26, మే 2023, శుక్రవారం

ఎక్కువ లడ్డూలు చేయించు


 ఎక్కువ లడ్డూలు చేయించు


తంజావూరు జిల్లాకు చెందిన ఒక ధనిక భూస్వామి ఆరోజు స్వామివారికి భిక్ష ఏర్పాటు చేశాడు. ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తయారు చేయించమని అతణ్ణి ఆదేశించారు పరమాచార్య స్వామివారు.


శ్రీమఠం ఉద్యోగులు, ఆ భూస్వామి చుట్టాలు కొద్దిమంది మాత్రమే ఆరోజు భోజనానికి ఉన్నవారు. అన్ని లడ్డూలు చేయించమని ఎందుకు తెలిపారు అర్థం కాలేదు ఆ భూస్వామికి. బహుశా కొన్ని లడ్డూలను ఏదైనా అనాథ ఆశ్రమానికి గాని, వేద పాఠశాలకు గాని పంపుతారేమో అని అనుకున్నాడు.


అలా కాకుండా, ఆరోజు వడ్డనని పరమాచార్య స్వామివారు పర్యవేక్షించారు. ఎంత వద్దన్నా అందరికీ రెండు కంటే ఎక్కువ లడ్డూలు వడ్డించమని, మిగిలిన వాటిని కూడా అందరికి వడ్డించమని ఆదేశించారు స్వామివారు.


మరలా ఒక విపరీతమైన ప్రకటన చేసి లోపలకు వెళ్ళిపోయారు స్వామివారు. అదేంటంటే స్వయంగా మహాస్వామి వారే ఆదేశించినా వడ్డన చేసిన అన్ని లడ్డూలు తినాల్సిన అవసరం లేదని. ఎక్కువైన వాటిని వదిలేయవచ్చని.

అన్న లక్ష్మిని చెత్తకుప్ప పాలు చెయ్యరాదని తరచూ పిల్లలకు బోధించే స్వామివారు ఇలా చెప్పడం వారికి వింతగా తోచింది. అందరూ ఎక్కువైన లడ్డూలను అరటి ఆకుల్లోనే వదిలేశారు.


పరమాచార్య స్వామివారి ఆదేశం కావున ఆ లడ్డూలను ఎండుద్రాక్ష, జీడిపప్పు, లవంగాలు, యాలకులు బాగా దట్టించి తయారుచేశారు. అటువంటి లడ్డూలను ఇలా ఆకులలో వృధాగా ఉండడం చూస్తున్న భూస్వామి కాస్త బాధపడినా, అకారణంగా పరమాచార్య స్వామివారు ఏదీ చెయ్యరని సంభాళించుకున్నాడు.

తరువాత ఆ భూస్వామితో మాట్లాడుతూ స్వామివారు, “వెనుకవైపు ఆకులు పడవేసిన చోటుకు వెళ్లి చూడు” అని ఆదేశించారు.


ఆ భూస్వామి వెనుకవైపుకు వెళ్ళగా, అక్కడ కొన్ని కురువ కుటుంబాల వారు ఆత్రుతగా ఆ పారవేసిన లడ్డూలను తినడం చూశాడు. ఎప్పుడూ తినని అంతటి మధుర పదార్థాన్ని తమకు అందించినందుకు, వారు అ భూస్వామిని చూడగానే మనస్సులోనే కృతఙ్ఞతలు తెలిపారు.


ఆ భూస్వామి చాలా సంతోషపడ్డాడు. మహాస్వామివారి వద్దకు తిరిగిరాగానే, “వారి కుల ధర్మం ప్రకారం, ఈ కురవలు ఉచ్చిష్టాన్నే ఇష్టపడతారు. అన్నదానానికి వారు అంగీకరించరు. వారికి ఉన్న నియమం అది. మనకు లాగానే వారికి కూడా అదే నోరు, అదే కడుపు కదా? అందుకే ఈరోజు మనం తిన్న లడ్డూల వంటివే వారికి కూడా ఇవ్వాలని సంకల్పించాను. అది నువ్వే చేయ్యగలవని కూడా నాకు తెలుసు. కనుక, ఇప్పుడు వారి దీవెనలు నీకే ఉంటాయి” అన్నారు స్వామివారు.


--- రా. గణపతి, “మహా పెరియవాళ్ విరుంధు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం


సర్వ భూత నివాసోసి....

ఒకసారి పరమాచార్య వారు ఒక వేద పాఠశాల ను సందర్శించారు. వారు ఎప్పుడు వేద పాఠశాల కు వెళ్లినా తప్పకుండ వంటశాలను చూస్తారు. అక్కడి వంటవారు ఆసక్తిగా, రుచిగా పిల్లలకు వండి పెడుతున్నారా అని గమనిస్తారు. అదేలాగున ఇక్కడ కూడా వంటశాల లోనికి వెళ్లారు. వంటాయినా పిల్లలు తినడం కోసం సేవై (సేమియా లాంటిది )వండుతున్నాడు. ఇప్పటిలాగా ఇన్స్టంట్ సేమియా లు రాని రోజులవి.వంటవాడు ప్రయాసతో వాటిని చేయడం చూసి వారు చాలా సంతోషించి,

"దీనిని తరచూ వండుతుంటావా "అని అడిగారు.

వంటవాడు "పాపం పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండి వేదం నేర్చుకోవడానికి వచ్చారని వారికి రుచిగా చేసి పెడదామని చేస్తున్నాను పెరియవ "

స్వామి "చాలా సంతోషం. రోజు ఈ సేవ చెయ్యు."అంటూ పరమాచార్య బయటకు వెళ్లిపోయారు.

వంటవాడు మనసులో "ఇదేంటి. ఇంత కష్టమైన దానిని రోజు చెయ్యమంటారే "అనుకున్నాడు. కొద్ది సేపు కాగానే స్వామి వంటవాణ్ణి పిలిచి "నేను కోరింది రోజు ఈ సేవ చెయ్యమంటే రోజు సేవై చెయ్యమని కాదు. రోజు పిల్లలకు రుచిగా వండి పెడుతున్నావే అదే పెద్ద సేవ. అది చెయ్యమని.వేద విద్యార్థులకు వండి పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదు. అని నా ఉద్దేశ్యం."అని అనునయించారు.ఇంతకీ వంటవాని మనస్సులో అనుకున్నది స్వామి కి ఎలా తెలిసిందని మీరు అడగరని నాకు తెలుసు.

 ***ఇలాంటి సంఘటనలు కోకొల్లలు గా స్వామి వారున్నపుడు జరిగేవి. "ఈశ్వరసర్వ భూతానం హృద్దేశే అర్జున తిష్టతి ".... అన్న వాసుదేవుని స్మరిద్దాం.

:

 మహాస్వామి వారి అన్నపూర్ణావతారం


పరమాచార్య స్వామివారు ఒక తమిళ సామెతను ఎప్పుడూ చెప్పేవారు, “అందరికీ అన్నం పెట్టు, భేదం చూపకుండా” అని. ఆహారం పెట్టేటప్పుడు ఎవరు, ఏమిటి అన్న ఎటువంటి బేధం చూపరాదని చెప్పేవారు. రాత్రిపూట దొంగలకు కూడా ఆహారం అందించే ఒక కేరళ సంప్రదాయం గూర్చి ఎప్పుడూ తెలిపెవారు. కేరళలోని చేరుక్కుణ్ణం అన్న ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ దేవాలయంలో ఈ పధ్ధతి ఉంది. దేవాలయంలోని భక్తులందరి భోజనాలు అయ్యాక, ఆహార పొట్లాలు కట్టి, వాటిని చెట్టుకు వేలాడదీసేవారు అటుగా వెళ్ళే దొంగలకోసమని.


సంగం సాహిత్యంలో ఉధియన్ చేరాళదన్ అన్న చేర రాజు మహాభారత యుద్ధ సమయంలో పాండవ కౌరవ ఇరు పక్షాల వారికీ అన్నం పెట్టి ‘పేరుం సోట్రు చేరాళదన్’ అన్న పేరు ఎలా పొందాడో తెలిపేవారు.


వేటగాడైన కన్నప్ప శివునికి ఆహారం పెట్టాడు. వేటగాడైన గుహుడు శ్రీరామునికి ఆహారం పెట్టాడు. ఇక్కడ, శ్రీశైలం అడవులలో ఉండే చెంచులు పరమాచార్య స్వామివారిచే ఆహారం పొందారు.


రవాణా వ్యవస్థ అంతగా లేని 1934లో పరమాచార్య స్వామివారు మందీమార్బలంతో కీకారణ్యంలో ఉన్న శ్రీశైలం వెళ్తున్నారు. దారిలో ఒకచోట వారికి చెంచులు ఎదురయ్యారు. ఆ చెంచులు మొదట వీరిని శతృవులుగా భావించి బాణాలు చేతబూని విల్లు ఎక్కుపెట్టారు. కాని స్వామివారి దివ్య తేజస్సు చూసి, తప్పు తెలుసుకుని వీరిని ఆదరించారు.


వీరిని అడ్డగించాలని వచ్చినవారే వీరికి కాపలావాళ్లై, సామాను మోస్తూ, రాత్రిపూట పహారా కాస్తూ పరమాచార్య స్వామివారిని సపరివారంగా తదుపరి చోటుకు చేర్చారు. సెలవు తెసుకునే ముందు అందరూ ఒకచోట చేరారు.


మహాస్వామి వారి వారికి కొంచం ధనం ఇవ్వమని మేనేజరును ఆదేశించగా వారు దాన్ని తాకడానికి కూడా ఇష్టపడలేదు. ఆ చెంచుల నాయకుడు మేనేజరుకు ఎదో చెబితే, వారు దాన్ని నిరాకరిస్తూ తల అడ్డంగా తిప్పి కుదరదన్నారు.

మహాస్వామివారు చిటికె వేసి మేనేజరును పిలిచి, “అతను ఏమి అడిగాడు, నువ్వు ఎందుకు లేదన్నావు?” అని అడిగారు.


“పెరియవా ముందర వారు నృత్యం చేయాలనుకుంటున్నారు”


“నృత్యం చూడడం వల్ల శ్రీమఠం గౌరవం తగ్గుతుందని మేనేజరుగా నీ అభిప్రాయం కనుక నేను వారి నృత్యం చూడనని నువ్వు అన్నావు”

మహాస్వామి వారి మాటల్లో ఎక్కడా కోపం కనబడలేదు. మేనేజరు మౌనంగా నిలబడ్డారు.


ఎంతో గొప్ప కళాకారుల నృత్యాలు కూడా చూడని మహాస్వామివారు వారి నృత్యాన్ని చూడడానికి అంగీకరించారు ఒక షరతు పైన; మగవారు ఎవరైనా నృత్యం చెయ్యవచ్చు. కాని వారితో పెద్దవారు కాని బాలికలు మాత్రమే కలిసి నృత్యం చెయ్యాలి.


“సందర్భాన్ని బట్టి మీకు వివిధ నృత్యాలు ఉన్నాయి కదా; దేవుని కోసం, గెలిచినప్పుడు, ఆటలకోసం అలా. మరుప్పుడు మీరు చెయ్యదలచుకున్న నృత్యం ఎలాంటిది” అని అడిగారు మహాస్వామివారు.


“మేము ఇప్పుడు చెయ్యబోయే నృత్యం కేవలం మాకు అత్యంత దగ్గరైన ఆప్తులకు మాత్రమే” అని తెలిపారు.


పరమాచార్య స్వామి వారు వారి నృత్యాన్ని చూసి, వారినందరినీ ఆశీర్వదించి, వారికి మంచి విందు ఏర్పాటు చేశారు.


--- రా. గణపతి, “మహా పెరియవాళ్ విరుంధు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


సేకరణ 🙏🙏

దేవాలయాలలో

 దేవాలయాలలో ధ్వజస్థంభానికి ముందుగా మొక్కిన తర్వాతే ప్రదక్షిణం ఎందుకు చేస్తాము

~~~~~~~


ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం.


ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓ కధ ఉంది.భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు.


ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. 


ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు. అతడు పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు. 


తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ,అతడిని కపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు. 


శ్రీకృష్ణుడు, ధర్మరాజు కలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుకుంటారు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు,"రాజా! మీ దర్శనార్ధమై మేమువస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో  "మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూర ధ్వజుని  శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఇతడ్ని వదిలేస్తానని చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడ"మని కోరుతారు.


వారి కోరిక విన్న మయూరధ్వజుడు అందుకు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి, భార్యాసుతులను పిలిచి, అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. 


వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు" అంటాడు. 


అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.


మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి" అని కోరుతాడు మయూరధ్వజుడు. 


అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతీ దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున 'స్తంభాలు' వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి నీకు ప్రదక్షిణ, నమస్కారాలు, ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. 


ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. 


ఆనాటి నుంచీ ఆలయాల ముందు మయూర ధ్వజుడి పేరు మీద స్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించటం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

🙏🙏🙏

పసుపు, కుంకుమలు

 భారతీయ పూజలలో భాగమైన పసుపు, కుంకుమలు ఎంత గొప్ప పాత్ర పోషిస్తాయో అదే విధంగా హారతి ఇవ్వడం కూడా అందే విధంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది మన పూజా విధానంలో. అసలు దేవునికి హారతిని ఎందుకు ఎప్పుడు ఇస్తారు. కర్పూరానికి రెండు సుగుణాలు ఉన్నాయి. ఒకటి ఎలాంటి అవశేషమూ మిగలకుండా దహించుకుపోవడం. రెండోది సుగంధాన్ని, ప్రకాశాన్ని వెదజల్లడం. బహుశా మనిషి జీవితం కూడా ఇలాగే సాగాలన్నది దీనివెనుకున్న ఆంతర్యం. భక్తుడు ఎలాంటి కర్మ ఫలమూ మిగలకుండా, మోక్షం వైపుగా సాగిపోవాలనీ.. జీవిత పరమార్థాన్ని దీని ద్వారా తెలియజేసారు మన పెద్దలు. ఈ విషయంగా ఎప్పడన్నా ఆలోచించారా? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాల గురించి తెలుసుకోవాలంటే..


పూజ చేయడం అనేది భగవంతుని యందు మనసు లగ్నం చేయడానికి చేసే ప్రక్రియను పూజ అంటారు. దీనికి గాను పసుపు కుంకుమలు ఎంత తోడ్పడతాయో హారతి ఇవ్వడం కూడా దేవుని ఆరాధనకు అంతగానే ఉపయోగ పడుతుంది. మనస్సులో పూజ ముగిసిందనే ఆలోచన రాగానే గంట మోగిస్తూ దేవుని ఆహ్వానించి హారతిని వెలిగిస్తాము. సవినంగా భగవంతునికి మ్రొక్కుతూ మనస్సును ఆయన అందు లగ్నం చేసి హారతిని ఇస్తూ ప్రార్థిస్తాము. అక్కడితో పూజా విధానం సంపూర్ణం అయినట్టుగా భావిస్తాం ఇదంతా జరిగాక మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.


ఒకప్పుడు ఆలయాల్లో ఎలాంటి వీద్యుత్తు దీపాల సౌకర్యం ఉండేది కాదు. పైగా గాలి కూడా చొరబడని రాతితో ఆ నిర్మాణాలు ఉండేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. దీంతో దుర్వాసన, సూక్ష్మక్రిములు దరిచేరక తప్పదు. కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నందువల్ల కర్పూరంతో హారతిని ఇవ్వడం, దేవాలయం ప్రాంగణంలో కర్పూరాన్ని వాడటం వంటివి చేస్తున్నారు. అయితే కర్పూరాన్ని చెట్ల నుంచి సేకరిస్తారు. చాలా రకాలుగా ఫలపుష్పార్చనకూ, ధూపదీపాలకూ పూర్తిగా వృక్షాల మీదే ఆధారపడేవారు. పూజ విధానం అంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది.


శక్తి, స్పర్శా,,


భగవంతుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోవడం సహజం. ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది. హారతితో పాటుగా ఘంటానాదాన్ని చేయడం సహజం. కళ్లు మూసుకుని హారతిని అద్దుకోవడం ద్వారా మనసు, చెవులు, ఆఘ్రానించే శక్తీ, స్పర్శా...ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి.దీనికోసమే ముఖ్యంగా పూజా విధానంలో హారతి ముఖ్యమైన భాగం అయింది

కర్తృత్వ అహంకార భావమును

 యస్య నాహంకృతో భావో

 బుద్ధిర్యస్య న లిప్యతే ।

హత్వాఽపి స ఇమాఁల్లోకాన్న

 హంతి న నిబధ్యతే ।।



కర్తృత్వ అహంకార భావమును (చేసేది నేనే అన్న భావమును) విడిచిపెట్టి, బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండే వారు, ప్రాణులను సంహరించినా సరే, వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధనములకు లోనుకారు.


పవిత్రమైన బుద్ధి కలవారు, చేసేది తామే (కర్తృత్వ భావన) అన్న అహంకారమును విడిచి పెట్టి ఉంటారు. తమ కర్మ యొక్క ఫలములను భోగించాలనే కోరికతో కూడా ఉండరు. ఆ విధంగా వారు తాము చేసిన పనుల యొక్క కర్మ బంధనములలో చిక్కుకోరు. భౌతిక దృక్పథం పరంగా, వారు పనిచేస్తున్నట్లే ఉంటారు కానీ ఆధ్యాత్మిక కోణంలో, వారు స్వార్ధ ప్రయోజనాలకు అతీతముగా ఉంటారు, కాబట్టే వారు కర్మఫలములకు బందీలు కారు.


భారత చరిత్రలో, మొఘల్ సామ్రాజ్య కాలంలో, రహీమ్ ఖాన్‌ఖనా, ఒక ప్రఖ్యాత కవి, సాధువు. జన్మతహా ఇస్లామ్ మతస్థుడైనా, ఆయన శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క గొప్ప భక్తుడు. ఆయన ఎప్పుడైనా దానములో భిక్ష ఇస్తే, తన కళ్ళు క్రిందికి వంచేవాడు. ఆయన ఈ అలవాటు గూర్చి ఒక మధురమైన సంఘటన ఉంది. సంత్ తులసీదాసుకి ఈ రహీమ్ యొక్క దానమిచ్చే పద్దతి తెలిసి, ఆయనను ఇలా అడిగారు :


‘అయ్యా, ఈ దానం ఇచ్చే పద్ధతిని మీరు ఎక్కడ నేర్చుకున్నారు?. మీ చేతులు పైకి ఉన్నా మీ కళ్ళు క్రిందికి ఉన్నాయి.’ అని. దీనికి రహీం చాలా అందంగా ఎంతో వినమ్రతతో ఇలా బదులిచ్చాడు:


‘అసలు ఇచ్చేవాడు వేరే ఉన్నాడు, పగలు, రాత్రి ఇస్తున్నాడు. కానీ, ప్రపంచం నేను ఇచ్చాను అనుకుంటున్నది, అందుకే నేను నా కళ్ళను క్రిందికి అంటున్నాను.’ అని.


మనము సాధించినవాటన్నిటికీ కేవలం మనమొక్కళ్ళమే కారణము అన్న భావన విడిచిపెడితే, అది మనలను కర్తృత్వ అహంకార భావన నుండి విముక్తి చేస్తుంది.

సెంగోల్

 *పార్లమెంట్​లో లోక్​సభ స్పీకర్​ వద్ద పెట్టే ఎంతో ప్రాముఖ్యం గల 'సెంగోల్​' గురించి ఇప్పటికీ భారత ప్రజలకు సరిగ్గా తెలియదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.* మే28న కొత్త పార్లమెంట్​ భవనం ప్రారంభించాక ప్రధాని నరేంద్ర మోదీ.. 'సెంగోల్​'ను లోక్​సభ స్పీకర్​ సీట్ వద్ద పెడుతారని చెబుతూ దాని ప్రాముఖ్యాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే 'సెంగోల్'​ వెనుక ఉన్న అసలు కథెంటో తెలుసుకుందాం.


 *సెంగోల్​ అనే ఈ రాజదండాన్ని తొలిసారిగా భారత తొలి ప్రధాని జవహర్​ లాల్ నెహ్రూ స్వీకరించారు.* బ్రిటీష్​ వలస పాలనకు ముగింపు పలుకుతూ.. భారత స్వయంపాలనకు, అధికార మార్పిడికి గుర్తుగా దీనిని ఏర్పాటు చేశారు. *'సెంగోల్​'.. 'సెమ్మై' అనే తమిళ పదం నుంచి పుట్టింది.* దీనికి తమిళంలో ధర్మం అని అర్థం వస్తుంది.


 *'సెంగోల్'​ ఏర్పాటు వెనుక కథేంటి?* 

భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన నేపథ్యంలో బ్రిటిష్​ ఇండియా చివరి వైశ్రాయ్​ అయిన లార్డ్​ మౌంట్​ బాటన్​.. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో ఏర్పాట్లపై చర్చించారు. ఈ క్రమంలోనే అధికారికంగా స్వాతంత్ర్యం ఇచ్చినట్లుగా ఏదైనా ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేయాలని నెహ్రూకు సూచించారు మౌంట్ బాటన్​. దీనికి స్పందించిన నెహ్రూ.. వెంటనే భారత చిట్టచివరి గవర్నర్​ జనరల్​ సీ రాజగోపాలచారిని అడగగా.. ఆయన ఓ సలహా ఇచ్చారు

రాజవంశంలో నూతన రాజు సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో జరిగే ఆచారాల గురించి నెహ్రూకు చెప్పారు రాజగోపాలచారి. *కొత్తగా రాజు అయ్యే వ్యక్తి పూజారి నుంచి రాజదండాన్ని స్వీకరిస్తారని..* అలానే తాము కూడా *బ్రిటిష్​ పాలన నుంచి విముక్తి పొందడానికి సూచికగా ఈ రాజదండాన్ని స్వీకరిద్దామని* సూచించారు. దీనికి ప్రధానమంత్రి నెహ్రూతో పాటు మౌంట్​ బాటన్​ కూడా అంగీకరించారు. దీని బాధ్యతను సైతం రాజగోపాలచారికే అప్పగించారు జవహర్​లాల్ నెహ్రూ.  దీంతో ఆ 'సెంగోల్'​ను తయారు చేయించడానికి.. రాజగోపాలచారి వెంటనే నాటి మద్రాసులోని తిరువడుతురయైకి వెళ్లారు. అక్కడే ఉన్న ఓ మఠాన్ని సందర్శించి.. ఈ విషయం చెప్పగా మఠాధిపతులు సైతం దీనికి అంగీకరించారు. *ఉమ్మిడి బంగారు చెట్టి అనే ఓ బంగారు ఆభరణాల దుకాణం.. బంగారు 'సెంగోల్​'ను అద్భుతంగా తీర్చిదిద్దింది.* ఐదు అడుగుల పొడవుతో 'సెంగోల్'​ పైభాగంలో న్యాయానికి ప్రతీకగా నందిని చెక్కారు. అనంతరం ఈ 'సెంగోల్​'ను పవిత్ర గంగా జలంతో శుద్ధి చేసి లార్డ్ మౌంట్​ బాటన్​కు అందించారు మఠాధిపతులు. ఆ తర్వాత *స్వాతంత్ర్యానికి గుర్తింపుగా 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మౌంట్​ బాటన్ నుంచి సెంగోల్​ను స్వీకరించారు నెహ్రూ.* అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు దానిని భారత నూతన ప్రధానికి అందజేశారట. ఆ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను ఆలపించారట. ఇదండీ సెంగోల్​ వెనుక ఉన్న అసలు కథ. *ప్రస్తుతం ఇది అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది.* ఇప్పుడు దీనిని ఆదివారం కొత్త పార్లమెంట్‌ భవనంలో అమర్చనున్నారు.

ఎక్కువ శ్రద్ధ చూపించకూడదు....

 .      

              _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*న చాత్రాతీవ కర్తవ్యం*

*దోష దృష్టి పరం మనః।*

*దోషో హ్యవిద్యమానోపి*

*తచ్చిత్తానాం ప్రకాశతే॥*

~శ్రీ శంకర విజయం లో కుమారిలభట్టు చెప్పిన శ్లోకము. వ్యక్తిత్వం వికాసానికి దోహదం చేసే అమోఘమైన సుభాషితం.


తా𝕝𝕝 

తన చుట్టూ ఉన్న  ప్రతికూల భావాలపై ఎక్కువ శ్రద్ధ చూపించకూడదు..... ఒకవేళ వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తే అవి ఉనికిలో లేనప్పటికీ ప్రతికూలతను అతను చూస్తాడు..

సాంగత్యం

 



                    *సాంగత్యం*

                   ➖➖➖✍️



*అసతాం సంగదోషేణ సాధవో యంతి విక్రియామ్*

*దుర్యోధన ప్రసంగేన  భీష్మో గోహరణో గతః*


*ఆరు నెలలు కలిసి వుంటే వాడు వీడువీడౌతాడనే నానుడి వినేవుంటాం. దానికి ఒక మంచి ఉదాహరణ ఈ సుభాషితం....*


*అసతాం అంటే అసత్యవాది, అసత్యవాది సాంగత్యంలో వుంటే సాధువుకూడా మారిపోతారు.*


*దుర్యోధనుడి సాగత్యంలో వుండి విష్ణుసహస్రనామం చెప్పగలిగిన భీష్ముడంతడి వాడు కూడా విరాటరాజు గోవులను దొంగిలించటానికి కూడా సిద్ధం అయ్యాడు...*


*అంతేనా? ...మూర్ఖ సాంగత్యంలోకి వచ్చిన ప్రతీ ఒకరూ తమ తమ స్వస్వభావాన్ని మరచిపోయి మూర్ఖ పద్దతి అవలంభించేస్తారా?*


*కాదు.. కాదు .....!*


*ఈ క్రింద సుభాషితం చూడండి...*


*వికృతిం నైవ గచ్ఛంతి సంగదోషేణ సాధవః *

*ఆవోష్టితం మహాసర్పైశ్చందనం న విషాయతే .*


*ఎలా అయితే నిరంతరమూ విషపూరితమైన సర్పాలు గంధపు చెట్లను చుట్టి పెట్టుకున్నా, గంధపు చెక్క విషంపూరితం కాకుండా, తన సహజసిద్ధమైన సుగంధాలను అందరికీ పంచి పెడుతుందో,                  అలాగే సాధువులు, మహా పురుషులు కూడా దుస్సాంగత్యంలో వున్నంతమాత్రాన తమ సహజస్వభావాన్ని కోల్పోరు, వికృతి చెందరు. *


*అదేమిటి???*


*ఒక చోట మహాత్ములు కూడా సాంగత్యదోషం వలన తప్పు చేస్తారు అని., మరొక చోట అదే మహాత్ములకి సాంగత్యదోషం వుండదు అని అంటారు అని అనుమానం రావచ్చు.*


*అదే సనాతన ధర్మం గొప్పతనం, మనకు దారి చూపటానికి ప్రతీ విషయంలోనూ సందర్భోచితంగా వివరణతో జాగ్రత్తలు నేర్పుతుంది.*


*ఇదే విషయాన్ని గీత లో    కృష్ణ భగవానుడు ఇలా చెబుతాడు…

‘ఉద్ధరేదాత్మనాత్మానమ్* *నాత్మానమవసాదయేత్* *ఆత్మైవహ్యాత్మానోబంధురాత్మైవరిపురాత్మనః’*


*మనిషి ఉద్ధరింపబడటానికి, అధోగతి పాలుకావడానికి తనకు తానే కారణం. అందువలను తనను తానే ఉద్ధరించుకోవాలి. తన మనస్సే తనకు బంధువు మరియు శత్రువుకూడాను, మంచి కోరటం, ఆచరించటం వలన మనస్సు బంధువుగా, మనని ఉద్ధరిస్తుంది. చెడ్డ పనులు ఆలోచనలు వలన మన మనస్సు శత్రువుగా మనలను అధోగతి పాలు చేస్తుంది.*


*అంటే, మనం అధోగతి పాలైనా, ముక్తి మార్గాన్ని అధిరోహించినా దానికి కారణం మన సాంగత్యం కాదు. మనో నిగ్రహంతోనే మన అధోగతి లేదా ఉన్నతి అన్నమాట.*


*ఇంతటి గొప్ప విషయాలను, నిత్య సత్యాలను నిక్షిప్తం చేసుకున్న భగవద్గీతను మన నిత్యజీవితం లో భాగం  చేసుకొందామా మరి..*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


పుష్పదంతుని కథ:*

 



             *పుష్పదంతుని కథ:*

                  ➖➖➖✍️



*గంగాతీరంలో ‘బహుసువర్ణకమ’నే అగ్రహారముంది. అచట బహుశాస్త్రవేత్తయైన ‘గోవిందదత్తుడ’నే బ్రాహ్మణుడున్నాడు. ఆతని భార్య ‘అగ్నిదత్త.’ వారికి సుందరులైనా గాని- మూర్ఖత్వం నిండుగానున్న ఐదుగురు పుత్రులు పుట్టారు.* 


*ఒకనాడు గోవిందదత్తుడింట లేని సమయంలో వారింటికి ‘వైశ్వానరుడ’నే విప్రుడు అతిథిగా వచ్చాడు. అతడు కుమారులకు అభివాదం చేయగా –తిరిగి ప్రతినమస్కారం చేయటం కూడా తెలియని వారు నమస్కారానికి బదులుగా నవ్వారు.*


*ఇట్టి కుసంస్కారుల ఇంటిలో భోజనం చేయకూడదని నిర్ణయించుకొని ‘వైశ్వానరుడు’ వెళ్లి పోవటానికి సిద్ధపడుతున్న సమయంలో ‘గోవిందదత్తుడు’ వచ్చాడు.*


*తన కుమారులు పరమ మూర్ఖులని అందుచే వారినింతవరకు తాను తాకలేదని చెప్పాడు.*


*తండ్రి మాటలు విన్న కుమారులలో నొకడగు ‘దేవదత్తుడ’ను వాడు తండ్రి మాటలకు బాధపడి ఇంక తన జీవితం వ్యర్థమని తలచి తపం చేయటానికి బదరికాశ్రమానికి  వెళ్లాడు.*


*అతడు చిరకాలం శివుని గూర్చి తపస్సు చేసాడు. దాని  ఫలంగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు శివుని-తాను శివునకు   అనుచరునిగా నుండునట్లు వరాన్ని  కోరుకొన్నాడు. శివుడాతనికి 'సకల విద్యలను గడించి భోగాలనుభవించిన తరువాత శివానుచరుడవు కాగల'వనే వరాన్నిచ్చాడు.*


*’దేవదత్తుడు  పాటలీపుత్రానికి చేరుకొని ‘వేదకుంభుడ’నే ఉపాధ్యాయునాశ్రయించాడు. ఆతని విద్యార్థి దశలో గురుపత్ని  హఠాత్తుగా ఆతనిని వరించింది. అతడా పాపానికి వెరచి అటనుండి పారిపోయి ప్రతిష్ఠాననగరానికేగి ‘మంత్రస్వామి’ అనే గురువు నాశ్రయించి సకల విద్యలను పొందాడు.* 


*ఒకరోజు ఆ నగర పాలకుడగు సుశర్మ కూతురు శ్రీ అను నామెను దేవదత్తుడు కిటికీగుండా చూచాడు. ఆమె కూడా ఈతనిని చూసింది. పరస్పరం మోహితులయ్యారు. ఆమె దంతంతో ఒక పుష్పాన్ని గ్రహించి ఆతనిపై విసరి వేసింది.*


*రాకుమార్తె చేసిన ఈ సంకేతాన్ని విప్పలేక దేవదత్తుడు తన గురువు మంత్రస్వామిని అడిగాడు.*


*అప్పుడు గురువు “దంతముచే పుష్పాన్ని ఆమె విసిరింది కాబట్టి పూలు విరివిగా నున్న పుష్పదంత దేవాలయానికి రమ్మని తానక్కడ అతనికోసం నిరీక్షిస్తానని సంకేతితంగా చెప్పిం”దని ఆమె అభిప్రాయాన్ని విప్పి చెప్పాడు.* 


*దేవదత్తుడు పుష్పదంత దేవాలయానికి వెళ్లి ఆమె రాకకై తలుపు చాటున దాక్కొన్నాడు. ఆమె రాగానే ఆమెను కౌగిలించుకొన్నాడు. ఆమె తన సంకేతాన్ని ఎట్లా తెలుసుకున్నావని అడుగగా తన గురువు తనకది చెప్పాడన్నాడు.*


*అపుడామె కోపించి “నీవు విదగ్ధుడవు (చతురుడు) కావంటూ వెళ్లి పోయింది.*


*అప్పుడతడు చేసేదేమీ లేక ప్రాణాలను విడవటానికి సిద్ధమయ్యాడు. శివుడు తానిచ్చిన వరం వ్యర్థమౌతుందనే ఉద్దేశ్యంతో తన ప్రమథగణాల్లో ఒకడైన పంచశిఖుడనే వానినతని వద్దకు పంపాడు. పంచశిఖుడాతని వద్దకు వచ్చాడు. దేవదత్తుని శ్రీ తో కలపటానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. దానిప్రకారంగా అతడొక వృద్ధ బ్రాహ్మణుని వేషం వేసుకొని దేవదత్తునకు స్త్రీ వేషం వేసి సుశర్మ కొలువు దీరియుండగా ఆతని వద్దకు వెళ్లి “రాజా! నాకుమారుడెక్కడకో వెళ్లి పోయాడు. వానిని  వెదకటానికి నేను పోతున్నాను. ఈమె నా కోడలు. నా కొడుకు దొరికే వరకు ఈమెను నీ అంతఃపురంలో దాచియుంచమని కోరాడు.* 


*రాజామెను తన కుమార్తె అంతికానికి పంపాడు. స్త్రీ రూప వేషధారియైన ఆతడు నెమ్మది నెమ్మదిగా శ్రీ కి దగ్గరై –తానెవరో తెలుపుకొన్నాడు.*


*ఇద్దరూ గాంధర్వ విధించే పెండ్లాడారు. రాకుమార్తె గర్భం ధరించగా దేవదత్తుడు పంచశిఖుని తలవగా ఆతడు వచ్చి దేవదత్తుని అంతఃపురంనుండి తప్పించాడు.* 


*పంచశిఖుడు మరునాడు బ్రాహ్మణ వేషంతో రాజు వద్దకు పోయి తన కుమారుడు దొరికాడని తన కోడలిని తన కప్పగిస్తే తాను వెళ్ళి పోతానన్నాడు.*


*రాజు అంతంపురంలో వెదికించగా ఆమె ఎక్కడా కనబడ లేదు. బ్రాహ్మణశాప భయంతో రాజు తన మంత్రులతో విచారింపగా వారు 'ఇతడు నిజమైన బ్రాహ్మణుడు కాడని నిన్ను మోసం చేయటానికి వచ్చిన దేవుడని చెప్పారు.*


*పూర్వం ఇంద్రుడు, యముడు  శిబి చక్రవర్తిని ఏ విధంగా పరీక్షించటానికి వచ్చారో ఆ విధంగానే నిన్ను పరీక్షించటానికి వచ్చా'రన్నారు.* 


*ఇక చేసేదేమీ లేక రాజా ప్రమథగణంతో “ఓ పూజ్యుడా! నన్ను రక్షించు. రాత్రింవబవళ్లు శ్రద్ధతో కావలి కాస్తున్నా నీ కోడలినెవరో రాత్రి అపహరించారు. ఇది చాలా మాయగా ఉన్నద”న్నాడు. అపుడా దేవగణం రాజుతో అట్లయితే 'నాకొడుకునకు నీ కూతునిచ్చి పెండ్లి చేసి నాకు కోడలు లేని లోటును తీర్చ'మన్నాడు.*


*రాజు దానికంగీకరించి దేవదత్తునకు తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసాడు. ఈ విధంగా దేవదత్తుడు శివుడు చెప్పిన ప్రకారంగా చాలాకాలం భోగభాగ్యాలనుభవించాడు. *


*సుశర్మ వానప్రస్థానికై మహీధరమనే వనానికి వెళ్లాడు.   తిరిగి  దేవదత్తుడు శివుని ఆరాధించి మనుష్య శరీరాన్ని వదలి ప్రమథగణమయ్యాడు.*


*ప్రియురాలు ఉదంతముతో పుష్పాన్ని విసరుటయందలి సంజ్ఞను తెలియని వాడగుటచేత ఆతడు ప్రమథగణాల్లో పుష్పదంతునిగా ప్రసిద్దుడయ్యాడు.*


*ఇతడే తరువాత వరరుచిగా ప్రసిద్ధుడయ్యాడు. ఆతని భార్య శ్రీ- జయ అనే పేరుతో పార్వతీదేవికి ప్రతీహారి అయింది. శివుడు పార్వతీదేవికి చెప్పిన బృహత్కథను దొంగచాటుగా విని తన భర్తకు చెప్పి కథావ్యాప్తికి దోహదపడిందీమెయే.*✍️

(కథాసరిత్సాగరం-మొదటిలంబకం-ఏడవ తరంగం)

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

 గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

మన ఆరోగ్యం….


*మన ఆరోగ్యం….


*బ్రాండెడ్ vs…*

               *జనరిక్ మందులు : *

                    ➖➖➖✍️

                 (సమగ్ర వివరణ)


 *ఒక కొత్త మందును  కనుగొనడానికి ఫార్మా  కంపెనీలు అనేక పరిశోధనలు, పరీక్షలు చేసి మందును మా‌ర్కెట్ లోకి తీసుకొస్తాయి.* 


 *అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీ పై ఆ కంపెనీకి కొంత కాలం పాటు ( 20 సం.లు) పేటెంట్ హక్కులు ఉంటాయి.* 


 *అలా తయారు చేసిన మందులను బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అంటారు.* 


 *ఆ మందు యొక్క ఫార్ములా తెలిసినా ఏ ఫార్మా కంపెనీ అయినా సరే, దానిని పేటెంట్ ఉన్న కాలంలో పేటెంట్ పొందిన కంపెనీ అనుమతి లేకుండా ఆ మందు తయారు చేయకూడదు.* 


 *అలా పేటెంట్ లో ఉన్న మందులను ఇతరులు ఎవరైనా తయారు చేసి అమ్మితే వారు శిక్షార్హులౌతారు. అంటే ఆ మందుపై, మొట్ట మొదట తయారు చేసిన కంపెనీకే  20 సంవత్సరాల పాటు గుత్తాది పత్యం ఉంటుంది.* 


 *నిజానికి ఆ మందును తయారు చేయడానికి అయ్యే ఖర్చుకూ, ఆ మందుపై కంపెనీ వసూలు చేసే అమ్మకపు ధరకు ఏ మాత్రం పొంతన ఉండదు. తయారీ ఖర్చు కంటే మందు యొక్క అమ్మకపు ధర అనేక రెట్లు అధికంగా ఉంటుంది.* 


 *ఎందుకంటే ఆ మందు తయారీ కోసం "పరిశోధనలు మరియూ క్షేత్ర స్థాయి పరీక్షల (Clinical Trials)" నిమిత్తం మాకు చాలా డబ్బు ఖర్చైందని సదరు కంపెనీ వాదిస్తుంది. కాబట్టి ఓ 20 సంవత్సరాల పాటు ఆ మందుపై దానిని తయారు చేసిన కంపెనీకి పేటెంట్ హక్కులు కల్పించి, పెట్టుబడి సొమ్మును రాబట్టుకోడానికి, ఆ మందును మొట్టమొదట తయారు చేసిన కంపెనీకి అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది.* 


 *మందు పై మొట్టమొదటి తయారు చేసిన  కంపెనీ యొక్క పేటెంట్ కాలం ముగిసిన తర్వాత, అవే కెమికల్స్ ను ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును ఏ కంపనీ అయినా తయారు చేసి, మార్కెట్ లోకి విడుదల చేయొచ్చు.. అలా తయారు చేసిన మందులను " జనరిక్_డ్రగ్స్" అంటారు.* 


 *జనరిక్ డ్రగ్స్ తయారు చేయటానికి ఫార్మా కంపెనీలు ఎటువంటి పరిశోధనలు కాని క్లినికల్ ట్రయల్స్ గాని జరపవలసిన అవసరం లేదు. అందువలన జనరిక్ డ్రగ్స్ ధరలు, బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30 నుండి 80 శాతం తక్కువ ధరలలో లభిస్తాయి. వీటిపై ముద్రించబడే యం.ఆర్.పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు.* 


 *తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి నకిలీ మందులు అని, సరిగా పని చేస్తాయో చేయవో  అని భయపడవలసిన అవసరం లేదు. బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ జనరిక్ మందుల తయారీలోను పాటిస్తారు.బ్రాండెడ్ మందులెలా పనిచేస్తాయో, జనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి.* 


 *కాని ప్రజలు జనరిక్ మందులకు అలవాటు పడితే ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకూ, ఫార్మా ఏజెన్సీలకూ, మందుల షాపులకూ, అందరికీ నష్టమే కదా.* 


 *అందుకనే జనరిక్ మందులపై, అవి బ్రాండెడ్ మందుల్లా పనిచేయవన్న పుకార్లు లేవదీస్తున్నారు. అది నిజం కాదు జనరిక్ మందులు బ్రాండెడ్ మందులతో సమానంగా పని చేస్తాయి* . 


 *బ్రాండెడ్ మందులు తయారు చేసే ఫార్మా కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా డాక్టర్లకు తమ బ్రాండెడ్ ఔషధాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వాటిని సూచించమని కోరుతుంటాయి. డాక్టర్ ఎంతమేర రాస్తే అంతమేర ప్రతిఫలాలను ముట్టజెబుతాయి. ఈ ఫలాలు ఉచిత విదేశీ పర్యటనలు, చెక్, బహుమతులు ఇలా పలు రూపాలుగా ఉంటాయి.అందుకే బ్రాండెడ్ ఔషధాలు చాలా ఖరీదుగా ఉంటాయి.* 


 *కొంత మంది వైద్యులు జనరిక్ మందులను సూచిస్తుంటారు. అవి వారి ఆస్పత్రి ప్రాంగణంలోనే లభిస్తాయి. వాటి ధర వాస్తవానికి చాలా తక్కువగా ఉన్నప్పటికీ వాటి మీద ముద్రించబడిన ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ అడిగితే ఒక 10 శాతం తగ్గిస్తారు. దాంతో కస్టమర్ సంతోషిస్తాడు. కాని ముద్రిత ధర కంటే 50 నుంచి 80 శాతం వరకు తక్కువ ధర ఉంటుంది.* 


 *ఉదాహరణకు జ్వరానికి సాధారణంగా డాక్టర్ వద్దకు వెల్లకుండానే చాలా మంది వాడే మందు …. "డోలో650" (పారసెటమాల్ 650 మి గ్రా.) దీని ధర 15 టాబ్లెట్లకు 29 /- రూపాయలు. ఇదే టాబ్లెట్ ను సిప్లా కంపని "పారాసిప్ 650" పేరుతో తయారు చేసి అమ్ముతుంది , దాని ధర 10 టాబ్లెట్ లకు 18/- రూపాయలు. నిజానికి జనరిక్ మెడికల్ షాపులలో పారసెటమాల్ 650 మి గ్రా.  రూ. 4.50 /- లకు పది టాబ్లెట్ లభిస్తాయి.* 


 *నొప్పి నివారణకు వాడే డైక్లో ఫెనాక్ సోడియం ఎస్ఆర్ బ్రాండెడ్ (వోవిరాన్)10 మందుల ధర రూ.51.91. కానీ ఇదే ఔషధం 10 మందుల జనరిక్ ధర జనఔషధి స్టోర్ లో Rs. 3.35 మాత్రమే. 100 ఎంఎల్ కాఫ్ సిరప్ బ్రాండెడ్ వి అయితే 33 రూపాయలు పైనే. జనరిక్ దగ్గు మందు జనఔషధి స్టోర్ లో 13 రూపాయలకే లభిస్తుంది. జ్వరం తగ్గడానికి వాడే ప్యారాసిటమాల్ 500 మి గ్రా. 10 మాత్రల ధర బ్రాండెడ్ అయితే 13 రూపాయలు. జనరిక్ అయితే 2.45రూపాయలే.* 


 *సూక్ష్మంగా చెప్పాలంటే బేసిక్ ఫార్ములా ప్రకారం తయారైన మందును జనరిక్ మందు అంటారు. ఇదే సూత్రంతో కార్పొరేట్ కంపెనీలు పేరు మార్చి మందులు ఉత్పత్తి చేస్తున్నాయి. ధరలో తేడా తప్పితే మందు పనిచేయడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మందు పరిమాణం, రసాయనిక నామం, నాణ్యత ఒక్కటే గానీ లేబుల్, దానిపై బ్రాండ్ పేరు మారుతుంది.* 


 *జనరిక్ మందుల పట్ల సామాన్య ప్రజలకు చాలా అపోహలు* *అనుమానాలున్నాయి. వాటిని గూర్చి వివరించి ఉపయోగించేలా చేసే వ్యవస్థలు లేవు. ఇటీవల కాలంలో వీటిపట్ల ప్రజలకు కొంత అవగాహన పెరిగింది.* 


 *అందరికీ జనరిక్ మందుల పట్ల అవగాహన పెంచి మనం కూడా* *వీలైనంత ఆ మందులు వాడి డ్రగ్ మరియు ఫార్మా మాఫియా దోపిడీ ని అరికట్టాల.* ✍️

       *…జన విజ్ఞాన వేదిక (AIPSN)*


.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఆచార్య సద్బోధన:*

 


             *ఆచార్య సద్బోధన:*

                 ➖➖➖✍️


*భూమిపై ఉండేది అంతా చర్యకు, ప్రతిచర్యయే!*


*నీవు ఇతరులకు ఏదైతే చేస్తావో నీకు ఇతరులు దానినే చేస్తారు..!*


*నీవు ఏదైతే ఇస్తావో తిరిగి దానినే పొందుతావు…!*


*కనుక మంచినే చేయండి, తిరిగి మంచినే పొందండి..!*


*ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది..!*


*కష్టమయినా సరే మంచి మార్గంలోనే ముందుకు కదలండి..  అదే మీకు అన్నింటా శ్రేయస్కరం...!*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“ గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

Powerful Nation

 💥 *Check New York Times view about PM Modi : (Joseph Hope, Editor-in-Chief of the New York Times:)*


◼️Narendra Modi's sole aim is to make India a better Country. If he is not stopped, in the future, India will become the most Powerful Nation in the World.. It will surprise even  the USA, the United Kingdom, and Russia..Japan.


◼️Narendra Modi is moving towards a specific goal. No one knows what he wants to do....and his intentions, strategy, cannot be predicted.


◼️Behind the Smiling face, he is a dangerous Patriot. He uses all the Countries of the world for the benefit of his Nation......India.


◼️First he destroyed US ties with Pakistan and Afghanistan.


◼️Next Narendra Modi has created an alliance with Vietnam, shattered China’s Superpower dream and made use of the three Countries.


◼️The long-running dispute over oil extraction overseas between Vietnam and China has benefited India. With India's support, Vietnam began producing Oil in China's Southern Seas.


◼️Vietnam now supplies all of its Oil to India. The United States has different support for this. He made Pakistan a poor Country without going into a war.


◼️He brought the Port of Iran under his control.


◼️He has set up an Indian Military base on the border with Afghanistan, very close to the area that divides Pakistan.


◼️In order to increase Indian trade, he has also built a route through Iran (leaving Pakistan) to Afghanistan.


◼️Narendra Modi’s desires are Going Up ....one by one. Sections 370 and 35A have been repealed.


◼️One day he will completely capture Pakistan occupied Kashmir. Pakistan will fall into 4 pieces in the coming seasons. This will happen on the warning of Narendra Modi.


◼️Saudi Arabia, Pakistan's traditional ally, will also play a Key role in the Partition of Pakistan..


◼️In Asia, this man who finished China and the United States, has  canceled the SAARC Summit and shown his power to the World.. Narendra Modi has succeeded in maintaining India's superiority over Asia..


◼️He made UAE fine the Foreign minister of Pakistan on landing in UAE & sent the minister back. Malaysia took over a Pakistan airplane to recover debts owed by Pakistan.


◼️Russia and Japan, 2 of Asia's Major Powers, have done nothing to say.


◼️He held both Countries in his hands with great precision. In the case of China's Vietnam Oil issue, China will ask for Oil... Then he will ask Pakistan Occupied Kashmir. 🤟


◼️What he would ask was, "I'll take it.. You have Hair in your Mouth," and tease China's Vietnam issue..


◼️Nothing can be done by China. This person is taking Indian Politics to a totally different level.


◼️Many Countries think and act as if each Country has many Enemies.. But India has no Enemies other than Pakistan. India is almost certain to be a friend to all Countries of the World.


◼️This man is doing more harm to Pakistan than the real War.. By using Muslim Countries against Pakistan, Narendra Modi has proven himself to be one of the Best leaders in the World.


◼️Even if Pakistan goes for War with India, there will not be so much loss.. But now Pakistan is suffering more than that.


◼️In all negotiations with all Countries, this person's Honesty must be taken into account.


◼️India's progress will be difficult for the rest of the World.


◼️With the current astounding growth of India, all the Countries in the United Nations will experience the consequences..! 

____________________________

✨✨✨✨✨✨✨✨

☝🏻

*Great article, tells you what NO media in India will speak about the achievement of Modi and his foriegn policy.* 


*Jai Bharat !*

*Vande' Maataram*

🇮🇳

వాల్మీకి రామాయణం:* *9 వ భాగం:*

 


           *వాల్మీకి రామాయణం:*

                  *9 వ  భాగం:*

                    ➖➖➖✍️


*ఆ రాత్రి అక్కడే గడిపి, మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు. అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గూర్చి చెప్పమంటే, విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు…  "పూర్వం కృత(సత్య) యుగంలో కశ్యప ప్రజాపతి ఇరువురు భార్యలైన అదితి మరియు దితి సంతానమైన దేవతలు, దైత్యులు ఎంతో సఖ్యతగా, ధార్మికంగా జీవించేవారు. అలా కొంత కాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది. కాబట్టి క్షీర సాగరాన్ని మధిస్తే అందులోనుంచి అమృతం పుడుతుంది, అది తాగితే మనకి ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు, కావున ఆ సాగర మధనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా అందులోంచి ముందు హాలాహలం పుట్టి అది దేవతలని, రాక్షసులని, మనుషులని, ఈ జగత్తు మొతాన్ని నాశనం చెయ్యసాగింది. అప్పుడా దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్లి ఆయనను రక్షించమని ప్రార్ధించారు. శంకరుడు బయటకి రాగా, ఇది అగ్రపూజ కనుక మొదట వచ్చినదాన్ని అందరికన్నా పూజ్యనీయులైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు. అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేలగా తాగాడు. అన్ని లోకాలని కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక పొక్కు రాలేదు, కళ్ళు ఎరుపెక్కలేదు, ఆయన మెడలో ఉన్న పిల్ల పాములు కూడా అటూ ఇటూ కదలలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు.* 


*సంతోషించిన దేవతలు మళ్ళీ ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతోపాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు.*


*అప్పుడాయన కూర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపు పై పెట్టుకొని పైకి తెచ్చారు.*


*అప్పుడు మళ్ళీ చిలకడం ప్రారంభించారు. అప్పుడు అందులోంచి నురగలు వచ్చాయి, ఆ నురగల నుంచి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకి సేవ చేసే పరిచారికలు కూడా కొన్ని కోట్లమంది వచ్చారు.*


*అప్సు నిర్మథనాత్ ఏవ రసాత్ తస్మాత్ వర స్త్రియః |*

*ఉత్పేతుః మనుజ శ్రేష్ఠ తస్మాత్ అప్సరసో అభవన్ ||*

*షష్టిః కోట్యో అభవన్ తాసాం అప్సరాణాం సువర్చసాం |*

*అసంఖ్యేయాః తు కాకుత్స్థ యాః తాసాం పరిచారికాః ||*


*అలా వచ్చిన అందమైన అప్సరసలని, దేవత రాక్షసులలో ఎవరూ కోరలేదు. అందుకని వాళ్ళు దేవ వేశ్యలు అయ్యారు.*


*తరువాత అందులోనుంచి వరుణుడి కుమార్తె అయిన వారుణి అనే సురరసం వచ్చింది. దేవతలు ఆ వారుణిని తాగారు కాబట్టి వాళ్ళని సురులు అని పిలుస్తారు, రాక్షసులు ఆ సురారసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అని అంటారు. ఆ వారుణిని సేవించలేదు కనుక రాక్షసుల మనస్సులు ఎప్పుడూ సంతోషంగా ఉండవు.* 


*తరువాత వచ్చిన ఉచ్చైఃశ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు, అలానే కౌస్తుభాన్ని శ్రీమహావిష్ణువు స్వీకరించారు. తరవాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు, చివరగా విష్ణు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు.*


*కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా అనింది.. “నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులని చంపారు. నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు, దీనికంతటికి దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం. కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి” అని కశ్యపుడిని అడిగింది.* 


*”అయితే నువ్వు సౌచంగా( భౌతికంగా, మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఉండడం) ఒక 1000 సంవత్సరాలు ఉండగలిగితే, నీకు ఈ లోకాలని శాసించగల, ఇంద్రుడిని సంహరించగల కొడుకు పుడతాడు” అని కశ్యపుడు అన్నాడు.* 


*దితి సరే అని శుక్లప్లవనము అనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చెయ్యడం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరికి ఇంద్రుడు వచ్చి, “నేను నీకు సేవ చేస్తాను అమ్మా” అన్నాడు.* 


*దితి సరే అనడంతో రోజూ ఫలాలు తీసుకోచ్చేవాడు, రోజూ తన తల్లి కాళ్ళు పట్టేవాడు. అలా 990 సంవత్సరాలు పూర్తయ్యాయి.*✍️

రేపు...10.వ భాగం...

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



కష్టాలను తరిమికొట్టండి



*ఒక పాము చాలా హుషారుగా  పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...* 


ఆ పాము కోతిని కాటు వేయబోయింది...భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి.

ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి...


తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన

కోతికి నిరాశే ఎదురయ్యింది...అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని

అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు..

' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని...కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది...ఇందులోని నీతి ఏంటంటే...


నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు...కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి.

అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ బంధువులు,ఎవ్వరూ నిన్ను రక్షించడానికి నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు.

ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు... నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరిసహాయం కోసం చూడకూడదు..కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు...కష్టాన్ని మంచి పరిష్కారంలో తరిమికొట్టాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు..

నిజమే కదా! పాత కథే అయినా ధైర్యాన్నిచ్చే చక్కని కథ.

కష్టాలను తరిమికొట్టండి...ఆనందంగా జీవించండి...https://chat.whatsapp.com/Cf4WSYow7il7f2jhsCODOD

చైతన్యము

 *శుభోదయం* 

💐🙏💐🙏💐


➡️నిరంతర దైవ నామ స్మరణ


➡️నిరంతర దైవ చింతన


➡️నిరంతర ధ్యానము 


➡️నిరంతర సత్సాంగత్యము


నందు నిలిచిన మనసు 


➡️ఎరుకలో ఉంటుంది...


➡️ ఎరుకలో ఉన్న మనసు వర్తమానంలో ఉంటుంది... 


➡️ వర్తమానంలో ఉన్న మనసు ప్రస్తుత క్షణంలో ఉంటుంది....


➡️ ప్రస్తుత క్షణానికి గతం లేదు.. భవిత లేదు..


➡️ గతం, భవిత లేని మనసుకు దుఃఖం లేదు..


➡️ దుఃఖం లేని మనసు శాంతికి నిలయం.... 


➡️ శాంతిగా ఉన్న మనసు  ఆనందానికి నిలయం....


➡️ ఆనందం నీ సహజ స్థితి..


➡️ ఆనందం నీ స్వరూపం...


➡️ ఆనందం నీ స్వభావం... 


➡️ *ఆనందమే నీ ఉనికి, చైతన్యము....*


➡️ *అదే నీ ఆత్మ స్థితి...* 


అది పొందడానికే ఈ నిరంతర సాధన.... 


🙏🙏🙏🙏🙏

*వేద రక్షణ

 


       *వేద రక్షణ - వాజపేయం*

                ➖➖➖✍️


మా నాన్నగారు *‘జె. పద్మానాభాచార్య వాజపేయ యాజి’* గారికి నాతోపాటు నలుగురు కొడుకులము. 


మా నాన్నగారికి పరమాచార్య స్వామివారిపై అనన్య భక్తిప్రపత్తులు. వారు ఋగ్వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు.


అప్పుడు మేము కుంభకోణంలో నివసించేవాళ్ళం. అప్పుడు పరమాచార్య స్వామివారు మా నాన్నగారిని పిలిచి, *“ఇప్పుడు మధ్వులలో అగ్నిహోత్రులు ఎవరూ లేరు కనుక నువ్వు రోజూ అగ్నిహోత్రం చెయ్యడం ప్రారంభించాలి”* అని ఆజ్ఞాపించారు. 


స్వామివారి ఆదేశానుసారం మా నాన్నగారు అధ్యయనం ప్రారంభించి నిత్యాగ్నిహోత్రి అయ్యారు.


కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు 

మా నాన్నగారు వేదపారాయణం చేస్తున్నారు. కంచి పరమాచార్య స్వామివారు పంపగా వచ్చామని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. 


మా నాన్నగారు *’కలకత్తాకు వెళ్లి అక్కడ ఉన్న వేదభవనంలో ఋగ్వేద అధ్యాపకులుగా ఉంటూ అక్కడ ఉన్న మధ్వ సముదాయానికి పౌరోహిత్యం చెయ్యవలసింది’* గా పరమాచార్య స్వామివారు ఆదేశించారని వారు తెలిపారు. 


మహాస్వామివారి ఆజ్ఞ ప్రకారం మా పెద్ద అన్నను తీసుకుని కలకత్తా వెళ్ళారు. అక్కడి వేదభవనంలో ఋగ్వేద అధ్యాపకులుగా ఉంటూ, అక్కడి మధ్వులకు వైదికం చేస్తూ ఉండేవారు. 


నాలుగైదు సంవత్సరాల తరువాత 1968లో ఒక బస్సు ప్రమాదంలో మా అన్నయ్య చనిపోయాడు.


పరమాచార్య స్వామివారు మమ్మల్ని విజయవాడ వేద సదస్సుకు రమ్మన్నారు. అక్కడ స్వామివారిని కలువగా మమ్మల్ని కలకత్తా వదిలి కావేరీ తీరంలో ఉండమని ఆదేశించారు. 


దాంతో మేము సిరుగమణి అగ్రహారం చేరుకున్నాము. అక్కడ శ్రీమాన్ వేంకటేస అయ్యర్ గారు మా వసతికి, నెల భత్యానికి ఏర్పాట్లు చేశారు. నాన్నగారు అక్కడ ఋగ్వేదం నేర్పుతూ, అగ్నిహోత్రం చేస్తూ ఉండేవారు.


శాస్త్రం ప్రకారం నిత్యాగ్నిహోత్రం, ఇష్టి, సోమయజ్ఞం జరిగేవి. పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో ఎందఱో మధ్వ విద్యార్థులు వేద రక్షణ నిధి ట్రస్ట్ తరుపున విద్యార్థులుగా చేరి, అధ్యయనం చేసి, పరిక్షలలో ఉత్తీర్ణులయ్యారు. 


ఈనాటికీ సిరుగమణి వేద పాఠశాల నడుస్తోంది. మా చిన్నతమ్ముడు పరశురామన్ అక్కడ అధ్యాపకుడు కూడా.


*ఈరోడ్* లో మా నాన్నగారు వాజపేయ యాగం పూర్తిచేసిన తరువాత మహాస్వామివారి దర్శనం కోసం మహఖాన్ వెళ్ళాము. అక్కడ ఉన్న శ్రీమఠం సేవకులకి వాజపేయ యాగం పూర్తిచేసి స్వామివారి దర్శనానికి వచ్చామని చెప్పాము. 


కాని మహాస్వామివారు మమ్మల్ని మా బసకు తిరిగివెళ్ళమని సమాధానం పంపారు. 

ఏదో కారణానికి మహాస్వామివారి దర్శనం లభించకపోవడంతో మేము బసచేస్తున్న సత్రానికి వచ్చి మిక్కిలి బాధపడుతున్నాము. ఒక గంటసేపటి తరువాత ఏనుగు, గుర్రం, చామరం, వేదఘోష, మంగళ వాయిద్యాలతో కూడిన ఒక బృందం అటుగా వచ్చింది. *“యాగం చేసివచ్చినవారు ఇక్కడ ఎవరో బసచేస్తున్నారు. వారిని సకుటుంబంగా తీసుకునిరమ్మని పరమాచార్య స్వామివారు సండూర్ సంస్థాన మహారాజుగారిని పంపారు”* అని మాతో చెప్పారు. 


ఆ విషయం విని మేము ఆనందాశ్చర్యాలకు లోనయ్యాము.


సామవేద ఘోషతో, కలకత్తా శంకర నారాయణ శ్రౌతి మమ్మల్ని తీసుకుని 

వచ్చారు. సండూర్ మహారాజుగారు మా నాన్నగారికి శ్వేత ఛత్రం పట్టి ఊరేగింపుగా తీసుకునివచ్చారు. మేము మహాస్వామి వారి మకాం చేరుకోగానే స్వామివారు మాతో, *“ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు ఈ కన్నీళ్ళు? వాజపేయ యాగం చేసినవారిని రాజలాంఛనాలతో తెల్లని గొడుగు క్రింద చూడాలని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మిమ్మల్ని అలా చూడాలనే నేను వెనక్కు పంపాను”* అని చెప్పారు. 


మహారాజుగారు పట్టిన శ్వేత ఛత్రాన్ని మాకు ఇచ్చి, దాదాపు రెండుగంటల సేపు మాతో మాట్లాడి, మా బాధను తొలగించి మమ్మల్ని ఆశీర్వదించి పంపారు.


ఇది మా జీవితాల్లో ఎప్పటికీ మరచిపోలేని అత్యద్భుతమైన సంఘటన.


--- పి. రామకృష్ణాచార్య, ఋగ్వేద అధ్యాపకులు, మంత్రాలయం. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

 #కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



వాల్మీకి రామాయణం: 8 వ భాగం:

🌺🍀8.రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...


             వాల్మీకి రామాయణం:

                    8 వ  భాగం:

                   ➖➖➖✍️


అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగా నదిని సమీపించారు, అందరూ గంగని చూడగానే ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు  మొదలగువారు 

ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి, అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చొని, మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు....

"కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారు, కాని కుమారులు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు, ఆ యాగం జరుగుతుండగా కుశనాభుడి తండ్రైన కుశమహారాజు అక్కడికి వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, గాధి అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశం పేరు నిలబెడతాడు" అన్నాడు.


“నేను ఆ గాధి యొక్క కుమారుడినే రామా” అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు.


స పితా మమ కాకుత్స్థ గాధిః పరమ ధార్మికః |

కుశ వంశ ప్రసూతో అస్మి కౌశికో రఘునందన ||


అప్పుడు విశ్వామిత్రుడు..... " నేను కుశ వంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు ఋచకుడు. కొంతకాలానికి  మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద, మా అక్కకి దగ్గరగా ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చెయ్యడానికి వచ్చాను, నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను" అని రాముడితో చెప్పాడు.


అక్కడే ఉన్న ఋషులు అప్పుడు…


విశేషేణ భవాన్ ఏవ విశ్వామిత్ర మహాయశః |

కౌశికీ సరితాం శ్రేష్ఠః కుల ఉద్యోతకరీ తవ ||


“నీవంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది, మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనం అయ్యింది” అని అన్నారు.


అప్పుడు రాముడు “గంగకి త్రిపథగ అన్న నామం ఎలా వచ్చిందో చెప్ప”మన్నాడు. 


అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు... " పూర్వకాలంలో హిమవంతుడు అనే పర్వత రాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవాహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలో ప్రవహించేది.  ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయ్యి, హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది, 3 లోకములలో ప్రవహించినది కనుక గంగని ‘త్రిపథగ’ అని పిలుస్తారు" అని విశ్వామిత్రుడు చెప్పాడు.


“మీరు విషయాలని మనస్సుకి అతుక్కున్నేటట్టు చెప్పగలరు, కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసింది”గా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు. 


అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు..."పార్వతి పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది, పార్వతీదేవి - శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి, కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు శంకరుడు బయటకి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆయనతో, “స్వామీ! మీరు పార్వతీదేవితో 100 దివ్యసంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు, మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే, మేము ఎవరము దానిని తట్టుకోలేము, కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి” అన్నారు.


వాళ్ళు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు, “కాని ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు, దాన్ని ఎక్కడ వదిలిపెట్టను”అని శంకరుడు అడిగాడు. 


అప్పుడు ఆ దేవతలు.....

“యత్ తేజః క్షుభితం హి అద్య తద్ ధరా ధారయిష్యతి | మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి” అన్నారు. 


శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. 


ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి, “నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున.....


అపత్యం స్వేషు దారేషు న ఉత్పదయితుం అర్హథ |

అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ||

ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి |

అవనే న ఏక రూపా త్వం బహు భార్యా భవిష్యసి ||

న చ పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుషీకృతా |

ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్ఛతీ ||


“మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి, ఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు, భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుంద”ని శపించింది. 


ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.


వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. 


అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.


శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. 


అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు, తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. 


ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలీక బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. 


అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు - మనోరమల కుమార్తెలైన గంగా - పార్వతులకి తేడా లేదు, కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే, పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. 


అప్పుడా దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, “దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి” అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. 


అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. 


శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. “ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చెయ్యమంటారు” అని అడిగింది. 


అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది.


అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి, ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము, సీసము పుట్టాయి, ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి, మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్ని పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా, శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా, పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు(కృత్తికల పుత్రుడు) అని పిలవాలి, అలా అయితే పాలు పడతాము” అన్నారు. 


దేవతలు సరే అన్నారు.


తతః తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ |

పుత్రః త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః ||


ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు, ఏక కాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్నిసంభవహా అని నామాలు, అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక, స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక, అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్ధాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు" అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.


గంగ అసలు భూమి మీదకి ఎందుకొచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు 

"పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడు పరిపాలించేవాడు, ఆయనకి కేశిని, సుమతి అని ఇద్దరు భార్యలు. సుమతి గరుక్మంతుడి సోదరి. తనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు స్రవణాన్ని చేరుకొని 100 సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగు స్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న ఇద్దరు భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు, రెండవ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు” అని వరమిచ్చాడు. 


ఇది విన్న కేశిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడుగగా, ఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి” అని అన్నారు. 


పెద్ద భార్య అయిన కేశిని “తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాల” అని అడిగింది, నాకు మహోత్సాహము కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు.


కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనే వాడు పుట్టాడు, రెండవ భార్యకి ఒక సొరకాయ పుట్టింది, ఆ సొరకాయ కిందపడి పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు. 


వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు, వాళ్ళందరిని కలిపి సగరులు అన్నారు. 


పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రోజూ రాజ్యంలోని కొంతమంది పిల్లలను సరయు నదిలోకి తీసుకెళ్ళి, నీళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడు. 


కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి.....


ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిబాధకః ||

పౌరాణాం అహితే యుక్తః పిత్రా నిర్వాసితః పురాత్ ||


“తప్పు చేసినవాడు కొడుకైనా సరే, అతనివల్ల ప్రజలకి కీడు జరుగుతుంది కనుక శిక్షించాలి” అని అనుకున్నాడు. 


ఆ అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన అంశుమంతుడిని తన దగ్గర పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి. 


అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేథ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళుతున్న అంశుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడా సగరుడు తన 60,000 మంది కొడుకులని పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది, కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండని చెప్పి పంపాడు. 


వజ్రాల్లాంటి తమ గోళ్ళతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. 


ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి… “దేవా! సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చెయ్యమంటారు” అని అడిగారు. 


అప్పుడు బ్రహ్మదేవుడు..... “మీరెవరు కంగారు పడకండి, ఈ భూమంతా శ్రీమహా విష్ణువుది, కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు, ప్రస్తుతం ఆయన పాతాళ లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు” అని చెప్పారు.


కాపిలం రూపం ఆస్థాయ ధారయత్య అనిశం ధరాం |

తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజా ||


ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వాళ్ళు సగరుడి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు. 


“నాకు గుర్రం తప్పకుండా కావాలి, మీరు పాతాళం దాకా తవ్వెయ్యండ”ని చెప్పి వాళ్ళని మళ్ళీ పంపాడు. 


ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి, ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశా గజం అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకి వెళ్ళగా, వాళ్ళకి మహా పద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది, అలాగే పడమర దిక్కున సౌమనసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారు. 


నాలుగు దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు. ఈ సారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలో సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగాలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగుతీసారు. 


వెంటనే ఆ కపిల మహర్షి ఒక 'హుం'కారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు.


ఎంతకాలమైనా సగరులు రాకపోయేసరికి, ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు. 


అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జరగలేదు కనుక నీళ్ళు తీసుకువద్దామని బయలుదేరగా, ఆ సగరుల మేనమామ అయిన గరుక్మంతుడు ప్రత్యక్షమై, “ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి. కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి” అని చెప్పాడు. 


సరే అని ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశారు. 


తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధ పడ్డాడు. తరవాత ఆయన ఒక 30,000 వేల సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు, ఆయన తరవాత అంశుమంతుడు రాజయ్యాడు, ఆయన 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తరవాత వచ్చిన దిలీపుడు 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు కాని గంగని తీసుకురాలేకపోయాడు. దిలీపుడి తరవాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పజెప్పి, గోకర్ణ క్షేత్రంలో 1000 సంవత్సరాలు తపస్సు చేయగా, ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడు. అప్పుడు భగీరథుడు 

"నాకు కుమారులు లేరు, కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అన్నాడు, అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు" అన్నాడు.


అప్పుడు బ్రహ్మదేవుడు "నీ మొదటి కోరికని నేను తీరుస్తాను, కాని గంగని భూమి మీదకి వదిలితే, దాన్ని పట్టగలిగేవాడు ఎవడూ లేడు, కేవలం శివుడు తప్ప. కావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి, ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను" అని అన్నాడు.✍️

రేపు... 9వ భాగం...

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

ఓం కారం

 

               🕉️ఓం కారం🕉️

                  ➖➖➖✍️


*ఓంకారంతో దివ్య ప్రకంపనలు.. తరంగాలతో దేహం పులకితమయం!*


*చాలామంది నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతంగా ఇష్టపడతారు.* 


*పంచభూతాల్లో శబ్దం ముందు ఉంది. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారమే!*


*ఓంకారం దేహంలో ఉంది. 'ఓం' అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది. దివ్య ప్రకంపనలు శరీరాన్ని చుట్టుముడతాయి.*


*అప్పుడు శరీరం సహజ ధ్యానంలోకి అత్యంత సహజంగా వెళుతుంది. ఆ తరవాత నిశ్శబ్దంలో ఓలలాడుతుంది.*


*ఓంకారానికి, ఓంకారానికి మధ్య ఏర్పడుతున్న నిశ్శబ్దాన్ని సాధకుడు గమనించాలి.*


*అక్కడ మనసు ఆగిపోతుంది. ఆ నిశ్చలత్వమే ఓంకారాన్ని ఉద్దీపింపజేస్తుంది.*


*ప్రయత్నపూర్వకంగా ప్రతి రోజూ ఓంకారాన్ని జపిస్తే, కొంతకాలం గడిచాక మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది.*


*'ప్రశాంతత కావాల్సినవారు ఓంకార ధ్యానం చేయాలి'అంటారు.*


*నమ్మకం ఉన్నవారైనా, లేనివారైనా ఓంకారాన్ని జపిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు.*


*'అ'కార, 'ఉ'కార, 'మ'కారాలు కలిసి 'ఓంకారం' అయిందని పండితులు చెబుతారు.*


*ఔషధాన్ని నమ్మనివారైనా, దాన్ని తీసుకున్నప్పుడు దాని పని అది చేస్తుంది. ఓంకారమూ అంతే! ఆ శబ్దాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టగానే, అది సాధకుల్ని చక్కగా పట్టుకుంటుంది.*


*వేదభూమికి ఆధారం ఈశ్వరుడు. ఆయనకు శబ్దరూపం ఓంకారం.*


*ఓంకారంతో ధ్యానంలోకి ప్రవేశిస్తే చాలు. ఆనందం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని ఉపనిషత్తులు చెబుతున్నాయి.*


*ఓంకారం అంటే, ఆనంద స్వరూపం. అది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాల్ని దాటి వెలుగులీనుతూ ఉంటుంది అది.* 


*ఎవరు ఆ ప్రణవ శబ్దం చేస్తారో, వారితో సులువుగా కలుస్తుంది. వారిని తనలో కలుపుతుంది.* 


*నిశ్శబ్దానికి నేపథ్యంగా ఉండేది ఓంకారమే. అది విశ్వంలో ఆత్మగా ఉంది.* 


*ఓంకారం- పిలిస్తే పలుకుతుంది. ఋషుల చుట్టూ తిరుగుతుంది. ధ్యానుల శరీరాల్ని డమరుకాలు చేస్తుంది. జ్ఞానుల దేహాల్ని పాంచజన్యాలుగా మారుస్తుంది. శ్రీకృష్ణుడి మురళిలోకి ప్రవేశించిన ఓంకారం బృందావనమంతా విహరించిందని పురాణ గాథలు చెబుతాయి.*


*ఓంకారం ప్రాణం. చైతన్యం, సత్యం, ఆనందం... అన్నీ ఓంకారమే.*


*శివుడి మాటలకు భాష ఓంకారం. ఆ శివతాండంలో ఓంకారం ప్రణవ నాదమవుతుంది. ముల్లోకాలూ ఆనంద సాగరంలో తేలియాడేలా చేస్తుంది.*


*ఓంకారమే ప్రకృతిని నడిపిస్తుంది. ఆ ఓంకారాన్ని ఆహ్వానించి, ఆవాహన చేసుకున్న మానవ జన్మ ధన్యమైనట్లే.*


*ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః ఇలా ప్రతి నామం ముందూ ఓంకారం భూషణమై వెలుగుతుంది.*


*ప్రతి స్తోత్రమూ ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ప్రతి శ్లోకమూ ఓంకారంతోనే జీవిస్తుంది.*


*ఓంకారంతోనే విశ్వం ప్రారంభమైంది. అది చివరికి ఓంకారంలోనే లీనమవుతుంది.*


*'ఓం' అని ధ్యానిస్తే పరమశివుడికి మోకరిల్లినట్లే. సకల జీవులూ ఓం తోటలో పూచిన పుష్పాలు. ఓంకార వర్షంతోనే అవి పెరుగుతాయి. ఓంకార కాంతిలోనే అవి హాయిగా జీవిస్తాయి. ఓంకారం వాటికి ప్రాణవాయువు. వాటికి శక్తి, ధైర్యం, శాంతి ఓంకారమే. అందుకే అందరూ 'ఓం'కారాన్ని శాంతితో జతచేస్తారు. శాంతిలో 'ఓం' చూస్తారు.*


*'సమస్తం ఓంకారం నుంచే ఉద్భవించింది' అంటారు కబీర్‌.*


*దైవం ఓంకార ప్రేమ స్వరూపం. ఆయన రూప రహితుడు, నాశన రహితుడు, నిర్గుణుడు. ఆయనతో ఐక్యం కావడానికి ప్రయత్నించు. సమస్తమూ ఆయన ఆనందంలోనే ఉంది' అని చాటిన కబీర్‌ మాటలు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



*దైవీ సంపద.

 *దైవీ సంపద..*


       *ఏ గుణానికి ఏది మందు?*

                  ➖➖➖✍️

*- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ శర్మ గారు.*


*‘డిప్రెషన్’, ‘స్ట్రెస్’, 'టెన్షన్’ - ఈ మూడు మాటలూ ఇప్పుడు నిత్యజీవిత నినాదాలై పోయాయి. ప్రతి కుటుంబంలోనూ, ప్రతి రంగంలోనూ మామూలై పోయాయి.*

         

*వీటికి పరిష్కారాలేమిటి?*


*భారతీయ తత్త్వశాస్త్రం పురాణాది ధార్మిక గ్రంథాల ద్వారా చక్కని సూచనలిచ్చింది. మనం గమనించలేక పోతున్నాం, అన్వయించుకోలేక పోతున్నాం.*

         

*ఒకప్పుడు భోగాలనిపించుకున్న వాటిని - ఇప్పుడు అవసరాలనుకుని, వాటిని ఎలాగైనా సాధించాలనే ఆశ ఒక ప్రధాన కారణం.*


*అలాగని 'గొర్రెతోక' జీవితాలను సర్దిపుచ్చుకోమని కాదు కానీ, నిరంతరం ఏదో లోటును అనుభూతికి తెచ్చుకుంటూ, ఏదో కావాలనే ఆరాటాన్ని పెంచుకుంటూ సాగి పోవడం తగదు కదా!*

          

*ఒక నిదానం, ఒక క్రమశిక్షణ - లేకుండా అసంతృప్తి, అసహసం పెంచుకొని - కేవలం  ‘సంపాదనయే జీవితం' అనే లక్ష్యాన్ని మనకు మనమే నిబద్ధించుకుని, ఆ దిశగా పరుగులు పెట్టే యాంత్రికతకు అలవాటుపడ్డాం.*


*ఒక పరిధి, ఒక పరిమితి ప్రతిదానికీ ఉంటాయి. అర్థకామాల సంపాదన అవసరమే కానీ, ఆ అవసరం ఏ మేరకు? అని నిర్దేశించే 'ధర్మం' అనే  'రెగ్యులేటర్' ఉండాలి. అది జీవితాన్ని తీవ్రమైన పరుగు పెట్టించకుండా నియంత్రిస్తుంది.*


*ఈ డిప్రెషన్లో బోలెడు రకాలున్నాయి.*


*అన్నిటినీ విశ్లేషించి, చికిత్స చేయడానికి ఎన్నో వైద్యశాలలున్నాయి. అవి పచ్చగా వర్ధిల్లుతున్నాయి.*


*అయితే మన ధార్మిక వాఙ్మయ చికిత్సా విధానం పద్ధతిని కూడా గమనించుకుంటే ముందు జాగ్రత్తలు, చికిత్సలు కూడా సాధ్యమౌతాయి.*


*శరీరంలో వాత, పిత్త, కఫ తత్వాలుంటాయి. ఒక్కొక్క దేహం ఒక్కో తత్త్వం. దానిననుసరించి చికిత్స జరపాలి - అంటుంది ఆయుర్వేదం.*


*అలాగే మానసికంగా సత్వ రజస్తమో గుణాల తత్త్వాలుంటాయి. వాటిని విశ్లేషించగలగాలి. ఒక్కొక్కరి మనస్తత్వంలో ఈ గుణాల పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక్క గుణం మాత్రమే ఈ ప్రపంచంలో ఉండదు. మూడూ కలిసే ఉంటాయి. వేటిని ఎలా నియంత్రించాలో తెలిసి బ్రతకడమే తెలివితేటలు.*


*సాధారణంగా - మానవ జన్మ రజోగుణ ప్రధానమైనది. దేవతలు సత్యగుణ ప్రధానులు. భూతప్రేతాదులు తమోగుణ ప్రధానులు. మనలో ఏ గణాన్ని ఎక్కువ చేసుకుంటే ఏ వర్గంలోకి చేరవచ్చో పై విభజన బట్టీ మనమే ఎంపిక చేసుకోవచ్చు.*


*రజోగుణం వల్ల కామం, క్రోధం కలుగుతాయి. ఇవి తగిన మోతాదులో ఉండాలంటే సత్వగుణ సహాయం కావాలి. వివేకం, జ్ఞానం, సంతోషం, సంతృప్తి, సత్యం, నిగ్రహశక్తి, దయ, సామ్యం వంటి లక్షణాలు సత్వగుణ సంబంధాలు.*


*రజోగుణం వల్ల కలిగే లక్షణాలతో ఒకదానితో తీవ్రమైన అనుబంధం పడుతుంది. అది రాగమైనా, ద్వేషమైనా కావచ్చు. ఏదైనా ఎక్కువ ఆశించడం, ఎక్కువ భావించడం, ఆ చింతనలో అంచనా లెక్కువగా వేసుకోవడం, ఆశలు పెంచుకోవడం వంటి స్వభావాలు రజోగుణ ప్రకోపాలు, దీనితో నిజ జీవితంలో అంచనా ఏ మాత్రం దెబ్బతిన్నా, ఆశించినదానికి విరుద్ధంగా జరిగినా అలజడి, ఒత్తిడి ఏర్పడతాయి.*


*సాత్విక సాధనలలో ముందుగానే మనసును సంస్కరించుకుంటే ఈ రజఃప్రభావాల నుండి జాగ్రత్త పడవచ్చు. అందుకే సాత్వికాహారం, సాత్వికమైన దైవచింతన, నియమబద్ధమైన జీవిత విధానం, శ్రమతో ధర్మబద్ధంగా సంపాదించుకున్న దానితో తృప్తి చెందడం, క్షమాగుణం వంటివి అలవరచుకుంటే మానసిక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు.*


*రజోగుణ ప్రకోపం వల్ల ఒత్తిడికి, ఆందోళనకు గురైతే - కొందరు సత్వగుణంతో నియంత్రించుకోగలరు. ఆధ్యాత్మిక బోధలు, సాధన వంటివి ఈ విధమైన నియంత్రణలో భాగాలు. వేదాంత శాస్త్రం బోధించే 'వస్తు విచారం’ (ఏ విషయంలో ఎంతమేరకు సారం వుందో తేల్చే ఆలోచన) దీనికిసహకరిస్తుంది.*


*అయితే రజోగుణం తీవ్రస్థాయిలో దెబ్బతీసినప్పుడు, ఈ సత్వగుణంలో చికిత్స కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కొందరు ఆ విధమైన ప్రయత్నాన్ని చేయరు కూడా. దానికి బదులుగా తమోగుణ సహాయాన్ని తీసుకుంటారు.*


*నిద్ర, కునుకుపాటు, సోమరితనం, జడత్వం వంటివి తమోగుణ లక్షణాలు.*


*మందులతో నిద్రపుచ్చడం, దేనికీ స్పందించని స్థితికి మెదడును తీసుకువెళ్ళడం - ఈ తమోగుణ చికిత్సా విధానం. ఇప్పుడు ఎక్కువ భాగం ఈ విధానాన్నే అవలంబిస్తున్నారు.*


*ఇది తాత్కాలికంగా రజోగుణ తీవ్రతని తగ్గించినా, తమోగుణం పాళ్ళు పెంచే ప్రమాదం ఉంది. జాడ్యం, మాంద్యం వంటివి సంక్రమించి బుద్ధిశక్తి క్షీణిస్తుంది. ఎన్నో సాధించగలిగిన ధీశక్తి మొద్దుబారుతుంది.*

        

*ఇలా కాకుండా ఉండాలంటే ఆధ్యాత్మికమైన ధ్యాన యోగ, సంకీర్తనాది సాధనాలు సహకరిస్తాయి.*


*మనం వేదాంతం పలికే జ్ఞాన వైరాగ్యాలే స్ఫూర్తినిస్తాయి.*

        

*నిరాడంబర జీవితం, మితాహార, విహారాలు, ఉత్తమలక్ష్యమైన భగవచ్చింతన... ఈ మూడూ గొప్ప ఔషధాల్లా పని చేస్తాయి.*


*ఎన్ని పనులు సాధించినా, ఎన్ని వ్యాపకాలున్నా 'మితి' అనే ధోరణిని ఈ మూడింటి ద్వారా సాధించవచ్చు.*

        

*సంయమనం గల చిత్తాన్ని, తొందరపాటులేని తనాన్ని బాల్యంనుంచే ఆధ్యాత్మిక జీవనసరళితో అలవాటు చేస్తే, ఆ పిల్లలు పెద్దయ్యాక మితిమీరిన రజోగుణానికి లోను కాకుండా, వాటి దుష్ప్రభాలకు గురికాకుండా ఉండగలరు.*


*లంకలోని సీతమ్మ ఈ సాత్విక సాధన వలననే, తన మహాదుఃఖతీవ్రతలో నిలదొక్కుకోగలిగింది. నిరంతరం రామచింతన, రామదీక్షపై విశ్వాసం, ధైర్యం, అశాభావం లాంటి సానుకూల సకారాత్మక భావాలు ఆమెకు ఆలంబనాలయ్యాయి.*


*హనుమంతుని ద్వారా రామవార్తను విన్నాక, అడిగి అడిగి రాముని వర్ణింపజేసి, ఆ రామకీర్తనతో పరవశించి సేదదీరింది.*


*అలాగే అరణ్యవాస కాలంలో ధర్మరాజాదులు సాత్విక సాధనలతో నిలబడగలిగారు. పురాణాల్లో - కష్టాలపాలైన దశలలో సావిత్రి, దమయంతి, నలుడు వంటి వారు ఈ మార్గంలోనే స్వస్థులయ్యారు.*


*ఈ సాత్విక గుణ సమూహానికే 'దైవీ సంపద' అని పేరు పెట్టింది భగవద్గీత.*


*'దైవీ సంపద్విమోక్షాయ'. దైవీ సంపద వలననే దుఃఖం నుండి విడుదల  లభిస్తుందని గీతాచార్యుని మాట.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



*భక్త హృదయం

     *భక్త హృదయం*

                ➖➖➖✍️


*తులసీదాసు శ్రీరాముడికి గొప్ప భక్తుడు. అతని జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అలాంటి కథే ఇది.*


*ఒకసారి తులసీదాసు ఇంట్లో ఇద్దరు దొంగలు పడ్డారు. ఇంటి వెనుకవైపు గోడకు కన్నం వేసి లోనికి వచ్చారా దొంగలు. పూజ గదిలో వెండి పంచపాత్ర, ఇతర సామగ్రి సంచిలో పెట్టుకున్నారు. ఇంటి లోపలికి వచ్చిన కన్నంలో నుంచే బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు.*


*కానీ బయట ఇద్దరు వ్యక్తులు విల్లంబులు పుచ్చుకుని కాపలా ఉండటం కనిపించింది. దీంతో లోపలికి వచ్చేశారు.* 


*కాసేపయ్యాక మళ్ళీ బయటకు తొంగి చూస్తే.. ఆ కాపలాదార్లు అక్కడే ఉన్నారు. ఇలా బయటకు వెళ్లాలని చాలాసార్లు విఫలయత్నం చేశారు.*


*ఇంతలో తెల్లారింది. ఎప్పటిలాగే.. తులసీదాసు స్నానాదులు పూర్తి చేసుకుని పూజ గదిలోకి వచ్చాడు.*


*ఇద్దరు దొంగలు బిక్కముఖాలు వేసుకుని అక్కడ కనిపించారు.*


*'ఎవరు నాయనా మీరు?' అని అడిగారు తులసీదాసు.*


*'స్వామీ! మేము దొంగలం. మీ ఇంట్లో దోచుకోవడానికి వచ్చాం. మమ్మల్ని క్షమించండి స్వామీ' అని ప్రాధేయపడ్డారు.*


*వారిని ఊరడించిన తులసీదాసు.. 'దొంగతనం చేసి వెళ్లిపోకుండా తెల్లవార్లూ ఇక్కడే ఉన్నారేం?' అని ప్రశ్నించాడు తులసీదాసు.*


*'ఏం చెప్పమంటారు స్వామీ! ఈ గోడకు ఆవల ఇద్దరు సైనికులు విల్లంబులు ధరించి ఉన్నారు. రాత్రంతా మీ ఇంటికి కాపలా కాశారు. ఒకరేమో నల్లగా ఉన్నారు. మరొకతను ఎర్రగా ఉన్నారు. వారిని చూడగానే భయమేసి లోపలికి వచ్చేశాం. కాసేపయ్యాక వారిని మళ్లీ చూడాలనిపించింది. మళ్లీ బయటకు వెళ్లడానికి ప్రయత్నించాం. మళ్లీ వారిని చూడగానే భయం వేసి లోపలికి వచ్చేశాం. రాత్రంతా ఇదే జరిగింది స్వామీ' అని చెప్పుకొచ్చారిద్దరూ.*


*ఆ ఇద్దరెవరో తులసీదాసుకు అర్థమైంది. రామలక్ష్మణులే తన ఇంటికి కాపలాదార్లుగా వచ్చారని విశ్వసించాడు. ఈ వెండి వస్తువుల కోసం తన దైవం ఒక రాత్రంతా నిద్రలేకుండా ఉండిపోయాడని బాధపడ్డాడు తులసీదాసు. తను నమ్మిన దైవం సేవకుడిగా రావడంతో ఆ భక్తుడి హృదయం తల్లడిల్లిపోయింది. రాముడికి కష్టం కలిగించిన వస్తువులేవీ ఇంట్లో ఉండొద్దనుకున్నాడు. ఆ వెండి వస్తువులతో పాటు ఇంట్లోని విలువైన వస్తువులన్నీ దొంగలకు దానం ఇచ్చి.. అక్కడ్నుంచి పంపించేశారు.*


*ఆయన మాత్రం నిరాడంబరంగా రామసేవలో కాలం వెళ్లదీశాడు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

నాయకుడి ప్రొఫైల్

 

*భారతదేశంలో నిజమైన నాయకుడి ప్రొఫైల్ ఎలా ఉండాలి?*

                 ➖➖➖✍️



*ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాషాయ వేషధారణలో కేవలం "సన్యాసి" మాత్రమేనని చాలా మంది అనుకుంటారు.*


*అయితే వాటి గురించిన వాస్తవాలు తెలుసుకోవాలంటే కింద చదవండి.*

*మీకు నచ్చితే షేర్ చేయండి.*


 *◾️అజయ్ మోహన్ బిష్త్ మారుపేరు (పదవీ విరమణ తర్వాత)*

*యోగి ఆదిత్యనాథ్ జన్మస్థలం - ఉత్తరాఖండ్ దేవభూమి*


*▪️HNB గర్వాల్ యూనివర్సిటీ చరిత్రలో అత్యధిక మార్కులు (100%)*


*▪️యోగి జీ గణిత విద్యార్థి, అతను B.Sc గణితం బంగారు పతకంతో ఉత్తీర్ణత సాధించాడు.*


 *▪️1972లో ఉత్తరాఖండ్‌లోని దేవభూమిలోని వెనుకబడిన పంచూర్ గ్రామంలో చాలా పేద కుటుంబంలో జన్మించారు.  అతనికి ఇప్పుడు 50 ఏళ్లు.*


*▪️భారత సైన్యంలోని పురాతన గూర్ఖా రెజిమెంట్ యొక్క ఆధ్యాత్మిక గురువు.*


 *▪️నేపాల్‌లో యోగి మద్దతుదారుల పెద్ద సమూహం, యోగిని గురు భగవాన్‌గా ఆరాధిస్తారు.*


 *▪️మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుతమైన నైపుణ్యం.  ఏకకాలంలో నలుగురిని ఓడించిన రికార్డు.*


*▪️సుప్రసిద్ధ ఈతగాడు. ఎన్నో పెద్ద నదులను దాటారు.*


*▪️కంప్యూటర్‌ను కూడా ఓడించే అకౌంటింగ్ నిపుణుడు.  ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి కూడా యోగిని మెచ్చుకున్నారు!*


 *▪️రాత్రిపూట కేవలం నాలుగు గంటల నిద్ర.  అతను ప్రతిరోజూ ఉదయం 3:30 గంటలకు లేస్తాడు.*


  *▪️యోగా, ధ్యానం, గౌశల, ఆరతి, పూజ రోజువారీ దినచర్య.*


 *▪️రోజుకు రెండు సార్లు మాత్రమే తింటారు..*

 *పూర్తిగా శాఖాహారం.  ఆహారంలో దుంపలు, వేర్లు, పండ్లు మరియు దేశీయ ఆవు పాలు ఉంటాయి.*


*▪️అతను ఇప్పటి వరకు ఏ కారణం చేత ఆసుపత్రిలో చేరలేదు.*


 *▪️యోగి ఆదిత్యనాథ్ ఆసియాలోని అత్యుత్తమ వన్యప్రాణి శిక్షకులలో ఒకరు, అతనికి వన్యప్రాణులంటే చాలా ఇష్టం.*


 *◾️యోగి కుటుంబం ఇతను ఎంపీ లేదా ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి స్థితిలో ఉందో ఇప్పటికీ అలాగే జీవిస్తోంది.*


*▪️సంవత్సరాల క్రితం పదవీ విరమణ తీసుకున్న తర్వాత యోగి ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్లారు.*


*▪️యోగికి ఒకే బ్యాంకు ఖాతా ఉంది మరియు అతని పేరు మీద భూమి ఆస్తి లేదు లేదా అతనికి ఎటువంటి ఖర్చులు లేవు.*


*▪️వారు తమ సొంత జీతం నుండి వారి ఆహారం మరియు బట్టలు ఖర్చు చేస్తారు మరియు మిగిలిన డబ్బును సహాయ నిధిలో జమ చేస్తారు.*


 *ఇది యోగి ఆదిత్యనాథ్ ప్రొఫైల్.*


*భారతదేశంలో నిజమైన నాయకుడి ప్రొఫైల్ ఇలా ఉండాలి.  అటువంటి సాధువులే భారతదేశాన్ని మళ్లీ ప్రపంచ గురువుగా మార్చగలరు. అటువంటి వ్యక్తులను దేవుడు తన మాధ్యమంగా భూమిపైకి పంపే అవతారాలు అంటారు.*✍️

 .          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



గ్రహబాధలు తొలగిపోతాయి

 .మానవులు ఎల్లప్పుడూ పితృఋణం, మాతృఋణం, పుత్రికా ఋణం, స్త్రీ ఋణం, సోదర ఋణం, దైవఋణం, ఋషిరుణం, దానఋణం, గురు ఋణం ఈ తొమ్మిది ఋణాలను తెలిసి కానీ తెలియక కానీ తీర్చకపోతే ఎల్లప్పుడూ ఋణబాధలు వేధిస్తూ ఉంటాయి. ఉన్నత స్థితి కలుగదు. 


1. తల్లి ఋణం :- తల్లితో విభేదాలుంటాయి. వీరు తల్లిని బాధించకూడదు. పేదవారికి పాలు, బియ్యం, దానం చేయుట వల్ల మేలు జరుగుతుంది.


2. పితృఋణం :- తల్లితండ్రులు గతించినచో వారికి చేయవలసిన కర్మలను సకాలంలో ఆచరించకపోవటం వల్ల విద్య, ఉద్యోగం. వ్యాపార అభివృద్ధి ఉండదు.


3. పుత్రికాఋణం :- పుత్రికను బాధించటం, కూతురు ఆస్తిని అనుభవించటం వల్ల అవమానాలు, ధననష్టం, ఒంటరి జీవితం కలుగుతాయి.


4. స్త్రీ ఋణాలు :- పరస్త్రీలను వ్యామోహించి బాధించటం, సంగమించటం, వారిని వదిలివెయ్యటం, తరచు గుర్తుచేసి దుర్మార్గంగా బాధించటం, భార్యను బాధించటం, కొట్టడం, ఆమెను పస్తులుంచటం, ఆమెను బయటకు గెంటివేయుట, నిందలు ప్రచారం చేయుట, పరస్త్రీలను బల్కారించటం, కామవాంఛలకు గురిచేయటం, మధ్య వయసునుండి అకాల మరణ భయం, దారిద్ర్యం కలుగుతాయి. గర్భవతులను కూడా బాధించరాదు.


5. సోదర ఋణం :- తన రక్త సంబంధీకుల ధనం వాడుకోవటం వారిని బాధించటం, వారి ఆస్తులను సక్రమంగా పంచక తాననుభవించుట మోసం చేయుట వీటివల్ల కొంతకాలానికి తన పిల్లలు దరిద్రం అనుభవిస్తారు. మనఃశ్శాంతి ఉండదు. జీవిత చరమాంకంలో దీనస్థితి కలుగుతుంది. వంశక్షయం కలుగుతుంది.


6. దైవ ఋణం :- దైవాన్ని నిందించుట, జంతుహింస చేయుట, దేవాలయ ఆస్తులను అనుభవించుట వీటివల్ల సంతాననష్టం ఉంటుంది. అంగవైకల్యం కలిగిన సంతానం కలుగుతారు. శారీరక బలహీనత కలుగుతుంది. 


7. ఋషి ఋణం :- తమ వంశఋషిని సేవించలేకపోవటం, సాధు సన్యాసుల పట్ల తెలిసో తెలియక అమర్యాదగా ప్రవర్తించుట, ఋషిప్రోక్తమైన మంత్రాలను అవహేళన చేయుట వల్ల కలుగుతుంది.

దీనివల్ల మూర్ఖత్వం, ఆవేశం, సౌఖ్యలేమి కలుగుతుంది. 


8. దాన ఋణం :- ఒకరికి దానం చేస్తానని చేయకపోవుట - దానం చేసి ప్రతిఫలం కోరుట, చేసిన దానిని తిరిగి తీసుకొనుట వల్ల ఈ ఋణం ఏర్పడుతుంది. ఇటువంటి వారు తరచు వివాదాలకు గురవుతూ ఉంటారు. వ్యసన పీడ కలుగుతూ అపకీర్తి కలుగుతుంది.. 


9. గురు ఋణం :- గురువులను దూషించుట, అంతకుసమానమైన వారిని నిందించుట. దీనివల్ల మిత్రభేదం, ఉపాధి కోల్పోవుట, ఋణ బాధలు కలుగుతాయి.


ప్రతినిత్యము తల్లితండ్రుల సేవ చేయుట వల్ల సమస్త గ్రహబాధలు తొలగిపోతాయి.https://chat.whatsapp.com/Cf4WSYow7il7f2jhsCODOD

తప్పులు......ఒప్పులు🌳

 *🌳తప్పులు......ఒప్పులు🌳*


         ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు ..3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు. దాని మీద ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోవాలి అనుకున్నాడు.

    నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు. 

" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు. ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ " మార్కు పెట్టండి అని అందులో ఉంది.

    దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు. అతడికి ఏడుపు వచ్చేసింది దాని నిండా

" ఇంటూలే ". ఖాళీ లేదు.

       ఏడుస్తూ...

తనకు ఆర్ట్ నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు." నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు.  అప్పుడు మాస్టారు అతడిని ఓదార్చి .....అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు. మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు. ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు.

దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు.

  " నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు ఎక్కడ లోపం ఉందో అక్కడ క్రింద నేను పెట్టిన రంగులు, బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసులో ఉంది.

విచ్చిత్రంగా వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు. ఎందుకలా జరిగింది ?  అనుకొంటూ అతను మళ్ళీ మాస్టార్ దగ్గరికెళ్ళి జరిగింది చెప్పడంతో ....

మాస్టారు అతనికి ఇలా చెప్పడం జరిగింది...

 "ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం" అని. ....!!🍁https://chat.whatsapp.com/G4vTknQuOME6XXxxzzU3mS


*👉 కాబట్టి ఒకరి జీవితాన్ని విమర్శించి, తప్పులు వెతగడం అందరికి చాలా తేలిక. కానీ అదే ఒకరి జీవితాన్ని సరిచేయడము మాత్రం చేతకాదు ఎవ్వరికి.*


*🕉️ సమస్త లోకా సుఖినోభవంతు 🌠* మీ మల్లేశ్వరరావు 🙏🙏🙏🍁https://chat.whatsapp.com/G4vTknQuOME6XXxxzzU3mS

హృదయం కదిలించే కథ

 హృదయం కదిలించే కథ


రవి సాప్ట్ వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు.


ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. "ఆకు కూరలు... ఆకు కూరలు" అని కేక వినిపించింది. డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు.


"కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె. "పాలకూర కట్ట ఎంత?" అడిగాడు.


"పది రూపాయలకు మూడయ్యా" చెప్పింది అవ్వ.


"మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు" అన్నాడు చిరుకోపంగా


"నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ.


పదిరూపాయలు ఇచ్చాడు. "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ గంపను తనవైపు ఎత్తి పట్టుకుని.


గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి.అమ్మయ్య పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చాయి అనుకున్నాడు ఒకింత సంతోషంగా.


అవ్వ వెళ్ళిపోయింది.


"ఎంత ఆశో ఈ ముసలిదానికి... ఇవాళో రేపో చావబోతుంది... ఇంకా డబ్బు మూటలు కడుతున్నది" ముసిముసిగా నవ్వుకున్నాడు.


అప్పటినుంచి అవ్వ వచ్చినపుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, రెండు వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు.


కొన్నాళ్ల తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు. అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది. ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచీని మోస్తూ "నానమ్మా... నన్ను స్కూల్ నుంచి పంపేశారు..." ఏడుస్తూ వచ్చింది.


అవ్వ కంగారుగా "అయ్యో నా బిడ్డ... బాబూ... కాస్త గంప కిందికి దించునాయనా" అన్నది రవితో.


"ఏడవకమ్మా... నేనొచ్చి చెబుతాలే. రేపు ఫీజు కడతాలే... నా తల్లే... ఇంటికిపొదాం పద" అన్నది పిల్లను వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ.


రవికి అర్ధం కాలేదు. "ఎవరీ పిల్ల..?" అని అడిగాడు అవ్వను.


"నా మనవరాలు బాబూ...ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలవారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు పురుగుల మందు మింగి చచ్చిపోయింది. మా ఆయన మూడేళ్ళబట్టీ పక్షవాతం వచ్చి మంచం మీదున్నాడు. ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వ లేదు. ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను రోజూ తెల్లారుజామునే లేచి పొలాలకెళ్లి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకుని మోస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ అమ్ముకుంటూ పైసాపైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా. మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు. నెలరోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు. ఈరోజు చూడు బాబు...పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటకి పంపించారు." అన్నది కళ్ళు తుడుచుకుంటూ.


రవి నరాలు మొత్తం బిగుసుకునిపోయాయి. రక్తం స్తంభించిపోయింది. గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు. అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది. మనసంతా ఉష్ణ జలపాతం అయింది. ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టాయి. "ముసల్దానికి ఎంత డబ్బాశ" అనే తన వెకిలి మాట వెయ్యి గునపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది. ప్రతి కష్టం వెనుకా ఒక కన్నీటిగాధ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు.


పర్సులో చెయ్యి పెట్టాడు. బయటకొచ్చి "అవ్వా..ఈ ఐదువేలు తీసుకుని మనవరాలి ఫీజ్ కట్టెయ్యి" అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని.


హంపి మొహంజదారో శిధిలాలకు ప్రతీకలాంటి అవ్వ వృద్ధశరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది.


"బాబూ...ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది" అన్నది వణుకుతూ.


"అప్పని ఎవరు చెప్పారు? చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను. ఇప్పుడే కాదు..నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజ్ కడతాను..రేపటినుంచి రోజూ నేను ఉన్నా లేకపోయినా పదిరూపాయల ఆకు కూరలు ఇచ్చేసి వెళ్ళు" గంప పైకెత్తాడు రవి.


మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు. వాకిట్లో ఆరు ఆకు కూర కట్టలు కనిపించాయి!.


" నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం"

" అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకోవడం లోకకళ్యాణం"


From శ్రీ గోపిరెడ్డి జగదీశ్వర రెడ్డి గారి

FB wall


https://www.facebook.com/reel/756780695799443?s=yWDuG2&fs=e&mibextid=Nif5oz

 


అమోఘమైన విజ్ఞానం

 




🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*స్త్రీ.. ఆమె శరీరం ఈ మహా విశ్వం, ఒకొక్క అవయవం ఒక్కో భీజాక్షరం*, గర్భం విశ్వం యొక్క ఉనికి, యోని స్థానం విశ్వానికి ద్వారం! అంటే ఈ లోకంలో ఎంతమంది స్త్రీలున్నారో అన్ని విశ్వపు  ద్వారాలున్నాయని అర్ధం. ఎటువంటి ప్రాణి అయినా ఆ ద్వ్రారాల ద్వారా "ప్రాణం"తో ఊపిరి తీసుకుంటున్నాయని, మనం కూడా ఒక రూపాన్ని పొంది ఉనికిలోకి ఒక ప్రయోజనం కోసం వస్తున్నామని, మన మొదటి ఇల్లు స్త్రీ గర్భమని అర్ధంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. తంత్ర యోగం ప్రకారం, యోని అనేది మనుగడకు, ప్రకృతి (విశ్వజనీన పదార్థం, Universal Substance) తో ముడిపడి ఉన్న శక్తి యొక్క చిహ్నం (విశ్వాన్ని కదిలించే సృజనాత్మక శక్తి) . అందుకే శక్తుల్లోకెల్లా మహాశక్తి అయిన అమ్మవారి యొక్క "యోని" స్థానాన్ని కామాఖ్య దేవి దేవాలయంలో భక్తులు పవిత్రంగా పూజిస్తారు.


యోని స్థానం విశ్వపు ద్వారం అయితే పురుషుడి లింగ స్థానం ఆ ద్వారానికి తాళంచెవి. అందుకే స్త్రీపురుషుల కలయిక ఒక యజ్ఞం వంటిదని వేద ఉపనిషత్తుల వాఖు. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తు అయితే ఒక ఘట్టంలో స్త్రీపురుషుల కలయిక గురించి ఆశ్చర్యపోయే విశ్లేషణ ఇస్తుంది. అలానే సృష్టిలో అఖండ సత్యం అనేది కౌగిలిలో అల్లుకుపోయిన స్త్రీపురుషుల్లా అంత అందంగా, అద్భుతంగ, అమోఘంగా, మధురంగా, రమణీయంగా ఉంటుందని నవతంత్ర మాట! నవతంత్ర యొక్క చిహ్నం శివపార్వతులు. అందుకే సత్యాన్వేషణలో ఎందరో మహానుభావులు, మహాపురుషులు సత్యాన్ని గ్రహిస్తూ బ్రహ్మానందాన్ని పొందుతూ జీవించేవారు!


మీ గృహములో ఆడపిల్ల జన్మించిందంటే జీవితం యొక్క మూలం మరియు ఆత్మలు శరీరాన్ని పొందే విశ్వపు ద్వారం ఒకటి తెరుచుకుందని,  ఒక మహాక్షేత్రం వెలిసిందని, అనంతమైన శక్తిగల అమ్మవారు స్వయంగా ఒక ప్రత్యేకమైన రూపంలో దిగి మీ ఇంటికి వచ్చిందని అర్ధం.


భారతీయ వైదిక వ్యవస్ధ ఉన్న కాలంలో, దారిలో స్త్రీ కనిపిస్తే ఎదురొచ్చే పురుషులు నమస్కరించుని వెళ్ళేవారు. కౌల ఆచారం అనే ఒక తంత్ర ఆచారం ఉన్న సమయంలో అయితే స్త్రీకి ఒక ఉన్నత పీఠం ఉండేది. భార్యల నెలసరి సమయంలో భర్తలు మోకరిల్లి పార్వతీ దేవి రూపంగా కొలిచి పూజించేవారు.


 

కౌల ఆచారం, తంత్ర విజ్ఞానం, పుట్టిల్లయిన భారతదేశంకంటే బయట దేశాల్లో ప్రాముఖ్యతను పొందడం ఆశ్చర్యకరం! అంటే ఎటువంటి అమోఘమైన విజ్ఞానం మనం కోల్పోవడం ద్వారా ఎందుకు ఈరోజు మన సామజిక, వివాహ, కుటుంబ వ్యవస్ధ చిన్నాభిన్నం అయిపోతుందో, స్త్రీల జీవితాలు గృహ హింస ద్వారా, అత్యాచారాల ద్వారా ఎందుకు నలిగిపోతున్నాయో అర్ధంచేసుకోవచ్చు!


*సేకరణ:- శ్రీ జి.టి.ఎస్. ఆచార్యులు గారి వాట్సాప్ పోస్ట్.* 

🌹🌹🌹🙏🙏🙏

మహాస్వామి వారి అన్నపూర్ణావతారం

 మహాస్వామి వారి అన్నపూర్ణావతారం


పరమాచార్య స్వామివారు ఒక తమిళ సామెతను ఎప్పుడూ చెప్పేవారు, “అందరికీ అన్నం పెట్టు, భేదం చూపకుండా” అని. ఆహారం పెట్టేటప్పుడు ఎవరు, ఏమిటి అన్న ఎటువంటి బేధం చూపరాదని చెప్పేవారు. రాత్రిపూట దొంగలకు కూడా ఆహారం అందించే ఒక కేరళ సంప్రదాయం గూర్చి ఎప్పుడూ తెలిపెవారు. కేరళలోని చేరుక్కుణ్ణం అన్న ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ దేవాలయంలో ఈ పధ్ధతి ఉంది. దేవాలయంలోని భక్తులందరి భోజనాలు అయ్యాక, ఆహార పొట్లాలు కట్టి, వాటిని చెట్టుకు వేలాడదీసేవారు అటుగా వెళ్ళే దొంగలకోసమని.


సంగం సాహిత్యంలో ఉధియన్ చేరాళదన్ అన్న చేర రాజు మహాభారత యుద్ధ సమయంలో పాండవ కౌరవ ఇరు పక్షాల వారికీ అన్నం పెట్టి ‘పేరుం సోట్రు చేరాళదన్’ అన్న పేరు ఎలా పొందాడో తెలిపేవారు.


వేటగాడైన కన్నప్ప శివునికి ఆహారం పెట్టాడు. వేటగాడైన గుహుడు శ్రీరామునికి ఆహారం పెట్టాడు. ఇక్కడ, శ్రీశైలం అడవులలో ఉండే చెంచులు పరమాచార్య స్వామివారిచే ఆహారం పొందారు.


రవాణా వ్యవస్థ అంతగా లేని 1934లో పరమాచార్య స్వామివారు మందీమార్బలంతో కీకారణ్యంలో ఉన్న శ్రీశైలం వెళ్తున్నారు. దారిలో ఒకచోట వారికి చెంచులు ఎదురయ్యారు. ఆ చెంచులు మొదట వీరిని శతృవులుగా భావించి బాణాలు చేతబూని విల్లు ఎక్కుపెట్టారు. కాని స్వామివారి దివ్య తేజస్సు చూసి, తప్పు తెలుసుకుని వీరిని ఆదరించారు.


వీరిని అడ్డగించాలని వచ్చినవారే వీరికి కాపలావాళ్లై, సామాను మోస్తూ, రాత్రిపూట పహారా కాస్తూ పరమాచార్య స్వామివారిని సపరివారంగా తదుపరి చోటుకు చేర్చారు. సెలవు తెసుకునే ముందు అందరూ ఒకచోట చేరారు.


మహాస్వామి వారి వారికి కొంచం ధనం ఇవ్వమని మేనేజరును ఆదేశించగా వారు దాన్ని తాకడానికి కూడా ఇష్టపడలేదు. ఆ చెంచుల నాయకుడు మేనేజరుకు ఎదో చెబితే, వారు దాన్ని నిరాకరిస్తూ తల అడ్డంగా తిప్పి కుదరదన్నారు.

మహాస్వామివారు చిటికె వేసి మేనేజరును పిలిచి, “అతను ఏమి అడిగాడు, నువ్వు ఎందుకు లేదన్నావు?” అని అడిగారు.


“పెరియవా ముందర వారు నృత్యం చేయాలనుకుంటున్నారు”


“నృత్యం చూడడం వల్ల శ్రీమఠం గౌరవం తగ్గుతుందని మేనేజరుగా నీ అభిప్రాయం కనుక నేను వారి నృత్యం చూడనని నువ్వు అన్నావు”

మహాస్వామి వారి మాటల్లో ఎక్కడా కోపం కనబడలేదు. మేనేజరు మౌనంగా నిలబడ్డారు.


ఎంతో గొప్ప కళాకారుల నృత్యాలు కూడా చూడని మహాస్వామివారు వారి నృత్యాన్ని చూడడానికి అంగీకరించారు ఒక షరతు పైన; మగవారు ఎవరైనా నృత్యం చెయ్యవచ్చు. కాని వారితో పెద్దవారు కాని బాలికలు మాత్రమే కలిసి నృత్యం చెయ్యాలి.


“సందర్భాన్ని బట్టి మీకు వివిధ నృత్యాలు ఉన్నాయి కదా; దేవుని కోసం, గెలిచినప్పుడు, ఆటలకోసం అలా. మరుప్పుడు మీరు చెయ్యదలచుకున్న నృత్యం ఎలాంటిది” అని అడిగారు మహాస్వామివారు.


“మేము ఇప్పుడు చెయ్యబోయే నృత్యం కేవలం మాకు అత్యంత దగ్గరైన ఆప్తులకు మాత్రమే” అని తెలిపారు.


పరమాచార్య స్వామి వారు వారి నృత్యాన్ని చూసి, వారినందరినీ ఆశీర్వదించి, వారికి మంచి విందు ఏర్పాటు చేశారు.


--- రా. గణపతి, “మహా పెరియవాళ్ విరుంధు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం