*వాట్సాప్ గ్రూపు!*
రావు ఒక వాట్సాప్ గ్రూపులో సభ్యుడు.
ఆ గ్రూపులో ఎవరు మెసేజస్ పెట్టినా...
ఖచ్చితంగా చదివి , చక్కగా స్పందించి - మంచి రిప్లై , కామెంట్స్ పెడుతూంటారు.🤝
అలాంటి -- రావు గారు ఒకరోజు హఠాత్తుగా గ్రూపు నుండి లెఫ్ట్ అయ్యారు.🙄
అంతేగాక స్నేహితులతో అప్పుడప్పడూ సరదాగా కలవడానికి కూడా - రావటం లేదు.😏
కొన్ని వారాలయ్యాక ఒకరోజు సాయంత్రం *గ్రూప్ అడ్మిన్*.....
*గ్రూప్ లెఫ్ట్ అయిన* రావు గారి ఇంటికి వెళ్లారు.😍
బాగా చలిగా ఉండటం వలన - కొన్ని కర్ర దుంగలను కాల్చి ,
ఆ మంట పక్కన చలి కాగుతూ ఒంటరిగా కూర్చున్నాడు రావు గారు.
అడ్మిన్ ను చూసి విష్ చేసి, మరేమీ మాట్లాడకుండా మిన్నకుండి పోయాడు.😷
ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది.🤐
కాలుతూ
నాట్యం చేస్తున్న జ్వాలను చూస్తున్నారు - ఇద్దరూ.🔥
మధ్యలో అడ్మిన్ లేచి -
బాగా కాలుతున్న కర్ర దుంగను పక్కకు లాగేసి , మరల కుర్చీలో కూర్చున్నాడు.
జరిగే దానినంతా నిశితంగా చూస్తున్నాడు - రావు.
అలా బాగా కాలుతున్నప్పుడు పక్కకు లాగిన ఆ ఒంటరి దుంగ, క్రమేపీ మంట ఆరి , చల్లబడి నల్లని బొగ్గుగా మారింది.
తిరిగి చచ్చుబడి, చల్లబడిన దుంగను - కాలుతున్న మంటల్లో వేసాడు అడ్మిన్.
అది - తిరిగి కాలుతున్న దుంగలతో కలసి మండి , వేడిని కాంతిని ఇచ్చింది.
*అడ్మిన్ తిరిగి వెళ్ళడానికి కుర్చీలోంచి లేచాడు.*
అప్పుడు - రావు అతని దగ్గరకు వెళ్ళి, *ఇంటికి వచ్చి నందుకు, మనసుకు హత్తుకునే పాఠం చెప్పినందుకు ధాంక్యూ.*🙏🏻
*రేపటి నుండి మన మీటింగులకు వస్తాను. తిరిగి మన వాట్సాప్ గ్రూపులో నన్ను ఏడ్ చెయ్ అన్నాడు..* 🥰
అసలు వాట్సాప్ గ్రూపు ఎందుకంటే - ప్రతి మెంబరు మిగిలినవారి నుండి జ్వాల, వేడిని ( fire & heat ) పొంది ఉత్తేజాన్ని పొందటానికి.💕
గ్రూపులోని వారందరూ వేడి తగ్గకుండా ఏక్టివ్ గా ఉండాలి.👌🏼
*గ్రూపనేది ఒక కుటుంబం.*
ఏదో ఒక సమయంలో కొన్ని msgs, మాటల యుద్ధాలు, అపార్థాలు గ్రూపు సభ్యుల్ని బాధ పెట్టొచ్చు.😢
గ్రూపనేది మనం కలవడానికి, ఆలోచనలు పంచుకోడానికి, మనం ఒంటరివాళ్ళం కాదని చెప్పడానికి.🫂
*జీవితం నిజంగా ఎప్పుడు అందమైందని అనిపిస్తుందో తెలుసా!*🌈
*కుటుంబ సభ్యులు, మరియు స్నేహితులతో ఆత్మీయతతో కలిసి ఉన్నప్పుడు...*💞
*ఇంకా మనలో హుషారు జ్వాలలు రగిలిస్తూ...💃🏻🕺🏼 స్నేహితులు, బంధువులూ.. అందరూ ఒకే కుటుంబంలా కలసి ఒకే గ్రూపులో అందరూ తమతమ అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటూ ఉన్నప్పుడే!*
*అందుకే అలాంటి గ్రూపు క్రియేటర్ కు, గ్రూపు సభ్యులకు థ్యాంక్స్ చెబుదాం!*
🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి