణుడు.

.

జనకునికొమరిత,

దశరధుని కోడలు ,

రామపత్ని ,

అతిలోకవీరుడైన లక్ష్మణుని వొదినగారు అలా నిస్సహాయంగా సుఖమును కోల్పోయి దుఃఖిస్తూ స్పృహకోల్పోయి అశోకవనమందు పడియున్నది.

.

అక్కడ రాముడు .....

.

NB.

.ప్రాణముపోతే పోయింది వెధవప్రాణము ,

కానీ విలువలు ఎంత గొప్పవి ! 

ఇదీ సీతమ్మ అంటే!

ఇదీ భారతీయ సంస్కృతి!

.

Height of a Woman' imagination in this country is SITHA AND SAVITHRI ..

.అని అంటారు స్వామి వివేకానంద !

.

వ్యక్తి సౌఖ్యమా? సమాజ హితమా? ఏది ముందు?

.

అంటే సమాజ హితానికే ప్రాముఖ్యత భారతీయ ధర్మశాస్త్రాలలో !

No room for INDIVIDUAL COMFORT .

SOCIETY IS ABOVE INDIVIDUAL.

.

ఇదీ భారతీయమ్!

.

రామాయణమ్ 169

...

మారీచుడిని సంహరించి వడివడిగా అడుగులు వేస్తూ గుండెల్లో ఏదో గుబులురేగుతుండగా పరుగెడుతూ వస్తన్నాడు రామచంద్రుడు. ఇంతలో ఎడమవైపునుండి భయంకరముగా నక్క ఊళవేసింది ! ఆ శబ్దము కర్ణకఠోరంగా ఉండి మనసులో శంకలు రేపింది !

.

సీత క్షేమమేనా? 

.

ఆ ఆలోచన వచ్చినదే తడవు ఆయన నడకలో వేగం హెచ్చింది ! లోలోపల తర్కించుకుటున్నాడు ! ఆ మారీచుడు అలా అరచినందువలన సీత భయపడి తప్పకుండా లక్ష్మణుని నా వద్దకు పంపుతుంది .

ఒంటరి దానిని సీతను రాక్షసులు భక్షించి ఉండలేదు కదా !

.

 మరల సీతను చూడగలనా ?.

.

ఈ ఆలోచన ఆయన మనస్సులో అంతులేని ఆందోళనకు కారణమయ్యింది .ఇంతలో మృగపక్షిసంఘాలన్నీ దీనంగా తనవైపే చూస్తూ కనపడ్డాయి !

.

సీత క్షేమమేనా?

.

అల్లంత దూరంలో తమ్ముడు లక్ష్మణుడు తనకెదురుగా వస్తూ కనపడ్డాడు.

.

సీత క్షేమమేనా ? ప్రశ్నించసాగింది రామయ్య మనస్సు!

.

లక్ష్మణుడు తనను సమీపించగనే ఆయన కుడిచేయి తనచేతిలోకి తీసుకొని,సీతను విడిచి వచ్చినావు నీవు ,ఎంత చెడ్డ పని చేసినావని పలికి ,అంతా సవ్యముగానే ఉంటుందికదా ? అని అనుమానం వ్యక్తంచేశాడు.

.

లేదు ,నాకు అశుభశకునాలు కనపడుతున్నాయి సీతక్షేమముగా ఉండి ఉండదు ,నశించిపోయి ఉంటుంది, నాకేమీ సందేహములేదు !

.

రాక్షసులు పన్నిన పన్నాగమిది .

.

సీత మరణించిఅయినా ఉండవలే

అపహరింపబడిఅయినా ఉండవలె!

ఆదిత్యుడు

 దశిక రాము**


**అందరికీ దసరా శుభాకాంక్షలు**

ఆదిత్యుడు

పద్మహస్తః పరం జ్యోతిః పరేెశాయ నమో నమః । 
అండయోనిర్మహసాక్షి ఆదిత్యాయ నమో నమః ।। 

సూర్య గ్రహం
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ । 
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ।। 

ఆదిత్యుడు, సూర్య గ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రాదులకు శుభం చేకూర్చుగాక.

   **శుభోదయం**
🙏🙏🙏 

సంపూర్ణ క్రియాశీలత్వం

 సృష్టి అవసరాలు తీర్చడం వల్లా.., సంపూర్ణ క్రియాశీలత్వం వల్ల ఈశ్వరున్ని సంపద అనెడి ఐశ్వర్యం సేవిస్తూ ఉంటుంది.


5) జ్ఞానంఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వం - సర్వశక్తిమత్వమే సర్వజ్ఞత్వానికి కారణమౌతుంది.తత్వశాస్త్ర దృష్ట్యా జ్ఞానం అనేది పొందబడేది ... కోల్పోయేది కాదు. అది ఎప్పుడూ ఉండేది. అది ఆత్మ స్వరూపంగా ఉంటుంది.దాన్ని మనకున్న ఏకాగ్రతను బట్టి కొంచెం కొంచెంగా అనుభవంలోకి తెచ్చుకుంటాము.ఒక వ్యక్తిలో ఉన్న ఏకాగ్రత శక్తిపైన అతని జ్ఞానం ఆధారపడి ఉంటుంది.ఏ విషయంలో ఏకాగ్రత చూపుతాడో ఆ విషయ సంబంధ జ్ఞానం లభిస్తుంది.ఏకాగ్రత సంపూర్ణ స్థాయికి చేరినపుడు సంపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అలాంటి వ్యక్తులను ఆత్మజ్ఞానులు అంటాము. వారి వ్యక్తిగత చైతన్యం విశ్వ స్థాయికి ఎదగడం వల్ల వారికి కూడా సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది.ఈ విశ్వంలోని సమస్త నియమాలను సృష్టించి ఒక నియతిని ఏర్పాటు చేయడం వల్ల ఈశ్వరునికి నియంత అనే మరో పేరుంది.ఆ నియమాలపై ఏకాగ్రత నిలిపి పరిశోధించడాన్నే మనం శాస్త్ర విజ్ఞానం అంటున్నాము.ఇలా సర్వవ్యాపకుడు - విశ్వరూపుడు - నియంత అయిన ఆ పరమాత్మను జ్ఞానం అనెడి ఐశ్వర్యం సదా సేవిస్తూనే ఉంటుంది.


6) వైరాగ్యంసంతృప్తితో కూడిన త్యాగమే వైరాగ్యం.ఈశ్వరునికి నిరంజనుడని పేరు.అంటే దేనికీ అంటకుండా కేవల సాక్షి మాత్రంగా ఉండే వైరాగ్య సంపన్నుడని అర్థం.వైరాగ్యం అనేది సమృద్ధిని దాటిన స్థితి.హిమాలయాల్లో "పరుసవేది " అనే మూలిక ఉంటుందట. ఆ వేరుతో ఏ లోహాన్ని ముట్టినా ఆ లోహం బంగారంగా మారుతుందట. అలాంటి పరుసవేది ని కలిగి ఉన్న వ్యక్తి గుట్టలు గుట్టలుగా బంగారాన్ని ప్రోగుచేస్తాడా?ఆ వేరును మాత్రం దగ్గరుంచుకుని అవసరమున్నంత వరకే వాడుకుంటాడు. అతనికి ధనాన్ని సంపాదించాలనే కోరిక - ఆశ వంటివి ఏమీ ఉండవు.అంటే ధన విషయంలో వైరాగ్యం లభించినదన్న మాట!అసంతృప్తితో - అశక్తతతో వచ్చేది వైరాగ్యం కాదు. అది లేమితనం - బలహీనత.ఒక నపుంసకుడు సన్యాసిగా మారితే అది వైరాగ్యం కాదు.ఒక నిజమైన పురుషుడు సన్యాసిగా మారితేనే అది నిజమైన వైరాగ్యం.మన దేశంలో చాలా మంది మిథ్యా వైరాగ్య సంపన్నులు ఉంటారు. నాకు ధనం మీద ఆశ లేదు అంటుంటారు. మళ్లి కష్టపడకుండా - తేరగా ధనం వస్తే సంతోషిస్తారు. ఒక కోటి రూపాయలు కష్టపడి సంపాదించి దానిపై బంధం లేకుండా సంతృప్తితో దానం చేయగలిగితే అది వైరాగ్యం అవుతుంది.వైరాగ్యం అనేది తేలికగా వచ్చే ఐశ్వర్యం కాదు. అది ఇంతకు ముందు చెప్పినట్లు సమృద్ధిని దాటిపోయిన స్థితి.ఎవరో కొందరు వివేకానందుడు లాంటి మహాత్ములు మాత్రమే నిజమైన వైరాగ్య సంపన్నులుగా ఉంటారు.


ఇక దేవునిది అన్ని విషయాల్లో సమృద్ధిని దాటిన స్థితి.కాబట్టి వైరాగ్యం అనెడి ఐశ్వర్యం అతడిని నిరంతరం సేవిస్తూ ఉంటుంది.ఇలా ఈ ఆరు ఐశ్వర్యాలను కలిపి 'భగ' అని పేరు. వీటిని కలిగి ఉండడం వల్ల భగవంతుడని పేరు.మనలో కూడా ఈ ఆరు ఐశ్వర్యాలు అంశ మాత్రంగా ఉంటాయి. మన ప్రవర్తనను బట్టి ఆయా ఐశ్వర్యాలు వృద్ధి పొందుతాయి.                    

 ************

కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుదయాన్వితా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 38 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుదయాన్వితా’


మాటలో మర్యాద ఎలాఉంటుందో చూపిస్తు వశిన్యాది దేవతలు అమ్మా! నువ్వు మా తల్లివి నీ తొడల సౌందర్యము నీ భర్తయిన మహాకామేశ్వరునికి ఒక్కడికే  తెలుసు అని ఆ నామమును ఎంతో అందముగా చెప్పారు. ఈ బ్రహ్మాండమే అమ్మ స్వరూపము అయినప్పుడు సృష్టిలోని ఏ శరీరము ఆమె సౌందర్యముతో తులతూగలేదు.   


 శంకరాచార్యులు అమ్మవారిని ‘విధిజ్ఞే’ అని పిలిచారు. విధిజ్ఞ అనగా చేయవలసిన విషయాలు బాగా తెలిసి ఉన్నపిల్ల. భార్య మొదటి లక్షణము భర్తను గౌరవించడము. ఒక ఆడపిల్లకు ఇంతకన్నా గొప్ప పేరు లోకములో ఉండదు. అమ్మవారు తన కర్తవ్యము బాగా ఎరిగి భర్తను గౌరవిస్తుంది. ఈ శ్లోకములో అమ్మవారు భర్తను ఎలా గౌరవిస్తుందో చెపుతున్నారు. దానికి ఆయన ఎంతో అందమైన ఉపమానములు చెపుతున్నారు. అమ్మా ! లోకములో అరటిచెట్లు ఉంటే వాటే వాటి బోదెలు ఎలా ఉంటాయో అటువంటి తొడలు కలిగినదానివి. ఐరావతము అనే ఏనుగు తొండము వంటి తొడలు కలిగినదానివని నేను అన్నాను కానీ అమ్మా బంగారు అరటిచెట్ల సౌందర్యము, ఐరావతము యొక్క తొండము సౌందర్యము నీ రెండు ఊరువుల సౌందర్యము తిరస్కరించ కలిగింది. నీ మోకాళ్ళు గుండ్రముగా ఉన్నాయి. నీ మోకాళ్ళు మాత్రం గరకుగా ఉన్నాయి. ఆ విషయములో నీ మోకాళ్ళు ఐరావతం కుంభస్థలం గరకుగా ఉంటుంది. తొండము కూడా ముట్టుకుంటే గరకుగా ఉంటుంది. అమ్మా! నీ మోకాళ్ళు ఎర్రగా గుండ్రముగా ఉన్నాయి. అవి నల్లబడి పెచ్చుకట్టి ముట్టుకుంటే ఇంత గరకుగా ఉన్నాయేమిటి? అనిపించేట్లు ఉన్నాయి. ఎందుకు అనగా నువ్వు కర్తవ్యము బాగా తెలిసినదానివి. స్త్రీ భూమి మీద సాష్టాంగనమస్కారం చేయకూడదు కనక నువ్వు ప్రతిరోజు పరమశివుడు కనపడగానే మోకాళ్లను నేలకు తాకించి వంగి నువ్వు పెట్టుకున్న బొట్టు శివుని పాదముల మీద ముద్రపడేట్లుగా నమస్కారము చేస్తూ ఉంటావు. అసలే సుకుమారమైన తల్లివి. అందువలన నీ మోకాళ్ళు గరకుగా అయిపోయాయి అన్నారు. 


 ఆ భావనతో నిలబడటము చేతనైననాడు వాళ్ళను అమ్మ పరవశించి ఒక బిడ్డలా తన వడిలో కూర్చోపెట్టుకుంటుంది. ఇంకొక జన్మ ఎత్తవలసిన అవసరము లేని స్థితిని, ఈ జన్మలో సమస్తమయిన సుఖములను అనుగ్రహిస్తుందని చెప్పడము శంకరుల ఉద్దేశ్యము. జగద్గురువులు, మహాపురుషులు, లోకానికి సందేశము అందించవలసిన బాధ్యత ఉన్నవారు కనక అంత గొప్ప శ్లోకాన్ని మనకి అందించారు.  


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

రాజరాజేశ్వర్యష్టకం

 రాజరాజేశ్వర్యష్టకం


అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ

కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ

సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౧ ||


అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ

వాణీ పల్లవపాణి వేణుమురళీగానప్రియా లోలినీ

కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౨ ||


అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ

జాతీచంపకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా

వీణావేణువినోదమండితకరా వీరాసనేసంస్థితా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౩ ||


అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ

బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా

చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౪ ||


అంబా శూల ధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ

వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమాసేవితా

మల్లద్యాసురమూకదైత్యమథనీ మాహేశ్వరీ అంబికా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౫ ||


అంబా సృష్టవినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా

గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా

ఓంకారీ వినుతాసుతార్చితపదా ఉద్దండదైత్యాపహా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౬ ||


అంబా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా

యా బ్రహ్మాదిపిపీలికాంతజననీ యా వై జగన్మోహినీ

యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళామాలినీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౭ ||


అంబాపాలిత భక్తరాజదనిశం అంబాష్టకం యః పఠేత్

అంబాలోకకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతమ్

అంబా పావనమంత్రరాజపఠనాదంతే చ మోక్షప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౮ ||

హరహర మహాదేవ

 *హరహర మహాదేవ*


శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.

*బిల్వ దళం ప్రాముఖ్యత*

బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని మరోపేరు ఉంది. 

బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ.బిల్వం ఇంటి అవ రణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తూర్పున ఉంటే సౌఖ్యం. పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షిణాన ఆపదల నివారణ. 

వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది. 

ఓం నమః శివాయ..హర హర మహాదేవ శంభో శంకర.. 

*30 రకాల శివలింగాలు*

సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే..అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. 

కానీ మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి. అపూరూపమైనవి..ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం..

అందుకే వాటి గురించి తెలుసుకుందాం....

రకరకాల పదార్ధాలతో రూపొందించిన శివలింగాలు గురించి పురాణాలు వివిధ సందర్భాలల్లో వర్ణించాయి.... ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి.....

1) గంధపు లింగం.

రెండు భాగాలు కస్తూరి , నాలుగు భాగాలు గంధం , మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు .....దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

2) నవనీత లింగం.

వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.

3) పుష్పలింగం.

.నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు....దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

4) రజోమయ లింగం.

పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాథరత్వం సిద్ధిస్తుంది..... శివ సాయిజ్యాన్ని పొందగలరు

5) ధ్యాన లింగం.

యవలు , గోధుమలు , వరిపిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు....దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి , సంతానం కలుగుతుంది.

6 ) తిలిపిస్టోత్థ లింగం.

నూగు పిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ది కలుగుతుంది.

7) లవణ లింగం..

హరిదళం , త్రికటుకము , ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి .

8 ) కర్పూరాజ లింగం .

ముక్తి ప్రదమైనది.

9) భస్మమయ లింగం.

భస్మముతో తయారు చేస్తారు ...... సర్వసిద్ధులను కలుగచేస్తుంది

10) శర్కరామయ లింగం..

సుఖప్రదం..

11) సద్భోత్థ లింగం..

ప్రీతికరని కలిగిస్తుంది.

12) పాలరాతి లింగం..

ఆరోగ్యదాయకం.

13) వంకాకురమయ లింగం.

వంశవృద్దిని కలిగిస్తుంది ...... దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు .

14) కేశాస్థి లింగం .

వెంట్రుకలు , ఎముకలతో తయారు చేస్తారు .....ఇది శత్రునాశనం చేస్తుంది.

15) పిష్టమయ లింగం..

ఇది పిండితో తయారు చేయబడుతుంది...ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16) దధిదుగ్థ లింగం .

కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది.

17) ఫలోత్థ లింగం..

ఫలప్రదమైనది.

18) రాత్రి ఘజాత లింగం.

ముక్తి ప్రదం

19) గోమయ లింగం..

కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు ..... దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది..... భూమిపై పడి మట్టి కలిసిన పేడ పనికిరాదు

20) దూర్వాకాండజ లింగం.

గరికతో తయారు చేయబడు ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది

21) వైడూర్య లింగం..

శత్రునాశనం , దృష్టి దోషహరం

22) ముక్త లింగం .

ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్ట సిద్దిని కలిగిస్తుంది

23) సువర్ణ నిర్మిత లింగం.

బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది

24) ఇత్తడి - కంచు లింగం..

ముక్తిని ప్రసాదిస్తుంది

25) రజత లింగం..

సంపదలను కలిగిస్తుంది

26) ఇనుము - సీసపు లింగం..

శత్రునాశనం చేస్తుంది

27) అష్టధాతు లింగం.

చర్మరోగాలను నివారిస్తుంది.....సర్వసిద్ధి ప్రదం

28) స్ఫటీక లింగం.

సర్వసిద్ధికరం , అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది

29) తుష్టోత్థ లింగం..

మారణ క్రియకు పూజిస్తారు

30) సీతాఖండ లింగం.

ఫటిక బెల్లంతో తయారు చేసింది..... ఆరోగ్యసిద్ధి కలుగుతుంది

*పరమేశ్వర పూజా పుష్పఫలము*

శివున్ని దర్భలతో పూజిస్తే - దీర్ఘాయుస్సు! 

ఉమ్మెత్తలతో పూజిస్తే - సుతప్రాప్తి!

జిల్లేడు పూలతో పూజిస్తే - శౌర్యము !

కలువ పూలతో పూజిస్తే - విక్రమ వృద్ధి !

బంధూక సుమములతో పూజిస్తే - భూషణ ప్రాప్తి !

జాజి పూలతో అర్చిస్తే - వాహన ప్రాప్తి !

మల్లెపూలతో పూజిస్తే - భోగము ప్రాప్తిస్తాయి !

అవిసె పూలతో పూజిస్తే - పరమేశ్వర ప్రాప్తి !

కొండ గోగుపూలతో ఆరాధిస్తే - వస్త్ర లాభం !

నువ్వుల పువ్వులతో ఉమామహేశ్వరుణ్ణి పూజిస్తే - యౌవన ప్రాప్తి కలుగుతుంది !

తుమ్మి పువ్వులతో అర్చిస్తే - మోక్ష లాభం !

నందివర్థన పూజ - సౌందర్యాన్ని చేకూర్చుతుంది !

శ్రీమద్భాగవతం -36🌷

 🕉శ్రీమద్భాగవతం -36🌷


వేనుడు రాజు అయిన తరువాత ప్రజలకు ఇటు రాజు వైపునుండి బాధ అటు క్రూరుల వైపునుండి బాధ. యజ్నయాగాది క్రతువులు లేవు. రాజు ఈశ్వరుడు. కాబట్టి మీరు యజ్ఞం చేస్తే నాకు చెయ్యాలి. నా చిత్రపటములకే ఆరాధన చేయాలి అని వేనుడు ప్రకటించాడు. ఇపుడు భూదేవికి కోపం వచ్చింది. ‘వీళ్ళు తమ కొరకు మాత్రమే తింటున్నారు. వీళ్ళకి కృతజ్ఞత లేదు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. కాబట్టి నేను ఓషధీశక్తిని ఉపసంహారము చేస్తున్నాను’ అంది. భూమికి ఓషధీ శక్తి ఉంటేనే బ్రతుకుతారు. ఎప్పుడయితే ఓషధీశక్తి ఉపసంహారం అయిందో వెంటనే వచ్చే ఫలితం ప్రతి వాడికి దేశంలో ధర్మం అన్నమాట నీతి అన్నమాట కడుపులోకి పదార్ధం దొరికినంత సేపే ఉంటాయి. అసలు తినడానికి దొరకకపోతే భాగవతం చెపుతాను రమ్మనమంటే ఎవరయినా వస్తారా? ఎవరూ రారు. ఎక్కడ చూసినా దేశంలో అసాంఘిక శక్తులు ప్రబలిపోయాయి. నేరముల సంఖ్య పెరిగిపోయింది. దొంగతనములు పెరిగిపోయాయి.

ఋషులు ఈ పరిస్థితిని గమనించారు. వారు సరస్వతీ నదీ తీరంలో సమావేశం అయ్యారు. రాజ్యంలోని అప్పటి దారుణ పరిస్థితులకు కారణం ఏమిటని ఆలోచన చేశారు. మహర్షులు అందరం వెళ్ళి వేనుడితో ఒక మాట చెబుదాం. అతడు మన మాటవిని మారిపోతే సంతోషం. మారక పోతే ఇంకా ఆ రాజు ఉండకూడదు కాబట్టి మన తపశ్శక్తి చేత వానిని సంహారం చేసేద్దాం అనుకోని బయల్దేరారు. రాజుకు ఆశీర్వచనం చేసి ఒకమాట చెప్పారు. ‘రాజా, నీవు యజ్ఞయాగాదులు చేసి ఈ భూమిని రక్షించాలి. శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలి. ఈశ్వరుని యందు బుద్ధి మరల్చుకో’ అని చెప్పారు. అపుడు వేనుడు ‘అసలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కనపడని విష్ణువుకు యజ్ఞం చెయ్యమంటున్నారా? ఇంకొకసారి నోరు విప్పితే మీ కుత్తుకలు ఎగితిపోతాయి’ అన్నాడు.

అపుడు ఋషులు ఇక అతడు మారడు అనుకున్నారు. ‘వీనికి బోధ అనవసరం. వీనవలన మొత్తం రాజ్యం నాశనం అయిపోతోంది. వీడు ఉండడానికి వీలులేదు.’ అనుకున్నారు. అపుడు ఋషులందరూ కోపం తెచ్చుకొని హుంకారమును చేశారు. అంతే! వేనుడు చచిపోయాడు. అహంకారం ప్రబలి ప్రబలి మహాత్ముల జోలికి వెళ్ళిన వారికి చిట్టచివరికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. వేనుని తల్లి అయిన సునీథ గొప్ప మంత్రశక్తి కలిగినది. ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది. తన మంత్రశక్తితో వెనుది శరీరమును కాపాడింది. అందుకని ఆశరీరమునకు అంత్యేష్టి సంస్కారమును చేయలేదు. ఋషులు కొంతకాలం చూశారు. ఇపుడు నేరముల సంఖ్య ఇంకా పెరిగిపోతోంది. శిక్షించే నాథుడు లేడు. అప్పుడు ఋషులు అన్నారు ‘ఇప్పుడు మనం ఎలా అయినా సరే రాజుకి వంశాన్ని పెంచాలి. రాజు మరణించి ఉన్నాడు. ఇపుడు మనం మన తపశ్శక్తితో రాజు శరీరంలోంచి రాజు సంతానమును తీసుకురావాలి’ అనుకున్నారు. తపశ్శక్తి ఉన్నవారు మూఢుల్ని మార్చలేకపోయారు. కానీ క్షేత్రములేకుండా శరీరంలోంచి సంతానమును సృష్టిస్తున్నారు కానీ వారి వాక్కుకు వాడు మాత్రం మారలేదు. ఋషులు వెళ్ళి మొట్టమొదట ఆయన తొడమీద మథనం చేశారు. అందులోంచి తపశ్శక్తితో మథనం చేస్తే పాపము పైకి రావడం మొదలు పెట్టింది. అందులోంచి బాహుకుడు అనబడే ఒక నల్లటి వాడు పొట్టి పొట్టి కాళ్ళు పొట్టి పొట్టి చేతులు ఎర్రటి కళ్ళు రాగి జుట్టుతో పుట్టుకొచ్చాడు. ‘నేను ఏమి చేయాలి’ అని ఋషులను అడిగాడు. అపుడు ఋషులు వానివంక చూసి ‘వీడు రాజ్యపాలనము చేయగలిగిన వాడు కాలేడు అనుకోని నీవేమీ చేయవద్దు అన్నారు. ఇపుడు మరల సరియైన పిల్లవాడు రావాలి అంటే ఎక్కడ మథనం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఈలోగా ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయి అక్కడ ఉండే కొండలలో నివసించడం మొదలు పెట్టాడు. అతని వంశీయులకే ‘నిషాదులు’ అని పేరు వచ్చింది.

ఇపుడు ఋషులు ‘స్వామీ, ఒక కొడుకు పుట్టడమును మేము అడుగుట లేదు. లోకమును రక్షించగలిగిన కొడుకు కావాలని అడుగుతున్నాము కాబట్టి శ్రీమహావిష్ణువా, నీవే నీ అంశ చేత నీ తేజస్సు చేత ఈ బాహువులలోంచి బయటకు రా’ అని బాహువులను మథించారు. ఆశ్చర్యకరంగా బాహువుల నుండి ఒక అందమయిన పురుషుడు, ఒక అందమయిన స్త్రీ పుట్టారు. ఆ పుట్టిన వారి పాదములను చూస్తే శంఖరేఖ, పద్మరేఖ, చక్రరేఖ కనబడ్డాయి. ‘ఓహో మనం ప్రార్థన చేసిఅట్లు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. కాబట్టి ఇక రాజ్యమునకు ఇబ్బందిలేదు’ అనుకున్నారు. ఆ పిల్లవాడికి పృథువు అని పేరుపెట్టారు. ఆయన వెంటనే యౌవనమును సంతరించుకున్నాడు. ఆవిడకు ‘అర్చిస్సు’ అని పేరు పెట్టారు. ఆయనే పృథు మహారాజు అయ్యారు. 

ఆయన విష్ణు అంశతో ఋషులు మథిస్తే పుట్టిన వాడు కనుక ఆయన రాజ్యపాలనం చేయడానికి కావలసిన ఉపకరణములు తమంత తాము గబగబా దిక్పాలకులు పట్టుకువచ్చారు. కుబేరుడు ఆయన కూర్చొనుటకు కావలసిన సింహాసనం తెచ్చాడు. వరుణుడు గొడుగు తెచ్చాడు. వాయువు చామరం, ధర్ముడు మేడలో వేసుకునేందుకు సుగంధమాల తీసుకువచ్చారు. బ్రహ్మగారు వేదమనబడే కవచమును ఇచ్చారు. సరస్వతీ దేవి మేడలో వేసుకునే హారమును, పూర్ణాంశలో ఉండే స్వామి శ్రీమహావిష్ణువు సుదర్శనమును, లక్ష్మీదేవి ఐశ్వర్యమును, పరమశివుడు దశచంద్రమనబడే కత్తిని ఇచ్చాడు. ఈ కత్తి పెట్టడానికి ఒర కావాలి. పార్వతీదేవి శతచంద్రమనబడే ఒరను ఇచ్చింది. సోముడు గుర్రమును, త్వష్ట రథమును, అగ్ని ధనుస్సును, సూర్యుడు బాణమును, సముద్రుడు శంఖమును, ఇచ్చాడు. స్వామి జన్మించగానే సమస్త దేవతలు తమ శక్తులు ధారపోశారు. పృథు మహారాజు పరిపాలన చేయడం కోసం సింహాసనం మీద కూర్చోగానే వంధిమాగధులు స్తోత్రం చేశారు. అపుడు పృథువు వాళ్లకి బహుమానములను ఇచ్చి సంతోషించాడు. ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి ‘మహానుభావా ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి దిక్కు ఎవరూ లేరు. ఆకలితో అన్నమో రామచంద్రా అని అలమటించి పోతున్నాము. ఎందుకు అంటే భూమి ఓషధీ శక్తులు అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మేము పంటలు పండిద్దామన్నా పండడం లేదు. నీవు మమ్మల్ని అనుగ్రహించవలసినది’ అన్నారు.

పార్వతీ దేవి శాకాంబరి అయినట్లు వెంటనే పృథు మహారాజు తన ధనుస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు. ‘అసలు ఈ భూమి పంట పండుతుందా? పండదా? నా బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తాను’ అన్నాడు. పృథు మహారాజు గారి ఆగ్రహమును చూసి భయపడి భూమి గోరూపమును పొంది పరుగెడుతోంది. ఏ దిక్కుకి పరుగెడితే ఆ దిక్కుకు ఎదురువచ్చాడు. అపుడు గోవు ప్రార్థన చేసింది. ‘స్వామీ నీవే ఒకనాడు యజ్ఞవరాహామై నీ దంష్ట్రలతో భూమిని పైకి ఎత్తావు. నీవే ఈ భూమిలోంచి అన్ని రకములైన శక్తులు కలిగే అదృష్టమును నాకు కటాక్షించావు. ప్రజలు ఎవరూ యజ్ఞయాగాదులు చెయ్యలేదు. వేనుడు చెయ్యవద్దని శాసించాడు. ప్రజలు మానివేశారు. యజ్ఞయాగాదులు మానడం ఎంతటి ప్రమాదకరమో భాగవతం చెపుతోంది. అందుకని నేను నా ఓషధీ శక్తులను గ్రసించాను(నమలకుండా మ్రింగివేయడం). అలా గ్రసించడం వలన ఓషధీశక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపొయింది. ఇప్పుడు లేదు. కానీ ఒక లక్షణం ఉంది. నేను గోరూపంలో తిరుగుతాను. జీర్ణమయిన శక్తి మరల పాలరూపంలో బయటకు వస్తుంది. నేను పాలరూపంలో ఈ శక్తులన్నీ నీకు ఇవ్వాలి. నువ్వు రాజ్య క్షేమము కోరిన వాడివి కనుక నీకోసం విడిచిపెడతాను. కానీ నీవు వచ్చి దూడగా నిలబడతానంటే కుదరదు. ఇపుడు దూడ రూపంలో ఎవరయినా రాగలరా? దూడగా ఎవరిని తీసుకు వస్తావు’ అని అడిగింది.

అపుడు పృథు మహారాజు ‘ఇప్పుడు నీవు చెప్పిన మాటకు చాలా సంతోషం. తల్లీ, నీకు నమస్కారం. నీకు దూడగా స్వాయంభువ మనువును తీసుకువస్తాను. ఆయన భూమిని చాలా గొప్పగా పరిపాలించినవాడు’ అని చెప్పాడు. స్వాయంభువ మనువు పేరు వినగానే భూమాత చాలా సంతోషించింది. స్వాయంభువ మనువు దూడగా వచ్చి ఆ శిరములను ఒక్కసారి కదిపాడు. ఒక్కసారి లోపల ప్రేమ కలిగి ఆ శిరములలోంచి పాలు కారిపోయాయి. ఈ ఓషధీశక్తిని పితకగలిగిన వాడు ఉండాలి. ఎవరు పితకాలి? పృథు మహారాజు వెళ్ళి పొదుగు దగ్గర కూర్చున్నాడు. ఇపుడు ఓషధీశక్తులను తట్టుకోగలిగిన పాత్ర కావాలి. తన చేతిని పాత్రగా చేసి రెండవ చేతితో పాలు పితికాడు. ఆ పాలను భూమిపై చల్లాడు. వెంటనే పంటలు పండాయి. భూమి సస్యశ్యామలం అయిపొయింది.

ఇపుడు ఆకలి ఎక్కువ పండేటటువంటి భూమి తక్కువ. అందుకని పృథువు తన ధనుస్సును చేతపట్టి వంచి ధనుస్సు చివరి భాగంతో కొన్ని పర్వతములను పడగొట్టి భూమిని సమానం చేశారు. అలా చేసేసరికి కొన్ని వేల ఎకరముల భూమి మరల వ్యవసాయ యోగ్యమయింది. దీని మీదకు వచ్చి నీరు నిలబడింది. విశేషమయిన పంటలు పండాయి. పృథివి మీద ఉన్నవాళ్ళు అందరూ చాల సంతోషించారు. భూమిని పృథు మహారాజు పిండితే ‘పృథివీ’ అనే పేరు వచ్చింది. అందుకే జీవితంలో పృథు మహారాజు గురించి వినినట్లయితే మన కోరికలు అన్నీ తీరిపోతాయని పెద్దలు చెపుతారు.

సశేషం....

💥💥💥

పురుషసూక్తమ్

 *పురుషసూక్తమ్*


*(21) ప్రజాపతిశ్చరతి గర్భే అంతః*

*అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిమ్*

*మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః*


తా" భగవంతుడు ప్రపంచంలో క్రియాశీలుడై మరలుతున్నాడు. జన్మలేనివాడుగా ఉంటూనే ఆయన అనేక రూపాలతో ఉద్భవిస్తున్నాడు. ఆయన నిజస్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు. బ్రహ్మవంటి వారు సైతం మరీచి మొదలైన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు.


(భగవదనుభూతి విశిష్టత ఇక్కడ ప్రస్తావించబడింది. మానవుడు పొందదగిన పదవులలో అత్యున్నతమైనది బ్రహ్మపదం. కోట్లాది సం"లుగా కొనసాగే మహాప్రళయ సమయంలో, అంటే ఈ సృష్టి అంతానికి వచ్చినప్పుడు ఆయన పదవీకాలం కూడ సమాప్తమవుతుంది. కాని భగవదనుభూతి పొందిన, ముక్తుడైన మహాత్ముల స్థితి అటువంటిది కాదు. *బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి* భగవంతుణ్ణి తెలుసుకొన్నవాడు భగవంతుడే అవుతాడు. అతడికి మరణం లేదు, వినాశం లేదు. అందుచేతనే బ్రహ్మవంటి దేవతలు సైతం భూలోకంలో ఋషులై ఉండ అభిలషిస్తారు. అందుచేత మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తీ భగవంతుణ్ణి అన్వేషించాలి. ఇదే ప్రశంసనీయమైన కార్యం.)


******************************

ఒత్తిడిని

 👌      *ఒత్తిడిని ఎలా అధిగమించాలో ఈ ఐదు సూత్రాల ద్వారా తెలుసుకుందాం.*

🎊💦🌹🦚🌻💦🎊


 *👉�   మీకు ఏమి ఎదురైనా, మీరు దానిని ఎలా ఎదుర్కొంటారు, దానినుంచి మీరేమి నేర్చుకుంటారు అన్నది పూర్తిగా మీమీదే ఆధారపడింది.* 

 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *మిమ్మల్ని యాతనకు గురిచేస్తోంది మీ షెడ్యూల్ కాదు. విషయం ఏమిటంటే మీరు కేవలం మీ ఆలోచనా, భావోద్వేగాలలో ఊపిరిసలపనంతగా మునిగిపోయి ఉన్నారు.* 


🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴


 


 *మీరు సంపాదించేది బాగా జీవించడానికే, ఒత్తిడితో మిమ్మల్ని మీరు* *చంపుకోవడానికి కాదు.* 


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


 


 *ఏ పని ఒత్తిడిని కలిగించదు. మీ శరీరం, మనస్సు, భావోద్వేగాలను మీరు సరిగ్గా  నియంత్రించుకోలేక పోవడమే ఒత్తిడిని కలిగిస్తుంది.* 


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


 


 *బయటి పరిస్థితులు మీకు శారీరకమైన నొప్పిని మాత్రమే కలుగ జేయగలుగుతాయి. బాధ మాత్రం మీ మానసిక సృష్టే.*    👈


🎊💦🌹🦚🌻💦🎊

ఆత్మ విచారం

 💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺


          *_🌹 ఆత్మ విచారం 🌹_*


*👌 _పుణ్యపురుషులు ఇతరుల కోసం జీవిస్తారు. జ్ఞానీ ఇతరుల కోసం తనను తానే అర్పించుకుంటాడు. ఇతరులకు ఉపకారం చేయడం వల్లే మనకుమేలుకలుగుతుంది. ఇంతకన్నా వేరే మార్గం లేదు._*


*_సమాజంలో చాలా మంది.. లోకం ఏమనుకుంటుందో.... ఆ  నలుగురు ఏమనుకుంటారో..అనే బెంగతోనే, అలోచించి అనేకమంది తమ కార్యాలను నిర్దేశించుకుంటున్నారు.తప్ప సత్యానికి, వాస్తవికతకు, స్వకీయ అభిరుచికి, ఆసక్తికి, సామర్థ్యలను అంచనా వేసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు._* 


*_ఈ సమాజ భావన నేడు మన స్వేచ్ఛను పూర్తిగా హరించడమే కాకుండా ప్రతి దాంట్లో కృత్రిమ పోటీనీ పెంచి జీవితాన్ని పెను ఒత్తిడికి గురి చేస్తున్నది._* 


*_ఏ పని చేయడానికైనా ముందు నేను ఈ పనిచేస్తే సమాజం ఎలా భావిస్తుంది...? సమాజంలో నా గౌరవం ఇనుమడిస్తుందా... ? అని అలోచించి ముందుకెళ్లడం నైజాంమైంది._*


*_మిత్రమా...ముందు నీవు ఏమనుకోకుండా చూసుకో... నీవు చేసే పని ధర్మ బద్దమైనదా కదా అనేది నీవు ముందు  విశ్లేసుకో...అది ఎంత చిన్న పనైనా ధైర్యంగా నిర్వర్తించు. ఈ.. సమాజం ఎలా ఉన్నా, నివ్ ఎలా బ్రతిన. నీలోని తప్పులను వెతుకుతూనే ఉంటుంది. అందికే.... అందుకే...సమాజం కోసం కాకుండా నీ కోసం బ్రతుకు.._*


*_ఈ  రోజు నిన్ను తప్పని హేళన చేసిన ఈ.. సమాజమే.. నిన్ను నెత్తిన బెట్టుకొని ఉరేగిస్తుంది. ధర్మ బద్దంగా, న్యాయంగా, నీకు, నీ మనస్సుకు, బుద్ధికి మంచి అనిపించే ఏ పనైనా న్యూనతాభావజాలాన్ని వదిలి కార్యరంగం లో.. దూసుకోపో... జీవితం నీది... నీ జీవితం నీ వెళ్లే దారిని బట్టే...నిన్ను శాసిస్తుంది గుర్తుంచుకో._*


*_మనం గమనించడం లేదు కానీ, ఇలాంటి పరిణామం వలన మనలోని సృజనాత్మకత కూడా పూర్తిగా మరుగున పడే ప్రమాదం ఉంటుంది. మనం ఎంత ఎక్కువ విలక్షణంగా ఆలోచిస్తే అంత వైవిధ్యభరిత కార్యాలను సాధిస్తాం._*


*_ప్రతిదానికి సమాజం అనుకుంటూ భయపడితే...చివరకు మిగిలేది దుఃఖమే. అసలు నిజానికి మనం భయపడుతున్న సమాజం ఎక్కడున్నది....?_*


*_ఈ సమాజ భావన కేవలం మన ఊహ మాత్రమే.  సమాజం అంటే వ్యక్తుల సమూహం. వ్యక్తి వ్యక్తి కలిస్తేనే సమాజం. వ్యక్తి ఆలోచనే సమాజపు ఆలోచన కదా ! అలాంటప్పుడు మనం వినూత్నంగా ఆలోచించడానికి ఎందుకు భయపడుతున్నాం... ?_*


*_అందుకనే నలుగురు ఏమనుకుంటారో అన్న భావనను కొంత పక్కన పెడితే  మనం స్వేచ్ఛగా ఆలోచించగలుగుతాం, యధార్థ పరిస్థితులకు దగ్గర జీవించ గలుగుతాం._*🙏


🌹 *_ఆత్మీయ మిత్రులకు దసరా శుభాకాంక్షలు*_ 🌹

              *వే శ్రీ* 

💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺

శ్రీ ప్రహ్లాద భక్తి

 *\!/ ఓం నమో వెంకటేశాయః.\!/* 

 **_అందరికీ  శుభోదయం...**_ 

         *నారసింహ విజయము* 

+++++++++++++++++++++

                 శ్రీ ప్రహ్లాద భక్తి    

************************

187  శ్లోకము   కొనసాగింపు  

**************************

"శోణిత పంకాంకిత కేసరుండును నై ప్రేవులు కంఠమాలికలుగ ధరించి కుంభికుంభ విదళనంబు చేసి చనుదెంచు పంచాననంబునుం బోలె, దనుజకుంజర హృదయకమల విదళనంబు చేసి, తదీయ రక్తసిక్తంబు లైన నఖంబులు సంధ్యారాగ రక్తచంద్రరేఖల చెలువు వహింప సహింపక, లేచి తన కట్టెదుర నాయుధంబు లెత్తుకొని తత్తఱంబున రణంబునకు నురవడించు రక్కసులం బెక్కుసహస్రంబులం జక్రాధిక నిర్వక్రసాధనంబుల నొక్కనిఁ జిక్కకుండం జక్కడిచె; ని వ్విధంబున."


 *భావము* : “ నెత్తురుతో తడసి ఎఱ్ఱబారిన మెడజూలుతో; భయంకరంగా ఆ దానవ రాజు ప్రేగులు కంఠమాలికలులా వేసుకున్న మెడతో ఆ ఉగ్ర నరసింహుడు దర్శనమిచ్చాడు. ఆ దేవుడు ఆ దానవుడి హృదయకమలం చీల్చి వేసి, మదగజేంద్రుడి కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజులాగా విరాజిల్లుతున్నాడు; రక్తంలో తడసిన ఆయన గోర్లు సంధ్యారాగ రంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి; ఆ రూపం చూసిన రాక్షస వీరులు కోపాలు పట్టలేక వివిధ ఆయుధాలతో ఆ రాక్షసాంతకుని మీదకి దండెత్తి వచ్చారు; అలా వచ్చిన పెక్కువేల రక్కసులను వచ్చిన వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో ఒక్కడిని కూడా వదలకుండా వధించాడు ఆ ఉగ్ర నరకేసరి.”


+++++++++++++++++++++

 *విష్ణుసహస్రం* .... అర్థం, పరమార్థం.

+++++++++++++++++++++

591) గోహిత: - భూమికి హితము చేయువాడు.

+++++++++++++++++++++

 *ఈ ఉదయం శ్రీహరి కీర్తన* 

+++++++++++++++++++++

" శేష శైల గరుడాచల   "

+++++++++++++++++++++

బంధాలు - కర్తవ్యాలు

 *బంధాలు - కర్తవ్యాలు* 

🕉️🌞🏵️🌎🌼🚩


 *బంధం అనేది మిథ్య అని అందరికీ తెలుసు. ఈ జగత్తు మిథ్య. జగన్నాథుడే నిత్యమూ సత్యమూ అనీ తెలుసు. కానీ మనస్సు ఏ బంధంలోనైనా చిక్కుకుంటే దాన్నినుంచి విడివడడమనేది చాలా కష్టం.* *అందులో పుత్రవ్యామోహం, కళత్ర వ్యామోహంలో మనుషులు చిక్కుకుంటేనే సంసారం సాగరం అయిపోయింది. గుదిబండగా మారిపోతుంది. దాన్నుంచి ఎంతకీ బయటకు రాలేరు.* 

 *ఎంత వివేక విచక్షణలున్నా, జ్ఞానమున్నా సరే ఆ బంధాలు జిడ్డుగా మారిపోతాయి. అందుకే మనవాళ్లు చిన్నప్పటి నుంచి దేనినైనా అతిగా కోరకూడదంటారు.* *తామరాకుపై నీటిబొట్టుగా ఉండాలి కానీ సంసారంలో మునిగిపోకూడదు. అట్లాఅని కర్తవ్యాలను విస్మరించకూడదు. కర్తవ్యాన్ని విస్మరించినా,* *బంధంలో చిక్కుకున్నా చాలా కష్టపడాల్సి వస్తుంది.* 

 *మహారాజు అయి ఉండి కూడా ఏవిధంగా బంధాల్లోను ఇరుక్కున్నాడో దశరథుని కథ వింటే తెలుస్తుంది.* 

 *దశరథుడు మహాయోధుడు. దేవతలకే కదనరంగంలో కాలుకదిపి తన నైపుణ్యంతో వారికి విజయం చేకూర్చేవాడు. అట్లాంటి దశరథుడు మహాపట్టణం అని పేర్గాంచిన అయోధ్యాపట్టణానికి మహారాజు అయ్యాడు. ఆయన రాజ్యం ముక్కారు పంటలతో, విద్యాసుగంధాన్ని ధరించిన పౌరులతో నిండి ఎల్లవేళలా సస్యశ్యామలంగా విజయలక్ష్మి అధివష్టించిన భూమిలా విలసిల్లేది.* 

 *కానీ దశరథుడు నిస్సంతు. అతనికి ముగ్గురు రాణులుండేవారు. కానీ సంతాన విహీనుడై సదా తనకు వారసులు లేరని వాపోతుండేవాడు. తన ఆస్థాన పురోహితులను, వశిష్ట,* *వామదేవాది మహర్షులతో తన గోడును వివరించి తనకు సంతాన యోగం కలిగేటట్టు చూడమని ప్రార్థించేవాడు.* 

 *దశరథుడు ధర్మసంపన్నుడని ఖ్యాతి వహించాడు. అయోధ్యను ఇంద్రపురితో పోల్చేవారు. సాధువులు, సన్యాసులు, సిద్ధులు లాంటి వారంతా దశరథుడు వేయేండ్లు సుఖసంతోషాలతో పాలన సాగించాలని దీవించేవారు. అటువంటి దశరథుడు కదా అని మహర్షులంతా* *ఆలోచించారు. వారు వారి యోగదృష్టితో దశరథుని భావిని దర్శించారు. మహర్షులంతా దశరథుని చేత పుత్రకామేష్ఠి చేయిస్తామని చెప్పారు. ఋష్యశృంగుని పిలిపించమని చెప్పారు.* *దశరథుడు ఆనంద పరవశుడై యాగానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఋష్యశృంగుడను మహర్షి దశరథుని చే పుత్రకామేష్ఠి యాగం చేయించాడు. శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘు్నలను నలుగురు పుత్రులు కలిగారు. రాణులు, రాజు అమితానంద పడ్డారు. రాణీవాసంలో ఆ నలుగురు పుత్రులు అపురూపంగా* *పెరుగుతున్నారు. కాలక్రమంలో వారు పెద్దవారు అవుతూ యుద్ధవిద్యలు నేర్చుకునే సమయంలోనే విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకు వచ్చాడు. దశరథుడు ఆ మహామునికి స్వాగత సత్కారాలు చేశాడు. ఏదైనా పని నిమిత్తం వచ్చి ఉంటే తెలుపుమని దానిని నిర్వర్తిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం తన పుత్రులైన రామలక్ష్మణులను విశ్వామిత్రుడు యాగరక్షణార్థం పంపమని దశరథుని కోరుకున్నాడు.* 

 *దశరథుడు ఎంతో వేదనతో వారిని వదిలి ఉండలేక, మహర్షికి ఇచ్చిన మాట వదలలేక ఆయనతో పంపలేకపోయాడు. అయ్యో లేక లేక పుట్టిన పిల్లలు కదా. వారిని ఏ విధంగా మీతో పంపాలని వ్యధచెందాడు. కాదంటే పోలా అనుకొన్నాడు. దశరథునిలోని పుత్ర వ్యామోహం మాట ఇచ్చి తప్పడమనే మహాపాపానికి కూడా వెరవనివ్వలేదు. భావి తెలిసిన వశిష్ఠ మహర్షి మెల్లగా దశరథునికి నచ్చచెప్పాడు. విశ్వామిత్రుని కోపస్వభావం గురించి చెప్పాడు. ఆయనకు పుట్టిన కుమారులు సాధారణ పిల్లలు కారని కారణ జన్ములని వివరించారు. వారికి ఎన్నో విద్యలను విశ్వామిత్రుడు నేర్పుతాడని లోకానికే కీర్తితెచ్చే వీరులుగా విశ్వామిత్రుడు వారిని తీర్చిదిద్దుతాడని ఎంతో చెప్పిన తరువాత అపుడు దశరథుడు చేసేది ఏమీ లేక ఎంతో వేదన చెంది మెల్లగా* *తన అనురాగాన్ని బలవంతంగా ఆపుకుని రామలక్ష్మణులిద్దరినీ మహర్షి వెంట పంపించారు. చూశారా! బంధం వదిలించుకోవడం అంటే ఎంత కష్టమో. కొన్నాళ్లు దూరమైతేనే* *ఉండలేనట్టున్నాడు. అంతటి జ్ఞాన నిధి అయిన దశరథుడు. ఇక మామూలు జనం గురించి ఏమి చెప్పాలి.* 

 *ఆ తరువాత వచ్చిన ఘట్టం చూడండి. దశరథునికి ఏమి మిగిల్చిందో!* 

 *విశ్వామిత్రుని వెంట నడిచిన రామలక్ష్మణులు ఆయన్ను మెప్పించి ఎన్నో గాథలను విని, అస్తశ్రస్త్రాలను మహర్షి ద్వారా గ్రహించి విశ్వామిత్రుడు తలపెట్టిన యాగాన్ని రక్షించారు. ఆ మహర్షి ఆశీర్వాదాన్ని పొందారు.* 

 *దారిలో మిథిలానగర ప్రవేశం చేసిన రామలక్ష్మణులు జనకుని దగ్గర ఉన్న శివధనుస్సును చూశారు. మహర్షి ప్రోత్సాహంతో రాముడు శివధనుర్భంగం చేశాడు. జనకుడు తన మాట ప్రకారం రామునికి తన కుమార్తె అయిన సీతమ్మను ఇచ్చి వివాహం చేస్తానని చెప్పగా రాముడు తన తండ్రి అభీష్టం మేరకు తాను వివాహం చేసుకొంటానని చెప్పాడు.* 

 *జనకుడు, ఆయన తమ్ముడు కుశధ్వజుడు దశరథుని వివాహం చేయడానికి ఆజ్ఞను పొందాడు. అపుడు దశరథుడు, జనకుడు,* *కుశధ్వజులు బంధువులు, పురప్రజలు ఇలా అందరి సహకారంతో రామలక్ష్మణ భరత శత్రుఘు్నలకు సీత, ఊర్మిళ, మాండవి, శుత్రకీర్తిలను ఇచ్చి వివాహం చేశారు.* 

 *కొన్నాళ్లకు దశరథునికి రాముని పట్ట్భాషేకం చేద్దామని తలంపునకు వచ్చాడు. కానీ విధివశాత్తు కైకమ్మకు దశరథుడు ఇచ్చిన రెండు వరాల వల్ల రాముడు వనవాసం చేయాల్సి వచ్చింది. విషమ పరిస్థితి చూసి దశరథుడు* *తట్టుకోలేకపోయాడు. ఆఖరికి కైక కాళ్లు పట్టుకుని బతిమిలాడడానికి కూడా వెనుకంజ వేయలేదా మహారాజు. ఎంతో వేదనకు గురయ్యాడు. దుఃఖభారంతో వేయిసంవత్సరాలు మీద పడినవానిగా మారిపోయాడు. కానీ కాలధర్మం మారుతుందా? ఎవరో వగుస్తున్నారని, మరెవరో* *సంతోషపడుతున్నారని కాలం తన పని చేయకుండా ఆగుతుందా? ఎట్టకేలకు రాముడు తన తండ్రిని బాధపెట్టి అయినా సరే ఆయన మాటను నేను వింటాను అనే సత్యాన్ని లోకానికి చాటాలనుకొన్నాడు. వెంటనే వనవాసానికి బయలుదేరాడు. రామునితో పాటు సీత, లక్ష్మణులు కూడా వనవాసానికి బయలుదేరారు. వారు దశరథునికి తమ తల్లులకు ప్రణామాలు అర్పించి వనాల బాట పట్టి రాజ్యాధికారాన్ని వదులుకుని వెళ్లిపోయారు. కానీ దశరథుడు-* 

ఆ *ముగ్గురిని వనవాసం చేయవద్దని చెప్పలేక, కైక మాటను కాదనలేక దశరథునికి నిస్సత్తువ కలిగింది. చేసేది ఏమీ లేక పుత్ర వ్యామోహాన్ని దూరం చేసుకోలేక, బంధాన్ని విడవలేక చివరకు ప్రాణాలను వదిలేశాడు. చూశారా! బంధం ఎంత బలవత్తరమైందో రాముడు అడవుల పాలు కాకపోయి ఉంటే దశరథుడు ఇంకొన్నాళ్లు జీవించి ఉండేవాడేమో అనిపిస్తుంది.* *కానీ ఇట్లా ఆలోచించడమూ తప్పే మరణం నిశ్చయమైన తరువాతే జీవి శరీరమనే ఉపాధిని పొందుతుంది. అంటే పుట్టినప్పుడే ఆ జన్మ కాలమెంతో నిర్ణయించబడే ఉంటుంది. కానీ కాలమెప్పుడూ నెపాన్ని తన మీద వేసుకోదట. అందుకే అయ్యో పాపం! రాముడు దూరమైనందుకే దశరథునికి మృత్యువు దాపురించింది అనుకొంటారు.కానీ కాల ధర్మం ప్రకారం దశరథుని కాలం తీరింది అనుకోలేకపోతారు.* 

 *అందుకే కాలం గురించి ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. దూరమైన కాలాన్ని దక్కించుకోలేము. రాబోయే కాలాన్ని ఒడిసి పట్టలేము.* *కనుక ఎవరైనా సరే కర్తవ్యనిష్ఠ సత్యధర్మాలను ఆచరణలో పెట్టుకుంటే చాలు కాలం మనలను బాధించదు.* 

 --- డా. రాయసం లక్ష్మి


🕉️🌞🌎🏵️🌼🚩

చండీహోమం

 చండీహోమం.....


చండీహోమం కేవలం ఒక వర్ణం కో ఒక వర్గం కో మాత్రమే కాదు.. అన్ని వర్ణాల వారికి సంబంధించినది.


చండీ ఆరాధన కలకత్తా దగ్గరలోని గిరిజన జాతులవారు ప్రారంభించారని పెద్దలు చెప్పియున్నారు, వారి వద్ధనుండే చండీహోమం ఆరాధన, హోమం బయల్పడినాయి. కాలక్రమేణా బ్రాహ్మణులు, పండితులు కూడా చండీహోమం చేయనారంభించారు. 


లక్ష్మీ, సరస్వతీ, కాళికాదేవి.. ఈ ముగ్గరు శక్తుల కలయికతో ఏర్పడినదే మహాచండీ.. ఈమె హోమం చేయడంవల్ల సమస్త బాధలు నివారణమవుతాయి.

వ్యాపారాలు వృద్ధి చెందుతాయి, శత్రువులు నశిస్తారు, పరప్రయోగాలతో బాధపడేవారు, తరచుగా కుటుంబంలో మరణాలు సంభవిస్తున్నవారు, అకారణంగా కోర్టు  కేసులలో ఇరుక్కుంటున్నవారు, ఇంకేమైనా ఇతరత్రా సమస్యలతో బాధపడతున్నవారు చండీహోమాన్ని చేయించుకోవడం వల్ల చండీమాత అనుగ్రహంతో త్వరితగతిని, వాటి నుండి బయటపడతారు.


చండీమాత ఉగ్రరూపమే కాళికామాత.. ఈమె శాంతరూపంలో.. మంగళచండి, సంకటచండీ, రణచండీ, ఓరైచండీ గా పూజలందుకుంటారు. 


చండీ హోమము ఎందుకు చేయాలి..

అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే, చండీ మాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి, అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. 


ఆమె ఆదిశక్తి, 

పరాశక్తి, 

జ్ఞానశక్తి, 

ఇచ్చాశక్తి, 

క్రియాశక్తి, 

కుండలినీ శక్తి.


..అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం.


లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. 

లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం, సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య.


అది లలితా పారాయణం, 

చండీ పారాయణం 

..అని రెండు రకాలు. 


బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం, లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. 


చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.


చండీ హోమం లో ఉన్న మంత్రాలు, అధ్యాయాలు..


చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక 

మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. 


బ్రాహ్మీ, 

నందజా, 

రక్తదంతికా, 

శాకంబరీ, 

దుర్గా, 

భీమా, 

భ్రామరీ 


..అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది.


దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 

13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. 


సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు..


పూజ, 

పారాయణ, 

హోమం.


..ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. 


చండీ హోమానికి సంబంధించి..


నవ చండీ యాగం, 

శత చండీ యాగం, 

సహస్ర చండీ యాగం, 

అయుత (పది వేలు) చండీ యాగం, 

నియుత (లక్ష) చండీ యాగం, 

ప్రయుత (పది లక్షలు) చండీ యాగం ఉంటాయి.


కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, 

గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, 

శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.


వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట.


ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, 


ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, 


మను చండి (చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. 


ఇక, శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. 


సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. 

కోరికలు నెరవేరతాయి. 


లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండి అంటారు.


ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు...


|| ఓం శ్రీ మాత్రే నమః ||


|| ఓం నమః శివాయ ||

🌹దేవీ కథలు -16

 🌹దేవీ కథలు -16


🕉️🕉️🕉️🕉️🕉️


💥గంగా , లక్ష్మీ , సరస్వతులు


☘☘☘☘☘☘☘☘☘


లక్ష్మీ దేవి , గంగాదేవి, సరస్వతీ దేవి అనే దేవతామూర్తులు ముగ్గురూ పూర్ణాంసతో మహావిష్ణువులో తాదత్మ్యం చెందారు. వారి కళలు మాత్రం భారతభూమిలో నదులుగా అవతరించాయి.


సరస్వతీ దేవి పూర్ణాంశగా కళారూపంలో అవతరించి 'భారతి' అనే పేరు పొందింది. వాక్కులకు అదిష్ఠాన దేవత కనుక అమెకు 'వాణి' అనే పేరు వచ్చింది. పాపాలను దహింపజేయగల పచ్చని కాంతితో అగ్నివలె ప్రకాశిస్తూ పవిత్రమైన నదీరూపాన్ని పొందినపుడు ఆమె 'సరస్వతి'. సరస్వతీ నది అంతర్వాహిని. అంటే పైకి కన్పించకుండా నీటి అడుగున గుప్తంగా దాగి ప్రవహించేది. ప్రయాగ క్షేత్రంలో గంగా యమునా సరస్వతీ నదులు కలుస్తాయి. అది త్రివేణీ సంగమం. త్రివేణి సముద్రంలో కలిసేచోటు కూడా అక్కడే ఉంది. అది త్రివేణీ సాగర సంగమ స్థానం కాని, ప్రయాగలో గంగా యమునా నదులు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఆ రెండిటి మద్య సూక్ష్మరూపిణిగా ఉన్న అంతర్వాహిని సరస్వతీ నది. గంగాజలం తెల్లని కాంతితో చల్లగా ఉంటుంది. యమున నీరు నల్లని కాంతితో గోరువెచ్చగా ఉంటుంది.


గంగానది విష్ణుపాదాల నుండు ఉద్భవించింది. భగీరథుని తపః ప్రభావం చేత భూలోకంలో ప్రవహించింది. సగర పుత్రుల ను ఉద్ధరించ డానికి, గంగను భూమికి రప్పించడానికి సూర్యవంశరాజులు ప్రయత్నించారు. సగర చక్రవర్తి కుమారులు అరవై వేల మంది కపిలమహర్షి శాపం వల్ల దగ్ధులు కాగా, వారిని ఉద్ధరించడానికి సూర్యవంశంలో పుట్టిన అసమంజుడు తీవ్రమైన తపస్సు చేశాడు. తపఃఫలం పొందక మునుపే అతని శరీరం రాలిపోయింది. అతని కుమారుడైన అంశుమంతుడు కూడా చిరకాలం ఘోరతపస్సుచేసి, ఫలం పొందకుండానే తనువును వదిలాడు. అంశుమంతుని కుమారుడైన భగీరథుని గుణవంతుడు, బుద్ధిమంతుడు, భగవద్భక్తుడు. కఠోర తపోదీక్షతో గంగను ప్రసన్నురాలిని చేసుకొన్నాడు. అతని కోరిక మేరకు గంగ భూలోకంలో ప్రవహించిది. గంగానదీ ప్రవాహం వల్ల సగరపుత్రులు సజీవులయ్యారు. ఆ ఆ ప్రదేశం సాగరమై పుణ్యస్థలమైంది.


లక్ష్మీ దేవి భారతీదేవి వాక్యానుసారం పద్మినిగా అవతరించి, నదీ రూపాన్ని దాల్చి , ధర్మధ్వజుని పుత్రికయై తులసీ వృక్షంగా రూపొంది. పాప పరిహారకమై నిలిచింది.


నదీ రూపాలను పొందిన గంగా లక్ష్మీ సరస్వతులు ముగ్గురూ భూలోకంలో ప్రవహిస్చూ , కలియుగంలో ఐదువేల సంవత్సరాల కాలం గతించే వరకు ఉండి, ఆ తరువాత వైకుంఠంలో మహావిష్ణువులో పూర్ణత్వం పొందుతారు. కాశీక్షేత్రం, బృందావన క్షేత్రం కలియుగాంతం వరకు పుణ్యస్థలాలుగా నిలిచి ఉంటాయి. జగన్నాథ క్షేత్రం , సాలగ్రామ శక్తి కలియుగంలో పదివేల సంవత్సరాల వరకు మహీమాన్వితమై నిలిచి ఉంటాయి.


కలిప్రభావం వల్ల లోకమంతా ఆధర్మ ప్రవర్తనతో నిండి సద్గుణాలు, పురాణాలు, వేదవిహిత కర్మలు, దేవతార్చనలు, భగవన్నామ సంకీర్తనలు, సత్య ధర్మాలు, వ్రతోపవాసాలు అన్నీ క్రమంగా భూలోకాన్ని విడిచిపోతాయి. అవన్నీ వైకుంఠం చేరుకుంటాయి. కలియుగాంతం నాటికి భూమిపై జనులు ఆచారహీనులై స్వైరవిహారాలకు పాల్పడతారు. ఎనిమిది సంవత్సరాల వయస్సునాటికే స్త్రీలు సంతానవతులు కావడం, 16|| సం వయస్సుతే వార్ధక్యం ప్రవేశించడం కలిలక్షణాలే.


శ్రీమహావిష్ణువు విష్ణుయశుడు అనే బ్రాహ్మణునకు కుమారుడై చేత ఖడ్గాన్ని ధరించి, అశ్వవాహనుడై 'కల్కి' అనే పేరుతో మూడు రాత్రులలో పాపాత్ములందరిని అంతం చేస్తాడు.ఆరురోజుల పాటు రాత్రింబవళ్లు ఏకథాటిగా కుంభవృష్టి కురిసి అంతా జలమయమైపోతుంది. ద్వాదశాదిత్యులు ఒకే సారిగా దర్శనమిస్తారు. వారితేజస్సు వల్ల భూమిపై అంతా ఎండిపోతుంది.


'కల్కి' ప్రభావంతో కలిపురుషుడు అంతరిస్తాడు. కృతయుగం ప్రారంభమవుతుంది. ధర్మదేవత నాలుగు పాదాలతో నిలబడుతుంది. భూలోకం అంతా ప్రకాశిస్తూంది. ఇలా యుగ పరివర్తనం జరిగే కాలం బ్రహ్మకు 108 సంవత్సరాలు . ఆ తరువాత బ్రహ్మ కూడా లయమైపోతాడు. దానికి 'ప్రాకృత ప్రళయము' అని పేరు. త్రిమూర్తులు, మహర్షులు , జ్ఞానులు, యోగులు చిద్రూపమై తేజస్సులో లయమై పోతారు. ప్రకృతి అంతా చిదగ్నిలో లీనమైపోతుంది. ఈకాలమంతా పరాశక్తికి ఒక్కనిమిషం . అంటే ఆమె కనురెప్పల కదలికలో ఈ సమస్త భువనాలూ పుట్టి నశిస్తూ ఉంటాయి. ఆమె ఒక్కసారి కన్నుతెరిస్తే సృష్టి .ఆమె కనురెప్పమూస్తే ప్రళయం. అందుకే ఆమె విరాడ్రూపాన్ని సందర్శించిన హయగ్రీవుడు 'లలితా సహస్ర నామావళి'గా ఆమె వైభవాన్ని గానం చేస్తూ "ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః" అని కీర్తించాడు.


ఈ విధంగా పరాశక్తి సంకల్ప ప్రభావం వల్ల .యుగాలు , ధర్మాలు, కాలచక్రం, నదులు, పర్వతాలు, బ్రహ్మ, విష్ణువు, రుద్రులు కూడా ప్రాకృతిక ప్రళయములో అంతమవుతూ ,మళ్ళీ కృతయుగారంభంలో ఆవర్భవిస్తూ వుంటారు. ఇదంతా పరాశక్తి లీలావిలాస ప్రభవమే.


        🙏ఓం శ్రీ కనకదుర్గా యై నమః🙏

             🔯🔯🔯🔯🔯

దసరా

 🛕🚩 *హిందూ ఆధ్యాత్మిక వేదిక*🚩🛕 9441010368

======================


*"దసరా" అంటే?* 



దసరా *దశహరా* నుండి రూపాంతరం చెందింది.

దశ అనగా పది.

పది తలలు గల రావణుడిని హరించిన రోజే *దశహరా.!* 

ఇది భౌతికమైన విషయం.

ఆద్యాత్మికంగా ఆలోచించినట్లైతే?

మనిషిలోని పది దుర్గుణాలను లేదా పాపాలను హరించవలసిన రోజు.!

అదే నిజమైన *దసరా.!* 

ఏమిటా *దుర్గుణాలు*? 

అవి

*శారీరకంగా చేసే పాపాలు 3.* 

1.అపాత్రదానం.(చేయవలసిన వారికి దానం చేయకపోవడం లేదా మనం చేసిన దానం వృధా కావడం)

2.శాస్త్రం అంగీకరించని హింస చేయడం.

3.పర స్త్రీ ని లేదా పురుషుని పొందు కోరడం.,సంగమించడం.

*నోటి ద్వారా చేసే పాపాలు 4.* 

1.పరుషంగా మాట్లాడుట.

2.అసత్యాలు చెప్పడం.

3.వ్యర్థ ప్రలాపాలు చేయడం.

4.అసభ్యంగా మాట్లాడుట.

*మనసు ద్వారా చేసే పాపాలు 3.* 

1.పరుర సొమ్ము ను దొంగిలించాలనే బుద్ధి ఉండటం.

2.ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం.

3.అహంకారం కల్గి ఉండటం.

ఇవి పది పాపాలు!

ఈ పాపాలను హరించుకుందామనీ.,ఆ హరించే శక్తి అమ్మ దుర్గామాత మనందరికీ ఇవ్వాలని ఆశిద్దాం.


*జై దుర్గామాతా..*

దీపారాధన

  

*దీపారాధన* 


దీపం పరబ్రహ్మ స్వరూపం..

దీపం మంగళ కారకం 

దీపం ఆరోగ్యదాయకం


ఉదయ సంధ్యా దీపారాధన సర్వ సౌభాగ్యదాయకం.

సంప్రదాయబద్దంగా వెలిగించే నూనె లేదా నేతి దీపానికి ఆధ్యాత్మిక కారణం వుంది.

దీపం జ్ఞానానికి చిహ్నం నేటికి పూజ చేసేటప్పుడు దేవాలయములోను నేతి దీపాలను వెలిగిస్తారు. దీపం ఒక జ్యోతి వెలుగుతో అనేక జ్యోతులను వెలిగించవచ్చును,దీపానికి చీకటిని పారద్రోలి వెలుగులు పంచగల శక్తి దీపానికి వుంది.

పవిత్రమైన శుభ సందర్భాల్లో దీప జ్యోతిని వెలిగించే సంప్రదాయం మనది.

దీపం చీకటిని పారత్రోలె దివ్యజ్యోతి ప్రతి ఇంట ఉదయం, సాయంత్రం దీపారాధన చేయటం హిందూ సంప్రదాయం.

దీపపు కుందేలలో వేసే నునె/నెయ్యి ప్రత్తితో చేసే వత్తి మన అహంకార,లోభము,మొహానికి సంకేతం. భగవంతుని ఎదుట దీపం వెలిగించగానే నెమ్మదిగా అవి నశిస్తాయని బావిస్తారు.

దీపపు సమ్మెను తప్పనిసరిగా పూజించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో వుంది.

దీపపు సమ్మెకు కుంకుమ, గంధం మూడు చోట్ల పెట్టి పూలతో అలంకరంచి పూజిస్తారు. ఆ తరువాత ఆ దీపాన్నిఅష్టదిక్కులకు భూమికి అకాశానికి చూపిస్తూ నమస్కరిస్తూ దేవుని వద్ద ఉంచుతారు. దీపపు సమ్మెకు వుండే ఐదువత్తుల యొక్క పరమార్ధం …… ఐదువత్తులలో మొదటి వత్తి భర్త కోరికలు తీరుటకు, రెండోవ వత్తి సంతాన యోగక్షేమాలకు, మూడోవ వంశవృద్ది కొరకు, నాల్గోవ వత్తి కీర్తి ప్రతిష్ట ల కొరకు, ఐదోవ వత్తి దు:ఖముల నుండి విముక్తి కొరకు ఈ ఐదు జ్యోతులను వెలిగించటం శ్రేయస్కరం.

అమావాస్య రోజున సాయంసంధ్యలో దీపారాధన చేసి ఇష్ట దైవాన్ని పూజించి అష్టదిక్కులకు చూపించిన అరిష్టాలు తోలగుతాయి.

దీపము కొండెక్కిన….

దీపము కొండెక్కిన ఇష్టదేవత నామాన్ని జపిస్తూ మళ్లీ దీపము వెలిగిస్తే దీపము కొండెక్కిన దోషము తొలగుతుంది. 

ఒక వత్తిని ఏనాడు వెలిగించరాదు, దీపారాధన రెండు వత్తులు వేసి వెలిగించవలెను.

మురికిగా వున్న వత్తిని వెలిగించిన జ్ఞాపకశక్తి తగ్గుతుంది. స్టీల్ కుందులలో దీపారాధన చేయరాదు.

దీపారాధన ఈశ్వరునికి ఎడమ వైపు, విష్ణువుకి కుడి ప్రక్కన చేయాలి, దేవి పూజలలో నేతిదీపాన్ని వెలిగించాలి.

దీపమునకు కుంకుమ పూవులు పెట్టి పూజ ప్రారంబించాలి. దీపమునకు ఈ విధంగా చేయుట అగ్నిదేవుని ఆరాధించుటకు సంకేతం.

*విజయ విలాసిని

 *విజయ విలాసిని*

సృష్టి అంతా ఆవరించి ఉన్న పరమ చైతన్యాన్ని, ప్రకృష్టమైన శక్తిని జగన్మాతగా ఆర్ష ధర్మం దర్శిస్తోంది. సకల సృష్టికి మూలం శక్తి. సృష్టి స్థితి లయాత్మకమైన శక్తి పలు రీతుల వ్యక్తమవుతోంది. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులే జగత్తును ముందుకు నడిపిస్తున్నాయి. ఏ కార్యక్రమాన్నైనా నిర్వహించాలనే సంకల్పం- ఇచ్ఛ! ఆ వ్యవహారానికి నిర్మాణాత్మక ప్రణాళిక రూపకల్పన- జ్ఞానం! సంకల్పాన్ని, ప్రణాళికను సమ్మిళితం చేయడం క్రియ! ఈ మూడింటి సర్వ సమగ్ర రూపమే మహాశక్తి. అందుకే ఆ దివ్యజనని విశ్వనిర్వహణా శక్తిగా ప్రకటితమవుతోంది. ఈశ్వర స్వరూపమైన ఈ జగతిలో ప్రతి కార్యానికి ప్రేరణ, స్ఫూర్తి, ఆలంబన జగదంబేనని లలితా త్రిశతి ప్రస్తావించింది. ప్రతి జీవిలోనూ ‘నేను’ అనే ఆత్మ తత్వం నెలకొని ఉంటుంది. ఆ ఆత్మ తత్వానికి సంకేతం పరాశక్తిగా విలసిల్లే చిచ్ఛక్తి!

సౌజన్య పూరితమైన, సౌమనస్యదాయకమైన భావజాలం వ్యక్తుల్లో పరివ్యాప్తం కావాలని ఆదిశక్తి అభిలషిస్తుంది. అరిషడ్వర్గాలతో అహంకారయుతంగా పెచ్చరిల్లడం దనుజత్వం. ఆ తమోగుణం తొలగించుకుని సత్వగుణాన్ని సాధించడం దివ్యత్వం. అజ్ఞానయుతమైన ఆసురీ శక్తుల్ని అంతం చేసి, వారిలో జ్ఞాన గరిమను పెంపొందించి, తమస్సు నిండిన హృదయాల్లో ఉషస్సు నింపడానికి అంబ అవతరించింది. అందుకే ఆ మహా శక్తిని, అజ్ఞానుల హృదయాల్లో గూడుకట్టుకున్న చీకటిని తొలగించే సూర్య ప్రకాశ ద్వీపనగరిగా, మహా చైతన్యం నిండిన మకరంద ఝరిగా జగద్గురువు ఆదిశంకరులు సౌందర్యలహరిలో ప్రస్తుతించారు.

శరత్కాలంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు కొనసాగే అమ్మ ఆరాధనా క్రమాన్ని శక్తి తంత్రంగా పేర్కొంటారు. భక్తి భావన, ధర్మపాలన, యోగసాధన, ఆధ్యాత్మిక చింతన, నైతిక రుజువర్తన వంటి ఉత్తమ గుణాలనే పుష్పాలతో దేవిని పూజించే అర్చనా సంవిధానమే శక్తి తంత్రం.

ఆంతరంగికమైన వైపరీత్య భావాలపై పైచేయి సాధించడం విజయం. బాహ్యంగా తారసిల్లే దుష్టశక్తులపై యుక్తిగా గెలవడం జయం. ఈ రెండింటినీ సమన్వయంగా అనుగ్రహించే శక్తి ఆకృతి విజయేశ్వరి! రక్షణాత్మకమైన క్షేమకారక శక్తి విజయదశమి నాడు అపరాజితగా అలరారుతుంది. అసురులందరూ వ్యక్తుల్లో ఉండే అనేక ప్రతికూల ధోరణులకు సంకేతం. ఒకే ఒక్క మహాశక్తి అనేక రూపాలుగా విడివడి దుష్ట సంహారం చేసింది. ఆసురీ భావాలు విజృంభిస్తే ముందు వ్యక్తులు పతనమవుతారు. ఆపై వ్యవస్థలు కునారిల్లుతాయి. దుర్గాంబను వేదం తారణీశక్తిగా, అంటే అన్నింటినీ అధిగమింపజేసే దివ్యరూపిణిగా ప్రస్తావించింది. దుర్మార్గం, దుష్టత్వం, దురాచారం వంటి దురితాల్ని నిలువరించి, సర్వశుభ మంగళదాయినిగా విజయవిలాసిని వర్ధిల్లుతోంది.

నిస్తేజాన్ని జయించి, జడత్వాన్ని అధిగమించి, ప్రయత్నశీలతతో పురోగమించి, కర్తవ్యదీక్షతో అనుకున్నది సాధించడానికి కావాల్సిన శక్తిని అందుకోవడానికి ఉపకరించే ఉపాసన- శరన్నవరాత్రుల్లో శక్తి ఆరాధన! సద్బుద్ధి, సౌశీల్యం వంటి సుగుణాలకు బలిమిని, కలిమిని అందించడమే శక్తిమాతల అనుగ్రహ ఫలం. విజయదశమినాడు ‘అగ్ని గర్భ’గా వ్యవహరించే శమీ వృక్షాన్ని పూజిస్తాం. మనలో ఉన్న ఉగ్రత్వం, క్రోధం, తీష్ణత వంటి అగ్నితత్వాలన్నీ తొలగి, వ్యతిరేక అంశాలు శమింపజేయడానికి శమీపూజ ఉపయుక్తమవుతుందని చెబుతారు. ఐశ్వర్యం, ధీరత్వం, కీర్తి, తేజస్సు, ఆరోగ్యం, ఆకర్షణ, ఆనందం, సౌజన్యం అనే అష్టమహా ఫలితాల్ని శరన్నవరాత్రుల్లో భక్తులు దేవీ కరుణతో సాధిస్తారని దేవీ భాగవతం వివరించింది. అందుకోసం విజయద అయిన అపరాజిత అనుగ్రహాన్ని సర్వదా ఆకాంక్షించాలి!

✍🏻- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

*మిత్రులకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు*

*తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు  క్రింది లింక్ ద్వారా చేరండి*

https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ

"న మంత్రం

 🙏🙏🙏

*******

        **శుభోదయం**

                     ***

""న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో

న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాః

న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం

పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణమ్""

                ***

**ఓ మాతా!...నాకు మంత్రము కానీ తంత్రము కానీ ఏదేని స్తోత్ర విధానము కానీ తెలియదు. కనీసం నిన్ను ఎలా వేడుకోవాలో కూడా తెలియదు...నీతో ఎలా మధ్యవర్తిత్వం నడపాలో కూడా తెలియదు...నాకు సంగీత పాటవం కూడా లేదు. నాకు జప ముద్రా విధానం తెలియదు. కానీ నేను నిన్ను మాత్రం శరణు వెడితే నా సకల బాధలూ పటాపంచాలవుతాయనీ మాత్రం తెలుసు .. అమ్మా నాకు నీవే శరణు శరణు.**

*******

 *దసరా పండుగ శుభాకాంక్షలు*

    **శుభప్రదమైన రోజు**

                    ***

పాలపిట్ట

 *పాలపిట్ట దర్శనం ఎందుకు* 


🍁🍁🍁🍁


విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా 9 రోజుల పాటు దుర్గాదేవిని పూజించి చివ‌రి రోజున ఉత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ద‌స‌రా రోజు రావ‌ణ‌ద‌హ‌నంతోపాటు చేయాల్సిన కార్య‌క్ర‌మాల్లో మ‌రొక‌టి.. పాల‌పిట్ట ద‌ర్శ‌నం. ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను దర్శించుకోవ‌డం వ‌ల్ల‌ అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. అయితే అస‌లు పాల‌పిట్ట‌ను ఎందుకు ద‌ర్శించుకోవాలి ? దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణం ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.


పాండ‌వులు అర‌ణ్య‌, అజ్ఞాత వాసాల‌ను ముగించాక విజ‌య‌ద‌శ‌మి రోజున శ‌మీ వృక్షంపై ఉన్న త‌మ ఆయుధాలను తీసుకుని హ‌స్తినాపురం వైపు ప్ర‌యాణ‌మ‌వుతారు. అదే స‌మ‌యంలో వారు పాల‌పిట్ట‌ను చూస్తారు. దీంతో వారికి ఆ త‌రువాత అన్నీ శుభాలే క‌లుగుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో కౌర‌వుల‌పై వారు విజ‌యం సాధిస్తారు. అప్ప‌టి నుంచి ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను చూడ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంద‌ని పురాణాలు చెబుతున్నాయి.


పాల‌పిట్ట సాక్షాత్తూ దేవీ స్వ‌రూప‌మ‌ని, అది ఉత్త‌ర దిక్కు నుంచి వ‌స్తే ఇంకా మంచిద‌ని, శుభాలు, విజ‌యాలు క‌లుగుతాయని పండితులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. విజ‌య‌ద‌శ‌మి రోజున క‌చ్చితంగా పాల‌పిట్ట‌ను చూడండి.. చూడ‌డం మాత్రం మ‌రిచిపోకండి..!



🍁🍁🍁🍁

విజయదశమి

 *విజయదశమి*

🙏🌹🌹🌻💐🌻🌹🌹🙏

*వి + జయ + దశ + మి*


ప్రాచీన రుషులు ఏ పేరుని పెట్టినా అందులో గమనించాల్సిన అనేక రహస్యాలు– అక్షరాల్లో, పదాల్లో, పదాల విరుపుల్లో... ఇలా ఉండనే ఉంటాయి. వాటిని తెలుసుకున్న పక్షంలో పండుగలలో దాగిన గొప్పదనం అర్థమై పదికాలాల పాటు మనం ఈ పండుగ సంప్రదాయాన్ని కొనసాగించగలిగిన వాళ్లం – ముందు తరం వాళ్లకి అందజేయగలిగిన వాళ్లం కూడా కాగలం. 


ఈ దృష్టితో చూస్తే ఈ పండుగ పేరు *‘జయదశమి’* కాదు. *విజయ దశమి* ట. పైగా *"విజయ ‘దశ’ మి"* ఏమిటి? పదిరోజులపాటు సాగే పండుగట ఇది. మంచిదే! పదిరోజుల పాటే ఉందుకు సాగాలి? సరే! పదిరోజులపాటూ పండుగ చేసుకోకుండా 10 వ రోజునే ఎందుకు పండుగగా చేసుకోవాలి? ఈ పదిరోజుల్లోనూ మరి 'మూలా నక్షత్రం రోజున సరస్వతీ పూజా', 'దుర్గాష్టమి రోజున దుర్గాపూజా' కూడా ఉంటూంటే, విజయం మాత్రం 10వ రోజునే వచ్చిందంటూ ‘విజయదశమి’ నాడే విశేష పూజని ఉదయం సాయంకాలాల్లో చేస్తారా? ఎందుకని? ఇలా ఎంతగా ఆలోచించడం మొదలెడితే అంతా ఆశ్చర్యంగానే ఉంటుంది కదా! లోపలికి వెళ్లి రహస్యాలని తెలుసుకుందాం!


*జయం* వేరు– *విజయం* వేరు

కేవలం మనకున్న అంగబలంతో (మనుష్యుల సహాయం) అర్ధ (దాడి చేయడానికి కావలసిన ధనం) బలంతో ఎదుటివారి మీదికి వెళ్లి గెలుపుని సాధించగలిగితే– గెలిస్తే దాన్ని ‘జయం’ అనాలంది శాస్త్రం. ఇలా సాధించిన ‘జయం’ ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. ఇది నిజం కాబట్టే ఈ యుద్ధంలో గెలుపుని సాధించిన రాజు పైసారి యుద్ధంలో గెలుపుని సాధించని సందర్భాలెన్నో కనిపిస్తాయి మనకి. అశాశ్వతమైన గెలుపుని ‘జయం’ అనాలంది ధర్మశాస్త్రం. 


అదే మరి *‘విజయ’* మైతే అది సంపూర్ణం శాశ్వతం కూడా. జయానికీ విజయానికీ మధ్యనుండే తేడా అనేది అంగ బలాన్నీ అర్ధబలాన్నీ మరింతగా సమీకరించుకున్న కారణంగా వచ్చేది కాదు. *‘జయం’* అంటే మనుష్య శక్తితో సాధించబడేదీ, సాధించుకునేదీ. అయితే *విజయ* మనేది మనకి రాబోతున్న గెలుపుకి భగవంతుని అనుగ్రహం తోడైతే లభించేది ఔతుంది.


మనకి కావలసిన అన్ని శక్తులూ ఉన్నా భగవంతుని అనుగ్రహం లేని పక్షంలో మనకి కలిగే గెలుపు సంపూర్ణం శాశ్వతం కానే కాదు. ఇది నిజం కాబట్టే అర్జునునికి ఉన్న పేర్లలో ఒకటి ‘విజయుడు’ అనేది. అంటే ఎల్లకాలమూ అతనికి భగవదనుగ్రహం ఉంటూనే ఉంటుంది సుమా! అని తెలియజెప్పడమన్నమాట. ఆ కారణంగానే అర్జునుని కంటె గొప్పవాళ్లైన ఏకలవ్యుడూ కర్ణుడూ కూడా అతణ్ణి గెలవలేకపోయారు. పైగా ఏవేవో కారణాల వల్ల ఓడిపోయారు కూడా. మళ్లీ ఇదే అర్జునునికి, భగవదనుగ్రహమనేది ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వీడి వెళ్లినప్పుడు (నిర్యాణమైనప్పుడు) ఉండే వీలే లేకపోయింది. ఆ కారణంగానే అంతఃపుర కాంతలందరికీ రక్షణగా ఉంటూ ఆ స్త్రీలని తెస్తూన్న సందర్భంలో దోవలు కొట్టేవాళ్లంతా అర్జునుని మీద తిరగబడి అర్జునుణ్ణి కావడి బద్దలతో మోదారు. అంటే ఏమన్నమాట? కృష్ణుడున్నంతకాలమే అర్జునునికి ఆ శక్తి ఉండి ‘విజయుడు’ అయ్యాడు. ఆయన గతించాక అర్జునుడు కేవలం ‘పార్థుని' గానే (కుంతీదేవి పుత్రునిగా మాత్రమే) అయిపోయాడు.


కాబట్టి జయమంటే గెలుపు– విజయమంటే భగవంతుని కృపానుగ్రహాల కారణంగా లభించిన గెలుపని అర్థమన్న మాట! అందుకే సంప్రదాయం తెలిసిన ఎవరికైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నామంటూ చెప్పి పాదాభివందనాన్ని చేస్తే– ‘జయోస్తు’ అనరు. ‘విజయోస్తు’ అనే ఆశీర్వదిస్తారు. ‘నీకు గెలుపు లభించుగాక! దానికి పరమేశ్వరుని అనుగ్రహం ఉండుగాక! ఆ కారణంగా నీది శాశ్వతమైన గెలుపుగా మారుగాక!’ అని దాని అర్థమన్నమాట.


తనంత తానుగా ఆ అమ్మే ఓ దేవత అవుతూంటే, మళ్లీ ఆమెకి గెలుపుకోసం మరో దేవతానుగ్రహం కావాలా? అప్పుడే కదా ఆమె జయం– విజయం– ఔతుంది? ఇదేమిటనిపిస్తుంది.

రాక్షసులూ దేవతలూ అనే ఇద్దరూ ఆయా స్థానాలని పొందింది కేవలం తమకి తాముగా ఆచరించిన తపస్సు వల్లనే. అంటే సాధించిన తపశ్శక్తి కారణంగానే. ఈ నేపథ్యం లో రాక్షసులు ఎక్కడ దేవతలని జయించలేమో? అనే దృష్టితో మరింత మరింత తపస్సుని చేశారు. వాళ్లు ఎంత స్థాయి తపస్సుని చేశారంటే– తానొక్కతే గాని వెళ్లి యుద్ధానికంటూ దిగితే చాలనంత. 


దాంతో ఆమె *గణపతి నుండి పాశాన్నీ, కుమారస్వామి నుండి శక్తి ఆయుధాన్నీ, తన భర్త శంకరుని వద్దనుండి శూలాన్నీ, శ్రీ మహావిష్ణువు నుండి చక్రాన్నీ...* ఇలా ఇన్నింటినీ ధరించి (8మంది దేవతల నుండి 8 తీరుల తపశ్శక్తిని ఆయుధాల రూపంలో స్వీకరించి అష్టభుజిగా) ఆమె రోజుకొక్క రాక్షసుణ్ణి చొప్పున వధించుకుంటూ వచ్చి 9 మంది రాక్షసులని వధించాక 10 రోజున 10వ రాక్షసుడైన *మహిషుణ్ణి* వధించింది. ఇలా 9 దాటి 10 వ వధ కాబట్టీ, విజయాన్ని సాధించిన 10వ రోజు కాబట్టీ ‘ *విజయదశమి’* అయింది. అది 10 (దశ) కున్న గొప్పదనం. 10 అనేది పూర్ణసంఖ్య. తన వెనుక 9 ఇంటిని అండగా కలిగిన సంఖ్య. 


దిక్కుల సంఖ్య 10. తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తరాలు నాలుగూ, ఈశాన్య ఆగ్నేయ నిరృతి వాయవ్యమనే విదిక్కులూ (దిక్కుకీ దిక్కుకీ మధ్యన ఉండేవి) నాలుగు, పైనా కిందా అనే రెండూ కలిపి 10 మాత్రమే.


శ్రీ హరి ఈ లోకంలో ఉన్న అందరినీ (84 లక్షల జీవరాశుల్ని) రక్షించే నిమిత్తం ఎప్పటికి ఏది అవసరమో గమనించి అప్పటికి ఆ అవతారాన్నెత్తుతూ క్రమంగా మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ కృష్ణ అనే 9 అవతారాలని ముగించి ఇక తప్పదనే దృష్టితో ‘కల్కి’ అవతారాన్నెత్తి మొత్తం అందర్నీ సంహరించి యుగానికి ముగింపుని 10వ అవతారంతోనే చేశాడు.


పది తర్వాత అంకెలన్నిటిలోనూ పది అంకె ప్రవస్తావన ఉంటూనే ఉంటుంది. ఏకాదశి (1+10=11), 

ద్వాదశ (2+10=12) 

త్రయోదశ (3+10=13) 

చతుర్దశ (4+10=14)... ఈ తీరుగా ఉంటూనే ఉంటుంది.


వ్యక్తి శరీరం కూడా బాల్యం– బుద్ధిబలం– శరీరబలం – కంటిబలం తగ్గడం – శుక్రశక్తి తగ్గడం– రక్తం తగ్గడం– మానసిక ధైర్యం తగ్గడం– శరీరం స్పర్శనీ, కళ్లు చూపునీ, చెవులు వినికిడినీ, ముక్కు వాసననీ, నాలుక రుచినీ కోల్పోతుంది ప్రతి పదేళ్లకీ. (1 నుండి 10 వరకూ బాల్యం, 11 నుండి 20 వరకూ బుద్ధిబలం... ఇలా ఎదిగిన శరీరం తగ్గుదలవైపుకి వెళ్తూ 91 నుండి 100 కి అన్ని అవయవాల దిగుదలకీ వ్యక్తి గురవుతూ ఉంటే ఇక్కడ కూడా ప్రాధాన్యం 10 కే కదా!


కేవలం ఓటమి అనేదే లేకపోవడం కాదు. పవిత్రత కూడా ఏమాత్రమూ చెడకపోవడం ఉంటుంది ఈ విజయదశమి రోజున. 


అమ్మవారు ఈ విజయదశమి రోజునజమ్మిచెట్టు నీడన ఉంటుంది. జమ్మిచెట్టునే సంస్కృతంలో శమీ అంటారు. లోకంలో ఎక్కడైనా అపవిత్రత అనేది ఉండే చోటుగా శ్మశానాన్ని చెప్తారెవరైనా. ఆశ్చర్యకరమైన అంశమేమంటే *జమ్మిచెట్టు– అమ్మవారు ఈ విజయదశమి రోజున ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటారో, అది అపరాజితాస్థలం.* 


ఆ జమ్మిచెట్టు మాత్రమే శ్మశాన స్థలాన్ని కూడా పవిత్రీకరించగల శక్తి కలది.  ఈ కారణంగానే అమ్మవారు జమ్మిచెట్టు కింద కూర్చుని దర్శనమిస్తూ– అ– పరాజిత–నని తన గూర్చి మనకి అర్థమయ్యేలా అనుగ్రహిస్తారు అందర్నీ వీరు, వారు అనే భేదం లేకుండా!


ఇంత లోతు అర్థం కల 10వ తిథి అయిన దశమి నాడు అమ్మ రాక్షసులపై విజయాన్ని సాధించింది. అందుకే అపరాజిత ఇంతటి విజయాన్ని సాధించిందీ, 9 దాటి 10 వ నాడు విజయ రహస్యాన్ని మనకందించిందీ అమ్మ కాబట్టే ఆమెకి ఈ విజయదశమి నాటి పేరు ఆమె చేసిన కృత్యాలని బట్టి– అ– పరాజిత– అని. పరాజయం (ఒటమి) అనేదే ఎరుగని తల్లి– లేని తల్లి. (న+ పరాజిత= అపరాజిత)


*తన్నో దుర్గిః ప్రచోదయాత్‌!*



🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

🙏🌹🌹🌻💐🌻🌹🌹🙏

" Art of parenting

 "   "మీ పిల్లల పెంపకంలో మీరు వైఫల్యం చెందుతున్నారరా? మీ పిల్లలు మీ మాట వినడం లేదా? పేచీలు పెడుతున్నారు? అది మీకు పెద్ద సమస్యగా ఉన్నదా? "అయితే ఓపికగా పూర్తిగా ఈ విషయాలు చదవండి". (సేకరణ & సమర్పణ:- "మజుందార్,బెంగళూర్,Cell No: 87925- 86125".                   "  నేడు ఈ సమాజంలో పిల్లలకు పూర్తి  "స్వేచ్ఛ" ఇచ్చుచున్నారు.  పిల్లలు వారి గోల్స్ మీకు చెబుతారు.   మీ పిల్లల ఫెయిల్యూర్స్ కి బాధ్యత  ఎవరి మీద కో    త్రోసి  వేయుచున్నారు.  అవును కదా!  అసలు మీ పిల్లలు ఎక్కువ సమయం ఎవరి వద్ద గడుపుతున్నారు?  కొన్ని సంవత్సరాల కిందట ప్రభుత్వం జంతువులను సర్కస్ కంపెనీలో హింసకు గురి చేస్తున్నారని వాటిని సర్కసు యందు ఉపయోగించరాదని నిషేధం విధించినారు.   అప్పుడు బెంగాల్ రాష్ట్రములో సర్కస్ కంపెనీ వారు తమ వద్ద ఉన్న పది (10)పులుల ను అచట అడివి యందు వదిలి వేసినారు.   ఆ 10  చిరుతపులు లను వేట కుక్కలు తరిమి కొట్టి చంపి వేసినవి.   వాటికి ముఖ్య కారణం"Life skills"  నేర్పించలేదు.   అలాగే మన పిల్లలకు గారాబంగా కష్టపడకుండా ఏసీ స్కూల్స్ రూములు, ఏసీ బస్సులు, అక్కడే భోజనం, వారు సుఖంగా ఉన్నారు అని ఊహించు కోను చున్నారు.  వీరు చదువును కొను చున్నారు.  కాని చదువుట లేదు.  పేద వాళ్ళ స్థితిగతులు, గ్రామీణ వాతావరణం, ప్రకృతి సౌందర్య ఆరాధన, వారికి తెలియదు.  న్యూట్రల్ ఫ్యామిలీస్  వల్ల , మానవ సంబంధాలు, సేవా దృక్పథం, మానవత్వం, ధైర్యం, పట్టుదల, వినయ విధేయతలు మొదలగు అనేక విషయాలపై అవగాహన, ఆలోచన, పరిశీలన, అవసరం కానీ లేక   సామాజిక బాధ్యతలు, మానవత్వం లేకుండా వారి తల్లిదండ్రులు పిల్లల కొరకు పడే కష్టం, తపన, డబ్బు విలువ, సమయము విలువ, తెలియకుండా, ఒకరిపై ఆధారపడి  జీవించే తత్వము పై జీవిస్తున్నారు.   స్వతంత్ర భావాలు సన్నగిల్లుతున్నాయి. సరియైన  నాయకత్వ లక్షణాలు ఏ కోశానా ఉండుట లేదు.  ఈ పిల్లల వయస్సును చిన్నతనములో మూడు (3) భాగాలుగా విభజించవచ్చు.   వాటిని గురించి ఈ విధముగా తెలుసుకుందాం.          .1 Zoun :(0-- 5 Yrs. పిల్లలు) :- " వీరిని తల్లితండ్రులు దేవుడిలాగా, మల్లె పువ్వులా సుకుమారంగా చూడాలి!  మీరు ఈ వయసులోనే పిల్లలను బెదిరించారా? ఇంతే సంగతులు ,వాళ్ళు అదేవిధంగా మారతారు.  జాగ్రత్త  సుమా!  వారిని మీరు పూర్తిగా ఫ్రీగా వదిలిపెట్టండి.  కలియతిరుగుతూ "అబ్జర్వ్" చేస్తాడు.   ఆ వయసు వాడు  ప్రేమ కోరుకుంటాడు.   "ప్రేమనగర్" సినిమా లో ఆయాని( దాది)  అమ్మా అని అంటాడు.   చూశారు కదా!  మీరు వారిని భయపెట్టే మాటలు ఏవి చెప్పకండి?  ఈత కొట్టుట, గోడ ఎక్కుట, చెట్టు ఎక్కుట, సైకిల్ తొక్కుట, దూకుట, ఎగురుట, అల్లరి ఎంత చేస్తే, అంతా చెయ్యనివ్వండి? స్వేచ్ఛ ఇవ్వండి, జాగ్రత్తగా దగ్గరుండి  చూసుకోండి, ఆపదలు రాకుండా అది మాత్రమే మీ వంతు బాధ్యత ,కర్తవ్యం అని తలచండి, ఆటలు ,పాటలు, ఆ వయసులో వాడికి  లోకం అదే ! వారిని ప్రోత్సహించండి?  దీనికి హద్దులు   పెట్టకండి, వాడు ఎంత విహరిస్తే అంత గొప్పవాడు అవుతాడు? (ఒక పిల్లల మనస్తత్వ శాస్త్రవేత్త అంచనావేసి చెప్పిన విషయము)               2 nd Jone (06 -- 12 Yrs, పిల్లలు) :-- " వీరి విషయములో చాలా అప్రమత్తంగా (careful) గా  treatment  చేయాలి? ఆ వయస్సు లోని  పిల్లలను  హేళన చేయుట,  సిగ్గుపడే  విధమైన  మాటల తో చులకన చెయ్యకండి.   ఇంటికి వచ్చిన బంధు మిత్రుల వద్ద  వారిని తక్కువ చేసి  మాట్లాడుట  చేయకండి.   ఇది వాళ్ళ జీవితానికి "టర్నింగ్ పాయింట్"  అని గుర్తించండి.   మీ పిల్లవాడి విషయం నీకు ఏమి తెలుసు, వారి భవిష్యత్తును మీరు ఎట్లా అంచనా వేస్తారు?  Positive thinking  తో తప్పా  ఎప్పుడు        "negative thoughts" తో మాట్లాడవద్దు.    ఈ వయస్సు వారి జీవితానికి అత్యంత విలువైనది.  దానిని మీరు బాగా చేసినా? చెరిపిన మీరే దానికి బాధ్యులు ,కారణం కనుక అత్యంత శ్రద్ధ తీసుకోండి  దయచేసి,. ఈ దేశ బావి భవిష్యత్తు వారి  మీదే   ఆధారపడి ఉంది.   అందుకే  నేటి మన కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధతో "దేశభక్తి" ఉన్నత విలువలు గల సమర్థవంతమైన ఆలోచనతో    నాయకత్వ లక్షణాలతో ఈ దేశం ముందు ఉండాలని ఎంతో ఉన్నత విలువలు గల పాఠ్య ప్రణాళిక , బోధన, సిబ్బందిని తగిన విధముగా  శిక్షణ ఇచ్చుటకు "నూతన పంధా తో దేశమంతటా ఒకే పాఠ్యప్రణాళిక" రూపొందించుటకు గాను కంకణం కట్టుకుంది.   ఈ వయస్సు పిల్లలను దండించ కూడదు.   ఏటువంటి పరిస్థితిలో నైనా  " మిలట్రీ ట్రీట్మెంట్" ఇవ్వాలి.  అవమానించిన గెట్టిగా ఫీల్ అవుతాడు.   మీ పిల్లలను వేరే పిల్లలతో పోల్చకండి.   Instant చేయరాదు.   పిల్లలను స్నేహితులుగా చూడాలి.   వారిలో ఆత్మవిశ్వాసం కలగజేయాలి.  వాడు ఏ పని చేసినా   "Super" అని.   "Good Job"  అంటూ మెచ్చుకోలు మాటలే   మాట్లాడండి.   నీవు ఇంకా  బాగా చదవగలవు?  ఇంకా బాగా గుండ్రముగా రాయగలవు ?ఇప్పుడు రాసింది కూడా బాగుంది, ముందు మెచ్చుకోండి ?ఆ తరువాత సూచన చెప్పండి .తిరిగి మళ్లీ మెచ్చుకోండి?  ఈ పద్ధతి వాడండి?  స్ఫూర్తి , ఉత్సాహము, పోత్సాహము, ఆసక్తి కలుగజేయుట మీ విది.  Weekend లో మంచి ప్రదేశాలు తిప్పండి,  ప్రకృతిని ఆస్వాదించే అవకాశం  ఇవ్వండి. పెన్ను ,పుస్తకము ఇచ్చి ఎలా ఉంది నీకు ఎలా అనిపించింది రాయమని కోరండి? అడగండి, మంచి పదాలు చెప్పి ప్రోత్సహించండి?  చిన్నతనము నుండి "ఫీడ్బ్యాక్ "ఇచ్చుట అలవాటు చేయండి.   ప్రేమించుట నేర్చుకో గలడు, అసూయ, ద్వేష భావం  రాదు.  మానసిక పరిపక్వత   వస్తుంది.  మీకు అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తాడు.  మా నాన్న నాకు ఫ్రెండు  అని ఊహించుకుని ఉంటాడు.   మీరు న్యాయం గా ఉండాలి.  కష్టం లేకుండా పెంచినా, మీరు పడే కష్టం ,డబ్బు విలువ తెలియజేయండి.   పొదుపు చేయుట, స్వతహాగా సంపాదనకు మార్గాలు అన్వేషణ మార్గము   సూచించి బోధ పరచండి.         , ఈ క్రింది సూచనలు పాటించండి--  నడుచుకునే విధంగా చేయండి.             ,1) TIME :-- "తగిన సమయం  ఇవ్వండి.   స్కూలు నందు  ప్రతి పేరు ఏమి జరిగింది  ఏ సబ్జెక్టు చెప్పారు.   ఏ హోమ్ వర్క్ ఇచ్చినారు.    మీ క్లాస్ టీచర్ ఏ పాఠం చెప్తారు.  నీకు బాగా అర్థం అయ్యిందా? నేను ఏమైనా నీకు హెల్ప్ కావాలా? నన్ను అడుగు, నిద్రపోయే ముందు రామాయణ, భారత, భాగవత , నీతికథలు ,. స్వాతంత్ర సమరయోధుల గురించి,  world map, India map,   కొని ఇవ్వండి .వాటి మీద రోజు అవగాహన, సమీక్ష చేయండి.  వారిని ఇన్స్పైర్ చేయండి.   వారు మంచి కలలు కంటారు, దానికి తోడ్పాటు ఇవ్వండి?  వారి Goles(లక్ష్యం) తెలుసుకోండి?  Imagination  కల్పించండి.    Doctor lawyer ,Bank, ఐఏఎస్ అధికారి, వారికి  "Goles "కు సంబంధించిన items కోని  Bed వద్దా కనపడు లాగునా ఉంచండి.     2) "teach":-- (బోధన) " ఏ స్కూలు నందు చేర్చాలి. మేనేజ్మెంట్ వారు ఎవరు?  వారి  గురించి వారు అన్యువల్ డే సెలబ్రేషన్ చీఫ్ గెస్ట్ గా ఎవరిని  పిలిచారు అనేది   అంచనా వేయండి,    అక్కడ పరిస్థితులు,   సమీక్షించి,  మీరు స్కూలుకు వెళ్ళినా మీ పిల్లవాడి టీచర్ వద్ద మీరు చాలా గౌరవం ,మర్యాద, భక్తిభావంతో ఉండండి. మీ పిల్లవాడు కూడా చూసి నేర్చుకుంటాడు.     3) Touch (ఆత్మీయ స్పర్శ) :-- భుజం మీద చెయ్యి వేసి ,నవ్వుతూ పలకరించి ఉండండి.        4)Trust(నమ్మకం):--మీ పిల్లవాడి చెప్పే మాటలు నమ్మండి, కుర్రవాడికి నమ్మకం కలిగించండి.  తెలియకుండా నిఘా పెట్టండి.        5) Truth(నిజం):-- నిజమైన, వికాసైన అయిన మాటలు, చెప్పండి.   "ప్రపంచ వింతలు".  చెపుతూ ఆసక్తికర గా చేయండి.   "మోటివేషనల్ స్టోరీస్," "కొటేషన్స్"   చెప్పండి.   6)Talk(మాట్లాడుట) :-- మాటల ద్వారా మంచి విషయ పరిజ్ఞానం అందించండి .    మానవ సంబంధాలకు ను తెలియపరచండి. మీ బంధుమిత్రులను వచ్చిన వారితో ఎలా మెలగాలో   నేర్పండి, మీరు   ఆచరించిన   వారే నేర్చుకోగలరు.                 3rd Zone (13 Yrs to 19 yrs):-- 1)ఈ వయసు పిల్లలు "టీనేజ్ "అని అందురు.   ఈ వయస్సు పిల్లలను ఫ్రెండ్స్గా  feel  చేయుట పేరెంట్స్ యొక్క ముఖ్య కర్తవ్యం.   Be Friend Ship -- Food Habits జాగ్రత్తలు అవసరం.    2) "section of friends :-- " మనం వారిని ఐడెంటిఫై  చేయాలి .  వారిని 4 రకాల ఫ్రెండ్స్ కల్చర్ గా చెప్పాలి ఇక్కడ,   ఈ విషయాలను  మీ పిల్లలకు    సరైన అవగాహన   కల్పించండి.1  I am winnar -- You are Winner.   ఈ కోవలోని వారు అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు.               2) I am winnar -- you are Looser.        వీరు చాలా danger , మోసం దగా ఒత్తిడి  చేసే వారై   ఉంటారు.             3)" I am Looser --  You are Losser,      కూసే గాడిద వచ్చి మేసే గాడిదని పాడు చేసింది అనే సామెత.   దొందూ దొందే,   ఇలాంటి స్నేహితుల వల్ల ఉపయోగం   లేదు అపకారము లేదు.  4)" I am Looser -- you are Winner. (ఇలాంటి స్టేజీలో నేడు పేరెంట్స్ ఉంటారు.  విడమర్చి చెప్పాలి.  మొక్కై వంగనిది మానై వంగునా? ( టీచరు తల్లిదండ్రుల మాట పిల్లల వినకపోతే).   అసలైన సిసలైన సరి అయిన పద్ధతి అయిన ముఖ్యమైన విశేషం నేటి సమాజంలో పిల్లలకు నీతులు చెప్పి, పెద్దలు ఆచరించరు? ఆలోచించండి ? మీరు ఒకసారి!                  1) మీరు ప్రతి రోజూ రెండు సార్లు బ్రష్ చేసి, మీ పిల్లలకు చెప్పండి?         2)"మీరు ప్రతిరోజు సూర్యుడు ఉదయించే వేళ కు ముందే లేచి (06-00 ఉదయం) మీ పిల్లలకు లేవమని చెప్పండి?               3)" తల్లిదండ్రులు మీ పిల్లల ఎదుట వాదు లాకోవటం, గట్టిగా తర్కించుకొనుట, ఇలాంటివి చేయకండి తరువాత మీ పిల్లలకు చెప్పండి?              4) మీరు టీవీ ,మొబైల్, చూస్తూ-- మీ పిల్లలకు చూడొద్దని చెప్పండి?    5)" మీరు వాళ్ళ స్కూలు టీచరును, మేనేజ్మెంట్ ను గౌరవించిన, మీ వాడు కూడా విన గలడు.?        6)" మీ పిల్లవాడు అన్నం తినకుండా కోపం ప్రదర్శించుట మీరు ఒకటి రెండుసార్లు చెప్పండి ,అప్పుడు మీరు కూడా అన్నం తినుట మానివేయండి. అప్పుడు అమ్మ ప్రేమ వల్ల తింటాడు.  దారికి వస్తాడు.                7) nature is the greatest test book అన్నారు.    పకృతి సిద్ధమైన గార్డెన్స్, వాటర్ ఫాల్స్, కోటలు, జూ పార్క్ లకు పిల్లలతో సందర్శించండి.  వారికి అవగాహన కలిగించుటకు పెన్ను పేపరు లేదా బుక్ ఇచ్చి రాయంచడి.             9) పిల్లి తన పిల్లలను  7 ఇల్లు తిప్పి తగు జాగ్రత్తలు తీసుకొని గొంతును పట్టుకొని మెత్తగా జాగ్రత్త తీసుకుని తిరుగు తుంది కదా!   ప్రాక్టికల్  అవగాహన కలిగించుటకు  మీ పిల్లలను పోస్టాఫీసు, రైల్వేస్టేషను, బ్యాంకు, ఫైర్ స్టేషన్ ,పోలీస్ స్టేషన్ ,కోర్టు,  కలెక్టర్ ఆఫీస్,  బస్టాండ్, ఎయిర్పోర్ట్, వెజిటబుల్ మార్కెట్ ,లకు తిప్పండి , అచ్చట జరుగు కార్యకలాపాలను , వివరంగా ఈ విశధం గా  చెప్పి అర్థమయ్యే విధంగా బోధ పరిచి వారికి వచ్చిన అనుమానాలను తీర్చండి .వారు చూసిన దృశ్యం రూపకమైన వాటి మీద అవగాహన, తో పాటు హృదయములో " ముద్ర" పడును.  10) ఫ్యాషన్ (అభిరుచి) పాడుట,ఆడుట, డాన్స్, లాంటి విషయాలపై బేసిక్ నాలెడ్జి నేర్పండి. వారి అభిరుచికి తగినట్లు తగు శిక్షణ, నైపుణ్యం ,ఇచ్చుటకు తగు ఏర్పాట్లు చేయండి.   నేడు సమాజంలో" చెడుకు" ఎక్కువ ప్రోత్సాహము ఎక్కువ, ఆకర్షణీయముగా కూడా ఉండును.   మంచి విషయాలకు తోడు నీడ వచ్చే వారు చాలా తక్కువ, కావున మీ పిల్లలు వాటి గురించి  ప్రశ్నించవచ్చు ?  మీరు వారికి నిరాశ పడవద్దు నీ చుట్టూ వారి గురించి నీవు ఆలోచించవద్దు.  నీలో ఉన్న విషయము సత్తా ముఖ్యము. నీవు నీ జీవితం నీ ఇష్టం అని చెప్పండి.  దానిని సరైన పంథాలో నడిపించును.  రేడియో ఊహా శక్తికి దోహదం చేసే సాధనం ఇది మంచిది.   రోజూ పేపరు చదువుట అలవాటు చేయండి.   పిల్లలకు శ్రమ పడుట లోని విలువలు నేర్పాలి.     అత్యున్నతమైన విలువలు మారటానికి నిజాయితీ మంచిని ప్రోత్సహించండి.  మెదడుకు మేత చే ఇండోర్   & అవుట్ డోర్ ఆటలు ఆడించండి. విలువలు కలిగిన జీవితానికి సోపానం వేయాలి.    అంతర్గత రూపానికి విలువ ఇవ్వటం నేర్చుకోవాలి.  పంచుకుని తినుట లోని ఆనందమును తెలియజేయండి.   మనం మన సంపదను సమాజంలో నుంచి సృష్టించుకున్న సమాజానికి కొంత తిరిగి ఇవ్వడం మన బాధ్యత, కర్తవ్యం, అని తెలియ పరచండి.    చట్టాలను గౌరవించుట, నైతిక విలువలను పాటించుట.  ఆధ్యాత్మిక దృష్టికోణంలో, వారిని ఉన్నతమైన "భారతదేశపు" సంస్కృతి, సంప్రదాయాలను, ఆ పాడే వ్యక్తిగా తీర్చిదిద్ది ఈ సమాజానికి మీ వంతు బాధ్యత నెరవేర్చండి.   Mobile  మిమ్ములను శాసించి వాడుకుంటుంది మీ సమయాన్ని,  కానీ మీరు  ప్రపంచ జ్ఞానం,  Mobile  ను మనం ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోని, నేర్పండి.    ఇది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన నేర్చుకో దగ్గ విషయాలు, చాలామందికి తెలుసు కానీ గుర్తు చేయటం కొరకు మాత్రమే చెప్పడమైనది. ".        ఈ విషయాలు ఉపయోగపడతాయని అనిపిస్తే  "షేర్" చేయండి. ".  ఇది కేవలము తల్లిదండ్రుల యొక్క హితము కోరి మాత్రమే రాయబడినది.