🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
*జీవనపోరాటం*
🌷🌷🌷
ముంబై మెట్రో లలో ..
ఇంకా దేశవ్యాప్తంగా బస్సు స్టాండ్లు,
రైల్వే స్టేషన్ ల లో ప్రజల రద్దీ కనిపిస్తోంది.
ప్రజలకు బుద్ధి లేదు, భయం అసలు లేదు అని విమర్శించే మేధావులకు బహిరంగ లేఖ!
అయ్యా, ..
మీరు అమెరికాలోనో ఆస్ట్రేలియా లోనో పుట్టాల్సిన వారు స్వామీ !
ఇది ఇండియా. జనాభా 140 కోట్లు.
మీ ప్రతిభ అనండి,
కష్టం అనండి,
అదృష్టం అనండి,
మీకు కారు ఉంది,
విమానాల్లో వెళతారు .
కానీ అందరికీ ఆ అవకాశం లేదు స్వామీ !
బతకాలంటే ఇంటినుంచి బయటకు పోవాలి, పని చెయ్యాలి .
పనికి వెళ్ళాలి అంటే బస్సెక్కాలి.
రైల్ ఎక్కాలి.
అక్కడ జనాలు.
తోసుకొని పోవాలి..
గుంపులుగా ఉండాలి అని
ఎవరికీ ఉంటుంది ?
తానొక్కడే,
లేదా తన కుటుంబం ..
రైల్వే స్టేషన్ కు పోతే అక్కడ తనలాగే ఎంతో మంది అభాగ్యులు.
మెట్రోలో చోటు(ప్లేస్) కోసం, బస్సులో సీట్ కోసం దూరాలి.
తోసుకొంటూ ముందుకు పోవాలి.
ఒక సారి వెళ్లి నిలుచోండి.
ఎవరినీ ముట్టుకోకుండా నిలుచోండి. మీరు ఎక్కే రైల్ జీవిత కాలం మిస్సు. మీకు నచ్చినా,
మీకు కోపం వచ్చినా, అసహ్యం వేసినా ఇదే ఇండియా.
మార్చలేమా అంటారా?
ఒక సారి ట్రై చెయ్యండి.
పుల్ పవర్స్ మీకు ఉంటే
ఎలా కంట్రోల్ చేస్తారో చెప్పండి.
అమెరికా వేరు, ఆముదాల వలస వేరు.
కెనడా వేరు, కాకినాడ వేరు స్వామి !
రాసుకొని, తోసుకొని బతికితేనే ఇక్కడ బతుకులు.
మరో దారి లేదే!
ఏమి చేస్తాము?
ఏదైనా మార్గం ఉంటే చెప్పండి .
లాక్ డౌన్ పెట్టాలి అంటారు. అందరూ ఇంట్లోనే ఉంటే సేఫ్ అంటారు. మీకు సాగుతుంది.
అందరికీ సాగాలి కదా స్వామీ! బయటకు వెళితే, అక్కడ తనలాగే వచ్చిన వారు గుంపులు గా ఉంటే ఆ దోషం తనదా?
అప్పుడు కరోనా సోకితే పోతారో వుంటారో తరువాత మాట!
ఇంట్లో ఉంటే కచ్చితంగా పోతారు. కడుపు మాడి పోతారు. ప్రభుత్వాలు మాత్రం ఏమి చేస్తాయి. అప్పటికీ గోదాముల్లో ఉన్న ఆహార ధాన్యాలు పంచేసారు . ఇంకా ఎక్కడనుంచి వస్తాయి? అక్షయ పాత్రలు కథలోనే ఉంటాయి .
రైతు పొలానికి వెళ్ళాలి. పంట పండించాలి. దాన్ని లారీ ఎక్కించాలి. దానికి డీజిల్ పోయడానికి పెట్రోల్ బంక్, అక్కడ పని చేసేవారు, దారిలో లారీ డ్రైవర్ తిండి తినాలి కదా. అక్కడ ఒక డాబా. ఇక సిటీలో, ధాన్యం,
కాయగూరలు, పాలు. దించడానికి కార్మికులు. వాటిని మీ ఇంటికి తేవడానికి కొంత మంది.
తమరు పొట్ట కదలకుండా టీవీ రిమోట్ చేత పట్టుకొని సోఫా లో కూర్చొని అబ్బా, "జనాలకు బుద్ధి లేదు. స్టే హోమ్ అంటే వినరు.
ఈ గుంపులు ఏంటి" అని ఈసడించుకొంటూ ఉంటే, మిమ్మల్ని ఆలా కూర్చోపెట్టడానికి వెనుక వేల మంది లక్షల మంది శ్రమ ఉందని అర్థం చేసుకోండి .
ఇండియా డెమోగ్రసీ అర్థం కాదు. ఆర్థిక వ్యవస్థ అర్థం కాదు.
సామాజిక వాస్తవికత అర్థం కాదు. అది మీ తప్పు కాదులే సామి. ఇన్నాళ్లు అర్థం కానిది ఇంకా ఏమి అర్థం అవుతుంది/అసలే కరోనా కాలం.
ఇక్కడ చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్!
మూడో వేవ్!
ముప్పై వ వేవ్!
మా చావేదో మేము చస్తాము.
కెనడాకో ఆస్ట్రేలియాకో ఇమ్మిగ్రేట్ అయ్యే అవకాశాల్ని మీరు చూసుకోండి స్వామి. మీ ప్రాణం అంటే మీకు తీపి. తప్పులేదు,
కానీ మీ ప్రాణ భయం తో మిగతా వారిని చంపాలి అనుకంటె యెట్లా?
లేదు ఇక్కడే ఉండాలి అంటావా? అయితే,
*జీనా హైతో మర్నా సీకో* ..
*కదం కదం పర్ లడ్నా సీఖో* ..
*హిందీ రాదా ?*
బతకాలంటే చావడం నేర్చుకో .. అడుగడుగునా పోరాటం నేర్చుకో . ఇదే జీవన పోరాటం.
రచయిత పేరు తెలియదు. మా ఇంట్లో మా అమ్మగారి సంవత్సరిక కార్యక్రమాలకు వచ్చిన బ్రహ్మ గారు, ఇతరులు కార్యక్రమాలు చేయించాలంటే భయంగా ఉన్నా, చేయించకపోతే గడవని పరిస్థితులు అని తమ సమస్యలు చెప్పడం గుర్తుకి వచ్చింది. చక్కని విశ్లేషణ అని పంపేను.
🌹🌹🌹🌷🌷🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి