4, ఏప్రిల్ 2023, మంగళవారం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏


*గ్రంథం:* నమ్మిన వారికి సొమ్ము - నమ్మకుంటే (వారి ప్రారబ్దం),  భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*చీటీల ద్వారా శ్రీ స్వామి పలకడం* 


గొర్తి సాయిశివ (స్విట్జర్లాండ్) తన అనుభవాన్ని  ఇలా తెలుపుతున్నారు:


1999వ సంవత్సరంలో పాల్వంచ ఆడమ్స్ కాలేజీలో ఇంజనీరింగ్ సీటు వచ్చాక మా నాన్నగారి మ్రొక్కుబడి ప్రకారం కృతజ్ఞతలు తెలుపుకొని, మూడు నిద్రలు చేయటానికై గొలగమూడి శ్రీ వెంకయ్యస్వామి సన్నిధికి వచ్చాము. స్వామి సన్నిధిలో శ్రీ సుబ్బరామయ్య సార్ సత్సంగంలో మూడు రోజులు గడిచిపోయాయి. ఇక యింటికి బయలుదేరుతూ సుబ్బరామయ్య సారికి నమస్కరించి సెలవు తీసుకుందామని వెళ్ళాము. నేను మనస్సులో శ్రీ వెంకయ్యస్వామిని సార్ ద్వారా సందేశం యిప్పించమని ప్రార్థించాను. సార్ అప్పుడు చెప్పిన మాటలు: *"వెంకయ్య స్వామి నీకు సీటు యిప్పించారు, చదువుకొనే అవకాశం కలిగించారు. కనుక ఆ పనిని టాప్ మోస్ట్ గా, క్షుణ్ణంగా, ఆయనను మెప్పించేంతగా చేయటమే ఆయన సేవ అని"*.


 ఆ తర్వాత ఉత్తరాల ద్వారా విద్యార్ధి లక్షణాలు తెలియచేస్తూ, నిజమైన బాబా సేవ అంటే విద్యార్థిగా నేను చేయవలసినదేమిటో తెలియచేయటమే కాక, ఆ విధంగా చేసేందుకు తగిన శక్తినీ, ఉన్ముఖతనూ కలుగచేసి *సార్ ద్వారా శ్రీ వెంకయ్యస్వామి నా జీవితంలో, దృక్పథంలో ఎంతో మార్పు తీసుకు వచ్చారు.* అందువల్లనే ' గేట్' పరీక్షలో మంచి ర్యాంకు వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్సి, బెంగుళూరు)లో మాస్టర్స్ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) చేసే అవకాశం కలిగింది. అది కేవలం శ్రీ స్వామివారి భిక్షే. లేకుంటే ఇంటర్వ్యూలో కూడా వెంకయ్య స్వామి, సాయిబాబా, భరద్వాజ మాష్టారు మొ॥ మహాత్ముల ప్రస్తావన రావటమేమిటి? వారి గురించి, వారు చెప్పిన నియమాలు గురించి అంతసేపు ఇంటర్వ్యూ బోర్డు వారు వినటం, ప్రశ్నించటం ఏమిటి? దీని ద్వారా ఐ.ఐ.ఎస్సి లో కూడా సీటు ఇప్పించినది వారేనని బల్లగుద్ది చెప్పటం కాదూ?


 మొదటి సెమిస్టర్ పూర్తయింది. అప్పుడు. కూడా ఒకటే ధ్యేయం! సార్ మాటలు తరచూ చెవుల్లో మారు మ్రోగుతూ ఉండేవి. *టాప్ మోస్ట్ గా ఆయన ఇచ్చిన పనిని నిర్వర్తించాలి. ఎవ్వరూ చేయలేనంతగా! మన ప్రయత్నం మనం చేస్తే కొండంత అండగా స్వామి నిలుస్తారు. మనకు సరైన మార్గదర్శకం చూపిస్తారు అని.* మొదటి సెమిస్టరు ఫలితాలలో అన్ని సబ్జెక్టులలో టాప్ గ్రేడ్ వచ్చింది. అప్పుడు మా గైడ్ అడిగిన ప్రశ్న. 'నువ్వు కావాలనుకుంటే ఇప్పుడు డైరెక్టుగా పిహెచ్.డికి నీ రిజిస్ట్రేషన్ని అప్లోడ్ చేసుకోవచ్చును. అలా చేస్తే నువ్వు పూర్తి చేసిన సెమిస్టర్ కూడా నీ పిహెచ్.డి.లోకి జమ చేయబడుతుంది. ఇంకొక మూడు, నాలుగు సంవత్సరాలలో డైరెక్ట్ పిహెచ్.డి. డిగ్రీ వస్తుంది. నీ నిర్ణయం ఏమిటో చెప్పు' అని


అప్పటికి బాబా నా చిన్నప్పటి నుండీ ప్రసాదించిన అనుభవాల దృష్ట్యా మరియు సుబ్బరామయ్య సార్ సత్సంగాల వల్ల దృఢంగా ఏర్పడిన భావం - *ఏ విషయంలోనైనా గురువు మీద ఆధారపడాలని!* అందునా ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవటానికి నా పరిమితమైన విచక్షణకో, ఇష్టాయిష్టాలకో చోటివ్వక భగవంతుని ఆజ్ఞానుసారం, ఆయన మార్గదర్శకత్వాన్ని పొంది, ఆయన నిర్ణయానికి సంతోషంగా తలవొగ్గడంలోనే నా మరియు అందరి శ్రేయస్సు వుంటుంది అని. మరుసటి మారు గొలగమూడి వెళ్ళినప్పుడు సార్ కి నా పరిస్థితి మరియు నాకు ఉన్న ఆలోచనలు వివరించాను. నా ఆలోచనలు ఇవి:


(1) పిహెచ్.డి.కి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అప్ గ్రేడ్ చేయించుకోవటం.


(2) మాస్టర్స్ పూర్తి చేసి డిగ్రీ వచ్చాక విదేశాలలో ఇంకా మంచి యూనివర్శిటీలో పిహెచ్.డి. చేయటం


(3) మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత, ఇక్కడే ఇండియాలోనే మా గైడ్ వద్దనే పిహెచ్.డి. చేయటం


మొదటి ఆప్షన్లో అయితే మూడు సంవత్సరాలు కలిసి వస్తాయి. తక్కువ వయస్సులోనే పిహెచ్.డి వచ్చేస్తుంది. రెండవ ఆప్షన్లో ఎక్స్పీరియన్స్ మరియు క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ బాగుంటాయి. మూడవ ఆప్షన్ అయితే ఏ కారణం వల్లనైనా పిహెచ్.డి డిగ్రీ రాకపోయినా, కనీసం మాస్టర్స్ డిగ్రీ అయినా చేతిలో వుంటుంది అని.


సార్ సమాధానం: "ఇటువంటి విషయాలలో మన సొంత తెలివితేటలతో తర్కించుకోవటం కాక, *'స్వామీ! నాకు ఏది మంచిదో అది నువ్వే చెప్పు నాకు తెలియదు' అని హృదయపూర్వకంగా ప్రార్థించి ఆయన సందేశం తీసుకో" (స్వామి సమాధిమీద చీట్లు వేసి ఏది వస్తే అది చేయి - అని ఈ సందర్భంలో స్వామి సందేశం పొందేందుకు ఒక మార్గం సూచించారు)* ఆ విధంగా స్వామిని ప్రార్థించుకొని వారి సందేశం కోరగా 'అబ్రాడ్ (విదేశ) యునివర్శీటీలో పి.హెచ్.డి చేయి' అని స్వామి ఆజ్ఞాపించారు! అలాగే స్విట్జర్లాండ్లో ప్.హెచ్.డి. పూర్తి చేయించారు. నమ్మిన వారికి స్వామి వారు పిలిచిన పలికే దైవం.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


   ఇలా కొద్దికాలం గడిచాక ఒకనాడు హైదరాబాద్ లో నా దగ్గర చదువుకున్న ఒక పాత విద్యార్థి వచ్చి తాను గృహస్థుడుగా పూనేలో వుంటున్నానని, శిరిడీ వచ్చినప్పుడు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని ఎంతో ప్రేమతో ఆహ్వానించాడు. నిజానికి నేనా రోజులలో ఏ స్నేహితులను, బంధువులను, చివరకు విజయవాడలో ఒంటరిగా వుంటున్న మా తండ్రిగారిని గూడ చూడటానికి వెళ్ళేవాడినికాను. కారణం ఏనాటికైనా సన్యసించి దేశమంతా సంచరించాలని, చివరకు ఎక్కడో ఏకాంత స్థలంలో భగవత్ ధ్యానం చేస్తూ జీవితశేషం గడిపి ప్రశాంతంగా శరీరం విడిచిపెట్టడం ఒక్కటే నా ధ్యేయంగా వుండేది. కానీ అదంతా ఆ పాత విద్యార్థితో ఏకరువు పెట్టి ఎప్పుడో గాని మరలా కలసుకోని అతని ఆత్మీయతను, ఆదరణను కించపరచదల్చక అతడితో మొహమాటానికి మాత్రమే పూనా వస్తానని చెప్పాను. 

    

*********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

సూర్య నమస్కారం

 సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు... ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం...


1.నమస్కారాసనం ( ఓం మిత్రాయ నమ ):-

సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.


2.హస్త ఉత్తానాసనం ( ఓం రవయే నమః) :-

కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.


3.పాదహస్తాసనం ( ఓం సూర్యాయ నమః) :-

శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.


4.ఆంజనేయాసనం ( ఓం భానవే నమ ) :-

ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.


5.పర్వతాసనం ( ఓం ఖగాయ నమః) :-

కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.


6.సాష్టాంగ నమస్కారం ( ఓం పూష్ణే నమః) :-

ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం - ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.


7.సర్పాసనం ( ఓం హిరణ్యగర్భాయ నమః ) :-

శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.


8.పర్వతాసనం ( ఓం మరీచయే నమః) :-

ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.


9.ఆంజనేయాసనం ( ఓం ఆదిత్యాయ నమః) :-

నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి


10.పాదహస్తాసనం ( ఓం సవిత్రే నమః) :-

మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.


11.హస్త ఉత్తానాసనం ( ఓం అర్కాయ నమః) :-

రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.


12.నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః) :-

నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.

సూక్తిసుధ

 : .

                 _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝


*శిక్షాక్షయం గచ్ఛతి కాలపర్యయాత్*

*సుబద్ధమూలా నిపతన్తి పాదపాః |*

*జలం జలస్థానగతం చశుష్యతి*

*హుతం చ దత్తం చ తథైవ తిష్ఠతి॥*


తా||

*కాలం అనేది గడుస్తూ వుంటే నేర్చుకున్న విద్యలన్నీ మరుపుచే మరుగున పడిపోతాయి. భూమి లోతుల్లోకి అతిదృఢంగా పాతుకుపోయిన మొదళ్లు ఉన్నా చెట్లు కూలిపోతాయి. చెరువుల్లోని నీరూ ఎండిపోతుంది. కానీ, చేసిన యజ్ఞాలూ, దానాలూ మంచి పనులుగా, పుణ్యకర్మలుగా శాశ్వతంగా లోకంలో నిలిచిపోతాయి*.


                  _*సూక్తిసుధ*_


*అపూర్వమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్౹*

*తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ॥*

                      ~శ్రీమద్భగవద్గీత


తా॥ 

సమస్తదిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదిలన్నియును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగనే అందులో లీనమగును అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు.

కూపస్థమణ్డూకం

 శ్లోకం:☝️కూపస్థమణ్డూకం

*మణ్డూకః కూపమణ్డూకః*

  *సీమానో యస్య సీమితాః |*

*పరచక్రగతప్రాణీ*

  *నరో బద్ధస్తథైవ చ ||*


భావం: కప్ప తన సరిహద్దులు తానుంటున్న బావికి పరిమితం అయినప్పుడు దాని లోకము, విజ్ఞానము కుడా ఆ మేరకే పరిమితం అవుతాయి. అలాగే వేరొకరు గీసిన చట్రాన్ని అంగీకరించే మానవజాతికి ఇలాంటిదే జరుగుతుంది!

విభూది మహిమ


      *🙏విభూది మహిమ 🙏*         


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌸దుర్వాస మహర్షి నిత్యం పరమశివుని  మనసులో ధ్యానించి, విభూది ధరించి

నిత్యానుష్టానాలను ఆరంభించేవాడు.


🌿ఒకనాడు ఉదయాన విభూది ధరించి పితృలోకానికి బయల్దేరాడు దుర్వాస

మహర్షి. మార్గం మధ్యంలో హఠాత్తుగా ఒక బావి కనిపించింది. గతంలో ఎన్నడూ 

ఆ మార్గంలో ఏ బావి కనపడేదికాదు.


🌸ఆ బావిలోయేమి వున్నదో అని  ఉత్కంఠ తతో తొంగి చుశాడు మహర్షి. ఆ బావిలో పాపాత్ములు చాలామంది బంధించబడివున్నారు. ఈ లోకాన పాపాలు చేసినవారు అందరూ ఆ నరక కూపంలో త్రోసివేయబడి వున్నారు.


🌿విషయం గ్రహించి తన పయనం సాగించాడు దుర్వాస మహర్షి. ఇంతలో ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. దుర్వాస మహర్షి తొంగిచూచి వెళ్ళిన వెంటనే ఆ నరక కూపం స్వర్గధామంగా మారింది.


🌸ఆ కూపంలో ఆత్మలకు బాధలు కలిగించిన

విష జంతువులు, సర్పాలు సుగంధ సుమ మాలలుగా మారిపోయాయి. సలసలమరిగే

నీరు సుగంధ పన్నీరుగా మారింది. 

తుఫానులాగ వీచిన ప్రచండ గాలులు

పిల్లతెమ్మరలుగా మారాయి.


🌿ఆ దుర్గంధ భూయిష్ట కూపం సుగంధంగా మారింది. ఇన్ని రోజులు యమయాతన పడిన ఆత్మలు అన్నీ మోక్షాన్ని పొందాయి. ఈ విపరీత పరిణామం చూసి ఆ నరక కూపంలో ఆత్మలను హింసిస్తున్న కింకరులు భయపడి  యమ ధర్మరాజు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు.


🌸నరక కూపం స్వర్గంగా ఎలా మారినదో తెలియని యముడు, వేగంగా వచ్చి 

ఆ కూపాన్ని చూశాడు. స్వర్గం నుండి ఇంద్రుడు కూడా వచ్చి చూసి, ఎలాగ జరిగినదీ తెలియక, విస్మయం చెందాడు. 


🌿ఆశ్చర్యంతో తలమునకలై దేవేంద్రుడు, యముడు కంగారుగా కారణం తెలుసుకుందుకి ఈశ్వరుని వద్దకు వెళ్ళారు. నరక కూపం స్వర్గంగా ఎలా మారినదని ఈశ్వరుని అడిగారు.


🌸త్రికాలజ్ఞుడైన ఈశ్వరునికా నరకం స్వర్గంగా మారిన కారణం తెలియకుండా వుంటుందా? 


🌿పరమ శివభక్తుడైన దుర్వాసమహర్షి  శాస్త్రానుసారం విభూది ధరించి

సదా తనని పూజించేవాడు. ఆయన

అనుకోకుండా ఆ పితృ కూపాన్ని తొంగి చూసినందువలన, ఆయన నుదుటి నుండి ఒక విభూది కణం ఆ నరకకూపంలో పడినది.


🌸ఆ విభూది మహిమ వలన నరక కూపం స్వర్గంగా మారినది." అని వారికి తెలిపాడు  పరమశివుడు.


🌿దుర్వాస మహర్షి నిత్యం, ఉంగరపు వ్రేలు, మధ్యవ్రేలు చూపుడు వ్రేలు ఈ మూడు వ్రేళ్ళను కలిపి 'ఓం'కార మంత్రాన్ని జపిస్తూ (అకార, ఉకార, మకార) నుదుటన విభూదిని ధరించడం నియమంగా కలవాడు. 


🌸ఈ విధంగా నిష్టగా ధరించే విభూది మహిమాన్వితమైనదని మనకి యీ కథ తెలియచేస్తోంది..స్వస్తి..🚩🌹🙏హరే కృష్ణ హరే రామ🙏🚩


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


మొత్తం మాయమైపోయింది...

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

 👉 *సరిగ్గా గుర్తులేదు కానీ* 

 *చాలా కాలం  క్రితం*  


పెరియార్ భావజాలంతో ఉరకలేస్తున్న అక్కడి ఓ ద్రావిడ పార్టీ పెద్దలు హిందూ ద్వేషంతో రగిలిపోతూ, బ్రాహ్మణ విద్వేషంతో  ఓ పనికిమాలిన పనికి నడుంకట్టింది...


అదేమిటంటే.

రాఖీ పూర్ణమి రోజున అందరు బ్రాహ్మణులు కొత్త జంధ్యం మార్చుకునే ఓ ఆనవాయితీని అపహాస్యం చేస్తూ, వచ్చే రాఖీ పూర్ణమి కి పందులకు జంధ్యం వేయబడును అని ప్రకటించి, అందుకు ఓ పెద్ద వేదికను కూడా ప్రకటించి తమ కార్యాచరణను మొదలు పెట్టారు,


దీనిపై బ్రాహ్మణ సంఘాలతో పాటు ఎన్నో హిందూ సంఘాలు కూడా భగ్గుమన్నాయి,


అయినా లెక్కచేయక హిందూ సంఘాలను మరింతగా రెచ్చెగొడుతూ, పందులకు జంధ్యం వేసే కార్యక్రమం నడిపిస్తున్నారు...


ఎంత చెప్పినా వినే స్థితిలో వాళ్ళు లేరు...

ఎన్ని నిరసనలు చేసినా ఫలితం లేదు...


ఇలా సుమారు ఓ రెండు రోజులు గడిచాక దీన్ని ఎలా అడ్డుకోవాలి...??


అని అనేక మంది ఆలోచిస్తుండగా...


అప్పుడు ఓ పెద్దాయన మీడియా ముందుకు వచ్చి,


వాళ్ళు చేస్తున్న దాంట్లో తప్పేమీ లేదు,

దయచేసి ఆ ద్రావిడ పార్టీ వాళ్ళను ఆడ్డుకోకండి,


మా నాన్న గారు నాకు జంధ్యం వేశారు,

నేను నా కొడుక్కి జంధ్యం వేశాను,

నా కొడుకు నా మనవడికి జంధ్యం వేశాడు,


ఇలా ఎవరి సంతానానికి వాళ్ళు జంధ్యం వేయడం సాంప్రదాయమే కదా...??


కాబట్టి దయచేసి వాళ్ళను ఆడ్డుకోకండి అని చెప్పి వెళ్ళిపోయాడు...


అంతే తెల్లవారి నుండి జంధ్యాలు వేసే బ్యాచ్ మొత్తం మాయమైపోయింది...😂😂😂


దీన్నే కుక్కకాటికి చేప్పదెబ్బ అంటారు..తిట్టి అరచి కోపడి అవతల వారి ఈగో satisfy చేయడం ఎందుకు నీ అరుపులకు విలువ లేదు అని వదిలేసి ఇలా కొడితే కుష్మాoడం పగలాలి..

సేకరణ వాట్సాప్ పోస్ట్.

ధూళితో దర్శనం

 *ధూళితో దర్శనం స్పర్శతో పావనం...!!*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


శ్రీగిరి నివాసా... శ్రీశైల వాసా... మల్లన్నా... చేదుకోవయ్యా... దరి జేర్చుకోవయ్యా... కేవలం దర్శన మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే స్వామి.. తనను తాకి తరించే అవకాశం కూడా ఇచ్చాడు.. 


భీకర కీకారణ్యాల్లో, గండరాతి శిలల్లో పంచాక్షరీ మంత్రాన్ని ఊతంగా చేసుకుని,  భక్తిప్రపత్తులనే శక్తిగా మార్చుకుని తరలివచ్చే వారిని అలాగే తన సన్నిధికి ఆహ్వానిస్తాడు మల్లికార్జునుడు. 


