ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
12, ఏప్రిల్ 2026, ఆదివారం
విలువల సంక్షోభాన్ని
సావడి కబుర్లు -7
వందేమాతరం
ఈరోజు సహోద్యోగి శ్రీ కొణకంచి వెంకట సుబ్రహ్మణ్యం గారు "ఉఫోరియా" చిత్ర సమీక్ష రాస్తూ సామాజిక పరిస్థితులపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. నిజమే, నేటి సమాజాన్ని పరిశీలిస్తే మనసుకు కలిగే భావన ఒక్కటే, ఆవేదన. అభివృద్ధి, ఆధునికత, స్వేచ్ఛ అనే పదాలు మన జీవన విధానాన్ని మారుస్తున్నప్పటికీ, వాటి వెనుక దాగి ఉన్న విలువల సంక్షోభాన్ని మనం గమనించకపోతున్నాం.
అభివృద్ధి పేరుతో ముందుకు పరుగులు తీస్తున్న మనిషి, విలువలను వెనక్కి నెట్టేశాడు. సమాజం అన్ని దిక్కుల నుంచి బంధాలను తెంచుకుంటూ ప్రత్యేకంగా యువత హక్కులు అనే పేరుతో స్వేచ్ఛను విచ్చలవిడితనంగా అలవాటు చేసుకుంటోంది. ఈ పరిణామం ఒక్క వ్యక్తి లేదా ఒక వర్గానికి సంబంధించినది కాదు. ఇది మొత్తం సమాజ నిర్మాణంలో ఏర్పడిన అసమతుల్యతకు ప్రతిబింబం. ఈ విశృంఖలత్వం ఒక భయంకర దావానలంలా నిశ్శబ్దంగా కాని వేగంగా సంస్కారమనే పచ్చని వనాన్ని దహించేస్తోంది. ఈ దావాగ్నిని ఆర్పకపోతే, రేపటి సమాజం విలువల రహితంగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి పరిష్కారం ఏమిటి? ఎవరిది బాధ్యత? ఎవరు బాధ్యత వహించాలి?.
సమాజం అనే నిర్మాణం కుటుంబం, విద్య, సమాజం మరియు సాంస్కృతిక వాతావరణం అనే నాలుగు స్థంభాలపై నిలబడింది. ఈ నాలుగు చోట్లా బలహీనతలు ఏర్పడినప్పుడు, దాని ప్రభావం ప్రత్యక్షంగా యువతపై పడుతుంది. కుటుంబంలో విలువల బోధన తగ్గిపోవడం, విద్యలో నైతికతకు ప్రాధాన్యం తగ్గిపోవడం, మరియు సమాజంలో వినోదం పేరుతో అసంబద్ధ ప్రభావాలు పెరగడం, సంస్కృతి సంప్రదాయాల పట్ల నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి యువతను దారి తప్పిస్తున్నాయి. ఫలితంగా, స్వేచ్ఛకు హద్దులు లేకుండా పోతున్నాయి.ఆత్మ నియంత్రణ అనే గుణం క్రమంగా కనుమరుగవుతోంది.
ఈ పరిణామం ఒక్కరోజులో రాలేదు. కుటుంబంలో విలువల బోధన తగ్గిపోవడం, ఉత్తీర్ణత మాత్రమే అర్హతగా వచ్చిన విద్యా విధానాల్లో మార్పులు, సాంఘిక మాధ్యమాల ప్రభావం అధికం కావడం, స్వేచ్ఛను బాధ్యతల నుండి వేరు చేయడం. ఫలితంగా యువతలో అహంకారం పెరిగింది, ఆత్మ నియంత్రణ తగ్గింది.
ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది కుటుంబంలో పెద్దల పాత్ర. గతంలో పెద్దలు కుటుంబానికి మార్గదర్శకులు, సంస్కారాలకు ప్రతీకలు, అనుభవానికి నిలయాలుగా ఉండేవారు. కానీ నేటి పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. నా బాధ్యతలు నేను నిర్వహించాను. ఇక ఎవరి కుటుంబాల వారివి. నా శేష జీవితాన్ని నాకు అనుకూలంగా, ఎవరికీ అడ్డం లేకుండా నా అభిరుచులకు అనుగుణంగా జీవిస్తాను అన్న దృక్పథం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఆధునిక కాలంలో వానప్రస్థంగా భావించబడుతున్నప్పటికీ, శాస్త్రాలు చెప్పిన వానప్రస్థ ధర్మం ఇదికాదు. ఇది ఆధునిక కాలం తనకు అనుకూలంగా నిర్వచించుకున్న వానప్రస్థం. బాధ్యతారాహిత్యానికి వేసుకున్న ఒక చక్కని ముసుగు.
మన ధర్మశాస్త్రాలు నిర్వచించిన చతుర్వర్ణ ఆశ్రమాల్లో వానప్రస్థం ఒకటి. భౌతిక ఆసక్తుల (ధనం, కుటుంబం) నుంచి విముక్తి. అంటే ఎవరు గదిలో వారు కూర్చొని "కృష్ణా రామా" అనుకోవడం కాదు. శాస్త్రాలు అంతవరకే నిర్వచించలేదు, సమాజానికి మార్గదర్శకత్వం వహించడం, తదుపరి తరానికి విలువలను అందించడం, అనుభవాన్ని పంచుకోవడం అనే పవిత్ర కర్తవ్యం వానప్రస్థం. అంటే సమాజం పట్ల పెరిగిన మరింత బాధ్యత. అది సమాజంలో ఆధ్యాత్మిక మరియు సంస్కార చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించే బాధ్యత. మన పరిధిలో కూర్చుని ఉండటం కంటే, మనం సమాజానికి అందించిన రేపటి తరాన్ని (పిల్లలు, యువత) సరైన సంస్కార మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి. సనాతన ధర్మం ప్రకారం, కుటుంబంలో పెద్దవారు (వృద్ధులు) కుటుంబానికి, సమాజానికి ఎలా ఉపయోగపడాలో ఆలోచించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే *లోకాన్ని వదిలేయడం కాదు, లోకానికి మార్గం చూపడం వానప్రస్థం.*
*తస్మిన్ గృహే భవతి యదా బాల్యం వృద్ధతా ధ్రువా ।*
*తస్య తత్కార్యమాచార్యః ప్రవర్తేత సదా గురుః ॥*
మనుస్మృతిలో చెప్పినట్లు కుటుంబంలో వృద్ధులు గురువులుగా మారి మార్గదర్శకత్వం వహించాలి. శాస్త్రవాక్యాలు కూడా ఇదే విషయాన్ని బలంగా తెలియజేస్తున్నాయి. కుటుంబంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి దశలో పెద్దలు మార్గదర్శకులుగా ఉండాలి. కేవలం మాటలతో మాత్రమే కాదు, ఆచరణతో చూపించే మార్గదర్శకత్వమే నిజమైన ఉపదేశం.
రామాయణంలో దశరథ మహారాజు తన పిల్లలకు ధర్మాన్ని నేర్పించిన విధానం వల్లే శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడిగా ఎదిగాడు. సమాజానికి రక్షకుడు అయ్యాడు. పెద్దలు తమ ఆస్తిగా సంస్కారం కూడా పిల్లలకి ఇవ్వాలి. ఇవ్వకపోతే, పిల్లలు "అధర్మ మార్గం"లో పడతారు. అందుకే
పెద్దల సమయోచిత మార్గదర్శనం లేకపోవడమే మహాభారతంలో కౌరవుల వైఫల్యానికి కారణంగా చెప్పవచ్చు,
నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఇదే లోపాన్ని సూచిస్తున్నాయి. సాంకేతికత ఒక వరంగా మారాల్సింది, కానీ అది కొంతవరకు వ్యసనంగా మారింది. సోషల్ మీడియా ప్రభావం, అసభ్య కంటెంట్, మాదకద్రవ్యాల ఆకర్షణ ఇవన్నీ యువతను నిశ్శబ్దంగా దారి తప్పిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 2025లో 30% యువత డ్రగ్స్ ప్రభావంలో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇవి కేవలం వ్యక్తిగత సమస్యలు కావు, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రమాదకర సంకేతాలు. రేపటి తరాన్ని సంస్కారయుతంగా పెంచడం మన ధర్మం. అప్పుడే మన సమాజం ధర్మభూమిగా మారుతుంది.
మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. ఈ సమస్యకు ఒకే వ్యక్తితో పరిష్కారం రాదు, ఇది సమిష్టి బాధ్యత అని తెలుసుకోవాలి.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల బాధ్యత అత్యంత కీలకమైంది. పిల్లలకు మంచి విద్య, సౌకర్యాలు ఇవ్వడం మాత్రమే తల్లిదండ్రుల కర్తవ్యం కాదు. వారికి సంస్కారం, విలువలు, నైతికత అనే బలమైన పునాది అందించాలి. పిల్లలతో సమయం గడపడం, వారి ఆలోచనలను అర్థం చేసుకోవడం, మంచి చెడుల మధ్య తేడాను తెలియజేయడం, స్వేచ్ఛకు పరిమితులు నిర్ధారించుకోవడం నేర్పించాలి. ఇవన్నీ తల్లిదండ్రుల బాధ్యతలో భాగం. ఆస్తి కంటే గొప్పది సంస్కారం. అది ఉంటేనే వ్యక్తి సమాజంలో నిలబడగలడు.
పెద్దలు మార్గదర్శనం చేస్తే, తల్లిదండ్రులు సంస్కార బోధన చేయాలి. గురువులు జ్ఞానంతో పాటు నీతి బోధన చేయాలి, సమాజం మంచి వాతావరణం కల్పించాలి. ఈ నాలుగు స్థంభాలు బలంగా నిలబడితేనే యువత సరైన మార్గంలో నడుస్తుంది. మనము రేపటి తరానికి ఏమి ఇస్తున్నామో ఆలోచించాలి.
చివరగా, మనం మనకు మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. రేపటి తరానికి మనం ఏమి అందిస్తున్నాం?. కేవలం సౌకర్యాలనేనా, లేక విలువలతో కూడిన జీవన విధానమా? భవిష్యత్తు సాంకేతికతపై కాదు, సంస్కారం మీద నిలబడుతుంది. సంస్కారం ఉన్న చోటే సమాజం నిలుస్తుంది. అది లేకపోతే అభివృద్ధి కూడా అర్థరహితమవుతుంది, సమాజం కూలిపోతుంది అన్న వాస్తవానికి గ్రహించాలి.
మనందరం కలిసి బాధ్యతగా ఆలోచించి, ఆచరించినప్పుడు మాత్రమే ఈ విశృంఖలత్వాన్ని నియంత్రించగలం. అప్పుడే మన సమాజం మళ్లీ ధర్మం, నీతి, సంస్కారం ఆధారంగా నిలిచే ధర్మభూమిగా వికసిస్తుంది.
ఆలోచిద్దాం, అడుగు ముందుకు వేద్దాం.
మృశి
(దశిక ప్రభాకరశాస్త్రి)
9849795167
*భక్తి ఎలా వుండాలి???*
*భక్తి ఎలా వుండాలి???*
భగవంతుడు భావ ప్రియుడు మాత్రమే,
బాహ్య ప్రియుడు కాదు...
ఈరోజు మన భక్తి అంతా బాహ్యమైనదే,
ఎంత అలంకరించామా,
ఎన్ని వంటలు చేసామా, ఎంతమంది మనలను పోగిడారా అనే ఆలోచనే ...
ఇదంతా అహంకార భక్తి ...
శ్రీకృష్ణుడి వద్దకు ఒకనాడు సత్యభామ బంగారుతట్టలో కొన్ని ఫలములు తెచ్చి కృష్ణుని ముందుంచింది...
" ఇవి నా తోటలో పండిన పండ్లు, ఈ జాతి మరి ఎక్కడనూ లేదు" అని వాటిని గూర్చి గొప్ప గా వర్ణించినది...
కృష్ణుడు ఒక తేలిక నవ్వు నవ్వి, ఒక పండును రుచి చూచి, ఇవి సారహీనములని చప్పరించి పడవేసెను...
ఇంతలో "గుబ్బి" అనుఒక గొల్లపిల్ల దోసిటలో కొన్ని పండ్లు తెచ్చి "స్వామీ!! ఇవి అల్ల నేరేడుపండ్లు,
స్వామి వలె శ్యామసుందరములు, అందువలన నాకు మిక్కిలి ప్రియములు"!!..
"దయతో గైకొని అనుగ్రహింపవలెను. " అనుచూ పాదముల మ్రోల వ్రాలినది...
కృష్ణుడు వాటి రుచిని అడుగడుగునా మెచ్చుకొనుచూ, అన్నియూ తిని వేసెను.
నిజానికి సత్యభామ ఇచ్చిన ఫలములు విలువ కలవి, రుచి కలవి... ఐన నేమి?!
ఆమె అహంభావము స్వాతిశయము మూలమున భగవానుని దృష్టి లో అవి రసహీనము లైనవి...
గోపిక స్వచ్ఛమైన ప్రేమ, అమాయకత్వము, అణుకువ మూలమున అవి భగవంతునికి అత్యంత ప్రియంకరములైనవి...
అందుకు వాటినే స్వీకరించాడు,
ఈరోజు భగవంతుడు మనము చేసే పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు ఎన్ని స్వీకరిస్తున్నారో మనకే అర్థం కావాలి...
స్వస్తి.....✍
*_శుభమస్తు_*
🙏శ్రీ సద్గురు పీఠం ద్వారా...✍
సమస్త లోకా సుఖినోభవంతు
ఆచార్యుడు అంటే.. ?
ఆచార్యుడు అంటే.. ?
గురువంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. ఆ గురువు ఆచార్యుడిగా ఉంటాడు. ‘‘ఆచార్యః గురూనాం శ్రేష్టః’’ – ఆచార్యుడిని గురువులందరిలోకి శ్రేష్టుడంటారు. అంటే ఎవడు ఆచారాన్ని కలిగున్నాడో ఆయన ఆచార్యుడు. నీవు ఏ విషయాన్నయినా చదువుకుని ఉండవచ్చు. అది విద్యార్థులకు బోధిస్తూ ఉండవచ్చు. ఒకడు నృత్యం నేర్చుకుంటాడు, శిష్యులకు చెపుతూ ఉంటాడు. ఒకడు వాద్యపరికరాన్ని మోగించడంలో నిష్ణాతుడు. సంగీతంలో, విలువిద్యలో, లెక్కలు చెప్పడంలో.. అలా వారివారి రంగాల్లో పాండిత్యం సంపాదించి దానిని శిష్యులకు బోధిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఆచార్యులు మాత్రం కారు. కేవలం ‘నీవు ఏం చెబుతున్నావు, ఏ స్థాయిలో చెపుతున్నావన్న దాన్నిబట్టి నీవు ఆచార్యుడివి కాలేవు’ అంటుంది శాస్త్రం.
బోధించే విషయం ఏదయినా ధర్మశాస్త్రం, వేదం బాగా తెలిసున్నవాడై, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడే ఆయన ఆచార్యుడు అని పిలవబడతాడు. నీకు ధర్మశాస్త్రం తెలిస్తే జీవితంలో ధర్మాన్ని అనుష్ఠానం చేసి చూపిస్తే, పదిమందికి నీవు ఆదర్శవంతుడవయితే, ‘ఆయనలా బతకండి’ అన్న శిష్టాచారానికి నీవు ప్రమాణమైతే అప్పుడు మాత్రమే నీవు ఆచార్యుడివి. విలువిద్య నేర్పిన ద్రోణుడిని ద్రోణాచార్య అన్నారు. అయితే కేవలం ఆయన విలువిద్య నేర్పినందుకు అలా అనలేదు, విద్య నేర్పేటప్పుడు పాత్రత చూసాడు, ధర్మబద్ధంగా నడుచుకున్నాడు కనుక ద్రోణాచార్యుడయ్యాడు...
*కీర్తి మూర్తులు
🙏🌹 *కీర్తి మూర్తులు* 🌹🙏
మనిషిని సంతోష పెట్టే అనేక లౌకిక విషయాల్లో *కీర్తి ఒకటి*. మనిషి సహజంగానే *కీర్తి కాముకుడు*. ఎవరికైనా కీర్తి వస్తే వారు *ఎంతగానో ఆనందిస్తారు*. దాని నుంచి మరికొంత *స్ఫూర్తినీ పొందుతారు.* కీర్తి స్వభావం అటువంటిది. మంచి పనులు చేసినవారికి మంచి పేరు, తద్వారా కీర్తిప్రతిష్ఠలు తప్పక దక్కుతాయి. *మనం చేసే పనులను* బట్టే కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయనేది సత్యం.
*గురుస్థానంలో* ఉండి ప్రసిద్ధులైన ఎందరో ఋషులు మనకు కనిపిస్తారు. వ్యాసుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు... ఇలా చాలామంది లోకంలో గురుశ్రేష్ఠులై విలసిల్లారు. ఆధునిక కాలంలోనూ గురుపరంపర కొనసాగుతోంది. యథాశక్తి వారూ పేరుప్రతిష్ఠలు పొందుతున్నారు. మరికొందరు *వారికిష్టమైన పనిలో ప్రావీణ్యం* సంపాదిస్తారు. వారు *ఆ పనిలో నిష్ణాతులై* కీర్తి పొందుతారు. నలమహారాజు, భీమసేనుడు ఈ విధంగా పేరు గడించినవారే. వారు *పాకశాస్త్ర ప్రవీణులు*. లోకంలో నలభీమపాకమనే నానుడి ఉంది.
పాండవులు ఎప్పుడూ ధర్మం వైపే ఉన్నారు. వారు *ఊరికెప్పుడూ ఉపకారమే చేశారు.* సత్కార్యాలతో శాశ్వత కీర్తి గడించారు. అలాగే చేతికి ఎముక లేకుండా *దానం చేసిన* కర్ణుడు ఎనలేని కీర్తిని పొందాడు. *లోకహిత కరమైన కార్యాలు* చేయడం ద్వారా శిబిచక్రవర్తి, దధీచి మొదలైనవారు ఎంతో కీర్తినార్జించారు. మమ్మటుడు తన 'కావ్య ప్రకాశం' గ్రంథంలో కావ్యాలు రాయడం వల్ల కలిగే ప్రయోజనాల జాబితా ఇచ్చాడు. 'కావ్యం యశనే...' అంటూ, *కావ్యాలు రాయడం* వల్ల కీర్తి వస్తుందని చెప్పాడు. సంస్కృత సాహిత్యంలో కాళిదాసు, భాసుడు మొదలైన మహాకవులు లోక *ప్రశస్తమైన కృతులు* రాసి ఎంతో కీర్తిని పొందారు. తెలుగు సాహిత్యంలో కవిత్రయం, పోతన, శ్రీనాథుడు గొప్ప *గొప్ప కావ్యాలు* రాసి ఘనమైన కీర్తి సంపాదించుకున్నారు. ఈ పరంపర నేటికీ కొనసాగుతోంది
సమాజంలో కొందరికి *దానం చేయడం* వల్ల కీర్తి దక్కుతుంది. ఇంకొందరికి *మంచి వ్యక్తిత్వం* వల్ల పేరుప్రఖ్యా తులు వస్తాయి. మరికొందరికి వారు చేసే సేవల ద్వారా కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. శ్రీమతి డొక్కా సీతమ్మ లాంటి వారికి *అన్నదానం* చేయడం వల్ల నిరుపమానమైన కీర్తిప్రతిష్ఠలు లభించాయి. స్వామి వివేకానంద లాంటివారు *ఉన్నతమైన వ్యక్తిత్వం* ద్వారా విశ్వవిఖ్యాత కీర్తి గడిం చారు. మదర్ థెరెసా కు ఆమె *సేవల ద్వారా* ఎనలేని పేరుప్రఖ్యాతులు వచ్చాయి. సమాజంలో ఇప్పుడూ ఎంతోమంది దాతృత్వం వల్ల ప్రఖ్యాతి పొందుతున్నారు.
*చిత్రలేఖనం* వంటి లలితకళలు సైతం కొందరికి ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టాయి. కేరళకు చెందిన రాజా రవివర్మ, తెలుగువారైన దామెర్ల రామారావు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు. సిద్ధేంద్రయోగి *నాట్యశాస్త్రం* వల్ల ప్రసిద్ధి చెందారు. ఇటువంటివారి కీర్తిచంద్రికలు ఆచంద్రతారార్కం ప్రకాశిస్తుంటాయి. అయితే, సమాజం ఎప్పుడూ ఒకటి గమనించాలి. ఇంతమంది మహానుభావులు ఆయా రంగాల్లో అంతటి విజయాలు సాధించింది కేవలం కీర్తిప్రతిష్ఠలు పొందాలని కాదు. అది వారివారి ప్రతిభా వైదుష్యమని గ్రహించాలి. అర్హులైన వారందరికీ కీర్తి దక్కుతుంది. అర్హత ఉంటే ఎవరినైనా, ఎప్పుడైనా పేరు ప్రఖ్యాతులు వెతుక్కుంటూ వస్తాయి. అందులో *లోక కల్యాణ కారకమైన* పనులు చేసేవారిని *కీర్తి ప్రతిష్ఠలు* తప్పక వరిస్తాయి.
మనందరం కొంత సమయాన్ని *సమాజ సేవకై వినియోగిద్దాము*, కీర్తి మూర్తుల *సరసన స్థానం సంపాయిద్దాము.*
ధన్యవాదములు
*(సేకరణ)*
సహస్రనామ స్తోత్ర పారాయణకు
హిందూ ధర్మశాస్త్రాలలో, పురాణాలలో దేవతల **సహస్రనామ స్తోత్ర పారాయణకు** అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. నామ సంకీర్తన ద్వారా మనఃశుద్ధి, కార్యసిద్ధి కలుగుతాయని అనేక గ్రంథాలు ఘోషిస్తున్నాయి.
వివిధ పురాణాల నుండి సహస్రనామ పారాయణ విశిష్టతను తెలుసుకుందాము
****************************************
* శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రము (గణేశ పురాణం)*
అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యః సురైరపి |
సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ||
ఈ సహస్రనామాలను పఠించేవారికి చతుర్విధ పురుషార్థ సిద్ధులు (ధర్మ, అర్థ, కామ, మోక్షాలు) లభిస్తాయని, ముఖ్యంగా విద్యార్థులకు విద్య, ధనార్థులకు ధనం ప్రాప్తిస్తాయని గణేశ పురాణం ద్వారా తెలుస్తుంది.
****************************************
*శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామము (స్కంద పురాణం)*
శత్రు సైన్య వినాశార్థం భక్తానామభయాయ చ |సహస్రనామముద్గీతం షణ్ముఖస్య మహాత్మనః ||
శత్రువుల నుండి భయం ఉన్నప్పుడు, కోర్టు సమస్యలు లేదా కుజ దోష నివారణ కోసం సుబ్రహ్మణ్య సహస్రనామ పారాయణ పరమౌషధంలా పనిచేస్తుంది.
****************************************
*దేవీ భాగవతం - గాయత్రీ సహస్రనామము*
సర్వపాపహరం పుణ్యం సర్వరోగనివారణం |
సహస్రనామపాఠాత్తు బ్రహ్మలోకే మహీయతే ||
ఈ సహస్రనామ పారాయణ సర్వ పాపాలను హరిస్తుంది, రోగాలను నయం చేస్తుంది. ఇది పఠించిన వారు అంతిమంగా బ్రహ్మలోకాన్ని పొందుతారు.
సంధ్యా వందన సమయంలో గాయత్రీ సహస్రనామ పారాయణ చేయడం వల్ల బ్రహ్మతేజస్సు పెరుగుతుందని చెప్పబడింది.
****************************************
*శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము (బ్రహ్మాండ పురాణం)*
సహస్రనామపాఠాచ్చ యత్ఫలం భవతి ప్రియే |
తత్ఫలం కోటిగుణితం భవేన్నామజపాత్సదా ||
ఇతర స్తోత్రాల కంటే సహస్రనామ పారాయణ విశిష్టమైనదని, అందులోనూ లలితా సహస్రనామ పారాయణ సర్వ పాపహరమని చెప్పబడింది. "సకృదేవ పఠేద్యస్తు సర్వపాపైః ప్రముచ్యతే" ఒక్కసారి పఠించినా సర్వ పాపాలు తొలగిపోతాయని దీని అర్థం.
****************************************
*శ్రీ శివ సహస్రనామ స్తోత్రము (లింగ పురాణం / మహాభారతం)*
ఆయురారోగ్యమైశ్వర్యం ధైర్యం వీర్యం బలం తథా |
శివనామ జపాదేవ సర్వమేతన్న సంశయః ||
ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, పరాక్రమం మరియు బలం.. ఇవన్నీ శివ సహస్రనామ పారాయణ వల్ల నిస్సందేహంగా లభిస్తాయి.
****************************************
*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము (మహాభారతం - అనుశాసనిక పర్వం)*
భీష్మ పితామహుడు ధర్మరాజుకు ఉపదేశించిన ఈ స్తోత్రం అత్యంత ప్రామాణికమైనది. దీని ఫలశ్రుతిలో పారాయణ ప్రాముఖ్యత ఇలా
య ఇదం పఠేన్నిత్యం భక్త్యా శ్రద్ధాసమన్వితః |
యుజ్యేతాత్మసుఖక్షాంతి శ్రీధృతిస్మృతికీర్తిభిః ||
ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రతిరోజూ ఈ నామాలను పఠిస్తారో, వారు ఆత్మసుఖం, శాంతి, ఐశ్వర్యం, ధైర్యం, జ్ఞాపకశక్తి మరియు కీర్తిని పొందుతారు.
ఇందులో "న వాసుదేవ భక్తానామ్ అశుభం విద్యతే క్వచిత్" అని చెప్పబడింది. అంటే భగవంతుని నామాన్ని స్మరించేవారికి ఎన్నడూ అశుభం కలగదు.
***************************************
*శ్రీ రామ సహస్రనామ స్తోత్రము (పద్మ పురాణం)*
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||
వేయి నామాలను పఠించడం వల్ల కలిగే ఫలితం కేవలం "రామ" అనే నామాన్ని మూడు సార్లు పఠించడం వల్ల కలుగుతుందని దీని అర్థం. ఇది సహస్రనామాల యొక్క శక్తిని, నామ సంకీర్తన సులభతను తెలియజేస్తుంది.
****************************************
*శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రము (బ్రహ్మ పురాణం)*
మహాలక్ష్మిని స్తుతించే ఈ సహస్రనామ పారాయణ దారిద్ర్య నిర్మూలనకు అత్యంత శక్తివంతమైనదని చెప్పబడింది.
దారిద్ర్య దుఃఖ శమనం సర్వైశ్వర్య ప్రదాయకమ్ |
సహస్రనామ పఠనాత్ లక్ష్మీః సాక్షాత్ ప్రసీదతి ||
ఈ సహస్రనామ పఠనం వల్ల దారిద్ర్యం, దుఃఖం శమిస్తాయి. సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇది పఠించేవారిపై లక్ష్మీదేవి సాక్షాత్కరించి అనుగ్రహిస్తుంది శుక్రవారం నాడు లేదా పౌర్ణమి నాడు ఈ పారాయణ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది.
****************************************
*శ్రీ సూర్య సహస్రనామము (భవిష్య పురాణం)*
నమః సూర్యాయ శాంతాయ సర్వరోగనివారిణే |
ఆయురారోగ్యమైశ్వర్యం దేహి దేవ జగత్పతే ||
సూర్య సహస్రనామ పారాయణ వల్ల చక్షు రోగ నివారణ (కంటి వ్యాధులు తగ్గడం) మరియు చర్మ వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని భవిష్య పురాణ ప్రోక్తం. "ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అని ఆర్యోక్తి.
****************************************
*వరాహ పురాణం - భూదేవి సహస్ర నామ స్తోత్రం*
నామ సంకీర్తనం తస్య సర్వదోషవినాశనం |సహస్రనామ తుల్యం హి నామ ఏకం హరేః స్మృతం
||
కలియుగంలో భూమిపై నివసించే మనుషులకు భగవంతుని నామమే రక్ష అని, సహస్రనామ పారాయణ చేయడం వల్ల భూమికి సంబంధించిన దోషాలు (వాస్తు దోషాలు వంటివి) కూడా తొలగిపోతాయని వరాహ పురాణం చెబుతోంది.
****************************************
*స్కంద పురాణం - గంగా సహస్రనామము*
గంగేతి నామ జపతో యోజనానాం శతైరపి |
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి ||
గంగా సహస్రనామాన్ని పఠించడం వల్ల వందల యోజనాల దూరంలో ఉన్నా కూడా గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని స్కంద పురాణం పేర్కొంది.
****************************************
*శ్రీ శ్యామలా సహస్రనామము (సౌభాగ్య లక్ష్మీ కల్పము / బ్రహ్మాండ పురాణం)*
కవిత్వదమ్ చౌదారమ్ చ సర్వసౌభాగ్యదాయకమ్|పఠేత్సహస్రనామేమం వాగ్దేవ్యాః ప్రీతిదాయకమ్ ||
విద్యార్థులు, కళాకారులు ఈ నామాలను పఠించడం వల్ల వాక్శుద్ధి, సృజనాత్మకత పెరుగుతాయి. ఇది బుద్ధిని ప్రకాశింపజేస్తుంది.
***************************************
*నృసింహ సహస్రనామ స్తోత్రము (నృసింహ పురాణం)*
సర్వరోగ ప్రశమనం సర్వపాప వినాశనమ్ |
శత్రుసంహారకం చైవ నృసింహనామ కీర్తనమ్ ||
గ్రహ పీడలు, శత్రు బాధలు, అకాల మృత్యు భయం ఉన్నవారు ఈ నామాలను పారాయణ చేయడం వల్ల వజ్రకవచంలాంటి రక్షణ లభిస్తుంది.
****************************************
*శ్రీ దక్షిణామూర్తి సహస్రనామము (ఆకాశ భైరవ కల్పము)*
అజ్ఞాన తిమిరచ్ఛేదం జ్ఞానదీప ప్రకాశకమ్ |సహస్రనామ సంకీర్త్యా దేవాచార్యః ప్రసీదతి ||
అజ్ఞానం అనే చీకటిని (తిమిరం) నశింపజేసేది (ఛేదనం) జ్ఞానం అనే దీపాన్ని వెలిగించేది భగవంతుని వేయి నామాలను (సహస్రనామాలను) సంకీర్తన చేయడం ద్వారా దేవతలకు గురువైన వారు లేదా ఆ పరమాత్మ సంతోషించి అనుగ్రహిస్తారు.
****************************************
"సహస్ర" అంటే వెయ్యి అని మాత్రమే కాదు, "అనంతం" అని కూడా అర్థం. భగవంతుని అనంతమైన గుణాలను, శక్తులను స్తుతించడమే సహస్రనామ పారాయణ ఉద్దేశం. ఇది కేవలం పుణ్యం కోసమే కాకుండా, మన అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం.
అష్టోత్తర శతనామ పారాయణ (108 నామాలు)
సాధారణంగా ప్రతి నిత్య పూజలో "అష్టోత్తరం" తప్పనిసరి. నవగ్రహాల యొక్క ప్రభావం మనపై ఉండడం వల్ల, 9 గ్రహాలు మరియు 12 రాశుల కలయిక (9 \times 12 = 108) ద్వారా కలిగే దోషాలను తొలగించుకోవడానికి 108 నామాలు పఠిస్తారు.
అవకాశం లేనపుడు ** (108), **త్రిశతి** (300), మరియు **సహస్రనామములు** (1000).
ఏదో ఒక పద్ధతి పారాయణ అర్చన చేయడం మంచిది.
***************************************
*అష్టోత్తరం 108 విశేషం*
*దేవీ భాగవతం*
అష్టోత్తర శతైర్నామభిః అర్చయేత్ పరమేశ్వరీమ్ |
సర్వపాప వినిర్ముక్తః సర్వకల్యాణభాజనమ్ ||
108 నామాలతో అర్చన చేయడం వల్ల తక్షణమే పాప విముక్తి కలిగి, సకల శుభాలు కలుగుతాయి. ఇది దైనందిన సాధనకు (Daily Practice) అనువైనది.
నారద పురాణం
అష్టోత్తర శతం నామ్నాం సర్వపాప ప్రణాశనమ్ |యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామానవాప్నుయాత్ ||
108 అనే సంఖ్య సూర్యుడు, చంద్రుడు మరియు భూమికి మధ్య గల దూరం యొక్క నిష్పత్తికి, అలాగే మనిషిలోని 108 ప్రధాన నాడీ కేంద్రాలకు (Nadi points) సంకేతం. అందుకే అష్టోత్తర పఠనం వల్ల శరీరం మరియు మనస్సు త్వరగా లయబద్ధం (Alignment) అవుతాయి.
*****************************************
*త్రిశతీ 300 విశేషం*
లలితోపాఖ్యానం త్రిశతి నామ పారాయణ (300 నామాలు)
సహస్రనామపాఠాచ్చ యత్ఫలం భవతి ప్రియే |తత్పల్యం కోటిగుణితం త్రిశత్యా జపతో భవేత్ ||
హయగ్రీవ స్వామి అగస్త్యుడితో ఇలా అంటారు
"ఓ అగస్త్యుడా! సహస్రనామ పారాయణ వల్ల కలిగే ఫలితం కంటే, త్రిశతి పారాయణ వల్ల కోటి రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది."
దీనికి కారణం త్రిశతిలోని నామాలు *మూల మంత్రo* (15 అక్షరాల మంత్రం) తో కూడి ఉండడం. ఇది కేవలం నామ పారాయణమే కాదు, మంత్ర జపంతో సమానం.
***************************************
*సహస్ర( 1008) నామ పారాయణ విశేషం*
సహస్రనామ పారాయణ అనేది యజ్ఞం లాంటిది. "విష్ణు సహస్రనామ" ఫలశ్రుతిలో భీష్ముడు ఇలా అంటారు
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ ||
సహస్రనామాలను పఠించడం వల్ల పరమమైన తేజస్సు, తపస్సు మరియు బ్రహ్మజ్ఞానం లభిస్తాయి. ఇది సంపూర్ణ శరణాగతికి మార్గం.
****************************************
*బ్రహ్మ వైవర్త పురాణం*
నారాయణేతి నామాస్తి వాగస్తి వశవర్తినీ |
తథాపి నరకే ఘోరే పతంతీత్యేతదద్భుతమ్ ||
భగవంతుని నామాలు ఉన్నాయి, వాటిని పఠించే శక్తి కలిగిన నాలుక ఉంది. అయినప్పటికీ మనుషులు ఘోరమైన నరకానికి (కష్టాలకు) గురవుతున్నారంటే అది విచిత్రం. అంటే, నోరున్న ప్రతి ఒక్కరూ ఈ సహస్ర, త్రిశతి లేదా అష్టోత్తర నామాలను పఠించి తీరాలని దీని ఆంతర్యం.
వీటన్నింటిలోనూ **"భక్తి"** అనేది ప్రధానాధారం. భక్తి లేకుండా చేసే సహస్రనామ పారాయణ కంటే, భక్తితో చేసే ఒక్క నామ స్మరణ మిన్న అని పురాణాలు ఘోషిస్తున్నాయి.
****************************************
*ప్రతీ సహస్ర నామాలలో అంతర్యం*
నామ రూపే లీలా ధామేత్యనుక్రమః |
చిత్తే స్ఫురంతి త్వనిశం భక్త్యా సంకీర్తనే కృతే ||
*నామ
భగవంతుని పేరు (ఉదా.. విష్ణు, లలిత, శివ). ఇది ధ్వని రూపం.
*రూప
ఆ నామాన్ని పఠిస్తున్నప్పుడు స్ఫురించే దైవ స్వరూపం (శంఖ చక్ర గదాధరుడు లేదా త్రినేత్రుడు).
*లీల ఆ దైవం చేసిన అద్భుత కృత్యాలు (ఉదా.. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ).
*ధామ
ఆ దైవం నివసించే పరమపదం (వైకుంఠం, కైలాసం లేదా శ్రీచక్రాంతర్వర్తిని).
*పద్మ పురాణం - నామ చింతామణి*
నామ చింతామణిః కృష్ణశ్చైతన్య రసవిగ్రహః |
పూర్ణః శుద్ధో నిత్యముక్తోఽభిన్నత్వాన్నామ నామినోః ||
భగవంతుని నామం ఒక 'చింతామణి' వంటిది. అది చైతన్య స్వరూపం (రసవిగ్రహం). భగవంతుడికి, ఆయన నామానికి భేదం లేదు. కాబట్టి నామ పారాయణ చేసేటప్పుడు భక్తుడు ఆ దైవంతో ఏకమైపోతాడు. ఇదే సమాధి స్థితికి పునాది.
*సమాధి స్థితికి మార్గం క్రమ పద్ధతి*
సహస్రనామ పారాయణలో ఈ నాలుగు అంశాలు ఒకదాని వెంట ఒకటి ఎలా స్ఫురిస్తాయి అని శాస్త్రం
*నామ స్మరణ
నాలుకతో నామాన్ని పలకడం (శబ్ద బ్రహ్మ).
*రూప ధ్యానం
నామం వినబడగానే మనస్సులో దైవ రూపం స్థిరపడటం.
*లీల చింతన
ఆ దైవం యొక్క కళ్యాణ గుణాలు, లీలలు గుర్తొచ్చి హృదయం ద్రవించడం.
*ధామ ప్రాప్తి
సర్వం ఆ దైవమయంగా కనిపించే స్థిరమైన స్థితి (సమాధి).
***** నిత్యా ఆచరించే వారికి ఇహ సుఖం తో పాటు పరమ పదం కూడా తథ్యం******
****************************************శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏
*రాళ్ళబండి శర్మ*
సుమన మనోహర రామ*
*సుమన మనోహర రామ*
సుమన మనోహర రామ
సుందర వదనా రామ
రాజీవ లోచన రామ
రఘుకుల సోమా రామ
దశరథ నందన రామ
కౌసల్యా సుప్రజా రామ
సౌమిత్రి అగ్రజ రామ
వశిష్ఠ శిష్య రామ
కౌశిక మఖ రక్షక రామ
శివధనుర్భంజన రామ
సీతా కళ్యాణ రామ
పితృవాక్య పరిపాలక రామ
గహన విపినచర రామ
మాయా మృగ అనుసరణ రామ
మారీచ మర్దన రామ
జానకీ విరహ రామ
వాలి నిగ్రహ రామ
సుగ్రీవ రాజ్య ప్రదాత రామ
హనుమత్ సేవిత రామ
దశకంఠ సంహార రామ
అయోధ్యా పుర వాస రామ
పట్టాభిషేక రామ
రామ కోదండ రామ
సుమన మనోహర రామ
సుందర వదనా రామ
--
సునీల్ ఆకెళ్ళ
కుటుంబ సమస్యలు - విశ్లేషణ బ్రాహ్మణి దేవి - imp
సావడి కబుర్లు - 8
వందేమాతరం
కుటుంబ సమస్యలు - విశ్లేషణ
*సహృదయం సామనస్యం అవిద్వేషం కృణోమి వః ।*
*అన్యోన్యం అభిహర్యత వత్సం జాతమివాఘ్న్యా ॥*
_మన హృదయాలు ఒకటిగా ఉండాలి, మన భావనలు సమన్వితంగా ఉండాలి, పరస్పర ద్వేషానికి తావు ఉండకూడదు. ఒక ఆవు తన దూడను ఎంత ప్రేమగా ఆదరిస్తుందో అంత ప్రేమతో మనం ఒకరినొకరం ఆదరణతో ఉండాలి_ అంటూ అధర్వణ వేదం రూపంలో వేదమాత మానవ కుటుంబజీవనానికి ఇచ్చిన అద్భుతమైన ఉపదేశం ఎంతో విలువైనది. అదే నిజమైన కుటుంబ స్వరూపం.
కుటుంబం అంటే కేవలం ఒకే ఇంట్లో నివసించే రక్తసంబంధాల కలయిక కల వ్యక్తుల సమాహారం మాత్రమే కాదు. ఒకే హృదయస్పందనతో జీవించే మనసుల సమూహం. అది ప్రేమ, కర్తవ్య, త్యాగ, క్షమ, సహనం, గౌరవం అనే ఆరు స్తంభాలపై నిలిచే పవిత్ర జీవనవ్యవస్థ. రక్తసంబంధం కుటుంబానికి రూపాన్ని ఇస్తే, ప్రేమ దానికి ప్రాణాన్ని ఇస్తుంది. కర్తవ్యబోధన దానికి స్థిరత్వం ఇస్తుంది. క్షమ దానికి చిరకాలం నిలిచే విశ్వాసాన్నిస్తుంది.
ఒక విధంగా మనిషి జీవితంలో కుటుంబమే తొలి పాఠశాల. తల్లిదండ్రులే తొలి గురువులు. కుటుంబమే సంస్కార బోధన చేసే తొలి దేవాలయం. అందుకే మన సంస్కృతిలో గృహాన్ని “ఇల్లు” అని మాత్రమే కాక “గృహస్థాశ్రమం” అని గౌరవంగా సంబోధిస్తారు.
అయితే, ఇంత పవిత్రమైన బంధాలలో ఎందుకు కలహాలు ఏర్పడుతున్నాయి? ప్రేమతో కలిసిన మనసులు ఎందుకు దూరమవుతున్నాయి ?. కలిసి జీవించాలనే సంకల్పంలో తేడాలు ఎందుకు వస్తున్నాయి? దీనికి సమాధానం వెతికితే మనకి మానవస్వభావంలోనే కనిపిస్తుంది.
కుటుంబ కలహాలకు ప్రధాన కారణం ప్రేమ, అపేక్షలు.
అపేక్షలు అతిగా పెరిగితే అవి బాధకు మూలమవుతాయి. “వారు నన్ను అర్థం చేసుకోవాలి”, “నేను అనుకున్నట్టే ప్రవర్తించాలి”, “నా మనసుకు అనుగుణంగా ఉండాలి” అనే మౌనమైన ఆశలు నెరవేరనప్పుడు అసంతృప్తి పుడుతుంది. ఆ అసంతృప్తి మెల్లగా మనసులో మంటగా మారి కలహాలకు కారణమవుతుంది.
దీనినే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు
*కామాత్ క్రోధోఽభిజాయతే క్రోధాత్ భవతి సంమోహః ।*
*సంమోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః ॥*
అంటూ, అతిశయమైన ఆశల నుంచే క్రోధం పుడుతుంది. క్రోధం వివేకాన్ని నాశనం చేస్తుంది అని హెచ్చరించాడు.
కుటుంబ కలహాలకు అపేక్షలు మొదటి కారణమైతే, రెండో ప్రధాన కారణం అహంకారం. ప్రేమ “మనము” అంటే, అహంకారం “నేను” అంటుంది. “నేనే ఎందుకు తగ్గాలి?”, “నా మాటే ఎందుకు వినకూడదు?”, “ప్రతి సారి నేనే ఎందుకు క్షమించాలి?” అనే భావనలు ఎప్పుడైతే మనసులో కలుగుతాయో, అవే కుటుంబంలో చీలికలకు తీసుకొని వస్తాయి. అంటే ప్రేమ తగ్గిన చోట అహం పెరుగుతుంది, అహం పెరిగిన చోట శాంతి నిలవడం కష్టం.
ఇక మూడవ కారణం సంభాషణలో లోపం.
కుటుంబాలు పెద్ద సమస్యల వలన కూలిపోవు, చిన్న అపార్థాలను పెద్దవిగా పెంచడం వలన కూలిపోతాయి. చెప్పవలసిన మాట చెప్పకపోవడం, వినవలసిన మాట వినకపోవడం, అర్థం చేసుకోవలసిన సందర్భంలో తీర్పు ఇవ్వడం, ఇవే అనేక బంధాలను దెబ్బతీస్తాయి. మాటలతో సరిచేయవలసిన చోట మౌనం దానిని మరింత కఠినతరం చేస్తుంది.
నాలుగవ ముఖ్య కారణం పోలికలు. “వారి ఇంట్లో ఇలా ఉంది”, “వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు”, “అతని భార్య ఇలా, ఆమె భర్త అలా.." వంటి పోలికలు కుటుంబాల్లో ఆనందాన్ని హరించి వేయడమే కాక అసంతృప్తిని పెంచుతాయి. పోలిక ఉన్నచోట కృతజ్ఞత ఉండదు, కృతజ్ఞత లేని చోట సంతోషం నిలవదు.
ఇక చివరిగా, ఐదవ కారణం క్షమాభావం లేకపోవడం.
తప్పులేని మనిషి ఉండడు. కలిసి జీవించాలంటే పరస్పరం లోపాలను అర్థం చేసుకోవాలి, కొన్ని సందర్భాల్లో భరించాలి కూడా. ప్రతి చిన్న పొరపాటును మనసులో దాచుకుంటూ పోతే, అది మనుషుల మధ్య సంబంధాన్ని లోపల్నుంచి క్రమంగా క్షీణింపజేస్తుంది. అందుకే *క్షమా వీరస్య భూషణమ్* క్షమించడం అనేది బలహీనత కాదు, బలం అంటారు.
ఇవే కాక, ఆర్థిక ఒత్తిడులు, సమయాభావం, బాహ్యప్రభావాలు, ధార్మిక విలువలు లేకపోవడం, పరస్పర గౌరవం తగ్గిపోవడం కూడా కుటుంబంలో కలహాలకు కారణం అవుతున్నాయి. ఆధునిక జీవనశైలి సౌకర్యాలను పెంచినా, హృదయాల మధ్య దూరాన్ని కూడా పెంచుతోంది. ఒకే ఇంట్లో నివసిస్తున్నా, మనసులు వేర్వేరు లోకాలలో విహరిస్తున్నాయి. కలిసి భోజనం చేసే అలవాటు తగ్గిపోవడం, మనసు తెలుసుకోవాలనే ఆలోచన లేకపోవడం, బాధ పంచుకునే సంస్కారం తగ్గిపోవడం, నావాళ్లు స్థానంలో నేను అనే భావం పెరిగిపోవడం కూడా కుటుంబ కలహాలకు కారణమవుతున్నాయి.
మరి దీనికి పరిష్కారం లేదా? అంటే ఉంది. మొదట కుటుంబంలో హక్కుల గురించి కాక బాధ్యతల గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి.
“నాకు ఏమి దక్కింది?” అనే ప్రశ్న కంటే “నేను ఏమి ఇచ్చాను?” అనే ఆలోచన కుటుంబాన్ని కాపాడుతుంది.
రెండవది, ముఖ్యంగా వినడం నేర్చుకోవాలి. సంబంధాలు నిలవాలంటే ఎదుటివారి మాటను సమాధానం చెప్పడానికి కాక, అర్థం చేసుకోవడానికి వినాలి.
మూడవది గెలవడం కాదు బలపడడం ముఖ్యం అన్నది గ్రహించాలి. వాదనలో గెలిచి మనసును కోల్పోవడం మూర్ఖత్వం అవుతుంది. కుటుంబంలో “నేను గెలిచాను” అన్న భావం కన్నా “మన బంధం నిలిచింది” అన్న భావం గొప్పతనం తెలుసుకోవాలి. నాలుగవది, కలిసి ఆచరించే సంస్కృతి పెంపొందించుకోవడం.
ఇక ఐదవది, కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోవడం. కుటుంబ సభ్యులలోని మంచి లక్షణాలను ప్రశంసించాలి. ప్రశంసించని ప్రేమ క్రమంగా అలసిపోతుంది.
ఆరవది, ఆర్థిక ఒత్తిళ్లు. ధనం కుటుంబాన్ని పోషించడానికి సాధనంగా ఉండాలి కానీ అదే లక్ష్యమైపోతే సంబంధాలు బలహీనమవుతాయి. సంపాదన పెరిగినా సమయం, ప్రేమ, పరస్పర గౌరవం తగ్గితే కుటుంబంలో శూన్యత పెరుగుతుంది.
చివరిగా ముఖ్యమైనది, సహనాన్ని సాధనగా స్వీకరించాలి. కుటుంబంలో కొన్నిసార్లు సత్యం కన్నా శాంతి ముఖ్యమవుతుంది, తర్కం కన్నా ప్రేమ గొప్పదవుతుంది.
కౌరవ వంశం బాహ్య శక్తుల వల్ల కాదు, అంతర్గత ద్వేషం వల్లే నశించింది. ఇది కుటుంబాన్ని బాహ్య శత్రువులు కన్నా అంతర్గత విభేదాలే ఎక్కువ నాశనం చేస్తాయి అన్నదానికి మహాభారతమే మనకు గొప్ప ఉదాహరణ.
కలహాలు రావడం అసహజం కాదు, కానీ కలహాల కంటే బంధం గొప్పదని గుర్తుంచుకొని వాటిని అధిగమించడం సంస్కారం.
అంతిమంగా, కుటుంబం అనేది సంపూర్ణుల సమూహం కాదు, పరస్పర అపూర్ణతలను ప్రేమతో అంగీకరించిన మనుషుల పవిత్ర బంధం. ఇల్లు ఇటుకలతో నిర్మించబడితే, కుటుంబం హృదయాలతో నిర్మించబడుతుంది.
కుటుంబం నిలవాలంటే ఒకరినొకరు మార్చుకోవాలని కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ప్రయత్నించాలి.
మన సనాతన హిందూ సంస్కృతీ సంప్రదాయాల కుటుంబ ఐక్యతకు ఒక అందమైన మార్గదర్శక శ్లోకాన్ని ఋగ్వేదం
*సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతామ్ ।*
అంటూ కలిసి నడవండి, కలిసి మాట్లాడండి, పరస్పరం మనస్సులు తెలుసుకోండి, అని బోధించింది.
ఇదే ఆదర్శమైన కుటుంబ జీవనానికి అవసరమైన సూత్రం.
మృశి
(దశిక ప్రభాకర శాస్త్రి)
9849795167
11.04.2026
బ్రాహ్మణి దేవి -
*బ్రాహ్మణి దేవి - సృష్టి యొక్క ఆదిశక్తి*
సప్తమాతృకల పవిత్ర క్రమంలో మొదట నిలిచే దేవి బ్రాహ్మణి. ఆమె బ్రహ్మ దేవుడు యొక్క శక్తి స్వరూపిణి. సృష్టి అనే భావన రూపం దాల్చే ముందు మనసులో మెదిలే ఆ మొదటి ఆలోచన స్పూర్తి - అదే బ్రాహ్మణి తత్వం.
ఆమె కేవలం పురాణాలలో ఉన్న దేవత మాత్రమే కాదు; ప్రతి సృజనాత్మక ఆలోచనకు, ప్రతి జ్ఞానోదయానికి మూలమైన చైతన్యశక్తి.
ఐకానోగ్రఫీ మరియు ప్రతీకలు
బ్రాహ్మణి స్వర్ణవర్ణంతో, శాంతస్వరూపంతో, జ్ఞానమయ కాంతితో దర్శనమిస్తుంది. ఆమె రూపంలోని ప్రతి అంశం లోతైన అర్థాన్ని కలిగి ఉంది.
నాలుగు ముఖాలు
బ్రహ్మలాగే బ్రాహ్మణికి కూడా నాలుగు ముఖాలు ఉంటాయి. ఇవి నాలుగు వేదాలను సూచిస్తాయి. సర్వ విద్యల మూలం, జ్ఞానానికి ఆదిప్రేరణ ఆమెనే అన్న సందేశం ఇందులో ఉంది.
హంస వాహనం
ఆమె వాహనం హంస. హంసకు నీటిలో కలిసిన పాలను వేరుచేసే శక్తి ఉందని ఉపమానం. అదే విధంగా బ్రాహ్మణి భక్తునికి మాయ (అసత్యం) నుండి సత్యాన్ని వేరుచేసే వివేకాన్ని ప్రసాదిస్తుంది.
కమండలువు మరియు జపమాల
కమండలువు - సృష్టి విత్తనాల ప్రతీక.
జపమాల - ధ్యానం, ఏకాగ్రత, జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చే సాధన.
మానసిక స్వచ్ఛతకు బ్రాహ్మణి సాధన
ఈ ఆధునిక కాలంలో మనసు ఎన్నో సమాచారాలతో, దృష్టి మరల్చే అంశాలతో నిండిపోతుంది. ఈ కల్లోలంలో బ్రాహ్మణి “దైవిక వడపోత”లా పనిచేస్తుంది.
ఆమె అనుగ్రహం వల్ల:
సృజనాత్మకత పెరుగుతుంది - కళాకారులు, రచయితలు, ఆవిష్కర్తలకు ప్రేరణ.
https://whatsapp.com/channel/0029Vailh8bGk1FuDeog9W21
మనస్సు పవిత్రమవుతుంది - చిత్తశుద్ధి, సాత్త్విక స్థితి కలుగుతుంది.
బుద్ధి వికాసం - అజ్ఞానాన్ని తొలగించి విద్యా, ఆధ్యాత్మిక రంగాల్లో పురోగతి.
దైనందిన జీవితానికి సందేశం
ప్రతి గొప్ప సాధనకు మూలం శాంతమైన, నియంత్రితమైన మనస్సు మరియు పవిత్ర సంకల్పం. బ్రాహ్మణిని ఆరాధించడం అంటే కేవలం జ్ఞానం కోరకడం కాదు; ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసే సద్గుణాలను కోరుకోవడం.
ఆమె తత్వాన్ని ధ్యానిస్తే, అస్తవ్యస్తమైన ఆలోచనలు సుసంఘటిత దృష్టిగా మారి, మనలోని సామర్థ్యం సాకారమవుతుంది.
బ్రాహ్మణి అనేది సృష్టిని నిర్మించే శాంతమయ శక్తి - సమాజంలో సౌహార్దాన్ని, మనసులో స్పష్టతను నింపే ఆదిమాతృశక్తి.
https://whatsapp.com/channel/0029Vailh8bGk1FuDeog9W21
నైతికత లోపిస్తున్న యువత*
*నైతికత లోపిస్తున్న యువత*
****************************
*ఇరిగో చూడండి మన భావి భారత పౌరులు వీరు*
*కన్నవారి కోటి కలల ఆశాదీపాలు...*
*కొండల్ని సైతం పిండిని చేయగల సమర్ధులు*
*శక్తి యుక్తుల్లో అగ్రగణ్యులు*
*అయినా ఇదేం కర్మమో తెలియదు!*
*ఉరుకుపరుగుల దైనందిన జీవితంలో ఆటుపోట్లతో అలసిసొలసిన ముదిమితరం ఒకపక్క గుదిబండలాంటి సంసార సాగరాన్ని ఈదడానికీ ఇప్పటికీ పడిలేచే కేరటంలా తమవంతు చెమటలు చిందిస్తుంటే!*
*సాధనే తమ లక్ష్యమై*
*శోధనే తమ ధ్యేయమై*
*ప్రగతి పథంలో దేశాన్ని నడపవలసిన నేటి యువతరం మాత్రం మన్నుతిన్న పాములా మందకోడిలా.... సాగుతుందిలా*
*చరవాణి మోజులోపడి బానిసలైపోతున్న సోమరిపోతులు ఇంటింటికీ భారంగా తయారవుతున్నారిలా..,!*
*కుటుంబానికి చేయుత నివ్వవలసిన వయస్సు లో ఇలా వ్యసనపరులై బతకటమేమిటి కర్మ కాకుంటే! ?*
*ఉడుకురక్తం ఉప్పొంగుతున్నా చేతకాని చవటల్లా వండిపెడితే తిని కూర్చోవడమేమిటి బ్రతుకు అర్థం తెలియకుండా ! ?*
*వయసు కావరంతో కన్నవాళ్ళు కానరారు*
*ఉన్న ఊరు కంటికానదు*
*వీరికన్నా మృగాలు నయం*
*వాటి ఆహారం అవే కష్టపడి సాధించుకుంటాయి*
*దేశభక్తి లేదు పెద్ద చిన్న తారతమ్యం లేదు మంచి చెడుల విచక్షణ లేదు దుర్జన సహవాసాలతో దేశతిమ్మరులై తిరుగాడు మానవ మృగాలుగా తయారైనారు*
*ఓ..యువత మేలుకో ఇకనైనా మీరు మారకుంటే మహిలో మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోవనుంది జాగ్రత్తసుమ్మి!!*
*....... 0......*
ఆవు…వేదన !!!
ఆవు…వేదన !!!
నాయనలారా…మిమ్మల్నే….!
పిలిచేది ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా…? మీకు అమ్మపాలు లేక… గుక్కపట్టి ఏడుస్తుంటే… అమ్మపాల బదులు నా పాలు తాగి పెరిగారు గుర్తులేదా..! ఇప్పటికీ పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మీగడలతో… ఇలా నా పాలతోనే తయారయ్యే అనేక రకాల ఉత్పత్తులతో కండలు పెంచుకుంటున్నారే…! ఆ ఆవునే నేను. దేవుడు ప్రతిచోటా ఉండలేక తల్లిని సృష్టించాడంటారు…ఆ అమ్మేలేని పసిబిడ్డలకు ఆవుపాలు ఎందుకు పోస్తారో తెలుసా…? ఆవుపాలతో బిడ్డ బతికి బట్టకడుతుందని నమ్మకం… అదే నా ప్రత్యేకత. అలాంటిది నన్ను కోసుకుని తింటారా…?
నేను ఏ రోజైనా నోరు తెరచి మిమ్మల్ని ఏదైనా అడిగానా…? ఇంత గడ్డి తిని…ఇంటిల్లిపాదినీ బతికిస్తున్నాను. పాడిసంపద మాత్రమేకాదు నాయనా…! గోమూత్రం, గోమయం…ఇలా నా శరీరంలోని అణువణువూ మీ కోసం… మీ ఆరోగ్యకరమైన జీవనం కోసం … మీ ఇంట్లో సిరులు కురిపించే పంటల కోసం… ధారవోస్తుంటే… అదీ చాలదని నన్ను వండుకుని తింటారా…? పైగా “ బీఫ్ ఫెస్టివల్” అంటూ అమ్మలాంటి నన్ను చంపుకుతినటం… మీకో పండుగా…..?
ఎర్రటి ఎండలో పెట్టినా… మీకు చల్లని మజ్జిగనిస్తున్నా… హోరుమనే వానలో నేను వణికిపోతున్నా…. మీకు మాత్రం వేడివేడి పాలనిస్తున్నా… దొరికిన చెత్తాచెదారమేదో తిని…మీకు మాత్రం పుష్టికరమైన పాడినిస్తున్నా….! చుర్రుమనే కారంతో మీ నోళ్లు మండితే…కమ్మని నెయ్యిని కూడా నేనే ఇస్తున్నా…. మరి నేనేం పాపం చేశానని…నాకీ చిత్రవధ….?
ఏనాడైనా మిమ్మల్ని పొడిచానా…కరిచానా… కనీసం బెదిరించానా… భయపెట్టానా…! మీరు అదిలిస్తే…ఏదో నా బిడ్డలే కదా అని ఓ మూలన పడి ఉన్నా కదా…! నా ఆఖరి శ్వాస దాకా మిమ్మల్నే కనిపెట్టుకుని … పాలిచ్చాను…పాలించాను…
అందుకు నాకు ఇదా బహుమతి…! ఇదేనా…నవనాగరికులమని చెప్పుకునే మీరు చూపించాల్సిన కృతజ్ఞత….?
కడుపులో పెట్టుకుని కాపాడే కన్నతల్లిని ఎవరైనా చంపుకుంటారా…? గ్లాసుడు నీళ్లిస్తేనే…. థ్యాంక్యూ..థ్యాంక్యూ..థ్యాంక్యూ … అంటూ ఆకాశానికి ఎత్తేస్తారే…! అలాంటిది మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడే …. నన్ను వండుకుని తినాలనిపించటం మీకు న్యాయమా…? పైగా మీ రుచి కోసం… మీ ఆకలి తీర్చే నన్ను ఆకలితో మాడుస్తారు… తలకిందులుగా వేలాడదీస్తారు… ఒక్కసారి ప్రాణం తీయకుండా…చిత్రవధ చేస్తారు… మనుషులు చేయాల్సిన పనేనా ఇది…?
గోమాతను కాపాడటం అంటే భారతీయ వైభవాన్ని కాపాడుకోవడమే .
డబ్బు మనం పొదుపుగా
*శ్రీ కిరణం*
*డబ్బు మనం పొదుపుగా వాడుకుంటే కష్ట కాలంలో ఆదుకుంటుంది, అదుపు లేకుండా వాడుకుంటే జీవితంతో ఆడుకుంటుంది.*
*క్రాంతి కిరణాలు*
*కం. పొదుపుగ ధనమును వాడిన*
*నది రక్షించును మనలను నాపదలందున్*
*నదుపును తప్పిన వేళల*
*పదునగు నాయుధము కన్న వాడిగ నుండున్*
శ్రీ సుందరమూర్తి నాయనారు
శ్రీ సుందరమూర్తి నాయనారు (సంపూర్ణ చరిత్ర)
01. పూర్వజన్మ వృత్తాంతం
కైలాసంలో శివుడికి నిత్యం అలంకరణ చేసే సేవకుడు ఒకరు ఉండేవారు. అతని పేరు "హాలాహల సుందరుడు". ఒకరోజు తోటలో పూలు కోస్తుండగా, పార్వతీ దేవి చెలికత్తెలైన 'కమలిని', 'నిందిత' (అనిందిత) అనే ఇద్దరు అద్భుతమైన సౌందర్యరాశులను చూసి మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మాయిలు కూడా సుందరుడిని ఇష్టపడతారు.ఈ విషయం సర్వజ్ఞుడైన శివుడికి తెలుస్తుంది. "కైలాసంలో కామ వాంఛలకు తావు లేదు. మీ కోరికలు తీర్చుకోవడానికి మీరు ముగ్గురూ భూలోకంలో జన్మించండి. మీ ఆశలు తీరాక తిరిగి నా దగ్గరకు వద్దురు గాక" అని ఆశీర్వదించి పంపిస్తాడు.
02. జననం -
రాజభోగం:శివుడి ఆజ్ఞ మేరకు ఆ సుందరుడు, తమిళనాడులోని 'తిరుమునైపాడి' అనే రాజ్యంలోని 'తిరునైవలూరు' గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు "నంబి ఆరూరార్".అతని అందం చూసి ముచ్చటపడిన ఆ దేశపు రాజు 'నరసింగ మునియరైయార్', బ్రాహ్మణుల అనుమతితో ఆ పిల్లవాడిని దత్తత తీసుకుని రాజకుమారుడిలా పెంచాడు. వేదాలతో పాటు యుద్ధ విద్యలు, రాజభోగాలు అనుభవిస్తూ పెరిగాడు.
3. పెళ్లి మండపంలో గొడవ
యుక్తవయసు రాగానే సుందరుడికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. సరిగ్గా మాంగళ్యధారణ సమయానికి, ఒక వృద్ధ బ్రాహ్మణుడు (శివుడు) చేతిలో తాటియాకుల గ్రంథం పట్టుకుని అక్కడికి వచ్చాడు.* వృద్ధుడు: "ఆగండి! ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ వరుడు నా బానిస."* సుందరుడు (కోపంతో): "పిచ్చివాడా (పిత్తా)! ఒక బ్రాహ్మణుడు మరొక బ్రాహ్మణుడికి బానిస ఎలా అవుతాడు? పో ఇక్కడి నుంచి."* వృద్ధుడు: "ఇదిగో సాక్ష్యం. నీ తాతగారు స్వయంగా రాసిచ్చిన పత్రం ఇది. 'మా వంశం మొత్తం ఈయనకు బానిసలుగా ఉంటాం' అని రాసి ఉంది."సభలోని పెద్దలు ఆ పత్రాన్ని పరిశీలించి, అది నిజమేనని తేల్చారు. సుందరుడు ఓడిపోయాడు. పెళ్లి ఆగిపోయింది. ఆ ముసలివాడి వెంట బానిసగా వెళ్ళాడు
04. జ్ఞానోదయం
- మొదటి పాట:ఆ వృద్ధుడు సుందరుడిని తీసుకుని 'తిరువెణ్ణైనల్లూర్' శివాలయానికి తీసుకెళ్లి, గర్భగుడిలోకి వెళ్లి మాయమయ్యాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది."సుందరా! వాదనలో నన్ను పిచ్చివాడా (పిత్తా) అన్నావు కదా! ఆ పేరుతోనే నన్ను స్తుతిస్తూ పాట పాడు. భూమిపై నీ జీవితం ఉన్నంత కాలం నేను నీకు వెన్నంటే ఉంటాను."అప్పుడు సుందరుడు కన్నీళ్లతో "పిత్తా పిరై సూడి..." (ఓ పిచ్చివాడా! నెలవంకను ధరించినవాడా!) అంటూ తన మొదటి "తేవార" గీతాన్ని పాడాడు.
05. ఇద్దరు భార్యలు
- విచిత్ర దాంపత్యం:భూలోకానికి వచ్చింది పూర్వజన్మలో ఇష్టపడ్డ ఆ ఇద్దరినీ పెళ్లి చేసుకోవడానికే కదా!* తిరువారూర్ అనే ఊరిలో రుద్రగణిక కులంలో పుట్టిన 'పరవైయార్' (కమలిని అవతారం)ను చూసి ప్రేమించి, శివుడి ఆజ్ఞతో పెళ్లి చేసుకున్నాడు.* కొన్నాళ్ళకు తీర్థయాత్రలకు వెళ్లి తిరువొత్తియూర్ అనే ఊరిలో 'సంకిలియార్' (నిందిత అవతారం)ను చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి, "నేను నిన్ను వదిలి ఎప్పటికీ వెళ్లను" అని ప్రమాణం చేశాడు. కానీ శివుడి ఉత్సవాలు చూడాలనే ఆత్రుతలో ఆ ఊరు దాటగానే అతనికి కళ్లు పోయాయి (ప్రమాణ భంగం వల్ల)
06. స్నేహితుడిగా శివుడు
సుందరుడి చరిత్రలోముఖ్య ఘట్టం ఇదే. దేవుడిని ఒక ఆత్మమిత్రుడిగా చూశాడు.* బంగారం అడిగాడు: కరువు వచ్చినప్పుడు ప్రజలకు అన్నదానం చేయడానికి, ఇంటి ఖర్చుల కోసం శివుడిని నేరుగా బంగారం అడిగేవాడు. శివుడు ఇచ్చేవాడు కూడా!* శివుడే రాయబారి: మొదటి భార్య పరవైయార్‌కి, సుందరుడు రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి కోపం వచ్చింది. ఆమెను శాంతింపజేయడానికి సాక్షాత్తు పరమశివుడిని అర్ధరాత్రి పూట ఆమె ఇంటికి దూతగా పంపాడు సుందరుడు. భక్తుడి కోసం దేవుడు వీధిలో నడిచి వెళ్లి రాజీ కుదిర్చాడు.
07. తిరుత్తొండ త్రొగై (నాయనార్ల చరిత్ర):
తిరువారూర్ దేవాలయంలో భక్తులందరూ ఉండగా, సుందరుడు గర్భగుడి వైపు వెళ్తుంటే "మా భక్తులను గౌరవించని వాడిని దేవుడు కూడా గౌరవించడు" అని విరన్మిండ నాయనారు అంటారు.అప్పుడు శివుడు సుందరుడికి, "నా భక్తుల గొప్పతనం నీకు తెలియదు.. వారి గురించి పాడు" అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు సుందరుడు "తిరుత్తొండ త్రొగై" అనే పదికాన్ని పాడాడు. ఇందులో 63 మంది నాయనార్ల పేర్లు, వారి గొప్పతనాన్ని ఒక్కో లైన్లో చెప్పాడు. దీని ఆధారంగానే తర్వాత 'పెరియపురాణం' వచ్చింది.
08. కైలాస ప్రాప్తి:
సుందరుడు తన 18వ ఏటనే భూమిపై తన కర్మ పూర్తి చేసుకున్నాడు. శివుడు అతన్ని తీసుకెళ్లడానికి ఐరావతాన్ని (తెల్ల ఏనుగు) పంపాడు. సుందరుడు దానిపై ఎక్కి కైలాసానికి వెళ్తుండగా, అతని మిత్రుడైన 'చేరమాన్ పెరుమాళ్' (మరొక నాయనారు) అది చూసి, తన గుర్రం చెవిలో శివమంత్రం చెప్పి, ఆ గుర్రంతో సహా ఆకాశమార్గాన కైలాసానికి వెళ్ళాడు
ముప్పు తిప్ప లెట్టి ముదిరి పోయిన జబ్బు
ముప్పు తిప్ప లెట్టి ముదిరి పోయిన జబ్బు
వస్తె హోమియోలొ వైద్య ముంటె
ముందుగానె వస్తె ముప్పుతిప్పలు నేల
సకురు అప్ప రావు సత్యమిదిర
భావం: అనేక మంది రోగులు వారి బాధలు అర్జెంటుగా తగ్గించేసుకుందామనే పిచ్చి భ్రమతో ఇంగ్లీషు స్పెషలిస్ట్ వైద్యుల చుట్టూ, కార్పొరేట్ హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి తిరిగి సమస్యను బాగా ముదరబెట్టుకొని, పరిష్కారం కానంత జటిలం చేసుకుని, జేబులో డబ్బులన్నీ వాళ్ళు పూర్తిగా పిండేసాక, ఇక మీ జబ్బు తగ్గే అవకాశమే లేదని వారు నిరాశకు గురి చేసాక, పూర్తి దీనావస్తకు చేరుకున్న రోగాలను సైతం ఓర్పుగా, నేర్పుగా నయం చేయగలిగే సత్తా కలిగిన హోమియో వైద్యానికి రోగం వచ్చిన వెంటనే వెళ్తే మీకీ తిప్పలూ, తలనొప్పులూ లేకుండా, ఒంట్లో పార్టులు కోయించుకొని, చెడగొట్టు కోకుండా, జేబులో డబ్బులన్నీ గొరిగించుకోకుండా హాయిగా, త్వరగా నయమై, క్షేమంగా మీరు మీ ఇంటిలోనే ఉంటారు కద నాయనా! ఎందుకు, హోమియోను చులకనగా చూసి, మీరు నానా తిప్పలు పడటం? హోమియోను చూసి ఎందుకలా భయపడి దూరంగా ఉంటారు?అదేమైనా మీ శత్రువా? బాగా ముదిరిపోయి, బ్రతుకు మీద ఆశ వదిలేసుకున్న వాళ్ళ రోగాలే నయం చేయగలిగే దమ్మున్నది లేతగా అప్పుడప్పుడే వచ్చిన సమస్యలూ, రోగాలూ నయం చేయలేని తింగరి, చేతకాని వైద్యమనుకుంటున్నారా?
హోమియో వైద్యమంటే ఒక అద్భుతం, అమృతం! దీనిని అర్థం చేసుకుని, ప్రతీ సందర్భానికీ వాడుకునే వాళ్ళ జన్మ ధన్యం!
సకురు అప్పారావు చెప్పే ప్రతీ మాటా అక్షర సత్యం!అయినా సరే దానిలో నిజముందో లేదో మీరు కూడా చూడండి, ఆలోచించండి!
ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870
(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)
*ఆణి ముత్యాలు
*ఆణి ముత్యాలు*
ఎక్కువగా ఎవరిని నమ్మకు *మోసపోతావు*
ఎవరికోసం ఆలోచించకు *అలుసైపోతావు*
ఎవరికి ఎక్కువ విలువివ్వకు *గౌరవం కొల్పోతావు*
ఎవరిని ప్రశ్నించకు *శత్రువు అవుతావు*
*యల్లావఝల ఫణి కృష్ణ*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
క్రాంతి కిరణాలు
*శ్రీ కిరణం*
*పెదవులకు సత్యం, కళ్లకు దయ, చేతులకు దానం, ముఖానికి చిరునవ్వు, హృదయానికి ప్రేమ — వీటిని మించిన ఆభరణాలు ఈ సృష్టిలో లేవు.*
*క్రాంతి కిరణాలు*
*కం. పెదవులపై సత్యంబును*
*వదనము నందు చిరునవ్వు బాధను మాన్పున్*
*సెద తీర్చెడు చూపులు*
*నెద యందున ప్రేమ పెంచు మెప్పటికైనన్*
జయతాచ్ఛంకరోగురుః
*జయతాచ్ఛంకరోగురుః-१९*
జగత్తు ధర్మానికి అవసరమైనది ప్రవృత్తి మార్గము. ప్రకృష్టమైన ప్రధానమైన ప్రహృష్టమైన ప్రసార యోగ్యమైన వృత్తి ప్రవృత్తి. జగత్తునుంచి తరింౘడానికి అవసరమైన మార్గము నివృత్తి. నిర్వికారమైన నిరపేక్షితమైన నిస్తులమైన నిర్గుణతత్త్వ ప్రసారభూతమైనది నివృత్తి. మన సనాతన ధర్మాచరణకై ఈ రెండు మార్గములు ప్రశస్తములు అనన్యములు. ఎందరో అవతార పురుషులు ఈ రెంటిలో ఏదియో ఒక మార్గమును ప్రధానమైనదిగా మఱియొకటి గౌణమైనదిగా పరిగణించి ఆదరించి ఆచరించి అనుసరింపఁజేసినారు. వారిలో విష్ణుభగవానుని అంశావతారములలో ప్రవృత్తి మార్గము ప్రధానముగా నివృత్తి మార్గము గౌణముగా మనము దర్శింపవౘ్చును. శివ భగవానుడి అంశావతారములలో నివృత్తి మార్గము ముఖ్యతమముగా ప్రవృత్తి మార్గము నిమిత్తమాత్రముగా గోచరింౘును. కాలచక్ర భ్రమణమున కలుగు సృష్టి రక్షణకై ప్రవృత్తి ధర్మస్థాపనలో స్థితి కారకుఁడైన విష్ణు పరమాత్మ అవతారములెట్లనేకములో నివృత్తి ధర్మ ప్రసారమునకై లయ కారకుడైన శంకరదేవుని అవతారములట్లే యనేకములు. ముఖ్యంగా శ్రీరామచంద్రచక్రవర్తి శ్రీకృష్ణభగవానుడు ప్రవృత్తి ధర్మానికి ప్రతీకలుగా శ్రీ దక్షిణామూర్తి ఆదిశంకరభగవత్పాదులు నివృత్తి ధర్మానికి నిదర్శనములుగా మనకు దిశా నిర్దేశనము చేసినారు.
వేదముల మూలమును అందించినది బ్రహ్మదేవుఁడు. మహర్షులైన బృహస్పతి వశిష్ఠ పరాశర వ్యాస జైమిని గర్గ... వేదమునందలి ఒక్కొక్క భాగమును విస్తరింప జేసిన వరిష్ఠులు. శ్రీ శంకరభగవత్పాదాచార్యులవారు సమస్త వేదస్వరూపులు. అందుకే వారు ఋషి పూర్ణ స్వరూపులని గణుతికెక్కినారు.
*వందే గురు పరంపరామ్*
సుభాషితమ్
🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *వాణీ రసవతీ యస్య*
*యస్య శ్రమవతీ క్రియా* l
*లక్ష్మీః దానవతీ యస్య*
*సఫలం తస్య జీవనమ్* ll
తా𝕝𝕝 *ఎవడి మాటలు ప్రియకరమై, పరహితమై ఉండునో, శ్రమతో కూడిననూ కర్తవ్యనిష్ఠతో క్రియలను ఆచరించునో, సంపదలు దానధర్మములకై వినియోగించబడునో అతడి జన్మ సార్థకమగుచున్నది... ఫలప్రదమగుచున్నది...*.
✍🌹💐🌸🙏
కామ్యములను తీర్చే దేవతలు*
*కామ్యములను తీర్చే దేవతలు*
మన సనాతన ధర్మంలో కోరికలను బట్టి ఏ దేవతను ఆరాధించాలో తెలిపే అత్యంత ప్రామాణికమైన గ్రంథం శ్రీమద్భాగవతం లో శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు ఏ కోరిక ఉన్నవారు ఏ దేవతను పూజించాలో వివరించారు.
****************************************
*శ్రీమద్భాగవతo*
బ్రహ్మవర్చసకామస్తు యజేత బ్రహ్మణస్పతిమ్ |
ఇంద్రమింద్రియకామస్తు ప్రజాకామః ప్రజపతీన్ ||
*బ్రహ్మవర్చస్సు (వేద విజ్ఞానం) కోసం బృహస్పతిని.
*ఇంద్రియ శక్తి కోసం ఇంద్రుడిని.
*సంతానం కోసం ప్రజాపతులను.
****************************************
దేవీం మాయాం తు శ్రీకామః తేజస్కాయో విభావసుం |
వసుకామో వసూన్ రుద్రాన్ వీర్యకామోఽథ వీర్యవాన్ ||
*సంపద (లక్ష్మి) కోసం మాయాదేవిని (దుర్గ/మహాలక్ష్మి).
*తేజస్సు కోసం అగ్ని దేవుడిని.
*ధనం కోసం వసువులను.
*పరాక్రమం కోసం రుద్రులను.
****************************************
అన్నకామస్తు అదితిం స్వర్గకామోఽదితేః సుతాన్ |
రాజ్యకామో విశ్వాందేవాన్ సాధ్యన్ సంసాధకో విశామ్ ||
*ఆహారం (అన్నం) కోసం అదితి దేవిని.
*స్వర్గ ప్రాప్తి కోసం అదితి పుత్రులను (ఆదిత్యులను).
*రాజ్యాధికారం కోసం విశ్వేదేవతలను.
****************************************
ఆయుష్కామోఽశ్వివౌ దేవౌ పుష్టికామ ఇలాం యజేత్ |
ప్రతిష్ఠాకామః పురుషో రోదసీ లోకమాతరౌ ||
*ఆయుష్షు కోసం అశ్విని దేవతలను.
*పుష్టి (ఆరోగ్యం) కోసం భూదేవిని.
*గౌరవం/ప్రతిష్ఠ కోసం భూమిని మరియు ఆకాశాన్ని.
***************************************
రూపాభికామో గంధర్వాన్ స్త్రీకామోఽప్సర ఈప్సితాః|
ఆధిపత్యపరః సర్వాన్ యజేత పరమేష్ఠినమ్ ||
*సౌందర్యం కోసం గంధర్వులను.
*ఉత్తమ భార్య/స్త్రీ సుఖం కోసం అప్సరసలను.
*ఆధిపత్యం కోసం బ్రహ్మదేవుడిని.
****************************************
యజ్ఞకామో యజేత్ యజ్ఞం విద్యకామస్తు గిరిశమ్|
దాంపత్యార్థ ఉమాం దేవీం ధర్మార్థ ఉత్తమశ్లోకమ్ ||
*యజ్ఞ ఫలం కోసం యజ్ఞ పురుషుడిని (విష్ణువు).
*విద్య (జ్ఞానం) కోసం పరమశివుడిని.
*దాంపత్య సుఖం కోసం పార్వతీ దేవిని (ఉమా దేవి).
*ధర్మం కోసం ఉత్తమశ్లోకుడైన శ్రీమన్నారాయణుడిని.
****************************************
(పరమ సత్యం)శ్రీమద్భాగవత పురాణం
ఇవన్నీ లౌకిక కోరికల కోసం చెప్పబడినవి. అయితే, అదే భాగవతంలో శుక మహర్షి చివరగా ఒక అత్యున్నతమైన వివరణ*
అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారధీః |
తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరమ్ ||
నీకు ఏ కోరికా లేకపోయినా (అకామ), అన్ని కోరికలు ఉన్నా (సర్వకామ), లేదా మోక్షం కావాలనుకున్నా (మోక్షకామ)... నువ్వు చేయవలసిన పని ఒక్కటే—పరమ పురుషుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మను అనన్యమైన భక్తితో ఆరాధించడం.
****************************************
ఐశ్వర్యం మరియు సంపద కోసం
శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి.
ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః |
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే||
అగ్ని, వాయువు, సూర్యుడు, వసువులు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు - వీరందరూ లక్ష్మీ స్వరూపులే. సంపద కోసం ఈ దేవతలను (ప్రధానంగా మహాలక్ష్మిని) ఆరాధించాలి.
****************************************
శత్రు నాశనం మరియు విజయం కోసం
షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైల విమర్దనమ్ |
దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజమ్ ||
శత్రువులను జయించడానికి, ఆపదలు తొలగడానికి శివపుత్రుడైన స్కందుడిని (సుబ్రహ్మణ్య స్వామిని) ధ్యానించాలి.
****************************************
*మోక్షం మరియు జ్ఞానం కోసం (దక్షిణామూర్తి/శివుడు/ హయగ్రీవుడు)*
జ్ఞానం మహేశ్వరాదిచ్ఛేత్ ముక్తిమిచ్ఛేత్ జనార్దనాత్ |
జ్ఞానం కావాలనుకునే వారు మహేశ్వరుడిని, మోక్షం కావాలనుకునే వారు విష్ణువును పూజించాలి.
****************************************
గ్రహ దోషాలు, ముఖ్యంగా శని ప్రభావం తగ్గడానికి హనుమ ఆరాధన శ్రేష్ఠం.
అంజనానందనం వీరం జానకీ శోకనాశనమ్ |
కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్ ||
భయాలు తొలగడానికి, పనుల్లో విజయం సాధించడానికి హనుమంతుడిని స్మరించాలి.
****************************************
*సంతాన ప్రాప్తి కోసం (బాలకృష్ణుడు)*
హరివంశ పురాణం మరియు భాగవతం ప్రకారం సంతానం కోసం సంతాన గోపాల మంత్రాన్ని లేదా కృష్ణుడిని పూజించాలి.
దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే |
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ||
సంతానం కోరుకునే వారు ఈ శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడాలి.
****************************************
ఆయుష్షు మరియు అపమృత్యు దోష నివారణ మృత్యువు నుండి తప్పించుకోవడానికి, పూర్ణాయుష్షు కోసం త్రయంబకేశ్వరుడిని పూజించాలి.
****************************************
శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏
*రాళ్ళబండి శర్మ*
తిరుపతి వెంకన్న
*తిరుపతి వెంకన్న దర్శనం 24×365 చాలా రద్దీగా ఉంటుంది. మిగతా దేవాలయాల్లో అలా ఉండదు, ఎందుకు?*
```
తిరుపతి వెంకన్న దర్శనం 24×365 రద్దీగా ఉండడానికి కారణం ఒక్క మాటలో చెప్పాలంటే - “నమ్మకం + ప్రకృతి + సౌకర్యం = తిరుమల మహాత్మ్యం.”
ఒక ఉదాహరణ తీసుకుంటే, రాహు-కేతు పూజ అన్ని గుళ్లల్లో చేసినా కాళహస్తి అంటేనే ఒక ఫీలింగ్.దుర్గమ్మ అనగానే విజయవాడ దుర్గగుడి గుర్తొస్తుంది. అలాగే ‘కలియుగ దైవం’ అనగానే తిరుమల వెంకన్నే. ఎందుకు..?```
*1. స్థల మహిమ - భూమి ఎంపిక:*```
శంకరాచార్యులు, రామానుజులు లాంటి మహానుభావులు ఏ కొండ పడితే ఆకొండ ఎక్కి గుడి కట్టలేదు. తిరుమల సప్తగిరులు సాక్షాత్తు ఆదిశేషుడి అవతారం అని పురాణం. వాయు పురాణంలో ‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన’ - ఈ విశ్వంలో వెంకటాద్రికి సమానమైన స్థలం లేదు అని ఉంది.
అంటే ఆ కొండ మీద అడుగు పెడితేనే వైబ్రేషన్ మారిపోతుంది. సైన్స్‌లో చెప్పాలంటే ‘జియోమాగ్నెటిక్ ఫీల్డ్’ ఎక్కువ ఉన్న ప్రదేశాలు. అక్కడ ధ్యానం చేస్తే మనసు తొందరగా శాంతిస్తుంది.
*. సంకల్ప బలం - కోట్లాది మంది నమ్మకం:
ఒక దీపం వెలుగుతుంది, కోటి దీపాలు కలిస్తే సూర్యుడే అవుతుంది. తిరుమలకి 2000 ఏళ్లుగా కోట్లాది మంది ‘గోవిందా,గోవిందా’ అని మొక్కుతున్నారు. ఆ సంకల్పం, ఆ కన్నీళ్లు, ఆ మొక్కులు అన్నీ ఆ గాల్లోనే ఉన్నాయి. అందుకే కొత్తగా వెళ్లిన వాడికి కూడా గుండె బరువు దిగిపోయినట్టు ఉంటుంది. దీన్నే మన పెద్దలు ‘క్షేత్ర మహాత్మ్యం’ అన్నారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అక్కడి ఎనర్జీ నిన్ను పట్టుకుంటుంది.
*. సర్వం సిద్ధం - ప్రకృతి + సౌకర్యం:
అక్కడ అనేకమైన ప్రత్యేకతలు ఉంటాయి అందులో జపాలి ఆంజనేయుడు, పాపవినాశనం, ఆకాశగంగ, శిలాతోరణం - ఒక గుడి కాదు, ఒక లోకం. పైన కొండలు, కింద మేఘాలు, చుట్టూ అడవి. నగరం గోల వినపడదు. పైగా TTD వాళ్లు అన్నదానం, బస్సు, క్యూ లైన్, లడ్డూ - భక్తుడు తిన్నాడా, పడుకున్నాడా అని చూసుకుంటారు.
‘కలియుగంలో ప్రత్యక్ష దైవం’ అంటే భయం వేయకూడదు కదా, భరోసా ఇవ్వాలి. తిరుమల అదే చేస్తుంది!```
*2. జియోగ్రఫీ - అందరికీ అందుబాటు:*```
AP, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర - అన్ని రాష్ట్రాలకు 1 రాత్రి జర్నీ. "వీకెండ్‌లో వెళ్లొద్దాం పద" అనేంత దగ్గర. అది కూడా ఒక కారణం.
మరి మిగతా గుళ్లల్లో ఎందుకు లేదు?
ప్రతి గుడికీ శక్తి ఉంటుంది. కానీ కొన్ని గుళ్లు "పవర్ హౌస్" లాంటివి. కరెంట్ అన్ని ఇళ్లల్లో ఉన్నా, పవర్ స్టేషన్ దగ్గరే లోడ్ ఎక్కువ. తిరుమల అలాంటి పవర్ స్టేషన్.
కలియుగంలో మనిషి అరిషడ్వర్గాలతో, టెన్షన్లతో సతమతం అవుతున్నాడు. "ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడేవారు?" అని ఏడ్చినప్పుడు "నేనున్నాను" అని ఆ కొండ మీద నుంచి ఒక భరోసా వినిపిస్తుంది. ఆ భరోసా పేరే వెంకటేశ్వరుడు.
అందుకే 24×365 క్యూ ఉంటుంది. అది రద్దీ కాదు, కోట్ల గుండెల నమ్మకం లైన్‌గా నిలబడింది. నువ్వు వెళ్లేది రాయితో చేసిన విగ్రహం దగ్గరికి కాదు, నీ కోసం ఎదురుచూస్తున్న తండ్రి దగ్గరికి. అందుకే ఎంత రద్దీ ఉన్నా కాలు లాగుతూ అయినా వెళ్తాం.
‘వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’ - వెంకన్న లాంటి దేవుడు లేడు, రాడు. అందుకే ఆ క్యూ ఎప్పటికీ తగ్గదు. గోవిందా!
ఇవి నాతో చూసినట్టు అంశాలు మిగిలినవి మీకు తోస్తే వాటిని కూడా చెప్పొచ్చు …ఎవరి నమ్మకం వారిది✍️``` - TMS Rao.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏.
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - దశమి - శ్రవణం - భాను వాసరే* (12.04.2026)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
---------------------------------------------
*.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
---------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*నేర్పండి*
🌸శ్రీ రామ స్తుతి🙏
🌸శ్రీ రామ స్తుతి🙏
సీ. సీతా మనోహరా ! చిన్మయా ! శ్రీరామ !
యిందీవర శ్యామ ! వందనములు
నిత్య నిరంజనా ! నిరుపమ గుణధామ !
శంకర పూజితా ! శరణు శరణు !
పరమాత్మ ! నిను భక్తి భజన చేసిన వారు
భవ బంధ మోక్షంబు బడయ గలరు.
శరణన్న వారిని కరుణతో బ్రోచెడు
సాకేత పురివాస ! సార్వ భౌమ !
తే. దనుజమర్దన శ్రీరామ ! ధన్య చరిత !
రవికులేశ్వర రఘువీర ! రమ్య తేజ !
భువన మోహన యో రామ ! పుణ్య పురుష !
దశరథాత్మజ ! రఘురామ !ధర్మ తేజ !
సాహితీ శ్రీ జయలక్ష్మి
అద్భుతమైన వైష్ణవ క్షేత్రం
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లాలో దాగి ఉన్న ఒక అద్భుతమైన వైష్ణవ క్షేత్రం ఉంది… చాలా మందికి తెలియని ఈ దేవాలయాన్ని “తొలి తిరుపతి” అని పిలుస్తారు. ఇది చిత్తూరు తిరుమల కంటే కూడా పురాతనమని స్థానికులు భక్తితో నమ్మే మహిమాన్వితమైన క్షేత్రం.
🕉️ తొలి తిరుపతి –శ్రీ శృంగార వల్లభ స్వామి క్షేత్రం"*
తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం మండలం, చదలవాడ (తిరుపతి గ్రామం) లో ఉన్న ఈ దేవాలయం, దివిలి నుండి కేవలం 1 కి.మీ దూరంలో, కాకినాడ నుండి 27 కి.మీ ఉత్తర దిశలో ఉంటుంది. ప్రశాంతమైన గ్రామ వాతావరణంలో నిశ్శబ్దంగా నిలిచిన ఈ ఆలయం, బయటకు సాధారణంగా కనిపించినా… లోపల అడుగుపెడితే ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.
ప్రవేశ ద్వారం చాలా నిరాడంబరంగా ఉంటుంది. కానీ ద్వారం పైనే శేషతల్పంపై విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, బ్రహ్మ, నారదులు దర్శనమివ్వడం భక్తుల హృదయాలను ఆనందంతో నింపుతుంది.
🌟 “చిరునవ్వుతో దర్శనమిచ్చే స్వామి”
ఇక్కడి ప్రధాన దేవుడు శ్రీ శృంగ వల్లభ స్వామి.
వెంకటేశ్వర స్వామి చిరునవ్వుతో దర్శనమివ్వడం వల్లే “శృంగ వల్లభ” అనే పేరు వచ్చింది.
గర్భగుడికి చేరుకోవడానికి ఏడు ద్వారాలు దాటాలి.
మొదటి రెండు ద్వారాలు దాటితే ద్వజస్తంభం ఉన్న బయటి ప్రాకారం వస్తుంది. స్తంభాలపై పురాతన శాసనాలు ఈ ఆలయ మహిమను చెబుతుంటాయి.
ఈ ఆలయంలో ఒక అద్భుతం ఉంది…
👉 మీరు ద్వజస్తంభం వద్ద నిలబడి స్వామివారిని చూస్తే —
ఆయన మీ ఎత్తులోనే కనిపిస్తారు!
ఎంత ఎత్తు ఉన్నా, ఎంత పొట్టిగా ఉన్నా… స్వామి మీకు సమానంగా కనిపిస్తారు.
ఇది ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక – శిల్పకళా అద్భుతం.
🌿 ధ్రువుడి తపస్సు – స్థల పురాణం
ఈ క్షేత్రం కథ ధ్రువ మహారాజు తపస్సుతో ముడిపడి ఉంది.
సవతి తల్లి అవమానంతో బాధపడిన చిన్న ధ్రువుడు,
నారద మహర్షి ఉపదేశించిన “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని జపిస్తూ ఆరు నెలలు కఠోర తపస్సు చేశాడు.
అతని భక్తి చూసి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారు.
తన మహారూపం కారణంగా బాలుడు చూడలేకపోవడంతో…
👉 “నన్ను చూడాలనుకునే వారి ఎత్తులోనే దర్శనమిస్తాను” అని ఆశీర్వదించారట.
అందుకే ఈ ఆలయంలో స్వామి ప్రతి భక్తుడికి వారి ఎత్తులో దర్శనమిస్తారని నమ్మకం.
🏛️ చరిత్ర చెబుతున్న వైభవం
ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యులు ద్రావిడ శైలిలో నిర్మించారు.
మౌర్యుల కాలం నుండి బ్రిటిష్ కాలం వరకు రాజుల ఆదరణ పొందిన ఈ ఆలయం తరువాత నిర్లక్ష్యానికి గురైంది. ఇటీవలే పునరుద్ధరణ పనులు చేపట్టారు.
🔔 ఈ ఆలయాన్ని సందర్శించినవారిగా చెబబడే మహారాజులు:
శ్రీకృష్ణదేవరాయలు
భోజ మహారాజు
విక్రమార్కుడు
కాకతీయ రాణి రుద్రమాదేవి
ఇక్కడ నారద మహర్షి లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని కూడా విశ్వాసం.
💫 ఆలయంలోని విశేషాలు
✨ ఎప్పుడూ ఎండిపోని బావి
✨ 27 నక్షత్రాల నక్షత్ర మండపం
✨ ఆళ్వారుల విగ్రహాలు
✨ శివుడు క్షేత్రపాలకుడిగా ఉన్న శివాలయం
✨ శ్రీదేవి – భూదేవి సమేత శృంగ వల్లభ స్వామి ఉత్సవమూర్తులు
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది.
🙏 దర్శించాల్సిన దివ్యక్షేత్రం
ప్రాంతం దూరంగా ఉండటం వల్ల చాలామందికి తెలియని ఈ ఆలయం, ఒకసారి దర్శించాల్సిన పవిత్రక్షేత్రం.
స్వామివారి చిరునవ్వు చూసినవారు… మరల మరల వెళ్లాలని కోరుకుంటారు.
“తొలి తిరు🌸శ్రీనివాస స్తుతి🙏
సీ. వేంకటా చలపతి! వేగమే రావయ్య
సప్తగిరులు దిగి సాధుశీల!
అలమేలుమంగతోయాలసిం పకనిక
శ్రీనివాసా! రావశీఘ్రముగను
భక్తులబ్రోచేటి వరదుడా బాధలు
తీర్చుమా జనులకు దీనబంధు
కొండల పైనున్న కోనేటి రాయుడా!
కోర్కెలు తీర్చుమా కూర్మితోడ
తే,.. మునులుసైతము దర్శించు ముక్తి కోరి
మానవులపైనదయచూపు మమత తోడ
తిరుమలగిరిపైవెలసిన దివ్యమూర్తి!
నిత్యకళ్యాణములునీకు నిర్మలాత్మ!
సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్లపతి” — నిజంగా భక్తి హృదయాన్ని తాకే దివ్య అనుభూతి. 🕉️
పంచాంగం 12.04.2026 Sunday,
ఈ రోజు పంచాంగం 12.04.2026 Sunday,
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస కృష్ణ పక్ష దశమి తిథి భాను వాసర శ్రవణం నక్షత్రం సాధ్య యోగః వణిజ తదుపరి భద్ర కరణం.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
శ్రాద్ధ తిథి: దశమి
నమస్కారః , శుభోదయం
ఆర్యా శతకం - 1*
*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 80*
*దేశిక ఇతి కిం శంకే తత్తాదృక్తవ ను తరుణిమోన్మేషః।*
*కామాక్షీ శూలపాణేః కామాగమసమయతంత్రదీక్షాయామ్||*
*భావము :*
*జగన్మాతా! నీకు నీవే సాటి. నీవు నీ కన్నుల వీక్షణములచే, వేద సంబంధమైన విద్యలయందు, మన్మధ కళలయందు, ఈశ్వరునకే గురుత్వము వహించావేమో అని తోచుచున్నది.*
🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
భగవద్గీత
--------------------------భగవద్గీత. ------------------------
చతుర్దోధ్యాయః
జ్ఞాన కర్మ సన్యాస యోగము
ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః ।
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ।। 2 ।।
ప్రతిపదార్థ:
ఏవం — ఈ విధంగా; పరంపరా — పరంపరలో; ప్రాప్తమ్ — అందుకున్న; ఇమం — ఈ (శాస్త్రము); రాజ-ఋషయః — రాజర్షులు; విదుః — అర్థం చేసుకున్నారు; సః — అది; కాలేన — దీర్ఘ కాల గతిలో; ఇహ — ఈ లోకంలో; మహతా — చాలా; యోగః — యోగము; నష్టః — తరిగిపోవుట; పరంతప — అర్జునా, శత్రువులను తపింప చేయువాడా.
తాత్పర్యము :
ఓ శత్రువులను జయించేవాడా, రాజర్షులు ఈ విధముగా యోగ శాస్త్రమును పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో అది ఈ లోకంలో లుప్తమైపోయినది (క్షీణించి పోయినది).
వివరణ:
దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవరోహణ క్రమంలో అందుకునేటప్పుడు, శిష్యుడు భగవత్-ప్రాప్తి తెలిపే శాస్త్రాన్ని గురువు గారి నుండి అర్థంచేసుకుంటాడు, ఆ గురువు తన గురువు నుండి ఇలాగే అందుకున్నాడు. ఈ విధమైన సాంప్రదాయం లోనే రాజర్షులైన నిమి, జనకుడు యోగ శాస్త్రాన్ని అర్థం చేసుకున్నారు. ఈ సంప్రదాయం, ఆది-జగద్గురువైన భగవంతునితోనే మొదలయ్యింది.
తేనే బ్రహ్మ హృదాయ ఆది-కవయే ముహ్యంతి యత్ సూరయః
(భాగవతం 1.1.1)
ఈ శ్లోకం ప్రకారం, భగవంతుడు సృష్టి ప్రారంభంలో ఈ జ్ఞానాన్ని, ప్రప్రథమంగా జన్మించిన బ్రహ్మ దేవుని హృదయంలో తెలియపరిచాడు, ఆయన నుండి ఈ సంప్రదాయం కొనసాగింది. ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, సూర్యభగవానుడైన వివస్వానుడికి కూడా తాను ఈ జ్ఞానాన్ని తెలియపరిచినట్టు చెప్పాడు, ఆయన నుండి కూడా ఈ సంప్రదాయం కొనసాగింది. కానీ, ఈ భౌతిక ప్రపంచ స్వభావం ఎలాంటిదంటే, కాల క్రమంలో ఈ జ్ఞానం లుప్తమైపోయింది. ప్రాపంచిక మనస్తత్వంగల, కపటులైన శిష్యులు, తమ కళంకిత దృక్పథం పరంగా జ్ఞానాన్ని అన్వయిస్తారు. కొలది తరాల్లోనే ఆ జ్ఞానం యొక్క ప్రాచీన స్వచ్ఛత మలినమైపోయింది. ఇలా జరిగినప్పుడు, తన అకారణ కరుణచే, భగవంతుడు ఆ సందేశాన్ని మానవ జాతి సంక్షేమం కోసం తిరిగి సుస్థిరపరుస్తాడు. ఆ పనిని తానే ఈ లోకంలో స్వయంగా అవతరించి గానీ లేదా తన పని కోసమే నియమింపబడ్డ భగవత్ ప్రాప్తి నొందిన మహనీయుని ద్వారా గానీ చేస్తాడు.
భారత చరిత్రలో ఐదవ మూల జగద్గురువైన, జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు సనాతన జ్ఞానాన్ని ఇప్పటి కాలంలో తిరిగి ప్రతిపాదించి స్థిరపరిచిన, భగవత్-ప్రేరణ నొందిన, ఈ కోవకి చెందిన మహాత్ములు. పవిత్ర కాశీ నగరంలో, ఐదువందల మంది వేద-పండితులతో కూడిన అత్యున్నత సంస్థానమైన, కాశీ విద్వత్ పరిషత్తు, కేవలం ముప్పైనాలుగు సంవత్సరాల ప్రాయంలోనే జగద్గురువు అన్న బిరుదునిచ్చి వారిని సత్కరించింది. వారు ఆ విధంగా, భారత చరిత్రలో జగద్గురు శంకరాచార్య, జగద్గురు నింబార్కాచార్య, జగద్గురు రామానుజాచార్య, మరియు జగద్గురు మధ్వాచార్యుల తరువాత ‘జగద్గురువు’ అన్న బిరుదు నొందిన ఐదవ వారయ్యారు. భగవద్గీత యొక్క నిగూఢమైన భావాన్ని, జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు నాకు తెలియచేసిన ప్రకారంగా, ఈ యొక్క గీతా వ్యాఖ్యానం వ్రాయబడింది.
12-04-2026 ఆదివారం రాశి ఫలితాలు
శ్రీ గురుభ్యోనమః 🙏
12-04-2026 ఆదివారం రాశి ఫలితాలు
మేషం
సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
---------------------------------------
వృషభం
వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు.
---------------------------------------
మిధునం
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.
---------------------------------------
కర్కాటకం
ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.
---------------------------------------
సింహం
సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
---------------------------------------
కన్య
దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
---------------------------------------
తుల
బంధుమిత్రులతో ఊహించిన మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
---------------------------------------
వృశ్చికం
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
---------------------------------------
ధనస్సు
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.
---------------------------------------
మకరం
ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం.
---------------------------------------
కుంభం
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.
---------------------------------------
మీనం
ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.
---------------------------------------
*సంపూర్ణ మహాభారతము
🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*శనివారం 11 ఏప్రిల్ 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
1️⃣9️⃣2️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*192 వ రోజు*
*విరాట పర్వము పంచమాశ్వాసము*
*192 వ రోజు*
*అర్జునుని వీరవిహారం*```
అర్జునుడు గాండీవాన్ని ధరించి కుఱు సైన్యాలను నుజ్జు, నుజ్జు చేసాడు. కుఱు సైన్యం వజ్రవ్యూహంగా ఏర్పడి అర్జునిని ఎదిరించసాగాయి. ఉత్తర కుమారుడు అర్జునిని పరాక్రమానికి పొంగిపోయి శ్లాఘించాడు. అర్జునుడు చెలరేగి యుద్ధం చేయసాగాడు. గాండీవం గుండ్రంగా తిప్పుతూ ఇరు వైపులా ఉన్న అమ్ముల పొది నుండి బాణాలు తీసి రెండు చేతులతో ఎడతెరిపి లేకుండా యుద్ధం చేస్తూ వజ్రవ్యూహాన్ని ఛేదించాడు. అర్జునిని ధాటికి గుర్రములు రథం విడిచి పారి పోతున్నాయి. రథికులు రథం నుండి కింద పడుతున్నారు. కింద పడ్డ వారిని విడిచి పెడుతూ ముందుకు సాగుతున్నాడు అర్జునుడు. ఒకసారి కనిపించిన వారు మరలా కనిపించడం లేదు. ఉత్తరకుమారుని జాగ్రత్తగా కాపాడుకుంటూ యుద్ధం చేస్తున్నాడు. అర్జునినితో యుద్ధం చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. అప్రతిహతంగా సైన్యాల మధ్య తిరుగుతున్న అర్జునిని ధాటికి సైన్యాలు నిస్తేజం ఔతున్నాయి. ద్రోణాదులపై శరసంధానం చేసాడు, కర్ణుని రథసారథిని బాణంతో కొట్టాడు, అతని రథాన్ని విరగకొట్టాడు, విల్లును విరిచాడు, దేవదత్తాన్ని పూరించాడు. కర్ణుని అవస్థ చూసి కుఱు సైన్యాలు భీష్ముని వెనక చేరారు. భీష్ముడు వారిని ఉత్సాహపరిచాడు. కృపాచార్యుడు, ద్రోణుడు, వికర్ణుడు సుయోధనునికి రక్షణ కవచంగా నిలిచారు.```
*అర్జునుడు కర్ణునితో తలపడుట*```
అర్జునుడు ఉత్తర కుమారునితో
"ఉత్తర కుమారా! కొంచెం సేపు రధాన్ని ఆపు. మనముందు మొహరించిన సైన్యాలను చూడు. కర్ణుని ముందు రధాన్ని ఆపు, వాడి పొగరు అణిస్తే కాని సుయోధనుని పొగరు అణగదు" అన్నాడు.
ఉత్తర కుమారుడు రథాన్ని కర్ణుని ముందుకు పోనిచ్చాడు. కర్ణుని వైపు శరవేగంతో దూసుకు వెళుతున్న అర్జునుని చూసి చిత్రాంగధుడు, చిత్రరధుడు, సంగ్రామ చిత్తుడు, వివిశంతి, దుష్ప్రహుడు, చిత్రసేనుడు, దుర్ముఖుడు, దుర్జయుడు, వికర్ణుడు, శత్రుంతపుడు, దుశ్శాసనుడు మొదలైన కుఱు కుమారులు అర్జునినిపై ఒక్క సారిగా ఉరికారు. ముందుగా వికర్ణుని విల్లు విరిచాడు వికర్ణుడు పారిపోయాడు. తరువాత శత్రుంతపుని చంపాడు. దానితో కుఱు కుమారులు పారి పోయారు. తరువాత కర్ణుని తమ్ముడు సంగ్రామజిత్తుడు అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు ఒక బల్లెంతో వాడిని పొడిచి చంపాడు. కర్ణుడు కోపంతో అర్జునినిపై బాణం వేసాడు. ఈ విధంగా అర్జునుడు కర్ణుడు తలపడ్డాడు. కౌరవ సేనంతా యుద్ధం చేయడం ఆపి వీరిని చూస్తూ నిలబడ్డారు. అర్జునుడు కర్ణుని చూసి “కర్ణా! నిండు సభలో నాకు ఎదురు లేదని పలికావు ఇదిగో యుద్ధం వచ్చింది సభలలో ప్రగల్భాలు పలకడం కాదు ఇప్పుడు నీ ప్రతాపం చూపు నీ తమ్ముని చావు కనులార చూసావు కదా ఇంత దాకా వచ్చి పారిపోవడానికి ప్రయత్నించ వద్దు. ద్రౌపదిని నిండు సభలో అవమానించి నందుకు ఫలితం అనుభవించాలి కదా. ఆ రోజు ధర్మరాజు మాటకు కట్టుబడి నిన్ను వదిలాను ఇప్పుడు చిక్కావు తప్పించుకోలేవు" అన్నాడు.
కర్ణుడు "అర్జునా! అన్నగారి మీద పెట్టి తప్పుకుంటావా! అంత వీరుడివా? ఎలాగైనా అడవులలో తిరిగితే రాజ్యం వస్తుందిలే అని అడవులలో తిరిగిన పిరికి పందలు మీకు ధైర్యసాహసాలు ఉన్నాయా? నీవు ఏమేమో చేసావని అన్నారు, నిన్ను చూస్తుంటే అవి అన్నీ అసత్యాలు అనిపిస్తున్నాయి" అంటూ అర్జునిపై బాణాలు సంధించాడు.
అర్జునుడు బదులుగా బాణాలతో సమాధానం ఇస్తున్నాడు. కర్ణుని విల్లు విరగ కొట్టాడు. కర్ణుడు శక్తి బాణాలను అర్జునినిపై ప్రయోగించాడు. అర్జునుడు దానిని తుత్తునియలు చేసాడు. కర్ణుడు విల్లు తీసుకుని ఆర్జునిని సారథిపై ఆరు బాణాలు అర్జునినిపై పది బాణాలు వదిలాడు. అర్జునుడు కోపించి కర్ణునిపై బల్లెములు వర్షంలా కురిపించాడు. కర్ణుడు వాటి ధాటికి ఆగలేక పారిపోయాడు. అర్జునుడు విజయ చిహ్నంగా దేవదత్తం పూరించాడు.
అర్జునుడు "ఉత్తరకుమారా! కుఱుసేనలో ముఖ్య వీరుడు కర్ణుడు పారి పోయాడు. ఇక మనకు ఎదురు నిలిచేది ద్రోణాచార్యులు మాత్రమే" అంటూ కుఱు సేనను చూసాడు.
ఉత్తరకుమారుడు అర్జునినితో
"అర్జునా! నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం, భయం, విహ్వల భావం కలుగుతున్నాయి. నీ ధైర్యం, నీ శౌర్యం చూస్తుంటే నాకు భయం కలుగుతోంది. నా మనసు వశం తప్పుతోంది, కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి రథం నడప శక్యం కాకున్నది. ఇలాంటి యుద్ధం నేనిది వరకు చూడలేదు. మనసు పరవశించి పోతోంది" అన్నాడు.```
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
12ఏప్రిల్ 2026🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
*🌹12ఏప్రిల్ 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్రమాసం - కృష్ణ పక్షం*
*తిథి : దశమి* రా 01.16 వరకు ఉపరి *ఏకాదశి*
*వారం : ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : శ్రవణం* మ 03.14 వరకు ఉపరి *ధనిష్ఠ*
*యోగం : సాధ్య* సా 06.16 వరకు ఉపరి *శుభ*
*కరణం : వణజి* మ 01.02 *భద్ర* రా 01.16 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 07.00-10.00 & 11.00-12.00 మ 02.00-04.00*
అమృత కాలం : *రేపు (13) తె 05.18 - 06.57*
అభిజిత్ కాలం : *ప 11.43 - 12.33*
*వర్జ్యం : రా 07.22 - 09.01*
*దుర్ముహూర్తం :సా04.42- 05.32*
*రాహు కాలం :సా04.49- 06.22*
గుళికకాళం :*మ 03.15 - 04.49*
యమగండం : *మ 12.08 - 01.42*
సూర్యరాశి : *మీనం*
చంద్రరాశి : *మకరం/కుంభం*
సూర్యోదయం :*ఉ 06.03*
సూర్యాస్తమయం :*సా 06.32*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.54 - 08.24*
సంగవ కాలం :*08.24 - 10.54*
మధ్యాహ్న కాలం :*10.54 - 01.23*
అపరాహ్న కాలం :*మ 01.23- 03.53*
*ఆబ్ధికం తిధి :చైత్ర బహుళ దశమి*
సాయంకాలం :*సా 03.53 - 06.22*
ప్రదోష కాలం :*సా 06.22 - 08.40*
రాత్రి కాలం :*రా 08.40 - 11.45*
నిశీధి కాలం :*రా 11.45 - 12.31*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
🌷*ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌞సూర్యాయ నమః🌞*
*🙏హృదయే మాం రక్షతు🙏*
🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః*
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🌞🌞🌞🌞🌷🌹
*శ్రీ మహావిష్ణు పురాణం
🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*శనివారం 11 ఏప్రిల్ 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *54వ భాగం*``
*చంద్రుడు, దత్తాత్రేయుడు, దూర్వాసుల జననం*```
కొంతకాలం తరువాత అత్రి మహర్షి నుండి దివ్య తేజస్సు గ్రహించిన అనసూయాదేవి గర్భవతి అయ్యింది. ఆ రోజు రాత్రి అనసూయ నిద్రపోతున్న సమయంలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణుమహేశ్వరులుప్రత్యక్షమైనారు. వారి దివ్యతేజో కాంతులు ముఖం మీద పడటంతో అత్రి మహర్షి మేల్కోని త్రిమూర్తులను చూసి ఆశ్చర్యంతో
నమస్కరించాడు.
అత్రి మహర్షి విస్మయంగా చూస్తుంటే మొదట బ్రహ్మదేవుని నుండి దివ్య కాంతిపుంజం ఉద్భవించి నిద్రిస్తున్న అనసూయ గర్భంలో ప్రవేశించి లీనమైంది. తరువాత శ్రీమన్నారాయణుని హృదయం నుండి దివ్యతేజస్సు అవతరించి అనసూయ గర్భంలో ప్రవేశించింది. పిదప మహాదేవుడి ఫాలనేత్రము నుండి అగ్నిలా ప్రజ్వరిల్లే జ్యోతి ఉదయించి అనసూయాదేవి గర్భంలోకి ప్రవేశించి అంతర్దానమయ్యింది.
త్రిమూర్తుల తేజస్సుల విలీనంతో అనసూయాదేవి బంగారు తేజస్సుతో ప్రకాశించింది. ఈ అద్భుత దృశ్యం చూసిన అత్రి మహర్షి ఆనందబాష్పాలు రాలుతుండగా అంజలి ఘటిస్తూ నమస్కరించాడు. త్రిమూర్తులు ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. అనసూయాదేవి గర్భానికి తొమ్మిది నెలలు నిండి పదవ నెల వచ్చింది. ముగ్గురు మహాపురుషులు జన్మించే సమయం ఆసన్నమైంది.
మార్గశిర మాసము ఆరంభమైంది. ఆదివారం ముగిసి సోమవారం మొదలయ్యే రాత్రిలో శుభ తరుణాన బ్రహ్మాంశ సంభూతుడైన చంద్రుడు జన్మించాడు. మరికొంత సేపటికి సోమవార ప్రదోషకాలంలో మృగశిర నక్షత్రంలో విష్ణువాంశ సంభూతుడైన దత్తుడు త్రిముఖములతో, ఆరు భుజములతో దివ్య తేజస్సు విరాజిల్లుతూ జన్మించాడు.
ఆకాశంలో దేవదుందుభులు మ్రోగాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. అప్సరసలు నాట్యం చేసారు. నారదుడు, తుంబురుడు, గంధర్వులు గానం చేసారు. సనకసనందాది మహర్షులు శుభాశీస్సులు ఇచ్చారు. ఇంద్రాది దేవతలు “జయహో దత్తాత్రేయా!" అని కీర్తించారు. అత్రి అనసూయలకు తనను దత్తం చేసుకోవడం వలన ఆ విష్ణాంశ సంభూతుడు దత్తాత్రేయుడుగా కీర్తించబడ్డాడు.
దత్తాత్రేయ జననం తరువాత కొద్ది సమయానికి శివాంశ సంభూతుడు, ఫాలనేత్రాగ్ని సమానుడు అయిన దుర్వాసుడు జన్మించాడు. అగ్రజుడు అయిన చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క ఇరవై ఏడు కుమార్తెలను వివాహమాడాడు. గ్రహస్థితి పొంది తన నక్షత్ర భార్యలతో ఆకాశంలో విహరిస్తూ చంద్రుడు రాత్రి వేళ వెన్నెలలో, చల్లదనంతో సమస్త జీవులకు మానసిక ఉల్లాసం కలిగించ సాగాడు.
తన పుత్రికలను సమానంగా ఆదరించడం లేదని దక్షుడు కుష్ఠురోగంతో నశించమని చంద్రుని శపించాడు. చంద్రుడు పరమశివుని తపస్సుతో ప్రసన్నం చేసుకుని కుష్ఠురోగం నుంచి విముక్తి పొందాడు. నెలలో పదిహేను రోజులు వృద్ధి చెందేటట్టు, పదిహేను రోజులు నశించేట్టు వరం పొందిన చంద్రుడు పరమేశ్వరుడి శిరస్సున ఉండే భాగ్యం పొందాడు. శివుడు చంద్రశేఖరుడు అయ్యాడు.
శివాంశతో జన్మించిన దూర్వాసుడు తపస్సంపన్నుడయ్యాడు. మూడవ నేత్రపు కిరణాంశ సంభూతుడు కావడంతో ఆగ్రహం దూర్వాస మహర్షికి సహజగుణమైంది. అపర రుద్రుడి వలె ప్రవర్తిస్తు దేవతలు గాని, వేరేవరైనా గాని చేసిన చిన్న తప్పులకు కూడా తీవ్రమైన శాపాలు ఇచ్చేవాడు.
కానీ ఆ శాపాల వలన లోకాలకి శుభం జరిగేది. క్షీరసాగరమధనం దుర్వాసుడు ఇంద్రునికి ఇచ్చిన శాపం వలన జరిగింది. శ్రీహరి కూర్మ వామన పరశురామ రామ బలరామ శ్రీకృష్ణాది అవతారాలు ఎత్తి లోకక్షేమం, ధర్మ రక్షణ చేయడానికి దూర్వాస మహర్షి శాపాల కారణం అని చెప్పవచ్చును.
అవతార పురుషుడు, విష్ణాంశ సంభూతుడు అయిన దత్తాత్రేయుడు చిన్నవయస్సులోనే తపస్సిద్ది పొందాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళి సంవత్సరాల తరబడి తపస్సు చేసాడు. అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు భగవంతుని అవతారము అని తెలియడం వలన దత్తాత్రేయుడి తపస్సుకి అభ్యంతరం చెప్పలేదు.
దత్తాత్రేయుడు వైష్ణావాంశ అని తెలిసిన చుట్టుపక్కల ఆశ్రమాలలో గల మునులు దత్తాత్రేయుడి వద్దకు వచ్చి "దైవస్వరూపా! మాకు గురువై ఉపదేశం చేయండి" అని అభ్యర్థించేవారు.
దత్తాత్రేయుడు "నేను ఎవరికి గురువుని కాను. మీరు నా శిష్యులు కాదు" అని వారికి దొరకకుండా మరో దూర ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేసుకునేవాడు.
*(సశేషం)*
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
