5, జులై 2021, సోమవారం

ప్రాణ రూపిణీ

 784. 🔱🙏  ప్రాణ రూపిణీ 🙏🔱

ఐదక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించే టప్పుడు *ప్రాణ రూపిణ్యై నమః* అని చెప్పాలి.

ప్రాణ = ప్రాణముల యొక్క, రూపిణీ = రూపముగా ఉండునది.

జీవదేహ సంబంధం - ప్రాణాలతోనే సంధానం కావింపబడి ఉంటుంది. ప్రాణాలు తిన్నగా పనిచేస్తున్నంత వరకే జీవ దేహ సంబంధం తిన్నగా ఉండి, జీవి తన దేహంతో ఈ ప్రపంచంలో జీవిస్తాడు. లేకపోతే దేహాన్ని విడిచి తన

దోవన తాను పోతాడు.

ప్రాణాలు ఐదుగా చెబుతారు. వీటినే పంచ ప్రాణాలు అంటారు. వీటినే పంచ వ్యాహృతులుగా - ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానముగా గూడా చెబుతారు.


1) దేన్నైనా స్వీకరించే శక్తిని గాని, ఆకర్షించే శక్తిని గాని 'ప్రాణము' అంటారు. 

2) దేన్నైనా వికర్షించే శక్తి ని గాని విసర్జించే శక్తి ని గాని ' అపానము' అంటారు. 

3) శరీరంలోపలకు తిన్నగా వ్యాపింప గలిగే శక్తిని వ్యానము' (వి + ఆనం) అంటారు. 

4) శరీరం నుండి బయటకు పనిచేసే శక్తిని ఉదానం' అంటారు. 

5) బయట వాటికి - శరీరం లోపల వాటికి మధ్య సమన్వయాన్ని కలిగి తిన్నగా నిలబడేట్లు చేసే శక్తిని *సమానము* అంటారు.ఈ విధమైన ఐదు రకాల ప్రాణశక్తుల రూపంలోను మనలో అమ్మవారు ఉండి మనలను తిన్నగా నడిపిస్తుంది.

ప్రతి జీవిలోనూ ప్రాణరూపముగా ఉండునది - అని ఈ నామానికి అర్థం.


🙏ఓం ఐం హ్రీం శ్రీం ప్రాణ రూపిణ్యై నమః🙏

🌷శ్రీ  మాత్రే  నమః 🌷

కామెంట్‌లు లేవు: