5, జులై 2021, సోమవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 6

  ప్రశ్న పత్రం సంఖ్య: 6                             కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి  

1) రోజు ఏర్పడటానికి ఈ గ్రాహం కారణం 

2) ఉత్తరాయణం ఈ తారీకు నుండి మొదలౌతుంది 

3) అయనాలు ఎన్ని అవి ఏవి 

4) చంద్రుడు పూర్తిగా కనపడని తిది ఏది 

5) చంద్రుడు పూర్తిగా కనపడు  తిది ఏది 

6) చంద్రోదయం ప్రతి రోజు ఎన్ని(ఘడియలు) నిముషాల వ్యవధితో మారుతుంది 

7) నిన్నటి కన్నా ఈ రోజు చెంద్రుని పరిమాణంలో ఎన్నవ వంతు తేడా ఉంటుంది 

8) పాల పుంత అంటే ఏమిటి 

9) వివాహంలో పురోహితులు నవ వధూవరులకు ఏ నక్షత్రాన్ని చూపిస్తాడు. 

10) వివాహంలో చూపే నక్షత్రం ఏ నక్షత్ర మండలంలో వుంది.  

11) రాసి చక్రంలో ఎన్ని గదులు వున్నాయి.  

12) రాసి చక్రాన్ని చుట్టిరావటానికి అన్ని గ్రహాలకన్నా మందకొడిగా కదిలే గ్రాహం ఏది. 

13) ఏ ఏ గ్రహాలు కనపడకపోతే మౌడ్యమి వస్తుంది 

14) వివాహాలలో ఈ గ్రహ దోషం ముఖ్యంగా చూస్తారు అది ఏది 

15) భూమికి దగ్గరగా వున్న గ్రాహం ఏది 

16)ఏ  కాలంలో భూమికి సూర్యుడు దగ్గరగా వస్తాడు 

17) సూర్యుడు ఒక ______ అని శాస్త్రజ్ఞులు అంటారు 

18) సూర్య కాంతిలో ఎన్ని రంగులు ఉంటాయి  

19) సూర్యుని రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయి 

20) సూర్యుని రద సారధి పేరు ఏమిటి. 

21) సూర్యుని రధాన్ని ఎన్ని అశ్వాలు లాగుతున్నాయి. 

22) కంటికి కనిపించని గ్రహాలు ఎన్ని వాటి పేర్లు ఏమిటి 

23) సూర్య గ్రహణం ఈ తిది నాడు వస్తుంది 

24)  చంద్ర గ్రహణం గ్రహణం ఈ తిది నాడు వస్తుంది 

25) చంద్రుడు దేనికి కారకుడు 

26) సముద్రంలో ఆటు పోటులకు ఈ గ్రాహం కారణం. 

27) మనం వున్న పాలపుంత పేరు ఏమిటి  

28) మనం ఈ ప్రపంచంలో చూసే వస్తువులు ఎన్ని కొలతలు (డైమెన్షన్లు) కలిగి ఉంటాయి 

29) నీటి చక్రం (నీరు భూమి నుండి ఆకాశానికి వెళ్ళటం తిరిగి భూమిపైన పడటాన్ని) చెప్పే మంత్రాలను యేమని పిలుస్తారు. 

30) ఏ  గ్రహానికి ఆవరణ (డిస్క్) ఉంటుంది 

31) సూర్యుడు నిత్యం మండుతూ ఉండటానికి ఈ అణు చర్య అని అంటారు అది ఏమిటి. 

32) పగలు రాత్రులు ఏర్పడటానికి కారణం 

33) భూమి యెంత వేగంగా పరిభ్రమిస్తుంది.  

34) ఉల్కా పాతాలూ ఎలా ఏర్పడుతాయి. 

35) భూమి మధ్యన వుండే పదార్ధాన్ని యేమని అంటారు. 

36) భూమి మీద నుండి ఆకాశంలో పైకి పోతున్న కొద్దీ వాతావరణ పీడనం ఎలా మారుతుంది. 

37) మన సాదారణ వాతావరణ పీడన ఎంతఉంటుంది (సెంటి మీటర్లలో) 

38) బారోమీటార్ రీడింగ్ యాదృచ్చికంగా పడిపోతే దేనిని సూచిస్తుంది. 

39) పూర్వం విమాన యానాం చేసేవారి జేబులోని ఫౌంటెన్ పెన్ ఇంకు ఎందుకు బైయటికి వచ్చేది. 

40) ఇప్పుడు విమాన యానాం చేసేవారి జేబులోని ఫౌంటెన్ పెన్ ఇంకు బైయటికి ఎందుకు రాదు 

41) విమాన యానాం చేసే ప్రయాణికులు చెవిలో దూది పెట్టుకోవటం వల్ల కలిగే సౌకర్యం ఏమిటి 

42) గగన తలంలో వెళుతున్న విమానం లోపలి వాతావరణ పీడనం విమాన బైయటి పిదనంతో సమానంగా ఉంటుందా లేదా 

43)  వెళుతున్న రైలు లోపలి వాతావరణ పీడనం రైలు బైయటి పిదనంతో సమానంగా ఉంటుందా లేదా 

44) రోడ్డు మీద ప్రయాణించే లారీ కన్నా పట్టాల మీద నడిచే రైలు ఎక్కువ వేగంగా ప్రయాణించగలదు ఎందుకు 

45) విమానంలో ఇంధనాన్ని ఎక్కడ నింపుతారు 

46) విమానం టైరులు ఏ గ్యాసుతో నింపుతారు. 

47) గ్రహణం ఏర్పడే రప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తి మారుతుందా, ఎలా 

48) చెందుని వెలుతురుకు కారణం ఏమిటి 

49) భూమి నుండి యెంత ఎత్తులో ఉపగ్రహాలు ఉంచుతారు 

50) ఉపగ్రహంనుంచి భూమి మీదికి తరంగాలను పంపే పాలఖాలను యేమని అంటారు 

51) భూగ్రాహం మీద ఖగోళంలో వుంచినట్లే ఉపగ్రహాన్ని చంద్రగ్రహం మీద వుంచగలరా 

53) రాసి ఛేక్రంలో వేగంగా తిరిగే గ్రాహం ఏది. 

54) గగనతలంలో భూమినుండి పైకి వెళుతున్నకొద్దీ ఆక్సిజన్ శాతం పెరుగుతుందా, తగ్గుతుందా  

55) గురుత్వాకర్షణ శక్తి సాధారణంగా యెంత ఉంటుంది. 

56) ధ్రువాల వద్ద గురుత్వాకర్షణ సాధారణ శక్తి కన్నా ఎక్కువగా ఉంటుందా లేక తక్కువగా ఉంటుందా 

57) మనము వాడే పంచాంగంలో వున్న మానాన్ని ఏమంటారు 

58) నక్షత్రాలు ఎన్ని 

59) ఒక్కో నక్షత్రానికి పాదాలు ఎన్ని 

60) ఆధునిక సైన్సు ప్రకారం నక్షత్రానికి గ్రహానికి తేడా ఏమిటి. 


కామెంట్‌లు లేవు: