2, ఏప్రిల్ 2023, ఆదివారం

అబ్బాయనుకో

 *ఎవరు వ్రాసారో కానీ చాల గొప్పగా ఉంది చాలా గర్వంగా ఉంది.*


*ఒక గర్భవతైన భార్య,* 

*ఆమె భర్త ఇలా*

*మాట్లాడుకుంటున్నారు..*


*భార్య:* 


ఏం అనుకుంటున్నావ్..?

అబ్బాయి పుడతాడనా ?

అమ్మాయనా..??


*భర్త:*


అబ్బాయనుకో...

వాడికి లెక్కలు

నేర్పుతాను...

ఇద్దరం కలిసి గేమ్స్

ఆడుకుంటాం... 

స్విమ్మింగ్

నేర్పుతా... 

చెట్లెక్కడం

నేర్పుతా... 

అమ్మాయిలతో 

ఎలా మాట్లాడాలో

నేర్పుతా... ఇంకా....


*భార్య:*


చాలు చాలు! 

మరి అమ్మాయి పుడితే..!?


*భర్త:* 


అమ్మాయైతే 

ఏం నేర్పనవసరంలేదు...!

అదే నాకు

నేర్పుతుంది... 


నేనేం తినాలి... 

ఏం తినకూడదు...

ఏం మాట్లాడాలి... 

ఏం మాట్లాడకూడదు... 

నేను ఎలాంటి బట్టలు

వేసుకోవాలి... 


ఒక రకంగా 

మా అమ్మ లాగా

అన్నమాట... 


ఇంకా నేను దానికి

ప్రత్యేకంగా ఏం

చేయకపోయినా 

నన్ను హీరోలా చూసుకుంటుంది... 


నన్నెవరైనా

బాధపెట్టారనుకో, 

వాళ్ళని అస్సలు

క్షమించదు... 

ఎదురు తిరుగుంది... 


భర్త దగ్గర కూడా 

నాగురించి గొప్పగా

చెప్తుంది... 

మా నాన్న నాకోసం 

అది చేసాడు... 

ఇది చేసాడు అనీ... 


*భార్య:*


సో..అమ్మాయైతే ఇవన్నీ

చేస్తుంది... 

అబ్బాయైతే 

చేయడంటారు

అంతేగా..??


*భర్త:*


కాదు..

అబ్బాయైతే ఇవన్నీ

మనల్ని చూసి నేర్చుకుని

చేస్తాడు... 


అమ్మాయికి 

బై బర్త్ వచ్చేస్తాయ్... 


*భార్య:*


అదేం 

శాశ్వతంగా మనతోనే 

ఉండిపోదు కదా..!


*భర్త:*


ఉండదు... 

కానీ మనం దాని గుండెల్లో

ఉండిపోతాం... 


అందుకని 

అది ఎక్కడ ఉంది 

అన్నది సమస్య కాదు..!


Daughters 

are Angles... 

Born with

unconditional 

love and care forever...


అందుకని 

ఆడపిల్లల

తల్లిదండ్రులు

అదృష్టవంతులు...


కూతురంటే కూడికల,

తీసివెతల లెక్క కాదు

నీ వాకిట్లో పెరిగే 

'తులసి మొక్క'... 


కూతురంటే 

దించేసుకొవలసిన 

బరువు కాదు..

నీ ఇంట్లో వెలసిన 

'కల్పతరువు'... 


కూతురంటే 

భద్రంగా చూడవలసిన

గాజు బొమ్మ కాదు... 

నీ కడుపున పుట్టిన 

మరో "అమ్మ"... 


కూతురంటే

కష్టాలకు,కన్నీళ్ళకు

వీలునామా కాదు ...

కల్మషం లేని 

'ప్రేమ' కు చిరునామా...


కళ్యాణమవగానే 

నిన్ను విడిచివెళ్ళినా...

పరిగెత్తుకొస్తుంది నీకు 

ఏ కష్టమెచ్చినా... 


తన ఇంటి పేరు

మార్చుకున్నా

కడదాకా వదులుకోదు

పుట్టింటి పైన ప్రేమను...


కొడుకులా

కాటి వరకు

తోడురాకపోయినా... 

అమ్మ అయి 

నీకు ప్రసాదించగలదు 

మరో జన్మ...


కూతురున్న 

ఏ ఇల్లు అయినా

అవుతుంది.. 

దేవతలు 

కొలువున్న కోవెల... 


*కూతురిని కన్న* 

*ఏ తండ్రి అయినా* 

*గర్వపడాలి యువరాణిని*

 *కన్న మహారాజు లా.*

కాకి - కాలజ్ఞాని'

 ' బలగం సినిమా లో కాకి అనే ఒక పక్షిని మన తెలంగాణా ఆచారంలో భాగంగా చూపించారు...అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రం ఆ గౌరవం దక్కింది..ఎందుకంటే

----------------------------------------కాకి - కాలజ్ఞాని' అంటారు...


®️వేకువ జామునే '(బ్రహ్మ ముహూర్తంలో)' మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి.


®️'కావు కావు' అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు.. ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతమూ 'కావు కావు' అని  అందరికీ గుర్తు చేస్తూ 'బోధిస్తూ'.. అందరినీ తట్టి లేపేది కాకి.


®️ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న 'అన్ని కాకులకు' సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి  ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి.


®️శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి 'సంఘటితంగా పోరాటం' చేపట్టేవి కాకులు.


®️ఆడ కాకి - మగ కాకి కలవడం కూడా 'పరుల కంట' పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం.


®️ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికిచేరే మంచి ఆచరణ కాకులదే.


®️సూర్యాస్తమయం సమయానికి గూటికిచేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే.


®️అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా.


®️కాకులు లేని ప్రదేశం లేదు ఈ భువిపై. కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. అందుకే  'కాకులు దూరని కారడవి' అంటారు.


®️కాకులు అరుస్తోంటే  ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తోంది అనేవారు పెద్దలు.


®️అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు (భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి.


®️సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక  స్నానమాచరించి బయట ఎగురుతాయి.  అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు.


®️దానధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు.


®️భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు.


®️మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షీభూతంగా ఉండే పక్షి కాకి.


®️ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు.!


®️కూజాలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి...!!


®️భారతీయుల సనాతన ధర్మం - విశిష్టత, ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవే.  సంఘజీవనం.., సేవాతత్పరత.., మంచి స్నేహభావాలతో., ఈర్ష్యా ద్వేషాలు లేకుండా., కలసి మెలసి అన్యోన్యంగా., అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో., నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము.

------------------------------

ఇది చదివాక, కాకి జీవనంలో ఇంత  తాత్వికత, ఇంత లోతైన అర్థం ఉందా!!!!! అనిపించింది. వీలైనంతమందికి పంచితే మంచిదేమో !...

ఒక మిత్రుడు నన్ను అడిగాడు....

వేదాలను మించిన శాస్త్రం లేదు.

 శ్లోకం:☝️

*నాస్తి వేదాత్పరం శాస్త్రం*

 *నాస్తి మాతుః పరో గురుః ।*

*నాస్తి దానాత్పరం మిత్రం*

 *ఇహ లోకే పరత్ర చ ll*

    అత్రిస్మృతిః - 148


భావం: వేదాలను మించిన శాస్త్రం లేదు. తల్లిని మించిన గురువు లేదు, దానాన్ని మించిన స్నేహితుడు లేడు; ఇహలోకంలోను పరలోకంలో కూడా!

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏 


*గ్రంథం:* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*ఓం బోధయజ్ఞాయనమః*


శ్రీ స్వామిభక్తుడు పగడాల దస్తయ్యగారు,  బురదపాళెం ఇలా చెప్తున్నారు.


ఒకరోజు శ్రీస్వామివారు చెప్పారు, "అయ్యానేను అరణ్యంలో మంచి ఆకలితో వస్తున్నాను, ఒకచోట పెద్దామె చద్దియన్నం మూటలు పెట్టుకొని వాళ్ళ ఇలాక మనుషుల కొఱకు ఎదరుచూస్తుంది. నన్ను చూడగానే ఆమె ఆప్రక్కనున్న చెట్టు చాటుకు వెళ్ళింది. నేను మంచి ఆకలితో వున్నాను. కనుక ఒక చద్దిమూట తీసుకొని ప్రక్కనున్న నది ఒడ్డున తినేందుకు వెళ్ళాను. చద్దిమూట విప్పి చేతిలో వుంచుకొని తినేందుకు కలుపబోతున్నాను.


 బ్రహ్మాండముగా గాలి, వాన, ఉరుములు వచ్చి ఆ అన్నమంతా నేలపాలైపోయింది. నేను తినేందుకు ప్రాప్తం లేకుండా పోయింది." ఆనదిలో నీరు త్రాగి ఆకలి తీర్చుకోవలసి వచ్చింది. ఆచద్దిమూటను అడగకుండా, ఆమెకు చెప్పకుండా తీసుకొన్న ఫలితమే ఇలా అయినది". అని సెలవిచ్చారు. ఇది మనందరికీ ఒక చక్కని పాఠమే. *మన అవసరం ఎంత బలీయంగా వున్నా అనుమతి లేనిదే ఇతరుల వస్తువును మనం తాకరాదని అలా తీసుకొన్నా అది మనకు దక్కదని శ్రీ స్వామివారు ఈ లీలద్వారా బోధిస్తున్నారు.*


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*ఓం సమర్ధ సద్గురు శ్రీ సాయినాథాయ నమః*

*శ్రీ సాయి లీలామృతము: అధ్యాయము 28*

అలానే దాసగణు ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లామ్ పూర్కర్ అనే వృద్ధ బ్రాహ్మణుడైన సాధుపుంగవుని దర్శించి, "శ్రోత్రియుడనైన నేను సాయిని దర్శించవచ్చా?" అన్నాడు. "దర్శించవచ్చు. నేను గూడ వారిని దర్శించి 3 రోజులు వారి సన్నిధిలో వున్నాను. ఆయనెంతటివారో ప్రజలు తెలుసుకోవడం లేదు. ముందు ముందు వారి గొప్పతనము ప్రజలు తెలుసుకొంటారు" అన్నారు.

*రచన: ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఏదైనా మనము చాలా కష్టం పడుచున్నాము అనే భావన ఉన్న వారు ఒక్కసారి మిళారేప చరిత్ర ను చదివిన/విన్నా ముక్తి మార్గము గురు సేవ ఇలాంటివి మనలో  మాటల రూపం లో ఉన్న వా లేక చేతల రూపం దాల్చినవా అని స్పష్టం అవుతుంది.. శాశ్విత ఆనందం పొందే దానిలో మన మనసు ఎంత శిక్షణ పొందు తుందో అర్ధం అవుతుంది...

జై సాయి మాస్టర్🙏🙏🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


  కొద్ది నిమిషాలలో అమ్మ నన్ను పిలిపించారు. నేను వెళ్ళి నమస్కరించగా ఆమె ప్రేమగా నా కళ్ళలోకి చూస్తూ, నా చేతిలో రవ్వకేసరి ప్రసాదం వేసారు. అంతటితో నా కర్తవ్యం స్పష్టమై మనసులో బరువు కొంత తగ్గింది. ప్రసాదం కళ్ళకద్దుకుని అమ్మకు సెలవు చెప్పుకుని వెనుకకు తిరుగగానే ఆమె హిందీలో, "ఏమయ్యా! నీకు కావలసిందేమిటి?" అని మరుక్షణమే తన మాట సర్దుకుంటూ, “నీకేం కావాలి?" అన్నారు. ముక్తి లేక జ్ఞానము కావాలని కోరితే ఆమె ఆశీర్వదిస్తారు. కాని అది ఫలించేది ఎన్నడో ఎవరికి తెలుసు? అనుకుని, నేనామెను మరల దర్శించుకోలేను గదా! అని గుర్తురాగానే నేను వెనక్కు తిరిగి, 'అమ్మా, మీ దర్శనం నాకు మరొక్కసారి కావాలి' అన్నాను. అమ్మ ఒక్క క్షణం ఆలోచనగా నాకేసి చూచి, 'మంచిది, అలాగే లభిస్తుందిలే పో!' అన్నారు. నేను వెంటనే బయల్దేరి స్టేషనుకు వెళ్తున్న మరికొందరితో కలసి బండిలో రైల్వేస్టేషను చేరుకున్నాను.

  

*********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

విద్యారంభంలో

 శ్లోకం:☝️

*నమామి శారదాం దేవిం*

  *విద్యారమ్భే సుమంగళాం ।*

*నరస్తస్యాః ప్రసాదేన*

  *పాండిత్యం లభతే సదా ।।*


భావం: విద్యారంభంలో సరస్వతీ దేవికి నమస్కరిస్తున్నాను, ఎందుకంటే మనిషి ఎల్లప్పుడూ ఆమె ఆశీర్వాదంతోనే జ్ఞానవంతుడు అవుతాడు.🙏

సూక్తిసుధ

 .

                 _*సూక్తిసుధ*_



*ఒక దోషము చేత మరియొక దోషములు గలుగునవి:*

 

కామముచేత వ్రతనాశము, కోపము చేత జీవహింసయును, లోభముచేత దొంగతనమును, వంచనచేత అసత్యమును, శౌర్యముచేత భయమును, అజ్ఞానముచేత అవివేకమును, దుష్టత్వముచేత శత్రుత్వమును, సాహసముచేత ప్రాణభయమును, గర్వముచేత అపజయమును వల్లని పనివలన అపాయము, చెడు పనివలన అపకీర్తియును సిద్ధముగా వచ్చును.

జన్మరహితుడను

 [01/04, 9:46 pm] +91 99496 97763: *"బువ్వ కొద్దీ బుద్ధి!!"*


_పూర్వం ఒక శివభక్తుడు కాశీ నడిచి వెళుతూ, ప్రతీరోజు చీకటి పడేటప్పటికి దగ్గర్లోని గ్రామంలో ఎవరో ఒక గృహస్తు ఇంట ఆశ్రయం సంపాదించి అతిధిగా ఉండేవాడు._ 


అలాగే ఒకరాత్రి ఒక గ్రామంలోని ఇంట ఆశ్రయం సంపాదించాడు.


ఆ రాత్రి ఆ ఇంట భోజనం చేసి పడుకున్న శివభక్తుడికి, ఆ ఇంటి ముందు కట్టి ఉన్న 'ఆవు' కనిపించింది. 

ఆ ఆవుని దొంగతనంగా తీసుకుపోవాలనే ఆలోచన ఆ భక్తుడికి కలిగింది. 

ఇంట్లోని వారందరూ నిద్ర పోగానే, ఏ మాత్రం చప్పుడు లేకుండా, ఆవుని తీసుకుని బయలుదేరాడు. 

ఉదయానికి ఆవుతో సహా ఒక చెరువు వద్దకు చేరుకుని, అక్కడ ఆవుని కట్టి, కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసాడు...

అప్పుడు అతనికి రాత్రి తాను చేసిన పాపపు పని గుర్తుకు వచ్చింది. 

వెంటనే పశ్చాత్తాప పడుతూ, ఆ ఆవును తీసుకుని ఆ గ్రామంచేరి, ఆవును ఆ ఇంటి యజమానికి అప్పగించి "అయ్యా, నన్ను క్షమించండి, ఆవును దొంగలించాలన్న దుర్భుద్ది ఎలా కలిగిందో  నాకు అర్ధం కాలేదు. 


ఉదయం కాలకృత్యాలు తరువాత నాపని నాకే చాలా సిగ్గుగా అనిపించింది" అన్నాడు.

ఆ ఇంటి యజమాని శివభక్తుడికి నమస్కారించి "అయ్యా! అది మీ తప్పు కాదు, నేను ఒక దొంగను, రాత్రి మీరు తిన్నది నేను దొంగలించి తెచ్చిన డబ్బుతో తయారుచేసిన భోజనం. 

దాని ప్రభావంతో మీకు దొంగ బుద్ధి కలిగింది.

కాలకృత్యాల తరువాత దాని ప్రభావం మీలో పూర్తిగా పోయింది, అందువల్ల ఆవును తిరిగి తీసుకువచ్చారు" అన్నాడు. 


అప్పుడు శివభక్తుడు సంతోషించి, అక్కడి నుండి బయలుదేరాడు. 


_ఆందుకే ... వంట చేసే ముందు కావలసినవి..._

పాత్ర శుద్ధి,

పాక శుద్ధి,

భావ శుద్ధి

ఇదంతా అయ్యాక , బగ్వద్ అర్పితం వుండాలి, అప్పుడే ఆ పదార్థము ప్రసాదంగా మారుతుంది ...

మనం తినే ఆహారాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుందని...


ఎట్టి ఆహారమో - అట్టి ప్రవర్తన,

ఎట్టి ప్రవర్తనో అట్టి - అట్టి జీవితం,

ఎట్టి జీవితమో - అట్టి మోక్ష సాధన...

[02/04, 8:19 am] +91 93911 85608: 🙏💐🌹🙌 Establishment of Supreme Court Bench in AP for South India is our main aim 🙌🌹💐👍


🌹భగవద్గీత🌹


నాల్గవ అధ్యాయము. జ్ఞాన , కర్మ , సన్న్యాస యోగము నుండి 6వ శ్లోకo పదచ్ఛేద , టీకా , తాత్పర్య సహితముగా


అజోఽపి సన్నవ్యయాత్మా

భూతానామీశ్వరోఽపి సన్ ౹

ప్రకృతిం స్వామధిష్ఠాయ

సంభవామ్యాత్మమాయయా ౹౹(6)


అజః , అపి , సన్ , అవ్యయాత్మా , 

భూతానామ్ , ఈశ్వరః , అపి , సన్ ౹

ప్రకృతిమ్ , స్వామ్ , అధిష్ఠాయ , 

సంభవామి , ఆత్మమాయయా ll(6)    


(అహమ్) = నేను ;

అజః = జన్మరహితుడను ;

అవ్యయాత్మా = శాశ్వతుడను ;

సన్ , అపి = ఐనప్పటికిని ;

భూతానామ్ = సమస్తప్రాణులకు ;

ఈశ్వరః , సన్ , అపి =  ఈశ్వరుడను ఐనప్పటికిని ;

స్వామ్ , ప్రకృతిమ్ = నా ప్రకృతిని ;

అధిష్ఠాయ = ఆధీనములో ఉంచుకొని ;

ఆత్మమాయయా = నా యోగమాయచే ;

సంభవామి = అవతరించు చుందును .


తాత్పర్యము :- నేను జన్మరహితుడను , నిత్యుడను , సమస్త ప్రాణులకును ఈశ్వరుడను, అయినను నా ప్రకృతిని ఆధీనములో నుంచుకొని, నా యోగ మాయచే అవతరించు చుందును. (6)

 

      

తండ్రే ధర్మం,

 .


               _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝 

*పితాధర్మః పితాస్వర్గః* 

*పితాహి పరమం తపః౹

*పితరి ప్రీతిమాపన్నే*

*ప్రీయన్తో సర్వదేవతాః॥*


*భావం:*

తండ్రే ధర్మం, తండ్రే స్వర్గం, తండ్రే తపస్సు తనకు అనుకూలంగా నడుచు కుంటున్న కొడుకు పట్ల తండ్రి గనుక సంతుష్టుడైతే సకల దేవతలూ సంతృప్తులు అవుతారట.....ధర్మమూర్తి అయిన తండ్రికి సేవ చేస్తే ఇహలోకంలో కీర్తి, ఆనక మోక్షం సిద్ధిస్తాయని ఈ పురాణమే మరో చోట చెప్పింది....  *బిడ్డకు ఏది, ఎంత, ఎప్పుడు, ఎలా ఇవ్వాలో, వేటిని ఇవ్వకూడదో క్షుణ్ణంగా తెలిసిన వాడు తండ్రి*... *అతడి హృదయం లోతైనది....మాట కటువు, మనసు వెన్న సున్నితం*....