16, ఏప్రిల్ 2022, శనివారం

అంకుల్స్ బ్యాచ్

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

    *🌷35+ అంకుల్స్ బ్యాచ్🌷*            

               🌷🌷🌷

ఈ 35ఏళ్ల వయసుంది చూశారూ.. అదికచ్చితంగా మగాళ్లకు చాలా క్లిష్టమైన వయసు... 👨 

అప్పటికి ఇంకా మనం నిత్యయవ్వనులం అనే ఫీలింగ్ లో, ఇంకా అమ్మాయిలకు లైన్ వేసే వయసే అనే "ఫిలాసఫీలో" బతికేస్తుంటాం కదా.. 

🤗కుర్ర వయసు దాటి నడివయసుకు వచ్చామని మన మస్తిష్కం ఇంకా ప్రిపేర్ అయిఉండక పోవడం, ఉడుకురక్తం, ఉక్కు నరాలు అనే ఫీలింగ్ నుంచి బయట పడకపోవడం వల్ల ఉత్సాహం ఉరకలేసే వయసులోనే ఉన్నట్టుగా బతికేస్తుంటాం..☺ 


కానీ ఈ "బర్త్ డే "అనేది ఒకటుంది కదా 🎉🎂 అది నువ్వు పెద్దోడివి అయిపోయావ్ అని గుర్తు చేసి దేవుడి మీద విపరీతమైన కోపాన్నికలుగ చేస్తుంది..🤒


60ఏళ్లు వచ్చినా ఇంకా ఆ రజినీకాంత్ లు, చిరంజీవిలు 45ఏళ్లు దాటినా ఇంకా మహేష్ బాబులు, జూ ఎన్టీఆర్ లు, ప్రభాస్ లు ఇంకా అమ్మాయిల ఊహల్లో కలల రాకుమారులుగానే మిగిలిపోతారు.. వాళ్లనేమో ఈ ఫ్యాన్స్ అనబడే "శతృమూకలేమో" అన్నయ్యా అని పిలుస్తుంటారు ఇప్పుడే 35దాటిన మమ్మల్ని మాత్రం అంకుల్ అని పిలుస్తారు... అంకుల్ అన్న మాట వినపడగానే ఆ..మనల్ని కాదులే🙉...అలా మనల్నిపిలవకూడదులే అని అనుకుంటాం...కానీ భయంకరమైన పేలుడుపదార్ధం శబ్దంకంటే భయంకరంగా వినిపించే ఆ అంకుల్ అనే మాట మననిఉద్దేశించే అని తెలిశాక🙊.. గుండె కవాటాల్లో ఒకటి బ్లాక్ అయిపోయినట్టు, చిన్న మెదడులో 'చిన్నగులకరాయి 'అటూ ఇటూ కదిలినట్టు అనిపిస్తుంది.😾.


సరే ఎవర్ని ఏం పిలవాలో తెలిని "యూజ్ లెస్ ఫెలోస్" అని తాత్కాలికంగా వారినితిట్టుకుంటూ మానసికంగా అప్పటికి ఏదో ఒకటి చెప్పుకుని బతికేస్తాం బాగానే ఉంది కానీ🚶..


అత్త వయసుండే ఆంటీ కూడా ఎక్కడో షాపింగ్ మాల్ లో ఎదురయి 'అంకుల్ 'అన్నప్పుడు మాత్రం తిరిగే రంగుల రాట్నంలోంచి దూకేసినట్టు,.....అగ్నిగుండంలో పడిపోతే ఎవరో లాగుతున్నట్టు, ...... ఊబిలో పడి పీకలవరకూ లోపలికి కూరుకుపోయినట్టుగా అనిపిస్తుంది. 😏😤


భారత శిక్షాసృతి నుంచి నాకు ఒక్కడికే కాస్తంత రిలీఫ్ ఇస్తే ఆ అంకుల్ అని పిలిచినోళ్లని ఏదోచేయాలిపిస్తుంది. 👊


ఇదంతా ఒకటయితే బంధువుల ఫంక్షన్ కి వెళ్లినపుడు ఇంకోరకమైన సమస్య... "పెద్దనాన్నా"... అని తమ్ముడి పిల్లలు పిలిచినప్పుడు ఆనందపడాలో బాధపడాలో అర్థంకాదు.."నాన్న "అని నా పిల్లలు పిలిచినంతవరకూ ఓకే కానీ మరీపెదనాన్న అంటే పెన్షన్ తీసుకునే వయసుకు దగ్గరపడ్డామా అని కాసేపు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అందుకే ఆ పిల్లలకు కాస్తంత దూరంగా తిరుగుతాం..


ఇక కొంతమంది అయితే ఆ అంకుల్ కి విష్ చేశావా అనిపెళ్లీడుకొచ్చిన కూతుర్ని ఎవరో ఆంటీ మన ముందే అంటుంటే మరుగుతున్న సాంబార్ లో తలపెట్టాలనిపిస్తుంది. 💂


అప్పటి వరకూ పెళ్లయిందా అని అడిగినోళ్లు..ఇప్పుడు కొత్తగాపిల్లల్ని ఏస్కూల్లో చేర్చావు అని అడుగుతుంటే కుర్రకారు బ్యాచ్ అంతా మనదగ్గరలోకి రాకుండా కేవలం అంకుల్స్ బ్యాచ్ మాత్రమే రావయ్యా ఇక్కడకూర్చో అని వాళ్లబ్యాచ్ లో కలిపేసుకుంటుంటే ఆ బాధ ఏ మానసిక వైద్యుడూతీర్చలేడు..😥


ఇక 35 ప్రస్ లో వచ్చే మరో దారుణమైన సమస్య జుట్టు ఊడడం.. వయసు పెరుగుతోందని గుర్తుగా నెత్తిమీద వెనుకో ముందో ఒక్కోవెంట్రుకా ఊడిపోతూ ..ముఖంమూడంగులాల పొడవు పెరుగుతుంటే ఉండే బాధ ఆ పాకిస్తానోడికి కూడా వద్దు.. ఉగాండా వెళ్లి అక్కడోళ్లకు ఊడిగం చేయొచ్చుగానీ బట్టతలతో మాత్రం బతకలేం... జుట్టు ఊడకుండా రాసే అయిల్స్ ఎక్కువగా కొనేది, స్కిన్ డాక్టర్ల దగ్గరక్యూలో నిల్చునేది, మొలకెత్తిన గింజలుతినేది ఈవయసులోనే.. అరవై, డెబ్బై ఏళ్ల వయసు వచ్చినా.. ఇంకా తలనిండా జుట్టుతోపక్కకి,వెనక్కి దువ్వుకుని కనిపించేవారిని చూస్తే విపరీతమైన విరక్తి..


రాలే బొచ్చు రాలక మానదు.. 

రాలని బొచ్చు ఎప్పటికీ రాలదు...

కావాలంటే ఉంచుకునేది 

వద్దనుకుంటే తీసుకునేది బొచ్చొక్కటేగా అని ఎవరైనా రజినీకాంత్ డైలాగులు చెబుతుంటే... బంగాళాఖాతంలో కాసేపు వారందరినీ ముంచిలేపాలనిపిస్తుంది. 😖


35ప్లస్ లో బాడీకాస్త ఫిట్ గా ఉండి కండలు తిరిగి ఉంటే కాస్త ఏజ్ ని కవర్ చేసుకోవచ్చు గానీ పాపం మాలో కొంతమందికి ఆ వయసుకే బట్టతల వచ్చేసి పొట్టపెరిగిపోయి... జీన్స్ నుంచి కాటన్ ప్యాంట్ కి, రీబోక్ షూ నుంచి లెదర్ చెప్పులకి మారిపోయినప్పుడు ఎందుకో ప్రళయం వచ్చినట్టు, ప్రపంచం మొత్తం అంతమైనపోయినట్టు ఫీలింగ్....🙄😏


ఇక ఉద్యోగాలుచేసే చోట 35ప్లస్ లో ఒకవిచిత్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ వయసులో సీనియర్లు అయిపోయి రిటైర్మెంట్ కు దగ్గర పడినట్టుగా చూస్తారు.. అప్పటికి బాగా యాక్టివ్ గా ఉంటే పర్లేదు చీఫ్ పొజిషన్ లో ఉండొచ్చు.. కానీ అలా అవలేకపోతే మాత్రం అప్పుడే కొత్తగా ఆఫీస్ కి వచ్చే యంగ్ బ్యాచ్ లు ఉంటాయే వారితో కలవలేక వారు కలుపుకోలేక జీవితంలో ఏమీ సాధించలేకపోయామే అనే బాధతో విలవిల్లాడాల్సిందే..😶


అభినందన్ లాంటి వారిని చూసినప్పుడు రక్తం పొంగిపోయి ఉత్సాహంతో ఏ ఆర్మీకో, నేవీకో, ఎయిర్ ఫోర్స్ కో వెళ్లిపోదామని డిసైడ్ అవుతాం..🏃🏃🏃 కానీ నోటిఫికేషన్ లో అది కేవలం 25ఏళ్లవయసులోపు మాత్రమే అని ఉన్నప్పుడు 🚶సర్టిఫికెట్ లో డేటాఫ్ బర్త్ మార్చే వాళ్లుంటే బాగుండు అనిపిస్తుంది.🙇


విరాట్ కోహ్లీ లాంటి వాళ్లని చూస్తే మాకు విపరీతమైన జెలసీ.. 🙃 అందరూవారిని అప్రిసియేట్ చేస్తుంటే మేము ఓర్వలేం..ఎందుకంటే వాళ్లు చిన్నవయసులోనే ప్రపంచం గుర్తించేస్థాయికి ఎదిగిపోతే మేము 35ప్లస్ కు వచ్చాం కానీ ఏమీ పీకలేకపోయాం అని తెగ బాధపడిపోతాం... 😖


45ఏళ్లుదాటినోడు కూడాతలకి ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుని ముఖానికి రంగేసుకుని సినిమాలో కాలేజీకుర్రోడి రోల్ చేస్తుంటే మేము మాత్రం 35ప్లస్ కే అంకుల్స్ బ్యాచ్ లో చేరి పిల్లలతో సినిమాదియేటర్ లో వెనుక వరసలో కూర్చుని పాచిపోయిన పాప్ కార్న్ తింటూ ఆ హీరోలో మమ్మల్ని ఊహించుకుంటూ బతికేస్తుంటాం..😎😎


35ఏళ్లువచ్చేప్పటికి పెళ్లి చేసుకుని ఉద్యోగంలోనే లేక వ్యాపారంలోనోకాస్తో కూస్తో సెటిల్ అయినోళ్ల పరిస్థితి కొంత వరకూ బెటరే కానీ 35ఏళ్లు దాటినా పెళ్లికానిప్రసాద్ లపరిస్థితి మరింత ఘోరం...వాళ్ల బాధలు వర్ణనాతీతం...😪😪


అందుకే 35ప్లస్ ని కూడా ఇంకా కుర్రకారుగానే బావించే విధంగా ప్రభుత్వంచట్టం తీసుకురావాలి.. అంకుల్ అనే పదాన్ని దేశవ్యాప్తంగా నిషేధించాలి.. 35దాటిన వారికి ప్రత్యేక హక్కులను కల్పించాలి... బట్టతలమీద జుట్టు మొలిపించుకోవడానికి చేసే ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రభుత్వమే ఉచితంగా చేయించాలి.. అంకుల్ అనిపిలిస్తే అట్రాసిటీ కేసు పెట్టాలి... 😠😠


ముఖ్యంగ బాధ పడకూడదు 

బాద పడి జుట్టుపీక్కుంటే 

మన జుట్టే చేతిలోకి వస్తుంది..

అది కూడ ఇంకో బాధ 😐😐


కాబట్టీ అమ్మాయిలు; ఆంటీలు ; అమ్ముమ్మలు 

మీరు అందరూ అంకులు అని ఏవర్నీ అనకండి ..plzzzzzzz.....

ఒక అంకుల్ ( సారీ…. యంగ్ ఎట్ హార్ట్ బాధ)…….😛😛😛😛😛😛😛

సంఘ సంస్కర్త కందుకూరి*

 *గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి* సమాజంలో పాతుకుపోయిన ఛాందస భావాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన కందుకూరి వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త అని ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవన ప్రాంగణంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో కందుకూరి జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ  1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించిన కందుకూరి వీరేశలింగం కవి, రచయిత, పండితుడు అన్నారు. వీరేశలింగం తన రచనా  వ్యాపకాన్ని సమాజ సేవకు ఒక సాధనంగా   ఉపయోగించారని అన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం తో పాటు కుల నిర్మూలనకు అనుకూలంగా అకుంఠిత దీక్షతో పనిచేశారని అన్నారు. నవయుగ వైతాళికుడు, యుగకర్త, గద్య తిక్కన అనే బిరుదులు పొందారని శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ , డాక్టర్ భావన, జయేంద్ర   , రేలంగి బాపిరాజు  తదితరులు పాల్గొన్నారు.

గీత పారాయణ ఫలం:

 గీత పారాయణ ఫలం:

1.ప్రధమ అధ్యాయ ఫలం:-గీతాపారాయణము పూర్తిగా గానీ,లేక ఒక అధ్యాయము గానీ,లేక సగము అధ్యాయము గానీ,లేక ఒక శ్లోకం గానీ,లేక శ్లోకార్థము గానీ,కడకు ఒక పాదము గానీ,కనీసం ఒక పదము గానీ భక్తిపూర్వకంగా ఎవడు కావించునో అతడు సుశర్మ వలె ముక్తుడగును.ఎట్లనిన ------ 

పూర్వం సుశర్మయను బ్రాహ్మణుడు కలడు.అతడు విషయలోలుడై,దురాచారపరుడై,జీవితమును భ్రష్టమొనర్చుకొని,మరణించి, పెక్కు యమయాతనల ననుభవించి, తిరిగి మరుజన్మలో ఎద్దు అయి పుట్టెను.అది భారములను మోయుచు,మోయుచు ఒకనాడొక పర్వత ప్రాంతమున భారాధిక్యముచే క్రిందపడి మ్రుతి నొందెను.అద్దాని దీనదశను జూచి ఆ మార్గమున బోవుచున్న కొందరు దానికి సద్గతులు కలుగుటకై తమ పుణ్యములోని కొంత భాగమును ధారబోసిరి.అందొక వేశ్యయూ తానేమీ పుణ్యము చేయలేదని తలచి, ఏదైనా చేసియుండినచో ఆ వ్రుషభమునకు కర్పించితినని సంకల్పించెను.వేశ్యయొక్క పుణ్యముచే ఆ వ్రషభము పుణ్యలోకములకు వెళ్ళి మరల పూర్వ జ్ణానం గల ఉత్తమ బ్రాహ్మణ జన్మను బొందెను. అంతట ఆ బ్రాహ్మణుడు తనకు పూర్వజన్మమున సుక్రుతమును ధారబోసిన వేశ్య ఇంటికి వెళ్ళి ఆ సుక్రుతము ఎట్టిది అని అడుగగా,ఆమె చిలుకను చూపించి,ఆ చిలుకపలుకు వాక్యములను వినుటచేత తన మనస్సు పునీతమైనదని, చెప్పెను.అంతట వారిద్దరునూ ఆ చిలుకను సమీపించి ప్రశ్నింపగా,ఆ చిలుక పూర్వజన్మలో తానొక విద్వాంసుడనని, గురుధూషణాది పాపములను జేసి మరణించి తిరిగి చిలుకయై పుట్టి అరణ్యము లో దీనావస్థలో ఉన్న తనను ఒక మునిపుంగవుడు తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి పోషించుచున్నాడు అనియూ చెప్పెను.అచ్చోట గీత ప్రధమాధ్యాయము అతడు తన శిష్యులకు నిరంతరము బోధించు చుండగా విని క్రమముగా దానిని ఉచ్ఛరించగల్గితిననియు, ఒకనాడు ఒక దొంగ తన్నపహరించి ఈ వేశ్యకు అమ్మెననియు చెప్పెను.వేశ్యకు పాపవిముక్తి,సుశర్మకు సద్గతి లభించెను.

తస్మా దధ్యాయ మాద్యం పఠతే శ్రుణుతే స్మరేత్

అభ్యసేత్తస్య న భవేత్ భవాంభోధిర్దురుత్తరః.

కాబట్టి గీత ప్రధమాధ్యాయమును ఎవడు పఠించునో,శ్రవణము చేయునో,లేక స్మరించునో అట్టివాడు సంసారసాగరమును సులభముగా దాటిపోవును.

గీత ప్రథమాధ్యాయము పారాయణచే ----పాపవిముక్తి, పూర్వజన్మ స్మృతి కల్గును.

జలధారలు కనుగొను విధానం -

 భూమియందు జలధారలు కనుగొను విధానం  - 


 *  బావిలో నీరు ఉప్పగా ఉండినను , బురదగా లేదా వగరుగా , దుర్గన్ధముగా ఉండినచో మద్దిచెట్టు బెరడు , తుంగ గడ్డలు , వట్టివేళ్లు , శొంఠి , బీర విత్తులు , ఉశిరిక పొట్టు , చిల్లగింజలు తీసుకుని మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని బావినీటిలో కలిపిన ఆ బావినీరు తియ్యగా , శుభ్రముగా తయారగును. బావి వొడ్డున ఉశిరిక చెట్టు వేసినను బావినీరు తియ్యగా ఉండును. 


 *  మనిషి శరీరమున సిరలు ఏవిధముగా రక్తమును తీసుకువెళ్లే విధముగా ఉండునో అదేవిధముగా జలనాడులు భుమియందు ఉండును. ఈ జలనాడులు పెద్దవి మరియు చిన్నవిగా ఉండును. 


 *  పాతాళం నుండి పైకి వచ్చు జలనాడులను మహ సిరలు అనగా పెద్దగా జలతో కూడిన నాడులు అని అర్థం. దక్షిణదిశ , పశ్చిమ దిశ , ఉత్తరదిశ నుండి వచ్చు నాడులు శుభప్రధములు . ఆగ్నేయ , నైఋతి , వాయువ్య దిశల నుండి జలనాడులలో జల స్వల్పంగా ఉండును. 


 *  నిర్జల ప్రదేశము నందు నీరు ప్రబ్బలి చెట్టు ఉన్న దానికి పడమర దిశలో మూడు మూరల దూరము నందు ఒకటిన్నర  పురుష ప్రమాణం నందు పశ్చిమదిశ నుండి వచ్చు జలనాడి ఉండును.  ముందుగా తెల్లటి కప్పు వచ్చును. ఆ తరువాత బండ వచ్చును. ఆ బండని చేధించిన పిమ్మట జలం ఉండును. 


 *  పురుష ప్రమాణం అనగా 120 అంగుళములుగా లెక్కలోకి తీసికొనవలెను. మరికొన్ని గ్రంథాలలో పురుషుడు నీటిలోకి దుమికెప్పుడు తన చేతులను పైకి ఎత్తునప్పుడు 120 అంగుళములు ఉన్నచో దానిని పురుషప్రమాణముగా నిర్ధారించుకొనవలెను . 


 *  నిర్జల ప్రదేశము నందు నేరేడు చెట్టు ఉన్నచో ఆ నేరేడు చెట్టుకు ఉత్తర దిశకు మూడు మూరలు దూరములో రెండు పురుష ప్రమాణంలో తవ్విన తూర్పు దిక్కు నుండి వెలువడు ఐంద్రి అను పేరుగల జలనాడి ఉండును. అందులో ఇనుపవాసన కలిగిన మృత్తిక ( మట్టి ) , తెల్లని కప్ప ఉండును. 


 *  తోయరహిత ప్రదేశము నందలి నేరేడు చెట్టునకు తూర్పు దిశ యందు పుట్టయున్నచో దానికి సమీప దక్షిణ పార్శ్వమున రెండు పురుష ప్రమాణములు తవ్విన అందు మధుర జలం ఉండును. తవ్వు సమయమున అర్థ పురుష ప్రమాణం నందు ఒక చేప , పావురపు రంగు గల బండ , నల్లని మట్టి దాని క్రింద జలం ఉండును  . 


 *  జలహీన ప్రదేశము నందు అత్తిచెట్టు ఉన్నచో దానికి పడమట మూడు మూరల దూరంలో రెండున్నర పురుష ప్రమాణములు తవ్విన అందు ఒక పురుష ప్రమాణంబున తెల్లని సర్పము , నల్లని రాయి ఆ క్రింద తూర్పు దిశ నుండి మధురజలం స్రవించెడి జలనాడి ఉండును. 


 *  నిర్జల ప్రదేశము నందలి నల్లవావిలి చెట్టుకు పుట్ట చుట్టుకుని ఉన్న దానికి దక్షిణ దిశ యందు మూడు మూరల దూరమున రెండుంబాతిక పురుష ప్రమాణము తవ్విన ఎన్నటికి ఎండిపోని జలనాడి ఉండును. అందు అర్థ పురుష ప్రమాణమున  ఎర్రని చేప , దాని క్రింద కపిల వర్ణము గల మృత్తిక దాని క్రింద తెల్లని మృత్తిక దాని క్రింద ఇసుకయు ఆ క్రింద సున్నపు రాళ్ళను దాని క్రింద ఉదకము ఉండును . 


          ఇలాచెప్పుకుంటూ వెళితే ఒక గ్రంథం అవుతుంది. మరింత విలువైన సమాచారం నేను రాసిన గ్రంథాల యందు విపులంగా ఇచ్చాను. 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

వారణాసి మహిమ

 🕉️ *వారణాసి మహిమ* 🕉️


అగస్యునికి కుమారస్వామి వారణాసి మహిమను వివరిస్తున్నాడు .ఇక్కడ  మరణం సంభవిస్తే ముక్తియే . .ఈ మణికర్ణిక లోకి గంగ చేరింది .ఇది శ్రీ విష్ణువుకు చక్రపుష్కరిణి .పరబ్రహ్మ నివాస క్షేత్రం. రాజర్షి భగీరధుడు  బాగీరధిని భూమి పైకి తెచ్చి తన పితామహు లందరికి ఉత్తమ లోకాలను కల్గించాడు .ఇక్కడ బంగారం ఉద్భ వించింది .చక్రపుష్కరిణి మణిశ్రవణం అనే పేరుతో పిలువబడుతుంది .మణికర్ణికలో గంగ చేరిన దగ్గర్నుంచి ఇది దేవతలకు నిత్య ఆవాసం అయింది .ఇక్కడ జ్ఞానంతో పనిలేదు .గంగాస్నానం విశ్వనాధ దర్శనమే ముక్తినిస్తుంది .యముడు మొదలైన వారు కూడా ఇక్కడి వారినేమీ చేయలేరు .అన్ని విఘ్నాలను పోగొట్టే వరుణానది ఉంది. కాశీకి దక్షిణంగా అసి నదికి ఉత్తరంగా వరుణానదిని దేవతలు నిల్పి మోక్షనిక్షేపంగా కాపాడు తున్నారు .


        ఈ క్షేత్రంలో పడమరన వినాయకుడున్నాడు .ఈయన విశ్వనాథునికిరక్షకుడు. వినాయకుని అనుమతి లేని వారికి ప్రవేశం లేదు .పూర్వం దక్షిణ సముద్రతీరాన సేతుబంధనం దగ్గర మాతృభక్తిగల ధనుంజయుడు అనే వాడుండే వాడు .సన్మార్గం లో ధనం సంపాదించే వాడు .అర్ధులను సంతోషపెట్టే వాడు .వినయ సంపన్నుడు .విష్ణుపూజా దురంధరుడు గుణసంపన్నుడు. సదాచార సంపన్నుడు .తల్లి ని విశేషంగా పూజించి సేవించే వాడు. శివయోగిబోధ వల్ల అతనికి జ్ఞానం కలిగింది .తల్లి చనిపోయింది ఆమె అస్తికలను భద్రంగా ఒక రాగిపెట్టెలో పెట్టి పూజలు చేసి కావడిలో దాన్ని కాశీకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు .ఇతరు లెవ్వరు పెట్టెను ముట్టుకో కుండా జాగ్రత్తపడ్డాడు. దారిలోఒక అరణ్యంలో  జ్వరంవచ్చి బాధ పడ్డాడు. కూలి వాడిని ఏర్పాటు చేసుకొని అతనితొ పెట్టె మోయించాడు. కాశీ కి చేరాడు. మోసే వాడినే  కాపలా ఉంచి కావలసినవి కొనుక్కో వటానికి బజారు వెళ్లాడు. ఆ రాగిపెట్టెలో డబ్బు ఉంటుందని వాడు ఆశ పడ్డాడు. దాన్ని ఎత్తుకు పోయాడు .ధనుంజయుడు తిరిగి వచ్చి తెలుసుకొని బాధ పడ్డాడు. గంగాస్నానం విశ్వనాథ దర్శనం లేకుండా ఆ మోత గాడి ఇంటికి వెళ్లాడు. కూలివాడు ఆ పెట్టె ను దారిలోనే బ్రద్దలు కొట్టి అందులో అస్తికలే ఉన్నందున అక్కడ పారేసి పారిపోయాడు ఇంటికి వెళ్లి అతని భార్యను నిజం చెప్పమని ధనుంజయుడు కోరాడు ఆమె ఇంట్లో దాగి ఉన్న భర్తకు ఈ సంగతి చెప్పింది .ధనుంజయుడు అతడిని తీసుకొని ఆ ప్రదేశానికి చేరాడు .ఆ చోటును అంత పెద్ద అరణ్యం లో కని పెట్ట లేక హతాశుడై ఇంటికి తిరిగి వెళ్లి పోయాడు .


         విషయం అందరికి చెప్పి, వారు చెప్పిన ప్రకారం గయకు వెళ్లి తల్లి శ్రాద్ధం  పెట్టాడు .ప్రయాగ లో త్రివేణీ సంగమ స్నానం చేశాడు. తరువాత కాశీకి వచ్చి తల్లి అస్తికలను గంగలో కలిపితే విశ్వేశ్వరానుగ్రహం లేక పోవటం వల్ల నెట్టివేయబడ్డాయి .శ్మ అంటే శవం .శాన అంటే శయనించేది. అంటే శవం శయనించేది కనుక కాశి కి మహాశ్మశానం అని పేరొచ్చింది .అంటే ప్రళయ కాలంలో సమస్త భూతజాలం శవం పై ఈ మహా క్షేత్రం లో శయనిస్తుంది అని అర్ధం .కనుకనే మహాశ్మశానం అయింది .ప్రళయకాలంలో ఈశ్వరుడు ప్రతినిత్యం కాశీపట్నంలో త్రిశూలం పై ఉంచి రక్షిస్తూ ఉంటాడు .అందుకే కాశీకి ప్రళయభయం లేదు .కాశి కలికాల వర్జిత మైనది .దీనిని కాశి అని, వారణాసి అని, రుద్రావాసమని, మహాశ్మశానమని ,ఆనందకాననం ,దేవీపురమని అంటారు.

వంద ఉత్తమ పుస్తకాలు*

 *తెలుగులో తప్పనిసరిగా చదవాల్సిన వంద ఉత్తమ పుస్తకాలు* 


●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు

●మహాప్రస్థానం - శ్రీశ్రీ

●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం

●మాలపిల్ల - ఉన్నవ లక్ష్మినారాయణ

●చివరకు మిగిలేది - బుచ్చిబాబు

●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్

●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్

●కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి

●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ

●కళాపూర్ణోదయం - పింగళి సూరన

●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ

●గబ్బిలం - గుఱ్ఱం జాషువా

●వసు చరిత్ర - భట్టుమూర్తి

●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు

●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి

●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు

●చదువు - కొడవగంటి కుటుంబరావు

●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు

●కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి

●వేమన పద్యాలు – వేమన

●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి

●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి

●అల్పజీవి – రావిశాస్త్రి

●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి

●ఆంధ్ర మహాభాగవతం – పోతన

●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి

●మొల్ల రామాయణం – మొల్ల

●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య

●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర

●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య

●మైదానం – చలం

●వైతాళికులు – ముద్దుకృష్ణ

●ఫిడేలు రాగాల డజన్ – పఠాభి

●సౌందర నందము - పింగళి, కాటూరి

●విజయవిలాసం - చేమకూర వేంకటకవి

●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు

●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు

●మ్యూజింగ్స్ – చలం

●మనుచరిత్ర- అల్లసాని పెద్దన

●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ

●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి

●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు

●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర

●దిగంబర కవిత - దిగంబర కవులు

●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ

●పానశాల - దువ్వూరి రామిరెడ్డి

●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు

●అంపశయ్య – నవీన్

●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య

●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం

●జానకి విముక్తి – రంగనాయకమ్మ

●స్వీయ చరిత్ర – కందుకూరి

● మహోదయం - కెవి రమణారెడ్డి

●నారాయణరావు - అడవి బాపిరాజు

●విశ్వంభర – సినారె

●దాశరథి కవిత – దాశరథి

●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య

●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య

●పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం

●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి

●పారిజాతాపహరణం - నంది తిమ్మన

●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు

●రాజశేఖర చరిత్ర – కందుకూరి

●రాధికా సాంత్వనము - ముద్దు పళని

● స్వప్న లిపి – అజంతా

●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి

●శృంగార నైషధం – శ్రీనాథుడు

●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు

●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు

●అను క్షణికం - వడ్డెర చండీదాస్

●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ

●చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి

●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి

●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్

●గద్దర్ పాటలు – గద్దర్

●హాంగ్ మీ క్విక్ - బీనాదేవి

●ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్

●కుమార సంభవం - నన్నే చోడుడు

●మైనా - శీలా వీర్రాజు

●మాభూమి - సుంకర, వాసిరెడ్డి

●మోహన వంశీ – లత

●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి

●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి

●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు

●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి

●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం

●స్వేచ్ఛ – ఓల్గా

●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి

●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

●తృణకంకణం – రాయప్రోలు

●హృదయనేత్రి - మాలతీ చందూర్

●బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్

●నీతి చంద్రిక - చిన్నయ సూరి

●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు


●నీలిమేఘాలు – ఓల్గా

●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల

●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్

●కొయ్య గుర్రం – నగ్నముని

●నగరంలో వాన – కుందుర్తి

●శివారెడ్డి కవిత – yశివారెడ్డి


వీలైతే చదవండి.

అమ్మకు నాన్న శత్రువుర హాయిగముందుకు సాగుమింకపై*

 *అమ్మకు నాన్న శత్రువుర హాయిగముందుకు సాగుమింకపై*


ఉ.


ఉమ్మడి యింటినందుగల పుత్తడి దైవత నాయనమ్మ పె


ద్దమ్మయె గాక బామ్మ, పినతల్లికి యమ్మయు యమ్మకమ్మ య


మ్మమ్మకు మిన్నగెప్పుడును మచ్చిక జేసెడి యమ్మ నుండ యే


*అమ్మకు నాన్న శత్రువుర? హాయిగముందుకు


సాగుమింకపై *

దత్తపది

 దత్తపది :- దాడి,జాడి,వేడి,పాడి ఉ.


దాడిని గోరి రావణుడుతమ్ముని నిద్రను


లేపనెంచుచున్


జాడిలు గంపలండలుగ జాంగ్రిలు లడ్డులు


బెట్టిలేపగన్


వేడిగ పాయసంబులను వీరుడు బిందెతొ


పట్టుబట్టెనే


పాడిగ కుంభకర్ణునికి పండగ బోజన


మందితీరెనే

ప్రశ్నోత్తరములు

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


శ్రీజయేంద్రవాణి – ప్రశ్నోత్తరములు


🌷🌷🌷🕉🕉🌷🌷🌷


1 ప్రశ్న: స్త్రీలు మంగళసూత్రం కట్టుకున్న త్రాడు ఎన్నాళ్ళకి ఒకసారి మార్చి కొత్తది కట్టుకొనవలెను?


జవాబు: మాంగల్యం కట్టిన పసుపు త్రాటిలో ఒక నూలు పోగు పోయినాసరే , శని , మంగళవారాలు కాకుండా మిగిలిన రోజులలో రాహుకాలం , మరణయోగం , లేకుండా మంచి సమయం చూసి క్రొత్త పసుపు త్రాడు కట్టుకొనవలెను.

( మాంగల్యం పసుపుత్రాడులో కట్టుకొనటమే విశేషము)


2 ప్రశ్న: స్త్రీలు రెండు చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ వినాయకునికి నమస్కరించవచ్చునా?


జవాబు: రెండు చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తున్నట్టు భావన చేస్తూ స్త్రీలు నమస్కరించవచ్చును.


3 ప్రశ్న: సుమంగళి స్త్రీలు చందనం పెట్టుకోవచ్చునా?


జవాబు: నుదుట కుంకుమ పెట్టుకుని దానిపైన చిన్నగా విభూతి పెట్టుకొనవచ్చును. చందనం కంఠానికి రాసుకోవలెను.


4 ప్రశ్న: భర్త , పిల్లల ఆరోగ్యం , కుటుంబ క్షేమం కొరకు గృహిణి వారానికి ఒక రోజు ఏ దేవతకి పూజ చేస్తే మంచిది?


జవాబు: శుక్రవారం అమ్మవారి పూజ చేయవలెను . దేవాలయంలో పరాశక్తి అర్చన చేయవలెను . క్షేమం కలుగుతుంది.


5 ప్రశ్న: కుటుంబంలో దారిద్ర్యం తీరి పిల్లలకు వివాహాలు కావడానికి నేను ఏ స్తోత్రాలు చదవాలి?


జవాబు: మీరు ప్రతిరోజు పారాయణం చేయవలసిన స్తోత్రం

” విదేహి దేవి కళ్యాణం విదేహి పరమం శుభం

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి!”


ఓం నమో నారాయణాయ🙏

ఆడవారు తులసి చెట్టు వంటివారు

 ఆడవారు తులసి చెట్టు వంటివారు.😍 


మగవారు దురదగుంట చెట్టు వంటివారు.😏 


సీన్ కట్ చేస్తే ..!


"బీర్బల్ ... దర్బారుకు ఆలస్యంగా ఎందుకు వచ్చావు?"


"ఆలంపనా... జహాపనా....  ఈ రోజు మా తులసీ మాత పూజ ప్రభూ....!! అమ్మకి పూజచేయడంలో ఆలస్యం అయిపోయింది."


అక్బర్ కి నవ్వొచ్చింది. 


"తులసి... మాత.... హ హ హ హ ... ఈ చిన్న మొక్క మీకు తల్లా?" అంటూ వికటాట్టహాసం చేశాడు. 


"ఎవరక్కడ... ఒక తులసి చెట్టును తెప్పించండి"


పాదుషా తలచుకుంటే మొక్కలకు కొదవా? 


సభలో అందరి ముందే తులసి మొక్కను చింపి పోగులు పోశాడు అక్బర్.


"చూశావా... నీ మాతను ఏం చేశానో..."


బీర్బల్ ఏమీ అనలేదు. "చిత్తం జహాపనా" అన్నాడు. 


మరుసటి రోజూ బీర్బల్ ఆలస్యంగా వచ్చాడు.


"ఈ రోజేమిటి బీర్బల్... మళ్లీ ఎందుకాలస్యం?" 


"ప్రభూ నిన్న మా తల్లిగారి పూజ అయింది. ఇవాళ్ల తండ్రిగారి పూజ ప్రభూ..."


"మీ తండ్రి కూడా ఒక మొక్కేనా..."


"అవును ప్రభూ...."


"ఆ మొక్కని తీసుకురండి" 


ఆ మొక్కని దర్బారులో పెట్టారు. 


అక్బర్ "మీ అమ్మ పని పట్టాను. ఇక మీ అబ్బ పని పడ్తాను చూసుకో..." అంటూ ఆ మొక్కను చింపి పోగులు పోశాడు. 


కాసేపటికి అక్బర్ కి దురద మొదలైంది. ముందు మర్యాదగా కనీ కనిపించనట్టు గోక్కున్నాడు.


తరువాత బరబరా గోక్కున్నాడు. బట్టలువిప్పి మరీ నేలపై పొర్లుతూ గోక్కోవడం మొదలుపెట్టాడు. 


"అమ్మోయ్... బాబోయ్... నాకేమైంది బీర్బల్ ...." అంటూ గావుకేకలు పెట్టాడు.


బీర్బల్ నెమ్మదిగా, తెచ్చిపెట్టుకున్న వినయంతో "జహాపనా... మా తల్లి శాంత స్వభావురాలు, ఏమీచేయదు. కానీ మా తండ్రి అలాంటివాడు కాదు. ఆయనకు ముక్కుమీదే ఉంటుంది కోపం."


"ఎవరయ్యా ఈ తండ్రి... బాధ భరించలేకపోతున్నాను."


"ప్రభూ... తులసి మాకు తల్లి. దూలగొండి మాకు తండ్రి. దూలగొండిని కెలుక్కున్నారు మరి...." అన్నాడు బీర్బల్.


"ఏం చేయాలయ్యా... ఎలా తగ్గుతుందయ్యా ఈ దురద....?" అక్బర్ గారు నేలమీద పడి దొర్లుతున్నాడు. 


"ప్రభూ దీనికి ఒకటే మార్గం. మా తండ్రి గారి కోపాన్ని మా తల్లి మాత్రమే శాంతింపచేయగలదు. కాబట్టి ఆమెకు మొక్కండి. తులసి ఆకుల రసాన్ని పూసుకొండి. దురద తగ్గుతుంది." అన్నాడు బీర్బల్.


అక్బర్ ఓ చేత్తో గోక్కుంటూనే రెండో చేత్తో తులసమ్మకు దణ్ణం పెట్టాడు.


ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు ఇలాగే బుద్ధి చెప్పాలి.


🙏🙏🙏🙏🙏🙏

 షేర్ చేయడం మరువకండి