*దీపారాధన*
దీపం పరబ్రహ్మ స్వరూపం..
దీపం మంగళ కారకం
దీపం ఆరోగ్యదాయకం
ఉదయ సంధ్యా దీపారాధన సర్వ సౌభాగ్యదాయకం.
సంప్రదాయబద్దంగా వెలిగించే నూనె లేదా నేతి దీపానికి ఆధ్యాత్మిక కారణం వుంది.
దీపం జ్ఞానానికి చిహ్నం నేటికి పూజ చేసేటప్పుడు దేవాలయములోను నేతి దీపాలను వెలిగిస్తారు. దీపం ఒక జ్యోతి వెలుగుతో అనేక జ్యోతులను వెలిగించవచ్చును,దీపానికి చీకటిని పారద్రోలి వెలుగులు పంచగల శక్తి దీపానికి వుంది.
పవిత్రమైన శుభ సందర్భాల్లో దీప జ్యోతిని వెలిగించే సంప్రదాయం మనది.
దీపం చీకటిని పారత్రోలె దివ్యజ్యోతి ప్రతి ఇంట ఉదయం, సాయంత్రం దీపారాధన చేయటం హిందూ సంప్రదాయం.
దీపపు కుందేలలో వేసే నునె/నెయ్యి ప్రత్తితో చేసే వత్తి మన అహంకార,లోభము,మొహానికి సంకేతం. భగవంతుని ఎదుట దీపం వెలిగించగానే నెమ్మదిగా అవి నశిస్తాయని బావిస్తారు.
దీపపు సమ్మెను తప్పనిసరిగా పూజించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో వుంది.
దీపపు సమ్మెకు కుంకుమ, గంధం మూడు చోట్ల పెట్టి పూలతో అలంకరంచి పూజిస్తారు. ఆ తరువాత ఆ దీపాన్నిఅష్టదిక్కులకు భూమికి అకాశానికి చూపిస్తూ నమస్కరిస్తూ దేవుని వద్ద ఉంచుతారు. దీపపు సమ్మెకు వుండే ఐదువత్తుల యొక్క పరమార్ధం …… ఐదువత్తులలో మొదటి వత్తి భర్త కోరికలు తీరుటకు, రెండోవ వత్తి సంతాన యోగక్షేమాలకు, మూడోవ వంశవృద్ది కొరకు, నాల్గోవ వత్తి కీర్తి ప్రతిష్ట ల కొరకు, ఐదోవ వత్తి దు:ఖముల నుండి విముక్తి కొరకు ఈ ఐదు జ్యోతులను వెలిగించటం శ్రేయస్కరం.
అమావాస్య రోజున సాయంసంధ్యలో దీపారాధన చేసి ఇష్ట దైవాన్ని పూజించి అష్టదిక్కులకు చూపించిన అరిష్టాలు తోలగుతాయి.
దీపము కొండెక్కిన….
దీపము కొండెక్కిన ఇష్టదేవత నామాన్ని జపిస్తూ మళ్లీ దీపము వెలిగిస్తే దీపము కొండెక్కిన దోషము తొలగుతుంది.
ఒక వత్తిని ఏనాడు వెలిగించరాదు, దీపారాధన రెండు వత్తులు వేసి వెలిగించవలెను.
మురికిగా వున్న వత్తిని వెలిగించిన జ్ఞాపకశక్తి తగ్గుతుంది. స్టీల్ కుందులలో దీపారాధన చేయరాదు.
దీపారాధన ఈశ్వరునికి ఎడమ వైపు, విష్ణువుకి కుడి ప్రక్కన చేయాలి, దేవి పూజలలో నేతిదీపాన్ని వెలిగించాలి.
దీపమునకు కుంకుమ పూవులు పెట్టి పూజ ప్రారంబించాలి. దీపమునకు ఈ విధంగా చేయుట అగ్నిదేవుని ఆరాధించుటకు సంకేతం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి