28, డిసెంబర్ 2023, గురువారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


రాజుగారి వాయువేగాన్ని అందుకోలేక బాగా వెనకబడింది.

రాజుమాత్రం ధనుస్సు ఎక్కు పెట్టి దాన్ని వెంబడిస్తూ ఘోరారణ్యంలోకి చేరుకున్నాడు. సూర్యుడు

నడినెత్తిమీద నిప్పులు చెరుగుతున్నాడు. గుర్రం అలిసిపోయింది. రాజుగారికి దాహమయ్యింది. గొంతు

ఎండిపోయింది 

ఉన్నట్టుండి భీకరసూకరం మాయమయ్యింది. మహారాజుకు ఒక్కసారిగా వొళ్ళు జలదరించింది.

ఇదేదో మహామాయ అనుకున్నాడు. దారీ తెన్నూలేని కీకారణ్యంలో చిక్కుకున్నాడు. ఒంటరిగా నిలబడ్డారు.

ఏమి చెయ్యాలో తోచలేదు.

అల్లంత దూరంనుంచి జలపక్షులు కలకూజితాలు వినిపించాయి. అటువైపు వెళ్ళాడు.

నిర్మలోదకాలతో ప్రవహిస్తున్న చిన్న నది కనిపించింది. హమ్మయ్య అనుకున్నాడు. గుర్రానికి నీళ్ళు తాపే

తానిన్ని త్రాగాడు. ముఖం తడుపుకున్నాడు. కాసేపు విశ్రమించాడు. ఇక రాజధానికి పోదామనుకున్నాడు.

అంతలో

వృద్ధబ్రాహ్మణ రూపంలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. హరిశ్చంద్రుడు సవినయంగా 

నమస్కరించాడు. విప్రుడు ఆశీర్వదించాడు. మహారాజా ! నీకు స్వస్తి అగుగాక! ఈ అరణ్యంలోకి

ఒంటరిగా ఎందుకు వచ్చినట్టో? నిజం చెప్పు అని ప్రశ్నించాడు.

బ్రాహ్మణోత్తమా ! ఒక మహాసూకరం మా రాజధానికి వచ్చి ఉద్యానవనాన్ని ధ్వంసం చేసింది.

దాన్ని తరుముకుంటూ వచ్చాను. ఉన్నట్టుండి అది కనుమరుగయ్యింది. అంతా మాయగా ఉంది. నా

సైన్యం - వెనక ఎక్కడో చిక్కుపడింది. దాహం వేసి ఈ నది దగ్గరికి వచ్చాను. ఈ అడవిలోంచి బయటపడే


కారి తెలియడం లేదు. ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ నిలబడ్డాను. అంతలోకీ భాగ్యవశాత్తూ తమ

దర్శనమయ్యింది. రాజధానికి చేరుకు

దారి చెప్పండి. నేను హరిశ్చంద్రుణ్ణి. అయోధ్యాధిపతిని.

రాజసూయం చేసినవాడిని. విప్రులకూ విద్వాంసులకూ వాంఛితార్థాలు తీర్చినవాడిని. మీరుకూడా ఏదైనా

యజ్ఞం చేసుకోదలుచుకుంటే పుష్కలంగా ధనం ఇస్తాను. ఒకసారి మా అయోధ్యకు దయచేయండి.అనిచెప్పాడు

కామెంట్‌లు లేవు: