15, మే 2023, సోమవారం

*నా ధర్మం.

 


                  *నా ధర్మం..!*

                  ➖➖➖✍️


*కోట్ల సంవత్సరాల సనాతన ధర్మాన్ని ప్రశ్నించే మూర్ఖుల కోసం ఈ మహిమాన్విత దేవాలయాల వివరణ….*


*సైన్స్ అభివృద్ధి చెందిన నేటి తరానికి కూడా అంతుచిక్కని దైవ రహస్యాలు ఎన్నో ఇముడ్చుకుని ఇప్పటికీ భక్తితో ఉన్నవారికి తాదాత్మ్యం, సైన్స్ అన్నవారికి ప్రశ్నార్థకంగా ఉన్న ఈ మహిమాన్వితమైన ప్రదేశాలు భారతీయ సంస్కృతి హిందూ ధర్మనిరతికి ప్రతీకలుగా భాసిల్లుతున్నాయి.*


*ఈ రోజు హిందూ మతం దేదీప్యమానంగా వెలుగుతోందంటే ఇలాంటి ఎన్నో మహిమాన్వితమైన క్షేత్రాలు, దేవాలయాలే కారణం.*


*ఎన్నో దోపిడీలకు గురైనా, లౌకికవాద ప్రభుత్వాలు సహకరించక పోయినా, మా ఈ దేవాలయాలన్నింటిని ప్రభుత్వాలు ఆక్రమించుకున్నా, పరమత రాజులు పగలగొట్టినా ఆస్థిక నాస్తిక భావాజాలమున్న ఎందరో ముఖ్యమంత్రులు ప్రధానులు పరిపాలించిన, ఎన్ని మతాల వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా, మతమార్పిడులు, మత కుతంత్రాలు చేసినా ఎలాంటి మానవ ప్రయత్నాలు చేయకుండానే ఈ రోజుకీ ఒక మహాసముద్రం వలే మన సనాతన ధర్మం నిలిచి ఉంది.*


*మన సనాతన ధర్మపరాయణులు సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక మహిమాన్విత దేవాలయాన్ని దర్శించుకొంటే చాలు, పాపాలు పారిపోతాయి. పిశాచబాధలు ఉంటే వదిలిపోతాయి. ఏ విధంగానైనా, ఏ రూపం లోనైనా, ఏ సమయం లోనైనా ఆర్తితో మొక్కి పూజించిన వెంటనే మా దేవుళ్ళు అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు, మోక్షాన్నిస్తారు.*


*అలాంటి మహిమాన్వితమైన ఆలయాల్లో సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:*


*1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.*


*2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.*


*3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.*


*4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.*


*5. మొగిలీశ్వర్ దేవాలయం*


*6. కడప జిల్లా కోదండరామ దేవాలయం,*


*నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:*

*1. మహానంది*

*2. జంబుకేశ్వర్*

*3. బుగ్గరామలింగేశ్వర్*

*4. కర్ణాటక కమండల గణపతి.*

*5. హైదరాబాద్ కాశీ బుగ్గ* *శివాలయం.*

*6. బెంగళూర్ మల్లేశ్వరస్వామి ఆలయం*

*7. బెల్లంపల్లి రాజరాజేశ్వర శివాలయం*

*8. సిద్ధగంగా ఆలయం*


*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు…*

*1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.*

*2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,*

*3. మంజునాథ ఆలయం*


*శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్, సముద్రమే వెనక్కివెళ్లే గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.*


*జగన్మాత మానవ స్త్రీవలె నెలసరి అయ్యే…*

*1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,    2. కేరళ దుర్గామాత.*


*సమయానుసారంగా రంగులు మారే ఆలయాలు…*

*1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.*

*2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.*

*పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, ఇక్కడే నెయ్యి "వెన్న" గా మారేది.*


*నిరంతరం భౌతిక పరిమాణం పెరుగుతూన్న విగ్రహాలు…*

*1. కాణిపాకం విఘ్నేశ్వరుడు*

*2. యాగంటి బసవన్న,*

*3. కాశీలో తిలభండేశ్వర్,*

*4. బెంగుళూరు బసవేశ్వర స్వామి*

*5. బిక్కవోలు లక్ష్మీగణపతి దేవుడు*


*స్వయంభువుగా సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.....*

*ఆరునెలలకు ఒకసారి తెరిచే…*

*1. బదరీనాథ్,*

*2. కేదారనాథ్ (ఇక్కడ ద్వారం మూసేటప్పుడు వెలిగించిన దీపం ఆరునెలల తరువాత ద్వారాలు తెరిచేవరకు వెలుగుతూనే ఉంటుంది)*

*3. గుహ్యకాళీమందిరం.*


*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు కర్ణాటకలోని హాసన్ దగ్గర ఉన్న హాసంబా దేవాలయం, ఇక్కడ దేవునికి నివేదించిన ప్రసాదాలు సంవత్సరం తరువాత మళ్లీ ఆలయం తెరిచేటప్పటికీ కూడా చెడిపోకుండా అలానే ఉంటాయి.*


*హిమాచల్ ప్రదేశ్ లో 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి ముక్కచెక్కలై తిరిగి మళ్లీ అతుక్కుని ఎప్పటిలాగే తయారయ్యే బిజిలి మహాదేవ్ ఆలయం.*


*పెట్టిన ప్రసాదాలు తినివేసే.              కేరళ శ్రీ కృష్ణ దేవాలయం, మరియు బృందావనంలోని రాధాకృష్ణ శయనమందిరం.*


*ఒంటి స్తంభంతో యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ మండువేసవి వేడిలో కూడా ఊట నుండి చల్లని నీరు ఊరుతుంది.*


*ఉత్తరఖండ్ లో రోజుకు మూడుసార్లు రూపాలు మారే దారిదేవి.*


*నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. ఒకరోజు ఈ అమ్మవారు పూజారికి కలలో కనబడి ఇక నుండి దీపం నూనెతో కాకుండా నీటితో వెలిగించమని చెప్పింది, అప్పటినుండి ఇప్పటివరకు అలాగే జరుగుతూ ఉంది.*

*విగ్రహాన్ని తాకితే మనిషి శరీరం వలె మెత్తగా ఉండే మూర్తులు ఉన్న ఆలయాలు…*

*1. హేమాచల నరసింహ స్వామి.          2. శ్రీశైలం వద్దనున్న ఇష్టకామేశ్వరీ దేవి*


*మనిషి వలె గుటకలు వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామి.* 


*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునోత్రి.*


*ఏ వైపునుండి వస్తుందో ఏ స్థంభం నుండి వస్తుందో కూడా తెలియనట్టి ఛాయా విశేషం గలిగిన…*

*1. ఛాయాసోమేశ్వరాలయం, ఇక్కడ ఏ స్థంభందో తెలీని నీడ ఉంటుంది.*

*2. హంపి విరూపాక్షేశ్వర ఆలయం, గోపురం నీడ వ్యతిరేకదిశ (Reverse order) లో ఒక చోట పడుతుంది.*

*3. అలాంటిదే మరోటి బృహదీశ్వరాలయం.*


*వేల టన్నుల బరువున్నప్పటికినీ నీటిలో తేలే విష్ణువు విగ్రహం నేపాల్.*


*గోపురం మీదనుండి పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.*


*ఇంకా...*

*ప్రపంచంలో నిత్యం అత్యధిక భక్తులు దర్శించి తరించే తిరుమల వెంకటేశ్వర స్వామి, కేరళ అనంత పద్మనాభ స్వామి, రామేశ్వరం, కంచి,

చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం ఇవి నాకు తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే.* 


*మనదేశంలో ఇలాంటి మహిమాన్వితమైన దేవాలయాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి, ఈ పేజీలోని పూర్వపు పోస్టుల్లో ఇలాంటి విశేషాంశాలు కొన్ని పోస్ట్ చేయడం కూడా జరిగింది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       

*

కామెంట్‌లు లేవు: