3, ఏప్రిల్ 2024, బుధవారం

చుట్టరికాలు

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 అమ్మ..నాన్న..అని తెలుగులో పిలుచుకొంటే ఉండే ఆ మమకారం, ఆప్యాయత మామ్, డాడ్ అంటే వస్తాయా? అక్క, బావ, మేనత్త, మేనమామ, పిన్ని, బాబయ్య వంటి అద్భుతమైన బాంధవ్యాలు అంకుల్, ఆంటీ అంటే వస్తాయా? తెలుగులో పిలిచే చుట్టరికాలు ఇంగ్లీషు లో గాని, ఇతర భాషల్లో గాని దొరుకుతాయా? అందుకే మన తెలుగుని, మన చుట్టరికాలను మరచిపోకూడదంటున్నారు ప్రముఖ రచయిత్రి డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*03-04-2024 / బుధవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. సంతానం విద్యా విషయాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం


సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతనకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. 

---------------------------------------

మిధునం


ధన వ్యవహారాలు  ఒడిదుడుకుగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారుతాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. దూరప్రయాణం సూచనలుఉన్నవి. ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి. దైవ  చింతన పెరుగుతుంది.

---------------------------------------

కర్కాటకం


 ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహ  పరుస్తుంది. సోదరులతో సమన్వయం లోపిస్తుంది.

---------------------------------------

సింహం


సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. రావలసిన ధనం సమయానికి అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు పొందుతారు.

---------------------------------------

కన్య


 కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులతో  శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

---------------------------------------

తుల


ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా రుణ ప్రయత్నాలు కలసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు ఉంటాయి. నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

---------------------------------------

వృశ్చికం



ధన వ్యయ సూచనలు ఉన్నవి.స్థిరాస్తి వివాదాలలో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ  పూర్తి కావు.

---------------------------------------

ధనస్సు


వాహన  కొనుగోలుకు ఆటంకాలు  తొలగుతాయి. వ్యాపారం  పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు.

---------------------------------------

మకరం


దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులెదురవుతాయి. ఆరోగ్య విషయంలో  వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు.  పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.  వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది.

---------------------------------------

కుంభం


నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారంతో సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలు పరిచి విజయం సాధిస్తారు.

---------------------------------------

మీనం


ఆకస్మిక  ప్రయాణం సూచనలు ఉన్నవి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సమాజంలో  కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

*ఆ పై కోర్టు*

 *ఆ పై కోర్టు* - *The Ultimate Court*


కొన్నేళ్ల క్రితం, జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, ఒడిశాలో పూరీలోగల న్యాయ కళాశాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడ్డారు. అయన కాలేజీ ఫంక్షన్‌కి వెళ్లే ముందు రోజు పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్లాడు.


జగన్నాథుని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా, సింహద్వారం దగ్గర ఎవరో "రంగనాథ్ బాబు" అని చాలాసార్లు పిలవడం విన్నారు. ఇంత పెద్ద స్వరంతో తనని ఎవరు పిలుస్తున్నారు! అది కూడా గుడి ద్వారం దగ్గర! అది తననేనా లేక ఇంకెవరినైనా పిలుస్తున్నారా అని ఆశ్చర్యపోతూ, సందిగ్ధంలో వెనక్కి తిరిగి చూడగా, కుష్టు రోగియైన ఒక బిచ్చగాడు కనిపించాడు. అతని శరీరం అంతా గాయాలు మరియు చేతులు, కాళ్ళకు కట్టులతో అతనిని పిలుస్తున్నాడు.


మీరు ఎవరు, నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని జస్టిస్ మిశ్రా ప్రశ్నించారు. అప్పుడు కుష్టు రోగి అతనితో, "అయ్యా, మీరు నన్ను గుర్తుపట్టలేదా?

నేను కొన్ని సంవత్సరాల క్రితం పేరుమోసిన కులియా డాకు(బందిపోటు)ని, మీరు ఒడిషా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను మీ క్లయింట్‌ని. దోపిడీ మరియు హత్య కేసులో దిగువ కోర్టు నాకు జీవితకాల కఠిన శిక్ష విధించింది. కానీ మీరు ఒడిశా హైకోర్టులో నాకు అనుకూలంగా వాదించి, నాకు ఎలాంటి శిక్ష పడకుండా విడుదల చేయించారు. కానీ సార్ నిజానికి నేను నిందితుడిని, ఆ వ్యక్తిని హత్య చేసి డబ్బు మరియు బంగారం దోచుకెళ్లాను. అదేవిధంగా ఇతర కేసుల్లో కూడా నేను ఎలాంటి శిక్ష లేకుండా విడుదలయ్యాను.


అతను కొనసాగించాడు, "సర్ నేను మానవుల కోర్టు నుండి ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛను పొందాను. కానీ సార్ నిజానికి నేను నిందితుడిని, ఆ వ్యక్తిని హత్య చేసి డబ్బు, బంగారం దోచుకెళ్లాను. అదే విధంగా ఇతర కేసుల్లో కూడా నేను ఎలాంటి శిక్ష లేకుండా విడుదలయ్యాను." అయ్యా నేను మానవుల కోర్టు ద్వారా స్వేచ్ఛ పొందాను, కానీ ఆ సర్వశక్తిమంతుడి కోర్టులో నేను తీవ్రంగా శిక్షించబడ్డాను, నా శరీరం అంతా కుష్టువ్యాధి వచ్చి, అవయవాలను కోల్పోయాను. నా బంధువులు నన్ను అసహ్యించుకుని గ్రామం నుండి వెళ్లగొట్టారు. నేను రోడ్డు మీద పాకుతూ ఆహారం కోసం అందరినీ వేడుకుంటున్నాను. గుడి ద్వారం దగ్గర అప్పుడప్పుడూ ఎవరైనా భోజనం పెడతారు, లేకుంటే నేను ఆహారం తీసుకోకుండా అలాగే ఉంటాను.

అది విన్న జస్టిస్ మిశ్రా బరువెక్కిన హృదయంతో వంద రూపాయల నోటు ఇచ్చి మౌనంగా వెళ్లిపోయారు.


లా కాలేజీ ఫంక్షన్‌లో జస్టిస్ మిశ్రా కన్నీళ్లతో ఈ వాస్తవ సంఘటనను వివరించారు. మేము మా *తెలివితేటలు ఉపయోగించి, ఎవరినైనా విడిపించడానికి లేదా శిక్షించడానికి వాదిస్తాము. కానీ పైన ఇంకొక ఉన్నత న్యాయస్థానం ఉంది, అందులో తెలివితేటలు పని చేయవు, మరియు దోషులు తప్పించుకోలేరు. దోషికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది.*  


 *అదే కర్మ యొక్క చట్టం (Law of Karma)*


ప్రస్తుత పరిస్థితుల్లో, మన రాష్ట్రంలో, దేశంలో, రాజకీయ నాయకులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అధికారం కారణంగా చట్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీల మద్దతుతో, తమపై ఆరోపించబడిన (తీవ్రమైన నేరారోపణలతో సహా) కేసుల నుండి, చట్టం నుండి, న్యాయప్రక్రియ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.


కానీ ఏ ఒక్కరు కర్మ యొక్క చట్టం (Law of Karma) నుండి తప్పించుకోలేరు. 🙏🙏🙏