2, ఏప్రిల్ 2023, ఆదివారం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏 


*గ్రంథం:* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*ఓం బోధయజ్ఞాయనమః*


శ్రీ స్వామిభక్తుడు పగడాల దస్తయ్యగారు,  బురదపాళెం ఇలా చెప్తున్నారు.


ఒకరోజు శ్రీస్వామివారు చెప్పారు, "అయ్యానేను అరణ్యంలో మంచి ఆకలితో వస్తున్నాను, ఒకచోట పెద్దామె చద్దియన్నం మూటలు పెట్టుకొని వాళ్ళ ఇలాక మనుషుల కొఱకు ఎదరుచూస్తుంది. నన్ను చూడగానే ఆమె ఆప్రక్కనున్న చెట్టు చాటుకు వెళ్ళింది. నేను మంచి ఆకలితో వున్నాను. కనుక ఒక చద్దిమూట తీసుకొని ప్రక్కనున్న నది ఒడ్డున తినేందుకు వెళ్ళాను. చద్దిమూట విప్పి చేతిలో వుంచుకొని తినేందుకు కలుపబోతున్నాను.


 బ్రహ్మాండముగా గాలి, వాన, ఉరుములు వచ్చి ఆ అన్నమంతా నేలపాలైపోయింది. నేను తినేందుకు ప్రాప్తం లేకుండా పోయింది." ఆనదిలో నీరు త్రాగి ఆకలి తీర్చుకోవలసి వచ్చింది. ఆచద్దిమూటను అడగకుండా, ఆమెకు చెప్పకుండా తీసుకొన్న ఫలితమే ఇలా అయినది". అని సెలవిచ్చారు. ఇది మనందరికీ ఒక చక్కని పాఠమే. *మన అవసరం ఎంత బలీయంగా వున్నా అనుమతి లేనిదే ఇతరుల వస్తువును మనం తాకరాదని అలా తీసుకొన్నా అది మనకు దక్కదని శ్రీ స్వామివారు ఈ లీలద్వారా బోధిస్తున్నారు.*


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*ఓం సమర్ధ సద్గురు శ్రీ సాయినాథాయ నమః*

*శ్రీ సాయి లీలామృతము: అధ్యాయము 28*

అలానే దాసగణు ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లామ్ పూర్కర్ అనే వృద్ధ బ్రాహ్మణుడైన సాధుపుంగవుని దర్శించి, "శ్రోత్రియుడనైన నేను సాయిని దర్శించవచ్చా?" అన్నాడు. "దర్శించవచ్చు. నేను గూడ వారిని దర్శించి 3 రోజులు వారి సన్నిధిలో వున్నాను. ఆయనెంతటివారో ప్రజలు తెలుసుకోవడం లేదు. ముందు ముందు వారి గొప్పతనము ప్రజలు తెలుసుకొంటారు" అన్నారు.

*రచన: ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఏదైనా మనము చాలా కష్టం పడుచున్నాము అనే భావన ఉన్న వారు ఒక్కసారి మిళారేప చరిత్ర ను చదివిన/విన్నా ముక్తి మార్గము గురు సేవ ఇలాంటివి మనలో  మాటల రూపం లో ఉన్న వా లేక చేతల రూపం దాల్చినవా అని స్పష్టం అవుతుంది.. శాశ్విత ఆనందం పొందే దానిలో మన మనసు ఎంత శిక్షణ పొందు తుందో అర్ధం అవుతుంది...

జై సాయి మాస్టర్🙏🙏🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


  కొద్ది నిమిషాలలో అమ్మ నన్ను పిలిపించారు. నేను వెళ్ళి నమస్కరించగా ఆమె ప్రేమగా నా కళ్ళలోకి చూస్తూ, నా చేతిలో రవ్వకేసరి ప్రసాదం వేసారు. అంతటితో నా కర్తవ్యం స్పష్టమై మనసులో బరువు కొంత తగ్గింది. ప్రసాదం కళ్ళకద్దుకుని అమ్మకు సెలవు చెప్పుకుని వెనుకకు తిరుగగానే ఆమె హిందీలో, "ఏమయ్యా! నీకు కావలసిందేమిటి?" అని మరుక్షణమే తన మాట సర్దుకుంటూ, “నీకేం కావాలి?" అన్నారు. ముక్తి లేక జ్ఞానము కావాలని కోరితే ఆమె ఆశీర్వదిస్తారు. కాని అది ఫలించేది ఎన్నడో ఎవరికి తెలుసు? అనుకుని, నేనామెను మరల దర్శించుకోలేను గదా! అని గుర్తురాగానే నేను వెనక్కు తిరిగి, 'అమ్మా, మీ దర్శనం నాకు మరొక్కసారి కావాలి' అన్నాను. అమ్మ ఒక్క క్షణం ఆలోచనగా నాకేసి చూచి, 'మంచిది, అలాగే లభిస్తుందిలే పో!' అన్నారు. నేను వెంటనే బయల్దేరి స్టేషనుకు వెళ్తున్న మరికొందరితో కలసి బండిలో రైల్వేస్టేషను చేరుకున్నాను.

  

*********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

కామెంట్‌లు లేవు: