#భువనేశ్వరిపీఠం
వివిధ రోగములు - కారక గ్రహములు .
మనిషి చేసే పాపకర్మలు వ్యాధుల రూపంలో పట్టి పీడిస్తాయి అని అనేక గ్రంధములలో చెప్పబడింది. అదేవిధంగా ఆయా వ్యాదులు రావడానికి ఆయా గ్రహాలూ కారణం . ఒక్కోసారి మనం ఎన్ని ఔషధాలు తీసుకున్నా కూడా వ్యాధి నుంచి పూర్తి ఉపశమనం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా వ్యాధికారక గ్రహానికి పూజ జరిపించడం ద్వారా మరియు సరైన ఔషధ సేవన ద్వారా బయటపడవచ్చు. ముందు గ్రహాలకు దానం ఇవ్వాలి . అప్పటికి ఫలితం లేకుంటే తీవ్రతని బట్టి అభిషేకం నిర్వహించాలి. ఇంకా ఫలితం రాకుంటే జపం చేయించాలి. ఇంకా ఫలితం ఇవ్వకుంటే హోమం నిర్వహించాలి. ఇందులో ఏది అన్నది ఆ గ్రహ దోషం , వ్యాధి తీవ్రతని బట్టి ఉంటుంది.
ఇప్పుడు మీకు ఆయా వ్యాధులకు కారణం అయ్యే గ్రహాల సమాచారం ఆచార్య సిద్ద నాగార్జునుడు రచించిన సిద్ద నాగార్జున తంత్రం నుంచి గ్రహించడం అయినది.
సన్నిపాత జ్వరం ( Typhoid ) - గురు,బుధులు .
కామెర్లు ( Jaundice ) - గురు, శుక్రులు .
రాచకురుపు ( Carbuncle ) - రవి.
మలేరియా ( మలేరియా ) - శని .
పురాణ జ్వరం ( Long standing Fever) శని .
అతిసారం ( diamhoed and chronic ) కుజుడు .
గ్రహణి ( Diarrhoea ) - బుధ , శని , కేతువు .
మూలశంక ( Piles ) - కుజుడు , రాహువు.
రక్త ఆర్శస్సు ( Bleeding piles ) - కుజుడు , రాహువు .
అగ్నిమాన్ధ్యం ( Dyspepsis ) - శని.
అజీర్ణం ( Indaigestion ) - శని.
కలరా ( cholera ) - కుజుడు .
రాజయక్ష్మ ( Consumption ) - కుజ, రాహువు
అసాధ్య రాజయక్ష్మ ( Tuberculosis ) క్షయ - శుక్రుడు .
తమక శ్వాసము ( Asthama ) - శని, బుద,కేతువు .
మహాశ్వాసం ( Dysproea ) - శుక్రుడు .
ఉన్మాదం ( Insanity ) - శుక్ర,రాహు,చంద్ర,శని
ధనుర్వాతం ( Titanus ) - రవి,శని కలయిక కాక రవి,కుజ,శని కలయిక .
పక్షవాతం ( Paralysis ) - శని.
అవతంత్రకం ( Hysteria ) - కుజ,శని.
మూగతనం ( Apasia ) - బుద,కేతువు .
వాత రక్తం ( Gout ) - శని,శుక్రులు .
ఆమవాతం ( Rhumatism ) - శని .
నొప్పి - ( Colic ) - శని, కుజ,రాహువు.
పరిణామ శూల ( Gastral Gokennosis ) - శని, కుజ, రాహువులు .
హుద్రోగములు - ( Diseases of the Heart ) శుక్రుడు .
మూత్రక్రుచ్చం ( Dysuria ) - కుజ, బుధులు .
జలోదరం ( Ascties ) - కేతువు ,బుదుడు .
మూత్రజ వృద్ది ( Hydrocele ) - బుదుడు.
మశూచి ( Small pox ) - బుద,కేతు,కుజులు .
చెవుడు ( Deafness ) - శని.
తలనొప్పి ( Headache ) - కుజ,రాహువులు
గర్భస్రావం ( Abortion ) - రవి,గురులు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557