శౌచ నియమాలు అక్కర్లేదు, విధివిధానాలు అవసరం లేదు, ‘వచ్చాము నా తండ్రీ’  అనగానే ఒంటికి అంటిన ధూళితోనే నన్ను తాకి తరించండని అనుమతినిస్తాడు, దాన్నే ధూళి దర్శనం అంటారు. 


శ్రీశైలంలో మాత్రమే దొరికే మహద్భాగ్యం, ఉత్కృష్టమైన ఈ అవకాశం ఇక్కడే ఎందుకు ఉంది...??


శ్రీశైల క్షేత్రానికి రవాణా సౌకర్యాలు లేని రోజులవి, దట్టమైన అడవుల్లో, నల్లమల కనుమల్లో ప్రయాణం. 

వందల మైళ్ల దూరం కాలినడకనే వచ్చేవారు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నల్లమల పాదాల వద్దకు చేరుకోగానే నాలుగు ప్రధాన మార్గాలు ఆహ్వానం పలికేవి...


*శిఖరేశ్వరం_మార్గం : 🙏*


తీరాంధ్ర ప్రాంతం నుంచి ప్రజలు శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతకం చేరుకునేవారు.. 


యర్రగొండ పాలెం, వేంకటాద్రి పాలెం, గంజివారిపల్లి, దుద్దనల, నాగూరు మీదుగా తెలగ వారి చెరువు వచ్చేవారు.. కొండ మార్గంలో చింతల, పెద్ద ఆరుట్ల,, చిన్న ఆరుట్ల దాటి శిఖరేశ్వరం లో వీర శంకరస్వామిని సేవించుకునేవారు. 


అక్కడి నుంచి ముందుకు వెళ్లలేని వారు నంది కొమ్ముల నుంచి ఆలయాన్ని దర్శించుకుని వెనుతిరిగేవారు..

అందువల్లనే శ్రీశైల శిఖరం దర్శించినంతనే పునర్జన్మ ఉండదనే భావన ప్రచారం చెందినట్లు చెప్పొచ్చు...



*భీమునికొలను_మార్గం : 🙏*


రాయలసీమ నుంచి వచ్చే భక్తులు శ్రీశైలం దక్షిణ ద్వారమైన సిద్ధవటం నుంచి.., మరికొందరు పశ్చిమ ద్వారమైన అలంపురం నుంచి బయలుదేరి నంద్యాల, ఆత్మకూరు, కృష్ణాపురం, వెంకటాపురం,  సిద్దాపురం మీదుగా నాగలూటి వచ్చేవారు. 


 భీముని కొలను ద్వారా  కైలాస ద్వారం చేరుకొని ఆలయాన్ని చేరుకుని స్వామిని దర్శించేవారు.  ఇది ఆ రోజుల్లో అత్యంత ప్రసిద్ధిచెందిన మార్గం.

  


     *నీలిగంగ_మార్గం : 🙏*


నాగర్‌ కర్నూల్‌,  అమ్రాబాద్‌, తెలకపల్లి  మీదుగా ప్రయాణం చేసే తెలంగాణ ప్రాంత ప్రజలు మొదట శ్రీశైల ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన ఉమామహేశ్వరం చేరుకునేవారు..


అటవీ ప్రాంతంలో అప్పాపురం, భ్రమరాంబ చెరువు, మేడిమాకుల, సంగడిగుండల మీదుగా నీలిగంగరేవుకు వచ్చేవారు. అక్కడ తెప్పల ద్వారా కృష్ణా నదిని దాటి చుక్కల పర్వతాన్ని ఎక్కి శ్రీశైలం చేరుకొని స్వామిని దర్శించేవారు.

  


*జాతరరేవు_మార్గం : 🙏*


ఇది కూడా ఉమామహేశ్వరం నుంచే ప్రారంభ మవుతుంది.  భ్రమరాంబ చెరువు,  మేడిమాకుల చేరుకొని అక్కడ నుంచి అక్కగని వద్దకు వచ్చి  కృష్ణా తీరంలోని జాతర రేవును దాటుకొని చుక్కల పర్వతాన్ని ఎక్కి శ్రీశైలం చేరుకునేవారు..


ఈ ప్రయాణం అత్యంత కఠినమైంది కాబట్టే సాధారణ ఆలయాల్లో ఉండే విధి విధానాలు ఇక్కడ పాటించనవసరం లేదు. 


సాధారణంగా దైవ దర్శనానికి శుచీ శుభ్రతలను పాటిస్తూ వెళ్ళడం ఆచారం.. అటువంటివి ఏమీ లేకుండా ఈ క్షేత్రానికి చేరుకుని ఆతృతగా స్వామి వారి వద్దకు వెళ్లి తమ ఆత్మీయులను ఆలింగనం చేసుకుని పలకరించినట్టుగా స్వామి వారిని తాకి, దర్శించే ఆచారం ఏర్పడింది..


వందలాది మైళ్లు కాలినడకన ప్రయాణిస్తూ మార్గమధ్యంలో  క్రూర జంతువుల నుంచి, అటవికుల నుంచి తమను తాము  కాపాడుకుంటూ... ‘చేర్చుకో మల్లన్న... దరి చేర్చుకో మల్లన్న’ అంటూ స్వామి వారిని ప్రార్థిస్తూ క్షేత్రానికి చేరుకొని ముందుగా స్వామిని స్పర్శించి దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం.


అంతేకాకుండా మార్గమంతా తమతో పాటే ఉండి, రక్షించి తన వద్దకు చేర్చుకున్నందుకు కృతజ్ఞతతో, ఉద్వేగంతో శ్రీశైలం చేరుకున్న వెనువెంటనే వెళ్లి మల్లికార్జునుడిని దర్శించుకునే వారు. 


అందువల్లనే ఈ విధమైన ఆచారం ఏర్పడినట్లు చెప్పవచ్చు.  మరే క్షేత్రంలోనూ ఇలాంటి అవకాశం లేదు...



*నాలుగు యుగాల్లో...🙏*


శ్రీశైల క్షేత్ర మహాత్మ్యం ఈనాటిది కాదు. యుగయుగాల నుంచి  ఎందరో మహానుభావులు ఇక్కడ మల్లికార్జున స్వామిని దర్శించి సేవించినట్లు చెబుతారు. శ్రీశైల ఖండంతో పాటు, వివిధ పురాణాల్లోనూ ఈ విశేషాలున్నాయి...



*కృతయుగం...🙏*


బ్రహ్మ దేవుడు శ్రీశైలంలో తపస్సు చేసి పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకొన్నారు. 

దక్ష సంహారం సమయంలో వీరభద్రుడు తాండవం చేసింది ఇక్కడే, అందుకు నిదర్శనంగా శ్రీశైలం క్షేత్ర పాలకునిగా వీరభద్రస్వామి కనిపిస్తాడు.

పరమ భక్తుడైన నందీశ్వరుడికి ముక్తిని కల్పించిన ప్రాంతంగా ఈ వనాలను చెబుతారు.


*త్రేతాయుగం 🙏*


బ్రహ్మ హత్య దోషాన్ని పోగొట్టుకొనేందుకు శ్రీరామచంద్రమూర్తి శ్రీశైలాన్ని  దర్శించారు. 

స్వయంగా శ్రీరాముల వారు ప్రతిష్టించిన సహస్ర లింగేశ్వరుని ఇప్పటికీ ప్రధాన ఆలయం ముందు భాగంలో చూడవచ్చు.



*ద్వాపర యుగం 🙏*


పంచ పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించుకొన్నారు. 

ఒక్కొక్కరూ ఒక్కో లింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు, ఇప్పటికీ ప్రధాన ఆలయం వెనుక భాగంలో ఈ గుడులు కనిపిస్తాయి.


*కలియుగం 🙏*


జగద్గురు ఆది శంకరాచార్యుల వారి సాధనలకు నిలయంగా నిలిచిందీ దివ్యక్షేత్రం.. ఆయన ఇక్కడే సౌందర్యలహరి రచించారు...


స్వస్తీ...🙏🙏🙏


ఓం నమఃశివాయ...హరహర మహాదేవ...🌹🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