17, సెప్టెంబర్ 2020, గురువారం

. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 54

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 54 / Sri Gajanan Maharaj Life History - 54 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 11వ అధ్యాయము - 2 🌻*

నేను మీయొక్క అవివేకమయిన పిల్లవాడిని. నాకు ఏది మంచిదో అది మీరే చెయ్యండి. తన పిల్లలకు ఏది మంచిదో తల్లి మాత్రమే అర్ధం చేసు కుంటుందని శ్రీతుకారాం తన కధనంలో అన్నారు.

నేను మీ పిల్లవాడిని మరి నేను మిమ్మల్ని అర్ధించడం ఎందుకు ? మీరు జ్ఞానంఅనే మహాసముద్రం, అన్ని విషయాలు తెలిసినవారు అని భాస్కరు అన్నాడు. ఇదివిన్న శ్రీమహారాజు చాలా సఇతోషించారు. స్వయానా నిజాయితీ పరులైనవారికి, ఇతరుల నిజాయితీ సంతృప్తిని కలిగిస్తుంది.

భాస్కరు తమ అత్యంత ప్రియమైన భక్తులలో ఒకరు కావున భాస్కరును రక్షించమని కొంతమంది భక్తులు శ్రీమహారాజును అర్ధించారు.

సజ్జనులారా మీయొక్క తెలివి తక్కువ తనం వల్లనే మీకు ఈవిధంగా అనిపిస్తోంది. జీవన్మరణం అనేది అసత్యం అని తెలుసుకోండి. ఎవరూ జన్మించలేదు, మరణించలేదు. ఈమధ్యను గూర్చి అవగాహన చేసుకుందుకు అత్యంత గొప్పదయిన, ఆత్మగురించిన జ్ఞానం అవసరం అని మేధావులు సలహా ఇచ్చారు.

పూర్వజన్మ కర్మఫలితాన్ని అనుభవించకుండా మీకు ఈజన్మనుండి విముక్తి లేదు. క్రిందటి జన్మలో మీరు ఏదో చేస్తారు, దానిఫలితాన్ని అనుభవించేందుకు మరల జన్మ ఎత్తుతారు, మరలా ఈజన్మలో చేసిన పనుల ఫలితాన్ని అనుభవించేందుకు మరలా జన్మఎత్తుతారు, ఇలా ఈచక్రం ముందుకు కొనసాగుతుంది. ఎంతకాలం ఈగొలుసును కొనసాగించడం ?

భాస్కరు తన పూర్వజన్మ ఫలితాలను అనుభవించడం పూర్తిచేసాడు, ఇక మోక్షం పొందడం కోసం విముక్తుడయ్యాడు. కావున దయచేసి అతనిదారిలోకి రాక అతనిని వెళ్ళనివ్వండి. భాస్కరులాంటి భక్తుడు దొరకడం కష్టమే.

ఈ కుక్క క్రితం జన్మలో భాస్కరుకు శత్రువు, కనుక అది ఈజన్మలో బాలాపూరులో ఇతనిని కరిచింది అని తెలుసుకోండి. ప్రతీకారం పూర్తి అయింది, కానీ ఈ సంఘటన వలన భాస్కరు మనసులో ఏమాత్రమయినా చేదు మిగిలితే, ఆకాటుకు ప్రతీకారం తీర్చుకోడంకోసం మరోజన్మ ఎత్తడానికి కారణం అవుతుంది.

కావున ఈ రోజుతో క్రితం జన్మల శతృత్వాలన్నీ పూర్తి అయి, భాస్కరు ఆజన్మలన్నిటి నుండి పరిశుద్దుడయ్యాడు అని అర్ధంచేసుకోండి.

ఇక ఇతనికి రెండు నెలలు ఆయుర్దాయం ఉంది, నేను ఇతనిని ఈ రెండు నెలలూ ఈ కుక్క కాటు పరిణామాలనుండి రక్షిస్తాను, అలా నేను చెయ్యకపోతే తిరిగి ఇతను రెండి నెలలు జీవించడం కోసం జన్మించాలి అని శ్రీమహారాజు అన్నారు.

శ్రీమహారాజు చెప్పిన ఈబ్రహ్మజ్ఞానం గురించి చాలామంది అర్ధంచేసుకోలేక పోయారు, కానీ బాలాభవ్ చేసుకోగలిగి చాలా సంతోషించాడు. అతను భాస్కరు యొక్క నిష్కలమైన భక్తికీ, దానివల్ల జీవన మరణ చక్రంనుండి ముక్తి పొందడాన్ని పదేపదే పొగిడాడు. అప్పుడు అందరూ షేగాం తిరిగి వచ్చారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: