ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లాలో దాగి ఉన్న ఒక అద్భుతమైన వైష్ణవ క్షేత్రం ఉంది… చాలా మందికి తెలియని ఈ దేవాలయాన్ని “తొలి తిరుపతి” అని పిలుస్తారు. ఇది చిత్తూరు తిరుమల కంటే కూడా పురాతనమని స్థానికులు భక్తితో నమ్మే మహిమాన్వితమైన క్షేత్రం.
🕉️ తొలి తిరుపతి –శ్రీ శృంగార వల్లభ స్వామి క్షేత్రం"*
తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం మండలం, చదలవాడ (తిరుపతి గ్రామం) లో ఉన్న ఈ దేవాలయం, దివిలి నుండి కేవలం 1 కి.మీ దూరంలో, కాకినాడ నుండి 27 కి.మీ ఉత్తర దిశలో ఉంటుంది. ప్రశాంతమైన గ్రామ వాతావరణంలో నిశ్శబ్దంగా నిలిచిన ఈ ఆలయం, బయటకు సాధారణంగా కనిపించినా… లోపల అడుగుపెడితే ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.
ప్రవేశ ద్వారం చాలా నిరాడంబరంగా ఉంటుంది. కానీ ద్వారం పైనే శేషతల్పంపై విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, బ్రహ్మ, నారదులు దర్శనమివ్వడం భక్తుల హృదయాలను ఆనందంతో నింపుతుంది.
🌟 “చిరునవ్వుతో దర్శనమిచ్చే స్వామి”
ఇక్కడి ప్రధాన దేవుడు శ్రీ శృంగ వల్లభ స్వామి.
వెంకటేశ్వర స్వామి చిరునవ్వుతో దర్శనమివ్వడం వల్లే “శృంగ వల్లభ” అనే పేరు వచ్చింది.
గర్భగుడికి చేరుకోవడానికి ఏడు ద్వారాలు దాటాలి.
మొదటి రెండు ద్వారాలు దాటితే ద్వజస్తంభం ఉన్న బయటి ప్రాకారం వస్తుంది. స్తంభాలపై పురాతన శాసనాలు ఈ ఆలయ మహిమను చెబుతుంటాయి.
ఈ ఆలయంలో ఒక అద్భుతం ఉంది…
👉 మీరు ద్వజస్తంభం వద్ద నిలబడి స్వామివారిని చూస్తే —
ఆయన మీ ఎత్తులోనే కనిపిస్తారు!
ఎంత ఎత్తు ఉన్నా, ఎంత పొట్టిగా ఉన్నా… స్వామి మీకు సమానంగా కనిపిస్తారు.
ఇది ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక – శిల్పకళా అద్భుతం.
🌿 ధ్రువుడి తపస్సు – స్థల పురాణం
ఈ క్షేత్రం కథ ధ్రువ మహారాజు తపస్సుతో ముడిపడి ఉంది.
సవతి తల్లి అవమానంతో బాధపడిన చిన్న ధ్రువుడు,
నారద మహర్షి ఉపదేశించిన “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని జపిస్తూ ఆరు నెలలు కఠోర తపస్సు చేశాడు.
అతని భక్తి చూసి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారు.
తన మహారూపం కారణంగా బాలుడు చూడలేకపోవడంతో…
👉 “నన్ను చూడాలనుకునే వారి ఎత్తులోనే దర్శనమిస్తాను” అని ఆశీర్వదించారట.
అందుకే ఈ ఆలయంలో స్వామి ప్రతి భక్తుడికి వారి ఎత్తులో దర్శనమిస్తారని నమ్మకం.
🏛️ చరిత్ర చెబుతున్న వైభవం
ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యులు ద్రావిడ శైలిలో నిర్మించారు.
మౌర్యుల కాలం నుండి బ్రిటిష్ కాలం వరకు రాజుల ఆదరణ పొందిన ఈ ఆలయం తరువాత నిర్లక్ష్యానికి గురైంది. ఇటీవలే పునరుద్ధరణ పనులు చేపట్టారు.
🔔 ఈ ఆలయాన్ని సందర్శించినవారిగా చెబబడే మహారాజులు:
శ్రీకృష్ణదేవరాయలు
భోజ మహారాజు
విక్రమార్కుడు
కాకతీయ రాణి రుద్రమాదేవి
ఇక్కడ నారద మహర్షి లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని కూడా విశ్వాసం.
💫 ఆలయంలోని విశేషాలు
✨ ఎప్పుడూ ఎండిపోని బావి
✨ 27 నక్షత్రాల నక్షత్ర మండపం
✨ ఆళ్వారుల విగ్రహాలు
✨ శివుడు క్షేత్రపాలకుడిగా ఉన్న శివాలయం
✨ శ్రీదేవి – భూదేవి సమేత శృంగ వల్లభ స్వామి ఉత్సవమూర్తులు
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది.
🙏 దర్శించాల్సిన దివ్యక్షేత్రం
ప్రాంతం దూరంగా ఉండటం వల్ల చాలామందికి తెలియని ఈ ఆలయం, ఒకసారి దర్శించాల్సిన పవిత్రక్షేత్రం.
స్వామివారి చిరునవ్వు చూసినవారు… మరల మరల వెళ్లాలని కోరుకుంటారు.
“తొలి తిరు🌸శ్రీనివాస స్తుతి🙏
సీ. వేంకటా చలపతి! వేగమే రావయ్య
సప్తగిరులు దిగి సాధుశీల!
అలమేలుమంగతోయాలసిం పకనిక
శ్రీనివాసా! రావశీఘ్రముగను
భక్తులబ్రోచేటి వరదుడా బాధలు
తీర్చుమా జనులకు దీనబంధు
కొండల పైనున్న కోనేటి రాయుడా!
కోర్కెలు తీర్చుమా కూర్మితోడ
తే,.. మునులుసైతము దర్శించు ముక్తి కోరి
మానవులపైనదయచూపు మమత తోడ
తిరుమలగిరిపైవెలసిన దివ్యమూర్తి!
నిత్యకళ్యాణములునీకు నిర్మలాత్మ!
సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్లపతి” — నిజంగా భక్తి హృదయాన్ని తాకే దివ్య అనుభూతి. 🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి