15, జనవరి 2023, ఆదివారం

సంక్రాంతి

 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

             *సంక్రాంతి పర్వము*

శా.

దుష్కర్మౌఘము భోగిమంటఁ బడుచున్ తోడ్తోడ నిఱ్ఱింకగా 

నిష్కామంబె మనోవిలాసమవగా నిత్యానందమయ్యెం దగన్ 

శుష్కాచారవిదూరధీరమతులై శోభించ భూవాసులున్ 

నిష్కర్షం జనె భోగి త్రోవ నిడుచున్ నేస్తమ్ము సంక్రాంతికిన్ 

సీ.

రంగవల్లులలోన లలన పేర్చిన గొబ్బి 

         రక్షణై నిలువ సంక్రాంతి వచ్చె 

హరిదాసుసంకీర్త నాలాపముల మ్రోల 

         గమకమ్ము నిండ సంక్రాంతి వచ్చె 

ఆలకొమ్ముల నిండ నలదు రంగులతోడ 

          లలితమై వెలుగు సంక్రాంతి వచ్చె

పొంగళ్ళు పొంగించ నంగనామణులెల్ల 

          కమనీయమైన సంక్రాంతి వచ్చె

తే.గీ. 

కూతురల్లుళ్ళు సంతుతో కోరి రాగ 

క్రొత్తజంటల వేడ్కలు కొసరి వచ్చె 

తెలుగు లోగిళ్ళ సంక్రాంతి తీర్చవచ్చె 

సంబరములెన్నొ గుమిగూడి సందడించ 

సీ.

ఆవుదూడల పిల్పు లార్తినిండిన మార్పు 

          రైతుబంధువె వేల్పు ప్రగతితాల్పు 

ఏడాది కృషి వెంట ఇంట జేరిన పంట 

          ఆరుగాలము కంట నంటి యుంట 

నందిరాజులబృంద మందెవేసి చంద 

          మందగించగ వంద వందనములు 

అన్నదాతలు వార లన్ని కాలములందు 

          నెన్న నౌనే చిన్న వెన్ని యైన 

తే.గీ.

మకరసంక్రాంతి వేళలో నికరమైన 

యుత్తరాయణ పర్వాన నుత్తముండు 

రైతు మారాజు రసరాజు రాజరాజు 

నతని కృపయె పర్వమ్ము గతియు మనకు 

*~శ్రీశర్మద*

మీరొస్తారని

 మీరొస్తారని...


నీ తల్లికి దూరమాయే

నీ ఊరుకి దూరమాయే

నీ తల్లి కన్నీరాయే

నీ ఊరు సిన్న బోయే.


నినుగన్న తల్లి పెంచేలే

పుట్టిన ఊరు బలమునిచ్చేలే

అమ్మను మరిచి

ఊరమ్మను వదిలావా.


పల్లెలోని ఇళ్లు బోసిపోయాయి.

ముసలి కాళ్ళు ఈడుస్తుంటే

రచ్చబండ రాయిలా

కనిపిస్తుంటే... 

ఏమయ్యి పోయావు

నీవు మరిచిపోయావా...


బాల్యమంత ఆడి పాడావా

చెరువులు మావే అన్నావా

కుంటలు మావే అన్నావా

పొలంగట్ల పైన ఆటలాడావా

పల్లెతల్లి ఒడిలో బిడ్డలయ్యారా.


పండగ రోజున అందంగా దిద్దావా

సంకురాతిరి సంబరం జేశావా

మట్టి బొమ్మలను పూజించావా

ఊయల పండగ ఊరేగేవా


వరసలు పెట్టి పలికి

అక్కాబావంటు

అత్తమామంటు

కూతురా కోడాల అంటూ

పిలుచు కున్నారా.


పొలాన ఏరువాక పండగ చేసావా

పంటకు కోతలు నూర్పులు జేసావా

పండిన పంటలు ఇంటముందు 

ధాన్యపు సిరులు జేసి

పల్లె పండగ జరిపారా.


పట్నం మోజులో

పల్లె విడిచి పరుగులు పెట్టి

వెళ్ళి పోయావా

బ్రతుకే భారమైయిందా...

నన్ను మరచి పోయావా.


బస్తీలో బందీ ఆయ్యావా

ఒంటరి బతుకు బ్రతికేవా

నీవు దూరంగా ఉంటేను

అమ్మ అల్లాడి పోతుందో.


కొడుకా కొమరయ్య

బిడ్డా లచ్చమ్మ 

పల్లెమ్మను నేనున్నా

సేద తీర రారండో...

నా చెంతన చేరండో...


అమ్మను మరువకు

ఊరమ్మను మరచకు

ఎదురు చూపులు

చూస్తున్నాము..



మీరొస్తారని....!


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

నేనే బాలాజి

 నేనే బాలాజి 


పరమాచార్య స్వామి వారు అప్పుడు మహారాష్ట్రలో మకాం చేస్తున్న కాలం. ఒక జమీందారు(సంపన్నుడైన భూస్వామి), స్వామి వారికి సౌకర్యవంతమైన విడిది కోసం వారి అవసరాలన్నీ జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆయన దగ్గర పనిచేసే ఒక సేవకుణ్ణి ఈ ఏర్పాట్లలో ఏమి లోపం రాకుండా స్వామివారి నిత్య అవసరాలు చూసుకోవడానికి ఉంచాడు.


ఆ యువకుని పేరు పవార్. ఆ యువకుడు స్వామివారు అక్కడున్నన్ని రోజులు స్వామి వారికి అనన్యమైన సేవ చేసాడు. పరమాచార్య స్వామి వారు ఆ యువకుని భక్తికి, సేవానిరతికి ఎంతో ఎంతో ప్రీతి చెందారు. అక్కడి విడిది ముగియ బోతుండగా, స్వామి వారు ఇక బయలుదేరవలసిన సమయంలో ఆ భూస్వామితో, “ఈ యువకుడిని నాతో తీసుకుని వెళ్ళనా?” అని అడిగారు. ఆ భూస్వామి చాలా సంతోషించాడు. అతని ఆనందానికి అవధులు లేవు. అతని దగ్గర పనిచేసే సేవకుడు, మహాస్వామి వారి వద్ద సేవకుడిగా ఉండబోతున్నాడు. పరమాచార్య స్వామి వారిని సేవించబోతున్నాడు. 


వెంటనే ఆ భూస్వామి, “సంతోషంగా మీతో తీసుకుని వెళ్ళండి. అతని కుంటుంబాన్ని నేను చూసుకుంటాను. వారి అవసరాలన్నీ నేను తీరుస్తాను. కాబట్టి అతను తన కుంటుంబం గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు” అని అన్నాడు. ఆనాటినుండి ఆ ఉత్తర భారతీయ యువకుడు శ్రీమఠంలో ఒక సభ్యుడయ్యాడు.


శ్రీమఠం తరువాతి మకాం ఏ సౌకర్యములు లేని చోట చేసారు. అది రాత్రి సమయం కావున వంట వండి మఠం సభ్యులందరూ భోజనాలు ముగించారు. అన్న పానాదులు ఎవరికి లోటు లేకుండా సమృద్ధిగా ఉండాలని మమాస్వామి వారి ఆజ్ఞ. మఠంలో పనిచేసేవారికి ఎవరికి భోజనం తక్కువ కాకూడదు.


అందరూ భోజనాలు ముగించిన తరువాత పరమాచార్య స్వామి వారు వచ్చి, ఒక్కొక్కరిని భోజనం ముగించారా అని విచారిస్తున్నారు. అందరూ తిన్నామని చెప్పారు. చివరగా వారు బయటకు వచ్చి చూస్తే తలుపు దగ్గర పవార్ కాపలా ఉన్నాడు.


అతనికి తమిళం రానందున ఏమైనా తిన్నావా అని స్వామి వారు సైగలతో అడిగారు. కాని అతను దీనంగా లేదు అన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు. మహాస్వామి వారు వెంటనే మఠం మేనేజరును పిలిచి, “ఈ యువకుడు మనల్ని నమ్మి ఇక్కడికి వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలని నీకు ఎందుకు అనిపించలేదు? అతను అడగకపోయినా అతనికి మన భాష రాకపోయినా నువ్వు ఎందుకు అతని గురించి పట్టించుకోలేదు. కనీసం తిన్నావా? అని అయినా అడిగావా? మీరందరూ తినేసి, వంట వార్పు ఆపేసారు. ఈ నిర్మానుష్య ప్రదేశంలో అతనికి తినడానికి ఏమి దొరుకుతుంది?” అని అడిగారు. 


స్వామి వారు చాలా కోపంగా మేనేజరుని మందలించారు . తరువాత మేనేజరు మహాస్వామి వారితో పవార్ కు తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. 


కొద్దిసేపటి తరువాత ఒక వ్యక్తి సైకిల్ లో ఒక క్యారేజితో అక్కడికి వచ్చాడు. ఇంకా ఇక్కడ గుడారాలలో వెలుగు కనపడడంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. వారు అతన్ని వివరములు అడుగగా, అతను ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్నవారికి భోజనం తిసుకుని వెళ్తున్నానని, దార్లో వెళ్తూ స్వామి వారిని దర్శించాలని వచ్చానని చెప్పాడు. వెంటనే పరమాచార్య స్వామి వారు ఆ వ్యక్తితో పవార్ ను చూపిస్తూ, “నువ్వు తీసుకెళ్తున్న దాంట్లో కొద్ది ఆహారం ఇతనికివ్వగలవా?” అని అడిగారు. అపార కరుణకు సాకార రూపమైన మహాస్వామి వారు తన సేవకుని కోసం ఒక అజ్ఞాతవ్యక్తిని అర్థిస్తున్నారు. 


వెంటనే ఆ వ్యక్తి, “ఈ క్యారేజిలో ఆహారం ఉంది. అతన్ని తినమనండి. నేను వేరే ఏర్పాట్లు చేసుకుంటాను” అని క్యారేజిని ఇచ్చి వెళ్ళిపోయాడు. వారు దాన్ని తెరవగా అందులో ఉత్తరభారతీయుల అహారమైన వేడి వేడి చపాతీలు, కూరగాయల సబ్జి ఉన్నది. స్వామి వారు నవ్వుతూ పవార్ వైపు చూసి తినమన్నారు. తన కోసం ఇలా ఎవరినో మహాస్వామి వారు అర్థించడం చూసి పవార్ కదిలిపోయాడు. తరువాత ఆ వ్యక్తి ఎప్పుడూ మళ్ళా ఆ క్యాంపు వైపు కాని రాలేదు. కనీసం అక్కడ వదిలిపెట్టిన క్యారేజి తీసుకుని వెళ్ళడానికి కూడా రాలేదు. 


పవార్ కు మహాస్వామి వారే ప్రపంచంలా మారిపోయింది. మఠంలో శాశ్వత ఉద్యోగి అయిపోయాడు. పరమాచార్య స్వామి వారు మేనాలోనికి(అందులోనే స్వామివారు నిద్రపోయేవారు) వెళ్ళేవరకు అన్నీ తానై సేవించేవాడు. అన్ని అవసరాలని తీర్చేవాడు. 


కొన్ని సంవత్సరాల తరువాత పవార్ కుటుంబం స్వామి వారి దర్శనానికి కాంచీపురం వచ్చింది. కొన్ని రోజులు ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. తరువాత అక్కడి నుండి వారు తిరుమల వెళ్ళి శ్రీనివాసుణ్ణి దర్శించుకోవాలనుకున్నారు. పవార్ వచ్చి స్వామి వారికి వారి కోరిక తెలుపగా “సంతోషంగా వెళ్ళి రమ్మను” అని చెప్పారు. 


మనసులో పవార్ కు కూడా తన కుటుంబంతో వెళ్ళాలని ఉంది. దానికి మహాస్వామి వారి ఆశీస్సులు, అనుమతి కావాలి. అదీకాకుండా తను వాళ్ళతో వెళ్తే స్వామివారి అవసరాలని ఎవరు చూసుకుంటారు. కావున కేవలం ఒక్కరోజు మాత్రమే వెళ్ళి వద్దామని స్వామి వారిని అనుమతి అడిగాడు. 


స్వామివారు అతనితో, “నీకు బాలాజిని చూడాలని ఉందా? సరే వాళ్ళతో కూడా వెళ్ళు” అని సెలవిచ్చారు. పవార్ చాలా సంతోషించాడు. 


స్వామివారు మేనాలొనికి వెళ్ళగానే దాని తలుపులు గట్టిగా మూయడం, ఉదయాన్నే స్వామి వారికంటే ముందే మేల్కొని మేనా తలుపులు తీయడం పవార్ కి దినచర్య. ఆరోజు ఉదయం పవార్ మరియు అతని కుటుంబం తిరుమల వెళ్ళాలని నిశ్చయించుకొన్నారు. 


రోజూలాగే అరోజు కూడా మేనా తలుపులు తీసి ఉదయం చెయ్యవలసిన పనులన్ని చేసి తిరుమలకు వెళ్దాము అనుకున్నాడు. తెల్లవారగానే మేనా తలుపులు తీసి లోపలికి చూసి స్థాణువై భక్తితో కన్నుల నీరు కరుతుండగా స్వామి వారికి సాష్టాంగం చేసి నమస్కరించాడు. అతనికి మేనాలో స్వామి వారికి బదులుగా కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీనివాసునిగా దర్శనమిచ్చారు. 


మహాస్వామి వారు తమ కరుణాపూరితమైన చూపులతో చూడగా, ఆ చూపులలో “నీకు తెలియదా నీ బాలాజి ఇక్కడే ఉన్నాడు అని” అన్నట్టు తోచింది పవార్ కు. కొద్దిసేపు పవార్ మౌనంగా ఉన్నాడు. చిన్నగా స్వామివారిని చూస్తూ, ”నేను వారితో తిరుమల వెళ్ళడం లేదు” అని చెప్పి తన దినచర్యకు ఉపక్రమించాడు.


పవార్ తన మనసులో “అన్నీ అందించగలిగే దేవుడు ఇక్కడ ఉండగా దేవునికోసం వేరేచోట వెదకడం ఎందుకు?” స్వామివారికి ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అనుగ్రహించాలో బాగా తెలుసు. వారు త్రికాలవేదులు, కాలాతీతులు.


#KanchiParamacharyaVaibhavam #Paramacharya

సమాజం లో మనిషి

 ఆత్మ విద్య మీ జన్మ రహస్యం- / ఆత్మ-మీ సొంత ఇల్లు, మీ శరీరం అద్దె ఇల్లు. ఆత్మ విద్య:

*Man is a social animal అన్నారు*...


*సమాజం లో మనిషి అంతర్భాగం.*

*సమాజం లేకపోతే మనిషి లేడు.*

*మనుషులు లేకుండా సమాజం లేదు*...


*ఎప్పుడూ సమాజాన్ని విమర్శించుకుంటూ పొతే*

*నీ మంచిని గుర్తించేవారు ఎవ్వరూ ఉండరు*...


*ఇతరులతో సంబంధం లేకుండా,*

*నేనొక్కడినే ఏదయినా సాధిస్తాను.*

*నేనొక్కడినే బతుకగలను అనుకుంటే అది భ్రమ.*...


*అందరితో కలిసిమెలిసి జీవించాల్సిన బాధ్యత మన అందరిదీ.*


*ఎవరో మారాలి అనుకునే ముందు,*

*మనం అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నామా లేదా అనేది ఆలోచించాలి*...


*మారదు లోకం అనుకునే ముందు,*

*మనం మారి ప్రయత్నం మొదలుపెడదాం*....


మన అభివృద్ధికి తల్లితండ్రులు,

తోడబుట్టిన వారు, తోడువచ్చిన వారు,

సమాజం అందరూ త్యాగాలు, ప్రోత్సాహం ఇస్తేనే ఈ స్థాయికి వచ్చాము...


*వారందరికీ కృతజ్నులమై ఉందాము*...


*అభివృద్ధికి అందరూ కారణమయితే*,

*నీ పతనానకి కారణం నువ్వే అవుతావు* ...


" #ఏంటో జనాలు వున్న time🕰️ వేస్ట్ చేసుకుంట... దేనికైనా time రావాలి అంటారు".ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి time ఎవ్వరి వెనకాలరాదూ time ఎవ్వరికోసం రాదూ మనమే time తో పాటు వెళ్ళాలి time పని time చేస్తుంది మనమే time వస్తుంది ani ఏమి చెయ్యకుండా time కోసం చూస్తున్నాం  time నమ్ముకోవద్దు మిమల్ని మీరు న్నముకోండి time 🕰️కన్నా ముందుకు వెళ్తారు🏃‍♂️

సంక్రాంతి వెనుక

 _*సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు*_


సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి... 


- పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట! 


- సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.

శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.


- కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు.

అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.


- సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.


- సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ అయిదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది._*సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు*_


సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి... 


- పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట! 


- సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.

శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.


- కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు.

అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.


- సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.


- సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ అయిదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.      *సేకరణ : - నిమ్మగడ్డ శ్రీధర్*

ఈ శ్వేత పత్రంపై

 ఈ శ్వేత పత్రంపై!....


పౌష్య మాసాన!

మకర రాశిలో!

భానుడి ప్రవేశకాలాన!

సంరంభంతో!

ఆరంభంగా!

విచ్చేసిందీ!

ఉత్తరాయణ పుణ్య కాలం!

పితృ దేవతలను స్మరించు కాలమై!

దేవతలకు అత్యంత ప్రీతి పాత్రమై!

విప్రులకు సైతం!

విరివిగా కూష్మాండముల దానమిడు కాలమై!

ముష్కురులంతా కుక్కుటముల కదనరంగములకంపు కాలమై!

గోవుల, వృషభములకు!

పూజ లిడు కాలమై!

పతంగుల ఎగరేసే కాలమై!

ముదితలు ముంగిట 

ముగ్గులిడి గొబ్బెమ్మల పెట్టు వేళ!

పుడమి లోని చెడు నంతా!

భోగి మంటల రూపంలో!

చలి కాచు కొను వేళ!

బసవడు గంగిరెద్దై!

మంచిని ఆహ్వానిస్తూ!

పండుగ పరమార్థాన్ని చాటుతూ!

ప్రతీ ముంగిటా నర్తించే వేళ!

దాసు హరి నామ కీర్తనలతో!

జగతిని రంజింప చేయు వేళ!

ఇల్లిల్లూ మామిడి తోరణాలతో!

ముస్తాబైన వేళ!

రైతన్న ఇంటికీ సస్య లక్ష్మి!

వేంచేసిన వేళ!

కొత్త బెల్లం,కొత్త బియ్యం, ముర్రు పాలతో!

కాసింత మురిపాలనూ రంగరించి పొంగలిని సేయు వేళ!

రాజన్న,రైతన్న, కార్మికులకే కాక!

దేశ ప్రజలందరికీ!

మూర్తి త్రయ సంకేతమై!

భోగి,సంక్రాంతి,కనుమల రూపంలో!

ఇమ్మహి సుభిక్షం చేయగ!

ముదమ్ కూరుస్తూ!

అంబరాన్నంటేలా!

ఈ సంబరాన్ని జరుపు కోండంటూ!

నా మది ముంగిట నిలిచి!

రస హృదయులైన!

మిమ్మందరి నీ!

మురిపించాలని!

ఈ శ్వేత పత్రంపై కవితై!

విచ్చే సిందీ! పౌష్య హేమంత!

మకర సంక్రాంతి లక్ష్మి!


ఎస్.ఎన్.మూర్తి. దోసపాటి.

సామర్లకోట.

9866631877

దేశ భక్తురాలు

 ’నీ తుపాకి గుండు గట్టిదో ,నా బోడి గుండు గట్టిదో తేల్చుకొందామా ‘’?అని సవాలువిసిరిన దేశ భక్తురాలు కోటమర్తి కనక మహాలక్ష్మమ్మ-


 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లోని గునుపూడి లో 30-9-1860 న వేలూరి లక్ష్మీ నారాయణ ,వెంకమ్మ దంపతులకు 14వ చివరి సంతానంగా కనక మహాలక్ష్మమ్మ పుట్టింది .తండ్రి సంస్కృత,ఆంధ్రాలలో మహా పండితుడైన శ్రోత్రియుడు ,పరమ చా౦దసుడు .యజ్ఞం చేసి సోమయాజి అయినవాడు .ఆయిదవ ఏటనే కూతుర్ని40ఏళ్ళ కోటమర్తి సూర్యనారాయణకు ఇచ్చి వివాహం చేశాడు .లోకజ్ఞానం లేని ఆ అమాయక పిల్ల పెళ్ళిలో పేచీలు పెడితే మొగుడే ఎత్తుకొని ఆడించి లాలించాడు .అగ్రహారీకుడు సిరి సంపదలతో తులతూగుతున్న భర్త, మామగార్ని మించిన పరమ ఛాందసుడు .కానీ మహా పండితుడు. ఆఇంట నిత్యం పురాణపఠనాలు,సత్కాలక్షేపాలు జరిగేవి .ఇవన్నీ వింటూ ఆమెకు రామాయణ భాగవత భారతాలు కొట్టిన పిండి అయ్యాయి. అన్నీ వాచో విధేయాలయ్యాయి .ధారణా శక్తి అమోఘం కనుక ఆమెకు రానిశ్లోకం పద్యం ఉండేవికావు .పుట్టింటి లోని సంగీతం వంటబట్టిపద్యాలు శ్లోకాలు రాగయుక్తంగా ,ఇంపుగా ,అనర్గళంగా పాడుతూ వినే వారిని మైమరపించేది .స్వయం గా పద్యాలు ,పాటలూ రాసి౦ది కూడా ..తనకు తెలిసిన విషయాలను సులభంగా అర్ధమయేట్లు కధలు గా చెబుతూ తగినట్లు పద్య శ్లోకాలుభావ గర్భితంగా పాడుతూ శ్రోతలను రంజింపజేసేది .30ఏళ్ళ వయసులో అయిదుగురు బిడ్డల తల్లి అయింది ,ఆరవ బిడ్డ పుట్టటానికి నెల రోజుల ముందే భర్త మరణించటం వలన వైధవ్యం ప్రాప్తించింది . పుట్టింటికి భీమవరం చేరింది .కాని పుట్టింట్లో ఆదరణ లభించకపోవటం వలన ఆమె అహం దెబ్బతిని ,తనమనసులోని అభ్యుదయభావాల వ్యాప్తికోసం భీమవరంలో దూరంగా ఒక కుటీరం నిర్మించుకొని అక్కడే నివాసమున్నది .పరమ ఛా౦దసులైన తన అత్తగారింట తన పిల్లలు పెరిగితే, వారికి అభి వృద్ధి ఉండదు అని గ్రహించి పిల్లలతో సహా కుటీరంలోనే ఉన్నది .ఆమెకున్న వివేచనా శక్తి ,పాండిత్య ప్రకర్ష ,పురాణ ఇతిహాసాలపై ఉన్న అద్భుతమైన పట్టు ,ధర్మ బోధనా పటిమ ,ధైర్యం నిస్సంకోచంగా చెప్పి ఒప్పించగల నేర్పు గమనించిన ఆవూరి క్షత్రియ స్త్రీలు ఆమెకు పరమ ఆత్మీయులయ్యారు .ఆమెను గురుభావంతో అత్య౦త గౌరవంగా చూస్తూ అన్నిట్లోనూ సహాయ సహకారాలు అందించి ఆదరించారు .కనకమ్మ గారికి అక్కడ ఏ లోటూ లేదు .


  సంఘ సంస్కరణ పట్ల ,రాజకీయాలపట్ల ఆసక్తి చూపి అంకితభావంతో పని చేసింది .క్షణం తీరికలేకుండా మాట్లాడుతున్నా ,నడుస్తున్నా తకిలీతో నూలు తీస్తూనే ఉండేది.తాను ఖద్దరు ధరించి అందరి చేతాధరి౦పజేస్తూ ,ఇంటింటికీ తిరిగి ఖద్దరు వస్త్రాలు అమ్మి ఖద్దరు వ్యాప్తికి విశేష కృషి చేసింది .స్వదేశీయ వస్తువులనే వాడింది .పిల్లలకూ అవే అలవాట్లు నేర్పించి ,జాతీయభావాలతో పెంచి ఉత్తమ పౌరులుగా బాధ్యతగల వ్యక్తులుగా తీర్చి దిద్దింది .తన తండ్రి యజ్ఞం చేసిన భీమవరం లోనే ఆమె కాంగ్రెస్ పెద్దలను ,హరిజనులను ఆహ్వానించి కొడుకు ,కోడలు చేత సత్యనారాయణ వ్రతం జరిపించి౦ది.హరిజన వాడలకు వెళ్లి అక్కడిపిల్లలకు స్నానాలు చేయించి , వాళ్ళ ఇళ్ళను శుభ్రపరచి ఆరోగ్యానికి శుభ్రత ఎంత అవసరమో నేర్పించేది .ఒకసారి ఆమెరైలులో ప్రయాణం చేస్తుంటే ఒక నిండు చూలాలైన హరిజన స్త్రీకి పురుటి నొప్పులు రావటం చూసి ,పక్క స్టేషన్ లో ఆమెను దింపి ,తాను కట్టుకొన్న బట్టనే ఆవరణగా చేసి ఆమెకు పురుడు పోసింది .నిజమైన సాంఘిక సేవకు ఇంతకంటే ఉత్తమ ఆచరణ ఎక్కడ ఉంది ?.


  కనకమహాలక్ష్మి సేవానిరతి ,నిర్మాణ కార్యక్రమాలపట్ల ఆపేక్ష ,స్వాతంత్రేచ్చ ,నిరర్గళ అమోఘ వాగ్దోరణి గమనించిన కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ ఉద్యమ ,ప్రచార బాధ్యతలను ఆమెకు అప్పగించారు .ముఖ్య ప్రబోధకురాలిగా ప్రచారకురాలిగా చేశారు .ప్రచార కార్యక్రమం లో ఆమె రాత్రనక పగలనక తిరిగింది తాను స్త్రీ అనే విషయమే మర్చిపోయింది .ఆమె ప్రసంగాలకు ప్రజలు ఉత్తేజితులయే వారు.’’రెండవ బార్డోలి ‘’గా ప్రసిద్ధి చెందిన భీమవరం లో ,వేలాది స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొనటానికి ,కాంగ్రెస్ కు ఆర్ధిక బలం చేకూరటానికి ఆమె ప్రచార ప్రబోదాలే ముఖ్యకారణం .అందుకే పోలీసు వ్యవస్థ ఆమెను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు .కానీ వాళ్ళు అనుకొన్న సమయం లో వారికి కనిపించేదికాదు అవాక్కయ్యేవారు .కనిపించినట్లే కనిపింఛి మాయమయ్యేది. ఒక సారి నిండు చూలాలైన తన కూతుర్ని పురిటికి మేనాలో అక్కగారింటికి తీసుకు వెడుతుంటే పోలీసులు ఆమెను అటకాయించారు .అప్పుడు ఆమె తాను కనకమ్మ కాదని ,కూతురు పురిటికి కనకమ్మ తప్పక వస్తుందని చెప్పగా ,పోలీసులు నమ్మి ఇంటిముందు కాపలా కాశారు .లోపల పురుడురావటం బిడ్డపుట్టటం జరిగిపోయాయి కాని కనకమ్మ వాళ్లకు కనిపించనే లేదు .ఆమె తమ చెవిలో పెద్ద కాబేజీ పువ్వే పెట్టిందని ఆలస్యంగా గ్రహించారు .ఎన్నో సార్లు ఇలా పోలీసుల కళ్ళు కప్పి తిరిగింది .కాంగ్రెస్ నాయకులే ఆమె ప్రతిభకు ఆశ్చర్య పోయేవారు ..1930జూన్ 10న ,1931 ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నందుకు అరెస్ట్ చేసి రాయవెల్లూరు రెండవసారి జైలుకు పంపారు .రెండవ ప్రపంచ యుద్ధ సమయం లో ప్రజలు ఐచ్చికంగా నిరసన ప్రదర్శనలు,సత్యాగ్రహాలు చేశారు .అప్పుడు మూడవ సారి ఆమెను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు .నాల్గవసారి 1941వ్యక్తి సత్యాగ్రహం లో పాల్గొని జైలుపాలయ్యారు .సుమారు అయిదేళ్ళు ఆమె రాయవెల్లూరు, బళ్ళారి కర్నూలు జిల్లాలో కారాగార వాస శిక్ష అనుభవించిన వీర ,ధీర దేశ భక్తురాలు .అపక్వ ఆహారమే తినేది .నానబోసిన పెసలు సెనగలు ,ఇంటినుంచి వచ్చిన పళ్ళుమాత్రమే ఆహారం .గోవి౦దనామాలు హుషారుగా పాడుతూ పాడిస్తూ జైలు అంతాతిరిగేది .పురాణకాలక్షేపలు హరికథలతో అందర్నీ అలరించి హాయి కూర్చేది .కరడుగట్టిన పగ ద్వేషం కోపం తాపం ,అసూయ ఉన్న జైలును నవ్వులతో చతురోక్తులతో భక్తిభావ ,ఆధ్యాత్మిక బోధనలతో చిరునవ్వుల పందిరిగా చేసి ఖైదీలలో నిస్తేజం నిరాశా నిస్పృహ లను పోగొట్టేది .జైలు అధికారులకూ ఆమె అంటే మహా పవిత్రభావం ఉండేది .వారితో మాట్లాడుతూ చకచకా పచారులు చేస్తూ తకిలీపై నూలు వడుకుతూ ఒక్క క్షణం కూడా వృధా చేసేదికాదు.


  1928నుంచి 1942వరకు కనకమ్మ ఉద్ధృతంగా రాజకీయంలో పాల్గొన్నది .ఒకసారి 1930 జూన్ 10న సాయంత్రం 7 గం.లకు భీమవరం తాలూకా శృంగ వృక్షం లో కలిదిండి వెంకటరామరాజు గారింటి ముందున్న పెద్ద ఖాళీ స్థలం లో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు .స్థానికులేకాక చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలూ కనకమ్మ గారి ఉపన్యాసం వినటానికి తండోప తండాలుగా వచ్చేశారు .అప్పటికి ఆమె వయస్సు .50.వితంతువు .తెల్లని ఖాదీ వస్త్రం ధరించి బోడిగుండుపై ముసుగుకప్పుకొని ఉపన్యాసం ఇవ్వటానికి వేదిక ఎక్కింది .ఆమె మాట్లాడుతున్నా పాటలు పాడుతున్నా శ్లోకాలు ,పద్యాలు పాడుతున్నా ఒక సంగీత కచేరీ లా ఉండేది .శ్రోతలుమైమరచి తన్మయులై వింటున్నారు .అక్కడ చేరిన అసంఖ్యాక జనాన్ని చూసి ఉత్తేజితురాలై పొంగిపోయింది .పోలీసులు జీపు లతో వచ్చి మోహరించారు .ఇద్దరుముగ్గురు పోలీసు జవాన్లతో,ఒక పోలీసు అధికారి ,వేదిక దగ్గరకు రాగా ,అక్కడే ముందు వరుసలో కూర్చున్న సుప్రసిద్ధ జాతీయవాదీ ,ప్రముఖ లాయరు శ్రీ ముష్టి లక్ష్మీ నారాయణ గౌరవంగా లేచినిలబడి ‘’అయ్యా నమస్కారం కనకమ్మ గారి ఉపన్యాసంమహా రసవత్తరంగా సాగుతోంది .ఇలాసభలు ఏర్పాటు చేసుకొని భావాలు వెలిలిబుచ్చుకొనే ఒక్కటేఇప్పుదు ఈప్రభుత్వం లో ఉన్న ప్రజా స్వేచ్చ .మీరు ఆస్వేచ్ఛ ను అరికట్టకండి .ఉపన్యాసమవగానే మీ విధి నిర్వహణ మీరు చేయండి ‘’అని చెప్పి ఒక కుర్చీ తెప్పించి ఆఫీసర్ ను కూర్చోబెట్టారు .కనకమహాలక్ష్మి స్వరాన్ని మరింతపె౦చి ‘’అయ్యా !మీరంతా భారత మాతను దాస్యం నుంచి తప్పించటానికి కంకణం కట్టుకొన్న భారత వీరులు .ఈ పోలీసుల్ని చూసి బెదిరి పోకండి .వాళ్ళూ మన సోదరులే .పొట్టకూటికోసం పిరికిగా పరులకు దాస్యం చేస్తున్నారు .అలాంటి వారి పిస్తోలు గుండ్లకు పిసరంతకూడా పస ఉండదు .ఏమయ్యా ఇన్స్పెక్టర్ బాబూ ! నీ తుపాకి గుండు గట్టిదో ,నా బోడి గుండు గట్టిదో చూస్తావా “’అని సవాలు విసిరి ,నెత్తిమీది ముసుగు తీసి, తలకాయ వంచి నిలబడింది .క్షణాలలో జనం భారత మాతాకు జై గాంధీ మహాత్మునికీ జై ,కోటమర్తి కనకమ్మ గారికీ జై అంటూ దిక్కులు పిక్కటిల్లెట్లుగా అంటూ మైదానం అంతా మారుమోగేట్లు స్పందించారు .ఉపన్యాసం అవగానే ఆమెను అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళారు ఇలాంటి సంఘటనలు ఆమె జీవితకాలం లో చాలా జరిగాయి .


  ఎట్టకేలకు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది .స్వాతంత్ర సమరభావనానికి రాళ్ళు ఎత్తిన కూలీలను కాంగ్రెస్ పాలకులు మర్చిపోయారు .అలాగే కనకమ్మగారినీ పక్కన పెట్టేశారు .అయినా ఆమె ఊరుకోలేదు ఆంధ్రరాష్ట్ర ఉ ద్యమం లో చురుకుగా పాల్గొన్నది .స్వామి సీతారాం 1952లో భీమవరం లో 7రోజులు సత్యాగ్రహ శిబిరం నిర్వహిస్తే ,పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా ఏడు రోజులు కఠిన ఉపవాసం చేసింది .ఆంధ్రరాష్ట్రం విషయం అధిష్టాన వర్గం నాయకులతో మాట్లాడటానికి ఆ వృద్ధ నారి ఢిల్లీ వెళ్ళి మంతనాలు జరిపింది .


 జీవితాన్ని పరమ శాంతంగా తన కుటీరంలోనే సాధారణంగా గడిపింది ఆ అసాధారణ దేశ భక్తురాలు .12-1-1962న ఆ ధీరోదాత్త దేశభక్తురాలు శ్రీమతి కోటమర్తి కనకమహా లక్ష్మమ్మశతాధిక ఆయుస్సుతో జీవించి 102 ఏట పరమ పదించింది . .


 గబ్బిట దుర్గా ప్రసాద్-7-1-23-ఉయ్యూరు  


 


--


గబ్బిట దుర్గా ప్రసాద్

http://sarasabharati.wordpress.com

http://sarasabharativuyyuru.wordpress.com

ఉత్తరాయణ పుణ్యకాలం

 శ్లోకం:☝️

*అగ్నిజ్యోతిరహః శుక్లః*

  *షణ్మాస ఉత్తరాయణం l*

*తత్ర ప్రయాతా గచ్ఛంతి*

  *బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ll*


భావం: ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు శుక్ల మార్గంలో పయనిస్తాడు. శుక్ల మార్గం అంటే సూర్యకాంతి సమృద్ధిగా ఉన్న మార్గం. సూర్యుని తేజస్సు ఉత్తరాయణంలో క్రమంగా వృద్ధి చెందుతుంది. మానవులు ఎప్పుడూ సులభమైన మార్గంలో ప్రయాణించాలనుకుంటారు. దానికి శుభప్రదమైన ఉత్తరాయణం శ్రేయస్కరం.


*అందరికీ భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు!*🪁🎋🌾