25, డిసెంబర్ 2020, శుక్రవారం

శక్తి పరిమాణం గురించి

 శక్తి పరిమాణం గురించి వక పరిశీలన. దీనికి కొలత కలదా? అనంతమా?సూక్ష్మమా? అనంతమైన కొలమానం కలిగి యుండవలె. సూక్ష్మమునకునూ కొలత యుండవలె. దీనిని ఎవరైనా కొలిచితిరా? లేదే దీనినే మహా అని సంబంధం. ఆత్మ మహా అని పివవచ్చును. దానికి మాత్రమే పై శబ్ద నిర్వచనము. మహాదేవ దేవునికి మహా అని పేరు. మహా అనగా ఈ అనే శక్తి వ్యాప్తిని దానికి దేశ మాన కాల రంగు రుచి వాసన లేనిదని అది ఏ పదార్ధరూపమైనగాని పొందవచ్చును. మహాదేవ శివ కేశవ సంబంధమైన లేక రెండింటి రూపమైన బ్రహ్మ పదార్ధమా? బ్రహ్మ పదార్ధం అర్ధం కాదు. దానిని రజోగుణం చైతన్యమైనగానీ లేదాలేదావిడదీసినగాని తెలియదు. దీనిని బ్రహ్మాణమీశం కమలాసనస్థాం వృషీంశ్ఛదివ్యాన్ ఉరగంశ్చదివ్యాన్, అని బ్రహ్మండము అణువని అది ఈశం అని కమలాసనుడైన బ్రహ్మ మని బ్రహ్మ మునకు పూర్వం శివ కేశవ రాహు కేతు తత్వ మని దానిని తెలియుటయే బ్రహ్మమని తెలియువు. బ్రహ్మము అనగా బ్రహ్మకు అతీతమైన. అటులనే మహా శబ్దంలే ఎమ్ హెచ్ అనే పదములు మ హ ౦ పూర్వము యెక్క హవిస్సు తత్వము బ్రాహ్మణ మని పూర్ణ శక్తి వ్యాప్తి మహా యని దానికి మహా లక్ష్మీ మహా సరస్వతీ, మహా  కాళీ యని సంబంధం కూడా యిదియే. వ్యవహారికంగా లక్ష్మి, సరస్వతి, కాళీ సంబంధం. కాని మహా అనే పదాన్ని శక్తి లక్షణము అది పదార్ధరూపము కాదని విశేషమైన మూల శక్తి రూపమని అదే పరబ్రహ్మ మని తెలియును.

ధార్మికగీత - 119*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                            *ధార్మికగీత  - 119*

                                       *****

             *శ్లో:- పితృభి స్తాడితో పుత్రః ౹*

                    *శిష్య స్తు  గురు శిక్షితః  ౹*     

                     *ఘనాహతం సువర్ణం చ ౹*

                     *జాయతే జనమండనమ్౹౹*

                                       *****

*భా:-లోకంలో శిక్ష తోను,శిక్షణ తోను,రాపిడి తోను రాణించేవి మూడు అంశాలు పరిశీలిద్దాం. 1. "పుత్రుడు":-తల్లి దండ్రుల ఆలనా పాలనలో బాల్యము నుండి సామ దాన భేద దండో పాయాల నిబద్ధత, క్రమశిక్షణల తో క్రమంగా ఉన్నతంగా ఎదిగి, విద్యావినయ సంస్కార సుగుణగణ శోభితుడైన కుమారుడు;  2. "శిష్యుడు":-  విద్యా, జ్ఞాన సంపత్తితో పాటు మానవీయ, సామాజిక, సాంస్కృతిక  విలువలలో గురువు గారి శిష్యరికంలో సుశిక్షితుడై, కమనీయ శిల్పంగా మలచ బడిన శిష్య పరమాణువు; 3. "బంగారము":- ఎంత ఖరీదు గల, అపురూప లోహమైనా, అగ్నిలో సలసల  కాల్చబడి, స్వర్ణకారుని సుత్తి దెబ్బలు తినడం చేత మిరుమిట్లు కొలిపే  కాంతు లీనుతూ, నగల రూపంలో రూపుదిద్దబడిన బంగారము; 4.  పుత్రుడు, ఛాత్రుడు, పుత్తడి  అనబడే యీ మూడును జనబాహుళ్యంలో నిరంతరం ప్రశంసాపాత్రమై, వేనోళ్ళ కొనియాడబడుతూ, చెక్కు చెదరని కీర్తి ప్రతిష్ఠలతో ఇనుమడిస్తాయి. విశ్వవ్యాప్తంగా అందరి హృదయాలలో శాశ్వత సుప్రతిష్ఠమై గారవింప బడతాయి. ఇలా "పుత్రుని" , "శిష్యుని", "పసిడి" ల యొక్క ఉజ్జ్వలమైన  భవిత తల్లిదండ్రులు, గురువు, స్వర్ణకారుని చేతుల్లో ఉందని సారాంశము.*

                                 *****

                  *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

ఆలయాలు

 ఆశ్చర్యాన్ని కలిగించే ఎన్నో వింతలు ఉన్న ఆలయాలు !* 🙏


🌻 *రామేశ్వరం:* 🌻

*తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని రామేశ్వరంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వర లింగం ఇక్కడ ఉంది. ఈ ఆలయంలో రెండు శివలింగాలు ఉండగా,రామసేతు సైన్యం ఇక్కడే ప్రారంభం అయిందని స్థలం పురాణం చెబుతుంది. 

*రామేశ్వరం శైవులకు, వైష్ణవులకు పుణ్యక్షేత్రం. రామేశ్వరం ద్వీపంలో అనేక తీర్థాలున్నాయి. రామనాథస్వామి ఆలయంలోనే 22 తీర్థాలున్నాయి. వీటిలో స్నానం చేయడం ఎంతో పుణ్యదాయకమని ఆలయచరిత్ర పేర్కొంటుంది. 

*ఈ తీర్థాలు చిన్న చిన్న బావుల్లాగా వుండటం విశేషం. ఈ జలాలతో పుణ్యస్నానం చేస్తే తపస్సు చేసిన ఫలం వస్తుంది. అయితే ఈ బావుల్లో నీరు అనేది ఎప్పుడు ఉండటం విశేషం. ఈ ఆలయం బయట నుంచి కొంత దూరంలోనే సముద్రతీరం కనిపిస్తుంది. 

*ఇక్కడ అలలు లేకుండా ప్రశాంతంగా వుండటం విశేషం. కాశీ యాత్రకు వెళ్లి అక్కడి గంగాజలాలను తీసుకువచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలిపితే కానీ కాశీయాత్ర పూర్తిచేసినట్టు అని పెద్దలు పేర్కొంటారు.