18, డిసెంబర్ 2023, సోమవారం

Panchang


 

డబ్బు ఒక limit దాకా చాలు.

 *సెలబ్రిటీ కానందుకు బాధపడవద్దు...*🎯


మనలో చాలా మంది తాము ఒక సెలబ్రిటీ కాలేకపోయాము అని బాధ పడుతూ ఉంటారు...ఒక రాజకీయ నాయకుడు లాగా అయ్యి కోట్లు సంపాదించి లేదనీ , లేదా ఓ సినిమా నటుడిని చూసి అతనిలా అవలేకపోయము అని...లేదా పెద్ద పేరున్న క్రికెటర్ అవ్వలేదని...లేదా ఓ 100 కోట్లు సంపాదించలేక పోయాను అనీ...ఇలా అనుకుంటూ వుంటారు...


నిజం గా చెప్పాలంటే వీళ్ళల్లో అందరూ ఆనందం గా బ్రతికే వాళ్ళు వుండరు...చాలా మంది ఎప్పుడూ ఒక insecurity లో వుంటారు...మీరు పెద్ద సినిమా నటుడు అనుకోండి...ఇలా  మీలా ఇంట్లో నుంచి బయటపడి చట్నీస్ కి వెళ్లి ప్రశాంతం గా టిఫిన్ చెయ్య గలడా?...మీలాగా  సందు చివ్వర బండి దగ్గర నుంచుని స్నేహితులతో కబుర్లు చెప్తూ మిర్చి బజ్జీలు తినగలడా?...డబ్బు ఒక limit దాకా చాలు...అది మితి మీరి సంపాదిస్తే మీ జీవితం లో ప్రశాంతత లేకుండా పోతుంది...


ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఏదో అనుభవిస్తున్నాడు అనుకుంటాము...కానీ అతడి కంటే మీరే ప్రశాంతంగా నిద్ర పోతారు...అతడికి ఎప్పుడూ ఈ పదవి ఎలా కాపాడుకోవాలి , అందరినీ ఎలా బుజ్జగించాలి...ఒక వేళ అక్రమం గా డబ్బు సంపాదిస్తే ఈ డబ్బు ఎలా దాచుకోవాలి ...ఇవే ఆలోచనలు...ఉదయం లేవగానే మీ చుట్టూ వంద మంది వుంటారు...మీ టైం మీకు లేనప్పుడు ఎన్ని కోట్లు ఉండి ఏమి లాభం చెప్పండి...


అంతెందుకు మీరు పెద్ద పదవి లో వున్నారు అనుకోండి...తిరుపతి వెళ్లినప్పుడు బ్రహ్మాండం గా దర్శనం జరుగుతుంది...కానీ చుట్టూ మీ సెక్యూరిటీ వాళ్ళు , మీ PA లు, మీ secretary లు, మిమ్మల్ని అక్కడ కూడా వెంటాడే మీ అనుచరగణం...వీళ్ళు అందరి మధ్య ఏం ప్రశాంతత వుంటుంది ? మీలా ఆయన గుడి ఎదురుగా మెట్లపై స్వామి వారిని తలుచుకుంటూ హాయిగా కూర్చో గలడా?...మీలా ఆయన తిరుమల కొండంతా సరదాగా తిరగగలడా?...


నాకు తెలిసిన ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి వున్నాడు...కనీసం 1000 కోట్ల ఆస్తి... ఇద్దరు కూతుళ్లు...ఆయన ఎప్పుడూ సరిగా నిద్రపోడు...ఏమిటి స్వామీ అంటే... సార్ ఈ కష్టపడి సంపాదించింది అంతా అల్లుళ్లకి పోతుంది...వాళ్ళు సరిగా వుంటారో వుండరో...దీన్ని కరిగించేస్తారో... ఇదీ ఆయన బాధ...ఇంక అంత ఆస్తి ఉండి నువ్వు సంతోష పడుతున్నది ఏమిటి ?...


అతి సాధారణ జీవితం గడిపే వారే ఎంతో సంతోషం గా వుండ గలుగుతారు...ప్రశాంతం గా పడుకోలేనప్పుడు మీ ఇల్లు అయిదు ఎకరాల్లో ఉంటే ఏం లాభం ? మీరు రాత్రి పడుకోడానికి ఒక్క మంచం చాలు...మనస్సు ప్రశాంతం గా ఉండడం ముఖ్యం...అది లేనప్పుడు మీకు 50 విల్లాలు ఉన్నా ఉపయోగం లేదు...డబ్బు భోగాలను ఇస్తుంది...కానీ ఆనందాన్ని ఇవ్వదు...ఇది గ్రహించక చాలా మంది జీవితాంతం డబ్బు వెనకాల పరుగెడుతూ టైం గడుపుతారు... అలా పరుగెడుతూ వుండగానే జీవితం అయిపోతుంది...కూర్చుని ప్రశాంతం గా కాఫీ తాగిన రోజు కూడా ఉండదు...


మీ నాలుకకి కావల్సింది రుచి గానీ అది మీరు five star హోటల్ లో తాగారా లేదా రోడ్డు పక్కన టీ స్టాల్ లో తాగారా అన్నది అనవసరం...మీరు నానా కష్టాలు పడి ,పెద్ద building లు కొనుక్కున్న కూడా  మీరు రాత్రి అవ్వగానే పడుకునేది ఒక గదిలోకి వచ్చే ఒక్క మంచం పైననే అని గుర్తుంచు కొండి...ఈ భూమ్మీద బ్రతికే ఓ 60 లేదా 70 ఏళ్లు ఇలా పరుగెడుతూ బతకాలా?...హాయిగా ప్రశాంతం గా జీవించ లేమా ? 


సంవత్సరాల పాటు తమ కుటుంబ సభ్యులతో  గడపడానికి టైం లేని    celebrity ల కంటే రోజూ పిల్లా పాపలతో ఆడుకునే మీరు ఎంత అదృష్టవంతులో ఆలోచించుకోండి... భార్య పిల్లల తో , బంధువులతో , స్నేహితుల తో గడపడానికి కూడా టైం లేని జీవితం ఏమిటి చెప్పండి ? 


ఇలాగని అందరు సెలబ్రిటీస్ విషయం లో ఇలాగే  జరుగుతాయని కాదు...కొంత మంది ఒక limit పెట్టు కుంటారు... కానీ చాలా మందికి ఈ లిమిట్ పెట్టుకునే ఆలోచనా రాదు...  ఆ ఆలోచన వచ్చేటప్పటికి  ఆ స్థితి కూడా దాటిపోతారు.


అందుకని మీరు ఎప్పుడూ జీవితం లో నిరుత్సాహపడ వద్దు. ఎవరి జీవితం లో నైనా చిన్న చిన్న సంతోషాలు ఎక్కువగా వుంటాయి...మీకు ఇష్టమైన టిఫిన్ తినడం...మీకు ఇష్టమైన ఫోన్ కొనుక్కోవడం... అలా వర్షం లో వెళ్లి టిఫిన్ సెంటర్ లో మిర్చి బజ్జీలు తినడం...ఇంట్లో కూర్చుని టీవీ లో మీకు ఇష్టమైన సినిమా చూడడం...స్నేహితుల ఇళ్లకు వెళ్ళడం...ఏదైనా వూళ్లకి వెళ్ళడం... అలా రైలు లో వుంకో వూరు వెళ్ళడం...ఇటువంటివి మన జీవితాల్లో ఎన్నో వుంటాయి...వీటిని చక్కగా ఆస్వాదించండి...ఇవే ఎంతో మధురమైన జ్ఞాపకాలు గా మిగులుతాయి...


ఒక్కసారి మన తాతలు , ముత్తాతలు ఎలా జీవించారో గుర్తు తెచ్చుకోండి...ఆ రోజుల్లో ఇన్ని గందరగోళ ఉద్యోగాలు లేవు...వూళ్ళో కరణం, మునసబు , పోస్ట్ మాస్టర్ , స్కూల్ టీచర్...ప్లీడరు గుమాస్తా...  లేదా వ్యవసాయం...ఆ తర్వాత రైల్వే లు , బ్యాంకు లు చాలా కాలానికి వచ్చాయి...మన తాత ముత్తాతలు ఎవ్వరూ సెలబ్రిటీస్ కాదు...కానీ ఎంతో సంతోషం గా జీవించారు...కష్ట సుఖాలు పంచుకోవడానికి బోలెడు మంది వుండే వారు...ఇప్పుడు మీ కష్టం కాదు , సంతోషం పంచుకునే వాళ్ళు కూడా కరువయ్యారు...ఎవ్వరికీ టైం లేదు...రోజూ పరుగెత్తడమే ...


ఈ పరుగెత్తడం ఆపి కాస్త అనుభవించడం నేర్చుకోండి...ఈరోజే మొదలు పెట్టండి... అలా రోడ్డు మీదకి వెళ్లి కాఫీ తాగుతూ చుట్టూ వున్న వాళ్ళని గమనించండి...ఎన్ని జీవితాలు కనపడతాయో...ఎంత అమాయకం గా బ్రతుకుతున్నారో కొందరు చూడండి...మీరు కూడా వాళ్ళలో ఒకళ్ళు కండి...ఇదే నిజమైన జీవితం...ఇదే అసలైన , ఎవ్వరూ దొచుకొలేని ఆనందం...🤝🏻😆😄😆