5, జులై 2021, సోమవారం

రాణీ కా వావ్

 మన క్రొత్త వందరూపాయల నోటు పై వెనుక ఉన్న బొమ్మ ని గమనించారా..దానిని గురించి క్లుప్తం గా😊


🌹క్రొత్త వంద రూపాయల నోటుకు వెనుక వైపు ఉన్న ఈ చిత్రం పేరు 🔴"రాణీ కా వావ్"🔴. ఇది ఒక నీటి బావి. ఇది గుజరాత్ లోని పఠాన్ జిల్లాలో ఉంది. వంద రూపాయల నోటు మీదకు వచ్చే వరకు ఎవరికీ తెలియని ఈ అద్భుత నిర్మాణం విశేషాలు....


మాములుగా దేశంలో ఉన్న చాలా నిర్మాణాలు రాజులు దేవుళ్ల కోసమో తమ రాణుల కోసమో కట్టించారు...... కానీ దీన్ని మాత్రం సోలంకి వంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమ -1 గుర్తుగా 1050-1100 మధ్య సరస్వతి నది ఒడ్డున నిర్మించింది.


మొత్తం 7 అంతస్థుల్లో నిర్మించిన ఈ బావి పొడవు దాదాపు 213 అడుగులు. వెడల్పు 66 అడుగులు, లోతు 92 అడుగులు. భారతదేశంలో మిగిలిన నిర్మాణాలన్ని నేల మీద నుండి పైకి అంతస్థులుగా నిర్మిస్తే దీన్ని మాత్రం భూమి లోపలికి 7 అంతస్థులుగా నిర్మించడం విశేషం. భూమి లోపలికి తవ్వుతూ నిర్మాణాలు చేయడం ఎంతో కష్టమైనప్పటికి ఈ నిర్మాణం భారతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఓ అద్భుత ఉదాహరణ.


ఈ నిర్మాణంలో అద్భుత కథలు చెక్కిన  215 స్థంభాలు, దాదాపు 800 శిల్పాలు ఉన్నాయి. గోడల మీద దశావతారం కథలు,  ఇతర పురాణాలు, స్త్రీల గురించి ఎన్నో బొమ్మలు చెక్కబడ్డాయి.


ఈ బావి మరో అద్భుతం లోపలికి దిగిన కొద్ది ఉష్ణోగ్రత తగ్గి చల్లగా ఉంటుంది. 7 అంతస్తులు దిగిన తరువాత బావి ఉంటుంది. అప్పట్లో బావి చుట్టూ ఔషధ మొక్కలు కూడా పెంచారు అందుకే ఈ బావిలో స్నానం చేస్తే రోగాలు తగ్గేవి. 


బావి దగ్గరే ఓ తలుపు మూయబడి ఉంటుంది. అప్పట్లో శత్రువులు దాడి చేసినపుడు ఆ తలుపు తెరిచి లోపల 30 కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గంలో  సిద్దాపూర్ అనే పట్టణానికి చేరే ఏర్పాటు చేశారు.


కానీ ఒకసారి సరస్వతి నదికి వచ్చిన వరదల్లో ఈ బావి పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది. 1980లో ASI {Archeological survey of india} ఆర్కీలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది.


2014లో UNESCO దీన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేర్చి దీని కీర్తి విశ్వవ్యాప్తం చేసింది. కానీ 


2018 జులైలో రిజర్వ్ బ్యాంకు 100 రూపాయల నోటు మీద ముద్రించే వరకు చాలా మంది భారతీయులకు ఈ అద్భుత నిర్మాణం గురించి తెలియక పోవడం బాధాకరం.


🔴పిల్లలకు తెలిసేలా వివరం గా చెప్తారు కదూ😊🌹❤

కామెంట్‌లు లేవు: