19, జులై 2024, శుక్రవారం

కర్నాటక : ఆనెగుండి - కొప్పాల్

 🕉 మన గుడి : నెం 883


⚜ కర్నాటక  : ఆనెగుండి - కొప్పాల్


⚜ అంజనాద్రి బెట్ట



🔆 అంజనాద్రి కొండ -  హనుమంతుని జన్మస్థలం


💠 మంత్రముగ్దులను చేసే ప్రకృతి దృశ్యాల విశాల దృశ్యాలు, ఆశ్చర్యపరిచే సూర్యాస్తమయ దృశ్యాలు మరియు పర్వతాలు మరియు రాళ్ల మధ్య తుంగభద్ర నది ప్రవహించే సుందర దృశ్యాలు మీకు మీ ఒత్తిడి, అలసటను దూరం చేస్తాయి.  

వరి పొలాలు, కొబ్బరి తోటలు, ఒక వైపు రాకీ పర్వతాలు మరియు మరోవైపు తుంగభద్ర కొండపై నుండి అద్భుతమైన దృశ్యాలు అధిరోహించదగినవి.  


౧ ఉన్న, హంపి నుండి తుంగభద్ర నదికి ఆవల ఉన్న ఆనెగుండికి దగ్గరగా, అంజనాద్రి  హనుమంతుని జన్మస్థలంగా నమ్ముతారు.  

అంజనకు జన్మించిన హనుమంతుడిని ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు, అందుకే ఈ కొండను అంజనాద్రి కొండలు అని పిలుస్తారు, దీనిని అతని జన్మస్థలం అని నమ్ముతారు.


🔆 *అంజనాద్రి  స్థలపురాణం*

💠 హిందూ పురాణాల ప్రకారం, అంజనాద్రి  హనుమంతుని జన్మస్థలం అని నమ్ముతారు కాబట్టి ఇది అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.

హనుమంతుని జననం అద్భుతం మరియు అద్భుతాలతో నిండిన పురాణ కథ. 

ఈ కథను చెప్పడానికి రెండు ప్రధాన కోణాలు  ఉన్నాయి:


🔆 *దివ్య మామిడిపండు*

💠 ఒక సంస్కరణలో, హనుమంతుని తల్లి అంజన తల్లి కావాలని  ఆమె మరియు ఆమె భర్త, కేసరి అనే ధైర్యమైన వానర రాజు, శివుడు మరియు పార్వతిని తీవ్రంగా ప్రార్థించారు. 

వారి ప్రార్థనలు ఫలించబడ్డాయి! శివుడు మరియు పార్వతి వారికి ప్రత్యేకమైన, అద్భుత మామిడిని బహుమతిగా ఇచ్చారు. 

అంజన మామిడిపండును తిని హనుమంతుని కన్నది.


🔆 *దివ్య పాయసం:*


ఒక కథనం ప్రకారం  అయోధ్య రాజు దశరథుడు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. ఫలితంగా, అతను తన ముగ్గురు భార్యలు పంచుకోవడానికి పవిత్రమైన పాయసం అందుకున్నాడు, ఇది రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుల జన్మలకు దారితీసింది. 

దైవిక శాసనం ప్రకారం, అంజనా పూజలో నిమగ్నమై ఉన్న అడవిపై ఎగురుతున్నప్పుడు ఒక గాలిపటం పాయసం యొక్క భాగాన్ని లాక్కొని పడిపోయింది.

 వాయుదేవుడు పడుతున్న పాయసాన్ని అంజనా చాచిన చేతులకు అందించాడు మరియు ఆమె దానిని సేవించి హనుమంతుని జన్మకు దారితీసింది. 


💠 వాయుదేవుడు  హనుమంతుని యొక్క దైవిక తండ్రి అయిన వాయువు హనుమంతుని పుట్టుకలో కీలక పాత్ర పోషించాడు. 

అతను అంజనాకు శివుని ఆశీర్వాదాలను తీసుకువెళ్లాడు, ఆమె హనుమంతుడిని గర్భం ధరించేలా చేసింది.

💠 హనుమంతుని పుట్టుక సామాన్యమైనది కాదని రెండు కథలు హైలైట్ చేస్తాయి. 

అతను మాయా మామిడి పండు లేదా పవిత్రమైన నైవేద్యం ద్వారా దైవంచే ఆశీర్వదించబడ్డాడు. 

వాయుదేవుడు కూడా రెండు కథలలో ప్రత్యేక పాత్ర పోషించాడు.

💠 హనుమంతునికి గల పురాణ సంబంధం భక్తులను మరియు చరిత్ర ప్రియులను అంజనాద్రి కొండకు ఆకర్షిస్తుంది. 

యాత్రికులు దేవతకు నివాళులర్పించడానికి మరియు వారి ప్రయత్నాలలో బలం, రక్షణ మరియు విజయం కోసం ఆశీర్వాదం కోసం కొండపైకి ట్రెక్కింగ్‌ను ప్రారంభిస్తారు. 



💠 శిఖరం వద్ద ఉన్న హనుమాన్ దేవాలయం అంజనాద్రి కొండ యొక్క ముఖ్యమైన ఆకర్షణ, ఇది హిందువులకు పవిత్రమైన తీర్థయాత్ర కేంద్రంగా పనిచేస్తుంది. 

హంపిలోని గొప్ప నిర్మాణాలతో పోలిస్తే పరిమాణంలో చిన్నది అయినప్పటికీ, ఈ ఆలయం శిఖరంపై ప్రముఖంగా ఉన్న చిన్న గోపురం లాంటి టవర్‌ను కలిగి ఉంది.

 ఒక ఎర్రటి జెండా టవర్ పైన రెపరెపలాడుతుంది, ఇది దూరం నుండి కనిపిస్తుంది, భక్తి మరియు విశ్వాసానికి దీటుగా పనిచేస్తుంది.

ప్రత్యేక రోజులలో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది


💠 ఆలయాన్ని ఎక్కడానికి దాదాపు 575 మెట్లు ఉంటాయి. అదనంగా, రాముడు మరియు సీతా దేవతలకు అంకితం చేయబడిన ఆలయాలు సమీపంలో ఉన్నాయి.



💠 అంజనాద్రి కొండను సందర్శించడం కేవలం ఆధ్యాత్మిక సాంత్వనను మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాల ఉత్కంఠభరితమైన దృశ్యాలను కూడా అందిస్తుంది. మీరు ఎప్పుడైనా హంపికి సమీపంలో వెళ్తే , ఈ పవిత్ర స్థలాన్ని అన్వేషించండి!


💠 సమీప రైల్వే స్టేషన్లు కొప్పల్, హోస్పేట మరియు మునీరాబాద్. మూడు స్టేషన్లు దాదాపు 40 కి.మీ దూరంలో ఉన్నాయి

ఆనందంగా బ్రతుకుదాం

 1991 April 5న ‘స్వాతి’ వీక్లీ వాళ్ళు ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. అందులో ఒక ప్రశ్నకు అద్భుతమైన సమాధానం చెప్పారావిడ. గొప్ప ఫిలాసఫీ కనిపించింది ఆ జవాబులో 👏👏🙏🙏 🙏


👉 ఎంతో జీవితాన్ని చూసిన మీరు, రచయిత్రిగా, ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా, తోటివారికి మీ అనుభవం నుంచి ఇచ్చే సలహా ఏమిటి?


 యద్దనపూడి :

————————

ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి! మనిషికి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఈ జీవితం! వంద సంవత్సరాల వెనక మనం లేం! వంద సంవత్సరాల ముందు వుండం. యోగ నిద్రలో క్షణంలో వెయ్యో వంతు, కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడటానికి మనకి దక్కిన ఈ అపురూపమై న అవకాశాన్ని, ఈర్ష్యాసూయలతో, వ్యర్థ పంతాలతో చేయి జార్చుకోవద్దు!


ప్రతిరోజూ ప్రతి నిముషం, ప్రతి సెకనూ, మన చేతిలోంచి జారిపోయి ఇక తిరిగిరాదు. మనది అనుకున్న మన ఈ శరీరం కూడా మనది కాదు!


మన తాత ముత్తాతల రక్తంతో మనకి ఈ శరీరం వచ్చింది. ఈ జీవనధారని మన పిల్లలకి అందించి మనం వెళ్లిపోవాల్సినవాళ్ళం. మనకెందుకు ఈ కొట్లాటలు! మనకెందుకు ఈ పరస్పర ద్వేషాలు!


వాటిని వదిలేసి, మనం సుఖంగా బ్రతకటానికి ప్రయత్నంచేసి, ఎదుటివారిని సుఖంగా బ్రతకనిద్దాం. మనం మళ్ళీ పొందలేని ఈ జీవితాన్ని మనకి మనం “జీవిస్తున్నాం” అనే స్పృహతో, ఆనందంగా బ్రతుకుదాం!


మనమంతా రైల్వే వెయిటింగ్ రూమ్ లో   కూర్చున్న ప్రయాణీకులం. ఎవరి రైలు వస్తే వారు వెళ్ళిపోతాం. ఈ కుర్చీలు, బెంచీలు, కర్టెన్లు మనవి కావు అని తెలుసుకుంటే నిజంగా ఆనందంగా బ్రతకగలుగుతాం! ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాల్సినవాళ్లకి, ఈ ప్రపంచంతో ఎందుకు గొడవ!


మనశ్శాంతిగా,  వున్నంతలో బ్రతకటమే ధ్యేయం చేసుకుంటే మీకు, మీ ఇంట్లోవారికి, మీ పక్కింటి వారికీ, మీ సాటి సంఘంలో అందరికీ సుఖశాంతులు, సంతోషం లభిస్తాయి.

 YaddanapudiSulochana Rani

మల్లెపూల సుగంధ పరిమళాలు

 *2039*

*కం*

మల్లెల సుగంధ పరిమళ

మల్లన వ్యాపించుచుండు నన్ని దిశలలకున్.

కల్ల కుసుమముల పైనట

జల్లిన గంధమ్మె చెల్లు సతతము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మల్లెపూల సుగంధ పరిమళాలు అన్ని దిశలకూ స్వఛ్ఛందముగా వ్యాపించును. అబధ్ధపు పూలపై (బొమ్మ పూలు) చల్లిన సుగంధ మే వ్యాపించగలదు. అంటే బొమ్మ పూలపై ఎంత సుగంధం(సెంటు) చల్లితే అంతే వ్యాపిస్తుంది.

*సందేశం*:-- నిజమైన సుగంధ పుష్పాల కు ప్రచారం అవసరం ఉండదు. ఏ గంధమూ లేని పుష్పాలకే ఏదో ఒక గంధం చల్లి ప్రచారం చేయవలసి ఉంటుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీ ల లి త*

 *శ్రీ ల లి త* 


పరమేశ్వరుని మహిమ అసాధారణమైనది. ఆయనను ఎంత పొగిడినా సరిపోదు. అయితే ఆ పరమేశ్వరుడిని మన శక్తి మేరకు పూజించి మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. 

మన పూర్వీకులు భగవంతుడిని అనేక పేర్లతో స్తుతించి ప్రయోజనం పొందారు. వీటిలో సహస్రనామాలు అత్యంత ప్రసిద్ధమైనవి. సహస్రనామాలలో లలితా సహస్రనామం విశిష్టమైనది. 

లలితా సహస్రనామం వేదాంత బోధనలను అనువదిస్తుంది, ఇంకా భగవంతుని యొక్క సద్గుణ రూపాన్ని (సగుణ రూపo) వివరిస్తుంది, స్తుతించే రీతులనుబట్టి భగవంతుడు భక్తులను ఎలా అనుగ్రహిస్తాడో వివరిస్తుంది. ముఖ్యంగా శ్రీ శంకరులు ప్రబోధించిన అద్వైత సిద్ధాంతం లలితా సహస్రనామంలో చాలా చోట్ల ప్రస్తావించబడింది. *సమస్త మిథ్యాజగత్ అధిష్టాన ద్వైతవర్జిత మరియు తత్త్వ మార్థస్వరూపిణి* అనే ఈ స్తోత్రం అద్వైత సిద్ధాంతాలను తెలియజేస్తుంది. ఆమె అనుగ్రహం పొందడానికి ఆమె నామాలను జపించాలని *నామ పారాయణప్రీత* అనే నామ స్తుతి తెలియచెపుతున్నది. 

 *నామ సత్యప్రసాదిని* భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరుకున్నవి త్వరగా లభిస్తాయని ఈ నామం చెబుతోంది. అలాగే *నిర్వాణ సుఖదాయిని* అంటే మోక్షం కోసం ఆమె నామాలను జపించే వారి కోరిక నెరవేరుతుంది అనే నామం తెలియచెబుతుంది. కాబట్టి

భక్తులందరూ కల్పవృక్షం వంటి కోరికలను తీర్చే లలితా సహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా కోరుకున్న ప్రయోజనాలను పొందండి.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

సుఖముకలవాడౌతాడు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 శ్లో𝕝𝕝  *అసంపన్నః కథం బంధుః? అసహిష్ణుః కథం ప్రభుః?,* 

       *అనాత్మవిత్ కథం విద్వాన్? అసంతుష్టః కథం సుఖీ?* 


సంపన్నుడు కాకపోతే బంధువెలా ఔతాడు ? ( *సంపన్నులకు అందరూ బంధువులమని చెప్పుకుంటారు* ) ఓర్పు లేనివాడు రాజెలా ఔతాడు ? పరమాత్మ స్వరూపం తెలియనివా విద్వాంసుడెలా ఔతాడు ? *సంతృప్తి లేనివాడు ఎలా సుఖముకలవాడౌతాడు* ?

కుక్క వంకర తోక

 శ్లోకం:☝️

*నలికాగతమపి కుటిలం*

 *న భవతి సరళం శునః పుచ్ఛమ్ ।*

*తద్వత్ ఖలజనహృదయం*

 *బోధితమపి నైవ యాతి మాధుర్యం॥*


భావం: కుక్క వంకర తోకను గొట్టంలో పెడితే అది నిటారుగా నిలవదు. అలాగే దుష్టుని హృదయం మంచిని బోధించడం వల్ల మెత్తబడదు (మారదు).

పంచాంగం 19.07.2024 Friday

 ఈ రోజు పంచాంగం 19.07.2024 Friday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస శుక్ల పక్ష  త్రయోదశి తిధి భృగు వాసర: మూల నక్షత్రం ఇంద్ర యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


త్రయోదశి రాత్రి 07:35 వరకు .

మూల రాత్రి 03:52 వరకు.


సూర్యోదయం : 05:55

సూర్యాస్తమయం : 06:50


వర్జ్యం : రాత్రి 01:18 నుండి ఉదయం 02:52 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:30 నుండి 09:22 వరకు తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి 01:40 వరకు.


అమృతఘడియలు : రాత్రి 08:36 నుండి 10:10 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.



యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

వినాయకి గురించి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

    *సౌభాగ్యాన్నిచ్చే వినాయకి!*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*వినాయకి గురించి విన్నారా!*


*ఆంజనేయునిలాగానే వినాయకుడు కూడా ఘోటక బ్రహ్మచారి అని ఒక నమ్మకం. అయితే చాలా సందర్బాలో ఆయనకు ధర్మపత్నిగా వేర్వేరు దేవతల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఉత్తరాదిలో ఆయనను సిద్ధి, బుద్ధి అనే దేవతా సమేతంగా ఆరాధించడం కనిపిస్తుంది. అక్కడక్కడా వృద్ధి అనే మరో దేవత పేరు కూడా గణపతి ధర్మపత్నిగా వినిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే లక్ష్మీ లేదా సరస్వతీదేవి వినాయకునికి తోడుగా కనిపిస్తారు. కానీ చాలా అరుదుగా వినాయకి అనే సహచరి పేరు కూడా వినిపిస్తుంది. ఆ విశేషాలు...*


*వేల ఏళ్ల క్రిందటే!*


*గణేశుని స్త్రీ రూపం అయిన వినాయకి ప్రతిమలు వేల సంవత్సరాల నుంచే ప్రాచుర్యంలో ఉన్నాయి. రాజస్థాన్‌లో లభించిన క్రీస్తుపూర్వం నాటి ఒక వినాయకి టెర్రకోట ప్రతిమను ఇందుకు ఉదాహరణగా చెబుతూ ఉంటారు. వినాయకికి సంబంధించి ప్రత్యేక ఆలయాలు లేనప్పటికీ సుచీంద్రం, చెరియనాడ్‌ వంటి ప్రాచీన ఆలయాలలోని గోడల మీద వినాయకి శిల్పాలు కనిపిస్తాయి.*


*పురాణాలలో ప్రస్తావన:~*


*వినాయకి గురంచి జనబాహుళ్యంలో పెద్దగా ప్రచారం లేనప్పటికీ, పురాణాలలో మాత్రం ఈమె ప్రస్తావన తరచూ కనిపిస్తుంది. స్కాంద, మత్స్య, వాయు, లింగ పురాణాలలో వినాయకి గురించి కబుర్లు వినిపిస్తాయి. కొన్ని కథల ప్రకారం వినాయకి తొమ్మిదిమంది మాతృకలలో ఒకరు. మరికొన్ని కథనాల ప్రకారం ఆమె 64మంది యోగినిలలో ఒకరు. వినాయకికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన, స్పష్టమైన కథనం మాత్రం అంధకాసురుని వధ సందర్భంగా వినిపిస్తుంది.*


*అంధకాసురుని వధ:~*


*పరమేశ్వరుడు ఒకనొకప్పుడు లోకకంటకుడైన అంధకాసురుడు అనే రాక్షసుని వధించడానికి బయల్దేరాడు. కానీ అంధకాసురునికి ఒక చిత్రమైన వరం ఉంది. అదేమిటంటే... అతని రక్తం నేల మీద పడగానే, ప్రతి ఒక్క రక్తపు బొట్టు నుంచి ఒకో అంధకాసురుడు ఉద్భవిస్తాడు. అలా అంధకాసురుని రక్తం నేల మీద పడకుండా చూడటానికి ప్రతి ఒక్క దేవతా నుంచీ స్త్రీ స్వరూపాలు వెలికివచ్చాయట. అలా వినాయకుని నుంచి వెలికి వచ్చిన స్త్రీ తత్వమే వినాయకి.*


 *ఆరాధన:~*


*గజానని, గణేశని, విఘ్నేశ్వరి... ఇలా వినాయకికి వివిధ పేర్లు కనిపిస్తాయి. చాలా సందర్భాలలో ఆమెకూ వినాయకునికీ మధ్య స్పష్టమైన సంబంధం చెప్పనప్పటికీ, ఆమె రూపం మాత్రం అచ్చు వినాయకునిలాగే ఉండటం విశేషం. పరశు, గొడ్డలి, మోదకాలను ధరించిన వినాయకి రూపమే ప్రాచీన శిల్పాలలో కనిపిస్తుంది. వినాయకిని విఘ్నాలకు అధినేత్రిగా భావిస్తారు. స్త్రీ దేవతలకు అధికంగా ప్రాధాన్యతను ఇచ్చే తాంత్రిక ఆచారాలలో వినాయకి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతిలోని పురుష తత్వం, స్త్రీ తత్వం ఉన్నట్లే... ప్రతి దేవతకీ తప్పకుండా స్త్రీ స్వరూపాన్ని ఆపాదించడం మన తత్వంలోనే ఉంది. ఎందుకంటే, ఈ రెండు గుణాలూ కలిస్తేనే పరిపూర్ణత అని మనకు తెలుసు. మరి ఆ గణేశుని స్త్రీ స్వరూపంగా వినాయనికి ఆరాధించడంలో వింతేముంది*


*ఓం శ్రీ మాత్రే నమః।*


*ఓం నమః శివాయ॥*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శఠగోపం ఎందుకు పెడతారు

 ✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

*గుడిలో తలమీద శఠగోపం ఎందుకు పెడతారు?*

✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

*శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తాడు.*


*ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశిస్తుందని చెబుతారు. అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకను తలుచుకోవాలంటారు పండితులు.*


*శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, శడగోప్యం అని అంటారు. శఠగోపం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి, తీర్థం, శఠగోపనం తీసుకుంటారు.*


*శఠగోపం విశేషాలు:~*


*శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు. అంటే మనము కోరికలను శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే.*


*శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు.*


*శఠగోపం వలన కలిగే ఫలితం:~*


*శఠగోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి. శఠగోప్యమును తలమీద ఉంచిన ప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. శఠగోప్యమును శఠగోపం అని కూడా అంటారు.*


*ఓం నమః శివాయ॥*

✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

తప్పక దేవుడు సాక్షాత్కరిస్తాడు.*

 


*బొమ్మలకోసమో, డబ్బు కోసమో పోరుపెట్టి ఏడుస్తూ తల్లిని పీడించే బిడ్డ మాదిరి ఎవరు భగవంతుని దర్శించటానికి పరితపిస్తూ విలపిస్తారో వారికి తప్పక దేవుడు సాక్షాత్కరిస్తాడు.*  

అమ్మవారే ఆడపిల్లగా తిరుగుతుంటుంది. కాబట్టి ఆ అమ్మ కూతురుగా ఉండాలని కోరిక ఉంటుంది. కాత్యాయన మహర్షి అమ్మవారిని ఉపాసన చేస్తే అమ్మవారు వచ్చి కనపడింది. ఏంకావాలి?  అని అడిగితే నాకు కూతురివవుతావా అమ్మా అన్నాడు. కాత్యాయనుడికి కూతురై కాత్యాయని అయింది. భృగుమహర్షి అమ్మవారిని అమ్మా నాకు కూతురివి కా అమ్మా అంటే తప్పకుండా అవుతానని భార్గవి అయింది. జనకుడికి కూతురుగా జానకి అయింది. లోకమాత కూతురుగా వచ్చింది. ఆవిడ ప్రేమకీ, సౌజన్యానికీ హద్దు ఎక్కడాఉండదు. అలా ఎలా కుదురుతుంది? నేను లోకాలంతటికీ తల్లిని. నీకు కూతురుగా ఎలా వస్తాను? అని అనదు. ఆవిడ ఎవరికైనా కూతురైపోవడానికైనా సిద్ధపడి,  నేను ఫలానావారి అమ్మాయిని అని చెప్పుకుంటుంది.

వాట్సాప్ గ్రూపు

 *వాట్సాప్ గ్రూపు!*


రావు ఒక వాట్సాప్ గ్రూపులో సభ్యుడు. 


ఆ గ్రూపులో ఎవరు మెసేజస్ పెట్టినా...

 ఖచ్చితంగా చదివి , చక్కగా స్పందించి - మంచి రిప్లై , కామెంట్స్ పెడుతూంటారు.🤝


 అలాంటి -- రావు గారు ఒకరోజు హఠాత్తుగా గ్రూపు నుండి లెఫ్ట్ అయ్యారు.🙄


 అంతేగాక స్నేహితులతో అప్పుడప్పడూ సరదాగా కలవడానికి కూడా - రావటం లేదు.😏


కొన్ని వారాలయ్యాక ఒకరోజు సాయంత్రం *గ్రూప్ అడ్మిన్*..... 

*గ్రూప్ లెఫ్ట్ అయిన* రావు గారి ఇంటికి వెళ్లారు.😍


బాగా చలిగా ఉండటం వలన - కొన్ని కర్ర దుంగలను కాల్చి ,

ఆ మంట పక్కన చలి కాగుతూ ఒంటరిగా కూర్చున్నాడు రావు గారు.


అడ్మిన్ ను చూసి విష్ చేసి, మరేమీ మాట్లాడకుండా మిన్నకుండి పోయాడు.😷


ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది.🤐


కాలుతూ 

నాట్యం చేస్తున్న జ్వాలను చూస్తున్నారు - ఇద్దరూ.🔥


మధ్యలో అడ్మిన్ లేచి -

బాగా కాలుతున్న కర్ర దుంగను పక్కకు లాగేసి ,  మరల కుర్చీలో కూర్చున్నాడు.


జరిగే దానినంతా నిశితంగా చూస్తున్నాడు - రావు.


అలా బాగా కాలుతున్నప్పుడు పక్కకు లాగిన ఆ ఒంటరి దుంగ, క్రమేపీ మంట ఆరి , చల్లబడి నల్లని బొగ్గుగా మారింది.


తిరిగి చచ్చుబడి, చల్లబడిన దుంగను - కాలుతున్న మంటల్లో వేసాడు అడ్మిన్.


అది - తిరిగి కాలుతున్న దుంగలతో కలసి మండి , వేడిని కాంతిని ఇచ్చింది. 


*అడ్మిన్ తిరిగి వెళ్ళడానికి కుర్చీలోంచి లేచాడు.*


 అప్పుడు - రావు అతని దగ్గరకు వెళ్ళి, *ఇంటికి వచ్చి  నందుకు, మనసుకు హత్తుకునే పాఠం చెప్పినందుకు ధాంక్యూ.*🙏🏻


*రేపటి నుండి మన మీటింగులకు వస్తాను. తిరిగి మన వాట్సాప్ గ్రూపులో నన్ను ఏడ్ చెయ్ అన్నాడు..* 🥰


అసలు వాట్సాప్ గ్రూపు ఎందుకంటే  - ప్రతి మెంబరు మిగిలినవారి  నుండి జ్వాల, వేడిని ( fire & heat ) పొంది ఉత్తేజాన్ని పొందటానికి.💕


 గ్రూపులోని వారందరూ వేడి తగ్గకుండా ఏక్టివ్ గా  ఉండాలి.👌🏼


 *గ్రూపనేది ఒక కుటుంబం.*


ఏదో ఒక సమయంలో కొన్ని msgs, మాటల యుద్ధాలు, అపార్థాలు గ్రూపు సభ్యుల్ని బాధ పెట్టొచ్చు.😢


గ్రూపనేది మనం కలవడానికి, ఆలోచనలు పంచుకోడానికి, మనం ఒంటరివాళ్ళం కాదని చెప్పడానికి.🫂


*జీవితం నిజంగా ఎప్పుడు అందమైందని అనిపిస్తుందో తెలుసా!*🌈

*కుటుంబ సభ్యులు, మరియు స్నేహితులతో ఆత్మీయతతో కలిసి ఉన్నప్పుడు...*💞


*ఇంకా మనలో హుషారు జ్వాలలు రగిలిస్తూ...💃🏻🕺🏼 స్నేహితులు, బంధువులూ.. అందరూ ఒకే కుటుంబంలా కలసి ఒకే గ్రూపులో అందరూ తమతమ అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటూ  ఉన్నప్పుడే!*


 *అందుకే అలాంటి గ్రూపు క్రియేటర్ కు, గ్రూపు సభ్యులకు థ్యాంక్స్ చెబుదాం!*


🙏

యదార్థ సంఘటన

 🥀🥀🥀🙏ఇది జరిగిన యదార్థ సంఘటన



ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మహానుభావుని పేరు శ్రీ కృష్ణమూర్తి అయ్యర్, వయస్సు 65 సంవత్సరాలు. ఈయన తిరుచ్చిలో నివాసముంటున్నారు. ఈయన్ని అందరూ కిట్టూ మామ అని పిలుస్తుంటారు ... 🥀🥀🥀


వీరు పేద బ్రాహ్మణులు, వీరి జీవనాధారం ఒక చిన్న ఇడ్లి కొట్టు. తనకు వ్యాపారంలో తన భార్య తోడుగా ఉంటుంది. 

వ్యాపారంలో కేవలం లాభాలు మాత్రమే చూసుకోకుండా తనకున్నదాంట్లో ఆకలితో బాధపడేవారికి అన్నం పెడుతూ, తన స్థాయికి తగిన దాన ధర్మాలు కూడా చేస్తుంటారు ...


 ఆ ప్రాంతంలో ఉండే కౌన్సిలర్ పాండియన్, మద్యం తాగి, తన వాళ్ళతో కిట్టు మామ కొట్టుకు వచ్చి కడుపు నిండా తినాడు. తను తిన్నవాటికి బిల్లు కట్టమని కిట్టు మామ భార్య అడిగితే, పాండియన్ కు కోపం వచ్చింది. ఈ ప్రాంతపు కౌన్సిలర్ నే డబ్బులు అడుగుతారా అంటూ కొట్టులోని సామాన్లను బయట పారేసి గొడవ చేసాడు ...


అడ్డుగా వెళ్ళిన కిట్టు మామను తిడుతూ, బ్రాహ్మణుడివి నీకు అంత ధైర్యం ఉందా అంటూ తన జంధ్యం పట్టుకున్నాడు. అప్పటి వరకూ ఒర్చుకున్న కిట్టు మామకు జంధ్యం పట్టుకోగానే ఒక్కసారిగా విరుచుకుపడి, పక్కనే ఉన్న కర్రతో పాండియన్ న్ను, తన పరివారాన్నీ చితకబాది, నాకు యుద్ధ కళలు కూడా వచ్చు జగ్రత్త అన్నాడు. దాంతో అహం దెబ్బ తిన్న పాండియన్ నీ అంతు చూస్తా, రేపు నీ కొట్టు లేకుండా చేస్తా అంటూ బెదిరించి వెళ్ళిపోయాడు ...


మరుసటి రోజు పాండియన్ కొట్టు దగ్గరకు రాలేదు, కానీ కిట్టు మామకు ఒక విషయం తెలిసింది, నిన్న రాత్రి గొడవ పడి వెళ్తున్న పాండియన్ బండికి ఆక్సిడెంట్ అయ్యింది అని, అంతే కాదు ఆ ఆక్సిడెంట్ లో పాండియన్ కు బలమైన గాయాలయ్యాయని, రక్తం చాలా పోయిందని ...

 

అయితే పాండియన్ కు వెంటనే ఆపరేషన్ చేయాలి అని, అతని బ్లడ్ గ్రూపు అరుదుగా దొరికేది, వారి దగ్గర స్టాక్ లేదని, ఆ బ్లడ్ గ్రూపు వారు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి రక్త దానం చేయమని చెప్పారట, విచిత్రంగా కిట్టు మామ బ్లడ్ గ్రూపు కూడా అదే కావడంతో వెంటనే కిట్టు మామ హాస్పిటల్ కు వెళ్ళి, రక్త దానం చేసి, ఆపరేషన్ అయ్య్నేత వరకూ ఉండి వెళ్ళాడు ...


ఆరోగ్యం కాస్త కుదుట పడ్డాక కిట్టు మామ చేసిన సహాయం గురించి తెలుసుకునిన పాండియన్, వెళ్ళి క్షమాపణ చెబుతూ లక్ష రూపాయలు ఇవ్వబోయాడు ... 


అప్పుడు కిట్టు మామ అన్న మాటలు " అయ్యా, ఆరోజు మీరు డబ్బులు లేవు అని చెప్పి ఉంటే నేను ఊరుకునేవాడిని, మీరు నేనెందుకు కట్టాలి అని గొడవ చేసారు, మీరు పెద్ద స్థాయి వారు కనుక భరించాను, కానీ మీరు నా జంధ్యం తెంపాలని ప్రయత్నించారు, ఒక బ్రాహ్మణుడిగా జంధ్యం కాపాడుకోవడం నా కర్తవ్యం కనుక కోపంతో కొట్టాను, మీరు ఆపదలో ఉన్నారని తెలిసి మిమ్మల్ని కాపాడడం కూడా నా కర్తవ్యం అని వచ్చి రక్త దానం చేసాను, అంతే తప్పా ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, ఇంత డబ్బు నాకు అవసరం లేదు, మీ తృప్తి కోసం మీరు అంతగా ఇవ్వాలనుకుంటే నా బిల్లు డబ్బులు మాత్రం ఇస్తే చాలు అన్నాడట " ... 


కిట్టు మామ ఔదార్యానికి పాండియన్ కన్నీళ్ళ పర్యంతమయ్యాడట ... అపకారికి కూడా ఉపకారం చేసే ఇటువంటి మహానుభావులు ఇంకా ఉన్నారంటే మనసుకెంతో ఆనందం కలిగింది .....

* సేకరణ *

వైవాహిక వైఫల్యాలకు కారణం

 నేటి వైవాహిక వైఫల్యాలకు కారణం?


1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..

ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,

చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..

భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!


2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో

ఒకరు చూపులు నిలపకపోవటం.. -

ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!

(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)

(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)


3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..

ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!


4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..

ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు...!


5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి

రావటం వధూవరులని ఆశీర్వదించటం..

ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి

జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!


6. బఫే భోజనాలు..

ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!


7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..

ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!


ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.

అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని

భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....


అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.


      సర్వేజనా సుఖినో భవంతు !

💐💐

శంఖనిధి...పద్మనిధి

 *శంఖనిధి...పద్మనిధి...!!🙏🙏*


సిరి సంపదలను పలు రూపాలలో  ఆరాధించ  వచ్చును.

కొంతమంది  ఎనిమిది విధాలైన అష్టైశ్వర్యాలుగాను, తొమ్మిది విధాలైన  నవ నిధులుగాను , ఆరాధించి తరిస్తున్నారు. 


ఆదికాలంలో  సిరి సంపదలను , శంఖ నిధి, పద్మనిధి  అని  రెండు రకాలుగా  కీర్తించేరు, ఇవి శంఖ రూపంలోను, 

తామర పుష్ప రూపంలోను

వున్నట్టు  చెప్తారు. 


ఈ రెండు నిధులకు అధిపతి

కుబేరుడు, అప్పర్ స్వామి తేవారంలో శంఖనిధి, పద్మనిధులను

గురించి వివరించారు.


మహాలక్ష్మి నివాస ముఖద్వారం వద్ద  శంఖనిధి పద్మనిధి  వుంటారు అని అంటారు...


దీనికి నిదర్శనంగా మన దేవాలయాల  ద్వారాల వద్ద  ఇద్దరు యక్షులు శంఖాన్ని , పద్మాన్ని ధరించి నిలబడివుంటారు...


పెద్ద పెద్ద ఆలయాలు ,  భవంతులు, గృహాల  ప్రవేశ ద్వారం మీద మహాలక్ష్మీ ని,  మెట్ల వద్ద శంఖ నిధి , పద్మనిధిని ప్రతిష్టించే  ఆచారాలు ఏర్పడినవి, జైనుల ఆలయాలు అన్నిటిలో

ప్రవేశ ద్వారముల మీద

మహా లక్ష్మీని, మెట్ల కిరు ప్రక్కలా  యీ రెండు నిధులను అమరుస్తారు.


ఈ లోకంలోని అమూల్య సంపదలన్నీ జలగర్భంలో మరుగుపడి వున్నవని  , భగవంతుని అనుగ్రహం పొందిన అదృష్ట జాతకులకు, ఒక శుభ సమయాన ఆయా నిధులకు అధిపతులైన  దేవతల ద్వారా లభిస్తాయని భక్తుల ధృఢ విశ్వాసము, ఇంద్రుడు  పాలకడలిని  చిలికినప్పుడు లభించిన అమృతంతో పాటు సిరి సంపదలు కూడా తన ఆధీనంలోనే వుంచుకున్నాడు.


సాగర గర్భాన మకరలోకం అనే లోకం  వున్నదని ,ఆ లోకంలో అనంతంగా నిధి నిక్షేపాలు , సిరిసంపదలు

వున్నాయని చెప్తారు, జలాలలోని ఆ సంపదలకి చిహ్నం శంఖనిధి అని, 

ఖగోళంలోని విజ్ఞాన నిధి 

చిహ్నమే పద్మనిధియని పిలవ

బడుతున్నది. 


ఈ శంఖనిధి, పద్మనిధుల విశిష్టత గురించి పురాణాలు  ఉన్నతంగా వర్ణిస్తున్నాయి, తామరపుష్ప రూపంలో వున్న 

పీఠం మీద దక్షిణావర్త శంఖాన్ని అమర్చి , ఆ శంఖంలో ధాన్యాన్ని, నాణెములను వేసి  అదే శ్రీమహాలక్ష్మి గా భావించి పూజలు చేసి ఆరాధిస్తారు.


కాలక్రమేణా, ఆ తామర పుష్ప పీఠ ఆకారాన్ని కూర్మ రూప

ఆసనంగా మార్చడం జరిగింది.

కూర్మం  దీర్ఘకాలం వుండేది అయినందున కూర్మాసనాన్ని

పీఠంగా అమరుస్తున్నారు. 


ఇప్పుడు కూర్మ పీఠాలే ఈ విశేష పూజల సమయంలో  ఎక్కువగా దర్శనమిస్తున్నాయి...


స్వస్తి.🙏🌹🍎🍉🍑🍓🍓🤝🤝


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

గురు పౌర్ణమి

 జై శ్రీ రామ్ 


జై గురుదత్త 

ఈరోజు మనము గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి గురించి తెలుసుకుందాము.గురుపౌర్ణమి గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా మనము వ్యాస మహర్షి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.వ్యాస మహర్షులవారు పరాశర మహర్షి మరియు సత్యవతి కి జన్మించాడు.ఈయన పుట్టిన వెంటనే తపస్సుకి వెళ్ళిపోయాడు.ఈయన పూర్వ నామం కృష్ణ ద్వైపాయనుడు.వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు.వేదాలతో పాటు మహాభారతం, మహా భాగవతం మరియు అష్టాదశ పురాణాలు రచించాడు.ఈయన సప్త చిరంజీవులలో ఒకరు. వేదాలను సంకలనం చేసి ఆధ్యాత్మికతను మానవాళికి అందించాడు.అందుకని ఈయన పుట్టిన రోజు అనగా ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అంటున్నారు.ఈ పౌర్ణమి నాడు గురువులను,వ్యాస మహర్షిని పూజించుకునే రోజు. 

ఇక్కడ మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను ప్రస్తుతం గురువు యొక్క ప్రాధాన్యత చాలా తగ్గిస్తున్నారు.అది ఎలా అనగా ఆధ్యాత్మికతను మొత్తం యూట్యూబ్,వాట్సప్, ఫేస్బుక్ లాంటివి అనుసరించి తెలుసుకుంటున్నారు. తెలుసుకోవడం తప్పు అని అనడం లేదు కాని గురువు లేకుండా ఎటువంటి ఆధ్యాత్మిక సాధనలు గాని పూజలు గాని చేస్తే ఆ పూజలో ఉన్న జ్ఞానం కానీ ఆ పూజ యొక్క వృత్తాంతం,దేవి దేవతల స్థితిగతులు తెలిసే అవకాశం లేదు.కనుక  ఆధ్యాత్మిక మార్గాలలో వెళ్లాలి అంటే తప్పనిసరిగా గురువు అనే వ్యక్తి ప్రత్యక్షంగా ఉండాలి. సాధారణంగా గురువులు సరైన వాళ్ళు లేరు అనే మాట కూడా వినపడుతోంది కానీ ఎంత సరైన వాడు లేకపోయినా మనసుపెట్టి వెతికితే కచ్చితంగా దొరుకుతారు.ఇప్పటికీ మహిమాన్వితమైన గురువులు,యోగులు,సిద్ధ పురుషులు మన మధ్య ఉన్నారు కానీ వారిని గుర్తించలేక మనం ఆ నిందని గురువు మీద తోసేస్తున్నాం.కాని ఇది సరైన పద్ధతి కాదు దయచేసి గురువును వెతకండి దొరుకుతారు. మరియొక విషయం ఎవరైనా ఒక గురువు దగ్గర మంత్రం తీసుకొని ఉంటే కచ్చితంగా ఆ గురువుని కలవవలసి ఉంటుంది.భగవంతుడు సైతం సహాయం చేయనప్పుడు మనకి మార్గదర్శకం చేసే వ్యక్తి ఒక గురువు మాత్రమే.అంతటి గురువు యొక్క ఆశీర్వాదం గురు పౌర్ణమి నాడు లభిస్తుంది.ఆరోజు అనగా జూలై 21 2024 మనమందరం వ్యాస మహర్షి,మన గురువులను పూజించి మంచి సాధన మార్గంలో ప్రయాణం చేద్దాం.

శ్రీ మాత్రే నమః

జై శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ

చాతుర్మాస్య దీక్ష

 ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - III  


చాతుర్మాస్య దీక్ష 


    ఆషాఢ మాసంలోని పౌర్ణమి నుంచీ ప్రారంభించి, సన్యాసులూ, 

    శుక్ల ఏకాదశి నుంచీ ప్రారంభించి ఇతరులూ నాలుగు మాసాలపాటు ఒకే చోట ఉండి, ప్రత్యేకంగా చేసే దీక్షయే "చాతుర్మాస్య దీక్ష". 


ఒక అభిప్రాయం 


    పూర్వం చాలా ప్రదేశాలలో మట్టిదారులే ఉండేవి. 

    వర్షాకాలంలో సంచరించుట కష్టంగా ఉండేది. 

    ఆ కాలంలో వర్షాలు కూడా ఎక్కువ. నదులు దాటటానికి ఇప్పటిలాగా వంతెనల సౌకర్యాలు లేవు. రవాణా వ్యవస్థకూడా ఉండేది కాదు. 

    అందుచేత ఆ నాలుగు నెలలు ఒక్క దగ్గరే ఉండి చాతుర్మాస్యం చేపట్టుచుండేవారు. 

    మరిప్పుడు ఆచరించాలా? అనే సందేహం కలగుతుంది. 

    అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఇది ఆచరించవలసిన దీక్షయే! 


యతులు 

1. పరివ్రాజకులుగా సంచరిస్తూ ఉండేవారు (Moving Saints) 

2. స్థిరంగా ఉండే, ఆశ్రమ - పీఠాధిపతులు (Stationary Saints)

    

దీక్ష - ప్రమాణాలు 


1.శ్రుతి ప్రమాణం 


"అష్టౌమాస ఏకాకీ యతిశ్చరేత్" అనే శ్రుతివచనాన్ని అనుసరించి, 

    యతీశ్వరుడు సంవత్సరంలో ఎనిమిది నెలలు సంచరించుచునే ఉంటాడు. 

    ఆయన ఒక్కొక్క రాత్రిని ఒక్కొక్క చోట గడుపుచూ తిరుగుతుంటారు. 

    సంచార సమయంలో సాయంకాలం అయ్యేచోట ఆగి, అచ్చట సజ్జనులు సమకూర్చెడి భిక్షను స్వీకరిస్తారు. 

    ఆ రాత్రికి అచట ఉండి, మరునాడు ఆ ప్రదేశాన్ని వీడి, వెళ్ళిపోతుంటారు. 

  (Moving Saints) 


    కాబట్టి మిగిలిన నాలుగు మాసాలూ ఈ దీక్ష ద్వారా ఒకేచోట నివసించి, 

  - శక్తి పెంచుకుంటూ, 

  - జ్ఞానాన్ని అక్కడ వారికి సమగ్రంగా పంచిపెడతారు. 


2.రామాయణ ప్రమాణాలు 


(i) రాజు లేని రాజ్యం గురించి చెబుతూ, 


    రాజు లేని రాజ్యంలో, 

  - ఎల్లప్పుడూ ఒంటరిగానే సంచరించువాడూ, 

  - ఇంద్రియ నిగ్రహం కలవాడూ, 

  - మనస్సులో ఆత్మస్వరూపాన్ని గూర్చి ధ్యానము చేయువాడూ, 

    ఎక్కడ సాయంకాలం అవుతుందో, అక్కడనే గృహంగా భావించి ఆ రాత్రి నివసించేవాడూ అయిన ముని సంచరించడు - అనడం సంచార మునుల (Moving Monks) విధి తెలియజేస్తుంది. 


నారాజకే జనపదే 

చరత్యేకచరో వశీ I

భావయన్నాత్మనాత్మానం 

యత్ర సాయంగృహో మునిః ৷৷ 

         - అయోధ్యకాండ 67/23 


(ii) సీతను వాల్మీకి ఆశ్రమసమీపంలో వదలి వస్తున్నప్పుడు, లక్ష్మణునితో సుమంత్రుడు 


    పూర్వము అత్రి మహర్షి పుత్రుడైన దుర్వాస మహాముని, 

    చాతుర్మాస్య దీక్షకై, 

    పవిత్రమైన వసిష్ఠాశ్రమమునందు నివసించెను. 

  (వార్షిక్యమ్ = వర్షాకాల సంబంధమైన చాతుర్మాస్యమును) 

  - అనడం ద్వారా, ఈ దీక్ష పాటింపబడేదని తెలుస్తుంది. 

(వశిష్ఠుడు, భరద్వాజుడు, అగస్త్యుడు,... - Stationary Monks, 

  దుర్వాసుడు - Moving Monk) 


పురా నామ్నా హి దుర్వాసా 

అత్రేః పుత్రో మహామునిః I 

వసిష్ఠస్యాశ్రమే పుణ్యే 

వార్షిక్యం సమువాస హ ॥ 

          - ఉత్తరకాండ 51/2 

      


(iii) సుగ్రీవ పట్టాభిషేకానంతరం, వర్షాకాలం, లక్ష్మణునితో శ్రీరాముడు 


   "పరమహంస"లుగా కీర్తింపబడు సన్యాసులు చాతుర్మాస్య దీక్షల కారణంగా సంచారములు మానుకొని తమ ఆశ్రమములకు చేరిరి 

  - అనే ధ్వని వచ్చేవిధంగా, 


   "మానస సరోవరమునందు నివసించుటకు ఆరాటపడే హంసలు స్వస్థానానికి బయలుదేరాయి." 

  (సంప్రస్థితా మానసవాసలుబ్ధాః 

            - కిష్కింధ 28/16 ) అంటాడు. 


(iv) శ్రీరాముడు అక్కడే 

జీవాత్మ పరమాత్మను చేరుతోంది అనే అంతరార్థాన్ని సూచిస్తూ, 

    నిద్ర మెల్లగా కేశవుని చేరుచున్నది అని కూడా అంటాడు. 

(నిద్రా శనైః కేశవమభ్యుపైతి 

           -  కిష్కింధ 28/28) 


ఈ దీక్ష అసలు లక్ష్యం 


అ) చాతుర్మాస్య వ్రతం ఒకవైపు ఆరోగ్యానికి సంబంధించినది. 

    చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ 

  - మొదటి నెలలో కూరలు, 

  -  రెండవ నెలలో పెరుగు, 

  -  మూడవ నెలలో పాలు, 

  -  నాల్గవ మాసం లో పప్పు దినుసులూ తినకూడదు. 

  (వీటి వివరాలు తరువాయి భాగంలో) 


ఆ) మరొకవైపు ఆధ్యాత్మికం. 

    భాగవతం వంటి గాథలు వింటూ ఆధ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలూ గడపాలి. 

    క్రమక్రమంగా వైరాగ్యాన్ని పొందే అభ్యాసమే ఈ దీక్ష. 


    మనం కూడా, మనమన గురుదేవులను ఆశ్రయించి, ఈ దీక్ష పాటిస్తూ, తద్వారా, ఇహపర సుఖాలు రెండూ పొందుదాం. 


                      కొనసాగింపు ... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

విలువైనది ఏమిటి

 ఒక తెలివైన వృద్ధుడిని ఒక యువకుడు అడిగాడు, "జీవితంలో అత్యంత విలువైనది ఏమిటి?"


వృద్ధుడు బదులిచ్చాడు, "అది డబ్బు మాత్రం కాదు, కీర్తి లేదా అధికారం కాదు. జీవితంలో అత్యంత విలువైనది సమయం."


బాలుడు అయోమయంలో పడ్డాడు. "సమయమా?" అతను అడిగాడు. "సమయం ఎందుకు?"


వృద్ధుడు నవ్వాడు. "ఎందుకంటే సమయం అనేది మనందరికీ సమానంగా ఉంటుంది, కానీ అది కూడా ఒకసారి పోగొట్టుకున్న మనం తిరిగి పొందలేనిది కూడా అదే. మనం వృధా చేసే ప్రతి క్షణం శాశ్వతంగా పోతుంది. మనం తెలివిగా ఉపయోగించే ప్రతి క్షణం బహుమతిగా ఉంటుంది. మనకు మరియు ఇతరులకు."


ఆ అబ్బాయి ఒక్క క్షణం ఆలోచించాడు. "అయితే డబ్బు సంగతేంటి?" అతను అడిగాడు. "మనం డబ్బుతో ఎక్కువ సమయం కొనలేమా?"


పెద్దాయన నవ్వి. "లేదు, నా యంగ్ ఫ్రెండ్," అతను చెప్పాడు. "డబ్బు మనకు వస్తువులను కొనగలదు, కానీ అది మనకు ఎక్కువ సమయాన్ని కొనలేదు. కానీ అది చేయగలిగినప్పటికీ, దానిని బాగా ఉపయోగించుకునే జ్ఞానం మనకు లేకపోతే ప్రపంచంలోని అంత సమయo కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి?"


బాలుడు తల ఊపి, అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. "అయితే, నేను నా సమయాన్ని ఎలా ఉపయోగించగలను?" అని అతను అడిగాడు.


వృద్ధుడు మళ్ళీ నవ్వాడు. ఇది యుగాల నుండి ఉన్న ప్రశ్న అని ఆయన అన్నారు. 


"అయితే ఇక్కడ ఒక సూచన ఉంది: మీ కీలకమైన విషయం ఏమిటంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో  మీ చుట్టూ ఉన్న ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపడానికి దాన్ని ఉపయోగించడం.


🌿 ఇతరులకు సహాయం చేయండి, 


🌿కొత్త విషయాలను నేర్చుకోండి, 


🌿మీ కోరికలను కొనసాగించండి. 


🌿మరియు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ప్రతి క్షణం ఒక బహుమతిగా ఉపయోగించుకోండి."


👉ఆ రోజు నుండి, బాలుడు తన సమయం యొక్క ప్రతి క్షణానికి విలువ ఇవ్వాలని మరియు ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి దానిని ఉపయోగించాలని సూచించాడు.


👉 మరియు అతను సుదీర్ఘమైన, ప్రయోజనకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడిపాడు.. 


🦋ఇది కదా జీవితo అంటే... జీవించడం అంటే...🍁