26, మార్చి 2023, ఆదివారం

..మా తెలుగు.

 *నేను...మా తెలుగు....*


మేము మీకు అత్యంత సమీపములోయుండు తమిళనాడులో నివసిస్తుండే తెలుగు వాళ్ళము. మా జనాభా తమిళనాడులో దాదాపు రెండన్నర నుండి మూడు కోట్లు. ప్రస్తుత తమిళనాడు జనాభా 8 కోట్లు. అంటే తెలుగువారి సంఖ్య దాదాపు 35 శాతము.


సరే తెలుగు వారి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మీ ఊహలకు కూడ అందని ఘోరమైన పరిస్థితి అది. ఒకింత ఓపికతో చదవండి.


01. ప్రస్తుతము మాకు మొత్త తమిళనాడులో  తెలుగు బడులు లేనే లేవు. 


02. మా ఇండ్లలో తెలుగు బాష మాటలాడడం కూడ దాదాపు మరచి పోయినాము. మూట కట్టి పడేశాము అనుకొండి. 


03. ఉద్యోగ నిమిత్తం తెలంగాణా కాని లేక ఆంద్రప్రదేశము నుండి వలస వచ్చిన వారిని వినహాయించి మాలో తెలుగు వ్రాయడం లేక చదవడం తెలిసినవారి సంఖ్య మొత్త తమిళ నాడులో రెండు లేక మూడు వందలను కూడ దాటదు. వారెవరంటే ఇప్పట్లో దాదాపు 70 సంవత్సరములు మించిన వారు అలనాడు తెలుగు బడులలో చదివిన వారౌతారు. వారికి పిదప స్థానీయ తెలుగు వారికి తెలుగు బాష చదవడం లేక వ్రాయడం కూడ తెలియదు. ఇది ముమ్మాటికీ సత్యం. మూడు కోట్లో మూడు వందలు.‍... ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి.


04. ప్రస్తుతం మా ఇండ్లలో మాటలాడడం కూడ తమిళ భాషలోనే చలామణి ఔతున్నది. మా పిల్లలు తెలుగు మాట్లాడడం మరచి పోయారు, లేక వారి మాటలలో దాదాపు 60 శాతము పదాలు తమిళ పదాలే. అంతఘోరమైన తెలుగు.


05. మా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలైన హోసూరు , చిత్తూరు పక్కలోయుండే ప్రాంతాలైన రాణీపేట, వేలూరు, నగరికి సమీపములోని తిరుత్తణి, తడకు సమీపములోని గుమ్మిడిపూండీ  కాక చెన్నైలోని ఉత్తరప్రాంతాలైన పారిస్ కార్నర్, ఫోర్ట్, చెన్నై సెంట్రల్, టి.నగర్ ప్రాంతాలు వినహాయించి వేరెక్కడను తెలుగు వార్తాపత్రికలు దొరకవు. పై ప్రాంతాలలోనూ ఏ అతి స్వల్పమైన కొట్లలో మాత్రము అందునా రోజుకు పదికి తక్కువైన సంఖ్యలోనే ఆ వార్తా పత్రికలు దొరకుతవి. ఇది మూడు కోట్ల జనాభా యుండే తెలుగువారి గతి.!!!


06. త్యాగయ్య జనించిన తిరువైయారులో తెలుగును భూతద్దం పెట్టి వెదకినా సరే, తస్మాత్ జాగ్రత్త,  సూక్ష్మరూపంలోకూడ కనబడదు సుమా.


07. దాదాపు 60 ఎళ్ళ క్రితం అనేక ప్రభుత్వ గ్రంథాలయములలో (లైబ్రరీ) తెలుగు పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు ఆ గ్రంథాలయములలోని అన్ని తెలుగు పుస్తకాలను తమిళనాడు ప్రభుత్వము లోబరచుకొని వాటిని ధ్వంసం చేసేసారు, ఏ కొన్ని తమిళనాడు ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణకు లోబడని (కేంద్ర ప్రభుత్వ సహఆయము పొందిన) ప్రాచీన గ్రంథాలయములు మాత్రమే ఆ చర్యకు లోబడలేదు. ఉదా సరస్వతీ మహల్ తంజావూరు మొదలైనవి. సరస్వతీ దేవి కదా!!! తన్ను జయింప సాధ్యమా.


07. జారీ చేయబడిన ఏకొద్ది (చేతి వేళ్ళతో ఎంచవచ్చు) తెలుగు బడులలో తెలుగు అధ్యాపకులు లేరు. వారి పరీక్షా పత్రములను ఎలా తిద్ది మార్కులేస్తారో, ఆ భగవంతునికే తెలియాలి. ఏవో కొన్ని బడులలో ఉండు ఆధ్యాపకులకెవరికైనా ఒకింత తెలుగు తెలిసియుంటే అతను గణితము, విజ్ఞనము లేక వృక్షశాస్త్రము, జంతు శాస్త్రము,రసాయన శాస్త్రము,వంటి వేరేదైనా సాంకేతిక శాస్త్ర  అధ్యాపకుడైయుండినకూడా కనికరముపై ఆ పిల్లలకు ఒకింత తెలుగు నేర్పవచ్చును. తెలుగు పండితులు అనే జాతి ఇక్కడ అంతరించి పోయింది. అంతే.


08. ఇప్పటి ఇచ్చటి తెలుగువారికి ఏ ఒకింత తెలుగు తెలిసియుంటే అది గద్యరూప తెలుగే కాని భగవంతుని సాక్షిగా పద్యములంటే ఏమి, ఆ పద్యములలోని యతి,గణ,ప్రాస,అలంకార లక్షణములు గూర్చి ఏమియు తెలియవు. అసలు ప్రతిరోజు చలామణిలోయుండే మాటలలోనే  సాదారణమైన తెలుగు పదాలే అంతరించి పోయినవి. మా ప్రాంతాలలో తెలుగు భాష దౌర్భాగ్య స్థితి అనడంకన్నా భాష ఔన్నత్యమునకు మేమంత పాటుపడినాము. సంస్కృతము దేవ భాష, ఎందుకంటే కాల క్రమేణ దానిని మరచిపోయినాము. అదే స్థానానికి మేము తెలుగును తీసుకెళ్ళినామంటే అది మా భాషాభిమానము, నమ్మండి.


09. తెలుగు భాషలోని అరసున్నలు పూర్తిగా మరచిపోయినాము. మాకు "శ,స,ష" ల ఉఛ్ఛారణలు కూడ సరిగ్గా తెలియవు. "ర" మరియు బండి "ఱ" లు ఎప్పుడెలా ఉపయోగించాలో మరచి పోయాము. ఇప్పటి మా ప్రాంత తెలుగు వారికి తెలుగు బాషలోని అక్షరాల సంఖ్యకూడ తెలియవు. అలాంటప్పుడు ఇటువంటి సూక్ష్మ విషయాలను గమనింప సమయముందా. వదలేద్దాం.


10. కొలత మానికల పేర్లను సైతము మేము పూర్తిగా మరచిపోయినాము. ఉదాహరణకి తులము, పలము, వీశె. శేరు, మణుగు, భారము, అంగుళము, అడుగు, గజము, పొడుగు, వెడల్పు, పరిధి, వ్యాసము, వైశాల్యము, ఘనపరిమాణము, ఇలాంటి పదాలు ఏకొన్ని కోమిటి కుటుంబాల పిల్లలు తప్ప మరెవ్వరికి గుర్తు కూడా లేదు. ఈ పదాలలో కొన్ని కోమిటివారి పిల్లల రక్తంలో చేరి పోయిన పదాలు గనుక  నేటికీ వారిలో కొందరికైనను ఆ పదాలు గుర్తుంటుంది. పాపం వారిని క్షమిస్తాము.


11. అసలు రుచుల పేర్లను తెలుగులో చెప్పడం కూడ ఈ నాటి తమిళనాడులోని తెలుగు పిల్లలకు తెలియదు. అంత దిగజారిన పరిస్థితి. కాదు,కాదు, మేము అంత ఎదిగి పోయినాము. అసలు రుచుల పేర్లే తెలియక పోతే ఇక తెలుగు బాష రుచిని ఎలా వర్ణింపగలము.


12. మేము మాటలాడుకొను సందర్భాలలో మా దేహ పరిస్థితిని గూర్చి మా ఎదుటి తెలుగువారితో మాటలాడు సందర్భాలలో మాటలాడునపుడు మాకు అసలు దేహ ఆరోగ్యం, లేక స్థితిని గూర్చి తెలుప తెలుగు పదాలను కూడ పూర్తిగా మరచిపోయినాము తమిళ పదాలే నోటినుండి జారుతున్నవి. ఈ కాలములో మన దేహ ఆరోగ్యాలు ఏమి లక్షణంలో ఉందో మా ప్రాంతంలో మా తెలుగు బాష అదే లక్షణంలో ఉంది, కాక ఇంకా క్షీణించిన విధంగా ఉన్నది. ఏమో అంటారే యథా రాజా తథా ప్రజా అని. అలా మేము ఏమి లక్షణంలో ఉన్నామో, మా తెలుగు అదే లక్షణంలోనే ఉన్నది. 


