🌸 *సుభాషితమ్* 🌸
శ్లో|| అర్చన కాలే రూపగతా సంస్తుతికాలే శబ్దగతా
చిన్తనకాలే ప్రాణగతా తత్త్వవిచారే సర్వగతా!!
తా|| జగన్మాత పూజా సమయంలో ‘రూపం’ లోనూ, స్తుతించేటప్పుడు ‘శబ్దం’ లోనూ, చింతన చేసేటప్పుడు ‘ప్రాణం’ లోనూ, తత్త్వ విచారం చేసేటప్పుడు సర్వత్రా గోచరిస్తుంది.
*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*
*_అడ్మిన్ - సంస్కృతసుధాసింధువు_*
: 🙏🌹🌹*నేటి సుభాషితం* 🌹🌹🙏
*శ్లో!! న సా సభా యత్ర న సంతి వృద్ధాః!*
*న తే వృద్ధా యే న వదంతి ధర్మం!*
*నాసౌ ధర్మో న సత్యమస్తి!*
*న తత్సత్యం యచ్ఛ తేనాభ్యుపేతం!!*
*ఎక్కడ వృద్ధులు లేరో అది సభ కాజాలదు; ఎవరు ధర్మమును చెప్పరో వారు వృద్ధులు గారు;దేనియందు సత్యము లేదో అది ధర్మము గాదు;దేనివల్ల లోకమునకు కల్యాణ మొనగూడదో అది సత్యము గాజాలదు. అనగా లోకకల్యాణ మొనగూర్చు సత్యధర్మ ప్రవచన మొనర్చు పండితులు కూర్చున్నదే సభ యని అర్థము.*
🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి