16, ఏప్రిల్ 2024, మంగళవారం

నాటకరంగ దినోత్సవం!

 ఈరోజుతెలుగు నాటకరంగ దినోత్సవం!


    తనదేహము, తనగేహము,

    తనకాలము తనధనమ్ము తనవిద్య జగ

    జ్జనులకు వినియోగించిన

    ఘనుడీ వీరేశలింగకవి జనులారా..!

         ఈరోజు నవయుగ వైతాళికుడు కందుకూరి పుట్టినరోజు,దాదాపు చాలామంది విస్మరించిన రోజు. జీవితమంతా స్త్రీవిద్యకోసం, స్త్రీపునర్వివాహంకోసం, స్త్రీజన సముధ్దరణకోసం, సాంఘికదురచారాల నిర్మూలనకోసం అహరహంశ్రమించిన కవితాయోధుడు కందుకూరి.

           కందుకూరి పుట్టినరోజు అయిన ఈరోజును అసలు తెలుగు నాటకరంగ దినోత్సవంగా ఎందుకు జరుపుకొంటున్నాం?

              తెలుగుసాహిత్యం పుట్టి వెయ్యేళ్ళు దాటింది కాని తెలుగు నాటకం పుట్టిమాత్రం 164 సంవత్సరాలే అయింది.తెలుగులో తొలినాటకం 1860లో శ్రీకోరాడ రామచంద్ర శాస్త్రిగారు రాసిన "మంజరీ మధుక రీయం". అయితే తొలిగా1880లో ప్రదర్శింపబడిన నాటకం మాత్రం కందుకూరివారి "వ్యవహారధర్మబోధిని". 

               కందుకూరి ఆంగ్ల,సంస్కృత నాటకాల్ని అనువదించారు. పౌరాణిక, సాంఘిక నాటకాల్ని రాసారు. వీరి శాకుంతలం అనువాదనాటకం ఆంధ్రదేశంలో పలుచోట్ల ప్రదర్శింపబడి మన్ననలు పొందింది.ఇక బ్రహ్మవివాహం నాటకం ఆనాటి సమాజాన్ని మిక్కిలి ప్రభావితం చేసింది. అతి బాల్యవివాహం, వృద్ధవివాహం, కన్యాశుల్కం వంటి సాంఘిక దురాచారాల్ని ఈనాటకంలో అధిక్షేపించడం జరిగింది.

                 నాటకం ప్రజలను ప్రభావితుల్ని చేసే ఒకశక్తివంతమైన సాధనం. అంతేకాదు అది జీవితవిమర్శ. సమాజంలో ప్రతిబింబించే మనుష్యుల మనః ప్రవృత్తులను, అడుగడుగునా మనకు ఎదురుపడే సామాజిక సమస్యలను రంగస్థలంపై ప్రదర్శించే నాటకంలో ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూడగల్గుతారు.

              నాటకం యొక్క ప్రయోజనం పఠనంకాదు, ప్రదర్శన. ప్రదర్శించినపుడే అది ప్రజలహృదయాల్లోకి సూటిగా ప్రవేశిస్తుంది. అలా నాటకాల్ని రచించి వదిలేయకుండా వాటిని తొలిసారి ప్రదర్శించే చొరవతీసుకొన్న గొప్ప ప్రయోక్త కందుకూరి.

                  సాంఘికనాటకాల్లో వ్యావహారిక భాషను ప్రవేశ పెట్టి, సమకాలీన సమాజాన్ని కధావస్తువుగా స్వీకరించి, తొలినాటక సమాజాన్ని స్థాపించి, తొలినాటక ( వ్యవహారధర్మబోధిని) ప్రదర్శనను నిర్వహించిన నాటకకర్త, ప్రయోక్త, కందుకూరే. అందుకే కందుకూరి పుట్టినరోజును తెలుగు నాటకరంగదినోత్సవంగా మనం జరుపుకొంటున్నాం..!

Panchaag


 

కాశీ యాత్ర ర (మొదటి భాగము)

 కాశీ యాత్ర (మొదటి భాగము)


ఈ ఏడు ఫెబ్రవరి నెలలో నేను నా శ్రీమతి కలసి రామేశ్వరము ఒక యాత్రికుల సమూహంతో బస్సులో వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని బస్సుకు టికెట్ల డబ్బులు కూడా కట్టి చివరి నిమిషంలో కారణాంతరాలవల్ల ప్రయాణాన్ని విరమించుకోవలసి వచ్చింది. ఈశ్వరుని అనుగ్రహం లేదు అని సరిపెట్టుకున్నాము. ఈ విషయంలో మేము వ్యాకులపడి ఉన్నామని తలంచి మా కుమారుడు మమ్ములను ఉత్సాహ పరచనెంచి గత మార్చి నెలలో వారణాశి ప్రయాణముకు విమాన టికెట్లు బుక్కు చేసినాడు. మా ప్రయాణం ఏప్రియల్ 4వ తారీకు రాత్రి 7-40 నిముషములకు హైదరాబాదు విమానాశ్రయం నుండి మొదలై 9వ తారీకు ఉదయం 9-15 నిముషములకు తిరిగి హైదరాబాదు విమానాశ్రయంలో చేరుకోవటంతో ముగుస్తుంది.


ప్రయాణ సన్నాహాలు: రోజులు గడుస్తున్నాయి అనుకున్న ఏప్రియల్ 4వ తారీకు రానే వచ్చింది. నాకు ఆ రోజుకూడా రాజేంద్రనగర్ కోర్టులో ఒక కేసు వున్నది. నా కుమారుడు అనుకున్న ప్రకారం రెండు రోజులముందే బెంగుళూరు నుండి వచ్చాడు. వచ్చిన వెంటనే ప్రయాణానికి ఏమేమి సామానులు తీసుకొని వెళ్ళాలి అని నా కుమారుడు, శ్రీమతి అనుకోని బ్యాగులు సర్దుకోవటం మొదలు పెట్టారు. నేను 4వ తారీకునాడు కోర్టుకు నా క్లయింటు కారులో వెళ్ళాను. అదృష్ట వశాత్తు మా జెడ్జిగారు సెలవులో వున్నారు. కేసు తొందరగా వాయిదా వేసుకొని 12 గంటలకల్లా ఇంటికి చేరుకొని నా బ్యాగు సర్దుకున్నాను. మేము అనుకున్న ప్రకారము సాయంత్రము 5 గంటలకు రాపిడో క్యాబు బుకు చేసుకున్నాము. ఒక పది నిముషములలో క్యాబు వచ్చింది. ఒక అర గంటలో మమ్ములను విమానాశ్రయంలో దింపాడు. క్యాబుకు 600 రూపాయలు అయ్యాయి. మేము ముందుగా నా ప్రింటరులో తీసుకున్న టికెట్ల ప్రింట్లను చూపించి విమానాశ్రయాయంలోకి ప్రేవేశించాము. తరువాత మా లగేజీలను తనిఖీచేసిన  ఆమెతో మేము మా లగేజీలను క్యాబిన్లో కాకుండా మా వెంట తీసుకొని వెళతాము అని అడుగగా దానికి ఆమె సరే అని అన్నది. మీ వెంట లగేజి తీసుకునే పక్షంలో టాగ్లు వేసుకోవలసిన అవసరము లేదు అని అన్నది. తరువాత అక్కడి మానెటరును చూసుకొని మేము గేటు నెం. 17 లో విమానాన్ని ఎక్కాలని తెలుసుకొని చెక్ ఇన్ ద్వారాన్ని దాటి వెళ్ళాము. చెకిన్ మనకు మన మనీపర్సు, మొబైలు ఫోనులు కూడా అక్కడి ట్రేలలో పెట్టి అక్కడి యంత్రంద్వారా తనికీ చేయపడ్డ తరువాత మాత్రమే తీసుకొనాలి. 


మాకు వారణాసి వెళ్ళటానికి ఇండిగో విమానంలో 45వ వరుసలో సీట్లు దొరికాయి. ఆ విమానంలో 7 కేజీల లగేజి మన వెంట మరియు 15 కేజీల లగేజి క్యాబిన్లో తీసుకొని వెళ్ళవచ్చు. గోళ్ళ రంగులు, రేజరులు, మండే పదార్ధాలు, సిగరెట్ లైటరులు, చాకులు, బ్లేడులు వెంట తీసుకోవటానికి అనుమతి ఉండదు.

హైదరాబాద్ లో చక్కటి విడిది*

 *హైదరాబాద్ లో చక్కటి విడిది*.. *రూ.200లకే...వసతి...*


*ముఖ్య గమనిక...Rs..."40"...వేలకే పెండ్లి మండపంతో పాటు "15" గదులు సకల హంగులతో కాచిగూడ తుల్జాభవన్‌...*


వైద్యం కోసమని రోగులు,సిటీ అందాలను చూసేందుకు పర్యాటకులు నిత్యం నగరానికి వస్తుంటారు. ఒక్కోసారి ఇక్కడే విడిది చేయాల్సి ఉంటుంది. లాడ్జిల్లో రూమ్స్‌ తీసుకుంటే.. ఆర్థిక భారం తప్పదు. ఒక్కరోజు ఉండాలన్నా.. ఎక్కువ మొత్తంలో రుసుము చెల్సించాల్సి వస్తుంది. ఇది పేదలు, సామాన్యులకు కొంత ఇబ్బందే. అలాంటి వారి కోసం ఇంటిని మరిపించేలా చక్కటి వసతి కల్పిస్తున్నది కాచిగూడలోని తుల్జాభవన్‌. తెలంగాణ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *ఈ భవన్‌లో నామమాత్రపు ధరతో అంటే నలుగురికి రోజుకు రూ. 200కే వసతి కల్పిస్తున్నారు.* 


ఇతర రాష్ట్రాల పర్యాటకులు..

నగరం నడిబొడ్డున ఉండటం, పార్కింగ్‌ రవాణా సౌకర్యం, తక్కువ చార్జీ ఉండటం వల్ల ఈ భవన్‌ మంచి ప్రాచుర్యం పొందింది. వివిధ రాష్ట్రాల నుంచి యాత్రికులు, వివిధ వైద్యశాలలకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులు నిత్యం ఇక్కడ బస చేస్తుంటారు. ఎక్కువగా ఏపీ, బెంగళూరు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ , పంజాబ్‌, కర్ణాటక, హర్యానా, గోవా తదితర రాష్ర్టాల నుంచి వచ్చే టూరిస్టులు ఇక్కడే విడిది చేస్తారు. అలా వచ్చే ఆదాయంతోనే భవనాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నారు. అయితే ఈ విడిది కేంద్రంలో తక్కువ చార్జీలతో సకల సౌకర్యాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా నగరానికి వచ్చే గ్రామీణ ప్రాంతాల వారికి ఈ భవనం గురించి తెలియకపోవడం వల్ల వసతి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. 


వివాహ వేడుకలకు.. 

శతాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనానికి కొత్త హంగులు సమకూర్చారు. మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. సకల సౌకర్యాలు కల్పించారు. టూరిస్టుల కోసం ప్రత్యేక వంటశాల గదిని నిర్మించారు. ప్రస్తుతం 18 గదులు అందుబాటులో ఉండగా, అన్నింటిల్లో బాత్‌రూంలను ఏర్పాటు చేశారు. ఇటీవలే పేదల సౌకర్యార్థ్ధం *తక్కువ ఖర్చుతో పెండ్లిళ్లు చేసుకోవడానికి టెంట్‌ సామాన్లు, 15 గదులను కేవలం రూ.40 వేల ప్యాకేజీతో ఇస్తుండటం విశేషం.*


ఆలయం.. గ్రంథాలయం.. 

ఈ తుల్జాభవన్‌లో పురాతన రామాలయం ఉంది. ఏటా *శ్రీరామనవమి వేడుకలు* వైభవంగా నిర్వహిస్తారు. ఇక యువత, నిరుద్యోగులు, పాఠకుల కోసం గ్రంథాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం పలు స్వచ్ఛంద సంస్థలు వైద్యశిబిరాలు నిర్వహిస్తుంటాయి.   


ఎంతో మేలు...

పేద, మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ఖర్చుతో *పెండ్లిండ్లు చేసుకోవడానికి కేవలం రూ.40 వేల ప్యాకేజీ ఇవ్వడం శుభసూచికం...* కొన్ని నెలలుగా మధ్యతరగతి ప్రజలు ఈ భవన్‌లో పెండ్లిళ్ల్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు బయట లాడ్జిలతో పొల్చితే ఇక్కడ *కేవలం రూ.200 చెల్లిస్తే నలుగురికి వసతి కల్పిస్తున్నారు...( తాటిపల్లి దేవయ్య )* 


అనేక సౌకర్యాలు అందుబాటులో..

నగరంలోని వివిధ ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులకు అందుబాటు ధరలో అంటే *నలుగురికి రోజుకు కేవలం రూ.200లకే తుల్జాభవన్‌లో వసతి కల్పిస్తున్నాం.* వివిధ పనుల కోసం వచ్చే పర్యాటకులు ఇక్కడ వసతి పొందడానికి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నగరం నడి బొడ్డున ఉండటం వల్ల ఇక్కడి నుంచి ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా ఉన్నది. *వసతి పొందాలనుకునే వారు -9491000687, 8309481306 నంబర్లలో సంప్రదించవచ్చు.* -ఎ.బాలాజీ( దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, కాచిగూడ తుల్జాభవన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌

శ్రీరామ స్తుతి

 🌸శ్రీరామ స్తుతి 🙏


సీ. సకల చరాచర సంరక్ష కుడవీవు

                రక్షించుమా నన్ను రామ భద్ర !

     సాకేతపురవాస ! సకల సద్గుణ శీల !

                సర్వజ్ఞ ! శ్రీరామ ! సత్య పాల !

     భరతాగ్రజా రామ ! పావన గుణ ధామ !

             మహనీయ చారిత్య్ర ! మధుర నామ!

     కుంభకర్ణాగ్రజుం గూల్చిన రఘువీర !

              నిత్య సత్య వ్రతా ! నిగమ వినుత !

తే.పతితపావన ! రఘురామ ! పరమపురుష !

    సతి యహల్యను బ్రోచిన సత్త్వరూప !

    భక్త పాలక ! శ్రీ రామ ! భాను విభవ !

    దశరథతనయ రఘురామ ! ధర్మతేజ !


         జయలక్ష్మి పిరాట్ల

ఊపిరి" ఉన్నంత వరకే.

 భగవద్గీత లో భగవానుడు చెప్పిన మాటలు

నా డబ్బు, నా పొలం, నా ఇల్లు, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా మనవడు, నా మనవరాలు ఇలా, నా, నా, నా, నా అనుకునేవి అన్నీ ఈ శరీరంలో "ఊపిరి" ఉన్నంత వరకే. ఒక్కసారి ఊపిరి ఆగి పోయిందో, ఈ శరీరాన్ని తీసుకుని వెళ్లి బొందల దొడ్డిలో పడేస్తారు. నా అనుకున్నవి ఏవీ "మన వెంట" రావు. వచ్చేది ఒక్కటే మనం మన జీవితంలో ఈ సమాజానికి చేసిన "మంచీ, చెడూ".

అవి ఈ "ఆత్మ" అనే శరీరాన్ని అంటి పెట్టుకొని ఉంటాయి. తెలిసి చేసినా, తెలియక చేసినా, అవి మనల్ని అంటిపెట్టుకుని నడుస్తూ మరో జన్మకు కారక మౌతాయి. అది మనిషి జన్మ కావచ్చు, జంతు జన్మ కావచ్చు, పురుగు జన్మ కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు. అయితే ఈ ఆత్మకు శరీరం మీద మమకారం చావక, ఊపిరి పోయిన తరువాత కూడా ఈ శరీరం వెంట పరుగులు పెడుతూ ఉంటుంది. ఈ శరీరాన్ని పాతి పెడితే అక్కడే తిరుగుతూ , మరో జన్మ పొందే వరకు ఆ శరీరం పరిసరాల్లో ఉంటుంది. బలహీనతను ఆసరాగా చేసుకుని మానవ శరీరాల్లో కి ప్రవేశించి ఇబ్బందులకు గురిచేస్తోంది. దానినే "గాలి సోకడం" అని మన పెద్దలు తెలిపారు. అందుకే హిందూ ధర్మం లో ఈ శరీరాన్ని "దహనం చేస్తారు". 13 రోజుల పాటు నిత్య కర్మలు ఆచరిస్తారు . ఆత్మకు స్వర్గ ప్రాప్తి కలగాలని, అస్థికలను తీసుకుని వెళ్లి నదిలో కలుపుతారు. అయినప్పటికీ భూమి మీద మమకారం చావక ఇక్కడే పరిభ్రమణం చెందుతూ ఉంటే, మన జన్మకు కారకమైన పెద్దలకు పరలోకం (ఆత్మ తిరుగాడే లోకం) లోనూ మంచి జరగాలని కోరుకుంటూ శ్రాధ్ధ కర్మలు ఆచరిస్తూ ఉంటారు. సైన్స్ కు సైతం అందని చాలా విషయాలు మన వేదాలలో ఎప్పుడో చెప్పటం జరిగింది. వీటిని అర్థం చేసుకోలేని వారు వీటిని అవహేళన చేస్తూ అభాసుపాలు అవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలోని "నాసా" కేంద్రం లోని శాస్త్రవేత్తలు"సంస్కృతం నేర్చుకుని" మన పురాణాలలోని అంశాలను చదువుతూ వాటిపై పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచంలో సైన్స్ అనే అభివృద్ధి జరగక ముందే మన దేశంలో అభివృద్ధి జరిగింది. విదేశీ దాడుల కారణంగా వీటిని బయటకు రాకుండా చేసి, కొత్త గా సైన్స్ అంటూ పరిచయం చేసి మన దేశం సంస్కృతి సంప్రదాయాలను అణచి వేయడానికి ప్రయత్నించారు. కానీ, నిజం నిప్పులాంటిది. కావున, భారతదేశం ఔన్నత్యం, సంస్కృతి, సంప్రదాయాల వెనుక గల సైన్స్ విషయాలు ఒక్కటొక్కటిగా ప్రపంచానికి తెలుస్తున్నాయి. మన భగవద్గీత, మన రామాయణం, మన భాగవతం లను ఎవరైనా పుక్కిటి పురాణాలు అనే హేళన చేస్తే వారికి తగిన సమాధానం చెప్పాలి. అందుకు మీలాంటి పెద్దలు నడుం బిగించాలని కోరుకుంటున్నాను. అందుకే ఇంత పెద్ద వ్యాసం మీకోసం.

💐💐💐💐

భవదీయుడు

సీతారాం, సీనియర్ జర్నలిస్టు. 💐💐💐💐🙏🙏🙏🙏

సైకిలు పెడలు

 సైకిలు పెడలు - సంప్రదాయాలు 


(పరమాచార్యులవారు చెబుతుండగా 1947లో వ్రాయబడిన వ్యాసం)


ఎవరైనా సైకిలు నడుపుతుంటే అతను కాళ్ళతో పెడలు తొక్కుతాడు. తొక్కడంలో అనుభవం ఉన్నవాడు మొదట త్వరగా పెడలును త్రొక్కి తరువాత కొంతసేపు తొక్కడం మానేసి హ్యాండిలు మాత్రం పట్టుకుని ఉంటాడు. వాడు పెడలు త్రొక్కకపోయినా సరే, అంతకుముందు త్రొక్కినప్పుడు పుంజుకున్న వేగం కారణంగా, సైకిలు ముందుకు వెడుతుంది.


ప్రభుత్వం అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది. బ్రాహ్మణులు సాధారణంగా ఈ పరీక్షలలో బాగా విజయం సాధిస్తూ ఉంటారు. ప్రభుత్వం కొంతకాలం కేవలం ప్రతిభ ఆధారంగా కళాశాలలో ప్రవేశం ఉంచినప్పుడు, బ్రాహ్మణుల పిల్లలు ప్రవేశం సాధిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిభకు కావలసిన మార్కులకంటే చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. అలా విశేషంగా మార్కులు సంపాదించే విద్యార్థుల సంఖ్య కళాశాలలో ఉన్న ప్రతిభ ఆధారంగా ఇచ్చే సీట్ల కన్నా కొన్నివందలరెట్లు ఎక్కువగా ఉంటుంది.


ఇలా జరుతుండటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ప్రస్తుతం ఏ విశేష కారణమూ కనిపించటంలేదు. ఆచారాలూ, అనుష్టానాల విషయంలో బ్రాహ్మణుల పిల్లలకూ ఇతరుల పిల్లలకూ ఏమీ తేడా ఉండట్లేదు. పైగా కొన్ని విషయాలలో బ్రాహ్మణుల పిల్లలకంటే ఇతరులే బాగా ఉంటున్నారు. మరి బ్రాహణుల పిల్లలు ఎక్కువ ప్రతిభ కనపచటానికి మూలకారణం ఏదయ్యుంటుంది ? మనం దాన్ని కనుగొనాలి.


భగవంతుడు పక్షపాతి కాడు. బ్రాహ్మణులు ఆచారాలూ, అనుష్టానాల విషయంలో ఇతరులకన్నా వేరు కాకపోయినా, కొన్ని విషయాలలో ఇతరులకన్నా దిగదుడుపే అయినా, భగవంతుడు ఎక్కువ మేధస్సుని బ్రాహ్మణులకు ఎందుకు ఇచ్చాడు ?

పూర్వీకులు సైకిలు త్రొక్కడం చేత. 


మనకు మూడుతరాల క్రితం జీవించిన మన పూర్వీకులు, జీవన సాఫల్యానికి కావలసిన బ్రహ్మ తేజస్సును పొందటానికి అవసరమైనదానికంటే ఎక్కువగా ధార్మిక జీవనము అనే సైకిలు త్రొక్కారు. ఈరోజు మనం ఏ కర్మానుష్టానమూ లేకుండా కేవలం హ్యాండిలు పట్టుకుని వారి (మన పూర్వీకుల) మూలంగా పరీక్షలలో విజయం సాధించేస్తున్నాము.


వాళ్ళు బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు నిద్రలేచేవారు. మనం సాధారణంగా సూర్యోదయం తరువాతే నిద్ర లేస్తాం. వారి కాలంలో సకాల సంధ్యావందనం చెయ్యని వాడిని వెతకవలసి వచ్చేది. మన కాలంలో సకాల సంధ్యావందనం చేసే వాడిని వెతకవలసి వస్తోంది.


వారి కాలంలో ఉదయ సాయంకాలాలలో జనులు సంధ్యావందనములకై గుమికూడేవారు. మన కాలంలో ప్రొద్దున్న ఒక క్లబ్బులోనూ సాయంత్రం వేరే క్లబ్బులోనూ గుమికూడతాము. ఆత్మను పోషించవలసిన సమయంలో అనాత్మను పోషిస్తాము. ఆత్మశక్తిని కోల్పోయి, ఆత్మను బలహీనం చేస్తాము.


ఈ భూమిలోని ఇతర మతస్తులు కేవలం సాయంత్రం భగవంతుణ్ణి స్మరించడం, కొన్ని సమయాలలో కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా సంపాదించిన శక్తి సామర్ధ్యాలతో, అకారణంగా మన వద్దనుండి మొత్తం రాజ్యం లాగివేసుకున్నారు.

బుక్కరాయల గురువైన విద్యారణ్యస్వామి, శివాజీ గురువైన సమర్థ రామదాసు గొప్ప నైతిక ప్రవర్తన కలవారు, కర్మానుష్టానపరులు, భగవదనుభవం అయినవారు. వారు మన ధర్మాన్ని పాడుచేసిన విదేశీయుల కరాళనృత్యాన్ని నాశనంచేసి, మన ధార్మికమైన రాజ్యాన్ని పునః స్థాపించారు.


నాగరికతా ? జంతుప్రవర్తనా ? 


మనకు మూడుతరాల క్రితం జీవించిన గొప్పవారిలో మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోనివారు లేరు. మట్టి, నీటిపాత్ర వారి దగ్గర ఎప్పుడూ ఉండేవి. మనం నాగరీకులమయ్యాము. మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోవడం వదలివేశాము. మనం జంతువులమయ్యాము. ఇది మన నాగరీకత.


ప్రథమ ఆచారమైన శౌచం వదలివేసిన వాడు చేసే ఏ కర్మ అయినా, బూడిదలో (అగ్నికి బదులు) హోమంచేయటంతో సమానం.


మూడుతరాల క్రితం వారు త్రొక్కిన ఫలం ఎంతవరకూ ఉంటుంది ? త్రొక్కకుండా ఉన్న సైకిలు ఎంత దూరం పరిగెడుతుంది ? వేగం తగ్గిపోవడం అప్పుడే మొదలయ్యింది. మా చిన్నప్పుడు బ్రాహ్మణుల పిల్లల్లో చూసిన బ్రహ్మతేజస్సు ఈ తరం వాళ్ళల్లో కనిపించుటలేదు. అలాగే చదివే సామర్థ్యమూనూ.


కాబట్టి, తరువాతి తరాల వారు భగవదనుగ్రహమూ, బ్రహ్మ తేజస్సూ, మేధాశక్తీ కోల్పోకుండా ఉండాలంటే, మన జీవితంలోనూ ఇవి క్రమేణా తగ్గిపోకుండా ఉండాలంటే, మనం "ధర్మశాస్త్ర సైకిలు" లోని "కర్మానుష్టాన చక్రమును", "ప్రవర్తన పెడలు" త్రొక్కడం ద్వారా త్రిప్పుతూ ఉండాలి.


--- “జగద్గురుబోధలు”, http://jagadguru-vaibhavam.blogspot.in నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

హిందుత్వమంటేనే

హిందుత్వమంటేనే వేడుకలు.
హిందుత్వమంటేనే వైభవం.

హిందుత్వమంటేనే ఉత్సవం.
హిందుత్వమంటేనే ఉత్సాహం.

హిందుత్వమంటేనే మంగళం.
హిందుత్వమంటేనే శుభకరం.

హిందుత్వమంటేనే సంబరం.
హిందుత్వమంటేనే సమర్పణం.

హిందుత్వమంటేనే సంస్కారం.
హిందుత్వమంటేనే సర్వ వికాసం.

హిందుత్వమంటేనే ప్రకృతి ఆరాధనం.
హిందుత్వమంటేనే పర్యావరణ సంరక్షణం.

హిందుత్వమంటేనే సౌభ్రాతృత్వం.
హిందుత్వమంటేనే సకల మానవాళి సౌఖ్యం.

హిందుత్వమంటేనే పురాతనం.

హిందుత్వమంటేనే సనాతనం.

హిందుత్వమంటేనే నిత్య నూతనం.

హిందుత్వమంటేనే చిరంతనం.

హిందుత్వమంటేనే అమృత భాండం.
హిందుత్వమంటేనే అండ పిండ బ్రహ్మాండం.

హిందుత్వమంటేనే...
అనంతం,అఖండం, ఆజరామరం.
🚩🚩జై శ్రీరామ్ 🚩🚩

వినయం సంపన్నుడు

 శ్లోకం:☝️

*నరత్వం దుర్లభం లోకే*

 *విద్యా తత్ర సుదుర్లభా ।*

*శీలం చ దుర్లభం తత్ర*

 *వినయస్తత్ర సుదుర్లభః॥*


భావం: మానవ జన్మ పొందడమే కష్టం, పొందినా విద్యావంతుడు కావడం అంతకంటే కష్టతరం. శీలము సద్గుణాలను పెంపొందించుకోవడం మరింత కష్టతమం, ఇవన్నీ ఉన్నప్పటికీ, వినయం సంపన్నుడు చాలా  అరుదు.

పంచాంగం 16.04.2024

 ఈ రోజు పంచాంగం 16.04.2024   Tuesday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వాసంత ఋతు చైత్ర మాస శుక్ల  పక్ష: అష్టమి తిధి భౌమ వాసర: పుష్యమి నక్షత్రం ధృతి యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి మధ్యాహ్నం 01:27 వరకు.

పుష్యమి రా.తె 05:15 వరకు. 

సూర్యోదయం : 06:03

సూర్యాస్తమయం : 06:29


వర్జ్యం : పగలు 11:34 నుండి మధ్యాహ్నం 01:34 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:32 నుండి 09:22 వరకు తిరిగి రాత్రి 11:07 నుండి 11:53 వరకు.


అమృతఘడియలు : రాత్రి 10:17 నుండి 12:01 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం  03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

*ఏ వేదంలో ఏముంది.... 🙏*

 *ఏ వేదంలో ఏముంది.... 🙏*


1. ఋగ్వేదం: దేవతల గుణగణాలు ఇందు లో ప్రత్యేకం. అగ్నిదేవుడి ప్రార్ధనతో ఈ వేదం ప్రారంభమవుతుంది. ఇందులో 1017 శ్లోకాలు, 10,580 మంత్రాలు, 1,53,826 శబ్దాలు, 43,200 అక్షరాలు ఉన్నాయి. ఋగ్వేదంలొ ఉండే మంత్రాలను రుక్కులు అని కూడా అంటారు. ఇవి ఛందోబద్ధాలు....


2. యజుర్వేదం: ఇది యజ్ఞయాగాదులు గురించి వివరిస్తుంది. ఇందులో రెండు శాఖలు ఉన్నాయి. అవి 1. శుక్ల యజుర్వేదం (యాజ్ఞ వల్క్య మహర్షి). ఇందులో 1975 పద్యగద్యాలున్నాయి. 2. యజుర్వేదం (త్తెత్తరీయ మహర్షి). ఇందులో 2,198 మంత్రాలు, 19,200 పదాలు ఉన్నాయి.....


3. సామవేదం: ఇది అతి చిన్నది. సమం అంటేె గ్రామం. ఇందులో మంత్రాలు 1875 ఉన్నాయి. వీటిలో 1504 ఋగ్వేద మంత్రాలే. 99 మాత్రమే కొత్తవి. 272 పునరుక్తాలు. భారతీయ సంగీత శాస్త్రానికి సామవేదమే మూలం. ఇది శాంతి వేదం.....


4. అధర్వణ వేదం: లౌకిక విషయాలను ఇది వర్ణిస్తుంది. 5977 మంత్రాలు ఉన్నాయి. అనేక చికిత్సావిధానాలు ఉన్నాయి. మూలికా చికిత్స కూడా ఇందులో వర్ణించి ఉంది. రాజ్యం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థల గురించి వివరంగా వర్ణనలు ఉన్నాయి. దీనినే బ్రహ్మ వేదమని కూడా అంటారు. రాజ్యం, రాజకీయాల గురించి వివరించినందుకు క్షాత్ర వేదమని, చికిత్సల గురించి వివరిస్తుంది కాబట్టి భిషగ్వేదమని కూడా పిలుస్తారు. వేదాలను అర్థం చేసుకోవడం సామాన్యులకు ఒకింత కష్టమే. అందుకే వీటిని చదివి అర్థం చేసుకోవడానికి మహర్షులు ఒక నిర్దిష్ట పద్ధతిని ఏర్పరిచారు. దీని ప్రకారమే ఆరు వేదాంగాలు, నాలుగు ఉపవేదాలు ఉన్నాయి....


వేదాంగాలు 6: శిక్ష, వ్యాకరణం, నిరుక్తము ఛందస్సు, జ్యోతిష్యం, కల్పం....


ఉపవేదాలు 4: గాంధర్వ వేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం, అర్థవేదం....


అథర్వణ వేదమే ఈ నాలుగు ఉప వేదాలకు మూలమని భావిస్తారు...🙏🇮🇳🙏