28, డిసెంబర్ 2023, గురువారం

Stopping a heavy ship🚢


 

Fort


 

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


రాజుగారి వాయువేగాన్ని అందుకోలేక బాగా వెనకబడింది.

రాజుమాత్రం ధనుస్సు ఎక్కు పెట్టి దాన్ని వెంబడిస్తూ ఘోరారణ్యంలోకి చేరుకున్నాడు. సూర్యుడు

నడినెత్తిమీద నిప్పులు చెరుగుతున్నాడు. గుర్రం అలిసిపోయింది. రాజుగారికి దాహమయ్యింది. గొంతు

ఎండిపోయింది 

ఉన్నట్టుండి భీకరసూకరం మాయమయ్యింది. మహారాజుకు ఒక్కసారిగా వొళ్ళు జలదరించింది.

ఇదేదో మహామాయ అనుకున్నాడు. దారీ తెన్నూలేని కీకారణ్యంలో చిక్కుకున్నాడు. ఒంటరిగా నిలబడ్డారు.

ఏమి చెయ్యాలో తోచలేదు.

అల్లంత దూరంనుంచి జలపక్షులు కలకూజితాలు వినిపించాయి. అటువైపు వెళ్ళాడు.

నిర్మలోదకాలతో ప్రవహిస్తున్న చిన్న నది కనిపించింది. హమ్మయ్య అనుకున్నాడు. గుర్రానికి నీళ్ళు తాపే

తానిన్ని త్రాగాడు. ముఖం తడుపుకున్నాడు. కాసేపు విశ్రమించాడు. ఇక రాజధానికి పోదామనుకున్నాడు.

అంతలో

వృద్ధబ్రాహ్మణ రూపంలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. హరిశ్చంద్రుడు సవినయంగా 

నమస్కరించాడు. విప్రుడు ఆశీర్వదించాడు. మహారాజా ! నీకు స్వస్తి అగుగాక! ఈ అరణ్యంలోకి

ఒంటరిగా ఎందుకు వచ్చినట్టో? నిజం చెప్పు అని ప్రశ్నించాడు.

బ్రాహ్మణోత్తమా ! ఒక మహాసూకరం మా రాజధానికి వచ్చి ఉద్యానవనాన్ని ధ్వంసం చేసింది.

దాన్ని తరుముకుంటూ వచ్చాను. ఉన్నట్టుండి అది కనుమరుగయ్యింది. అంతా మాయగా ఉంది. నా

సైన్యం - వెనక ఎక్కడో చిక్కుపడింది. దాహం వేసి ఈ నది దగ్గరికి వచ్చాను. ఈ అడవిలోంచి బయటపడే


కారి తెలియడం లేదు. ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ నిలబడ్డాను. అంతలోకీ భాగ్యవశాత్తూ తమ

దర్శనమయ్యింది. రాజధానికి చేరుకు

దారి చెప్పండి. నేను హరిశ్చంద్రుణ్ణి. అయోధ్యాధిపతిని.

రాజసూయం చేసినవాడిని. విప్రులకూ విద్వాంసులకూ వాంఛితార్థాలు తీర్చినవాడిని. మీరుకూడా ఏదైనా

యజ్ఞం చేసుకోదలుచుకుంటే పుష్కలంగా ధనం ఇస్తాను. ఒకసారి మా అయోధ్యకు దయచేయండి.అనిచెప్పాడు

శ్రీరామ స్తుతి

 🌸శ్రీరామ స్తుతి🙏


పట్టాభిరామ ! నీపావననామమ్ము

    తలచిన జన్మంబు ధన్యమగును

కోదండరఘురామ ! కోర్కెలు తీర్చుమా 

   కోసలాధీశుడా ! కోరి కొలుతు

జనకునిజామాత ! జానకీ ప్రాణేశ !

   జగమేలు జగదీశ ! జయము జయము

సకలలోకములకు సంరక్ష  సర్వజ్ఞ

   సజ్జనసేవిత సాధుశీల

తే.రమ్ము మముకావ రఘు నాథ !  రమ్య దేహ !

ధర్మ పాలన చేసిన ధర్మవీర !

పరమపావన రఘు వంశి ! పరమపురుష !

దశరథాత్మజ ! రఘువీర ! ధర్మ తేజ


జయలక్ష్మి

కర్మలను గాక

 🌸 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 🌸


శ్లో𝕝𝕝 

*న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః౹*

*యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే॥*


*_శ్రీమద్ భగవద్గీత_  _అష్టాదశోధ్యాయః_*

*_మోక్షసన్యాస యోగః_*


తా𝕝𝕝 ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగ త్యజించుట సాధ్యముకాదు.... కావున కర్మలను గాక కర్మఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని చెప్పబడుచున్నాడు.....

28-12-2023 / గురువారం / రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️

 •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*28-12-2023 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి.

---------------------------------------

వృషభం


నిరుద్యోగుల యత్నాలు సఫలమౌతాయి. మిత్రులతో విందువినోద  కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.  వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు.

---------------------------------------

మిధునం


చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో  మాటపట్టింపులు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.  ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

---------------------------------------

కర్కాటకం


వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

---------------------------------------

సింహం


వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన  వ్యవహారాలలో  కొద్దిపాటి ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

---------------------------------------

కన్య


కుటుంబ సభ్యులతో  దైవదర్శనాలు చేసుకుంటారు. నూతనోత్సాహంతో  కొన్ని పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

---------------------------------------

తుల


వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. రాజకీయ ప్రముఖుల నుండి  సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

---------------------------------------

వృశ్చికం


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

---------------------------------------

ధనస్సు


వృత్తి, వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.   స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసి రావు. సోదరులతో ఆస్తి   విషయంలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆలయ సందర్శనం చేసుకుంటారు.

---------------------------------------

మకరం


వ్యాపారాలు విస్తరణ  ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

---------------------------------------

కుంభం


వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు  తొలగుతాయి. చాలా కాలంగా పూర్తికాని  పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం  సేకరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

మీనం


పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  ముఖ్యమైన  పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

Jokes


















 

Panchang


 

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*ప్రథమ స్కంధము*


*జలజాతాక్షుడు చూడ నొప్పె ధవళచ్ఛత్రంబుతో, చామరం*

*బులతో, పుష్పపిశంగచేలములతో, భూషామణిస్ఫీతుడై*

*నలినీబాంధవుతో, శశిద్వయముతో, నక్షత్ర సంఘంబుతో*

*బలభిచ్చాపముతో తటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్.*


నల్లనివాడు, పద్మనయనంబులవాడు అయిన శ్రీకృష్ణుడు ద్వారకలో ఊరేగింపుగా మెలమెల్లగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ కదలుతున్నాడు. పైన తెల్లని గొడుగు. అటు ఇటూ వింజామరలు. పూవులుకుట్టిన పచ్చనికాంతితో కనులపండుగ చేస్తున్న కమనీయ వస్త్రాలు. నిలువెల్లా పెక్కుతీరులైన బంగారంలో పొదిగిన వజ్రాలు వైడూర్యాలు మొదలైనవి కల నగలు. ఆహా! ఎంత మనోహరరూపం. ఆయనను చూచి పైకి అలా భావనతో చూస్తే ఒక నల్లని మేఘం. ఇక్కడి గొడుగు ఆ మేఘం మీద వెలుగుల కుప్పలతో కప్పుచున్న సూర్యుణ్ణి తలపింపజేస్తున్నది. చామరాలు రెండు చందమామలలా ఉన్నాయి. నగలు నక్షత్రాలలాగా మెరిసిపోతున్నాయి. ఆభరణాలు ఇంద్రధనుస్సులాగా విరాజిల్లుతున్నాయి. మణులు మెరుపుతీగలను స్ఫురింపజేస్తున్నాయి.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

అనులోమ విలోమ చిత్రము !

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి పోస్ట్* 

                  🌷🌷🌷

శు  భో   ద   యం !!🙏


అనులోమ విలోమ చిత్రము !!


             కం:  " తా  వినువారికి  సరవిగ


                            భావనతో   నాను  నతి  విభావి  సుతేజా


                            దేవర   గౌరవ  మహిమన 


                           మా  వలసిన  కవిత  మరగి  మాకు నధీశా!" 


                  కళాపూర్ణోదయం--6  ఆ : 172 పద్యము-- పింగళి  సూరన.


                                ఈపద్యం  మొదటినుండి చదివితే  తెలుగు పద్యము.  చివరినుండి చదివిన సఁస్కృత  శ్లోకనము. అనులోమ విలోమమున  భాషాద్వయ  సమ్మేళనం. అదేచిత్ర కవిత! 


        తెలుగుపద్యమునకు అర్ధము:-  అతి విభావి సుతేజా--మిక్కిలి ప్రకాశించు పరాక్రమముగల; అధీశా!--ఓరాజా-;దేవర గౌరవ మహిమన-- ఏలిన వారి గొపిపతనములవననే ;(మహిమవలన)  మావలసినృకవిత-- మాకుప్రియమైనకవిత్వము; తాన్--అది; వినువారికిన్-- శ్రోతలకు; సరవిగన్--తగురీతిగా ; భావనతోన్--తలచినంతనే; మాకున్ మరగి--మాకుస్వాధీనమై; ఆనున్-- భాసిల్లును.;


           భావము:- రాజా! ఆశ్రయ దాతలైన  తమ మహిమాతి శయముచేతనే  శ్రోతల కానందమును గూర్చు యీకవిత మాకు వశవర్తినియై  మెఱుగారు చున్నది.


                                  ఈపద్యమును తుదినుండి చదివిన సంస్కృత శ్లోకమగును.


               శ్లో:   శాధీన  కుమా  గిరిసుత


                    వికనసి  లవమాన  మహిమ  వర  గౌరవ  దే


                   జాతే  సువిభా  వితి  నను


                    నాతో   నవ  భాగ   విరసకరి  నా  ను  వితా. 


              పదవిభాగము:-  శాధి ,ఇన ,కుమ్ , అగిరి ,మత , వికనసి , లవమాన , మహమ వర గౌరవదే ,జాతే , సు విభౌ , ఇతి ,నను , నా ,అతః నవ భాః ,గవి ,విరసకరి , వా, అనువితా;    


                అర్ధము:  ఇన--ఓరాజా!--  ఆగిరి-పర్వతములున్నంతవరకు ; కుమ్--భూమిని ; శాధి-- ఏలుము; మత--సర్వసమ్మతుడా;

వికనసి--మిక్కిలి కీర్తిచే విరాజిల్లు చున్నాడవు ; లవమాన;- లవుని వలెమానవంతుడవగు ;నను -ఓరాజా! ;మహిమ వరగౌరవ దే--గొప్పదనముచే  మిగుల గౌరవ మొసంగు ; సువిభౌ--నీవంటి ప్రభువు; ఇతి--ఈరీతి ;_ జాతే - ఉండగా ;నా-మనుజుడు (పండితుడు) 

అతః -ఇట్చిగౌరవమువలన : నవభా--నూతన వికాసము గలవాడై  ; రసకిరి-- నవ రసములను వెదజల్లు; గవి- భాషయందు ; అనువితా నా? --స్తుతింప బడకుండునా? 


              భావము:-  ఓరాజా! ధరలో గిరులున్నంత కాలము నీయిల నేలుము. శ్రీరామ కుమారుడైన లవుని వంటి ఘనుడా! గౌరవాదరములను జూపు  నీవంటి మహా ప్రభువును జూచినంతనే  సత్కవులు నూతనోత్సాహులై  పలుకుల రసములు గురియ

నిను వర్ణన సేయకుందురా?  నిను జూడగనే స్వాెభావికముగనే  కవితలు పొంగును.


                 నాటి ప్రబంధ కవులలో  సూరన  ప్రతిభావంతుడు. ఉత్పాద్య ప్రబంథమని  నాడు కళాపూర్ణోదయమును  పండితులీసడించినా, ఆగామి కాలమున దానిని ప్రస్తుతించనివారు లేరు. ఇట్టి చిత్ర విచిత్రములకది పుట్టినిల్లు.తెలుగున పద్యరూపమగు తొలి నవలగా  దానిని  నేడు సంభావించుచున్నారు. ఆమహాకవికి అంజలి ఘటించుచు--                                                స్వస్తి!

🙏🙏👌🌷🌷🌷🌷🌷👌👌👌

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

              🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం  -‌ ద్వితీయ -  పునర్వసు  -‌ గురు వాసరే* *(28-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/HPHGKKx-Q5Y?si=xc9czaeL8HSYH51L


🙏🙏