17, సెప్టెంబర్ 2020, గురువారం

వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా నిర్వహించే

 ☝️తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా నిర్వహించే ధ్వజారోహణంకు దర్భ చాప, తాడు సిద్ధమయ్యాయి. ఈ క్రతువుల్లో దర్భచాప,తాడు అతిముఖ్యమైనవి.


బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ధ్వజస్తంభం మీదకు గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.


అర్చకులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు.దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుడతారు. 


వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. 


        ఇందుకోసం వడమాల పేట పరిసర ప్రాంతమైన చెల్లూరు పంటకాలువల మీద పెరిగే ఈ దర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరిస్తారు. 


దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెడతారు. ఆ తరువాత దర్భను బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేస్తారు.


ధ్వజారోహణం కు 5.5 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు చాప, 175 అడుగుల తాడు అవసరం అవుతాయి.  


అయితే అటవీశాఖ ఈ సారి 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాప, 211 అడుగుల పొడవు తాడు సిద్ధం చేసింది.  


టీటీడీ డి ఎఫ్ ఓ చంద్ర‌శేఖ‌ర్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకుని వచ్చి వీటిని ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ కు అందిచారు. 


ఈ నెల 19వ తేదీ జరిగే ధ్వజారోహణం లో వీటిని ఉపయోగిస్తారు.


🍁🍁🍁🍁

*నిద్రలో మెలకువ వస్తే ఆరోగ్యానికి సమస్యే..*


తీమసుకోవల్సిన జాగ్రత్తలివే..

రాత్రి కన్నంటుకోగానే లోపల ఒక్కొక్క ఆర్గాన్‌ డ్యూటీ ఎక్కుతాయి. ‘ఈ టైంకి నువ్వు! ఫలానా టైంకి నువ్వు’ అని వంతులు పెట్టుకొని షిష్ట్‌వైజ్‌ పని చేసుకుంటాయి. వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్‌ లేకుండా పని చేసుకుంటే.. నిద్ర కూడా సుఖంగా ఉంటుంది. వాటికేదన్నా ప్రాబ్లమ్‌ వస్తే.. అవి మన నిద్రని డిస్టర్బ్ చేస్తాయి. నిద్ర మధ్యలో మెలకువ వచ్చిందంటే ఆ టైమ్‌ల డ్యూటీ చేస్తున్న ఆర్గాన్‌కి సుస్తీ చేసినట్టు! అంటే టెస్ట్‌లు లేకుండా ఆర్గాన్‌ హెల్త్‌ కండిషన్‌ని గుర్తు పట్టొచ్చన్నమాట!


రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే రాత్రి హాయిగా నిద్ర పోవాలి. కానీ మంచి నిద్ర ఎంత మందికి దొరుకుతుంది? లైఫ్‌‌స్టైల్ ఎంతో హెల్దీగా ఉంటే కానీ అలా జరగదు. ఆరోగ్యానికి నిద్రకు లింక్ ఉంది. నిద్ర పోయే సమయాన్ని బట్టి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయొచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా నిద్ర మధ్యలో మెలకువ వచ్చే టైంని బట్టి కూడా హెల్త్ ఎలా ఉందో డిసైడ్ చేయొచ్చు.


చాలామందికి నిద్ర పోయేటప్పుడు మధ్యలో మెలకువ వస్తుంది. నిద్ర మధ్యలో ఒకట్రెండు సార్లు లేచి, మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అయితే రోజూ ఒకే టైంకి మెలకువ వస్తుందంటే.. శరీరంలో ఏదో తేడా ఉన్నట్టేనని అంటున్నారు డాక్టర్లు. మెలకువ వచ్చే టైంని బట్టి శరీరంలో ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో చెప్పొచ్చంటున్నారు.


*రిపేరింగ్ టైం..*


నిద్ర పోయేటప్పుడు శరీరం.. ప్రాబ్లమ్స్‌‌ను రిపేర్ చేసుకుంటుంది. ఆరోజులో జరిగిన మెంటల్, ఫిజికల్ ఇంబాలెన్స్‌‌ను బాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. హార్మోన్స్‌‌ను సమతుల్యం చేసి, మరుసటి రోజుకు శరీరాన్ని రెడీ చేస్తుంది. ఈ ప్రాసెస్ రాత్రంతా జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది.

ఒక్కో అవయవానికి ఒక్కో టైం ఉంటుంది. ఆ టైంలో అవయవానికి ఏదైనా డిస్టర్బెన్స్ఉంటే పనికి ఆటంకం జరిగి, శరీరం మేల్కొంటుంది. అంటే మెలకువ వచ్చే సమయాన్ని బట్టి అవయవాల పనితీరుని డిసైడ్ చేయొచ్చన్న మాట.


శరీరం నిద్రలో ఉన్నా, మేల్కొని ఉన్నా తన పనితీరుకి సంబంధించిన సిగ్నల్స్‌‌ని ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. వాటిని అర్ధం చేసుకొని మార్పులు చేసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. నిద్రకు ఆటంకం కలుగుతుందంటే… ఎక్కడో, ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క. ఆ ప్రాబ్లమ్‌‌ని ఎలా కనిపెట్టాలో చూద్దాం.


9–11

తొమ్మిది నుంచి పది గంటల మధ్యలోనే చాలామంది నిద్రలోకి జారుకుంటారు. అయితే కొంతమందికి ఇలా పడుకోగానే అలా మెలకువ వస్తుంది. తొమ్మిదింటికి పడుకుంటే పదకొండు లోపే మెలకువ వచ్చి, సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. 11 గంటలలోపు మెలకువ వచ్చిందంటే.. మెదడు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు లెక్క. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఒత్తిడిని ఫేస్ చేస్తున్నట్టు అర్ధం. అలాగే తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్య థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్‌‌గా ఉంటుంది. ఈ టైంలో నిద్రకు డిస్టర్బెన్స్ వస్తుందంటే.. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే ఇలాంటి వాళ్లు ఆరోగ్యకరమైన లైఫ్‌‌స్టైల్‌‌ని అలవరచుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్–ఎ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. మెడిటేషన్ చేయడం, శుభ్రమైన నీళ్లు తాగడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం మంచిది. రోజూ అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కొవ్వు, ఉప్పు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.


11–1

సాధారణంగా రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో గాల్ బ్లాడర్ (పిత్తాశయం) శరీరంలోని ఫ్యాట్స్‌‌ని కరిగిస్తుంది. గాల్ బ్లాడర్ నుంచి రిలీజ్ అయ్యే పైత్యరసం చిన్న పేగుల్లోకి వెళ్లి, ఆహారం జీర్ణం అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. ఇందులోని ఎంజైమ్స్, కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి, వాటి ద్వారా అందే ఏ, డీ, ఈ, కె విటమిన్లను శరీరానికి అందిస్తాయి. ఈ సమయంలో నిద్ర ఇబ్బందిగా మారిందంటే.. గాల్ బ్లాడర్ పని తీరు సరిగా లేదని అర్ధం. ఇలాంటి వాళ్లు డైట్‌‌లో అన్‌‌హెల్దీ ఫ్యాట్స్, ఆయిల్స్‌‌ను తగ్గించాలి. పడుకునే ముందు ఈజీగా అరిగే ఆహారాన్ని తీసుకోవాలి.


1–3

ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో లివర్ యాక్టివ్‌‌గా ఉంటుంది. శరీరంలోని మలినాలను క్లీన్ చేసి, బ్లడ్ ను ప్యూరిఫై చేస్తుంది. ఈ టైంలో మెలకువ వచ్చిందంటే.. లివర్‌లో ఏదో ప్రాబ్లమ్‌‌ ఉందని అర్ధం. రాత్రిళ్లు ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్స్ తిన్నా, ఆల్కహాల్ తాగినా ఇలా జరుగుతుంది. కాలేయం జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారు చేసి, సరఫరా చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని విషపదార్థాలను తనలో దాచుకుని, శరీరానికి హాని జరగకుండా కాపాడుతుంది. శరీరానికి గుండె ఎంత ఇంపార్టెంటో లివర్​ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే ఈ టైంలో మెలకువ వచ్చే వాళ్లు ఆల్కహాల్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. నీళ్లు, ఆహారం కలుషితంగా ఉన్నాయేమో చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు తగ్గిస్తే మంచిది.


3–5

3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఊపిరితిత్తులు ఆక్సిజన్‌‌ను ఎక్కువగా పంప్ చేస్తాయి. కండరాలకు రక్తం, ఆక్సిజన్ అందే సమయం ఇదే. ఈ సమయంలో మెలకువ వస్తోందంటే లంగ్స్‌‌లో సమస్య ఉన్నట్టు గుర్తించాలి. అందుకే ఇలాంటి వాళ్లు రెగ్యులర్‌గా బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు, కార్డియో వ్యాయామాలు చేయాలి. జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. పడుకునే ముందు లైట్‌‌ ఫుడ్‌‌ తీసుకోవాలి. భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే, ఆహారం జీర్ణమై పడుకునే సమయానికి గాలి బాగా ఆడుతుంది.


5–7

5 నుంచి 7 గంటల మధ్యలో శరీరం టాక్సిన్స్‌‌ని బయటకు పంపుతుంది. శరీరం మొత్తాన్ని క్లీన్ చేసే టైం ఇది. అందుకే ఈ టైంలో మెలకువ వస్తే వెంటనే లేవడం మంచిది. లేచి కాలకృత్యాలు తీర్చుకుంటే.. హెల్దీగా, ఫ్రెష్‌‌గా రోజుని స్టార్ట్ చేయడానికి శరీరం రెడీ అవుతుంది. ఈ టైంలో మెలకువ వచ్చినా లేవకుండా అలాగే నిద్రపోతే.. శరీరం తాజాదనాన్ని కోల్పోయి, అలసిపోయినట్టు తయారవుతుంది. ఆ ఎఫెక్ట్ రోజంతా ఉంటుంది.


*ఇవి కూడా..*

ఎక్కువగా టీవీ చూడడం, మొబైల్ వాడడం, జంక్ ఫుడ్ తినడం, మద్యం, సిగరెట్ల లాంటి అలవాట్లు నిద్రను పాడుచేస్తాయి. నిద్ర సరిగా లేకపోతే అవయవాల పనితీరు మందగించి, బీపీ పెరగడం, గుండె సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, నరాల బలహీనత, చేతులు తిమ్మిర్లు రావడం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం లాంటి ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదముంది.


*మంచి నిద్ర కోసం..*

నిద్రకు సరైన టైం టేబుల్ అలవర్చుకోవాలి.

6 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

ఆల్కహాల్​, సిగరెట్‌‌ అలవాట్లకు దూరంగా ఉండాలి.

పడుకునే ముందు స్నానం చేయాలి. రాత్రిళ్లు లైట్ ఫుడ్ తీసుకోవాలి. రాత్రి 8 గంటల లోపే భోజనం ముగించాలి.

రాత్రిళ్లు టీవీ చూడడం, సెల్‌‌ఫోన్‌‌ వాడడం తగ్గించాలి..


సేకరణ 👇..

ఈయన మీకు తెలుసా

 దండి భట్ల విశ్వ నాధ శాస్త్ర

ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు జర్మన్ లో 

వున్న విదేశీయా కార్యాలయానికి వెళ్లారు అక్కడ జర్మన్ 

అధికారులు గోడమీద వున్న చిత్ర పటాన్ని చూపించి 

అయన మీకు తెలుసా అని అడిగితే లేదు అనగా అయన మీ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రి 

వాస్తవ్యులు దండి భట్ల విశ్వనాధ శాస్త్రి సంస్కృత మహా పండితులు అన్ని వేదాలు అర్ధాలు చెప్పగల గొప్ప 

మేధావి మేము వేదశాస్త్రం వైజ్ఞానిక శాస్త్రం వీరినుండి  

గ్రహించి యుద్ధసమయంలో ఆయుధ నిర్మాణం కొరకు 

వినియోగించుకున్నాము అందుచేత ఆయనమీద 

గౌరవంతో ఆ చిత్రపటాన్ని ఇక్కడ పెట్టుకున్నామ 

అని చెప్పారు సేకరణ మన్నవ గిరిధరరావు గారి 

పుస్తకం నుండి



శివుడి నటరాజ రూపం వెనక ఉన్న పరమార్థం




డమరుకాన్ని పట్టుకున్న హస్తం

'నటరాజ భంగిమలో డమరుకాన్ని పట్టుకున్న హస్తం సృష్టికి ఆధారమైన శబ్దాన్ని సూచిస్తుంది.'


ఎడమ చేతిలోని అగ్ని వినాశనాన్ని అంటే ప్రళయాన్ని సూచిస్తుంది.

'ఎడమ చేతిలోని అగ్ని వినాశనాన్ని అంటే ప్రళయాన్ని సూచిస్తుంది. ఆ రెండు చేతులూ ఒకే రీతిగా ఉండడం ఈ ప్రపంచంలో సృష్టి వినాశాలు ఎప్పుడూ సమానంగా కొనసాగుతాయని తెలుపుతుంది.'


నటరాజు ముఖం

'రెండు బాహువుల మధ్య ఉన్న నిర్వికారమైన నటరాజు ముఖం సృష్టి వినాశనాలు రెండింటినీ సమన్వయించుకున్న, ఆ రెండిటికీ అతీతమైన స్థితిని సూచిస్తుంది.'


నటరాజ రూపం దేనికి సంకేతం...

నటరాజు కుడి పక్కన ఉన్న రెండో బాహువు అభయ ముద్ర ద్వారా స్థితి, పాలనలను సూచిస్తుంది. ఎడమ ప్రక్కన ఉన్న రెండో బాహువు పైకెత్తిన ఆయన పాదాన్ని చూపుతూ మాయాజాలం నుంచి విముక్తిని సూచిస్తుంది.'


నటరాజ రూపం దేనికి సంకేతం...

నటరాజు ఒక రాక్షసుడి దేహంపై నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ రాక్షసుడు మానవునిలోని అజ్ఞానానికి ప్రతిరూపం. దానిని నశింపజేస్తేనే ముక్తి సాధ్యం.


నటరాజ రూపం దేనికి సంకేతం...

శివుడి 'ఆనంద తాండవం' లేదా 'లాస్యం' - ప్రళయం తర్వాత తిరిగి జగత్తు యొక్క సృష్టిని సూచిస్తుంది. శివుడు పరబ్రహ్మానికి సంకేతం. అతడి మెడలోని సర్పం ప్రతీ జీవుడిలో ఉండే కుండలినీ శక్తికి సంకేతం. వెన్నులోని ఏడు చక్రాలను మేల్కొల్పడమే కుండలినీ శక్తిని మేల్కొల్పడం. శివుడి 'రుద్ర తాండవం' ఈ జగత్తు నాశనానికి సంకేతం.


నటరాజ రూపం దేనికి సంకేతం...

శివుని అర్థ నారీశ్వర తత్వం సృష్టిలోని స్త్రీత్వ, పురుషత్వాలకు సంకేతం.


నటరాజ రూపం దేనికి సంకేతం...

శివుడి మూడో కన్ను జ్ఞానానికి సంకేతం.


నటరాజ రూపం దేనికి సంకేతం...

చేతిలోని పుర్రె మృత్యువుపై విజయానికి సంకేతం.


నటరాజ రూపం దేనికి సంకేతం...

దట్టమైన శివుని జటాజూటం ప్రళయకాలంలో అన్ని వైపులా వ్యాపించి తుఫానులు,సునామీల వంటి ఉత్పాతాలను సృష్టిస్తుంది. శివుడు మూడో నేత్రం తెరవడంతో దాని నుంచి వెలువడే అగ్నిశిఖలు

విశ్వమంతా దావానలంలా వ్యాపించి, దానిని నాశనం చేస్తాయి.


నటరాజ రూపం దేనికి సంకేతం...

శివుడి ఈ రెండు తాండవాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. శివుడి ఈ రెండు రకాల నృత్యాలు 'చిదంబరం' అంటే - హృదయమనే ఆకాశంలో - అంటే చైతన్యానికి కేంద్రమైన చిదాకాశంలో జరుగుతాయి


నటరాజ రూపం దేనికి సంకేతం...

వివిధ రూపాలుగా మనకు కనిపించేదంతా నిజానికి అశాశ్వతం, భ్రాంతి మాత్రమేనని శివుడు సదా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. బ్రహ్మ రాత్రిని అనుభవించినప్పుడు ప్రకృతి అచేతనంగా ఉంటుంది. శివుడు సంకల్పించేంత వరకు ప్రకృతి నృత్యం చేయజాలదు. ఆయన ఆత్మానందం నుంచి మేలుకొని, తన నృత్యం ద్వారా జడమైన ప్రకృతిని మేల్కొలిపేలా శబ్దం (డమరుక ధ్వనిగా సూచితం) చేస్తాడు. ఇలా తన నృత్యం ద్వారా పదార్థ రూపంలో వివిధ ప్రకృతి క్రియలను కొనసాగిస్తాడు. కాలాంతరంలో ఆయన తన నృత్యం ద్వారానే నామరూపాలనింటినీ నశింపజేసి, ప్రకృతికి విశ్రాంతినిస్తాడు. ఇదంతా కవిత్వంగా మురిపించే ఆధునిక విజ్ఞానం.


LIKE | COMMENT | SHARE |


🔱 శివానందా రూపం శివం శివం 🔱


నటరాజ రూపం దేనికి సంకేతం...

బ్రహ్మకు రాత్రి అయి నిద్రలోకి వెళ్ళినపుడు శివుడు రుద్ర తాండవం మొదలుపెడతాడు. అప్పుడు ఈ విశ్వం నాశనమై, కుంచించుకు పోయి, శూన్య స్థితికి చేరుతుంది. బ్రహ్మకు పగలు అయి, మేలుకున్నప్పుడు శివుడు ఆనంద తాండవం మొదలుపెడతాడు. అప్పుడు బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తాడు


ఏడు రోజుల పూజా విధానాలు


ఆదివారం: అనారోగ్య నివారణకు, చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతాన క్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారం నాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారం నాడు ఉపవాసం వుండి, సూర్యారాధన లేక సూర్యాష్టకం చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారం నాడు ప్రారంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలు ఆచరించాలి. అలా ఆచరించలేని వారు కనీసం 12 వారాలైనా చేయాలి.


వ్రతవిధానం: ఆదివారం నాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సాష్టాంగ నమస్కారములతో సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆ పైన గంగా జలాన్ని, లేదా శుద్దోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయుణిడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం వుంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.


సోమవారం: అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనః కారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రశేకరాష్టకంతో సోమవార పూజ శ్రేష్ఠమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారంనాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాలపాటు ఈ వ్రతాచరణ చేయాలి.


వ్రతవిధానం: చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో ఓం నమఃశ్శివాయ అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరం, చంద్రశేకరాష్టకం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పువ్వులు, శ్వేత గంధం, బియ్యంతో చేసిన పిండి వంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండి ఉంగరాన్ని ధరించాలి. పూజా సమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతో పాటు పాలు, పెరుగు, పండ్లు మరియు తెలుపురంగు వస్తువులను దానం చేయాలి.


మంగళవారం: ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి ఆంజనేయ స్తోత్రం గాని సుబ్రమణ్య అష్టకమ్ గాని పఠించి మంగళవార వ్రతం ఆచరించాలి.


వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాలపాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్దిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘవ్యాధులు, ఋణబాధలు ఉపశమిస్తాయి. రాగిపాత్ర, ఎరుపురంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలనకోసం ఈ వ్రతాచరణ చేసేవారు కుజాష్టోత్తరాన్నిలేదా మూలమంత్రం పఠించాలి.


బుధవారం: స్థితికారకుడు, శిక్షరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందగోరేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు మదురాష్టకాన్ని భక్తితో పఠిస్తూ ఈ వ్రతాచరణ చేయాలి.


వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజ చేసే వారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చ ద్రాక్ష మొదలైన ఆకుపచ్చ రంగులో వుండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డి తినిపించడం శ్రేష్ఠం. ముడిపెసలతో చేసిన పదార్ధాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.


గురువారం: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివౄఎద్దిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, షిర్డిసాయి, రాఘవేంద్రస్వామి, దత్తాత్రే యుడు లేదా తమ గురువును ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యా ఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనలనుంచి తప్పించుకోవాలనుకునేవారు వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గురువార వ్రతం చేయాలి.


వ్రతవిధానం: ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్ళపాటు చేయాలి. స్నానా నంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి, కంచు లోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పూవులను, పసుపును, పసుపు కలిసిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించకూడదు. ఒకపూట తప్పనిసరిగా ఉపవాసం వుండి, స్వామికి నివేదించిన పదార్ధాలను స్వీకరించాలి.


శుక్రవారం: దుర్గ, లక్ష్మి, సంతోషిమాతా, గాయత్రి తదితర దేవతల అనుగ్ర హాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్త్రణామం


ార పూజకు శ్రేష్ఠమైనది.


వ్రతవిధానం: ఈ పూజను శ్రావణమాసం లేదా ఏ మాసంలోనైనా శుక్లప క్షంలో వచ్చే తొలి శుక్రవారం నాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లని తల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి.


శనివారం: శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందగోరేవారు, శని, రాహువు, కేతువు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు నవగ్రహా స్తోత్రంతో శనివార వ్రతం చేయాలి.


వ్రతవిధానం: శ్రావణమాసం లేదా పుష్యమా సంలో వచ్చే తొలి శనివారం నాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచ రణ చేయాలి. వెంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వు లనూనె, ఆవు నెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు వత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో, సరిపెట్టుకోవాలి. ఆఖరివారం ఉద్యాపనగా నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి.


ఏ పూజ, వ్రతం చేసేటప్పుడైనా ఫలితం కోసం కాకుండా శ్రద్దాభక్తులతో చేయాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. హంగు, ఆర్భాటాలకు దూరంగా వుండాలి. చన్నీటి స్నానం, మితాహారం, భూశయనం, బ్రహ్మచర్యం, మద్య, మాంసాలకు, అశ్లీల సంభాషణలకు, దృశ్యాలకు దూరంగా వుండాలి.


*సేకరణ*

అశ్వత్థామ గర్వ పరిహారము

 *భాగవతామృతం*

అశ్వత్థామ గర్వ పరిహారము


1-173-శా.శార్దూల విక్రీడితము


విశ్వస్తుత్యుఁడు శక్రసూనుఁడు మహావీరుండు ఘోరాసిచే

నశ్వత్థామ శిరోజముల్దఱిఁగి చూడాంతర్మహారత్నమున్

శశ్వత్కీర్తి వెలుంగఁ బుచ్చుకొని పాశవ్రాతబంధంబులన్

విశ్వాసంబున నూడ్చి త్రోచె శిబిరోర్వీభాగముం బాసిపోన్.

విశ్వ = లోకముచే; స్తుత్యుఁడు = స్తుతింప దగినవాడు; శక్రసూనుఁడు = అర్జునుడు {శక్రసూనుడు - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు}; మహా = గొప్ప; వీరుండు = వీరుడు; ఘోర = భయంకరమైన; అసి = పదునుకల కత్తి; చేన్ = తో; అశ్వత్థామ = అశ్వత్థామ; శిరోజముల్ = కేశములు; తఱిఁగి = తెగ్గోసి; చూడ = జుట్టు; అంతర = లోని; మహా = గొప్ప; రత్నమున్ = రత్నమును; శశ్వత్ = శాశ్వతమైన; కీర్తి = కీర్తి; వెలుంగన్ = ప్రకాశింపగా; పుచ్చుకొని = తీసికొని; పాశ = తాళ్ల; వ్రాత = సమూహము యొక్క; బంధంబులన్ = కట్లను; విశ్వాసంబునన్ = నమ్మకముగ; ఊడ్చి = విప్పి; త్రోచెన్ = నెట్టెను; శిబిర = గుడారముయొక్క; ఉర్వి = భూమి; భాగమున్ = భాగమును (ప్రదేశము); పాసి = తొలగి; పోన్ = పోవునట్లుగా.

విశ్వమంతా కొనియాడ దగినవాడు, వీరాధివీరుడు, యింద్రపుత్రుడు అయిన అర్జునుడు శ్రీకృష్ణుని అభిప్రాయానుసారం పదునైన కత్తితో అశ్వత్థామ శిరోజాలు ఖండించి లోపల మెరుస్తున్న మహామణిని వశం చేసుకున్నాడు. విశాలమైన కీర్తిని పొందాడు. తరువాత కట్టిన త్రాళ్లన్నీ విప్పదీసి శిబిరం బయటికి గెంటేశాడు.

1-174-క.కంద పద్యము


నిబ్బరపు బాలహంతయు

గొబ్బునఁ దేజంబు మణియుఁ గోల్పడి నతుఁడై

ప్రబ్బిన వగచే విప్రుఁడు

సిబ్బితితో నొడలి గబ్బుసెడి వడిఁ జనియెన్.

నిబ్బరపు = నిస్సంకోచపు; బాల = పిల్లల; హంతయున్ = హంతకుడును; గొబ్బునన్ = వెంటనే; తేజంబు = ప్రకాశమును; మణియున్ = మణియు; కోల్పడి = పోగొట్టుకొని; నతుఁడు = వంగిపోయినవాడు; ఐ = అయి; ప్రబ్బిన = అతిశయించిన; వగ = దుఃఖము; చేన్ = తో; విప్రుఁడు = బ్రాహ్మణుడు; సిబ్బితి = సిగ్గు; తోన్ = తో; ఒడలి = ఒళ్ళు; గబ్బు = పొగరు; సెడి = చెడిపోయి; వడిన్ = వేగముగా;చనియెన్=వెళ్లిపోయెను.


బాలకులను నిర్భయంగా హత్యచేసిన అశ్వత్థామ భరింపరాని అవమానంతో మర్యాదను, మణిని(తేజస్సు) కోల్పోయి, సిగ్గుతో తలవంచుకొని, అతిశయించిన ఆవేదనతో వెలవెలపోయి వేగంగా వెళ్లిపోయాడు.

1-175-ఆ.ఆటవెలది


ధనముఁ గొనుట యొండె, దలఁ గొఱుగుట యొండె,

నాలయంబు వెడల నడచు టొండె,

గాని చంపఁ దగిన కర్మంబు సేసినఁ

జంపఁ దగదు విప్రజాతిఁ బతికి.

ధనమున్ = ధనమును; కొనుట = తీసికొనుట; ఒండెన్ = ఒకటో; తల = జుట్టు / గుండు; గొఱుగుట = తీసివేయుట / చేయుట; ఒండెన్ = ఒకటో; ఆలయంబు = ఇల్లు; వెడలనడచుట = వెళ్ళగొట్టుట; ఒండెన్ = ఒకటో; కాని = అంతే కాని; చంపఁన్ = చంపుటకు; తగిన = తగ్గ; కర్మంబు = కర్మము; చేసినన్ = చేసినప్పటికిని; చంపన్ = చంపుట; తగదు = తగినపని కాదు; విప్ర = బ్రాహ్మణ; జాతిన్ = జాతివానిని; బతికి = బతికి.

ధనం తీసికోవాలి, లేదా తల గొరిగించాలి, అదీ కాదంటే ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలి. అంతే గాని చంపదగిన దుష్కర్మం చేసినా బ్రాహ్మణ పుట్టుక పుట్టిన వానిని చంపరాదు.

1-176-వ.వచనము

ఇ ట్లశ్వత్థామం బ్రాణావశిష్టుం జేసి వెడలనడచి, పాండవులు పాంచాలీ సహితులై పుత్త్రులకు శోకించి, మృతులైన బంధువుల కెల్ల దహనాది కృత్యంబులు సేసి యుదక ప్రదానంబు సేయు కొఱకు స్త్రీల ముందట నిడుకొని గోవిందుండునుం దారును గంగకుం జని తిలోదకంబులు సేసి క్రమ్మఱ విలపించి హరి పాదపద్మజాత పవిత్రంబు లయిన భాగీరథీ జలంబుల స్నాతులయి యున్న యెడం బుత్త్రశోకాతురు లయిన గాంధారీ ధృతరాష్ట్రులను గుంతీ ద్రౌపదులను జూచి మాధవుండు మునీంద్రులుం దానును బంధుమరణశోకాతురు లయిన వారల వగపు మానిచి మన్నించె నివ్విధంబున.

ఇట్లు = ఈ విధంగా; అశ్వత్థామన్ = అశ్వత్థామను; ప్రాణ = ప్రాణాలతో; అవశిష్టున్ = మిగిలినవానిగ; చేసి = చేసి; వెడల = బయటికి; నడచి = పంపి; పాండవులు = పాండవులు {పాండు రాజు సంతానము - పాండవులు}; పాంచాలీ = ద్రౌపది {పాంచాలి - పాంచాల దేశ రాకుమారి , ఐదుగురకు భార్య , ద్రౌపది}; సహితులు = కూడినవారు; ఐ = అయి; పుత్త్రుల = కొడుకుల; కున్ = కొరకు; శోకించి = దుఃఖించి; మృతులైన = మరణించిన; బంధువులు = చుట్టాలు; కున్ = కు; ఎల్లన్ = అందరకు; దహన = శవ దహనము; ఆది = మొదలగు; కృత్యంబులు = కార్యములు; చేసి = పూర్తిచేసి; ఉదకప్రదానంబున్ = తర్పణములు, (బంధు మరణాంతర కర్మ); చేయు = చేయుట; కొఱకున్ = కోసం; స్త్రీల = స్త్రీలను; ముందట = ముందర; ఇడుకొని = ఉంచుకొని; గోవిందుండునున్ = కృష్ణుడును {గోవిందుడు-గోవులకు ఒడయుడు (స్వామి) / కృష్ణుడు}; తారును = తామును; గంగ = గంగానది; కున్ = కి; చని = వెళ్ళి; తిలోదకంబులు = తిలోదకములు {తిలోదకములు ఇచ్చుట - బంధు మరణాంతర కర్మ}; చేసి = వదలి; క్రమ్మఱన్ = మరల; విలపించి = ఏడ్చి; హరి = విష్ణుమూర్తి; పాద = పాదములనే; పద్మ = పద్మముల; జాత = పుట్టి; పవిత్రంబులు = పవిత్రములు; అయిన = అయినట్టి; భాగీరథీ = గంగానది {భాగీరథి - భగీరథుని ప్రయత్నము వలన భూలోకానికి వచ్చిన నది, గంగానది}; జలంబులన్ = నీటిలో; స్నాతులు = స్నానము చేసినవారు; అయి = అయి; ఉన్న = ఉన్నటువంటి; ఎడన్ = సమయమున; పుత్త్ర = కొడుకుల కోసం; శోక = దుఃఖముతో; ఆతురులు = బాధపడువారు; అయిన = అయినట్టి; గాంధారీ = గాంధారి; ధృతరాష్ట్రులను = ధృతరాష్ట్రులను; కుంతీ = కుంతి; ద్రౌపదులను = ద్రౌపదులను; చూచి = చూసి; మాధవుండు = కృష్ణుడు; ముని = మునులలో; ఇంద్రులున్ = శ్రేష్ఠులును; తానును = తనూ; బంధు = చుట్టముల; మరణ = మరణానికి; శోకాతురులు = దుఃఖితులు; అయిన = అయినట్టి; వారల = వారియొక్క; వగపున్ = దుఃఖాన్ని; మానిచి = పోగొట్టి; మన్నించెన్ = ఆదరించెను; ఈ = ఈ; విధంబునన్ = విధంగా.

ఇలా అశ్వత్థామను ప్రాణాలతో గెంటేసి ద్రౌపదితోపాటు పాండవులు తమ కొడుకుల కోసం శోకించారు. అనంతరం చనిపోయిన బంధువు లందరికీ దహన సంస్కారాలు ఆచరించారు. స్ర్తీలతోనూ, శ్రీకృష్ణునితోనూ గూడి గంగానదికి వెళ్లి, పొంగిపొర్లే దుఃఖం దిగమ్రింగి పవిత్ర గంగానదిలో తిలోదకాలు ఇచ్చారు, తరువాత అందరూ శ్రీమహావిష్ణువు పాదాల నుండి పుట్టిన పవిత్ర గంగానదీ జలాలలో స్నానాలు చేశారు. తరువాత శ్రీకృష్ణుడు మునివరేణ్యులతో కూడి పుత్రశోకంతో వ్యాకుల మనస్కులై ఉన్న గాంధారీ ధృతరాష్ట్రులను, కుంతీ ద్రౌపదులను సమీపించి ఎన్నో విధాల ఊరడించి ధైర్యం చెప్పాడు.

1-177-శా.శార్దూల విక్రీడితము


పాంచాలీ కబరీవికర్షణమహాపాపక్షతాయుష్కులం

జంచద్గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁ డి

ప్పించెన్ రాజ్యము ధర్మపుత్త్రునకుఁ గల్పించెన్ మహాఖ్యాతిఁ జే

యించెన్ మూఁడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్.

పాంచాలీ = ద్రౌపదియొక్క; కబరీ = జుట్టును; వికర్షణ = పట్టుకొని తోసేసిన; మహా = ఘోరమైన; పాప = పాపం వలన; క్షత = క్షీణించిన; ఆయుష్కులన్ = ఆయుస్సు గలవారిని; చంచత్ = చెలరేగిన; గర్వులన్ = గర్వంతో ఉన్నవారిని; ధార్తరాష్ట్రులన్ = ధృతరాష్ట్ర పుత్రులని; అనిన్ = యుద్ధమున; చంపించి = చంపించి; గోవిందుఁడు = కృష్ణుడు; ఇప్పించెన్ = ఇప్పించెను; రాజ్యమున్ = రాజ్యమును; ధర్మపుత్రుడు = ధర్మరాజు {యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; కున్ = కి; కల్పించెన్ = కలిగించెను; మహా = గొప్ప; ఖ్యాతిన్ = కీర్తిని; చేయించెన్ = చేయించెను; మూఁడు = మూడు; తురంగమేధములు = అశ్వమేధయజ్ఞములు; దేవేంద్ర = దేవేంద్రుని; ప్రభావంబునన్ = వైభవంతో.

నిండుసభలో ద్రౌపద్రిని జుట్టుపట్టుకులాగిన మహాపాపం ఫలితంగా దుర్మదాంధులైన ధృతరాష్ట్రనందనులైన కౌరవుల ఆయుష్షులు క్షీణించాయి; వారందరినీ శ్రీకృష్ణుడు కరుక్షేత్రయుద్ధంలో చంపించి, ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు; విజయభేరి మ్రోగించి మహేంద్రవైభవంతో మూడు అశ్వమేధ యాగాలు చేయించాడు; ధర్మరాజుకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెప్పించాడు.

1-178-వ.వచనము

అంత వాసుదేవుండు వ్యాసప్రముఖ భూసుర పూజితుం డయి,యుద్ధవ సాత్యకులు గొలువ ద్వారకాగమన ప్రయత్నంబునం బాండవుల వీడ్కొని రథారోహణంబు సేయు సమయంబునం, దత్తఱపడుచు నుత్తర సనుదెంచి కల్యాణగుణోత్తరుండైనహరి కిట్లనియె.


అంత = అంతట; వాసుదేవుండు = కృష్ణుడు {వాసుదేవుడు - వసుదేవుని కుమారుడు, కృష్ణుడు}; వ్యాస = వ్యాసుడు; ప్రముఖ = మొదలగు ప్రముఖమైన; భూసుర = బ్రాహ్మణులచే; పూజితుండు = పూజింపబడినవాడు; అయి = అయి; యుద్ధవ = యుద్ధవుడును; సాత్యకులు = సాత్యకియు; కొలువ = పూజించగా; ద్వారక = ద్వారకకు; ఆగమన = చేరు; ప్రయత్నంబునన్ = ప్రయత్నముతో; పాండవుల = పాండవుల; వీడ్కొని = సెలవుతీసుకొని; రథ = రథాన్ని; ఆరోహణంబు = ఎక్కుట; చేయు = చేసే; సమయంబునన్ = సమయంలో; తత్తఱ = ఖంగారు; పడుచున్ = పడుతూ; ఉత్తర = ఉత్తర; చనుదెంచి = వచ్చి; కల్యాణ = శుభ; గుణ = గుణములతో కూడిన; ఉత్తరుండు = ఉత్తముడు; ఐన = అయినట్టి; హరి = కృష్ణుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

అనంతరం వ్యాసాది మహర్షుల పూజలందుకొన్న శ్రీకృష్ణుడు ఉద్ధవ, సాత్యకులను వెంటబెట్టుకొని ద్వారకకు బయలు దేరాడు. పాండవు లందరికీ వీడ్కోలు చెప్పి రథం ఎక్కుతుండగా, ఉత్తర తత్తరపడుతూ పరుగెత్తుకు వచ్చి మంగళకరగుణాలప్రోవైన పురుషోత్తమునితో ఇలా మొరపెట్టుకొంది.

1-179-మ.మత్తేభ విక్రీడితము


"ఇదె కాలానల తుల్యమైన విశిఖం బేతెంచె దేవేశ! నేఁ

డుదరాంతర్గత గర్భ దాహమునకై యుగ్రప్రభన్ వచ్చుచు

న్నది దుర్లోక్యము మానుపన్ శరణ మన్యం బేమియున్ లేదు నీ

పదపద్మంబులె కాని యొండెఱుఁగ నీ బాణాగ్ని వారింపవే.

ఇదె = ఇదిగో; కాల = మృత్యువు వంటి; అనల = అగ్ని; తుల్యము = తోసమానము; ఐన = అయినట్టి; విశిఖంబు = బాణము; ఏతెంచెన్ = వస్తోంది; దేవేశ = కృష్ణా {దేవేశుడు - దేవతలలో శ్రేష్ఠుడg, కృష్ణుడు}; నేఁడు = ఇవాళ; ఉదర = గర్భము; అంతర్గత = లోపలి; గర్భదాహమున = పిండమును దహించుట; కై = కోసము; ఉగ్ర = భయంకరమైన; ప్రభన్ = ప్రభావంతో; వచ్చుచున్ = వస్తూ; ఉన్నది = ఉంది; దుర్లోక్యము = చూడశక్యంకానిది; మానుపన్ = నివారించే; శరణము = దిక్కు; అన్యమున్ = ఇంకోటి; ఏమియున్ = ఏదీ; లేదు = లేదు; నీ = నీయొక్క; పద = పాదములనే; పద్మంబులే = పద్మములే; కాని = తప్ప; ఒండు = ఇంకోటి; ఎఱుఁగన్ = ఎరుగను; ఈ = ఈ; బాణాగ్నిన్ = బాణాలనే అగ్నిని; వారింపవే = ఆపుము.

“దేవదేవా! శ్రీకృష్ణా! ప్రళయాగ్ని జ్వాలలతో భయంగొల్పే బాణ మొకటి ఎక్కటినుంచో కళ్లకు మిరుమిట్లు గొల్పుతూ వచ్చి, నా కడుపులో ఉన్న పిండాన్ని కాల్చేయాలని చూస్తోంది. ఈ భయంకర బాణాన్ని అడ్డుకొని నన్ను రక్షించేవారు వేరే ఎవరు లేరు. నీ చరణకమలాలనే నమ్మి శరణుజొచ్చాను. కరుణించి ఈ బాణాగ్నిని ఆపు.

1-180-క.కంద పద్యము


దుర్భరబాణానలమున

గర్భములో నున్న శిశువు ఘనసంతాపా

విర్భావంబునుఁ బొందెడి

నిర్భరకృపఁ గావుమయ్య, నిఖిలస్తుత్యా!

దుర్భర = భరింప శక్యంకాని; బాణానలమునన్ = బాణాలనే అగ్నివలన; గర్భము = (నా) గర్భం; లోన్ = లోపల; ఉన్న = ఉన్నట్టి; శిశువు = శిశువు; ఘన = అత్యధికమైన; సంతాప = బాధ; ఆవిర్భావంబునున్ = పుట్టుటను; పొందెడిన్ = పొందుతోంది; నిర్భర = నిండు; కృపన్ = దయతో; కావుము = కాపాడుము; అయ్య = తండ్రీ; నిఖిలస్తుత్యా = శ్రీకృష్ణా {నిఖిలస్తుత్యుడు - సర్వులచే స్తుతింపబడువాడు, కృష్ణుడు};

భరింపరాని ఈ శరాగ్నికి నా కడుపులో ఉన్న పసిగందు కసుగంది పోతున్నాడు. దయతో రక్షించవయ్యా, సకల శరీరులచేత స్తుతింపబడువాడా! శ్రీకృష్ణా!

1-181-క.కంద పద్యము


చెల్లెలికోడల, నీ మే

నల్లుఁడు శత్రువులచేత హతుఁడయ్యెను సం

ఫుల్లారవిందలోచన!

భల్లాగ్ని నడంచి శిశువు బ్రతికింపఁగదే.

చెల్లెలి = (నీ) చెల్లెలికి; కోడల = కోడల్ని; నీ = నీయొక్క; మేనల్లుఁడు = మేనల్లుడు (మేనల్లుడు - సోదరి కొడుకు); శత్రువుల = వైరుల; చేతన్ = వలన; హతుఁడు = చంపడినవాడు; అయ్యెను = అయ్యెను; సంఫుల్ల = చక్కగా వికసించిన; అరవింద = పద్మములవంటి; లోచన = కన్నులు గలవాడా; భల్ల = బాణముల యొక్క; అగ్నిన్ = అగ్నిని; అడంచి = అణచి; శిశువున్ = శిశువును; బ్రతికింపఁగదే = బ్రతికింపుము.

నేను నీ చెల్లెలు సుభద్రాదేవికి కోడల్నయ్యా; నీ మేనల్లుడు అభిమన్యుడిని శత్రువులు అన్యాయంగా పొట్టనపెట్టుకొన్నారు. చక్కగా వికసించిన పద్మాల వంటి నీ కన్నులెత్తి చూడవయ్యా! కృష్ణయ్య! ఈ అమ్మును వమ్ముచేసి నా కడుపుపంట ప్రాణాలు కాపాడవయ్యా.

1-182-ఆ.ఆటవెలది


గర్భ మందుఁ గమలగర్భాండశతములు

నిముడుకొన వహించు నీశ్వరేశ!

నీకు నొక్క మానినీగర్భరక్షణ

మెంత బరువు నిర్వహింతు గాక."

గర్భమందున్ = గర్భంలోపల; కమలగర్భఅండ = బ్రహ్మాండములు; శతములు = వందలకొలది; నిముడుకొనన్ = ఇముడ్చుకొని; వహించు = ధరించు; ఈశ్వర = దేవతలలో; ఈశ = శ్రేష్ఠుడా; నీకు = నీకు; ఒక్క = ఒక్క; మానినీ = స్త్రీ యొక్క; గర్భ = గర్భాన్ని; రక్షణము = రక్షించటం; ఎంత = ఏపాటి; బరువు = భారము; నిర్వహింతుగాక = తప్పక చేయ్యి (నాగర్భరక్షణ).

గర్భంలో వందలకొద్దీ బ్రహ్మాండాలను భద్రంగా భరించే దేవాధిదేవ! శ్రీకృష్ణా! నీకు ఒక ఆడదాని గర్భాన్ని రక్షించటం ఏమంత బ్రహ్మాండం. ఆపదలో ఉన్న నన్ను ఆదుకోవయ్యా! నా గర్భాన్ని రక్షించవయ్యా!”

1-183-వ.వచనము

అనిన నాశ్రితవత్సలుం డగు నప్పరమేశ్వరుండు సుభద్ర కోడలి దీనాలాపంబు లాలించి, యిది ద్రోణనందనుండు లోక మంతయు నపాండవం బయ్యెడు మని యేసిన దివ్యాస్త్రం బని యెఱింగె; నంతఁ బాండవుల కభిముఖం బయి ద్రోణనందను దివ్యాస్త్ర నిర్గత నిశిత మార్గణంబులు డగ్గఱిన బెగ్గడిలక వారును బ్రత్యస్త్రంబు లందికొని పెనంగు సమయంబున.

అనినన్ = అని కోరగా; ఆశ్రిత = ఆశ్రయించిన వారిని; వత్సలుండు = రక్షించువాడు; అగు = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుండు = కృష్ణుడు {పరమేశ్వరుడు - పరమమైన ఈశ్వరుడు, కృష్ణుడు}; సుభద్ర = సుభద్ర యొక్క; కోడలి = కోడలి; దీన = దీనమైన; ఆలాపంబులు = పలుకులు; ఆలించి = విని; ఇది = ఇది; ద్రోణనందనుండు = అశ్వత్థామ {ద్రోణనందనుడు - ద్రోణునికొడుకు, అశ్వత్థామ}; లోకము = ప్రపంచం; అంతయున్ = సమస్తముూ; అపాండవంబు = పాండవులు లేకుండా; అయ్యెడుము = అవుగాక; అని = అని; ఏసిన = వేసినట్టి; దివ్య = దివ్యమైన; అస్త్రంబు = అస్త్రము; అని = అని; ఎఱింగెన్ = తెలుసుకొన్నాడు; అంతన్ = అంతలో; పాండవులు = పాండవులు; కున్ = కు; అభిముఖంబు = ఎదురు; అయి = అయి; ద్రోణనందను = అశ్వత్థామ; దివ్య = దివ్యమైన; అస్త్ర = అస్త్రమునుండి; నిర్గత = వెలువడిన; నిశిత = వాడైన; మార్గణంబులు = బాణములు; డగ్గఱినన్ = దగ్గరకురాగా; బెగ్గడిలక = చెదరకుండా; వారును = వారుకూడా; ప్రత్యస్త్రంబులు = ఎదురు అస్త్రాలు; అందికొని = తీసుకొని; పెనంగు = యుద్ధము చేయు; సమయంబున = సమయంలో.

ఆపన్నశరణ్యుడైన గోపాలుడు అనుంగు చెల్లెలి కోడలు ఉత్తర దీనాలాపాలు ఆలకించాడు. ఇది, లోకంలో పాండవ వంశం లేకుండా పోవాలని, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అని తెలుసుకొన్నాడు. అంతలో, ఆ దివ్యాస్త్రం నుండి వెలువడుతున్న పదునైన బాణాలు పాండవులను చుట్టుముట్టాయి. వారు బెదరిపోకుండా ఎదురు నిలిచి శరపరంపరలతో సమరం సాగించసాగారు.

1-184-మ.మత్తేభ విక్రీడితము


తన సేవారతిచింత గాని పరచింతాలేశమున్ లేని స

జ్జనులం బాండుతనూజులన్ మనుచు వాత్సల్యంబుతో ద్రోణనం

దను బ్రహ్మాస్త్రము నడ్డుపెట్టఁ బనిచెన్ దైత్యారి సర్వారి సా

ధన నిర్వక్రము రక్షితాఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్.

తన = తనయొక్క; సేవ = భక్తితో; ఆరతి = తపించు; చింత = ఆలోచన; కాని = తప్ప; పర = ఇతర; చింతా = ఆలోచన; లేశమున్ = కొంచెముకూడా; లేని = లేని; సజ్జనులన్ = మంచివారిని; పాండుతనూజులన్ = పాండవులను; మనుచు = కాపాడాలనే; వాత్సల్యంబు = ఆపేక్ష; తోన్ = తో; ద్రోణనందను = అశ్వత్థామ యొక్క {ద్రోణుని కొడుకు - అశ్వత్థామ}; బ్రహ్మాస్త్రమున్ = బ్రహ్మాస్త్రాన్ని; అడ్డుపెట్టన్ = అడ్డుకోమని; పనిచెన్ = నియోగించాడు / ప్రయోగించాడు; దైత్యారి = కృష్ణుడు {దైత్యారి - దైత్యుల శత్రువు, కృష్ణుడు}; సర్వ = సమస్తమైన; అరి = శత్రువులను; సాధన = సాధించుటలో / నశింపచేయుటలో; నిర్వక్రము = తిరుగులేనిది; రక్షిత = రక్షింపబడిన; అఖిల = సమస్త; సుధాంధస్ = దేవతలను గల {సుధాంధసులు – సుధా (అమృతమును) అంధసులు (అన్నముగా కలవారు), దేవతలు }; చక్రమున్ = చక్రమును.

తనను సేవించాలనే భావం తప్ప ఇతర భావం ఏమాత్రం ఎరుగని సచ్చరిత్రులు, సజ్జనులు అయిన పాండవులు ఆపదలో ఉన్నారు, వారిని ఆదరంతో ఆదుకోవాలని రాక్షసాంతకుడు అయిన శ్రీకృష్ణుడు భావించాడు: అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని త్రిప్పికొట్టటం కోసం, శత్రువుల ఆయుధాలకు చెక్కు చెదరనిది, దేవతలు అందరినీ కనురెప్పలా కాపాడేది అయిన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు.

1-185-మ.మత్తేభ విక్రీడితము


సకలప్రాణిహృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ

క్ష్మకళుం డచ్యుతుఁ డయ్యెడన్ విరటజా గర్భంబుఁ దాఁ జక్రహ

స్తకుఁడై వైష్ణవమాయఁ గప్పి కురు సంతానార్థియై యడ్డమై

ప్రకటస్ఫూర్తి నడంచె ద్రోణతనయబ్రహ్మాస్త్రమున్ లీలతోన్.

సకల = సమస్త మైన; ప్రాణి = ప్రాణుల యొక్క; హృద = హృదయముల; అంతరాళములన్ = లోలోపల; భాస్వత్ = ప్రకాశించే; జ్యోతి = దీపము; ఐ = అయి; ఉండు = ఉండే; సూక్ష్మ = సూక్ష్మ మైన; కళుండు = నేర్పున్న వాడు; అచ్యుతుఁడు = హరి {అచ్యుతుడు – చ్యుతము (దిగజారుట) లేని వాడు / విష్ణువు}; ఆ = ఆ; ఎడన్ = సమయములో; విరటజా = ఉత్తర యొక్క {విరటజ - విరటుని సంతానము, ఉత్తర}; గర్భంబున్ = గర్భమును; తాన్ = తాను; చక్ర = చక్రమును; హస్తకుఁడు = చేతిలో ధరించిన వాడు; ఐ = అయి; వైష్ణవ = విష్ణువు {విష్ణువు – విశ్వమంతా వ్యాపించి ఉండు వాడు, హరి} యొక్క; మాయన్ = మాయను; కప్పి = కప్పి; కురు = కురువంశ; సంతాన = సంతానం నిలబడుటను; అర్థి = కోరినవాడు; ఐ = అయి; అడ్డము = అడ్డముగా నిలబడిన వాడు; ఐ = అయి; ప్రకట = అభివ్యక్తమైన; స్ఫూర్తిన్ = స్ఫూర్తితో; అడంచెన్ = అణిచాడు; ద్రోణతనయు = అశ్వత్థామ {ద్రోణతనయుడు - ద్రోణుని కుమారుడు, అశ్వాత్థామ}; యొక్క; బ్రహ్మాస్త్రమున్ = బ్రహ్మాస్త్రమును; లీల = అవలీల, లీలావిలాసము; తోన్ = గా.

సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాళాల్లో జ్యోతిర్మూర్తియై ప్రకాశించే వాసుదేవుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించటం కోసం చక్రాన్ని ధరించి, ఉత్తరాగర్భాన్ని యోగమాయతో కప్పివేసి, అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు.


1-186-వ.వచనము

ఇట్లు ద్రోణతనయుం డేసిన ప్రతిక్రియారహితం బయిన బ్రహ్మశిరం బనియెడి దివ్యాస్త్రంబు వైష్ణవతేజంబున నిరర్థకం బయ్యె; నిజ మాయావిలసనమున సకలలోక సర్గస్థితి సంహారంబు లాచరించు నట్టి హరికి ధరణీసుర బాణ నివారణంబు విచిత్రంబు గాదు; తత్సమయంబున సంతసించి, పాండవ పాంచాలీ సహితయై గొంతి గమనోన్ముఖుం డైన హరిం జేర వచ్చి యిట్లనియె.

ఇట్లు = ఈ విధంగా; ద్రోణతనయుండు = అశ్వత్థామ {ద్రోణతనయుడు - ద్రోణుని కొడుకు, అశ్వత్థామ}; ఏసిన = వేసిన; ప్రతిక్రియా = ఎదురు చేయటకు; రహితంబు = వీలు లేనట్టిది; అయిన = అయినటువంటి; బ్రహ్మశిరంబు = బ్రహ్మశిరము; అనియెడి = అనే; దివ్య = దివ్యమైన; అస్త్రంబు = అస్త్రం; వైష్ణవ = విష్ణువు యొక్క; తేజంబున = ప్రభావమువలన; నిరర్థకంబు = నిష్ప్రయోజనం; అయ్యెన్ = అయిపోయింది; నిజ = తన; మాయా = మాయ యొక్క; విలసనమున = విలాసము వలన; సకల = సమస్త; లోక = లోకముల యొక్క; సర్గ = సృష్టి; స్థితి = పాలన; సంహారంబులు = సంహారములు; ఆచరించున్ = ఆచరిస్తూ ఉండు వాడు; అట్టి = అయినట్టి; హరి = కృష్ణుని; కిన్ = కి; ధరణీసుర = బ్రాహ్మణుని {ధరణీసుర - భూమికి దేవత, బ్రాహ్మణుని}; బాణ = బాణమును; నివారణంబు = ఆపుట; విచిత్రంబున్ = విచిత్రమేమి; కాదు = కాదు; తత్ = ఆ; సమయంబున = సమయంలో; సంతసించి = సంతోషించి; పాండవ = పాండవులతోను {పంచపాండవులు - పాండురాజు సంతానము, 1ధర్మరాజు, 2భీష్ముడు, 3అర్జునుడు, 4నకులుడు, 5సహదేవుడు}; పాంచాలీ = ద్రౌపదితోను {పాంచాలి - పాంచాల రాకుమార్తె. ద్రౌపది}; సహిత = కూడినది; ఐ = అయి; గొంతి = కుంతి; గమన = వెళ్ళుటకు; ఉన్ముఖుండు = సిద్ధపడినవాడు; ఐన = అయినట్టి; హరిన్ = కృష్ణుని {హరి - సర్వ దుఃఖములను హరించు వాడు, విష్ణువు}; చేరన్ = చేరువకు; వచ్చి = వచ్చి; ఇట్లు = ఈ విధంగా; అనియెన్ = పలికెను.

అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం తిరుగులేనిది అయినప్పటికీ, వైష్ణవ తేజస్సు ముందు వ్యర్థం అయిపోయింది. ఒక బ్రాహ్మణ యువకుడి బాణాన్ని నివారించటం అన్నది, తన మాయా ప్రభావంతో నిఖిల జగత్తును నిర్మించి, భరించి, హరించే పరమాత్ముడికి విచిత్రమైన విషయమేమీ కాదు. అప్పుడు ఎంతో సంతోషంతో కుంతీదేవి కోడలు ద్రౌపది, కొడుకులు పాండవులతో వచ్చి ద్వారకకు ప్రయాణం అవుతున్న శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా స్తుతించింది-


ఘోర_కష్టోద్ధారణ_స్త్రోత్రం

ఘోరమైన_కష్టాలను_తొలగించే_శ్రీ_దత్తాత్రేయ_స్వామివారి ఘోర_కష్టోద్ధారణ_స్త్రోత్రం

ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.

1.శ్రీ పాద శ్రీ వల్లభ త్వం సదైవ
శ్రీ దత్తా స్మాన్ పాహి దేవాధిదేవ|,
భవగ్రహ క్లేశ హరిన్ సుకీర్తే   
ఘోరకష్టా దుద్ధారా స్మాన్ నమస్తే ||.

2.త్వం నో మాతా త్వం నో పితాప్తో ధి పస్త్వం త్రాతాయోగ క్షేమకృత్ సద్గురు స్త్వమ్
త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే
ఘోరకష్టా దుద్ధారా స్మాన్ నమస్తే ||.

3.పాపం తాపం వ్యాధిదీం చ దైన్యమ్
భీతిం క్లేశం త్వం హ రాశు త్వ దైన్యమ్|
త్రాతారం నో వీక్ష ఇషాస్త జూర్తే
ఘోరకష్టా దుద్ధారా స్మాన్ నమస్తే ||.

4.నాన్య స్త్రాతా న పీడాన్ న భర్తా
త్వత్తో దేవ త్వం శరణ్యో శోకహర్తా|
కుర్వత్రేయ అనుగ్రహం పూర్ణరతే
ఘోరకష్టా దుద్ధారా స్మాన్ నమస్తే ||.

5.ధర్మే ప్రీతీం సన్మతం దేవభక్తిమ్
సత్స్ జ్ఞప్తి దేహి భుక్తి చ ముక్తిం |
భవ శక్తీమ్ చ అఖిలానంద మూర్తే
ఘోరకష్టా దుద్ధారా స్మాన్ నమస్తే ||.

శ్లోక పంచక మతద్యో లోక మంగళ |వర్ధనం |
ప్రపటేన్యతో భక్త్యా స శ్రీ దత్తాత్రేయ ప్రియో భవేత్ ||

ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.

ఇతి శ్రీ పరమహంస పరి వ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఘోర
కష్ట ఉద్దారక శ్లోకం సంపూర్ణం

అందరం భక్తితో
"దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా
దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు

దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా
దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా

*పురుషోత్తమ మాసం..*

*_రేపటి నుండి అధిక మాసం ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా ? చేయకూడదా ?_*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ శార్వరి నామ సంవత్సరంలో అధిక మాసం వచ్చింది. అయితే ఈ అధిక మాసంలో ఏ విధమైన శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసం 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 18వ తేదీన వచ్చింది.

అయితే ఈ సమయంలో దేవుళ్ల పూజలకు సంబంధించిన కార్యక్రమాలను మాత్రం కచ్చితంగా చేయాలంట. ఎందుకంటే శుభకార్యాలు వేరు. దేవతల పూజలు వేరు. ఈ అధిక మాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.

ఈ అధిక మాసంలోని 30 రోజులలోని ఏడు రోజులలో ప్రత్యేకించి పౌర్ణమికి ముందుగా భాగవతాన్ని పారాయణం చేయాలి లేదా భాగవతం పారాయణం చేసే పండితులకు ఆ గ్రంధాన్ని అందజేయాలి. భాగవతంలోని దశమ స్కందంలోని క్రిష్ణునికి సంబంధించిన కథనాలను పారాయణం చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇలాంటి అవకాశం ప్రతి సంవత్సరం రాదు. ఈ అధిక మాసం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. కాబట్టి ఇలాంటి సువర్ణాకాశాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాల ప్రజలు చాంద్రమానాన్ని పాటిస్తే.. తమిళనాట ఉండే ప్రజలు సౌరమానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

*అధికమాసం అంటే ?*
చంద్రుని కదలికలను అనుగుణంగా ఉండే చాంద్రమానం కు , సూర్యుని కదలికలను అనుగుణంగా ఉండే సౌర మానంకు లెక్కల్లో కొన్ని తేడాలు వస్తుంటాయి. అందులో సౌరమానంలో సంవత్సరానికి కేవలం 360 రోజులు మాత్రమే వస్తాయి. అదే చాంద్రమానంలో 365 రోజులు వస్తాయి. ఇలాంటి తేడాలను సరిచేసి ఒకే లైనుపై తీసుకొచ్చే ప్రయత్నాన్ని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చేశారు. ఇలా రెండు మాసాలను సర్దుబాటు చేసిన కాలాన్నే అధిక మాసం అంటారు.

*ఎప్పుడైతే సంక్రమణం ఉండదో..*
ఈ మాసంలో పౌర్ణమి వచ్చినప్పటికీ , ఆ పౌర్ణమితో కూడుకున్నటువంటి విశేష గుణగణాలు కనిపించవని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో సంక్రమణం కూడా రాదు. అసంక్రాంతి , ద్విసంక్రాంతి వస్తుంది. ఏ మాసంలో అయితే సంక్రమణం ఉండదో ఆ మాసమే అధిక మాసం అని చెబుతున్నారు.

*శుభకార్యాలు చేయకూడదు..*
ఇలా సంక్రమణం లేని మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వివాహ కార్యక్రమాలు , ఇంట్లోకి ప్రవేశించడం , ఉపనయనాల వంటివి చేయకూడదు.

*దేవతలకు పూజలు..*
అయితే ఈ మాసంలో సకల దేవతలకు పూజలు మాత్రం చేయొచ్చు. ఎందుకంటే ఇవి శుభకార్యాలు కాదు. ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలైన సత్యనారాయణ వ్రతం , దేవుళ్లకు అభిషేకాలు , నవగ్రహ హోమాలు , నవగ్రహ జపాలు , శాంతి పూజలు ప్రత్యేకించి భాగవత పారాయణం , రామాయణ పారాయణం , ఆంజనేయస్వామికి సంబంధించి హనుమాన్ చాలీసా వంటివి కచ్చితంగా చేయాలి.

*ఈ నెలలో పుణ్యకార్యాలు చేస్తే..*
ఈ నెల మొత్తం ఒక నియమం పెట్టుకోవాలి. నిత్యం ఇష్టదైవాన్ని తలచుకుని ద్యానం చేయడం లేదా జపం చేయడం వంటివి చేస్తే ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుంది. ఉదాహరణకు మిగిలిన మాసాల్లో ఒకసారి రామ అంటే , ఒక్కసారే ఫలితం వస్తుంది. అయితే ఈ అధిక మాసంలో అంటే మాత్రం కోటి రెట్ల ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

*పురుషోత్తమ మాసం..*
ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా కూడా పిలుస్తారు. ఉత్తమ పురుషగా అందరి జీవులలో ఉండేవాడు.. సర్వజీవులలో ఆత్మస్వరూపుడిగా ఉండే వాడు పరమాత్ముడు. ఆ విధంగా పరమాత్ముడిని దర్శించడానికి , అందుకు ప్రాతిపదికగా తనలో ఉన్న ఆత్మను దర్శించడానికి ఈ సమయం చాలా అనుకూలమైనది.

*దానం చేయడం..*
ఈ కాలంలో దానం చేయడం వల్ల ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసంలో పేదలకు లేదా ఇతరులకు ఏమి దానం చేసినా ఎంతో మంచిది. అయితే అన్నిదానాల్లో కన్న మిన్న అయిన అన్నదానం చేస్తే మంచిది లేదా విద్యా దానం చేసినా కూడా మీకు శుభప్రదమైన ఫలితాలొస్తాయట. ఈ రెండింటికి అధిక ప్రాధాన్యం ఉంది. అయితే ఇవే చేయాలని నియమనిబంధనలేమీ లేవు. కాబట్టి మీరు నిరంతరం భగవంతుడి స్మరణ చేస్తూ.. మీ శక్తి మేరకు మీకు తోచిన సాయం చేయండి.

భూ కైలాస్




ప్రణవము

ప్రణవమునకు పూర్వాచార్యులు ప్రసాదించిన వివరణను ఇచ్చట పొందుపరుస్తున్నాను..   అకారమును ఉకారమును కూడినప్పుడు గుణసంధి వచ్చి "ఓ" అగును. దాని తర్వాత "మ" కార మున్నది.  కావున ప్రణవము అకార ఉకార మకారము లనెడి మూడక్షరములుగా ఉన్నది.  శృతియందు "ఓమిత్యేకాక్షరమ్" అని ప్రణవమును చెప్పియుండగా, ఇచ్చట మూడక్షరములుగా విడదీసి చెప్పుట తగునా అని కొందరు శంకిపవచ్చు. ఇందు సంహితకారమని, అసంహితకారమని  రెండు క్రమములు ఉన్నవి. సంధినొందిన ఆకారమును సంహితాకారమనియు, విసంధిగా నుండు ఆకారమును అసంహితాకారమనియు చెప్పుదురు. అసంహితాకారముగా గొనినప్పుడు ప్రణవము ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క పదము కావున మూడు పదములు మూడు అర్థములును తెలుపును. సంహితాకారముగా తీసికొన్నప్పుడు ఏకాక్షరముగాను, ఏకపదముగాను, ఏకార్ధముగాను తెలుపుచున్నది. "ఓమిత్యేకాక్షరమ్" అని చెప్పిన శృతికి దీని సంహితాకారము కారణము.

ప్రశస్తమయిన మాటలని

ఒకనాడు భోజరాజు ఆస్థానానికి దక్షిణ దేశం నుండి లక్ష్మీధరుడు అనే కవి వచ్చాడు.
ఆయన ముఖం తేజస్సు తో వెలిగిపోతూ వుంది.భోజరాజు ఆ కవిని గురించి ఎప్పుడూ విని
వుండలేదు .ఆయనను చూడగానే ఈయన మహానుభావుడు అనే అభిప్రాయం కలిగింది.
కవిగారు భోజరాజుకు మంగళ వాక్యాలతో స్వస్తి చెప్పి అభివాదం చేసి కూర్చున్నాడు
రాజా! నీది పండిత,మండిత సభ.నీవు సాక్షాత్తూ నారాయణ స్వరూపుడివి.అని ఒక శ్లోకం చెప్పాడు
  భోజ ప్రతాపం తు విధాయ ధాత్రా
  శేషై: నిరస్తై:పరమాణుభి:కిం
  హరే: కారే భూత్ పవి,రంబరే చ
  భాను:పయోధే:ఉదరే కృశాను:
అర్థము:--ఆ బ్రహ్మ భోజుడి పరాక్రమాన్ని సృష్టించి,మిగిలిపోయి వదిలేసిన
పరమాణువులతో యింద్రుడి చేతిలోని వజ్రాయుధమూ,ఆకాశము లో సూర్యుడు,
,సముద్రం మధ్యలో బడబాగ్ని తయారయ్యాయేమో.
ధాత్రా=ఆ బ్రహ్మ చేత భోజప్రతాపం విధాయ=భోజుడి పరాక్రమం సృష్టించ బడి, శేషై:
నిరస్తై పరమాణుభి:=మిగిలిపోయి పారేసిన పరమాణువు లతో,హరే: కరే అభూత పవి:=ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం ఏర్పడింది,ఆకాశములో సూర్యుడూ,పయోధే ఉదరే కృశాను:=సముద్ర గర్భం లో బడబాగ్ని కూడా ఏర్పడి నాయేమో
రాజు,సభికులు ఆ శ్లోకం విని చకితులయ్యారు.రాజు కవికి అక్షరలక్షలు యిచ్చాడు.
రాజా నీ రాజ్యం లోనే ఉండిపోవాలనే కోరికతో సకుటుంబంగా వచ్చాను అన్నాడు
లక్ష్మీధరుడు. ఎందుకంటే
   క్షమీ దాతాః గుణ గ్రాహీ స్వామీ స్వామీ పుణ్య యేన లభ్యతే
   అనుకూలః శుఛి: దక్షః కవిహి విద్వాన్ సుదుర్లభః
తా:-- క్షమాగుణం వున్నవాడు,దాత, ప్రతిభ గురించగలవాడు.అయిన ప్రభువు పుణ్యం .
వలననే లభిస్తాడు.దానికి తోడు, అనుకూలుడూ,నిర్మలుడూ,సమర్థుడూ,పైపెచ్చు కవీ, విద్వాంసుడూ అయిన నీలాంటి రాజు దొరకడం చాలా కష్టం..
భోజరాజుకు అలాంటి కవులు ఆశ్రయం కోరి వస్తే యింక కావలిసింది ఏముంటుంది?
ఈయనకు వెంటనే ఒక ఇల్లు ఏర్పాటు చేయ వలిసిందని మంత్రిని ఆజ్ఞాపించాడు.
ఆ సమయము లో ఏ ఇల్లూ ఆయనకు యివ్వద్ఫానికి ఖాళీగా లేదు.మంత్రి వెతికి
వెతికి ఒక నేత గాడు వున్న యింటికి వెళ్లి నీవు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలి.ఈ
యింట్లోకి మహా విద్వాంసుడికి ఇవ్వాల్సి వుంది అని చెప్పాడు.ఆ నేతగాడికి చాలా
బాధ కలిగింది.యిప్పటి కిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే తనేక్కడికి వెళ్ళాలి?అని
నేరుగా రాజు గారి దగ్గరకు వెళ్లి నమస్కరించి తన గోడు చెప్పుకున్నాడు.రాజా!నీ
మంత్రి నన్ను మూర్ఖుడిగా లెక్క కట్టేశాడు.అన్యాయంగా నన్నుయింటినుంచి
వెళ్లగొడుతున్నాడు..ఎవరో గొప్ప విద్వాంసుడికి యిస్తాడట.నీవైనా పరీక్షించి చూడు
నేను మూర్ఖుడి నో పండితుడనో అని ఈ శ్లోకం చెప్పాడు.

             కావ్యం కరోమి నహి చారు తరం కరోమి
            యత్నాత్ కరోమి యది చారుతరం కరోమి
            భూపాల మౌళి మణి రంజిత పాద పీట
            హే సాహసాంక! కవయామి వయామి యామి
తా:--కావ్యం నేనూ వ్రాస్తాను.కానీ అంత చక్కగా రాయలేను.బాగా ప్రయత్నిస్తే
చక్కగానూ వ్రాయగలను.,శత్రురాజుల శిరస్సు మీది రత్నాల కాంతి చేత ఎర్రగా
ప్రకాశించే పాద పీఠంకల మహారాజా! సాహసమే మారు పేరుగా గలవాడా! కవయామి=కవిత్వమూ వ్రాస్తాను,వయామి=నేతా నేస్తాను,యామి=వెళ్ళమంటే వెళ్ళీ పోతాను. ఈ శ్లోకంలో చమత్కారమేమిటంటే .చివరి పాదం లోని 'కవయామి' 'వయామి' 'యామి' అన్నమాటలు ఎంతో చమత్కార యుక్తములుఎలాగంటే 'కవయామి' అనేది ఒక క్రియాపదం. కవిత్వముచెప్పగలను అని దాని అర్థం.అందులో మొదటి అక్షరం 'క' తీసివేస్తే 'వయామి' అవుతుంది. అంటే మగ్గం నేసుకోగలను అని అర్థం, దానిలోనుండి 'వ' అనే అక్షరం తీసివేస్తే 'యామి' అవుతుంది. వెళిపోగలను అని అర్థం. యిలా ఒకపదం నుండి ఒక్కొక్క అక్షరాన్ని తగ్గిస్తూ పోతే యింకో క్రియాపదం రావడం ఎంతో చమత్కారం.

రాజుకు ఒక నేతగాడు తనను నువ్వు అని సంబోధిస్తుంటే ఆశ్చర్యమూ,ఆ నేతగాడి
కవితా మాధుర్యానికి సంతోషమూ కలిగాయి. కవితా శక్తి మాటయితే కొంచెంఆలోచించ
వలిసిందే కానీ నీ శ్లోకం చాలా బాగుంది.అన్నాడు. ఆ నేత కార్మికుడికి కొంచెం కోపం వచ్చింది.పైకి మాత్రం రాజా!ఒక్క విషయం చెప్పాలని వుంది.కానీ రాజధర్మం చెప్పాలని వుంది.కానీ రాజధర్మం వేరు,విద్వాంసుల ధర్మం వేరు అందుకని చెప్పలేక , అందుకని చెప్పలేక పోతున్నాను.అన్నాడు. ఏమిటా విషయం?సంకోచించకుండా చెప్పు అన్నాడు రాజు. దేవా!నేను కాళిదాసును తప్ప ఇతరులను కవులుగా పరిగణించ లేకపోతున్నాను.నీ సభలో కవిత్వ తత్వం తెలిసిన విద్వాంసులు కాళిదాసు తప్ప యింకెవరున్నారు?అని యింకో శ్లోకం చెప్పాడు.

యత్-సారస్వత సౌరభం గురు కృపా పీయూష పాకోద్భవం
తత్ -లభ్యం కవినైవ;హఠతః పాఠ ప్రతిష్ఠాజుషా
కాసారే దివసం వసన్నపి పయః పూరం పరం పంకిలం
కుర్వాణః కమలాకరస్య లభతే కిం సౌరభం సైరిభః
అర్థము:--కవిత్వ సౌరభం అనేది గురు కృప అనే అమృతపాకం వల్ల పుట్టేది.అది కవి
అయిన వాడికే లభిస్తుంది.బలవంతంగా (హఠతః)పాఠాలు చెప్పించుకుని
ఎక్కించుకునే వాడికి దొరకదు.రోజంతా చెరువులో కూర్చొని (కాసారే దివసం వాసన్ అపి) చెరువునంతా పూర్తిగా కలుషితం చేస్తున్న (పయః పూరం పరం పంకిలం కుర్వాణః)
దున్నపోతు(సైరిభః) తామరకొలను సౌరభాన్ని పొందుతుందా?

అయం మే వాగ్గుమ్భః-విశదపద వైదగ్ధ్య మధురః
స్ఫురత్-బంధః, వంధ్యః పరహృది,కృతార్థ: కవిహృది
కటాక్షః-వామాక్ష్యా: దరదళిత నేత్రాంత గళితః
కుమారే నిస్సారః,స తు కిమపి యూనః సుఖయతి.

అర్థము:- ఈ నా పద గుంభనము స్పష్ట మైన పదాల అమరికతో మధురమైనది,పద
బంధాల మెరుపు గలది.అది కవి హృదయాన్నే మెప్పిస్తుంది.యితర హృదయాలలో
అది నిష్ఫల మైపోతుంది. అతివ అరమోడ్పు కన్నుల నుంచి జారే చూపు పసిబాలుడికి
పనికి రాదు,పడుచు వాడి నయితేనే అది ఉల్లాస పరచగలదు. పోతే నేను నిన్ను నువ్వు నువ్వు అన్నానని కోపగించుకోకు.

బాల్యే సుతానాం,సురతేంగ నానాం
స్తుతౌ కవీనాం,సమరే భటానాం
'త్వం' కార యుక్తాః హి గిరః ప్రశ స్తాః
కః ది ప్రభో మోహభరం, స్మరత్వం
అర్థము:--బాల్యం లో కుమారులకూ,ఏకాంత ప్రణయ వేళలలో స్త్రీలకూ,స్తుతించే
టప్పుడు కవులకూ,యుద్ధము లో సైనికులకూ 'నువ్వు' అన్న సంబోధన తో కూడిన
మాటలే ప్రశస్తమయిన మాటలని శాస్త్రం జ్ఞాపకం చేసుకో నీ కెందుకీ అపార్థం?
బోజరాజు బాగా చెప్పావు అని మెచ్చుకొని అతనికి అక్షర లక్షలిచ్చి సన్మానించటమే
కాక వున్న యింట్లోనే ఉండేందుకు అనుమతి నిచ్చి పంపేశాడు.ఆ లక్ష్మీధర కవికి
త్వరగా ఒక భవనం నిర్మించమని,అంతవరకూ అతన్ని అతిథి గృహం లోనే వుంచమని
మంత్రిని ఆదేశించాడు. అలా ఆ నేతగాడు కవిత్వం చెప్పి రాజును మెప్పించి తన యింటిని కాపాడుకున్నాడు.
----------------------------------------------------------

చంద్రోదయం




జీవితం అంటే ఇదేనేమో




average

ఒక economics ప్రొఫెసర్ తన స్నేహితులతో ఇలా చెప్పారు,
నేను పనిచేసే కాలేజీ లో ఇప్పటివరకు ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు,
కానీ ఈ మధ్య ఒక క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చెయ్యవలసి వచ్చింది....!!!
ఎలా అని అడిగారు మిగతా వాళ్లు...!!!!

ఒక క్లాస్ వాళ్ళు ఇలా అడిగారు,
క్లాస్ లో టాప్ ర్యాంకర్, లీస్ట్ ర్యాంకర్ అని వొద్దు,
అందరూ ఒకటే ర్యాంక్ అన్నారు,
ప్రొఫెసర్ ok అన్నారు...
మీ అందరి మర్క్స్ add చేసి ,average తీసి రాంక్స్ ఇస్తా అన్నారు,

మొదటి సెమిస్టర్ లో,average ర్యాంక్ B వచ్చింది అందరికి,

2 nd సెమిస్టర్లో అందరికి D ర్యాంక్ వచ్చింది,

3rd సెమిస్టర్ లో అందరికి f వచ్చింది,

ఫైనల్ exams లో అందరూ ఫెయిల్ అయ్యారు,
స్టూడెంట్స్ అందరూ అవాక్కు అయ్యారు,
బాగా చేదివేవాళ్ళు ఎవరికోసమో మేము చదవటం ఎందుకు అని చదవటం మానేశారు,
చదువు తక్కువ చదివే స్టూడెంట్స్ ఎలాగ తెలివికల వాళ్ళు చదువుతారు కదా ,ఇంకా మేము ఎందుకు చదవటం అని చదవటం పూర్తిగా మానేశారు,

ఈ ఎక్స్పరిమెంట్ లో నాలుగు పాయింట్స్ నేర్చుకోవొచ్చు,

1. చట్టం ద్వారా పేదవాడి ని సంపన్నుడిని చేయలేము,
కానీ అదే చట్టం ద్వారా సంపన్నుడిని పేదవాడిగా చెయ్యొచ్చు,

2. ఒకరు ఎమన్నా ఉచితం గా పొందురున్నారు అంటే
మరొకళ్ళు ఆ ఉచితం ఇవ్వటం కోసం కష్టపడుతున్నారు,

3. గవర్నమెంట్ ఏదన్నా ఉచితం గా ఇస్తుంది అంటే,
ఎవరి దగ్గరనుండో ఆ ఉచితానికి కావలసిన కష్టాన్ని తీసుకుంటుంది,
4. ఉన్నది పంచుకుంటూ పోతే సంపద సృష్టి జరగదు,
కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి,

సగం మంది ప్రజలు మేము కష్టపడటం ఎందుకు,
అన్ని మాకు ఉచితం గా వొస్తున్నాయు అనుకుంటే,

మిగతా సగం కష్టపడి ,ఉచితాలుకి కావలసినవి సమకూర్చుతున్నారు,
ఈ కష్ట పడేవాళ్ళు ఎందుకు మాకి కష్టం,ఎవరినో కూర్చోపెట్టి మేపటానికి అని ,కష్టపడటం మానేస్తే,
అక్కడే దేశవినాశనానికి బీజం పడుతుంది..
పార్టీలకతీతంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి నలుగురితో చర్చించండి....దేశం కోసం...రేపటి తరాల కోసం.....🙏🙏🙏

వ్యాసమహర్షి

వ్యాసమహర్షి మహాభారతాన్ని 3 సంవత్సరములు రచించాడు.ఈ మహాభారతమును స్వర్గంలో చెప్పడానికి నారద మహామునుని, పితృ లోకంలో చెప్పడానికి దేవలుడుని, గరుడ గంధర్వ యక్షరాక్షస లోకములలో చెప్పడానికి తన కుమారుడైన శుకమహర్షిని, సర్ప లోకములో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయనుడిని నియమించారు వ్యాసమహర్షి.
 

వ్యాసమహాభారతం లో మొత్తం 100 పర్వములు ఉన్నాయి. అవి
1 పౌష్యము. 2.పౌలోమము. 3.ఆస్తీకము. 4.ఆదివంశావతరము.
5.సంభవపర్వము 6.జతుగృహదాహము. 7.హైండింభము 8.బకవధ
9.చైత్రరధము. 10.ద్రౌపదీస్వయంవరం 11.వైవాహికము 12.విదురాగమనము
13.రాజ్యార్ధలాభము 14.అర్జున తీర్థయాత్ర 15.సుభద్రాకల్యాణం 16.హరణ హారిక
17.ఖాండవధహనము. 18.మయదర్శనము

19.సభాపర్వము 20.మంత్రపర్వము
21.జరసంధవధ 22.దిగ్విజయము 23రాజసూయము. 24.బర్ఘ్యాభిహరణము
25.శిశుపాలవధ 26.ధ్యూతము 27.అనుధ్యూతము

28.అరణ్యము
29.కిమ్మీరవధ 30.కైరాతం. 31.ఇంద్రలోకాభిగమనము 32.ధర్మజతీర్ధయాత్ర
33.జటాసురవధ 34.యక్షయుద్ధం 35.అజగరము 36.మార్కాoడేయోపఖ్యానము
37.సత్యాద్రౌపదిసంవాధము. 38.ఘోషయాత్ర 39.ప్రాయోపవేశము 40వ్రిహిద్రోణకాక్యానము
41.ద్రౌపదీహరణము 42.కుండలాహరణము 43.అరణేయము

44.వైరాటము 45.కీచకవధ 46.గోగ్రహణము 47.అభిమన్యువివాహము

48.ఉద్యోగము
49.సంజయయానము 50.ద్రుతరాష్ట్రప్రజాగారణము. 51.సానత్సుజాతము 52.యానసంధి
53.భగవధ్యానం 54.సేనానిర్యాత 55.ఉలూకధూతాభిగమనము 56.సమారథ,అతిరథ సంఖ్యానము
57.కర్ణ భీష్మ వివాదము 58.అంబోపాఖ్యానము 59.జంబుఖ౦డవినిర్మానము 60.భూమిపర్వము

61.భీష్మాభిషేకము 62.భగవద్గీత 63.భీష్మవధ

64.ద్రోణాభిషేకము
65.సంశప్తక వధ 66.అభిమన్యు వధ 67.ప్రతిజ్ఞాపర్వము 68.జయద్రద వధ
69.ఘటోత్కచ వధ 70.ద్రోణ వధ 71.నారాయణాస్త్ర్హప్రయోగము

72.కర్ణపర్వము

73.శల్యపర్వము 74.హ్రదప్రవేశము 75.గదాయుద్ధము 76.సారస్వతము.

77.సౌప్తికపర్వము 78.వైషీఖము 79.జలప్రధానము.

80.స్త్రీపర్వము
81.శ్రాద్ధపర్వము 82.రాజ్యాభిషేకము 83.చార్వాకనిగ్రహము 84.గృహప్రవిభాగము.

85.శాంతిపర్వము 86.రాజధార్మానుకర్తనము 87.ఆపద్ధర్మము.
88.మోక్షధర్మము

89.అనుశాసనికం 90.భీష్మస్వర్గారోహణం

91.ఆశ్వమేధికము 92.అనుగీత

93.ఆశ్రమవాసము 94.పుత్రసందర్శనము 95.నారదాగమనము
96.మౌసలము 97.మహాప్రస్ధానికము

98.స్వర్గారోహణం

99.హరివంశము

100.భవిష్యత్పర్వము.

-_______________________________________________-
                                     
ఓ రోజు రాజరాజనరేంద్రుడు తన ఆస్థాన కవి అయిన నన్నయతో , నేను ఎన్నో పురాణాలు విన్నాను. అర్ధశాస్త్రముల గురించి తెలుసుకున్నాను. నాటకములు చూసాను. ఎన్ని విన్నమహాభారతము విన్న దానితో సాటిరాదు. కానీ మహాభారతము సంస్కృతములో ఉన్నది. దానిని దయచేసి మీరు తెలుగులోనికి రాయండి, అని అన్నాడు.

దానికి నన్నయ్య "మహారాజ! మహాభారతాన్ని తెలుగులోకి రాయడమంటే ఇసుకలో రేణువులు లెక్కబెట్టుటవంటిది నా వల్ల అవుతుందా ? అయిన మీరు అజ్ఞాపించారు కావున తప్పకుండ ప్రయత్నిస్తాను". అని మహాభారత తెలుగు అనువాదానికి శ్రీకారం చుట్టాడు.

మహాభారతములోని 100 పర్వములను తెలుగులో 18 పర్వములకు కుదించారు.

1.అనగా వ్యాస మహాభారతములోని మొదటి పర్వమైన పౌష్యము నుండి పద్దెనిమిదవ పర్వమైన మయదర్శనము వరకు ఆదిపర్వముగాను,

2.పందొమ్మిదవ పర్వము సభాపర్వము నుండి ఇరవైఏడవ పర్వము అనుధ్యూతము వరకు తెలుగులో సభా పర్వముగాను,

3.రవైఎనిమిదవ పర్వము అరణ్యము నుండి నలభైమూడవ పర్వము అరణేయము వరకు తెలుగులో అరణ్యపర్వము గాను,

4.నలభై నాలుగవ పర్వము వైరాటము నుండి నలభై ఏడవ పర్వము అభిమన్యు వివాహము వరకు విరాట పర్వము గాను,

5.నలభై ఎనిమిదవ పర్వము ఉద్యోగము నుండి అరవైయవ పర్వము భూమి పర్వము వరకు ఉద్యోగ పర్వముగాను,

6.అరవై ఒకటవ పర్వము భీష్మాభిషేకము నుండి అరవై మూడవ పర్వము భీష్మవధ వరకు భీష్మ పర్వము గాను,

7.అరవై నాలుగవ పర్వము ద్రోణాభిషేకము నుండి డబ్బై ఒకటవ పర్వము నారాయణాస్త్ర్రప్రయోగము వరకు ద్రోణ పర్వము గాను,

8.డబ్బై రెండవ పర్వము కర్ణపర్వము యధాతధంగా కర్ణపర్వముగాను,

9.డబ్బై మూడవ పర్వము శల్క్య పర్వము నుండి డబ్బై ఆరు సారస్వతము వరకు శల్య పర్వము గాను,

10.డబ్భై ఏడవ పర్వము సౌప్తికపర్వము నుండి డబ్భై తొమ్మిదవ పర్వము జలప్రధానము వరకు తెలుగులో సౌప్తికపర్వముగాను,

11.ఎనభైయవ పర్వము స్త్రీ పర్వము నుండి ఎనభై నాలుగవ పర్వము గృహప్రవిభాగము వరకు స్త్రీ పర్వము గాను,

12.ఎనభై అయిదవ పర్వము శాంతి పర్వము నుండి ఎనభై ఎనిమిది మోక్షధర్మము వరకు శాంతి పర్వము గాను,

13.తరువాతి రెండు పర్వాలను అనుశాసనిక పర్వముగాను,

14.తరువాతి రెండు పర్వాలను అశ్వమేధ పర్వముగాను,

15.తరువాతి మూడు పర్వములను ఆశ్రమవాస పర్వము గాను,

16.చివరి ఒక్కొక్క పర్వమును మౌసల,
17.మహాప్రస్థానిక,
18.స్వర్గారోహణ పర్వములుగా విభజించి కుదించి రచించడం జరిగింది.

పోలాల అమావాస్య - పూజ

**

మనము, మన సంతానం ఆయురారోగ్యాలతో ఉండటానికి కారణం మన గ్రామ దేవతల కరుణా
కటాక్షాలే! అందుకే మన పెద్దలు గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పండుగల రూపాలలో ఎన్నో అవకాశాలు కల్పించారు. మరి అటువంటి గ్రామదేవతలలో పోలేరమ్మ ఒక ముఖ్యమైన దేవత.

పోలాల అమావాస్య నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుని, అమ్మవారుగా కొలవబడే పోలేరమ్మ వారిని
పూజించు తారు.

పోలాల అమావాస్యనాడు పోలేరమ్మ ఆరాధన ఉత్తరాంధ్ర, ఒరిస్సాలలో మహాళయపక్షములు అయిన చివరి రోజు అనగా భాద్రపద అమావాస్యనాడు చేస్తారు. మిగిలిన వారు శ్రావణమాసంలో అమావాస్యనాడు పోలేరమ్మను ఆరాధిస్తారు. ఆరోజున కొందరు మహిళలు తమ సంతానము ఆయురారోగ్య భాగ్యాలతో వర్ధిల్లాలని 3,5,9,11 బేసిసంఖ్యలో పిల్లపాపలతో కళకళలాడే ముత్తైదువల ఉన్న ఇళ్ళకు వెళ్ళి ఆ ముత్తైదువల చేతుల మీదుగా బియ్యం, కూరలు వగైరా జోగిరూపంలో సంగ్రహించి తమ ఇంటికి తీసుకు వచ్చి కొన్ని బియ్యపు (బియ్యం, కొబ్బరి కలిపి రుబ్బి) పిండితో నీటిలో ఉడికించి, అందులో బెల్లం వేసి హారది, మరియు తమకు జోగిరూపంలో దొరికిన పెసరపప్పు మరియు బియ్యం కలిపి పొంగలి (పప్పు హారది) చేసి, తొమ్మిదిరకాల కాయగూరలతో అందులో కంద, చామ తప్పనిసరిగా ఉండేవిధంగా కలగాయ పులుసు చేసి అవి పోలేరమ్మకు నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఇంట్లో పిల్లలతో సహా అందరూ ఆరగించుతారు.

 పొలాల అమావాస్య ముందు రోజు ఒక కంద మొక్క (తల్లీ,పిల్ల మొక్కలు ఒకే కుదుటలో ఉండాలి).
ఇంకా ఒక వరిదుబ్బు కూడా కందమొక్కతో కలిపి ఉంచడం ఉత్తరాంధ్రలో ఆనవాయితీ. ఆ కందమొక్క వీలయితే చిన్న కుండీలో ఉంటే మంచిది. పూజ అయినతరువాత మన మిగిలిన మొక్కలతో పెరుగుతుంది. మరల తరువాత సంవత్సరం అదే మొక్కను లేదా ఆ మొక్క పిల్లలు పూజకు ఉపయోగపడతాయి. (ఏదైనా కందమొక్క, దాని పిల్లమొక్క ఉండాలి) మిగతా పూజ సామాను అంతా అందరికీ తెలిసినవే; పసుపు,
కుంకుమ, పూలు, కొబ్బరి కాయ ఒకటి, పసుపు కొమ్ములు రెండు, అరడజను అరటి పళ్ళు.

 కందమొక్కను పూజా మందిరంలో పెట్టుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు
వినాయకుని, పసుపు గౌరమ్మని, చేసుకుని తమల పాకుల్లో కంద మొక్క దగ్గరగా పెట్టుకోవాలి.
నైవేద్యానికి పళ్ళు, కొబ్బరి కాయతో పాటు అమ్మ వారికీ వడ పప్పు, పానకం, చలిమిడి, ఆడ
సంతానం కలవారు గారెలు, మగ సంతానం కల వారు బూరెలు సిద్దం చేసుకోవాలి. ఈ బూరెలు, గారెలు సంగతి ఎలా ఉన్నా పాలహారది (బియ్యం,కొబ్బరితో రుబ్బిన పిండితో పాలలో ఉడికించి, బెల్లము వేయబదినది), పప్పుహారది (బియ్యం, పెసరపప్పు ఉడికించి బెల్లము వేసినది). కలగాయపులుసు ముఖ్యము. మూడు దారం పోగులకు పసుపు రాసి పసుపు కొమ్ములు (నడుం విరగకుండా ఉన్నవి, చిన్నవి) కట్టి ఉంచుకోవాలి. తల్లి, పిల్లలకు అందరకూ సరిపడిన చిన్న పసుపుకొమ్ములు విరగకుండా ఉన్నవాటితో ఈ తోరాలు కడతారు.

ఇక పూజా విధానం ఇతర పూజల లాగానే. ముందుగా ఆచమనం చేసుకుని, సంకల్పం చెప్పుకుని గణపతి పూజ చేసుకుని అమ్మ వారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. పసుపు అమ్మ వారిని, కంద మొక్క లేక కంద పిలకని, కుంకుమతో పుష్పాలతో పూజించి, దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి, అక్షతలు చేత పట్టుకుని, వ్రత కథ చదువుకుని, కొన్ని అక్షతలు అమ్మ వారి మీద, కొన్ని కుటుంబ సభ్యుల అందరి మీద జల్లు కోవాలి. పసుపు కొమ్ము కట్టిన ఒక దారం అమ్మ వారి దగ్గర ఉంచి, ఇంకో దారం పూజ చేసిన స్త్రీ మెడలో కట్టు కోవాలి. పిల్లలకు కూడా ఆ పసుపుకొమ్ము తోరం కట్టాలి. తీర్థ ప్రసాదాలు భక్తి తో స్వీకరించాలి.

 *వ్రతకథ*

అనగా అనగా ఒక ఊర్లో ఓ ఇల్లాలు. ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతున్నారు, పోతున్నారు. పోలాల అమావాస్యకు పుడుతున్నారు , మళ్లీ పొలలమావాస్యకి చనిపోతున్నారు . నోచుకుందామని ఎవర్ని పేరంటానికి పిలిచినా రామని అంటున్నారు . ఈ విధంగా బాధపడుతున్న ఆ ఇల్లాలుకు మళ్లీ ఎప్పటివలె సంతానం కలగడం, చనిపోవడం జరిగినధి . ఆ పిల్లను తీసుకుని స్మశాసంలో సమాధి చేయడానికి వెళ్ళింది. అప్పుడు పోలేరమ్మ అక్కడకు వచ్చింది. ఆ ఇల్లాలిని ఇలా అడిగింది. "ఈ ఊర్లలో వాళ్ళంత నాకు మొక్కేందుకు వస్తారు . పాయసం , వడలు నైవేద్యం తెస్తారు . ఎడ్లకు రంగులు వేసి నెమలి పించం పెట్టి గాలి , ధూళి తగలకుండా ప్రదక్షణం చేయిస్తారు . పాలేర్లు కల్లు తెస్తారు . వాళ్ళ పెళ్ళాలు కడవలతో పానకం తెస్తారు . నువ్వెందుకు శవాన్ని ఇక్కడ సమాధి చేస్తున్నావు?" అని ప్రశ్నించింది. ఆ ఇల్లాలి ఇలా అంది "అమ్మా! పోలేరమ్మ తల్లీవేయి కళ్ళ తల్లివి నీకు తెలియనిది ఏముంది. నేను పూర్వ జన్మలో ఏ పాపం చేసానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తున్నారు" అని బాధ పడింది. అప్పుడు పోలేరమ్మ తల్లి "ఓ ఇల్లాలా! క్రిందటి జన్మలో పొలలమావాస్య నాడు నీవు పేరంటాళ్ళు రాక ముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా పాయసం , గారెలు పెట్టావు. పులుసు తీపి సరిపోయిందో లేదో చవిచూశావు. మడి , తడి లేకుండా అన్నీ ఎంగిలి చేశావు. అందుకే నీకు పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోయారు". అనిచెప్పింది . తన అపరాధాన్ని తెలుసుకున్న ఆ ఇల్లాలు పోలేరమ్మ తల్లి కాళ్ళమీద పడి తనను క్షమించమని వేడుకున్నది. ఆ ఇల్లాలు ఆ వ్రత విధానం తనకు తెలుపమని వేడుకోగా పోలేరమ్మ ఇలా తెలిపింది. పొలలమావాస్యనాడు . గోడను ఆవు పేడ పాలతో అలికి, పసుపు కుంకుమతో బొట్టుపెట్టి కంద మొక్క,వరిదుబ్బు కలిపి ఉంచి అకుదురే అమ్మగా భావించి తొమ్మిది వరుసల దారంతో పసుపు కొమ్ము (నడుం విరగనిది) కట్టి, ఆ తోరం ఆ కందమొక్క తల్లికి కట్టి పూజ చేయాలి. తొమ్మిది వరుసల తోరం పేరంటాలకి ఇచ్చి మనము కట్టించుకోవాలి . పిండి వంటలు నైవేద్యం చేసి అమ్మకి నివేదన చేయాలి . భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి . ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా , మశూచి మొదలైన వ్యాధులు రాకుండా పోలెరమ్మ తల్లి కాపాడుతుందని " చెప్పింది. ఈ విధంగా ఆ ఇల్లాలు ఈ వ్రతంని చేసి తన చనిపోయిన సంతానాన్ని తిరిగిపొందింది.

శివామృతలహరి

     శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

శా||
దేవా ! దివ్యమునీంద్రపూజిత ! భవద్దీవ్యత్పదాంభోజ సం
సేవా స్వాదు మరందపాన కలనా చి త్సౌఖ్యమగ్నంబు : మ
ద్భావేందిందిర మెట్లుగోరు నితర వ్యాపారముల్ , స్నిగ్ధ రా
జీవంబయ్యది రేయి విచ్చుకొనునా? శ్రీ సిద్ధలింగేశ్వరా!

భావం ;( నాకు తెలిసినంత వరకు)

దివ్య స్వరుపులైన మునులతో నిత్యం పూజించబడే మహాదేవా!
తుమ్మెద పద్మాల నుండి తేనెను ఎలా సేవిస్తుందో, అలాగే నీ యొక్క పాద పద్మాలను ఆశ్రయించి సేవించటం ద్వారా కలిగే మకరందం పానం చేసే అనుభూతిని కోరుకొనే నా మనసు , అల్పమైనటువంటి ఇతర వ్యాపకాలను ఎలా కోరుకుంటుంది స్వామీ! ఉదయభానుడి కిరణాలతో విచ్చుకొనే తామర మొగ్గ,
రాత్రి పూట చంద్రుడి కిరణాలతో విచ్చుకోదు కదా, అందుకే నిరంతరము నీ చరణ సేవా భాగ్యం కల్పించు స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!
అని ప్రార్థించారు.

రామాయణమ్. 65


...
దశరథుడి ఆజ్ఞలు వింటూ కైక భయపడిపోయింది !
.
ఖాళీ అయిన బొక్కసము,సైన్యము లేని రాజసము ,నిర్జన నగరము ఉండీ భరతుడికేం ఉపయోగము .
.
తను ఇంత చేసి అంతా వృధా అయిపోతుందేమో అనే వ్యధ ఒక్కసారిగా ఆవిడ హృదయాన్ని పట్టిపీడించింది.
.
అక్కరలేదు ! సారహీనమైన రాజ్యమక్కరలేదు ! అని నిస్సిగ్గుగా ,నిర్లజ్జగా అందరి ఎదుటా గర్జించినట్లుగా పలికింది కైక ! .
.
ఓసీ ! దురాత్మురాలా నీకోరిక రాముడిని అడవికి పంపమనే ! అంతేకానీ వైభవశూన్యుడైన రాముని పంపమని కాదు.అని దశరథుడు గద్దించాడు కైకను .
.
తోకతొక్కిన త్రాచులాగా లేచింది ,మీదకురికే రేచులాగా నిలుచుంది !
.
నేనన్నది మీ వంశంలో అసమంజసుని సగరుడు ఎలా పంపాడో అలాగ పంపమని ! అంతేకానీ ధనధాన్యాలతో,చతురంగబలాలతో ,దాసదాసీజనంతో విహారయాత్రకెళ్ళినట్లుకాదు.
.
ఈ విధంగా మాట్లాడుతున్న కైకను చూసి సిద్ధార్దుడనే మంత్రి...
.
అసమంజసుడితో రాముడికి పోలికా !
. సకలసుగుణాభిరాముడు,సర్వలోకమనోహరుడు ,సకలజీవసంరక్షకుడమ్మా రాముడు !
.
వాడు ! అసమంజసుడు,
పసిపిల్లల పీకలునొక్కి వారి ఏడుపులు విని ఆస్వాదించి ఆనందించేవాడు . వారిని గిరగిర త్రిప్పి సరయూనదిలో బంతులు విసిరినట్లు విసిరే వాడు ,లోకంలోని అసమంజసమైన పనులన్నీ చేసే వాడు !
.
వాడికీ ,రామునికీ పోలికా ! నీవు మాట లాడే దానిలో ఏమైనా ఔచిత్యమున్నదా .
.
వాడి బాధలు తట్టుకోలేక జనం మొరపెట్టుకొంటే భార్యతోసహా రాజ్యబహిష్కరణ శిక్ష విధించాడమ్మా సగర చక్రవర్తి ! .
.
అటువంటి దౌర్భాగ్యునితో రామునికి పోలిక తేవడమా ! నీవు స్పృహలోనే ఉన్నావు కదా! .
.
అసలు అడవికి పంపటానికి రాముడు ఏ నేరం చేశాడో మేమంతా తెలుసుకో గోరుతున్నాము ,నిష్కారణముగా సత్పధగామిని శిక్షిస్తారా! ఆ పాపము ఊరకే పోదు!
.
సిగ్గూఎగ్గూలేని కైక ఇంతమంది ఇన్నిమాటలంటున్నా తనకేమీ పట్టనట్లు అలాగే ఉండిపోయింది.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

*మాఊళ్ళో మహాశివుడు*

ఏళ్ల క్రితం బెజవాడ గుళ్లో మొదలుపెట్టిన అర్చకజీవితం పలు ఆలయాలు మారుతూ పదిహేడేళ్ళ క్రితం ఈ అరికమొగల ఊళ్ళోకొచ్చినప్పుడు శివాలయం కమిటీ వాళ్లిచ్చిన జీతం ఐదొందలు మహేశ్వరరావుగారికి..*

*గ్రామస్థులు మర్యాదస్తులు కావడంతోన్నూ, అడపాదడపా పలకరించేవాళ్ళతోన్నూ ఊరితో విడదీయరాని అనుబంధంగా మారింది అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు..*

*ప్రత్యేకంగా యే మాన్యాలంటూ లేని ఆ పాతకాలంనాటి చిన్న శివాలయానికి నిత్య కైంకర్యాల నిమిత్తం ధూపదీపనైవేద్య పథకం కింద ప్రభుత్వం ఇచ్చే అయిదువేల రూపాయలే శరణ్యం గుళ్లో మహేశ్వరుడికి, ఆయన్నే నమ్ముకున్న మహేశ్వరరావుగారికిన్నూ..!!*

*రెండుపూటలా దీపం పెట్టి, అభిషేకం చేసి, స్వహస్తాలతో చేసిన తేలికపాటి నైవేద్యం తృప్తిగా నివేదించి, దర్శనానికొచ్చిన భక్తులకి అర్చనలు చేయిస్తూ కొనసాగిస్తోన్న సామాన్యజీవనమే పరమేశ్వర ప్రసాదితమని మనసారా నమ్మిన అమాయకుడాయన.. ఉన్నంతలో ఇద్దరి కూతుళ్ళకి పెళ్లిళ్లయ్యాయి.. గొప్పగా కాకపోయినా వాళ్ళ కాపురాలు చేసుకుంటున్నారు..*

*బియ్యప్పిండితో గీసిన నిలువుగీతలా పోతున్న అరికమొగల ఊరి జీవితాల్లోకి కరోనా ప్రవేశించడంతో ఏడొందల జనాభాలో 274 కేసులొచ్చాయి..*

*గుడి మూతపడింది.. భక్తులు రావడం మానేశారు..!!*

*ప్రభుత్వం నుంచొచ్చే అయిదువేల రూపాయల నిధులు ఆగిపోయాయి.. కారణమడిగితే తిరుపతి దేవస్థానానికి భక్తులు రాక ఇట్లాంటి చిన్నగుళ్ళకి నిధులు ఆపమన్నారని కబురొచ్చిందట..!!*

*మహేశ్వరరావుగారు నవ్వుకున్నారు.. భక్తితో మారేడుదళం సమర్పించినా చాలంటారుగానీ తన స్వహస్తాలతో ఏదొకటి వండిపెడితేనే తప్ప నైవేద్యం కూడా ముట్టడు ఆ మహాశివుడు..!!*

*ఇంకెక్కడి భుక్తి..??*

*గుడికి జనాలెవరూ రాకపోయినా లోపలున్న లింగానికి ఏకాంతంగానైనా విధిగా నిర్వహించాల్సిన నిత్యపూజలకి లోటు లేకుండా నెట్టుకొస్తున్నాడు..*

*వాటికోసమని వయస్సులో ఉండగా వేలుమీదకొచ్చిన ఉంగరానికి ఇప్పుడు విడుదలొచ్చింది.. కాకుంటే బ్యాంకుకెళ్లింది..!!*

*భార్య ఉండగా బతుకు బాగుండిన రోజుల్లో ముచ్చటపడి చేయించిన గొలుసు కూడా ఉంగరం బాటే పట్టింది..!! భార్యే బ్యాంకుతాకట్టుకి పోతున్నట్టు తను గురైన ఆవేదన గురించి రోజూ పూజలందుకునే శివుడికైనా తెలుసో లేదో..!!*

*ఆ డబ్బులు ఉన్నంత వరకూ సాగాడు.. తర్వాత కమిటీ పెద్దని కలిశాడు..*

*"రాష్ట్రంలో సంవత్సరాదాయం కనీసం 50వేలు కూడా లేకుండా 6(సీ) కేటగిరీలో ఉన్న 6709 చిన్న ఆలయాల్లో మనదొకటి..!!! ఏం చేస్తాం చెప్పండి..?? ఊ ఊ..!!"*

*"శివుడికి, నాకూ కూడా జరుగుబాటు కష్టంగా ఉందండీ.. పెద్దలేమైనా దయతలిస్తే.. "*

*"హమ్మమ్మా అపచారం అపచారం.. మీబోటివారికి గౌరవభత్యం ఇచ్చేంతవాళ్ళమా.. మా దగ్గరేముంటాయండీ పంతులుగారూ.. అసలే కరోనాకాలం.. ఇన్నాళ్లనుంచీ ఆరొందలడబ్భై జనాభా ఉన్న ఈ అరమొదల గ్రామంలో తమతమ శక్తి కొద్దీ సమర్పించుకోగా పళ్లెంలో పడిన చిల్లరంతా మీకేగా..!! కానివ్వండి కానివ్వండి.. ఆ.. ఆ..!!* వాటి గురించి *మేమేనాడైనా అడిగామా..??"*
 
*కమిటీపెద్దగారి మాటల్లో శ్లేష అర్ధమైంది మహేశ్వరరావుగారికి.. గుడికొచ్చే బీదాబిక్కి జనం కార్తీకమాసాల్లో కాకుండా ప్రతీ సోమవారం పళ్లెంలో విదిల్చే చిల్లర ఎంతనేది చెప్పడానికి సిగ్గుపడేంత మొత్తాన్ని ఇట్లా అపార్ధం చేసుకుంటున్నందుకు లోతైన కళ్ళతో అంతకంటే లోతుగా నవ్వారు..*

*మహేశ్వరరావుగారికి ఇంకేం అడగాలనిపించలేదు.. ఏవన్నా ఉంటే గింటే శివుడ్ని తప్ప మనుషుడ్ని అడగటానికి సంకోచించే తత్వం మరీ ఎక్కువైపోయింది ఈ మధ్య..!!!*

*ఆ మధ్య నోరు విడిచి ప్రెసిడెంటుని ఇలాగే ఇళ్లపట్టాల గురించి అడగబోయారు..*

*"ఇళ్లేవో రాస్తున్నారంటున్నారు.. శిథిలావస్థకి చేరుకున్న ఆ రెండుగదుల ఇంట్లో ఉండటం కాస్త ఇబ్బందిగానే ఉంటోంది.. మరీ ముఖ్యంగా వర్షాలప్పుడు.. గుడినానుకుని ఉండటంతో కోతుల బెడద కూడా ఎక్కువయ్యింది..!!"*

*"65 ఏళ్లొచ్చిన మీకు ఇప్పుడు ఇల్లు అవసరమా.. మీ తర్వాత ఎవరికిస్తారు..?? పైగా మీ ఇంట్లో మీదొక్కటే కదా ఓటు..!!" అని తుపాకీ పేలినట్టు నవ్వి హాస్యం చేసిన ప్రెసిడెంటు ఈ మధ్యే కరోనా సోకి ముదరబెట్టి 43 ఏళ్ళకే కాలం చేశాడు పాపం..!!*

*"ఏంటో.. విధి విచిత్రం.. అంతా పరమశివుడి లీల..!!" అని సరిపెట్టుకున్నారు మహేశ్వరరావుగారు..*

*ఎందుకో ఆ మర్నాడు పొద్దున్న లేచాకా గొంతులో చేదుగా ఉండి, మర్నాటికి గరగరలాడి, వాసన తెలీనివ్వకుండా జలుబు, పట్టు విడవనంతగా జ్వరం వచ్చేసేసరికి టెస్టులక్కర్లేకుండానే కరోనాగా తేలింది..!!*

*నీరసంగా ఉన్న మహేశ్వరరావుగార్ని ఆ వార్డు వాలంటీరొచ్చి అంబులెన్సుని పిలిపించి ఎక్కించాడు..*

*హాస్పిటల్లో జరుగుబాటు బాగానే అయ్యి, దురలవాట్లు లేని క్రమశిక్షణా శరీరం కాబట్టి తొందరగానే కోలుకున్నారు..* *పదిహేనురోజుల తర్వాత మళ్లీ ఇంటి దగ్గర దింపించి రెండువేల రూపాయల రొక్కం చేతిలో పెట్టాడు వాలంటీర్..*

*మరో పదిరోజుల పథ్యం తిరిగి గుడి తెరవడం ప్రారంభించి, బావినీటితో నిస్సత్తువగానే అభిషేకం జరిపి కాసేపు తువ్వాలు విసురుకుంటూ ఆ శివుడినే చూస్తూ కూర్చుని వచ్చేస్తున్నారీ మధ్యన.*

*పదిరోజులయ్యింది..*

*ఎవరి దాతృత్వం చేతనో కూరగాయల కవర్ అందివ్వడానికి ఇంటి గుమ్మం దగ్గరికొచ్చిన వాలంటీరుకి కళ్లతోనే కృతజ్ఞత చెప్పారు ముక్కుకి, మూతికి ఎర్రతుండు కట్టుకున్న మహేశ్వరరావుగారు..*

*నమస్కారం చెప్పి వెనుదిరగబోతోన్న వాలంటీరును ఆగమన్నారు మహేశ్వరరావు పంతులుగారు..*

*"మన ఊరిగుడికి ఆదాయం టీటీడీ దేవస్థానం నుంచి వస్తోందట.. ఇప్పుడు కొండకొచ్చే భక్తులు లేక ఆదాయం తగ్గి తిరుపతి వెంకన్న బీదవాడయ్యాడుట..* *అంచేత గత ఐదునెలలుగా మా భృతి నిలిపివేశారు..!!"*

*గుమ్మానికి పదడుగుల దూరంలో నిలబడ్డ వాలంటీరు అలానే చూస్తున్నాడు విషయం అర్ధంగాక..*

*ఎర్రతుండు చాటు దాగిన వణుకుతోన్న పెదవులతో మెల్లగా గొణిగారు పంతులుగారు..!!*

*"ఆ కరోనా వ్యాధి మళ్లీ వచ్చే అవకాశం ఉందా నాయనా..? వస్తే రెండువేలు మళ్లీ ఇస్తారా..?"*
_*రచయిత:-Haribabu Maddukuri*_
*సేకరణ: కెయస్వీ కృష్ణారెడ్డి, జిహెచ్ఎం, గంటి, కొత్తపేట మండలం, తూర్పుగోదావరి, 9492146689.*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఇది కథ అయినా ప్రస్తుత పరిస్థితి కి నిలువుటద్దం.*

_*మనం అనుసరించేది ఏ ధర్మమైనా ఆ ధర్మం కోసం జీవించే వారిని గౌరవిద్దాం*_

_*హైందవ ధర్మాన్ని ఆచరించే మిత్రులకు విజ్ఞప్తి*_

_*అన్ని ఆలయాలూ తిరుపతులు కావు. అందరు అర్చకులూ స్థితిమంతులు కాదు‌. నేను సాధ్యమైనంత వరకూ చిన్న ఆలయాలకే వెళతాను మంచి దక్షిణ వేస్తాను. హుండీలో కాదు సుమా...మీకూ నచ్చితే ఆచరిస్తారు కదూ*_

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

చర్మసంరక్షణ మూలికా యోగాలు -



 * చందనము , అగరు , వట్టివేరు మూడింటిని సమానంగా తీసుకుని పాలు లేక పన్నీరు కలిపి లేపనంగా తయారుచేసుకుని ముఖమునకు పట్టించి కొంత సమయం తరువాత శుభ్రపరుచుకొనుచున్న ముఖ వర్చస్సు పెరుగుతుంది .

 * చందనం , కుంకుమపువ్వు , కస్తూరి కలిపిన మిశ్రమాన్ని ముఖమునకు లేపనం చేయుచున్న ముఖవర్చస్సు పెరుగును .

 * పద్మ కేసరాలు , నాగ కేసరాలు సమాన భాగాలుగా తీసుకుని ఆ మిశ్రమ చూర్ణాన్ని 3 - 5 గ్రాములు నిత్యం నెయ్యి లేక తేనెతో సేవించుచున్న చర్మసౌందర్యం అమితముగా పెరుగును .

 * బూరుగు చెట్టు ముల్లును పాలలో అరగదీసి ఆ గంధమును పైకి రాయుచున్న మొటిమలు హరించును .

 * ఒక కప్పు పాలలో ఒక టీస్పూను నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి మరునాడు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటూ ఉన్నచో క్రమేణా ముఖం పైన మచ్చలు తగ్గును.

 * కాలిన గాయాల మచ్చలు పోవడానికి బంతి ఆకుల రసాన్ని ఉదయం మరియు సాయంత్రం రాయవలెను .

 * మిరియాలు , చందనం సమంగా కలిపి నీళ్లతో నూరి ఆ గంధాన్ని పైన పట్టిస్తే మొటిమలు హరించును .

 * తులసి ఆకుల రసంలో కొద్దిగా టంకణం (Borax ) కలిపి పైన లేపనం చేస్తే ముఖం మీద మచ్చలు , మంగు క్రమేణా నశించును.

        పైన చెప్పిన మూలికలు అని ఆయుర్వేద పచారీ షాపులలో దొరకును.

    గమనిక -

           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు .

                 కాళహస్తి వేంకటేశ్వరరావు

             అనువంశిక ఆయుర్వేద వైద్యులు

                         9885030034

గురు గ్రహ దోషాలు - నివారణ

గురు గ్రహ దోషాలు - నివారణ

నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్వగుణ ప్రధానమైన ఈ గ్రహం భూమిపై నివసించే జీవులపై, మానవులపై ప్రభావం చూపుతుంది.

ఈ గ్రహ ప్రాబల్యం బాగా ఉన్న వారికి విద్య, బుద్ధి, జ్ఞానం బాగా ఉంటుంది. ఈ గ్రహం బాగుంటే వారు అమితమైన తేజోవంతులుగానూ, ధనవంతులుగానూ ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఇక ఈ గ్రహానికి సంబంధించిన వ్యాధులు, గురు గ్రహ దోషానికి పరిహార క్రియలను పరిశీలిస్తే.. కాలేయం, వెన్నుపూస, తొడలు, చెవులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నత్తి, మతిమరుపు, శరీరానికి నీరు పట్టడం, కఫం వంటి వ్యాధులు గురు గ్రహ ప్రభావంతో కలుగుతాయి.

అలాగే గౌరవహాని, పండితపామరులతో వివాదం, స్థానచలనం, అధికార నష్టం, తీర్థయాత్రలలో ఇబ్బందులు, స్వార్థం, సంతానదోషం, ధననష్టం, పుత్ర విరోధం, దైవ, గురు భక్తి లోపించడం ఇవి సామాన్యంగా గురు గ్రహ బలహీనతవలన కలిగే ఇబ్బందులు, లోపాలని శాస్త్రం చెబుతుంది.

అందుకే గురుగ్రహ దోషాలు, వ్యాధుల పరిహారం కోసం మంచి పుష్యరాగ మణిని గురువారం రోజు శివ పంచాక్షరి మంత్రం, గురుగ్రహ మంత్రంతో కలిపి జపించిన తర్వాత ధరించాలి. స్త్రీలు పాదాలకు ధరించే పసుపు, గడపలకు పసుపు రాయటం, పూజా కార్యక్రమాల్లోనూ, స్నానానికి మనం వినియోగించే పసుపు ఎన్నో వ్యాధుల్ని నివారించగలదు. కాబట్టి పసుపు రంగు వేయబడిన గది గోడల మధ్య నివాసం ఈ లోపాన్ని పూరిస్తుందని శాస్త్రం చెబుతోంది.

గురు గ్రహ దోషం వల్ల అనేక రకాల వ్యాధులు కలుగుతాయి. ముఖ్యంగా కాలేయం, వెన్నుపూస, తొడలు, చెవులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నత్తి, మతిమరుపు, శరీరానికి నీరు పట్టడం, కఫం వంటి వ్యాధులు గురు గ్రహ ప్రభావంతో కలుగుతాయి. అలాగే గౌరవహాని, పండిత పామరులతో వివాదం, స్థానచలనం, అధికార నష్టం, తీర్థయాత్రలలో ఇబ్బందులు, స్వార్థం, సంతానదోషం, ధననష్టం, పుత్ర విరోధం, దైవ, గురు భక్తి లోపించడం ఇవి సామాన్యంగా గురు గ్రహ బలహీనతవలన కలిగే ఇబ్బందులు, లోపాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

అందువల్ల గురుగ్రహ దోషాలు, వ్యాధుల పరిహారం కోసం మంచి పుష్యరాగ మణిని గురువారం రోజు శివ పంచాక్షరి మంత్రం, గురుగ్రహ మంత్రంతో కలిపి జపించిన తర్వాత ధరించాలి. స్త్రీలు పాదాలకు ధరించే పసుపు, గడపలకు పసుపు రాయటం, పూజా కార్యక్రమాల్లోనూ, స్నానానికి మనం వినియోగించే పసుపు ఎన్నో వ్యాధుల్ని నివారించగలదు. కాబట్టి పసుపు రంగు వేయబడిన గది గోడల మధ్య నివాసం ఈ లోపాన్ని పూరిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

జాతకంలో గురువు బలహీనంగా ఉంటే.. సంతాన సౌఖ్యత లేక పోవటం, కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట, నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట, ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం, షుగర్, క్యాన్సర్, మూత్ర రోగాలు, పెద్ద పొట్టతో కలిగిన దేహం, పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం, గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు.

వ్యాధి వస్తే తొందరగా తగ్గదు. లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖం, సంతోషం లేక పోవుట, దైవంపై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేకపోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శించుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.

గురు గ్రహ దోషనివారణకు పసుపు రంగు స్టోన్ నీటిలో వేసుకొని ఆ నీటిని త్రాగిన దోష నివారణ కలుగును. పసుపు కొమ్ము గణపతిని, పసుపు రంగు స్టోన్ గణపతిని పూజిస్తే చాలా మంచిది. పూర్వ కాలం నందు గురుగ్రహ దోష నివారణకు ఇంద్రుడిని పూజించేవారు, ప్రస్తుతం సాయిబాబా, దత్తత్రేయ, హయగ్రీవుడిని పూజిస్తున్నారు.

గురు గ్రహ దోషం - శాంతి

ప్రతి గురువారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల సమయంలో దగ్గరలో ఉన్న దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి 160 ప్రదక్షిణలు చేయాలి. 16 గురువారాలు నవగ్రహములకు 160 ప్రదక్షిణలు చేసి, పసుపు వస్త్రంలో ఐదు పావుల శనగలు పోసి, మూత కట్టి, దాన్ని దానం చేయాలి.

అలాగే గురువారం రోజున ఉడికించిన శనగలు పేదలకు పంచిపెట్టాలి. కుడి చేతి చూపుడు వేలుకి కనకపుష్యరాగం ఉన్న బంగారు ఉంగరాన్ని ధరించాలి. బ్రాహ్మణుడితో గురు గ్రహ జపం చేయించి శనగలు దానం చేయాలి. గురువారం నాడు గురుగ్రహం వద్ద 16 పసుపు రంగు వత్తులతో దీపారాధన చేసి పసుపు వస్త్రాన్ని దానం చేయాలి.

16 గురువారాలు ఉపవాసము ఉండి చివరి గురువారం దక్షిణామూర్తి పూజ, గురు అష్టోత్తర పూజ చేయాలి. ప్రతిరోజూ 160 మార్లు చొప్పున 160 రోజుల పాటు గురు ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి.16 గురువారముల పాటు గురు గాయత్రి మంత్రాన్ని 160 సార్లు పారాయణ చేయాలి. ప్రతి రోజూ దత్త శ్లోకాన్ని పారాయణ చేస్తూ, 40 రోజుల్లో 16.000 సార్లు గురు మంత్రాన్ని జపించండి. తీరిక లేనివారు కనీసం గురుశ్లోకములు 16 సార్లు లేదా గురు మంత్రాన్ని 160 సార్లు కాని పారాయణ చేయాలి. గురు పౌర్ణమి పర్వదినమున 18 సార్లు స్తవం పారాయణ చేయాలి...మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

ఆర్యాశతకం(మూకపంచశతి

ఆర్యాశతకం(మూకపంచశతి),మత్తేభవిక్రీడితం::;
తిరమై,కాంచిపురంబునందు,వెలసెన్ /దేదీప్యమాయాకృతై//అరయన్ భాసుర నాల్గుహస్తములయం/దాక్రామరూపంబులై//మెరిసెన్ కార్ముక పాశయంకుశములే,/మేలైన హారంబులన్//మురిపించేకుచ ధాడ్యమున్, త/న్మోక్షార్ధకానందకిన్////
[17/09, 6:32 1 96529 04609: ఆర్యాశతకం(మూకపంచశతి)శ్లోకం 3మత్తభవిక్రిడితం::;
స్మరధన్యార్ధము తోపనేరదుగ ము/మ్మారెంత శోధించినన్//కరుణారూపిణి,చింతితార్ధఫలమై /కాంచీపురీభాగ్యమై//వరచింతామణియై వసించెనట సంపద్ప్రత్యసామ్యంబుగా//తరపన్చేయగ చిత్సుధాంబువులు మద్జ్ఞానార్జనాదాహమై////

ఓ భార్యాభర్తల కథ.

అనేక మలుపులతో🙃😮😃 కూడిన ఓ భార్యాభర్తల కథ.

ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది. అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది. క్యాషియర్ ఆమె బ్యాగ్లో ఒక టీవీ రిమోట్ గమనించాడు.
అతను ఉండబట్టలేక ఆడిగేసాడు. "మీరు ఏప్పుడూ మీ టీవీ రిమోట్‌ను మీతో తీసుకువెళతారా?"అని.

 ఆమె "లేదు, ఎప్పుడూ కాదు. ఈరోజు మావారు క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా..." అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చింది.

 నీతి: మీ భార్య మాట వినండి. ఇంకా, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి.....

కథ ఇంతటితో అయిపోలేదు ...

క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు.
ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయి "ఏమైంది..!!" అని క్యాషియర్ని అడిగింది.

 అతను చెప్పాడు, “మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు .....”

నీతి: మీ భర్త అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి.

కథ కొనసాగుతుంది ....

భార్య ఈసారికి తన భర్త క్రెడిట్ కార్డును పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది. దురదృష్టవశాత్తు అతను తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.

 నీతి: మీ భార్య యొక్క శక్తిని మరియు జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు ..

 కథ ఇంకా అయిపోలేదు ...

స్వైప్ చేసిన తర్వాత, యంత్రం 'మీ మొబైల్ ఫోన్‌కు పంపిన పిన్ను నమోదు చేయండి' అని సూచించింది .......

 నీతి: ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత రక్షిస్తుంది..!

కథ కొనసాగుతుంది ....

ఆమె మరలా నవ్వి, తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను బయటకు తీసింది.
అది తన భర్త ఫోన్. ఆమె దానిని రిమోట్ కంట్రోల్‌తో బాటుగా తీసుకుని వచ్చేసింది.. ఎందుకంటే, తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసుగించకుండా ఉండేందుకు. చివరకు ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది.

 నీతి: ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు!

 కథ కొనసాగుతుంది ....

ఆమె ఇంటికి చేరుకునేసరికి బయట అతని కారు లేదు.
ఒక నోటు తలుపు మీద అతికించబడి ఉంది.
అందులో ఇలా రాసుంది...
"రిమోట్ దొరకలేదు. మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యు...."

 ఇంటి తాళాలు కూడా తనతోబాటే తీసుకుపోయాడు

  నీతి: మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు.😊🤔🤭😮

దీపారాధన చేయడం వలన ఫలితాలు

ప్రస్తుతం యాంత్రీకజీవనగమనం లో ఉన్న యువతీయువకులు తాము ఉన్న ఇంట్లో దీపారాధన చేయడానికి కూడా సమయం సరిపోవడం లేదు. కానీ కొంచెము ముందు గా లేచి దీపారాధన చేయడం వలన ఎన్నో ఫలితాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.చాలామంది ఉద్యోగులు భార్యాభర్తలు లక్షలు కి లక్షలు సంపాదించుతున్నారు. కానీ నెల పదిరోజులు తర్వాత వారి దగ్గర డబ్బు ఏమీ ఉండదు. దానికి కారణం మనం చేసుకునేవే మనతో వస్తాయి అని తెలుసుకోకపోవడమే.
🍁దీపం వెలిగేచోట లక్ష్మీ నివాసం ఉంటుంది.
🍁సూర్యోదయం నకు ముందుగా లేచి దీపం పెట్టడం వలన దరిద్రాలు తొలగి ఐశ్వర్యాలు లభిస్తాయి.
🍁దేవతాశక్తులు స్థిరనివాసం చేస్తాయి.
🍁దీపం వెలిగించి పూజాదికాలు చేస్తే విఘ్నకారకులైన విఘ్నేశ్వరుడు మొదలగు దేవతల అనుగ్రహం కలుగుతుంది.
🍁తామసశక్తులు, రాక్షస శక్తులు భూతప్రేత పిశాచాలు దరిచేరవు.
🍁దీపారాధన క్రమంగా మనలో ఙ్ఞానాన్ని వికసింపచేస్తుంది. ఆ రోజు న మనస్సు అంతా ప్రశాంతంగా ఉంటుంది.
🍁దీపాన్ని మన ఇంట్లో ప్రజ్వలింపజేయడం వలన ఉత్తమ ఫలితాలు మరియు ఆ చేసిన వారికి ఉత్తమ లోకాలు లభిస్తాయి.
🍁ఇంకొకవిషయం చెప్పాలంటే దేవతాలోకాలు గా చెప్పే ఊర్ధ్వ లోకాలన్నీ కూడా కాంతి లోకాలే.
🍁కాంతి లేనివన్నీ కూడా అధోలోకాలు అంటే చీకటిమయం అన్న మాట.
🍁ఇంట్లో జ్యోతి ని ప్రజ్వలింపజేయడం వలన మనకు మంచి గతులు లభిస్తాయి. పుణ్య లోకాలు సిద్ధిస్తాయి.
🍁మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలంటే దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
🍁మన ఇంట్లో సంధ్యా సమయంలో దేవుని దగ్గర దీపం పెట్టడం వలన ఆ ఇంట లక్ష్మీ నివాసం ఆ ఇంట్లో దైవశక్తులు ఉంటాయి.
🍁అలాగే ఆ ఇంట్లో రోగాలు, నిరుత్సాహం, కలహాలు, దరిద్రము మొదలైన బాధలు ఉండవు.
🍁మీరు ఇంట్లో దీపం వెలిగించి దైవానికి నైవేద్యం సమర్పించడం ఎంతో మంచిది. మీతో బాటే పాలు నైవేద్యం పెట్టవచ్చును.
🍁మీకు సెలవు దినాలు లో కాస్తంత ఓపిక తెచ్చుకుని దేవుని ముందు మీకు వచ్చిన స్తోత్రం లు పారాయణం లు చేసుకుంటూ ఉంటే మనస్సు కు ఎంతో హాయి ప్రశాంతత.
🍁ఎంత సంపాదించితే ఏముందండీ మనస్సు కు ప్రశాంత త లేకపోవడం వల్ల అంటారా?
🍁ఈ రోజు నుంచే ప్రారంభం చేయండి. ఆచరించండి. ఆనందంగా ఉండండి.

పోత‌న త‌లపులో....55



గోపాలకృష్ణుని దర్శించడానికి హస్తినానగరకాంతలు నగరంలోని భవనాలపై కెక్కారు. మార్గానికి ఇరువైపుల గుంపులు గూడి చేతులు చాపి వాసుదేవుణ్ణి ఒకరికొకరు చూపించుకోసాగారు. క్ర‌మ క్ర‌మంగా కృష్ణ ప‌ర‌మాత్మ ర‌థం దూరంగా వెళుతోంది.....

       ****
"రమణీ! దూరము వోయెఁ గృష్ణురథమున్ రాదింక వీక్షింప, నీ
కమలాక్షుం బొడఁగానలేని దినముల్ గల్పంబులై తోఁచు గే
హము లం దుండఁగ నేల పోయి పరిచర్యల్ సేయుచున్ నెమ్మి నుం
దము రమ్మా" యనె నొక్క చంద్రముఖి కందర్పాశుగభ్రాంతయై.

                        **
తరుణీ! యాదవరాజు గాఁ డితఁడు; వేదవ్యక్తుఁడై యొక్కఁడై
వరుసన్ లోకభవస్థితిప్రళయముల్ వర్తింపఁగాఁ జేయు దు
స్తరలీలారతుఁడైన యీశుఁ, డితనిన్ దర్శించితిం బుణ్యభా
సుర నే" నంచు నటించె నొక్కతె మహాశుద్ధాంతరంగంబునన్.

                          ****
“ఓ సఖీ! అదిగో శ్రీకృష్ణుని రథం దూరంగా వెళ్లిపోయింది. ఇక మన కళ్లకు కన్పించదు. కమలాక్షుణ్ణి కనుగొనలేని దినాలు కల్పాలులా తోస్తాయి. ఇక క్షణం సేపు కూడ ఉండలే మీ యిళ్ళలో. మాధవుని వెంట మనం కూడ వెళ్లి ఆయనకు సేవలు చేసుకుంటు అక్కడే హాయిగా ఉండిపోదా” మంది మన్మథుని బాణాలు నాటిన మగువ యొకతె.

                     ***
“చెలీ! వేదవేద్యుడైన ఆదినారాయణుడే గాని ఈ కృష్ణుడు యాదవప్రభువు కాదే. ఈ దేవాధిదేవుడు విశ్వానికి సృష్టి స్థితి లయాలు కల్పించే మహానుభావుడే. ఈయన లీలలు మనం తెలుసుకోలేం. లోకేశ్వరుణ్ణి కనులారా దర్శించిన నేను ఎంత అదృష్టవంతురాలనో” అని ఒక అంగన ఆనంద తరంగాలు పొంగిపొరలే అంతరంగంతో చిందులు వేసింది.

🏵️పోత‌న ప‌ద్యం🏵️
🏵️ఆనంద తరంగం,🏵️

పంఙ్ఞేంన్ద్రియములు

ఇంద్రం యజ్ఞం చ వర్ధయః ఇంద్రియములు అనగా పంఙ్ఞేంన్ద్రియములు ముఖ్యము. శరీర లక్షణము తెలియవలెనన్న ఆత్మ దేహమును ఆశ్రయించవలెను. అది తేజస్సు రూపంలోనే అనగా తేజస్సు దేహ రూపం ఆశ్రయించవలెను. ఆత్మకు తెలియదు వాసనలున్నాయని. యముని యెుక్క ఆఙ్ఞమేరకు దేహ నిర్ధారణ వాసనలు అనుభవించు నిర్ణయము. దేహమును ఆశ్రయించు నిర్ణయము ఆత్మదే.నరకం అనగా భూమి పైననే స్వర్గం అనగా దైవత్వం అంతేగాని భోగములు అనుభవించుట కాదు. భోగములు అనుభవించుట మెూహము. వ్యాధి రూపేణ కర్మలు అనుభవం. భోగ రూపంలో కూడా కర్మలు అనుభవమే. అనుభవించుట యఙ్ఞమని కర్మలు యఙ్ఞరూపమే. అంతరింద్రియములు జీవునికి బాహ్యయింద్రియములు పంచభూతములు. వీటి మూలము జీవులు. దేహము వక కారణము. యిన్ అనే శబ్దమూలము ఈ అనే ఎన్ అగ్నిగా మారి పదార్ధ లక్షణము లేనిది పదార్ధముగా మారుట యే యిన్ద్రియ లక్షణము యీ ప్రక్రియ యఙ్ఞమని బాహ్యంగా చేయుట ప్రకృతిని సమతుల్యం చేసిన కోరికలను ఆనందంగా అనుభవించ వచ్చు. తద్వారా కర్మ బంధములు త్వరగా విడువవచ్చు. దీని నడక గతి తప్పిన యెడల వక చోట అగ్ని, మరోచోట వాయు, మరోచోట నీరు, యిలా వివిధ ప్రాంతములలో వివిధ రూపంలో మానవజీవనమునకు ప్రకృతి విరుద్దమైన వినాశనం కలుగును. విశ్వంలో కూడా శక్తి పరిణామములు సక్రమంగా యుండుటయే 'యిన్ద్రం యఙ్ఞం చ వర్ధయః. 'అన్న విశ్లేషణ.

మొగలిచెర్ల అవధూత

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
అమ్మాయి పెళ్లి..

మొగలిచెర్ల లో సిద్ధిపొందిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద అప్పుడప్పుడూ వివాహాలు జరుగుతూ ఉంటాయి..శ్రీ స్వామివారి సన్నిధిలో వివాహం చేస్తే తమ బిడ్డల భావి జీవితం సుఖంగా సాగిపోతుందని కొందరు..శ్రీ స్వామివారి దయవల్లే తమకు సంతానం కలిగింది కనుక, ఆ సంతానం యొక్క వివాహాలు కూడా ఇక్కడే జరిపితే..వాళ్ళ మీద కూడా స్వామివారి కృపా కటాక్షణాలు వుంటాయని మరికొందరూ..శ్రీ స్వామివారి వద్దే వివాహం జరిపించుకోవాలని మొక్కుకునేవారు ఇంకొందరూ..ఇలా కారణాలు ఏవైనా..శ్రీ స్వామివారి మందిరం వద్ద వివాహాలు చేసుకుంటూ వుంటారు..

రెండు సంవత్సరాల క్రిందట ఇద్దరు పెద్దవాళ్ళు మా దగ్గరకు వచ్చి.."మా పిల్లవాడికి పెళ్లి నిశ్చయం అయింది..వచ్చే నెలలోనే ముహూర్తం.. వివాహాన్ని స్వామివారి సన్నిధిలో చేయాలని నిర్ణయం తీసుకున్నాము..ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ఏమైనా నిబంధనలు ఉన్నాయా?.." అని అడిగారు..వివాహం చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి ల తాలూకు వయసు ధ్రువీకరణ పత్రాలు కావాలని..ఇద్దరిలో ఏ ఒక్కరు మైనర్ అయినా ఇక్కడ వివాహం చేసుకోవడానికి అంగీకరించమనీ..చెప్పాము.."ఆ ఇబ్బందేమీ లేదు..ఇద్దరూ ఇరవై నాలుగేళ్ల పై బడిన వారే.." అని చెప్పి..ముహూర్తం రోజుకు వస్తామని చెప్పి..రెండు గదులు తమకు కేటాయించమని చెప్పి వెళ్లారు..

అనుకున్న ప్రకారమే ముహూర్తం రోజుకు ఆ పెళ్లి బృందం శ్రీ స్వామివారి మందిరం వద్దకు వచ్చారు..పెళ్లికూతురు తల్లిదండ్రులిద్దరూ ముందుగా మందిరం లోనికి వచ్చి.."అయ్యా..ఒక్కసారి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుంటాము..ఈరోజు మా అమ్మాయి పెళ్లి జరగడానికి స్వామివారి దయ కారణం.." అన్నారు..లోపలికి వెళ్లి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వచ్చారు..మరి కొద్దిసేపటికల్లా.. పెళ్లి జరిగిపోయింది..వధూవరులను తీసుకొని మందిరం లోనికి వచ్చారు..శ్రీ స్వామివారి సమాధి వద్ద నూతన దంపతులు నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చేసారు..

"మాకు పెళ్ళైన ఆరేళ్ళ దాకా బిడ్డలు పుట్టలేదు..మొగలిచెర్ల లో ఒక స్వామివారు సిద్ధిపొందారు..అక్కడికి వెళ్లి మొక్కుకోండి..మీకు సంతానం కలుగుతుందని మా ఊళ్ళో పెద్దలు చెపితే..ఇక్కడకు వచ్చాము..ఐదురోజుల పాటు నిద్రచేసాము..ఆ తరువాత సంవత్సరానికి ఈ అమ్మాయి పుట్టింది..స్వామివారి ప్రసాదం అనుకున్నాము..కానీ పుట్టిన తరువాత ఈ పిల్లకు ఐదేళ్ల వయసు దాకా మాటలు రాలేదు..డాక్టర్లకు చూపించాము..ఫలితం లేదు..మళ్లీ స్వామివారి వద్దకు వచ్చి వేడుకున్నాము..మా దుఃఖాన్ని ఆ స్వామి గ్రహించాడేమో..మరో మూడునెలలకు మాటలు వచ్చాయి..బడికి పంపించాము..బాగానే చదువుకున్నది..డిగ్రీ పూర్తిచేసింది..పెళ్లి చేద్దామని సంబంధాలు చూసాము..మూడేళ్ల పాటు ఒక్క సంబంధమూ కుదరలేదు..నాలుగు నెలల క్రిందట అమ్మాయిని తీసుకొని ఒక శనివారం సాయంత్రం ఇక్కడికి వచ్చి నిద్ర చేసి, "స్వామీ! అమ్మాయికి పెళ్లి కుదిరితే..నీ సమక్షం లోనే వివాహం చేస్తాము.." అని మ్రొక్కుకున్నాము..పది రోజుల్లోనే ఈ సంబంధం వచ్చింది..చిత్రమేమిటంటే..అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇక్కడే వివాహం చేయాలని మొక్కుకొని ఉన్నారట..మమ్మల్ని అడిగారు..అంతకంటే కావాల్సింది ఏమున్నదని మేమూ సంతోషంగా ఒప్పుకున్నాము..అబ్బాయి బెంగుళూరు లో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు..ఆ కుటుంబం కూడా స్వామివారి భక్తులే..అదే మాకు సంతోషం..మొదటినుంచీ మమ్మల్ని స్వామివారు అన్నివిధాల ఆదుకున్నారు.." అని చెప్పారు..

మరో పదిహేను నెలల తరువాత ఒక ఆదివారం నాడు ఆ దంపతులు తమ కూతురు అల్లుడు.. వాళ్లకు పుట్టిన మగ బిడ్డను తీసుకొని శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చారు..ఆరోజు శ్రీ స్వామివారి వద్ద అన్నదానం చేశారు..వాళ్ల సంతోషానికి కారణం.. ఆ కారుణ్యమూర్తి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడే కదా!..

సర్వం..
శ్రీ దత్తకృప!.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

యాంత్రీకజీవనగమనం

ప్రస్తుతం యాంత్రీకజీవనగమనం లో ఉన్న యువతీయువకులు తాము ఉన్న ఇంట్లో దీపారాధన చేయడానికి కూడా సమయం సరిపోవడం లేదు. కానీ కొంచెము ముందు గా లేచి దీపారాధన చేయడం వలన ఎన్నో ఫలితాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.చాలామంది ఉద్యోగులు భార్యాభర్తలు లక్షలు కి లక్షలు సంపాదించుతున్నారు. కానీ నెల పదిరోజులు తర్వాత వారి దగ్గర డబ్బు ఏమీ ఉండదు. దానికి కారణం మనం చేసుకునేవే మనతో వస్తాయి అని తెలుసుకోకపోవడమే.
🍁దీపం వెలిగేచోట లక్ష్మీ నివాసం ఉంటుంది.
🍁సూర్యోదయం నకు ముందుగా లేచి దీపం పెట్టడం వలన దరిద్రాలు తొలగి ఐశ్వర్యాలు లభిస్తాయి.
🍁దేవతాశక్తులు స్థిరనివాసం చేస్తాయి.
🍁దీపం వెలిగించి పూజాదికాలు చేస్తే విఘ్నకారకులైన విఘ్నేశ్వరుడు మొదలగు దేవతల అనుగ్రహం కలుగుతుంది.
🍁తామసశక్తులు, రాక్షస శక్తులు భూతప్రేత పిశాచాలు దరిచేరవు.
🍁దీపారాధన క్రమంగా మనలో ఙ్ఞానాన్ని వికసింపచేస్తుంది. ఆ రోజు న మనస్సు అంతా ప్రశాంతంగా ఉంటుంది.
🍁దీపాన్ని మన ఇంట్లో ప్రజ్వలింపజేయడం వలన ఉత్తమ ఫలితాలు మరియు ఆ చేసిన వారికి ఉత్తమ లోకాలు లభిస్తాయి.
🍁ఇంకొకవిషయం చెప్పాలంటే దేవతాలోకాలు గా చెప్పే ఊర్ధ్వ లోకాలన్నీ కూడా కాంతి లోకాలే.
🍁కాంతి లేనివన్నీ కూడా అధోలోకాలు అంటే చీకటిమయం అన్న మాట.
🍁ఇంట్లో జ్యోతి ని ప్రజ్వలింపజేయడం వలన మనకు మంచి గతులు లభిస్తాయి. పుణ్య లోకాలు సిద్ధిస్తాయి.
🍁మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలంటే దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
🍁మన ఇంట్లో సంధ్యా సమయంలో దేవుని దగ్గర దీపం పెట్టడం వలన ఆ ఇంట లక్ష్మీ నివాసం ఆ ఇంట్లో దైవశక్తులు ఉంటాయి.
🍁అలాగే ఆ ఇంట్లో రోగాలు, నిరుత్సాహం, కలహాలు, దరిద్రము మొదలైన బాధలు ఉండవు.
🍁మీరు ఇంట్లో దీపం వెలిగించి దైవానికి నైవేద్యం సమర్పించడం ఎంతో మంచిది. మీతో బాటే పాలు నైవేద్యం పెట్టవచ్చును.
🍁మీకు సెలవు దినాలు లో కాస్తంత ఓపిక తెచ్చుకుని దేవుని ముందు మీకు వచ్చిన స్తోత్రం లు పారాయణం లు చేసుకుంటూ ఉంటే మనస్సు కు ఎంతో హాయి ప్రశాంతత.
🍁ఎంత సంపాదించితే ఏముందండీ మనస్సు కు ప్రశాంత త లేకపోవడం వల్ల అంటారా?
🍁ఈ రోజు నుంచే ప్రారంభం చేయండి. ఆచరించండి. ఆనందంగా ఉండండి.

సిద్ధవిద్యా

పంచదశీ మహామంత్రము సిద్ధవిద్యామంత్రము. దానికి శోధన లేదు. సిద్ధాదిశోధన అవసరం లేకుండానే ఈ మంత్రాన్ని ఉపదేశం పొందవచ్చు.

సామాన్యంగా ఏదైనా మంత్రాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఆ మంత్రం మనకు సిద్ధిస్తుందా లేదా అనే విషయం ముందుగా తెలుసుకోవాలి. దీనికి అర్వాణచక్రం వేసి మంత్రం తీసుకోబోయేవాడికి, మంత్రం ఏ రకంగా ఉన్నదో చెబుతారు. అర్వాణచక్రంలో మంత్రం నాలుగు రకాలుగా వస్తుంది. 1. సుసిద్ధము 2. సిద్ధము 3. సాధ్యము 4. అరిష్టము.

1. సుసిద్ధము అంటే
గత జన్మలలోనే ఈ మంత్రం సాధకుడికి సిద్ధించింది.
కాబట్టి మంత్రం తీసుకుని ఏ కొద్దిపాటి జపం చేసినా సిద్ధిస్తుంది.

2. సిద్ధము అంటే - మంత్రాన్ని గట్టిగా నియమనిష్టలతో ఉపాసనచేసినట్లైతే సిద్ధిస్తుంది.

3. సాధ్యము అంటే - చాలా శ్రమపడి ఉపాసన చేస్తే మంత్రం సిద్ధించవచ్చు. అంత తేలిక మాత్రం కాదు.

4. అరిష్టము అంటే - మంత్రాన్ని తీసుకుంటే ఉపాసకుడికి భయం వేస్తుంది. పిచ్చికలలు వస్తాయి. ఒక రకమైన ఉన్మాదానికి కూడా లోనవుతాడు. ఇటువంటి వారు ఆ మంత్రాన్ని వదిలివేసినట్లైతే ఆ బాధలు తప్పుతాయి.

అయితే పంచదశి మహామంత్రం విషయంలో ఈ రకమైనవి ఏవీ చూడవలసిన అవసరం లేదు. సిద్ధశోధన చెయ్యవలసిన అవసరం లేదు. ఇది మహామంత్రము. మహామంత్రాలను ఉపాసన చెయ్యాలి అంటే గతజన్మలో వాటితో అనుబంధం ఉండాలి. లేకపోతే వంశపారంపర్యంగా రావాలి. కాని శ్రీవిద్య సిద్ధవిద్య. దీనికి అటువంటి నియమాలు నిష్టలు అవసరం లేదు. అది సిద్ధిస్తుందా లేదా అని చూడవలసిన అవసరం కూడా లేదు. దేశంలో చాలామంది ఏరకమైన మంత్రోపాసనా లేకుండానే లలితా సహస్రం
పారాయణ చేస్తుంటారు. వారందరికీ కూడా గతజన్మలోనే పరమేశ్వరితో అనుబంధం ఉన్నదన్నమాట. లేకపోతే వారలాచెయ్యరు. ఈ రకంగా అనుబంధమున్నవారు తమ
స్నేహితులవల్లనో, ఇతరులవల్లనో పారాయణ జరిగే చోటికి వెళ్ళి క్రమేణా వారు కూడా లలితాసహస్రం పారాయణ చెయ్యటానికి అలవాటు పడతారు. వీరందరికీ గతజన్మలో పరమేశ్వరితో అనుబంధమున్నది అనే విషయం మరిచిపోకూడదు. అలా కొంతకాలం పారాయణ చేసిన తరువాత మంత్రోపదేశం కూడా తీసుకోవచ్చును. మంత్రం సిద్ధిస్తుందా లేదా అనే విషయం ఆలోచించవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా సిద్ధిస్తుంది.
మంత్రోపాసన చేసినట్లైతే శ్రీవిద్యలో కొన్ని ఇబ్బందులు వస్తాయట కదా ? అని చాలా మంది అడుగుతుంటారు. మంచి గురువు దగ్గర ఉపదేశం పొంది సత్సంకల్పంతో జపం చేస్తే చెడు ఎప్పుడూ జరగదు. కాకపోతే మంత్రాన్ని ఎప్పుడూ మంచి కోసమే వాడాలి. అంతే కాని చెడు కోసం మంత్రాన్ని ఉపయోగించకూడదు. అలాంటప్పుడు దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మంత్ర జపం చేసేటప్పుడు సత్సంకల్పమనేది ముఖ్యం. మనసా వాచా కర్మణా అందరి క్షేమాన్నే కోరాలి. శ్రీవిద్య మీద ఆసక్తి గలవారి కోసం ఈ
విషయం ఇక్కడ చెప్పబడింది. పుట్టుకతోనే జ్ఞానవైరాగ్యాలు కలవారు సిద్ధులు సనకసనందనాదులు, వారిచే ఉపాసించబడే విద్య కాబట్టి ఇది సిద్ధవిద్య, షట్చక్రాలలో ఆధారచక్రంలో ఉండే దేవత సిద్ధవిద్య, ఉపాసనవల్ల చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించేవి సిద్ధవిద్యలు. అవి.

కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమావతీ తథా
బగళా సిద్ధవిద్యా చ మాతంగీ కమలాత్మికా
ఏతా దశమహావిద్యాః సిద్ధవిద్యాః ప్రకీర్తితాః ||

                    శ్రీమాత్రే నమః
                🌹🌹🌹🌹🌹🌹
మత్స్యావ తార కథ 3
మంజరీ ద్విపద

అవ్విధంబుగ తిమి యర్ధించ నృపుని
ఆతడచ్చెరువొంది యనె మీను తోడ
" ఒక దినంబున శత యోజనంబంత
విస్తరించెడు నీవు విన్నాణముగను
వినము చూడము మేము యిటువంటి ఝషము
మీన జాతుల కిట్టి మేనుండ గలదె !
యేమిటి కెవ్వాడ వీలీల ద్రిప్ప
కరుణ నాపన్నుల గావ వేడంగ
యంభశ్చరంబైన హరివి నీవంచు
యెఱిగితి నేనిన్ను యీశ్వరా !యిపుడు
యవ్యయా ! పరమాత్మ ! నారాయణాఖ్య !
సృష్టి స్థితి లయల చేయు క్రీడందు
సర్వేశ ! యత్యంత చతురుడ వీవు
దీనులకును మాకు దిక్కువు నీవు
సకల భక్తుల కెల్ల సంరక్షు వీవు
నీ యవతారముల్ నిఖిల జీవులకు
భూతి హేతువులయ్య పురుషవరేణ్య !
పరమేశ ! మేము మీ పరులము గాము
నిర్మల జ్ఞానంబు నిండియుండితిమి
గలవు మా కండగా కమలాక్ష ! నీవు
భక్త స్థితుడవీవు పరమాత్మ ! యీశ !
ఆదిదేవా ! ప్రభో ! యనయంబు నీకు
నతి సేయు వానికి నాశ మెట్లుండు ?
శ్రీ లలనా కుచ వేదిక పైన
శ్రీ లలనా కుచ చిత్ స్థలి పైన
క్రీడాంతరంగువై క్రీడించు చుండి
యాధ్యాత్మికానంద మనుభవించేటి
సర్వేశ ! నీవిట్టి తామసంబైన
మత్స్య రూపము నేల మఱి దాల్చినావు ?
విస్మయంబగుచుండె యెఱిగించు దేవ !"
సత్యవ్రతుండిట్లు సప్రార్థనమున
యడుగగా వినియును యానంద ముగను
యయ్యుగ కడపట ప్రళయ కాలమున
సంద్రాన తా నొంటి సంచరించుటకు
తగు మత్స్య రూపంబు దాల్చిన యట్టి
శ్రీహరి యిట్లనె చిద్విలాసముగ

"ఇటమీద నీరాత్రి కేడవ రోజు
పద్మ గర్భుని యొక్క పగలుయై నిండు
భూర్భు వాదిక మూడు భువనంబు లెల్ల
విలయాబ్దిలో మున్గు విపరీతముగను
అప్పుడు నీ కడ కద్భుతంబుగను
నావొక టొచ్చును నాదు పంపునను
అందఱూ నావపై యస్మదానతితొ
సర్వొషధీతతుల సర్వ బీజముల
నిడుకొని సాగేవు నిండు సంద్రమున
ఆ రీతి విహరించు యా నావ యందు
సప్తర్షి బృందంబు సాగు నీతోడ
ముందు కన్పించని ముసురు చీకటిలొ
మిణుకను చుండును మౌనుల మేను
ఆ రీతి దేలుచూ యడ్డు లేకుండ
సాగరంబందున సాగును నావ
ఆ నావ కడలిలో యలల తాకిడికి
స్వాధీన మవకుండ సాగుట కొఱకు
యిరు కెలంకుల యందు వెనుకనూ ముందు
నేనుండి మత్స్యమై యేమఱకుండ
బృహదమౌ నా ఱెక్క యీకల తోడ
యాసన్న మకరుల నంతంబు జేసి
కాపాడుచుందును కడలిలో దిరిగి
అపుడొక పెనుబాము యాసన్న మయ్యు
నగుపించు నక్కడ నాదు యానతితొ
కడలిలో గలిగెడి సుడిగాలి కతన
వడి తిర్గబడకుండ వహియించు టకును
కాకోదరంబుతో గట్టిగా యపుడు
నా మేని కొమ్ముకు నావను గట్టి
కాళరాత్రంతయు గడచెటి వఱకు
మునులకు నీకును మున్నీటి యందు
కడగంద్లు లేకుండ గాచుచూ నుందు .
అందుకే యిటువంటి యద్భుతంబైన
మత్స్య దేహంబును మది దాల్చినాను
పార్థివా ! నే పరబ్రహ్మంబు యనియు
యెఱుగు నా మహిమను విశదంబు గాను
కడువిధి నుండుము కరుణింతు నిన్ను "
ఆ రీతి శ్రీహరి యానతి నిచ్చి
యంతర్హితుండయ్యె నవనీశు యెదుట
అధినాథు డంతట యానంద ముగను
దర్భశయ్యను తూర్పు తలగడ o
పడుకొని మనమందు ప్రాశాంతముగను
ప్రళయకాలంబుకై పరిపూర్ణ మదితొ
యెదురు చూచుచు నుండె విష్ణుని దలచి .

గోపాలుని మధుసూదన రావు

మృతదేహంపై శవపరీక్ష

* కోవిడ్ -19 నుండి మృతదేహంపై శవపరీక్ష (పోస్టుమార్టం) చేసిన మొట్టమొదటి దేశంగా ఇటలీ నిలిచింది మరియు కోవిడ్ -19 వైరస్ వలె ఉనికిలో లేదని విస్తృతమైన దర్యాప్తులో తేలింది, బదులుగా ఇది చాలా పెద్ద ప్రపంచ కుంభకోణం ఉంది. ప్రజలు వాస్తవానికి "యాంప్లిఫైడ్ గ్లోబల్ 5 జి విద్యుదయస్కాంత వికిరణం (పాయిజన్)" తో మరణిస్తున్నారు. *

 కరోనా వైరస్ కారణంగా మరణించే వ్యక్తుల మృతదేహాలపై శవపరీక్షలు (పోస్టుమార్టం) అనుమతించని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చట్టాన్ని ఇటాలియన్ వైద్యులు ఉల్లంఘించారు, తద్వారా కొంత శాస్త్రీయ పరిశోధన మరియు దర్యాప్తు తరువాత, ఈ చిరునామా ఇది వైరస్ కాదని, మరణానికి కారణమయ్యే బాక్టీరియం అని నిర్ధారించలేము, దీనివల్ల సిరల్లో రక్త నాళాలు ఏర్పడతాయి, అంటే, ఈ బ్యాక్టీరియా కారణంగా, సిరలు మరియు నరాలలో రక్తం పేరుకుపోతుంది మరియు ఈ రోగి మరణానికి కారణం అవుతుంది.

 ఇటలీ వైరస్ను ఓడించింది, "వ్యాప్తి-ఇంట్రావాస్కులర్ కోగ్యులేషన్ (థ్రోంబోసిస్) తప్ప మరేమీ లేదు, మరియు దానిని ఎదుర్కునే పద్ధతి ..........
 * యాంటీబయాటిక్స్ మాత్రలు}
 * శోథ నిరోధక * మరియు
 * యాంటికోగ్యులాటస్ * (ఆస్పిరిన్) తీసుకోవడం ద్వారా ఇది నయమవుతుంది.
 ప్రపంచానికి ఈ సంచలనాత్మక వార్తలను ఇటాలియన్ వైద్యులు కోవిడ్ -19 వైరస్ యొక్క చనిపోయిన శవాల శవపరీక్షలు (పోస్టుమార్టం) ద్వారా తయారు చేశారు, ఇది వ్యాధి సాధ్యమని సూచిస్తుంది. మరికొందరు ఇటాలియన్ శాస్త్రవేత్తల ప్రకారం, వెంటిలేటర్లు మరియు ఇన్వాసివ్ కేర్ యూనిట్లు (ఐసియు) ఎప్పుడూ అవసరం లేదు. ఇందుకోసం ఇటలీలో ఇప్పుడు కొత్త మొలాసిస్ ప్రోటోకాల్స్ జారీ చేయబడ్డాయి.
 చైనా దాని గురించి ముందే తెలుసు కానీ తన నివేదికను ఎవరికీ బహిరంగపరచలేదు.
 దయచేసి ఈ సమాచారాన్ని మీ కుటుంబం, పొరుగువారు, నిపుణులు, స్నేహితులు, సహోద్యోగులందరికీ పంచుకోండి, తద్వారా వారు కోవిడ్ -19 భయం నుండి బయటపడగలరు మరియు ఇది వైరస్ కాదని వారు అర్థం చేసుకున్నారు, కానీ కేవలం 5 జి రేడియేషన్ కలిగిన బాక్టీరియం రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నవారికి హాని కలిగించడమే కారణం. ఇది రేడియేషన్ ఇన్ఫార్క్షన్ మరియు హైపోక్సియాను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిస్థితికి వచ్చే వారు * ఆస్ప్రిన్ -100 ఎంజి * మరియు * అప్రోనికస్ లేదా పారాసెటమాల్ 650 ఎంజి * తీసుకోవాలి. ఎందుకు ... ??? .... ఎందుకంటే కోవిడ్ -19 రక్తాన్ని పేరుకుపోతుంది, ఇది థ్రోంబోసిస్‌కు కారణమవుతుంది మరియు దీనివల్ల సిరల్లో రక్తం పేరుకుపోతుంది మరియు ఈ కారణంగా మెదడు, గుండె మరియు s పిరితిత్తులు ఆక్సిజన్ పొందలేవు వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం ప్రారంభిస్తాడు మరియు శ్వాస లేకపోవడం వల్ల, వ్యక్తి వేగంగా మరణిస్తాడు.
 ఇటాలియన్ వైద్యులు WHO ప్రోటోకాల్‌ను అనుసరించలేదు మరియు కోవిడ్ -19 చేత చంపబడిన శవాలను శవపరీక్ష చేస్తారు. మృతదేహాలు, కాళ్ళు మరియు శరీరంలోని ఇతర భాగాలను తెరిచి పరిశీలించిన తరువాత, రక్త నాళాలు విడదీయబడి, సిరలు త్రోంబితో నిండి ఉన్నాయని వైద్యులు భావించారు, ఇది సాధారణంగా రక్తం ప్రవహించకుండా చేస్తుంది. రోగి మరణానికి కారణమయ్యే శరీరానికి ఆక్సిజన్ ప్రవాహాన్ని కూడా తగ్గిస్తుంది.ఈ పరిశోధన తెలిసిన తరువాత, ఇటాలియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెంటనే కోవిడ్ -19 చికిత్స యొక్క ప్రోటోకాల్‌ను మార్చి, దాని సానుకూల రోగులకు ఆస్పిరిన్ ఇచ్చింది. 100mg మరియు ampromacus ఇవ్వడం ప్రారంభించింది. దీనివల్ల రోగులు కోలుకోవడం ప్రారంభించారు మరియు వారి ఆరోగ్యం మెరుగుపడింది. ఇటాలియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒకే రోజులో 14000 మంది రోగులను డిశ్చార్జ్ చేసి వారి ఇళ్లకు పంపింది.
 * మూలం: ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ *

14-20-గీతా మకరందము


        గుణత్రయవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అవతారిక - ఈ ప్రకారముగ గుణములను దాటినవాడు జననమరణాది దుఃఖముల నుండి విడుదల బొంది మోక్షమును బడయునని వచించుచున్నారు -

గుణానేతానతీత్యత్రీన్
దేహీ దేహసముద్భవాన్ |
జన్మమృత్యుజరాదుఃఖైః
విముక్తోఽమృతమశ్నుతే || 

తాత్పర్యము:- జీవుడు దేహోత్పత్తికి కారణభూతములగు ఈ మూడుగుణములను దాటి (దాటినచో) పుట్టుక, చావు, ముసలితనము, దుఃఖములు - అనువానిచేత లెస్సగ విడువబడినవాడై, మోక్షమును (మరణరహిత ఆత్మస్థితిని) బొందుచున్నాడు.

వ్యాఖ్య:- 'గుణాన్' అని చెప్పినందువలన, రజస్తమములతోబాటు సత్త్వగుణమును గూడదాటి నిర్గుణ పరమాత్మను జేరవలెనని భావము. అయితే మొట్టమొదట తమోగుణమును పారద్రోలి సత్త్వగుణమును బాగుగ అభ్యసించవలెను. ఆ పిదప నిస్సంకల్పాత్మస్థితియందు ఆ సత్త్వగుణము దానియంతట అదియే అతిక్రమింపబడగలదు.
గుణములవలన కలుగు గొప్ప అపకారమేదియో, అవి తొలగినందువలన కలుగు గొప్ప ఉపకారమేదియో ఈశ్లోకమునందు తెలుపబడినది. "దేహసముద్భవాన్” దేహములను సృష్టించుటయే వానివలనగలుగు దారుణమగు అపకారము, వానివలన జీవుడు జననమరణరూపమగు ఈ సంసారచక్రమునుండి తప్పించుకొనజాలడు. ఒక దేహము పోయిన మఱియొక దేహము వచ్చుచుండును. ఇప్పటికి ఎన్నియో కోట్లకొలది జన్మలు, శరీరములు, ఆ త్రిగుణరూపబీజమునుండియే, మూలమునుండియే ఉద్భవించినవి. ఆ మూలము విచ్ఛిన్నముకానిచో ఇంకను ఎన్నియో అగణితములైన జన్మలు రాగలవు. అయితే జన్మవచ్చినచో నష్టమేమి? యని ప్రశ్నించవచ్చును. ఆ నష్టమేమియో భగవానుడే ఈశ్లోకమందు తెలియజేసిరి. ముసలితనము, రోగము, చావు, దుఃఖములు మొదలగు ఆపత్తులన్నియు శరీరోద్భవము వలననే జీవునకు కలుగుచున్నవి. కాబట్టి అసలు శరీరమే రాకుండ, అనగా జన్మలేకుండ చేసికొనుటయే ఉత్తమము అట్టి జన్మరాహిత్యమో గుణములను దాటినపుడే కలుగగలదని ఇచట స్పష్టముగ చెప్పివేయబడినది. కాబట్టి ముముక్షువు తన సత్ప్రయత్నములచే తమోగుణమును, రజోగుణమును తెగద్రుంచి, సత్త్వగుణమును దాటివైచి శాశ్వత కైవల్యపదవి నొందవలయును. అయ్యది మరణరహితస్థితి. గనుకనే దానిని "అమృతము" అని భగవాను డిచట పేర్కొనిరి.
"ముక్తః” అని చెప్పక "విముక్తః” అని చెప్పటచే త్రిగుణములను దాటినవాడు జననమరణబంధమునుండి పూర్తిగ విముక్తుడగునని భావము.

ప్రశ్న:- ఈ దేహములు వేనివలన కలుగుచున్నవి?
ఉత్తరము: - త్రిగుణములవలన.
ప్రశ్న:- మరణరహితమగు కైవల్య (మోక్ష) పదమెట్లు చేకూరగలదు?
ఉత్తరము:- ఈ మూడుగుణములను దాటుటచే,
ప్రశ్న:- దేహము(జన్మ) వచ్చినచో నష్టమేమి?
ఉత్తరము: - ముసలితనము, రోగము, చావు, వియోగము, దుఃఖము, మున్నగునవియన్నియు ఆ
దేహమువలననే సంభవించుటవలన, అది మహానర్థదాయకమైయున్నది. కావున దేహరహిత (జననమరణరహిత) ఆత్మస్థితినే జీవుడు పొందవలెను.
ప్రశ్న:- మోక్షస్థితి యెట్టిది?
ఉత్తరము:- అది జననమరణములు లేని స్థితి (అమృతమ్).