1, అక్టోబర్ 2021, శుక్రవారం

అంటును కట్టవచ్చు.

 వృక్ష విచిత్రములు - అంటు కట్టడం ద్వారా విచిత్రాలు సృష్టించుట 


 * మామిడి టెంక నాటిన పిదప మొలచిన మొక్క జానెడు వరకు పెరిగిన పిదప చిగురు కత్తిరించిన యెడల నాలుగైదు కొమ్మలు పుట్టి పెరుగును. ఆ కొమ్మలు వ్రేళ్ళు వలె పెరిగిన పిమ్మట నాలుగు కొమ్మలకు నాలుగు జాతుల అంటు మామిడి అంట్లు కట్టిన నాలుగు వైపులా నాలుగు రంగుల కాయలు కాచును. 


 * పనస మొక్కకు మామిడి కొమ్మ కట్టి నాటిన మొదటను పనస కాయలును, కొమ్మలకు మామిడి కాయలను కాయును .


 * నేరేడు మొక్క యెక్క కొమ్మకు గులాబి, జామ, అంటును కట్టవచ్చు.


 * నిమ్మ , దబ్బ , కమలా, నారింజ, ఈ జాతులు ఒక జాతి మొక్కకు అన్ని జాతుల మొక్కలు అంట్లు కట్టవచ్చును.


 * పాల మొక్కకు సపోటా, పనస అంటు కట్టవచ్చును.


 * పొగాకుకు , గరుడ వాహన , జాజికి చమెలి, గులాభికి పల్ల సంపెంగి , మాలతికి సాంబ్రాణి అంట్లు కట్టవచ్చు. 


 * మల్లె చెట్టు దగ్గర నొక యెర్ర బాడిధ కొమ్మను పాతి ఆ కొమ్మ చిగిర్చిన పిదప అడ్డగముగా నొక రంధ్రము చేసి ఆ రంధ్రములో నుండి ఒక మల్లె కొమ్మని తీసి పేడ మన్ను ఆ రంధ్రముని గప్పి నీళ్లు పోయుచుండిన కొంతకాలానికి ఆ రంద్రములో గల కొమ్మకి వేర్లు వచ్చును. పిమ్మట ఆ కొమ్మని మొదటకి కోసి నాటిన మంకెన ( బాడిధ ) పువ్వులు పూయును. 


 * పొగడ చెట్టు కొమ్మకు సంపెంగ మొక్కకు అంటు కట్టిన ఒక పక్క పొగడ పువ్వులు , ఇంకో పక్క సంపెంగ పువ్వులు పూయును.


 * సూర్య కాంత ( sunflower ) గింజలు పాలలొ 7 మార్లు నానవేసి ఎండబెట్టి నాటి రోజు పాలతో తడుపు చుండిన తెల్లని పువ్వులు పూయును. 


 * ఎర్ర గన్నేరుకు , తెల్ల గన్నేరుకు అంటు కట్టిన రెండు రకాల పువులు పూయును.


      

సంస్కృత మహాభాగవతం

 *1.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదియవ అధ్యాయము*


*లౌకిక - పారలౌకిక సౌఖ్యములన్నియును నిస్సారములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*10.16 (పదహారవ శ్లోకము)*


*ఏవమప్యంగ సర్వేషాం దేహినాం దేహయోగతః|*


*కాలావయవతః సంతి భావా జన్మాదయోఽసకృత్॥12592॥*


ప్రియమైన ఉద్ధవా! దేహాభిమానులగు జీవులందరు, దేహముతో తాదాత్మ్యతను అంగీకరించుటచే వారు తమ అజ్ఞానమువలన ఆత్మకు నానాత్వమును ఆపాదించెదరు. కాని, వాస్తవమునకు విశ్వమంతటను ఒకే ఒక ఆత్మయొక్క అఖండసత్తా వ్యాపించియున్నది. శారీరకమైన బాల్య, యౌవన, వార్ధక్యములవంటి అవస్థలు కాలప్రభావముతో ప్రతిక్షణము మార్పుచెందుచు, మృత్యుముఖమున ప్రవేశించుచున్న సంగతి సమస్త ప్రాణులకు అనుభవైకవేద్యమే. కావున, ప్రాపంచికమైన దేహ-గేహముకల భార్యాబిడ్డలూ, ప్రాణి-పదార్థములు మున్నగువాటియందు అహంకార - మమకారములను కలిగియుండక వైరాగ్యమును పొందుటకు ప్రయత్నింపవలెను.


 *10.17 (పదిహేడవ శ్లోకము)*


*అత్రాపి కర్మణాం కర్తురస్వాతంత్ర్యం చ లక్ష్యతే|*


*భోక్తుశ్చ దుఃఖసుఖయోః కో న్వర్థో వివశం భజేత్॥12593॥*


కర్మలను ఆచరించుటలో వాటి ఫలములను పొందుటలో జీవులు పరతంత్రులే. కాని, వారికి స్వాతంత్ర్యము ఉన్నట్లు గోచరింపదు. ఒక వేళ సుఖ-దుఃఖాదుల అనుభవమునందు స్వాతంత్ర్యమే ఉండినచో, లోకమునందు దుఃఖము ఎవరు కోరుకొందురు? కోరి దుఃఖములపాలు ఎందుకయ్యెదరు? కావున సంసారముపట్ల ఉపరతిని పొంది, వైరాగ్యముద్వారా మోక్షమును సాధించుటకై ప్రయత్నింపవలెను.


 *10.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*న దేహినాం సుఖం కించిద్విద్యతే విదుషామపి|*


*తథా చ దుఃఖం మూఢానాం వృథాఽహంకరణం పరమ్॥12594॥*


 *10.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*యది ప్రాప్తిం విఘాతం చ జానంతి సుఖదుఃఖయోః|*


*తేఽప్యద్ధా న విదుర్యోగం మృత్యుర్న ప్రభవేద్యథా॥12595॥*


లోకములో గొప్ప విద్వాంసులైన కొందరు మానవులకు కొంచమైనా సుఖము కలుగుటలేదు. అట్లే ముర్ఖులగువారికి దుఃఖము కొంచమైనా లేకుండుట కనబడుచున్నది. కావున, ఏవిధమైన అహంకారమును కలిగియుండుటయును వ్యర్థమే. ఒక వేళ సుఖమును పొంది, దుఃఖమును తొలగించుటను తెలిసినవారు కూడా సాక్షాత్తుగా మృత్యుముఖమునుండి తప్పించుకొను ఉపాయమును ఎంతమాత్రమూ ఎరుగరుకదా!


 *10.20 (ఇరువదియవ శ్లోకము)*


*కో న్వర్థః సుఖయత్యేనం కామో వా మృత్యురంతికే|*


*ఆఘాతం నీయమానస్య వధ్యస్యేవ న తుష్టిదః॥12596॥*


వధ్యస్థానమునకు తీసికొనిపోబడిన వ్యక్తికి ఈసంపదలుగాని, భోగములుగాని ఏమి సుఖమును ఇచ్చును? అట్లే మృత్యుముఖమునకు చేరినవానికి ఈ భోగములుగాని సంపదలుగాని సంతోషమును చేకూర్చునా?


 *10.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*శ్రుతం చ దృష్టవద్దుష్టం స్పర్ధాసూయాత్యయవ్యయైః|*


*బహ్వంతరాయకామత్వాత్కృషివచ్చాపి నిష్ఫలమ్॥12597॥*


ఉద్ధవా! లౌకిక సుఖములవలె పారలౌకిక సుఖములు గూడ దోషయుక్తములే. ఏలయన అక్కడగూడ పరస్పర కలహములు సంభవించుచుండును. అచట ఎక్కువ సుఖమును అనుభవించువారి యెడల తక్కువ సుఖములను అనుభవించు వారికి స్పర్థయుండును. అట్లే వారి గుణములను దోషములుగా ఎంచుచుందురు. ఎక్కువ సుఖములను పొందువారు తక్కువ సుఖములను పొందువారిని చులకనగా చూచుచుందురు. ప్రతిదినము పుణ్యములు క్షీణించుచుండుటచే సుఖములుగూడ తగ్గిపోయి పూర్తిగా నష్టమగును. పరలోకసుఖములు గూడ తగ్గిపోయి పూర్తిగా నష్టమగును. పరలోకసుఖముల కొరకై చేయబడు యాగాది ప్రక్రియలలోగూడ, ఋత్విజులలో అశ్రద్ధయు, కర్మలలో లోపములును ఏర్పడుటవలన యజమాని స్వర్గసుఖములను పొందుటలోను విఘ్నములు ఏర్పడుట సంభవమే. రైతుకృషి ఎంతగా ఉన్నను అతివృష్టి, అనావృష్టి మొదలగు ఈతిబాధలవలన 'పండినపంట చేతికి అందును' అను విషయముగూడ సందేహమేకదా!.


 *10.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*అంతరాయైరవిహతో యది ధర్మః స్వనుష్ఠితః|*


*తేనాపి నిర్జితం స్థానం యథా గచ్ఛతి తచ్ఛృణు॥12598॥*


యజ్ఞయాగాది ధర్మములు ఎట్టి అంతరాయములు లేకుండా ఆచరింపబడినను, వాటివలన పొందబడిన ఊర్ధ్వలోకముల గతి ఎట్లుండునో తెలిపెదను వినుము.


 *10.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*ఇష్ట్వేహ దేవతా యజ్ఞైః స్వర్లోకం యాతి యాజ్ఞికః|*


*భుంజీత దేవవత్తత్ర భోగాన్ దివ్యాన్ నిజార్జితాన్॥12599॥*


యజ్ఞములను ఆచరించు పురుషుడు యజ్ఞములద్వారా దేవతలను ఆరాధించి స్వర్గలోకమునకు చేరును. అచట అతడు తన పుణ్యకర్మలద్వారా ఆర్జించిన భోగములను దేవతలవలె అనుభవించును.


 *10.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*స్వపుణ్యోపచితే శుభ్రే విమాన ఉపగీయతే|*


*గంధర్వైర్విహరన్ మధ్యే దేవీనాం హృద్యవేషధృత్॥12600॥*


 *10.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*స్త్రీభిః కామగయానేన కింకిణీజాలమాలినా|*


*క్రీడన్ నవేదాత్మపాతం సురాక్రీడేషు నిర్వృతః॥12601॥*


తాను ఆర్జించిన పుణ్యములఫలితముగా అతడు దివ్యములైన వస్త్రాభరణములను ధరించి, తేజోవిరాజమానమైన విమానము నందు దివ్యాంగనలమధ్య విహరించును. గంధర్వులు అతని గుణగణములను గానము చేయుదురు. చిఱుమువ్వల తోరణముల గలగలలతో ఒప్పుచు కోరినరీతిగా సంచరించునట్టి విమానమున అతడు మేరుపర్వతసానువుల యందును, దివ్యములైన ఉద్యానములయందును విహరించును, ఆ సుఖములలో మునిగి, పుణ్యసమాప్తితో వాటిల్లెడి తన పతనమును గూడ అతడు గుర్తింపడు.


 *10.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*తావత్ప్రమోదతే స్వర్గే యావత్పుణ్యం సమాప్యతే|*


*క్షీణపుణ్యః పతత్యర్వాగనిచ్ఛన్ కాలచాలితః॥12602॥*


పుణ్యఫలములు ముగియు నంత వఱకును అతడు స్వర్గసుఖములను అనుభవించును. పుణ్యములు క్షీణించిన పిమ్మట తనకు ఇష్టము లేకున్నను కాలప్రభావమున అథోలోకమున పడిపోవును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీమద్భాగవతము

 *01.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2278(౨౨౭౮)*


*10.1-1403-వ.*

*10.1-1404-*


*శా. "తండ్రిం జూడము తల్లిఁ జూడము యశోదాదేవియున్ నీవు మా*

*తండ్రిం దల్లియు నంచు నుండుదుము సద్ధర్మంబులం; దొల్లి యే*

*తండ్రుల్ బిడ్డల నిట్లు పెంచిరి? భవత్సౌజన్య భావంబులం*

*దండ్రీ! యింతటివార మైతిమిగదా! తత్తద్వయోలీలలన్.* 🌺



*_భావము: అటు పిమ్మట ఒక రోజు, శ్రీకృష్ణుడు బలరామ సహితముగా నందుని కలిసి ఇలా అన్నాడు: "మాకు మా కన్నతల్లితండ్రులెవరో తెలియదు, చూడనూలేదు. వాత్సల్యము చూపించిన నీవు, యశోదాదేవియే మా అమ్మ నాన్నలు అనుకుని పెరిగాము. ఇంతకు ముందు ఎవరైనా ఇలా ప్రేమతో పెంచివుంటారా? మీ సౌజన్యము, సద్భావము, మంచి మనస్సుల ప్రభావంతో బాల్య చేష్టలు, ఆ యా వయోక్రీడలలో వర్తించి, ఇంతవారమైనాము."_* 🙏



*_Meaning: As some period elapsed, one day Sri Krishna accompanied by Balarama, met Nanda and expressed His gratification and pleasure at the way they took care Him and Balarama during their infancy and childhood: "We were not knowing our natural parents all these years and you tended us with great affection and abundant love and brought us to this age and stage. We grew up in your care considering you two as our loving parents. No one else would have brought up other's kids the way you cared for us. We are what We are today, is just because of your blessings, kindness, good heartedness and noble mind."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

సంస్కృత మహాభాగవతం

 *01.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదియవ అధ్యాయము*


*లౌకిక - పారలౌకిక సౌఖ్యములన్నియును నిస్సారములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*10.10 (పదియవ శ్లోకము)*


*యోఽసౌ గుణైర్విరచితో దేహోఽయం పురుషస్య హి|*


*సంసారస్తన్నిబంధోఽయం పుంసో విద్యాచ్ఛిదాత్మనః॥12586॥*


ఈశ్వరునిద్వారా నియంత్రింపబడు మాయాశక్తి త్రిగుణాత్మకమైనది. ఆ త్రిగుణములే పురుషున(జీవున)కు సూక్ష్మ, స్థూల శరీరములను నిర్మించుచున్నవి. పురుషుడు అజ్ఞానముచే దేహమే తానని తాదాత్మ్యమును చెందుటవలన అహంకార, మమకారములు ఏర్పడుచున్నవి. ఇట్టి దేహాభిమానము వలన అతడు సంసారమునందు బద్ధుడు అగుచున్నాడు. ఈ విధముగ పురుషునిలో కలిగిన దేహాభిమానమే ఆత్మజ్ఞానమును దూరమొనర్చును. కావున, తనలో కలిగిన ఈ అజ్ఞానమును ఆత్మవిచారముతో నశింపజేయవలెను.


*10.11 (పదకొండవ శ్లోకము)*


*తస్మాజ్జిజ్ఞాసయాఽఽత్మానమాత్మస్థం కేవలం పరమ్|*


*సంగమ్య నిరసేదేతద్వస్తుబుద్ధిం యథాక్రమమ్॥12587॥*


ఆత్మవిచారము యొక్క జిజ్ఞాసవలన తనలోనే ఉన్నట్టి అద్వయము, నిరంజనము, పరతత్త్వము అనెడు ఆత్మస్వరూపమును విశదముగా తెలిసికొనవలెను. క్రమక్రమముగా దేహాది అనాత్మవస్తువుల యందుగల సత్యత్వబుద్ధిని విడిచిపెట్టవలెను.


ఉన్నది ఆత్మ సత్తా ఒక్కటే వేరొక దానికి ఉనికి లేనేలేదు. దృశ్యజగత్తు అంతా మాయామయము. మిథ్య అని పలుమార్లు చెప్పబడినది. ఈ మాట అందరి అనుభవములో కూడా ఉన్నది. కావున, మిథ్యాభిమానము వదలిపెట్టి వైరాగ్యభావమును పొంది, స్వస్వరూపానుసంధానమనకై సాధన సలుపవలెను.


*10.12 (పండ్రెండవ శ్లోకము)*


*ఆచార్యోఽరణిరాద్యః స్యాదంతేవాస్యుత్తరారణిః|*


*తత్సంధానం ప్రవచనం విద్యాసంధిః సుఖావహః॥12588॥*


యజ్ఞము చేయుటకు అరణి మంథనమువలన అగ్ని ఉత్పన్నమగును. ఇందులో పైన ఒకటి, క్రింద ఒకటి రెండు కర్రలు ఉండును. మధ్యలో మంథనకాష్ఠము ఉండును. అట్లే ఆత్మ విద్యయనెడి అగ్ని ఉత్పన్నమగుటకు ఆచార్యుడు ఆదియరణి (పైకర్ర), శిష్యుడు ఉత్తరారణి (క్రింద కర్ర) ఉపదేశము మంథనకాష్ఠము (మధ్య కర్ర). ఆచార్య, శిష్యుల సంధానమునుండి ఉత్పన్నమగు ఆత్మ విద్యాగ్ని సుఖావహము, అది అజ్ఞానమును రూపుమాపి పరమానందమును పంచియిచ్చును.


*10.13 (పదమూడవ శ్లోకము)*


*వైశారదీ సాతివిశుద్ధబుద్ధిర్ధునోతి మాయాం గుణసంప్రసూతామ్|*


*గుణాంశ్చ సందహ్య యదాత్మమేతత్ స్వయం చ శామ్యత్యసమిద్యథాగ్నిః॥12589॥*


ఈ విధముగా అభ్యాసము చేయగా చేయగా బుద్ధి సూక్ష్మమగును. అట్టి విశుద్ధబుద్ధి గుణములనుండి ఉత్పన్నమైన మాయను భస్మమొనర్చును. అప్పుడు ఆ గుణములవలన ఏర్పడిన సంసారమునందుగల నానాత్వముగూడ అంతరించును. అంతట ఇంధనములను పూర్తిగా భస్మమొనర్చిన పిమ్మట అగ్ని శాంతించినట్లు, గుణములను భస్మమొనర్చిన బుద్ధియు ప్రశాంతమగును. ఇట్టిస్థితిలో *వాసుదేవస్సర్వమ్* అనెడి అనుభవము లభించును. అంతట ఆత్మయొక్క అఖండసత్తా నిలిచిపోవును.


*10.14 (పదియవ శ్లోకము)*


*అథైషాం కర్మకర్తౄణాం భోక్తౄణాం సుఖదుఃఖయోః|*


*నానాత్వమథ నిత్యత్వం లోకకాలాగమాత్మనామ్॥12590॥*


*10.15 (పదిహేనవ శ్లోకము)*


*మన్యసే సర్వభావానాం సంస్థా హ్యౌత్పత్తికీ యథా|*


*తత్తదాకృతిభేదేన జాయతే భిద్యతే చ ధీః॥12591॥*


కర్మలను ఆచరించుటవలన సుఖము లభించును అని మీమాంసకులు చెప్పుచుందురు. కాని, ఈ అభిప్రాయము సరియైనదికాదు. మీమాంసకుల ప్రధాన ఆశయమగు ఈ మాటను ముందుగా ప్రస్తావించి ఇంకనూ భగవానుడు వారి గురుంచి ఇట్లు వివరించుచున్నాడు - వారు చెప్పునదేమన, కర్మలను ఆచరించువారు, వాటి ఫలములగు సుఖ-దుఃఖములను అనుభవించువారు అనేకములుగ ఉందురు. వివిధములైన దేహముల కారణముగా ఆత్మలు కూడా అనేకములని భావింతురు. వారి కర్మల ఫలితములుగా లభించెడు లోకములు, కాలములు, వాటిని ప్రస్తావించే శాస్త్రములు, వాటిని అనుసరించి లభించే దేహములు ఇవన్నింటి స్థితులు నిత్యములు. ఇంతేగాక, ఇవన్నియును యథాతథముగా ప్రవాహరూపముతో కొనసాగుచుండును. మరియు ప్రాణుల ఆకృతిభేదములతో వాటి బుద్ధులు కూడా వేర్వేరుగా ఉండును. ఈ రీతిగా వీరు విశ్వసించే నిత్యత్వమును స్వీకరించినయెడల, భగవంతుని అభిప్రాయము మేరకు వాస్తవస్థితి వేరుగా నుండుటచే వైరాగ్యము ఎట్లు కలుగును? వైరాగ్యము వినా మోక్షము లభించుటెట్లు?


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*428వ నామ మంత్రము* 1.10.2021


*ఓం పంచకోశాంతరస్థితాయై నమః*


పంచకోశముల మధ్య యందలి అధిష్ఠానదేవత అయిన శ్రీవిద్యాస్వరూపిణియై తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పంచకోశాంతరస్థితా* యను ఎనిమిదక్షరముల నామ మంత్రమును *ఓం పంచకోశాంతరస్థితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి శాంతిసౌఖ్యములు, సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు, కైవల్య సాధనకు కావలసిన ధ్యాన నిమగ్నతయు అనుగ్రహించును.


శ్రీవిద్యాస్వరూపిణి అయిన పరమేశ్వరి పంచకోశముల మధ్యయందలి అధిష్ఠానదేవత. ఆ తల్లి పంచకోశమంత్ర దేవతల మధ్యనున్నది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనునవి పంచకోశములు. ఈ పంచకోశములలోని ఆనందమయకోశ స్వరూపిణి జగన్మాత గనుకనే ఆ తల్లి *పంచకోశాంతరస్థితా* యని అనబడినది. పంచకోశములలో పరమేశ్వరి సూక్ష్మరూపమున విలసిల్లుచున్నది. శ్రీచక్రమందు బిందుస్వరూపిణిగా తేజరిల్లుచున్నది. 1.శ్రీవిద్య, 2. పరంజ్యోతి, 3. పరా, 4. నిష్కళశాంభవి, 5. అజపామాతృక అను ఈ ఐదింటిని పంచకోశదేవతల నామములుగా జ్ఞానార్ణవ తంత్రమందు వివరింపబడినవి. శ్రీచక్రమునందు ఈ అయిదు దేవతలను పూజించునపుడు సృష్టిచక్రము మొదలైన చక్రములందు చుట్టును పరంజ్యోతి మొదలుకొని నలుగురు దేవతలను పూజించుతారు. ఈ ఐదు దేవతల పూజలు ప్రత్యేకముగాను, సమిష్టిగాను కూడా పూజించుదురు. ఇది అలా ఉండగా ఈ ఐదు దేవతలలో శ్రీవిద్యను మాత్రము శ్రీచక్రములోని బిందుస్థానములో పూజించుతారు. గనుక ఇట్టి పంచకోశమలలోపలి భాగమందు అమ్మవారు ఉన్నది గనుక ఆ తల్లి *పంచకోశాంతరస్థితా* యని అనబడినది. అదే విధముగా సకల శరీరములందు అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము అను అయిదుకోశములు ఒకదానిలో ఒకటి సంచులవలె నున్నవి. అది ఎలాగ అంటే:-


అన్నమయకోశంలో ప్రాణమయకోశం ఉంటుంది.


 ప్రాణమయకోశంలో మనోమయకోశం ఉంటుంది.


మనోమయకోశంలో విజ్ఞానమయకోశం ఉంటుంది.


విజ్ఞానమయకోశంలో ఆనందమయకోశం ఉంటుంది. 


*ఆనందమయకోశంలో ఉండునదే పరబ్రహ్మ*. అట్టి పరబ్రహ్మమే శ్రీమాత. గనుకనే ఆ అమ్మ *పంచకోశాంతరస్థితా* యని అనబడినది.


ఈ విషయములో దూర్వాసమహర్షి ఈ విధముగా అనెను "ఓ తల్లీ! అన్న, ప్రాణ, మనో, బుద్ధి, ఆనందములు ఐదును శిరస్సు, రెక్కలు, తోక, ఆత్మ, దేహములుగా ఉపనిషద్వాక్యములచే వివరింపబడి ప్రసిద్ధములైన పంచకోశములతో నీవు జ్యోతిస్స్వరూపముగా దాగియున్నావు. ఆ విషయం తెలిసికొనినవాడు పరబ్రహ్మమును తెలిసినవానిగా చెప్పవచ్చును". అందుచే అమ్మవారు *పంచకోశాంతరస్థితా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పంచకోశాంతరస్థితాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*427వ నామ మంత్రము* 1.10.2021


*ఓం అయ్యై నమః* 


*అయీ* అని పిలువబడు లలితాంబికకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అయీ* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం అయ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ జగన్మాత తల్లివలె వారిని వెన్నంటియుంటూ సకలార్థసిద్ధిని కలుగజేయును.


*అయీ* అనగా అమ్మ. మహారాష్ట్రలో *ఆయీ* అని తల్లిని పిలుస్తారు. లలితాంబిక జగదాంబిక. లోకాలకే తల్లి. అనంతకోటి జీవరాశులకు సృష్టికారకురాలు. తల్లి వలె సకలజీవకోటిని సంరక్షించు చుండును. ఏ ప్రాణికి ఎప్పుడు ఏది అవసరమో అది కలుగజేస్తూ, ఆపదలన్నవి కలుగకుండను, కలిగినచో రక్షించుచూ లోకాలను తల్లివలె పాలనచేయుచుండును గనుకనే శ్రీమాత *అయీ* (ఆయీ!) అని ప్రేమతో, నిండుమనసుతో పిలువబడుచున్నది. ఆ తల్లి తనకన్న వేరైనది, తనకన్నా వేరు కానిది. సగుణబ్రహ్మయు, నిర్గుణ బ్రహ్మయు రెండునూ తానే అని అనిపించుకొనుచున్నది. ఆ తల్లిని *అయీ* యని ప్రేమతోను, ఆర్తితోను పిలిస్తే తక్షణం వచ్చి పలుకుతుంది, ఆదుకుంటుంది. అందుకే ఆ అమ్మ *అయీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అయ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

రఘుపతి వెంకటరత్నం నాయుడు

 *గొప్ప సంఘ సంస్కర్త రఘుపతి* బ్రహ్మ సమాజానికి ఆద్యుడు అయిన రఘుపతి వెంకటరత్నం నాయుడు గొప్ప సంఘ సంస్కర్త అని ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంగం ఆధ్వర్యంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతి ఘనంగా జరిగింది. డాక్టర్ శిరీష మాట్లాడుతూ రఘుపతి వెంకటరత్నం నాయుడు విద్యావ్యాప్తికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగం పంతులు సహచరుడైన నాయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే లను ఆదర్శంగా తీసుకుని విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 19o4 లో పి ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గా సేవలు అందించారన్నారు. 1911 లో ఆ కళాశాలలో కో ఎడ్యుకేషన్ ప్రారంభించారు అని అన్నారు. బ్రహ్మ సమాజాన్ని కూడా నాయుడే స్థాపించారని డాక్టర్ శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు ,సుబ్రహ్మణ్యం, బాపిరాజు, తదితర వాకర్స్ పాల్గొన్నారు.

ప్రతిఫలం

 🦜ప్రతిఫలం🦜

**************************

ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు పాలు, పెరుగు,నెయ్యి,అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో 

జీవితం సాగిస్తుండేవాడు. కొన్ని పాలని ఊరిలో అమ్మి 

ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి మార్కెట్ కు వెళ్లి అమ్మేవాడు.

భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్

సంచిలో kg బ్యాగ్స్ లో వేసి ఇచ్చేది,ఒకరోజు మార్కెట్ కు వెళ్ళి రోజంతా అమ్మి,ఒక కొట్టుకు వెళ్ళి అక్కడ ఆ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు పప్పు బియ్యం అన్నీ సరుకులు ఇంటికి తీసుకొని బయలుదేరాడు అప్పుడు కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ ను తూకం వేసి చూశాడు ఆయనకు ఆక్షర్యం వేసింది 1kg లేదు కేవలం 900 గ్రాములే ఉంది.యజమాని అన్ని తూకం చేసి చూస్తే అన్నీ 900gm బ్యాగులే ఉన్నాయి.ఆయనకు చాలా మనసుకు బాధ అనిపించింది

ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే.నన్ను మోసం చేశాడే అని అనుకున్నాడు..


 మళ్ళీ ఒక వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మటానికి వచ్చాడు

అప్పుడు యజమాని చెప్పాడు నా కొట్టుకు ఇకపై కాలు పెట్టకు నీవు మోసగడివి నమ్మకద్రోహివి .నెయ్యి 1kg అని 900gm ఇస్తావా ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు అని గొడవ చేశాడు...


అప్పుడు ఆ పెద్దాయన వినయంతో యజమాని తో ఇలా చెప్పాడు, అయ్యా నేను బీదవాడినే కానీ. మోసగాణ్ణి కాదు నా దగ్గర తక్కెడ కొనే అంత డబ్బు లేదు మీ దగ్గర తీసుకెళ్లిన 1kg చక్కెర ఆధారంగా ఇంట్లో తక్కెడ లా చేసుకొని తూకం చేస్తాను అని చెప్పాడు..

అందుకు యజమాని తల వంచుకుని తన తప్పు తనకు తెలిసి సిగ్గు పడ్డాడు..


    *మిత్రులారా. మనం వేరేవారికి ఏం చేస్తామో

తిరిగి అదే మళ్ళీ మనకు జరుగుతుంది. అది మంచి కానీ చెడు కానీ, .గౌరవం కాని అవమానం కానీ, దుఃఖం కానీ సంతోషంకాని, మోసగించటం కానీ మోసపోవటం కానీ, తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది............✍ ☃

☄☄☄☄☄☄☄☄☄☄☄


పాలను ఆశించి గోవును పోషిస్తాము. గోవు నుంచి మనకు పాలు వస్తాయి. అంతే కాదు పేడ కుడా వస్తుంది. పాలు ఇంట్లోకి తెచ్చుకుంటాం. కాని, పేడని మాత్రం ఇంటి బయట వేస్తాం. ఆవు నుండి పాలు మాత్రమే రావాలి, పేడ రాకూడదు అంటే వీలు కాదు.


కర్మలు కూడా ఇలానే ఉంటాయి. ఏ కర్మ చేసినా అది పూర్ణంగా అర్ధవంతంగా ఉంటుందని చెప్పలేము. కొంత అభ్యంతరకరంగా కూడా ఉండవచ్చు. సంబంధాలు కూడా ఇలానే ఉంటాయి. ఏ సంబంధం లేకుండా.... ఎవ్వరితోనూ సంబంధం లేకుండా జీవించడం సాధ్యపడదు. కాని సంబంధాలలో కేవలం సంతోషమే ఉంటుందని చెప్పలేము. విషాదం కూడా కలిసి ఉంటుంది.


తల్లిదండ్రులు కావచ్చు , అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనతో కలిసి జీవిస్తున్న ఎవరైనా కావచ్చు.. వారిలో మనకు అన్ని నచ్చిన గుణాలే ఉంటాయని చెప్పలేము. మనకు నచ్చనివి వారు మేచ్చేవి కూడా ఉంటాయి.. అలాంటివి ప్రేమకి, సౌఖ్యానికి ప్రతిబంధకాలే కావచ్చు.. కాని అవి లేకుండా సంబంధాలు లేవు.

గులాబీల మధ్య ముళ్ళు తప్పనట్లు సంబంధాలలో ఈ విధమైన సంఘర్షణలు తప్పవు.

షష్టి పూర్తి సార్ధకం అవుతుంది

 ఈ పుస్తకాన్ని రచయితను కొనియాడడానికి మాటలు చాలవు. ప్రతి తెలుగు తెలిసినవారూ చదవాల్సింది. షష్టి పూర్తి సార్ధకం అవుతుంది... ఎవరు చదివినా..🙏

🌹అక్షరాంజలి 🍇

కృతి సమర్పణ 🍁


ముందుమాట 🌹


డా. ఏ. రామశాస్త్రి గారు 

పేరు వినని వారు, తెలియనివారు చాల తక్కువ మంది ఉండవచ్చు . 


ఆయన గురించి రెండు మాటలు నేను రాయకపోతే అది న్యాయం కాదు.


శాస్త్రి గారు IIT లో P.HD. చేసేరు. RBI లో CGM గాను, IBRDT లో ముఖ్యాధికారిగా DIRECTOR గా పనిచేసి పదవి విరమణ చేసేరు . 

Banking, Finace, Planning and 

Economics subjects లో గొప్ప ప్రావీణ్యం సంపాదించేరు, పేరుప్రఖ్యాతులు గణించేరు . అనేకమంది రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు వారితో సంప్రదించేవారు. వారి సలహాలను గౌరవించేవారు . ఇప్పటికీ అనేక వున్నత శ్రేణి సంస్థలకు సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు.


అయితే ఎన్నో బాధ్యతలమయమయిన ఉద్యోగములు నిర్వహించిన ఆయనలోని కవి హృదయం ఎప్పుడు నిద్రపోలేదు. తట్టి తట్టి లేపుతూనే ఉండేది. 


సున్నిత మనస్సు. సౌమ్యమయిన హృదయం. నిదానము, సరళ సంస్కృతీ వారికి వెన్నతోబుట్టిన విద్యలు. అటువంటివారి కలం నుండి ఆణిముత్యాలు ఎన్నెన్నో! అందులో ఒకటి అక్షరాంజలి. వారి సౌమ్యతకు అద్దం పట్టినట్లువుంది. వారి సున్నిత మనస్తత్వం కూడా ప్రతి అక్షరములోను కనిపిస్తుంది. 


వారికలంలో వారి మేనమామ ఉషశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కొంతవరకూ కనిపిస్తారు. బహుశా శాస్త్రిగారి భావాలలో ఉషశ్రీగారు ప్రవహిస్తున్నారేమో! వీరి ఆలోచనాసరళి, వేదాంతభావాలకు కొంతవరకు ఉషశ్రీగారి ప్రేరణ ఉందేమో అనిపిస్తోంది.


అక్షరాంజలి లో అన్నీ ఆణి ముత్యాలే. అన్నీ అందమయినవే. నాకు మాత్రం" యోగ మార్గం " నా హృదయాన్ని బంధిన్చివేసిందేమో అనిపించింది. వీరి కవిత్వ పటుత్వ సంపదలలో కొన్ని మాత్రం మనకు వారు ప్రసాదించటం నాకు మనకు భాగ్య సంపదగా చేరిందనిపిస్తోంది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. 

చదివినకొలది మరోరెండు సార్లు చదవాలనిపించినది అక్షరాంజలి.


అన్ని ఆణిముత్యాలే కదా 

🍁🍁🍁

(ములుకుట్ల మాధవ. వెంకటేశ్వర దత్తాత్రేయ 

M.M.V.Dattatreya)

ఒక మంచి పుస్తకం. ప్రతి తెలుగు తెలిసినవారూ చదవాల్సింది. షష్టి పూర్తి సార్ధకం అవుతుంది... ఎవరు చదివినా.. దీనిలో వున్న జ్యోతిష విజ్ఞానం గమనించండి...🙏

కులాంతర వివాహాలలో

 -:కులాంతర వివాహాలలో బ్రాహ్మణులు:-

'బ్రాహ్మణులు నయము బారులు దీరుదు

రస్పృష్యులను బెండ్లియాడగాను

కత్తుల దూయును కడుమ కులములెల్ల

రస్పృశ్యులను బెండ్లియాడుటన్న

వేలాది చిల్లరకులముల వారెల్ల

వర్ణ సాంకర్యమున్ జేరనీరు

మాలలు మాదిగల్ మడిగట్టు కొందురు

అంతర్వివాహాల గొంతు నులుము.'

అని ఒక కవి ఊరికే వ్రాయలేదు.ఈ క్రింది విషయం చదివితే ఈ విషయం మనకే అర్థం అవుతుంది.

ఈ మధ్య కాలంలో కులాంతర వివాహాలలో బ్రాహ్మణులు మిగితా అన్ని కులాలకన్న ముందు వరుసలో ఉన్నారని తేలింది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ముగ్గురు ప్రముఖ విద్యా వేత్తలు త్రిదిప్ రాయ్, ఆర్కా రాయ్ చౌదరి మరియు కోమల్ సహయ్ జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది.

ఇండియన్ హ్యూమన్ డెవలప్ మెంట్ సర్వే మరియు నేషనల్ శాంపిల్ సర్వే వారు జరిపిన సర్వే లో ఈ విషయం వెలుగు చూసింది.

విచిత్రంగా పట్టణ ప్రాంతాలలో కన్నా గ్రామీణ ప్రాంతాలలో ఈ కులాంతర వివాహాలు అధికం అని తేలింది.

వివరాలు:-

👉🏿 బ్రాహ్మణులలో కులాంతర వివాహాల శాతం 6.3%

👉🏿మొత్తం ఓ.సి. లలో 6.2%

👉🏿ఓ.బి.సి.లలో 4.8%

👉🏿ఎస్.సి.లలో 4.7%

  ఇంకో విచిత్ర విషయం ఏమిటంటే కులాంతర వివాహాలనగానే ప్రేమ వివాహాలు అనుకుంటాం. కానీ 60% కుదిరించిన వివాహాలు . 66% జంటలైతే వివాహం జరిగిన రోజే ఒకరినిఇంకొకరు చూసుకున్నారట.

   ఇదీ విషయం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి లీలలు..


*ప్రదక్షిణాలూ..ప్రయోజకత్వమూ..*


అప్పుడే బస్సు దిగి వచ్చారా దంపతులు..ఇద్దరూ దాదాపు 45ఏళ్ళ వయసు పైబడిన వారే..వారి వెనకాలే ఓ ఇరవై, ఇరవైరెండేళ్ల యువకుడు..చూడగానే వాళ్ళ కుమారుడు అని తెలిసిపోతోంది..నేరుగా శ్రీ స్వామివారి మందిరం లోకి వచ్చి, మండపం లో నిలబడ్డారు..మండపం లోనుంచే, శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నారు..


"అయ్యా!..ఇక్కడ ఉండటానికి వసతి దొరుకుతుందా?..మేము కొన్నాళ్ళు శ్రీ స్వామివారి వద్ద ఉండాలని వచ్చాము.." అని ఆలయ సిబ్బందిని అడిగారు..ఆ దంపతులది కందుకూరు ప్రక్కన శాఖవరం అనే ఓ చిన్న పల్లెటూరు..ఆ యువకుడు వాళ్ళ కుమారుడే..చక్కని రూపం..మంచి ఒడ్డూ పొడుగూ.. చూడగానే ఆకట్టుకునే రూపం..వాళ్ళ వివరాలు అన్నీ సేకరించుకొని..వాళ్ళు ఉండటానికి ఒక గది కేటాయించారు..


ఇక వివరాలలోకి వెళితే..ఆ దంపతులకు వచ్చిన సమస్య కుమారుడితోనే..చక్కగా చదువుకున్నాడు..డిగ్రీ మంచి మార్కులతోనే పాసయ్యాడు..వినయానికి విధేయతకు మారు పేరు లాగా ప్రవర్తన ఉండేది..ఈ దంపతులూ అబ్బాయిని చూసి మురిసిపోయేవారు..మరి ఉన్నట్టుండి ఏమైందో తెలీదు..అబ్బాయి ప్రవర్తన మారిపోయింది..చిన్నపిల్లాడిలా మనస్తత్వం ఏర్పడింది..తనలో తానే నవ్వుకోవడం..మాట్లాడుకోవడం..చేయసాగాడు.. చదువు పూర్తిగా మానేశాడు..ఒక్కొక్కసారి మరీ పసి పిల్లాడిలాగా ఏడవడం చేయసాగాడు..చూసే వాళ్లకు కూడా గుండె తరుక్కు పోయేది..పాపం ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు..డాక్టర్ల వద్దకు పరుగెత్తారు..ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యా లేదు..ఏ టెస్టుకూ అంతుపట్టడం లేదు.. శారీరికంగా పుష్టిగా వున్నాడు..ఈ మానసిక రోగాన్ని నయం చేయడం ఎలానో తెలియడం లేదు..ఇద్దరు ముగ్గురు సైక్రియాటిస్ట్ లకు కూడా చూపారు..వాళ్ళు చెప్పిన సలహాలూ పాటించారు..ఏమీ మార్పు లేదు..రోజులు కాస్తా నెలల్లోకి..నెలలు సంవత్సరాల్లోకి మార్పు చెందాయి కానీ..తమ కుమారుడు మాత్రం ఏ మార్పు లేకుండా..మానసిక రోగంతో మిగిలిపోయాడు..


వైద్యులు వల్ల నయం కానీ జబ్బు వచ్చినప్పుడే..సహజంగా దైవం గుర్తుకువస్తాడు మానవులకు..అదే జరిగింది ఆ దంపతుల విషయం లోకూడా.."మీరు కొన్నాళ్ల పాటు మీ బిడ్డను తీసుకొని..మొగలిచెర్ల గ్రామం లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వద్ద వుండకూడదూ..ఆ స్వామి ని నమ్ముకుంటే ఫలితం ఉంటుంది.." అని ఎవరో సలహా ఇచ్చారు..ఎందుకనో ఆ తండ్రి మనసులో ఆ మాట నాటుకు పోయింది..భార్యతో తాను విన్న సలహా గురించి చెప్పాడు..ఆవిడ కూడా ఈ ప్రయత్నం చేద్దామని అన్నది..అదిగో..ఆరకంగా నిశ్చయం చేసుకొని..తమ కుమారుడితో సహా మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి చేరారు..


మొగలిచెర్ల చేరారు కానీ..ఇక్కడకూడా వెంటనే ఫలితం కనబడలేదు..ప్రతిరోజూ రెండుపూటలా శ్రీ స్వామివారి మందిరం లో 108 ప్రదక్షిణాలు కుమారుడిని వెంట బెట్టుకుని చేశారు..సుమారు మూడు నెలల తరువాత మాత్రమే ఆ యువకుడి ప్రవర్తన లో కొద్దిపాటి మార్పు కనబడింది..అలా మొదలై.. మరో మూడు నెలలు గడిచేసరికి..ఆ యువకుడు పూర్తిగా మనిషిలా మారాడు..వివేకవంతుడయ్యాడు..మొత్తం ఆరు నెలల పాటు శ్రీ స్వామివారి సన్నిధిలో ఆ దంపతులు చేసిన ప్రార్ధన ఫలితాన్ని ఇచ్చింది..తనలో వచ్చిన మార్పు శ్రీ దత్తాత్రేయుడి కరుణా కటాక్షణాల వల్లే సాధ్యమైందని ఆ యువకుడూ పూర్తిగా నమ్మాడు..తమ కుమారుడు పూర్వస్థితికి వచ్చేసాడన్న ఆనందంతో..శ్రీ స్వామివారి సమాధి వద్ద సాగిలబడి ప్రణామం చేసుకున్నారు..ముగ్గురూ సంతోషంగా తమ ఊరికి వెళ్లారు..


విజయేంద్ర వర్మ గా పిలువబడే ఆ యువకుడు ఇప్పుడో సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. చక్కగా ఉద్యోగం చేస్తూ వున్నాడు..శ్రీ స్వామివారికి పరమ భక్తుడు..అతని తల్లిదండ్రులు ప్రస్తుతం కందుకూరు లో వుంటున్నారు..అప్పుడప్పుడూ శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి వస్తూ ఉంటాడు..శ్రీ స్వామివారి దర్శనం అయిన తరువాత ఆలయ సిబ్బందిని పేరు పేరు నా చక్కగా పలకరించుకొని వెళుతుంటాడు.. 


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్: 523114..సెల్..94402 66380& 99089 73699).

సాక్షీభూతుడు భగవానుడు

 కర్మల కేవల సాక్షీభూతుడు భగవానుడు అయితే ఆయనను ఆరాధించడం ఎందుకు? ...ఆచార్య వాణి వినండి.

................................

ఈ ప్రశ్న అందరినీ తొలిచే ప్రశ్న. దీనికి ఆచార్య వాణి ద్వారా నాకు దొరికిన సమాధానం మీతో పంచుకుంటున్నాను. ప్రతి వ్యక్తి తనకు నిర్దేశించిన పని చేయకుండా ఉండలేడు. చేయాలి కూడా. వీటికి భగవంతుడు సాక్షీ భూతుడు గానే ఉంటాడు. కర్మలు చేయించేది భగవానుడు కాదు. జీవుడి సుఖ దుఃఖాలకు ఆయన ఎంత మాత్రం బాధ్యుడు కాదు. మంచి కర్మలు చేస్తే మంచి ఫలం, చెడు కర్మలు చేస్తే చెడు ఫలం జీవుడు అనుభవిస్తాడు. కర్మలు మూడు రకాలు. కర్మలు, అకర్మలు, సుకర్మలు. మనం మామూలుగా చేసుకుపోయేవి కర్మలు. చెడు తలంపుతో చేసేవి, చెడ్డ పనులు చేయడం అకర్మలు. కేవలం శక్త్యానుసారం చేసే మంచి పనులు సుకర్మలు.మూడోది మాత్రమే ఉత్తమ గతులు కలిగిస్తుంది. మరి కేవలం చూస్తూ కూర్చునేటప్పుడు భగవంతుడి ఆరాధన ఎందుకు? ఇక్కడే మనం ఆలోచించాలి. భగవంతునికి శరణాగతి చేయడం ద్వారా మనం చేసే బలమైన పాప కర్మలు క్షయం అవుతాయి. సత్వ గుణం అలవడుతుంది. అది సత్ కార్యక్రమాలకు దారితీస్తుంది. మంచి (పని) చేయడమే పుణ్యం. చెడు చేయడమే పాపం. ఏ పనీ చేసినా భగవంతుని సంతోష కోసం చేయాలి. ఆయన సంతోషమే జీవుడి సంతోషం కావాలి. కాలాన్ని బట్టే మార్పు అని మనం అనేస్తుంటాం. కాలాలుమారడం లేదు, ఋతువులు మారడం లేదు. సూర్యచంద్రుల భ్రమణం మారడం లేదు. మారుతున్నది మన మనో ప్రవృత్తే. వ్యాస భారతం పాశ్చాత్యులు తల మీద పెట్టుకుంటున్నారు. మనం వాళ్ళ సంస్క్రుతి అక్కున చేర్చుకుంటున్నాం. మరి మారుతున్నది కాలమా, మనమా? చేయాల్సింది చేయకుండా వితర్క, కుతర్కాలు చేస్తే ఫలితం సున్నే. సుకర్మలు చేస్తూ, అది కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా ఉంటూ, భగవంతునికి శరణాగతి చేయమనే భగవద్గీతలో భగవాన్ ఉవాచ. అదే కర్మ సూత్రం. భారములు నాపై ఉంచి పని చేస్తూ ఉంటే, వారి మంచి చెడ్డలు నావే, వారు నావారే, వాటిని మళ్లీ తిరిగి రాని నా ధామాన్ని చేరుస్తామని శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేసి ఉన్నారు. జీవుడా..శరణాగతి ద్వారా తరించు. ఓం పరబ్రహ్మనే నమః// ఆదూరి వేంకటేశ్వర రావు. 🙏

దేవునికి పూలని ఎందుకు సమర్పించాలో

 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

*🌻అసలు దేవునికి పూలని ఎందుకు సమర్పించాలో తెలుసా?🌻*



🍃🌹పూలు ఎందుకు పూజలకు పూలు వాడటం పూర్వం నుంచి ఆచారంగా వస్తోంది.

ప్రకృతి అందం అంటే మొదటగా గుర్తొచ్చేది పూలే. అంతగా రంగు రంగుల పూలతో అలంకరించుకుని ప్రకృతి అందంగా ముస్తాబవుతుంది. తద్వారా రోజూ వారీ దైనందిక వ్యవహారాలలో భాగంగా పూలను జతచేయడం, పూలను తమ పరిసరాల్లో భాగంగా భావించడం మానవుని విధిగా మారింది. 


🍃🌹భారతీయ స్త్రీల అలంకరణలో భాగంగా పూలకు ఉన్న ప్రాధాన్యత గురించి తెలియనిది కాదు. క్రమంగా పెళ్ళిళ్ళలోనూ, ఇంటిని అలంకరించుటలో, పెళ్ళికూతురుని అలంకరించడంలో, పండుగలలో, పూజా వ్యవహారాలలో, చివరికి మరణంలో భాగంగా కూడా, అనేక విధాలుగా పూలను వినియోగిస్తారు. కావున దైవ ప్రార్ధనకు పూలను వినియోగించడంలో ఆశ్చర్యమే లేదు. 


🍃🌹పూజ చేయాలి అంటే.. ముందు పూలకు ప్రాధాన్యత ఇస్తాం. దేవుడికి అత్యంత ప్రీతికరమైనవి పూలు. నిత్య పూజ అయినా, వారం పూజ అయినా, గుళ్లో అయినా, హోమం జరిగినా ముందుగా పూలు తీసుకుంటాం. ఎన్ని రకాల పూలు పూసినా.. పూజకే. దేవుడికే అనిపిస్తుంది. పూలు, పూజకు విడదీయరాని బంధం ఉంది. కొందరు కేవలం పూల మీద మక్కువతో గృహాలలో ప్రత్యేకంగా తోటలను సిద్దం చేయడం, లేదా పూల కుండీలలో ప్రత్యేకంగా పెంచడం వంటివి చేస్తుంటారు కూడా. 


🍃🌹ప్రతి 10 కుటుంబాలలో 5 కుటుంబాలు పూల మొక్కలను కలిగి ఉంటాయి అనడంలో ఆశ్చర్యమే లేదు. అంతగా పూలు దైనందిక వ్యవహారాలలో భాగంగా మారిపోయాయి. ప్రకృతి ప్రేమికునికి ఒక స్నేహితుడిలా పూలు ఉంటాయి అనడంలో ఆశ్చర్యమే లేదు. కొందరు కేవలం పూల మీద మక్కువతో, తమ వ్యాపారాలను కూడా మొక్కలకే కేటాయించే పనులకు పూనుకుంటూ ఉంటారు. కృష్ణుడు చెప్పిన ప్రకారం భక్తితో, పవిత్ర మనస్సుతో ఎవరైతే పూలుతో గానీ, పండుతోగానీ, నీటితో గానీ దేవుడికి పూజ చేస్తారో.. వాళ్ల భక్తి నైవేద్యాన్ని తృప్తిగా స్వీకరిస్తానని గీతలో వివరించాడు. 


🍃🌹అందుకే.. పూజలకు పూలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఒక్క చుక్క నీరైనా, దర్భలైనా, సువాసనలు కలిగించే పూలైనా నాకు సమర్పించి, నా కృపకు పాత్రులవగలరు అని తెలిపాడు. భక్తితో సమర్పించిన తులసి ఆకు సైతం కృష్ణుని భారాన్ని మోయగలిగింది అంటేనే అర్ధమవుతుంది, భక్తితో సమర్పించేది ఎంత చిన్నదైనా దేవుని కృపను ఫలితంగా అందివ్వగలదు అని. దేవుడికి అలంకరించడం నుంచి పూజలోని ప్రతి అంశం పూలతోనే ముడిపడి ఉంటుంది. రకరకాల పూలు, రకరకాల రంగుల్లో దేవుడిని అలంకరించడం, పూజించడం ఆనవాయితీగా వస్తోంది. 


🍃🌹కొన్ని పూలు తప్ప అన్ని పూలనూ పూజలకు ఉపయోగిస్తాం. అలాగే దేవుళ్లకు ఇష్టమైన పూవులతో పూజించడం సంప్రదాయం. అసలు దేవుడికి పూలు ఎందుకు సమర్పించాలి ? దేవుళ్లకు పూలంటే ఎందుకంత ప్రత్యేకం ? దేవుడికి పూలు సమర్పించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి ?

పూలు కోసేటప్పుడు దేవుడి పూజకు ఉపయోగించే పూలు ఎలా పడితే అలా కోయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. పూలు కోసేముందు ఈ పూలు భగవంతుడి కోసం అని మనసులో ప్రార్థించి, చెట్టుకు నమస్కరించాలి. పువ్వులను కర్రతో దులపకూడదు. చేత్తోనే కోయాలి. కోసిన పూలను కిందపెట్టకూడదు. తడిబట్టలతో కోసిన పూలను భగవంతుడు స్వీకరించడని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు... పూజకు ఉపయోగించే పూలను కూడా తడపకూడదు. ఈ నియమాల్లో దేనిని తప్పినా... సమర్పించే పూల వల్ల ఎలాంటి ఫలితం ఉండదట.


🍃🌹అనేక రకాల నైవేద్యాలు పెట్టకపోయినా, అగర్బత్తీ సువాసనల మద్య దేవుని ఉంచకపోయినా , ఖరీదైన ఖనిజాలతో విగ్రహాలు చేయించకపోయినా, ధూప దీప నైవేధ్యాలలో ముంచకపోయినా కూడా పర్లేదు కానీ, పూలతో అలంకరణ లేకుండా పూజ ముగించడం అంటే అది జరగని పనే అవుతుంది. ప్రతి రోజూ ఒక్క పువ్వునైనా దేవుని సమర్పించడం ద్వారా అనేక పూజలు చేసిన ఫలితాన్ని పొందవచ్చు అని భక్తుల విశ్వాసం. ఈరోజు ఇక్కడ అసలు పూలను ఎందుకు దేవునికి విధిగా సమర్పిస్తాము అన్న విషయం గురించి తెలుసుకుందాం. 


🍃🌹పూలు వాడే విధానం పూజలకు ఉపయోగించే పూలు చాలా పవిత్రంగా ఉండాలి. వాడిపోయినవి, ముళ్లుతో ఉన్నవి, అపరిశుభ్రమైనవి, దుర్వాసనతో ఉన్న పూలు ఉపయోగించరాదు. మహాలక్షికి ఎనలేని ప్రీతి. అలాగే తెల్లని పూలంటే.. చదువుల తల్లి సరస్వతికి, పసుపు రంగు పూలు పార్వతీదేవికి ఇష్టం. కాబట్టి ఈ దేవతల పూజలకు ఈ రంగు పూలను ఉపయోగించడం శ్రేయస్కరం.

మరియు దేవునికి పూలను సమర్పించడానికి సరైన మార్గాలను గురించి కూడా తెలుసుకుందాం. 


🍃🌹ఈ ప్రకృతిలో అత్యంత అందమైన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి పూలే , తర్వాతే ఏమైనా: నిజమే కదా, ఎటువంటి ఆలోచనా లేకుండా చెప్పవచ్చు. గడ్డి పువ్వులో కూడా అందం దాగి ఉంటుందని. శ్రేయస్కరమైన పూలు తామర, కలువ, జాజి, చామంతి, నందివర్దనం, మందారం, నీలాంబరాలు, కనకాంబరాలు, పారిజాతం, పద్మాలు, ఎర్రగన్నేరు, నిత్యమల్లి పూలు దేవుడి పూజకు శ్రేయస్కరం.


🍃🌹పూలను దేవుని సమర్పించడం ద్వారా, ఈ ప్రకృతిలోనే అందమైన విషయాన్ని దేవునికి సమర్పించిన భావన కలుగుతుంది. పూలను సమర్పించే విధానం అనుసరించి, భక్తుడు ఎంత భక్తి ప్రపత్తులను, నియమ నిష్ఠలని కలిగి ఉన్నాడో అన్నది తెలుస్తుంది. దేవునికి పూలను సమర్పించడం ద్వారా అనేక లాభాలను పొందవచ్చు : నియమ నిష్టలతో దేవునికి ప్రేమగా పూలను సమర్పించిన భక్తుని పట్ల దేవుని కృప ఎన్నడూ ఉంటుంది, తద్వారా ఆర్ధిక సమస్యలు లేకుండా, మానసికంగా, శారీరికంగా , స్నేహితుల మరియు కుటుంబ సంబంధాల పరంగా సమస్యలను దూరం చేసి , క్రమంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేలా ఆశీర్వదిస్తాడని భక్తుల ప్రఘాడ విశ్వాసం. 


🍃🌹పూలు తమ పరిసరాలను అందంగా మార్చడమే కాకుండా, సానుకూల ఫలితాలకు మార్గాన్ని సుగం చేస్తాయి: పూలలో అంతర్లీన అందం, ఆకర్షణ దాగి ఉంటుంది, మరియు వాటి సువాసన పూజలో ఒకరకమైన సానుకూల దృక్పధాలను కలిగేలా చూస్తుంది. తద్వారా మానసిక ప్రశాంతత చేకూరి, ఏకాగ్రత పెరగడానికి కారణమవుతుంది. ద్యానం, మంత్రోచ్చాణలు తోడైతే పూజా ఫలం మరింత ఎక్కువగా ఉంటుంది. పూజ అనే పదంలో కూడా పూల గురించిన ప్రస్తావన ఉంది : పూజ అనే పదంలో మొదటి అక్షరం పుష్పాన్ని సూచిస్తే, రెండవ అక్షరం జపాన్ని సూచిస్తుంది. అనగా పుష్ప జపం అని అర్ధం వచ్చేలా. జపం అనగా ఇష్ట దేవుని ఇతర పేర్లతో స్మరించడం. మరియు “ జ ” అనే అక్షరం జలాన్ని కూడా సూచిస్తుంది. 


🍃🌹దేవునికి పూలను ఎందుకు సమర్పించాలి ? నిజానికి దేవునికి ఆలోచనలతో సంబంధమే లేకుండా పూలను సమర్పించడం జరుగుతుంది. నిజానికి పెద్ద విషయం కాకపోయినా, మీ ఇష్టదైవానికి సంబంధించి మాత్రం కొన్ని విధివిధానాలు పాటించడం మంచిది. ముళ్ళు కలిగిన లేదా అసంబద్దమైన పూలను దేవునికి సమర్పించకూడదు. కొన్ని పురాణాల, దేవుని కథలు, వ్రత విధానాల ప్రకారం కొన్ని పూలు పూజకు పనికి రావు అని తెలుపబడినది. అవి ఏమిటో పెద్దలను కనుగొని, తద్వారా పూజకు ఉపక్రమించడం అన్ని విధాలా మంచిదిగా సూచించబడినది. 


🍃🌹ప్రతి దేవుడు లేదా దేవత తమకంటూ ఇష్టమైన పూలను కలిగి ఉంటారు. ప్రతి దేవుడు లేదా దేవత తమకంటూ ఇష్టమైన పూలను కలిగి ఉంటారు. అవి ఏమిటో తెల్సుకుని తద్వారా పూజకు ఉపక్రమించడం మంచిది. ఉదాహరణకు సరస్వతీ దేవికి తామర పువ్వులా. మంచి సువాసనలు కలిగిన పూలను మంచి సువాసనలు కలిగిన పూలను దేవునికి సమర్పించడంలో జాగ్రత్తను తీసుకోవాలి. తద్వారా తాజా పూలనే దేవునికి సమర్పించవలసి ఉంటుంది. పెద్దల సూచనల ప్రకారం క్రింద పడిన పూలను సమర్పించడం చేయరాదు. 


🍃🌹శుభ్రంగా ఉన్న పూలనే దేవునికి సమర్పించవలసి ఉంటుంది ఎటువంటి కళంకం లేని అందమైన, శుభ్రంగా ఉన్న పూలనే దేవునికి సమర్పించవలసి ఉంటుంది. కొందరు ఒక పళ్ళెంలో నీటిని తీసుకుని అందులో పూలను ఉంచి, సున్నితంగా శుభ్రపరచిన తర్వాతే దేవుని సమర్పించే అలవాట్లు కలిగి ఉంటారు. ఇళ్ళలో ప్రత్యేకంగా మీరే పెంచిన పూల మొక్కలనుండి సేకరించిన పూలను వీలయితే, ప్రత్యేకమైన, శుభ్రంగా ఉన్న ప్రదేశాలలో పెంచిన పూల మొక్కల నుండి పూలు తీసుకోవడం శ్రేయస్కరం. ఇంకా వీలయితే ఇళ్ళలో ప్రత్యేకంగా మీరే పెంచిన పూల మొక్కలనుండి సేకరించిన పూలను పూజకు వాడడం అన్ని విధాలా మంచిది. 


🍃🌹మంత్రోచ్చారణ సమయంలో పూలను పద్దతిగా దేవుని పాదాల కడ విడువడం పూలను మాలధారణ, లేదా ప్రతిమకు కాని విగ్రహానికి కాని పూలను అలంకరించడమే కాకుండా మంత్రోచ్చారణ సమయంలో పూలను పద్దతిగా దేవుని పాదాల కడ విడువడం ద్వారా కూడా దేవుని కృపకు పాత్రులవగలరు.



🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

పదప్రహేళిక

 పదేవున్నాయి ఎన్నింటికి సమాధానాలు వ్రాస్తారో చూద్దాం !

------------------------------------------------------


(1) చలువగుర్రం అనగా ?


(అ) హిమాలయాలలో పెరిగే గుర్రం

(ఆ) ఉత్తరదృవంలోని మంచుగుర్రం

(ఇ) గాడిద

(ఈ) కంచరగాడిద


(2) సారమేయం అనగా ?


(అ) ఊరకుక్క

(ఆ) అడవిపిల్లి

(ఇ) యుద్ధాశ్వం

(ఈ) మదపుటేనుగు


(3) భల్లూకమంటే ఎలుగుబంటనేకాదు ఈ అర్థం కూడా వుంది


 (అ) నల్లటిచిరుత

(ఆ) దమ్ములగొండి (Hyena)

(ఇ) కోతి

(ఈ) గ్రామసింహం


(4) ఘోటకం లేదా తేజీ అనగా ?


(అ) ఉడుము

(ఆ) పాము

(ఇ) ఉడుత

(ఈ) గుర్రం


(5) తగరం లేదా తగరు అనగా ?


(అ) మేకపోతు

(ఆ) పొట్టేలు

(ఇ) కుందేలు

(ఈ) కుర్రదూడ


(6) గోమాయువు అనగా ?


(అ) నక్క

(ఆ) కుక్క

(ఇ) తోడేలు

(ఈ) దమ్ములగొండి


(7) చింబోతు అనగా ?


(అ) జడలబర్రె

(ఆ) దుప్పి

(ఇ) మేకపోతు

(ఈ) గొర్రెపోతు.


(8) మృగాశనము అనగా ?


(అ) సింహం

(ఆ) మృగాలను (జింకలను) పట్టి తినే తోడేలు

(ఇ) నక్క

(ఈ) పెద్దపులి


(9) వ్యాళం లేదా వ్యాలం అనగా ?


(అ) పులి

(ఆ) కొండచిలువ

(ఇ) తాబేలు

(ఈ) మొసలి.


(10) వెంట్రువ అనే జంతువును గ్రామ్యభాషలో ఎంటవ అంటారు అంటే ?


(అ) ఉడుము

(ఆ) ముంగిస

(ఇ) కుందేలు

(ఈ) అడవిపిల్లి


॥పదప్రహేళిక॥

------------------------------------------------------------జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.