ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
16, అక్టోబర్ 2024, బుధవారం
16-10-2024) రాశి ఫలితాలు
ఈ రోజు (16-10-2024) రాశి ఫలితాలు
గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు
మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి
సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును
మీకు నమ్మకం కలిగించడానికి మా వల్ల మా యాగం వల్ల ప్రయోజనం పొందిన వారి వివరాలు ఇవ్వగలం
మేషం
16-10-2024
పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృషభం
16-10-2024
కుటుంబ సంబంధిత వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగమున వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ విషయంలో అవరోధాలు తప్పవు. నూతన వ్యాపారాలు ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం.
మిధునం
16-10-2024
నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటకం
16-10-2024
గృహమున సంతాన శుభకార్యాల పై చర్చలు జరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగపరంగా ఒత్తిడిని అధిగమించి పనులను పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక అనుకూలత పెరుగుతుంది.
సింహం
16-10-2024
ముఖ్యమైన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కొన్ని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగమున స్వల్ప ఇబ్బందులుంటాయి.
కన్య
16-10-2024
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
తుల
16-10-2024
వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ధన మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలలో విజయం సాధిస్తారు. ఋణ సమస్యలు నుండి ఊరట కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. సంతాన వివాహ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.
వృశ్చికం
16-10-2024
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పునరాలోచన చెయ్యడం మంచిది. ముఖ్యమైన పనులలో సొంత ఆలోచనలు చేయటం మంచిది. క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
ధనస్సు
16-10-2024
ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
మకరం
16-10-2024
వాహన ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కుంభం
16-10-2024
ఇంటాబయట అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలలో విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
మీనం
16-10-2024
చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉన్న మిత్రులు సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. భూ వివాదాలు పరిష్కారంతో ఊరట పొందుతారు. వాహన క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి.
*శ్రీ ఆది శంకరాచార్య చరితము45
*శ్రీ ఆది శంకరాచార్య చరితము45 వ భాగము*
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
*సర్వజ్ఞపీఠ దక్షిణ ద్వారము:*
ఆనాటి ఉదయముననే గంగానదీ పవిత్ర జలములలో శ్రీశంకరాచార్యులు స్నాన మాచరించి నిత్య అనుష్ఠానము ముగించుకొని శాంతమూర్తియై మందహాస వదనుడై యుండుట పద్మపాదాది ప్రముఖ శిష్యులు చూచి వందనపూర్వకంగా 'ప్రభో! ఈ భరత ఖండములో వాయవ్య దిశగా ప్రఖ్యాతి చెందిన కాశ్మీర దేశములో శారదా పీఠమునకు నాలుగు మండపములు గలిగి నాలుగు ద్వారములు ఉన్నవట. దానినే సర్వజ్ఞ పీఠమని అంటారు. సర్వజ్ఞులైన వారలు మాత్రమే ఆ పీఠముల నధిరోహించుటకు అర్హులని చెప్పుదురు. దాని కున్న నాలుగు ద్వారములు నలుదిక్కు లకు నాలుగు ముఖములుగ అమర్చబడి యున్నాయి. తూర్పు ద్వారపీఠము తూర్పు దేశమును, పశ్చిమ ద్వార పీఠము పశ్చిమ దేశమును, ఉత్తరద్వార పీఠము ఉత్తర దేశమును, దక్షిణద్వార పీఠము దక్షిణ దేశమును రక్షించునని ప్రతీతి. ఏ దిశనున్న పీఠమును ఆ దేశస్థుడైన సర్వజ్ఞుడే అధిరోహించ వలెను. ఏ పీఠాధిపతి యైనను లేకున్న ఆ పీఠద్వారము మూసి వేయబడును.ఎంతో కాలము నుండి దక్షిణ ద్వార పీఠమును పరిపాలించువారు లేక మూయబడియున్నది. అందుచేత దక్షిణదేశ పరిరక్షణ లేకున్నది. అది దాక్షిణాత్యులకు అవమాన కరము కాదా? దాక్షిణాత్యులలో సర్వజ్ఞుడు పుట్టలేదని దాని అర్థం. ఈ పరిస్థితిని చక్కచేయు భారము తమయందు గలదని నివేదించు వారము' అని ప్రోత్సహించారు.
*పీఠారోహణ పరీక్ష:*
విశాలహృదయం గల వారలకు విశ్వమే కుటుంబమగును. అట్టి వారు తన కుటుంబ అవమానమును భరించగలరా? కాశ్మీరదేశమందు గల సర్వజ్ఞపీఠ దక్షిణ ద్వారమును తెరచి దాక్షిణాత్యుల అవమానము రూపుమాపుటకు నిశ్చయించారు శ్రీ ఆచార్య స్వామి. ఆయన కష్టసుఖముల నెఱుగని ధీరుడు. జయాపజయ ములను ఆయన యెఱుగడు. ఎన్ని భరించిను తనవారి బాధలుమాత్రం భరించెడి వాడు కాడు. అదే ఆయనలో గర్భితమై యున్న విశ్వప్రేమ. మత్తేభములను మించిన అద్వైతతత్త్వజ్ఞులు, సింహ శార్దూలములను క్రుంగదీయు విజ్ఞులు శ్రీశంకరాచార్య శిష్యగణ మందు లెక్కకు మిక్కిలిగా నున్నారు. లంకాపతిని సంహరించుటకు నరకులపతి తోడ కపికులపతి, కపికులములు వెంట నంటినట్లు శ్రీశంకర శిష్య గణము శ్రీగురు దేవుల ననుసరించి, జయజయ ధ్వానములు సల్పుచు ఆనందవారాశిలో మునుగుతూ కాశ్మీరమునకు పయనమై పోవుచున్నారు. కొలది దినములకు కాశ్మీరదేశం జేరుకొని సర్వజ్ఞ పీఠ ప్రదేశమును తెలిసి కొనిరి. సర్వజ్ఞపీఠ దక్షిణ ద్వారము తెరచుటకు అనేక అవరోధములు గలవని ప్రతివాదులు చెప్పగా విన్నారు. తెలుపబడిన అడ్డములు అవరోధములు గావని నిశ్చయించి మొదటి అడ్డమునుజేరుకొన్నారు. అచ్చట, 'ఎవరయ్యా మీరు? మహా ఒడిదుడు కుగ వస్తున్నారు? ఆగండి! చాలమంది రావడం, వెళ్ళడమైంది. ఇక్కడ ఒక పరీక్ష గలదు. అందు నెగ్గివెళ్ళాలి. నీకేమైన మా పరీక్షకు తట్టుకొను ధీమా ఉన్నదా? ఉంటే మాపరీక్షకు సిద్ధపడు! మా సర్వజ్ఞ పరీక్షలో నెగ్గినప్పుడు మార్గావరోధం లేకుండ చేస్తాము' అన్నారు అచ్చట ఉన్న ప్రతివాది బృందము.
శ్రీజగద్గురువులా పలుకు లాలకించి, ఓహో! అదా మీఅభ్యంతరం! మీరడిగే దేదోఅడగండి. నేనందులకు సిద్ధముగ నుంటిని’ అన్నారు. ప్రతివాదులు 'మిమ్మల్ని పరీక్షించు వారు రానై యున్నారు. తొందర పడకుడు. వారు వచ్చుదనుక కొలది సేపు ఇచ్చట విశ్రమిం చండి' అని శ్రీశంకరులను ఆపుజేసిరి.
శ్రీశంకరులరాక అందరికీ తెలిసినది. వారందరు శ్రీఆచార్యస్వామిప్రభావం వినిన వారుకాదు. పరీక్షా ధికారులకు వర్తమానం పంపగా కఠినపరీక్ష జరుపుటకుఆయత్తపడుటతో వేళ తప్పినది. అంతవరకు సమీపంగా ఉన్న ఒక దిబ్బమీద శ్రీ ఆచార్య దేవులు విశ్రమించారు. ఆ మిట్టను 'శంకరమిట్ట' యని పిలుస్తారు. కాణాద మతమునకు చెందిన పరీక్షాధికారి వచ్చిశ్రీ శంకరులను పరీక్షకు పిలచెను. అంతట ఈ దిగువరీతిని పరీక్ష జరిగింది.
కాణాదుడు: ఏమయ్యా! నీవేనా పరీక్షకు వచ్చావు? బాగున్నది! మా మతరహస్యములను ఎఱుగుదువా? లేక పారి పోతావా?
*శంకరాచార్యులు: సంశయమేల?*
కాణాదుడు: పారిపోవుటకా?
శంకరాచార్యులు: మిమ్ములను జయించుటకు!
కాణాదుడు : సరే! షడ్భావములు చెప్పగలవా?
శంకరాచార్యులు: ద్రవ్య, గుణ, కర్మ సామాన్య, విశేష,సమవాయము లను నారింటిని కాణాద మత మందు షడ్భావము లందురు.
కాణాదుడు: సంయోగం పొందిన పరమాణు ద్వయము నుండి సూక్ష్మమైన అణుద్వయం ఉత్పన్నమైనదని మామత మందు గల రహస్యము. ఆద్యణుక మును ఆశ్రయించు కొని మహా సూక్ష్మమైన అణువు దేనివలన జనించుచున్నది?
శంకరాచార్యులు: అదియా! చెప్పెద వినుడు! ద్విత్వసంఖ్యలే అందుకు కారణము.
కాణాదుడు : స్వామీ! సర్వజ్ఞత్వం తమకే గలదు! తాము విజయ మును సాధించిరి. సర్వజ్ఞ పీఠము నధిరో హించుటకు సమర్ధుల య్యారు.
కాణాదులట్లు ప్రకటించుటతో అచ్చోటనున్న వారందరు జయజయ ధ్వానములు మిన్ను ముట్టునట్లు గావించారు. ప్రధమ అవరోధము ఈ విధముగ లీలగ దాటిపోవుచుండ కొంత ఉదవ్వేగు నప్పటికి, నైయాయకుడడ్డు తగిలి, ‘ఆచార్య స్వామీ! తమ ప్రభ కొంచెం విన్నాను. కాణాద మతస్థులను జయించారట! బాగున్నది! కాని మా మతమును గురించి పరీక్షనిచ్చి అందుత్తీర్ణులై ఈ గట్టు దాటవలెను.
శంకరాచార్యులు: కానిండు
నైయాయికుడు :కణాద ముని మతము (కాణాదము)నకును, గౌతమ మతమునకును ముక్తి విషయమందున్న భేద మేమున్నదో చెప్పండి!
శంకరాచార్యులు: గుణ సంబంధము నాశనమయినగాని ముక్తిరాదు అందురు కాణాదులు. గుణసంబంధము నాశన మయినను అందు జ్ఞానముండి యుండ వచ్చును. అట్టిస్థితినే మోక్షమనుచున్నారు గౌతమ మతస్థులు. ఇరు మతములలో గుణనాశము, ఆకాశ సదృశస్థితి సమాన ధర్మములు.
(1) గౌతమ మతమందు 'జ్ఞానము కలిగియుండ వలె'నన్నది హెచ్చుగ నున్నది.
(2) ఈ రెండు మతములలోను పదార్థ భేదము సమానము. పరమేశ్వరుడు నిమిత్త కారణం గలవాడని ఇరుమతముల వారు అంగీకరిస్తారు.
నైయాయికుడు : బాగుగా చెప్పితివయ్యా! చాల దిట్టవలె కన్పట్టు చున్నావు. సర్వజ్ఞుడ వైతివి! సర్వజ్ఞ పీఠాధి రోహణకు వెళ్ళుమా!
అట్లు రెండవ అడ్డమును తొలగించుకొని ముందుకు జనునంత సాంఖ్యులడ్డు తగిలి పరీక్షనిచ్చి, తృప్తిపరచమనిరి. అందులకు ఆచార్య స్వామి సంసిద్ధుడే కదా!
సాంఖ్య పరీక్ష -
సాంఖ్యుడు: శంకరాచార్యస్వామీ! మూలప్రకృతి స్వతంత్రముగ జగత్కారణ మగుచున్నదా? లేక పరమాత్మ నాశ్రయించి జగత్తునకు కారణమగు చున్నదా?
శంకరాచార్యులు: మూలప్రకృతి సర్వ జగత్కారణమని సామాన్యముగ అందరనేమాట. సాంఖ్యులు గూడ అట్లే పలుకుదురు. వేదాంతులట్లు గాక అస్వతంత్రముగ జగత్కారణ మగుచున్నదని తెలుపుదురు. అయితే పరబ్రహ్మమేసర్వమునకు కారణమని న్యాయ ధర్మము.
సాంఖ్యుడు: యతీశ్వరా! మీ సమాధానము మమ్మెంతో సంతస పరచినది. ఇంక నీ ఇచ్ఛ చొప్పునపోయి సర్వజ్ఞ పీఠము నధిరోహించ నగును. సర్వజ్ఞుడవు! శెలవిండు!
ముందుకు చరచర పోవుచుండగా శ్రీశంకరులకు బౌద్ధుడు అడ్డు తగిలి,
'ఏమయ్యా! శంకరా చార్యా! ఆ వేగం తగ్గించు! చాల అడ్డములు దాటి వస్తివి. అవన్నియు అడ్డములు కావు. మా అడ్డమే గడ్డు! ఆగి, మా పరీక్షకు సమాధానములు పలికి మమ్ములను తృప్తిపరిచి మరీ పోవలెను.
శంకరాచార్యులు : మీ యభీష్ట మేదియో వివరించండి.
బౌద్ధపరీక్షాధికారి: యతీశ్వరా! బాహ్య పదార్ధములెన్ని? అవేవి?
శంకరాచార్యులు: సౌత్రాంతకములు, వైభాషికములను రెండు తెరగులనున్నవి.
బౌద్ధపరీక్షాధికారి: ఆ రెండింటికి గల భేదమేమి?
శంకరాచార్యులు: సౌత్రాంతికములో వేద్య జాత మంతయు అనుమాన గమ్యముగ జెప్పబడియున్నది. ఈ రెండు వైభాషికము ప్రత్యక్ష ప్రమాణముగ చెప్పబడి యున్నది. ఈ రెంటికి క్షణ భంగురత్వం సమానమని చెప్పబడు చున్నది.
బౌద్ధపరీక్షాధికారి: మా విజ్ఞానమునకు వేదాంతుల విజ్ఞానమునకు గల భేదము చెప్పగలవా?
శంకరాచార్యులు:విజ్ఞానములో క్షణికత్వము, బహుత్వము ఉన్నదని మీ విజ్ఞాన వాదు లందురు. జ్ఞానము ఏకత్వమని స్థిరత్వము గలదియని వేదాంతుల నిశ్చయము. ఇదియే వారిరువురకు గల తారతమ్యము.
అని వివరించుటతో బౌద్ధపరీక్షాధికారి మెచ్చి తన అభ్యంతరము తొలగించెను. అంతట శ్రీ జగద్గురువులు ముందునకు పోవుచుండ జైన మతస్థుడడ్డు తగిలి పరీక్షలిచ్చి అందుత్తీర్ణుడై జనుమనెను.
జైనుడిటుల ప్రశ్నించెను.
‘యతీశ్వరా! మీకు తెలియని రహస్యము లుండవు. ఈ ఒక్క రహస్యమును బహిర్గత మొనరించండి. అదినిజ మైనచో మీ మార్గమున కవరోధముండదు.
శంకరాచార్యులు: కానిండు.
జైనుడు: అస్తి కాయ శబ్దము వివరించుడు!
శంకరాచార్యులు: జీవాస్తి కాయము, పుద్దలాస్తి కాయము, ధర్మాస్తి కాయము, ఆకాశాస్త్రి కాయము, కాలకాయము అనునవి అయిదు. ఈ పంచాస్తి కాయములు మీ మతమందు ప్రధానము.
అంతట జైన మతస్థులు శ్రీ శంకరాచార్యుల యెడ అపరిమితం ఆనందము ప్రకటించుచు జయజయ ధ్వానములు గావించిరి.
దారి ఇచ్చుటతో శ్రీ ఆచార్యస్వామి ముందునకు సాగుచుండిరి. అంతలో నొక జైమిని మతస్థుడు ప్రత్యక్షమై,
జైమినీయుడు: మాకు వేదము ప్రధానమైనది. ఎరుగుదువా? మేము జైమినీ మతములోని వారము. మా మతము నందు శబ్దస్వరూపమేది? ఆ శబ్దము ద్రవ్యమా? గుణమా? చెప్పి దాటుము!
శంకరాచార్యులు: అకారాది అక్షరములు అంతటా వ్యాపించి యున్నవి. ఇవి చెవులకు మాత్రము వినబడునవి. ఈ అక్షర సముదాయము గుణము కాదని ద్రవ్యమేయని మీ మత స్థులనుచున్నారు. ప్రళయము వచ్చినను శబ్దములు నశించవు. వేదములు గూడ నిత్యము గావని వేదాంత ములోని మాట. పరమాత్మ ఒక్కడే నిత్యమైన వాడు. ఉపనిషత్తులు గూడ పరమాత్మ జ్ఞానం కలిగిన తరువాత సచ్చిదానంద పరబ్రహ్మమే నిత్యమైనది, మిగిలిన వన్నియు కనబడునవి యగుటచే నాశంకలవియగుచున్నవి. ఇది వేదాంత మతము యొక్క పరమ రహస్యము.
జైమినీయుడు: శ్రీశంకరాచార్యా! ఇంతటితో మీ సర్వజ్ఞత లోకమునకు వ్యక్తమాయెను. ముందు మీకడ్డములు లేవు. ఇదియే ఆఖరి పరీక్ష.
మహానుభావా! మీ మహిమ వర్ణించ ఈనాటివారి తరమా! ఆచారముననుసరించి పరీక్ష జరుప బడినదిగాని మిమ్ములను పరీక్షించ మా తరమా! ఈ క్షణము లోకమునకుపండుగైనది .( పండగ అయింది )
అంతలో పద్మపాదుని చేయి పట్టుకొనియుండ,,వారల కిరుపార్శ్వముల యందు వింజామరలు వీచుచుండిరి. ఛత్రముల పట్టి బహుపరాకులు పలుకుచుండగ శిష్య,ప్రశిష్యులు జయజయ నినాదములు భూన భోంత రాళములలో ప్రతిధ్వ నించుచుండ శ్రీశంకరావతార మూర్తి చిద్విలాసుడై సర్వజ్ఞ పీఠాధిరోహణకు నిరాటంకముగ జనుచున్నారు.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 45 వ భాగము సమాప్తము*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 44
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 44 వ భాగము*
🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕
శ్రీ శంకరాచార్యులకు వచ్చిన వ్యాధిని నిర్లక్ష్యము చేయవలదని శిష్యులాడిన మాటలు విని శ్రీగురుదేవులు పలుకాడలేదు. అంతట వారలు దిగులొంది, 'దీనదయాళో! దేహాభి మానం కించిత్తైనను తమకు లేని కతమున వ్యాధి యననేమొ తెలియ రాకున్నది. ఇందు ఆవంతైనను అసత్యం లేదు. మేము తమ వ్యాధిజూచి సహించ జాల కున్నాము. బాంధవా! ఈ వ్యాధిని కుదర్చగల భిషగ్వరులు ఉన్నారు. వాళ్ళు పరీక్షిం చుటకు అనుమతి నొసంగుడు. కన్నులార గాంచి మిన్న కుండుట తమకు ధర్మం కాదు. దానిని నయంజేయు నుపాయమును అన్వేషించకుండ నుండటయు మాకు పాడిగాదు. తమకీ ధర్మములు తెలియనివి గావు.పుష్పములనుఆశ్రయించు కొని తుమ్మెదలు అందున్న మధువును ముదముతో పీల్చు మాడ్కి, తమ పాద పద్మముల నాశ్రయించు కొని వాక్సుధారసము నాస్వాదించుచు సుఖముగ కాలము గడుపు చున్నారము. తమకు ఏలాటి అస్వస్థత లేకుండ నుండవలెనని కోరుచుందుము గదా! కావున మా మాట మన్నించి వ్యాధికి తగు చికిత్సకై త్వర పడుదురని వేడుకొను చున్నారము!' అని ప్రార్ధించిరి.
అప్పుడా శిష్యుల పలుకులు విని శ్రీశంకరా చార్యులు, 'బిడ్డలారా! నిజమును గ్రహించుడు. రోగ మనునది గతజన్మలో చేసిన పాపకర్మ ఫలితమను రహస్యము మీరలు ఎరిగియున్నారు. అనుభవించిన నయమగును గదా! ఏ కారణము వలననైనను కర్మఫలము పూర్తిగ అనుభవించ కున్నచో శేషించిన దానికై మరి జన్మనెత్త వలసి యుండును. వ్యాధి నశించుటతో కర్మఫలము పూర్తియగును. ఈవిధాన మంతయు శాస్త్రముల యందు విపుల పరచబడి యున్నది. మీకింత తొందరేల? ఇందు మరియొక రహస్యము ఇమిడి యున్నది, వినుడు! గతజన్మలోని పాపకర్మవలన సంభవించు రోగము చికిత్సల వలన నయము కాదు. నా వ్యాధి అట్టిదగుటచే దాని ననుభవించిన నిర్మూల మగును. దీనికి వేరొక మార్గము కానరాదు. ఈ వ్యాధితో ఈ శరీరము పోయినను నాకు భయము లేదు. ఇది ఎప్పటికైనను పోవు నదే గనుక అట్టిదానికై విచార మేల?'అనివివరించారు. అంత మాత్రాన శిష్యులు ఊరుకొందురా?
*చికిత్స:*
శ్రీశంకరపాదులు భగందర వ్యాధికి చికిత్స నంగీకరింప కుండుట వలన శిష్యులకు ఆందోళన హెచ్చి, 'పరమాత్మా! తమవంటి వారలకు తామన్నట్లు తనువులపై ఆశలుండక పోవుట నిజము, సహజము కూడ. దానిని కాదన జాలము. ఆర్తత్రాణ పరాయణా! మా మనవివిని కాదనకుడు. మమ్ములను కరుణించుడు! తమ శరీరము మావంటి శరీరము కాదు. పరమ పవిత్రమైనది. మా శరీరములు పాంచభౌతికములు. తమది,దివ్యశరీరము. అలాంటి తమశరీరము బహుకాల ముండవలెనని మేమెల్లప్పుడు కోరుచుందుము. జలచరములకు నీరము ఎట్లాధారమో తమ శరీరము మాకట్లు ఆధారమై యున్నది. అట్టి యోగప్రదమైన మీ శరీరమును రక్షించుకొనడమే మా విధి. అదియే మాకు పరమ రక్షణ. తమ రక్షణ మాకు లేనినాడు మాకు వినాశమే గతి. దయా సముద్రులు మమ్ములను కాపాడవలెనన్న తమ శరీరము నకు రక్షణ అవసరం గదా! తమకు కావలసిన దేదియు లేదు. కాని లోకమును రక్షించుటకు శరీరరక్షణ ముఖ్యావసర మగుచున్నది. ప్రభో! లోకంతో పాటు మమ్ములను గూడ రక్షించుడు! జగద్రక్షకా! తప్పక ఈ వ్యాధికి చికిత్స చేయుటకు అనుమతించుడు!’ అని పరిపరి విధముల గురుదేవులను అర్ధించారు.
శ్రీశంకర గురువర్యులు శిష్యుల సంతాపము సహించనొల్లక దయ గలిగినలు దిక్కులకు పోయి భిషగ్వరులను గొని తెండని శిష్యుల కానతిచ్చిరి. పేదకు దొరికిన పెన్నిధి వలె ఉప్పొంగి గుర్వాజ్ఞను శిరసావహించి అందుకు సమర్ధులైన శిష్యులు కొందరు సమర్థులైన వైద్య శిరోమణులకై పయనమైపోయిరి. కొంత దవ్వేగునప్పటికి అనుభవము గల వైద్యులను వెదకి పట్టుకొనిరి. వారితో జగద్గురువుల స్థితి దెలిపి అంగీకరింప జేయగ శిష్యులు భిషగ్వరులను వెంట నిడుకొని గురువుల కడకుదెచ్చిరి. శిష్య గణము వైద్యులను తగు విధముగ గౌరవించి శ్రీశంకర పాదులను జూపిరి. అంతట భిషగ్వరులు శంకరుల కడ నిలువబడి వినయ విధేయతలతో నమస్కా రములర్పించి, స్వామీ! మీ వ్యాధి వివరింపుడు. మేము చేయగలిగిన దంతయు చేయ సిద్దముగ నుంటిమి. సెలవిండు! అని విన్నవించిరి.
'భిషగ్వరులారా! ఈ వ్యాధి లోపల ఉత్పత్తి కాబడి ఆసన సమీప మందు బహిర్గత మగు చున్నది. దీనికేదైన మందు ఉన్నచో ప్రయో గించుడు! పూర్వజన్మ కృత పాపకర్మఫలితముగ ఈరోగమంకు రించినదని నాయొక్క నిశ్చయము. అనుభవిం చినచో నయమగునని నా నిశ్చయము. అందులకై చికిత్స నిచ్చగింప కుంటిని. శిష్యుల బలవంతంతో మిమ్ము రావించితిని. మీకేదైన అనువుగనుపించిన మీ పని మీరు చేయుడు!' అని శంకరులు తెలియ జేశారు.
అంతట అశ్వనీదేవతల వంటి వైద్యశిఖామణులు తమకు ఉన్న అనుభవ మును పురస్కరించుకొని శాస్త్రీయమైన చికిత్స జేసిరి. వారలెంతటి శాస్త్రజ్ఞానం గలిగియున్నా ఎట్టి అనుభవము గలవారైనను ఎట్టి మందులు ఉపయోగిం చినను మందుల దారి మందులది. రోగం దారి రోగానిది అయినది. పైగా రోగము ఆ క్షణమున కాక్షణము తీవ్రరూపం దాల్చుచున్నది. అట్లైనను వేయికండ్లతో కనిపెట్టు కొని చికిత్స జేయుచునే యున్నారు. అట్లయినను భిషగ్వరులు విఫలమనో రథులైనారు.
అంతట శ్రీశంకరాచార్య స్వామి, వారి ముఖవైఖరి కనిపెట్టి, వైద్య శిఖామణులారా! చింత నొందకుడు! రోగములు సాధ్యా సాధ్యములుగ నున్నవి. అసాధ్యమేరికి శక్యము? మీరిచ్చోటు జేరి బహుదినము లైనది. మీ కొఱకెందరెందరో వేచి యుందురు. మీ రాకకై వారెదురు జూచు చుందురు. మీరచ్చట లేని లోటు ఎంతైన నుండును’ అని మెల్లగ పలికిరి.
అంతట వైద్యులు ముకుళిత హస్తులై, సంయమివరా! తాము
వచించినదంతయు సత్యమే. రోగ మని భ్రమించి చికిత్స నొసంగితిమి. ఇయ్యది మా అనుభవం మేరకు రోగము వలె గన్పట్టుట లేదు. ఇది కర్మ ఫలితమువలె గోచరించు చున్నది. మిమ్ములను విడనాడి పోవజాల కుంటిమి. అనేక మంది మిమ్ముల నాశ్రయించుకొని తమ వాగమృతమును పానం జేయుచున్నారు. మాకట్టి యోగ్యత ఎప్పటికి ప్రాప్తించునో కదా! అనుగ్రహించిన నిజ నివాసములకు జేరగల'మని విధేయులై విన్నవించగ శంకరులు నారాయణ స్మరణలు పలికిరి. అంతట వారు నిజనివాసములు జేరు కొనిరి.
పద్మపాదుడు గురుదేవులను వదలునా? గురు దేవులవ్యాధి తొలగుటకు ఉపాయ మాలోచించెను.
*పద్మపాదుడు యోగశక్తిచే వ్యాధి కుదుర్చుట:*
శ్రీజగద్గురువులకు చికిత్స కావలెనన్న కోరిక వైద్యులరాక తీరినను వైద్యులు చేయునది లేక తిరిగిపోవడంజూచి నిస్పృహజెంది యున్నారు సంయమీంద్రులు శరీర మునుమరచి నిర్వికల్ప సమాధిలో తమనిజ రూపమును లోపలి దృష్టితో చూచుకొను చున్నారు. అది శిష్యులను మరింత కలవర పరచినది. శిష్యకోటి క్రుంగిపోవుట పద్మపాదుడు కనిపెట్టి తదేక దృష్టితో యోచించెను.
'శంకరుడే శ్రీశంకరా చార్యులై యవతరించెను. అట్టివానికి పురాకృత పాపము ఎట్లు రావీల గును? శ్రీగురుదేవులన్నది సరికాదు. అది శాస్త్రవిషయ ధర్మము. మహావైద్యులు ఇది రోగము కాదనిరి. అట్టివారలను కాదను అవకాశము గలదా? సరే! ఇంక రోగ మంకురించుటకు హేతువేమై యుండ వలెను? దేశ మంతయు కలయదిరిగి తిమి. స్వామి మంత్ర తంత్రజ్ఞులైన వారి నెందరినో జయించి యున్నారు. అశ్వనీదేవతలను మించిన వైద్యుల పలుకులు, నా అనుమా నమునకు బలము చేకూర్చు చున్నవి. సందేహమేల! ప్రభువర్యులకెవరో దుర్మార్గుడు ఏదో మారణహోమం ప్రయోగము చేసి యుంటాడు. లేకున్న ఇంతఘోర మేల?” అని నిశ్చయించి తన ఇష్టదైవ మయిన శ్రీ నరసింహస్వామిని మనసా ఒక్కసారి ధ్యానించి ప్రార్థించాడు. ఆయనకు ఉపాసనా బలం చేత
భగవదనుగ్రహం గలుగుటతో, 'శ్రీగురు దేవులకు చేసిన ప్రయోగం వెనుకకు మరలుగాక!' అని సంకల్పం చేశాడు పద్మ పాదుడు. ఆయన కోరిక శ్రీనరసింహ స్వామి మన్నించారు. అందులకు శంక యేల? ఆ క్షణంలో శ్రీశంకరులకు అంకురించిన భగందర వ్యాధి వెనుకకు మరలి ప్రయోగం చేసిన కపట శిష్యుడై యున్న అభినవ గుప్తుని ఆవహించినది. శంకరాచార్యస్వామి అద్భుతముగ కోలుకొను చున్నారు. అభినవ గుప్తుడు వ్యాధికి బలి అయ్యాడు. పిమ్మట పరిపూర్ణ ఆరోగ్యము శ్రీ శంకరునిలో ఉదయించినది. ఆ ప్రాంగణ మంతా ఆనందసాగర మందు మునిగితేలియాడి పద్మపాదుని వేనోళ్ళ కొనియాడిరి.
*శ్రీ గౌడపాదాచార్య స్వామి:*
ఒకానొక సాయం సమయాన గంగాతీర సైకత స్థలములలో శ్రీశంకరాచార్య స్వామి సుఖా సీనుడై నిమీలిత నేత్రుడై పరమాత్మ ధ్యానంలో నుండియున్న సమయమున శ్రీగౌడ పాదాచార్యస్వామి కాషాయాం బరములు ధరించి దండ కమండ లములను చేతబూని దేదీప్యమానముగ వెలు గొందుచు శంకరులను చూచుటకై సమీపించుచున్నారు. శ్రీశంకర పాదులది గ్రహించి పరమభక్తితో ఎదురేగి స్వాగతమిచ్చి పరమ గురువులకు సాష్టాంగ పాదాభి వందనము లాచరించి వినమ్రుడై ప్రక్కచాటుగ నిలువబడి వినయముతో
తలఒకించుక వంచి యున్నారు.
శ్రీగౌడపాదులకు శంకరులను జూచినంత ఆనంద బాష్పములు వరదలై ప్రవహించినవి. గృహస్థులు కలిసికొనినప్పుడు సాంసారిక గోష్ఠులు వెడలబోసి కొనెదరు. భూపాలుర కలయిక లో పరిపాలనా వ్యవహారములు ముచ్చ టించుకొందురు. యతులన్న బ్రహ్మజ్ఞాన సంపన్నులగుట జేసి తత్త్వవిషయములు విచారించెదరు. అట్లనే శ్రీశంకర గౌడపాదుల కలయికలో తత్త్వరహస్య ములను, లోక క్షేమమును, తత్త్వ ప్రచార సంపూర్తిని గురించి ముచ్చటించు కొన్నారు. అంతట శ్రీ శంకరాచార్య స్వామి, 'పరమగురు వర్యా! మహాత్ముల దర్శనభాగ్యం లభ్యమైన నేడు సుదినము! తమ అనుగ్రహ ప్రభావముతో మూగలు వాచాలురగు చున్నారు. కుంటివారలు కొండలు దాట గలుగు చున్నారు. పాపులు పుణ్యాత్ములగుచున్నారు. సకాములు నిష్కాములై సంయమీంద్రు లగుచున్నారు. కార్యములు నిర్విఘ్నములగు చున్నవి. తమ అపార కృపను వర్ణింప వీణావతి వెరచును. తమ నామ స్మరణ సర్వపాప హరమై అనంత పుణ్యప్రద మగుచున్నది. తమ జ్ఞానం అనంతం! అఖండం! సకలసద్గుణ సంపన్ను లగుటజేసి శ్రీశుకమహర్షికి ప్రియశిష్యు లయ్యారు! అపారకరుణా సాగరులైన శ్రీగోవింద భగవత్పాదా చార్యుల వారిని శిష్యునిగా జేసికొని తమ విజ్ఞాన సర్వస్వమును ఆయన కందించినారు. నేను వారి కటాక్షముతో సకల శాస్త్రములను సాకల్యముగ తెలిసికొన గలిగితిని. నా పూర్వ పుణ్యం కొలది తమ దర్శన భాగ్యం కలిగి పావనుడ నైతిని. అను గ్రహించుడు!' అని నిగర్వియై విన్నవించెను.
*శ్రీగౌడపాదుల ప్రశంస:*
శిష్యుడు గొప్పవాడగుట కన్న వేరొక భాగ్యము ఉండదు సద్గురువులకు. శ్రీగౌడపాదులకు శ్రీశంకరా చార్యులు ప్రశిష్యుడు. తపోభూములయందు వసించు వారలకు రవి తేజము కనుపించదా? శ్రీ శంకర సుభాషితములు వినుటతో తనలో గల ఆనందం పెల్లుబికి, 'బిడ్డా! నీ అపార సుగుణ సంపత్తి, నిర్వికల్ప ప్రవృత్తి, అసమాన విజ్ఞాన విక్రమము, పరమ శాంతము నన్నెంతగనో ముగ్ధుణ్ణి చేసి నీకడకు రప్పించినవి. నిన్ను జూడగనే మున్నెన్నడు కలుగని ఆనందమును పొందితిని. నాయనా! నే రచించిన మాండూక్యోపనిషత్తు కారికలకు నా కోరికతో భాష్యరచన చేసితివట! ఆ రచన అత్యంతం అద్భుతముగ నున్నదని శ్రీగోవిందపాదులు జెప్పగ వినియున్నాను. అద్దానిని విందామన్న కోరికతో వచ్చాను' అని వ్యక్తం చేశారు శ్రీగౌడపాదులు.
అంతట శ్రీ శంకరులు శ్రీగౌడపాదకారికలకు తానురచించిన భాష్యమును చక్కగ చదివి వినిపించారు. గౌడపాదులు మైమరచి విన్నారు.బంగారమునకు పరిమళమబ్బినట్లు భాష్యరచన జేసినందులకు శ్రీశంకరులను మెచ్చుకొని వరమొకటి ఈయ సంకల్పించి తన యభిమతమును వ్యక్తం జేయగా 'స్వామీ! తమ దర్శన భాగ్యమును మించిన వరము నాకేల! అయినను తమ కోరికను మనసా అంగీకరించు వాడను. నిశ్చింతతోడి మనసుతో సర్వదా స్వస్వరూప పరమాత్మ యందు విహరించునట్లు అనుగ్రహించుడు!' అని వినయముతో శ్రీశంకరులు వెల్లడించెను. శ్రీశంకరులు కోరిన వరమునకు మిక్కిలి సంతసించి నారాయణ స్మరణ జేయుచు గౌడపాదు లంతర్ధాను డయ్యెను. ఆనాటి రేయి ఆ గాథ నంతయు శ్రీశంకరాచార్యులు తమ శిష్యులకు వెల్లడించారు. అంతలో అరుణోదయ మయ్యింది.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 44 వ భాగముసమాప్తము*
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
*శ్రీ ఆది శంకరాచార్య చరితము43
*శ్రీ ఆది శంకరాచార్య చరితము43 వ భాగము*
🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄
అర్హుడను జైనుడు:
శ్రీశంకరాచార్యస్వామి శిష్య గణంతో బాహ్లికదేశమందు ప్రవేశించి శిష్యులకు తాము రచించిన భాష్యములను బోధించుచుండిరి. జైనులువచ్చి శ్రీశంకర పాదుల బోధలు వినుచుండెడివారు. కాని అవి వారికినచ్చి యుండలేదు. జైనమతము 'అర్హత' మనుపేరుతో వ్యవహరింప బడుచున్నది. ఒకనాడు అర్హుడొకడు శ్రీశంకరులను సమీపించి 'మా మతవిధా నము తమరొక్కసారి వినిన మీ మతమును విడిచి మా మతమును స్వీకరించగలరు! అప్పుడు మాకు శిష్యుడవై వెలుగొంద గలవు!' అని మెల్లగ వచించెను. అంతట శ్రీ శంకర పాదులు సప్త పదార్ధ ములెట్టివో వివరించ మనగ అర్హతుడు, ‘సప్తపదార్ధ విజ్ఞానముండిన గాని మోక్షము లభించదని మా మతము గాఢవిశ్వాసము గలది. ఆ సప్త పదార్ధములను సప్తభంగిచే నెఱుగవలెనను నియమముతో గూడినది మా అర్హమతము' అనివివరించి సప్తపదార్ధ వివరణము, సప్తభంగి తెఱగులు విశద పరిచెను. అంతట శంకరుడు జీవాస్తికాయము ఎట్టిదని ప్రశ్నించారు. అర్హతుడంత, 'జీవుడు దేహతుల్య మానముతో గూడి ఎనిమిది రకములైన కర్మలచే బద్ధుడైయున్నా' డనెను. అంతట శ్రీశంకర పాదులు, 'ఓయీ! శరీర పరిణామకుడైన జీవుడు మహత్తుకానేరడు.అణువుగూడ గాడు. ఘటాదులు గూడ మహత్పరిణామం గాని అణు పరిమాణం గలవి గావు. జీవుడే విధముగను రెండునుగాడు. జీవుడు మధ్య పరిణామం గలవాడు. శరీరములు చిన్న, పెద్ద, పొట్టి, పొడవుగ నుండుచు ఒకేస్థితిలేకున్నవి. మానవ జీవుడు చనిపోయిన తరువాత మానవ శరీరమును విడచి ఏనుగు శరీరమును ప్రవేశించినపుడు ఆ గజశరీర మంతటను వ్యాపించ గలడా? మానవ శరీరమెంత పరిణామం గలిగి యుండునో ఆ కొలతను బట్టి అంతవరకే గజశరీరమందిమిడి యుండి మిగిలిన గజశరీరము నిర్జీవముగ నుండవలెను. అట్లే తేనెటీగ శరీరమును ప్రవేశించినపుడు తేనెటీగ యంత పరిమాణమే ప్రవేశించి తక్కినది బయట నుండవలెను. అట్లు జరుగు చున్నదా? లేదు. కావున జీవుని పరిణామం నిశ్చితమైనది' అని శంకరులు ఖండించగ అర్హతుడు అనేక విధముల తన మతమును ప్రతిష్ఠించుటకు ప్రయత్నించి విఫలుడ య్యెను. శ్రీశంకరులు మరియొక విషయమును గురించి తెలిసికొన గోరి, ‘అర్హతుడా! ఆత్మావ యవములు చేతనములా? అచేతనములా? చేతనము లనియెదవా అప్పుడవి పరస్పరవిరుద్ధ భావములు గలిగియుండి ఐకమత్యం లేకపోవుట వలన శరీరమును బాధించుచున్నవి. లేక జడము లనెదవా మానవ దేహ పరిమితి గలవాడు జీవుడైనందున పూర్తిగా శరీరమును చైతన్యవంతం చేయజాలక పోవును గదా! ఇంక అవయవములలో చైతన్యం లేకున్నచో వృద్ధి క్షయములుండవు' అని విషయమును అందిచ్చెను. అర్హతుడదివిని, 'యతి వర్యా! గుఱ్ఱముల నేకములుగ నున్నను ఒకే విధముగ ఐకమత్యంతో రథము నెట్లు లాగుకొని పోవుచున్నవో ఆత్మావయవములు అనేకములుగ నున్నను చైతన్యం పొంది పరస్పర విరోధభావం లేకుండ ఈ శరీరమును నడుపుచున్నవి అందువలననే శరీరావయవములు శత్రుత్వం లేకుండ వృద్ధి నొందుచున్నవి. అదే విధముగ తగ్గుచున్నవి అని సమాధానమిచ్చెను. శ్రీశంకరాచార్యస్వామి విని, ‘అర్హతుడా! రథమును గుఱ్ఱములనేకము గలసి శత్రుత్వం లేకుండ సంఘీ భావంతో ఒకేసారి లాగుచున్నవని వచించితివి. అది బాగున్నది. అట్లా గుఱ్ఱములు లాగుటకు కారణము వేరుగ నున్నది. తోలువాడే కారణుడు. రథమును నడిపే చాకచక్య మంతయు రథసారధి యందు మాత్రమే గలదని తెలిసి కోవాలి. కావున చేతనా మయమైన శరీరము రథమును బోలి యున్నది. సారథి లేకున్న గుఱ్ఱములు విరోధంలేక సంఘీభావంతో ప్రవర్తించలేవు గదా! అదే విధమున సారథి అనే ఆత్మలేకున్న అవయవములు పనిచేయజాలవు. ఆత్మావయవములు ఆత్మ కన్న వేరుగలేవు, అందు వలన గమనా గమనములు కలుగుచున్నవి. కావున ఆత్మ నిత్యము కాదందు వేమొ ఆత్మకు ప్రత్యేకత కలదని తెలిసికొనుము.జీవావయవములు పెరిగేవి, తరిగేవి కావు. ఏనుగు దేహములోజీవుడు ప్రవేశించుటతో జీవావయవములు వృద్ధి జెందు చున్నవి. కీటకాదులలో సంకోచము నొందుచున్నవి. జలగ తనకు అవసర మగునపుడు సాగు చున్నది. అవసరం లేనప్పుడు కురుచయగు చున్నది. అట్లుగనే జీవుని పరిమాణం నియమితమై యుండుటలేదు. జీవుని అవయవములు వృద్ధిక్షయ ములు నొందుచున్నవనినను ఈ జీవావయవములు విస్తరించడం, ముడుచుకొని పోవడం అనునవి జెందుచున్నవి. అదే విధమున ఘటాది పదార్ధములు మారుపాటు జెందే స్వభావం గలవి యగుటచే నిత్యములు గాక నాశమొందు విధమున జీవావయవములును నశించే స్వభావం గలవియే యగుచున్నవి. అందుచే జీవునకు నిత్యం లేక ఆత్మ గూడ నశించగా సంచిత ప్రారబ్ధ ఆగాములను దోషములు సంభవించుచున్నవి. జీవుడు నిత్యత్వం కానందున పూర్వజన్మ కృత పాపకర్మ ఫలితములు ఈ జన్మలో సంభవించక పోవలసి యుండును. ఇది కృతనాశ దోషమగును. అట్లయిన ఈ జన్మలో చేయబడిన కర్మఫలితం సంభవించక క్రొత్త కర్మాను భవమే కలుగ వలెను. ఇది చేయని కర్మ ఫలితమును అనుభవించుట యగును. జీవుడు నిత్యుడు గాకున్నచో చేసికొన్న కర్మల వలన సంసార సముద్రములో మునిగిపోవు జీవునకు ఆనపకాయ బుఱ్ఱ నీటి మీద తేలియాడు మోక్షం రానేరదు. బంధమైనను మోక్షమైనను జీవునకే ఉన్నవని జెప్పవలెను. జీవుడు నిత్య మైనచో కర్మలున్నప్పుడు బంధము గల వాడగుననియు, ఆ బంధము లేకపోయిన ముక్తుడగునని చెప్పవీలు గాదు.
కర్మలు నిత్యం కానట్లే జీవుడు గూడ నిత్యుడు గాకున్నచో మోక్ష మెవరికి కలుగును? కావున మీ మతమందు అతీతమైన ముక్తి నిత్యం గాని జీవునకు అంట గట్టడం ఏలా శక్యమగునో అగమ్యగోచరము! కాబట్టి జీవునకు సంకోచము, ముకుళితము ఉన్నవనుట ఎన్నటికిని అంగీకరింప వీలులేదు. కావున మీ విధానములన్నియు పర స్పర విరోధములు గలవి యగుటచే అవి పరమాత్మను పొందుటకు సాధనములు గాజాలవు' అని గంభీరోపన్యాస మిచ్చారు. అంతట జైనులు, అర్హతులు గర్వములుడిగి వారై శ్రీ శంకరాచార్య స్వామికి పాదా క్రాంతు లయ్యారు. అట్లు విజయుడై నైమిశారణ్య పుణ్య భూములకు వెళ్ళారు. ఆ ప్రాంతమందు గల దరద, భరత, శూరసేన, కురు, పాంచాల మొదలగు దేశములందున్న పండితులు శ్రీశంకరపాదుల దివ్య దర్శనం చేసికొనిరి. వారి నందరిని ప్రస్థానత్రయ భాష్య ప్రభావముతో జయించి అద్వైతులను జేసి అసమాన ప్రతిభను ప్రదర్శించి ప్రఖ్యాతి వడసిరి.
పిమ్మట శ్రీహర్షుడను మహా పండితుడు సకలశాస్త్రములలోను నిధియై, అజయుడై మహా గర్వముతో వెలయు చుండెను. అట్టివానిని గురువైన ప్రభాకరుడు కుమారిలభట్టు ఓడించ లేక పోయిరి. కాని వానిని శ్రీ శంకరాచార్యులు తమ వశం జేసికొన్నారు. పిమ్మట కామరూప దేశస్థుడైన అభినవ గుప్తుడను శాక్తేయుడు శ్రీశంకరులకు శిష్యుడయ్యెను. అదెట్లనగా :
*అభినవగుప్తుడు:*
కామరూప దేశమందు అభినవగుప్తుడను శాక్తేయు డొకడుండెను. ఆతడు వారి మత గ్రంథమునకు భాష్యరచన చేసినగ్రంథకర్త. అతడు శ్రీశంకరాచార్యుల అఖండ ప్రభావం విని క్రుంగి దారి తెన్నులు గానకుండెను. శ్రీశంకర పాదుల చేతులలో ఓడిపోవడం స్థిరమను కొనెను.ఆతడిటుల తలపోసెను.' వేదమనినను దాని భావమనినను శంకరులకు మంచినీళ్ల ప్రాయము. వేదబాహ్య మతములను ఆయన అంగీకరించడు. అట్టితరి ఆయనను కాదనుటెట్లు? త్రిమూర్తులు సాయమైనను వాదమందాయనను ఓడించుట కడు దుర్లభం. ఆయన కత్తికి అడ్డులేదు. కొమ్ముటేనుగులు ఆయన కడ క్రుంగిపోయినవి. శ్రీశంకర దివ్యతేజమునకు జడిసి భల్లూకములు పారిపోయెను. త్రిలోకములందు ఆయనకు సాటియైనవాడు కానరాడు. ఆయనను జయించుటకు వేరు మార్గములేదా! నా మంత్ర ములు తంత్రములు వృథా కావడమేనా?
నా మతస్థులను శిష్యులను విడచి ఒక్కణ్ణి విడి పోయిన లోకం హర్షించ గలదా! శ్రీశంకరులతో వాదించి ఓడిపోవుట కంటే ముందుగనే దాసోహమని వారి శిష్యగణమున జేరి పోయిన ఉభయతారకముగ నుండును గదా! బయటినుండి
నేజేయునది ఏమియు నుండ జాలదు' అని నిశ్చయించి తన శిష్య వర్గమును విడనాడి శ్రీశంకర శిష్య గణమందు పరమభక్తుని వలె ప్రవర్తించు చుండెను. తన కుట్ర సాగునని కులుకుచుండెను. కపట శిష్యుని కనిపెట్టువారు లేరైరి. క్రూరుడు అదను దొరికినప్పుడు నిర్దయుడు కాకుండునా?
పిమ్మట శ్రీ శంకరాచార్యులు అంగ వంగ కళింగాది దేశములలో అద్వైతమత ప్రచారము చేసి అందందు గల కుమతముల నెల్లను అద్వైతమతమునకు ద్రిప్పి నిరుపమ యశస్సునార్జించి ప్రకాశించుచు గౌడ దేశ మందు గల మురారిమిశ్రుని, ఉదయ నాచార్యుని, ధర్మగుప్తుని జయించి శిష్యులనుగా జేసికొని దేశమందు స్థిరముగ శాంతిని నెలకొల్పుటకు సంకల్పించిరి.
*శ్రీశంకరాచార్య స్వామికి భగందర వ్యాధి:*
శ్రీ శంకరదేశికేంద్రులు విశ్వప్రేమతో దేశమందంతటను అద్వైత మతమును స్థాపన చేసి ముముక్షు జనులకు, భక్తులకు, పండిత లోకము నకు పరమహంసయై ఆధారభూతుడై దేదీప్యమానముగ వెలుగొందు చున్నాడు. అట్టి లోకబాంధ వునకు భగందర వ్యాధి అంకురించినది. దాని ప్రభావం సామాన్యమైనది గాదు. నిరంతరం మర్మ స్థానము నుండి రక్తస్రావ మపారంగాజరుగుచున్నది. శ్రీ స్వామి ధరించిన కౌపీనములు, శాఠీలు రక్తసిక్త మగుచుండెను. ఎప్పటి కప్పుడు అవి తీసి మంచివి ధరించుచుండు వారు. ఆపని తోటకా చార్యుడు కడు భక్తిశ్రద్ధలు కలిగి పరిశుభ్రం చేయుచుం డెడివాడు. అంతభయానక రోగమంకురించిప్రకోపించినను దానిని నయం చేసుకొందామన్న మాటయే లేదు శ్రీజగద్గురువులకు. శిష్యులు వేయి చేతులతో సకలోపచారములు చేయు చున్నను వ్యాధి ఆరోజు కారోజు అభివృద్ధి నొందు చునే యున్నది. శిష్యులది గాంచి ఆందోళన జెంది జగద్గురువులను జేరి, 'సర్వరక్షకా! జగదోద్దారకా! జగద్గురో! తమకు తెలియని విషయములు, ధర్మములు గానరావు. తమ పరిస్థితి జూడ మాకు ఆదుర్దా కలుగుచున్నది. మాకు కలుగు చున్న దుఃఖములు వెల్లడించక తప్పింది కాదు. కరుణించుడు! తామెట్టి విధమైన సంకల్ప వికల్పములు లేక నిశ్చింతగ ఆత్మతత్త్వమందు మునిగి ప్రకృతిని మరచియున్నారు. కేవలం జ్ఞానస్వరూపమును పొందియున్నారు. శరీరములు స్థిరములు గావని, బుద్బుధప్రాయ మని తాము దృఢమైన ఎఱుకతో నున్నారు. శరీరములకు సంభవించు వ్యాధులు, కష్టసుఖములు అనుభవించ వలసినదేయనిమహానీయు లందురు. ఈనాడు చేసుకొనిన కర్మను బట్టి వ్యాధులు సంభవించేవి కావని శాస్త్రములు తెలుపు చున్నవి. పుణ్యపాప కర్మ ఫలితాలని పెద్దలందురు. అయినను అట్టి విధానము అంత మంచిది కాదని విన్నవించు వారము. ఋణ శేషము, శత్రు శేషము, రణశేషము ఉండరాదని పెద్దలనుచున్నారు. స్వామీ! తమకు కలిగిన వ్యాధి తీవ్ర రూపము దాల్చి యున్నది. అట్టిది నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని మా యభిమతమైయున్నది. గురుదేవా! దీని కేదైనా ఉపాయ మాలోచించుడు! అని వినయముగ వేడు కొనిరి.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము*
*43 వ భాగముసమాప్తము*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*శ్రీ ఆది శంకరాచార్య చరితము41
_*శ్రీ ఆది శంకరాచార్య చరితము41 వ,భాగము*_
🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑
శ్రీ శంకరాచార్యులు నీలకంఠుని ఉపన్యాస మంతయు విని, 'ఓయీ! మీ విధానము ననుసరించి మీకు తెలిసి యున్నంతవరకు వచించి యున్నారు.అది సత్యం కానేరదు. ద్వైతమునకుఅతీతమైనది, ఉపనిషత్తులలో నిర్వచించిన అద్వైతము సత్యమై యొప్పారు చున్నది. బ్రహ్మాదులు పరబ్రహ్మ ము కంటే గొప్పవారు కారు. పరాపరమైనది ఆ పరబ్రహ్మమే. అట్టి చైతన్యస్వరూపుడైన పరబ్రహ్మమును మహా వాక్యము స్థిరపరచు చున్నది. జీవునకు ఉపాధి యున్నది. కారణమనే ఉపాధి గలవాడు ఈశ్వరుడు అని శ్రుతి స్పష్టముగ తెలుపుచున్నది. కనుక 'తత్వమసి' జీవేశ్వరు లకు అభేదమునే ప్రతిపాదించుచున్నది. ‘తత్త్వమసి’ మహా వాక్యములో ఆ పరమాత్మ నీవు అను అర్ధమును వివరించు టలో విరోధమే కలుగు చున్నది. ఇందులో జీవేశ్వరులను అంగీక రించుట చేత భేదము కనబడు చూనేయున్నది. చైతన్యపదార్థం ఒక్కటే గాని రెండు కాదు. అది నిత్యమైనది. ఉపాధులు కేవలం కల్పితములు. సత్యం కాదు. కనుక ఉపాధులను లెక్కలోనికి తీసుకొని రాకూడదు.
'తత్-త్వం' అనునవి మాటలు రెండైనా అందు విరుద్ధముగ నున్నదానిని విడచి సత్యమైన దానినే గ్రహించవలెను. చైతన్యం సత్యమైనది గనుక దానినే గ్రహించ వలసి యున్నది. ఇక తత్త్వమసి పరమాత్మనే తెలుపుచున్నది. పరమాత్మ ఒక్కటే కాని ఇన్నిలేవు. ఆనాడెచ్చ టనో కాన్పించిన దేవ దత్తుడు ఈనాడు మరియొక చోట కాన్పించినప్పుడు (సోయం దేవదత్తః) ఆతడే ఈతడు అని చెప్పడంలో తేడాయే లేదు. కాల వ్యత్యాస మందును, రూపు రేఖాదులలోను తేడా గలదు. అట్టి తేడాలు ఉన్నంత మాత్రంచేత ఆతడు వేరుకాక పోలేదు. ఆలాగుననే తత్త్వమసి మహా వాక్యం లో తత్ (నేను), త్వం (నీవు) ఈ రెండు పదములకు భేదము లేదు. ‘సోయం దేవ దత్తః' అను దృష్టాంత ము ఇచట ప్రస్తావనకు ప్రసిద్ధము, సమంజస ము. అందులోగల విరుద్దాంశ ములను విడ నాడినచో దేవదత్తుడు ఒకటిగానే ఉన్నాడు. (ఆనాటి దేవదత్తుడు చిన్నవాడు, ఈనాటి దేవదత్తుడు ముసలి వాడు, గడ్డములు, మీసములు వచ్చి నెరసియున్న వాడు, త్వరలో పోల్చుటకు శక్యం కానివాడు) రెండుగా లేడు. తత్, త్వం పదములు వేరై నను జీవేశ్వరులకు భేదం చూపుట లేదు. రెంటికీ తేడా లేకపోవడ మనేది పరమసత్యం' అని సహేతుకముగా వివరించారు.
శ్రీశంకరపాదుల వచనములు నీలకంఠాచార్యు లువిని, 'శంకరాచార్య స్వామీ! జీవుడు కొద్దిపాటి జ్ఞానం కలవాడు. ఈశ్వరుడు సర్వజ్ఞాని. జీవుని రూపంచిన్నది. ఈశ్వరుని రూపం పెద్దది. పైగా వారిరువురి రూపములు కంటికి కన్పించుట లేదు. అందువలన గుణములను బట్టి జీవేశ్వరురులకు భేదా భేదములు నిర్ణయించవలసి యున్నది. కనుక లక్షణములను బట్టి తత్త్వమసి యందు తేడా ప్రబలముగ నున్నది. అందువలన జీవేశ్వరులకు అభేద మనుట మీ వంటి వారికి తగునా?’
అంతట నీలకంఠుని జవాబువిని, శ్రీశంకర పాదులు, 'నీవనుకొన్నది కల్పితం కాని నిజం కాదు. ముత్యపు చిప్ప లోవెండి కనుపించు చున్నది. అది నిజమా? కాదు. అది కేవలం కల్పితం. పరమాత్మ స్వరూపంలో జీవుని రూపం ముత్యపు చిప్ప లోని వెండి వలె కల్పితమేయగుచున్నది. కల్పిత వస్తువు ఒకటి ఉన్నప్పుడు, అకల్పిత వస్తువునకు నిజమైనది ఒకటి ఉండితీరవలెను. జీవేశులు కల్పితము లైనప్పుడు అందుకు నిజమైనది వచించియున్నారు.అది పరమాత్ము నిగా అంగీకరించ వలెను. త్రాడును చూచి పామనుకొన్నప్పుడు త్రాడుని మించి పాము ఎట్లుండునో కల్పితము (త్రాడు) నకు అధిష్ఠానమైనది పామే కనుక జీవేశ్వరు లకు స్వరూప నిర్ణయం చేయకూడదు. 'అల్పుడు, విజ్ఞుడు’ అనడం కేవలం కల్పితమే యగు చున్నది. సద్వస్తువును అందరు అంగీకరించి తీరవలెను. 'దేహాది ఉపాధులు జీవునకు స్వరూపం. దీనికి అధిష్ఠానం పరమాత్మ' అని ఒప్పుకొని తీరవలెను. ఈ కనబడు శరీరము, అందున్న ఇంద్రియములు జడములే యగు చున్నవి. ఈ జడవస్తువులకు అధిష్టానమైనది జీవుడు. అది జీవ స్వరూపంలో ఉన్న చైతన్యం సర్వలక్షణ మైనది; ఏకరూపములో నున్నది; అద్దానినే పరమాత్మ అందుము. ఆ పరమాత్మ స్వరూపమే ఈ జగత్తు. జగత్తు పరమాత్మకు మాయో పాధి. అందువలన అది నిజం కాదు. ఈ జగత్తంతా జడమై యున్నది. దీనికి అధిష్ఠాన మేదియో తెలిసికొన వలసి యున్నది. అదే సత్యవస్తువు. ఆ సత్య వస్తువే పరమాత్మ. జీవేశ్వరులకు
ఉపాధులు కల్పించడమేయని ఇదివరలో చెప్పబడి యున్నది. అది చైతన్యం మాత్రమే. శుద్ధస్ఫటికం వద్ద ఒక ఎఱ్ఱని పుష్పమున్న ప్పుడు అప్పుడా శుద్ధస్ఫటికం ఎఱ్ఱగా ఉన్నట్లే కన్పించును. అట్లా స్ఫటికం ఎఱ్ఱగా కనుపించినా స్ఫటికములో మాత్రం ఎరుపు లేదు. దాని నిజమైన రంగు తెలుపే గదా! అట్లుగనే కల్పించబడిన ఉపాధులను బట్టి చైతన్యం జీవేశ్వరులుగ తోచును. కనుక జీవేశ్వ రులవలె కాన్పించుచున్న చైతన్యమునకు మూఢత్వము లేదు, సర్వజ్ఞత్వము లేదు. అది కేవలం నిర్గుణమే. జీవేశ్వరులకు భేదముందనుకొనువానికి మోక్షం రాదుసరికదా మృత్యువు ప్రాప్తించును. అట్టి వానికి సంసారసాగరం తప్పదు. జీవేశ్వరులకు భేదం లేనట్టి వారికి మోక్షం కలుగుచున్నది. ఇట్టి విధముగ శ్రుతులు తెలుపు చున్నవి. జీవేశ్వరులకు భేదము కన్పట్టుచుండిన వానికి తత్త్వశాస్త్ర శ్రవణం లేదన్నమాట. చంద్రుడు ఆకసమున కాస్త గోచరించును. బహుదూరమందుండుట వలన అట్లు చిన్నదిగ కాన్పించుట భ్రమ మాత్రమే.
విచారించగ చంద్రుడు చిన్న వాడు గాడని తేలుచున్నది. అట్లుగనే 'నేను శివుడనుగాను' అను కోవడం భ్రమ మాత్రమే యగుచున్నది. ఈ భ్రాంతి పోవలయు నన్న వేదాంత తత్త్వ విచారణ చేయవలెను. భ్రాంతి సత్యంకాదు కదా! కనుక 'తత్త్వ మసి' జీవేశ్వరులకు భేదము లేదనునది సత్యమే యగుచున్నది. అంతట నీలకంఠుడు, 'శంకరా! కపిలుడు మొదలయిన మహర్షులు జీవుని స్వరూపమును, ఈశ్వరుని స్వరూపమును బహు స్పష్టముగ వివరించి యున్నారు. వారిరువురికి ఉండు భేదమును గూడ బాగుగ వివరించి నిరూపించి యుండగ తాము దానిని వ్యతిరేకించి, రెండూ ఒకటే యనుచున్నారు. పదుగురాడు మాట పాడియై చెల్లవలెను గదా! మీ ఒక్కరి మాట నేనెట్లు ఒప్పుకొన గలను?' శ్రీశంకరా చార్యులంతట, నీల కంఠాచార్యుని సంశ యము నివారణ చేయ 'శ్రుతులకు, స్మృతులకు విరోధము వచ్చినపుడు శ్రుతి వాక్యమునే అంగీకరించవలెను. దుర్బలమైన స్మృతివాక్యం అంగీకరించకూడదు. ఇదే న్యాయము. కపిలుడు మొదలయిన మహాత్ము ల వాక్యములకంటె 'తత్వమసి' బలమై యున్నది అని తెలిపారు.
'తత్త్వమసి' బలమై యున్నది' అనితెలియ జెప్పిన శంకరులతో, నీలకంఠాచార్యులు, 'శంకరాచార్యా! వేదములకు విరోధముగ నున్న స్మృతి వాక్యములు విడిచిపెట్ట మనడంలో సబబు గాన రాదు. మహర్షుల పలుకులు యుక్తియుక్తమై యున్నవి. అవి వేదములతో సమముగా నుండును. కనుక మహర్షుల వాక్యములు వృథా అనడం పాడి గాదు. జీవుడు సుఖము వేరుగను, దుఃఖము వేరుగను అనుభవించుచున్నాడు. అందులో ఒక జీవుడు సుఖమును, ఒక జీవుడు దుఃఖమును అనుభవించు చుండుట అందరు ఎరిగినదే! అందరు సుఖంగా ఉండుట లేదు. ఈ శరీరములలో ఉండు జీవాత్మలు వేరుగను చాలగను ఉంటున్నవి. ఆత్మఉన్నపుడు అలాజరుగదు. కనుక ఆత్మలు కూడ అనేకమని తేలినది. లేనిపక్షమందు లోకమందు జరుగుచున్న వ్యవహారములన్నియు ఒకేరీతిని ఉండవలెను.
అందుకనే మహర్షుల లందరు ఒకటి కాదని నిశ్చయించారు. ఒకే ఆత్మ అయిననాడు అంతా దుఃఖముతో నైనను ఉండ వలెను. లేకున్న అందరు సుఖముగనైనను ఉండవలెను. అలా ఉంటున్నారా? ఒకరిని సుఖీ అని, వేరొకరిని దుఃఖీ అని అనుచున్నా రెందుకు? ఒకరికి ముక్తి వచ్చిన అందరికీ వచ్చును. ఇదంతా అందరు ఎఱిగినదే. కాదనుటకు ఎవరును లేరు. యతివర్యా! ఇది యటుండ వేదాంతులు ఆత్మను, 'అకర్త, అభోక్త' యనుచున్నారు. కర్త అయినను, భోక్త యైనను అంతఃకరణమే యనుదురు. ఇవి ఆత్మకు లేవనుచున్నారు. జీవునకు చైతన్య మున్నది గనుక కర్త, భోక్తగూడ అతడే. అంతఃకరణము జడము, జ్ఞానము లేనిదియును. అట్టి దానిని కర్త, భోక్త యనుట సమంజస ముగలేదు. యతీశ్వరా! మరొక్క విషయమును తెల్పెద నాలకించుము! మోక్షము సుఖము నిచ్చునని తెలుపు చున్నారు. లోకములో ఎక్కడ జూచినను సుఖమున్నచోట దుఃఖమే కనుపించు చున్నది. సుఖము, దుఃఖమును వెంట బెట్టుకొనియే యున్నది. ఆలోచింపగ సుఖము సుఖము కాదనియే తేలుచున్నది. విష మిళితమైన ఆహారము నెట్లు విసర్జించవలెనో సుఖము నావిధముగనే విడిచిపెట్టవలెను. సర్వ దుఃఖములు నాశన మైన నాడే మోక్షం లభించునని మేము తెలుపుచున్నాము. మీరు మాటాడునది మోక్షము కానేరదు’.
అంతట శంకరాచార్యు లు, ‘పండితోత్తమా! సుఖమునైనను, దుఃఖమునైనను పొందునది మనసే. మనస్సున కట్టి ప్రభావము ఉన్నది. అది ఇంకను బహు విచిత్రమైన ప్రభావం గలది. ఆత్మకు అట్టి ధర్మములు లేవు. అంతఃకరణములు తేడాగా నుండును గాని ఆత్మ కట్టి ధర్మములు లేవు. ఆత్మ ఒక్కటియే. స్థూల,సూక్ష్మ శరీరములు రెండును జడము లయినను చైతన్య సంయోగము కర్తృత్వ మును కలుగజేయు చున్నది. చైతన్య సంయోగము లేనిచో ఇంద్రియములు కదలనే కదలవు. సూర్యుని కాంతితో ప్రాణులన్నియు తమతమ దైనందిన వ్యాపారములు ఎట్లు నిర్వర్తించుకొన గలుగు చున్నవో ఆ సూర్యుడు అందరికీ ఎట్లు సాక్షీ భూతుడుగ నుంటున్నాడో ఆత్మ సూర్యుని వలెనే సాక్షియై వెలయుచున్నాడు. వెలుగునిచ్చు చున్న సూర్యునకు కర్తృత్వం లేదు. సాక్షీభూతుడైన ఆత్మ కును కర్తృత్వ భోక్తృత్వములు లేవు. చైతన్యములేని శరీరములను శవము లందురు. సుఖము లన్నియు దుఃఖములతో కూడి యున్న వనునది సత్యము. ఐతే అది మామూలుగ జరుగుచున్నపని. అసలు సుఖమనగ దుఃఖము లేనిది. ఆనందముతోగూడినది బ్రహ్మసుఖము. అది ఎక్కడో లేదు, తనలోనే యున్నది. అది దేని వలన కలుగునది కాదు. దుఃఖం
నశించినంత మాత్రమున మోక్షము రానేరదు. స్వానుభవం వలననే బ్రహ్మసుఖం కలుగును. వచ్చినది ఎన్నటికీ పోదు. అది అనంత మైనది' అని నీలకంఠా చార్యుల పూర్వపక్షములన్నియు ఖండించి, ఆయన అనుమాన పిశాచములను పార ద్రోలి, పరమ ప్రమాణ ములతో ద్వైతమును కాదని అద్వైతమతము స్థాపించారు. అంతటితో నీలకంఠాచార్యులు చెప్పునది లేకపోయెను.
శ్రీశంకరాచార్యులు నీల కంఠుని చేతిలో ఓడిన పోవడం నిశ్చయమను కొన్నవారు నిస్పృహ జెంది శ్రీజగద్గురువుల అఖండ ప్రజ్ఞకు అబ్బుర పడిరి. ఆవార్త దేశమంతట వ్యాపించినది. ఆ క్షణమందు శిష్యులు కూడ, నీలకంఠునితో పాటు ద్వైత భావమును వీడి శైవ భాష్యమును శ్రీశంకర పాదుల కర్పించి పాదాక్రాంతులై శిష్యులు అయ్యారు.
నీలకంఠాచార్యుల గురువు ఉదయనా చార్యుడు. ఆయన అద్వైతమతమును వ్యాప్తి చెందకుండ అణగద్రొక్క నెంచిన వారలలో ఉద్దండుడు. శిష్యులు, ప్రశిష్యులు శ్రీశంకరపాదులకు శిష్యులైనారనిన వార్త విని, అడలిపోయి నిర్వీర్యుడై ఆహారం సహించక శల్యగతు డయ్యాడు.
స్వామి ఆ ప్రాంత మంతయు అద్వైత మత స్థాపన జేసి మరికొన్ని దినములకు ద్వారకా నగరమునకు ప్రయాణ మైనారు.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరితము 41వ, భాగము సమాప్తము*
మహవతార్ బాబా*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*మహవతార్ బాబా*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
మహవతార్ బాబా గారి వయసు రెండు వేల సంవత్సరాలకి పైగా ఉంటుందని ఆ స్వామి ఇప్పటికి ఇంకా హిమాలయాల్లో బ్రతికే ఉన్నారని చాలా మందిలో ఒక నమ్మకం అనేది ఉంది.
భారతదేశ చరిత్రలో అతి ప్రాచీనమైనది విద్య క్రియా యోగ. ఈ విద్యని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడని చెబుతారు.
ఆ తరువాత పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో ఈ విద్య గురించి వివరించాడు. ఇక ఈ విద్యని తిరిగి మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది మహావతార్ బాబా అని చెబుతారు.
మరి మహావతార్ బాబా ఎవరు?
బాబా సిద్ధిని ఎలా సంపాదించాడు? ఆ విద్యని ఎలా నేర్చుకున్నాడు? అయన శిష్యులు బాబా గురించి ఏమని చెప్పారనే ఇలాంటి మరెన్నో విషయాల గురించి..
తమిళనాడు రాష్ట్రం, ఫరంగిపేట గ్రామంలో ఒక నంబూద్రి బ్రాహ్మణుడైన అర్చకునికి రోహిణి నక్షత్రంలో 203 నవంబర్ 30 వ తేదీన ఒక మగబిడ్డ జన్మించాడు. ఆయనే మహావతార్ బాబా. అయన తండ్రి కుమారస్వామి ఆలయంలో అర్చకునిగా చేసేవాడు. ఇలా రోహిణి నక్షత్రంలో జన్మించిన ఆయనకి వారు నాగరాజు అని పేరు పెట్టారు. అయితే తనకి ఐదు సంవత్సరాల వయసు ఉన్నపుడు ఆలయంలో పెద్ద ఉత్సవం జరుగుతుండగా
వేరే ప్రాంతానికి చెందిన ఒకడు ఆయన్ని అపహరించి కలకత్తా నగరానికి తీసుకువెళ్లి అక్కడ ఒక ధనవంతుడికి అమ్మేశాడు.
ఇంట్లో బానిసగా ఉంటున్న ఆయన్ని చూసి జాలిగుణంతో కొన్ని రోజులకే ఆ ధనవంతుడు ఆయనకి స్వేచ్చని ఇస్తూ తనకి నచ్చిన చోటుకు వెళ్ళమని చెప్పగా. అంత చిన్న వయసులో అయన బయటి ప్రపంచంలోకి రాగా..ఆయనకి ఒక సాధువుల బృందం కనిపించగా వారితో పాటు వెళ్లి వారికి సేవలను చేయడం ప్రారంభించాడు.
ఇలా ఆ సాధువులు అయన చేసే సేవలకు సంతోషిస్తూ పురాణ ఇతిహాసాలు చెబుతుండేవారు.
ఇలా అన్ని తెలుసుకుంటూ మంచి పండితుడిగా ఎదిగిన అయన కేవలం పాండిత్యం వలన భగవంతుడి ఆశీర్వాదం సంపాదించలేను అని అనుకోని దివ్యజ్ఞానం, సిద్ది పొందాలంటే ఎలా అనుకుంటూ విచారిస్తుండగా.
ఆ సాధువుల బృందం కాశీకి వెళుతుండగా..వారితో పాటు కాశీకి వెళ్లి అక్కడ నుండి శ్రీలంకకు చేరుకున్నాడు. ఇక శ్రీలంకలో కతిర్గామ అనే సుబ్రహ్మణ్యస్వామి
ఆలయం ఉంది. ఇక్కడే సుబ్రహ్మణ్యుడు వల్లీదేవిని వివాహం చేసుకున్నాడని పురాణం. అయితే ఈ ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి యంత్రానికి పూజలు అందుకోడం చూసాడు. అంటే ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం అంటూ ఉండదు. ఒక బంగారు యంత్రం,
అందులో సుబ్రహ్మణ్యస్వామి వారి రూపం ఉండగా ఆ మహిమగల యంత్రానికే పూజలు చేసేవారు.
ఇంకా ఈ ఆలయంలో బోగనాధుడు అనే ఒక సిద్ధపురుషుడు ఉండేవాడు. ఆ సిద్ద పురుషుడు సాక్షాత్కరించడంతో అక్కడే ఉంటూ ఆరు నెలల పాటు కదలకుండా ధ్యానం చేసాడు.
ఇలా ఆరు నెలలు సమాధి స్థితిలో ఉన్న ఆయనకి చివరికి సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్షమవ్వగా ఆయనికి ఎల్లపుడు యువకుడిగా ఉండే సిద్ది లభించింది.
ఆ తరువాత బోగనాధుడు అయనతో ఇలా అన్నాడు, ద్రవిడ దేశంలో కుర్తాళంలో అగస్త్య మహర్షి ఉన్నాడు. అక్కడికి వెళ్లి అయన అనుగ్రహాన్ని పొందమంటూ సూచించాడు.
దీంతో అయన కుర్తాళం చేరుకొని అగస్త్య మహా ముని కోసం 47 రోజులు ధ్యానంలోనే ఉంటూ ఘోర తపస్సు చేయగా అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యేక్షమై దివ్య ప్రసాదాన్ని తినిపించి యోగ విద్యలోని ఎన్నో రహస్యాలు చెప్పి సిద్ధిని ప్రసాదించి, హిమాలయాల్లో ఉన్న బదరీనాధ్ కి వెళ్లి అక్కడ మహా సిద్ధిని పొందమని చెప్పాడు.
ఇలా బదరీనాథ్ క్షేత్రానికి వెళ్లిన బాబా మహాసిద్ధిని పొంది నిత్యా యవ్వనుడిగా, అమరుడిగా ఎదిగిన నాగరాజు మహవతార్ బాబాగా స్థిరపడిపోయారు.
క్రీస్తు శకం 788 -820 మధ్య బ్రతికిన ఆదిశంకరాచార్యకు సన్యాస దీక్ష ఇచ్చినవారు గోవింద భగవత్పాదులు కాగా యోగ దీక్ష ఇచ్చినది మహా అవతార్ బాబా.
ఇంకా కొందరు చెప్పిన దానిప్రకారం కేదారనాథ్ పర్వత శిఖర ప్రాంతంలో ఉన్న సిద్ధాశ్రమానికి శంకరులు వెళ్లాలని ప్రయత్నించగా ఆయనకి వీలు కాలేకపోవడంతో అప్పుడు మహావతార్ బాబా కొన్ని యోగ సాధనాలు వారితో చేయించగా అప్పుడు శంకరులు శిఖర ప్రాంతంలో ఉన్న ఆ సిద్ధాశ్రమానికి వెళ్లారని చెబుతారు.
ఇలా కేదార్ ప్రాంతంలో ఉండే సిద్ధాశ్రమ యోగులు రహస్యంగా ఉంటూ మానవ జాతికి అవసరమైన శుభాలు చేస్తుంటారు.
ఆ సిద్ధాశ్రమ యోగులే..
రమణ మహర్షి , అరవింద యోగి , కావ్యకంట గణపతి ముని
అని ధ్యాన యోగులు చెప్తున్నారు.
బాబా గారి శిష్యులలో పరమహంస యోగానంద వంటి ఎంతో మంది యోగ గురువులు ఉన్నారు.
ఇక మొదటిసారిగా ప్రపంచానికి బాబా గురించి వెలుగులోకి తీసుకువచ్చింది లాహిరి మహాశయుల గురువుగారు.
ఇక లాహిరిబాబా విషయానికి వస్తే, ఈయన మిలటరీ లో అకౌంటెంట్ గా పనిచేస్తుండేవారు. హిమాలయాల్లో రాణిఖేద్ లో పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు జరిగిన సంఘటన అయన జీవితాన్నే మార్చేసింది. ఒక రోజు సాయంత్రం సమయంలో హిమాలయాల్లో తిరుగుతుండగా ఒక ఎత్తైన పర్వతం నుండి ఎవరో
ఒకరు అతడిని పేరు పెట్టి పిలుస్తున్నారని అనిపించగా,
ఈ మంచు కొండలో నాకు తెలిసినవారు ఎవరు లేరు, నేను ఇక్కడ ఉద్యోగానికి వచ్చి కూడా కొన్ని రోజులే గడిచింది నన్ను గుర్తు పట్టి ఎవరు పిలుస్తున్నారని
కొండ పైకి వెళ్లగా ఒక గుహలోకి వెళ్లగా..అతడిని నీవు ఇంకా గుర్తు పట్టలేదా అంటూ ఒక్కసారి ఆయన్ని స్మృశించగా లాహిరి గారికి తన గత జన్మలు గుర్తుకు వచ్చి నన్ను తాకిన ఆ దివ్య శక్తి మహవతార్ బాబా గారిది అని గ్రహించాడు.
ఇక బాబాజీ లాహిరి మహాశయులకు క్రియాయోగ దీక్షని ప్రసాదించారు. ఈ సంఘటన 1861 లో జరుగగా ప్రపంచానికి అప్పుడే బాబా రెండు వేల సంవత్సరాల నుండి ఇంకా హిమాలయాల్లోని జీవించి ఉన్నాడని అర్ధం అయినది.
ఇక లాహిరి యొక్క శిష్యుడు యుక్తేశ్వర్‌గిరిబాబా. లాహిరి యొక్క ప్రియ శిష్యుడైన యుక్తేశ్వర్‌గిరిబాబా 1894లో అలహాబాద్ లో జరిగిన కుంభమేళాలో మహావతార్ బాబాని ప్రత్యేక్షంగా కలుసుకున్నాను అంటూ చెప్పాడు.
ఈ విషయం యుక్తేశ్వర్‌గిరిబాబా వ్రాసిన కైవల్య దర్శనం అనే పుస్తకంలో ఉంది.
ఇక మహావతార్ బాబా శిష్యుడు లాహిరి మహాశయుల గురువు అయితే ఈయన శిష్యుడు యుక్తేశ్వర్‌గిరిబాబా. ఇంకా యుక్తేశ్వర్‌గిరిబాబా శిష్యుడు పరమహంస యోగానంద.
అయితే పరమహంస యోగానంద వ్రాసిన ఒక యోగి ఆత్మకధ అనే పుస్తకం ఆధ్యాత్మిక చరిత్రని సృష్టించింది.
ఈయన కారణంగానే క్రియా యోగ అనే విద్య అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది.
ఈవిధంగా నాగరాజుగా జన్మించిన ఆయన దేవుడి అవతారం కానప్పటికీ పూర్వ జన్మ పుణ్యఫలమో, దేవుడి లీలనో తెలియదు కానీ చిన్నతనంలోనే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసి
కుమారస్వామి దర్శనం పొంది
అగస్త్యమహర్షి అనుగ్రహంతో సిద్ది పొంది క్రియా యోగ వంటి ఎన్నో యోగ రహస్యాలను తెలుసుకొని అమరుడిగా ఇప్పటికి
హిమాలయాల్లో ఉండే రహస్య గుహలో జీవించే ఉంటున్నాడని చాలా మంది నమ్మకం.
శ్రీ గురుభ్యోనమః..!!
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
కౌరవుల పేర్లు
100 మంది కౌరవుల పేర్లు మీకు తెలుసా?
1. దుర్యోధనుడు
11. సుబాహుడు
21. సులోచనుడు
2. దుశ్సాసనుడు
12. దుష్పప్రదర్శనుడు
22. చిత్రుడు
3. దుస్సహుడు
13. దుర్మర్షణుడు
23. ఉపచిత్రుడు
4. దుశ్శలుడు
14. దుర్మఖుడు
24. చిత్రాక్షుడు
31. నోర్ణనాభుడు
32. సునాభుడు
33. ລ້ລ້
34. ఉపనందుడు
5. జలసంధుడు
15. దుష్కర్ణుడు
25. చారుచిత్రుడు
6. సముడు
16. కర్ణుడు
26. శరాసనుడు
35. చిత్రాణుడు
36. చిత్రవర్మ
37. ລ້ລ້
7. సహుడు
8. విందుడు
17. వివింశతుడు
18. వికర్ణుడు
9. అనువిందుడు
19. శలుడు
10. దుర్దర్షుడు
20. సత్వుడు
41. చిత్రాంగుడు
51. చిత్రాయుధుడు
42. చిత్రకుండలుడు
52. నిషింగుడు
27. ధర్మధుడు
28. దుర్విగాహుడు
29. వివిత్సుడు
30. వికటాననుడు
61. సదుడు
62. సువాగుడు
38. దుర్విమోచనుడు
39. అయోబావుడు
40. మహాబావుడు
71. దుర్జయుడు
72. దృఢహస్థుడు
73. సుహస్తుడు
74. వాయువేగుడు
43. భీమవేగుడు
53. పాశుడు
63. ఉగ్రశ్రవుడు
44. భీమలుడు
54. బృఎందారకుడు
64. ఉగ్రసేనుడు
45. బలాకుడు
55. దృఢవర్మ
65. సేనాని
75. సువర్చుడు
46. బలవర్ధనుడు
56. దృఢక్షత్రుడు
47. నోగ్రాయుధుడు
57. సోమకీర్తి
66. దుష్పరాజుడు
76. ఆదిత్యకేతుడు
67. అపరాజితుడు
77. బహ్వాశి
48. సుషేణుడు
58. అనూదరుడు
68. కుండశాయి.
49. కుండధారుడు
59. దఢసంధుడు
50. మహోదరుడు
60. జరాసంధుడు
81. క్రధనుడు
86. వలోలుడు
82. కుండినుడు
87. రుద్రకర్ముడు
83. ధనుర్ధరోగుడు
88. దృణరదాశ్రుడు
84. భీమరధుడు
89.అదృష్యుడు
85. వీరబాహుడు
90. కుండభేది
69. విశాలాక్షుడు
70. దురాధరుడు
91. 22
92. ప్రమధుడు
93. ప్రమాధి
94. దీర్గరోముడు
95. దీర్గబాహువు
96. ఉడోరుడు5-
97. కనకద్వజుడు
98. ఉపాభయుడు
99. కుండాశి
100. విరజనుడు
78. నాగదత్తుడ
79. అగ్రయాయుడు
80. కవచుడు
ముక్కు నుంచి రక్తం
ముక్కు నుంచి రక్తం , వ్రణాలుని హరించుటకు దానిమ్మ పువ్వులతో అద్భుత యోగం -
ఇప్పుడు నేను చెప్పబోయే యోగం చరకుడు ప్రయోగించింది.
ముక్కునుంచి రక్తం కారుచున్న సమయంలో దానిమ్మ పువ్వుల్ని దంచి రసము తీసి చక్కెర కలిపి ముక్కులో పిండిన ముక్కు లో నుంచి కారు రక్తం నిలిచిపోవును.
వ్రణములు నివారించుట కొరకు దానిమ్మ మొగ్గలు చెట్టు క్రింద రాలిన వాటిని తీసుకుని కాల్చి వ్రణముల పైన చల్లిన త్వరలోనే మానును. దీనికి తోడు తంగేడు పువ్వుల భస్మం కూడా కలిపిన ఇంకా తొందరగా వ్రణములు మానిపోవును.
మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
బుధవారం*🪷 🌷 *16, అక్టోబర్, 2024*🌷 *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🪷 *బుధవారం*🪷
🌷 *16, అక్టోబర్, 2024*🌷
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*
*తిథి : చతుర్ధశి* రా 08.40 వరకు ఉపరి *పౌర్ణమి*
*వారం :బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : ఉత్తరాభాద్ర* రా 07.18 వరకు ఉపరి *రేవతి*
*యోగం : ధృవ* ఉ 10.10 *వ్యాఘాత* రా 05.57 తె వరకు
*కరణం : గరజి* ఉ 10.31 *వణజి* రా 08.40 ఉపరి *భద్ర*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.00 - 10.30 సా 04.00 - 05.00*
అమృత కాలం :*మ 03.04 - 04.28*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : ఉ 06.36 - 08.01*
*దుర్ముహూర్తం : ప 11.29 - 12.16*
*రాహు కాలం : మ 11.53 - 01.21*
గుళికకాళం : *మ 10.25 - 11.53*
యమగండం : *ఉ 07.28 - 08.56*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *మీనం*
సూర్యోదయం :*ఉ 06.00*
సూర్యాస్తమయం :*సా 05.45*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.00 - 08.21*
సంగవ కాలం :*08.21 - 10.42*
మధ్యాహ్న కాలం :*10.42 - 01.03*
అపరాహ్న కాలం : *మ 01.03 - 03.24*
*ఆబ్ధికం తిధి : ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి*
సాయంకాలం : *సా 03.24 - 05.45*
ప్రదోష కాలం : *సా 05.45 - 08.12*
రాత్రి కాలం : *రా 08.12 - 11.28*
నిశీధి కాలం :*రా 11.28 - 12.17*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.11*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🪷 *శ్రీ సరస్వతి స్తోత్రం*🪷
*సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |*
*విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🪷🪷🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🌷🌷🌹🌷
🌹🌷🌹🪷🪷🌹🌷🌹
పంచాంగం 16.10.2024 Wednesday
ఈ రోజు పంచాంగం 16.10.2024 Wednesday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష చతుర్దశి తిధి సౌమ్య వాసర: ఉత్తరాభాద్ర నక్షత్రం ధ్రువ యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
చతుర్దశి రాత్రి 08:39 వరకు.
ఉత్తరాభాద్ర రాత్రి 07:16 వరకు .
సూర్యోదయం : 06:12
సూర్యాస్తమయం : 05:50
వర్జ్యం : ఉదయం 06:33 నుండి 07:56 వరకు.
దుర్ముహూర్తం : పగలు 11:38 నుండి 12:25 వరకు.
అమృతఘడియలు : మధ్యాహ్నం 03:01 నుండీ 04:26 వరకు.
రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
శుభోదయ:, నమస్కార: