5, జులై 2021, సోమవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 6

  ప్రశ్న పత్రం సంఖ్య: 6                             కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి  

1) రోజు ఏర్పడటానికి ఈ గ్రాహం కారణం 

2) ఉత్తరాయణం ఈ తారీకు నుండి మొదలౌతుంది 

3) అయనాలు ఎన్ని అవి ఏవి 

4) చంద్రుడు పూర్తిగా కనపడని తిది ఏది 

5) చంద్రుడు పూర్తిగా కనపడు  తిది ఏది 

6) చంద్రోదయం ప్రతి రోజు ఎన్ని(ఘడియలు) నిముషాల వ్యవధితో మారుతుంది 

7) నిన్నటి కన్నా ఈ రోజు చెంద్రుని పరిమాణంలో ఎన్నవ వంతు తేడా ఉంటుంది 

8) పాల పుంత అంటే ఏమిటి 

9) వివాహంలో పురోహితులు నవ వధూవరులకు ఏ నక్షత్రాన్ని చూపిస్తాడు. 

10) వివాహంలో చూపే నక్షత్రం ఏ నక్షత్ర మండలంలో వుంది.  

11) రాసి చక్రంలో ఎన్ని గదులు వున్నాయి.  

12) రాసి చక్రాన్ని చుట్టిరావటానికి అన్ని గ్రహాలకన్నా మందకొడిగా కదిలే గ్రాహం ఏది. 

13) ఏ ఏ గ్రహాలు కనపడకపోతే మౌడ్యమి వస్తుంది 

14) వివాహాలలో ఈ గ్రహ దోషం ముఖ్యంగా చూస్తారు అది ఏది 

15) భూమికి దగ్గరగా వున్న గ్రాహం ఏది 

16)ఏ  కాలంలో భూమికి సూర్యుడు దగ్గరగా వస్తాడు 

17) సూర్యుడు ఒక ______ అని శాస్త్రజ్ఞులు అంటారు 

18) సూర్య కాంతిలో ఎన్ని రంగులు ఉంటాయి  

19) సూర్యుని రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయి 

20) సూర్యుని రద సారధి పేరు ఏమిటి. 

21) సూర్యుని రధాన్ని ఎన్ని అశ్వాలు లాగుతున్నాయి. 

22) కంటికి కనిపించని గ్రహాలు ఎన్ని వాటి పేర్లు ఏమిటి 

23) సూర్య గ్రహణం ఈ తిది నాడు వస్తుంది 

24)  చంద్ర గ్రహణం గ్రహణం ఈ తిది నాడు వస్తుంది 

25) చంద్రుడు దేనికి కారకుడు 

26) సముద్రంలో ఆటు పోటులకు ఈ గ్రాహం కారణం. 

27) మనం వున్న పాలపుంత పేరు ఏమిటి  

28) మనం ఈ ప్రపంచంలో చూసే వస్తువులు ఎన్ని కొలతలు (డైమెన్షన్లు) కలిగి ఉంటాయి 

29) నీటి చక్రం (నీరు భూమి నుండి ఆకాశానికి వెళ్ళటం తిరిగి భూమిపైన పడటాన్ని) చెప్పే మంత్రాలను యేమని పిలుస్తారు. 

30) ఏ  గ్రహానికి ఆవరణ (డిస్క్) ఉంటుంది 

31) సూర్యుడు నిత్యం మండుతూ ఉండటానికి ఈ అణు చర్య అని అంటారు అది ఏమిటి. 

32) పగలు రాత్రులు ఏర్పడటానికి కారణం 

33) భూమి యెంత వేగంగా పరిభ్రమిస్తుంది.  

34) ఉల్కా పాతాలూ ఎలా ఏర్పడుతాయి. 

35) భూమి మధ్యన వుండే పదార్ధాన్ని యేమని అంటారు. 

36) భూమి మీద నుండి ఆకాశంలో పైకి పోతున్న కొద్దీ వాతావరణ పీడనం ఎలా మారుతుంది. 

37) మన సాదారణ వాతావరణ పీడన ఎంతఉంటుంది (సెంటి మీటర్లలో) 

38) బారోమీటార్ రీడింగ్ యాదృచ్చికంగా పడిపోతే దేనిని సూచిస్తుంది. 

39) పూర్వం విమాన యానాం చేసేవారి జేబులోని ఫౌంటెన్ పెన్ ఇంకు ఎందుకు బైయటికి వచ్చేది. 

40) ఇప్పుడు విమాన యానాం చేసేవారి జేబులోని ఫౌంటెన్ పెన్ ఇంకు బైయటికి ఎందుకు రాదు 

41) విమాన యానాం చేసే ప్రయాణికులు చెవిలో దూది పెట్టుకోవటం వల్ల కలిగే సౌకర్యం ఏమిటి 

42) గగన తలంలో వెళుతున్న విమానం లోపలి వాతావరణ పీడనం విమాన బైయటి పిదనంతో సమానంగా ఉంటుందా లేదా 

43)  వెళుతున్న రైలు లోపలి వాతావరణ పీడనం రైలు బైయటి పిదనంతో సమానంగా ఉంటుందా లేదా 

44) రోడ్డు మీద ప్రయాణించే లారీ కన్నా పట్టాల మీద నడిచే రైలు ఎక్కువ వేగంగా ప్రయాణించగలదు ఎందుకు 

45) విమానంలో ఇంధనాన్ని ఎక్కడ నింపుతారు 

46) విమానం టైరులు ఏ గ్యాసుతో నింపుతారు. 

47) గ్రహణం ఏర్పడే రప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తి మారుతుందా, ఎలా 

48) చెందుని వెలుతురుకు కారణం ఏమిటి 

49) భూమి నుండి యెంత ఎత్తులో ఉపగ్రహాలు ఉంచుతారు 

50) ఉపగ్రహంనుంచి భూమి మీదికి తరంగాలను పంపే పాలఖాలను యేమని అంటారు 

51) భూగ్రాహం మీద ఖగోళంలో వుంచినట్లే ఉపగ్రహాన్ని చంద్రగ్రహం మీద వుంచగలరా 

53) రాసి ఛేక్రంలో వేగంగా తిరిగే గ్రాహం ఏది. 

54) గగనతలంలో భూమినుండి పైకి వెళుతున్నకొద్దీ ఆక్సిజన్ శాతం పెరుగుతుందా, తగ్గుతుందా  

55) గురుత్వాకర్షణ శక్తి సాధారణంగా యెంత ఉంటుంది. 

56) ధ్రువాల వద్ద గురుత్వాకర్షణ సాధారణ శక్తి కన్నా ఎక్కువగా ఉంటుందా లేక తక్కువగా ఉంటుందా 

57) మనము వాడే పంచాంగంలో వున్న మానాన్ని ఏమంటారు 

58) నక్షత్రాలు ఎన్ని 

59) ఒక్కో నక్షత్రానికి పాదాలు ఎన్ని 

60) ఆధునిక సైన్సు ప్రకారం నక్షత్రానికి గ్రహానికి తేడా ఏమిటి. 


ఆదర్శ మూర్తి

 ఆదర్శ మూర్తి గా!....


సామాన్య కుటుంబంలో జనియించి

సాధారణ విద్యను అభ్యాసం గావించి

నిరాడంబర జీవితాన్ని అనుసరించి

సరళ మైన రీతిలో

మానవ భావోద్వేగా లే కవిత కైనా

కథ  కైన,నవల కైన ఆలంబన గా

ఎంచుకుని

పేద ప్రజల జీవితాల్ని జీర్ణిం చుకుని

వాటిని తన రచనల్లో సదా ప్రతి బింబింప చేసుకుని

కాయ కష్టాన్ని అలవరచు కని

శ్రామికుడు గా దీనుల జీవితాల్ని

అనుభవించి

పత్రికా రంగాన, ఆకాశ వాణి లో

తన విశేష సేవలు అందించి

తన ఆపత్కాలంలో,క్షుద్బాధాసమయం లో ఆపత్ బాంధ వులుగా నిలిచిన

వారి పై విశ్వాసానికి ప్రత్తీకగా

తన సంతతికి వారి పేర్లు పేట్టి

తన గృహసీమ కు కూడా 

సహధర్మచారిణి పేరును పెట్టి

తన సాహితీ పిపాసకు,తన సాహితీ తృష్ణ కు  తార్కాణంగా కళా ప్రపూర్ణ, కళా రత్న, జ్ఞాన పీఠ్ వంటి

ఎన్నో పురస్కారాలను  ఎన్నో అందుకుని

బడుగు జీవితం నుంచి ఎన్నో అడుగుల ఎత్తైన కీర్తి శిఖరాలను

అధిరోహించి

కృషీ తో నాస్తి దుర్భిక్షం అన్న పదానికి ఆదర్శంగా

ఈ జగతికి మార్గ దర్శి గా నిలిచిన

అక్షర బ్రహ్మ,ఆదర్శ పుషుడు

భరత మాత నే కాక జాతిని సైతం

పునీతం చేసిన మహనీయుడు

మన రావూరి భరద్వాజ గారికి

ఈ అక్షర నీరాజనం!


దోస పాటి.సత్యనారాయణ మూర్తి.

9866631877

పూజ..ఎవరు చేయాలి..!

 పూజ..ఎవరు చేయాలి..!


*1*


యజమాని ఉత్తరీయం..గోచీపోసి పంచె..కట్టుకోవాలి.

సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది. 

కాని నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేయాలి అంటే యజమాని నిత్యపూజ చేయాలి. 


*2*


సంకల్పంలోనే ఉంది "ధర్మపత్నీ సమేతస్య" అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. 

అంటే దాని అర్థం ఇంట్లో పూజ..ఇంటి యజమాని చేయాలి.


*3*


ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే ఎలా..? 

అందువలన పురుషుడు వళ్ళు వంచి ప్రతిరోజూ పూజ చేయ్యాలి. 


*4*


అదేవిదంగా నైమిక్తిక తిథులలో గాని, 

వ్రతమప్పుడు గాని పూజ చేసేటప్పుడు ధర్మపత్నీ, పిల్లలు కూడా ప్రక్కన ఉండాలి.


ఇక వస్త్రధారణ విషయనికి వస్తే ప్రధానంగా..

ఆడపిల్ల అయితే లంగా వోణీ,

వివాహిత అయితే చీర కట్టుకోవాలి. 


అమ్మవారికి అవే కదా ప్రధానం.


*5*


మరి పురుషుల విషయనికి వస్తే, 


పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది.

"వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ" అనగా వికచ్ఛః అంటే గోచీ పెట్టుకోలేదు, 

అనుత్తరీయశ్చ అంటే పైన ఉత్తరీయం లేదు అని. 

గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబర అవుతుంది. 

కాబట్టి పురుషుడికి ఉత్తరీయం ఉండాలి, 

అలాగే గోచీపోసి పంచె కట్టుకోవాలి. 

వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని "కచ్ఛము" అంటారు. 


*6*


అందుకే వేదం చదువుకున్న పెద్దలు, 

వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు. 


చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు.


 వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. 

కాబట్టి పురుషులు ఈ రెండు పద్దతులు తప్పనిసరిగా పాటించాలి.  


*7*


ఉత్తరీయం ఎటువైపు వేసుకోవాలి అంటే, 

ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. 

కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. 

అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. 


*8*


ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే యజమాని యందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నది చూసి, 

ఎందుకంటే యజమానికి అయన పెద్దరికం భుజం మీద ఉన్న ఉత్తరీయం వలనే.


కాబట్టి చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు 

పూజ చేసేటప్పుడు.

దేవాలయంలోనైనా అంతే. 


*9*


దేవాలయంలో వెళ్తే ఎదో చిన్నపిల్లలకి చెప్పినట్లు 

చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పించుకోకుండ మనంతట మనమే తీసి కూర్చోవాలి. 


ఇలా ఎందుకంటే దేవాలయం అనే మన మనశరీరంలోని ఆత్మ పరమాత్మను చూడాలి, 

ఆత్మకు పరమాత్మ, పరమాత్మకు ఆత్మ కనపడాలి. 


అలా చెయ్యకపోతే  భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు అని అర్ధం. 

అందువలన పురుషులు(యజమాని)పూజ చేసెపుడు ఉత్తరీయం వేసుకోవాలి, గోచీపోసి పంచె కట్టుకోవాలి..!

పొగడ పువ్వులు

 * ఓం నమఃశివాయ నమః*    

 

*🕉️పొగడ పువ్వులు🕉️*


*శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పూల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.*

*వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.*

*వేయి మారేడు దళాల కంటే ఒక తామరపువ్వు ఉత్తమం.*

*వేయి తామరపూల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.*

*వేయి పొగడపూల కంటే ఒక ఉమ్మెత్త పువ్వు ఉత్తమం.*

*వేయి ఉమ్మెత్త పూల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.*

*వేయి ములక పూల కంటే ఒక తుమ్మి పువ్వు ఉత్తమం.*

*వేయి తుమ్మి పూల కంటే ఒక ఉత్తరేణి పువ్వు ఉత్తమం.*

*వేయి ఉత్తరేణి పూల కంటే ఒక దర్భ పువ్వు ఉత్తమం.*

*వేయి దర్భ పూల కంటే ఒక జమ్మి పువ్వు శ్రేష్ఠం.*

*వేయి జమ్మి పూల కంటే ఒక నల్లకలువ ఉత్తమం.*

 

ఓం నమశ్శివాయ 👏⚘🌺🕉🌷

రాణీ కా వావ్

 మన క్రొత్త వందరూపాయల నోటు పై వెనుక ఉన్న బొమ్మ ని గమనించారా..దానిని గురించి క్లుప్తం గా😊


🌹క్రొత్త వంద రూపాయల నోటుకు వెనుక వైపు ఉన్న ఈ చిత్రం పేరు 🔴"రాణీ కా వావ్"🔴. ఇది ఒక నీటి బావి. ఇది గుజరాత్ లోని పఠాన్ జిల్లాలో ఉంది. వంద రూపాయల నోటు మీదకు వచ్చే వరకు ఎవరికీ తెలియని ఈ అద్భుత నిర్మాణం విశేషాలు....


మాములుగా దేశంలో ఉన్న చాలా నిర్మాణాలు రాజులు దేవుళ్ల కోసమో తమ రాణుల కోసమో కట్టించారు...... కానీ దీన్ని మాత్రం సోలంకి వంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమ -1 గుర్తుగా 1050-1100 మధ్య సరస్వతి నది ఒడ్డున నిర్మించింది.


మొత్తం 7 అంతస్థుల్లో నిర్మించిన ఈ బావి పొడవు దాదాపు 213 అడుగులు. వెడల్పు 66 అడుగులు, లోతు 92 అడుగులు. భారతదేశంలో మిగిలిన నిర్మాణాలన్ని నేల మీద నుండి పైకి అంతస్థులుగా నిర్మిస్తే దీన్ని మాత్రం భూమి లోపలికి 7 అంతస్థులుగా నిర్మించడం విశేషం. భూమి లోపలికి తవ్వుతూ నిర్మాణాలు చేయడం ఎంతో కష్టమైనప్పటికి ఈ నిర్మాణం భారతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఓ అద్భుత ఉదాహరణ.


ఈ నిర్మాణంలో అద్భుత కథలు చెక్కిన  215 స్థంభాలు, దాదాపు 800 శిల్పాలు ఉన్నాయి. గోడల మీద దశావతారం కథలు,  ఇతర పురాణాలు, స్త్రీల గురించి ఎన్నో బొమ్మలు చెక్కబడ్డాయి.


ఈ బావి మరో అద్భుతం లోపలికి దిగిన కొద్ది ఉష్ణోగ్రత తగ్గి చల్లగా ఉంటుంది. 7 అంతస్తులు దిగిన తరువాత బావి ఉంటుంది. అప్పట్లో బావి చుట్టూ ఔషధ మొక్కలు కూడా పెంచారు అందుకే ఈ బావిలో స్నానం చేస్తే రోగాలు తగ్గేవి. 


బావి దగ్గరే ఓ తలుపు మూయబడి ఉంటుంది. అప్పట్లో శత్రువులు దాడి చేసినపుడు ఆ తలుపు తెరిచి లోపల 30 కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గంలో  సిద్దాపూర్ అనే పట్టణానికి చేరే ఏర్పాటు చేశారు.


కానీ ఒకసారి సరస్వతి నదికి వచ్చిన వరదల్లో ఈ బావి పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది. 1980లో ASI {Archeological survey of india} ఆర్కీలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది.


2014లో UNESCO దీన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేర్చి దీని కీర్తి విశ్వవ్యాప్తం చేసింది. కానీ 


2018 జులైలో రిజర్వ్ బ్యాంకు 100 రూపాయల నోటు మీద ముద్రించే వరకు చాలా మంది భారతీయులకు ఈ అద్భుత నిర్మాణం గురించి తెలియక పోవడం బాధాకరం.


🔴పిల్లలకు తెలిసేలా వివరం గా చెప్తారు కదూ😊🌹❤

ఉపవాసం అనగా

 *

🍂💫🍂💫🍂💫🍂💫🍂💫🍂

    👉ఉపవాసం అనగా ఏమి తినకుండా కేవలం మంచినీరు తాగి ఉండటమే ఉపవాసం . దీర్ఘ ఉపవాసం చేయువారు రసాహారము తీసికొనవలెను. కొందరు దేవునికి ఒకపొద్దు ఉంటున్నాం అని ఆ తరువాత అరడజను అరటిపళ్ళు, 10 ఇడ్లిలు, అరకిలో ఉప్మా లాగించేస్తారు . అన్నం మాత్రం తినరు.బహుశా వారి దృష్టిలో ఇదో రకం ఉపవాసం కావొచ్చు.కాని అలా చేయడం ఉపవాసం అనిపించుకోదు.


         ఉపవాసం చేయడం వలన ముఖ్య ఉపయోగం శరీరంలోని మాలిన్యాలను బహిష్కరింపచేసి వ్యాధి నిర్మూలనం అవుతుంది. పొట్ట , కన్ను, వ్రణములు , జ్వరములు, జలుబు మొదలగు వ్యాదులను కనీసం 5 రోజులపాటు ఉపవాసం చేసి వ్యాధి తగ్గించుకోవచ్చు. ఏ వ్యాధిలోనైనా ఉపవాసం చేయుట వలన వ్యాధి తొందరగా తగ్గించుకోవచ్చు . లేనిచో ఒకపూట ఉపవాసం ఉండి తరువాత ఆ వ్యాధికి సంబంధించిన పథ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు.


          👉ఉపవాసంలో 4 రకాలు ఉన్నాయి  అవి 


           1 - నిర్జలోపవాసం .


           2 - జలోపవాసం .


           3 - రసోపవాసం .


           4 - ఫలోపవాసం .


 *🪨నిర్జలోపవాసం  -*


          మంచినీరు కూడా ముట్టకుండా చేయు ఉపవాసమును నిర్జలోపవాసం అంటారు. ఈ ఉపవాసం ముఖ్యంగా శరీరంలో నీరు ఎక్కువ చేరినప్పుడు అనగా శరీరం వాచినప్పుడు రెండు లేదా మూడు దినములు ఈ ఉపవాసం చేయవలెను .  మూడురోజులకు మించి ఈ ఉపవాసం చేయరాదు .


 *💦జలోపవాసం*


          కేవలం మంచినీరు మాత్రమే తాగి చేయు ఉపవాసమును జలోపవాసం అందురు. దీనిని మూడురోజుల నుంచి ఏడు రోజుల వరకు మాత్రమే చేయవలెను . అంతకు మించి చేయరాదు . శరీరంలో మాలిన్యాలు అధికంగా చేరి ఏ రసాహారమును కూడా జీర్ణం చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం మంచినీరు తాగించి ఉపవాసం చేయించవలెను. అనగా సుమారు రెండులీటర్లు మంచినీరు త్రాగించవలెను.


 *🎋రసోపవాసం*


           ఈ రసోపవాసమును సాధారణంగా ప్రకృతిచికిత్సాలయాల్లో రసోపవాసం చేయిస్తారు. కేవలం పండ్లరసాలతో చేయు ఉపవాసమును రసోపవాసం అంటారు. ఈ ఉపవాసం వారం రోజులు మొదలుకుని నెలరోజులు వరకు కూడా చేయవచ్చు . రసోపవాసంలో ముఖ్యంగా నిమ్మరసం , పలుచని నారింజరసం , బత్తాయిరసం , కమలారసం , తేనెనీరు, కొబ్బరినీరు , బార్లినీరు మొదలగునవి రోజుకు మూడుసార్లు నుండి అయిదుసార్లు లోపలికి తీసుకోవచ్చు .


 *🌞ఫలోపవాసం*


        ఉపవాసం చేయలేనివారు ఫలోపవాసం చేయవచ్చు . కేవలం రసము నిండిన ఫలములు మాత్రమే ఆహారంగా తీసికొనవలెను . అరటిపండు తీసుకోకూడదు . ఎక్కువ బత్తాయి, నారింజ, కమలా , ద్రాక్షా, అనాస , దానిమ్మ, మామిడి, పుచ్ఛ మొదలగు పండ్లు తినవచ్చు . 


        ఈ ఉపవాసం రోగిని అనుసరించి పది నుంచి నలుబది రోజుల వరకు అనుసరించవచ్చు.


 *😊ఉపవాసం చేయుట వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు*


 జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలివృద్ధి అగును.


  మలాశయంలో మురికి బహిష్కరింపబడి అజీర్ణం తొలగించబడి క్రిములను, బాక్టీరీయా నాశనం చేయబడును.


  మూత్రపిండాలలోని విషపదార్ధాలు, రాళ్లు బహిష్కరింపబడును.


  ఊపిరితిత్తులలోని నంజు, నీరు బహిష్కరించబడి ఆయాసం నివారించబడును. శ్వాసక్రియ చక్కగా జరుగును.


  గుండెచుట్టు , లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును. గుండెజబ్బులలో రసోపవాసం మంచిది.


  లివర్ మరియు స్ప్లీన్ ఆహారం జీర్ణం అగుటకు ఇవి చక్కగా పనిచేయాలి. ఈ ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలోని మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ది అగును.


  శరీరంలో రక్తప్రసారం చురుకుగా ఉండును. ఉపవాసం చేయుట వలన రక్తదోషములు నివారించబడును. తిమ్మిర్లు, మంటలు , నొప్పులు కూడా తగ్గును.


  కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసము వంటి మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును.


  నాడీమండలం శుభ్రపరచబడును.


  జ్ఞానేంద్రియాలలో మాలిన్యాలు అన్ని పోవును .


  చర్మం కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కటిరంగు వచ్చును.


    మనస్సు ప్రశాంతంగా ఉండి కోపం వంటివి మన అదుపులో ఉండగలవు.


 *😔ఉపవాసం చేయకూడని వారు  -*


       చాలా బలహీనంగా ఉన్నవారు, గుండెజబ్బులు కలవారు , బాలురకు, వృద్దులకు గర్భిణీస్త్రీలకు , బాలింతలకు , క్షయ మరియు రక్తహీనత కలిగిన రోగులు , మధుమేహంతో ఉన్నవారికి ఎక్కువ రోజులు ఉపవాసం చేయకూడదు .


 *ఉపవాసం చేయదగిన వారు*

       స్థూలకాయులు , ఉబ్బసం, సంధివాతం, రక్తపుపోటు,చర్మవ్యాధులు మొదలగు దీర్ఘకాలిక రోగులకు ఉపవాసం చేయుట మంచిది.


    ఉపవాసం ముగించిన వెంటనే ఘనాహారం తీసుకోకూడదు . ఉపవాసం తరువాత ఎక్కువ ఆహారం తీసుకొకూడదు. క్రమేపి ఆహారాన్ని పెంచుకుంటూ రావలెను. కారం , మసాలా పదార్దాలు , పిండివంటలు పచ్చళ్ళు తినకూడదు. అలా తీసుకున్నచో విరేచనాలు , వాంతులు , కడుపులో మంట, నొప్పి కలుగును.

ప్రాణ రూపిణీ

 784. 🔱🙏  ప్రాణ రూపిణీ 🙏🔱

ఐదక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించే టప్పుడు *ప్రాణ రూపిణ్యై నమః* అని చెప్పాలి.

ప్రాణ = ప్రాణముల యొక్క, రూపిణీ = రూపముగా ఉండునది.

జీవదేహ సంబంధం - ప్రాణాలతోనే సంధానం కావింపబడి ఉంటుంది. ప్రాణాలు తిన్నగా పనిచేస్తున్నంత వరకే జీవ దేహ సంబంధం తిన్నగా ఉండి, జీవి తన దేహంతో ఈ ప్రపంచంలో జీవిస్తాడు. లేకపోతే దేహాన్ని విడిచి తన

దోవన తాను పోతాడు.

ప్రాణాలు ఐదుగా చెబుతారు. వీటినే పంచ ప్రాణాలు అంటారు. వీటినే పంచ వ్యాహృతులుగా - ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానముగా గూడా చెబుతారు.


1) దేన్నైనా స్వీకరించే శక్తిని గాని, ఆకర్షించే శక్తిని గాని 'ప్రాణము' అంటారు. 

2) దేన్నైనా వికర్షించే శక్తి ని గాని విసర్జించే శక్తి ని గాని ' అపానము' అంటారు. 

3) శరీరంలోపలకు తిన్నగా వ్యాపింప గలిగే శక్తిని వ్యానము' (వి + ఆనం) అంటారు. 

4) శరీరం నుండి బయటకు పనిచేసే శక్తిని ఉదానం' అంటారు. 

5) బయట వాటికి - శరీరం లోపల వాటికి మధ్య సమన్వయాన్ని కలిగి తిన్నగా నిలబడేట్లు చేసే శక్తిని *సమానము* అంటారు.ఈ విధమైన ఐదు రకాల ప్రాణశక్తుల రూపంలోను మనలో అమ్మవారు ఉండి మనలను తిన్నగా నడిపిస్తుంది.

ప్రతి జీవిలోనూ ప్రాణరూపముగా ఉండునది - అని ఈ నామానికి అర్థం.


🙏ఓం ఐం హ్రీం శ్రీం ప్రాణ రూపిణ్యై నమః🙏

🌷శ్రీ  మాత్రే  నమః 🌷

త్రివక్రం

 💐త్రివక్రం అంటే... మనసులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది మరొకటి. ఈ మూడు వంకరలు తీసివేయడమే కుబ్జతనాన్ని తొలగించడం. అవి పోయి ఏకత్వం వచ్చేసి, ఈశ్వర స్పర్శ కలిగినవాడు అప్పటి నుంచి ఇక ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని కోరుకుంటాడు.💐


అంతరంగం, ఆలోచన, ప్రవర్తనల్లో ఏదో ఒకదానిలో మనుషులు ఎప్పుడూ పొట్టివారే. ఏదో ఒక లోపం లేకుండా సాధారణంగా ఏ మనిషీ ఉండడు. అలాంటి మరుగుజ్జుతనాన్ని కుబ్జత్వం అంటారు. ఆధ్యాత్మికత, జ్ఞానవృద్ధి, గురుకృప, భగవదనుగ్రహం తదితరాల ఆలంబనతో మనిషి వాటిని దాటి త్రివిక్రముడవుతాడు. వాటిలో ఏది కావాలన్నా తపన, తాదాత్మ్యత, నిర్మల భక్తి, నిబద్ధత కలిగిఉండాలి. ఈ విషయాన్ని వివరించేదే భాగవతంలోని ‘కుబ్జ’ కథ.


కపటబుద్ధితో ధనుర్యాగానికి బలరామ కృష్ణులను ఆహ్వానించాడు కంసుడు. మధురకు బయలుదేరారు అన్నదమ్ములు. దారిలో వారికి ఒక దివ్యాంగురాలు ఎదురైంది. ఆమెకు కృష్ణుణ్ని నఖశిఖ పర్యంతం చూడాలని కోరిక. ఆయన మనోహరమైన చిరునవ్వులొలికే మోమును చూడాలని, వీలైతే తాను సిద్ధం చేసిన శ్రీగంధాన్ని ఆయన మేనుకు అద్ది, ఆ మోహనరూపాన్ని చూడాలని కోరిక. కానీ శరీరం సహకరించని పరిస్థితి ఆమెది. అదీకాక ఆమె కంసుడికి దాసి. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ కృష్ణుడు వచ్చే దారిలో కనీ కనిపించకుండా తచ్చాడుతోంది. గమనించిన కృష్ణుడు ఆమెమీద జాలిపడ్డాడు. కరుణాసముద్రుడయ్యాడు. ‘సుందరీ’ అని సంబోధించాడు. ఆ పిలుపు విన్న ఆమె ఆశ్చర్యపోయింది. కళ్ల వెంట అశ్రుధారలు కారుతుండగా- గద్గద స్వరంతో ‘స్వామీ! నువ్వు కూడా నన్ను హేళన చేస్తున్నావా?’ అని అడిగింది.


‘నేను గంధపు చెక్కలమీద గంధం తీసి, పరిమళ ద్రవ్యాలు అద్ది కంసమహారాజుకు ఇస్తూ ఉంటాను. అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను. నీవు ఈ గంధాన్ని రాసుకుంటే ఈ గంధానికే అందం వస్తుంది. ఈశ్వరా, కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా? నువ్వు నన్ను పిలిచిన పిలుపుతో వచ్చిన ధైర్యంతో ఇలా అడుగుతున్నాను’ అంది.


ఆమె కోరికను మన్నించాడు కృష్ణుడు. ప్రతిగా ఆమె పాదాలను తన కుడిపాదంతో తొక్కి, తనచేతి రెండు వేళ్లను కుబ్జ గడ్డం కింద పెట్టి పైకి ఎత్తాడు. ఆ చర్యతో ఆమె వంకరలు తొలగిపోయి సౌందర్యరాశిగా మారిపోయింది. అప్పుడు ఆమె కృష్ణుడితో ‘నాకు ఇంత సౌందర్యాన్నిచ్చావు. నేను నీకు ఇచ్చే ఆనంద సౌఖ్యాలను అనుభవించి నన్ను తరింపజెయ్యి. అందుకోసం నీవు ఒకసారి మా ఇంటికి రా’ అని అడుగుతూ ఆయన ఉత్తరీయం పట్టుకొని లాగింది. అప్పుడు కృష్ణపరమాత్మ ‘నేను పాంథుడిని. ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్ళగలను. కాబట్టి తప్పకుండా నేను మీ ఇంటికి వస్తాను. కాని ఇప్పుడు కాదు. కంస సంహారం అయిన తరవాత’ అన్నాడు.


త్రివక్రం అంటే... మనసులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది మరొకటి. ఈ మూడు వంకరలు తీసివేయడమే కుబ్జతనాన్ని తొలగించడం. అవి పోయి ఏకత్వం వచ్చేసి, ఈశ్వర స్పర్శ కలిగినవాడు అప్పటి నుంచి ఇక ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని కోరుకుంటాడు. త్రివక్రకు తన వంకరలు పోగానే ఆవిడ ఈశ్వరుడి కైంకర్యం (సేవ) చేయాలని కలిగిన కోరికతోనే అలా అడిగింది. అందుకోసం తన ఇంటికి రమ్మంటోంది. పరమాత్మ కంసవధ అయిన తరవాత వస్తానంటున్నాడు. అంటే అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి. ఇంకా నీలో అజ్ఞానం ఏమైనా మిగిలిఉంటే అది సమసిపోవాలి’ అని ఆ మాటకు అర్థం. ఆయన ‘నేను పాంథుడిని’ అనడంలోనూ అంతరార్థముంది. పాంథుడు (బాటసారి) అంటే ఇల్లులేని వాడని అర్థం. దాని భావం ‘ఆత్మ స్వరూపుణ్ని’ అని. ఆత్మకు ఇల్లేమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. అది అప్పుడప్పుడు ఏదో ఒక ఇంట్లోకి (శరీరంలోకి) వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అని భావం. ఆ ఆత్మ స్వరూపుడితో తాదాత్మ్యం చెందాలంటే మానసిక వికృతి పోవాలి. ఇక్కడ జరిగింది అదే. కుబ్జ సౌందర్యవతిగా మారడం అంటే, పరమాత్మ సంపర్కంతో మానవాళి స్వరూపాన్ని పొందడమేనని ఇందులోని అంతరార్థం.


🙏

we used to be Wireless

 Vengalappa went to US & had a meeting with Bill Gates.


Bill: I want to show you the US advancement. Come with me.


He takes him to a forest..


Bill: Dig the ground.


Vengalappa did it.


Bill: Dig deeper and deeper..


Vengalappa went upto 100 feet..


Bill: So now try to search something.


Vengalappa: I got a Wire.


Bill: You know, it shows that even 100 years ago we used to have telephones..!


Vengalappa became frustrated. He invited Bill to India.

Next year Bill was in India..


Vengalappa: I want to show you our advancement.


The same, he takes Bill to a forest.


Vengalappa: Dig it.


Bill does.


Vengalappa: Dig deeper and deeper..


Bill goes upto almost 1000 feet.


Vengalappa: Try to find something.


Bill tries..


Vengalappa: Did you get anything?


Bill: No, there is nothing here.


Vengalappa: You know, it shows that even 1000 years ago, we used to be Wireless..!


Bill Gates is still recovering from the shock..!

Bolo tararara..!!!! 

🚿😆😆😝😝

~~~~Forwarded~~~~

పేరు విచిత్రంగా ఉండాలి

 నాదగ్గరకి ఆతృతగా పరుగెత్తుకుంటూ వచ్చాడు నాకు తెలిసిన వాడొకడు.

 "మీరే ఎలాగైనా సాయం చేయాలి. ఎంతోమందిని అడిగాను. ఎవరూ నా బాధ అర్థంచేసుకోలేకపోయారు."


 "ఏమిటో నీ కష్టం?"


 "పిల్ల పుట్టి మూడేళ్ళైంది. రేపు స్కూల్లో పడేయాలి, ఇంతవరకూ పేరు పెట్టలేకపోయాం. నెట్‌ సెర్చ్‌ చేశాం, పుస్తకాలు వెతికాం. సరైన పేరు దొరకలేదు. ఎవరో మీ పేరు చెప్పి మీ దగ్గరకెళ్ళమన్నారు. మీరు తెలుసు కనక మీదగ్గరకొచ్చాను."


 "ఎలాంటి పేరు కావాలి?"


 "ఆ పేరు మా పిల్లకు మాత్రమే ఉండాలి. ఇంకెవరూ పెట్టుకోకూడదు."


 "సూర్యకాంతం పెట్టు. అదైతే నాకు తెలిసి ఎవరూ పెట్టుకోరు."


 "కానీ, పేరు విచిత్రంగా ఉండాలి. మా బావ, కూతుళ్ళిద్దరికీ ‘పండు వెన్నెల’, ‘నిండు పున్నమి’ అని పెట్టాడు. అట్లాంటి పేర్లు ఎవరికీ లేవని పొగరుతో విరగబడుతున్నాడు. వాటిని తలదన్నే పేరు పెట్టాలి."


 "మీ బావగాడి చెంప మీద కొట్టినట్టుండే పేర్లు చెప్తా రాసుకో. పట్టపగలు, చిమ్మచీకటి, మిట్ట మధ్యాహ్నం."


 "మా పిల్ల పేరు ఫైనలైజ్‌ అయ్యేవరకూ ఈ పేర్లు ఎక్కడా లీక్‌ చేయొద్దు సార్‌, ప్లీజ్‌!"


 "సర్లే, ఎవరికీ చెప్పనులే. అయినా ఎందుకోయ్‌ అంత టెన్షన్‌?"


 "పిల్లకు పేరుపెట్టే ఉద్దేశమేమైనా ఉందా... అసలేమైనా ప్రయత్నం చేస్తున్నావా? - అని రోజూ మా ఆవిడ తిడుతోంది సార్‌!"


 "నీ మాటల్లోనే రెండు పేర్లు దొరికాయి. ‘ఉద్దేశ’, ‘ప్రయత్న’ ఇంతకూ మీ ఆవిడ ఏమని తిడుతోంది నిన్ను?"


 "వేస్టుగాడివంది."


 "వేస్టు అంటే వ్యర్థం. ‘వ్యర్థ’- సూపర్‌ పేరు!"


 "ఇప్పుడు చాలామంది శాన్వి అనీ శ్రాగ్వి అనీ పెడుతున్నారు కదా... వాటికి అర్థం ఏవిటండీ?"


 "మీ ఆవిడ అందని కాదుగానీ, నిజంగానే వేస్టుగాడివోయ్‌. పేరుకు అర్థమేంటీ... పేరుకు అర్థం ఉండకపోవడమే ఇప్పటి ట్రెండ్‌. మా బాబాయి మనవరాళ్ళ పేర్లేవిటనుకున్నావు? పెద్దదాని పేరు ‘శ్మశాన’, చిన్నదాని పేరు ‘వాటిక’. ఎలా ఉన్నాయి?"


 "బ్రహ్మాండంగా ఉన్నాయి సార్‌. కాదేదీ పేరు కనర్హం అన్నమాట!"


 "మరే... ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాంట్లో కూడా రెండు పేర్లున్నాయి... బ్రహ్మాండ, అనర్హ."


 "మీరు శూన్యంలో నుండి కూడా పేర్లు తీస్తున్నారు సార్‌!"


 "శూన్య - ఇదేదో బాగుందయ్యా! బుర్రలో ఆ తెలివి ఉండాలి. ఏది చూసినా పేరు తట్టాలి. మా తమ్ముడు ఓ రోజొచ్చి ‘అన్నయ్యా, పిల్లల పేర్లు పెట్టడం విషమ సమస్యైంది’ అన్నాడు. అంతే, పిల్ల పేరు ‘విషమ’, పిల్లాడి పేరు ‘సమస్య్‌’. ఎలా ఉన్నాయి?"


 "బాగున్నాయి సార్‌. మా అమ్మ శివుడి పేరు మీద శివకుమారి అని పెడతానంటోంది."


 "అలా రొటీన్‌ పేరు పెట్టావో, నువ్వూ మీ ఆవిడా కలిసి ఒకే తాడుకు ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది."


 "కోప్పడకండి సార్‌!"


 "రొటీన్‌కు భిన్నంగా ఆలోచించవయ్యా. శివకుమారి కామనే గదా... ‘శవకుమారి’ అని పెట్టు. లేకపోతే 'కళేబరి' "


 "గురువుగారూ, ఇంతకూ మీ పిల్లల పేర్లు ఏవిటండీ?"


 "ఎవరికీ లేని పేర్లు పెట్టాలని అమ్మాయి పేరు ‘సామూహిక’, అబ్బాయి పేరు ‘అత్యాచార్‌’ పెట్టాను. తీరా ఇప్పుడేమో పొద్దున్న లేస్తే పేపర్‌ నిండా అవే. ఆ పేర్లు ఇంకెవరైనా పెట్టుకుంటారేమోనని కంటినిండా నిద్రపోయింది లేదు. అంతా నా ఖర్మ... అరె, ఇదేదో బాగుందే, ‘ఖర్మ’ ఎలా ఉంది?"


 "చాలా బాగుంది గురువుగారూ. కాకపోతే మా వంశానికి నాగదేవత పేరుతో కలిపి పెట్టుకోవాలి. ‘నాగఖర్మ’ అని పెట్టుకోమంటారా?"


 "మళ్ళీ ఇదొకటా?"


 "అవును సార్‌. మా కజిన్ల పేర్లు ‘నాగ బీభత్స్‌’, ‘నాగ డింభక్‌’, ‘నాగ హిడింబ్‌’. మా అన్నయ్య తన పిల్లలకు ‘సర్ప జగదేక్‌’, ‘నాగ అతిలోక్‌’ అని పెట్టాడు. వాడు చిరంజీవి ఫ్యాన్‌లెండి."


 "మళ్ళీ ఇదొక దరిద్రమా? ఒక్క నిమిషం... దరిద్ర... నాగ దరిద్ర అని పెట్టు."


 "కానీ మా ఆవిడ మూడక్షరాల పేరే పెడదామంటోంది."


 "‘కుబుస’ అని పెట్టు, సరికొత్త పేరు. నాగదేవతకు సంబంధించినదే. అక్షరాలూ మూడే."


 "అద్భుతం సార్‌. ఇదే ఫైనల్‌. ‘కుబుస’ అని పెట్టేస్తా."

...

చూశారా? పిల్ల పేర్ల ఉత్పత్తి ప్రకరణం!!!!

బృందావనం--శ్యామా, శ్యామా

 బృందావనం దగ్గరలో కాన్వెంట్ స్కూల్ లో చదువుతున్నట్టి రెహమాన్ అనే పిల్లవాడు రోజూ పిల్లలతో కలిసి స్కూల్ కి వెళ్ళి వచ్చేవాడు. ఒకరోజు అలాగే వస్తుంటే చిన్న గుడి కిటికీలు తెరిచి ఉన్నాయి. పిల్లలు దణ్ణం పెట్టి వెళ్తున్నారు. ఈ రహమాన్ ఒక్కసారి కిటికీలోంచి చూడగానే రాధాదేవి మూర్తి కనపడింది. ఎవరు వాళ్ళు అంటే ‘శ్యామా శ్యాం’ అన్నారు. శ్యామా అంటే రాధ, శ్యాం అంటే కృష్ణుడు. ఈ పిల్లవాడిలో ఏం మేల్కొందో కానీ ‘శ్యామా, శ్యామా’ అంటూనే ఉన్నాడు. ఆ నోరు ఆగలేదు. ‘శ్యామా’ మహామంత్రం. పైగా రూపం చూశాడు కదా అది హృదయంలో హత్తుకు పోయింది. హృదయం నిండా ద్వాదశ వర్షీయ అయిన ఆ తల్లి సుకుమార రూపం. ‘శ్యామా శ్యామా’ అంటూ ఉన్నాడు. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. రసయోగం లక్షణం ఇది. వాళ్ళ నాన్నగారు కరడుగట్టిన ఛాందసవాది. మీర్జాసాహెబ్ ఆయన పేరు. ఆయన ఏమిటిరా కాఫీర్ ల పేరు పలుకుతున్నావు, నోర్ముయ్యి అన్నారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎలా హిమ్సిన్చాడో తెలియదు కానీ కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ ఘట్టంలో ఒక హిరణ్యకశిపుడు, ఒక ప్రహ్లాదుడు కనపడ్డారు. నెత్తురు కారేటట్లు కొట్టారు పిల్లవాడిని. కానీ పిల్లవాడు చలించకుండా ‘శ్యామా శ్యామా’ అదే ఏడుపు. ఆఖరికి అక్కడ ఉన్న ధ్యాన్యం కొట్టంలో పడేశాడు. తిండి పెట్టలేదు. తల్లి అడ్డుకోబోతుంటే ఆమెని కూడా కఠినంగా త్రోసివేశాడు. ఆ పిల్లవాడు ఆకలి, దప్పిక అన్నీ మర్చిపోయి ‘శ్యామా, శ్యామా’ పదం మాత్రం వదలలేదు.  తండ్రిలేని సమయంలో తల్లి వెళ్ళి నాన్నా ఆమాట మానెయ్యి అంటే అమ్మా! అన్నం మానేయగలను కానీ ఇది మానలేను. ఆవిడ నా హృదయంలో కనపడుతోంది. శ్యామా శ్యామా  అంటూ ఉంటే నాన్న కొట్టింది కూడా నాకు తెలియట్లేదు. ప్రహ్లాదులు వంటి వారిని పురాణాలలో చదువుకోవడమే కాదు. అచ్చమైన భక్తులు నేటికీ ఉంటారు. వాళ్ళని చూసే యోగం మనకి లేదు అంతే. అందుకే హిందూ పురాణములు సర్వకాలిక సత్యములు. ఆశ్చర్యకరం ఒక రాత్రివేళ ఎలా దొరికిందో అవకాశం కానీ ఎవరో పిలిచినట్లు కాలినడకతో బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎలా నడిచాడో తెలియదు. లాక్కువచ్చేవాడిది శక్తి. నడిచేవాడిది కాదిక్కడ. అది చలికాలం వేళ, కార్తీకం. రాత్రిపూట యమునానది ఒడ్డున ఉన్న మెట్టుపై కూర్చుని ‘శ్యామా శ్యామా’ అంటూ ఉన్నాడు. నామానికి మించిన మంత్రం లేదు. అదే నోరారా అంటే తరించిపోతాం. ఈ పిల్లవాడు శ్యామా శ్యామా అని ఏడుస్తూ ఉంటే బెంగాల్ నుంచి ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ అనే ఒక ప్రొఫెసర్ గారు, రాధాకృష్ణ ఉపాసకుడు, తరచూ బృందావనానికి వచ్చి వెళ్తూ ఉండేవారు. ఆయన వచ్చి మంచు పడని చోటు చూసుకుని జపం చేసుకుంటున్నాడు. ఎందుకంటే యమున మెట్టు మీద కూర్చునే సాహసం ఎవరూ చేయడంలేదు. ఎందుకంటే అక్కడ తీవ్రమైన మంచు. అక్కడ ధ్వని వినపడుతుంటే కొంచెం దూరం నుంచి వెళ్లి చూసి యితడు సామాన్యుడు కాదు అనుకున్నాడు. ఇప్పుడు ఈయన గారికి కూడా తపస్సు పండే యోగం వచ్చింది. ఆకాశం నుంచి ఒక కాంతిపుంజం దిగడం కనపడింది. ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయకి కనపడింది. ఆ కాంతిపుంజంలోంచి ఒక స్త్రీ చేతిలో పాత్ర పట్టుకుని వచ్చి రహమాన్ ని పిలిచింది. రహమాన్ ఎవరు నువ్వు అన్నట్లుగా చూశాడు. ‘శ్యామా’ పంపితే వచ్చాను అన్నదిట. శ్యామా పంపించిందా? నన్ను తీసుకు వెళ్ళమని చెప్పు. నేను వెళ్ళిపోవాలి శ్యామాను చూడాలి అని ఏడుస్తున్నాడు. అంతకంటే గొప్ప ఏడుపు ఏం ఉంది. ఏడవకు ముందు నీరసపడిపోయావు నువ్వు బాగా. ఇది త్రాగు శ్యామా ఇచ్చి పంపింది అనగానే ఒక్కసారి త్రాగాడు. ఆ త్రాగిన తర్వాత ఆ తల్లి చెక్కిళ్ళు నిమిరి నువ్వు రేపు ప్రొద్దున రాధాకుండ్ లో స్నానానికి వెళ్ళు అని చెప్పి ఆమె అంతర్థానం అయిపొయింది. ఆవిడ పేరు చంపకలత. అమ్మవారి అష్ట సఖులలో ఒకావిడ. ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ వెళ్ళి ఏమిటయ్యా నీ భాగ్యం అని ఆ పిల్లవాడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ప్రొద్దున ఈయన నిద్రలేచే లోపలే ఆ పిల్లవాడు రాధాకుండ్ కు వెళ్ళిపోయాడు. మరి కనపడలేదు. రాధాకృష్ణ తత్త్వంలో రహమాన్ బాలుడు లీనం అయ్యాడు. ఇది ఆ తల్లియొక్క అనుగ్రహం. భక్తికి మతం అడ్డా? ఈ ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ ఇదంతా చూసి స్వయంగా వ్యాసంగా వ్రాసి అక్కడ ‘శ్రీ జీ మందిర్’ అని రాధాదేవి మందిరంలో ఒక మాసపత్రిక ముద్రితం అవుతూ ఉంటే దీనిని అందులో ముద్రించమని కోరుకున్నాడు. వాళ్ళు ప్రింట్ చేశారు. ఇది రికార్డు చేయబడిన ఒకానొక సత్యగాథ.

అక్రమంగా సరిహద్దు దాటితే,

 🙊మీరు "దక్షిణ కొరియా" అక్రమంగా సరిహద్దు దాటితే,

మీరు 12 సంవత్సరాలు జైలులో ఉంటారు

పెడతారు .... !!


         మీరు సరిహద్దు "ఇరాన్" అక్రమంగా ఉంటే

నిన్ను నిరవధికంగా దాటండి

అదుపులోకి తీసుకుంటారు .... !!


    మీరు "ఆఫ్ఘనిస్తాన్" అయితే

చట్టవిరుద్ధంగా సరిహద్దును దాటండి

 మిమ్మల్ని చూడగానే షూట్ చేయండని ఆర్డర్

ఇవ్వబడుతుంది....!!


    మీరు "చైనీస్" సరిహద్దును అక్రమంగా దాటితే

 మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారు

మరియు మీరు

మళ్ళి కనపడరు .... !!


      మీరు "క్యూబా" సరిహద్దు అక్రమంగా

 దాటితే ... 

కుట్ర చేసినందుకు జైలు పాలైతారు...!!


     మీరు "బ్రిటిష్" బోర్డర్ అక్రమంగా దాటితే, మీరు అరెస్టు చేయబడతారు

విచారణ జరుగుతుంది, జైలు శిక్ష పడుతుంది ...

మరియు

        మీరు పొరుగు దేశానికి చెందినవారై 

చట్టవిరుద్ధంగా భారత దేశ సరిహద్దు దాటినట్లు కనబడితే,

అప్పుడు మీరు పొందుతారు

1 ఒక రేషన్ కార్డు

2 పాస్పోర్ట్,

3 డ్రైవింగ్ లైసెన్స్,

4 ఓటరు గుర్తింపు కార్డు,

5 క్రెడిట్ కార్డులు,

6 ప్రభుత్వ రాయితీ అద్దె వసతి,

7 ఇల్లు కొనడానికి రుణాలు,

8 ఉచిత విద్య,

9 ఉచిత ఆరోగ్య సంరక్షణ,

10 న్యూ ఢిల్లీలో లాబీయిస్ట్,

11 ఒక టెలివిజన్.

మరో 12 మంది మానవ హక్కుల నిపుణులు

కార్మికుల సమూహంతో

లౌకికవాదం ట్రంపెట్

హక్కు .....

 ..... భారతీయులను

చంపడానికి స్వేచ్ఛ

స్వేచ్ఛ ...


      

💥మీరు ప్రజల్లో అవగాహన తీసుకురావాలనుకుంటే, పోస్ట్‌ను ఇతరులతో షేర్ చేయండి,

ప్రజల అవగాహన బాధ్యత నాపై మాత్రమే కాదు, మీపైన కూడా ఉంది.

ఏమి జరుగుతుందో చూడండి, ప్రారంభించండి.

🌹🌹🌹🙏🌹🌹🌹

జీవనపోరాటం

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

      *జీవనపోరాటం*

           🌷🌷🌷 

ముంబై మెట్రో లలో .. 

ఇంకా దేశవ్యాప్తంగా బస్సు స్టాండ్లు,

రైల్వే స్టేషన్ ల లో ప్రజల రద్దీ కనిపిస్తోంది. 

ప్రజలకు బుద్ధి లేదు, భయం అసలు లేదు అని విమర్శించే మేధావులకు బహిరంగ లేఖ! 


అయ్యా, .. 

మీరు  అమెరికాలోనో ఆస్ట్రేలియా లోనో పుట్టాల్సిన వారు స్వామీ ! 

ఇది ఇండియా.  జనాభా 140  కోట్లు. 

మీ ప్రతిభ అనండి, 

కష్టం అనండి,

అదృష్టం అనండి,

మీకు కారు ఉంది,

విమానాల్లో వెళతారు . 


కానీ అందరికీ ఆ అవకాశం లేదు స్వామీ ! 

బతకాలంటే ఇంటినుంచి బయటకు పోవాలి, పని చెయ్యాలి . 

పనికి వెళ్ళాలి అంటే బస్సెక్కాలి.

రైల్ ఎక్కాలి.

అక్కడ జనాలు.

తోసుకొని పోవాలి.. 

గుంపులుగా ఉండాలి అని 

ఎవరికీ ఉంటుంది ? 

తానొక్కడే, 

లేదా తన కుటుంబం .. 

రైల్వే స్టేషన్ కు పోతే అక్కడ తనలాగే ఎంతో మంది  అభాగ్యులు.

మెట్రోలో చోటు(ప్లేస్) కోసం, బస్సులో సీట్ కోసం దూరాలి. 

తోసుకొంటూ ముందుకు పోవాలి. 

ఒక సారి వెళ్లి నిలుచోండి. 

ఎవరినీ ముట్టుకోకుండా నిలుచోండి.  మీరు ఎక్కే రైల్ జీవిత కాలం మిస్సు.  మీకు నచ్చినా,

మీకు కోపం వచ్చినా, అసహ్యం వేసినా ఇదే ఇండియా. 


మార్చలేమా అంటారా? 

ఒక సారి ట్రై చెయ్యండి. 

పుల్ పవర్స్ మీకు ఉంటే 

ఎలా కంట్రోల్ చేస్తారో చెప్పండి.


అమెరికా వేరు, ఆముదాల వలస వేరు.  

కెనడా వేరు, కాకినాడ వేరు స్వామి ! 

రాసుకొని, తోసుకొని బతికితేనే ఇక్కడ బతుకులు.

మరో దారి లేదే! 

ఏమి చేస్తాము? 

ఏదైనా  మార్గం ఉంటే చెప్పండి . 


లాక్ డౌన్ పెట్టాలి అంటారు. అందరూ ఇంట్లోనే ఉంటే సేఫ్ అంటారు.  మీకు సాగుతుంది.

అందరికీ సాగాలి  కదా స్వామీ! బయటకు వెళితే, అక్కడ తనలాగే వచ్చిన వారు గుంపులు గా ఉంటే ఆ దోషం తనదా? 

అప్పుడు కరోనా సోకితే పోతారో వుంటారో తరువాత మాట! 

ఇంట్లో ఉంటే కచ్చితంగా పోతారు. కడుపు మాడి పోతారు. ప్రభుత్వాలు మాత్రం ఏమి చేస్తాయి.  అప్పటికీ గోదాముల్లో ఉన్న ఆహార ధాన్యాలు పంచేసారు .   ఇంకా ఎక్కడనుంచి  వస్తాయి? అక్షయ పాత్రలు కథలోనే ఉంటాయి . 


రైతు పొలానికి వెళ్ళాలి.   పంట పండించాలి.   దాన్ని లారీ ఎక్కించాలి.  దానికి  డీజిల్ పోయడానికి పెట్రోల్ బంక్, అక్కడ పని చేసేవారు, దారిలో లారీ డ్రైవర్ తిండి తినాలి కదా.  అక్కడ ఒక డాబా.   ఇక సిటీలో, ధాన్యం,

కాయగూరలు, పాలు.  దించడానికి కార్మికులు.  వాటిని మీ ఇంటికి తేవడానికి కొంత మంది.


తమరు పొట్ట కదలకుండా టీవీ రిమోట్ చేత పట్టుకొని సోఫా లో కూర్చొని అబ్బా, "జనాలకు బుద్ధి లేదు.  స్టే హోమ్ అంటే వినరు.

ఈ గుంపులు ఏంటి" అని ఈసడించుకొంటూ ఉంటే, మిమ్మల్ని ఆలా కూర్చోపెట్టడానికి వెనుక వేల మంది లక్షల మంది శ్రమ ఉందని అర్థం చేసుకోండి . 


ఇండియా డెమోగ్రసీ అర్థం కాదు. ఆర్థిక వ్యవస్థ అర్థం కాదు.   

సామాజిక వాస్తవికత అర్థం కాదు. అది మీ తప్పు కాదులే సామి. ఇన్నాళ్లు అర్థం కానిది ఇంకా ఏమి అర్థం అవుతుంది/అసలే కరోనా కాలం.

ఇక్కడ చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్! 

మూడో వేవ్!

ముప్పై వ వేవ్!

మా చావేదో మేము చస్తాము. 

కెనడాకో ఆస్ట్రేలియాకో ఇమ్మిగ్రేట్ అయ్యే అవకాశాల్ని మీరు చూసుకోండి స్వామి.  మీ ప్రాణం అంటే మీకు తీపి.  తప్పులేదు,

కానీ మీ ప్రాణ భయం తో మిగతా వారిని చంపాలి అనుకంటె యెట్లా?


లేదు ఇక్కడే ఉండాలి అంటావా? అయితే,


*జీనా హైతో మర్నా సీకో* .. 

*కదం కదం పర్ లడ్నా సీఖో* .. 


 *హిందీ రాదా ?* 


బతకాలంటే చావడం నేర్చుకో .. అడుగడుగునా పోరాటం నేర్చుకో . ఇదే జీవన పోరాటం.

రచయిత పేరు తెలియదు.  మా ఇంట్లో మా అమ్మగారి సంవత్సరిక కార్యక్రమాలకు వచ్చిన బ్రహ్మ గారు, ఇతరులు కార్యక్రమాలు చేయించాలంటే భయంగా ఉన్నా, చేయించకపోతే గడవని పరిస్థితులు అని తమ సమస్యలు చెప్పడం గుర్తుకి వచ్చింది.   చక్కని విశ్లేషణ అని పంపేను. 

🌹🌹🌹🌷🌷🌹🌹🌹

సరదా ఉపయోగాలు

 శరీర భాగాలు -- వాటి సరదా ఉపయోగాలు గురించి చెప్పుకుందాం...

 (సరదాకు మాత్రమే😊)


తల - తాకట్టు పెట్టుకోవడానికి

గడ్డం - పట్టుకుని బతిమలాడటానికి

ముక్కు - పిండి వసూలు చేయడానికి

వీపు - విమానం మోత మోగించడానికి

కాలు - కదపకుండా పనులు చేయించడానికి

కాళ్ళు - బలపం కట్టుకుని తిరగడానికి

చేతులు-ఖాళీ లేవనటానికి

అరికాలు - మంట తలకెక్కించుకోవడానికి

పళ్లు-రాల కొట్టటానికి

కళ్ళు - నిప్పులు పోసుకోవడానికి

భుజాలు - గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు      తడుముకోవడానికి

చెంప - ఛెళ్ళుమనిపించడానికి

వేలు - ఇతరుల వ్యవహారాలలో పెట్టడానికి

అరచేయి - వైకుంఠం చూపించడానికి

గొంతు- మీద కాలేసి తొక్కటానికి

పొట్ట - తిప్పల కోసం

నడుము - వంచి పనిచేయడానికి

నొసలు - చిట్లించడానికి

నోరు- పారేసుకోడానికి.

News for DIABETIC patients

 *Great News for DIABETIC patients..*             


Dr. Hasaan Shamsi Pasha working in one of Jeddah's hospital as Heart Specialist, had become Sugar patient himself with as high as 500 reading of Sugar level in the mornings..


He got very worried as despite many tests & trials of different medicines, his reading was still 200 before breakfast and 300 after breakfast..


As he was a reasercher himself and he was also writer of many medical books (refer to Wikipedia for more info on him), he decided to take Olive oil as medicine for Sugar..


He took 2-3 table spoons before bed and 2-3 table spoons early morning, one hour before breakfast..

Results were amazing after only one week of use.!


Sugar reading was 100 before breakfast and 180 after breakfast within 3 days and by end of 1 week it was 93 "after breakfast.!!"


He then left using before bed but still continues with early morning use of Olive oil..


Those who started using Olive oil for sugar showed other benefits too.. as follows :

Those who had problems of feet getting hot or cold, became better..


Others reduced the amount of their sugar medicines they used to take before..


Those using insulin injections have now reduced their dosage & are contemplating to stop injections completely.!

Many said their bones of the legs have now stopped paining.!


I request you all to, Please, forward this so that Diabetics in ur circle of Friends & Family are benefitted or try this for urself, if u suffer from Diabetes.... 

forwarded as received 

*I CARE 4U SO SHARED*

*విష్ణు సహస్ర నామం*.. . *(రెండవ భాగం).*

 *విష్ణు సహస్ర నామం*.. . 


*(రెండవ భాగం).*


విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించే ముందు ధర్మరాజు భీష్ముడిని ఆరు ప్రశ్నలు అడుగుతాడు. 1. ఈ ప్రపంచానికంతటికీ ఏకైక దేవత ఎవరు. 2. ఏది పరమ లక్ష్యము. 3. ఎవరిని స్తుతించాలి. 4. మానవులకు సుఖశాంతులు లభించాలంటే ఎవరిని అర్చించాలి.    5. ధర్మాలన్నిటిలోకి విశిష్టమైన ధర్మము ఏది. 6. దేనిని జపించుట చేత ప్రాణికోటికి సంసార బంధముల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ ప్రశ్నలన్నిటికీ భీష్ముని వారు మహావిష్ణువే పరమేశ్వరుడు, పరమ లక్ష్యము, స్తుతింప వలసినది ఆర్చింపవలసినది ఆయననే, ఆయన నామాలను జపించిన వారికి సకల శుభాలు జన్మ బంధం నుంచి మోక్షము లభిస్తాయి. ఆయనను ధ్యానించడం మే మానవులకు పరమ ధర్మము అని జవాబు చెప్తాడు.


ఈ ప్రశ్నలు ధర్మరాజు తన స్వార్థం కోసం అడగలేదు. అందరి జీవులకు జ్ఞానం కలిగించడానికి మోక్ష మార్గం తెలియజేయడానికి లోక శ్రేయస్సు కోసం అడిగాడు. కామక్రోధాలు స్వార్ధము మొదలైన దుర్గుణాలు కు లోనై వృధాగా కురుక్షేత్రంలో మరణించిన రాజులను సైనికులను గమనించి ఆ బాధతో ధర్మరాజు ఈ ప్రశ్న లను అడిగాడు. మరే విధమైనటువంటి లౌకిక వాంఛలు కానీ స్వార్థం కానీ లేని స్థితిలో ఉన్న భీష్ములవారు అదే ఉద్దేశ్యంతో లోకానికి మంచి చేయడం కోసం ఈ సహస్ర నామాలు ఉపదేశించారు. 


తాను ఉపదేశిస్తున్న నామాల యొక్క లక్షణాలు ఫలము కూడా భీష్మలవారు సూక్ష్మముగా చెప్పారు.


*యాని నామాని గౌణాని*

*విఖ్యాతాని మహాత్మనః*

*రుషిభిః పరి గీతాని*

*తాని వక్ష్యామి భూతయే*


మహావిష్ణువు గుణాలకు సంబంధించిన వాటిలో ముఖ్యమైనవి మహాత్ములైన ఋషుల చేత కీర్తింప బడినవీ అయిన నామాలను చతుర్విధ పురుషార్ధాలు సాధించుకోవడం కోసం చెబుతున్నాను అంటారాయన. ఈ శ్లోకం లో మనం ముఖ్యం గా మూడు పదాలు  జాగ్రత్తగా గమనించు కోవాలి. మొదటిది *గౌణం.*. రెండవది *పరికీర్తనం*.. మూడవది *భూతయే.*


గౌణము అంటే గుణ సంబంధ మైనది అని అర్థము.  ఉదాహరణగా మూడు నామాలు చూపిస్తాను. వాసుదేవ గదాగ్రజ శ్రీపతి.


 వాసుదేవ పదానికి  వసుదేవుడి కుమారుడు. గదాగ్రజ అన్న మాటకు గదుడు అనే ఒక యాదవునికి వరసకు అన్న అవుతాడు.  శ్రీపతి అంటే లక్ష్మీ దేవి భర్త. ఈ అర్థాలు లౌకికమైనవి. ఈ నామాలకు పరమేశ్వరుడి గుణాలకు ఉన్న సంబంధాన్ని వివరించు కోవాలి.


ప్రపంచమంతా ఎవ్వని యందు వసిస్తుందో ఎవడు ప్రపంచమంతా ఆవరించుకొని ఉంటాడో అతను వాసుదేవుడు.


అవ్యక్త రూపంలో ఉన్న భగవంతుడు మొదటగా ఓంకార రూపంలో వ్యక్తం అయినాడు. అది శబ్దము. గద అంటే  ఏదైనా చెప్పు లేదా ఉచ్చరించు అని  ఎవరినైనా అడగడం. గదతి అంటే చెబుతున్నాడు చెబుతున్నది అని అర్థం. కాబట్టి గద అంటే ఇక్కడ పలుకు అంటే వాచ్యమైన ఓంకార శబ్దం అని అర్థము. దాని కంటే ముందు అంటే ఓంకారాని కంటే ముందుఉన్న వాడు అని అర్థం.


శ్రీ అంటే భగవంతుని యొక్క జ్ఞాన ఇచ్చా క్రియా శక్తులు. వాటికి అధిపతి శ్రీపతి.


 అలాగే విష్ణు సహస్రనామాలలో కొన్ని శివుడికి సంబంధించినవి కొన్ని కుమారస్వామికి సంబంధించినవి, కొన్ని సూర్యునికి సంబంధించినవి కొన్ని అగ్నికి సంబంధించినవి అలా వేరే వేరే దేవతలకు సంబంధించినవి అనిపిస్తాయి. నిజానికి అవన్నీ కూడా భగవంతుడి గుణాల కు సంబంధించినవి. ఇది అర్థం చేసుకోవాలి. ఇదే గౌణాని  అనే మాట కు అర్ధము.


*పరికీర్తన*  ::  పరి అనే ఉపసర్గ చాలా గాఢమైన తత్పరతతో చేసే పనికి వాడతారు. బ్రహ్మాన్ని వివరించమని  శిష్యుడు గురువుని అడిగేది  పరి ప్రశ్న. పరిజ్ఞానము సంపూర్ణ జ్ఞానము. పరి కీర్తన అలాంటిదే.  మామూలుగా ఉబుసు పోకో కాలక్షేపానికో కాకుండా ఏకాగ్రతతో భక్తితో చేసే కీర్తన, లేదా ఏదైనా విషయాన్ని శక్తి కొద్దీ చాటి చెప్పడము. స్తోత్రాల విషయంలోనూ నామజపం విషయంలోనూ ఉచ్చ జపము ( పైకి వినబడేటట్లు చేసేది), ఉపాంసు జపము ( పెదవులు కదులుతూ మాట పైకి వినపడకుండా చేసేది),  మానసిక జపము ( మనసులో చేసుకునేది),  అని మూడు రకాల జపాలు ఉన్నాయి. పరి కీర్తనము అనే మాట ద్వారా ఉచ్చ జపం సూచింప బడుతున్నది. 


*భూతయే* ::  సంస్కృత భాషతో కొంచెం  పరిచయం లేకపోతే ఈ మాట అర్థం కాదు. ఆ శ్లోకం తాత్పర్యం చదివినా, తాత్పర్యం అట్లా ఎందుకు రాశారో తెలుసుకోలేము. భూతయే అంటే భూతికోసం. భూతి అంటే మహదైశ్వర్యము. ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక సంబంధమైన ఐశ్వర్యాన్ని అంటే సాధారణమైన కోరికలు నుంచి కైవల్యం దాకా అన్ని కోరికలు తీర్చ గలగడం. ఇది భీష్ముల వారు చెప్పినసహస్ర నామము యొక్క ఫలితము. విష్ణు సహస్రనామం తర్వాత ఫలశ్రుతి శ్లోకాలు చాలానే ఉన్నాయి. అవి చెప్పే విషయం అంతా భూతయే అనే ఈ ఒక్క పదం పూర్తిగా తెలియ జేస్తుంది. 


ఈ శ్లోకంలో విష్ణు సహస్రనామం లోని నామాలను ఎలా అర్థం చేసుకోవాలి వీటిని ఇంతకుముందు ఎవరు ఎలా చదివేవారు దీనిని చదివితే ఏ ఫలితం వస్తుంది ఈ మూడు విషయాలను భీష్ముల వారు చాలా స్పష్టంగా చెప్పారు.


విష్ణు సహస్రనామం లోని చాలా మాటలకు భారతంలోనే వివిధ సందర్భాలలో వేదవ్యాసులు అర్థాన్ని ఇచ్చారు.   వేదాల ల్లోనూ ఇతర పురాణాలలోనూ మరి కొన్ని మాటలకు అర్ధాలు ఉన్నాయి.  ఈ అర్ధాల నన్నింటిని  శంకర భాష్యం లో ఆదిశంకరులు సంకలనం చేసి పెట్టారు. ఆ అర్ధాలు ప్రధానమైనవి. మామూలు అర్థాలు చెప్పకూడదు అని కాదు. ఆ అర్థాలు కూడా పురాణాల ప్రకారం ఉన్నాయి. ఆది శంకరుల వారు గౌణార్ధాలతో పాటు  పక్కపక్కనే మామూలు అర్ధాలను కూడా  చెప్పారు.  గౌణాని అనే మాట భీష్ముల వారు ప్రత్యేకంగా చెప్పకపోతే అందరమూ మామూలు అర్థాలనే చూసుకోవలసి వచ్చేది...  


ఇంకా వుంది....


*పవని నాగ ప్రదీప్*

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలు..


*పిచ్చివాడు..పూజారి..*


      2005 వ సంవత్సరం... 23ఏళ్ళ వయసు కల ఓ యువకుడిని, ఇద్దరు దంపతులు చేతుల మీద ఎత్తుకొని, మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధికి తీసుకొని వచ్చారు..బలహీనంగా  ఉన్న ఆ యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది.. వారం నుంచీ ఆహారం కాదుకదా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదా మనిషి..ఏ దిక్కూ తోచని ఆ దంపతులు, ఎవరి ద్వారానో స్వామి వారి మహిమల గురించి విని, చివరి ప్రయత్నంగా ఇక్కడకు తీసుకొచ్చారు..


         పణిదెపు నరసింహాచారి, రమణమ్మ వాళ్ళ పేర్లు..పామూరు మండలం రేణిమడుగు గ్రామ వాస్తవ్యులు..వృత్తి, వ్యవసాయం, వడ్రంగి పని..ఇద్దరు సంతానం పెద్దది కూతురు..రెండవవాడు రామబ్రహ్మాచారి అని పిలవబడే ఈ యువకుడు.. లక్షణంగా ఉన్న సంసారం..అమ్మాయికి వివాహం చేశారు.. కుమారుడు రామబ్రహ్మాచారి స్వర్ణ కారుడిగా రాణిస్తున్నాడు..ఉన్నంతలో హాయిగా ఉన్నారు.. 


ఇంతలో ఏమైందో తెలీదు, రామబ్రహ్మాచారి మతిస్థిమితం లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించ సాగాడు.. పిల్లవాడి దుస్థితి చూసి తల్లిదండ్రులు కుమిలిపోయారు..రకరకాల పరీక్షలు అయ్యాయి..మొక్కని దైవం లేడు..ఫలితం లేదు..అంతుపట్టని వ్యాధి పెరుగుతోందే కాని తగ్గటం లేదు..అప్పుడప్పుడూ ఇతరుల మీదపడి కొట్టబోవటం లాంటి చర్యలకూ పాల్పడుతున్నాడు..క్రమంగా ఆహారం తీసుకోవటం తగ్గిపోయింది..ఆరోగ్యమూ క్షీణించసాగింది..యుక్తవయసులో ఉన్న కుమారుడు ఈ విధంగా మారటం, ఏ తల్లిదండ్రులకయినా మనోక్షోభే! 


        ఆఖరి అవకాశం గా శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి తీసుకువచ్చి, ఆ స్వామి సమాధి వద్ద మొక్కుకున్నారు..చేతుల మీద ఎత్తుకొనే స్వామి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు.. వారం గడచిపోయేసరికి, పిల్లవాడిలో మార్పు వచ్చింది..మెల్లిగా తనంతట తానే నడవగలిగే స్థాయి కొచ్చాడు.. 41 రోజులపాటు (మండలం) స్వామి గుడివద్దే ఉండాలని నిశ్చయించుకున్నారు.. క్రమంగా స్వస్థత చేకూర సాగింది..ఒక్కొక్కరోజూ గడిచేకొద్దీ మార్పు స్పష్ఠంగా కనపడుతోంది.. రామబ్రహ్మం ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తాడో అని భయపడిన ఇతర భక్తులు కూడా ఆశ్చర్యపోయే విధంగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది..


రామబ్రహ్మానికి కూడా ఆ దత్తాత్రేయుడి మీద సంపూర్ణ విశ్వాసం కలిగింది .. పూర్తి భక్తి పరుడిగా మారాడు..ఎంత మార్పు వచ్చిందంటే..నిశ్చలంగా గంటల తరబడి ధ్యానం లోనే గడిపే వాడు..మునుపటి మనోవికారపు చేష్టలు లేవు..సహనంగా వుండటమూ..శాంతంగా మాట్లాడటము అలవాటుగా మారిపోయాయి..రామబ్రహ్మం లో వచ్చిన మార్పు చూసి, అతనిని దగ్గరగా గమనిస్తున్న మేము సైతం ముక్కున వేలు వేసుకునేలా మారిపోయాడు..


  అప్పుడే..మా తల్లిదండ్రులు నిర్మల ప్రభావతి, శ్రీధరరావు దంపతులు కూడా ఇతని గురించి విన్నారు..రామబ్రహ్మం లోని భక్తి  మా అమ్మగారికి గారికి నచ్చింది..ఇతను కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుడయినాడు.. దత్తాత్రేయ స్వామి మందిర ప్రాంగణం లొనే, ఓ పాముల పుట్టను భక్తులంతా నాగదత్తయ్య అనే పేరుతో కొలుస్తుంటారు.. అక్కడికి వచ్చే భక్తులకు తీర్ధం ఇచ్చే పని రామబ్రహ్మానికి అప్పచెప్పారు..అత్యంత భక్తి శ్రద్ధలతో చేయసాగాడు.. కొన్నాళ్ళు గడిచాక..రామబ్రహ్మం అందరిలాగే మసలుకోవడమూ..శ్రీ స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవడమూ..నిత్యమూ దైవ చింతనలో గడపడమూ గమనించిన మా అమ్మగారు..రామబ్రహ్మానికి నచ్చచెప్పి.. ఒంగోలు లో దేవాదాయ శాఖ వారు నిర్వహించే వేద తరగతులకు ఇతనిని పంపారు.. ఆ శిక్షణ పొంది దేవాదాయ శాఖ వారు ఇచ్చిన సర్టిఫికేట్ తో తిరిగి మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామీ మందిరం చేరాడు రామబ్రహ్మం..


  మా మొగలిచెర్ల గ్రామం లో  పూర్వీకుల కాలం నుంచీ మా కుటుంబ వారసత్వంగా మా చేత నిర్వహింపబడుతున్న రామాలయం అర్చక బాధ్యతలు అప్పచెప్పారు..రామబ్రహ్మాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని నిత్య పూజా విధానాన్ని మా అమ్మగారు నేర్పించారు..చక్కగా నేర్చుకున్నాడు..ఏలోటూ లేకుండా చక్కగా శ్రీరామాలయం బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నాడు..


  రామబ్రహ్మాచారి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు, తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు, 2011 లో తగిన కన్యను చూసి వివాహం చేశారు..ఈ సమయంలోనే కావలి పట్టణం లోని శ్రీ కలుగోళమ్మ దేవస్థానం లో ఉప అర్చకుడి గా పనిచేసే అవకాశం వచ్చింది.. సంసారం పెరిగుతోంది, దానికి తగ్గ ఆదాయమూ కావాలి కదా!..కానీ అతని మనస్సంతా దత్తాత్రేయుడి పాదాలమీదే ఉన్నది.. 


ప్రతి శని ఆదివారాలు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి భక్తుల తాకిడి విశేషంగా ఉంటుంది.. ప్రస్తుతం ఉన్న అర్చక సిబ్బందితో ఉపాలయాలలో పూజలు సక్రమంగా జరపడం ఇబ్బంది గా ఉన్న కారణంగా ఇద్దరు పరిచారికలు (ఉప అర్చకులు) నియమించుకొనడానికి అనుమతి పత్రం దేవాదాయ శాఖ వారు ఇచ్చారు.."ఆ రెండురోజులూ శ్రీ స్వామివారి మందిరం లో అర్చక బాధ్యతలు నిర్వహిస్తావా" అని రామబ్రహ్మాన్ని  అడిగాను నేను..సంతోషంగా అంగీకరించాడు...శ్రీ స్వామివారు తన భక్తుడిని వారం లో రెండురోజుల పాటు తన ప్రాంగణం లోనే ఉంచుకునే ఏర్పాటు చేసుకున్నారు..రామబ్రహ్మమూ భక్తిగా శ్రీ స్వామివారి సన్నిధిలో అర్చక బాధ్యతలు చేపట్టాడు..


        అప్పటి నుండీ నేటివరకు, రామబ్రహ్మాచారి, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ప్రాంగణం లోగల ఉప ఆలయాలలో..ప్రతి శని ఆదివారాలు అర్చక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు..ఒక్కొక్కసారి ప్రధాన ఆలయం లోనూ పూజారిగా పనిచేస్తున్నాడు..


        మతిస్థిమితం లేక, మొగలిచెర్ల అవధూత శ్రీదత్తాత్రేయుడి శరణు కోరిన  రామబ్రహ్మం, నేడు, అదే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దేవస్థానం లో అర్చకుడు..


మీరూ ఎప్పుడైనా శని, ఆది వారాల్లో శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర దర్శనానికి వచ్చినప్పుడు, రామబ్రహ్మాచారి ని కలిసి మాట్లాడవచ్చు..


శ్రీ స్వామివారి లీల కు ఇంతకంటే నిదర్శనం కావాలా?


సర్వం..

శ్రీ దత్త కృప..


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్:523114..సెల్..94402 66380. & 99089 73699).

ప్రశ్న పత్రం సంఖ్య: 5

ప్రశ్న పత్రం సంఖ్య: 5                             కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి ప్రతి పదం "తి " తో అంతమౌతాయి   

1) మొదటి పూజలు పొందే దేముడు 

2) సౌందర్యం కల స్త్రీ 

3) ఒక ప్రసిద్ధ వైష్ణవ పుణ్య క్షేత్రం 

4) భర్త 

5) ఆమోదం తెలియ చేయటం 

6) ప్రసిద్ధ సినిమా నటి, నిర్మాత, గాయని, రచయిత, దర్శకురాలు, మదాసులో ఒక సినిమా స్టూడియో అధిపతి 

7) రూపవంతురాలైన స్త్రీ 

8) ఒక వంశం రాజు ఏనుగులకు అధిపతి అనికూడా అర్ధం 

9) భార్య 

10) దేవాలయాల నిర్మాణాలు నిర్దేశించే ప్రాచీన ఇంజినీరు 

11) దరిద్రుడికి ఇదే పరిస్థితి 

12) చనిపోయిన వారు ఈ స్థితి పొందాలనుకుంటారు 

13) రెండక్షరాలలో ఎక్కువ 

14)రెండక్షరాలలో తక్కువ

15) పేరు ప్రఖ్యాతులు కలిగి వుండటం 

16) ఏడుకొండల వానిని ఇలాకూడా పిలుస్తారు 

17) మంచి అంగన  మూడక్షరాలలో 

18) ప్రతి వారికి వుండాలిసింది ఇడిపోయిందా పిచోడే 

19) ఒక నక్షత్ర నామము 

20) విన్నపము 

21) ప్రీతి వారు పేరుతొ పాటు ఇది కూడా ఉండాలనుకుంటారు 

22) ఈశ్వరుని ఇలా కూడా పిలుస్తారు 

23) ఇది లేకపోతె మనం ప్రపంచాన్ని చూడలేము 

24) భ్రమ 

25) అందరు మనస్సుకు ఇది ఉండాలనుకుంటారు 

26) పడని పదార్ధాలు తింటే ఇది అవుతుంది. 

27) మనుసులు ఈ జంతువునుంచి పుట్టారంటారు 

28) ఈ రోజుల్లో ఇది వున్న మనుషులు అరుదుగా కనపడతారు 

29) ఎమితినాలన్న దీనితోటె 

30) షుగరు రోగులకు అన్నం తో పాటు ఇది కూడా తినమంటారు 

31) ఇది ఒక అలంకరణ పుష్పము 

32) క్రికెట్ ఆడటానికి,  ఇది ఉండాలి 

33) ఇది దేవతలకే కాదు ఒక తెలుగు రాజధాని కూడా 

34) బాహు బాలి సినిమాలోని సామ్రాజ్యం 

35) ఉత్తర రామచరిత్ర వ్రాసిన సంస్కృత కవి 

36) మనవాళ్ళు పూర్వం నీరు ఇక్కడినుండి తోడుకునేవారు 

37) పెండ్లిలో భర్త మూడు ధర్మములు నీతో కలిసి పంచుకుంటానని భార్యకు చేసే ప్రమాణం మొదటి రెండక్షరాలు 

38) ప్రపంచం 

39) ఆకారము