18, నవంబర్ 2020, బుధవారం

శ్రీలలితా సహస్రనామ వివరణ🌹

 🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*29. అనాకలిత సాదృశ్య చిబుకశ్రీ విరాజితా*


ఆ తల్లి చిబుకము అనగా గడ్డము యొక్క అందమునకు పోలిక చెప్పుటకు ఏ విధమైనదీ లేని ఆ గడ్డము యొక్క శోభలతో వెలుగొందుతూ వుంది.


వాగ్గేవిఐన సరస్వతి మొదలుగా, నేటి వరకూ గల కవులందరూ ఆ దేవి సౌందర్యమును వర్ణించే ప్రయత్నములు చేసినవారే.


కానీ వారిలో ఎవ్వరికీ శ్రీ మాత గడ్డము దాని సోయగము చెప్పుటకు తగిన వుపమానము దొరకలేదు. అటువంటి సాటిలేని గడ్డపు శోభలతో ప్రకాశిస్తున్నది దేవి


అద్దములో కనబడే శ్రీమాత యొక్క చుబుకమునకు ఆ తల్లి ప్రతిబింబము మాత్రమే సరిపోలుతుంది. మిగిలిన సృష్టిలో యేవీ కూడా ఆ అందము తెలియ జేయుటకు సరిపోదు.


పైగా ఆ చుబుకము అనే పదానికి "శ్రీ” అనే విశేషణము జేర్చుట వల్ల ఆ

అందమునకు పోలికే లేదు


క|| పరమేశ్వరి చిబుకమునకు, సరిపోల్చగ నేమిటౌను? చాలదే జగతిన్ మరితూగుటకే మున్నవి

తరుణిమ శోభకు సరిసమ దర్పణమొకటే!!   


        లలితానామసుగంధం

                 M.s.s.k

కామెంట్‌లు లేవు: