15, మే 2023, సోమవారం

ప్రయత్నాన్ని విరమించుకోడు.

 శ్లోకం:☝️

  *యథా సరిన్నైవ కదాపి వక్తి*

*సముద్రమార్గే కియదన్తరం హి ।*

  *తథైవ ధీరో మనుజస్తు మార్గే*

*కష్టాని సోఢ్వా న జహాతి యత్నం ll*


భావం: ప్రవహించే నది "సముద్ర మార్గం ఎటువైపు? ఇంకా ఎంత దూరం ఉంది?" అని ఎప్పుడూ అడగదు? అదేవిధంగా, ధీరుడు (సహనం ఉన్న వ్యక్తి) జీవిత మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రయత్నాన్ని విరమించుకోడు.

హనుమజ్జయంతి ప్రత్యేకం - 3/11

 ॐ       హనుమజ్జయంతి ప్రత్యేకం -  3/11 


    ఈ రోజు వైశాఖ బహుళ దశమి. హనుమ జన్మించినరోజు. 

    ఈ సందర్భంగా హనుమజ్జయంతి శుభాకాంక్షలు 


    హనుమంతుని తండ్రి పేరు కేసరి. 

    అంజన ఆ కేసరి యొక్క భార్య. 

    అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు. 

    హనుమంతుడు, అంజనాదేవి గర్భాన -  వాయుదేవుడు - శివతేజస్సును ప్రవేశపెట్టడం వలన జన్మించాడు. 

    అందుచేత పవనతనయుడు, మారుతి నందనుడు వంటి పేర్లు కలిగియున్నాడు. 


III.  హనుమ - వాయు పుత్రుడు - ప్రత్యేకత


    రావణ వధకై, బ్రహ్మాది దేవతల ప్రార్థనకు స్పందించి, 

    విష్ణువు - దశరథుని తండ్రిగా చేసికోవడానికి ఇష్టపడ్డాడు. 

    అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరితో 

    "అవతరించే విష్ణువుకు సహాయకులుగా ఉండుటకై బలవంతులూ కామరూపులూ అయి, మీ మీ శక్తులు కలిగియుండేలాగు పుత్రులను సృజింపుడు" అన్నాడు. 

   "ఎలుగుబంటులలో శ్రేష్థుడైన జాంబవంతుని తాను చాల క్రితమే సృజించాను" అని కూడా అన్నాడు. 


    అప్పుడు 

1, ఇంద్రుని వల్ల            - వాలి,

2. సూర్యుని వలన       - సుగ్రీవుడు, 

3. బృహస్పతి వల్ల        - తారుడు, 

4. కుబేరుని వలన        - గంధమాదనుడు, 

5. విశ్వకర్మ వలన         - నలుడు, 

6, అగ్ని వలన               - నీలుడు, 

7, అశ్వినీ దేవతల వల్ల  - మైంద ద్వివిదులు, 

8. వరుణుని వలన       - సుషేణుడు,

9. పర్జన్యుడని వలన    - శరభుడు, 

10. వాయువు వల్ల       -    హనుమ జన్మించారు. 


    పరాక్రమాలు గల అనేకమంది - గోలాంగూల (కొండముచ్ఫు) స్త్రీలయందూ, ఋక్ష స్త్రీల యందూ, కిన్నర స్త్రీలయందూ జన్మించారు. 


    ప్రధానంగా పైన పేర్కొన్న పదకొండు మందీ, పదకొండు విభాగాలకు చెందినవారు. తండ్రుల శక్తులు కలిగి, ఆయావిభాగాలలో నిష్ణాతులు.  


    ఒక భారీ పథకము (Project) చేపట్టేటపుడు కావలసిన 11 ముఖ్య విభాగాలైన 


ప్రణాళిక(Planning), 

వ్యవస్థీకృత కార్మిక రంగం(Organised working sector), 

కుశాగ్రబుద్ధి కలిగిన పరిపాలన(Correct decisive administration), , 

మేధస్సు(Intellect), 

ఆర్థికం(Finance), 

నిర్మాణం(Archetech), 

చైతన్యం(Activeness), 

ఆరోగ్యం(Health), 

నీరు(Water), 

దాపరీకం(Secrecy), 

సర్వజ్ఞత(All round) అనేవి ప్రధాన విషయాలు. 


    అటువంటి వాటికి సంబంధించి వారు "రావణ వధ" అనే ప్రత్యేక ప్రణాళిక(Operation)కి గాను వచ్చిన కారణజన్ములు. 


    అందులో వాయుపుత్రుడు ఒక ప్రత్యేకమైన వాడు. 

    వాయువు సర్వత్ర వ్యాప్తిచెంది, అందరకీ ప్రాణమైనది. అదే విధంగా వాయుదేవుని వలన జన్మించిన హనుమ, అందఱితోనూ అన్ని పనులలోనూ నేర్పుతో (all round) పని చక్కబెట్టగల్గినవాడు. 


    అంతేకాక, వాయువు 


(అ) సప్త మండలాలలో సప్త వాతస్కంధాలుగా కనబడుతుంది. 

(EXTERNAL - AT THE SPACE)


అవి


(i) మేఘమండలం   - ఆవహము, 

(ii) సూర్యమండలం - ప్రవహము, 

(iii) చంద్రమండలం  - సంవహము, 

(iv) నక్షత్రమండలం  - ఉద్వహము, 

(v) గ్రహమండలం     - వివహము, 

(vi) సప్తర్షిమండలం  - పరివహము, 

(vii) ధ్రువమండలం  - పరావహము 

                - అని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అధిష్ఠానదేవతగా ఉంటుంది. 

    అందుకనే వాయుపుత్రుడైన హనుమ అంతరిక్ష సంచారాన్ని  అలవోకగా చేస్తాడు. 

    ఆకాశమార్గంలో సముద్ర లంఘనం, సంజీవని పర్వతం పెకలించి తీసుకురావడం, తిరిగి యథాస్థానంలో ఉంచడం వంటివి ఈ కోవలోకి వస్తాయి. 


(ఆ) శరీరంలో 

      (INTERNAL - WITH IN THE BODY) 


అవి


    హృదిలో             - ప్రాణ, 

    గుదిలో               - అపాన, 

    నాభి వద్ద            - సమాన, 

    కంఠంవద్ద            - ఉదాన, 

    సర్వశరీరమందు - వ్యాన 

                - అనే ఐదు వాయువులు అంతర్గతంగా అందరికీ జీవాధారంగా పనిచేస్తాయి. 

    వాయునందనుడు ఈ ఐదు వాయువులతోనూ శారీరకంగా అద్భుతాలు చేసినవాడు కదా!


    ఈ విధమైన కార్యాలవలనే,  విభీషణునితో జాంబవంతుడు


      "హనుమ జీవించియున్నచో వానరసైన్యము హతమైననూ బ్రతికియున్నట్లే! 

       మారుతి ప్రాణాలు విడిస్తే, మనమందరమూ బ్రతికియున్ననూ మరణించినవారితో సమానమే!" 


                - అని వాయుపుత్రుడైన హనుమ గూర్చి అనగలిగాడు. 


వాయువు: 


    "గంధనం హింసనం యో వాతి చరాచరం జగద్ధరతి బలినాం బలిష్ఠః స వాయుః" - అని వాయు పదానికి నిర్వచనం. అంటే, 

  - చరాచర జగత్తును ధరించి జీవింపజేసి లయింపచేయువాడునూ, బలవంతులకంటే బలవంతుడునూ అవడం వల్ల దానికి "వాయువు" అని పేరు అని అర్థం. 


    వాయుపుత్రుడుగా హనుమ శ్రీరామునికి ప్రీతిపాత్రుడై, మనందరికీ ఇష్టమైన "ఇహలోక రక్షకుడు". 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

పాము వెళ్ళిపోయింది కానీ. .

 పాము వెళ్ళిపోయింది కానీ. . .


అర్ధరాత్రిలో మఠం ఏనుగు భయంతో ఘీంకరిస్తొంది. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ అరుపులకు కూడా ఎవవరికి మెలుకువ కలగలేదు. అంత పెద్ద ఏనుగులు ఎలుక, కప్ప, పిచుక వంటి చిన్న చిన్న జంతువులకు ఎక్కువ భయపడతాయి. ఈ రాత్రిలో ఏ కప్పో, ఎలకో ఆ ఏనుగు దగ్గరకు వెళ్ళుంటుందని పరమాచార్య స్వామివారే లేచి వెళ్ళారు.


ఏనుగుకు ఎదుగురుగా ఒక పెద్ద తాచుపాము పూర్తిగా పడగ విప్పి చూస్తోంది. వెంటనే స్వామివారు శిష్యులను నిద్రలేపారు. పామును కొట్టడానికి వాళ్ళు కర్రలు తోసుకుని వచ్చారు. “ఆ పామును కొట్టకండి. నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి. అదే వెళ్ళీపోతుంది” అని ఆదేశించారు.


స్వామివారు చెప్పినట్టుగా నువ్వులనూనె దీపం వెలిగించి అక్కడ పెట్టగానే, అప్పటి దాకా పడగ విప్పి నిలబడ్డ ఆ పాము మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంత పెద్ద ఏనుగు ఘీంకారాన్ని అక్కడే దగ్గర్లో పడుకున్న శిష్యులు వినలేదు కాని, అప్పటికే చెవి సమస్య ఉన్న పరమాచార్య స్వామికి వినపడింది.


అవును గజేంద్రుడు ‘కుయ్యో మొర్రో’ అని మొత్తుకుంటే అది విన్నది విష్ణువొక్కడే కదా! ఆ ఏనుగుని మరో చోటికి మార్చమని చెప్పారు మహాస్వామివారు.


”కాని పాము వెళ్ళిపోయింది కదా!”


“అవును పాము వెళ్ళిపోయింది. కాని ఏనుగుకి ఆ భయం పోయుండదు కదా!” స్వామివారి ఆదేశానుసారం దాన్ని మరో చోట కట్టారు శిష్యులు. పరమాచార్య స్వామివారు నిద్రకు వెళ్ళిపోయారు.


--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 1


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust

సాదాకా మేలుకో-1

 సాదాకా మేలుకో-1

84 లక్షల జీవరాశుల్లో ఒక జంతువే.అదే మనిషి  కేవలం మాట్లాడ్డం వల్ల మనిషి 83,99,999 జీవరాశుల కంటే చాలా భిన్నం, ప్రత్యేకం అయ్యాడు.మనిషి మాట్లాడటమే కాదు తనకన్నా ఎంతో పెద్దగా వున్న జంతువులను లొంగదీసుకోగలుగుతున్నాడు, అడివిలో సింహమే రాజు అంతేకాదు మిగితా జంతువులన్నీ కూడా సింహానికి భయపడవలసిందే. సింహం కన్నా ఎంతో పెద్దగా వున్న ఏనుగు కూడా సింహాన్ని చూసి పరుగులిడుతుంది.  సింహం తన వాడి ఐన కోరలతో, గోళ్ళతో చీల్చి  చండాడుతుంది. నిజానికి ఏనుగు ఎదురుతిరిగితే సింహం ఏనుగు ఒక్క కాలును కూడా కదల్చలేదు.  కానీ ఏనుగు కన్నా సింహం ఎంతో తెలివి అయినది కావటం వలన సింహం ఏనుగు మీద విజయాన్ని పొందగలుగుతున్నది. 

అనాదిగా మనం చూస్తూ వున్నాము బలమైన  వానికన్నా తెలివియిన వాడే ఎంతో సమర్ధవంతంగా తన పనులు చేసుకోవటమే కాకుండా బలమైనవానిమీద విజయాన్ని పొందుతున్నాడు. 

ఒక్కమాటలో చెప్పాలంటే బలము కన్నా తెలివే ఎంతో శ్రేష్టం అని మనకు తెలుస్తుంది. ప్రతి మనిషి బలముకన్న తెలివికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. అట్లా అని శారీరికంగా బలహీనులు కమ్మని కాదు అర్ధము, బలముకూడా ఏందో విలువైనది, ఉపయుక్తమైనది. దానికి తోడు బుద్ధికూడా కలిసివుంటే రెండు ఎంతోరాణిస్తాయి. అది ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. 

మానవునికి బుద్ది జ్ఞ్యానం కలిగి వుండటము వలన వాటిని సరైన మార్గంలో పెట్టుకోవటం చాలా మంచిది. వాటివలననే మనిషి తన జీవిత పరమావధి, పరమార్ధం ఏమిటని ఆలోచించగలుగుతాడు. ఆలా అలోచించి మానమహర్షులు మనకు అనేకానేక విషయాలను వారి దివ్య జ్ఞ్యానంముతో తెలిపారు. చివరికి మానవ పరమార్ధం జన్మరాహిత్యమైన మోక్షం ఒక్కటే అని నిర్ధారణ చేశారు. మనకు వున్నజ్ఞ్యానులలో శ్రీ ఆదిశంకరాచార్యులు అగ్రగణ్యులు. వారి "వివేక్ చూడామణిలో" శ్లోకాన్ని పరికించండి. 

జంతూనాం నరజన్మ దుర్లభమ



జీవులకు తొలుత మానవజన్మము ప్రాప్తించుటయే దుర్లభము. 


 84 లక్షల జీవరాశిగా మన శాస్త్రాలు చెపుతున్నాయి, అటువంటప్పుడు మానవ జన్మ పొందటం ఎంతటి అసాధ్యమో తెలుసుకోండి. 

కాబట్టి ఈ విషయం సాధకులు అందరు గ్రహించి తమ జన్మకు కారణం జన్మను సార్ధకతను చేసుకొనే జన్మరాహిత్య మార్గము అయిన మోక్షమార్గాన్ని ఎంచుకొని, ఉత్తముడైన గురువుని ఆశ్రయించి మోక్షార్ధి కావాలి. 

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

చేరువేల భార్గవ శర్మ  


 


బార్లీ నీళ్లు

 / బార్లీ నీళ్లు మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది  _*

               ➖➖➖✍️


*_" HEALTH  BENEFITS OF BARLEY WATER / బార్లీ నీరు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ":_*


*_ఆరోగ్యానికి బార్లీ వాటర్.. రోజూ తాగి ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు తెలుసా..?_*

    

*_అసలే ఎండాకాలం.. బయట ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు.. చాలామందిని శరీర ఉష్ణోగ్రత కూడా తీవ్రంగా వేధిస్తుంటుంది. ఎండ వేడి నుంచి త‌ప్పించుకునేందుకు కొంతమంది ప‌లు ర‌కాల పద్దతుల‌ను అనుసరిస్తుంటారు._*


*_కొంత మంది శీత‌ల పానీయాల‌ను తాగుతూ.. సేద తీరుతుంటే.. మరికొంతమంది వేస‌వి తాపం నుంచి గట్టేక్కేందుకు స‌హ‌జ‌సిద్ధమైన పద్దతులను అనుసరిస్తారు. అలాంటి సహజసిద్ధమైన పానీయాల్లో ఇంట్లో త‌యారు చేసుకునే బార్లీ నీటి పానీయం కూడా మ‌న‌కు వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నాన్ని కలిగిస్తుంది. ఈ నీటిని నిత్యం తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే.. బార్లీ నీటిని ఎలా త‌యారు చేయాలి.. దానివల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు చూద్దాం.._*


👇🏼👇🏼👇🏼👇🏼👇🏼


●●●


*_"తయారీ విధానం / Preparation Method Of 'Barley Water'.."_*


*_ఒక పాత్రలో లీటర్ రెండు లీటర్ల తాగునీటిని తీసుకుని వాటిలో కొన్ని బార్లీ గింజలను వేయాలి. లేకపోతే మిక్సి పట్టి పొడిని రోజుకు కొద్దిగా వేయొచ్చు. 20 నిమిషాలపాటు ఈ నీటిని మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. తర్వాత ఆ నీటిని చల్లార్చి వ‌డ‌పోయాలి. దీంతోపాటు ఉంటే.. అందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి. ఈ నీటిని నిత్యం ఉదయాన్నే పరిగడుపున తాగాలి. లేదా మ‌ధ్యాహ్నం ఎండ‌కు బ‌య‌ట‌కు వెళ్లివ‌చ్చిన తర్వాత కూడా తాగ‌వ‌చ్చు._*



*_"బార్లీ నీటి లాభాలు / BENEFITS OF BARLEY WATER:"_*


*_• బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి._*


*_• మూత్రాశ‌యం శుభ్రంగా మారుతుంది._*


*_• కిడ్నీలో రాళ్లు క‌రిగిపోతాయి.–*


*_• మూత్ర సమస్యలన్నీ తగ్గిపోతాయి._*


*_• జీర్ణశాయ ఇబ్బందులు, ఉదర సమస్యలు తొలగిపోతాయి._*


*_• కీళ్లు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి._*


*_• రోజూ బార్లీ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వేడి బ‌య‌ట‌కు పోయి చల్లగా మారుతుంది._*


*_• బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు బార్లీ నీటిని తాగితే బరువు తగ్గుతారు._*


*_• బార్లీ నీటి వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ క‌రుగుతుంది._*


*_• ర‌క్త స‌రఫ‌రా మెరుగు ప‌డుతుంది._*


*_• వ‌డ‌దెబ్బ తాకకుండా ఉండాలన్నా.. ఎండ‌లో తిరిగి వ‌చ్చిన వారు అనారోగ్యం బారిన ప‌డ‌కుండా ఉండాల‌న్నా.. బార్లీ నీటిని తాగితే మంచిదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు._*✍️

ఈ సమాచారమంతా కేవలం సభ్యుల అవగాహనకోసం మాత్రమే.

మీ అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు 

మీ డాక్టర్ ను సంప్రదించగలరు.🙏

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


*నా ధర్మం.

 


                  *నా ధర్మం..!*

                  ➖➖➖✍️


*కోట్ల సంవత్సరాల సనాతన ధర్మాన్ని ప్రశ్నించే మూర్ఖుల కోసం ఈ మహిమాన్విత దేవాలయాల వివరణ….*


*సైన్స్ అభివృద్ధి చెందిన నేటి తరానికి కూడా అంతుచిక్కని దైవ రహస్యాలు ఎన్నో ఇముడ్చుకుని ఇప్పటికీ భక్తితో ఉన్నవారికి తాదాత్మ్యం, సైన్స్ అన్నవారికి ప్రశ్నార్థకంగా ఉన్న ఈ మహిమాన్వితమైన ప్రదేశాలు భారతీయ సంస్కృతి హిందూ ధర్మనిరతికి ప్రతీకలుగా భాసిల్లుతున్నాయి.*


*ఈ రోజు హిందూ మతం దేదీప్యమానంగా వెలుగుతోందంటే ఇలాంటి ఎన్నో మహిమాన్వితమైన క్షేత్రాలు, దేవాలయాలే కారణం.*


*ఎన్నో దోపిడీలకు గురైనా, లౌకికవాద ప్రభుత్వాలు సహకరించక పోయినా, మా ఈ దేవాలయాలన్నింటిని ప్రభుత్వాలు ఆక్రమించుకున్నా, పరమత రాజులు పగలగొట్టినా ఆస్థిక నాస్తిక భావాజాలమున్న ఎందరో ముఖ్యమంత్రులు ప్రధానులు పరిపాలించిన, ఎన్ని మతాల వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా, మతమార్పిడులు, మత కుతంత్రాలు చేసినా ఎలాంటి మానవ ప్రయత్నాలు చేయకుండానే ఈ రోజుకీ ఒక మహాసముద్రం వలే మన సనాతన ధర్మం నిలిచి ఉంది.*


*మన సనాతన ధర్మపరాయణులు సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక మహిమాన్విత దేవాలయాన్ని దర్శించుకొంటే చాలు, పాపాలు పారిపోతాయి. పిశాచబాధలు ఉంటే వదిలిపోతాయి. ఏ విధంగానైనా, ఏ రూపం లోనైనా, ఏ సమయం లోనైనా ఆర్తితో మొక్కి పూజించిన వెంటనే మా దేవుళ్ళు అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు, మోక్షాన్నిస్తారు.*


*అలాంటి మహిమాన్వితమైన ఆలయాల్లో సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:*


*1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.*


*2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.*


*3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.*


*4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.*


*5. మొగిలీశ్వర్ దేవాలయం*


*6. కడప జిల్లా కోదండరామ దేవాలయం,*


*నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:*

*1. మహానంది*

*2. జంబుకేశ్వర్*

*3. బుగ్గరామలింగేశ్వర్*

*4. కర్ణాటక కమండల గణపతి.*

*5. హైదరాబాద్ కాశీ బుగ్గ* *శివాలయం.*

*6. బెంగళూర్ మల్లేశ్వరస్వామి ఆలయం*

*7. బెల్లంపల్లి రాజరాజేశ్వర శివాలయం*

*8. సిద్ధగంగా ఆలయం*


*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు…*

*1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.*

*2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,*

*3. మంజునాథ ఆలయం*


*శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్, సముద్రమే వెనక్కివెళ్లే గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.*


*జగన్మాత మానవ స్త్రీవలె నెలసరి అయ్యే…*

*1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,    2. కేరళ దుర్గామాత.*


*సమయానుసారంగా రంగులు మారే ఆలయాలు…*

*1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.*

*2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.*

*పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, ఇక్కడే నెయ్యి "వెన్న" గా మారేది.*


*నిరంతరం భౌతిక పరిమాణం పెరుగుతూన్న విగ్రహాలు…*

*1. కాణిపాకం విఘ్నేశ్వరుడు*

*2. యాగంటి బసవన్న,*

*3. కాశీలో తిలభండేశ్వర్,*

*4. బెంగుళూరు బసవేశ్వర స్వామి*

*5. బిక్కవోలు లక్ష్మీగణపతి దేవుడు*


*స్వయంభువుగా సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.....*

*ఆరునెలలకు ఒకసారి తెరిచే…*

*1. బదరీనాథ్,*

*2. కేదారనాథ్ (ఇక్కడ ద్వారం మూసేటప్పుడు వెలిగించిన దీపం ఆరునెలల తరువాత ద్వారాలు తెరిచేవరకు వెలుగుతూనే ఉంటుంది)*

*3. గుహ్యకాళీమందిరం.*


*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు కర్ణాటకలోని హాసన్ దగ్గర ఉన్న హాసంబా దేవాలయం, ఇక్కడ దేవునికి నివేదించిన ప్రసాదాలు సంవత్సరం తరువాత మళ్లీ ఆలయం తెరిచేటప్పటికీ కూడా చెడిపోకుండా అలానే ఉంటాయి.*


*హిమాచల్ ప్రదేశ్ లో 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి ముక్కచెక్కలై తిరిగి మళ్లీ అతుక్కుని ఎప్పటిలాగే తయారయ్యే బిజిలి మహాదేవ్ ఆలయం.*


*పెట్టిన ప్రసాదాలు తినివేసే.              కేరళ శ్రీ కృష్ణ దేవాలయం, మరియు బృందావనంలోని రాధాకృష్ణ శయనమందిరం.*


*ఒంటి స్తంభంతో యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ మండువేసవి వేడిలో కూడా ఊట నుండి చల్లని నీరు ఊరుతుంది.*


*ఉత్తరఖండ్ లో రోజుకు మూడుసార్లు రూపాలు మారే దారిదేవి.*


*నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. ఒకరోజు ఈ అమ్మవారు పూజారికి కలలో కనబడి ఇక నుండి దీపం నూనెతో కాకుండా నీటితో వెలిగించమని చెప్పింది, అప్పటినుండి ఇప్పటివరకు అలాగే జరుగుతూ ఉంది.*

*విగ్రహాన్ని తాకితే మనిషి శరీరం వలె మెత్తగా ఉండే మూర్తులు ఉన్న ఆలయాలు…*

*1. హేమాచల నరసింహ స్వామి.          2. శ్రీశైలం వద్దనున్న ఇష్టకామేశ్వరీ దేవి*


*మనిషి వలె గుటకలు వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామి.* 


*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునోత్రి.*


*ఏ వైపునుండి వస్తుందో ఏ స్థంభం నుండి వస్తుందో కూడా తెలియనట్టి ఛాయా విశేషం గలిగిన…*

*1. ఛాయాసోమేశ్వరాలయం, ఇక్కడ ఏ స్థంభందో తెలీని నీడ ఉంటుంది.*

*2. హంపి విరూపాక్షేశ్వర ఆలయం, గోపురం నీడ వ్యతిరేకదిశ (Reverse order) లో ఒక చోట పడుతుంది.*

*3. అలాంటిదే మరోటి బృహదీశ్వరాలయం.*


*వేల టన్నుల బరువున్నప్పటికినీ నీటిలో తేలే విష్ణువు విగ్రహం నేపాల్.*


*గోపురం మీదనుండి పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.*


*ఇంకా...*

*ప్రపంచంలో నిత్యం అత్యధిక భక్తులు దర్శించి తరించే తిరుమల వెంకటేశ్వర స్వామి, కేరళ అనంత పద్మనాభ స్వామి, రామేశ్వరం, కంచి,

చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం ఇవి నాకు తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే.* 


*మనదేశంలో ఇలాంటి మహిమాన్వితమైన దేవాలయాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి, ఈ పేజీలోని పూర్వపు పోస్టుల్లో ఇలాంటి విశేషాంశాలు కొన్ని పోస్ట్ చేయడం కూడా జరిగింది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       

*

ఆచార్య సద్బోధన:



              *ఆచార్య సద్బోధన:*

                  ➖➖➖✍️


*మనం సుఖముగా,  ప్రశాంతముగా ఉండవలెనంటే    మనం కోరికలను, అవసరాలను తగ్గించుకుంటూ వైరాగ్య భావం పెంచుకోవాలి.* 


*ఇది అత్యవసరమా? అని ప్రతి కోరికనూ గీటురాయిమీద పరీక్షించుకోవాలి.* 


*మన ఇంటిలో అనేక వస్తువులను పోగుచేసుకుంటే దుమ్మూ చీకటీ తప్ప ఒరిగేదేమీ ఉండదు.* 


*అలాగే మన మనస్సులో విషయాలను అధికంగా చేర్చుకుంటే దుఃఖము, బాధలు తప్ప ఇంకేమి రావు.* 


*కనుక బయట ఉన్నవన్నీ లోపల చేర్చవద్దు. తక్కువ సరంజామాతో పయనం చేసినపుడే గమ్యం చేరుకోవడం సులభం మరియు సురక్షితం.* 


*ప్రాణం నిలుపుకోవడానికి, ఆరోగ్యం కాపాడుకోవడానికి తగినంత ఉంటే చాలును.* 


*తగుమాత్రం ఉప్పు వేసినప్పుడే పప్పు రుచిగా ఉంటుంది. ఉప్పు ఎకువైతే రుచి చెడిపోతుంది. అట్లే, కోరికలను ఎక్కువ చేసుకుంటే జీవితం దుర్భరమవుతుంది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“ గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

అమ్మ దీవెన "

 " సృష్టిలో మహోన్నతం, మహత్తర దివ్య ప్రకాశం, అమ్మ దీవెన "



పుణ్య ధరిత్రిపై జగజ్జగని స్వరూపం 


మాతృమూర్తి అనురాగం, అనిర్వచనీయం 


అమృత రసాలను పంచెడి అమ్మ అభిమానం 


సృష్టిలో ఎన్నటికీ తరగని, ఏనాటికీ మరువలేని అమ్మ ఆలంబన 


అమ్మ మన చెంత ఉండగా దేనికీ లేదు మఱి కొఱత 


అమ్మ అండ ఉన్నచో, ఎట్టి క్లిష్ట సమస్యకైనా దొరుకు సులభతర పరిష్కారం 


అమ్మ అనురాగం, ఆప్యాయత, అమ్మ దీవెన వెంట ఉండగా కొండంత ధైర్యం మనకి 


మాతృమూర్తి ప్రేమాభిమానాలు ఈ పవిత్ర పుడమిపై భగవత్ ప్రసాదితం 


అమ్మను గౌరవించి, ఆమె మనఃపూర్వక శుభాశీస్సులు పొందాలందరూ ఈ భువిపై 


అమ్మ సాటి మఱెవరూ కానరారీ జగతిలో


మాతృమూర్తిని ఆదరించడం, ఆమెతో ఎల్లవేళలా ఆమెతో కలిసి ఉండడం మహోన్నతమీ ఇలలో 


మాతృమూర్తి ఆప్యాయతను పొందడంతో పాటు, ఆమెకు కావలసిన వాటిని సమకూర్చడం పిల్లల కనీస కర్తవ్యం !!


✍గుళ్లపల్లి ఆంజనేయులు