13. ఇక మాకు, తెలుగు వ్యాకరణమునకు ఏ విదమైన సంబందము లేవు. మించి మించి పోతే అమావాస్యకు అబ్దుల్ ఖాదర్ కు ఉండే సంబందం. ఇక వర్తమాన, భూత, భవిష్యత్ కాల క్రియా పదములకు మాకు ఏ విదమైన పరస్పర సంబందము లేవు. మహాప్రాణముల ఉచ్ఛారణ, ఎప్పుడు ఎలా వాటిని ఉచ్ఛరించాలి అనే విషయము మాకిసుమింతయు తెలియదు, మరచి పోయినాము అంతే. అసలు తెలుగులోని మొత్త అక్షరాల సంఖ్యనే మరచిపోయిన మాకు ఇదొక లెక్కా. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు, సమాసములు,సంధులు, సంధి సూత్రములు, ఆమ్రేడితాలు, ద్వందములు, ద్విగువులు, ...ఇవంతా ఏమి, కిలో ఎంత, ఎక్కడ దొరకుతుంది అని అడిగే వాళ్ళమైపోయాము. 


14. సమయానికి ఒక్క పదమే సరిగ్గా తెలియని మాకు పర్యాయపదాలు తెలిసే భాగ్యమున్నదా. ఛీ..ఛీ.. లేదండి. దయచూపి మమ్మల్ని వదలేయండి, మేము అయ్యో పాపం కదా. కనికరించండి.


15. కనీసం తెలుగులో రంగుల పేర్లను కూడ గుర్తింప తెలియని వాళ్ళమైపోయాము. అచ్చ తెలుగులో పక్షుల పేర్లు, మృగాల పేర్లు, నానా రక వృక్షాల పేర్లు, ఇవంతాకూడ మాకు మరుగై పోయింది. అంతట్లోనూ అమాంతం తమిళ, ఇంగ్లీషులే చోటు చేసికొన్నవి. మాతృభాషను  కోల్పోయిన దౌర్భాగ్యులం.


ఇంకా ఇలా ఎంతో చెప్పుకో పోవచ్చు. 


ఒక్క క్షణం ఆగి కారణాలను వెదుకుదాం. 1960 లలో ఒక విష పురుగు మొలిచింది. అదే తమిళనాడులోని కళగంలు. చీడ పురుగులు. మేము పిల్లలుగా ఉండినపుడు మా ప్రాంతములో తెలుగు తమిళ కన్నడ పిల్లలు కుటుంబాలు చాల అన్యోన్యముగా మసలుతుండినాము. నేను పిల్లవానిగా ఉండినపుడు గ్రంథాలయంలో తెలగు,తమిళ, కన్నడ పత్రికలు, పుస్తకాలు, వార్తాశపత్రికలు అన్నీ ఉండేవి. నేను 5 వ తరగతి చదువుతున్నప్పుడే తమిళము, కన్నడం నేర్చుకోవాలనే తపన. దాదాపు అందరు అలాగే ఉండేవాళ్ళము. కానీ ఈ కళగంలు వచ్చిన వెంటనే బాష విరోదత్వ బీజాలు నాటినారు. తమిళనాడును మొత్త ఇండియానుండి విభజించి " తనితమిష్నాడు" అంటే ప్రత్యేక తమిళనాడును భారతమునుండే విభజించి తమిళ వాళ్ళు పాలించాలనే ప్రణాళిక తీసుకొచ్చారు. కాని అది కొనసాగలేదు, కాని విభజనా శక్తులు తలెత్తాయి. దానితో వేరు బాషలను అణగ త్రొక్క ప్రారంబించారు. 1964లో ఆంటీహిందీ అజిటేషన్ చైకొన్నారు. స్కూలు పిల్లలలో విభజనా విషాన్ని చేర్చారు. స్కూలు పిల్లలను, తమిళ టీచర్లను ఆ పనులకుని అప్పటి (డి.ఎం.కే) ద్రావిడ మున్నేట్ర కళగం తీర్చి తిద్దింది. 1967లో మొదటి తూరి ఈ కళగంల చేతిలోకి ప్రభుత్వం చేరింది. అప్పుడు పట్టిన ఈ శని నేటి వరకు తమిళనాడును విడువ లేదు. తమిళము తప్ప మరన్ని బాషలను అణగత్రొక్కింది. నేను స్కూలులో చదువుతున్న కాలమందు  అంటే 1960 ప్రాంతాలలో తెలుగు పిల్లల సంఖ్య 60 శాతము. తమిళం 40 శాతము. నేడు తెలుగు శూన్యము. తమిళం వంద శాతం. మా చుట్టు ప్రక్కని అనేక చిన్ని గ్రామాలలో కన్నడ బాష మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేవి. నేడు కన్నడం పూర్తిగా మటుమాయం‌ ఆ నాటిలో మూడు బాషలు సహోదర భావంతో అన్నీ ఒకటితో ఒకటి పెనవేసుకొని జీవించేది. కాని నేడు ఆ తమిళ బాష ఒకటి మాత్రం ఆక్రమించుకొనినది. నాకు ఏ బాష పైనను విరోదం లేదు. నాకు ఆ మూడు బాషలు బాగుగ చదువ, వ్రాయ, మాటలాడ వస్తుంది. అన్నింటిని ప్రేమిస్తాను. పోతే తెలుగుపై ఎక్కువ మక్కువ. ఈ కళగాలే రాజకీయ కారణాలచే తెలుగును అణగత్రొక్కి నిర్మూలం చేసింది. అదే నా ఆత్మ బోరున ఏడుస్తుండే దానికి కారణం. నిస్సహయముగా మా లాంటి కొందరు ఇక్కడ మిగిలి పోయాము.


విషాదంతో


రామమూర్తి

చెన్నై.

ఉగాది

:

 ఉగాది

         కవిత శీర్షిక

రచన రవికుమార్ దేవర శెట్టి

సందర్భం శోభకృత్ వత్సరం

తేదీ 24/03/2023


నాలో నేను

నా వైపు అడుగులు

ప్రభాత సూర్యుడు

ఆకాశమంత మోదుగు పువ్వుల క్రాంతి..

కాంతిలో ఉగాది కొత్త సృష్టి ఆరంభమైతే..

నీలో నిన్ను దాచే

చీకటి ముసుగులోనే ఉన్నావా..

రంగులు మార్చే.. ఊసరవెల్లిలా నిన్ను నువ్వు చుట్టుకుంటూ ఉన్నావా..

 

ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం కదా..

ప్రేమ ,స్నేహం ,త్యాగం ,శ్రమ, నిజాయితీ ,శాంతిపోరాటం స్ఫురించటం లేదా?

నలుగురికి జీవిత సాఫల్యం అందించే విశ్వతత్వం నీలో ప్రతిపలించటం లేదా?

అంతా రిక్తమే.. సిక్తమే

అందమైన నటనే .‌.అలంకరణే డాంబికమే..


ఉగాది ఉషస్సులతో

విచ్చుకున్న వేప పువ్వులా హృదయ ద్వారాలు తెరుచుకున్నావా?

తీయమాను మామిడి పిందెలా మదిలో చెడును చెరిపి- తీపినిఎంచుకున్నావా? మిరియపుకారముల అహంకారాన్ని తుంచుకున్నావా?

నల్ల ఉప్పు కాసారంలో స్వార్థాన్ని

దహించుకున్నావా?

తీపి బెల్లముల -పులుపు చింతల నిన్ను నువ్వు సమర్పించుకున్నావా! మంచినే ఎంచుకున్నావా!!

నీలో నిన్ను వెతకలేనప్పుడు

ఉగాది పరమార్ధం తెలుసుకోలేనప్పుడు..

యుగాల ఆది ఉగాది నీకెందుకు!


నీటి కోసం తపించే చెకోర పక్షుల ..

వసంతం కోసం ఎదురుచూసే కోకిలమ్మ లా..

శోభ కృత వసంత శోభనంతా ..

కాంతి కణమై ..

విశ్వ చైతన్యమై..

మళ్లీ కూ..కూ.. రాగాలు ఆలపించి..

దశదిశలా చిద్వి లాఫమై.. చిదాత్మమై ..

చిగురులు తొడుగుకుంటూనే ఉంటుంది..

నీలో నిన్ను పునర్ సృష్టించువరకు

ఆశగా దీక్షతో..

నిరీక్షిస్తూనే ఉంటుంది..

నీవే ఉగాదిగా మారేంతవరకు ‌‌..

: స్పందించండి మిత్రమా

గాయాలలో

 గాయాలలో రక్తం ధారగా పోతున్నప్పుడు - 


       ఏదన్నా ప్రమాదాలలో గాయాల పాలు అయినప్పుడు రక్తస్రావం తీవ్రంగా ఉంటుంది. ఆ స్థితిలో పత్రబీజం ఆకులను ముద్ద చేసి గాయం పైన వేసి కట్టుకట్టి మరుక్షణమే పత్రబీజం ఆకులు మెత్తగా దంచి 10 నుండి 20 గ్రాములు మోతాదుగా ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి లొపలికి తాగించాలి.వెంటనే గాయాలు నుండి రక్తం కారడం ఆగుతుంది . రక్తస్రావం త్వరగా ఆగకపోతే మరో రెండు మూడు మోతాదులు గా కూడా ఒక గంట వ్యవధిలో లొపలికి ఇవ్వవచ్చు. అప్పుడు తప్పకుండా రక్తం ఆగి ప్రాణాలు దక్కుతాయి. 


                  ప్రమాదాలు జరిగినప్పుడు దెబ్బలు తగిలి ఆయా అవయవాలు పిప్పిపిప్పిగా నలిగిపోయినప్పుడు వైద్యులు ఈ అవయవాలను సరిచేసి వాటిపైన ఈ పత్రబీజం ఆకులు కట్టేవారు . చితికిపోయిన మాంసం ముద్ద యధాస్థితికి వచ్చి అతి త్వరలోనే ఆ అవయవం ఆరోగ్యాన్ని పుంజుకొని మామూలుగా పనిచేస్తుంది .


 గమనిక - 


       దీనిని సామాన్య పరిభాషలో "రణపాల " అని పిలుస్తారు .


  

         

వీర్ సావర్కర్

 🔥🔥వీర్ సావర్కర్ 

....

ఒక కొబ్బరికాయ పీచుతీయాలంటే కత్తికోసం వెదుకుతాం! 

.

అదే గోళ్ళతో తీయమంటే!

 వామ్మో!  ఎంత కష్టం!

.

అట్లాంటిది ప్రతి రోజూ రెండు బస్తాల కొబ్బరికాయలు చేత్తో పీచుతీసి, గానుగలో వేసి ఎద్దుకు బదులుగా తాను గానుగాడి నూనె తీసి,ఒంటరిగా చీకటికొట్లో 

25 సంవత్సరాలు మగ్గిమగ్గి  ,

బొగ్గుతో గోడలమీద కవితలువ్రాసి, వ్రాసినదానిని కంఠస్తం చేసి తదనంతర జీవితంలో పుస్తకంగా అచ్చువేయడం మానవమాత్రుడికి సాధ్యమవుతుందా! 

.

దానికి ఎంత ఓర్పు! కావాలి!

ఎంత మానసిక దృఢత్వం కావాలి!

.

అసలు అలాంటి మనిషి పుట్టాడా?

.

లేకేం ఉన్నాడు !

.

అలాంటి మనిషొకడు మన స్వాతంత్ర్య సమరయోధుడని ఎంతమందికి తెలుసు? 

.

మన పాఠ్యపుస్తకాలు అసలు ఆయన గురించి చెప్పాయా!

.

అండమాన్ సెల్యులర్ జైలులో గాలి వెలుతురు దూరని గదిలో 25 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఏకబిగిన అనుభవించి జీవితంలోని యవ్వనాన్ని దేశంకోసం ధారపోసిన మహనీయుడు

" స్వాతంత్ర్య వీరసావర్కర్ "


 ఒకరిద్దరివల్లనే మనకు స్వాతంత్ర్యం రాలేదు !

.

అది ఎంతోమంది త్యాగధనులు జీవితాన్ని తృణప్రాయంగా భావించి స్వాతంత్ర్య కదనరంగంలో కొదమసింగాల్లా దూకటం వలన వచ్చింది !

.

 వారిలో సావర్కర్ అగ్రగణ్యులు !

.

వీరసావర్కర్ ఎంతోమంది వీరులలో స్ఫూర్తి రగిలించేవారు .ఆయన

చుట్టూ లండన్ లో ఎంతో మంది దేశభక్తులు గుమికూడేవారు ! వారికి గురుస్థానం ఈయనదే !

..

వారు ..భాయీపరమానంద్,వీరేంద్రనాధ్ చటోపాధ్యాయ, వి.వి.స్ అయ్యర్..,సర్దార్ సింగ్ రాణా ,మేడమ్ కామా !, బాపట్ , ఎమ్.పి.టి. ఆచార్య ,మదన్ లాల్ దింఘ్రా....... 

.

ఇలా ఎంతోమందికి ఉపదేశగురువు ఆయన !


మన దురదృష్టం ఏమిటో కానీ ఇంతమంది,ఇంకా ఎంతోమంది  అకళంక దేశభక్తుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్యం అని మన పిల్లలకు తెలియకపోవడం !

.

 వీరుల చరిత్ర మనం పిల్లలకు చెప్పక ఎవరో ఒకరిద్దరి వల్ల స్వాతంత్ర్యం వచ్చింది అనే అబద్ధాలు విరివిగా ప్రచారం చెయ్యడం ! వాటినే పిల్లలు నమ్మడం ! 

.

వీరసావర్కార్ ను చదవండి చదివించండి !!!

..

సావర్కర్ అంటే మొక్కవోని ఉక్కు సంకల్పం 

సావర్కర్ అంటే స్ఫూర్తి

సావర్కర్ అంటే రగిలే నిప్పుకణం

సావర్కర్ అంటే సాహసం

సావర్కర్ అంటే తలవంచని వ్యక్తిత్వం

సావర్కర్ అంటే నిజాయతి

సావర్కర్ అంటే నీతి 

సావర్కర్ అంటే ధైర్యవంతుల గుండె చప్పుడు...


25సంవత్సరాలు ఒంటరి జైలు జీవితం ఎంత కఠినమో అర్ధం అవుతుంది..

వీర్ సావర్కర్ లాంటి వారు లక్షల మంది జీవితాలను ధార పోయడంతో  వచ్చిన స్వాతంత్ర్యాన్ని చాలా సుఖంగా అనుభవించేస్తున్నాం మనం....


భారత మాతకు జయము


ఇంతటి దేశభక్తుడి ఆస్తిని బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేసింది.. స్వాతంత్య్రం తరువాత వచ్చిన భారతీయ ప్రభుత్వం ఆస్తిని ఆయనకు అప్పగించలేదు కూడా..ప్రధాని ఎవరో చెప్పనక్కరలేదు కదా..

దుర్వ్యసనాలు

 శ్లోకం:☝️

*శుష్కీకుర్వంతి ఛిద్రాణి*

  *దోషయుక్తాని సద్గుణాన్ |*

*శీలం రక్షేత్ గుణాం రక్షేత్*

  *మతిం రక్షేత్ సుబుద్ధిమాన్ ||*


భావం: వ్యక్తిత్వ లోపాలు, దుర్వ్యసనాలు ఆ వ్యక్తి యెక్క సద్గుణాలను రద్దు చేస్తాయి, ప్రతిభను మసకబారుస్తాయి. కాబట్టీ వ్యక్తిత్వాన్ని, సద్గుణాలను మరియు ప్రతిభను అప్రమత్తతతో కాపాడుకుందాం.🙏

అమ్మకు సాయం

 *(అమ్మకు  సాయం చేయండి )..*  

*ఒక  సారి ఆలోచించండి .మారండి.*

🤱🤱🤱🤱🤱🤱🤱

*ఆ కాలంలో అంటే  మా బామ్మ ,అమ్మమ్మ , తాతమ్మ  తరంలో మనిషోకో రకం ఐటమ్ వండటం అనేది లేదు.*


*ఒక కూర , పప్పు , పచ్చడి , రసము లేదా పులుసు ( పెరుగు లేదా మజ్జిగ  సిద్ధం చేసి )  ఒకేసారి వండేసి , దేవతార్చన చేసుకుని , వాళ్ళ వరకు విడిగా మడిగా తీసుకుని  వంట గదిలో నుండి బయటకు వచ్చేసేవారు.*


*రాత్రికి అల్పాహారము  ఏ ఉప్పు పిండో , దిబ్బరొట్టో వేసుకుని  తినేసేవారు.*


*ఎవరైనా రాత్రి భోజనము చేసేవారుంటే , వారే  వేడిగా  ఏ కూర ముక్కో వేయించుకుని , పొద్దున తినగా మిగిలిన పదార్ధాలు  వేసుకుని  వాటితో తినేసేవారు.*


*మరి ఈ కాలంలో మనిషికో రకం. భర్త తినేది పిల్లలు తినరు. అత్త గారు తినేది భర్త తినడు . పిల్లలు తినేది  భర్త , అత్తగారు వేలేసి ముట్టుకోరు . వంట చేయడమంటే  ఈ రోజుల్లో  అంటే మహా యజ్ఞం చేసినట్లే.*


*ముఖ్యంగా  పిల్లలు చాలామంది ఇళ్ళల్లో  భోజనము చేయడానికి  చాలా పేచీ పెడుతున్నారు*


*చచ్చి చెడీ మనిషో కో రకం  చేసినా , తీరా భోజన సమయానికి  పీజాలు , పానీ పూరీలు , కుర్ కురేలు లాంటి జంక్ ఫుడ్స్  బయట తినేసి ఇంటికి వస్తారు.*


*అమ్మ భోజనం చేయ మానగానే , నాకాకలిగా లేదు . అన్నం వద్దని మారాం చేస్తారు . ఈ మారానికి  ఆడ మగ తేడా అనేదే  లేదు.*


*పిల్లలంటే  ఏ పదేళ్ళ లోపు వారంటే మీరు పప్పులో కాలేసినట్లే.*


*ఇంజనీరింగ్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ , డిగ్రీ ఫైనల్ ఇయర్  చదువుకునే యువతీ యువకులు కూడా ఇందులో  ఏమీ మినహాయింపు  కాదు.*


*వాళ్ళమ్మలకు   తిండి దగ్గర ఎంత వరకు నరకం చూపించాలో అంత వరకు చూపిస్తారు*


*రాత్రి 11 దాటినా అన్నం తినరు*


*వండిన కూరలు అన్నం చూసుకుని తల్లి దిగులుపడి తినమని బ్రతిమలాడితే అమ్మ మీద దయ తలచి  "అయితే  మాకు ముద్దలు కలిపి పెట్టు. అలా పెడితేనే తింటాం " అని అమ్మకు కండిషన్ పెడతారు.*


*పగలల్లా గొడ్డులా ఇంటి చాకిరీ సమస్తం చేసి , అర్ధరాత్రి డస్సిపోయి నిద్ర కళ్ళతో తూగుతూ అమ్మ ఈ పిల్లలకు ముద్దలు కలిపి నోట్లో పెట్టాలి*


*ఈ ముద్దలు కలిపే ప్రహసనం రాత్రే కాదు ఉదయం కూడా . ఒక డిష్ లో కలిపిన అన్నం తీసుకుని ,   అమ్మ పిల్లల వెనక పిల్లలు  స్కూల్ కు , కాలేజీ కి బయల్దేరే దాకా  వారి వెనకాల పరిగెత్తుతూనే ఉంటుంది.*


*ఉద్యోగాలుచేసే మాతృమూర్తులకు మరిన్ని సమస్యలు అదనం*


*వాస్తవానికి  భోజనము  చేయడానికి  ఎంత సేపు పడుతుంది ?*


*చాలా విశ్రాంతిగా తిన్నా  20 నిముషాలు మించి పట్టదు*


*రోజు మొత్తములోని  24 గంటలలో 20 నిముషాలు  భోజనము  చేయడానికి  సమయం  పిల్లలకు  దొరకదా ? వారు ఆ 20  నిముషాల  సమయాన్ని  కూడా  తమంతట తాము తినడానికి  కేటాయించ లేరా ?*


*సమయం దొరకక పోవడానికి  ప్రధాన కారణం ,  రాత్రి  పది లోపు పడుకుని ఉదయం 5 గంటలకు లేవ వలసిన  పిల్లలు , రాత్రి ఒంటి గంట దాకా T.V. లో నానా చెత్త ప్రోగ్రాం లు చూసి అప్పుడు పడుకుని ఉదయం 9,10 గంటలు దాటాక లేచి , ఉరుకులు పరుగులు పెడుతూ " టిఫిన్ వద్దు , భోజనము  వద్దు , లంచ్ బాక్స్ వద్దు టైం లేదు  " అని నానా హడావుడి చేసి అమ్మను నానా హైరాన పెట్టేస్తారు*


*తర్వాత వీళ్ళకు  పెళ్ళిళై , ఉద్యోగాలకు పరిగెత్తుతూ, పిల్లల్ని కని అమ్మ నెత్తిన  పడేసి ,  తమ సంతానానికి  కూడా చాకిరీ చేసే అయాగా  అమ్మను చేసేస్తారు.*


*మళ్ళీ అమ్మ కష్టాల కధ  ప్రారంభం ..*


*అప్పటికే  ఆ తల్లులకు 60 దాటి పోయి వయస్సు పై బడి , శరీరంలో ఓపిక నశించి , కాళ్ళ నెప్పులు , కీళ్ళ నెప్పులు , బి .పి .  , షుగర్ , ఆయాసం , నీరసం , గుండె దడ వంటి వ్యాధులతో పీడించబడి బాధపడుతూ చాకిరీ చేయలేక, చేయడానికి  ఓపిక లేదని ఎవరికీ చెప్పుకోలేక తమ లో తామే నా జీవితం ఇంతేనా ? ఈ చాకిరీకి అంతం లేదా ? దేవుడా !! ఏం పాపం చేసాను ? అని శోకించిన తల్లుల గురించి కూడా  నాకు తెలుసు.  అలాంటి వారిని నేను ప్రత్యక్షంగా  చూసాను. వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళని చాకిరీ చేస్తారు ?*


*ఈ  బాధలు చాలవన్నట్లు ,  భర్త  ఆఫీసు నుంచి  లేటుగా విసుగ్గా  వచ్చి అడుగుతాడు భార్యను " పిల్లలు భోంచేసారా ? " అని. " ఇంకా తినలేదండీ " అనగానే కారణం దొరికింది  కనుక " పిల్లలకు అన్నాలు కూడా పెట్టకుండా ఇంతవరకు  నువ్వు వెలగబెడుతున్న రాచకార్యమేమిటి ?" అని భార్య మీద ఇంతెత్తున ఎగిరి పడతాడు. ఆ సమయానికి ఆ ఇల్లాలు  అప్పుడే తీరుబడై   ఏ  T.V . నో చూస్తూ కూచుని ఉందనుకోండి , ఇక ఆయన ఉగ్ర నరసింహావతారం దాలుస్తాడు.*


*అంటే వేళకి భోజనము  చేయని  పిల్లల వల్ల మాటలు పడుతోంది  మీ అమ్మ గారు. గ్రహించారా ?*


*మరి దీనికి పరిష్కారం?* -


 *తన తల్లి పడుతున్న కష్టాన్ని సంతానమైన అబ్బాయి కాని అమ్మాయి కాని గ్రహించాలి. అర్ధం చేసుకోవాలి ..*


🤱🤱🤱🤱🤱🤱🤱🤱


*తల్లికి సాయంచేసే  విషయంలో ప్రతి బిడ్డా భాగం పంచుకోవాలి, వంటలో సాయం చేసే మాట దేవునికి ఎరుక. కనీసం మీ తిండి అయినా మీరు తినక పోతే ఎలా ?*


*25 ఏళ్ళు వచ్చినా డిగ్రీలు పూర్తయాక కూడా అమ్మ అన్నం  ముద్దలు కలిపి మీ నోట్లో పెట్టాలంటే ఆమెకు ఒంట్లో  ఓపిక ఉండవద్దా ?*


*ఈ విషయాలు కూడా చదువుకున్న వారికి  మరొకరు  చెప్పాలా .. ?*


*మాకన్నా ఉన్నతమైన  చదువులు చదువుతున్న వారు మీరు,* 

*మీ అంతట మీరే  ఆలోచించుకోండి ...*


*అమ్మ కనిపించే దేవత, ఆమె కంట నీరొలకనివ్వకండి. పువ్వుల్లో పెట్టి చూడండి. నవమాసాలూ‌మోసి, కని, దాసీగా మనలను సాకుతున్న దేవతామూర్తికి మనం ఏమిచ్చినా తక్కువే. ప్రతీ మాతృమూర్తికీ పాదాభివందనం*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అగ్నిహోత్రుడికి

 శ్లో||

కాళీ కరాళీ చ మనోజవా చ, సులోహితాయా చ సుధూమ్రమవర్ణా,

స్ఫులింగినీ విశ్వరుచీ చ దేవీ లేలాయమానా ఇతి సప్త జిహ్వాః || 

శౌనకా!? కాళీ, కరాళీ, మనోజవా, సులోహితా, సుధూమ్రవర్ణా, స్ఫులింగినీ, విశ్వరుచీ అనే ఈ భుగభుగలాడే ఏడు అగ్నులూ అగ్నిహోత్రుడికి ఏడు నాలుకలు.....

సూక్తిసుధ

 .

                _*సూక్తిసుధ*_


*


*చచ్చియు బ్రతికియుండేవారు:*


పరోపకారముగా గుంటలు బావులు చెరువులు మొదలైన జలాధారములు గలుగజేసిన వాడున్ను  తోటలుదొరువులు మొదలైనవి గలుగుజేసినవాడును, గుళ్ళుగోపురములు సత్రములు చావళ్ళుగట్టించినవాడును, అగ్రహారము మొదలగు శాశ్వత ధర్మములు చేసినవాడును, నీతి తప్పని రాజును యుద్ధరంగమునందు వెనుకదీయనివాడును, గొప్పవిద్య నేర్చినవాడును, కృతి యొనర్చినవాడును కృతియందిన వాడును సత్పుత్రునిగన్న వాడును, వీరు చచ్చియు బ్రతికియున్నవారు బ్రతికియు చచ్చినవారు.:*


పరోపకారముగా గుంటలు బావులు చెరువులు మొదలైన జలాధారములు గలుగజేసిన వాడున్ను  తోటలుదొరువులు మొదలైనవి గలుగుజేసినవాడును, గుళ్ళుగోపురములు సత్రములు చావళ్ళుగట్టించినవాడును, అగ్రహారము మొదలగు శాశ్వత ధర్మములు చేసినవాడును, నీతి తప్పని రాజును యుద్ధరంగమునందు వెనుకదీయనివాడును, గొప్పవిద్య నేర్చినవాడును, కృతి యొనర్చినవాడును కృతియందిన వాడును సత్పుత్రునిగన్న వాడును, వీరు చచ్చియు బ్రతికియున్నవారు బ్రతికియు చచ్చినవారు.

సుభాషితమ్

 .


             _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝

*ఉత్సాహస్సాహసం  ధైర్యం!* 

*బుద్ధిశ్శక్తిః పరాక్రమః!*

*షడేతే యత్ర  తిష్ఠన్తి*! 

*తత్ర దేవోఽపి తిష్ఠతి!!*


తా𝕝𝕝 

*ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం అనే ఆరు గుణాలు ఎక్కడుంటాయో అక్కడ దైవం కూడా ఉంటాడు*....

--------------------------------------------------


              _*సుభాషితమ్*_

             ~సుభాషితరత్నకోశః


𝕝𝕝శ్లో𝕝𝕝

*యత్ పుణ్యఫలమాప్నోతి గాం దత్త్వా విధివద్ గురోః|*

 *తత్ పుణ్యఫలమాప్నోతి భిక్షాం దత్త్వా ద్విజో గృహీ||*

                                  


𝕝𝕝తా𝕝𝕝 

*విధివిధానంగా గోవును గురువుకు దానంచేస్తే ఎంతపుణ్యం లభిస్తుందో... ఇంటికి వచ్చిన ద్విజునకు (బ్రాహ్మణునకు) బిక్షను సమర్పిస్తేకూడా అంతపుణ్యమూ లభిస్తుంది.*