*గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి* సమాజంలో పాతుకుపోయిన ఛాందస భావాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన కందుకూరి వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త అని ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవన ప్రాంగణంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో కందుకూరి జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించిన కందుకూరి వీరేశలింగం కవి, రచయిత, పండితుడు అన్నారు. వీరేశలింగం తన రచనా వ్యాపకాన్ని సమాజ సేవకు ఒక సాధనంగా ఉపయోగించారని అన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం తో పాటు కుల నిర్మూలనకు అనుకూలంగా అకుంఠిత దీక్షతో పనిచేశారని అన్నారు. నవయుగ వైతాళికుడు, యుగకర్త, గద్య తిక్కన అనే బిరుదులు పొందారని శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ , డాక్టర్ భావన, జయేంద్ర , రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి