25, అక్టోబర్ 2020, ఆదివారం

జ్ఞాన మార్గం- భక్తి మార్గం.

 జ్ఞాన మార్గం- భక్తి మార్గం. 

ముముక్షువులారా మనలో చాలా మందికి తరచుగా జ్ఞాన మార్గం- భక్తి మార్గం. రెంటిలో ఏది ఉత్తమమైనది అనే సందేహం కలగటం కద్దు. నేను నా గురుదేవులనుండి పొందిన జ్ఞానంతో ఈ విషయాన్ని వివరించటానికి ప్రయత్నిస్తాను. 

ముందుగా ఈ రెండు మార్గాలు ఏమిటి అనేది తెలుసుకుందాము. 

1) భక్తి మార్గం. 

ఒక భక్తుడు నిరంతరం ఒక దేవి, లేక దేముడిని పూర్తిగా త్రికరణ శుద్ధిగా (మనో, వాక్కాయ, కర్మేనా. ) నమ్మి నిత్యం పూజాదికములు నిర్వహిస్తూ సర్వావస్థలాల్లో తన దేముడిపైన నిష్కల్మషమైన భక్తి కలిగి మనస్సు పూర్తిగా ఆ దేమునిపైనే లగ్నం చేసి ప్రార్ధించడం తో ఆ దేముడు తనకు ముక్తి ప్రసాదిస్తాడని ఆ దేముడికి పూర్తిగా కల్మష రహితంగా, అనుమాన రహితంగా స్వాధీనం కావటం. ఇది భక్తి మార్గం. ఇక్కడ మనం ఒక వేదాంత సూత్రమును చూద్దాము అది "ఎత్ భావం తత్ భవతి" ఈ సూత్రము ప్రకారము ఒక మానవుడు సంపూర్ణంగా ఏ దేముడిని నమ్మి తన భక్తిని ప్రకటిస్తాడో ఆ భగవంతుడు ఆ రూపంలో ఆ భక్తుని అనుగ్రహిస్తాడు. ఇందులో సందేహంలేదు. 

నవ విధ భక్తులలో  భక్తుడు తన భగవంతుడిని ఏ రకంగా భావించిన సరే భక్తుడు భగవంతుడిని చేరుకుంటాడు అందులో సందేహం లేదు. అటువంటప్పుడు  మరి అందరు భక్తి మార్గాన్నే ఎంచుకోవచ్చుగా మరి జ్ఞాన మార్గ ఆవశ్యకత ఎందుకు అనే సందేహం కలుగుతుంది.  కానీ ఈ సందేహం బహు కొద్దీ మందికి మాత్రమే కలుగుతుంది. ఎందుకంటె చాలా మంది భక్తి మార్గమే సుగమమైనది అని భావించి ఈ మార్గంలోనే తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తారు. భక్తికి మూలం నమ్మకం అది తాను నమ్మిన దేముడు తనను ఉద్ధరిస్తాడనే నమ్మకం. అది ఉంటే చాలు మోక్షము పొందటానికి. కానీ జ్ఞాన మార్గం బహు క్లిష్టమైనది. 

2) ఇక జ్ఞాన మార్గం. 

జ్ఞాన మార్గం భక్తి మార్గం అంత సులువైనది కాదు.  ఇది కఠినాతి కఠినమైనది. ఎందుకంటె ఈ మార్గంలో సాధకుడు భగవంతుని స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకొని సాధన చేస్తాడు. 

భగవంతుని స్వరూపం తెలుసుకోటం ఎలా. భగవంతుడు అంటేనే నామ రూప, గుణ ( లక్షణం) లేని వాడు అంతే కాకుండా దేశంలో, కాలంలో లేనివాడు. అతనితోనే కాలం వున్నది. దీని గురించి కొంత వివరంగా తెలుసుకుందాము. 

మనం ఈ సృష్టిలో ప్రతిదీ ఏదో ఒక పేరుతొ తెలుసుకుంటున్నాము. అది ఎరకమైన పేరైన కావచ్చు. అంతేకాకుండా ఒక నిర్దుష్ట రూపం చూస్తూవున్నాము. ఒక నిర్దుష్ట రూపానికి ఒక నిర్దుష్ట పేరు తో పిలుస్తున్నాము. ఉదా: ఒక గ్లాసు, ఒక చెంబు, ఒక కంచం ఇలా ఒక నిర్దుష్ట ఆకారం కలిగి ఒకే రకమైన పదార్ధంతో ( లోహంతో) చేసిన వాటి రూపాయలని బట్టి పేర్లను నిర్దేశిస్తున్నాము. ఇలా పిలిచే పేరు చెపితే నీవు ఆ నిర్దుష్ట వస్తువుని గుర్తు పట్టగలవు. అంటే రూపం వున్న ప్రతిదానికి నామము (పేరు)ఉన్నదన్న  మాట. ఇక గుణం. ప్రతి వస్తువుకి ఒక ప్రేత్యేక గుణం అంటే లక్షణం ఉంటుంది. ఉదా : స్టీలు దానికి తెలుపు అనే లక్షణం ఇత్తడి దానికి పసుపు అనే లక్షణం, రాగి దానికి ఎరుపు అనే లక్షణం కలిగి ఉంటుందని మనకు జ్యోతకం అవుతున్నది. ఇది స్టీలు గ్లాసు, ఇది ఇత్తడి గ్లాసు, ఇది రాగి గ్లాసు అని మనం అంటు న్నాము. ఈ మూడు విషయాలు మనం మనుషులకు, జంతువులకు కూడా చూస్తున్నాము. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ఈ జగత్తులో వున్నా ప్రతి దానికి అంటే జీవికి, నిర్జీవికి సంబంధించి ఈ మూడు విషయాలతో గుర్తించవచ్చు. 

ఇక కాలము. నిజానికి ఇది ఒక విచిత్రమైన రాసి ఎందుకంటె దీనిని మనం పంచేద్రియాలతో గుర్తించలేము కానీ ఇది వున్నదని మనమందరం నమ్ముతాము దానికి ప్రమాణం మన నమ్మకమే. ఉదా : మనం తరచుగా అంటూవుంటాము నిన్న నేను ఈ చెట్టుకు ఒక పువ్వు చూసాను అంటావు. నేను ఏది నాకు చూపించు అంటే నీవు నిన్న చూసిన పువ్వు నీవు చూసిన కొమ్మకు లేదు. మరి ఏమైనట్లు అంటే ఆ పువ్వు ఈ రోజు పరిణతి చెంది చిన్న కాయగా మారింది అందుకే నిన్న చూసిన పువ్వు ఇప్పుడు లేదు. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే ప్రతిదీ కాలంలో మార్పు చెందుతున్నది. అంటే స్థిరంగా ఇక్కడ ఏమిలేదు. 

ఇప్పుడు దేశం అంటే ఏమిటో తెలుసుకుందాం. నీవు నాతొ అన్నావు అన్నా నిన్న నీకు పుస్తకము ఇచ్చాను అని అప్పుడు నేను అడిగాను ఎక్కడ ఇచ్చావు అని అన్నాను. నీవు అదే అన్నా నీయింటిముందర గేటుదగ్గర అదే అన్నా నను కాలింగబేల్ నొక్కితే నీవు వెంటనే గేటుదగ్గరికి వచ్చావు గుర్తుచేసుకో అంటావు. ఈ సంభాషణ వాళ్ళ మనకు నిన్న అనే కాలము గేటుదగ్గర అనే ప్రదేశం తెలుస్తున్నాయి అంటే ప్రతి చర్యా ఈ భూమిమీద ఒక నిర్దుష్టమైన కాలంలో నిర్దుష్టమైన దేశంలో అంటే స్థలంలో మాత్రమే జరుగుతుంది. ఇది అర్ధం చేసుకోటానికి కొంచం కష్టంగా ఉంటుంది.  నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం నీవు ఏమి చెప్పుతావో చూద్దాం. నీవు ఇప్పుడు ఎక్కడ వున్నావు.  దానికి నీవు కోఠిలో, నాంపల్లిలో, బిడ్సులో అని సమాధానం చెపుతావు. నేను నీవు చెప్పింది అబద్దం అంటే ఒప్పుకుంటావా అస్సలు ఒప్పుకోవు. నీవు చెప్పిందే నిజమని ప్రమాణం కూడా చూపిస్తావు. కానీ అది అంతా నిజం కాదు మరి నిజం ఏమిటంటే నీవు నేను భూమిమీద వేరు వేరు ప్రదేశాలలో ఉండొచ్చు కానీ మనమందరము వున్నది మాత్రం గాలిలో మాత్రమే. అదేమిటి గాలిలో ఉండేవి పక్షులు కదా మనం మనుషులం గాలిలో ఎలా ఉంటాము అనే అనుమానము నీకు వస్తుంది. కానీ ఇది నిజం మనం అంతా గాలిలో వున్నాము కాబట్టే మనం భుచేరులం అంటే భూమి మీద చేరించే జీవులం అయ్యాం. ఏక్షణం ఐతే భూమిమీద గాలి ఉండదో అప్పుడు ఒక్క జీవి కూడా బతికి ఉండదు. ఇది సత్యం. అంటే మనం చెప్పే దేశం రెండు విశేషాలు కలిగి వున్నది ఒకటి భూమి మీది ప్రదేశం రెండూప్ గాలిలోని ప్రదేశం. భూమి మీది ప్రదేశం వేరు వేరుగా ఉండవచ్చు కానీ గాలిలోని ప్రేదేశం మాత్రం అంతా ఒక్కటే. 

ఇంకా వుంది. 

కామెంట్‌లు లేవు: